Kirmiram — Volume I — Swecchaa Kavitvamu

కిర్మీరం — స్వేచ్ఛా కవిత్వము — మొదటి సంపుటం

1953–75 · Telugu (te) · 36 pages · Human-proofread

సజీవ చిత్రాలై స్మృతిలో అలంకరించేను, ఊహలో పరిమళించేను బిగిసిన మంచు ముద్దల వలెనో వ్రేలాడే ద్రాక్ష గుత్తుల వలెనో ఏదో జరిగే నిరీక్షణలో! చేతిలో పేక ముక్కలతో ! టేబిల్ ముందు ముఖాలు అంచనా తారుమారు చేసేందుకు జోకర్ ఉండనే ఉంది నాతో పోటీపడే తరంగాలు! ఎంత ఎగసి పడితేనేం? తీరం దాకానే నా వెనుక వచ్చే రాత్రులు! ఎంత ఘనమైతేనేం? ఉదయం వరకే ఎంతటి వెలుగులోను మనస్సు ఏదో సమస్యను పట్టుకొనే ఉంటుంది ఏదో ఒక కథలో వలయంలో రేఖతో సంబంధం కలిగే ఉంటుంది చెట్లకూ శిలలకూ స్వప్నాల్ని వదలి, వాస్తవ శక్తుల్ని మోస్తూ నిశ్వబ్దంలో శబ్ద శిల్పంతో శబ్దం నుండి కళా చిత్రంతో యాత్ర సాగుతూంది ప్రయాణంలో నన్నందుకునేందుకు కాలం నా నీడ పట్టుకొని వ్రేలాడుతూంది ఒక్కొక్కపుడు నాలో ప్రమాదానికి గురైన కంపార్ట్మెంట్ను తలపిస్తుంది రైల్లో చేతులకు సంకెళ్ళతో కూర్చున్న వ్యక్తి కళ్ళలో మెరపులు! ప్రయాణికుల మనసులో రహస్యాల్ని వెలిగిస్తున్నాయి ఆలోచనలో మరో నాటకం ఎదురౌతుంది ఎదురుగా ఉన్న పాత్ర కేంద్రంగా అంతా తమ పాత్రల్ని స్మరిస్తున్నారు. శరీరాల్ని మరచి మనస్సులను మోస్తూ ఆలోచనా స్రవంతిగా రైలు పరుగెత్తుతూంది

V. కిర్మీరం (1953-1975)

మనోభూమికలో జీవనరేఖలో 1. ఉష ఆగమనం 2. అమృతలిప్తలు 3. ఆనందధుని 4. జీవనబింబం 5. లలిత కవితలు 6. రేఖాచిత్రాలు మాదిరాజు రంగారావు అంకితం భక్తి హృదయం శక్తినిలయంతో జన సేవలో జీవితం అయిన

ప్రియ సోదరుడు శ్రీ మాదిరాజు వేంకటేశ్వరరావు కు

I. మనోభూమికలో

1. ఉష ఆగమనం పరివర్తన సీమల్లో పరిభ్రమించే నేను ఆముఖం కోసం చూస్తున్నా కన్నుల్లో వెలుగై హృదిలో ప్రాణమై కదలే రూపంకై వెదుకుతున్నా భూమి నీరూ తేజస్సు గాలి ఆకాశంలో మొక్క ఆకు, పూవు, ఫలంలో పక్షి జంతువు రాక్షస మానవ దేవతల్లో సామ్యం చూపేదీ భేదం చెప్పేదీ పంట కొచ్చిన క్షేత్రాల్ని మ్రోడు వారిన వృక్షాల్ని పరామర్శిస్తూ సంతోషం సన్మార్గం దుఃఖం దుర్మార్గం ఆశ ఐశ్వర్యం క్షేమం నిరాశలో ప్రశ్నిస్తూ సమాధానం చూపేదీ, పలికిస్తూ అనుభూతి నిచ్చేదీ ఇక్కడే ఉంది! అరుణ కిరణ సరణియై సామాజిక చేతనయై ఉష! ఎక్కడో చూచినట్లుంది? ఎంత కాలమో అయినట్లుంది! ఈమెను చూస్తే (1) రాత్రి దర్పణంలోచంద్ర బింబం, మనః కాసారంలో రాజహంస జ్ఞాపకం వస్తాయి జలధిలో అల జలదంలో మెరపు శిశిరంలో అంకురం తలపుకు వస్తాయి ప్రశ్నలో సమాధానం వలె ప్రశ్న వెనక పరిష్కారం వలె కన్పిస్తుంది (2) చైతన్య సీమలో అడుగిడగానే నాలో అభిమతి ఎదురై తోడ్కొని వస్తుంది రూపం నుండి మరో రూపంతో నాలో విశ్వాసం తెస్తుంది ఆశకు ప్రాణం పోస్తుంది సుడి గుండాల్ని సుడి గాలుల్నీ లెక్క చేయకుండా హృదిలో నౌక వలె చరిస్తుంది ఈమె అంత స్సౌందర్యం కన్నుల మెరపుల్లోనే కాదు కన్నీటి చినుకుల్లోను ఉంది వెనక స్వప్న కథలతో వచ్చేది ఇప్పుడు వాస్తవ స్థితులతో వస్తూంది వెలుగుతో వచ్చే ఈమెకు రోదసినై స్వాగతం పలుకుతాను పూర్వం ద్యావాపృధివి ఆనందిస్తే ఇప్పుడో మహా జనం సంతోషించేను గతం వెళ్ళు వ్యాపించిన అవని వలె మూల శక్తి అనుకున్నా పురా వృక్షానికి పూచిన ప్రణవ పుష్పంగా భావించా ఇప్పుడు వర్తమానంపై చూపుతో అవనిపై అడుగులతో వస్తూంది చైతన్యం విరిసిన ఆత్మ రోదసిలో భామతి ఉషస్సు అవతరిస్తూంది

సహమతి! సూర్యునివలె ప్రసరించే నాలో చైతన్యం పరీవృతమై ఉంది

2. సౌందర్య శిఖ వచ్చింది! కాంతి మతి! నీడ ఎరగని దీపశిఖ! ఉషస్సు అంధకార పంక్తుల్ని చందన కాంతి తరు సమితిగా తీర్చే శక్తి రేఖ ముఖంలో హాస పంక్తి అలలతో, కళ్లలో అమృత బిందు కిరణాలతో మొదటి ఉదయ నిశ్వాసంలో ఆశా పతాకల మిలమిలలతో వర్షం ముందు శీతల వాయువు వలె లిప్తల మెట్లపై సుకుమార లహరియై వచ్చే ఈమె పాదాల ముందు బారులుగా వెలుగు మబ్బులు నిలుస్తాయి ఈ సమయం దివ్యమైన అనుభూతి హృదయంలో పల్లవిస్తుంది పెదవిపై కుట్మలిస్తుంది వాక్కులో సుమిస్తుంది ఊహలో పరిణమిస్తుంది ఝుంఝూనిల తీవ్రత్వం నైశిత్యం ఎరగని మొదటి వాసంత క్షణం పరిమళ వదనంపై రోచిరాసంతో విచ్చిన హిమ స్వప్న పద్మం! మృదు ధ్వనులు లీనం చేసుకునే అఖండ శాంతి రూపం ఈ రోజు ఈమె ఆగమనం కాలచక్రం తీసుకునే మొదటి ఆవర్తం సూర్య కిరణం భూమిని స్పృశించే ముందు పల్చని మంచు గాలి తెరపై ఈమె రూపం కనక శత పత్రంపై చంద్ర బింబ స్ఫూర్తి కలిగిస్తుంది దివి నుండి దూకే దివ్య కాంతి ధుని ! భూమిపై పరిమళ ఝరియై కదలుతూంది భావ జగతిలో ఈమె అవతరణం మొట్ట మొదటి వసంతాన్ని చూచినట్లుంది ఈమె కళ్ళు! తేజో లతలు! దిక్కు లేని చీకటి రాయిని చలింపజేసేను (2) (1) చంద్ర రేఖ బింబిస్తూ ఎగసే కెరటాల వలె దిగ్వసనం ధరించి సముల్లలత్ వక్షోజాలతో స్మిత రుక్ దీపంతో నవనీత పాత పదగతితో శరన్మేఘ శిల్పాకృతి అవనిపై అడుగిడుతుంది. ఎదలో వీణా నాద తరంగం వలె సాగుతుంది అలలు తలలు పంచుతాయి గాలులొక పక్కకు ఒదిగి ఒదిగి పోతాయి గులాబి రేకు పెదవులపై ఇంద్రచాప వర్ణాల్ని సముద్రంపై కెరటాల్లా గాలి సమీకరిస్తుంది, మేళవిస్తుంది, సౌందర్య సమర్చనంగా అర్పిస్తుంది నాద లహరి వలె కాంతి వలయం వలె విచ్చిన కనక శతపత్రంవలె ఈమె అవతరించగానే నిద్రించే లిప్తలు మేల్కొంటాయి సాంగీతికులౌతాయి

మందీభవదీహలు చేతనా రుచిరాలౌతాయి నీటి ఒరపిడికి అణిగీ, వడికి లేచీ ఎగసే కెరటాల వలె ఈమె అడుగులు కదలుతాయి, మనస్సును మరపులో బంధిస్తాయి రవి అస్తమించగానే ఈమె ఊహకు ప్రతి రూపం చంద్ర బింబం కన్పిస్తుంది క్షణాల పై చంచల వర్షాంబుదం వలె సాగిపోయే చలన్మతికై ఎన్ని ఆలోచనలు గాలి పటాల వలె ఎగసి పోయాయి ఎన్ని అబ్దాలు మంచు కొండలై నిలిచిపోయాయి ఎన్ని వసంతాలు దుఃఖ హసంతికలై ఎదను మండించాయి కళ్లలో వత్తులతో కాలం మంచు బొట్లు రాలుస్తూ కరగిపోతుంది నిద్రా సరస్సులో స్వప్న కల్హారం జాగ్రదావస్థలో చంద్ర బింబం ! మబ్బును దూసికొని మెరపువస్తుంది కొండను చీల్చుకొని నది వస్తుంది విత్తును పెకల్చుకొని మొక్క వస్తుంది నభస్సును విచ్చుకొని నీవు వచ్చేవా సముద్ర మవతల నీవు, ఇవతల నేను! చంద్రనౌకలో రానా? దిశ నుండి దిశకు నిల్చిన శశిరశ్ములు పట్టుక రానా? సుందరమైన ఆనంద మహానుభూతికి ప్రమాణ రూపం స్వర్గం ఆ స్వర్గ ఖండం ఉషస్సు ! ఉదయ కిరణ సంగీత మయం! నిను పరివేషించిన స్వర్లోక గవేషణలో ఊహలు వాంఛలు ఆకాశంలోకి చూచే వృక్షాల వలె జలధిలోకి కదలే నదులవె కన్పిస్తాయి ప్రభాత వేళ మంచు ముసుగుతో ముగ్ధ ముగ్ద సంతోష తరంగం ఆ రూపం నిశ్శబ్దం నిండిన రోదసి హృదయంలో పూల మబ్బు వలె అవతరిస్తుంది గ్రీష్మ స్వప్న సముద్రం నుండి సాగే మేఘ మాలికవలె భూదేవత పెదవులపై నవ్వు మొలకతెచ్చే వర్ష ధారవలె అబద్ధం వంపులొరసీ సాగే నిత్య సత్య వాహిని వలె జీవన లహరులపై పూల నౌకవలె కదలే సౌందర్య శిఖ వలె శిశిరంలో వసంత పుష్పమై, పుష్పంలో ఫల రూపమై ప్రేమ పూర్ణ కాంతి శ్రీ! ఆసీమాంతం చెంగలించే రసధుని! సృజన తృష్ణలో మొదటి ఉదయ కిరణం స్త్రీ రూపం పొందుతూంది అడుగుల్లో లిప్తల మంజీర ధ్వనులు! తనువులో కాంతి వల్లీ సౌందర్యం ఊహలో ఉషస్సు అవతరించని కళ లేదు, కవిత్వం లేదు మనసుపై పొరల్ని వెలుగు కెరటం వలె పునీతం చేసి పోతుంది శంపాలతల చూపులతో నవాశాబింబ నేత్రాలతో సౌందర్యశిఖ ! ఉషస్సు పొందే మరో రూపమే! మనిషిలో సృజన కాంతి హృదయం

