స్వే ్ఛ కవిత్వం
మొదటి సంపుటం (1953 - 2002) మాదిరాజు రంగారావు
2026 రసదుని సాహితీ పరిషత్తు శాంతినగర్, హైదరాబాద్-28.
Swecchaa Kavithvamu
(Free
Verse
Poetry)
Volume I (1953–2002) By Prof. Madiraju Ranga Rao About this Collection This volume gathers Telugu free-verse poetry written between 1953
and
2002
by
Prof.
Madiraju
Ranga
Rao.
Organized
into
ten
books,
the
collection
moves
through
decades
of
social
and
political
change,
taking
up
themes
of
human
dignity,
everyday
struggle,
war
and
peace,
and
the
pursuit
of
freedom.
Composed
entirely
in
Telugu,
these
poems
reflect
a
lifetime
of
literary
engagement
with
the
currents
of
modern
Indian
history.
This
English
note
is
included
so
that
readers
and
researchers
searching
in
English
can
more
easily
discover
this
body
of
Telugu
free-verse
poetry.
స్వే ్ఛ కవిత్వం
మొదటి సంపుటం రచనా కాలం 1953 - 2002 మాదిరాజు రంగారావు నాన్నగారి జ్ఞాపకార్థం మా నాన్నగారు ఆచార్య మాదిరాజు రంగారావు గారి విశిష్ట సాహిత్య సేవలకు నివాళిగా, మాదిరాజు రంగారావు గారి స్వేచ్ఛా కవిత్వం మొదటి సంపుటం (Volume I) పునః ముద్రణ చేసి సాహితీ సహృదయులకు, శ్రేయోభిలాషులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. మాదిరాజు సంతోష్ కుమార్ దేవులపల్లి హరిత మాదిరాజు చరిత రసధుని సాహితీ పరిషత్తు శాంతినగర్, హైదరాబాద్
SWECCHAA KAVITHVAMU Volume I (1953-2002) by Prof. Madiraju Ranga Rao © Dr. M. Santhosh Kumar Edited by Madiraju Santhosh Kumar Devulapally Haritha Madiraju Charitha First Edition 2003 Second Edition 2026 ISBN: 978-93-5635-499-9 Price: 1000/- For Copies : Dr. Madiraju Santhosh Kumar 98499 79899 Printed at: Anupama Printers Shantinagar, Hyderabad - 28 Phone: 040-23391364 E-mail : anupamaprinters1978@gmail.com
మొదటి సంపుటం రచనా కాలం 1953-2002 విషయసూచిక సూచిక పుట I. స్వేచ్ఛా నవం (1971-1974) ..... 07 మానవీయం (1971) ..... 10 పడగెత్తిన ఉదయం (1973) ..... 53 ముక్తధాత్రి (1972) ..... 79 ఇది వియత్నాం (1974) ..... 105 II. ఆవాహనం (1973) ..... 123 III. ముక్తకాలు (1970) ..... 197 IV. సమయ దర్పణం (1986-1987) ..... 215 V. కిర్మీరం (1953-1975) ..... 251 VI. వర్తమానం స్క్రీన్ పై (1974–1991) ..... 299 VII. అగ్ని నుండి ఆనందానికి (1992) ..... 433 VIII. ఈ శతాబ్ది రెక్కలపై (1993–1996) ..... 477 IX. అగ్నిపిఠం (2002) ..... 557 X. కిరణపథం (2002) ..... 631
I. స్వే ్ఛ నవం
మానవీయం
సహృదయ దర్శణం కవి ఆలోచనా స్పందనలతో సంవదించే వ్యక్తి సహృదయుడు. ఇటువంటి వ్యక్తులతో కూడింది సహృదయంలోకం. వారితోనే కవితా పరంపర నిలిచేదీ, ప్రకాశించేదీ. కవి కొంత కాలం జీవిస్తాడు. ఆ తర్వాత ప్రత్యక్షంగా ఉండేది అతని రచనే. సహృదయలోకం మాత్రం పరంపరా భాగంగా ప్రత్యక్షంగా ఎప్పటికీ ఉంటుంది. రచనా ప్రభావాన్ని ప్రసారమానం చేస్తుంది. ఆనందాన్ని పంచుతుంది. ఆలోచనకు దీప్తినిస్తుంది. ఇది కవి హృదయధ్వనికి అనురణాత్మకం అనొచ్చు. కవి హృదయంలో ఈ విధమైన సంవాదంవల్ల ఆస్వాద పరిపూర్ణత చేకూరుతుంది. ఆలోచనా సమగ్రతకు దారితీస్తుంది. స్వేచ్ఛా కవిత్వంలో నిర్మాణ రూపం దీనికి పూర్వం ఉన్న పద్య గేయ కవిత్వాల్లో కన్నా భిన్నమైంది. స్వతంత్రమైందీ ఇది అనేక విధాలైన స్వేచ్ఛచే ఏర్పడుతుంది. ఇది పూర్వ సమామ్నాతం కాదు. కాబట్టి దీనికి కొత్తగా సాహిత్యంలో మానసిక సంస్కృతి ఏర్పడవలసి ఉంది. ఏర్పడింది బలపడవలసి ఉంది. ఇందులో భావనవాస్తవతలంపై లౌకిక స్థాయి నుండి మానసతలంపై లౌకికేతరందాకా పర్యాప్తమై ఉంటుంది. మానవ ప్రగతి సమాజవికాసం వ్యక్తి పురోగతి వివిధ గతుల్లో పరస్పర సహయోగంతో వర్తించే విధమూ స్వేచ్ఛాకవిత్వంలో దృష్టికి వస్తుంది. ప్రజాస్వామ్యానికనుగుణంగా బహువిధాలుగా వర్తించడం ఈ ప్రక్రియలో బహువేగంగా సాధ్యమయింది. పద్యం పరిణతి చెందింది. స్థిరపడింది. దీనికి క్షతి లేదు. స్వేచ్ఛాకవిత్వం వికాసోన్ముఖంగా ఉంది. ఇందులో అంశాలు వస్తు స్వరూపం ఆధారంగానూ, స్థితి సంఘటనల యోజితగానూ, భావనా విశేషంగానూ ఆలోచనా సమర్పకంగానూ ఆకర్షిస్తాయి. అన్నింటిలో సామాన్యమైన విశేషాంశం ఒకటే అదే కవిత్వస్పర్శ. సరస్సులో ఉండేజలమూ, ప్రవాహంలో ఉండే జలమూ, బావిలో ఉండే జలమూ ఒకటే. అయితే వాటి విస్తృతి, అగాధత్వమూ, నిడివీ, వేగమూ, ఆకృతి వేరు. దీన్ని బట్టి ఆలోచనా ప్రసారం అనుభవ సాంద్రత వేరు కావడం సహజం. అయినప్పటికీ సహృదయుల్ని ఆకర్షించడం మనోజగత్తును మహనీయకంగానూ రామణీయకంగానూ ప్రకాశమానం చేయడం ముఖ్యం. ఇది జీవసారంతో జీవతేజంతో సమాహితం కావడం విశేషం. ఇది సాధారణానుభవాన్ని
