Aavahanam — Volume I — Swecchaa Kavitvamu

ఆవాహనం — స్వేచ్ఛా కవిత్వము — మొదటి సంపుటం

1973 · Telugu (te) · 59 pages · Human-proofread

II. ఆవాహనం

(1973) మాదిరాజు రంగారావుభిన్నంగా ప్రత్యేకంగా ప్రతి యుగంలో సమయ సమయం వ్యక్తిత్వం ఉన్న కవి అప్పుడున్న దానికన్నా భిన్నంగా ప్రత్యేకంగా సృజనాత్మక శక్తిని ప్రదర్శించడం కన్పిస్తుంది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఎన్నో విషయాల సమాహారంగా సంక్లిష్టతను పొందే నేటి సమాజంలో ఈ లక్షణం మరీ స్ఫుటంగా కన్పిస్తుంది. మనిషీ, వ్యక్తీ, కవీ అనే మూడు అంశాలు కలుస్తూ విడిపోతూ మళ్లీ కలుస్తూ ఇట్లా జరుగుతూ ఎప్పటికపుడు ఏర్పడే సామాజికమైన ఆస్తిత్వం విశిష్టమైన రూపాన్ని పొందుతుంది. ఈ మూడు వేరు వేరు పరిధుల్ని కలిగినవైనా సృజనాత్మక రూపంలో అనుకోని అనుకోకుండా వివిధాంశాలతో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఆవిర్భవిస్తాయి. కవి దర్శన శక్తితో వీటికో అపూర్వమైన శోభ సంక్రమిస్తుంది. ఇది ఉన్నత స్థాయికి చెందింది. ఈ స్థాయికి క్రిందనున్నవి సాధారణమైన ఆకర్షణలతో అలరిస్తాయి. పై స్థాయిలో సామాజికం, మానసికం సృజనాత్మకం అనే స్థితులు నిరంతరత ప్రవాహశీలం కలిగిన సంక్లిష్ట రూపాన్ని పొందడం జరుగుతుంది. దీని రామణీయకత ఆంతరమైంది. ఇది ఈనాటి వైవిద్యోపేతమైన జీవితంలో ఎదురయ్యే వాస్తవ శక్తులతో రూపొందే సంక్లిష్ట సమాజాన్ని భావింపజేస్తుందే తప్ప వేరు కాదు. సృజన కర్తలందరూ తమ ఆదర్శాల కనుగుణంగా సమాజ నిర్మాణాన్నీ వ్యక్తి అస్తిత్వాన్నీ తమ ప్రభావ ముద్రతోనే ఆవిష్కరిస్తారు. ప్రజాస్వామ్యం ఈ విధమైన ప్రకటనా స్వేచ్ఛ కలిగింది. చారిత్రక కర్తవ్యాన్నీ సామాజిక బాధ్యతనూ తలపుకు తెస్తూనే వ్యక్తి గౌరవాన్ని కాపాడుతుంది. మరో విధంగా సమాజ వికాసానికి చోదకశక్తిగా వ్యక్తి పరిణతికి ప్రేరక శక్తిగా ఉంటుంది వీటిని సాహిత్య విమర్శలో సకారాత్మకంగా అన్వయ గుణంతో విశ్లేషించి వివరించవలసిన అవసరం ఉంది. స్వేచ్ఛా కవిత్వం అనేది వచన పద్యం, వచన గేయం, ముక్తచ్ఛందం, వచన గీతం, స్వచ్ఛంద కవిత్వం, వచన కవిత్వం మొదలైన వాటి కుండే పరిమితుల్ని తనలో అంతర్భవించుకున్న విస్తృత రూపం. ఈ సంకలనం ఆధునిక యుగంలో అనివార్యంగా కన్పించే నిరంతర పరిణామ శీలంతో భౌతిక చిత్రణంతో మానసిక ప్రకాశనంతో పరివర్తన లక్ష్యంతో ప్రగతి ప్రవాహకత్వాన్ని పొందే సంక్లిష్టమైన స్వేచ్ఛాకవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూంది. ఈ విధంగా భిన్నమైంది ప్రత్యేకమైందీ ఆవాహనం ప్రజాస్వామ్యనిబద్ధమైందీ. 26-03-2003 మాదిరాజు రంగారావు అంకితం స్వాతంత్ర్యం సాహిత్యం రెండు కళ్ళుగా

పయనించే మానవతా సమాజ హృదయం శ్రీ ఎం. ఎల్. నరసింహారావు అన్నగారికి సూచిక 1. అవాహనం పుట 2. పాత్రను విస్మరించలేను 3. అనుబంధం 4. ఒకటైన 5. కాలం గురించి 6. దేవుడైనా 7. నాముందూ వెనకా 8. నాలో బ్రతికి 9. భగవంతుడు 10. మబ్బువిరిసే 11. అంతమవని కథ 12. అంతమవనిరాత్రి 13. ఎవరది దూరంగా 14. ఎవరు మీరు 15. కత్తుల్లా వత్తుల్లా 16. కాంతి సింహం 17. కీర్తి స్తంభాలు 18. తెలుసునాకు 19. నిప్పుపూలు 20. పిస్టల్ పేల్చిన

21. మరవ లేని గాలులు 22. మూసుకున్న ఐదు వేళ్ళు 23. మేల్కొని ఉంటాను 24. రా ! రాత్రి అయి 25. రెక్కలు దాల్చిన కొండలు 26. విదూషకపాత్ర 27. వయొలిక్ పై పుట 28. శ్వేతేతర విహంగాలు 29. సముద్రం బింబిస్తూంది 30. స్నేహవీ చి 31. హృదయంతో మాట్లాడే 32. ఛాయ 33. ఆత్మబంధువు 34. ఇల్లే పదిలం 35. గాజుగది 36. చస్తూ బ్రతుకుతూ 37. దారి కడ్డంగా 38. దుమ్ములో 39. పతాకవార్త 40. పేరు జ్ఞాపకంలేదు 41. అగ్నిగానం 42. ఆసమయంరానీ 43. ఇరవై ఒకటో శతాబ్దిలో 44. ఆ ఎడారీ అడవీ 45. ఈ గీతం 46. యుగసంకేతం 47. చీకటి వెలిగించిన వార్త 48. దేవునితో గోష్ఠి 49. నగరంలో ఉదయం 50. నవ్వుతూంది వెలుగునాలో 51. నిజం చెప్పు 52. లౌకిక శ్రీ 53. మనరూపం మహీయం

54. వియత్నాంలో అమెరికావలె పుట 55. శైశవం 56. సామాన్యుని వాస్తవం 57. కదలండి శతఘ్నులవలె 58. హిమజ్వాల 59. కంపనం ప్రకంపనం 60. ప్రవాసం ఆవాసం 61. భవితవ్యం 62. జీరో జోన్ 63. అవకూడదు జ్వాలాచిత్రం 64. ఈ ఉగాది మొదటి రోజు 65. ఉగాది అడుగు పెట్టింది 66. రానీ మరోజన్మ ఈ ఉగాది 67. ఉగాది రావలసిందే 68. ఈ ఉగాది నాడైనా ఏ దిశ నుండైనా భావించకు వచ్చేనని నభోమణి. సర్వం బూది చేసి ఆశించకు చూసేమని వసంతం క్షణాలు మండుతున్నాయి చిత్రిస్తూ సంస్కృతీ దర్పణం మంటలు ఎగురుతున్నాయి కొలుస్తూ జీవిత గగనం.

1. ఆవాహనం కళ్ళలో అంగార శిఖలతో ఊహలో కంకాళ మాలతో కలలో విప్పిన పడగలతో గతిలో తూగే మృత్యువుతో నాల్కనుండి జారే సూదులతో వచ్చేవా వీధిలో శిశిరమై అనల రుచితో దహన మతితో కదిలేనా నవవసంతంకై సమాజం గాలీ వెలుగూ నీరూ అయినట్లు సృజన శక్తి రూపాలు మాట ఊహ వర్తన అవాలి శక్తి నిలయాలు బ్రతుకులో మరుగున పడిన ఆనందం రానీ బయటికి మనసులో అడుగున పడిన సత్యం రానీ చీల్చుకుని వినేవా ? సంగీతం విన్నదే చూచేవా దృశ్యం చూచిందే ఇంత వరకు విను ! వినందీ, కను ! కనందీ ! మనసులో అంతర్గతితో ముఖంలో శాంత తేజంతో

చెట్టుపై నీటి పై గాలిలో అవనిపై అంతటా రవిత తేజం ఊహలో మాటలో వర్తనలో రానీ సమ సమాజ వాసంతం మానవ తేజం నుండే వస్తుంది మహోదార సంస్కృతి ఆవాహన చేసికో నీలో శిశిర నాశన జనస్వామ్య రాగం ప్రగతి కాంతి పరిష్వంగం కోరే జనగణ దీన హీన హిమ శిలా శ్రేణులపై చరించే నేను ఎవర కోసమో జోల పాట పాడలేను క్షమించాలి వెలుగు పాత్రను విస్మరించ లేను తలెత్తే వెలుగు పై కత్తి పోటుకు చీకటి పొంచి ఉంది ఎడారి హృదయ భూమితో బికారి ముఖ గగనంతో ఎవరు వీరు! దూరంగా మాసిన దుస్తులతో చుక్కలవలె పూర్వపు రాత్రి స్మృతులు చిమ్మికొని వస్తున్నాయి పైకి! ఉదయం వస్తుంది ఉదార చరితుని వలె వెలుగులు వస్తాయి ఎడారి పై కెరటాల వలె కళ్ళలో కలల బొమ్మలతో ఊహలో పూల సింగిణులతో జీవితం మాత్రం వివిధ శక్తుల రణ వర్తన సంకులం! దుఃఖంతో వేదనతో నిండిన రాత్రి పై జాలి ఉంది సుఖ సంతోషంతో వచ్చే ఉదయం పై కోపం లేదు వెనకనే అజ్ఞాన విహంగం చీకటి రెక్కలతో ఉంది భయం తుపాను తలపిస్తుంది, మృత్యువు ఆలస్యం అంతే చిమ్మిన నెత్తురు గీతల్లో నుండి క్రమ్మిన పొగల సెగల్లో నుండి వెలుగు రూపం కోసం మనిషి పయనం సాగుతూనే ఉంది. మతాల విచ్చు కత్తుల మెరపుల్లో బ్రతుకును వెలగించ లేను ఇజాల చిక్కుటుచ్చుల తలపుల్లో హృదయాన్ని బంధించలేను తుపాను గాలి కెవరికి వారు భయపడుతూనే ఉన్నారు. సముద్రం ఉప్పొంగి క్రమ్మేస్తుందనీ అంతా శంకిస్తున్నారు అశాంతి నెవరూ కోరరు! శాంతి ఇంతలో చిక్కేట్టు లేదు విషమ స్థితిలో మనస్సు భావిస్తోంది మరో సృజన రూపం వర్షా జల సేచన కోరే గ్రీష్మ శిఖరంపై ఉన్న నేను બે ఎవరి కోసమో ఈల పాట వేయలేను ప్రతి వ్యక్తీ పాత్రకు సిద్దమైన జనస్వామ్య రంగంపై క్షమించాలి నేను వెలుగు పాత్రను విస్యరించ లేను

2. పాత్రను విస్మరించలేను ప్రగతి కాంతి పరిష్వంగం కోరే జనగణ దీన హీన హిమ శిలా శ్రేణులపై చరించే నేను ఎవర కోసమో జోల పాట పాడలేను

3. అనుబంధం నది అంటుంది సరస్సుతో “నీవూ నేనూ ఒకే కోవ” అనీ సముద్ర మంటుంది మేఘంతో “నీవు ! నేను విడిచే నిశ్వాసం” అనీ దీప మంటుంది సూర్యునితో "నీవూ నేనూ బంధువులం” అనీ నది అంటుంది ఆకాశంతో 'నీవూ నేనూ అన్నదమ్ములం' అనీ పదార్థ మంటుంది అణువుతో 'నీవు నాలో భాగమే' అనీ ప్రాణ మంటుంది గాలితో 'నీవూ నేనూ ఒకటేనా ?" అనీ ఎక్కడుంది భేదం ? రూపంలోనా ? ఎక్కడుంది సామ్యం ? భావనలోనా ? దేని రూపం దానిదే ప్రయోజనచిహ్నంతో, దీనితోనే దేనిదైనా వ్యక్తిత్వం అవసరంపై ప్రతిదీ కలుస్తుంది తనలో కలుపుకుంటుంది ప్రయోజనంతో ప్రతిదీ వీడుతుంది అస్తిత్వం వేరౌతుంది అయినా అనుబంధం తప్పదు ప్రకృతిలో ఏమైనా చివరకు దేని దారి దానిదే

4. ఒకటైన రెండు రెండు గదుల్లో రెండు ఆకృతులు ఇప్పట్లో కలవనివీ ఎప్పుడైనా కలవాలని ఎంతో తాపత్రయం పడేవీ మూసిన తలుపు సందుల్లో నుండో కిటికి రెక్కలు తెరిచో అపుడపుడూ ఒకరి నొకరు తలపులు విప్పి చూచుకునేవీ కాసేపు ప్రేమ ఒలుకుతుంది, కాసేపు ద్వేషం పొంగుతుంది ఒకటి కిటికీ వద్దకు చేరితే ఎపుడైనా మరొకటి చాటున చేరేను కన్పించకుండా’ బయట పడే కోరికతో ఒకటయ్యే ఆశతో ఏ సముద్రమూ ఆ హృదయంతో సరికాదు ఏ ఆకాశమూ ఆ హృదయాన్ని కొలవ లేదు. సూర్యుడు వెలుగు కళ్ళు తెరచిచూచేసరికి

చీకటి గది చెదరిపోయింది. సరే! మంచు పొర తొలగింది

5. కాలం గురించి మాట్లాడకు ! కాలం గురించి మాట్లాడకు దాని చావు దాన్ని చావనీ తలిస్తే చాలు ! తలుపులు తెరచుకొని వచ్చేస్తుంది పిలిస్తే చాలు ! ఎదురుగా పీట వేసుకొని కూర్చుంటుంది కాలం గురించి యోచించకు దాని బ్రతుకు దాన్ని బ్రతకనీ కాలం మౌన శంఖం, దీన్ని ఊదితే వినిపించే ధ్వని, ఈ మాట ! ఈ పాట ! మాట ఊహకు ప్రతీక ! పాట అనుభూతి మరీచి మాట ఉందే చివురాకు ! పదునైన కత్తీ ! పాట ఉందే పుష్పం ! అంగారం. మాట చెప్పలేని దాన్ని మౌనం చెబుతుంది సుందరంగా జ్ఞానానికి దూరంగా వివేకానికి దగ్గరగా తన చుట్టూ తాను తిరిగే జీవితంలో అనుభవాలు కరగిపోతూంటాయి కాలాని కంతం వూహించలేనట్లే జీవితానికీ అర్థం నిరూపించలేం అర్థ రహితంగా పరచుకొన్న ఆకాశంలో అర్థ సహితంగా వెలుగుతాడు చంద్రుడు కాలం మాట మరచి ఈ వేళ నిశ్శబ్ధంగా చీకటితో పోరాడే వెన్నెల గురించి ఆలోచిద్దాం కాలం గురించి మాట్లాడకు దాని చావు దాన్ని చావనీ కాలం గురించి మాట్లాడకు దాని బ్రతుకుదాన్ని బ్రతకనీ చినుకు పడింది సముద్రంలో దాని లోతు తెలుసుకునే కోరిక కలిగింది జలధిలోని ఉప్పన సహించలేక పోయింది గాలి విసురుకూ నిల్వ లేక పోయింది

6. దేవుడైనా సరే తన కోరికగాలికి వదలింది చూచింది బయటికి రావాలని సతమతమై చివరకు సముద్రంలో కలిసింది. ఆలలో ఒకటై చలనంలో పరవశించింది

గ్రీష్మం వచ్చింది అర్చావహ్నులతో, భీషణంగా జల బిందువు లావిరులైనాయి మారింది కరాళ ఋతువు వచ్చింది ప్రమీల సమయం చినుకు పడింది సముద్రంలో దాని లోతు తెలుసుకునే కోరిక కలిగింది మార్పులో నశించిన స్మృతి తిరిగి ఊర్పు తీసికొనేనా ? స్మృతి నిలిచేనా? మార్పు నాపగలిగేనా ? ఆఖరికి దేవుడైనా సరే ! జలధిలో కెరాటాలతో ఘర్షిస్తూ నౌక వలె

7. నా ముందూ వెనకా తుపాను గాలుల్లో వణకుతూ వృక్షం వలె ఉన్న నన్ను చూచావా ? వేడి నిట్టూర్పులు విడుస్తూ గ్రీష్మంలో అవని వలె వడ గాడ్పులకు కనలుతూ చేతులెత్తిన వృక్షం వలె ఉన్న నను చూచావా ? నిశ్శబ్దం గుండెపై అడుగేస్తూ నేను నడిచినపుడు నడుస్తూ నాతో మెలకువకూ నిదురకూ మధ్య రూపంతో ఉన్న నిన్ను చూచాను ! సూత్రానికి వ్యాఖ్యానం వలె అవరించిన ఆకాశాన జలదంలో మెరపు వలె జలదరించే ఊహలో నిన్ను చూచాను లిప్తను క్రమిస్తుంది లిప్త, శక్తిని హరిస్తుంది శక్తి రాలే ఆకూ పూవూ పండూ కాల గతిని జ్ఞప్తికి తెస్తాయి నా వెనుకే వెలిగే స్ఫుటంగా దీపాన్ని బింబిస్తూ నా ముందు మెరిసే అద్దం వలె ఎవరు నీవు ? నాలో గగన రూపమేనా ! నేను నీకు దూరమవుతున్నానా ? లేదు !

8. నాలో బ్రతికి ఉన్నట్లే నా వెనక వట వృక్షానివి ! నా ముందు నిశ్శబ్ద రేఖవు నీ ప్రత్యక్షంలో నా పాత్ర గమనం మరచి పోతాను తెలీనితనం తెలీకుండా తెలీని మలుపుల్లోకి తెలీని వానికి మల్లే తెలీకుండా తీసుక వెళ్ళుతావు ఏదో విశ్రాంతికై కొంత సేపు నామ మాత్రం నిలిచే నివాస యోగ్యంకాని ద్వీపానివి కదూ ! ఇపుడు నీకు పెద్ద తనం వచ్చింది నాకు చిన్నతనం పోలేదు నీవు కదలవు పర్వతం వలె నేను నిల్వలేను ప్రవాహం వలె

తలుపులు తెరచిన ఖైదులో ఖైదీ వలె నీవు కన్పిస్తావిపుడు ముఖంలో హ్లాదంతో శిరస్సు పై ఉష్టీషంతో చేతిలో కృపాణంతో కాలం ఇక కన్పించదు ! చేతి కర్ర మరచి పోకు ! "కుక్కలున్నాయి జాగ్రత్త” నీవు నా నుండి దూరం కావు నేను నీ నుండి దూరం కాను నేడు నీవు స్మృతిలో నిలిచేవు రేపు మేం స్మృతిలో మిగిలేం నీవు దూరమయ్యేవా ? ఏదీ నా ముఖం లోకి చూడు ఈ పోలిక లున్నంత వరకూ నీవు నాలో బ్రతికి ఉన్నట్లే!

