Agneepeetham — Volume I — Swecchaa Kavitvamu

అగ్నిపీఠం — స్వేచ్ఛా కవిత్వము — మొదటి సంపుటం

2002 · Telugu (te) · 58 pages · Human-proofread

విధ్వంసం ; దీని నుండి బయటపడే మానవ ప్రయత్నం - అభిలాష, శక్తి - యుక్తి, శాంతి లక్ష్యం “అగ్నిపీఠం”లో ప్రతిపాదితమైనాయి. ప్రజాస్వామ్యంలో “అగ్నిపీఠం” క్రమంగా మనిషిలో ఉత్తమ సంస్కార గుణాలతో ఉన్నత లక్ష్యాలతో "శాంతిపీఠం" కావాలనే కవి ఆకాంక్ష. ఇది టినిటీలో భావసూత్రం, మానవీయ కథలో చలన దృశ్యాలకాధారమైందీ. ఈ కవిత్వంలో ఒక కొత్త ప్రయోగ ప్రయత్నం జరిగింది. అది ప్రకృతీ, సమాజం, మనోభూమిక నిర్వహణాంశాలుగా, రూపాన్ని నిర్మించడం. ఈ దిశలో విశ్లేషణతో సమాలోచనార్హమైందీ. 11-3-2002 - - మాదిరాజు రంగారావు I. క్రాస్ ఫైర్ సూచిక మొదటి భాగం 1. ఏమైనా 2. కరుణలో ముంచీ 3. క్రాస్ ఫైర్లో 4. ఎర్రెర్ర నవ్వు 5. మూడు గీతాల్లో 6. నిరాశకూ నిరీక్షణకూ మధ్య 7. మట్టి మనిషి 8. ఏ మెట్టుపై 9. కిరణం మునిగిపోదు రెండో భాగం 10. ప్రదర్శనలో

11. సిగ్నల్ రెక్కలు 12. ప్రజాస్వామ్య బింబం 13. అరణ్యం కాకూడదు 14. చినుకూ సమాజం 15. అమృతయానం

I. క్రాస్ ఫైర్

(కావ్యం) (2002) అంకితం ఉదార చరితకు ప్రతీక ప్రియసోదరుడు డా॥ మాదిరాజు హరికిషనావుకు561 Haritha, Madiraju, Devulapalli M.A.(Lit.) క్రాస్ పైర్ - సమాలోచనం క్రాస్ ఫైర్ కావ్యం స్వేచ్ఛా కవిత్వంలో ప్రజాస్వామ్య కవిత్వ పార్శ్వానికి ప్రాతినిధ్యం వహిస్తూంది. సైద్ధాంతికంగా విభేదించే ఇరు పక్షాలు తమ మధ్యనున్న హద్దుల్ని అతిక్రమించి తీవ్రమైన కార్యాచరణకు తలపడడం, విషాద పర్యవసానానికి సిద్ధమవడం “క్రాస్ ఫైర్” స్వరూపం. ఏ పక్షమైనా మానవీయమైన విలువల్ని విస్మరించి ఒకరిపై మరొకరు హింసకూ కాల్పులకుద్యమించడం జరుగుతుంది. ప్రజాస్వామ్య దృష్టిలో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో రాజనీతి ప్రజ్ఞతో ఉదార ప్రవర్తనతో మానవుడు - మానవత పట్ల గౌరవం విశ్వాసంతో ఈ స్థితి నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. ఏమైనప్పటికీ మనిషి జీవించే హక్కును ఎవరూ నిరాకరించడం కూడదు. మనిషిని అవమానించే ధోరణి పనికిరాదు. కావ్యంలో ఈ స్ఫూర్తి లక్షితమైంది. సమాజంలో అభిప్రాయ భేదాలు, సంఘర్షణలు వస్తువుగా, స్థూలమైన స్థితులు,

ఆధారంగా రచన నిర్వహింపబడింది. భౌతిక స్వరూపం కన్నా మానసిక చిత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రచన సన్నివేశ నిర్మాణంతో ఆరంభమైంది. ఒక ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉదయం నలుగురు మిత్రులు కలిసారు, ఏదో సరదాగా జరుగుతున్న కాలక్షేప సమావేశం అది. ఒక వ్యక్తి ఆ సమయంలో గదిలోకి ప్రవేశించడం జరిగింది. ఆమె చేతిలో న్యూస్ పేపర్ ఉంది. ముఖంలో మౌనం! విషాద ఛాయ ఆవరించింది. ఆమె నుండి సమాచారాన్ని అభిలషిస్తున్నట్లున్నవి వారి ముఖాలు! వారి ముఖాలు ఆతురతతో మొగ్గలుగా మారాయి. ఈ భావన వారి ప్రతీక్షావ్యగ్రతను సూచిస్తూంది. ఆమె ముఖం చూస్తే ఏదో సీరియస్ విషయమే జరిగినట్లుంది. ఆమె పేరు స్నేహ. ఈ సందర్భంలో అన్వర్థమయింది. ఆమె చూపులో పలకరించే వాలకం ప్రతిఫలిస్తుంది. ఆనాటి పత్రికలో విషాదవార్తా శీర్షిక ఫోటోపై చిన్న ట్యూబ్ లైట్ ఉంది. ఇది జరిగిన ఘటనపై తెలీని అంశంపై వెలుగు ప్రసరిస్తూన్నట్లుంది. ఈ స్థితికి కారణాలనేకం. ఎవరి అభిప్రాయం వారిది. ఎన్నో అంశాలు ఈ విషయాన్ని పెనవేసుకొని సంక్లిష్టమైన రూపాన్ని గుర్తుచేస్తాయి. ఇవి దేశం రాజ్యం వ్యక్తిగతం శ్రేయస్సు, అభిప్రాయం, ఆదర్శం మొదలుగా పర్యాప్తమై కన్పిస్తాయి. అగ్నిసదృశమైన స్థితిలో మనిషిలో జాలి దయ కరుణ ఉదారత మొదలైన ఆర్ద్రభావాలు ఎక్కడో సన్నని నీటిజాలులా మిగిలే ఉంటాయి. ఈ అంశం గోడకు వేలాడే పిల్లల్ని దువ్వుతూన్న పులి చిత్రపటం ద్వారా సూచితమింది. పెద్దపులి కళ్ళు మెరుస్తూ భయాన్ని562 కలిగిస్తాయి. అందులోను అందముంది. ఎంత క్రూరమైందను కున్నా తన పిల్లల్ని ప్రేమించకుండా ఉండలేదు. ఇది ఆర్ద్ర భావోపేతమైంది. హింసా ప్రవృత్తి కలిగిన జంతువులో ప్రేమ వర్తనం, పరస్పర విరుద్ధ భావ మేళనాన్ని గుర్తుచేస్తుంది. ఇక మనిషి విషయానికి వస్తే మనస్సు ఎన్నో పరస్పర వ్యతిరేక భావ సమూహాల సంకలనరూపం. ఎప్పుడేది ఎందుకు బయటికి వస్తుందో స్పష్టంగా చెప్పడం కుదరదు. కారణాలు ఒక్కొక్కపుడు గుప్తంగా సాధారణ బుద్ధికందకుండా, అభిప్రాయ భేదాలకు వీలు కల్పిస్తూ చరిస్తాయి. అందుకే మనిషి జీవితం, సమాజ గమనం బహుసంక్లిష్టంగా గోచరిస్తుంది. ఈ సమయం! వార్తా పత్రికలో మొదటి పేజిలో ప్రచురితమైన మనిషి బొమ్మపై ఫోకస్! అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆనాటి వార్తలో చోటుచేసుకున్న వ్యక్తి ఎన్ కౌంటర్లో అసువులు కోల్పోయిన మనిషి. అతని ప్రాణం విలువవైందే, అతని జీవితం నడుస్తూన్న చరిత్రలో భాగంగా వర్తించింది. ఈ వస్తువులో రచన సామాజిక స్పందనతో శబ్దిస్తూంది. ఇతని మరణవార్త హృదిని కదిలించేది. ఇది టే నుండి జారిపడిన వస్తువు ధ్వనిలో గర్భితమైంది. ఇతరుల అభిప్రాయాన్ని మన్నించడం, ఎదుటి వ్యక్తిని గౌరవించడం ప్రజాస్వామ్యంలో కీలకమైన

అంశాలు. మానహక్కుల్ని గౌరవించే సమాజ సంస్కృతికి చెందినవి, అనుల్లంఘనీయాలు. నిరసన, ప్రతిఘటన ఏ తీవ్రస్థాయికి చెందినప్పటికీ పాలనారూపం లోహ పదం కారాదన్నదే నిరంకుశ వైఖరిని నిరసించే మాటలు. ఈ విధం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను బింబిస్తూంది. ఏమైనా మనిషి మనస్సు అరణ్యం కాకూడదు. అరణ్యం మృగాలకు ఆవాసం. అందువల్ల పర్యవసానాన్ని సులభంగా ఊహించవచ్చు. అయితే అభిప్రాయభేదాలున్నప్పటికీ సిద్దాంత ప్రచారాలున్నప్పటికీ ఇపుడు కావలసింది, మనిషి ఒక చేతిలో శాంతిపుష్పం, మరో చేతిలో ప్రజాస్వామ్య కేతనమన్న చిత్రం, మనిషిలో సృజనశీలమైన నిర్మాణాత్మకమైన ఆలోచననూ భౌతికమైన సామాజికమైన దర్శనాన్ని ఆవిష్కరిస్తూంది. అగ్నిపీఠం కావ్యత్రయం (టినిటి)లో మొదటిది “క్రాస్ ఫైర్” ఈనాటి సమాజ గమన చిత్రణం. Detroit, Michigan, U.S.A. 14-2-2002 - - హరిత563

1. క్రాస్పెర్ - కావ్య హృదయం “క్రాస్ ఫైర్” లో కావ్యంలో వస్తువు సామాజికమైంది. దీని నిర్వహణం భావ రూపాల్నీ, ప్రతీకల్నీ ఆశ్రయించింది. దీని లక్ష్యం ఉదార ప్రజాస్వామ్య భావనతో నిర్దిష్టమైంది. సమాజంలో వివిధ సందర్భాల్లో ఆదర్శాల సంఘర్షణ వల్ల సమస్యల ఒత్తిడి వల్ల తీవ్ర వైఖరి నవలంబించడంతో ఈ స్థితి ఉత్పన్నమవుతూంది. రాజకీయంగానూ, సామాజికంగానూ వైయక్తికంగానూ ప్రత్యేక స్థితుల్లో “క్రాస్ ఫైర్” అనివార్యమవుతూంది. ఈ అగ్నిరేఖలు రెండు పక్షాల మధ్య వివిధ స్థానాల్ని అతిక్రమించడం జరుగుతుంది. ఈ స్థితిలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇవి సమస్యల అవసరాన్ని బట్టి స్థితుల వేగ గమనాన్నిబట్టి విషమస్థాయిని పొందుతాయి. ఈ స్థితి విధ్వంసనకూ బాధకూ వేదనకూ అశాంతికీ దారితీస్తుంది. దీన్ని పరిహరించడం అవసరం. ప్రజాస్వామ్యంలో చర్చల కవకాశం, ఇతరుల అభిప్రాయాల పట్ల గౌరవం సమన్వయ గుణంతో పాటు ఉదారత మానవత లక్షణాలతో దీన్ని నియమించవచ్చు, దుష్ప్రభావాన్ని తగ్గించనూ వచ్చు. ఈ కావ్యం ఒక గదిలో మిత్రుల సమావేశంలో బయటపడిన మరణవార్తతో చాలా సహజమైన సన్నివేశంతో ఆరంభమైంది. క్రమంగా వర్తమాన రాజకీయ సామాజిక స్థితుగతులతో తీర్చబడింది. కావ్యంలో ఇది ప్రత్యేక స్థితి నుండి విశ్వజనీన స్థితికి క్రమిస్తుంది. ఇందులో సమకాలీన చరిత్రలో మన చుట్టూ ఉన్న సమాజంలో వ్యక్తుల

స్వభావంతో వాస్తవాల పునర్నిర్మాణం జరిగింది. ఈ సంవిధానంలో కల్పన తన పాత్రను నిర్వహించింది. ఇది వివిధ భావ రూపాల్లో మలచబడింది. ప్రతీకల్లో ధ్వనితమయింది. సామాజిక స్పృహతో పాటు వైయక్తిక మానసిక స్పందనల్ని కలిగింది. ప్రజాస్వామ్య లక్ష్యంతో ఆవిష్కృతమైంది. తెలుగు స్వేచ్ఛా కవిత్వంలో ఆధునిక చేతనకు ప్రాతినిధ్యం వహిస్తోందీ కృతి. చరిత్రలో వర్తమాన సామాజిక తలాన్ని చిత్రిస్తూంది. సాహిత్య చరిత్రలో స్వేచ్ఛాయుగం స్వాతంత్య్రానంతరం ఆలోచనా నవ్యతను స్వేచ్ఛను ప్రతిబింబిస్తూంది. 8-3-1999 డా॥ మాదిరాజు సంతోష్ కుమార్564

I. క్రాస్ఫర్

మొదటి భాగం

1. ఏమైనా ఎదుటి మనిషి క్షేమంకై సిప్తో స్నేహంలో పత్తో మిత్రబృందం సైజ్కు మించిన డ్రెస్లో కోలాహల ప్రపంచంతో డ్రాయింగ్ రూమ్ చేతిలో వార్తా పత్రికతో స్నేహ లోపలి కడుగేసింది. నిశ్శబ్ద ముఖాలు మొగ్గలై మాట కోసమెదురు చూస్తున్నాయి. ఆమె నడకలో రహస్యం బిగిసి బిగిసి కదులుతూంది ఆమె కళ్ళలో ఆలోచన నిలిచి నిలిచి హెచ్చరిస్తూంది చూపులు సూటిగా వాడిగా అందరినీ పలకరిస్తున్నాయి. పత్రికలో ఫోటోపై శీర్షిక చిన్న ట్యూబ్లెట్ ఉంది. పల్చని మంచు కేస్లో అనల ప్రతిమలా వర్తమానం నిలిచింది. పిల్లల్ని దువ్వే పెద్దపులి చిత్రంతో గోడపై క్యాలెండర్, పెద్దపులి కళ్ళలో భయబిందువు చూపుల్ని బంధించి నిలిపేస్తూంది. ఫ్యాన్ గాలి అశాంతి రెపరెపల్ని టెలిప్రింటర్లా వినిపిస్తోంది. సమాజ భీభత్సంపై టార్్చ లైట్ ఫోకస్లా ఫోటోలో మనిషి మానవ గౌరవ చిహ్నమూ, సమాజ చరిత్రలో భాగమూ, అతని అడుగుల కింద అవని నిన్న కంపించిన మాట వాస్తవమే టే నుండి జారిపడిన సాసర్వలె వార్త అను రణించింది. ఈ సమయం పగిలిన అద్దంలా చెదరి పడిన జీవిత ఖండం

ఏ ముక్కలో ఏ నిజం ప్రతిఫలించేదీ తెలీకుండా ఉంది. న్యాయం కావచ్చు! చట్టం కావచ్చు! ప్రతీకారమవచ్చు! ఆదర్శం కావచ్చు. జీవించే హక్కును మనిషి నుండి మాయం చేసే లోహపదం కారాదు. విషమ లిప్తల ఆలోలంలో అడవిలో ధైర్య శిఖరం ఎపుడు మునిగేదీ తెలీని భయ ద్వీపం వలె ఉంది

2. కరుణలో ముంచీ భవిష్య సమాజ స్వప్నంకై వర్తమానం రణ సదృశమవుతూంది ఇది పోటీ లేని పోరాటం! దీని కిప్పట్లో అంతం లేనట్లుంది.అగ్నిపిఠం - క్రాస్ ఫైర్ సమస్యల మధ్య సంక్షోభం మధ్య ఇనుప స్తంభంలా ఉన్న అస్తిత్వం ఏ గన్ పాయింట్కి బాంబు గురికో మట్టిపాత్రను జ్ఞాపకం చేస్తూంది. పెదవులపై నిశ్శబ్ద ముద్రతో సాహసం విషాదాన్ని వరిస్తూంది నిన్నటిలా ఈ రోజు భయ సముద్రం అవకూడదనే! ఈ నాటి బాధ రేపు వ్రణంలా మారకూడదనే! చక్రంవలె భ్రమిస్తూనో ఆకు వలె రాలుతూనో పోయే మనిషిని రక్షించుకునే బాధ్యత సమాజంలో మనిషిదే. సమస్యల వంతెనపై స్వాతంత్య్రం, అవతలి గట్టుపై ఆశతో ఉంది పెద్దపులి కంటి వెలుగు బోనులో మనిషి రూపం మెరుస్తూంది. తెల్ల కాగితం వలె ఎదురైన ఈ రోజు ఎర్రబడి భస్మం కావలసిందేనా? ఈ కాల్పులెంతవరకు? సూర్యబింబం నల్లబడేంత వరకా? చంద్రకళలు ఎర్రబడేంత వరకా? మనిషి మసి అయ్యే దాకానా? వార్త కెక్కిన వ్యక్తి మిత్రులెవరో బంధువులెవరో కానీ, అతణ్ణి మానవతా బంధం మాత్రం కరుణలో ముంచి పైకి తీసి చూపుతూంది. రాత్రి అయినా ఊరు మెలకువలో ఉంది క్రాస్ఓఫైర్లో ఎవరికి నిద్ర పట్టి చస్తుంది?

3. క్రాస్పెర్లో అడవిలా ఆటవికాన్ని కమ్ముకొనీ, సముద్రంలా ఉద్రేకాన్ని నింపుకొనీ తప్పిపోయిన శాంతి కోసం దిక్కులు చూస్తూంది. వీధి దీపం? మనిషి వెనక కదలే నీడల్ని కొలుస్తూంది దారిలో రహస్యాల్ని కనిపెట్టే గూఢ చరం చేస్తుంది

ముఖంలో ఉపాయాల్ని పసికట్టీ కళ్ళలో ఆయుధాల్ని వెదుకుతూంది జారే కన్నీరు తుడిచే బదులు కళ్ళలో సూదులు కదలిస్తూంది. అడుగుల వెనక వచ్చే అడుగులు చరిత్ర చిహ్నాల్ని చెరపేస్తున్నాయి దారిలో ప్రతిమలు భౌతిక సీమల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. హింసనూ హత్యనూ చూపే రేఖలతో చాచిన చేతులు విశ్వమానవ మనోజ్ఞ శిఖల్ని ఆర్పే పనిలో తేలుతున్నాయి. వీపుపై దెబ్బల వలె ఊరుపై అడపా దడపా కాల్పులు చాటైన ముఖాలు గాయాలతో బయట పడుతూన్నాయి. శాంతి ఎపుడు బడితే అపుడు వచ్చి ముంగిట్లో నిలవదు రన్నింగ్ రేస్లోనో గన్ పాయింట్తోనో పొందేది కాదు సమాజంలో దైన్యం హైన్యం పోరాటానికి దారి తీస్తూంటే అరచేయిలో అమృత కలశం చూపే రాజకీయ జాలికులూ ఉన్నారు

4. ఎర్రెర్ర నవ్వు ఆకాశంలో చుక్కలు అసహాయ సానుభూతి చూపిస్తున్నాయి ప్రతీకార ఖడ్గంపై అహంకారం విజయాన్ని కాంక్షిస్తూంది. కాగితంపై అక్షరాల వలె వీథి దీపాలు మినుకు మినుకుమంటున్నాయి అక్షరాల నుండి ఆలోచనల వలె వెలుతురు రెక్కలు చాస్తూంది. మనిషిలో కలలన్నీ బయటికి రావు! వచ్చినవీ మెలకువలో నిలవ్వు మనిషిలో సంభాషణ వెనక! అంతర భాషణం సాగుతూనే ఉంటుంది రాత్రి అంతా ఊరు మెలకువలో గడిపేస్తూంది క్రాస్ ఫైర్ ఆగినా, తప్పి పోయిన శాంతి కోసం ప్రకటన! ఉదయం పత్రికలో అరుణాక్షర కిరణాల్లో కన్పిస్తుంది బూదిలా ఎగసే మంచులో ఎర్రెర్రని నవ్వు జారి పోతూంది.

5. మూడు గీతల్లో బొమ్మ మనిషికీ మనిషికీ మధ్య కన్పించని సరిహద్దులకు రెండు వైపుల ప్రేలే గన్ వదలే తూటా బ్రతుకును చిత్రపటం చేస్తూంది? మండే వనంపై నీలి మబ్బులా ఓ ఆలోచన రాకపోదు? దారి తప్పిన అడవిలో దొరికే కాలి బాటలా అనుభవం లేకపోదు. మనిషిని మనిషి దగ్గరికి తీసుకునేందు కెన్ని అడ్డు గోడలు!