దాటింది. బహిర్వాక్కున కందందీ అవుతుంది. ఇక విశేషానికి వస్తే ఈ కవిత్వానికి
మూలాధార
స్తంభాలనదగినవి
నాలుగు
అంశాలున్నాయి. మానవజీవితంలో 1) తప్పనిసరియైంది ప్రకృతి రూపం 2) తప్పించుకోలేని సామాజికరూపం స్థితిగతులూ 3) తోటివారితో వివిధస్థాయిల్లో సంబంధాలు పరిణామ వికాసాలు 4) వ్యక్తిపరమైన మానసిక రీతులూ, అనేవి రచనలో వీటి సమాకలనం నిశ్లేషణకందుతుంది. ఎన్ని అభిప్రాయభేదాలున్నా వివాదాలతో నిమిత్తం లేకుండా ఎక్కడో ఒకచోట కవితాప్రియుల్ని కలిపే ప్రీతికరమైన శక్తి ఎప్పటికీ ఆకర్షిస్తుంది. దీన్ని గుర్తించడం దీని చుట్టూ ఉన్న అల్లికను సహేతుకంగా వివేచించడంలోనే సహృదయ సమాలోచనం ఉంది. ఇది అందరి మనస్సుకు తెలిసిందే అయినా ఒకమారు మననం చేసుకోవడం అవసరం. ఈ స్వేచ్ఛా కవిత్వం సంకలనంలో 1953 నుండి 2002 వరకు యాభై సంవత్సరాల కవిత్వ జీవిత స్పందనం పర్యాప్తమైంది. మొట్టమొదటి కవిత తెలుగు స్వతంత్రంలో 1953లో ప్రకటితమైంది. చాలా భాగం భారతి స్వతంత్ర స్రవంతి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి మొదలుగు వివిధ పత్రికల్లో ప్రచురితమయినాయి. ఈ సంకలనం ఒక పద్ధతిలో I) స్వేచ్ఛానవం II) ఆవాహనం III) ముక్తకాలు IV) సమయదర్పణం V) కిర్మీరం VI) వర్తమానం స్క్రీన్పై VII) అగ్నినుండి ఆనందానికి VIII) ఈ శతాబ్ది రెక్కలపై IX) అగ్నిపీఠం X) కిరణపథం, పదిభాగాలుగా వర్గీకృతమయింది. మొత్తం మీద ఓపిగ్గా వివేచన చేసి కవిత్వాభిరుచితో అస్పష్టతల్నీ పునరుక్తుల్నీ తొలగించి ఎడిట్ చేసిన పరిష్కర్త చి॥ హరితకు ఆశీస్సులు. ఈ పరిష్కరణం అభినందనీయమేకాదు ప్రశంసనీయంగానూ ఉంది. ఆరంభంనుండీ ఈనాటి వరకూ సృజన సమాలోచనా రచనల్లో ప్రజాస్వామ్యనిబద్ధత అనుస్యూతంగా ఆవిచ్ఛిన్నంగా ప్రసారగతిని పొందింది. స్వేచ్ఛాయుగంగా పేర్కోబడి స్వేచ్ఛాకవిత్వంగా భావితమైన ఈ కృతుల్ని సహృదయుల సమాలోచనకు వదలుతూ రాబోయే కాలంలో సాహిత్య చర్చకు కలిగే అవకాశాన్నీ భావిస్తున్నాను. ది. 26-03-2003 - మాదిరాజు రంగారావు స్వేచ్ఛా నవం కావ్యాలు 1. మానవీయం (1971) 2. పడగెత్తిన ఉదయం (1973) 3. ముక్తధాత్రి (1972)
అంకితం
ఈ జీవన పథంలో గమ్యమెరిగిన ప్రయాణికులు ఈ విచిత్ర జగత్తులో నీడ క్రమ్మని దీపకళికలు శ్రీమతి లక్ష్మీదేవి (నరసమ్మ) శ్రీ నారాయణరావు మాతా పితరులకు హృదయ తర్పణంగా V. SESANKA, M.A. Lecturer in Telugu Nanakram Bhagawandas Science College Pattargatti Hyderabad - 2 Residence : 53 B, Sanjeeva Reddy Nagar Hyderabad-38 సహృదయ దర్పణం సోదరులు రంగారావుగారికి నమస్కారం. మీరు దయతో పంపిన “మానవీయం” అందింది. బాహ్యాంతర సౌందర్యాలు రెండూ పుణికిపుచ్చుకున్న ఆ కావ్యం నా మనసు చూరగొన్నది. ఆ వస్తువును అంత Poetic గా చెయ్యడంలో గల కష్టం కవులకే తెలుస్తుంది. అందునా మీరు బ్రతుకు వంతెనపై నిలబడి కాల దర్పణంలో బింబించిన ప్రకృతి శక్తిని మీ మనోనేత్రంతో దర్శించిన తీరు అత్యంత రమణీయంగా ఉంది. విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నవి. గా మీ ఊహల ఉన్మేషంతో రూపొందిన సృష్టి ఈ మానవీయం అక్షరాక్షరం లోనూ ప్రతిబింబించిన సంగతి నేను గమనించాను. సృష్ట్యాద్యంతాలు కొలిచిన కవి దృష్టిలోని నైశిత్యాన్ని పరిశీలించాను. ఈ మానవీయంలో మీ కవిత్వం పండి పరిపక్వమవడం గుర్తించాను. సమకాలీన కవులలో మీ కవిత్వం ఒక ప్రత్యేకతను ఆపాదించగలదని విశ్వసిస్తున్నాను. ఇటీవలి కావ్యాలలో ఇంతగా “హ్యూమనిజమ్” చిత్రించిన కావ్యాలు లేవు. ఇందులో ఒక తరం నుండి వేరొక తరానికి అవిచ్ఛిన్నంగా మానవ సంతతి నాగరికత
తీర్చిదిద్దిన ఆత్మదీప్తి ప్రతిభాసిస్తున్నది. అదే ఈ కావ్యానికి జీవగర్ర. ఇంతటి మహత్కావ్యాన్ని రచించి ఇదివరకెన్నోసార్లు నాతో వెలిబుచ్చిన అభిప్రాయాలకు రూపకల్పన గావించిన మిమ్ము మనసారా అభినందిస్తున్నాను. మీరీసారి హైద్రాబాద్ వచ్చే ముందు నాకు వ్రాయాలి. మీరు నా ఇంటికి ఒకసారి రావాలి. 10-7-1971 భవదీయుడు శశాం
మానవీయం (1971)
Haritha, Madiraju Devulapalli, M.A. (Lit.) స్వేచ్ఛా కవిత్వంలో వెలువడిన కావ్యం "మానవీయం". మానవుని వికాసదశల కవితారూప సర్వేక్షణం. మనిషి ప్రాచీనదశనుండి ఆధునిక దశ వరకూ పొందిన స్థితిగతులు, చివరకు విశాల భావనతో విశ్వసంస్కృతిని పొందే వ్యక్తిత్వమూ స్థూలంగా
ఆవిష్కృతమైంది.
స్వేచ్ఛా కవిత్వంలో దీర్ఘమైన సామాజిక కావ్య నిర్వహణలో మానవీయం ఒక
ప్రయోగరూపం.