9. భగవంతుడు విడిది చేసిన లిప్త భూమి నుండి ఎగసీ నిశ్శబ్దం నిలిచి ఉంది స్తంభం వలె అమూల్య నిధి పోగొట్టుకున్న ముఖం వలె ఉంది వాతావరణం వాలిన బరువు హృదయంతో తెరచిన నక్షత్ర నేత్రాలతో కాలం ఒడిలో పడుకున్న రాత్రి మృత్యు రూపం బింబిస్తోంది నీల జలధి తరంగం వలె ఎదురౌతూంది ప్రతీ క్షణం పెదవులు విప్పలేని పూలు మౌన శిఖల వలె ఉన్నాయి. దుఃఖం ప్రవహిస్తూంది శీర్ణ నది వలె సుఖం బిగిసి పోయింది మంచు గడ్డ వలె కొడిగట్టిన దివ్వె వలె ఉంది ముఖం సన్నని వస్త్రం వలె గాలి దేహాన్ని ఆలంకరింప జూస్తుంది. అంతలో జారి పోతూంది, కదలిపోతూంది. ఊహలో తిష్ఠవేసిన రాత్రి బ్రతుకును పాలిస్తూంది. ఈ చీకటి దారుల్లో ఈ విషాదచ్ఛాయల్లో నలుగురితో పాటు తిరిగే గాజు ముక్కల బొమ్మ లేరుకొనీ అందమైన రంగు రంగుల రాళ్ళతో జేబులు నింపుకొనీ చుక్కలు విరిసిన చీకటి చెట్టు క్రింద విశ్రమించా నా ఫాలనేత్ర కపోలా ధరాల్ని వెలుగు వ్రేళ్ళుచాచి, స్పృశించే అమృత మూర్తి ! ఎవరీ మౌన దీపం రాత్రి ఎదపై జ్యోత్సాకృతి ! మనోభూమికలో జ్యోతిర్మతి నా ఎదుట నిల్చిన రాత్రి నిశ్శబ్దంగా కరిగిపోతూంది. ఇది కల కాదు కదా ! ఎవరి మాటో అట్లా ఉంచి ఇపుడు నా రూపం నేనే గుర్తించ లేనట్లుంది. అమృత సరస్సుల వంటి ఆ కన్నుల్లోకి సూటిగా

తప్పని మరణ సూచికల వంటి నా చూపులు ప్రసరించి కలిసినపుడు ! ప్రళయ స్థితి వచ్చి పడుతుందనుకున్నా. కాని, సుగమ సుందరంగా అవతరించింది మరో సృష్టి ఇది! భగవంతుడు విడిది చేసిన లిష్ట ! వెలుక్కి మనిషి అంటే ఎంత ప్రియం !

10. మబ్బు విరిసి కురిసే వేళ మబ్బు విరిసి కురిసే వేళ మెరపు మొలక నవ్వులతో నీవు పూల రెక్కల ఊహలతో వర్షాఝరీ గమనంతో అవతరిస్తావు నాపై ఒదిగి పోయి పరిమళ వీచిక వలె ఊహలో పరచుకొనీ గగన హృదయం వలె ఊహల ఆకుల చాటు నుండి శబ్ద విహంగమై వచ్చి నీలాకాశం వంపుల్లో సుందర జీవిత దృశ్యంలో సౌందర్య జ్వాలతో విచ్చిన శత పత్రమై కన్పిస్తావు. పూర్వ స్మృతుల సౌరభంతో అవనియై భవిష్యత్తు కల్పనా చిత్రంతో గగనమై మబ్బు విరిసి కురిసే వేళ, అగ్ని బీజ హాసంతో వర్తమాన దిశలో సృజన ప్రకృతివై కదలుతావు మానవ ప్రస్థానంలో మజలీ మజిలీలో అన్వేషణ అన్వేషణలో నిరంతరం మారే రూపానివి ! భూమి తిరుగుతూంది, భూమిపై కదలే మనకు దివా నిశా రూపాల్లో రవి చంద్రుల చలన భ్రాంతి ప్రపంచం ఆకర్షిస్తూంది, ప్రపంచంలో బ్రతికే మనపై త్రివర్గ రూపాల్లో త్రికరణాధికార ప్రభావ ముద్రలు మనోనేత్రం విప్పి చూస్తే ఈ ప్రపంచం శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షం. పైన ఎక్కడో అదృశ్యంగా పాతుకుపోయిన వేళ్ళతో క్రింద కిసలయ పత్ర పుష్ప ఫలవితతి తో ఆకుల కదలికలో సంగీతం! కూర్పులో చిత్ర కళ !

11. అంతమవని కథ ముండ్లు, తుట్టెలు, పురుగులూ ప్రాణం ప్రక్కనే మృత్యువు

గగనంలోకి చొచ్చిన శిరస్సు నుండి జారిన చీకటి జడలు తరగలుదరిపడే కడలి వలె సనాతన వృక్షం పైకి మనిషిని భయపెడుతుంది లోన మనసుకు ప్రియమైందీ. ఈ చెట్టు కొమ్మల్లో గూళ్ళు కట్టుకొని పక్షులు దప్పికతో పిడచకట్టిన నాల్కలతో తపించేవీ చలికి ముడుచుకున్న శరీరాలతో వణికేవీ తడిసి ముద్ద అయి వెచ్చదనం కోసం వగర్చేవీ వసంతం కోసం కలతో ఆశతో బ్రతికేవీ ప్రకృతిలో అవరోధాల్ని నిరోధిస్తూ ఘర్షిస్తూ లంఘిస్తూ లొంగుతూ జయిస్తూ జీవ యాత్ర సాగిస్తూంది ప్రాణికోటి. అనుభూతి సమార్ధమై హృదయం, అనుభవ పక్వమై మనస్సు తుపాను రాత్రి నెదుర్కొనే మహానది వలె ఉదయారుణ రూపంతో జీవితం అన్నిటికీ సంసిద్ధం ! ఈ చెట్టు నీడలో ఒక్కసారి అద్దంలో చూచుకుంటే ! మనిషి ! ముఖంలో ఎన్ని పొరలు ఎన్ని తెరలు ! వాటి వెనుక ఎందరు ! దేవతల రాక్షసుల దృశ్యాలు ! వాటి చాటున ఎన్నెన్ని జంతువులు మృగాలు ! విపరీత తత్త్వాలు ఈ కళ్ళు, చెవులు, మనస్సు! వాటి సేవకులూ అనుచరులేగా ! ఆత్మ నావరించిన ముసుగుతో మనిషిలో వ్యక్తిత్వం ఇంతటిదా ? అంతటిదా ? ఎవరికీ అందనంతటిది ! ఎన్ని సాహస కృత్యాలు చేయించింది ? ఎన్ని నాగరక రీతులు నిర్మించింది ? ఈ ముసుగు లేకపోతే మనిషి ఏ స్థితిలో ఉండేనో ? శిలగానా ? కలగానా ? చీకటి ముద్దగానా ? రేఖలతో చిత్రమేర్పడని వెలుగు బిందువుగానా ? నీల దుకూలం కప్పుకుని వస్తుంది రాత్రి ఆకాశం వంగి విశాల పృథ్వీ ఫాలం చుంబింపజూస్తుంది చెట్టు క్రింద చీకట్లో రెప్పలు వాలి మనస్సు విశ్రాంతి కోరుతుంది. ప్రకృతి చలనంతో మనిషి గమనం! గమనంతో జీవితం ! వెలుగులో చెట్టు క్రింద రెప్పలు విప్పి మనస్సు వ్యాపార నిమగ్న మౌతుంది బంగరు పూల తెల్లని పట్టుశాలువాతో వస్తుంది ఉషస్సు దిక్కుల దృక్కులు చెమ్మగిలి మధు పరాగ కింజల్కాలౌతాయి పృథ్వీ హృదయం జీవకోటిని గుండెకు హత్తుకుంటుంది

గగన హృదయం జీవరాశిని చూచి పరవశిస్తుంది ఒక్కొక్కలిప్త ఒక్కొక్క కిరణం వలె వెలిగి కాలం దీర్ఘ కిరణ తోరణ మౌతుంది ఒక్కొక్క ఊహ ఒక్కొక్క పుష్పంవలె వికసించి మనస్సు మధు పుష్ప దామమౌతుంది బయట మంచు తొలగి పోతూంటే లోపల మసక తెరలు జారిపోతాయా ? రవి అంతటా వెలుగు వీక్షణాలు ప్రసరిస్తున్నా భువిపై స్వర్ణ పథా లందరికీ లభించవు నాగరక సంపన్నంగా ఎదిగిన ఈ వృక్షాన్ని వదలగలమా ? నిదుర పొరల వలె ఆవరించే దీని నీడల్ని మరవగలమా ? పగిలిన గాజు వస్తువుల ముక్కలు! నేలపై కదలే మట్టి బొమ్మల రీతులు ఎదురుగా ! ఈ ఆవరణంలో ఒకటేమిటి ? ఎన్నెన్నో ధ్వనులకూ ! ప్రతిధ్వనులకూ ! రూపాలకూ ప్రతి రూపాలకూ అంకితమైన బ్రతుకులో అహి వలె చుట్టుకున్న అహంకారం అడుగునున్న అంతరాత్మ తెలిసేనా ? సంకల్ప వికల్పశక్తి గల మనిషైనా స్వార్థంతో నిశ్చయ వివేక స్ఫూర్తి గల మనిషైనా ప్రయోజనంతో ఈ చెట్టు నీడ తప్పదు ! ఈ జీవిత స్వప్నం తప్పదు ఇదో ! మొదలు తెలీని, ఓ అంతమవని కథ ! ఆత్మలు ముడుచుకొని పడుకున్నాయి శవాలు లేచి తిరగడ మారంభించాయి శూన్య భాండంలో ఒక్క మధు బిందువు ఒలికినట్లు జలధి తీరాన చూపులో ఒక నావ కన్పించినట్లు ఈ రాత్రి అంతమవుతుందన్న శుభవార్త !

12. అంతమవని రాత్రి గాలికి రాలే ఆకుల వలె ఊహలు సాగిపోతున్నాయి ఎవరి కోసం నిరీక్షణ ? ఎవరు వస్తారీ సమయం ? ఎవరో అమృత మూర్తి వచ్చి ధైర్య మిస్తారనే ఆశ! అయితే ఆ వచ్చే దెవరు ? శవాల సోదరులు ! ఆ నీడలా ! పగిలిన అద్దం ముక్కల వలె స్వప్నం చెదరి పోతూంది

ఇపుడే రూప రేఖలు స్పష్టంగా కన్పించడం లేదు నిదుర వస్తే హాయిగా ఉంటుంది ! ప్రపంచాన్ని మరచి పోవచ్చు కాని ప్రపంచాన్ని మరవాలనుకోడం పిరికితనం ఉదయం కన్న ముందుగా శవాలు లేచి తిరుగుతున్నాయి నేను నవ్వి ఊరుకునే కన్నా చేసే దేముంది ? రాత్రి అసంఖ్యాక తారకల నుండి జారిన వెల్గులు శరీరాల్ని తాకి ప్రవహిస్తున్నాయి ఈ ప్రపంచం నాదై నాది కాదన్నట్లుంది చీకటిలో కొంతభాగం ! వెలుగులో కొంత భాగం ! ఉన్న ఒక్క సత్యం - సూర్యుడు, ఆశలో పాతేయబడీ ఉన్న ఒక్క చైతన్యం, కాలం చీకట్లో బంధింపబడీ ఉన్న ఒక్క ఆనందం ఇంకా చీకటి తెర వెనకే ఉంది. అంధకారంలో కన్పించనివి వెలుగులో దర్శనమిస్తాయి కొత్త ఎక్కడుంది ? ఉషస్సు వెలుగు చూపులో తప్ప ! మానవత ఎక్కడుంది ? మనిషి ఆర్థ భావనలో తప్ప ఎవరికి వారే మేల్కొన్నట్లు ప్రక్క వారిని ప్రబోధిస్తున్నారు మనిషి ఎప్పుడు మేల్కొనేను ? మనస్సు ఎప్పుడు ఉషస్సు చూచేను ? ఆత్మలు ముడుచుకొని పడుకున్నాయి శవాలు లేచి తిరగడ మారంభించాయి

13. ఎవరది దూరంగా ఎవరది దూరంగా ? చెదరిన కేశ రాజితో బొప్పి కట్టిన ఫాలంతో విసరే వాయు ఛురికలకు గంటు పడిన కపోల పాళితో. దెబ్బతిన్న బుజాలపై మాయని గాయాలతో అడుగులో అడుగేస్తూ సాగే గ్రహణం వీడని బింబం ! ఎవరిది ? ఆడిన మాట తప్పని మతితో మెప్పుకై సముద్రంలో దూకేందుకూ వెనుదీయని వరదల్లో కొట్టుకపోవడానికీ సిద్ధంగా ఉన్న మూర్తి శాంతి సహన రూపం ! చేతులు కాల్చని మణిదీపం దారిద్ర్యం ఆకలి ఎండల్లో నిన్న! గమనం సాగించిన సాహసమతి ! వేసిన తప్పటడుగు పరిణామం ఇంకా తెలిసిరావడం లేదు. భోజన వేళ టైబిల్ పై నుండి క్రింద పడి ముక్కలైన గాజు పాత్ర పై ఆశ వదలి కొత్తది యత్నించక తప్పదు

మమకారం పెంచుకొని గాజు ముక్కల్ని ఏరుతూ ఆవేదన పడే కన్నా అలౌకిక మేముంది ? చరిత్రలో ఇంతకూ ఎవరా ? జ్ఞాపకం రావడం లేదూ ? చితికిన సౌందర్య దీపం ! తెలివిలో జారిన నిజ స్వప్నం ! గంధం ఇగిరి, వెలుగు తరిగి వర్ణం మాసిన, మనోరూపం ఎక్కడ చూచిందీ గుర్తుకు రానంత వాలకంతో ఉంది ! ఎండలో చలిలో వానలో నిశ్శబ్దంగా నిలిచిన రోదసి ఆత్మ నేత్రం తెరచీ రహస్యానికి సాక్షిగా ఉంది సంస్కారం సౌభాగ్యం ఔజ్వల్యం పూర్వం ఆకాశమంత ఎత్తుగా వర్తమానం మాత్రం వాస్తవంలో పీడకలగా ! ఎవరది దూరంగా ! బరువు రెప్పల క్రింద అణగిన వెలుగుతో వెలుగు చూపుల్లో కదలే చీకట్లతో మెడపై నిల్చిన ముఖంతో మబ్బు మెరపు చూపులతో మండు టెండల ఎదలతో చెవులు దిబ్బళ్ళు వేసే గోడులతో జన సమూహ రూపం ! ఈ దేశం ! నా రూపం ! మనిషిలో చీకటి వృక్షమైనపుడు ఏ దేశమైతేనేం ! వేరు వేరు పోతల్లో అంతా ! అజ్ఞాన శిల్పాలే ! మనిషిలో మానవత పసంతమైనపుడు ఏ భాగమైతేనేం ? అంతా చైతన్య శిఖలే ప్రజలు ! నా రూపం, జనరూపం

14. ఎవరు మీరు ? అస్తమించే సూర్య బింబంతో ఆనందం వీడే ఆకాశం లాంటి నా ముఖంలోకి తొంగిచూస్తూ నీడ బొమ్మల వలె మౌనంగా వెళుతుంటారు ? ఎవరు మీరు ? సభయ రూపాలా ? ఉదయించే చంద్రబింబంతో విషాదం వీడే ఆకాశం లాంటి నా కళ్ళముందు తారాడుతూ నీలి నీడల వలె దీనంగా భ్రమిస్తూంటారు ? ఎవరు మీరు ? నిరాశా రూపాలా ? వెలిగే దీప శిఖలు ఆకాశంలో విడిది చేసే వేళ కాలాన్ని మ్రింగజూచే చీకటి వలె ఎదురౌతారు ? ఎవరు మీరు వృక్ష వర్షీయసి కోర్కెల ఆకులు విడిచే సమయం శైశిర విచార వాయువు వలె వస్తూంటారు ? ఎవరు మీరు మిమ్మల్ని చూడగానే నా గుండెలో పూచిన పూలు కళ్ళ నుండి జారి రాలి పోతాయి ! ఎవరు మీరు

గగన వీధి పాలవెల్లి వలె మస్తిష్కంలో విరిసిన ఊహలు చలించడం మాని అదృశ్యమౌతాయి ! ఎవరు మీరు దీపానికి నీడ ఎంత దూరమో ? నా కంత దగ్గరలో వెలుగు మేడ క్రింద చీకటి మెట్ల వలె నిల్చిన మీకు నా మాట వినిపించడం లేదూ ! మీరు చీకటి మనుషులా ? అరె ! కన్పించరేం ? ఇంతలో ఏమయి పోయారు ? భానూదయంతో నా శరీరం కాంతి శిల్పమయమైంది నటత్ కిరణ ప్రావారం నా భుజాంసాల్ని అలంకరిస్తూంది నా మనో రూపం జీవన రస తీర్థమైంది ఇది జీవశక్తి సంకేతం.

15. కత్తుల్లా వత్తుల్లా ఐదు కత్తుల్లా పొడవైన వేళ్ళు పొడి చేస్తాయి కలసీ విడిగా ఇవి బాంబు విసరి జీవితాన్ని త్రుంచేస్తాయి ఆశీర్వదించి ఆయుస్సు పెంచుతాయి కలసి నిలుస్తాయి శక్తికి ప్రతీకగా గాలికి ఆకులు మాట్లాడినట్లు మమతా లోలమై హృదయం ఆ రోజు రావచ్చు ! ఏ రోజైనా కానీ కత్తులు బూజు పట్టి, వత్తులు అవసరంలేనీ స్నేహ సమయం ! కత్తుల మెరుపుల్లోనూ వత్తుల వెలుగుల్లోనూ నడిచే మనిషి గుండెలో చల్లని సూర్యుడూ లేక పోలేదు ఆరోజు రావచ్చు మనిషే కిరణమై పుష్పమై బ్రతికే రోజు నీలాకాశ గుహ నుండి వెడలిన కాంతి సింహం

16. కాంతి సింహం గగన కాసార దర్పణంతో ముఖం చూచుకొని మురిసింది. బంగరు పూలు పూచిన కాంతి నికుంజం వలె రోదసీ వితర్దికపై సంతోషంగా కూర్చుంది ! నన్ను చూచి నవ్వే సింహం నాకెంతో ముచ్చటైంది దానితో సంతోషంగా కాలం గడపాలని చేయి చాయి సైగ చేసి పిలిచా నాపై జాలి కలిగి కాబోలు ! కదిలింది ప్రక్క నున్న గాజు గ్లాసులోకి దూకింది.

నీటి చుక్క తొణకలేదు గాజు గ్లాసు కదల్లేదు. వేలాడే మంచు తెర తెగిపడినట్లు గాలికి కాసారంలో లహరి లేచి పడినట్లు పగిలే వీల్లేని ఎత్తు నుండి గాజు బొమ్మ పడినట్లు నా ఎదలో సన్నని ధ్వని ! కాలం ఆగినటెంది. గాలి తెరపై తుమ్మెద కాలి జాడ వలె నీటి అలపై గాలి తెర కదలిక వలె గుండె పొరలో జారే రాగం మొదటి స్పర్శ వలె వేళ్ళ కందీ కందని పాద రసం గుళిక వలె ! నా హృదిలో నవ్వుతూ కాంతి సింహం ! ఓటమి నంగీకరింపనీయని విజయ రూపమైంది చీకటి గుహ ముందు అగ్ని నికుంజంలా నిల్చి మెరపులా దూసుకొని వచ్చి నిండు ప్రాణం తీస్తుందనే మాట ! ప్రస్తుతానికి నిజమయినట్లు లేదు. కాంతి సింహానికి భయపడి పరుగెత్తి చీకటి గుహలోకి చేరడం కన్న మృత్యువు నయం ! భయపడడం అజ్ఞానం, దాగిపోవడం తిరోగమనం

17. కీర్తి స్తంభాలు సుజాతకుల హృదయ ద్వార కవాటాల ముందు ప్రేమామృత జిహ్వల చాచి తారాడే భుజంగాలు, శత్రువు కళ్ళముందు దివా రాత్రాలు నటించే పెను భూతాలు కాల మహావేదికపై ! నిల్చిన ఒకనాటి కీర్తి స్తంభాలు వేదనతో కంపించి హృదయాబ్జం బాధలతో శీర్ణమై తనూ శైలం నేడు ధాళ ధళ్య స్ఫటికాకృతి ప్రాంశు మూర్తియై నిలిచింది ! అందరితో మౌన భాష మాట్లాడుతుంది ప్రశాంతంగా చందన శీతల పరీమళ వాయు హాస శ్రీలతో అపరిమాణ వాజ్రేయ శరీరాలతో అవిగో ! కీర్తి స్తంభాలు గగన తలంపై వెలిగే సూర్య చంద్రులు ఏ విశ్వనాథుని కీర్తి చిహ్న కేతనాలు ఈ దిశా ఫాలం నుండి ఆ దిశా ఫాలం దాకా మంటి నుండి మింటి కెగసి నిల్చాయి

అజంతా తాజ్మహల్ వలె హేతువుకతీతంగా తెలుసు నాకు మేఘమా ! నాపై నీకెంత ప్రేమో ? పిడుగులు విసిరిందీ జ్ఞాపక ముంది సుమీ ! నీ కళ్ళల్లో మెరపు ఎంత అమాయకంగా బయట పడేదో నాకు బాగా తెలుసు ! పొగల తెరల చాటున దుమ్ము పొరల మాటున బ్రతుకుపై ఆశతో ఎద ఏడ్చే మాట నిజం ! బీట లేసిన నేలపై నీరాకకై వేచిన ఎందరికో నింగిలో నీ రూపంతో మదిలో ఎంత సంతోషమో ! అద్దంలో నీడలో వలె మనసులో బొమ్మలు ఉరుములతో మెరపులతో కదలిపోయే మబ్బులు చిత్ర విచిత్రా కృతులతో నవ్వుతో కోపంతో వచ్చిపోయే

18. తెలుసు నాకు మబ్బులు ! మనిషిలో నిరీక్షా దిశదిశలో ఆశలు ! కొత్త బంధుమూర్తులు ! అగ్ని దేవతా ముఖంలో గీష్మం నడిచే దారుల్లో సూర్యుడు తెరచిన కళ్ళ నుండి కణకణలాడే పూలు ! నియంతల హంతకుల గుండెల గోరీలపై విరబూచి వేడి నిశ్వాసం విడుస్తూ ధూమంతో మ్రగ్గే పూలు ! విద్యుత్తులా ప్రాకి శరీరంలో శిల వలె దిమ్మెక్కించే తమలో చల్లదనం ఎరగని నిప్పుపూలు ! పైకి నవ్వులు చిందే అకాల మృత్యు రేఖలు మరో రీతి నిప్పు పూలు అంతటా దొరికేవి కాదు మధుర మధుర గర్ణానినాద జలధారా మేఘంలో మృదు సుషీమ వాస్తరంగ జలధి కవి హృదయంలో నివాసం ! ఆ కవితకు వీటి పరిమళం ప్రాణాధారం స్వేచ్ఛా కాంతి కిరణం కోసం పరితపించే ఊహల్లో అర్థరాత్రి పన్నిన వలలో చిక్కిన ప్రాణికోటి గుండెల్లో

19. నిప్పు పూలు ఏ మారణాస్త్రాలకూ మాడిపోని పూలు నిప్పు పూలు ఎదలో క్రమ్మిను చల్లదనం పొగొట్టే వెచ్చవెచ్చనిపూలు !