మనిషిని మనిషి గుర్తించేందు కెంత సమయం పడుతూంది? స్వార్థం మనస్సును స్తంభింపజేస్తూంది; అణచేస్తూంది మూలాలు కన్పించడంలేదు ; దర్శనం అసంపూర్ణంగా మిగిలిపోతూంది దరిద్రం కాళ్ళకు సంకెళ్ళు వేస్తోంది; అవసరం పెదవుల్ని కుట్టేస్తోంది మనిషితో మనిషి సంబంధాలు విపణి ధరలు పలుకుతున్నాయి వీధిలో నడచే పాదాలు నీడల్ని వదలే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖంపై దూకే వెలుగులు బయటి ముసుగుల్ని తోసేయ జూస్తున్నాయిఅగ్నిపిఠం - క్రాస్ఫర్ స్వేచ్ఛా దీపం చేరేందుకు సమాజంలో ఎన్ని దారులో అన్ని యాత్రలు! ఒకటొకటీ గమ్యం చేరే లోపల చీలిపోతుంది ఎక్కడో ఆగిపోతుంది (2) జేబులో డైరీలో క్రితం తేదీ పేజీలో వ్రాసిన మాటలు ప్రయాణం వెనుక దాగిన విషాద జీవితాన్ని గీసి చూపిస్తున్నాయి. “ఈనాటి వరకూ నా ముఖం నిజ వర్ణం ఎరుగదు నా మస్తిష్కం నిశ్శబ్దమసలే ఎరుగదు; నిద్రలో తప్ప! ఇన్నాళ్ళు కాళ్ళు ఇసుకలో కూరుక పోయినట్లున్నాయి ఇపుడు ముడిచిన రెక్కలు విప్పినట్లు స్వేచ్ఛ లభిస్తూంది యంత్రం వలె తిరిగే శరీరం మానుషాన్ని పొందుతూంది మృత్యువు నిజంగా సంతోషానికి దారితీసే ద్వారం వలె ఉంది? చిత్రంగా! మృత్యువు తప్ప! జీవితమంతా రహస్యమన్నట్లుంది” కాగితంపై ఒక ప్రక్క రోజువారీ అవసరాల పట్టీ లెక్కకూ అవసరాలకూ మధ్య అంతరం మాత్రం అనంతం కింద అస్థిపంజరం వలె మూడు గీతల్లో గీసిన బొమ్మ.

6. నిరాశకూ నిరీక్షకూ మధ్య నిరాశకూ నిరీక్షకూ మధ్య రోజు మొదటి మెట్టుపై గగనంలో ఉడ్డీనానికి మథన పడే చిన్నన్న వెనుకనుండి నిర్వ్యాపారాన్నీ నిష్క్రియతనూ జనశ్రేణి నిందిస్తూంటే ఇంటి కప్పుపై చేరి కోడై కూయడం ఆరంభించేను చేతిలో గన్ ఊరు అవతల నిర్వ్యాజంగా నిరాటంకంగా కన్పించిన బాతుల్ని పక్షుల్ని హతమార్చడం సాగించేను. శ్రమ సాధనాల లంకరించే చేతులు; భయ స్థానాలవుతున్నాయి దారుణ మారణ సంస్కృతి బ్రతుకులో భాగమైపోతూంది.

పయనంలో నినాదాలు వినిపిస్తాయి; పతాక లెదురౌతాయి అడవి అడుగులకు దారి చూపిస్తుంది; కొండలు తలలు వంచుతాయి దారిలో ప్రతి మజిలీలో మనిషి మనిషి కలిసిన దృశ్యపరంపర అర్థం లేని దనుకున్న శబ్దం! ఎదురై గుండెకు హత్తుకుంటూంది ఆలోచన పురి విప్పుతుంది; అనుభవం హరివిల్లు అవుతూంది. శిశువు తొలి విజయం నేలపై అడుగు వేయడం మనిషి చిర విజయం మనస్సును వెలిగించడం సుఖంలో రెండు పుష్పాలు; దుఃఖంలో రెండు బాష్పాలు జీవిత గమనంలో తప్పనివీ; ఒడిలోనో చేతిలోనో రాలేను. భౌతికం మూట సర్దుకొని ఎక్కడికి పోతుంది? మర్నాడు మరో మూటతో సిద్ధమవుతుంది, ఎదురవుతుంది. నిరాశ నుండి నిరీక్ష నుండి రోజు చివరి మెట్టుపై ఉడ్డీనానికి సంరంభం! అంతా ఇంతానా? గుండె ఎగిరేంత!

7. మట్టి మనిషి ఎపుడో ఎత్తుకున్న బండను ఈ మట్టి మనిషి దించనే లేదు ఇదో నేరానికి శిక్ష అనేవారూ ఉన్నారు ఇదో సర్కస్ లో భాగమనే వారూ ఉన్నారు. కాళ్ళు చక్రాలైతేనేం; వలయంలో భ్రమణం! ఏ గమ్యం చేరుస్తుంది. పంటకొచ్చే భూమికి జవాబుదారీ ఈ మట్టి మనిషిదే మరొకరి కుంపటిని గుండెపై మోసే బాధ్యత ఇతనిదే సమాజ సముద్రాన్ని ఎంతకాలం శ్రమతో మధించినా వచ్చే అమృతం ఎప్పటికపుడు అదృశ్యమవుతూంది ఉప్పు నీరు మాత్రం ఈ మట్టి మనిషి వంతవుతూంది తోటలో వెన్నెలకు కాపలా కాస్తూ ఎండలకు పగటి గొడుగు పడుతూ బ్రతుకులో మిగిలేదీ ఎత్తుకున్న బండే, దీనితోనే సహవాసం ప్రతి జనపదం శ్రమ నిలయం అవచ్చు, ప్రతి అరణ్యం ఆశ్రమం కాదు. బండలా మిగిలిన బ్రతుకు దెబ్బలూ గాట్లు వహిస్తుంది ఏ వాలకాలో చెక్కబడతాయి! ఏ పిచ్చి గీతలో గీయబడతాయి ఇదో శిల్పమనీ భావించే తెలివి మీరిన వారూ ఉన్నారు దీన్ని స్వార్థంకై కీర్తించే యంత్ర ముఖాలూ లేకపోలేదు. ప్రతి చెమట బిందువు శ్రమకు చిహ్నం కాదు

ప్రతి పాద ముద్ర భవిష్య పథ సూచన కాదు ప్రతి అరచేయిలో శ్రమ రహస్యం బయట పడదుఅగ్నిపిఠం - క్రాస్ ఫైర్ ప్రతి నొసలుపై శ్రమ కణం మూల్యాంకనం జరగదు నాటకం చూచే సంతోషంలో సమయం తేలిపోతుంది బయటికి వస్తూనే వేసే అడుగులు ఇనుపబిళ్ళ లవుతాయి బయటికి రాగానే చాచిన చేతులు ఇనుప కడ్డీలవుతాయి ఇపుడు హృదయం తీగె తెగి మూల బడిన వయొలిన్ తో సమానం. జనస్వామ్య కిరణం గతానికి గుడై చెబుతూంది శ్రమ జీవన ముఖాలతో నవ చేతన మాట్లాడుతూంది పెదువులపై శబ్దం స్వేచ్ఛారుచితో ధ్వనిస్తూంది. మనిషి తనూ స్పర్శతో అవని గర్వంతో పులకిస్తూంది

8. ఏ మెట్టుపై ఇనుప కవచం ముక్కలై మనిషి మనోజ్ఞరూపం బయటపడుతూంది మనిషి వెనక రణ దృశ్యం! విశ్రాంత సముద్రం వలె ఉంది ఆకాశం ఆహ్వానిస్తూంది పక్షితో పాటు క్షిపణినీ అవని స్వాగతమిస్తూంది నాగలితోపాటు యంత్రాన్నీ ప్రజాస్వామ్యం పిలుస్తూంది మనిషి మనిషికి స్వేచ్ఛనిస్తూ గడ్డకట్టిన సమాజం ప్రవాహశక్తి పొందుతూంది అరచేయి శూన్యం కాదు! ఏదో పనితో ప్లవిస్తూంది అయినా అతృప్తి ఆకాశాన్ని అంచెలుగా కొలుస్తూంది ఆశకూ ఆదర్శానికీ మధ్య రోజు సతమతమవుతూంది ఆలోచనకూ అనుభవానికీ మధ్య మనస్సు నలిగిపోతూంది వాస్తవానికీ లక్ష్యానికీ మధ్య బ్రతుకు చెదరిపోతూంది అంతలో దూరం నుండి అలార్్మ ! విప్లవ సంకేతం! పూల వనంపై నిప్పులు నృత్యం చేస్తున్నట్లుంది ఏ మెట్టుపై ఎప్పుడు ఘర్షణ రేగేది తెలీకుండా ఉంది.

9. కిరణం మునిగి పోదు పొద్దెక్కే కొద్దీ ఎండ తిరగబడే ప్రజ వలె ఎదురౌతూంది మిట్ట మధ్యాహ్నం పై పై బడే ఆతంక గణం వలె వస్తూంది

పొద్దు వాలే సరికి చుక్కలు తీరని సమస్యల వలె మెరుస్తాయి మతిలో స్పందించే జనశక్తి సమాజ రథమై కదలుతూంది. భూమికై అంకితమైన వాళ్ళకు భూమిపై హక్కు లేదు అరుణ స్వరం ఎంతటి నిశ్శబ్దానైనా సాహసంతో తరుగుతూంది శ్వాససూత్రం ఎంతటి శరీరానైనా ఆయువుపై భరిస్తూంది. సంకల్పం ఎంతటి జీవితానైనా రెక్కలపై వహిస్తూంది. కదలని ఊపిరిలో స్పందన రావాలంటే నిలిచిన అడుగుల్లో చలనం కావాలంటే బిగిసిన జీవన లిప్తలు సరించాలంటే ఎన్ని సూర్య బింబాల్ని చూడాలిసి వస్తుందో! శతాబ్దాల క్రితం మూసిన తలుపు లిపుడు తెరుచుకున్నాయి. ఈవాల్టి ప్రభాతం అందరికీ సమంగా స్వాగతమిస్తూంది గ్రీష్మంలో జలపాతం వలె చీకట్లో ఎర్రని నిజం వలె రాళ్ళ నుండి ముళ్ళ నుండి స్వేచ్ఛ మనిషిని పూవై స్పృశిస్తూంది పయనం మొదలు కావడం వేరు; గమ్యం చేరడం వేరు ఇపుడు శుక్లపక్ష మొకరిదీ; కృష్ణపక్షమొకరిదీ కాదు నిప్పుల పైనా స్వేచ్ఛ ఆగిపోదు; మాడి పోదు, చలిస్తుంది సరిస్తుంది ఎంతటి ప్రవాహంలోను కిరణం మునిగిపోదు, ప్లవవిస్తుంది. 570571 రెండో భాగం

10. ప్రదర్శనలో ఆదర్శాల ప్రదర్శనలో శిల్పాలు వీథి నృత్యం చేస్తున్నాయి భుజాలపై ఎగిరే పతాక చిహ్నాలెపుడు మారేదీ తెలీదు జ్వాలల్ని చూస్తూ ప్రజలు ప్రక్కకు తప్పుక నడుస్తున్నారు వరసగా అంటించిన పోస్టర్లతో, గోడ, సినిమా రీలులా ఉంది. నాటకంలో ఎన్నికల అంతర్నాటకంలో ఎవరి రహస్యం వారిది అందని వస్తువుకై పరుగులో ఎవరికి వారు విడిపోతున్నారు ఎవరి విజయం వారికి ఫాలతలంపై రెక్కలతో ఎగురుతూన్నట్లుంది మధ్య మధ్య అనుకోకుండా ఏ సుడిగాలో తుపానో ప్రకంపనో దయచేయొచ్చు వీథి నుండి మరో వీథికి వచ్చేప్పటి కొక అంకం ముగుస్తుంది ఏ వ్యక్తీ ఇపుడొకే పాత్ర కాదు బహుపాత్రల సంకలనం పాత్ర నుండి పాత్ర మంచెపైకి అవలీలగా వస్తూ పోతూంటాయి

ఒకటి నిప్పురవ్వై ఎగరొచ్చు మరోటి కన్నీటి బిందువై రాలొచ్చు దారిలో ఎదురయ్యే శిల్పాలు దేవతల వాలకాన్ని తలపిస్తాయి బ్రతికుండగానే కొందరు స్మారక శిలలు కావాలనుకుంటున్నారు ఫాల తలంపై ఆకాశం సిగ్గుతో తలవంచుకుంటూంది హృదయంలో అస్తమయ క్షితిజం తప్తమై నిష్క్రమిస్తూంది రాత్రి వస్తుంది తప్పనిసరిగా విశ్రాంతికి వీలుగా స్వప్న సంతోషంగా రాత్రి ఎంతో మిగిలిఉన్నా ముఖాల్లో రవి బింబంకై తహతహ మరుగుతూంది కళ్ళ ముందు భ్రమలు కదలుతున్నాయి! కళ్ళనుండి జ్వాలలు సరిస్తున్నాయి ఇపుడు రాజకీయం ఆదర్శ హృదయం కాదు, ఆకర్షణ యంత్రం మాత్రమే.

11. సిగ్నల్ రెక్కలు ఉద్విగ్న భంగిమల్లో శిల్పాలు వీధి వీధినా పట్టు ప్రభలతో కదలుతూన్నాయి ప్రభలు పూల గుత్తులై ఎదురైన వోటరు చేతుల్ని అలంకరిస్తాయి చేతులు తప్పితే వెలుగులై కాళ్ళ వద్ద జీరాడతాయి కాళ్ళు తొలగితే మెడలో దండలౌతాయి; నెక్ టై అవజూస్తాయి ముందుకొచ్చి కబుర్లు చెబుతాయి వెనుక నుండి చాకులు దూస్తాయి చాచిన ఎడారి నాలుకకు; ఏ దిశా ప్రవాహమూ చాలనట్లుంది. ఎరుపెక్కిన కోర్కెల శిఖలు ఒకటొకటీ కళ్ళనుండి జారతాయి అరచేతుల్లో మరకలు గుల్ మొహర్నో మోదుగ పూలనో తలపిస్తాయి ఈ గుర్తుల్ని స్మృతిలో భద్రంగా దాచుకునే వారున్నారు. ఈ మరకల్ని ఏ వృష్టి శుభ్రం చేస్తుంది? మానవహక్కు జలం తప్ప రాజకీయ ధూళి ధూమం ప్రావారమై అడ్డంగా కదులుతూంది దీని వెనుక కాంతి లాస్యమో! ఖడ్గ నృత్యమో తెలీడం లేదు ఈ ప్రావారం తొలగితే గాని, అసలు ముఖాలు స్పష్టంగా కన్పించవు రాత్రి ఆకాశంలో చుక్కలు, పగలు నేలపై ఉత్సాహ శిఖలవుతున్నాయి. పట్టపగలు పెద్దలు ఎడారుల్ని వదిలి పంటల్ని ఎత్తుకపోయేరు గుడ్డలో చుట్టిన హృదయ మణితో అంతలో జారుకునేరు ప్రదర్శనలో గాజుకేస్లో వజ్రం వలె పైన! కర్మ సాక్షి కన్పించేను నినాదాల్లో ప్రవాదాల్లో మునిగిన అంతరంగం ఈ మధ్య మాయమైంది రేపటి అధికారంకై ఈనాటి ఆలోచనలు పిచ్చుక పిట్టల్లా ఎగురుతున్నాయి ఈతచెట్ల వంటి భయ సందేహాల మధ్య బంతుల వలె ప్రతినిధులు ఎన్నికల్లో ఉద్విగ్న శిల్పాలు! ప్రజాస్వామ్య యాత్రలో సిగ్నల్ రెక్కలు

12. ప్రజాస్వామ్య బింబం జన చేతన మేఘం! ఎద ఎదలో కనిపిస్తూంది అమృత కుంభ హృదయంతో గరుత్మంతునిలా ఎగసీ మానవతా గంధంతో ప్రతి బ్రతుకును స్పృశిస్తూంది; నిండు గుండెతో దూరం బహుదూరం కదలుతూంది రాలే ప్రతి బిందువూ నేల లోతు చూడాలనే మేఘం పయనించేంత మేర శ్రమ జీవన దృశ్యం! ననేలపై కృషి సంతకంతో కదలే మనిషిలో మేఘం మౌనాన్ని పలికిస్తుంది; శబ్దాన్ని మీటుతుంది రస ముద్రలు నిలుపుతుంది బ్రతుక్కి అభయమిస్తుంది అనుభవానికి భేదం లేదు; ఆలోచనకు సీమల్లేవు ఆర్తి నుండి చాతకం వలె మనస్సు ముక్తమవుతూంది నవ సమాజ శక్తులతో జీవన రుచి పొందుతూందిఅగ్నిపిఠం - క్రాస్ ఫైర్ అవని ఫాలతలంపై శ్రమ జీవన భవిష్య రేఖతో పరిణామ చరిత్రలో శాంతి ఖండం మొదలౌతూంది. నీలి మబ్బు చేతి కందదు హృదయ వదనం చుంబిస్తుంది స్వేచ్ఛకు ఎత్తు ఎంత ఇష్టమో! పవన పథమూ అంతే ఇష్టం పుట పుటలో నీలి మబ్బు అక్షరాల బాహువుల్లో ఒదిగిపోతుంది సమస్యలకాప్తరూపం, పీడిత జన సందేశం, ప్రజాస్వామ్య బింబం

13. అరణ్యం కాకూడదు నీలి మబ్బు రాకతో కన్పిస్తుందొకటే సమమైన ఆరరూపం ఇపుడు మట్టి శిశువనీ స్వర్ణ శిశువనీ ఏ భేదం లేదు దప్పికతో ఆగిన ఎడారి పచ్చని చేయి ఊపుతుంది బాధా ముఖంలో నిల్చిన కంటకం రస బిందువు జారుస్తుంది కోపంతో చిందులేసే కొరకంచు శాంతిపాఠం రవళిస్తుంది. భూమి ఆహారాన్ని ప్రసాదిస్తుంది ఆకాశం కల్పనను ప్రేరేపిస్తుంది చెట్టంతైనా ఆకాశమెత్తు పెరిగినా మనిషి గిట్టేది మట్టిలోనే మస్తిష్కంపై కదలే నీలి మబ్బు ఎదలో దిగుతుంది చెట్టుకన్నా ముందు మనిషినీ ప్రాణినీ పలకరిస్తుంది నేల కంటకుండా కదలినా నీలిమబ్బు రాకపోతే

అరణ్యం అగ్ని జడలు విప్పుతుంది సమాజం అనల ముఖం చూపుతుంది చేతిలో నాణాల వలె చినుకులు పేద గుండె నాదుకుంటాయి ప్రదర్శనశాలలో చిత్రాల వలె పనిపై కదలే శ్రమ సాధనాల వలె ఎగుడు దిగుళ్ళనూ బీటల్నీ సమతలం చేస్తూ ఎండిన గుండెను తడితో స్నేహ సుందరం చేస్తూ బడికెళ్ళే పిల్లల భుజాలపై వేలాడే బాగ్లల వలె నీలి మబ్బులు పెరిగిన అరణ్యం మృగ సంచారంతో చూడ్డాని కందంగానే ఉంటుంది కాని చూస్తూ చూస్తూ జీవితం మాత్రం అరణ్యం కాకూడదు దారిలో శిల మైలురాయి అవచ్చు; ఆయుధం కావచ్చు కాని మొలకెత్తిన జీవితం ఎదురైతేనే అర్థం ఆనందం నీలి మబ్బు చూపుడు వేలు కింద ఈ శ్రమ సమాజం ఇంద్ర ధనుస్సును మరిపించ వచ్చు వయొలిన్ వినిపించవచ్చు చినుకు పడింది

14. చినుకూ సమాజం సమాజ దాహం తీర్చడమే కాదు మొక్కనూ మొలిపిస్తుంది చిను చినుకూ కలిసి అవనిపై సరిస్తాయి చినుకు చినుకూ తరలి జలధిలో కలుస్తాయి గ్రీష్మంలో చినుకు వజ్రం, ఆనంద కణం అమూల్యం చినుకు చివరి మాట కాదు, సమాప్తీ కాదు చినుకు పడడం అదృష్టమైతే చినికి చినికి గాలి వానతో తుపాను రావడం దురదృష్టం ఒకటి మరో దానికి కారణం; ఒకటి మరో దానిలో భాగం చినుకు చేతిలో పూవై రాలొచ్చు గుండెలో ఆశై మొలవచ్చు చినుక్కీ ప్రవాహానికీ మేఘానికీ అనుబంధం మనిషీ సమాజం పరిణామాలకు ప్రతిరూపం మనిషి పురోగమనంతో సమాజ పరిణామంలో ఇప్పుడీ దారిన పాలకీ మోసే బుజాలు కన్పించవు ఇంతవరకు నీడల్లా అణగి ఉన్న ఆలోచనలు

15. అమృతయానం వెలుగు అలల్లా కదలుతూన్నాయి పురోగమిస్తున్నాయి. వీరి బాష్పబిందువులో రవి కిరణం మునకేసేందుకు భయపడుతూంది వీరి బాష్పబిందువులో మునిగిన మానవత ముఖమెత్తేందుకు సిగ్గుపడుతూంది ఇపుడు వీరి మాటల్లో అభ్యర్థన లేదు ప్రార్థన లేదు భయ ముద్ర లేదు గుండె దూసుకపోయే బాణం ముంది తూటా ఉంది క్షిపణి ఉంది అరణ్య గర్భం నుండీ నగర హృదయం దాకా ఒకే అభియానం నీదీ నాదీ, మనిషి మనిషి కథతో అందరిదీ, చరిత్రలో మనదీఅగ్నిపిఠం - క్రాస్ ఫైర్ ప్రయాణంలో అన్వేషణలో ప్రతి మనిషిలో చైతన్యం ఒకటే దారిలో గాలీ నీరూ భూమితో పాటు మానవతా బంధం ఒకటే తోటలో కొత్త మొక్కలు వస్తాయి; కొత్త పూలు రాకమానవు కొత్త జీవితం తెస్తాయి; కొత్త సంస్కృతి పరిమళిస్తుంది. ఇపుడు కావలసింది ఒక చేతిలో సుత్తీ మరో చేతిలో గొడ్డలీ కాదు చరిత్రలో నలిగి చినిగి మాసిన మాసికల మారణ పతాక కాదు ఒక చేతిలో శాంతి పుష్పం! మరో చేతిలో ప్రజాస్వామ్య కేతనం సృజన కిరణ హృదయంతో అవసరం, మనిషి అమృతయానం!