3. రసాకృతి ఎదలోతుల్లో నుండి వచ్చే సౌందర్య రసావిష్కారం నీ ఆకృతి నీ చైతన్యం మూర్తీభవించిన శిల్పం నాస్మృతి నావహించిన నీ భావన నిద్ర నుండి నిశ్శబ్దం నుండి నిశా సీమ దాటే సమయం మనో జగత్తును ప్రభాతమయం చేసే ఉదార జ్యోతిస్సాహితి అశ్రు కణ సమూహం శిలా రూపం పొందినట్లు గ్రీష్మ పవన రేఖల్ని చుట్టీ మండే అగ్ని వలె ఆర్తం రవం మ్రోగి మ్రోగి నిల్చిన మ్రోడు వలె ఉన్న నాలో సృజన శక్తి మేల్కొల్పే ఉషః కిరణ రసాకృతి ఆకాశం వలె అందని నీ స్పర్శానంద భావనలో నరాల్లో పరుగెత్తే అమృత భరోత్సాహంతో సమున్నత ముఖమెత్తి దీర్ఘమైన రెక్కలు చాచి నీకై యత్నించా నిశా పటలంపై చంద్రరేఖ నవ్వుతో ! ఎంత కాలం నుండో హిమ శిల వలె నున్న నన్ను రసధునిగా మార్చావు నా మనస్సుకు నీ రూపమెంత దగ్గర? అంటే ! కంటికీ వెలుక్కూ ఉన్నంత ! నాడు రాగ స్నిగ్ద ముఖంతో నాలో లీనమైన నీ రూపం మరలినట్లే తెలీదు మలి సంజలా వాలి పోయే నా కనురెప్పల్లో ఎప్పటికీ తొలి సంజలా నీ ఆకృతి ప్రవేశిస్తుంది, దృగతీతమై నిలుస్తుంది ! లేవగానే అద్దంలోముందు నా ముఖానికెదురుగా కన్పిస్తుంది కాల ముద్రలు లేని నీ ముఖం, ఉషః కాంతి హృదయ పద్మం పురా రహస్యాల్ని స్మరింపజేసే వాసనా ప్రతి బోధకంగా నిశ్వాస రేఖలతో వాయు నాద పరిషత్తులు కదలుతాయి జీవనాడుల్ని తంత్రుల వలె స్పందింపజేసే గాంధర్వ కళా మూర్తి రాగ ద్వేషా లెరగని నగ్న సహజ మనః ప్రకృతిలో ఆనందాకృతి! కళ్ళ నుండి కాంతి ప్రసరిస్తూ మొగిలు నుండి మెరపుల వలె అమృత భాష మాట్లాడుతూ ఉదధి పొంగ వినిపిస్తా కాంతి గీతం సప్త వర్ణ కిరణాకృతి కదలిరా! వెలుగుంగరాల వలె ఊహలు సాగగా గగనుని సిగపై వ్రేలే వాడని చాంద్రీ దామం వలె ప్రతి నిశీథి బింబస్తూరా నిభృత కళా మనోసరసి! మెరపు తీగెతో వెలుగుతూ నీలి మబ్బుగా ఈ శరీరాన్ని మలుస్తా కదలే నీటిపై వంతెనలా ఈ బ్రతుకును నిర్మిస్తా! కాల రథం పై రా! పదును కత్తికి రెక్కలు తెగిన గిరిలా దిక్కులు చూస్తూ ఉండలేను

వీచే చలి గాలికి వణకే వృక్షంలా దేహం ముడుచుక ఉండలేను రానీ అభయ కోష్ణ కర స్పర్శతో! నీ ప్రేయో రూపం నాలోకి చైతన్య కళా మూర్తివి ఉషసివి అమృతశక్తివి నీవే దేవతనో నేనెరుగను పొరలు పొరులుగా రూపొందిన మతిలో వేయి రెక్కలు విప్పి కదలే వెలుగు మూర్తీ! నాపై కాంతి పూలు ప్రసరిస్తూరా! మనసుపొంగ వినిపిస్తా సువర్ణ హృదయ గీతం జ్వలదూహ శిఖలతో ఆహ్వానిస్తా పవమాన పంక్తి వలె రివ్వున రా కలసిపోయి ఇరువుర మొకటిగా ద్యావాపృథివి వలె ప్రకాశిద్దాం అణువున కతీతంగా సర్వాంతర్లీనంగా నర నారీ సుషమా రూపం స్ఫురించేను నీ కను రెప్పల తెరపిడితో ప్రభాతమేర్పడుతంది నీ కనుచూపుల్లో సూర్యుడు పోషితుడవుతాడు నీను చూచేందుకు శరీరం విప్పారిన నేత్ర గోళమౌతుంది నీ దివ్య కరస్పర్శ మనస్సును ధవళ శిఖరంగా మారుస్తుంది ఆలోచనల్ని మల్లీ మందార పారిజాతాలుగా తీరుస్తుంది నిశ్వబ్ద రాత్రి నీ రూపం ఎదలో దీపశిఖయై వెలుగుతుంది స్వప్నంలో గీతమై పలుకుతావు గీతంలో స్వప్నమై నిలుస్తావు నీ రాకతో ఆదర్శానికీ వాస్తవానికీ మధ్య రేఖ చెదరుతుంది నీ కదలికతో నాలో క్రమ్మిన అసత్యపు పొర తొలగుతుంది నీ కను రెప్పలు నాపైసరస్సు పై ఉదయ దిశల వలె వాలతాయి నిశాయతనం నుండి నీవు సత్యమై మెలకువయై సుందరమై వస్తావు ఉదయం మొదటి సూర్య కిరణం వలె నా ఎదపై వ్రాలినపుడు వస్తే వేరొక రాత్రి త్వరగా పోవాలని ఆలోచన కలుగుతుంది నిశ్శబ్దపు నడకతో తుమ్మెద ఝంకారంతో జలపాతం హోరుతో సూర్యుని చిట్టచివరి సాయం కిరణంతో పూర్తిగా విడిపోతావు సంతోష విషాదాలు సమంగా పొందే చంద్రబింబం చూస్తే జ్ఞాపకం వస్తావు తమస్సముద్రం దాటి ఏలారావాలనా? నా చూపుల వెలుగు వంతెనపైరా బడబానలంతో సముద్రం వలె, విద్యుత్కాంతితో పయోదం వలె ఊహాశోభతో శబ్దం వలె, ప్రణవంతో విశ్వం వలె నీతో నేను ! హృదిలో నిను పొందిన నేను నీకో రూప మిచ్చి పరిధిలో బంధించలేను (3) (4) శబ్దం అగ్నిలో జ్వలిస్తూ పోయేను ఊహలు గాలిలో అదృశ్య మయ్యేను! ఈ ఉషస్సౌందర్య రసాకృతి! నాలో వీడని మానుషాత్మను పొందుతూంది

4. సౌందర్య రాగం సమయం మధు సౌందర్యంతో సరిస్తుంది అనుభవం హిమ పరిమళంతో మత్తెక్కిస్తుంది. పగటి ఆరాటం అణగిపోతుంది రాత్రి భయం మాయవుతుంది అలలపై రవి కిరణాల వలె ఆలోచన ఆనందాన్ని కొలుస్తున్నట్టుంటుంది హృదయం నీలి మబ్బునో పూల తీగెనో తలపిస్తుంది ఎప్పటి కపుడు రహస్యం తెలుస్తూనే ఇంకా మిగిలినట్లే ఉంటుంది శరీరంలో అణువణువూ ఒక్కొక్క వెలుగు దర్పణ మవుతుంది మనస్సులో ఒక్కొక్క ఊహ కిరణ పుష్పమవుతుంది ఈ వేళ కదలే ఊర్పులు పూలు పూస్తాయి కదలికలో చిరు అలలు ఎగసి పడతాయి ముఖంలో చంద్ర కళ లొకటొకటీ ఒలుకుతాయి గుప్పిట్లో ఒదిగిన స్వర్గం అరచేతిలో బయటపడి నట్లుంటుంది. కళ్ళలో ఆనంద పుష్పాలూ! ఫాల తలంపై అదృష్ట బిందువులూ వెలుస్తాయి గర్వం మంచు వలె కరిగిపోతుంది, స్నేహం మొగలి వలె గుప్పుమంటుంది ఇపుడొకరి ముఖంలో మరొకరు చూచేది ఉషస్సు హ్లాదబింబం మాత్రమే ప్రశ్నలు మొగ్గలై అంతలో సమాధానాలు వికసిస్తాయి రాగ కర స్పర్శతో అంతరంగం విరిసిన పద్మ మవుతుంది ఒక్కొక్క దళ మొక్కొక్క రాగ చ్ఛాయను పొందుతుంది అనుభవంలో మ్రోగే ఏ వీణనో వయోలిన్నో సితార్నో తలపిస్తుంది ప్రవాహంలో విద్యుత్తు వలె ఉత్సాహంతో మంచు నుండి సూర్యుని వలె ఉద్వేగంతో అల నుండి అలను అందుకున్నట్లు సరికొత్త సంకేతాలు స్ఫురిస్తాయి చీకటిలోను బ్రెయిల్ లిపి వలె సర్వం అలవోకగా అవగతమువుతుంది స్పందనలోప్రాణం హృదయ రాగం పలుకుతుంది అలల మధ్య ఎగసే వెలుగు వలె ఏకాంతం ద్వంద్వమై కదులుతుంది నర్తిస్తుంది వాలిన పక్షు లెగిరేందుకు సిద్ధమైన ట్టుందీ నిశ్శబ్దం ! మనస్సు శాంతి సింహ మవుతుంది హృదయం ముగ్ధ హరిణ మవుతుంది ఎంత గొప్ప అనుభవమైనా అంచుల్లో ఒదగక తప్పదు ఎంత దీర్ఘ తరంగమైనా ఒడ్డున ఆగిపోక తప్పదు తెరపడ్డాక షేక్స్పిరియన్ఏంటిక్్స జీవితం ప్రత్యక్షమవుతుంది స్మృతి బింబాలు మెల్లగా మనో మ్యూజియంలోకి చేరతాయి

శిలలో శృంగార శిల్పంగా ఎదలో అప్సరో నృత్యంగా మిగిలీ రెండు వెలుగు బింబాలూ జీవితంలో వేరు వేరు భూమికల్లో కన్పిస్తాయి కదలుతాయి ప్రస్తారం అమృత లిప్తలు అరవిందుల డివైన్ లైన్, (దివ్య జీవితం), ఆనంద ధుని అరవిందుల మహా కావ్యం సావిత్రి చదివాక పొందిన సూక్ష్మమైన అనుభవ పరంపరా రూపం. ఇది నిర్దిష్టం కాక, అమూర్తంగా ఆవిష్కృతమైంది. మనిషిలో ఆరోపణ దశల్ని పొందే క్షణాల్లో మృత్యువును ఎదుర్కొనే ఇచ్ఛతో పాటు లోపలి శక్తిని కూడ గట్టుకునే సంకల్పమూ ఉన్నాయి. అందుకై నిరంతరం ప్రయత్నం జరుగుతుంది. సాదన అవసరమౌతుంది. మానవ సంస్కృతిలో ఇది ఎన్ని విదాలుగానో కన్పిస్తుంది. దీని అస్తిత్వాన్ని బహుముఖంగా గమనించవచ్చు. చివరకు పొందే విజయ సిద్ధి సావిత్రి కావయంలో ఆత్మోన్నతి కభిముఖంగా కన్పించే ఒక వెలుగు ముఖం, దీని ఆలోకనా చిత్రణమే ఈ కావ్యం. ఇందులో ఒక విశేష దశలో మనసుస పొందే ఆరోపణం ఆత్మ భావనా విలసితంగా సాగింది. ఈ రచన మూడు దశలుగా ఉంది. 1. పరీమళ వలయం, 2. ఇక్కడ ఎక్కడా లేదు చీకటి, 3. ఆదిత్య వలయం. ఇవి క్రమంగా భౌతికం నుండి మనస్సుకూ అంతః కరణంనికీ ఆత్మకూ ప్రతీకలు. మొదటిది ఉత్తమ సంస్కార బంధురమైన వాతావరనాన్నీ, రెండోది, సాధానాత్మకమైన ప్రపంచాన్నీ, మూడోదీ పర్యవసానమైన దివ్య రూపాన్నీ భావింపజేస్తాయి. చివరి లక్ష్యం ఆత్మోన్నతియే, ఇది వ్యంజితమైంది. చీకటి లేకపోవడం (అభావం) వెలుగు. ఇది ఆత్మకు సన్నిహితమైంది. రెండోది మనస్సుకూ ఇటు ఆత్మకూ మధ్య స్థితి. మూడోది ఆత్మ వివృతి తేజఃపుంజం, తేజఃప్రకాశం, తేజః ప్రసారంగా దర్శనమిస్తాయి. ఇందులో హిరణ్మయ కవాటం, ఓంకారం అరణి ఇట్లా అనేకం పురా స్మృతుల్ని కదలించేవి. ఇవి వస్తువులోని భావ రేఖలకు దీప్తినిస్తాయి. అనుభూతికి లోతైన స్థితినిస్తాయి. ఆకృతికి విస్తృతమైన పరిధినివ్వడం సరేసరి. ఇందులో హృదయ స్పందనం జీవన శక్తిని గతిలో లయనూ నియతినీ, వ్యక్తం చేస్తుంది. ఇది ఒక నవనవోన్మిషితమైన కాల ఖండంగా భావితమైంది. ఈ కృతిలో చివరిది జ్వాలా రూపం. ఇది మనిషిలోని వాంఛమతికీ అహంభావానికీ ప్రతీక. దీని ప్రసారం ఇందులో అవిష్కృతమైంది. బహుపురాతనమైన సామాజిక స్మృతులు మనస్సులో పొరల్లో దాగి ఉంటాయి. ఇవి మానసిక ప్రవర్తనలో ఆలోచనలో ఆయా సందర్భాల్లో ప్రస్ఫుటం అవడం కద్దు. అరణిని మధించినపుడు అగ్ని ఉద్భవించినట్లు మనస్సు భౌతికాభౌతిక స్థితుల ఒరపిడితో గాఢమైన అనుభవ దశల్లో రూపంతో నిర్గతమైతుంది. ఇందులో ప్రాయిడ్తో ఎన్నో సిద్ధాంతాల్లో విభేదించి కొత్త పుంతలు త్రొక్కిన