20. పిస్టల్ పేల్చిన కవిత ఎగిరే జెండా వదిలి చేతిలో పిస్టల్ వహించాడు కుర్రడు పిస్టల్ మోతకు భయపడి దగ్గరలో ఉన్నవాళ్ళు పారిపోయారు దూరంగా ఉన్నవాళ్ళు తమలో నవ్వుకొని మిన్నకున్నారు పిల్లలకేమో ! అపుడే దీపావళి వచ్చిందా ? అనిపించింది గుండెలు సవరించుకొనే కొందరికి భయశ్రీకంగానూ ఉంది అతడు నడి వీధిలోకి రాగానే దారులన్నీ మూసుకున్నట్లుంది మిగిలింది నిశ్శబ్దం నడచే రాత్రి గుండెల అడుగుల సవ్వడీ ! పిస్టల్ మ్రోగింది మళ్ళీ, కొంతసేపటికి చూస్తే ఏముంది ? బద్దలైన ప్లాస్టిక్ తొడుగుల ముక్కలు క్రింద పడిఉన్నాయి సీసా మూత తీసే సరికి నురగలతో పొరలే బీర్ వలె కవిత్వం వీధిలో నృత్యం ఒక సరదా ! చీకట్లో పిల్లి కళ్ళ మెరపుల అందం తెల్లారింది ! వెలుగులు కళ్ళప్పగించి చూస్తూన్నాయి ప్లాస్టిక్ ముక్కల్ని ఏరి కూర్చి కేస్ నమోద్ చేసింది పోలీస్ స్వేచ్ఛాకవచం తొడిగె వెంటనే విడుదలచేసింది న్యాయస్థానం అంతలో శబ్దం వీథిలో మంటలతో పైకెగసింది కేకలతో అతడు కన్పించాడు గతి తప్పని రాత్రి వలె నిశ్శబ్దం మిగిలింది కాలశిఖపై సుళ్ళతో మౌనం వెలిగింది నీడలు చిరు మంటలతో నెత్రు చిత్రాల కలలు కంటూనే ఉన్నాయి నాలుగు వైపులా తిరిగింది అది ముఖమా ? ముసుగా ? తొడుగా ? దిశ దిశ మెరుపులతో సందేహాలు ప్రశ్నల్ని వదలుతున్నాయి. చుక్కలతో సముద్రం వలె కళ్ళు ! ఎండలో మంటల వలె మాటలు ఓపిగ్గా నిలిచి చూస్తే ఏముంది అంతా పిస్టల్ మ్రోగిన కవిత్వం తొలి మలి సంజల్లో విరిసే మల్లె పొదలపై నుండీ త్రాచుల పూత్కారాలతో, తుమ్మెద బారుల రొదలతో వెలుతురులో చీకటిలో గుప్పున కమ్మని తావులతో ప్రాణ తర్పణంగా తీవ్ర తీవ్రంగా ప్రాణ ఘాతుకంగా

21. మరవలేని గాలులు నిండుగా కపాల రంధ్రాల్ని పూరిస్తూ సంరావంతో వచ్చే గాలులు ! యంత్రం వలె వేగంతో బ్రతుకులు విడిచే బరువు నిట్టూర్పుల్నీ నాగలి వలె కదలే బ్రతుకులు విడిచే కోష్ట విశ్వాసాల్నీ

జీవితంలో మోసుకోచ్చే అనుభవ సంభారవాహులు సగం గాలిలో సగం నీటిలో ఉన్న నా గుండె నూపే గాలులు భూమికి జలదాగమన రహస్యం తెలియ జేస్తూ కౌగిలిలో వృక్షాంగనలకు కబుర్లు చెబుతూ హృదిలో అగ్ని రగిల్చి, దీపం వెలిగించి వెలుగుపంచి దశ దిశల ఆలోచనా కిర్మీర పరాగం చిమ్మే గాలులు ! అంబుధి విలోల వీచీ నిస్వానం వినిపిస్తూ బహు దూర దేశ సమాయాత వార్తావాహులు బ్రాహ్మీ ముహూర్త మహిత వేళ సృష్టి రహస్యంతో జగతిని మేల్కొల్పే ఉషః కాల సాంగీతికులు శిలల ఒరపిడితో కదలే సెలయేరు నవ్వుల సవ్వడితో నా గొంతులో పాటకు శ్రుతి పోసీ ధ్వని నిచ్చే గాలులు ఎత్తిన అలల తలలపై మెత్తని కాలూని వచ్చే గాలులు ! ఆరని ఎద మంటలతో శత్రువు వలె కదలిస్తూ కవ్విస్తూ పసి పాపల ముఖాల్లో వెలుగు నవ్వుల వలె కదలుతూ నటిస్తూ వచ్చే ఈ గాలుల్ని నే నెలా మరవగలను ? పురా ప్రకృతి బింబాన్ని స్మరింపజేసే ముద్రల్ని మరవగలనా ?

22. మూసుకున్న ఐదు వేళ్ళ లోకంపై మమత ఇంకా వదల్లేని సూర్యుని ఆశలు గ్రీష్మంలో పలాశల వలె దిక్కులు పట్టుకొని వ్రేలాడే సమయం అసివాళ్వోయి ఒక రాతి పరువుపై కూర్చున్నారు, ఐదుగురు నెరవేరని కోర్కెల ప్రకాశనంతో కాలం గడుపుతూ ఆకాశం ఒక ఇంటి కప్పు ! ఇప్పట్లో కూలదనే నమ్మకం ! దిక్కుల గుండెల్లోకి చొచ్చిన భూమి మనిషి జన్మించడంతోనే లభించిన స్థిరాస్తి జీవన గమనాన్ని పాలించే ఊహా శక్తి ! చరాస్తి ! ఒకరి మీద మరొకరి కధికార మసలే లేదు ఎవరి కిష్టమైన పని వారు చేసుకోవచ్చు అందరికీ వెలగబెట్టాలనే ఉంటుంది కాని తగిన శక్తీ, స్తోమత కొంతవరకే ! ఈ ఐదుగురూ దేవుని కాలి వేళ్ళు అంటారు కొందరు రాక్షసుని చేతి వ్రేళ్ళ నీ అంటారు మరికొందరు

ఏమైతేనేం ! ప్రయోజనం మేర మారే మైనపు బొమ్మలు ! అపుడపుడు వినిపిస్తాయి ! ఊళలు అరపులు ఈలలు ! చప్పట్లు ఇవి వారి సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు, కాని మనిషి చేతివ్రేళ్ళు అనుకుంటేనే బాగుంటుంది సన్యసించి మిధ్యా భావనతో పరమార్థం శోధించే తత్త్వమతీ హస్త గతమైన అధికారంతో ప్రజల్ని శాసించే పెద్ద మనిషి విద్యా విలసనంతో యశో జీవితం కోరేలోక హితవాదీ పరలోక ముందో లేదో వర్తమానం కోరే వాంఛా మతీ ప్రాణాన్ని ఘనంగా తన నిల్వ ధనానికి లంకె వేసే వ్యాపారీ జీవితంలో వారి వారి ఆశల ఊహల ప్రకటనానంతరం ఎవరికి వారు లేచారు ఇంటి ముఖం పట్టారు చాచిన ఐదు వ్రేళ్ళు మూసుక పోయాయి హఠాత్తుగా మింటి కప్పు కూలినటెంది చెల్లని కరెన్సీ నోట్ల వలె భూమి పై శరీరాలు !

23. మేల్కొని ఉంటాను బ్రతుకులో మార్పులు ఊర్పులతో పయనించే గాలుల కదలికలో పగలు మరచిన రాత్రితో, రాత్రి ఆరని తెలివితో ఉంటాను నాపై పగటి ముద్రలు పూర్తిగా వదలపు రాత్రి నాపై రాత్రి ముద్రలు పూర్తిగా వదలవు పగలు గొంగళీ పురుగు నుండి సీతాకోక చిలుక వలె రాత్రి నుండి మంచుతో అవతరిస్తుంది ఉదయం బలంగా గాలి తెర వీస్తే ఎక్కడి దక్కడ తునాతునకలై పోతుందా ? అన్నంత సుకుమారంగా ఉంటుంది సమయం పొద్దెక్కిన కొద్ది వేడి హెచ్చిన కొద్ది ప్రశంసలతో మొండి ఘట మనిపించుకుంటుంది ఉదయమయ్యే సరికి సన్నని కన్నీటి తెర వలె మంచు ! ప్రొద్దెక్కుతూన్న కొద్దీ ధైర్య కవచం వలె కాంతి ! రాత్రి అయ్యే సరికి త్యాగ జలం వలె చీకటి అంతగా మండే సూర్యుని క్రింద చెమటోడ్చుతూ అంతగా విసరే చలి గాలికి మేను ముడుచుకుంటూ ఎందరో పని చేస్తూంటే నేనింకా నిదురపోతూనే ఉన్నాను ఈ నిదుర మృత్యువు కన్న కొంత తేలికైంది

ఈ జీవితం మృత్యువు కన్న చాలా బరువైంది పగలంతా ప్రపంచం సముద్రంలో పడబోతున్నట్లుంటుంది పగలంతా ప్రపంచం అగ్నిలో ఆహుతి కానున్నట్లుంటుంది కాలు పెడితే కంఠ దఘ్నంగా కూరుకపోయే ఇసుక దిబ్బలు ! శూన్యంలో దృక్కులు ప్రసరిస్తూ దూర దూరం కదలే పెద్ద మనుషుల లాంతరు ముఖాలు ! ఇప్పు డెవరికి కావాలి ? బుజాల వెనుక నుండి నక్కలు నిక్కి చూస్తూంటాయి పాదాల వెనకాలే నీడలు నక్కి వస్తూంటాయి. ఊళ్ళు పట్టణాలు పొలాలు ఎడారులు సముద్రాలు దాటి ఇక మన గమనం, గగనంలో చంద్రుని పైకి ఆపైకి పయనానికి హద్దు లేవు ఊహకు పరిధులు లేనట్లే వర్తనకు తీరూ తెన్నూ లేదు మనసుకు విధం లేనట్లే పగటి బ్రతుక్కి వేళ్ళు దన్నుకొని అలవాట్లు ఎంత లోతుగానో పాతుక పోయి ఉన్నాయి రాత్రి అంతా ప్రపంచం శాంతి వరించనున్నట్లుంటుంది రాత్రి అంతా ఎద దేనినో అన్వేషిస్తున్నట్లుంటుంది స్థూలం నుండి సూక్ష్మానికి సాగే మనో గమనంలో నేను తప్పకుండా మేల్కొంటాను పగటి మగత పోయి తీరుతుంది ఈ భూమి పూలతో పండ్లతో పంటలతో నిండుగా ఉండాలనే ఆశ ! చావు నేలలో భయం వలె మగత ముఖంలో దాపరికం వలె నింప బడుతుంది. మనిషి కన్నీటి తెర వెనక రాత్రి వెనుక కాంతి వలె ఊహల్లో వాంఛల్లో ఆశా మనోజ్ఞ రూపాలు ఒక తరం పోయి మరో తరం వస్తూంది అసహజమైన పగటి భయం పోయి మనస్సు ధైర్య రూప మందుకుంటూంది పగటి కలలకూ పగటి మగతకూ అవకాశమీయని నవోదయ మనో రూపులు వాసంత జీవ కళలు ! వీరి కన్నుల్లో రెక్కలు విప్పి ముఖంలో పరచుకొన్న కాలం అమృతం వర్షిస్తుంది ! నేను తప్పకుండా మేల్కొనే ఉంటాను !

24. రా ! రాత్రి అయి రా రా ! రాత్రి అయి రా ! ఎందుకంటావా ? చెప్పనా రా ! నిశ్శబ్దమయి ఇక్కడ మెలకువతో పని ఉండదు శబ్దంతో స్వరంతో పనిలేదు, సంగీత ప్రసక్తే లేదు స్వప్నమయిరా ! ఈ లోకంతో పని ఉండదు బాధ ! దుఃఖం! ఆ దేవునికి వదిలేయొచ్చు! రా విప్లవమై ! వేయి సూర్యులు నీలో మండేరు మృత్యుపదం ఎదురైనా ! కొత్త సృష్టి కోరవచ్చు రాత్రి అయి రా ఎందుకంటావా ? చెప్పనా ! ఉన్న మతిని చీకటి కొనేస్తుంది, రహస్యం రక్షితమవుతుంది

25. రెక్కలు దాల్చిన కొండలు వాయువు కదలిక లేక మేఘాలు స్తంభించి పోతున్నాయి ఈ ఖండం నిష్పలంగా మారే ప్రమాదమెంతో దూరం లేనట్లుంది ఇంకి పోయి ఆవిరి ఐ పోగా మిగిలిన నీరు అడుగనపడింది ఇపుడు కన్పించడం మానేసింది. కృత్రిమమైన రెక్కలతో కొండ లెగురుతున్నాయి కళ్ళపై నమ్మకం చావని కొందరు కళ్ళప్పగించి చూస్తున్నారు సంతోషంతో వెంటబడి కొందరు తప్పుక పోజాస్తున్నారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై కోలుకొనీ కొందరు మరో వైపు ముఖం పెట్టి త్వర త్వరగా నడుస్తున్నారు కిచకిచలతో రుసరుసలతో ఆగడాలకూ ఆతతాయిలకూ దిగే కోతుల్ని దండించడానికి పాలకులు భయపడుతున్నారు ఇవి ఆంజనేయుని బంధువులని కాదుసుమా ! డార్విన్ను అనుసరించి తమ పూర్వీకులనా ? కాదు అంతకన్నా బలమైన కారణ ముంది ! మీకు తెలిసే ఉండాలి ! ఇరువురి నివాస ప్రయోజనమూ ఆ కొండలే అని ! ఇవి తృప్తిగా తిని యధేచ్చగా గంతులేస్తాయి కారణం లేకో ఉండో మీద పడి రక్కుతాయి భయపెడతాయి ప్రాణాలు తీసే సాహసమూ తెలివి లేక పోలేదు గలభాకు గాభరాపడి హడావిడిగా పరుగెత్తుకొచ్చి తమ ఉనికిని తెలియజేసే రక్షకుల నుండీ ఈ పని జరగొచ్చు

మరచాను వీటికి తోడు ! తొడేళ్ళు నక్కలూ ఉన్నాయి వీటి ఎత్తులకూ జిత్తులకూ చదరంగాలు ఆగవు వీటి ఊహను ఉపమిస్తే సరిగ్గా నల్ల బజారు అడవిలో కొండల మెండు రూపాల చిత్రణతో పోటీ పడుతూ వాతావరణ సూచనలూ వర్షాలపై వ్యాసాలూ వెలువడుతున్నాయి వర్ష ఫలం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు సామాన్యులు రెప్పలెత్తి జల మౌక్తికాలు విడిచి అడుగులు వేస్తున్నారు కొడుకులపై నమ్మకం లేక అవిశ్వాస వాతావరణంలో కొందరు ముందుగా ఎవరి కర్మ వారే, చేసుకుంటున్నారు పితరుల పై అభిమానం చచ్చిన కొడుకులు ఎక్కడైనా పెంపకం పోవడానికి సిద్ధపడుతున్నారు ఇదంతా ఎవరికి కావాలి ? కందకు లేని దురద చేమకు వలె ! జీవంగల చెట్లకూ ! గమనం గల నదులకేనేమో సామాజిక చైతన్యం గల మనసుల కేనేమో ? చెట్లలో పచ్చదనం మాయమౌతూంది నదుల్లో తరగ లణిగిపోతున్నాయి ప్రస్తుతం ! మేఘాల స్థానంలో ఎగురుతున్నాయి రెక్కలు దాల్చిన కొండలు సంఘంలో జడశక్తులు !