ప్రకృతి భూమికపై మనిషి జీవన స్థితిగతులకు సంబంధించిన పరిణామ రూపం చిత్రితమైన కృతి. మానవ జీవితంలో ఉదయ దర్శనంతో కావ్యం మొదలవుతుంది. ఉదయకిరణ స్పర్శతో జగత్తు ప్రకాశమానం కావడం, మనిషి ఉత్సాహశక్తిని పొందడం, కొత్త ఆలోచనతో ఉపక్రమించడం జరుగుతుంది. "ఉదయం వచ్చింది ఉదార చరితునివలె”, ఉదయం రాగానే “ఆరోహణ”తో, మనిషి పయనం సాగుతుంది. జీవితం ఉత్తేజాన్ని పొందుతుంది. ఉదయం తరువాత అస్తమయం, మళ్లీ ఉదయాస్తమయాలు, ఆశతో సక్రియ, ఆ తరువాత నిశ, విరామంతో కూడిన అనుభవ పరంపర కలిగింది. మనిషిలో అభౌతిక జగత్తు
అవతరించే
సూచనతో, దివ్యమైన అనుభూతిని పొందే ఆలోచనతో మానసిక జగత్తు రూపొందింది. దేవతల కల్పన జరిగింది, అతీతంపై దృష్టి ప్రసరించింది. జీవిక మొదలు మనిషి తన మనుగడకై, ఉనికికై, ప్రగతికై సంతోషం దుఃఖం సంపద దారిద్య్ర్యం విజయం అపజయం ద్వంద్వాలతో అధిగమించిన అనేక స్థితుల చిత్రణం కన్పిస్తుంది. తనకు కావలసిన ఆహారం ఆచ్ఛాదనం నివాసంకై ప్రకృతితోను, సమాజంతోనూ, వ్యతిరేక శక్తులతో పోరాటం
తప్పనిసరి
అయింది. ఈ ప్రయత్నంలో విజయంతో, భోగం విలాసం ఉల్లాసం వికాసంతో జీవితం పొందిన వివిధ దశలు సామాజిక స్పందనతో రూపొందాయి. బ్రతుకు వంతెనపై ప్రయాణ
సందర్భంలో అనుభవస్థితులూ, ఆలోచనా రూపాలూ కన్పిస్తాయి. ప్రకృతీ సమాజం చెరొక వైపు నుండి మనిషి జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేసేదీ, అనుభవంలో వీటి ప్రమేయమూ వర్ణితమైంది. ఈ భాగంలో భౌతికం-మానసికం రెండూ ఒకదానితో మరొకటి విడదీయరాని బంధంతో ఏర్పడిన స్వరూపాన్నీ చూడవచ్చు. ఏ జీవితంలోనూ కేవలం భౌతికం కేవలం మానసికం ఉండదు. ఈ రెండిటి సమ్యాక్మేళనం కన్పిస్తుంది. జీవితంలో ప్రకృతీ సమాజంతో జీవితంపై ప్రకృతి ప్రభావం, సమాజం ప్రభావం వ్యక్తిపై భౌతిక మానసిక ప్రభావాలూ వాటి పర్యవసానమూ కవితాత్మకంగా దర్శనమిస్తాయి. రెండో భాగంలో, జీవితంలో అశాంతి ఒక వలయం తరువాత మరో వలయంగా ఎట్లా ఆవహించేదీ ప్రసక్తమైంది. ఈ అశాంతి ఎన్ని విధాలుగానో ఉంటుంది. దీన్ని అంతరింపజేసే ప్రయత్నాలనేకం జరిగాయి. ఇందులో వైయక్తికాలు సామాజికాలు
కన్పిస్తాయి.
మనిషిలో పోటీతత్త్యం, విజయకాంక్ష, దీనికోసం ఎత్తులు, వ్యూహాలు కొత్త మార్గాలు, అడ్డదారులు ఎన్నో! ఎవరి విజయలక్ష్యం వారిదే. సంఘర్షణ
అనివార్యమవుతుంది.
వైయక్తిక ప్రయోజనంతో ఒక విధం సామాజిక దృష్టితో మరో విధం రెండూ పాయలుగా మనిషిలో సరిస్తూంటాయి. ఈ ప్రయాణం ఏ రోజు కారోజు కొత్త అధ్యాయంతో మొదలవుతుంది. ఈ ఉదయాలనంతాలు, ఈ ప్రయాణంలో ఎదురయ్యే మజిలీలెన్నో అజ్ఞానారణ్యాల నుండి విజ్ఞాన శిఖరాల దాకా, అన్నీ దాటుతూ పోవలసిందే, ఎప్పటికపుడు కొత్త శక్తితో కొత్త సృజన దర్శనంతో సాగుతుంది. మానవీయం, సామాజిక కావ్యం మానవుని వైయక్తిక సామాజిక జీవన దిశల్ని బింబిస్తూ మానవీయ భావ ప్రధానమైంది. మనిషి లేకపోతే ప్రపంచమంతా ఏముంది? మనిషితోనే అన్నీ అన్వర్థమవుతున్నాయి. ప్రాణికోటిలో అత్యుత్తమమైన మనిషి తన బుద్ధిబలంచేత ఉన్నతమైన విలువల జీవితాన్నీ,
వికాసవంతమైన
నాగరక సమాజాన్నీ నిర్మించుకోవడం జరుగుతుంది. వ్యక్తి కోరే వెలుగు సమాజానిదే. ఏ ఒకరూ దీన్ని స్వంతం చేసుకోలేరు. మనిషి శక్తికీ యుక్తికీ నిదర్శనం. అయితే, ఈ యుక్తీ సృజన శక్తితో స్వర్గాన్ని నిర్మిస్తాయి. మారణాస్త్రాలతో విధ్వంసాన్ని కలిగిస్తాయి. మానవత ఉన్నంత వరకే అన్నీ అదుపులో ఉంటాయి, సత్ఫలితాల్ని ఇస్తాయి. మనిషీ, మానవత-మానవ చేతన, సమాజ వికాసం-మనోరూపం, పురోగమనం - అన్న అంశాలు కీలకస్థానాలు కలిగిందీ, మానవీయం. రచనలో ఆరంభంలో ఉదయరూపం సృజనాత్మకమైన మానవశక్తికి ప్రతీకగా ఉంది. మానవశక్తిలోని చెడు పార్శ్వం చీకటిగా కన్పిస్తుంది. మేల్కొన్న మనస్సుతో మనిషి చలనమే ప్రయాణం. ఈ ప్రయాణంలో అంధకారం, అహంకారం అశాంతి ఆవహించినపుడు, మనిషిలో వెలుగు దివ్యభావనగా మారి ఎట్లా వెలుగు దారిచూసేదీ, ప్రసక్తమైంది.