II. సీజ్ ఫైర్

(కావ్యం) (2002) అంకితం జీవన సహచరి శ్రీమతి ఇందిరకు II. సీజ్ ఫైర్ సూచిక0 1. గది కిటికీ నుండి 2. కళ్ళలో నవశతాబ్ది 3.

లయ దొరకని చరణాలు 4. అద్దాల కేస్లో 5. సమయ రాగం 6. వెలుగు ముఖం కోసం 7. టాన్స్పరెంట్ హృదయంతో 8. ఆశ్చర్యం లేదు, విచిత్రమూ లేదు 9. మండే నిశ్శబ్దంలా 10. తలుపులు తెరవడమే 11. ఆశ్చర్యం లేదు, అనుమానం లేదు 12. ఆశ్చర్యం లేదు, అస్పష్టత లేదు 13. ఆశ్చర్యం లేదు, అవాస్తవం లేదు 14. ఆశ్చర్యం లేదు, అంతర్ముఖం లేదు కార్గిల్ కవితలు : 1. రెక్క ఒరిగిన ఈ రోజు 2. టాస్ సోల్జర్

3. ఇంకా తెరపడలేదు. 4. యశస్తోరణం సీజ్ ఫైర్ - సమాలోచనం సమాజంలో మానవ జీవిత పథంలో, వివిధ దశల్లో లక్ష్యంలో భేదాలు కారణంగా సంఘర్షణ అనివార్యం. ఇది కొన్ని సందర్భాలలో తీవ్రరూపాన్ని ధరిస్తుంది. రణ భావాన్ని పొందుతుంది. అయితే మనిషిలో వివేకంతో నిఖిల మానవ శ్రేయో భావనతో ఉదారతతో దీన్ని ఏదో ఒక విధంగా అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కొక్కపుడు క్లిష్టదశలు ప్రాప్తిస్తాయి. సంక్షోభం సంభవిస్తుంది. ఏ మూల నుండో ఆశాకిరణంకై మనిషి ప్రయత్నం జరుగుతుంది. దీని పర్యవసానమే సీజైర్ కావ్యం. ఇరువర్గాలు, పక్షాలు, తమ తమ ఆయుధాల ఉపయోగానికీ, మారణ ప్రవర్తనకూ విరామం ఇవ్వడమన్నమన్నమాలు. దీనివల్ల నలిగిపోయే శాంతి కొంత ఊపిరి తీసుకొనే సమయం దొరుకుతుంది. మనిషిలో స్వార్థమే కాకుండా పట్టువీడని ధోరణి, తన లక్ష్యంపై దృఢ వైఖరి. రణ మారణ స్థితులకు దారితీస్తుంది. ఆధునికయుగంలో అవసరాలూ, పరిస్థితులూ, అభిప్రాయ భేదాలు, ఆదర్శ రూపాలు, సంఘర్షణకు దారితీసే అవకాశమెక్కువగా ఉంది. ఆధునికమైన సాధనాలతో, త్వరగా మరింత తీవ్రరూపం ధరించడమే కాకుండా పరిధి విస్తృతి పొందడమూ జరుగుతూంది. ఆధునిక జీవితంలో ఎన్ని తరాల నుండో పాదుకొన్న పీడనం, తత్కాల సమస్యలవల్ల అలజడి అశాంతి, క్రమంగా హింసకు దారితీయడం జరుగుతుంది. ఇది సమాజంలో వివిధ స్థాయిలో కన్పిస్తుంది. దీన్ని నివారించేందుకు లేదా అదుపులో పెట్టేందుకు వ్యవస్థల్లో, సామాజిక రాజకీయ ఆర్థిక దృక్పథంతో ప్రజాస్వామ్యమొక్కటే పరిపూర్ణమైందని చెప్పలేం కాని ఉన్నవాటిలో మేలైందిగా కనిపిస్తుంది. సీజైర్ కావ్యంలో వస్తువు ఈ సూత్రంపై యోజితమవుతుంది. ఈ వ్యవస్థలో ఇతరుల అభిప్రాయాల్ని మన్నించడం, చాలా భాగం ఎక్కువమంది అభిప్రాయాల కనుగుణంగా వర్తించడం, లేదా వ్యతిరేకుల అభిప్రాయాల్ని కూడా పరిగణన లోకి తీసుకోవడం, సమస్యను తనదైన దృక్పథం నుండే కాకుండా అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా చర్చల ద్వారా పరిశీలించడం, న్యాయం చేకూర్చే విధంగా అందరినీ కలుపుకొని పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛ- సమానత్వం-న్యాయం (ఆర్థిక సామాజిక) అంశాల్ని - సిద్ధాంత ప్రమాణంలోనే కాక

అనుభవ సందర్భంలో గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఎన్నో మతాలు, ఎన్నో విశ్వాసాలు, ఎన్నో సాంస్కృతిక రీతులూ ప్రాంతీయ భాషా భేదాలు ఉన్న భారతీయ సమాజంలో ప్రజాస్వామ్యం, మేలైన పరిణామాల్ని కలిగిస్తుందనే విశ్వాసం.580 సీజైర్ కావ్యం ఇంతకుముందు వెలువడిన క్రాస్ఫర్లో భావ స్థానాల కొనసాగింపు మాత్రమే. సమాజంలో ఎదుర్కొనే ఆర్థిక సామాజిక రాజకీయ విషమ స్థితులవల్ల విపరీత ధోరణులవల్ల అనివార్యమయ్యే సంఘర్షణలూ - రణ సదృశస్థితినీ తొలగించే అవసరం ఎప్పటికీ ఉంది. కాబట్టి ఈ కావ్యం 'సీజైర్' లో వస్తువు సామాజికవసరమైంది. కావ్యం గది కిటికీ నుండి కన్పించే సంగ్రహ దృశ్యంతో ఆరంభమవుతుంది. గది అంటే చాలా తక్కువ పరిమితులతో కూడిన స్థితి సూచితం. దీనినుండి బయటి దృశ్యం, సమాజంలో మన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరిగే స్థితికి సంకేతం. గదికి ఒక కిటికీ, ఇది లోపలి ప్రపంచానికీ, బయటి ప్రపంచానికీ సంబంధాన్ని స్థాపిస్తుంది. మనిషి ఆలోచనలోను ఈ స్థితి అనివార్యమైంది. ఇది మనిషిలో స్వేచ్ఛగా వీచే ఆలోచనకూ సూటిగా దూకే వెలుక్కీ ప్రవేశరూపం. లోపలి ప్రపంచానికీ బయటి ప్రపంచానికీ మధ్య రాకపోకలకు సాధనం. వ్యక్తీ - సమాజం మధ్య సంబంధాన్ని స్థాపించేది. ఇట్లా ఒక్కో ఖండిక ఒక్కో విధమైన వైయక్తిక సామాజిక స్థితిగతుల్ని చిత్రిస్తూంది. చివర కార్గిల్ కవితలు జాతీయ భావనాత్మకాలే కాక మానవీయ స్పందన రూపాలుగానూ సమాలోచనకందుతాయి. మనిషిలో నీలి సముద్రం పాలసముద్రంగా రాగ సముద్రంగా మారాలనే కవి ఆశ. నీలి సముద్రం మనిషిలో చీకటి పార్శ్వాన్నీ, పాల సముద్రం, రాగసముద్రం మనిషిలో వెలుగూ, ఆర్ద్ర పార్శ్వాల్ని వ్యంజింపచేస్తున్నాయి. ఇందులో అయోమయం లేదు, అంతర్ముఖమూ లేదు, ఉంది ఒకే ఒక భౌతిక మానసిక తలాలపై వర్తించే సామాజిక స్వరూపం! ప్రజాస్వామ్య భావనతో దర్శితమైంది. కావ్యత్రయం (టినిటి)లో రెండోది “సీజై ఫైర్” వర్తమాన సమాజ స్థితి చిత్రణం. Detroit, Michigan, U.S.A. 16-2-2002 - హరిత సీజీ ఫైర్ - ఆలోకనం జీవితం నిరంతరం సంఘర్షణమయం, రణయుతం, రణచ్ఛాయాన్వితం, ఇది వివిధ తలాలపై క్రమిస్తుంది. బహుముఖాలుగా వర్తిస్తుంది. దీనికి విరామం అవసరం. ఈ స్థితే సీజ్-ఫైర్. మనిషి లక్ష్యం ఎన్నటికీ, శాంతి, సౌహార్ధ, సౌభాగ్య సమాజమే. ఆధునిక యుగంలో హక్కులకై పోరాటం మొదలుకొని ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనే

సందర్భాలనేకం. పీడనం, అశాంతి, అలజడి, హింస వివిధ స్థాయిల్లో కన్పిస్తాయి. అభిప్రాయాలూ సిద్ధాంతాలూ ఆదర్శాలపట్ల అవలంబించే తీవ్రవైఖరి కారణంగా, ఉద్రిక్త వర్తనం ఫలితంగా సంఘర్షణ క్రమంగా రణ సదృశమవుతుంది. ఈ కావ్యంలో నేడు సమాజం ఎదుర్కొనే విషమ స్థితులూ, విపరీత ధోరణులూ దృష్టికి వస్తాయి. ఈ భావనా కేంద్రంగా వివిధ సంఘటనలూ స్థితులూ అంశాలూ చిన్న చిన్న సన్నివేశ సంవిధాన నిర్మాణాల్లో అవతరించాయి. మనస్తత్వ ప్రధానంగా పాత్రలపై వెలుగు ప్రసృతమైంది. ఇందులో వస్తువు ప్రతీకలతో భావ రూపాలతో, సంభాషణపై కథనంపై దృష్టితో ఆవిష్కృతమైంది. ఇది వర్ణనా ప్రధానం కన్నా భిన్నమైన అభివ్యక్తి గుణం కలిగింది. ఈ సీజ్-ఫైర్ కావ్యం. దీనికి ముందు వెలువడిన క్రాస్-ఫైర్ కావ్య పరిణామ రూపం. మొదటిది పూర్వభాగంగానూ, రెండోది ఉత్తర భాగంగానూ గమనించవచ్చు. ఈ రెండింటి సమాహారమే జీవన రణ రూపం. ఇవి స్వేచ్ఛా కవిత్వంలో ప్రజాస్వామ్య పార్శ్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఉత్తమ సంస్కారంతో ఉన్నతమైన జీవన సంస్కృతి కలిగిన వ్యక్తి మనస్సులో ప్రేమ ఉదారత సమన్వయం శాంతినే కోరతాడు. సమాజంలో అనివార్యమైన సంఘర్షణల్నీ అశాంతిని తొలగించే తక్కువచేసే శక్తి ప్రజాస్వామ్యానికే ఉంది. ఇది సిద్ధాంతానికే పరిమితం కాకుండా ఆచరణలోను పరివర్తితం కావాలి, అప్పుడే ఆదర్శం ఫలప్రదమవుతుంది. 28-3-2000 మాదిరాజు రంగారావు II. సీజ్ ఫైర్

1. గది కిటికీ నుండి మనిషిలో గది కిటికీ అద్దాల రెక్కలు తెరచే ఉన్నాయి బయట గాలీ నీరూ వెలుగూ భూమీ, చేతనాచేతన ప్రపంచం తన కోసమే నన్నట్లుంది ఒకవైపు ఆకలీ మరోవైపు ఆలోచనతో జీవితంలో మనిషికి అవసరాలు ముఖ్యం మైలు రాయి నిశ్శబ్దంగా దారి చూపిస్తూంది వాహనాలు సశబ్దంగా ప్రవాహ గతినిస్తున్నాయి ప్రయాణికులు వెనక్కి చూచే సమయం లేదు. రాత్రి వస్తుంది భయ సుందరంగా, చీకటి బొమ్మతో ఆడుకొనీ నిద్రపోయి లేచే సరికెదురుగా చీకటి దిగిన మనిషి రూపం!

పుట్టిన సమయంలో భయం, మొదటి కేకతో రూపు దిద్దుకుంటుంది, రెండో కేకతో గూడు కట్టుకుంటుంది కాలం గడిచే కొద్దీ ధైర్యం బ్లేడ్ కదులుతుంది, భయాన్ని ముక్కలు చేసే కోరిక చలనంతో జీవన రణంలో గాయం లిపి ఒక్కొక్క సమయం ఒక్కొక్కరి కొక్కొక్క విధంగా అవగతమవుతుంది. గాయం లిపి తెలుసుకునే లోపల మరో గాయం, అవతరిస్తుంది అవలీలగా పొద్దునే మంచు ఊగే వెచ్చని కిరణాల్లో సమయం అద్దం నుండి చూస్తే, గుహ నుండి బయటికొచ్చి, శాంతి కవచం ధరించిన సింహంలా కదలుతుంది. వెలుగు మొగ్గల్ని తలపించే క్షణాలు అగ్ని పత్రాల్ని రెపరెపలాడించవచ్చు. రైఫిల్కు రెక్కలతో పని లేదు అది వదలే బులెట్కుంటే చాలు! కాలానికి రంగు రుచితో పనిలేదు దాన్ని వహించే మనస్సుకుంటే సరి. బయటి దృశ్యానికీ లోపలి దృశ్యానికీ మధ్య రేఖ చెదరి పోతూంది, మారిపోతూంది, అదృశ్యమవుతూంది కిటికీ మాత్రం నామ మాత్రంగా నిలిచిపోతూంది.

2. కళ్ళలో నవ శతాబ్ది పైన కిటికీ వద్ద కూచున్న నా చేతిలో పెన్ చివర నిశ్శబ్దం నుండి శబ్ద ప్రపంచం ఒకటొకటీ ఆలోచనా రేఖపై కదలుతూంది. ఒకవైపు కొత్త ప్రపంచంతో మార్చింగ్ తరం, మరో వైపు పాత ప్రపంచంతో జాగింగ్ గణం. దూరం నుండి బీట్ సంగీతం ప్రయాణగతికి లయనిస్తోంది. పక్కనుండి వాహనం దూసుకునీ లయ చెదరినట్లనిపిస్తోంది. దారిలో ఆగి ఆగి ఎదురయ్యే సన్నని మంచు తెర ఐస్ క్రీం కప్పు అంచులా పెదవుల్ని స్పృశిస్తోంది. ఎక్కడికక్కడ ఆగినట్లున్న దారి పోను పోను కారు ప్రయాణంలో ఎంతకూ అందకుండా పోతూంది. పక్కనే శ్రమ జీవి, తలలో బ్రతుకు మూటతో కదిలేను

మైలు రాయి, కదిలే మనిషి లక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూంది. ఈ దారిన చెట్టు నీడ ఏ ఒక్కరిదీ కాదు, స్వేచ్ఛా గమ్యం చేరే హక్కు అందరిదీ. ఒంటరితనం ప్రశ్న లేదు, ఎవరో కలుస్తూ పోతుంటారు, అంతా తమకు చెందినట్లే, అంతా తమకు కావలసినవారే. దారి పక్కన రాలే ఆకులపై కన్నా పూచే చెట్టు కొమ్మపై దృష్టితో నిరాశ వెనక బడుతూంది, ఆశ ముందుకు నడిపిస్తూంది. కిటికీ నుండి కళ్ళు కొత్త శతాబ్దికై ఎదురు చూస్తున్నాయి. చిన్నారి ఎప్పుడు వచ్చిందో, నా చేయి పట్టుకొని నిల్చుంది. అవనిపై క్షితిజం వలె ఎత్తిన ముఖంలో మొగ్గ తొడిగిన జన స్వామ్యం బింబిస్తూంది.

3. లయ దొరకని చరణాలు సంఘంలో లయ దొరకని జీవన చరణాలు అరణ్య హృదయం లోకి దారితీస్తున్నాయి. ఇక్కడికి రావడం ఏదో నేర్చుకునేందుకే అది మృగేంద్ర సాహసం కావచ్చు! అరణ్య రహస్యం కావచ్చు. జీవించే మనిషి హక్కు నిలుపుకునేందుకూ కావచ్చు. క్రాస్ బాధ్యత పూనే సహనం కోసం కాదు. గతానికీ వర్తమానానికీ మధ్య బంధం తెగింది. యాత్ర ఆగింది, చీలిక ఏర్పడింది, దారి చీలింది. చీలికలో నలిగే కన్నా, గోతిలో పడే కన్నా మరో దారి నవలంబించడం అప్పనిసరి అవుతూంది. ఇది జీవనయాత్రలో భిన్న మార్గ భేదమే. ఇక్కడెవరికీ ఎవరితో చిర శత్రుత లేదు. కృత్రిమ పాత్ర నెరగని నగ్న హృదయంతో అరణ్యం నిస్వార్థంగా స్వాగత మిస్తుంది. అమానుషం లేదు, అనుమానం లేదు, స్వేచ్ఛ కంతరాయం లేదు. పక్షి రెక్క అంచు నా బుజాన్ని స్పృశిస్తూ పోతుంది. పగిలిన బండల్నీ ముక్కలైన భూమినీ పిండి బ్రతుకుతూ, జరిగే పోరాటం, భూమి కోసం కన్నా మనిషి అస్తిత్వ కోసమన్నట్లుంది. బరువైన గాయాల్ని మోసుకునీ, రేగే మంటల్ని దాచుకొనీ

మారే వర్తమాన గమనంలో, అడుగుల్లో లయ కోసం అన్వేషణ! దిశ దిశ నుండి స్వరాలు కొమ్మ కొమ్మ నుండి ఆశలు ఆగీ ఆగని పిల్లల్లా గంతులేస్తూ అలరిస్తాయి, పలకరిస్తాయి అవనిపై పుట్టినా ఏదీ అవని ఒడిలోనే దాగిపోదు! పై పై కెదగాలనీ దూరదూరం విస్తరించాలనే కోరిక సహజం! తలుపులు మూసిన సాయం కాలం వంటి బ్రతుకులో ఆరుతూన్న నిప్పు కణంలోనూ శక్తి బీజముంది. పాలిన ముఖంలో పూచే ఆశలో సూర్యుడు! ఎక్కడో లేడు; బ్రతుకు శబ్దిస్తుంది గుండెలో, కవిత ధ్వనిస్తూంది నాడిలో.