26. విదూషక పాత్ర నోరు తెరిస్తే మాటలుకాదు జారేది బాకులు నోరు మూస్తే చేతుల నుండి జారేది బాంబులు కాలు సాగితే నేలపై చిందిన నెత్తురు మరకలు ఆవలిస్తే గాలిలో మండే అగ్గి పిడుగులు సైగ చేస్తే కంకాళాలు లేస్తాయి కపాలాలుపాడతాయి నేనెవరో తెలుసా ? వైప్లవ యంత్రాన్ని ప్రజా తంత్రాన్ని బులెట్ వదలక ముందే ! హఠాత్తుగా శరీరంపై రక్త చిత్రాలు అంతలో నిశ్శబ్దం! ప్రాణమున్న ఘన జడం సమాజం కాసేపు బ్రతుక్కి ఉరితాడు బిగించి జోకొట్టి బార్ లోకి నడిచే అడుగుల్లో తూగే విప్లవంతో ఈ నాటకంలో నాయకుడు విదూషక మహాశయుడే భీభత్స మతి అంతో ఇంతో వహించే ఘన పాత్రే

27. వయొలిన్ పై రాగంతో వయొలిన్ పై రాగంతో వస్తావూ మైడియర్ ఫెండ్ రా ! వెల్కమ్ దారిలో కారు వేగంగా పైబడి వస్తుంది తొలగిపో తొందరగా అదేం మెలకువ ! ఆ ధ్వని వినిపించదూ సంగీతం వినిపించేవా ? వయొలిన్ పై భృంగీ గణ నిస్వానంగా, జనంలో కదలేవా ? పొరపాటు పలికానా అయితే ఓ సవరణ రైలు విజిల్ రవళితోరా గొంతు విప్పుతావూ ! ఆపదలో హారన్ హఠాత్తుగా మ్రోగినట్లు గంతులేస్తావూ ! వేగంలో స్టీరింగ్ తప్పిన జీపు వలె దారిలో పో ! త్వరగా పైకి ! తొలగిపో ! అపాయం కలుగుతుంది జాగ్రత్త ! పగలూ రాత్రి పంచుకొని నిల్వకు సగం మనిషి సగం జంతువై నిదురవైతే ఏమౌతుంది ? వాహనమే నిన్ను తప్పుకుంటుంది జడమైతేనొ ? వాహనమే దిగాలుపడి ప్రక్కగా తొలగి పోతుంది నీ వైతే క్షేమంగా రాగంతో యధేచ్చగా పోవచ్చు ఒళ్ళు మరచి దారిలో అడుగేయకు ! కళ్ళు తెరచి నడూ వాస్తవ తలంపై మనసు విప్పి పరిమళాలహరి చిమ్ము ! వయొలిన్ పై రాగంతో వస్తావూ ! మైడియర్ ఫెండ్ పొగ క్రమ్మని ఎదతోరా ! సాలోచనగా మరీరా ! కోర్కెలకు మెరుగు పెట్టి జిగేలుమనిపిస్తుంది వెలుగు అణగ ద్రొక్కబడిన ఆశలు బయట పడే ద్వార మౌతుంది చీకటి ఇపుడు చీకటితో పనిలేదు నిద్ర అంతకన్నా పనికి రాదు శక్తి స్పందనతోరా ! రాగ విలసనంతో రా వెలుగు మొగలి రేకై రా ! బాకు చూపులతో సింహం వలె నిల్చిన సమయం పూల చూపులతో హరిణంగా మారనీ మిత్రమా హిమ శకలం కరిగిస్తూ ప్రాణంలో ప్రాణమై రా వయొలిన్ పై రాగంతో జీవన ధునియై ప్రేరణయై

28. ్వతేతర విహంగాలు భవిష్యత్తు రేఖా గమనం మార్చే ప్రజాహస్తాల్లో చిక్కిన తమ జాతక ఫలాల కోసం 'క్యూ' మార్్క ముఖాలుచాచి రాత్రి భూమి కంకట తిరగే భూతాల దేహచ్ఛాయల వలె మూకల మూకలుగా ప్రతిచోట ! శ్వేతేతర పక్షులు ! కాంతి హస్తాల క్రింద వెలిగే శాంతి హృదయ వాటికలో

అంటు చీకటి చెట్లు నాటి నిప్పు పూలుపూయించాలనీ నింగి నావరించి భ్రమగొల్పే తెల్లని రెక్కలుచాచి మిన్ను అన్ను బట్టేట్టు నినాదార భటీ శబ్దాలతో రేపటికి వేసే బాట కన్నా ముందు మాపటి కాడే ఆటలో రక్తి కట్టాలని అహరహం వీలైనంత శక్తి సమీకరిస్తూ ఏకంగా ధాత్రి నిండా వాలిపోయి సాంతం రాత్రి మయం చేయాలనీ ఉద్రేకంతో రివ్వు రివ్వున ఎగిరి ఎగిరి వస్తున్నాయి పన్నిన కాంతి ఖడ్గ జాలంలో అన్నీ విశ్రాంతి తీసుకునేనా ? విహరించే శ్వేతేతర పక్షులన్నీ కన్పించే స్వేచ్ఛేతర కక్షలోవి

29. సముద్రం బింబిస్తూంది నాలో చెలియలి కట్టపై నిల్చిన నా ముందు వస్తూపోతున్నాయి నౌకలు ఒడ్డుకు కదలి వచ్చి మెల్లగా విరిగిపోతున్నాయి తరగలు ఏముంది అంతటా నీరు నురగ బొమ్మలూ ! తరంగ చిత్రాలూ ! దగ్గరలో పర్వతంపై మేడ అందులో జీవితం భద్రమైంది నిరంతర చలనంతో సముద్రం సమాజాన్ని జ్ఞాపకం చేస్తోంది వెలుగులో సముద్రం విరిసిన ఇంద్ర ధనుస్సు వలె ఉంది అక్కడక్కడ వాలుతూ పక్షులు కోర్కెల్లా ఎగురుతున్నాయి చీకటిలో సముద్రం వాడిన పూల చెండ్ల రాశి వలె ఉంది బుసలు కొట్టే నల్ల త్రాచులునిక్కి నిల్చి తూగుతున్నట్లుంది జవాబు లేని ప్రశ్నల తూణీరం వలె ఉంది సముద్రం దీనిపై సూది మొన కాళ్ళతో వెలుగు నడుస్తూంది దూర దూరం తీరం వదలి వెళ్ళుతున్నాయి నౌకలు మిగిలేది సముద్రం ! చెలియలికట్టపై కాసేపు నేనూ నాపై నున్న ఆకాశం ఆదర్శం వలె ప్రతిఫలిస్తుంది సముద్రంలో సుళ్ళు తిరిగే హృదయంతో సముద్రం జీవితంవలె బింబిస్తూంది నాలో అంగారనిధి గ్రీష్మ దేవత మృగతృష్ణ పెంచే వేళ

30. స్నేహ వీచి తడి ఆరిన పుడమి గొంతుక నీటికై తపించే వేళ

శిలవలె హృదయం ఘనీభవించి ప్రపంచం పర్వతమయ్యే వేళ ఎక్కడి నుండో ఏ కోన నుండో జలధి తరంగాలపై రవళిస్తూ కబుర్లతో మురిపిస్తూ వస్తుంది స్నేహవీచి నదీ సైకతాలపై లహరుల్ని కిలకిల నవ్వులతో ముంచేస్తూ వృక్షాలను కుశల ప్రశ్నలతో సంభావిస్తూ గలగల ఊగిస్తూ సమున్నత శైల మస్తకాల్ని శీతల హస్తాలతో స్పృశిస్తూ మతాల సూత్రాలకు కట్టుబడని రెక్క విప్పిన ఆనందంతో తెలుపు నలుపు జాడ్య మెరగని ప్రేమతో వస్తుంది స్నేహవీచి మనిషి మనిషి మనస్సు కలయిక విశ్వశాంతి - సమర్చనంగా శిలా ప్రతిమల నిలయం ముందు విశ్రమించిన నాచెవిలో మనస్సు కవగత మయ్యే భాషలో గుండె విప్పి మాట్లాడుతూ వెళ్ళిపోతుంది మరో కోనకు నిశ్శబ్దంగా ఉదారవచనంతో నవంనవ శీతల గంధ వాయు స్నేహ వీచి

31. హృదయంతో మాట్లాడే చెట్లు చెట్లు సందేహిస్తున్నాయి ఇంట్లోకి రావడానికి లోనికి రాలేకనే కిటికి నుండి వాలి తొంగి చూస్తున్నాయి చెట్టు ఒక మనిషి ఐతే నేను ఒక చెట్టునైతే ! అవును చిత్రమైన ఊహ ! ఒక సమయంలో సహజం! భూమి పై రాళ్ళు చెట్లు జంతు కోటిలో భాగస్వామిగా ఆకాశం కింద కుటుంబంలో పరిణామం చెందిన నేను వీటి కన్న విడిగా మడి కట్టుకొని ఒంటరిగా కాస్త బుద్ధి ఉన్నందుకు గోడలు నిర్మించుకొని చుట్టూ ఇంతవర కెంత దూరం వెళ్ళాను పరమ పద సోపానం పై పై పైకి ఎదిగి దూర దూరం కొమ్మలతో ఆకులతో నిండి తమకు తెలీకనే మన మనుగడలకు గొడుగుల వలె ఉన్నాయి నేను బయటికి రాగానే తలలు ఊపి చేతులు చాచి అప్యాయంగా ఆహ్వానిస్తాయి ! దేని బ్రతుకది బ్రతుకుతూ మెలకువలో స్వప్నం వెంట పరుగెత్తే మన కాళ్ళు భూమిపై నడచిపోతాయి నిద్రా ముద్రలో మెలకువతో నిలిచే

చెట్లు వేళ్ళతో భూమిలో నిలిచి ఉన్నాయి మెలకువ రహస్యం తెలుసుకొనేందుకు నేను వెళ్ళుతాను విశాల హృదయంతో మాట్లాడే చెట్ల వద్దకు నేనే వెళ్ళుతాను

32. ఛాయ ఎవరొహో ! నిదురించిందీ నేలపై నీలాంబుద మాలా స్నిగ్ధ తనూ ! ముహుర్ముహు రాగత వాయు వీచీ సంచాలిత పుష్పందయ పక్షాలక త్వక్తాశా కాంతి చేల ! దుఃఖ ప్రావరణావృత ! సరభస గమన పవమాన విధుతమై, గగనాంస స్రస్తమై పొరలాడే నీరదాంశుకం వలె, భువి జారి పడిన యామినీ కర్ణ పూర్ణిమా చంద్ర తాటంక ఖచిత నీల మణి వలె భూదేవి పృథుల నితంబంపై అంకిత నఖాంకుర పంక్తి వలె ఆ పవ్వళించిందెవరు ? అరుణ మయూఖాలకు వాడి శార్వరీ కైశికం వీడి శీర్ణమై ఇట బడిన మందార పుష్పదామమో ! ఇట నిదురించిన దెవరీ మసృణ తమాల వల్లరీ మతల్లికా సుషమాంగన నిస్తరంగ యామున ధుని ఖండిత జల కణ మౌక్తికావృత ఘనా ఘన మండపంలో మార్మోగే ధ్వని తరంగాలకు బెదరి ఇట బడిన దుఃఖాగ్ని సంతప్త శంపా లాసికయొ ! నవా రుణా దిత్య మూర్తి గాత్ర పరిష్వంగంలో తప్తయై సంయంత్రిత భుజం వీడి ఇట బడిన ఛాయా కాంతయొ ! సౌర మార్గ పరిచ్యుతయై వాయు హత జ్వాలయై ఏ వృక్ష వర్షీయుని దుఃఖ సంవృత జీవిత చిత్రమో ! జీవదాన విచికీర్షా హృదయుడు ద్రుత తర గమన శీలి జలధర వర హృది నుండీ భువి జారి ప్రియు నెడబాసిన త్రపా తరళ యౌ శంపా వల్లికయా ! మమతా స్విన్నమైన దివి కేగలేవుగా ! రహస్తీరాల్లో నృత్య మాడి విశ్రాంతి మెయి వాల్చితివా ? కాంతి మండలం అంచులపై దిగజారుతూ నిరాలంబమై

నిరాశతో తమకపడి ఇట బడిన చీకటి కన్నెవా ? ఏ కోరిక సుడుల ముడులు విడిపోవ తిరుగాడి కడుడస్సి ఇటబడి దుఃఖ నిమ్నగ మున్గితివి ? ఎవరవీవు ? ఏకాంతంగా కఠిన శైల తల ఫలకంపై మలిన వస్త్రం దాల్చి ధూళి రేణురూషితవై వివర్ణమైన ప్రన్నని దేహం అల్పిష్ఠ తమస్తరంగిణి వలెనై ఎవరి కొర కాచరింతు వీ మౌన వ్రతం ? దుఃఖ విదారిత హృదయంతో దృజ్మనోజ్ఞతర కాంతులు దిక్తటాల్లో విసరుతూ ఏ సాగర తీరం వెదకుతూ ఏ నాక పథం ఆశిస్తూ ఏ సుందర సౌర పదవికై ఊహా సోపానాళి వినిర్మించేవు జఘన మండల విసర్పిత నీల వసన సంశోభిత మలినీకృత దేహంచల ! విరజీకృత నీలాలక త్యక్తాశా కాంతి చేల ! ముక్తచ్ఛాయా సుందరి ! మసృణ నీల నీరద సుషమా వల్గత్ కాంతి తనూ ! ఒక వృద్ధు రోజూ వెళ్ళుతాడు మా ఇంటి ముందుగా నేనూ బయలుదేరా ఎదో పని మీద అదే సమయంలో !

33. ఆత్మబంధువు అతడు నడచి నడచి మెల్లగా ఒక పాత ఇంట్లోకి వెళ్ళాడు. వీధిలో వస్తూ పోయే జనం ! ఎంతో సందడిగా ఉంది కిటికీ తలుపులు తెరచి చువ్వలు పట్టుకొని వంగీ ఒక చెంప వాటి కానించి వీధిలోకి చూస్తూ నిల్చున్నాడు. పసివాడై పోయాడు కిటికీ తలుపులు మూసి బయటి కొచ్చాడు ఇంటి తలుపులు మీద పడేట్టున్నాయి మెట్లూ అంతంత మాత్రమే లోనికడుగు వేయడానికే భయం వేస్తుంది వీధిలో ఒక ప్రక్కన నిల్చొని చూస్తున్న నా వద్దకు వచ్చి బాబూ ! అన్నాడు, నా పేరు చెప్పి 'ఈ ఇల్లు మీదేనా ?' అన్నాను 'అవునన్నాడు 'అమ్మేయకపోయారా ?' అన్నారు తలూపి నవ్వి ఊరుకున్నాడు ; గతానికి దగ్గరి బంధువు! కళ్ళలో మెరుపులో ఆరిపోయే దీపం స్పురించింది అంతలో చల్లారీ ! మంచు బిందువులైనాయి ఒక్క క్షణం అగి, ‘నాతో వస్తావా ?' అన్నాడు

లేదు పని ఉంది అన్నా ఎక్కడికని అడగకుండానే ఏం పనిలే ! అన్నాడు బహు సామాన్యంగా నా పని తెలిసినట్లు హఠాత్తుగా నా వైపు చూస్తూ శ్మశాని కెళ్ళుతున్నా నన్నాడు కోపం వహించాడనుకుంటూనే 'అమ్మో భయం' అన్నా నా భుజం పై చేయేశాడు క్రుంగిపోతానేమో నన్నంత బరువుగా ఒక్క ఊపు ఊపి ఏదో అన్నాను ఉలికి పడతావెందుకు ? అంటూనే గబగబ నడచి పోయాడు ! అమ్మయ్య వదిలాడు ఇంకా నయం తనతో పాటు తీసుకపోలేదు ! అతని గురించి అడగడం మరచా, ఈ మారు కన్పిస్తే అడగాలనుకున్నా ఆ రాత్రే కలలో కన్పించి, మళ్ళీ తనతో రమ్మన్నాడు ప్రియంగా తోడు నీడా లేరేమో నాకు భయం వేసింది కేకవేసా మళ్లీ కన్పించి అదే మాట ! అన్నాడు ఈసారి ధైర్యంగా తలూపి మర్యాదగా 'అలాగే తప్పకుండా ' అన్నా అతని ముఖం మొగ్గ తొడిగింది. ఆ ఇల్లు నాకు వ్రాసిస్తాన నన్నాడు అమ్మేయాలా ? మరమ్మతు చేయించి అద్దెకివ్వాలా ? ఏలా ఎంత లాభిస్తుందన్న ఆలోచనతోనే తెల్లవారింది లేచి కిటికీ వద్దకు వెళ్ళి ఇనుప చువ్వలు పట్టుకొని వంగి ఒక చెంప చువ్వలపై ఆనించి నిల్చున్నా బద్దకంగా నా కంటికి ఉదయం! శ్మశానంలో మండే చితి వలె ఉంది అబ్బ అప్పుడే ఎంత ఎండ అంటూ వెనక్కుతిరిగా “ఏడు గంటలైంది మరి” అంటూ ఎదురైంది శ్రీమతి ! ఆటలో పాటలో మాటలో వ్రాతలో బహుమతు లెన్నో అన్నీ చేర్చాడు పాపం గదిలో గోడకు ఆల్మెరాలో అందంగా గతం కలలు కంటూ రోజూ ఆ గదిలోనే అతని ప్రపంచం ఒక రాత్రి దొంగలు పడ్డారు అన్నీ మూట కట్టుక పోయారు

34. ఇల్లే పదిలం ఉదయం లేచి చూస్తే గుండె గుబుక్కుమంది పోయిన వస్తువుల స్థానాల్లో ఏవేవో కన్పించాయి ! పులి చర్మాలూ ! జింక కొమ్ములూ ! పాము కోరలూ ! తేలుకొండ్లూ సింహం జూలూ, ఏనుగు దంతాలూ ! వగైరా వైగైరా అద్దం ముందు నిల్చుంటే ఇవన్నీ ఎన్ని దిశల నుండో జ్ఞాపకంగా ఆయా ప్రాణుల రూపాల్లో బింబిస్తాయి

అద్దాని కెదురుగా అతడు అడవిలో నాగరకుని వలె ప్రస్తుతానికి తుపాకి మనస్సుతో కాటేజి ఊహతో అంతలో బిగిసిన శాంతి ముఖంతో చుట్టూ శూన్యం చీకటి సంకెళ్ళ వలె కాళ్ళ క్రింద జారిన నీడలు ! గంతులేసే లేగ దూడను కట్టుకొయ్యకు చేర్చినట్లు అద్దం ముందు నిల్చున్నాడు ! క్రాప్ దువ్వుకుంటూ వెనక్కు తిరిగి కిటికీ తలుపులు వేసే లోపల ఒక మూల రాత్రి ఒదిగి పడుకున్న పిచ్చుక లేచి రివ్వున బయటి కెగిరి పోయింది సెలయేటి అలలు కాలితో చిమ్మినట్లు తలుపులు దగ్గరికి లాగే లోపల ఎక్కడి నుండో వచ్చి పిల్లి లోపలికి దూసుక పోయింది ! తలుపుకు తాళం వేసి బయలు దేరాడు పోలీస్ స్టేషన్కి వాటి తస్సాదియ్యా ! అక్కడా కుర్చీల్లో! ఇంట్లో అద్దంలో కన్పించిన రూపాలే ! తుది బిందువు ముగిసింది ! వలయం పూర్తి అయింది ఇల్లే నయమని పించింది తలవంచుకొని బయలుదేరాడు ఒక్క నిదుర తీసాడో లేదో గంగలో శవాల వలె అంతా మటుమాయం అవును ఇల్లే ఎంతో పదిలం !

35. గాజు గది మనలో ప్రతి వ్యక్తీ మతిలో ఒక గాజు గదిలోనివాసం అవతలి మనిషిని చూడడం పరీక్షించడమే కాదు తాను గోప్యంగా ఉన్నట్లు భావించడం సహజం దీనికి దరవాజాలు కిటికీలు లేనే లేవు లోపలి నుండి బయటికి మనిషి రా వీల్లేదు బయటి నుండి లోపలికి వెళ్ళే ప్రశ్న లేదు ! అద్దాలు పగుల గొడితే ఈ కోరిక తీరుతుందనే నమ్మకం ఇది ఎట్లా ఉందంటే సరస్సుపై నీటి పొర లొకటోకటీ ఒలిచేసి అందులో బింబించే చంద్రుణ్ణి బయటికీ తీయాలనుకోడం ! ఒక హద్దులేని అవసరాల కల్పనతో అపుడపుడూ ఒకరి గదిలోకి మరొకరు వెళ్ళాలనే ఉబలాటం మరీ మరీ

ఎన్ని గదులు దాటినా తనకూ అవతలి లోకానికి మధ్య ఎప్పుడూ ఒక గది అయినా నిలిచి ఉంటుంది. అడుగు ముందుకేసి సాగినపుడు ఒకటొకటీ చంద్రుని వలె ప్రహ్లాదంగా ఉంటుంది. అడుగు నిలిచి పోయినపుడు, ఎక్కడిదక్కడే సమాధి వలె భయావహంగా ఉంటుంది సృష్టి కదలికలో సమాజం అనుభవంలో ఉంది ఆనందం ఎంతటి జీవితమైనా ఏదో ఒక వ్యాపారంలో మనో వ్యవహారమే !

36. చస్తూ బ్రతుకుతూ పోరాటం బ్రతుకులో గుడ్డి గుడ్డిగా కుంటి కుంటిగా ప్రతిచోట తెలిసిన వారితో తెలీని వారితో ప్రేమతో ద్వేషంతో శాంతిలో యుద్ధంలో గ్రుడ్డి కెవరో దారి చూపిస్తారు కుంటికెవరో ఆసరా ఇస్తారు అయినా మనిషికి మనిషి గుహలోనో అడవిలోనోవసించే జంతు సమం పురామనో నిలయంలో వీటి ఆవాసం మాత్రం భద్రమే. తెలుపు నలుపు ఎరుపు ఒకదాని నొకటి క్రమ్మేయ జూస్తాయి రంగుల హంగులతో మురుస్తూ దేని కది అందం చందం తమదే అనుకుంటాయి మంచులో చీకట్లో వెలుగులో పోరాటం ప్రతిచోటా బ్రతుకులో తెలిసీ తెలియక ఎదురెదురై తీర్చేరు నవంనవంగా మనోగుణాల కలయికతో ప్రకటనంతో పోట్లాటకూ కాట్లాటకూ ఊసిగొల్పే వికృత గుణం లేంది లేదు సుమీ ! ఆనాటి ఇతిహాసం ! ఈనాటి జీవితం అందరికీ కావాలి చీకట్లో తమ ఎదలో సూర్యుని వెలుగు, ఏలా వస్తుంది ఎపుడో ! రావచ్చు చస్తూ బ్రతుకుతూంటే ! దారికడ్డంగా నిల్చిన నిన్ను చూచే సమయం లేదు నా గడుసుతనంకన్నా నీ పెంకితనం చూచి చెట్ల చాటు నుండి కాలం నవ్వి పోతూంది నా ముందుకు రాకు నా కంటికి కన్పించకు పో ! అవతలికి పోవేం ! రోజు ఇదే పని నీకు !