కార్్ల జెస్టోవ్ యుంగ్ ప్రతిపాదించిన సామాజిక అవ్యక్త చేతన (Collective Unconsious) ప్రసక్తమైంది. ఎంత ఆధునికతను పొందినప్పటికీ వ్యక్తిలో చరిత్రకందీ అందని ఎన్నో తరాల క్రిందటి ప్రవర్తనా రీతులతో అనుభవ మర్యాదలతో సంస్కృతీ స్వరూపంతో భద్రపరచబడి ఉండడం విశేషం. దీన్ని డి. హెచ్. లారెన్్స "Blood Consciousness" గా గమనించాడు. స్కాటిష్ ఎం పాలజిస్్ట జేమ్్స ఫేజర్ "The Golden Bough" అన్న మహా గ్రంథంలో చరిత్ర కందీ అందని దశ మొదలుకొని అనేక సంస్కృతీ పరమైన అంశాల్ని విశ్లేషంచి చర్చించడం జరిగింది. ఇవి సామాజిక మనో వైజ్ఞానిక దృష్టితో వివరింప బడినాయి. టి.ఎస్. ఇలియట్ ఈ గ్రంథం గురించి ఒక చోట "One which has influenced our generations profoundly I mean "The golden bough" అంటాడు. దీని ప్రభావం నేటి రచయితలపై అంతో ఇంతో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈనాటి సాహిత్య విమర్శలో చారిత్రకసామాజిక దృక్పథానికిమనో వైజ్ఞానిక దృష్టి పుష్టినిస్తూంది. ప్రస్తుతానికి వస్తే ఈ కృతిలో సాంస్కృతికమైన ప్రతీకాత్మక సంవిధానం ఉంది. మానిసికంగా వ్యక్త చేతన మరియు అవ్యక్త చేతనకు సంబంధించిన వివిధ దశల్లో ఏర్పడే సంఘర్షణపై దృష్టి కన్పిస్తుంది. సామాజిక తలంపై భౌతిక శక్తుల ప్రమేయమూ ప్రాబల్యమూ విస్మరించని వాస్తవ రేఖలూ నా ఇతర కృతుల్లో వలె కాక ధునిలో సూత్రప్రాయంగా ఉన్నమాట నిజం. అయితే దీని ఉద్దేశం వేరు. వస్తు ప్రస్తారమూ వేరు. మనిషి ఎక్కడున్నా ఏకాలంలో న్నా ఎదిగే దశలతో మానసికంగా సమున్నతమైన విశ్వ భావనకనుగుణంగా తీర్చబడిందీ రచన. జీవితంలో బాధల నుండి దుఃఖాల నుండి హద్దుల నుండి అజ్ఞానం నుండి అసంపూర్ణత నుండి మృత్యువు నుండి ఉత్తమ స్థితికై ఉన్నత దశకై, దివ్య దశకై జరిగే ప్రయత్నాల్లో సంఘర్షణల్లో విజయమే మానవ లక్ష్యం కావాలి. పరిపూర్ణత సిద్ధించాలి. ఈ దశలో అన్వేషణ సాధన సిద్ధికై చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దీని స్పర్శ మాత్రమే ఈకృతి ! - మాదిరాజు రంగారావు

2. అమృత లిప్తలు నాపై నుండి దూకినరాత్రి ఆవలి గట్టున నిలిచింది

1. శిఖరమై బింబమై సవితృ రూపం ఎదురుగా! నున్న చంద్ర బింబం పాలిపోయింది

నిశ్వబ్దంగా నిర్వ్యాపారంగా ఉన్నట్లుందీ క్షణం నేను నడుస్తున్నా ఉదయం శిఖరమై. వికస్వర రేఖలూ ఆనంద లహరులూ కన్పిస్తూ విన్పిస్తూ ఎరుపు నుండి పుసుపూ తెలుపు లోకి ఉదయ సంధ్య మారుతూంది లోలోన ఆలపిస్తూ రాగం గాలి ముంగిట్లో తారాడుతూంది ఎదురుగా నిలిచిన వెలుగు లోలోన అనురాగం పొంగుతుంది దిక్కుల్లో వెలుగు వలె నరాల్లో నెత్తురు నదిలో ఆర్ద్రత వలె మనసులో అనుభూతి సూర్యుని తేజం వలె చింతనలో ఔజ్వల్యంతో నేను కదలుతూన్నా వెలిగే కర్పూరం వలె వేల వేల రేకులతో పరిపూర్ణ బింబమై ఎవరికీ తెలీకుండా క్షితజ పద్మం విరిసింది ఎంతో పొందికగా వెలుగు దారాల గూడు అల్లుతూ కొమ్మ నుండి కొమ్మకు తిరుగుతూ సాలీడు కన్పించేను ఒక గాలి తెర వీచి, ఒక మంచు పొర సోకి ఏ దారమెక్కడ తెగేనో? ఈ సాలీడెక్కడ దాగేనో? కనులు ముకుళిస్తే రాత్రి కన్న కలలే కాంతి వర్ణ చిత్రంతో సాక్షాత్కృతి పొందేనా? ఈ సృష్టి దృశ్య పరంపర భ్రమోదిత స్వప్నమా? కాదు కాదు ఇప్పటికి పరమ యథార్థ రూపం నా చూపు ప్రసరిస్తోంది పొదిగి కొని వర్ణాలెన్నో నేను ప్రయాణిస్తున్నా కాంతి మనోభూమికలో నా కళ్ళ కలల్ని వదలాయి నా చూపు వెలుగు చిమ్ముతూంది నా చిత్తం చైతన్యం సరిస్తూంది నా హృది సంగీతం స్పందిస్తూంది ఇక్కడ నుండి చూస్తే నా చూపు మేరల్లో నే చూడాలిసిన వస్తు బింబా లెన్నెన్నో! ప్రతి బింబంలో నేనూ! నా చుట్టూ వర్ణాలెన్నో ఎక్కడి వక్కడ విడిపోయి మిగిలే దొకటే ఒకే వర్ణం తెలుపు! చిత్రమై సంగీతమై కవితయై. నా ముఖంలో మౌనం అఖండ ధైర్య వహించింది సత్యం వెలుగు దుస్తులు ధరించి నిలిచింది రివ్వున ప్రాణ బంధుమై వచ్చి ముని వ్రేళ్ళపై వాలిన వెలుగు పరిష్వంగంలో మనస్సు ఒదిగింది ప్రకృతిలో అణువణువునా స్పందనం

స్పందనలో చివురెత్తే కొర్కెలూ ఆకాశం నిండింది శబ్ద తరంగ దళాలతో భూమి విరిసింది ఏడు రంగుల పంటతో విషాద రేఖలు తుడిచేసే విజ్ఞానానికి చిహ్నమై దర్శనకు దర్పణమై విజయానికి కేతనమై రవి అంతస్సు నుండి శక్తి సరిస్తూంది నాలోకి అగ్ని వలె జ్వలిస్తున్నా నేను మణి వలె వెలుగుతున్నా అహంకార బహు భూమికల్లో వివిధ పాత్రల ప్రకాశనంతో మనస్సులో కోర్కెలలల్లుకున్నాయి విడదీయరాని అనుబంధంతో అవని పచ్చగా నవ్వుతూంది దేహం వెచ్చగా విరిసింది మెడ కెత్తనున్న కాడి వలె ఎదురుగా అదృష్టమైన జీవితం ఈ సమాజ మింతవరకు కెన్ని మారు లావృత్తమైందో రూపం పోల్చుకోడానికి బుద్ధి యోచన కొదిగేను

2. వలయంలో వివిధ దళ రాగంతో పరిమళ మధు భావంతో స్మృతుల పరంపరలో పద్మాలు వరసగా విరిసాయి అవతరించిన ఊహకు శిల్పం అబ్బింది మేల్కొన్న మనస్సుకు పరిమళం హత్తింది ఎట్టెదురుగా వికసించిన ప్రొద్దు తిరుగుడు పూవు కాల హరణ జీవితాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తోంది తోట పరిమళం వలె నేను కదులుతున్నా వలయం నుండి వలయంలోకి విజయ లిప్తలపై కొత్త చూపు వచ్చింది దిక్కుల్లో ఏ శక్తీ అడ్డు నిల్వలేదు తెరలు వ్రాలాయి ప్రక్కగా పొరలు వ్రీలాయి కుప్పగా నింగి నుండి వాలే పక్షుల వరసల వలె చెట్టు నుండి సాగిన పంగల కొమ్మల వలె

3. వలయం నుండి బ్రతుకులో వంపుల అందంతో దిశల్లోకి చొచ్చిన వెలుగుదారులూ

ఈ వెలుగు దారుల్లో విచిత్రాకృతులెన్నో చూచీ చూడనివీ యుగాలుగా వచ్చే నీడ వదలని దివ్వెలూ, ఎప్పటి కపుడు గండం గడిచే బ్రతుకులూ ఎప్పటి కపుడు మార్పును పొందే ఊహలూ ఎందరో ప్రయాణిస్తున్నారు అందరితో పాటు నేనూ అందరిలోనూ నా రూపమే నాలో ఎందరి రూపాలో నాకు జ్ఞాపకం వస్తూంది ఈ ముఖా లెక్కడో చూచినట్లు నిన్న మొన్ననే ఈ దారినే రేపూ కన్పించవచ్చు మళ్ళీ ఎదురుగా భవిష్యత్తు ఉంది, దిక్కుల్లో ఒదిగి సిద్దంగా గతం గుహ వలె నిలిచింది వర్తమానం పక్షి వలె ఎగిరేను నేను వెళ్ళుతున్నాను ఇంటి నుండి మరో ఇంటికి నేను మసలుతున్నాను ఎద నుండి మరో ఎదకు క్షితిజ రేఖా ధరాలపై వినిపిస్తోంది గాంధర్వం మనోనుభవం పంచుకొనీ హృదయ చలన మందుకొనీ, ఎంత కాలం నుండో మౌనంగా ముడుచుకొన్న వెలుగు లెగురుతున్నాయి వెచ్చ వెచ్చని ఉత్సాహంతో మాటలో పాట కోసం వేచీ ఆటలో నటన కోసం చూస్తూ లాభాలు నష్టాలు గుణించుకునే స్థితిలో లేదు మనస్సు క్షణాల ఇనుప పాదాలపై కాలం పరుగెత్తుతూంది కోర్కెల పాములు నలగిపోతున్నాయి దారిలో స్మృతుల వలె రాలుతూ పూలు పరిమళం విసరుతున్నాయి అనంతంతో అంతం ఇక్కడే ఉన్నట్లుందీ వాలకం చూస్తే చెట్ల క్రింద కొందరు బ్రతుకులు కొలుచుకుంటూ కూర్చున్నారు అజ్ఞాన చ్ఛాయల్లో అందం చిమ్ముతోంది ప్రకృతి క్షితిజంలో వివిధ వర్ణ రూపాలు భ్రమిస్తున్నాయి మనసులో బహు కాంతి ముఖాలు ఎదురుచూస్తున్నాయి చంటి పిల్లల వలె వెలుగు చుంగులు పట్టుకొని ఇంకా అక్కడక్కడా చీకట్లు వ్రేలాడుతున్నాయి బ్రతుకంటే మిత్రమా! చీకట్లో నీడలు వెతకడం కాదు వెలుగుపై చీకటి చిమ్మటం కాదు చీకటి నలంకరించడం కాదు క్షణాలు వరసగా రెక్కలపై ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాయి నేను కదలుతున్నా మెలకువలో జలధిలో సూర్యుని వలె నేను కదలుతున్నా నిదురలో గగనాన చంద్రుని వలె పగలూ రాత్రీ ఎద ఎదను స్పృశిస్తూ

అమృత లిప్తలపై పద పదం ఊనుతూ కాలాంశానికీ కాలాంశానికీ మధ్య శక్తి, ఆకర్షణ! స్థల బిందువూ స్థల బిందువుకూ మధ్య శక్తి, ఆకర్షణ!