4. అద్దాల కేస్లో వర్తమాన చరిత్రలో నిబద్ధమైన హేతు పాత్ర దారికడ్డంగా ఉన్న బండల్ని నిన్న పేల్చేసింది జారి పడిన మానవ హక్కుల పత్రంపై శీర్షిక వలె ఉంది అడ్రసు జేబులో లేదు, పిడికిలిలో ఉందేమో! ఎవరి నెవరు గుర్తులు మాయకుండానే గురిచేసినా ఓ స్వప్నం నిజం కావడానికి హింస ఆదర్శం కారాదు ప్రవాహం గడ్డ కట్టినట్లుంది, అంగారం ఆరినట్లుంది రణంలో పడిపోయిన ఆదర్శ చక్రాన్ని తలపిస్తోంది. బాధా హృదయంతో ఆయుధం పట్టుకోవలసి వచ్చిందా? అనుమానాస్పదంలో రహస్యం తొడుక్కోవలసి వచ్చిందా? బయట పడిన పులి అదృశ్యమయి నట్లనిపిస్తుంది, కాని లోపల అద్దాల కేస్లో భద్రంగానే ఉంది! తిరుగుతుంది కూడా మేఘ గర్జనం విన్నంత మాత్రాన ఆకలి తీరదు మెరుపు తీగె మెరసినంత మాత్రాన ఆశలు పూయవు. తలపై ఆకాశాన్ని తాటి చెట్టు కొలవ జూస్తుంది

5. సమయ రాగం అద్దాల గది నుండి అంతరంగం అన్ని దిశలూ చూస్తుంది. బికారి వాల్పోస్టర్లో సినీ సంతోషాన్ని పొందుతున్నాడు యువ చరణాలు జలధి తీరాన అలల వలె తరలుతున్నాయి.

శాశ్వతంగా విశ్రాంతి పొందిన మనిషి మూసిన కళ్ళలో కలలు బిగింపబడినాయి. ఒకడో పక్షానికి విద్రోహి మరో పక్షానికి వీరుడూ విషాదమైనా ఆనందమైనా ఒంటరి నిద్ర పోనీదు, అందరినీ మేల్కొల్పుతుంది. నిలయాల నుండి నీడల్లా బయటి కొచ్చి చూచి పోతున్నారు. దారిలో విద్యార్థులు మూసిన పుస్తకాల్లా ఉండిపోయారు. ఇక్కడున్న సమూహాన్ని మానవతా స్పృహ కలుపుతూంది. కళ్ళలో నీళ్ళపై ఇందాకా దాగిన రహస్యం తేలుతూంది. ఇప్పటి దాకా ద్వేషాన్ని పెంచిందీ, కోపాన్ని రగిలించిందీ ఇపుడు ప్రేమను ప్రభవిస్తూంది, కరుణను ప్రవహిస్తూంది. దర్పణంలో స్వీయ ముఖం బదులు సమాజం బింబిస్తూంది కత్తి పదును చూచే వేళ్ళు పూల రేకుల్ని ఊహిస్తున్నాయి. విస్ఫోటానికెపుడో సరిచేయబడిన సమయం మారనుంది మానవతా ఘన రాగానికి ట్యూన్ చేయబడుతూంది.

6. వెలుగు ముఖం కోసం ఫేమ్లో ఫోటోగ్రాఫ్లో పైన కిటికీ వద్ద మనిషి ముఖం, ప్రవాహంలో తేలే పూల శాఖల్లా కింద చీలిన దారులు. బాల్కనీలో పక్షి వెంటిలేటర్ వైపు చూచి బయటి కెగిరేను ఆ పక్షితో మరో పక్షి సమాంతర రక్తితో పై కెగురుతూంది. ప్రయాణంలో నడిచే మనిషిలో నుండి పులి ఎన్నడో ఆకలి తీరేందుకు హఠాత్తుగా బయట పడుతుంది ఎదురుగా నున్న చెట్టు అస్థిపంజరాన్ని తలపిస్తూంది. పులి నడచినంతమేర మృత్యుముద్ర పైబడుతూన్నట్లుంటుంది.అగ్నిపిఠం - సీజై ఫైర్ అడవిలో పులి ఆకలి అవసరం దాని హద్దులోనే ఉంటుంది. ఆకలి తీరాక వెనక్కు మరలుతుంది, నివాసం చేరుతుంది. మనిషిలో నుండి బయట పడిన పులి వెనక్కి రావడం జరగదు మనిషిలో పులి ఆకలికి, ఏ సమయంతోను ఏ మేరతోను పనిలేదు. ఎదురుగా నున్న దీప స్తంభానికి ఉరి వేసుకున్న నీడ, సమాజంలో మనిషి విషాద క్రియను జ్ఞాపకం చేస్తూంది. ప్రయాణం సాగినంతమేర వేట, మనిషి జీవితంలో భాగమైంది

మనసులో ఆఖేటం! అదను కోసం చూస్తుంది, లేస్తుంది, తన పని చేస్తుంది. చెట్టు నుండి రాలే ఆకులు విషమ క్షణాల్ని కప్పేయ జూస్తున్నాయి. గాలికి ఇసుకపై అక్షరాల వలె సూక్తు లెగిరి పోతున్నాయి. సాయం సంధ్య ఆకలితో ఆకాశాన్ని నమిలేయ జూస్తూంది చీకటి ముఖం స్వార్థంతో భూమిని మ్రింగేయ జూస్తూంది. గదిలో ఎదురుగా అద్దంలో కన్పించే వస్తూ పోయే మనుషులు ఆలోచనకు పని కల్పించే యంత్రాల వలె కదలి పోయేరు.

7. టాన్స్పరెంట్ హృదయంతో ఒక చేతిలో కాఫీ కప్ వర్తమానాన్ని ఆస్వాదిస్తూ మరో చేతిలో పెన్ పాయెంట్లో భవిష్యత్తును దర్శిస్తూ కిటికీ వద్ద కూర్చున్న నా దృష్టికి ముందుగా పోయే దారిన జన జీవన సంకుల దృశ్యం ఫిల్్మ రీల్ వలె కదలుతూంది. ఆకలి కథతో సుడిగాలిలా చెలరేగిన ప్రశ్నా ముఖం ఏ జవాబు దొరక్కుండానే నేలపై ఒరిగి పోతూంది. చేతి నుండి ప్రస్తమయ్యే ఆయుధంలా పడిపోతూంది. తలపై ఏ దెబ్బో! కాళ్ళకే గొలుసో! చేతులకే కత్తెరో పడీ ఒరిగిన మనిషి వెనక దాగిన ఏ ప్రశ్నకూ సందేహానికీ ఇంత వరకు పూర్తిగా సమాధానం దొరకనే లేదు. పై నుండి నక్షత్రం కాదు కదా! పూవు కూడా రాలదు. నేలపై కన్నీటి కణం మాత్రం! రాలి పడుతుంది, మనిషిపై పుట్టినందుకు చూపే ఘన కార్యంలా. హితవాదీ మితవాదీ నిర్మాణశీలీ విధ్వంసకారీ ఆశామతి నిరాశామతి ఒక్కొక్కొరూ ఒక్కొక్క బింబమై, కళ్ళలో తడి వెన్నెలతో ముఖాల్లో రవి కిరణాల్ని అందుకునేరు. స్తేయం కన్నా భిక్షాటనం కన్నా సమాజంలో హక్కులకై పోరాటంలో ఈ సమయం సీజైర్ సమాజంలో శాంతికి ద్వారం వలె ఉంది. పై తరం కథా సూత్రాన్ని కిందితరం అందుకోవాలి నిజమే కాని ఒక తరం కథా గమన విధం మరో తరంలో ఉండదు. పేరూ ఊరూ కులం మతం కన్నా మనిషీ ప్రాణమూ! మిన్నె నిజం! నిప్పులా వెలుగుతూంది; టాన్స్పరెంట్ హృదయంలో!

8. ఆశ్చర్యం లేదు, విచిత్రమూ లేదు ఆశ్చర్యం లేదు అంతకన్నా విచిత్రమూ లేదు. మరో ఉదయం ఋతువూ వత్సరం శతాబ్ది అన్నీ సమాప్తి లేని ప్రవాహ పరంపరలో పడవలూ, ఓడలూ భయం నుండి ముక్తం కాని స్వేచ్ఛలో ఘర్షణ నుండి విరామం లేని భావనతో ప్రయాణమే గమ్యం చేరుతుంది? జీవితమే సంస్కృతి బింబిస్తుంది? ప్రయాణంలో కనుమరుగైన సూర్యుణ్ణి, వేలి ఉంగరం వజ్రంలోనైనా చూడాలనే ఉంటుంది. మానవతా విఘాత చిహ్నం అవనిపై నెత్తురు మరక శతాబ్ది హింసను బింబించే చరిత్రకు పీఠికలా ఉంది. పగటి చివరి కిరణం విషాదంతో ఆగినట్లుంది. సాయం సంక్షిప్త సంధ్య, నేలపై తల్లి ఎదపై వాలినట్లుంది. సూరీడు గమనం, చేతి గడియారంలో బంధితమైంది. బరువు గుండెతో తల్లి తలెత్తలేకుండా ఉంది. వేడి ఆలోచనతో తండ్రి దిక్కులవైపు చూచేను. జనం ఆలోచన అమాయక సీమల్ని దాటింది. జన సంభాషణ మృత్యు ముద్ర చుట్టూ తిరుగుతూంది. ఇక్కడ చేరిన మనుషులకూ నీడలకూ భేదం లేకుండా ఉంది. రవి వదలి వెళ్ళిన కిరణాల్ని గుండెలో నింపుకొనీ శశి మరచి పోయిన వెలుగుల్ని ఊహలో దాచుకొనీ, సాగే ప్రయాణంలో ఈ సమయం, పాట కన్నా మాటకే విలువ!

9. మండే నిశ్శబ్దంలా ఆశ్రయం కోసమో నిలయం కోసమో సాగే పయనంలో మధ్య మధ్య మండే నిశ్శబ్దాన్ని భరించక తప్పదు, తగల బెట్టే మంటల వెలుగు కన్నా చీకటి నయమనిపిస్తుంది. చంపే వ్యక్తీ చంపబడే వ్యక్తీ మానవ మూర్తులే ఇరువురి భావ తీరాల మధ్య స్నేహ ధార ఇగిరిపోయింది, ఇంకిపోయింది ; ఇసుక పంక్తి మిగిలింది. దారి కిరువైపుల నుండీ చూపుల స్వాగతాలు తప్ప

చాచే మనుషుల చేతులు కలిసే వీల్లేదు. దారి పొడవునా ఇరువురి మధ్య ఇనుప ముళ్ళ కంచె వెలసేను. మోసే క్రాస్లోను ఎరుపు తెలుపు నీలి రాజకీయాలు ఎదురయ్యే ముఖాల్లో బొమ్మలు! మానవేతర విశేషణాలు! విసరేందుకు రాళ్ళేరుకునే రెండు చేతులూ, పూల గుత్తులు గ్రహించేందుకు సమయం పడుతుంది.

10. తలుపులు తెరవడమే కత్తి దిగీ, బులెట్ దూరీ, మానవ బాంబు విస్ఫోటనంతో మనిషి చివరి ఊపిరి, సృష్టి అంచుల్ని కంపింప జేస్తూంది. మనిషి చివరి చూపు, సమాజ ముఖాన్ని మాడ జేస్తూంది. వ్యక్తి హక్కుతో సామూహిక సామాజిక హక్కులూ అనివార్యం విధ్వంసం హననం స్వేచ్ఛాచరణ గతికి విరుద్ధం జీవించే హక్కును కాదనడం మానవ సంబంధాన్ని మూసేయడమే. విపణిలో వీరగాధ అమ్మకానికి ధర పలకబడుతూంది. మనిషి శక్తి మంట గలిసి ప్రతిమ మిగిలిపోతూంది. రాళ్ళు పూలు పూయవు! ప్రతిమలుగా చెక్క బడొచ్చు మనిషి పూలు పూయక పోనీ! ప్రతిమ లవకుండా ఉంటే చాలు! మనిషిలో మానవత చేతికందేపరిమళ గుచ్ఛం కాదు. మనిషిని పురి కొల్పే, ఎద ఎద కందే, కిరణ పుంజం! అవును. రాత్రి మంచులో తడిసిన మనిషి నెత్తురు చిత్రం ఉదయం! మనిషి పోలికతో జీవ రూపం పొందుతూంది. విధ్వంసం లోనో ఎన్కౌంటర్లోనో మాయమైన మనిషి కోసం ఇపుడు ఏడ్వాలనిపించడం లేదు! ఏకాంతమూ కోరడం లేదు. బ్రతికి ఉన్న మనిషిలో శాంతి కిరణ ప్రసారంతో నవ శతాబ్దిలో స్వేచ్ఛా సృజన గతికి తలుపులు తెరవడమే.

11. ఆశ్చర్యం లేదు, అనుమానం లేదు కిటికీ నుండి కన్పించే జీవిత దృశ్యంతో స్మృతి జాలం కదలుతూంది వదిలేయబడిన పెంపుడు కుక్క విషాద ముఖంతో పిల్లడు నడచేను. ఎయిర్ కండీషన్ గదిలో కంప్యూటర్ వేళ్ళు స్పృశిస్తూ పయనించే

మనిషిలో ఆశకు పలు ముఖాలు! ఒక్కొక్కటీ ఒక్కొక్క దిశ చూపుతూంది. ప్రతి దిశ చూస్తూ తన చుట్టూ తాను తిరగడమే గమనంలా ఉంది. పురి విప్పిన నెమలి బదులు మతిలో సెట్ లైట్ భ్రమణం. కాళ్ళ కింద శిఖరం కోసం మనో రూపం ఎదుగుతూంది. చేతి కందే దిశ కోసం ఆలోచన చేతులు సరిస్తూంది. సమస్య శిఖరం నుండి అశాంతి జలపాతం దూకుతూంది. పేద అడుగు లోయ నుండి ఆవేదన ఎగసి చిమ్ముతూంది.అగ్నిపిఠం - సీజ్ఫర్ వ్యక్తి మాట లేకపోయినా జన భాషణం ప్రతిధ్వనిస్తూంది. వ్యక్తి గుర్తు మాసిపోయినా జనతా ముఖం ప్రతిఫలిస్తూంది. ఫిజ్లో ఐస్ క్రీంలా స్మృతులు బహుభద్రంగా ఉన్నాయి. ప్రతి పనికీ సమయం వలె స్మృతులు సనూస్వాదనకూ ఉంది. నివాస గృహం ఎప్పటికీ తుదిరేఖల్ని దిద్దుకోవాలిసే ఉంటుంది. భవిష్యత్తుకు చేర్చే మెట్లు ఎప్పటికీ పూర్తి కావలసే ఉంటాయి. తోటలో పూల కొమ్మకు నిప్పంటుకున్నా, కొందరికి తమ గదిలో ఫ్లవర్ వేజ్కు ధనం పూయాలనే! పేజీలో మలుపులు తిరిగే కవిత్వ పంక్తులో పదావళి, నెక్లెస్లో వజ్రాల వలె మెరసేను. ప్రవాహంలో పడవల్లా ఆలోచనలు కదిలేను. అశాంతిలో శాంతి ద్వీపం ఊహలో మెరసేను. సగం పైగా భూమి నీటిలో, సగం పైగా జీవితం రహస్యంలో బయటికి కన్పించే ప్రపంచం కన్నా లోపల దాగిందే ఎక్కువ. గొలుసేసిన సూట్కేస్తోనూ ప్రయాణంలో లగేజ్ తప్పదు! ఆశ్చర్యం లేదు. కిటికీ నుండి దృశ్యం! తెరిచిన మరో సూట్కేస్! ఇపుడే అనుమానం లేదు.

12. ఆశ్చర్యం లేదు, అస్పష్టత లేదు ఆశ్చర్యం లేదు, అంతకన్నా అస్పష్టత లేదు నిశ్శబ్ద బిందువు బిందువుతో సశబ్ద ప్రవాహం వలె రోజు వెంట రోజు వర్తమాన జీవిత వాస్తవం శ్రమ జీవన చలనంపై సమాజ గమనం పైన గది కిటికీ ముందు సమయ ముఖం వ్రేలాడుతూంది కిటికీ నుండి మెల్లగా లోపలికి కదులుతూంది. ఏదైనా సహింపక తప్పదు ఏమైనా భరింపక తప్పదు!

మధువో! పిడుగో! రథచక్రమో! విమానమో! హరితమై ధ్వంసనమై పీడనమై పయనమై మరో కిటికీ నుండి వెళ్ళిపోతుంది! గుర్తులు మిగులుతాయి. పంటలతో యంత్రాలతో శ్రమ శక్తికి కేంద్రమై విజ్ఞానం ఆనందం మానస తల నిలయమై మనిషిలో సృజన రేఖలిన్నీ అన్నీనా? ఎన్నెన్నో! మనిషిలో మనిషి ఒకరా? ఇద్దరా! ఎందరెందరో! కదిలే ఇనుప చక్రాల ధ్వని వలె పీడిత జన స్వరం కిటికీ నుండి లోపలికి దూసుకొని వస్తుంది, ఎద కదలిస్తుంది! పరచీ జనం నడచే రెడ్ కార్పెట్ వలెపగలు ఎగసే ధూళితో చుట్టబడుతూంది! గుర్తుపట్టలేకుండా! కిటికీ నుండి బయటికి చూస్తే చిత్రంగా అగ్నితో నెత్తురుతో మెరసే చీకటి చిత్రం మనిషిలో వికార రేఖ శకార రూపం పొందినట్లుంది! వెంట నున్న నీడలు సిగ్గుతో తొలగిపోతున్నాయి. కిటికీ కెదురుగా చంద్రబింబం వ్రేలాడుతుంది కిటికీ నుండి లోపలికి నాలోకి దూక బోతున్నట్లుంది! చదువుతూన్న పుస్తకం వలె కిటికీ తెరచే ఉంటుంది. సీజైర్తో ఈ రోజు కన్నా వచ్చే రోజు నయమనిపించడంలో ఆశ్చర్యం లేదు, అస్పష్టత లేదు.

13. ఆశ్చర్యం లేదు, అవాస్తవం లేదు జనం నుండి జనంలోకి శరీరం వెళుతూంది పథం నుండి పథానికి అడుగులు కదలుతున్నాయి. అనుభవం నుండి అనుభవానికి ఆలోచన సరిస్తూంది. ప్రతీ ముఖంపై ఓ రంగుల పతంగం ఎగురుతూంది ఇదో పై కెగసిన అలవలె పక్షివలె ప్రతిఫలిస్తూంది ఎంతో పరిచయమున్నట్లే నాలో భాగ మయిపోతూంది. ఈ గట్టు నుండి ఆ గట్టుకీ ఆ గట్టు నుండి ఈ గట్టుకీ సూర్యుడు సముద్రంలో ఈదేను, మనిషిలో అంతరంగ చిహ్నం! కిరణం ఆయువు పోస్తూంది, ఆత్మకు ఆకృతి నిస్తూంది. అరణ్యంలో దారి చూపినట్లే ముఖంలో బొమ్మలాట చూపుతూంది.

బులెట్ దూసుక పోయిన గాయం నిలిచిన రాత్రి వలె ఉంది. బ్రయొలి లిపితోనే సర్వం అర్థమయేట్లుంది. లోన మానసికమై, బయట సామాజికమై, వెనుక చరిత్రతో సీజైర్లో రణం బూది డ్రెస్లో అనలం వలె ఉంది. ఒకటి రెండు క్షణాల తుపాను చక్రంలో భీభత్సం నుండి బయటపడిన మనిషికిపుడు అలంకారంతో పనిలేదు. సీజైర్తో శాంతికి తెరచిన తలుపులు విషాదాన్నీ మృత్యువునీ దూరం నెట్టేసే చేతుల వలె ఉన్నాయి. మనిషి మనిషిగా తీగెపై అనన్వయంతో మీటిన స్వరాల వలె సంకులమైన క్రాస్ రోడ్ను దాటడంలోనే ఉంది, ప్రయాణ రహస్యం. గాయంపై మంచు ముక్కలా ఉంది సీజైర్ కాలంలో కరిగిపోతూ మంటల్ని స్మృతిమయం చేస్తూంది. గది కిటికీ మూత పడదు, దృశ్య పరంపర ఆగదు. ఆశ్చర్యం లేదు, అంతకన్నా అవాస్తవం లేదు.