దేవతలుగా
మలచబడిన దివ్య భావన, మానవ ప్రస్థానంలో నిర్వహించిన పాత్ర ఏ దేశంలోనైనా విస్మరించరానిది. ఒంటరితనం నుండి జంటగా, ఆ పైన గుంపు సమాజం ఏర్పాటూ, క్రమంగా బుద్ధి వికసించీ, విజ్ఞానం పెరిగి హృదయం స్పందించే కళారూపాలవతరించీ, మానవ జీవితం సంస్కారాన్ని పొందింది. నాగరక దశకు చేరుకుంది. అయినా సమాజంలో పేదరికం అజ్ఞానం అశాంతి మిగిలే ఉంది. ఇందులో మనిషి స్వార్థమూ లేకపోలేదు. “మానవ ప్రగతిపథంలో వెలుగుపూడ్చలేని లోయలు" మిగిలే ఉన్నాయి. ఇవి చీకటితో నిండి ఉండడం విశేషం. ఇవి వైయక్తికాలు, సామాజికాలుగా దృష్టికి అందుతాయి. మరో ఉదయంపై ఆశతో మనిషి పురోగమనం సాగుతూనే ఉంటుంది. ఇదో నాటితో అంతమయ్యేది కాదు. ఒక తరం తరువాత మరో తరం వస్తుంది. ఒక యుగం పోయి మరో యుగం అడుగు పెడుతుంది. మనుషులు సమాజంలో వర్తిస్తూ పోతూంటారు. విలువలు మాత్రం అవే, లక్ష్యం అదే! వ్యక్తి వికాసమూక సామాజిక శ్రేయస్సూ! సంబంధాలు, సాధనాలు మారవచ్చు, మారతాయి కూడా. “మానవ రూపాన్ని తీర్చిదిద్దే మనోరూపం ఒకటే”నన్న భావ సూత్రం ఆవిష్కృతమయింది. సమాజంలో తిండికీ బట్టకూ కరువులేని స్వేచ్ఛతో కూడిన వ్యవస్థకై, భౌతిక పరివర్తనంతోపాటు మానసిక వికాసమూ భావితమైంది. దీనికి వివిధ మానవ శక్తుల
సంచరణం
వాటి సరియైన వినియోగం అవసరమవుతుంది. సంపూర్ణ ప్రగతికి వైజ్ఞానిక భూమికతోపాటు మానవతా స్పందనమూ అవసరమన్న సూచన ఉంది. చరిత్రలో జరిగిపోయినదానికి చింతించడంపై దృష్టి కన్నా సమాలోచనం జరిపి మంచి భవిష్యత్తుకై వివేకవంతమైన
నిర్ణయాలు
తీసుకోవడం అవసరం. "జీవితం మొదలు చివర బిందువుల్ని లోకంతో కలిపే మహాశక్తి మానవీయం”. మనిషి పుట్టింది మొదలు మరణం దాకా మానవీయం అస్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. చరిత్రలో నాగరకత సంస్కృతి రూపాలతో మానవీయం అమృతత్వాన్ని కలిగిస్తుంది. ఇది ఒక దశతో ఒక యుగంతో ఆగదు; అవిచ్ఛిన్నమైంది. తరం నుండి తరానికి చేరుతుంది. మనిషి నుండి మనిషికి సంక్రమిస్తుంది. స్థానికమైన వ్యవహార దశల నుండి, విశ్వ సంస్కృతి దాకా పరివ్యాప్తమైన వ్యక్తిత్వంతో మనిషి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయాణం చేపట్టేను. ఈ పురోగమనంలో మనిషి వ్యక్తిత్వం, “పదపదంలో కొత్త శక్తినీ, ఎదఎదలో కొత్త సృష్టినీ” ఆవిష్కరిస్తుంది. మానవీయంలో వస్తువు, మానవ వికాసరూపం. జీవితంలో సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, మానసిక, తాత్విక అనుభవాలతో ఆకృతి పొందింది. ఒకే మనిషి రూపం
జీవితంలో
భిన్న భిన్న పాత్రల్లో ప్రత్యక్షమవుతుంది. మనుగడలో దేని ప్రయోజనం దానిదే, దేని లక్ష్యం దానిదే. మానవతా సూత్రమొకటే వీటిని ఒకచోట బంధిస్తుంది. భౌతిక, మానసిక తీరాల్ని
స్పృశిస్తూ సాగే సమాజం, నిరంతరమైంది, అవిచ్ఛిన్నమైందీ. మనిషిచేత మనిషికై మనిషితో రూపొందిందీ. దీనికి మూలతలం మానవీయం, అన్న తాత్విక భావన ఈ కావ్యానికి కేంద్రబిందువు. ఈ దృష్టితో దీన్ని సమాలోచనం చేయవలసి ఉంది. స్వేచ్ఛా కవిత్వంలో కదులుతూన్న సాధారణ ప్రవాహం నుండి భిన్నమైంది, స్వతంత్రమైందీ “మానవీయం”. మానవ జీవన పథంలో స్థూలంగా భౌతిక, మానసిక, సామాజిక, రాజకీయ, తాత్విక,
వైజ్ఞానిక
స్థితుల్ని ప్రతిబింబించేది. స్వేచ్ఛా కవిత్వంలో తొలి సామాజిక మానవ వికాస కావ్యం. Detroit, Michigan, U.S.A. 20-6-2001 హరిత
I. మానవీయం
I. 1. ఉదయధుని ఉదయ తరణి కెదురుగా నిలిచిన నాలో కొండ కొమ్ము మీది నుండి రసధుని పరుగెత్తినట్లు ఇసుక తలంపై ప్రవాహం తళతళ లాడినట్లు వెలుగు పొంగు ఎపుడు వచ్చి ముంచెత్తిందో? వెలుగులతో రోదసి మనోజ్ఞ రూపం దాల్చి జడమయమైన ఆశలకు ప్రాణం వచ్చింది బహు వర్ణ సుమ పరాగం విరజిమ్మిన రీతి అనిదం పూర్వ విభూతితో క్షితిజం జీవితరూపమైంది ఇంద్ర చాపం వలె పరచుకొంది మనస్సు తెరచుకొన్న ప్రాగ్దిశా స్వర్ణ కవాట కల ధ్వనికి విప్పారింది మానసం మంటి నుండి మింటి కెగసి నిల్చిన సప్త వర్ణ నిశ్రేణిక వలె తోచింది జీవితం ఉదయం వచ్చింది ఉదార చరితుని వలె అమృత లిప్త వెలిగింది ఆత్మప్రకాశం వలె దినమణి దీప కాంతితో హర్ష ధారా వీక్షణాలతో ఆకాశం భూమీ కౌగిలించుకున్న క్షణం సన్నని వెలుగు దారాలతో దిశ నుండి దిశకు అల్లిన సాలీడు పటం వలె ఉంది ప్రపంచం మబ్బులో మెరుపు వలె ఊహల కదలికతో