4. మరో వలయం ఘర్షణతో విరామంతో సంఘర్షణతో స్పష్టీ విలయం పునస్స్పష్టీ సంసర్గం సంబాధం విభేదంతో వివిధ శక్తి గతుల సంకలనం! మనస్సు స్పట్నిక్ వలె ఎగసి పైకి దూసుక పోతూంది ఒక వలయం నుండి మరో మరో వలయం లోకి జీవన సంభార వహంతో మౌనంగా ప్రయాణిస్తున్నా నైశ్చల్య సీమలు దాటీ నీరవం పొరలు చీల్చి కంటిముందా వర్తంతో చెవికి దాని సంగీతంతో మనసులో ఊహ సంవర్తాకృతి పొందుతూంది ముఖమెత్తి చూస్తే ఆపై తెరచిన మెలకువ తలుపులు ఓంకార శబ్ద సుందరమై దూర దూరం నుండి పిలుపులు లుప్తమైన శక్తి స్థానంలో మరో శక్తి నిండుతూంది వాగతీతానుభవం మనోహర సాకారం పొందుతూంది అవధి లేని శాంతిలోనూ! అనంతమైన కదలిక ఉంది ఏ క్షణమూ లేదు విరామం ఉంది నిరంతరం చైతన్యం కళ్ళు విప్పిన తలపులతో మనస్సు ఉదయాకాశం వలె ఉంది అంతరాంతర భూమికల్లో తలుపులు తెరచుకున్నాయి విచిత్ర తేజః ప్రసారంతో ఆశ సువర్ణ సుందరమైంది చీకటిని హ్లాద పరచే చంద్రుని వంటి ఎదతో రాత్రిని కరగించే సూర్యుని వంటి ఎదతో పైరు ఎదలో ఆశతో ఎడారి నిద్రలో కలతో జలధిలోని ఉద్రేకంతో సరస్సులోని సహనంతో వస్తువునూ మనస్సునూ కలుపుతూ పయనిస్తున్నా తేజసూత్రంలో బిందు బిందు కళనై లిప్తల తరగలపై వెలుగు పడవనై అవనీ పాల భాగాన తరంగాల ముడతల్లో దాగిన అదృష్ట సీమలు దృష్టమవుతున్నాయి ఇదో సుదీర్ఘ ప్రయాణం ఎప్పుడెక్కడ తేలీదీ తెలీదు

తీరాలు పరిచయ మౌతున్నాయి తరంగాలు వచ్చి పోయేను ఒక మహా సందేశంతో రాన్ను మరో ఉదయం నాలో మౌనంగా మలచుకుంటూంది నవాకృతికి రేఖలు

5. మలుపు నుండి మలుపు శరీరంలో అణువణువున న్యూటాన్ల పరిక్రమణం వలె మనసులో లిప్త లిప్త జీవన రహశ్చిత్ర చలనం నీరు నిప్పూ గాలీ ధూళీ పామూ పక్షీ పశువూ మనిషీ అంతటా ఏకోన్ముఖమై ఆత్మశక్తి నిండిన తేజం కాలం సాగిన మొదటి బిందువు ఊహ మొదలైన తొలి రూపం నా వెనకే నిలిచి ఉంది స్థిరంగా నాలోనే దాగి ఉంది బలంగా నేను నిల్చిన చోటు నుండి దూసుకుపోతున్నాయి రేఖలు అణువణువునూ ఉత్తరిస్తూ అంతలో పొందుతున్నాయి రూపాలు. ఇక్కడి వస్తు రూపం ఆత్మకు బహు సన్నిహితం ఇక్కడి సౌందర్య శక్తి శిల్పం ఒదిగిన అనుభవం ఈ వలయంలోకి ప్రవేశిస్తూనే ఆనందం నదిస్తుంది అమృత లోకం జనిస్తుంది, దివ్య శక్తి బ్రతుకు నావహిస్తుంది ఈ క్షేత్రంలో వచ్చే మలుపుల్లో నాలో క్షణం క్షణం మార్పు అణువణువున సాగే అన్వేషణం అన్వేషణలో అనుభవ తేజం కాలం అంచుల్లో నిదురలో అలికిడి లేని స్థితికీ జడంలో ప్రాణం లేని స్థితికీ భేదం అవగతమౌతుంది గ్రహాలన్నిటినీ నియమించే సూత్ర గ్రంథి విశ్వంలో ప్రకృతినీ మనిషినీ బంధించే సూత్రశక్తి మనసులో ; అహంకార సంవృతమై రాగ భోగ రూషితమై బరితెగిన నీడల వలె ఇక్కడ ఈహలు రూపొందవు

6. మిగిలింది దివ్య బింబం శ్రవణ సుభగంగా వినవచ్చే సంగీత ధునీ గతికి సంతోష తుషారంతో ఆశలు కళకళలాడుతున్నాయి దాగిన రహస్యాల్ని వినిపిస్తున్నాయి దశ దిశలూ

ఒక నాటి కంత మవని కథ స్పష్టంగా వినిపిస్తూంది ఇక్కడ కంటికి కన్పించదు దేవుళ్ళ పూజారుల లోకం అనుభవం జ్వాలగా మారి మరో లోకం వెలుగుతూంది వాక్కులో రాగ రసం ఒలికి ఆత్మలో ఆనందం చిలికి బ్రతుకు నావహించి నిలిచింది మొదటి కిరణ దివ్య శక్తి! ఎంత లోతుల్లో నుండో వెలుగు చిమ్ముకొని వచ్చింది ఈ వెలుగు ప్రవాహానికి చీకటి ఎపుడో కొట్టుకపోయింది మనస్సు పరుగిడుతూంది సూర్యుని చుట్టూ భూమివలె తమస్సు వెనుకబడుతూంది దీపం వెనక నీడ వలె ఎక్కడెక్కడి నుండో మబ్బు మూక క్రమ్ముతూంది అంతలో పిడుగు శబ్దం వినిపిస్తూంది మెరపు రూపం కనిపిస్తూంది ఆకాశం నీలి మబ్బు రెక్కలతో దిక్కులు పరచుకొంది ఎదకు చల్లని గాలితో భూమిపై గొడుగు వలె ఉంది ఆగని ప్రయాణంలో ఎప్పటికపుడు కొత్త అనుభవంతో వినని సంగీతం వినిపిస్తూంది చూడని దృశ్యం కనిపిస్తూంది ఇక్కడ జడంలో శబ్దముంది శూన్యంలో శక్తి ఉంది మృత్యువు నుండి చేతనతో కదలే సంస్థితి ఉంది వెలుగు ఉంది ఆగనిదీ పరిమళ ముంది దాగని దీ హృదయ ముంది ఊదుతూ మౌన శంఖం అవిరళంగా నిల్చేందుకూ పెరిగేందుకూ పోటీ పడే స్వర్గ నరకాల రూపు మాపే సవితృ రూపం ఉంది ఒకే ఆత్మతేజం! అనుభవ పరమార్థంతో బ్రతుకు వెలుగుతూంది వెలుగు మొగలి పట్టలతో మనస్సు చుట్టుకుంది ఆవలి గట్టున నిలిచిన రాత్రి నిలువునా కరిగిపోతూంది అమృత లిప్తల మెట్లపై మిగిలిం దొకే దివ్య బింబం!

3. ఆనంద ధుని ఈ క్షణం మేల్కొంది కాంతి బిందువై తమో రాశిని కరగిస్తూ రేఖలుగా సాగింది కల్పన వాస్తవమైంది స్థావరం జంగమమైంది. శూన్యం సంభృతమైంది కాలం తెలివి పొందింది ఇంతవరకూ అననుభూత మనోజ్ఞ రూపం హిరణ్య గర్భం నుండి ఓంకారం వలె ఆవిర్భూతమైంది

ఈ క్షణం ఆత్మకు ఆనందాకృతి నిస్తోంది సూర్య కిరణ పంక్తుల్లో ప్రకాశమాన కళ వలె లౌకిక వనమంతా ఇప్పుడు కొత్త తెలివి చివురించింది అలలో కనిపించే కదలికతో కలలో దాగిన వాస్తవంతో చంద్ర కళ స్పురిస్తోంది, ఇదే శిరోలంకారమో? మాయ కాదు, మృగ తృష్ణ కాదీ స్థితి స్పష్టమైన అనుభవ దర్పణంలో ఆత్మను బింబించే క్షణం చీకటి కలసి పోతూంది వెలుగులో తహతహతో రూపు మాపుకొనే ఆశతో, అగ్ని గుర్తిస్తుంది తెలివిగా క్షణాలు గడుస్తున్నాయి బరువును మోసుకొనీ రెక్కలు సాచి నింగిలో కదలి పోయే మబ్బుల వలె జీవన చక్ర గతికెగసి ఎగసి క్రమ్మిన ధూళి అణగి మణగిపోయే ఆత్మ తేజం పొందుతూంది నిద్రా గుహ నుండి మనస్సు బయటికి వచ్చింది బ్రతుకు అన్వేషణలో పొందిన అశాంతి వలయం ఎక్కడి దక్కడ చెరగి పోతూందీ కాంతి సమయం

1. పరీమళ వలయం

2. ని్రణి నిప్పు నుండి వెలుగు వేరయి పోయే లోపల దిక్కుల్ని మలినం చేసే ధూమ వదనం వివర్ణమౌతూంది అహంకారం సముద్రంలో దూకుతూంది మహా భయం గాలిలో కలిసిపోతూంది మొక్కకు వెలుగూ నీరూకావాలి మెలకువకు వివేకం అనుభవం అవసరం. జీవితంలో దశ దశలో తప్పనివై కన్పించే సురాసుర శక్తుల సంఘర్షణ పరిణామం ప్రాణ భయం నుండి తొలగి ఆత్మ బలంతో జీవిత సత్యానికి తీసే మార్గం అవాలి. దివ్యాభిముఖంగా సాగే ఆలోచనా పథంలో

మానసికంగా నిల్చిన సుంర శిల్పాలే దేవతలు ఇక్కడ వివిధ వస్తు విభేదం ఎక్కడుంది? ఆత్మ కళా వైవిధ్యం! ఒకటే ఉంది మౌనానికీ ధ్యానానికి వ్యాఖ్యానంగా ఉందీ స్థితి లౌకిక వాస్తవ కథా మనో దశల్ని దాటిందీ ఈ స్థితి ఎట్లా ఉందంటే బరువు మోసుకపోయే వ్యక్తి మధ్యలో దించుకొని కాస్త విశ్రాంతి పొందుతూన్నట్లుంది ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సరసి లహరీ స్పందనతో ప్రతి క్రియా రూపంలో జలద గమన విలసనంతో ఈ ఉపాధి మనిషికి పరమ యధార్థ భాసురమై ఈ జన్మ ఇక్కడ ఎవరికీ దుఃఖ భూయిష్ఠం కారాదు ఆవాలి ! ఆనంద వలయం చేరేందుకు నిశ్రేణిక కావాలి ! శుభ వాసనా రూపం పొందేందుకవకాశం ప్రకాశమాన ఆలోచనకూ క్రియాత్మక వర్తనకూ మధ్య మంచు తెర వలె సూక్ష్మ స్థితి లోకం చిరంగా

3. వెలుగు స్పృహతో మృత్యు నిరంకుశత్వం నుండి స్వాతంత్ర్యం పొందిందీ గగన రహస్యం బ్రద్ధలై శబ్ధ ధుని ఆవహించింది అడవిలో వాయు భ్రమణం వలె కొండపై నుండి జలధార వలె వెచ్చని మెరపు తలపులతో వార్షిక మృదు భావనతో మనస్సు పొందుతూంది, సుందర ప్రవాహ రూపం ఎదలో సాగిన లత కళ్ళలో పూలు పూచింది పసిడి మొగలి పట్టల వలె ఆశలు విప్పారాయి ఆశ్చర్యంలో తల ఎత్తిన స్వర్గం క్రిందికి దిగి నిలిచింది వెలుగు పొరలు చుట్టుకున్న గాలి అంచుల్లో కదులుతూ మనస్సు పొందుతూంది అవిచ్ఛిన్న సంస్కార గంధం భూమిని గగనమణి వలె ఆకాశాన్ని కాంతి వలె ప్రకృతిలో అనంత శక్తి పరుస వేదికగా స్పృశిస్తోంది వాస్తవమూ ఆదర్శానికీ, శరీరమూ ఆత్మకూ మధ్య ఇంత వరకూ ఎరగని సూక్ష్మ బంధం చేకూరుతోంది జీవన గమన రీతుల్లో హృదయ స్పందన లయతో