37. దారి కడ్డంగా ఈ గ్రీష్మాన్ని ఎవరార్పుతారు ? ఈ దరిద్ర మెవరు తీరుస్తారు నీమనో ముకురంలో బొమ్మలు ! నే చూస్తే సంతోషిస్తాయా ? మండనీ ! మండి మండి నిప్పై బూడిదై మనై పోనీ చినుకు పడి తడిసిన పచ్చిగడ్డి తన ముఖమైనా చూపొచ్చు వెళ్ళు ఆ గుళ్ళోకి ! పో ఆ సత్రంలోకి ! ఊపిరి అల ఆగేట్టుంది ! నా ముందు కన్పించకు ! నీ దీన రవం వినిపించకు బురదలో తేలే పట్టణాల్లో పైన పన్నీరు చల్లుకుంటున్నారు అసత్యంలో సత్యం వలె దుర్గంధంలో గంధం వలె ఉంది అంతరాత్మ నీవే మొగం పెట్టుకొని వస్తావు ! ఏ గణానికి చెందుతావు ! గత కాలం శైథిల్యంతో భవిష్యత్తుపై భయంతో కదలిపోయే ముఖచిత్రాల్లో కాంతి లేదు శాంతి లేదు కాలం కరగుతుంది మైనపు వత్తి వలె ఎవరు నీవు దాని వెలుగు అంచులోని నీడవా క్రీ నీడవా ? ఇపుడు నిల్వడానికి సమయం లేదు అవతలికి పో నీకే చెప్పేది పోతావా లేదా ? నీ కవిత్వం మూట కట్టుకొనీ !

38. దుమ్ములో అలలూ కలలూ అలల వరస వలె పిల్లలు దుమ్ములో అడుకుంటున్నారు వారి నవ్వులకు బుగ్గలపై మట్టి చారలు విప్పారాయి అతడో ప్రయాణికుడు ! దారిలో తారసిల్లిన పెద్ద మనిషి పిల్లల నవ్వు కన్నా ఏడుపే శోభగా ఉంటుందతనికి దగ్గరికి వెళ్ళి ఒకణ్ణి చరిచాడు కెవ్వున కేకలో సంగీతం వినిపించిందతనికి రెప్పల క్రింది నుండి చెంపలపై నీటి చారలు చూచి పాపం ! అనిపించిందేమో ! ఒక పైసా విసిరాడు ఏడ్చే పిల్లడి కన్నుల్లో నవ్వు తొంగి చూచింది అతనికి కోపం వచ్చింది ! ఎందుకో తెలుసుగా ఏదో పోగొట్టు కున్నటెంది ! ముందు కొచ్చి ఒకటి చరచి ముంగిట మరో పైసా విసరి గబగబ నడిచి పోయాడు వెనక్కు తిరిగి చూడకుండా ! అయినా అతని వీపుకి కళ్ళున్నాయి. వస్తూపోయే జనం కాలి ధూళి వారి మధ్య నున్న అంతరాన్ని కప్పేసింది

వెనక్కి తిరిగినా చూపుకున్నా గ్రుడ్డి నయమనిపించేట్లుంది కలల వరస వలె దుమ్ములో పరుగెత్తే పిల్ల ముఖాల్లో నవ్వులు! దూరదూరం పోయినంత మేర విసరేసిన బాకుల్లా అతనికి తోచడంలో ఏ ఆశ్చర్యం లేదు ఉదయం నుండి సాయం సమయం వరకూ మండే అగ్ని జ్వాలా తోరణాలతో రోదసి నిండి పోయింది రాత్రి సమయం ఆరి బొగ్గె చల్లబడిన శ్మశానం వలె ఉంది కుంచితమై చీకట్లు క్రమ్మిన నీలాకాశంలో అక్కడక్కడా గాలికి చెదరిన నిప్పు రవ్వల వలె చుక్కలు

39. పతాక వార్త భయంతో బిగిసిన నిశ్శబ్దాన్ని చీల్చుకొనీ వెర్రి కేక ! రివ్వున గాలి వేసే ఈలలకు చప్పట్లు చరచే చెట్లు ! అలల్లేని చీకటి నీటిలో బరువైన వస్తువు పడిన చప్పుడు మేల్కొన్న మనస్సులో ఒకటి రెండు పురాస్మృతుల కదలిక కదలిక గుర్తుపట్టి ఎవరో మెల్లగా జారి పోయినట్లు గుర్తు అలికిడి విని గుంపులుగా అలజడిగా సాగి ప్రతి అంగుళం అంగుళం గాలించి కాలి జాడైనా తెలీక విసిగీ వేసారిన గాలులు, చెట్లతో గుసగుసలాడుతున్నాయి ఎప్పుడో డెక్కడో భయంతో తల దాచుకున్న చంద్రుని పాదాలు కన్పించీ కన్పించడం లేదు శవ దహన సన్నాహం జరుగుతూన్న ఆకాశం ! సృష్టి మొదలు నుండి ప్రతి రోజు ఇదే విధం చీకటి చిత్ర వధ చేయబడినట్లు ఉదయాకాశ ముఖాన పతాక వార్త నా వెనక ఈడ్వబడుతూ వచ్చే నీడలతో క్రీనీడలతో వీధిలో నేను పునర్జన్మ తెలీదు గాని ప్రతి ఉదయం మరో జన్మ ఎత్తి నట్లుంటుంది ఫిల్్మ పేరు జ్ఞాపకం లేదు చూచి ఎంత కాలమైందో

40. పేరు జాపకం లేదు మధ్య మధ్య నవ్వులు ఏడ్పులు మంటలు! మంటల పూలు కంటికి ఇంపుగాను ఎదకు నిందుగాను సాగుతోంది

ఉన్నట్లుండి మధ్య సీటు ఖాళీ అయింది కనుమరుగై పోయిన వ్యక్తి గురించి అంతా మరచారు తెరపై బొమ్మలు వస్తూ పోతున్నాయి ఇంద్ర ధనుస్సును చిన్నాభిన్నం చేసి అమర్చినట్లుంది నిశ్శబ్ధం ధ్వనిలో పరవశించి కరిగిపోతూంది రెక్కలు ముడిచిన దీపం క్రింద నీడలు కలలు కంటున్నాయి. మనిషిలో సృజన శక్తి చుట్టూ కాలం తిరుగుతోంది. చీకటి నడుము చుట్టిన వెలుగు అంచుల్లో గాలి ఒదిగి ఉంది ఎవరూ ఏమీ చెప్పక పోయినా అన్నీ చెప్పినట్లే ఉంది ఆ క్షణం నిశ్శబ్దం, నృత్యంలో అలసి తెగిన మంజీరంలా ఉంది గంట గణగణ మ్రోగింది! వెలుగు బిలబిలా వచ్చింది ఎక్కడిదక్కడ సద్దుమణగి! ఏమీ తెలియనట్లే ఉంది 'చాక్లెట్్స! డ్రింక్్స' అంటూ కుర్రవాడి కేకతో జనం ఈ లోకంలోకి వచ్చారు ఇంతసేపు పరిమళవంతంగా వెలిగిన అనుభూతి నుండి “ఇప్పుడెక్కడున్నాను?” “ఉన్న చోటునే!” జ్ఞాపకం వచ్చింది చూస్తే వెలుగులో! ఆ వ్యక్తి తన సీట్లో ఎపుడు వచ్చి కూర్చున్నాడో ? ఎవరి ఇంటి దారి వారు పట్టే ఆతురతలో ఉన్నారందరూ హాల్ బయట బ్రతుకు బండి సిద్ధంగా ఉంది, మాదే ఆలస్యం! ఇవి విద్యా నిలయాలు ! వెలుగు ఆశలు పెంచుకున్నవి వీరే నా సోదరులు ! రంగుల వలలు క్రమ్మిన స్పటికాలు ఈ దశాబ్ది ప్రపంచంలో సమస్యలకు నిలువు టద్దాలు అరచేతిలో వైకుంఠం పిడికిట్లో కైలాసం బిగించి వారే నవ ప్రభావ గ్రహాలు ! భవిష్యత్తు తంత్రకర్తలు అయ్యో ఈ దేశం ఇపుడు చల్లారని శ్మశానం వలె ఉంది పొగ క్రమ్మిన రాజకీయం వికృత శిఖలు ధరిస్తూంది సూరీడు ఉదయించి ఎంత సేపో అయింది అయినా జీవితం చీకటి గుడారం వదలదు మంచు ముసుగు వీడదు అదిగో సామాన్యులు మంటలు పూచిన తీవెలు ! ఉన్న కళ్ళు మూతలు పడి ఎక్కడి కని వెళ్ళగలరు ! అయినా సందుల్లో గొందుల్లో పడి వెళుతూనేఉన్నారు మూకలుగా ! ఒకరి నొకరు ఢీకొంటూ త్వర త్వరగా

41. అగ్ని గానం ఈఎత్తిన ఇనుప చేతుల పర్యవసానం ? ఈవేసే అడుగుల గమ్యం ప్రయోజనం నైతిక వైక్లబ్యంతో అనుచితోద్రేకంతో యుగాల సంస్కృతి శిఖలై చీలుతూంది మనిషికి మానవుడు కన్పించడం లేదు మనసులో మానవీయం ఇగిరి పోతూంది అసహనం ! అవమానం! హింస ! ఆత్మ హత్య ! ఆటవిక ఝంఝా వీచికి రవీంద్ర సరోవరాన కూలే సంస్కృతీ శిఖరం నుండి ఎటు పరుగెత్తేరు ! నీటిలోకా ? వీటిలోకా ? ఏ ఒడ్డుకు ? ఇది మన ప్రజాస్వామ్యం ! ప్రభుకాలం కాదు నేటి భారతం ఎందరి తలల పైనో కాలూని చరిత్రలో ఎన్ని పుటలో పయనించిన సంస్కృతి ఇపుడు కొండ వలె పడి ఉంది ! ఎత్తిన ముఖాలు దించేయండి వీటిలో వెలుగు లేదు ఎత్తిన చేతులు వాల్చేయండి వీటిలో లక్ష్యం లేదు భగవంతుడా ! ఎక్కడున్నావు ? నీవు ఎదుట పడినా నిన్ను గుర్తించే దెవరీ సమయంలో ? పొగల్లో వెళ్ళనీ ! మేం పోదలదలచుకొన్న చోటికి ! ప్రస్తుతానికి సెలవు ! అగ్ని గానం మానలేం ! ఒక మాట చెప్పనా మానవతాగంధంతో నీవున్న చోటికే మేం తిరిగి రావచ్చు

42. ఆ సమయం రానీ రావద్దు ఆ సమయం ఉదాసీనత ఉద్యోగం చేసే ఆ సమయం రావద్దు దీని కన్న నిద్ర మంచిది కదలిక లేని శాంతి వద్దు రానీ క్షణం విషమ పాత్రగా అది మానవతా పూర్వమై మారనీ అమృత పాత్రగా ! నిరాశ నిటారుగా పెరిగి నింగిలో తల దూర్చీ నది ఒడ్డున రేవు పై విశ్వాసంతో తిరిగే వ్యక్తికి గత విషాదం జ్ఞప్తికి తెచ్చే ఆ సమయం రావద్దు దీర్ఘమైన చీకటి ఆయువును తగ్గిస్తూ వెలిగే ఆ సమయం రానీ రారానీజడ మతిలో చేతనతో అనాది నుండీ నీవొక దేవతపు

43. ఇరవై ఒకటో శతాబ్దిలో చంద్రుడు మా మనసుల్లో హ్లాదానికి రమణీయ రూపానివి ! ఋషులచే దర్శింపబడి దేవతల కమృతాన్నంగా చుబుకంపై పుట్ట మచ్చ అందం మరచిన కవులకు ప్రేయసి వదనంగా వెలిగే అమృత బింబం చీకటి సెమ్మెపై మౌనంగా వెలిగే దీపం నీ నిద్దుర ఛాయా రూపం చీకటి నీ మెలకువ వెలుగు రూపం వెన్నెల సందేహ బీజాలకూ సమస్యా వృక్షాలకూ నిలయమైన అకాశాన నిర్లిప్తంగా ఒంటరి జీవితం గడిపేవు ! ఇక్కడి ప్రణయ కోపనులకు దౌత్యం కొనసాగిస్తూ కళల మార్పుతో అలవలె ఉన్నావు ! ఎప్పటి నుండో ! సరే ఆ సంగతి అట్లా ఉంచుదాం దేవతా భావన నుండి గోళ రూప దర్శనంతో నీ గురించి జిజ్ఞాసా పరిశోధనలో కొత్త మలుపు నీ పై ఆర్మా్రంగ్ కాలూని సౌదర్యం కలపడంతో మొదలు హద్దుల అతిక్రమణ జరగడానికి ప్రక్కన పరాయి వాడంటూ ఉంటేగా ముఖంపై కత్తి గంట్లు పెట్టడానికి ఎవరికీ అందని ఎత్తులో ఉన్నావింత వరకూ ఇక ముందు వెలుగు కెరటంలా తేలుతూ గాలి బంతిలా ఎగిరే శరీర నిర్మితితో ప్రతి మనిషి కాంతి గోళంగా మారి నిన్ను చేరేను ప్రతి మస్తిష్కం టెలివిజన్ యంత్రమై నిన్ను చూచేను మేం నీ స్థాన మాక్రమించి, నీ గురించి పూర్వం ఈ లోకంలో వ్యాప్తమైన అభూత కల్పనలకు స్వస్తి పలికి పరిశోధనలు సాగించి నీ జీవిత తత్త్వం తేల్చి కొండ జాతి మనిషివనో రాతి నేల ఖండమనో ఇంకేవో వైజ్ఞానిక ప్రకటనలు వెలువడవచ్చు. నీతో ప్రత్యక్ష సంబంధం నెలకొనవచ్చు అపుడు నీ చుట్టూ రక్షణకై అమర్చబడిన యంత్రాలు నియమింపబడిన సోల్జర్లు పైన తిరిగే విమానాలూ, నీ జీవిత రూపం మార్చడానికై అహమహమికతో పరుగెత్తే

పరిశోధకులు నేతలు నిన్ను తమలో కలుపుకునే తంత్రాలు హద్దులతోనే దేశాల ఉనికి హక్కులతోనే నవ జీవిత సంస్థితి భౌతిక శక్తులతో బ్రతుకులో పొరలతోనే జాతులు విభేదాలు నీవో మా కంటికి రమణీయ సంస్కార పురా రూపానివి సూర్యుడున్నంత వరకూ నీ అస్తిత్వం మాసి పోదు నిను గూర్చి పగటి కలలు కన్న మేమిపుడు నిన్ను రాజకీయ వేదికగా వ్యాపార సంస్థ గానో మార్చవచ్చు కాంతి గోళం వలె వెలిగే నీవు మా అధికారానికిలోనైతే కాల పరిమితి దాటిన నీ హక్కుల పత్రం చెల్లేనా ? చలికి బిగిసిన మంచు మనిషిలా ఒంటరిగా గగన వీధి బిక్క మొగంతో పాలి పోయి కన్పించే చంద్రుణ్ణి చూచి ఊగిసలాడిన హృదయం ఒక సమయం సృష్టించుకున్న ఊహా చిత్రం ఇది గాలి రుస రుసలాడుతోంది ఎండ కణకణలాడుతోంది ఇసుక దిబ్బలపై గుడారాల వలె జీవితాలు ఎండిన చెట్ల నీడల్లో నివాసాల వలె ఆలోచనలు అవని దప్పికతో ఉంది మనస్సు తపనతో ఉంది

44. ఈ ఎడారీ అడవీ నీరు ! కావాలి నీరు ! పెదవులపై అణగిన సంతోష వార్త ఎపుడు పైకి ఉబికేదీ తెలీదు నీటికై అన్వేషణ ఆరాటం ఆరాటంతో పోరాటం ! యుద్ధం ముగిసిన దేశం వలె ఉంది వాతావరణం తిరగ్గా తిరగ్గా కన్నీటి చారికల్లా నీటి పాయలు భూమి పొదుపు చేసుకున్నవీ, ఎక్కడో దాచుకున్నవీ ఎండిన కొమ్మలతో బిరుసెక్కిన కేశరాజితో మొద్దు బారిన చెట్లు మరోజన్మకై వేచి ఉన్నాయి ఎడారి ప్రపంచంలో అడవి జీవితంతో జనం ! అపుడపుడూ ప్రాణం రుచితో పల్లవిస్తూనే ఉంది ! ఇంతటి ఎండల్లోనూ అన్వేషిస్తే దొరక్క పోదు ఒయాసిస్ ఎక్కడో ఒక నీటి జాలు గొంతులో గంగ దిగడానికీ ఇంతటి ఆర్తిలోనూ వినిపించక పోదు అనురాగ స్వరం ఎప్పుడో ఒక ఆర్ధభావంతో మనుషుల్ని కలపడానికీ

ఏ రుస రుసలోను ఏ భగభగలోను ఆగదు వ్యవహారం వ్యాపారం ! వర్షం ఆలస్యంగా వచ్చినా, అవని ఎదపై గంగ దూకినా ఈ ఎడారి రూపు మాసేట్టు లేదు! ఈ అడవి దాహంతీ రేట్టు లేదు తెలివి పదును కోరుతూంది సమయ సమయవ్యూహం ఈ జీవిత మెంతదైనా పసివాడు వేసిన వర్ణ చిత్రం

45. ఈ గీతం ఈ వేదిక నలంకరించిన తరుణ మనస్కులూ మనో భూమికలో రహస్య గనేషణ మతులూ భౌతిక జగత్తులో పరిణామ విచారణ చణులూ స్వాగతం పలికి మీకు ! ఈ గీతం వినిపిస్తున్నా అపశకునపు టూళలూ ఉద్రేకపు టురుపులూ గుండ్రాళ్ళ దొర్లింతలూ గులకరాళ్ళ కలవరింతలూ ముళ్ళ కంపల ఈడ్పులూ నిదుర లో పలవరింతలూ సుడి గుండాల తిరుగుళ్ళ ఆవలింతలూ ! త్రేన్పులూ ఒకటేమిటి ? ఇలాంటివి శబ్దించే ముఖ యంత్రాల్ని నియంత్రించే గీతం ! వినిపిస్తున్నా! ఉత్సాహ కళికలూ ! ముగ్ధ ముగ్ధంగా కాలాన్ని కత్తిరిస్తూ ఎగురుతూ ! క్రూర కిరాతక చర్యకు బలియై విలవిలలాడే, హరిణ శాబకం హృదయంతో ఈ గీతం వ్రాస్తున్నా సౌందర్య పరిమళాలతో కాలాన్ని మరపిస్తూ ఊగే పూవుల మధు పరాగ ఊహలతో ఈ గీతం చిత్రిస్తున్నా తల్లి కలల కానందాకృతి నిస్తూ బ్రతికి బట్ట గట్టి కాలాన్ని జయించే శిశువు హృదయ గతిలో ఆయువు రహస్య శక్తితో ఈ గీతం శబ్దిస్తున్నా గాలి పిల్లలు దిశల చెరగుల్లో దోబూచు లాడినట్లు వెలుగు కత్తులు రోదసి గుండెపై తళతళలాడినట్లు శబ్ద శర పంక్తి దిశా వీధి పరుగు తీసినట్లు వర్షధార భూమిలో విలీనమైనట్లు నా మాటలు మనస్సులో పొరల్లో కదలీ అంతరాత్మలో అర్థవంతాలై మానవ జీవన వ్యూహంలో అమృత కాంతి వర్షంతో నవ నవోన్మేష సృజనాకృతి, ఈ గీతం వినిపిస్తున్నా