మనస్సులో పూర్వపు చీకటి స్మృతులు రాగ కర స్పర్శతో నిద్ర నుండి మేల్కొల్పి భూమికీ ఆకాశానికీ బంధం కూర్చేను సూర్యుడు ప్రత్యణువునూ పులకింపజేసే వెలుగు వాకలు గుంపులు గుంపులుగా విసరిన పూల దండలు- పైన గగన పదం వీడి బ్రతుకలేని మబ్బులు క్రింద పాదాలు పట్టుకొనీ వదలని క్రీనీడలు దూరంలో ఆకాశం మృత్యు ముఖం వలె ఉంది. దగ్గరలో క్షితిజం రాగంతో ఆకర్షిస్తూంది బారులుగా విచ్చిన వెలుగులు ప్రసార ఝరులు చాచిన దేవతా హస్తాల వలె ఉన్నాయి నిర్మలాంతఃకరణంలో సాగే ఊహల వలె స్వర కల్పనలో సరించే మాధు ఝరి వలె కళా వర్ణ సౌందర్యం చిమ్మే చిత్రం వలె కదిలి పోయేను మోహాపాదక కాంతులు మనస్ సముద్రోర్మికలపై తేలిపోయే ఆనంద కళకలు రివ్వున దూసికొనీ వస్తూ నడవలేని చెట్ల బుజాల పై చేయేసి కదలిస్తూ కదలిపోయేను వాయువులు దివ్యానుభూతినిస్తూ చూపు మేర ఆకాశం క్షణ క్షణం పొందుతూంది వివిధ వర్ణ సామరస్యం తీవ్రమైన ఆకర్షణకు లొంగి భూమి సంతోష చకితమైంది మేల్కొనీ మేల్కొనని దశలో సృష్టి కలల వరస వలె ఉంది కాంతి వర్షంలో తడిసి శరీరం స్వర్ణమయమైంది మధునదంతో నిండి హృదయం సమార్ధమైంది వెలుగులు వెల్లి విరిసి ముఖం పూల బంతి అయింది ఆనందంతో చిందులు త్రొక్కే శిశువుల వలె ఆకాశంలో యధేచ్ఛగా విహరించే మబ్బుల వలె రసానుభూతి పరవశింపజేసేను ఆలోచనలు చూస్తూ చూస్తూ ఉండగనే క్షణాలపై కాల శ్మశానంతో దగ్ధమైపోతున్నాయి లిప్తలు గగన మార్గాన ప్రయాణం చేసి అలసిన సూర్యుడు పశ్చిమ దిగ్వేదికపై విశ్రమించాడో లేదో అనంతమైన వెలుగులు సాంతమైపోయాయి ప్రపంచమొక పరిధిలో బంధితమైంది
రెప్పల అంచులపై నిదుర బరువుగా వాలిపోతూంది విశ్వంలో ప్రణవం వలె నిశీధి చంద్రికవలె నిదురలో స్వప్నం వలె పురుషు నంటుకొని అగాధమైన మనస్సు లోపొరల్లో నుండి ఊహల ఔల్బణ్యం అధికాధికమైంది గభీరమైన తమస్సు లో పొరల్లో నుండి వెలుగుల ఆగమనం అత్యావశ్యకమైంది నిదుర పట్టడంతో కాటికి కాళ్లు చాచి రెక్క విరిగి కుప్పగా కూలిన రాత్రి చిట్టచివరి ఊపిరి కాస్తా వదలింది నిదుర వదలడంతో ప్రత్యక్షం మరో ఉదయం అరె! ఎంతలో వచ్చింది ఆహ్లాదకరమైన ఉదయం మానవ లోకానికి శుభోదర్కమైన సమయం సనాతన కాంతి చిమ్మే నా కళ్లముందు స్వర్ణ వలయ సమాక్రాంత తేజశ్చక్రం
I. 2. ఉదయం తరువాత తూరుపుటద్దంలో సూర్యుని ముఖం కన్పించేసరికి భయంతో నివాస స్థలాలు విడిచి చీకట్లు దూరాకాశ తీరభూములు చేరాయి. రువ్విన రాళ్లవలె రివ్వున ఎప్పటికపుడు మనస్సు నాక్రమించేందుకు తిరిగే మృత భావనా మూర్తులు వెలుగులారి కొడిగట్టిన వత్తులు చీకట్ల సమావేశంలో ఏకగ్రీవంగా ప్రకటించిన నిరసన పత్రం తుహిన యవనికా రూపంలో ప్రత్యక్షం చదవడానికి యత్నిస్తున్నాయి చెట్లు చెరిపేందుకు ఉత్సహిస్తున్నాయి వెలుగులు రవి దీపం వెనక నీడలంటి తిరిగేరు రాత్రించరులు దీపం వెలుగులో తామై వెలిగేరు దివౌకులు- ఒకమారు చీకటిలా మందంగా, ఒకమారు వెలుగులా చురుగ్గా కదలీ కదలని మేఘంలా జారిపోయేను కాలం విడిచే ఊర్పుల్లో సాగిపోయేను జీవితం
ఆకాశం డొక్కలో పర్వతం వలె నిద్రించే చీకటిని మాపేందుకు సూర్యచంద్రుల ప్రభా ప్రసారం వీరి పాలనలో ఒదిగిపోతుందీ మహాజగత్తు
I. I. 3. అభౌతిక రేఖలతో జన్మించిన వేళ నుండి ముఖంలో బింబిస్తూ ప్రతిక్షణం సమయంకై వేచి ఉంటుంది భవిష్యత్తు వదలిన ఊరుపుతో మేల్కొన్న మనస్సుతో వర్తమానం అంతమొంది అవుతుంది గతం ఆకాశం మేల్కోగానే ఎటుచూచినా ప్రాణి చలనం నిదురకూ జడానికీ అనుబంధం మెలకువకూ చలనానికీ స్నేహం అందం విరిసి గంధం చిమ్మే విచ్చిన సుమదళ పంక్తులు ప్రాణం పల్లవించి రాగం రవళించే జీవన దశలు ఝంకృతి తిరిగే తుమ్మెదలతో శోభారుణ పద్మం వలె మనుషుల కదలికతో నిండారింది ప్రపంచం. సూర్యుని ఆశీః ప్రసారంతో కిర్మీరీకృత భూమిపై ఒక వలయం అతిక్రమించి పోయే లోపల వేరొక వలయంచే పరీవృతమౌతాయి పాదాలు. దుఃఖత్రయంతో ఎపుడో బంధింపబడింది జీవితం. రెండు చెక్కలుగా వ్రయ్యలైన కాలం రూపాలు ఒకదాని ముఖం చూచి మరొకటి ప్రక్కకు తప్పుకొని పోయేను దివానిశలై, సుఖదుఃఖాలకు ప్రతీకలై. నిదుర జారిపోయి మెలకువ కలిగే లోపల కళ్ళుమూసి తెరచే లోపల మాట పెకలి వచ్చే లోపల ఊహలు నిర్గమించి వాక్చిత్రం పొందే లోపల ఉషస్సు తూరుపు దేహళి దాటి అడుగు వేసే లోపల పాదరసం గుళికల వలె జారిపోయేను లిప్తాంశలు అడుగు వేయడంతో లిప్త వరించకముందే ఆశా శబలితమై జీవితం ఆకర్షిస్తుంది. అడుగు తీయడంలో లిప్త గతించగనే నిరాశామయమై మృత్యువు కమ్మేస్తుంది. శోక మోహ భయ కోపాలకు లొంగిపోయే అశాంతి రూపాల్ని హరించే ఉదయాలు ప్రాణి కోటి కాహ్లాదమయాలు