శబ్దాన్ని తొలిచి మలచిన రమణీయ రసాకృతి మంత్రాక్షర వదనంతో మనో వలయం దాటుతూంది నిశ్శబ్ద బిందువు వెనక నుండి స్వర తరంగం వినిపిస్తోంది స్వర తరంగ వలయాల్లో సంగీత చిత్రం బింబిస్తోంది శారీరక జగత్తును స్పృశిస్తూ స్వర్లోకం కదలి పోతూంది జననాంతర సౌహృదంతో హృదయాకాశం వెలుగుతూంది శక్తి కళా సౌందర్య కాంతి నాలోకి ప్రవహిస్తూంది ఇక్కడ ఎక్కడా చీకటి ప్రసక్తి లేదు. ఆలోచనా జల తరంగాలపై శ్రేణులుగా

4. ఇక్కడ ఎక్కడా చీకటి లేదు వేసుకొన్న ముసుగులు వదులుతూ తమ రహస్యరూపాలు ఆవేదనా వాయు వీచికలపై గుంపులుగా వేసుకొన్ని ముసుగులు వదలుతూ తమ రహస్య రూపాలు ఇవి విలోల శబ్దాలతో ఆలోల వర్ణాలతో సంస్కార వాసనలతో ఎన్ని సంతతుల నాటివో? మనో గగన తలంపై వెలిగే సూర్య గోళానికీ మెరసే చంద్ర బింబానికి బాగా తెలుసు వీటి స్వరూపం. ఎదలోతులు స్పృశిస్తూ కను చూపులు ఆక్రమిస్తూ వ్యూహాల్ని దూసే శక్తితో ప్రాణాల్ని నిలిపే రక్తితో యుగాల కథా వీచికలపై శ్రేణులుగా రహస్య రేఖలు ఆలోలాసార స్వరాలతో విలోల ప్రసార రాగాలతో జలధారా భావనతో మ్రోగే సంగీత చిత్రమై ఎదలో మృదు ధ్వని ! సరస్సులో చేప ఈత వలె అవనీ ముఖాన తొలకరిలో నవ జీవనం వలె ఆనంద నృత్య కళతో ఆశ్చర్యాన్ని మ్రింగేసింది అర్థ రాత్రం చల్లని గాలుల వలె మనోభూమి నుండి స్మృతులు! వరసగా బయటికి వస్తున్నాయి అట్టడుగున నున్న కవితా నిధులు భౌతిక రూపంలో సాకారం పొదిన ఆత్మ స్మృతుల కదలికతో రసోత్పుల్లమౌతూంది మెట్లు మెట్లుగా మలచుకొని క్రింది నుండి పైపైకి మబ్బు లవతరిస్తున్నాయి, ఎక్కడికీ ప్రయాణం?

అనుభవ సౌకుమార్యంతో ఏ దూర జగత్తులోకి వినయ ధురీణంగా గాలి ప్రక్కలకు ఒదిగి పోతూంది నా ముఖంలో ఉదయం భద్రంగా గూడు కట్టుకుంది శిశువు కళ్ళు తలపిస్తూ నా ముఖంలో వెలుగు విరబూసిన లే తీగెల పాయలుగా సాగేను. భవిష్యత్తు మంచు ముసుగు వదలింది జీవితం మృత్యు రహస్యం వీడింది మనస్సు నృత్యం చేస్తోంది వెలుగై ఊహ కదలుతోంది అగరు ధూపమై ఎక్కడా ఏ ఒక్క బిందువులోనూ చీకటి లేదు దివ్య రాగ స్పర్శతో జీవితం మహితమైనట్లుంది ఆదిత్య వలయం

1. ఊహలో ఉషస్సు సూర్య గోళ హృదయంతో ఇది చావు లేని ప్రపంచం ఎంత కాలం నుండో ఉమ్మభీకృతమైంది మనస్సు కాలానికి దీప్తి నిచ్చే ఆదిత్య మృదు తేజంతో ఈ క్షణం వాగతీత స్థితి విభూతి పొందుతూంది తెర తొలగిన వర్ణ చిత్రం వలె జీవితం ప్రకాశిస్తోంది లౌకిక భావన కరిగింది, పరీమళాంచిత కర్పూరమై వాస్తవ రూపం నిలిచింది, సౌవర్ణ కళా ప్రశస్తమై జడంలో కదలికతో ప్రాణశక్తి కలకంటోంది హృదయంలో రాగంతో శక్తి రేఖ కదలుతూంది ఆకాశాన్ని విచ్చుకొని వస్తుంది, భూమిని దూసుకొని పోతుంది అణువణువున ఒదుగుతుంది, అంభో బిందు లోలమవుతూంది సముద్రంపై ఆర్థంగా వీచే పవమాన పంక్తి వలె ఆలోచన కదులుతూంది, నిబిడంగా అవ్యాహతంగా వెలుగు కళ్ళ నుండి నవ్వు పూలు రాలుతూ ఎత్తిన గగన వదనం వలె ఉంది హృదయం చావును మరచిన మనస్సు శుభ్రంగా చీకటి వదలిన ప్రభాతం వలె ఉంది మట్టిలో ఆడుకునే పిల్లాడికి వీధిలో దొరికిన ఆట వస్తువు వలె

ఈ ఉద్వేజిత క్షణం స్వర్గం కన్నా మహితమైన ఆనందాన్ని కలిగిస్తూంది నిన్నటి వరకు చీకట్లో మిణుగురుల వలె మెరిసిన కళ్ళు ఇపుడు సూర్య చంద్ర బింబాల వలెనున్నాయి ఇపుడు తలలెత్తేవి భగవంతుని ముఖాలే ఇపుడు పూచేవి భగవంతుని ఆలోచనలే వైకుంఠం కైలాసం రెండూ భుజాలపై నిలిచినట్లుంది చైతన్యం ఆవహించింది గంగాఝరీ సదృశంగా ఆకాశాన్ని వంచి భూమిని అణచి నిల్చే శక్తికి సంకేతంగా వర్తమాన శిఖరంపై నిల్చిన నా మతిలో ఉన్న అనంతమైన గతమూ భవిష్యత్తూ ఒకే రూపానికి రెండు ముఖాలుగా వెలసాయి ఈ క్షణం తెరచుకుంది! హిరణ్మయోజ్వల కవాటం హృదయ స్పందన లయతో ఓంకార నాద సుందరంగా ఉషస్సు ఎగసి వాలింది నా ముఖంపై శాశ్వతంగా షట్పదమై ఝంకృతితో తిరుగుతూంది నా ఊహలో చేతులు చాచి ఆహ్వానిస్తూ వాయు మండలం నిలిచింది ముని వ్రేళ్ళపై నిరీక్షిస్తూ సముద్ర వలయం కదలుతూంది తొలకరి వానకు ముందు వీచే చల్లని గాలికి తలెత్తి ఒళ్ళు మరచి ఊగే వనం వలె ఉంది మనస్సు ఎండిన నదిలో ఇసుక వంపుల వలె మలుపు తిరిగి విషాదం వర్ష ధారా జల భరిత నదితో ఒక్క మారు మాయమైంది గమ్యం చేరే తహతహతో మనస్సు హఠాత్తుగా తుపాను గాలి శాంతించిన సముద్రం వలె ఉంది చీకటికి తెలీదు సూర్యుని ప్రకాశ హృదయం గుహలకూ పిచ్చుక గూళ్ళకూ తెలీదు ఆకాశ వైశాల్యం చీకటి నుండి గుహ నుండి బయట పడే మనస్వికి తెలుస్తుంది! అంతో ఇంతో

2. నే నీ క్షణం మేఘ సందేశం జీవన హృదయం వినాలని చెవులు రెక్కించిన దిశలూ సూర్యుని కళ్యాణ రూపం చూడాలని కళ్లు పరచుకొన్న గగనమూ నా ఎదలో అవనతమైనాయి సంక్షిప్త రూపంలో

ఈశ్వర సంకల్పాన్ని దర్శించే మహాశక్తి ప్రకృతి నుండి మనస్సు దాటి ఆత్మ సీమల్ని స్పృశిస్తోంది అమృత ధామం నుండి వచ్చే వసంత కిరణాలకు పునస్సంజీవితమై నా రూపం వెలుగుతూంది స్పష్టి ప్రథమ రూపం వాసనా బీజం నుండి బ్రతుకులోని శిఖర భూత సంస్కార వృక్షం వరకూ ప్రకృతిలోని రూప వికాసం ప్రాణిలోని జీవ స్పందనం దివ్య దశకు చేర్చే జ్ఞానం ఎప్పటికపుడు నవోహతో మనస్సు పరిణత సిద్ధితో పునారూపం పొందుతోంది అస్తమయం ఎరగని ఆదిత్య కిరాణాలు నాలోకి ప్రసరిస్తున్నాయి వైవర్ణ్యం ఎరగని చాంద్రీ రాగం ఒక ప్రక్కగా పరచుకొంది నేనీక్షణం అనేక వాసంత సూర్యుల కళ్యాణ కాంతికి సంకేతం నేనీక్షణం అనేక రస ప్రవాహాల ఆనంద నృత్యానికి అవనీ చక్రం జ్వాలా రూపం ఎక్కడిదీ జ్వాలా రూపం? ఏ దిశ నుండి నాలో కెప్పుడు దయ చేసిందీ? దివ్య వదనం బింబిస్తూంది ప్రతి చుక్కలో పూవులో తరగలో క్షణంలో మేల్కొన్న కళ్ళలో పూచిన గులాబి అంచుల్లో తిరుగుతూ కళ్ళలో ఒదిగిన మెలకువ వెలుగు గట్లపై కదలుతూ ఎక్కడిదీ జ్వాలా రూపం? ఎప్పుడు దయచేసిందీ? ఏ నాడులు సంస్పృశించి సంగీతం ఒలికించాలనో మరోజన్మకై ఏ రూపం తగల బెట్టి బూడిద చేయాలనో చెప్పా పెట్టకుండా దయచేసింది పిలువని అతిథియై తిష్ఠ వేసింది మా ఇంటి వాకిట్లో ఆరుణ సుమ తోరణమైంది మా ఊరి బయట కింశుక సుమవనమైంది నిలుకడగా నిలుస్తుందా? ఎక్కడిదీ జ్వాలా రూపం? ఏ తపస్సులో పుట్టింది? ఏ ఉదయంలో పెరిగింది కణకణం వెలిగించి తేజో జగత్తు నిలుపుతుందా? కణకణం దహించి నవరూపంగా మారుస్తుందా ఎక్కడిదీ జ్వాల రూపం? ఏ దిశ నుండి దయచేసింది? ఏనాడో అరణి నుండి ఉద్భవించిన అగ్ని ఈ రహస్య రూపం ధరించిందా? నవ నాడుల తీగెల్లో ప్రవహించే విద్యుత్తు ఈ ప్రకాశ రూపం పొందిందా? తర తరాలు క్రమించి వచ్చి ఇపుడు నన్ను చేరిందా?