14. ఆశ్చర్యం లేదు, అంతర్ముఖం లేదు ఆశ్చర్యం లేదు అంతర్ముఖం లేదు! ఉందొకటే జీవన రణం నిరంతర ఘర్షణలో మధ్య మధ్య ఓ విశేషం! సీజ్ ఫైర్ వైరుధ్యం తప్పని గమనంలో, సౌహార్దం తొలగిన ముళ్ళపై వేదనతో ముడుచుకున్న హృదయం నడుస్తూన్న సమాజ చిహ్నం ఆకలీ అసతల శిఖరాల మధ్య పోరాటంతో స్వార్థం ద్వేషం లోయల్లోకి జారిపోతూ మొగలి పట్టలో గన్తో, మందారంలో బాంబుతో మానవ రూపంలో నాశన చణ విస్ఫోటనం. నలిగీ ముక్కలు ముక్కలై చెదరిన శరీరంతో మానవ సంస్కృతీ ప్రపంచం, భగ్గు భగ్గున మండుతూంది. క్యాలెండర్ మారుతుంది, కాని మనోమూలం ఒకటే జడాన్ని కదిలించే నిశ్శబ్దాన్ని పలికించే ఆ శక్తి ఒక్క హృదిదే. ఉత్సాహం అంచుల్లో సముద్ర చలనంతో, ఉద్రేక శిఖరంపై ఆకాశం శాలువతో మట్టి కణంలో మంజీర ధ్వనితో, రోజు పుటలో చెరగని హక్కులతో కన్నీటి బిందు సమూహం వెలుగు రేఖలతో, మారిన అభినవ రూపం

నవ సహస్రాబ్ది ముఖాన పారాడే సమాజ చేతనం నిన్న, కడుపులో దవానలంతో, మెదడులో ఆయుధంతో రేపు, పిడికిలి గుండెలో గగన మంత జనస్వామ్య బింబంతో మనిషిలో నీలి సముద్రం రాగ సముద్రమో పాల సముద్రమో అవడంలో ఆశ్చర్యం లేదు, అంతకన్నా అయోమయం లేదు అంతర్ముఖం లేదు.

2. కార్గిల్ కవితలు

1. రెక్క ఒరిగిన ఈ రోజు ఈ రోజు రెక్క ఒరిగి పడిపోయినట్లుంది. తొలి సంధ్యలోకి విషాదచ్ఛాయ సరించినట్లుంది. నిశ్శబ్దం చుట్టుకున్న కొండల గుండెల్లో శబ్దం స్పేర్లో దాచిన టైం బాంబును తలపిస్తూంది. సీతాకోక రెక్కలపై ఎగిరే వయస్సు ముళ్ళ పొదలపై జీరాడుతూంది, కొడలపై ఎగ బ్రాకుతూంది. నిశ్శబ్దం తప్ప రహస్యం తెలీని కార్గిల్, ప్రమాదాన్ని ఛేదించే త్యాగంతో ధ్వనిస్తూంది. కొండలపై నుండి ప్రేలే ఆయుధాల శబ్ద సేతువు జన గణ మన ఉత్సాహ రేఖను తలపిస్తూంది. సమయం నిప్పు కణాలపై నడుస్తూన్నట్లుంది నిశ్శబ్దం ఇనుప కవచం ధరించినట్లుంది.అగ్నిపిఠం - సీజ్ ఫైర్ పులి ఎదురైన హరిణాల్లా క్షణాలు చెదరి పోతున్నాయి. స్వేచ్ఛగా కదిలే గాలి మారణ ధ్వనితో కుంటుతూంది. అనుమాన దశ దాటింది, పసికట్టే 'డాలీ' అవసరం లేదు. రాత్రి పుటలో శబ్దం, వెలుగులో అర్థవంతమవుతూంది. చీకట్లో టార్్చ లైట్ వలె, ధైర్యం దారి చూపిస్తూంది. హృదిలో కర్తవ్యం, నేలను హత్తుకొనీ ఆకాశాన్ని ఆహ్వానిస్తూంది. చీకట్లో పిల్లి కళ్ళవలె సీజైర్ క్రికెట్ బాటింగ్లో తప్పిపోయిన బంతికై అన్వేషణలో విరామంతో బ్రతుక్కి తప్పని శాంతికై సిగ్నల్వలె ఉంది సీజైర్.

2. టాస్ సోల్జర్ దారిలో దృశ్యం వైపు కదిలే డాడీ చేయి పట్టుకొనీ పాప నడిచింది, “అదేమిటి?” “ఎవరు” అనీ అడగకలేక పోయింది. హఠాత్తుగా ఆ వ్యక్తి ప్రయాణం నిలిచిపోయింది. చేతి గడియారం మాత్రం పనిచేస్తూనే ఉంది. అడుగులో దూకే మార్్చ ఆన్ గమనం ఆగింది. చేతల్లో కదలే పులి పంజా బొమ్మై పోయింది. లోపల వెలిగే సూర్యుడు మాయమైనట్లుంది. కళ్ళలో ఒలికే జీవ లహరి తొలగిపోయింది. పిడికిలి సడలినా వేళ్ళు ఆయుధాల్లా ఉన్నాయి. దేహం దేశాని కర్పితమైంది, ప్రాణం జాతిలో కలిసింది. రెక్కలపై ఎగిరే ఆయువు నిలువునా చీలిపోయింది. అగ్నికణంలా ఉద్యమించే శరీరం మంచుగడ్డలా పడి ఉంది. రణంలో ఆరిన అనలం ఏ జ్వాలా రాగం వినిపిస్తుంది. గడ్డకట్టిన మనస్సుపై ఏ ఊహ పడవ పయనిస్తుంది. నేలపై ధూళి కమ్మిన క్షత శరీరం శుభ్రమైన పెట్టెలో; విలువైన మనిషీ మానవతను భద్ర పరచినట్లుంది. చరిత్ర అద్దిన అనల చిత్రాలతో చీకట్లను మోసుకొనీ సమయం దుఃఖ విషాద తీరాల మధ్య సరిస్తూంది. కార్గిల్ అయినా కొసావా అయినా కుప్పం అయినా కాశ్మీర్ అయినా ఎగసి వచ్చి ఎదపై వాలే ఆర్తి విహగ మొకటే. తలుపులు మూసిన ఇంట్లో చీకటి వాలినట్లు ధనస్సు నుండి ముక్తమైన బాణంలాగా చదువుతూన్న పుస్తకం హఠాత్తుగా మూతబడినట్లు అనల వీచి పరుగెత్తే నిశ్వాస సూత్ర పంక్తితో తల్లీ! తండ్రీ! సతి! పిల్లలు! మిత్రగణం! మనుషులు. శోకంతో చీలిన బాధా ప్రవాహంలా కన్పించేరు. ఈ సమయం సానుభూతి వెలుగు జాడ, ఒక్కొక్కరికో వీర పథం చూపుతూంది. మాయమైన సూర్యుణ్ణి అంతరంగంలో చూపేందుకు ప్రతి పౌరుని గుండె తలుపులు గట్టిగా తడుతూంది కల్లోలం అణగిన జలధిలో అలల్లా వరద తీసిన నదిలో పూల పడవల్లా

రణ విరామ క్షణాలు! మనస్సులో నిలిచేనా? ధరణీ విశాల హృదయంపై ధూళిలో కలిసిన కార్గిల్ సోల్జర్ ఈ గడ్డపై మొక్కయై కవితయై శాంతి హస్తం చాచేను ఈయ నెవరో పాపకు తెలిసినా తెలీక పోయినా దారిలో దృశ్యాన్ని చూచి చలించింది, డాడీ చేయి వదిలింది, అరచేయి వేళ్ళతో కళ్ళ తడి తుడుచుకుంది. అతని గురించి మతిలో కంప్యూటర్ పని చేసినా స్పందనలో మానవ చేతనతో అతడెవరో చెప్పకుండానే తెలిసింది. దృశ్యంలో పాప మనస్సు టాస్ వేసినట్లు తిరుగుతూంది సింహమో చక్రమో వీరమో శాంతమో! ఏ వేపైనా నాణెం ఒకటే! అది సోల్జర్ అపూర్వ వ్యక్తిత్వం! 596597

3. ఇంకా తెర పడలేదు నాటకం పూర్తి అయింది, కాని ఇంకా తెరపడలేదు. పాత్రలింకా రంగస్థలంపైనే కదులుతున్నాయి. పాత్రలు స్టేజ్పై ఉన్నంత వరకు ప్రేక్షకులు సీట్లు వదలేట్టు లేరు ఇక్కడే పాత్ర సొంతం కాదు, ఎందరి ప్రభావంతోనో రూపొందింది. శిరసైనా బుజాలైనా పాదాలైనా గాయం ఏ అంగానికైనా బాధ, మొత్తం శరీరానిదీ, సంవేదన సమస్త దేశానిదీ. రాళ్ళపై శాంతి బిందువులు కురిసినట్లే జారిపోతాయి. ధూళి కమ్మిన ముఖం కడుక్కునేందుకు నీళ్ళు కరువవుతున్నాయి. ఇక మిగిలింది కళ్ళలో నీరు మాత్రమే అవీ బయటికి రాకుండా లోపలి అగ్ని నిలిపేస్తూంది. స్నేహంలో దేశాల మధ్య సరిహద్దు రేఖ అమరిన పూల దండ ద్వేషంలో అదే విద్యుదనల దీర్ఘ సర్ప మవుతూంది. వాస్తవరేఖపై మంటల్ని మోదుగ పూలను కొనీ చాచిన స్నేహ హస్తం చంద్రవంక కొడవలి గాట్లతో శీర్ణ కమలంలా ఉంది. ఎదురుగా వెళ్ళిన ముఖంపై నిప్పు కణాలు చెరగినట్లుంది. పూలు పరచిన కళ్ళలో కత్తి మొనలు దూసినట్లుంది. గిరి శిఖరాలపై ఎప్పుడో మొలకెత్తిన అనల ఫలం ఇప్పటికి జాతికి రుచి తెలిసి వస్తూంది. హిమ ధవళ ఫాలంపై నెత్తురు చిందే గాయానికి

దేశం మహోదగ్ర రుద్రాకృతి ధరిస్తూంది. వెండి పూతతో మసకేసిన పాలనా చక్షువు ముందు రాజనీతి నిలిపిన అగ్ని ప్రశ్నే! కార్గిల్ సంక్షోభం. కాశ్మీర్ సుందర స్వప్నం! ఇప్పుడు! ద్వేష ఫలంగా మారుతూంది. హిమ గిరి హృదయం! వీర స్పర్శతో అనల గర్భ అవుతూంది. కొండల్లో శతఘ్ని శబ్దాన్ని, కవి హృదయం అనువదిస్తూంది చరిత్రలో తప్పని వీరాన్ని, జనచేతన ప్రతి ధ్వనిస్తూంది.598

4. యశస్తోరణం మూడు వన్నెల జాతీయ పతాకలో చక్రం వలె సైనిక వలయం చిన్ని చిన్ని గిరుల్లా అద్దిన తెలుపు పూలతో కదిలేరు ప్రతి మట్టి కణంలో ప్రాణాన్ని జోడించేరు ప్రతి అంగుళం నేలను అడుగుల్లో బంధించేరు. హిమ పటలాన్నీ ధూమ మండలాన్నీ చీల్చుకొని సాగేరు. శత్రు శిబిర విధ్వంసం నుండి జాతి శిఖరం లేస్తూంది. ఇక్కడి హిమ శిఖరాలకు గర్జించడమే తెలుసు. ఇక్కడ పారే నదులకు వీర నృత్యమే తెలుసు. సైనికుల అడుగుల్లో లయ పొందిన రణ భవిష్యత్తు విజయ కేతన చలనంతో దిశా ఫాలంపై బింబించేను. టైగర్ హిల్పై త్రివర్ణ పతాక రెపరెపల్లో సైనికులు అగ్ని నుండి బయటపడిన సువర్ణ మూర్తుల్లా వెలిగేరు. క్షణం క్షణం తాము వరించే మృత్యు గండం నుండి అనుక్షణం విజయ బింబంగా బయట పడేరు. వీరుల ఉత్సాహ తేజంపై జాతి లేచి కదలుతూంది. వీరుల ఉద్వేగ రాగంతో జాతి గుండె పలుకుతూంది. నిరంతర పోరాటం సైనిక లక్ష్యం! తరాల కాదర్శ రూపం! ప్లేన్ నుండి భుజాలపై దిగే శవ పేటిక రత్నగర్భలా ఉంది. హిమావృత రణ పథాన చరించిన అగ్ని గోళం ఇపుడు భద్రపేటికలో ధవళ పుష్పగుచ్ఛంలా నిద్రిస్తూంది. వీర క్షితిజంలో గిరిపై యశస్తోరణమై సైనిక బృందం. గుండెపై అరచేయితో, పైకెత్తిన మరో చేయితో, ప్రజ! III. నేడు రేపు మధ్య సూచిక

I. మొదటి భాగం : ప్రకృతి పార్శ్వం ..... II. రెండో భాగం : భౌతిక పార్శ్వం III. మూడో భాగం : సామాజిక పార్శ్వం : 1. అంబులెన్సో సూర్యుడు 2. గుండెకు పచ్చదనం 3. మానవీయ వాస్తవం 4. అదృష్ట పార్శ్వాలు 5. కవిత ఒక క్రీడ కాదు 6. కాలం విసిరే జోక్ 7. అశాంతి ప్రశ్న 8. బ్లాక్ బోర్్డ పై 9. ప్రజాస్వామ్య వాస్తవం

III. నేడు రేపు మధ్య

(కావ్యం) (2002) అంకితం ఉదార చరితకు ప్రతిబింబం ప్రియసోదరుడు డా॥ మాదిరాజు హరికిషనావుకు (GRIMSBY - U.K.) Haritha, Madiraju, Devulapalli M.A.(Lit.) నేడు రేపు మధ్య - సమాలోచనం నేడు రేపు మధ్య కాల గమన రూపమే జీవితం. అనుభవంలో ఉండేది వర్తమానం, ఇది ప్రవాహ సదృశమైంది. దీని చలనం ఒక విధంగా ఉండదు. ప్రవహించే తలాన్ని బట్టి, ప్రకృతిలో మార్పునుబట్టి ఉంటుంది. అసమత్వం విషమత్వంతో పాటు ఆఘాతం విపరీతం తమ ప్రభావాన్ని నెరపుతాయి. ఈ విపరీతాల్లో భూమికి సంబంధించింది

భూకంపం.

తుపాను వలెనే భూకంపమూ విపరీత మారణ స్థితి రూపమే. ఇటువంటిదే ఇటీవల గుజరాత్లో వచ్చిన భూకంపం. రిపబ్లిక్ రోజు సంతోషంతో అలరించే సమయం ఉదయం, భూకంపంతో విషాదం అలముకొంది. ఈ దారుణమైన మారణ వార్తకు స్పందించిన కావ్యం, "నేడు రేపు మధ్య", మానవ జీవితంలో ప్రకృతి వైపరీత్యాలు నెరపే ప్రభావంతో మొదలైన కావ్యం, ఆ పైన సమాజ వైషమ్యాలతో విషాద స్థితికి లోనయ్యే మరో విధమైన పార్శ్వంతో ప్రజాస్వామ్య వాస్తవంపై ఆశతో ముగిసింది. ఒకటి ప్రకృతి పరంగా వస్తే మరొకటి మానవ పరంగా సంక్రమిస్తుంది. ఈ కావ్యం మూడు భాగాలుగా ఉంది. మొదటి భాగం ప్రకృతి పార్శ్వంలో భూకంపానికి గురి అయిన కంచ్, అంజార్, కాండ్లా, మోబి మొదలైన ప్రాంతాల దుర్భర నిస్సహాయ స్థితీ, దృష్టికి వస్తుంది. రెండో భాగంలో, భౌతిక పార్శ్వంలో వివిధ ప్రాంతాల్లో వార్తలు పీడనం హింస ఆధారంగా స్తంభించిన విషాద జీవిత స్థితి చిత్రణంతో పాటు మనిషిలో నాశన గుణం, అమానుష వర్తనంతో తల ఎత్తే సమస్యలు రూపితమయినాయి. మూడో భాగంలో సామాజిక పార్శ్వంలో ఈ రెండింటికన్నా భిన్నమైనవీ సమాజంలో నెలకొన్న దుస్థితులు చిత్రితమైనాయి. చివరలో ప్రజాస్వామ్య చేతన ప్రాముఖ్యం

వివృతమయింది. II వైపరీత్యం ఏ ఒక్క వ్యక్తికీ పరిమితం కాదు. మొత్తం సమాజాన్ని కుదిపేసేది. ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా మరికొందరు బాధలకు గురి అవుతారు. "నేడు రేపు మధ్య” వాస్తవానుభవ జీవితాల్ని ప్రభావితం చేసే స్థితి భవిష్యత్తు గురించి ఆలోచింపజేస్తుంది. వ్యక్తితోపాటు సమాజం పొందే నష్టం అపారమైంది. ఇది పరోక్షంగా వ్యక్తులపైనే ప్రసరిస్తుంది. గుజరాతైపై 'విధి మోపిన ఇనుప పాదం' తో ఇక్కడి జీవితాలపై “నీలిముసుగు” విసరబడింది. మృత్యుమయమైన వాతావరణంలో మళ్ళీ జీవకళ తొణికిసలాడవలసి ఉంది. ఇది మనిషి శక్తితోనే సాధ్యమన్న విషయం ప్రతిపాదితమైంది. నేడు రేపు మధ్య జరిగే భౌతిక మానసిక ప్రయాణ రూపం ఈ కావ్యం. ఇది ప్రకృతీ, మనస్సూ సమాజం పరంగా జరిగే వైపరీత్యాలు, వైషమ్యాలు, అసమానతల్ని గురించి చిత్రిస్తుంది. వీటిని అధిగమించే మనిషిలో శక్తిని వెనువెంటనే స్ఫూర్తి తెచ్చే మానవీయ భావనా రూపం "నేడు రేపు మధ్య" కావ్యం. Detroit, Michigan, U.S.A. 26-2-2002 - హరిత603 నేడు రేపు మధ్య - పీఠిక ఈ కావ్యం మూడు భాగాలు. మానవ జీవితంలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యం మరోవైపు మనిషిలో నాశన గుణం, నెరపే ప్రభావ చిత్రణం. మొదటి భాగంలో సమాజంపై ప్రకృతి విధ్వంసన వర్తనం, రెండో భాగంలో ప్రకృతి దుష్ప్రభావం మానవ దుష్ప్రవర్తనం దృష్టికి వస్తాయి. మొదటిది వస్తుపరంగా, రెండోది భావపరంగాను నిర్మాణ రూపాన్ని పొందాయి. రెండూ దీర్ఘ కవితా రూపాన్ని పొందాయి. మూడోది ఖండికలుగా విధ్వంసన మనోరూపం, ఇంధ్రధనూ రూప చిత్రాల్ని తలపిస్తుంది. మూడింటిలోను భావసూత్రం ఇంచుమించు ఒకటే. ప్రకృతి మానసిక సామాజిక తలాలపై విధ్వంసం, హింస, అశాంతి, అపకృతి, అవమానం, దుఃఖం, పీడన నుండి ప్రేమ, శాంతి, నిర్మాణం, ఉపకృతి, గౌరవం, సౌభాగ్యం ఉదారతవైపుకు ప్రయాణింప జేసే విధంగా ప్రజాస్వామ్య భావనా లక్ష్యం కలిగింది. (1) ప్రకృతి పరంగా చూస్తే ఉదాహరణకు గుజరాత్, లాతూర్ భూకంపం కావచ్చు. ఒరిస్సా పెను తుపాను కావచ్చు, జపాన్ దీవుల్లో బద్దలైన అగ్నిపర్వతం ప్రభావం కావచ్చు, (2) మానవ సమాజ పరంగా పరస్పరాహరణం, అణ్వస్త్ర భయం,