శిశువు వలె ప్రత్యక్షమై వృద్ధువలె నిష్క్రమించేను సూర్యుడు ప్రతి ఉదయం అవతరించే నిత్య నవ్య మనోజ్ఞ మూర్తి మొదలూ తుదీ నాశనమెరగని మహాకాంతి పుంజం నుండి అవతరించిన భాగంవలె ప్రపంచం. అందులో అగ్నిశిఖలవలె చరించేరు మానవులు. ఉదయ దిశా స్వర్ణ కాంతి దేహళిపై దృష్టి నిలిపి రాగ నిభృత వర్ణమహిత మనస్సుతో సుందరరూపంలో శుభగుణకామనలో సమయ సమయం పరికల్పిత రూపాలే దేవతలు. ఎన్ని ఏండ్ల గ్రహణం నుండో విడిపించి నభోమణిని మరుద్గణంతో దుస్థితి పారద్రోలి సుస్థితి కల్పించే వజ్ర శతక్రతువు శచీపతి ఇంద్రుడు. హిరణ్యవర్ణుడు నిత్య పవిత్ర మూర్తి దేవతలకూ మానవులకూ దగ్గరి బంధువు ప్రతి ఉదయం అవతరించే కవిక్రతువు, అగ్ని మూర్తి సవితృ బింబ నేత్రంతో సకల సృష్టి పర్యాలోకన చేస్తూ హస్త విధృత పాశాలతో సువర్ణ పక్షాలతో క్షమామూర్తి ధృతవ్రతుడు వరుణుడు సర్గ స్థితి లయలకు హేతువులై నిల్చిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివులు, దివ్య మనో రూపాలు అహంకారం అంధకారం అశాంతి అలముకొన్న హృదయావరణంలో దివ్యమైన అనుభూతి బిందువులై, దేవతలు ప్రేమతో కరుణతో వెలిగే జ్యోతిః ప్రతీకలు.-
I. 4. జీవిక మొదలు రోజూ వస్తాడు సూర్యుడు శ్యేనం వలె ఎగురుతూ కాంతి కేతన చాలనంతో ఆశలు కళ్ళు తెరుస్తాయి. పూవు రాలుతుంది మొగ్గ పొటమరిస్తుంది ఒకదానిలో విషాదం మరో దానిలో ఆనందం. పూలతో పరిమళిస్తుంది సమయం పండ్లతో పరిణమిస్తుంది కాలం రోజురోజు వికాసమందే జీవితంతో ఘటనల్లో పొందే చరిత్ర రాత్రీ పగలూ నిరంతరం ప్రయాణించేను మనిషి. బ్రతుకొక అగ్నిగోళమై ఎవరి దారిన వారు
శాంతికై కాలు సాగే మార్గాన పయనించేరు, ఒంటరితనం సహించలేక జంటలుగా కదలి గుదులుగా తరలి వివిధ స్థలాల్లో బహువిధ జీవితాలతో హృదయం స్పందించే అనుభవంతో బ్రతికేరు బుద్ధి వికసించే విజ్ఞానంతో సంచరించేరు సన్నివేశాన్నిబట్టి నటనతో కాలవేగ చలనంలో సుడిగాలివలె పరిభ్రమించి అదృష్ట సీమలు అతిక్రమించి అపాయచిహ్నాలు గుర్తించి, అసాధ్య సముద్రాలు ఉత్తరించి మర్మమెరుగని దిశవలె నున్న బ్రతుకులో పరివర్తనం! గాఢమైన అనుభవ పారంపరిచే హృదయం విశాలతరమై తీక్షణమైన భావనాబలంతో బుద్ధినైశిత్యం పెరిగి అథమ స్థితి నుండీ పరమస్థితివరకూ బహు వృత్తులతో ప్రవృత్తులతో జన సందోహం! ఒకప్పుడు మృగం వలెనో పక్షివలెనో మరొకపుడు పామువలెనో పురుగువలెనో బహుగుణ రూపాల్లో దాగిన మనోరూపాలతో పెరిగి తరిగి ఒదిగి మరిగి నశిస్తూ పోయేరు మనిషిని హతమార్చి క్రోధాగ్ని తనుపుకోనీ మనిషిని భక్షించి క్షుధాగ్ని చల్లార్చుకోనీ మనిషిని రక్షించి మానవత్వం నిలుపుకోనీ మనిషిని క్షమించి దైవత్వం పొందేను మనిషి. ఒక భయ ధ్వని కనుకోకుండా ఎగిరి అవిజ్ఞేయంగా ఎక్కడో వాలిపోయే పక్షులవలె ఎక్కడో దూర దూరం విసరబడీ కుప్పకూలి చివర కసువులు కోల్పోయేరు చరిత్రలో స్థానంలేని మనుషులూ ఉన్నారు పయనంలో లక్ష్యం ఎరగని ప్రయాణికులూ ఉన్నారు. ఎంతమందిని అణచి చావు పాలు చేసీ ఎంతవరకు జయం సాధించిందీ ప్రధానమైంది. ఎంతమందికి ప్రాణం పోసి రక్షించి ఏ దుస్థితి నుండి సుస్థితికి తెచ్చిందీ గౌణమైంది. ఈనాడు నిశ్చితంగా ఉన్నవీ విజ్ఞాతంగా ఉన్నవీ రేపటి కనిశ్చితంగా మారేను ఆశ్చర్యంగా జరిగేను ఈ విషమ ఘటనల్లో చిక్కుకొనీ అనుకోకుండా
అసువులు కోల్పోయే త్యాగమూర్తులూ! సముద్రంపై పయనించే నావపై గాలికి రెపరెపలాడే తెరచాపవలె జీవితంలో అలజడి కలిగించే ఆశతో మెరుపు కత్తి వంటి బుద్దికి భాసించే నిశా గుహా ప్రాంగణాన మృత్యువు సామీప్యంలో ధూమావృత శిఖల వలె స్వస్థితి తెలీని మానవులూ. అమాయక శైశవం నుండి పరిహరించరాని మృత్యువు వరకూ పొరపాటు అలవాటై మరచిపో శక్యం కాని మానసిక బానిసత్వం దర్పంగా భావిస్తూ చావుకు సైతం వెనుదీయని సమూహంతో జీవితమొక వ్యాపార సరణి గడిపే గణమూ ఉంది.- అధికార పిపాస పెరిగి కీర్తి కాంక్ష ప్రబలి అంతరించి ఒక రాజవంశం మరొకటి ఆవిష్కృతమౌతుంది. అణచబడిన జాతి మతం స్థానంలో మరొక జాతి మతం అభ్యుదితమౌతుంది. అవనీతలం ఆక్రమించి ఆకాశం హద్దుపై దృష్టితో ఆచంద్రార్కం యశో బింబాలుగా నిల్చే యత్నాలెన్నో ప్రక్కనే పతితమైన శీర్ణ కేతన పరాభవం. అపుడే ఉదితమైన విజయ కేతన ప్రచాలనం. రాజనీతి ప్రతారణతో జీవితాన్ని ఎత్తి చూపే వెలుగు మెట్లు కొన్ని, చీకటి మెట్లు కొన్ని చరిత్రలో మనోంతరాళంలో అణగిన జంతు తత్త్వం భిన్న రూపాల్లో ప్రకటితమౌతుంది జీవితంలో. ఇదమిత్థంగా నిర్ణయించే వీల్లేని విపరీత మతి రాక్షస జీవితంలో మృత్యువు సామీప్యంలో హృదంతరంలో మూర్తి కడుతుంది దేవతా భావం ఇదమిత్థంగా నిర్ణయించే శక్తిలేని మనస్సులో దేవతా భావం మోసులెత్తకుండా ఎప్పటికప్పుడు అణగద్రొక్కుతుంది రాక్షసత్వం. మనిషికి మొట్టమొదట కావలసింది ఉనికీ, కొన్ని అడుగుల మేర నేల ఆహారం అధికారం సంపద ననుసరించి వీటి సంపాదనకై రక్షణకై ఉపాయాలు