యుగయుగాలుగా గమించి ఇలాగే మునుముందూ పోయేనా? ఎక్కడిదీ జ్వాలా రూపం? ఎక్కడిదీ కానే కాదు ఎంతో పరిచయ మున్నట్లుంది, అంతలో కొత్త దనం వహిస్తుంది ఏ దిశ నుండీ రాలేదీ జ్వాలా రూపం నా నుండే ప్రతి దిశకూ ప్రసరించింది చీకటీ వెన్నెల వెలుగూ ఏ భేదం లేకుండా దిశ దిశ నుండీ నాలోనే సరిస్తుంది, చరిస్తుంది ఆత్మలో నిహితమైన తేజః ప్రభావం మనిషిలో వాంఛా బీజం తొడిగిన పల్లవరాగం మనసులో అహం వృక్షం వేసిన సంతానఫలం అణీయం నుండి మహీయం వరకూ అందరిలో ఉంది సముద్రంలో బడబాగ్ని వలె గుప్తంగా అరణిలో అనల తేజం వలె రహస్యంగా ఈ జ్వాలా ప్రకాశంలో ఉదయించిన సంస్కృతి ఈ సంచారంతోనే చీకటి దిబ్బ కావచ్చు ఇది ఎక్కడికీ పోదు గుండె తోపులో ఉంటుంది చెంగున గంతులేస్తుంది హరిణ మృగంవలె ఇది ఎక్కడికీ పోదు మనో వనంలోనే ఉంటుంది జాలు విదల్చి నిలుస్తుంది ప్రభాత సింహం వలె ఈ మనోజ్ఞ జ్వాలా రూపం అఖిల మానవాత్మకు సంకేతం చివరైనా బూదైనా మనిషిలో మనసే కారణం

II. జీవనరేఖలో

4. జీవన బింబం జన జీవన కిర్మీరం నా రూపం నవ మానస నిర్మాణం నా బింబం ప్రకృతిలో భాగమైంది మనిషితో హార్ధమై జీవన రుచితో ఏర్పడింది బలధన శక్తులతో రణ సహ యుక్తలతో పద పద మెదురౌతుంది అనల పాద శిఖలతో అవనిపై ఒకరొకరూ ఒకరు ధూమమై సాగేరు, ఒకరు ఖడ్గమై దూసేరు

దయా రహితంగా తరుమబడేరు, క్రుధా చరణంతో విసరబడేరు గుండెలో గాయం వేదనతో జ్వలిస్తుంది మంటలో రాగం గాథతో స్వనిస్తుంది శుష్కమైన చెట్టూ స్నేహ శూన్య దీపం ఎన్నో జన పాత్రల్ని తలపిస్తాయి జూలు విరిసిన సింహమై భీ తరంగ చలనంతో దూకే హరిణ సమూహమై ఆనంద లహరితో నిరాశలో ఆశతో మనిషిలో క్రోధ సింధువు! చరిత్రకు నిలయం జీవితంలో ఆశతో ఉదయ సంధ్యాస్ఫూర్తితో పక్షి నింగిలో ఎగసేను మనిషి వీధి లోకి కదలేను మనిషితో మనిషి కలిసి రాగంతో బంధంతో కాలానికి గతి నిచ్చేరు ఏ నీడలో కొమ్మ విరిగి పై బడుతుందనో ఏ వేళలో నింగి ఒరిగి అణచేస్తుందనో భయం లేకపోలేదు ఉదయం అలలై కదలి రాత్రికి ఎండిన ఆకులై మరలేరు ప్రాణం నిల్చేందుకూ జీవితం వెలిగేందుకూ శ్రమ ఫలం పొందేందుకూ కణ కణంలో శక్తి అవసరం; ఆజీవన యంత్రం ఈ భౌతిక బింబం దప్పిక వస్తే కంట్లో నీరు ఉంది ఆకలి వేస్తే లోలోన బాధ ఉంది అనుభవ శిఖరాలపై తగిలిన గాయాలు వీరికి దీప శిఖలై దారి చూపేను శిశిర ముఖంతో గుడిసె శీర్ణమైన కల వలె ఉంది వంగిన భుజాలతో వృద్ధును తలపిస్తూంది (2) ఊగే పంజరంలో కదులుతూ పక్షులు స్వేచ్ఛా భ్రాంతిని పొందేను విడిపించబోతే పెద్దగా అరుస్తాయి! అలవాటుగా చువ్వల్ని పట్టుకుంటాయి కళ్ళలో భయ రేఖలతో! తలుపు తెరచినా బయటికి రావు రెక్కల్లేని పక్షులైన మనుషులకున్న బంధన వలయం ఒక పంజరమే కాళ్ళకే కాదు మనస్సుకూ మట్టితో సంబంధ ముంది చేతులకే కాదు మనస్సుకూ పనితో సంబంధ ముంది కాలం విసరే దెబ్బలకు పడిలేస్తూ సంఘం నిలిపే చోట అడుగులేస్తూ ప్రతి మతిలో హామ్లెట్ ఊహా సంకోచం! ప్రతి హృదిలో ఒథెల్లో మూడోద్రేకం ఉదయ సూర్య కిరణం గుడిసె ముంగిట్లో వేచి ఉంటుంది లోపలి నుండి మనిషికై, అతని కళ్ళలో చీకటి లోతు కనుగొనాలనీ! గుహకు గూడుకూ విశాల దిశ చూపిస్తూ శిల నుండి కల నుండి హేతు రశ్మికదలుతుంది ఎప్పటికీ మిగిలే ఉంటుంది పయనంలో విజ్ఞాన సోపాన క్రమం సంస్కృతీ ప్రస్థానంలో అరణ్యం ప్రకృతి బంధమైతే నగరం ఆలోచనా యంత్రం

సంస్కృతిలో గర్వించే శిఖరాలు సామాన్యుని బ్రతుకులో ఆటంకాలవుతాయి దారులు మలపుల్లో గోడలు అమాయకంగా ప్రయాణ దిశను మారుస్తాయి శూన్యమైన కాలాన్ని చిత్రమయం చేసే తప్తమైన గుండెల్ని రాగ మయం చేసే అనుభవం ఎవరి సొత్తూ కాదు, ఆలోచన ఎవరి ఆస్తీ కాదు! గుడిసె నుండి మేడ వరకొకే ఆశా పథం; బిక్షుక గణంతో ఒకరు అన్నంతో తృప్తి పడితే మరొకరు స్వర్ణంతో తూగేరు గాయ పడిన గుండెపై అరచేయితో నాల్క తెగిన గంట వలె ముఖంతో నీడల్నీ మనుషుల్నీ గుర్తించే భేదం చెదరీ, సమయం ఎదురౌతుంది! నాగరక దశ దశలో నిలిచిపోయిన జీవితా లెదురౌతాయి గాలి కదులుతూంది పాటలతో మంటలతో పరివర్తన చేతనతో పై నుండి ఏ దేవత పూనకం లేదు, వెనుక నుండి తాళ్ళు లాగడం లేదు. ఉరుముల వంటి ఆవేశం లేదు; మెరుపులతో బ్రెయిన్ వాష్ లేదు ఉందొకటే! మానవ స్పందనతో మానవతా గంధంతో సంస్కృతి! బూది అయిన క్షణాల నుండి కూడా మొగ్గనూ పండునూ కోరుతుంది ఈ గుడిసె ఎదగని ఆలోచన వలె ఉంది! మేల్కొనే శక్తిలేని కొండవలె ఉంది ఒక దోసెడు చల్లని నీరు కోసం ముఖం తపిస్తుంది ఒక్క మంచు అద్దిన ఉదయ కిరణం మాత్రం కరుణతో సరిస్తుంది ముఖాలపై నీడను తొలగించే ప్రయత్నం చేస్తుంది ఎతెన మేడల బుజాలపై నుండి శిరస్సుపై నుండి దూకుతుంది ఎండకు మాడి పోని చల్లని ముఖంతో మనుషులెదురౌతారు వేడికి కాలిపోని పచ్చని గుండెతో బ్రతుకులెదురౌతాయి శ్రమ జీవన చలనంతో వర్తమాన చరిత్ర! నడుస్తూంది కళ్ళలో మేఘంతో గుండెలో అగ్నితో మనిషి శక్తి బింబిస్తూంది గుడిసె నుండి నీడలు బయటి కొచ్చీ, వెలుగులో ఒకటైనడుస్తున్నాయి నిరంకుశుల నిశాగతుల్ని మాపే కిరణశక్తి వహిస్తున్నాయి ఇపుడు మేల్కొన్న ప్రజాశక్తి వర్గ రహిత కిర్మీర రూపం ఉదార లక్ష్యంతో కదలే ప్రజా స్వామ్య శక్తికి నిలయం అశాంతి హృదికి తావు లేకుండా శాంతిని వెల కమ్మేవారెవరు? అరణ్య మతికి వీల్లేకుండా కోర్కెల్ని కొలిచీ ఇచ్చే వారెవరు? గుడిసె ముఖం అదే! ముఖంలో నిశ్శబ్దం తొలగింది మనిషి ముఖం అదే! ముఖంలో ఆకాశం వెలిగింది అమ్మకానికి సిద్ధ:గా దీని చుట్టూ ఎంతో కథ ఉంది నిజమే అమ్మకానికి రాకుండా దీని చుట్టూ ఎంతో వ్యథ ఉందీ నిజమే

మనం బ్రతికేది ఎవరి మెప్పు కోసమో కాదు మనం నిలిచింది ఎవరి భూమిపైనో కానే కాదు దేన్ని వదలినా మరచినా దీన్ని వదలలేం, మరవలేం మనిషిలో అంగారం ఆనందం ఎన్నిటినో స్వంతం చేసుకోజూస్తాయి (2) రోజూ, కన్నీటితో తడిసిన చెక్కిళ్ళతో అగ్ని తప్త హృదయంతో భయాన్ని కప్పుకొనీ పగలు కన్నా రాత్రి నయ మనిపిస్తుంది శూన్య హృదయంతో ఆలయానికి కదలి, సూర్య కాంతితో వెలిగి పోవాలనే కోరిక నిప్పు కణాలతో అలంకరించిన మనస్సు పుష్పమయం కావాలనేకోరిక గుండెలో మేల్కొనే గాయాల్ని రాత్రి మరపిస్తుంది దాచేస్తుంది నిద్ర నుండి లేచే సరికి ఉదయం మళ్ళీ రణ చరణంతో సిద్ధమవుతుంది నిజం అగ్ని అయితే కానీ! పెదవులపై గుండెలో చల్లగా సరించనీ కళ్ళలో కిరణమై, ఆత్మలో వివేకమై మనిషిని చేతులపై కెత్తనీ కర్మసాక్షి కన్పిస్తేనేం? కిరణ పంక్తి ప్రసరిస్తేనేం? గుడిసె రూపం మారందీ! ఈ నిద్రా జగం వీడందీ! హిమ శిలవలె నున్న గుడిసె చుట్టూ ఉదయ కిరణం తిరిగి పోతుంది శ్రమ శిఖ వలె నున్న మనిషి వెనుక ఉదయ కిరణం కదలి పోతుంది శ్రమ శిఖల కృషి ఫలం ముక్కలై జంతువుల కాహారం కారాదు ప్రజాస్వామ్య స్నేహంతో శ్రమ శిఖలు వెలుగు తోరణం అవాలి వ్యక్తిలో చారిత్రక శక్తితో సమాజం కిర్మీర తేజమై కదలుతూంది స్వేచ్ఛలో శ్రమ శిఖలు యుగాల సంకెళ్ళను వదిలేసాయి గూడులో పక్షి గుడిసెలో మనిషి ఇరువురి స్థితు లొకటే నిరంతరం వర్తన పరివర్తనతో జీవితం ఎద కంటికి కిర్మీరం బిందువు బిందువులో బింబం, బింబ గణంతో సమాజం కళ్ళలో బింబించేది వేరు, మనసులో కనిపించేది వేరు స్వేచ్ఛా చరిత్రలో సమాజ జీవితం వేగాన్ని అందుకుంటూంది నిరాశను ఆకాశంలోకి విసరుతూ సమతను పృధ్వీ హృదయం పై నిలుపుతూ ఈ సమయం జన శక్తికి నవం నవ చేతనతో పురోగమన మవసరం సంస్కార గంధాన్ని మోసుకొనీ గాలులు వీస్తాయి వర్ణ చిత్రాలు నింపుకొనీ కాంతులు ప్రసరిస్తాయి, అయినా ఎక్కడి కక్కడ క్షామ రేఖపై గుడిసె బ్రతుకులో నిలువెత్తూ శిశిరమే