విధ్వంసనచణ విస్ఫోటం కావచ్చు. ఇవన్నీ నేడు మన అనుభవంలోనివే. (3) మూడో భాగంలో 'అంబులెన్సో సూర్యుడు' మొదలు 'కాలం విసరే జోక్' 'అశాంతి ప్రశ్న ఒక వాక్య దర్పణం’, ‘ప్రజాస్వామ్య వాస్తవం' వరకూ కవిత్వంలో సృజన సూత్రం, భావరూపంతో ప్రతీకతో కళాత్మకంగా యోజితమైంది. విధ్వంసన వర్తన సమూహాల మనోరూపంతో జీవిత విశ్లేషణతో నిర్మితమైంది. రచనలో పదవిన్యాసక్రమంలో మార్పులతో వాక్య లయలో మార్పులతో మధ్య మధ్య సంభాషణ గుణంతో భావజాలాన్ని మనస్సులో స్ఫూర్తి కట్టించే అంతర్గత సంవిధానం, అవలంబింప బడింది. ఈ గుణం కావ్యంలో పోను పోను సాంద్రమైంది. ప్రతీయమానత్వాన్ని పొందింది. నేడు రేపు అనేవి నిరంతరం వస్తూ పోయే కాల విభాగాలు. వీటి మధ్య కదలే మనిషి మనోరూపం కేంద్రంగా, ప్రకృతి సమాజం పార్శ్వాలతో జీవితం చిత్రితమైంది. స్థలం చేత కాలం చేత అనుభవం చేత సీమితమైనప్పటికీ విశ్వ జనీనమైన అంశాలూ కన్పిస్తాయి. ఇవి కష్టం సుఖం ప్రేమ కరుణ హింస శాంతి న్యాయం సమానత నీతి అవినీతి పీడనం రణం ఉదారత స్వేచ్ఛ మొదలుగా మానవీయమైన మౌలిక భావ జగత్తులోని, జీవిత వాస్తవాల్ని బింబించేవి. ప్రకృతిలో వైపరీత్యం మనిషిలో విషమ వర్తనం, ఒకే నాణెం రెండు రూపాలుగా గుర్తింపబడినాయి. వీటిని జయించడానికి ఒకవైపు నుండి భౌతిక విజ్ఞానం మరోవైపునుండి తత్త్వ ప్రపంచం అవతరించాయి. దీన్ని604 సవరించడానికి కృషి జరుగుతుంది. క్లిష్టస్థితులనుండి మనిషి తనలో శక్తిని సమీకరించుకొనీ, వృద్ధి పరచుకొనీ ఎప్పటికపుడు అభినవ రూపాన్ని పొందడం సమాజ చరిత్రలో స్పష్టంగా కన్పిస్తుంది. ఇది హేతుయుతమైన మానవతారూపంతో అవసరమైంది. ఒకటీ రెండు భాగాల్లో వస్తువు భౌతిక పరిధుల్లో నిబంధింపబడింది. మూడో భాగంలో వస్తువు మనః పరిధుల్లో చిత్రితమయింది. రెండూ జీవితంలో వాస్తవాలే. అయితే కవిత్వంలో ఏదో విధంగా కొంత కల్పన చోటు చేసుకుంటుంది. ఇది అనివార్యం. ప్రతి కవీ తనవైన నిర్మాణ పద్ధతుల్ని కలిగి ఉంటాడు. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంతగా కవి ప్రత్యేక వ్యక్తిత్వం అవగతికి వస్తుంది. కొందరిలో వీటిలో కొన్ని ఇంతకు పూర్వం పరిచయమున్నవీ ఎక్కువ తక్కువల్లో దృష్టికి వస్తాయి. పూర్వం ఉన్నవీ, క్రొత్తవీ ఏ అంశాలు ఏ నిష్పత్తిలో రూపొందిందీ, సమాలోచన జరుపవలసి ఉంటుంది. ఈ కవిత్వంలో మన జీవితంలో భాగమైందీ ఒక స్థితి ఆధార వస్తువుగాను ఉద్వేగం సంవేదన శక్తి కేంద్రాలుగాను, భావ రూపం, ప్రతీక, మానసిక చిత్రణం నిర్వహణ భాగాలుగాను, మానవీయ స్పందనంతో సృజన రూపం విశ్లేషణకందుతుంది. ఇది ప్రయాణ సాధనం మాత్రమే. ప్రయాణ లక్ష్యం ప్రజాస్వామ్యం. కవిత్వం లాగే విమర్శ కూడా ఒక కళ, రెండూ నా కూడా ఒక కళ, రెండూ నా దృష్టిలో విడదీయరానివి. మంచి విమర్శ ఎప్పటికీ కవిత్వావగతికి, అనుభవ విస్తృతికీ ఉపయోగపడుతుంది. ప్రకాశ

రూపాన్ని సిద్ధింపజేస్తుంది. అస్తిత్వాన్ని దృఢతరం చేస్తుంది. దీనికి మంచి అభిరుచి సమాలోచన గుణంతో కూడిన సాహిత్య సంస్కృతి అవసరం. దీనికీ ప్రతిభ ఎంత సారవంతమైతే ఇతర సహకారాలతో అంత మంచి విమర్శ ఉద్భవిస్తుంది. కవిలో విమర్శకుడూ, విమర్శకునిలో కవి ఉంటారని చెప్పడమే నా ఉద్దేశం. సమాజంలో బయటి మనిషీ, మనిషిలో మనిషీ, కవీ ఈ ముగ్గురి సమష్టి స్వరూపం, ఈ స్వేచ్ఛా కవిత్వం. విభిన్న కోణాల్లో నేడు రేపు మధ్య - కదలే వాస్తవ జీవితాన్ని బింబించే దర్పణం. ఇదే కవి అంతరంగం, అంతరంగ కవిత్వ స్వరూపం. సాహిత్య చరిత్రలో స్వేచ్ఛా యుగం, ఆధునిక సమాజశక్తిని బింబిస్తూంది. “అగ్నిపీఠం” టినిటిలో మూడోది "నేడు రేపు మధ్య” ప్రకృతీ సమాజ వస్తుగతమైంది. మాదిరాజు రంగారావు605

III. నేడు రేపు మధ్య

మొదటి భాగం ప్రకృతి పార్శ్వం రిపబ్లిక్ రోజు రాకతో ఉదయం విభిన్న స్వరజగత్తుతో ప్లాట్ఫార్్మ కోలాహలంగా ఉంది, ఆనందం అందుకుంది. క్షణాల్లో మహాధ్వని! అంతలో ఆర్తారావం! వెనువెంటనే నిశ్శబ్దం! తెరచిన శవ పేటికగా మారింది. గుజరాత్పై విధి ఇనుప పాదం కదిలింది మృత్యువు ఒకేసారి నీలి ముసుగు విసిరింది. చెట్టూ జంతువు మనిషీ భేదం లేకుండా అస్తవ్యస్తమైంది. విరిగి నలిగి చెదరి కూరుకుపోయిన మానవ రూపాలతో దారుణ మారణ భయ దృశ్యం! ధరణిపై అవతరించింది. తల్లివంటి సర్వంసహ భగ్నమైంది. సర్వం శిథిలమైంది జాతి పతాక గగనంలో రెపరెపలాడే సమయం, భుజంపై పెను గాయాలతో దేశం విలవిలలాడింది. కచ్ హృదయం బద్దలైంది, భుజ్ ముక్కలైంది. అంజార్ స్కూల్ పిల్లల సజీవ సమాధి విషాద వార్త! కాండ్లాలో కూలీల కార్మికుల హాహారవం. మోబిలో ప్రేమ చిహ్నం మణి మందిరం, వరదలకు నిలిచింది, భూకంపనకు విరిగింది.

వాతావరణం ఏడ్పునే మరచింది, ఎక్కడిదక్కడ స్తంభించింది. నిశ్శబ్దం మహదాశ్చర్యంతో, విగ్రహాకృతి పొందింది. తత్త్వాన్ని మరచీ, మాయను వదలీ మిగిలిన బ్రతుకుల్ని, ఎదురైన కఠోర వాస్తవం కౌగిలించుకుంటూంది. మత భేదాల్ని మరచిన మానవీయం, మందిరాన్నీ మసీదునూ చర్చినీ ఒకే పంక్తిని నిలుపుతూంది. ప్రాణంతో బయట పడిన కుక్క శిథిలాల ముందు, ఒంటరిగా కదులుతూ ఏ మనిషికో కాపలా కాస్తూంది. నీరూ అగ్నీ గాలీ ఆకాశం పృథ్వీ తత్త్వాలతో ప్రాణాన్ని ఇచ్చే పంచీకృత భూత రూపాలు ప్రాణం తీసే దంష్ట్రలు కావడం ప్రకృతి వైపరీత్యం. ధైర్యం ప్రేమ త్యాగం ఉదార కరుణలతో విషాదం నుండి నిరాశ నుండి మనిషిలో మరో మనిషి! విధ్వంసన సమయంలో సృజన శక్తికి బింబమై. రాత్రి వెన్నెల ముఖంపై బంతిలా దొర్లుతూంది. ఇక్కడో దీపం! అక్కడో దీపం! మిగిలిన బంధువుల్ని తలపిస్తూన్నాయి. హఠాత్తుగా తెగి ముత్యాలు జారిపోయిన హారంలా ఉంది, వీథి. విషాదం అంచున ముక్కలు ముక్కలైన శాంతి మధ్య కరుణ తరంగం కోసం ఎదురు చూచేరు ప్రజ! నిద్రించే నిశ్శబ్దంలా ఒకరు, కొన ప్రాణంతో నెలవంకలా ఒకరు! దెబ్బతిన్న తల్లి గుండెపై శిశువులా ఉంది మరో ఉదయం! తరతరాలు చెప్పుకునే విషాద గాథ మిగిలింది ఇపుడు బుద్దుడు కళ్ళు తెరచినట్లుంది ఇపుడు క్రీస్తు జీవితుడయినట్లుంది. ఆరు బయట తల కింద కలల మూటతో నిద్రించే వారూ తలపై బాధల ఆకాశంతో చదికిల బడిన వారూ గూడులేని దీనులకు చాచిన హస్తాల్లా టెన్టు, చెదరిన వాక్యాల్లో పదాల్లో ముఖాలు! అర్థాలు దాగీ! ఎటు వెళ్ళినా ఊరు తరువాత ఊరు, భీభత్స సముద్ర తీరం నుండి మరో తీరం చేరినట్లుంది. మరో ప్రమాదం ఎపుడు రహస్యం విప్పేదీ తెలీదు. క్షతగాత్రుల మధ్య నుండి ప్రయాణం

. వెదురు గడ వంతెనపై కల్లోల ప్రవాహం దాటుతూన్నట్లుంది. ఆర్తరవం దిశలు అల్లుకొని పోతూంది. త్యాగపేటి నేలపైకి దిగుతూంది. ప్రాణం లేని విమానం! పైన సహాయంకై తిరుగుతూంది. బండికాణి ఎత్తే రెండు చేతులూ పోయాయి, పొలానికీ తోటకూ వెళ్ళే రెండు కాళ్ళ నలిగాయి. జీవిత శిలల్ని చెక్కే మనసులు గాయాలతో శిలలైనాయి. బరువుపై బరువుతో కింది నుండి మూల్గులతో పిలిచే, ఓ తల్లిని! పైకి తీసే జవాన్ మెడలో వాలిన రెండు చేతులూ కృతజ్ఞతా సుమ దామమై మానవతను అలంకరించేను. చుట్టూ విరిగి పడిన రాళ్ళ మధ్య మొగ్గవంటి పాపను పైకి తీసే చేతులు! పచ్చని ఆకుల వలె కదిలేను. ఎతెన అంతస్తు భవనాల శిథిలాల మధ్య కన్పించే శిశువు, సజీవమై భవిష్యత్తును భద్రపరచేను. ఒకటి రెండు మెరపులు! సజీవ సంకేతాలు, అణగారిన జీవితాలపై ఆశను వెలిగించేను. ఇపుడీ ప్రాంతం నీలి మేఘంకై ఎదురు చూడడం లేదు. స్నేహహస్తం కోసం త్యాగ బింబంకోసం ఎదురుచూస్తూంది. పై మేఘ శకలాలు ప్రజల కళ్ళలో దాగినట్లుంది. సముద్ర బడబానలం వారి ముఖాల్లో తిష్ఠ వేసినట్లుంది. ఎవరి బాధకు సాక్షి వారే అయినా బాధ్యత అందరిదీ. బాధ నుండి వేదన నుండి మృత్యువు నుండి కొత్త మనిషి! ధైర్యంతో రాగంతో జిగీషతో కదిలేను. ప్రకంపన రేఖ భూమిని కత్తిరించినంత మేర, ముక్కలైన మట్టి బొమ్మల్లా క్షతగాత్రులు. చెదరిన బాధా గాథలతో అకాల శిశిర రూపాలు. సరికొత్త జీవితాలకై కదలిపోతూన్న దృశ్యం. స్వప్నం జారిపోయిన సౌరాష్ట్ర! దిగ్రమలో మునిగింది. రెక్కలు పోయిన పక్షి అయింది, పురి తెగిన నెమలిలా ఉంది. మనిషి బాధ్యత శక్తిని మించి పోతూంది. పాలనా వేగం లక్ష్యాన్ని చేరుకోలేకపోతూంది.

ఇది విధి పేరిట మనిషి శక్తిని విస్మరించే సమయం కాదు. భాష దేశం మతం హద్దుల్ని చెరపేసే మానవీయ సందర్భం. సమయం తెల్లని అక్షరం ఎరగని బ్లాక్ బోర్్డ ఉంది. రేపు పత్రికలో నీలి అక్షరాల్లో చుక్కలు కన్పించవచ్చు. ఇపుడు కావలసింది వాగ్దానాల స్వప్నం కాదు. ఇపుడు అవసరమైంది క్రియలో నిర్మాణ వాస్తవం. నిప్పంటిన దుస్తులతో పరుగెత్తే కాలాన్ని ధైర్యంతో నిలిపి కరుణతో జీవన రుచి చూపించాలిసి ఉంది. పేరుకు మాత్రం ఊళ్ళు మిగిలాయి కాలం ఒక్కసారి పేరుక పోయింది. దీన్ని కరగించేదీ, కదలించేదీ, సూర్య తేజం ఒకటే. స్నేహితులూ బంధువులూ కనుమరుగయినారు. చల్లని గాలి వణకుతూన్న చేతుల్ని స్పృశిస్తూంది. రాత్రి చేలి వెచ్చదనం కోసం జేబుల్ని వెదకుతూంది. విద్యుత్తు లేని చీకట్లో టేబిల్పై కొవ్వొత్తి వెలుగు బతుకును సార్థకం చేసుకుంటూంది కూలిన శిథిలాల మధ్య మిగిలిన గోడల వెంట తిరుగుతూ ఓ కుక్క ఆగి ఆగి మిగిలిన మనిషి కాళ్ళను పెనవేసుకుంటూంది. సర్వం భగ్నమై నగ్నమై బికారియైన స్థితిలో కళ్ళలో దాగిన ఆశలు శిథిలాన్ని వెదుకుతున్నాయి. ఇప్పటికీ తెరచి ఉన్న కళ్ళలో చీకటి నిలచే ఉంది. ఉదయాలు వస్తూ పోతున్నా చీకటి ఇప్పట్లో తొలిగేట్టు లేదు. శుభ్రమైన హిమ పటలంపై రక్తచిత్రం రణ చరణం లేకకుండా భీభత్స దృశ్యం. సేనా పద ఘట్టనలో నలిగినట్లున్న జన సమూహం! ఉపశాంతికై ఆరాటం! ఏ శత్రువూ ఆయుధమూ లేకుండా మారణ భూమి అయింది ప్రకృతి వైపరీత్యంతో కాలం! ప్రశ్నా చిహ్నమయింది. దారి మధ్య పడిన శిలల్ని తప్పించుకొనీ జీవన చలనంతో సాగే సరికొత్త జీవితం మొదలు! సూర్యునికి చావు లేదు, సప్త వర్ణాశ్వ గమనం ఆగదు! రంగుల కాగితం పూలు అతికిన మనోరూపం ఇపుడు స్వచ్ఛమైన మనోజ్ఞ పుష్పాల్ని వికసించేను

ప్రేమ కరుణ వీరం త్యాగం వివేకం శాంతి సృజనతో చిరంగా నవంగా బ్రతుకు సాగాలనే సంకల్పం! మనిషిలో మహాబోధి చివురిస్తూంది. మనిషిలో శాంతి శిలువ తలెత్తుతూంది. మనసులో జీవన ధుని కదులుతూంది. ఆత్మలో శాంతి పాఠం స్వనిస్తూంది. మనువుకు తెలీందీ, మిగిలే ఉంది. మార్కు్క అందందీ, దాగే ఉంది. పరిణామ శిఖరాలకు కొలత లేదు ప్రయాణ మజిలీలకు మితం లేదు తుపాను తాండవయినా, భూకంపం ఆందోళనమయినా మనిషి బలం ధనం సంకల్పం వికల్పం! శక్తీ యుక్తీ ప్రజ రూపం! ప్రజ కోసం! మానవ చైతన్యం అస్తిత్వం! సంస్కృతి! సర్వం లక్ష్యం ఒకటే! నవ సమాజం.నేడు రేపు

మధ్య

కాల చక్ర గమనంలో భూకంపం పెను తుపాను భీభత్సం ప్రమాదం సమాజ గతి చలనంలో పరస్పరాహరణం రాజకీయ విస్ఫోటం అపాయం రోదసిలో కక్ష్యపై ఉపగ్రహ భ్రమణంలా కండె చుట్టు దారంలా సామాజిక జీవితం నేడూ రేపూ మధ్య కదలే దృశ్యం పై ఆవిగ్నం ఆవేదన మారే గమ్యంపై ఆలోచన! జిగీష! కంటి రెప్ప లెత్తి మనిషి ఆదిత్యుని చూడలేడు ప్రతి ఫలనం మాత్రం అనుభవ రమణీయం అందదు శాంతి జగం అంతరంగ రూపం ఏ నిజమూ ఏ సమయం సంపూర్ణంగా అందదు జీవన వ్యాపారంలో మనిషి దృష్టి నేలపై చేతు లెత్తి ప్రార్థనతో కష్టంలో గగనంపై ఆకాశం నుండి ఇలకు దిగడం మానవీయం వీధి దీప పంక్తి రాత్రి వెలక్కపోయినా స్తంభం నుండి స్తంభానికి పయనం తప్పదు చీకటి భరించలేని సమయంలో మనుషుల్లో వెలుగుకై అసహనం సహజం! అన్వేషణ అవసరం ఆకలి కాగలేని మహర్షి పుణ్యధామాన్ని శపించేను

ఆకలి కాగలేని మనిషి కంతరాత్మ గుర్తుండదు! దారిలో వృద్ధ వ్యాఘ్రం ఉపదేశంతో కన్పిస్తుంది వేదికపై చతుర జంబుకం ఉపవాసంలో కూచుంటుంది. మనిషి నేడు నేలపై నడుస్తూన్నట్లు లేదు రెండవ భాగం భౌతిక పార్శ్వం సర్కస్లో తీగెపై కదలుతూన్నట్లుంది మనిషిలో మానవత చెలమలో నీరు లాంటిది అవసరాన్ని బట్టి పాత్రల ప్రమాణంలో నిలుస్తుంది. కంపనలో చెదరనీ, వరదలో తేలనీ, కరువులో మాడనీ విస్ఫోటం ముక్కలు చేయనీ ఆఘాతం పరస్పరం గాయపరచనీ సమయం శిలా నిశ్శబ్దమైనా తమ ఊరు తమ ఊరే తమ ఊపిరి అలలపై తేలుతుంది ప్రియంగా పలాయనం పునరాగమనం! నిర్గమనం, పునరావాసం. ఈ సమయం కావలసింది పొట్టకై చేతులకు పనీ బొందితో కైలాసం కాదు, చేతిలో వైకుంఠం కాదు సామాన్యుని జీవితమే అధినేతల మధ్య ఆటబంతి కారాదు. అప్సరోనృత్యంలో మంజీర పద ధ్వనికి సహకృతి కన్నా ఆపదలో ఆర్త రవానికి అనుస్పందన అవసరం ఆగిన రథ గమనానికి చేయి ఊత అవసరం. తెగిన బ్రతుకు సూత్రాన్ని సరిచేయడం కర్తవ్యం నేటి వస్తువు ప్రజ! మహాపాత్ర ప్రజ! చర్యతో రేపటి కథ ప్రజదే ప్రగతి చక్ర చలనంలో ఒక సంస్కృతి చెరగిపోయి మరో సంస్కృతి సమయ సమయం సంఘంపై కొత్త ముద్ర వేస్తుంది విజ్ఞానం చూపే దారిలో వివేకం గమ్యం చేరుస్తుంది. అనుభవం మనసుపై ఫిల్్మ ఫోటోలు దింపుతూంది తెలిసీ తెలీకుండా ఏ పక్షో శునకమో వానరమో పద్మమో ఫోటోలో చోటు చేసుకుంటాయి, మనిషి మనో మూలాలకు సూచికలై, ఏది ఎపుడు బయట పడేదీ తెలీదు. ఈ నిస్తబ్ద నిశ్శబ్దం సహజమైంది కాదు మారణ స్థితు లెన్నో వెను వెనుక దాచుకొందీ!