46. యుగ సంకేతం నిరాశలో మేల్కొంటాను ఆశతో జయిస్తాను అణువణువున నర్తించే శక్తిని నే నీ యుగ సంకేతాన్ని పగలు చెమటలో తడిసి రాత్రి అలసట క్రమ్మిన ఈ ప్రపంచ కక్ష్య రేఖను, నవ సమాజ గతి రూపాన్ని ! దీపమై వెలుగుతాను గుండెలో తోరణమై వ్రేలుతాను తలపై బొగ్గును రగుల్పుతాను మట్టిలో ప్రాణం తెస్తాను నేను జీవన సంగీతాన్ని, నేనీ యుగ సంకేతాన్ని నాకు దుఃఖం లేదు నేను పుట్టినందుకు తీరిక ఒపిక ఉంది విషాద శ్రుతి వినడానికి నాకు తృప్తి ఉంది నేను చేసే పనిలో ఆరని వెలుగు ఉంది దీపం వికసించడానికి ఆశాంతి ఆక్రందనలో జన గణం కోసం అగ్నియై మేల్కొంటాను వర్షమై బ్రతుకుతాను చంద్రునిపై ఆర్మా్రంగ్ సోదర మానవుడు అడుగు మోపిన క్షణం గంతేసిన యుగ ప్రభాతాన్ని ఒకే ఒక హృదయమై స్పందించే ప్రపంచ దృశ్యం బింబించే టెలివిజన్ మనో రూప యంత్రాన్ని నిరాశను ఎరువుచేసి విశ్వాసం పండిస్తాను నిశిలో మేల్కొంటాను ఆశతో జయిస్తాను నే నీ జీవన సంగీతాన్ని నే నీ యుగ సందేశాన్ని ప్రజాస్వామ్య విభాతాన్ని నేనీ యుగసంకేతాన్ని

47. చీకటి వెలిగించిన వార్త రోడ్ పై ఏదో మునిగిపోతున్నట్లు ఉరికే పిల్లడి కన్నా ఏ క్షణం అపాయం జరుగుతుందోననీ, గర్జిస్తూ దూక నున్న సింహం వలె వీడని సంశయంతో ఇంట్లో ఊహ చేసే తల్లికి పట్టుకుంది భయం కాలం కదలుతోంది దున్న పోతు బండివలె అలసినా విసిగినా ఏమైనా ప్రయాణం తప్పదు కిటికీ నుండి చూస్తే పగలు పూచిన మోదుగ వలె ఉంది

గదిలో బల్బు ముఖం ఉలికి పాటుగా వెలిగింది చీకటి కెదురు ప్రశ్న వలె ధైర్యంగా నిలిచింది ఉదయ మెదురైంది రక్తారుణ పద్మం వలె హృదయం స్పందించింది జల భరిత సరస్సు వలె ఏదో మునిగి పోతున్నట్లు ఉరికే పిల్లడికన్నా ఇంట్లో వేచి ఉన్న తల్లి కెంత ఆరాటమో అతడు తన కన్నుల్లోకి దూకే ఆ క్షణం రావాలనీ ఆనందం నవనీత సుకుమారంగా చూడాలనీ నిద్రలో కన్నుల్లో జ్వలించే దీపాలు కొడిగట్టాయి తెరచిన కన్నుల్లో వెలుగులు నడవ లేని బొమ్మ లయ్యాయి వీటి చుట్టూ నీడలు భయం పొరల వలె ఉన్నాయి ప్రేమలో ఆశలో ప్రాణం వ్రేలాడుతూంది జీరాడుతూంది 'పాడు కాలం వచ్చిందంటూ ! అడుగు పెట్టారు ఇరుగు పొరుగూ ఆనాడు పత్రికల్లో వార్త ! పోలీసు కాల్పుల్లో ఆ యువకుని మృతిపై ఆనందం విషాదం నిత్యం అనుభవించే ప్రపంచంతో

48. దేవునితో గోషి ప్రగాఢ బంధం లో ఉంటూ ఎక్కడో దూరంగా బ్రహ్మైక్య భావన గురించి మాట్లాడే ఇష్టం లేదు భయం క్రమ్మిన విశ్వాసంతో తన కీర్తిని కాపాడే మనుషులపై అనుగ్రహంతో ఆగ్రహంతో వెలసే భూమిలో గాలిలో నీరులో గగనంలో వెలుగులో అణువు నుండి బ్రహ్మండం విస్తరించి పూర్వం ఎందరికో వారి వారి మనో దశల్ని బట్టి విభిన్న రూపాల్లో కన్పించీ, కన్పించని దేవునితో ఇరవయ్యో శతాబ్దిలో జరిగే టెలివిజన్ గోష్టి ఊహలో సశేషమైందీ ఆశ్చర్యంలో విశేషమైందీ ప్రపంచం విజ్ఞాన యంత్రమయమైన ఈనాడు జీవితానికి సరికొత్త వ్యాఖ్యాన అవసరమవుతూంది ఊహల స్వభావం మారి దానితో క్రియా పర్యవసానం మారి మానవ సంస్కృతి గతికి కొత్త విలువ లేర్పడుతున్నాయి ఏ ఆకారం లేని నీకో రూపం కల్పించి పూర్వం నీ రక్షణ వ్యాజంతో ప్రచార గతి మిషతో

జరిగిన అవమానాలు హత్యలు యుద్ధాలు అసంఖ్యాకాలు నీ రూపం మలచడమే పరమ ప్రయోజనంగా మారి జీవిత యాదార్థ్యం నుండి మనస్సు వివేకం కోల్పోయి భూకంపం యుద్ధం క్షామం నియంతృత్వం అన్నీ నీ దయా రహితాలుగా దుర దృష్ట హేతువులుగా బాధ్యత నుండి తప్పుకొనే అవకాశం ఏర్పడింది. ప్రకృతి పై విజయం సాధిస్తూ నిరంతరం విజ్ఞానంతో దారిద్య్రం రోగం భయం నుండి ముక్తం చేసే కృషిలో స్పుత్నిక్ దశ చేరుకునీ సామాన్యుని మాటేమిటి ? హేతువుకతీతమైన సిద్ధాంతాల పరంపరలో చిక్కుకున్న మనిషిని బంధించే సమస్యలెన్నో ? కొందరు గతానికి చాలా దగ్గరి బంధువులు వర్తమానం శిలా నిద్ర వదిలించే పరివర్తనం దూకించే విప్లవం క్షమించరాని శత్రువుతో సమానం కిరీటాలు అగ్నిలో భస్మమై స్వేచ్ఛను పొందే సామాన్యుని ప్రపంచమిపుడో హేతు మయం ఒక దిశలో యుద్ధ భయంతో మరో దిశలో విజ్ఞాన ఫలంతో మానవ సంస్కృతి పై ప్రభావం నెరపుతుంది మనిషిలో స్వార్థం వదలబడిన అణ్వస్త్రం వలె ఎదురు లేక మైదానంలో విసరిన బంతిలా సూటిగా కాల మిపుడు భవిష్యత్తు శ్రేయో రూపంమైంది దేవునికన్నా జనప్రేయోరూపమైంది కాలాన్ని నియమించ లేని దేవుడు కాలానికి తల ఒగ్గక తప్పడం లేదు ఉదయం మంచు బొమ్మ వలె మెరపిస్తూ, మురిపిస్తూ పెదవి విప్పక మౌనంగా ఉన్న నీతో గోష్ఠి జరిపేదెలా ఒక క్షణం నిశ్శబ్దంలో శబ్దంతో నే నెవరో నీవు చెప్పేదాక తెలీదు నిజం చెబుతున్నా ! మనిషే! ఒక దశలో దైవం ! నీవనుకునే నేనే, నీ రూపం ! సదస్యులు లేకుండా ఆడే నాటకం వలె

49. నగరంలో ఉదయం రాజాదరణకై తారాడే కవి రత్నం వలె నగరంలో ఉదయం ! వచ్చింది ! రవి గమనానికిదారులు తెరచే ఉషస్సు దివా దుహిత ! యజ్ఞ కేతువు ! ఇక్కడ ఎవరికీ తెలీదు ! చీకటి ఎడారి బ్రతుక్కి ఈ వెలుగు ఒక ఒయాసిస్ అని కళ్ళు విప్పి వేచి చూస్తేగా తెలిసేది ! మనిషికి ఇక్కడ గడియారమే కాలమానం ! బ్రతుకు తెరువూ భోగ భావం రెండే రెండు దృష్టి రేఖలు దాదాపు అంతా క్షణం తీరిక లేని యంత్రాలే ! గుండె డాక్టర్కు అప్పగించి బుద్ది ఎక్కడో తాకట్టు పెట్టి సూర్య చంద్రు లిక్కడ రిటైరైన వాళ్ళతో సమానం పాపం చంద్రుడు మరీ ఔటాప్ డేట్ మ్యూజియంలో నిలిపే అమూల్య వస్తువు క్రిందే లెక్క ఏదో నెట్టుక వస్తున్నాడు సద్యో యోగంతో ప్రణయ దౌత్యాది గిరాకీ తగ్గినా మూనెట్ డిన్నర్కు అవసరమే ! ఇక వసంతం మాట పూర్వ కావ్య ప్రపంచంలోనే కోకిల మాటే లేదు హారన్ సైరన్ బహువిధ యంత్ర ధ్వనులు తప్ప ఎపుడైనా కవి వేష దారి ఈ సరంజామా పట్టుకొస్తే మర్యాదా యవనిక చాటున అదొక విచిత్ర శ్రీయే ఎప్పుడో రాత్రి చంద్ర బింబం కన్పిస్తే స్పుట్నిక్ గమనంతో ఆస్ట్రోనాట్ విహరణంతో రేపు పృథ్వీ సోదరుని వద్దకు వెళ్ళే ఆలోచనతో మానవ విజయ కేతనమై నిలుస్తుంది భావ ప్రపంచం ! నగరంలో ఉదయం ఇక్కడి ప్రజలకు మాత్రం అద్దాల కేస్లో భద్రపరిచిన బంగరు నాణెం !

50. నవ్వుతూంది వెలుగు నాలో ఓ స్వప్న హంసమా ! సమాజ బింబమా ! నీకు స్వాగతం చంద్ర బింబం నుండి ఊడి పడిన రమణీయ ఖండమా ! ఈ చీకటి బ్రతుక్కి ఊరట కలిగించే కాంతి శిల్పమా ! ఇక్కడ స్థితి శిశువు చేతిలో ఆట బొమ్మవలె ఉందా ! ఏలా వచ్చావు ? తెలిసా ? దారి తప్పా

తప్పదు నిర్బంధం ! కొంత సేపు ! చూడు మా అవస్థలు పరచుకొన్న సముద్రాలు విను ! మా బ్రతుకులు మండుతూన్న శిశిరాలు ! కన్నీటితో దప్పిక తీరదు! పాలూ పెరుగూ కాదు వెన్నెల ! ఆకలి తీరాకనే ఆనందం గురించి ఆలోచన వానలు సరిగా లేవనో పాడి పంటలు తరిగాయనో కార్మికులు సమ్మె చేసారనో పీడితులు తిరుగబడ్డారనో సమస్యలతో కదిలించనా ? ప్రశ్నలతో దిక్కుల్ని ఊగించనా ? గుట్టల్లో దారి చేసుకునీ, చీకట్లో దారి వెతుక్కుంటూ బీదరికంతో బేలతనంతో తిరిగే ప్రజ గురించీ మర్మంలేని గాథ చెప్పనా ? కర్మకాలినత వ్యథ వినేవా ? జోళ్ళు లేని కాళ్ళతో బండితోనో నాగలి తోనో బాట వెంట కదలిపోయే బ్రతుకు బరువు వివరించనా ? ఓ నా స్వప్న హంసమా! నీదో సుందర కాంతి లోకం నీలో కాన్నందివ్వడాని కెందరో ఎన్ని కలలో కన్నారు ఎప్పటి కపుడే కొత్త మాకు, సంతతి సంతతికీ క్రొత్త పాఠం చంద్రునిపై అడుగేసినా అవనిపై అడుగు ఎప్పటిదే తప్పనిదీ బయట వెన్నెల నవ్వుతూంది లోన నీడలు వెక్కిరిస్తున్నాయి ఊదాసీన చిత్రంలో రంగుల హంగులేని శూన్యబింబం సామాన్యుడు ! నిప్పు నీరు గాలి ఆకాశం మమత తృష్ణ అహం బలం ఒకదాని నొకటి అణచేస్తూనో, జత అవుతూనో త్యాగం రాగం శాంతి యుద్ధంలో ఏ వేళ సమాజం, సంక్లిష్ట వర్ణ చిత్రంలా మారేను నిరంతరం గోడ గడియారం నిశ్చలంగా చూపులు సరిస్తూంది ఎక్కడో దారి తప్పినట్లు రోజు తడబడుతూనే ఉంది దగ్గరిగా ఇనుప కమ్ములూ దూరంగా చీకటి గోడలూ ఇవి ముందు దాటి తేగదా ! ఆవలి లోకంతో పరిచయం అయ్యేది ఇక్కడ వస్తువు ఉంది, కదలిక రావాలి నీవు కదిలించే శక్తివి ఇక్కడ వత్తివుంది ! వెలుగు కావాలి, నీవు వెలిగించే రక్తివి నీకు మేము వింత ! మాకు నీవు కొత్త కాదు స్వప్నహంసమా! ఇవన్నీ మనసులో దాచుకో భద్రంగా ఎక్కడా పొక్కకు సుమీ మాకు సంస్కృతి ఉంది ! ప్రతిష్ఠ ఉంది పెట్టని కోట వరసలా పరిళమళ తరంగం వలె క్షితిజం నుండి వచ్చిన నీ చుట్టూ నా ఊహలు తుమ్మెదల్లా కదలడంలో ఆశ్చర్యం లేదు

నిను చూచిన సమయంలో దూత మేఘం మెదలుతుంది మనసులో పొరలో అనుభూతుల తలల పైకి కన్పిస్తాయి ఇక్కడా ఉన్నారు శపులు అస్తంగమిత మహిములు గుడిసెల్లో రోడ్ల ప్రక్కనా చినిగిన బొంతలతో వంతలతో ! అనుకునేవి నెరవేరడానికీ అంటూ జాడ్యం పోడానికీ వేప చెట్టు కింద వెలసిన దేవతల్ని నమ్మే భక్తులూ అవని పై పెరిగే అడవి వలె మనస్సుల్లో భయ సందేహాలు 'కర్మఫలం' ఇంకా జీవితంలో పరమ శక్తిగా మిగిలే ఉంది మర్యాద సహనం అహింస పేరిట ఎదురుగా గోడలు నిటారుగా ఉన్నది చాలు ఊపిరాడేంత వరకూ, లేని దాని కన్వేషించనూ లేరు చీకటిలో రాత్రి తేలుతూంది, రాత్రి నుండి ఉషస్సు విడుద లవుతుంది ఉషస్సుకై మనస్సు వేగుతూంది చీకటి గుండంలో, అంతా నిశ్శబ్దం నీవు కన్పించగానే చెప్పనా ఎదలో కదిలింది చంద్రకళ నాకు జ్ఞాపకం వస్తూంది నిన్నెక్కడో చూచినట్లు వాత్సల్యంకై అలమటించే త్వక్త శిశువు కళ్ళలోనా ? పేదరికంతో మూల కొదిగే బహిష్కృతుల తలపుల్లోనా ? నిశ క్రమ్మిన మతిలో చలించే విచ్చు కత్తుల మెరపుల్లోనా ? ఉష కోసం వేచి ఉన్న నిశి నిశి ఆశా లతికల చూపుల్లోనా ? మబ్బు క్రమ్మి వర్షానికి సిద్ధమైన దిక్కుల పెదవులపై అనురాగం విరిసినట్లు ! శక్తికీ రక్తికీ బింబమై వచ్చేవా ? ఏదీ మాట్లాడకుండా అన్నీ గుప్తంగా వెలిగిస్తూ చరిత్రలో దాగిన నిజం వలె ఎంత అపురూపంగా వచ్చావు ? ఒక మనవి ! యుద్ధ రంగంలో విమానం వలె రాబోకు సుమీ ఏపుగా పెరిగిన చెట్టు క్రింద నిప్పు పెదవులు విప్పింది కొలిమి సాన పట్టించి చికిలి చేయించడానికి గండ్రగొడ్డలి సిద్ధంగా ఉంది ఇది దేని కోసమన్నది? కాలం పైగానీ తెలీదు పచ్చని ఆకుల్లో పూల గుత్తి వలె నా ఊహల్లో స్వప్న హంస సముద్రంలో ఎగసే తరంగ శిఖరంపై ఆకర్షించే మణి దీపం ! సరస్సులో సూర్య బింబం వలె మనస్సులో రహస్యాల్ని చూపిస్తోంది నిదురకూ మెలకువకూ మధ్య లోతుగా సరించే నది వలె నేను నాచుట్టూ అన్యాయం ఆక్రందన రేఖలతో దీన హీన దృశ్యం నేను పయనిస్తూనే ఉన్నా రాత్రి తరగలపై పడవనై నీవు రావాలి మళ్ళీ చీకటి చివుళ్ళ నుండి తెల్ల గులాబీ వలె స్వప్నం మెలకువగా మారేనా ? హంస తెలివిగా మారేనా ?

నేను వెదకుతూన్న వెలుగు ఎదురుగా నవ్వుతూంది నీటుగా నాలో బ్రతుకుతూంది రివ్వు రివ్వున ఎగిరే హంస వలె ప్రపంచం మనస్సు కల్పించుకుందనీ నిర్మలాకాశంలో మాలిన్యం లేదనీ జీవితం దేవుడిచ్చిన వరమనీ వెలిగే సూర్యుని వదలి ఏ నీడ లేదనీ అంటావా ? కూలి వాని గొడ్డు కారపు మెతుకుల్లో ఏయే విటమిన్లు ఉందీ చంకలో శిశువుతో స్తన్య మిస్తూ అరచే బిచ్చకత్తె నడకలో లయ ఎట్లా ఉందీ చెప్పండి !

51. నిజం చెప్పు చెప్పండి ! ఈ దేశంలో సమృద్దిగా ఉంది ! అసంతృప్తి అనీ ఆందోళన అనీ బ్రతుకులో తప్పని విప్లవం రెక్కలు విప్పిన వాతావరణంలో “ఎవడికి పుట్టిన బిడ్డరా ? ఈ స్వాతంత్య్రం” అన్నట్లుంది! దేశానికి కావలసింది ! అధికారం, వైభోగం, రాజకీయం! లేకపోతే ఏలా నడుస్తుందీ ప్రజాస్వామ్య యంత్రం” అన్నట్లుంది ! తలదన్ని తాటి కెక్కుతూంటే ! ముసుగుదన్ని పడుకొనీ కలలుగనే సామాన్యుల కేం పట్టింది చెప్పు ఈ కథ ! పోరాటం నుండి పలాయనం చిత్తగించే సమయంలో ఇపుడు మన కర్తవ్యం ! మనస్సు విన్నది కన్నది పలకడం ఈ మరుభూములపై ఉల్లోల జల తరంగాలై ప్రవహించడం

52. లౌకికశ్రీ నీవు నా ప్రకృతికి వికృతి రూపానివి నీ ఉనికి నా అంతరాత్మకు వ్యతిరేకం నీకూ నాకూ ఉన్న సంబంధం మింటికీ మంటికీ గల అంతరం ఎక్కడో అవి కలిసినట్లు భ్రాంతి ఎంత దూరం వెళ్ళినా అంతా శూన్యం ! అంతలో మ్రింగేయాలన్న ఎత్తులో ఎంతో దగ్గరిగా వచ్చినట్లుంటావు ఒకపు డనుకూలంగా మరొకపుడభేదంగా నాలోకి తీసుకోవాలనిపింపజేస్తావు నీ నుండి విడిపోవా లనుకున్నంతలో నీవు చేసే గాలి రొదను అడవిలా వినమంటావు మేమంతా పడి ఉన్న అంబేదల మనుకొనీ

అనుకుంది తుచ చస్తే తప్పవు నీ గాలి అక్కర లేదనడం తెలిసీ కోపంతో ముఖం కందగడ్డ ఔతుంది అంతలో మంచు గడ్డగా మారుతుంది లో లోపల ఏమవుతుందో భగవంతునికే తెలుసు! ససేమిరా వదలవు పీడా విరగ డౌతుందనుకుంటే నీరు లేని మబ్బు ముక్క చాటు చేసుకొని నవ్వి పోకు నీరు ఉన్న మబ్బు ముక్క నీలో కదలితే చాలు ముక్కుపై ఎరుపుతో చూపులో తెలుపుతో నడచే నా వెనుక నే రాత్రి వలె డొంక తిరుగుడు ఆలోచనలతో అపుడపుడూ వెన్నెల ముసుగుతో ముళ్ళశిఖల అనుభవంతో వచ్చే నీవు ! అబ్బో ఎంత లౌకికశ్రీవి ! లౌకిక శ్రీ !