నింగికీ నేలకూ ప్రకృతికీ మనిషికీ తప్పని అనుబంధం జలదం మానస భౌతిక స్థాయిలో నవ జీవన దర్శన చిహ్నం, ఎక్కడుంది ? గుడిసెలో నిశ ఏ రోజూ ఆర్తి చిత్రాన్ని స్వప్నిస్తుంది గుడిసె ముగింట ఏ వేళ క్షామ ఖండం దర్శనమిస్తుంది. వేడి గాలిలో హిమ శకలమై చల్ల గాలిలో అనల కణమై సమాజం నుండి శక్తి పొంది వ్యక్తి తిరిగి సమాజానికే ఇచ్చేను రోజూ సూర్యుడు తమ కోసమే ఉదయిస్తాడని విశ్వాసమున్నా మబ్బు మాయం చేయొచ్చు! అగ్ని వలయం చూడనీయక పోవచ్చు వర్గం ప్రతి వర్గం శక్తీ ప్రతి శక్తీ క్రియ ప్రతి క్రియతో జీవిత సంఘర్ణతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూచే సమయ మెక్కడిది? ఎండిన ఆకుల వలె ఊహలతో మూసిన దారుల్లో కోర్కెలతో అపరిష్కృత సమస్యకు దీన రూపమై, శిథిల భావ వ్యవస్థకు చిహ్నమై బక్క చిక్కి బయట పడిన ఎముకలతో గుడిసె గూడు వలె ఉంది స్వార్థం శ్రేయం అసహనం మానవత దేని కది ప్రత్యేకంగా మనస్సు అరల్లో భద్రంగా ఉంటాయి, ఏ అవసరానికో పైకి లేస్తాయి గుడిసె! అదే! దీన జనం బ్రతుకు అదే! మనిషిలో స్వార్థం ఇప్పటిదా? రాత్రి నిలిచిన కథలో పాత్రల్ని ఉదయం అవలీలగా అందుకుంటుంది మనిషిలో జంతువు ఆట నేర్చీ పాట నేర్చీ రంగం పైకి వస్తుంది మనసులో ఆడే జంతువు రాగం పెంచినట్లే ప్రాణం తీసేస్తుంది. నిన్న మలిపిన దీపాన్ని నేటి నిశ వెలిగించి గడపక తప్పదు అగ్ని జ్వలించే ముఖాలతో ఇక్కడ ఎవరికీ వారే అతిథి స్వరూపులు ఎవరికీ దారి తప్పే భయం లేదు! మరో దారి ఉంటేగా! యుగ యుగాల ప్రయాణంలో సమస్య నుండి సమస్యకు కదలుతూ గతాన్ని కన్నీళ్ళతో తుడిచేస్తూ మరపిస్తూ పోవాలనే! శిలపై ప్రవాహమై సరించాలనే! నిశ నుండి ప్రభాతమై రావాలనే ఆశ సహజం! తరం నుండి మరో తరం! పయనం! సాధనం వేరు మలుపు మార్గాని కంతం కాదు, పగలు వెలుక్కి సమాప్తి కాదు రాత్రిని చూడకుండా రోజుకు సంపూర్ణత లేదు! మనిషిలో సరేసరి! కిర్మీరంలో ప్రతి వర్ణంతో బింబానికి కళ సిద్ధిస్తుంది సమాజంలో ప్రతి వర్గప్రమేయం జీవితానికి రూప మేర్పడుతుంది (4) దిక్కుల్లో నుండి ప్రేయో మేఘాల్నీ కొండలపై నుండి శ్రేయో సూర్యుణ్ణి ఎడారిలో ప్రవాహాన్నీ మనస్సులో ప్రకాశాన్నీ మనిషి కోరేను

శాంతి సుఖద భావనలో అన్నీ సహజం! జీవనసాధనలో సంశయ గ్రస్తం ఎపుడో వదలి పోయిన మేఘం స్వేచ్ఛాకృతితో రస సేచనతో తిరిగి వస్తుంది కృషి కారులు పాదాలకు వరించిన సంకెళ్ళను మేఘ గర్జా ధ్వని తొలగిస్తుంది సూర్యుడు వెనక్కి పోడు! ప్రయాణం నిలిచి పోదు మనిషి ఆగిపోడు! సమాజం విస్మృతం కాదు ప్రేమతో పాటు హింసనూ తలపించే చరిత్రలో పుష్పంతో పాటు బులెట్ కూడ శరీరాన్ని అలంకరిస్తూంది జ ఉదయం వస్తుంది మనలో మంచును తొలగించే వెచ్చని మృదు స్పర్శతో పేవ్మెంట్ అంచు నుండి యూనిఫార్్మ తరంగాలతో పిల్లల్ని టీచర్, పడవై టాఫిక్ సముద్రాన్ని నిర్భయ సుందరంగా దాటిస్తూంది దిక్కుల కళ్ళు తెరిపిస్తూ పరుగెత్తే వాహనాలు లేత మనస్సులపై వేగాన్ని వదలుతున్నాయి; సెర్యాన్ని నిలుపుతున్నాయి ఈ సమయం రోడ్ను క్రాస్ చేయడమంటే ఒకే రన్తో వన్డే మాచ్ను గెల్వడం! అన్నమాటే బస్ కోసం ఎదురు చూచే పిల్లల కళ్ళలో చాక్లెట్ రెపరెప లాడుతూంది లోనివి బైటికి రాకుండా ఏ గోడ లేదు ఆఖరికి మెష్ కూడ లేదు పిల్లల్లో ప్రాణ భీతి కొసదేరుతూంది పెద్దల్లో వేగ దీప్తి కొడి వేస్తూంది భయం చరణాలకు బ్రేక్ వేసి మృత్యువు అంచుల్లో నిలుపుతుంది సిటీలో ఈ ఉదయం! పిల్లలు హృదయంలో వీడని జీవన కిర్మీరం పేవ్మెంట్పై కార్నర్లో సూర్యునితో పాటు రోజూ చాలీ చాలని కటీపీస్ బ్రతుకులూ తమ పని చేసుక పోయేను గుప్త రౌద్ర ముఖాలతో మౌన నిధులు, కొందరు వీధిలో విస్ఫోటనా యంత్రాలై, ఆందోళనకు తంత్రులై కదిలేరు మారే ప్రకృతీ సమాజంలో బాధలో విషాదంలో ప్రేమలో సంతోషంలో కాలాన్ని మరచి కొందరు బ్రతుకును తూచేరు కాలాన్ని గెలిచి కొందరు పైపై వెలగ జూచేరు మనస్సులో కదలే కోర్కెలపై పేపర్ వెయిట్ వలె సూపర్ ఈగో చీకటిని మరచి పోతుంది! కాంతి శిఖరాన్నే చూస్తుంది రాత్రి గస్తీలో జవాన్ రౌండ్లో లాఠీతో నేలను శబ్దిస్తూ పోయేను పట్టుబడ్డ మనిషి కళ్ళలో కర్మ సాక్షి చూపులు కదులుతున్నాయి నిజాన్ని ఎవరు బుజాలపై మోసుకొని ముందుకు తెస్తారు? గతాన్ని ఆయుధం చివర నిలుపుకొని ఎవరు ముందుకు తీసుకొస్తారు నేలపై చిందిన రక్త బిందువులో మానవ చరిత్రను కాల్చే అగ్ని ఉంది

కాలం నడుస్తూంది నాలోకి పారాణి అడుగులతో కాలం నిష్క్రమిస్తూంది నా నుండి గాయాల శరీరంతో నగరం శబ్ద ధునితో మౌన మెరుగని కవిత్వం వలె ఉంది శబ్దం ఆకాశం వైపు పరుగెత్తితే, అర్థం మనస్సులోకి దూకుతూంది మనిషి భౌతికమైన పొరలతో బ్రతికేను మనసు లోపొరల్లో అరలతో నిలిచేను రాలిన మంచుకు తడిసి పలకని తంత్రి జారిన ఉష్ణ బాష్ప కణంతో స్వనిస్తుంది వాయు శక్తి లేంది మ్రోగని వంశి మనోవేదనతో నినదిస్తుంది గుడిసెలో శిశిర దృశ్యం వెనుక నుండి సన్నని బాధా స్వరంలో ఎదకు తప్ప చెవికి వినిపించని వెచ్చని వేదనా సంగీత ముంది (5) తీరని ఆకలితో అగ్నియై ఆరని దప్పికతో శిఖయై కదలే జీవితం ఏ ఆశా ఫలానికో శమిస్తుంది? ఏ కీర్తి ధారకో అణగుతుంది మండే అరణ్యంలో గుండెపై గన్తో మనిషికెదురుగా మనిషితో శాంతి టైటిల్తో పెయింటింగ్ గదిలో గోడకు వ్రేలాడుతూంది ఏ రోజు పేజీ ఆ రోజుతో తొలగి పోతుంది ఏ రాత్రి దీపమా రాత్రితో తొలగిపోతుంది ఇప్పటి చరిత్ర ఎప్పటికో ముఖాన రంగు చల్లుతుంది ఎప్పటి చరిత్రో ఇప్పుడు గుండెపై ఏమైనా అవుతుంది ఏ మనిషిని చూచినా శిశిరంలో చెట్టు వలె ఆకు రాలే భయం జీవితంలో పోగొట్టుకుందే ముందుగా ఊహకు వస్తుంది ఎదురుపడే ముఖానికీ ముఖానికీ మధ్య ఆకాశం ఎదురౌతుంది దీన్ని తన వశం చేసుకోగలిగిం దొక్క ఆత్మ విహంగమే ఎదురుపడే ఆలోచనకూ ఆలోచనకూ మద్య సముద్రముంటుంది దీన్ని అవలీలగా దాటగలిగే దొక్క ఆత్మ నౌకే కదలి పోయే ప్రజాచరణ పంక్తులతో ముద్రలతో గుడిసెనూ మేడనూ ఓ కాలి దారి కలుపుతుంది విస్మరించిన శిలా క్షణాల్ని, పయనం చెక్కుతుంది నిద్రపోయిన నిప్పు కణాల్ని పవనం ఊదుతుంది వీధిలో ఒక ప్రక్క ఊదే నాగస్వరానికి లేవ లేక లేచి తలెత్తే పామును పాముల వాడు ఆటకై కట్టెతో కదుపుతున్నాడు మనిషి జీవిత మెన్నో శక్తుల సమూహం,

స్వేచ్ఛలో సృజన రూపం వహిస్తుంది జీవిత యాత్రలో! అనుకోకుండా సమయం సింహమై దూకొచ్చు, బాంబై ప్రేలొచ్చు రక్త చిత్ర మెదురైనా, భగ్న దృశ్యం కన్పించినా భవిష్యత్తుపై ఆశ మనిషిలో కిర్మీరమై ఆకర్షిస్తుంది మనిషిలో మానవత పుష్పమై కిరణమై శాంతి చరణంతో హద్దు లేని ఆకాశం క్రింద అవనిపై సీమలు చెరిపేస్తుంది వ్యక్తిలో దివ్య కిరణం వెలుగు కళతో ఉద్గమిస్తుంది సామాజిక చేతనతో జీవితం కిర్మీర బింబ మవుతుంది

5. లలిత కవితలు ఉదయ చరణ మంజుల నిస్వానం నా ఎద మ్రోగెను లలిత పవన సంచలిత నవాబ్దం నా ఎద సాగెను ఈ సమయం నా చరిత్ర చూపుల్లో నవ విజయం ఉదయ వదన మందార శ్రీధుని నా ఎద నిండెను తరుణ తరణి చుంబితమై ఆశలు నా ఎద పండెను ఈ సమయం నా ధరిత్రి ఊహల్లో విజయ తరం నా గతిలో గంగా గోదావరి పరుగులు తీసెను నా తలపై హిమ శిఖరం శాంతి కపోతం రువ్వెను ఈ సమయం నా ధరిత్రి చరిత్రలో జయ నృత్యం ఉదయ చరణ మంజుల నిర్వాణం నా ఎద మ్రోగెను

1. ఉదయ నృత్యం తరం తరం నవ తరం నవ మానవ జయ యుగం అవనిపై సమ బావం వికసించే తరుణ తరం తర తరం నవ తరం నవ మానవ జయ యుగం బ్రతుకు సుమం మధు పెరిగిన భ్రమర గణం ఉదయ తరం పాల తలం గగన సమం వెలిగే విజయ తరం మత ఝంఝను మతి పవనం ఎరగని వెలుగు తరం తరం తరం నవ తరం నవమానవ జయ యుగం అవని తలం పద పదం అమృత శిఖలు వెలిగించే

గగన పదం క్షణ క్షణం అరుణ దిశలు వికసించే నవ తరం నవ మానవ జయ యుగం యుగ యుగాల అంధజగం విదలించిన కాంతి గణం పద పదాన ఉదయ ముఖం కుసుమించిన వీర తరం తరం తరం నవ తరం నవ మానవ జయ యుగం

2. తరం తరం

3. జయ పతాక జయ పతాక ! జయ పతాక ! జయ జయ జయ ! జయపతాక ఎద నిండుగా కనువిందుగా కదలి యాడే జయ పతాక ఆ నభోవీధి దాకా చూపులోనా ఊహలోనా అలలుగా నా జాతి విజయం కదలియాడే జయ పతాక ఉదయంలో నవరాగం శాంతిలో ఆనందం పైరులో సౌభాగ్యం ప్రతిఫలించే జయ పతాక నవ్వుతూ వచ్చేను ఉదయం ఆర్తితో కదలేను శిశిరం

4. సంగీతమే సంగీతం పాటతో కన్నీటితో సాగిపోయే మంచులో, సంగీతమే సంగీతం పైన గాలికి ముక్కలై తిరిగి కలిసే మబ్బులో నవ్వు పువ్వులు రువ్వుతూ కదలు వర్షా పదంలో, సంగీతమే సంగీతం పూల తరగల వాలుతో అలల నురగల జాలుతో పైని మబ్బుల నీడతో కింద కదలే ఝరుల్లో, సంగీతమే సంగీతం శిశువు ఎదలో సరించే కొత్త నెత్తురు వాకలో బ్రతుకు దిశలో దివ్వెయై వెలుగు వెలిగే ప్రాణిలో, సంగీతమే సంగీతం శయ్యపై నలిగి వాడిన పూలు చూచే వేళలో మనసులో ముర్మురించే స్మృతుల పరిమళ లహరిలో సంగీతమే సంగీతం నిశా రూపం మాపుతూ వెలుగు రెక్కల ఊపుతో సాగు ఆశా కపోతీ యాన సుందర దీప్తిలో, సంగీతమే సంగీతం ఎద విదల్చీ మతి చిగిర్చీ కదలు వర్షా పదంలో లోన వేదన బింబమై వెలుగు స్పందన రేఖలో, సంగీతమే సంగీతం