ఒకవైపు నుండి భూకంపం పెను తుపాను మరోవైపు నుండి పరస్పరాహరణం విస్ఫోటం ప్రకృతీ సమాజం రెండూ తెలిసో తెలీకుండానో మనిషికి సమయ సమయం మిత్రులూ శత్రువులూ రేపు కోతకు రాబోయే పంటపై సంతోషం కన్నా నేడు పేదరికంలో బాధ కడుపును కోసేస్తూంది. నేడు కళ్ళ నుండి రాలే వేడి కరుణ జలం రేపు పీడిత జనంలో వాస్తవ శక్తుల్ని పండిస్తుంది. ఇవే కంపనకు లయనిస్తాయో ఇవే తీవ్రతకు చేతులందిస్తాయో కారణం విధాత కాదు సమాజం, మనిషిలో మనిషి! మనిషితో మనిషి, సంఘంలో మనిషి! బాధ ఒక అస్త్రమై నిజాన్ని బద్దలు చేస్తుంది బాధ ఒక వాద్యమై కవిత్వాన్ని శబ్దిస్తుంది. ఇది మాయ కాదు! మిథ్య అంతకన్నా కాదు నేడూ రేపూ మధ్య నిజం! సమాజ శక్తుల చలనం! గాయానికి తగిలే ఎర్రని గాలి ఊహల్ని అనలమయం చేస్తూంది గాయానికి సోకే పచ్చని గాలి స్మృతుల్ని ఉల్లసితం చేస్తూంది ప్రమాదమో! అపాయమో! హృదయ మంతరిక్ష గోళాన్ని మరపిస్తూంది సమర్థుని యాత్రలో విమానయానమైనా చివరకు మిగిలేది మట్టితో బంధమే. ఫ్యాక్టరీ సైరన్ కొత్త రోజుకు ఊపిరి ఊదుతూంది స్కైలాబ్ మేధతో నిలువునా పైకెగసే విజ్ఞానం నవ జనస్వామ్య సమాజానికి ప్రేరణ అవుతూంది కంప్యూటర్తో మనిషి విశ్వరూపం ధరించినా జీవితంలో హృదయం సుస్వరత కోల్పోరాదు రైఫిల్ గొట్టం చివర తుమ్మెద వాలి లేచి తిరుగుతూంది చుట్టూ కలఝంకృతి నాదంతో గురి చెదర గొడుతూంది విజ్ఞానం మరచిన హృదయ సుమాన్ని జ్ఞాపకం చేస్తూంది. నేడూ రేపూ మధ్య స్థితుల్లో నలిగే కవి హృదయం ఉదార చరితతోఅక్షరాలకి ప్రాణం

పోస్తూంది,

సమాజాని

కాయువు

నిస్తూంది

జడం నుండి జంతువుల నుండి మనిషిని వేరు చేస్తూంది పాత వాసనల్ని మరపిస్తూంది, కొత్త జన్మకు మూల మవుతూంది.

సమాంతర ప్రతీకతో ఎంతటి మనిషీ జీసస్ కాలేడు మోసుకెళ్ళే టి.వి. కెమెరా కూడా శిలువగా తోచవచ్చు. చుట్టూ పెరిగే కొమ్మల్నీ కంటకాల్ని తొలగిస్తే నిజం అంతరంగంలో అవశ్యం బింబిస్తుంది. ప్రకృతి వైపరీత్యం, మనిషి స్వార్థ వర్తనం అడుగులు రెండూ, సృష్టికి ఇరు పార్శ్వాలు ఒకదాని తరువాత మరొకటి ఆఘాత విఘాతాలతో సమాజ రూపాన్ని గమనాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఒకవైపు నుండి కాల సముద్రం మ్రింగేయ జూస్తుంది. ఒకవైపు నుండి నీలి రాజకీయం మాయ చేయ చూస్తుంది దేశ పాలనా చక్రంలో గ్రహాలు మాటి మాటికీ కలిపి ఆడే పేక ముక్కల్లా తిరుగుతున్నాయి. చేతి గడియారంలో తేదీ, వారం మారుతూంది కాలెండర్లో వారం నెల తొలగి పోతూంది గుడిసెల్లో పేవ్మెంట్పై బ్రతుకు లెప్పటికీ ఒకటే. ఎగసి వచ్చి పక్షి అల్ప ప్రాణిని తన్నుక పోతూంది పురి విప్పిన జాతీయ పక్షి విష బీజాల కొరిగి పోతూంది మనిషి రుచి మరిగిన పులి! పొద చాటున పొంచి ఉంది శిఖరంపై నిలిచిన వ్యక్తి చేతులు చాచి మరో మనిషి శ్రమ ఫలాన్ని ఆహారించేను. రోడ్పై పగిలిన అద్దాలతో కాలిన బస్ సమస్య ముఖాన్ని వికృతం చేసి చూపుతూంది ఒక ఘటన లిప్తను అనల బంధువై రగిలిస్తూంది ఒక స్థితి అగ్నిని నృత్య భంగిలో కదలిస్తూంది. కళ్ళ నుండి జారే బిందువు బిందువులో ఆవేదన స్పందించే హృది కేభాషా భేదం లేదు బాష్ప కణం అద్దంలో స్మృతి ముఖాన్ని బింబిస్తూంది మరవలేని దృశ్యాలు స్మృతి శాలను అలంకరిస్తున్నాయి. రేపుపై విశ్వాసం పెంచుతూంది, రోడ్ ప్రక్కన చెట్ల వరస ఒకరి చేయి ఒకరు పట్టుకొనీ రోడ్డు క్రాస్ చేయ గోరే యూనిఫార్మో స్కూలు పిల్లల జట్టులా ఉంది. పట్ట పగలు అంధకార శకలాల్ని ఆనందించే వారూ ఉన్నారు

ఒక సమయం వెలుగే కాదు! అంధ ముఖాలూ పరిపాలిస్తాయి శాంతి సభలు జరుగుతున్నాయి, అశాంతి గోళాలు తిరుగుతున్నాయి ఒక సమయం ప్రజాస్వామ్యం ఇనుప పాదాలపై నడిపింపబడుతుంది. ఎప్పటికపుడు గీయబడిన రక్తరేఖలతో ఈ రోజు, మారణ చిత్రాల గ్యాలరీ వలె ఉంది. దారిన దృశ్యం, భీభత్స ముద్ర నుండి తప్పుకోలేక పోతూంది పయనం సాగే కొద్దీ మృత్యువుకు దగ్గరవుతూన్నట్లనిపిస్తుంది. ఆయుధం వహించి నడిచే వ్యక్తి గురి పెట్టడం తెలింది అమాయక ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది విధి గురించి ఆలోచన! అపుడు మొదలవుతుంది అసలు ఆయుధం ధరించే అవసరం పై ప్రశ్న ఉండనే ఉంది! ఇది మనిషిలో స్వార్థ మూలానికే కాదు, నాశన గుణానికీ చిహ్నం; మనసులో పొరలు ఆకాశం వలె ఒలిచే కొద్దీ వస్తాయి ఆటవికం నుండి నాగరకం దాకా దశ దశ లెన్నో పరిణామ దృశ్యాల్ని చూచేందుకు జీవిత మంతా చాలదు ఎపుడెపుడో వస్తాయి! భూకంపం! పెనుతుపాను ప్రకృతి చర్యలు ఎప్పటికీ ఉంది! మారణ గుణం, నీలి రాజకీయం, అణ్వస్త్ర భయం!! ఇవి సమాజ వనంలో దవానలంగా మారితే! మహాప్రమాదం! 614615 పరుగెత్తే రైలు జడ శక్తిని అనువదిస్తూంది పై కెగసే పక్షి నర శక్తిని అపహసిస్తూంది స్వార్థ చింతనలో మనిషి జడశక్తికి లోకువయ్యేను విధ్వంసమయినా కల్లోల మయినా నలిగేది సామాన్యుడే మరునాడు పత్రికలో ఫోటోలు స్వేచ్ఛకు సంకేతాలు! కూలింగ్ గ్లాస్గోంచి ప్రజల బాధల్ని చల్లగా తిలకిస్తూ జనం ముఖంపై దుమ్ము చిమ్మీ ఇంటి ముఖం పట్టేరు కెమెరా చిత్రాల్ని బంధిస్తుంది; పత్రిక లలంకరించు కుంటాయి ఏ దోషం ఎవరిదో అందరికీ హృదిలో బాగా తెలుసు ఏ దోష మయినా న్యాయాలయం ముద్రతోనే గుర్తింపు వెనుక నుండి పని చేసే ముఖాలు అంతరంగాన్ని మూసేస్తాయి. నేటి గురించి చింతతో పాటు రేపటి గురించి ఆలోచన

నేడు అన్వేషణతోపాటు రేపటి గురించి దర్శనం రేపు మనిషి సిగ్గుతో తలవంచుకోకుండా ఉండాలనే! అయితే వివేకమున్న హృదయం, ప్రయాణాని కవసరం శాసన పాలన న్యాయం పేరుతో ఆశా ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఐరావతం అశ్వం మహాపక్షి రథం రూపాలెన్నెన్నో పై నుండి అవనికి దిగాకనే కథ పరిచయ మవుతుంది కథలోకి వచ్చాకనే జన వ్యధ వినిపించడం మొదలవుతుంది అంతరంగం మంచు తెరల చాటున దాగి పోవచ్చు మందపు ఇనుప పొరల క్రింద అణగి పోవచ్చు స్వేచ్ఛలో స్వచ్ఛమైన అంతరంగం అంతరించదు దీపమై బింబమై ప్రయాణం సాగిస్తుంది. ఇది దారిలో మనిషిలో తెలివితో శిలా లోహ దారు ప్లాస్టిక్ రూపాల్లోకి మారొచ్చు అంతరంగం అందరికీ అందే వస్తువు కాదు ప్రదర్శన శాలలో నిలిపే శిల్ప ఖండమూ కాదు! గగనం నుండి వర్షధార భూమికి తెచ్చే సందేశం ఒకటే విశాల సృజన తలంపై నవసమాజ శక్తి వికాసం! అవని తనలో తొలకరి ముత్యాలు దాచుకుంటుంది మనిషి తనలో కన్నీటి ముత్యాలు బయటికి వదలేను పవనం దిశ దిశ కిచ్చే సందేశం ఒకటే ప్రాణ ప్రసారంతో సమాజం ఆయువు పెరగాలనీ, ఈ దేశ జనావాసం గుడిసెల్లో పేవ్మెంట్ పైనే ఎక్కువ ఏ రూపంలో నైతేం? అన్యాయానికీ అసమానతకూ కారణం మనిషిలో స్వార్థం. స్వార్థంలో పెరిగిన వ్యవస్థలో మనిషిని మనిషి మోసం చేసేను! మనీష నమ్మింప జేసేను. మూలమైన కోరికపై ధనం కీర్తి అధికార యుక్తులతో సమాజం అరణ్య మవుతుంది, దుర్గమమవుతూంది అరణ్యం జంతువులకూ మృగాలకూ ఆవాసమయింది. మనిషీ జీవితమూ సమాజం గురించి చర్చిస్తూంది సెమినార్ విన్నవారి మనస్సులో నిలుస్తుం దొక ప్రాణం లేని మినార్ ఇదో కీర్తి స్తంభం! నీడనూ ఇవ్వలేదు, గూడునూ కూర్చలేదు, క్రాస్ రోడ్ మధ్య నిలిపిన బుద్దుని ముఖం

చర్చల్లో తప్పి పోయిన వస్తువును జ్ఞాపకం చేస్తూంది రాత్రి అన్నిటినీ తనలోకి తీసుకుంటుంది ప్రాణినీ అప్రాణినీ రాత్రి అంటే చాచిన సుదీర్ఘ మృత్యు హస్తం కాదు అలసిన ప్రాణికీ, మనిషికీ మనసుకూ విశ్రాంతి నికేతనం ఇపుడే ప్రార్థన వినిపించదు ఏ గుడి గంటలు మ్రోగవు అంతా నిశ్శబ్దం! ఎక్కడో ఎప్పుడో ఒక శబ్దం తేలిగ్గా జారిపోతుంది. పొద్దునే వెలుగు నదిలో చీకటి కొట్టుక పోతుందనుకునేరు కాని మనిషిలో లఘిమయై ప్రవేశిస్తుంది, తిష్ఠ వేస్తుంది పదును కత్తిలా పనిచేస్తుంది! అనూహ్యంగా వర్తిస్తుంది లో లోపల వృక్షమై శాఖలతో అంతరంగాన్ని కప్పేస్తుంది ప్రతి వ్యక్తీ ఏదో నేరంలో భాగమే నేరాన్ని మరొకరి బుజాలపై వదిలేయడం సులభం అంతరంగ సాక్ష్యానికి పాండితితో పని లేదు! వివేకంతోనే పని ప్రతి మనిషికీ తెలుసు! తనలో గదిలో ప్రాక్ ప్రతిమ లున్నాయనీ వీటిని మనిషి వదల్లేడు! మరచిపోడు! ముక్కలు చేయడు! వీటిపై అనుబంధం పెంచుకోవచ్చు! ఊహలో ఆరాధన పెరగవచ్చు. నిష్క్రియతకూ జడ శక్తికీ నిలయమైన ప్రతిమల్లో వివేకం కోసం అన్వేషణ! చైతన్యం కోసం ఆవేదన! మనిషిలో భూకంపంలో, తుపానులో, పరస్పరాహరణంలో, విస్ఫోటంలో వివేకం పనిచేస్తుంది అంతరాత్మ జ్ఞాపకం వస్తుంది! గతం దారి ఆగిన విశాల నిశ్శబ్ద నికేతనం ఇక్కడ వరసగా ప్రతిమలు నిలబడతాయి పురా శిథిలాల్లో బయట పడే నిర్మాణాలు! మనిషి కలల కొకనాటి కల్పనా రూపాలు అజ్ఞానం భయం స్వార్థం ఎక్కడ బడితే అక్కడ బొమ్మలుగా మారతాయి; మనుషుల్లో బ్రతుకుతాయి అద్దాల కేసులో వ్యాపార ప్రదర్శనలో నిలిపే బొమ్మలకు హృదయ స్పందనలో ధ్వని సౌందర్యం ఎట్లా తెలుస్తుంది. ప్రకృతి విలయ హస్తం, మనిషి కుటిల పాదం ఒక్కొక్క సమయ మొక్కొక్కటి సమాజాన్ని పీడిస్తాయి దుమ్ములో బ్రతికే మనుషులు దుమ్ములో కలవడానికి ఒక విషమ లిప్త చాలు ఎంతో సమయం పట్టదు.

భూమి కంపించి బీటలతో లోయ లెదురవుతాయి తుపాను చెలరేగి నిరాశ్రయ రూపంతో జలమయమవుతుంది విస్ఫోటంలో శరీరాలు ముక్కలై దూర దూరం ఎగిరి పడతాయి ఆహరణంలో మనుషులు గాయాలతో అలంకృత మవుతారు. అంతరంగ నిష్క్రమణంతో మనిషి! జడంతో సమానం మానవతను మరవక పోయినా! ఒక దశలో శవం, సహనీయం కాదు నేడు ప్రజ చేసే ప్రజాస్వామ్య ప్రయాణం, రేపు గమ్యానికి చేర్చే అనుభవ చైతన్యానికి మూలం. నేడు రేపు మధ్య మూడో భాగం సామాజిక పార్శ్యం

1. అంబులెన్లో సూర్యుడు సూరీడు కాదు చంద్రుడూ కాదు సాక్షి ఇపుడు సాక్షి! చేతిలో టారైట్! అవచ్చు. ఆ దేహం గోడకు విసరిన రబ్బరు బంతి మోస్తరు క్షతమయిన హృదయం నిశ్శబ్దంలో మునిగింది. ఇక్కడ కళ్ళున్న మనిషి ఉన్నట్లు లేదు! అది రాత్రే! సూరీడు కాదు చుక్కలూ కాదు సాక్షి ఇపుడు సాక్షి! దారి ప్రక్కనున్న దీప స్తంభం కావచ్చు హతమయిన మానుషం నిశ్శబ్దంలో కలిసింది. ఆ దేహం జీప్ టయిర్ క్రింద గాజు బొమ్మ మోస్తరు! ఇనుప స్తంభమయినా పట్టిన చేయి తడి చప్పున వీడదు. సూరీడు కాదు గగనమూ కాదు సాక్షి! ఇపుడు దిక్కులు చూచే క్లాక్ టవర్ సాక్షి దారి ఆగినట్లుంది! కళ్ళు వాలి పోయినాయి. నేడు రేపు మధ్య నలిగిన నీలి ఘటన దృశ్యంలో వాస్తవం ఆత్మ హనన యత్నంతో అలంకరింపబడుతూంది. సూరీడూ కాదు సమాజమూ కాదు సాక్షి ఇపుడు సాక్షి! అంతరంగంలో వెలుగు మాత్రమే! నేడు రేపు మధ్య గతం అవలీలగా దూకింది. మధ్యలో తెగిన యువతి జీవితం మునిగిన చంద్ర బింబం

పొద్దునే వార్తలో న్యాయం రంగు దుస్తులు ధరించింది ఉలిపిరి మంచులో సూర్యుడు అంబులెన్సో కదలుతూన్నట్లుంది.

2. గుండెకు పచ్చదనం ఎంతటి మహానగరంలోను పొద్దునే ఎక్కడి నుండో చెట్టు కొమ్మ నుండి పక్షి గొంతు వినిపిస్తుంది. దూరం నుండి మరో పక్షి బదులు పలుకుతుంది. మనిషికి తెలీని స్పందనతో మనిషిని వశం చేసుకుంటుంది. పొగలో ధూళిలో కలకలంలో కోలాహలంలో అణగిన ప్రకృతి మూల రూపాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆర్ద్రత లుప్తమై విరామం నశించిన జీవితంలో పక్షికి నిలయమైన పచ్చదనం మనిషికీ అవసరం పక్షి రవంలో మధు ముద్ర ఉంది, శబ్ద మూల ముంది ఇది మనిషికీ మనిషికీ మధ్య స్నేహానికాహ్వానమయింది. చెట్టుపై పక్షి పలుకుతో రోజు ఆరంభ మవుతుంది. మనిషిలో గుండె బరువుతో రోజు సమాప్తమవుతుంది. మనిషిలో ఆర్ద్రత వీడని పచ్చని ఆలోచన అవసరం లేనపుడు తలకు పచ్చని పాగా ధరించే వారూ ఉన్నారు ప్లాస్టిక్ బొమ్మల మధ్య సూది మొనంత పచ్చదనంతో మనిషి హృదిలో దిగేను గగన మంత ఆనందం.620 వార్తా పత్రికలో చుట్టిన చిచ్చు బుడ్డిలా రైల్వే స్టేషన్ ముందో బస్ స్టాండ్ వద్దో రోజూ కన్పించే ఆమె మస్తకం పై

3. మానవీయ వాస్తవం పట్టపగలు సూర్యుడు వేడి కిరణాల బరువు దించుకునేను. ప్రక్క నుండి వాహనాలు దూసుకొని పోతున్నా తొలగదు! మృత్యు భయం లేదు! బ్రతుకు భయం తప్ప! చేతిలో నక్షత్రాల్లేకుండా నివాసానికి వెళ్ళితే రాత్రికి చంద్ర ఖండ మెట్లా గొంతు దిగుతుంది. మెలకువలో క్షుధా గోళమై తిరిగే జీవితం

రాత్రి ముసుగులో ఎంత సేపు దాక్కొని ఉంటుంది ప్రతి రోజు నేలపై ధూళి నుండి లేచే సరికి ఇంకో రూపంలో శూన్యం మరో జన్మ ఎత్తినట్లుంది. చుట్టూ ఉన్న పేదరికం కొందరికి ఫోటోగ్రాఫ్లో గోడ కలంకారం కావడంలో ఆశ్చర్యం లేదు తిరిగి తిరిగి విసిగి విసిగి చివరకు ఆయుధమై ఎవరికి, గురి అయ్యేదీ తెలీదు, ఉరి అయ్యేదీ తెలీదు! అక్కడక్కడా కదలుతూ బ్రతికే ఆమెలో ఇంకా సమాజం గురించి చిక్కు ప్రశ్న! మనసు కొక్కానికి తగల్లేదు ఆమెకు సమాజానికి అనుబంధం! భ్రమ కాదు! స్వప్నం కాదు వర్తమాన చరిత్రలో నేలపై నడచే మానవీయ వాస్తవం. ఏ వాల్ పోస్టర్లోనో అందాల ప్రదర్శనలోనో బొమ్మలూ చేతిలో పత్రికతోనో బ్యాగ్ తోనో రైలు దిగే బస్ ఎక్కే ప్రతిమలూ ఆమె జీవితంలో దూసే వాడి ప్రశ్నలకు సమాధానం కావు ఆమె కోల్పోయే బ్రతికే హక్కుకి ప్రత్యామ్నాయం లేదు.621