53. మన రూపం పహీమం నీ నా వెనకటి రూపం డార్వినీయం వానరం, కావచ్చు అంతకు పూర్వం మొక్క! కాదు మట్టి ! కాదు అణోరణీయం ! సరే గాని ప్రస్తుతం మనుషులం ! అంతరాత్మ ఉన్న వాళ్ళం మనస్సు మేల్కొనీ ఉషస్సు సంతరించుకుంటే మానవులం మనసు గుడ్డి అయితే చీకటి నయం, మొద్దెతే ఎద్దు నయం చూపులో పూలు కురిస్తేనో చలనంలో గమనం వస్తేనో చాలదు వేదన స్వరమై వివేకం వెలుగై రావాలి మనిషిలో చేతన ఎవరమన్న ప్రశ్నకు గట్టి సమాధానం అవాలి జీవితం తలుపులు వేసుకున్నా వచ్చి నిన్ను పిలుస్తాను అడ్డంకులు చీల్చుకొని వచ్చి నిన్ను కలుస్తాను నీవు వెలిగించుకున్న చిరువత్తి నేను అపహరించను నీవున్న ఇంట్లో ఇంత చోటూ నేను ఆక్రమించను కాలాన్ని చుట్టకొనీ పరున్న నీవు లేచే వరకూ వేచి ఉండనా ? మంచులో వానలో ఎండలో రోదసి వలె నిలిచే ఉండనా ? తలుపులు బిగించుకొని భయంతో వేగి పోకు, లే ! వచ్చి తలుపు తీయి వెలుగులో నా ముఖం చూడు క్షణాల్ని అతిక్రమించి వచ్చి నిన్ను కలవాలనే క్షణాల్ని కౌగిలించుకొని ఒకసారి బయటికి రా తలుపులు పగులగొట్టి లోనికి దయచేయాలా !

బలం చూపాలిసిన చోట వినయం చూపిస్తున్నానా ! ఏ శక్తుల ప్రాబల్యంతో ఏ మలుపు తిరుగుతుందో తెలీని చరిత్రగతిలో ఇరువురమూ బిందువులమే మనిషి వస్తువు కాదు ప్రాణే కాదు అంతరంగమున్న వ్యక్తి ! తలుపు తీయి ! పిలుపును మన్నించి రా బయటికి వెలుగులోకి ! నీవు సమాజ గతి రూపమైతే నేను ప్రగతి శక్తి రేఖను తలుపులు మూసుకున్నా వచ్చి నిన్ను పిలుస్తాను అడ్డంకు లతిక్రమించి వచ్చి నిన్ను కలుస్తాను ! వెనుకటి రూపాలకేం ! ఈ సమయం మహతో మహీయసులం మానవులం !

54. వియాత్నాంలో అమెరికా వలె ఇది అడవి ! మొదలు చివర లేదు ! మధ్య మధ్య జన పదాలు ! ఎప్పుడు మొదలైందీ తెలీదు అంతా మధ్యలో వచ్చి పోయే వారే ! నదీ నదాల సరస్సుల తీరాల్లో, పూలతో పండ్లతో చెట్ల నీడల్లో తాత ముత్తాతల కథా గ్రామం విని ఎవరి దారిన వారు పోతారు ఒంటరిగా ఉన్నపుడు మనస్సును హెచ్చరిస్తాయి నీడలు నన్ను నేను హెచ్చువేసుకొన ధైర్యంగా నిలుస్తాను వెలుగై దూరాన ఉన్న దీపాలు నాపై ఒక చూపు నిలుపుతాయి ధైర్యంలో నన్ను నేను మరచిపోయి మరే ఆలోచనలోనో పడతాను మనిషి శరీరంపై చూపులతో కదలికలో ఒడుపుతో అలికిడికి చాటు చాటు నుండి కదలిపోతాయి జంతువులూ మృగాలు ! ఓ వైపు చీకటిలో మెరసేను చాకు చూపులూ ! రాలే నిప్పు పూలూ ! పిడికిలి బిగించి నిల్చి గిరి వలె అలజడితో కదలిపోతూ ఝరి వలె కత్తులతో వత్తులతో పగలూ రాత్రీ మనిషి ప్రయాణం ! అడవి నుండి ! పల్లెకూ ! పల్లె నుండి పట్టణానికి ఈ కథ సొంతం వినేవారెవ్వరు ? ఇది ఎన్నటికీ సశేషమే గ్రీష్మ మందుకున్నా, పచ్చని ముఖాల్లో ఆశల చివుళ్ళతో సరికొత్త సంస్కార కళతో అక్కడక్కడా ఉద్యానాలు ఎదురౌతాయి వర్షం తారసిల్లితే అంతా పిచ్చివాని ఊహా వైభవం అందుకే కథ పూర్తికాదు ! అడవి భయమూ పోదు ఎన్ని శిఖరా లధిరోహించినా అడవి తనం తప్పదు మనలో బట్ట బయలుగానో గుట్టు సవ్వడిగానో పరమ రహస్యంగానో సంస్కృతీ సంపన్న మనుకునే మనిషి ఎంత దూరం పయనించాడు

ఉపమానం కావాలా ? స్పష్టంగా, వియత్నాంలో అమెరికా వలె కాల స్థల జ్ఞానం స్వార్థం ఎరగని దశ శైశవం ఏ వికారమూ ఎరగని సృజన కళికా రూపం హాలా హల లవ మెరగని అమృత భావనా క్షీరధి పితరుల ఎద కంటికి మూర్తి గొన్న సుకృతం మొగిలు ఉడుపుల్లో పొరలీ మిన్ను మన్నులో అడీ మాయని మేనితో చీకట్లో కలిసిపోని చందమామ

55. శైశవం ఏండ్లు పై బడిన కొద్దీ బుద్ధి వికసించిన కొద్దీ ప్రకృతికి దూరంగా వికృతికి శేఖరంగా కోప తాప సంతోష విషాద స్వార్థగతులతో లౌకిక మర్యాదల్లో క్లిష్టమై క్లిష్టంగా ఎదిగిపోతుంది స్వర్గ నరక రూపాల్లో పుణ్య పాప భావాల్లో ఏ భూమిక లెరగని శైశవం మనిషి జీవితంలో ఎప్పటికీ ఇగిరి పోని గంధం బాల్యంలో స్మృతులు మనో విశ్రాంతికి నెలవులు! మథనం ఎరగని మనసులో సుధా బిందువులు

56. సామాన్యుని వాస్తవం ఈ యుగం తలుపు తెరిస్తే అణువణువులో స్పందిస్తూ హృది హృదిలో కనిపించే నవ భారత బింబం నెహ్రూ ఎదపై గులాబితో బుజాన పావురంతో అడుగుల్లో జీవ నదీ లయతో కదిలే నెహ్రూ, సామాన్యుని స్వప్నాలనికి వాస్తవం దేశ భవిష్యత్తుకు ప్రజాస్వామ్య హృదయం ఆగిన పాటను స్నిగ్ద స్వరంతో అందుకునే జారిన ముత్యాన్ని తీసి స్వర్ణంతో పొదిగే ముక్కలైన హృదయాన్ని నవాశతో కలిపే రాజనీతి మనస్వి! చీకటి గతులకు దినమణి ఏ నాటికైనా తప్పని మరణంతో నీ నిష్క్రమణం జనస్వామ్య గతికి భరత వాక్యం కారాదు

నిరంకుశం రాజరికం ప్యూడలిజం వ్యతిరేకం నీ ఆశయం త్యాగంతో రాగంతో స్వేచ్ఛా సమతకు నవతకు సంకేతం ప్రొద్దు పొడవడానికిత బదులీ రోజు

57. కదలండి శతఘ్నుల వలె మన ముఖాల ముందు హఠాత్తుగా యుద్ధం వచ్చి పడింది లెగసే పూల నదుల వలె స్త్రీలూ నిప్పులు చిమ్మే గోళాల వలె పురుషులూ నేల ఈనినట్లు వీధుల్లో మైదానాల్లో సమర భావనాయుతజన సందోహం భరత జాతి హృదయం శాంతి కపోతి నివాసం దీనిపై తుపాకులు పేల్చే హంతకుణ్ణి మరవకండి మనం పీల్చే గాలి అప్పుడే ఎంతో బరువెక్కింది లేవండి మహాగ్నుల వలె కదలండి శతఘ్నుల వలె ప్రళయ మేఘం మెరపుకు భయపడి జీవితం గమనం ఆగుతుందా ? వ్యవహారం వీడుతుందా మెషిన్ గన్ ధ్వనికి ఉలికి పడి భరతదేశం భూభాగం గౌరవం వదులుతుందా ? పిడుగులు పరిహరించే శక్తి ఆవర్తానికెంత తెలుసో ? పన్నిన భూ కబళనం సాగదని శత్రువు కంటే తెలుసు లోహ నియంత కుతంత్రం విచ్చిన్నం చేసే దీక్షలో నిమగ్నమైన సోదరీ సోదరులారా ! స్వేచ్ఛా సమాజ బలం సర్వం మీ వెనుకే ఉంది మండే శక్తులతో దేశంకై నిలిచిన సైనికులారా ! మంచు కొండల్లో విద్యుద్ధతి సాగే జ్యోతుల్లారా ! విష వ్యూహం చేదించే అమృతా శయ మూర్తుల్లారా గుండెలో బాకు రువ్వి రక్త పతాక నెగరేసే శత్రువు భూమిని వీడనిదే జయింపనిదే వారిని ప్రతిజ్ఞ వీడకండి సమర సన్నాహం మానకండి లేవండి మహాగ్నుల వలె కదలండి శతఘ్నుల వలె బరువు నడకలతో మౌన ముఖాలతో ఆక్రందన స్పందించే అమాయక గమనంతో నగవు ఎగిరిపోయిన పెదవులు బిగించి ఆకాశం వంపుల్లో ఆశలు భద్రపరచకొనీ ప్రాణా లరచేత బట్టుకొనీ పిల్లలతో పశువులతో

స్తంభించిన గాలుల్ని కత్తుల వలె చీలుస్తూ తరలి వచ్చే కాందిశీకులు !శత్రు కృతఘ్నతకు చిహ్నలు మానవ సంస్కారం లేని ఇనుప హృది కెదురుగా దేశాన్ని రక్షించేందుకు దేహాన్ని డాలుగా చేసి శరీరంపై రక్త సిక్త వ్రణాల్ని గులాబి పుష్పాలుగా ఒంటరిగా ఉన్నా తన చుట్టూ మహా ప్రజ నిలిచి ధైర్య మిస్తున్నట్లున్న హిమగిరి పంక్తుల్లో అగ్నుల వలె పదపదం ప్రళయ లయతో ఎద ఎదలో ఖడ్గ సృష్టితో సాగే సోదర సైనిక బృందం, వీరభూమి సంకేతం మూర్తీభవించిన తేజశ్శిఖరం, జాతి ప్రతిష్ఠకు ప్రతిరూపం ఈ ఉషస్సాహిత్య వీధుల్లో రెక్క విప్పిన రణచ్ఛాయలు ఈ దేశ గగన ముఖంలో సాశ్రు శిఖల విషాద స్వరాలు

58. హిమజ్వాల ఈ ప్రశాంతాకాశం ఒక్కసారిగా మృత్యు తాండవం వినిపిస్తుందేం ? ఆ హిమాలయ సీమల్లో మ్రోగే కృతఘ్నుతాభర శతఘ్ని ధ్వనులు ! ఈ గడ్డపై వీచే శీతల వాయువులు సుమనోభిరామాలు రివ్వున దూసే పదను కత్తుల్లా భాసిస్తాయేం ఆ హిమభూమిలో సైనిక నేత్రాలు వదలే అనల కీలలేమో ఇది పురాణ దేవతా సమూహం దీపించే నివాసం ఇక్కడ హత్యా బుద్ధితో ప్రవేశించే వారెవ్వరు ? సూర్య తేజాన్ని మ్రింగజూచే మబ్బు మూకలేమొ! శత పత్ర వదనంపై నెత్తురు గంట్ల వలె హిమ శీతల స్వచ్ఛ భూమిపై అగ్ని కణాల వలె మూకలుగా సీమల్ని దాటే కాలముద్రా మూర్తులెవ్వరు శాంత తేజోమూర్తి హిమచ్చ సుషమా ఫాల తలంపై అగ్ని కీలలూ రక్త ఝరులూ సృజించే చీకటి ముద్ద లెవ్వరు ? ప్రతి భారతీయుడూ విడిచే ఒక్కొక్క కోష్ణ నిశ్వాసం తమో రాత్రి వలె భయదమై దీర్ఘమై హిమ భూమి చుడుతూంది ఒక్కొక్క హృదయం రవి బింబ సదృశంగా ఉదయాస్తమయాలు ఋతువులు కామనలు సర్వం మరచి దీప్తమతియై మహాభుజగంవలె ఫణ సహస్రం విప్పి

గగన మెత్తు నిల్చిందీ భరతజాతి నిప్పు గప్పిన నివురు పెనుగాలికి లేచింది ఎటు చూచినా ఒక్కొక్క అగ్ని గోళం ప్రతి హృదయం ఉద్వేగభరితం బడబాగ్ని మహా సముద్రం ! స్వేచ్ఛా సమాజ రిరక్షా వ్యగ్రమై నా దేశం శతకోటి ముఖాలతో జ్వాలయై మేల్కొంది కొండ వలె నిలిచి కలల్లో తూగే జాతికాదిది ! చెలియలికట్ట ఎరగని వార్నిధి ! నిత్యభాస్వరదేవతామతి మహాదాహం గొన్న కాలం రక్త ఝరుల్ని కోరుతూంది కాలాన్ని కబళింపనీయం ! ఖడ్గవ్యూహాన్ని చేదిస్తాం ఎదపై నిప్పుల కుంపటి దింపిన కృతఘ్నుల్ని తుద ముట్టించేందుకు త్వరగా హిమ జ్వాల నార్పేందుకు జల సంభృత నవ ఝంఝా హుంకృతి ఉరుములతో మెరుపులతో రణ వ్యూహ నవ మతితో ప్రజాస్వామ్య చరణంతో కదలండి నేఫా ప్రాంతం తరలండి లదక్ భాగం

59. కంపనం ప్రకంపనం గదిలో కలర్ టి.వి. చేరినా ఆ ఇండ్ల వాలకం పాతదే బండ రాళ్ళ శ్రేణుల గోడలతో బరువు గాథల రూపమే నిశా వేళ అవని గర్భం నుండి ధరా ప్రకంపన తరంగానికి పై పైకి చేతులు చాచిన మృత్యువు గుప్పిట్లో నిద్రాగణం రమారమి అంతా సజీవ సమాధిలో, మళ్ళీ ఉదయమే చూడలేదు చుట్టూ చెదరిపడిన శిథిలాల మధ్య కొన ఊపిరిలో ఊగే ప్రాణం చూచే చూపుకై చాచే చేయికై, ఎడారి నాలుకతో ఎదురు చూస్తూంది సాధించే విజ్ఞానానికి తోచకుండా, ఎదిగే శక్తి శిఖరాల కందకుండా ప్రకృతి వైపరీత్యం తోనో స్వార్థ గుహాభావం తోనో చాచిన మృత్యువు రెక్కలతో భవిష్యత్తు తనముఖం చూపిస్తూంది భూ ప్రకంపనమైనా జల తాండవమైనా నలిగేది ! రేఖ క్రింద నున్న వాళ్ళే ! శిఖరాలను కూల్చిన క్షణాలు గాయాలను మాత్రం మిగిల్చాయి పీఠభూమి అనుకున్న హృదయం బ్రతుక్కి డోలాందోళనమైంది దుష్ప్రభావ రుచి చూచాకే కారణాల్ని అన్వేషించేను మనిషి ! వ్యక్తి పరిధుల్ని దాటింది సమాజ శక్తుల్ని మీరింది

సుఖానికి దారి తీసిందే విపత్తుకూ దారి తీయొచ్చు ! తెల్లవారితే పొలానికి పోవలసింది, ప్రొద్దెక్కితే ఇంట్లో పిల్లల ఆకలి తీర్చేది ఎంత ప్రొద్దు పోయినా ఉట్టిపై ఆహారం నిశ్చలంగా శూన్యంలో వ్రేలాడుతూంది రాత్రి మూడు యాభై ఐదు అంకెలపై సూచిక లాగిన గోడ గడియారం దిగ్రమతో బిక్క మొగమేసింది ఉదయం ఆగీ ఆగని కాలాన్ని వేలెత్తి చూపుతోంది చుట్టూ ముక్కలై చెదరి పడిన జీవిత శకలాలతో భయద దృశ్యాలు శిథిలాల మధ్య ఊయెలలో నిద్రిస్తూన్నపసి పాప మిగిలిన అంకురం చీకటి అంచులో చంద్ర రేఖ, రాబోయే తరాని కాశా బింబం ఆపదలో ఒక హృదయం నుండి తెల తెల్లని పావురాళ్ళు ఎగిరి వస్తాయి అదే! సమయం ! మరో మతి నుండి నీలి నీలి గద్దలు బయట పడతాయి శ్మశానం నుండి ఎగసే ధూమాన్నీ అగ్ని నీ చీల్చుకొని పోయే హాహాకార శబ్దాలు నీరవమైన గగన హృదయంపై వాడి వేడి బాకు మొనల్లా దూసేను శిశిరం శరీరాన్ని ఆవహించింది గ్రీష్మం మనోవీథి తిష్ఠ వేసింది కంపనం ప్రకంపనం భయం! మళ్ళీ జనం కళ్ళ ముందు సుళ్ళు తిరగేను ఎలక్షన్లు ఆగవు ! రైళ్ళు నిలిచిపోవు ప్రవాహం ఆగదు ! ప్రభాతం దాగదు హింస ! విధ్వంసం ! ప్రకంపనమూ ఆగదు బయటి ప్రపంచమంతా అకంపనం! అంతలో ఎక్కడో ధరా ప్రకంపనం లాటూరే కావచ్చు లాస్ ఏంజిల్్స అవచ్చు మనిషిలో తరగని సంకల్పం మానవతా రాగ ధుని మీటుతుంది చరిత్రకు కొత్త రూప మిస్తుంది బ్రతుక్కి కొత్త ఉదయం తెస్తుంది

60. ప్రవాసం, ఆవాసం సమయ సమయం విడిపోయే శాఖలతో ప్రశాఖలతో సమాజ వృక్షం బృహదాకృతియై చరిత్ర గతులతో కొత్త అస్తిత్వం పొందుతూంది ఎగిరే పక్షి దిగే పక్షీ ఏ కొమ్మలోనూ రెమ్మలోనూ చిక్కుకోదు నలిగీ మాసీ మాడీ కూడా మనసు శుభ్రమై ఉజ్వలమై విభాసిస్తుంది అగ్ని నుండి బయట పడుతుంది ఆవర్తం నుండి పైకి లేస్తుంది జీవితానికి నిర్వచనం లేదు పై పై కెదిగే స్థాయితో పాటు అక్కడక్కడా మానవతా క్షామంతో క్రిందికి జారని స్థాయి లేదు మనిషి మనోరూపం ఆసమాజ దశకు చిహ్నం. హింసకు అవమానానికి గురై అరచేతిలో ప్రాణాలతో ఎదురుపడే అగ్నులకు దూరంగా, పై బడే పిడుగుల్ని తప్పుకుంటూ భయరేఖలు చుట్టిన ప్రవాస గణం ! మానవతా సీమలో ఆవాసం !