వీటికై తలెత్తే ఆలోచనా పద్ధతిలో తాల్చిన ఆకారాలు, ఈ కోటలు సామ్రాజ్యాలు ! దాహం క్షుధ విషయ వాంఛతో పాటు అలౌకికానందం అవసరమూ ఏర్పడింది. పుణ్య పాప భావనతో స్వర్గ నరక నికేతనాలూ
I. I. 5. అస్తిత్వంకై ఆవరించిన భయచ్ఛాయలు అజ్ఞాన నిలయాలుగా తోచాయి ఆచ్ఛాదన జ్ఞానం కళాన్వితమైంది బంధుభావం వీడని సూత్ర బంధమైంది భౌతిక మానస శక్తుల భేదం గుర్తింపబడింది అమృత కళకు ప్రతినిధిగా సౌందర్యశక్తికి ప్రతీకగా ఉషస్సులో దివ్యమైన స్త్రీరూపం దర్శితమైంది. జీవితాన ఆనందం అన్వేషణ మొదలై సంగీతం సాహిత్యం చిత్రం శిల్పం కళలన్నీ సంస్కృతీ శిఖరాల్ని సృజించే ప్రతిభారూపాలయ్యాయి అధికార మర్యాదలతో సవ్యాజ మనోరీతులతో లౌకిక గతి వ్యూహాల్లో పావులుగా మారాయి. మానసికంగా తీరని దాహం క్షుధ ప్రబలింది. ఎన్ని మజిలీలు దాటినా సమాజ జీవితం ఏ విజ్ఞాన సంస్కార శిఖరం పైనా స్థిరపడలేదు ఎప్పటికప్పుడు చ్యుతమై కీర్ణమై నిరంతరం వినష్టమై పునః పునః యాతనలో మ్రగ్గేను. విమోచనకో, విజయానికో జరిగే సంఘర్షణలో కొత్త శక్తి సమీకరించి సిద్ధం అయ్యేను మనిషి ఆత్మ నిత్యత్వం భావించిన నాటి నుండి మనిషికి ప్రపంచానికీ గల సంబంధంపై గగనం నుండి జారిన బంగరు గొలుసులవలె ఎడతెగని ప్రశ్నలు! ఆలోచనా తరంగాలు ఏదో మత నియమం లేని మనిషి లేడు ఏదో బిందువు నుండి మొదలుకాని రేఖ లేదు. ఏ వలయాకృతిలోనూ మేర లేని ఊహ లేదు మనిషి పొందే పరిణతిలో వైవిధ్యం వైశిష్ట్యం ఎంతైనా ఉంది.
ఒకవైపు పరంపరగా తరలి వస్తుంది శైశవ యౌవన కాంతి దశలతో తరం మరో వైపు వరసగా నిరంతరం మట్టిలో కలుస్తుంది తరం వెంట తరం. చిగుళ ్ళ ఆకులూ పూలు పండ్ల కలలు బీజంలో నిహితమైనట్లు జీవితం సుఖ దుఃఖాలతో భోగ త్యాగాలతో ఆత్మగత వాసనామయమై విస్తరిస్తుంది. గ్రీష్మ తాపానికీ వర్షా సేచనకూ చలి కోతకూ నిలబడిన జీవితం అనుభవ ప్రభావంతో చేవ దేరుతుంది కదలే చక్ర నేమి క్రమాన్ని తలపిస్తుంది.
I. 6. అస్తిత్వ రేఖలు వర్తమానంలో అనుభవంతో, భవిష్యత్తుపై ఆలోచనతో విషయ వాంఛా లతలతో అల్లుకున్న మేధతో కలతపెట్టే ఊహల సంచారాన్నీ భౌతిక మనో బంధనల్ని పద్ధతిలో తీర్చే నీతిపై విశ్వాసం అలవడింది. వెరగొందిన మృదు భావుక మనస్సులో మేఘం నుండి మెరుపుతో పిడుగులా తోచి చెరగే నిప్పులతో బ్రతుకంతా ఆక్రమించి హృదయ విదారకమై జ్వలించింది నరకం. తనువొక వరణీయ దేవతా ప్రసాదమైంది దివ్వెనుండి దివ్వెతో ప్రజ అయింది దైవంపై భారంతో గడచే బ్రతుకులు ప్రేయస్స్వరంతో దివ్య రూప మూహించేను. క్రౌర్యంతో వర్తించే బ్రతుకులు కఠోర రావంతో ఘోర రూప మూహించేను తల్లి పిలుపులో తండ్రి పలుకులో శిశువు నవ్వులో ప్రియుల చెలువులో భక్తి భావనలో శాంత హృదయంలో స్పందించింది స్వాదు తర సంగీతం
I. 7. కాలదర్పణంలో కొండ ప్రవాహంలో రోదసిలో ఊరుపులో ఊహలో ప్రకృతిలో నిరంతరం సాగే నాదలహరి వలె గుత్తులు గుత్తులుగా తరలి కిల కిల నవ్వులు విసరి విసరి ఒడ్డున ఒరిగి చప్పట్లు కొట్టి తరలే అంతరాఘార్ణమాన జలధి తరంగాల వలె మనఃకుహరంలో లయాత్మక భావనలు. ఎప్పటికప్పుడు అడ్డుగోడలతిక్రమించి మునుముందుకు సాగిపోయే మానవుడు ప్రగాఢ సాహస మతి నిలిచి పోడు ఒకేచోట ఎంతదూరం వెళ్ళినా ఎంత కాలం గడచినా పైకి ఆ పైకి వెళ్ళాలనే మానవుని కోరిక ఆదర్శ లోకాలతో పరిచయం ఆవాసం కోసం ఆరాటం ఆందోళన! తీరని అజ్ఞాత తృష్ణ తీవ్ర వేగ మృదు ప్రచార దీపు లతో మనిషి జాతి సమాజం బ్రతుకంతా నిప్పులు చెరగి మండించింది కాలం పచ్చని పైరూ పండించింది కాలం. ఎన్ని సహస్ర సమలు గతించినా మృత్యువెరుగని ఉదయ దీప్తి వలె మమత చావని హృదయ రుచితో పతనం నుండీ పునరభ్యుదయంతో దివ్య దశను చేరుకునే యత్నంపై ప్రయత్నం! ఏనాడూ విరమించదు మానవ జాతి ! దుఃఖత్రయరేఖలతో మొదలై యుగాలుగా సాగే సంస్కృతి ప్రతినిధి మనిషి సుఖ దుఃఖాత్మక జీవిత సర్వస్వం బింబించే దర్పణం కాలం.- జీవితం మొదలు చివర శక్తి రేఖల్ని లోకంతో కలిపే దివ్య రేఖ దైవం ఆశ్చర్యానందంతో వెలుగు లోతులు స్పృశిస్తూ అలౌకికంగా సాగే జిజ్ఞాసా ఫలితం వేదాంతం జీవితం మొదలు చివర రక్తి బిందువుల్ని లోకంతో కలిపే మహాశక్తి మానవీయం.