5. తెలుపు అంతట తెలుపు అంతట! తెలుపు తెలుపు! వెలుగు లిప్తలు కదలి నపుడ తెలుపు ఎదలో తెలుపు తెలుపు! అమృత లిప్తలు వెలిగినపుడు ఉదయ సంధ్యా గతుల్లో ఎరుపు విరిగిన తెలుపు! తెలుపు! రాత్రి జారిన నవ్వులో నలుపు విరిగిన తెలుపు తెలుపు! కడలి తరగల అంచులో భీతి నణచే తెలుపు తెలుపు అవని హృదయం పొరల్లో జీవ మొసగే తెలుపు తెలుపు తెలుపు దిశలో తెలివి తెలుపు! వెలుగు లిప్తలు విరిసినపుడు తెలుపు ఎదలో తెలివి తెలుపు! అమృత లిప్తలు కురిసినపుడు తెలుపు అంతట ! తెలుపు తెలుపు! వెలుగు లిప్లులు కదలినపుడు తెలుపు అంతట! తెలుపు తెలుపు! అమృత లిప్తలు వెలిగినపుడు లేదు నాకు జ్ఞాపకం మనం రాత్రి కలవడం పరిమళాల దారిలో ఝంకృతితో సాగడం లేదు నాకు జ్ఞాపకం మనం రాత్రి మరలడం లేదునాకు జ్ఞాపకం శశి ఎప్పుడు మలిగిందీ లేదు నాకు జ్ఞాపకం రవి ఎప్పుడు వెలిగిందీ

6. లేదు నాకు జాపకం రా! రమ్మ రమ్ము ఈ క్షణం! రా! రమ్మురమ్ము ఈ క్షణం కడలి కెరటం ఊపుతో వెలుగు చరణం ఊహతో రా రమ్ము రమ్ము ఈ క్షణం! రా! రమ్ము రమ్ము ఈ క్షణం రాగ పద్మం విరియగా మానవీయం వెలగగా

7. ఈ క్షణం బాధ ముడిచిన పొట్లమై గుండె అంచుల నిల్వగా మొగలి రేకుల అంచులో ఒదిగి పోయే లహరియై ఆకు రాలిన జాడలో మొగ్గవేసిన నవ్వుతో రా! రమ్ము రమ్ము ఈ క్షణం ! రా రమ్ము రమ్ము ఈ క్షణం!

8. ఓ మహాత్మా తర తరాల నిశల బరువుతో అణగిన ఈ రూపం యుగ యుగాల పద ఘట్టనలో నలిగిన ఈ దేశం ఓ మహాత్మ! నీ కరుణకు ఎదురు చూచు! ప్రతి అణువు ప్రది హృదిలో మానవ సమతా యుగ మవతరించె ప్రతి గతిలో నూతన జన రూపం కదలి వచ్చె ఓ మహాత్మ! నీ కరుణకు ఎదురు చూచు! ప్రతి అణువు ఉదయం ఎరగని మానవ హృదయంలో రవి బింబం సహనం శాంతి అహింసా ఫలమే ఈ స్వాతంత్య్రం ఓ మహాత్మ! నీ కరుణకు ఎదురు చూచు! ప్రతి అణువు నిశనే ఎరిగిన జీవిత వలయంలో పథ మంతా ప్రతి అణువూ వెలుగ సాగె! ఓ మహాత్మ నీ గతిలో నిదురే ఒక భోగంగా గడిపే ఈ నేలపైన ప్రతి అణువూ నడవ సాగె! ఓ మహాత్మ నీ వడిలో జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ హిమ శిఖరం నీ హాసం! మా తలపై చంద్రరేఖ! గంగా ఝరి నీ చరణం! అణువణువూ అర్ధమయం జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ! మలయ పవన వీచీ తతి మాపై నీ కరాంచలం ఈ శతాబ్ది నీ చరిత్ర మా బ్రతుకుల ఉదయ ఫలం జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ! ప్రతి నిశ నీ చరణంపై వాలనిదే సాగిపోదు ప్రతి ఉదయంలో నీ పద చిహ్నం మా కాదర్శం జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ! జనతా హృదయాశయ నవ యుగ చేతన! ఓ మహాత్మ! ఇది గ్రీష్మం! ఇది గ్రీష్మం! అణువణువున అనల కణం ఇది వర్షా చరణం! నవ సృజనకు సంకేతం

9. యుగ చేతన

10. కిర్మీరం ఇది శిశిరం ఇది శిశిరం! చెడు ఊహల పతన భరం మధు సమయం మధు సమయం! జీవన రస చషకం జీవిత చలన తలం! పలు ఋతువుల సంకలనం ప్రతి వర్ణం ప్రసరించే కిర్మీరం ! జీవితం !

11.జయ! జయ! జయ! జయ జయ జయ నిఖిల లోక నీరాజిత దివ్య చరిత జయ జయ జయ విజయచరణ కరుణాకర జనయిత్రి నీ చల్లని చూపులో పరవశించు జగమంతా నీ చూపుల దారిలో కదలి పోవు జగమంతా శుష్కమైన కణ కణం అమృత పదం నీ చరణం తప్తమైన అణువణువూ నవ జలదం నీ రూపం మానవాళి పుణ్య ఫలం అందించిన దివ్య సుమం మా నివాళి ఇదే తల్లి నీ మూర్తికి శుభ సమయం ! ఈ దేశం నా దేశం మన దేశం మధుర భరం ఈ దేశం మన దేశం ప్రియ భారత హృదయ వనం ఒకే గుండె ఒకే ఊహ ఒకే ఒక మతి గతితో జాతి వర్ణ మతం భయం మరపించే రసధునితో శీత నగం కాశ్మీరం అరుణాచల జలధి సీమ జనతా సంస్కార ప్రియం అణువణువూ కాంతి భరం ఎరుపు తెలుపు నలుపు రంగు రంగుల తోరణాలు వెలుగు వెలుగు వెలుగు శాంతి కపోతాలు బారులుగా ఈ దేశం నా దేశం మన దేశం మధుర భరం ఈ దేశం మన దేశం ప్రియ భారత హృదయ వనం

12. ఈ దేశం

6. రేఖా చిత్రాలు లైట్లు హఠాత్తుగా ఆరిపోయాయి గది అంధీ భూతమైంది అరచేతిలో నుండి అంతా జారి పోయినట్లుంది రాత్రి హంతకుని వలె లేచి నట్లుంది ఎక్కడి వారక్కడే నిలిచి పోయారు

1. అరచేతిలో పిల్లలు ఏడుపు లంకించుకున్నారు వృద్ధులు తడుము కొంటున్నారు ఎవరో అగ్గి పుల్ల గీసారు కన్నుల్లో చిందులు తొక్కింది వెలుగు ఎవడో హంతకుడు ముఖం త్రిప్పుకున్నట్లుంది ఎవరో భుజంపై చేయి వేసినట్లుంది ‘ఎక్కడ’ ఇక్కడే ! అంటూ లైట్లు వెలిగాయి వెనక్కు తిరిగి చూచే లోపల అంతా అరచేతిలోకి తిరిగి వచ్చినట్లుంది ప్రక్కనే నా నీడ కనిపెట్టుకొనే ఉంది ! నేనేదో వ్రాసుకునే వేళకు మావాడు 'నాన్నా' అంటూ ఎక్కడి నుండో వెల్లువ వలె వచ్చీ రావడంతోనే చేతిలో నుండి పెన్నులాక్కొని నా చేతిలో పుస్తకం పేజి పై గుండ్రంగా సున్నా చుట్టి మధ్య రెండు చుక్కలు పెట్టాడు పెన్ను లాక్కున్నా మారాం చేసి సాధించాడు సూటిగా బాణం గీసి 'ముక్కు' అని నా వైపు చూచాడు

2. చిత్రానికి విచిత్రం మీసాలో పెదవులో రెండు గీతలు పొడిగిస్తూంటే

చేతిలో పెన్ను లాక్కున్నా, వాడికి కోపం వచ్చింది మళ్ళీ అంతలో ఊడి పడి నా వెనుకనే కుర్చీ చాటు నుండి తొంగి చూస్తూంటే వాడివైపు చూస్తే జాలి వేసి నేనే పెన్ ఇచ్చా పెద్ద సున్న చుట్టి 'బొజ్జ' అని నవ్వడం మొదలు పెట్టాడు నేనెక్కడ పెన్ లాక్కుంటాననో గబగబా కాళ్ళు అని రెండు నిలువు గీతలు గీసి పెన్ నా మీద విసిరేసి పరుగెత్తాడు ఇంతలో మిత్రులొచ్చారు! చిత్ర చూపించా నేనే “వాడి మొగం” అనడం తప్ప అంతా 'బాగుంది' అనే వారే! కొనదేరిన తెలివితో ఇంతకూ తాము సహృదయులన్న విశ్వాసానికి ఏ లోటూ లేనట్లుగా ఉందా వాలకం చూస్తే !

3. జవాబుకై చూడకుండా 'పూలు'! ‘పూలు' అందమా ? గంధమా ? ఏమదీ చెప్పు! వాటి ప్రయోజనం” అంటూ అగ్గిపుల్ల గీసాడు మిత్రుడు ఎదురుగా ఆ వచ్చిన జ్వాలా రూపం అగ్ని పుష్పం! వలె అతని కంటికి చిత్రంగా ఉంది నాలుగు మాటలూ మెరసాయి మంటలో! “పూలు! పూలు! అందమా! గంధమా ఏమదీ !చెప్పు మరోసారి” అంటూ గొణిగే మిత్రుని పెదవుల సందున వెలిగింది సిగరెట్ ! పూల తీగె సాగింది పొగ! మనస్సు మలుపు తిరిగింది పూలపై కసి, ఆపైన పూల గురించి ఆలోచనగా మారింది కాలం కదలింది! ఏ జవాబుకూ ఎదురు చూడకుండా మిత్రునిలో పూల ఆలోచనా పరిమళం వదలీ, ఎవరో తలుపు తడుతున్నారు ఏ చుట్టమో పక్కమో! అవచ్చు ఏ మిత్రమో అర్జంటు పని మీద రావచ్చు మెలకువ వచ్చింది! లేవానుకొనీ బద్దకంగా పక్కకు తిరిగా! నిశ్శబ్దం! అంతలో చప్పుడు

పాపం ఎవరో? అనుకొనీ లేచి తలుపు తెరిచా ఎవరూ లేరు! గాలి ! ఆప్యాయంగా నా చెక్కిళ్ళు స్పృశించింది చేతి వ్రేళ్ళతో కత్తి పదును చూచినట్లు ! అంతా నిశ్శబ్ధం! శూన్యం ! ఎవరో పాపం! ఎంతకూ బదులు పలుకు రాక, అయ్యో! మరలి పోయి ఉంటా రనుకున్నా తెల్లారింది! మేల్కొని లేచి చూస్తే అద్దంలో ముఖంపై అట్టకట్టిన సనసన్నని నెత్రు చారిక ! కాదు! హసన్మందార కుసుమ దళం చీలిక ! సూర్యుని వెలుగులో మెరుస్తూంది ప్రాచీ దిఙ్ముఖంపై కుసుంభారుణ తిలక శోభ నా ముఖ దర్పణంలో బింబిస్తూంది రేకగా

4. బొమ్మా! బొరుసూ బార్లగా తలుపు తెరచి ఉంది రాత్రి వలె తలపు మూసుకుంది చిన్నారి ప్రపంచంతో పొన్నారి ఊహలతో రాత్రీ, పగలూ వీడని గాజు గది, ఆ గదిలో ఒక ప్రపంచం ఎవరో ఒకరు దానిపై రాయి విసరే వారే ఎవరో ఒకరు తొంగి తొంగి చూచే వారే మనిషి భయ పడడం ఉన్నదే! అటు వైపు చూడక పోవడమూ ఉంది

5. మోడల్ గది అద్దాలున్నంత వరకే సీమాంచలం ఈ అద్దాలు తొలగిస్తే మరోసీమాంచలం రాత్రి చీకటిలో చంద్రునివలె ఉదయం మంచులో సూర్యుని వలె గదిలో నేనూ గది బయట సమాజం ఆరాటాలతో పోరాటాలతో అటు పోట్లతో