ఇదో స్వదేశంలో వెలియైన కాశ్మీర్ పండితుల ప్రవాసం ! ఆటవికం నెరపే చర్యలకు, బలియై, కళ్ళలో బిగిసిన అగ్నులతో కాళ్ళలో సుడులతో వచ్చీ ఆవాసం చేరిన ప్రవాస గణం ! ముఖంలో నిశ్శబ్ద ముద్రలోనూ కోలాహల రేఖలు ! కొండ చుట్టూ తిరిగే సుడి గాలుల్ని తలపిస్తున్నాయి దేశంలో రాజ్యాంగం సమాధానమేం చెబుతుంది ? ఏ దేశమైనా ప్రాంతమైనా ఒక్క మానవతా సూత్రం తప్ప ! జ్వాలానికేతనం నుండి బయటపడిన పిపాసార్త హృదయానికి చిలికిన ఒక్క ఆప్త బిందువు అదో మినీ హిమ కాసారం ! ఇప్పుడు మెలకువలోనే గతం స్వప్న దృశ్యమై ఎదురౌతూంది వర్తమానం ఎంత త్వరగా గతమైతే అంత మంచిదనిపిస్తూంది ! బాటను అడవి మ్రింగేసింది అనుమానం మనిషిని దారి తప్పించింది లోపల మండే తాపంతో రాత్రి చలి కాచుకునేరు జారే కన్నీటి స్పర్శతో పగలు వేడినార్చు కునేరు స్వేచ్ఛ ఎవరికి ? స్వాతంత్ర్యం దేనికి ? ఎదురుగా ఉరి త్రాళ్ళ వలె ప్రశ్నలు వ్రేలాడుతున్నాయి ఏ అంతర్జాతీయ స్వరం ఏ జాతీయ వాదం పండితునిలో పామరునిలో తిష్ఠవేసిన భయాల్ని తుడిచేస్తుంది అలసి పోయిన కనురెప్పలపై ఊగే నిదుర మబ్బు బరువుకు దేహం అవలీలగా మరో జన్మవలె శాంత సరసిలోకి దిగుతూంది ధూళిలో కలిసిన మానవతా రాగాన్నీ నీడలో జారిన భగవంతుని బింబాన్నీ దూరాన వెలిగే వీధి దీపం ముఖమెత్తి పైకి వేలెత్తీ సమాజానికి చూపుతోంది

61. భవితవ్యం ఒకే మతం ఒకే దేశమనే భావం నిజమైతే ఎక్కడిదీ ఆగ్రహం ! అసంతృప్తి ఇన్ని తుపాకి గుండ్లు ప్రేలుతాయేం ఇన్ని రక్త చిత్రాలు విలపిస్తాయేం ? బూది దిబ్బల్ని మంటల్నీ త్రోసుకొని కన్నీళ్ళు ప్రవాహం కడతాయేం ? పిల్లలూ పెద్దలూ విడిపోయి చెట్టుకొకరు పుట్ట కొకరయ్యేరేం ఇవన్నీ సాధారణమే ? ఎందుక్కాదు ! గ్రీష్మం తాండవిస్తే ఇదేమీ కన్పించదూ ఏలా కన్పిస్తుంది ? స్వార్థం పీట వేస్తే అహంలో

ఆడుకోబోయిన పిల్లలు వచ్చేరనీ తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది పనిపై వెళ్ళిన పెద్దలు వచ్చేరనీ ఇల్లాలు ఎదురు చూస్తూనే ఉంటుంది ఎందరో బంధువులకై ఆపులకై కళ్ళు బయర్లు క్రమ్మాయి మిగిలింది మృగతృష్ణ ! కన్పించేది మృత్యు హాస దీపం ! బాంబు మెషిన్ గన్ టాంక్ ధ్వనితో వచ్చింది మహా బంధువు నీల మేఘానికి బదులుగా ప్రాణానికి అపాయం రణ ధూమం పంచ భూతాలూ పంచ ప్రాణాలూ వీటికే వేచి ఉన్నట్లుంది పచ్చని చెట్లు భగ్గున మండనీ, నదిలోనీరు ఎర్రనవనీ వేదనతో మూగవోయిన వారి మధ్య వేడుకతో చూచేవారూ ! ఉన్నారు వేయి చెప్పు లక్ష చెప్పు చరిత్రలో ఉందే మానవ సంస్కృతిపై గౌరవంతో పలుకుతున్నా ఎద ఎదలో తీవయై అల్లుకొనే మానవతా సంకల్పంతో, లౌకిక చైతన్యం ఒక్కటే ఈ ఖండం ! భవితవ్యం

62. జీరో జోన్ వాతావరణంలో గాలికి కదలే ఇరు రెక్కల కంటిన బూజుతో ఆశ, నీలి నీలి ఎరుపు తెలుపు పొగల నుండి ప్రాంగణంలో వాలుతూంది. ఇంటి ముందు చేతులు తెగిన చెట్టు చివురుకై మొగం వాచి ఉంది ఇంటి వెనుక గుండె జారిన బావి చినుకుకై ముని వ్రేళ్ళ పై నిలిచింది. బయట పడిన ఎముకల గూడుతో బుజాన నిండుకున్న జోలెతో దరిద్రం వాకిట్లో ఎదురు పడుతుంది, అసమ గతితో అనుభవ విషాదంతో ఎగసే ఆకలి సెగలపై ఒకటి రెండు కన్నీటి చుక్కలు రాలుతున్నాయి వేడి వేడి నిటూర్పు రేఖలు గాలిలో గ్రీష్మ గమనాన్ని రూపిస్తున్నాయి యంత్ర శబ్దాల్ని కలుపుకొనీ శబ్ద వీథుల నుండి గాలి ఆర్తినీ అలజడిని మోసుకొని చెట్ల బుజాలపై వాలుతూంది తెగిన కర చరణాలతో చెదరిన జీవితం వలె ఎగిరే శబ్ద శకలాలతో భగ్నమైన వాతావరణం నవమానవ వికృత శక్తిని చిగిరిస్తూంది ప్రకృతిలో ఖండిత రీతుల్ని అలంకరిస్తూంది ఎక్కడెక్కడి నుండో సంగీత ధుని చెవి దాకా ప్రయాణించే లోపల మధ్యలో కేకలు ! అరుపులు ! ఏడ్పులు ! బహు జాగ్రత్తగా కత్తిరిస్తున్నాయి దూసుకొని వచ్చే వాహనాన్ని మోసుకొని సాగే పవమానం

దారిన నడిచే మనుషుల్లో భయాన్ని విసరుతూ పోతూంది ధైర్యాన్ని కికురిస్తూ ఆహ్వానిస్తూంది అపాయ బాంధుర్యాన్ని గుర్తు చేస్తూంది నిజం ఎన్ని సార్లెనా వంచితం కావచ్చు శుష్కమై ! ఛిన్నమై పోవచ్చు ఎదురుగా మైదానంలో నడుస్తూ నలుగురితో వలయాకారంలో తిరిగి తిరిగి మొదటికే వచ్చీ చేరేరు మనుషులు అదే ! ప్రకృతి పొందే వికృతాకృతి నుండి ప్రకృతికీ జీవన రుచి గతిలో లయ నిలిచిపోతూంది తిరిగి అందుకుంటుంది సమయం ఏమీ ఎరగనట్లు నవ్వుతుంది పరిమళ మతితో పలకరిస్తుంది ముంగిట్లో పడే పిడుగును మరచి మబ్బు నుండి మెరపు జ్ఞాపకంతో ఉంది ఆశ గాలికి కదలే ధూళి ధూమం పొరలనుండి క్షణాల కొసల అంచులపై విరిసే మల్లె పూల రెక్కలతో నిజం మతిలో దిగుతుందనే విశ్వాసం ! మనిషిలో సహజం !

63. అవకూడదు జ్వాలా చిత్రం ముఖాన ముసుగు కప్పి అందంగా ప్రభాతాన్ని వీధుల్లో ఊరేగించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఏవేవో రంగులు మార్చిమార్చి ఏ ఆలోచనరానీకుండా మూగిన నీడల గుంపుల సంరంభంలో ఎవరూ కాదనడం లేదు తెలీని జనం కళ్ళకు రంగుల వల కల్పిస్తుందీ సమయం ఇది ఏదో అలంకారమనీ పదిమందీ చుట్టూ చేరారు కోట గోడల్ని దాటి ఇనుప గేట్లని దూకి పోతున్నాయి ఇసుక దిబ్బల్ని మైదానాల్ని చుట్టి నడిచి వస్తున్నాయి ఎర్రబారిన చూపులు ! అరుణ కాంతి తోరణాలు ! దారిలో అడుగుజాడలు ! పల్లెలో నగరంలో ప్రవేశిస్తున్నాయి మధ్య మధ్య విషాద కథలేంది ఏ చరిత్ర లేదు చిన్న పిల్లల మల్లే అందమైన వాగ్దానాల్ని నాయకులు ఆకర్షకంగా పంచి పెడుతున్నారు గగనాన్ని రెండు చేతుల్లో పట్టుకునేందుకై తమకు తోచిన చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తున్నారు సెకండ్లను నిమిషాలూ నిమిషాల్ని గంటలూ దాటే తొందరలో ఉన్నాయి

కాలం కదలుతూంది లేత చివుళ్ళ రెక్కలపై కాలం నిలిచింది ముసలి చెట్టువలె చేతిలో కట్టెతో కిటికీ చువ్వల మధ్య నుండి గాలి ఆగి ఆగి వీస్తోంది మధ్య మధ్య జ్ఞాపకం వచ్చే పద్యపాద ఖండాల వలె సరస్సులో కమలాలవలె మనస్సులో వర్తమాన విశ్వాసాలు ! చెట్ల కొమ్మల సందుల్లో చీకటి వలె నిలిచిపోయిన వ్యూహాలు సుత్తె దెబ్బల అనుభవంతో ఎంతటి శిల్పాకృతి పొందినా రాగరసం కోసం కణకణం తప్తమౌతుంది హృదయం ! నక్షత్రాలతో ఆకాశం వలె ప్రతిచెట్టూ వెలగాలనే పూలతో ఆనందమే కాదు ! పండ్ల కోసమూ ఆరాటపడుతుంది సూర్యుణ్ణి చంద్రుణ్ణి పలకరించే ఆలోచనలిప్పుడు చేదునూ వగరునూ రుచిచూస్తున్నాయి నిన్న ఉదయం ముఖాన వాలిన విషాదం ఇంకా రెక్కలు ముడుచుని అట్లాగే ఉంది ! ఈ ఉగాదిసృజన శక్తి సరించనీ మానవతా మాధుర్యం ఈ ఉగాది మనసులో పచ్చదనం అవకూడదు జ్వాలా చిత్రం

64. ఈ ఉగాది మొదటి రోజు గాలీ వెలుగూ ఆడని నిశ్శబ్దం గడ్డకట్టిన గదిలో రాతి పలకవలె నిలవకరా ! తలుపులు తెరచుకొనిరా ! గాలీ వెలుగూ సోకని నిశ్శబ్దం దిగమ్రింగిన మదితో మంచు బొమ్మవలె నుండకరా ఊహలు విచ్చకొని మరీ రా! బయటికి వచ్చిచూడు! చిరుగు పట్టిన బ్రతుకు బొంతలు చూడు ! దిక్కులు అంతటా ! ఎరుపు తిరిగిన నలుపు నీడలు సముద్రం మ్రింగజూస్తుంది కఠిన శైల బంధుర పర్వతాన్ని పర్వత మాక్రమింపజూస్తుంది ! క్షుబ్ద తరంగ సముద్రాన్ని కుచేల సంతాన మంటిస్తూంది నిప్పు ! అక్కడక్కడా ! కుబేర పట్టణాలు మండేను ధగధగ నిలువునా ! పొగదూరిన కళ్ళు నలుపు కుంటూ, ప్రజలీరోజు ! జ్ఞాపకం చేసు కునేరు దేవతలను ! వత్సరం మొదటిలిప్త ! గది నుండీ ! పాతబడిన మది నుండీ బయపడిన నీకు క్షితిజం ఆహ్వానం పలుకుతుంది ! అవని స్వాగతం చెబుతుంది ఆకాశాన వసంత సూర్యుని వలె వెలగనీ శక్తి నీలో

రా! బయటికి నీకాళ్ళపై నడు ! నీ రెక్కలపై ఎగురు! వంచే శక్తికే వంగుతుంది విల్లు, శబ్ద శక్తిని ధ్వనిస్తుంది లోకం శక్తి ఏ రూపమైనా కావచ్చు, గాలీ ! నీరు నిప్పు! మనస్సూ! చీకటీ దారిద్ర్యం నిండిన, ఇరుకూ అజ్ఞానం క్రమ్మిన ఈ గది నుండి పాతబడిన మదినుండి రా! బయటికి ఈ ఉగాది మొదటి పుటల్లో ! ఉషః కిరణ పంక్తియై రా విప్లవ కంఠం నుండి శాంతి స్వరమై ఎగసి నిశా శ్మశాన వేది పై కిరణ ప్రాణ స్పందనమై సాగి ఆత్మ శిఖరం పై దినమణి జోతియై వెలిగి మంచు పొర నుండి వెలుగు చందనమై విరిసి స్వప్న జగత్తును చెరపి వర్తమాన వాస్తవ మై కదలు! శూన్య నయానాల్లో వినీల మేఘ పంక్తియై తరలు ! దారిద్ర్య తాండవ శిశిరంలో వసంత రాగంతో దాహంతో అలమటించే గ్రీష్మ హృదిలో జీవధునితో కాల గతినిమార్చే ! శాంతి చరణమై గీతమైరా ! పరిణామ శిఖరమైన మనిషిలో ఉంది పూర్వ పూర్వ రూపం సంస్కృతీ సారమైన బ్రతుకులో ఉంది ఆటవికతత్త్వం అందుకే ! ఇంత అలజడి ! ఆక్రందన ! ఆశాంతి ఆస్పాలనం! స్నేహం ప్రేమ శాంతి సహనంతో రానీ సంస్కార శోభ ! ఈ ఉగాది ! మొదటి సమయబిందువుపై ఆర్ధ రాగమై రా! శాంతి కపోతమై రా! సృజన బింబిమై రా!

65. ఉగాది అడుగు పెట్టింది ఉగాది అడుగు పెట్టింది ప్రాణం ఉసురుసురు మంటూ మనిషి పై మనిషి నీడలతో రూపం గుర్తుపట్టలేకుండా ఉంది గ్రంథాలు తగలెట్టి మేధావులు చలికాచు కుంటున్నారు ఆగడాలతో దేశం ఆటవికానికి దర్పణ మవు తూంది ఇక్కడ ఏ క్షణంలో ఎవరు ఆయుధంగా మారేదీ తెలీదు ఏ ఉన్నత లక్ష్యంలేని గురిలేని స్వార్థం పిల్లాడి చేతిలో రాయిమోస్తరు ! కాళ్ళను వదలని నీడలు శృంఖలా సంగీతం వినిపిస్తున్నాయి కాలం విసుగెత్తి తిరగబడి గొంతుపై కాలూని కూర్చుంది నుదుటిపై గాయం నుండి నెత్తురుతో ఇప్పటికి గండం గడచింది కొన్ని పత్రికలు వివిధ భంగిమల్లో ప్రదర్శిస్తున్నాయి వేశ్యా పాతివ్రత్యం

వాళ్ళకీ గడవాలిగా బ్రతుకు ! గొంతు దిగాలిగా మెతుకు ఆకలిగొన్న ముఖాలు రొట్టె ముక్కతో శాంతిస్తే ఆకలిగొన్న ఈహలు అధికారంతోగాన తృప్తి పడవు ఆకలిగొన్న చేతలు రక్తంతో గాని శమించవు ఆకలి గొన్న అహంకారం ! హింసతో గాని నిద్రించదు భయాల దారుల్లో చరించే తలలపై గుండెలపై బాంబులతో విమానాల వలె ఆలోచనలు తిరుగుతున్నాయి ధూళి పొరలు చీల్చుకుంటూ భయాగ్నులు చిమ్ముకుంటూ చీకటి బాణమై హింస హృదయాల్ని దూసుకుపోతుంది తరాల సంస్కృతీ ప్రభ రంగం నుండి నిష్క్రమిస్తూంది హింసతో జయ ధ్వానం స్వర్గ ద్వారం చిత్రిస్తూంది నకిలీ గాంధీ ప్రకాశం ఉదయ భ్రాంతి కలిగిస్తూంది ఒత్తిడిలో నలిగిన బ్రతుకుతో ప్రతి ఋతువు వేసిన ముద్రలతో మొరటు దేలిన వాలకంతో కలలు నిండిన చేతి సంచీతో అరగిపోయి ముళ్ళు దిగే వీడని పాత చెప్పులతో ఇక్కడి నుండి ఎక్కడికి ? స్వర్గానికా ? దేవుని సన్నిధికా ! తలలు మునిగి లేస్తున్నాయి గంగలో కళ్ళు మూసి తెరుస్తున్నారు ధ్యానంలో స్వర్గం చూద్దాంలే చచ్చాక ఏలాగో తప్పదనీ దేవుణ్ణి తలుద్దాంలే ! అన్నీ హాయిగా అమరాలనీ ఈ మూల నుండి ఆ మూలకు ప్రయాణం చేస్తే సరిపోదు ఊహలో ప్రతిఫలిస్తూ ఈ దేశం మట్టిలో బింబిస్తూ నీ రూపం గుండెపై చేయితో ఎక్కడైనా సరే ! నిద్ర పోగల గాలి అశాంతి తీగెలపై ఈ దేశం పలుకుతూంది మృత్యు సంగీతం ఇంత కాలం నివురు వలె కప్పిన నవ్వు చెదరి పోయి వీచే గాలికి మెరుస్తూంది అంగారం తెలిసో తెలీకో అడుగు పెట్టి కిందికి దిగిన జలపాతం ! ఏలా వెనక్కి వెళ్ళిపోతుంది ఉగాది అడుగు పెట్టింది ఉసురుసురుమంటూ ప్రాణం

66. రానీ మరోజన్మ ఈ ఉగాది రానీ మరో జన్మ ఈ ఉగాది ! భయమెందుకు ! అందేనా జరిగేను మానవతా మనోజ్ఞ సిద్ధి

ప్రతి యుగ జననంలో ఉంటుంది కొత్తదనం ఊహలో వర్తనలో జీవన నవ భూమికలో ఎన్ని మార్లు పుట్టామో ! ఎన్ని సార్లు చచ్చామో ! జ్ఞప్తికుండదు ఎన్నిమార్లు పుట్టేమో చచ్చేమోనని ఎద ఆవేదన పడుతుంది నాకు వద్దు స్వర్గం ! అంతకన్న ముక్తి ! రానీహృదిలో రక్తి చివురులో మొగ్గలో పూవులో ఉంది సుమీ మరో జన్మ వాడిన పూవులో ఎండిన గుండెలో ఉంది సుమీ మృత్యువు బీజ నాశనం నుండి మొక్క వలె చావు అంచుల్లో జీవనం ! అందుకే చావంటే భయం లేదు మరో జన్మకు సంకేతం ఉగాది

67. ఉగాది రావలసిందే వికసించిన వదనం నుండి చిరునవ్వుల కింజల్కాలతో ఉగాది రానే వచ్చిందని తెలిసింది నీకూ నాకూ శూన్య శాఖా జీవితంలో పల్లవ గుణ శ్రీకారంతో ఉగాది దయచేసిందని తెలిసింది ప్రతి మనిషికీ చెట్టు చెట్టుకీ మధ్య చివురు పూల వంతెనతో అందంగా ఉగాది దిగిందని ప్రపంచానికి తెలిసింది శరీరానికీ శరీరానికీ మధ్య స్నేహ సుందర హృదయంతో కాలంపై ఉగాది ఉదార లక్ష్యం సమాజానికి తెలియాలి పూవు పూవు నుండి జ్వాలలే వస్తాయో పరిమళమే వీస్తుందో నీకూ నాకూ ఏం తెలుసు ? ఏ అగ్నికో ఏ గాలికో బాగా తెలుస్తుంది ! జీవన గతిలో అమానుషం అందరికీ తెలీదు ఈ ఉగాది ఇప్పటిదా ? ఆత్మ నాటిదీ ! ప్రకృతి అవతరించి నప్పటిదీ ! శాఖా ప్రశాఖలతో జీవితం ఎక్కడికక్కడ మహాతరు వనం మాటలో కొత్త చివురుతో ! గుండెలో కొత్త రసంతో ఉగాది రావలసిందే ! అదీ ! వత్సరాని కొకమారైనా! బ్రతుకుపై ఆశతో గుండెలో ఆయువుతో ఉగాది వస్తుంది ! పేద ముఖంలో ఒలికిన కళతో, అశాంతి నుండి, ఆర్తి నుండి, విధ్వంసం నుండి విస్ఫోటం నుండి సృజన కిరణ సమాజంతో, ఈ ఉగాది బయటికీ రానీ స్విచ్ ఆన్ చేస్తే చీకట్లో బల్బు వెలుగు విన్నాణం సృజిస్తుంది.