4. అదృష్ట పార్శాలు ఎక్కడో కలిసి అదృష్టం! మాట వరసకు పలకరిస్తుంది ఎంత కాలం నుండో కలవని పాత బంధువులా కనిపిస్తుంది. ఒకపుడు కన్పించి ఊపిరి ఆగేట్లు హత్తుకుంటుంది రెండు మాటలు రాలక ముందే కనుమరుగై పోతుంది మరొకపుడు కాస్త ఎడంలో త్రుటిలో తప్పుకొని పోతుంది ఇంకొకపుడు కుర్చీలోనో సోఫాలోనో ఆప్త మిత్రంలా చేరుతుంది. రైలు పట్టాలపై రహదారిపై కాలి బాటనా గాలి దారినా నాతో పయనిస్తుంది కాని, అపరిచితంగానే ఉండి పోతుంది నాతో పయనిస్తూనే హఠాత్తుగా ఎక్కడో విడిపోతుంది. ఎపుడో చకితంగా హేతువు కందకుండా ప్రత్యక్షమవుతుంది కదలని నాలోకి చేతనయై ప్రవేశిస్తుంది కదలే నానుండి అవలీలగా నిష్క్రమిస్తుంది. తలుపులు తెరచి ఉన్నా ముంగిట్లోనే వెలుగులు పరచి ఉన్నా చీకటి అంచునే కదలుతుంది

తన వెనక గ్రీష్మాన్ని మోసుకొనీ నానుండి మబ్బుల్ని కోరుతుంది తన వెంట ఆర్కెస్ట్రా శబ్దిస్తూ నా నుండి మౌనం కోరుతుంది పావురాళ్ళను ఎగరేసే బదులు నిప్పు కణాల్ని చిమ్ముతుంది వెచ్చదనం ఒక పరిమితి దాటితే శ్మశాన స్పర్శ తప్పదు కన్నీటి బిందువుల్ని వ్రేలి గోటితో మీటుతుంది నన్ను క్రాస్ చేసి ముందుకు వెళ్ళి పోతుంది అదృష్ట గమనంలో ఆలోచన వేగాన్ని అందుకుంటుంది ప్రవాహ చలనంలో నేనూ కదలి పోవడం! సహజం.622 నా కాళ్ళు శిఖరంపై పాతుకున్న వేళ్ళని తెలిసీ తెలీకా మబ్బు నుండి మెరపులా అదృష్టం నన్నెత్తుక పోజూస్తుంది నా చేతులు ప్రవాహం అంచున కదలే అలలని తెలిసీ తుపాను వెంట మబ్బులా నన్నెత్తుక పోజూస్తుంది జీవితంలో అంతవరకూ చూడబడని రూపం అదృష్టం ఎవరో కాదు! ఒకే నాణెం పై వాస్తవానికి మరో పార్శ్వం! ఆటలో ఏ ఒకరి చేతిలోనూ నిలవని బంతి! అదృష్టం ఆట ఆగదు! అదృష్టం నిలవదు! మనిషికి జిగీష సహజం! అదృష్టం మనిషి పయనంలో దొరికే రెండంచుల సాధనం తాను నరికితే ఆనందం! ప్రజ్ఞా ప్రతిఫలనం! నరకబడితే విషాదం! విధి! నేడు రేపు మధ్య అడుగువేసే మనిషి చరణం శిఖర స్పర్శ కోరుతుంది మనిషి మనో నేత్రం ఇంద్ర ధనుసు కోరుతుంది పొద్దెక్కిన కొద్దీ వాస్తవ దృశ్యాలు చూస్తుంది చీకటి రాకతో రాత్రి కల్పనకు సిద్ధమవుతుంది. ఇనుప చువ్వలా నిలిచిన ఆలోచన కూడా ఏదో ఒక రోజు పుష్పించాలనే కోరుతుంది. కవిత ఒక క్రీడ కాదు నేడు రేపు మధ్య తెరచిన కవాటంలా సమయం వీడ్కోలు మరచి పోతుంది, స్వాగతం పలుకుతుంది. సమాజ కథలో కొంత మిగులుతుంది సాయం సంధ్యలో కొంత కలుస్తుంది మరి కొంత చీకటి జలాల్లో కలసి పోతుంది

మరి కొంత రేపటికి చేతుల్ని అందిస్తుంది. సమాధుల్ని త్రవ్వీ శ్మశానాల్ని వెదకీ ప్రయోజనం లేదు కావలసిన వాటి నమూనాలు మనోంతరంలో భద్రంగానే ఉన్నాయి. నేడు రేపు మధ్య పుటలపై శబ్ద సమూహాల్ని నడిపే మానవ సంబంధాలు వేటి పనిలో అవి ఉన్నాయి లోపలి నుండి స్వేచ్ఛ లభించి బయటపడిన శబ్ద సమూహాలు కాగితంపై లిపిలో బంధితమవుతాయి పెదవులపై పాట ఎప్పటికో గాని ఎగరదు పెదవులపై మాట దూకేందుకు సిద్ధంగా ఉంటుంది నేడు రేపు కతీతంగా శబ్ద శక్తి వెలుగుతుంది. నేడు రేపు మధ్య అస్తిత్వం పుష్పమో అంగారమో! హ్లాదం ఒక వైపైతే! సంవేదన మరో వైపు ఆగిపోయిన స్వప్నం! ఓ కెరటమై లేవచ్చు అణగిన ఆదర్శం! ఓ దర్శనమై రావచ్చు. ఆశల్ని మోసే కిట్ వంటిది వర్తమానం కాలంతో స్థలంతో బంధం అనివార్యం ప్రయాణం నిలవదు! జీవన రణం ముగియదు. నేడు రేపు మధ్య మానసిక ప్రయాణం గడియారం అంకెలపై ఆరోహణతో చేతుల్లా రెండు ముళ్ళనూ పట్టుకుని సాగేను శ్రమ శిల్పికి గడియారంలో తెలిసిన అంకెలు రెండే, ఒకటి పనిలోకి వచ్చేప్పటిదీ రెండోది పని నుండి నిష్క్రమించేప్పటిదీ చంద్రు డాలస్యంగా రానీ రాక పోనీ ఫరవాలేదు కాని శ్రమ సంకేతం సూర్యుడు సమయానికి మేల్కోవలసిందే. నేడూ రేపూ మధ్య తమ అవసరాలు తీర్చే మినీ కల్పతరువు ఇంట్లో కుండీలో పెరగాలనే ప్రతి వ్యక్తిలో కోరిక ఎదురైన పుష్ప గుచ్ఛంలో దాగిన విస్ఫోట పదార్థం ఎగిరే పక్షికేం తెలుస్తుంది తన రెక్క అంచుతో గుచ్ఛాన్ని స్పృశించి వెళుతూంది. ముఖం లేకపోయినా ఫరవా లేదు కాని ఎదురుబడితే మనిషి గురి పెట్టే ఆయుధం కారాదు

ఎక్కడో దాగిన రహస్యం బాష్పకణంలో తళుక్కుమంటుంది. ఒక్కొక్క మనిషిలో ఏ తీగెనో చెట్టునో కదిలిస్తే ఒక సమయం పూలకూ పండ్లకూ బదులు నిప్పులు రాలే ప్రమాదముంది కళ్ళలో దుమ్ము చిమ్ముతూ సుడిగాలి రేగుతుంది నీడనిచ్చే తడికెల్ని అమాంతం ఎగరగొడుతూంది నేడు రేపు మధ్య భేదం లేకుండా బయట పనిచేసే బుజాలపై ఎండ ఎర్రని శాలువా వలె నిలుస్తూంది శ్రమ ముందు కాలం తలవంచుక వెళ్ళిపోతూంది. నేటి వాస్తవం నుండి రేపటి దర్శనంతో సమాజం జ్వాలయై అలయై తీగెయై జీవితాన్ని కదిలిస్తుంది రాత్రి ఎంత ఎత్తు ఎగిరినా ఎంత లోతు దిగినా మనిషి, పొద్దునే నేలపైకి వచ్చి తీరాలిసిందే వ్యక్తిలో మానవత ఉద్దరణిలో నీరు లాంటిది మనిషిలో దానవత మబ్బులో పిడుగు లాంటిది రెడ్ కార్పెట్పై నడుస్తున్నా వెనక కత్తి నిలచే ఉంటుంది స్వాగత స్వరం వెనక నిష్క్రమణ స్వరం ఉండనే ఉంది. 624625 అద్దంలో దీపం వలె కవిత వెలుగుతుంది స్పృశిస్తే కాల్చదు, సరికదా హత్తుకోవాలనిపిస్తుంది కవిత ఓ క్రీడ కాదు! విలాస యాత్ర కాదు అనుభవం దర్శనం ఒకటైన శబ్ద హృదయం కవిలో వేదన వదలిన బింబంతో బయటపడుతుంది మనిషికీ మనిషికీ మధ్య దీపం! తన ముఖం దాచుకోదు! నేడు రేపు మధ్య నిలిచిన అంతరంగ ముకురం అబద్దం చెప్పదు దీన్ని పూర్తిగా చూచే తీరిక వినే ఓపిక మనిషికి ఉందా? అని.

1. కాలం విసరే జోక్ శుష్క వదనం అపహసిస్తూంది! ఈ దరిదాపున వసంతం లేదు నాకు తెలుసు! కాలం విసరే జోక్, ఒక మృదుకఠోర వాస్తవమనీ

వర్తమానం నిప్పురవ్వల కార్పెట్లా పరచుకుంది చెదరే ఆశ వెదురు బొంగులా చీలుతుందనీ తెలుసు! చేతి నుండి జారిపడి ముక్కలైన గాజు పాత్రలా శాంతి! చేతులు చాచి ఎదురు చూస్తుందనీ తెలుసు నటనా సమాప్తిలో మైత్రి నీడలా దూరదూరం జరిగిపోతూంది ఇదో మినీ ఎడారినో! మృగతృష్ణనో! తలపిస్తుందనీ తెలుసు. ఇంద్ర ధనుస్సులా మానవత ఎపుడెంత సేపు కన్పించేదీ తెలుసు! ఇదొక ఇంద్రజాలంలో భాగం కావడం కాలం విసరే జోక్! నాకు తెలుసు, సమయం! మనిషి చేతిలో ఆట బంతి అనీ ఆడే శక్తితో పాటు నేర్పుతోనే రక్తీ విజయమా అనీ పైన కదలే నీలి మబ్బు కోసం నిరీక్షణం లేకుండా నాలో ప్రవహించే జీవనది జలధిలో కలుస్తుందనీ తెలుసు! ఊహ వెనక సముద్రం! మానసికం ; కళ్ళముందు సమాజం! భౌతికం! మనిషి అనుభవ జగత్తులో! ఈ జీవితం బింబ ప్రతిబింబ భావం! శ్మశానం తలుపు ఎన్నటికీ తెరవబడదు సమాధి తలుపు తెరచినా ప్రయోజనం లేదు! హృదయం మాత్రం నేడు చేతిలో వయొలిన్ వలె ఉంది దీన్ని వినేందుకు మనిషికి! చెప్పరాని వెల ఉందనీ తెలుసు! నాకు తెలుసు! కాలం విసరే జోక్ ఒక మృదు కఠోర వాస్తవమనీ.

3. అశాంతి ప్రశ్న మానవ సంస్కృతి చిహ్నం బమియాన్ బుద్ధప్రతిమ దేశాన్నీ కాలాన్నీ జయించే సాంస్కృతిక చేతనకు ప్రేరణం. మౌనోపదేశంతో నిలిచిన శాంతి శిఖరం చెలరేగే అలల మధ్య నిశ్శబ్ద ద్వీపం తాలిబాన్ ఆలోచనలు ఆయుధాలై ఎగసాయి రెక్క విరిగిన పక్షుల్లా క్షణాలు వాలిపోతున్నాయి హింసకు ద్వారమయిన అనాగరిక చర్యలో దెబ్బ దెబ్బకు రాలే ప్రతి ముక్కలో బుద్ధశక్తి పునర్భవం. కళ్ళలో వెలుగు పావురమై ఎగసింది ముఖంలో తేజం దిశల్లో కలిసింది. కూలిన ప్రతిమ చుట్టూ మహా సంఘ స్వప్నం జ్వలిస్తూంది

గుప్పెడు రాజనీతి మంచుకీ దోసెడు శాంతి జలసేచనకూ చిటికెడు సానుభూతి జల్లు, ఆరేది కాదీ అగ్ని! నాలుగు గోడల మధ్య తాలిబాన్ సమాజం కదల్లేని రాయిలా! సమాధితో సమానం. తలుపు మాట సరే! కిటికీ కూడ లేని మనస్సు మానవతా చరణాలపై ఇనుప సంకెళ్ళు విసురుతూంది. తాలిబాన్ వేసే అడుగులో అశాంతి జాడ ఎర్రగా కాలిన ఇనుప ముద్రను తలపిస్తూంది! మత మౌఢ్యం ఇనుప పరదావలె నిలిచింది. దిశా శాంత ముఖంపై నీలి పొగ! కదులుతూంది. ఆటవికంతో బిగించిన గాజు సీసాలా తాలిబాన్ వాలకం! జలధి మధ్య అనల ద్వీపంలా అఫ్ఘన్ స్థావరం పచ్చదనం కన్నా ఎండిన మ్రోడు ముఖాలే ఎదురవుతాయి పెను బండలు కూడా ఇక్కడి దరిద్రాన్ని తిరస్కరిస్తాయి! జీవిత కాన్వాస్పై వాస్తవం నిలువునా ద్వేషంలో ముంచిన బ్రష్ గీసిన చిత్రం వలె ఉంది. ఉద్రేకం తీగెలపై తుపాను గర్జిస్తూంది. ఉన్మాదం అంచుల్లో అశాంతి కదలుతూంది. రాత్రి వెనుక నున్న సూర్యుని గురించి కాదు చింత! ధూళి ధూమం వదలని పగటి బింబం గురించే! మనిషిలో సంస్కారం అశాంతి ప్రశ్నకు వేలాడుతూంది మనిషిలో ఆటవికం అశాంతి ప్రశ్నతో ఆడుకుంటూంది. మనసులో సద్భావన సజీవ రూపమై కదలుతూంది భౌతిక దశలో మనిషి కీర్తి శిల్పమై నిలుస్తూంది. సందర్భం అతిథివలె వస్తుందనుకుంటే హఠాత్తుగా శత్రువువలె ఎదురవుతూంది! ఆలోచన ఎదపై పూలదండ అయ్యే బదులు అంతలో కదలీ దవానలమై చుట్టేస్తూంది. తాలిబాన్ ముఖాల్లో అనల వృక్షం శాఖలు శాఖలుగా! దూరాన మంచు తెల్లని జెండా వలె ఆకర్షిస్తూంది. ఈ బుద్ధుని ప్రతిమ ఏ ఒక్కరిదీ కాదు! మానవ జాతిదీ పైన కదలే మేఘం! ఏ ఒక్కరిదీ కాదు. సమస్త ప్రాణిదీ. అవనిపై రేఖల హద్దులతో దేశాల్ని నిర్మించవచ్చు మతంతో గీసే మారణదృశ్యాల్లో శాంతిని దర్శించలేం

సమయం విధ్వంస చరణాలతో పరుగెత్తుతూంది ఇది మనిషి ఓటమిని తలపించే క్షణాల సంకలనం!

4. బ్లాక్ బోర్్డ పై బ్లాక్ బోర్డపై తెల్లని వాక్యాల వరస వయొలిన్ తీగెల్ని తలపిస్తున్నాయి ఎంతటి ఘన పండితులయినా లిపి తెలిందీ భాష తెలీందీ పామరజనంతో సమం. రోజు మొదట బ్లాక్ బోర్్డ ప్రత్యక్షమవుతుంది. దీనిపై చిక్కగా నిండుగా చీకటి ఒక ఆకర్షణ శాంత జలధిపై నావల్లా నిశ్శబ్ద గగనంలో విమానాల్లా పద వాక్య విన్యాసాలు అవనినీ అంతరిక్షాన్నీ ఆలోచనలో తేల్చేను బెలూన్కు వాహన మక్కర లేదు అది గాలి వాటును దాటలేదు ఆలోచనకు సాధనమవసరం అనుకున్న విధంగా సాగేందుకు! చాచిన కుడిచేయి ఒక దిశను చూపిస్తుంది చాచిన ఎడమచేయి మరో దిశను చూపిస్తుంది రెండు రేఖలూ కలిసే చోటు సాధ్యమే సాధ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది వివేకం! బ్లాక్ బోర్్డ ముందున్న మనసుల్ని కాంతి స్పృశిస్తుంది ఊహలో సింహంలా దూకొచ్చు, జింకలా ఎగరవచ్చు. పదం వెనక మరో పదం వాక్యం వెనక మరో వాక్యం లోలోపల ఏముందో తెలుసుకోడానికి సముద్రంలో చేపలా ఈదాలిసి ఉంటుంది. అన్వేషణతో కిరణంలా సంచరించాలిసి ఉంటుంది. ఒక ముఖంలో మరో ముఖం! ఒక్కో కోణంలో ఒక్కో వాలకం. ముందున్న కిటికీ నుండి చూస్తే శిఖరాలతో జీవితం శిఖరానికీ శిఖరానికీ మధ్య పైకి కన్పించని లోయలు! వెనకున్న కిటికి నుండి చూస్తే అలలతో సమాజం

సముద్రం అలలపై ఆతపంలో ఆవిరితో మార్పు సహజం. బ్లాక్ బోర్్డ కూ చాక్ పీస్ కూ ఏ లిపి భేదం లేదు. కాంతికీ కరానికీ పగలూ రాత్రీ భేదం లేదు. గదిలో విద్యుత్తు నిలిచిపోయిన సమయం చీకట్లో టేబిల్పై చేయి! పేపర్ వేటా న్నూ అగ్గిపెట్టెనూ సులభంగా గుర్తిస్తుంది. బోర్డపై ప్రతి పదాన్నీ చూచే ఓపిక ఉండాలి కాని కిటికి నుండి జనదృశ్యాన్ని చూచే తీరిక ఉండాలి కాని, ఇది అంతం లేని అనుభవ గ్రంథం, ఏ రోజుతోనూ సమాప్తి కాదు. బ్లాక్ బోర్్డ మొదలయిన రోజు వాక్య దర్శనంతో ప్రకాశిస్తుంది.

5. ప్రజాస్వామ్య వాస్తవం ఏ శకమయినా శతాబ్ది అయినా మానవజాతి సారబింబం మనిషిలో ప్రవృత్తి ఎప్పటిదే ఇతివృత్తం మాత్రం కొత్త! సమాజంలో వ్యక్తులు భావజాల నిర్మిత ప్రతిమలు ఒక దశలో ముక్తమై స్వాతంత్య్రం పొందేరు అంతరంగ ప్రేరణ లేంది ఎక్కడ వేసిన అడుగు అక్కడే. ఆలోచన చలనంతో అనుభవం సౌందర్యంతో స్వేచ్ఛాయతనంతో ఎవరి జీవితం వారికో ప్రియమైన సమాజ ప్రయోగశాల మనిషికీ, మనిషికీ మధ్య స్వార్థం ఒక బిగిసిన మంచు గోడ! ఏ గోడల్లేని సమాజంకై పరితపించే వారు ఉన్నారు ఋషులూ కవులూ తాత్త్వికులూ రాజనీతి దర్శకులూ ఒకరిపై బరువు దించీ, మరొకరి బరువునెత్తుకొనీ సాగే పయనం ఎక్కడికక్కడ ముగిసినట్లే ఉంటుంది కాని, దాటేది మజిలీ మాత్రమే భయం నుండి భయంలోకి గమ్యం నుండి గమ్యానికి గది నుండి గదిలోకి ఊరు వదలి మరో ఊరు గన్పాయెంట్◌ూ కొంత దూరంలో మనిషికీ మధ్య నేలపై నెత్తురు మరకల్ని తుడిచే కర్చీఫ్ మంచు తెర గురికి అడ్డంగా వచ్చి నిలుస్తుంది, మనిషి హక్కును తళుక్కుమనిపిస్తుంది.