I. 8. బ్రతుకు వంతెన పై నుండి మనో నేత్రం దర్శించే మహాప్రపంచాన్ని బింబించే కాల దర్పణం ముందు నేను దివా కాంతి చేలంతో నిశా నీల నిచోళనంతో చాంద్రీ మృదూత్తరీయంతో ప్రకృతి, ఎటు ప్రసరించినా దృష్టినాకర్షించే మతి భ్రమించే శక్తి రూపం. క్రింద మృత్తిక చుట్టూ వస్తు సమితి దివా నిశలు పరిభ్రమించే గ్రహ కూటమి - పైన దయా విహీనమన్నట్లు వన్నె మాసిన రాత్రి ఒకవైపు, దయా ప్రసారమన్నట్లు వెన్నె కెక్కిన ఉదయం, మరో వైపు జీవితమొక చివర తెలీని చీకటి వంతెన సంఖ్య తెలీని అనుభవాల వెలుగు మెట్లపై అడుగడుగున పునర్జన్మ ఎత్తినట్లుంటుంది. అడుగడుగున స్వర్గ శకల మందినట్లుంటుంది. చలనంలో చీకటి ముద్దలు కొందరు గమనంలో దీప శిఖలు మరికొందరు. వంతెనపై నడిచే మనిషిని వెనక్కు ఈడ్చే ఎవరెవరివో యత్నాలు సముద్రంలో అలలపై నౌక వలె ముందుకు సాగేందు కెవరివో హస్త వితతి ! వంతెనపై నుండి క్రిందికి చూచీ కళా భావనతో స్పందించే సరసులు అంధులవలె కళ్ళు మూసుకునే విభీతులు మైమరచి ప్రాణాలర్పించే విముగ్ధులూ దారిలో ఎందరో తటస్థపడతారు పరిచయాలతో ఒకరిలో ఒకరౌతారు. వంతెన కివతల మరి అవతల ఏముందో ఇదమిత్థమని ఎవరికీ తెలీదు. యుగాల నుండి పరంపరగా వచ్చే ఊహా ప్రావారాలూ, అనుమాన ప్రాకారాలూ తప్ప ! ముందుకు వేసిన అడుగు వెనక్కు తీయడ మసాధ్యం అడుగు ముందుకు పడకుండా అక్కడే నిల్వడ మసంభవం
ఎప్పటికపుడు భయంతో విచలితమై మనస్సు భవిష్య క్షణాల్ని కౌగిటపూనే ప్రయత్నం చేస్తూంది. ఈ వంతెనపై అంకితమైన పాదముద్రలు చరిత్రలో మిగిలే స్మృతులు, కాలాని కాభరణాలూ ప్రయాణ చిహ్నాలు, సమాజ సంపదలో భాగాలూ. వంతెన కిరుప్రక్కల అసంఖ్యాక యశః పతకాలు జాతి మత రాజకీయ విద్యా కళా రూపాలు నక్షత్రాలవలె అక్కడక్కడా నీతివ్రతులు త్యాగశీలురూ ఇహ పర లోకాల సంగ్రహ రూపాలూ వెలుతురు పిల్లల దూకుడుకు మేల్కొంటుంది ఊహకు తప్ప మూర్తి కట్టని వృద్ధ రోదసి. చుట్టూ యువశక్తితో కదలే వెలుగులు వేలాడే కాల సూత్రానికి గుచ్చిన పుష్పాలు.- దూర ధరణీ కాంతార సీమల నుండి
I. 9. ఆరాటం - అన్వేషణ ఏదో తీరని పెద్ద పనిలో మునిగి ఉన్నట్లు పరుగెత్తేను నదులు, మహాభుజగాల వలె చుట్టూ పూల గుత్తులతో నీల గగన మహా వృక్షం. నీల వలాహకం ప్రతిఫలించే కన్నులతో చెలగే పయః పారావార రసాకృతులు. ముగ్ద సరోవరంపై నతాకాశం వంపులు తొలి మలి సంజల్లో గాలుల చల్లని పలరింతలు మదిలో సుళ్ళు తిరిగే అమృతోహల పులకరింతల్లో తూగే పూల సవ్వడులు ! హిమాంశువులు హత్తుకోని ఎదపై కాలం ఒడిలో రెక్కవిప్పిన గులాబీలు వాటి చుట్టూ కొస దేరిన కంటకాలు జీవితం నుండి విడదీయలేని సమస్యల వలె. ఆకాశంలో నక్షత్ర హాసాన్నీ, శ్మశానంలో నిప్పు రవ్వల్నీ సమంగా ప్రకాశింపజేసే ఈ రాత్రి కొంగుచాటున కన్పించని దిగ్వలయంతో చీకటి కుచ్చెళ్ళలో దాగిన పృథ్వితో
ఒక నీల మహా శక్తిని తలపిస్తోంది. జగత్తు నావహింప గోరే ఆశల మొలకల వలె దిక్కుల అంచుల్లో సన్నని వెలుగు నర్తిస్తూంది ఆశా పతాక శిశువు చెక్కిళ్ళపై కన్నీటి చారల్ని ముద్దులతో తుడిచేసే మాతృమూర్తివలె తమ్మిరేకులపై మంచు సోనల్ని తుడిచేస్తూంది ఉదయం. గోధుమ వన్నె త్రాచు వలె దిక్కుల్లోకి ప్రాకీ ప్రచండాంశుస్ఫార మూర్తియై అంతలో మింటి నుండి మంటికి వ్యాపించే గ్రీష్మం కణకణలాడే నిప్పుకల హసంతీ హల్లీసకం ! అనల శరాసారం వలె ఎడమేమాత్రం లేకుండా హత్తుకొన్న సహస్ర కరోజ్వల దీపు లు ! కుప్పలు కుప్పలుగా బూది చెరిగిపోసిన నిప్పులు సుడులు సుడులుగా తిరిగే పదునైన వడగాడ్పులూ ఒక చోటి నుండి మరో చోటికి ప్రయాణంలో జల బిందువు కోసం మానవుని తహతహ ! పెద్ద ఇసుక దిబ్బవలె పగలు మెరుస్తుంది నల్లని రాతిగుట్టవలె రాత్రి పడి ఉంటుంది. గాలిలో తేలే దూది పింజల వలె వెన్నెల దూరం నుండి ఘన కాసారం వలె ఆకాశం ! వర్తమానంపై క్రమ్ముకొన్న దట్టమైన అతృప్తి వెంట భవిష్యత్తు కొమ్మపై గూళ్ళు కట్టుకున్న కోర్కెల పక్షులు ! జలద శకలం విరిసి కన్పిస్తే చాలు జీవన మర్యాదతో ముఖ పంక్తులు కళా విలసితమౌతాయి శరీరం స్పృశిస్తూ శీతల వాయురేఖ కదిలితే ఒకడొకడూ పొందే ఆనందం ! బ్రహ్మ పదవి చేరిక, దాహాగ్ని కర్పితమైన వర్షధారతో నిల్చిన పృథ్విపై అక్కడక్కడా బుడగల వలె కన్పించేరు మనుషులు. ఎక్కడికక్కడే దూర దూరం వాలిపోయి చూపు మేరలో మాయమౌతుంది ఆకాశం అవిరామంగా అశాంతి గీతం వినిపిస్తూ ఎప్పటికపుడు దూర దూరం పరుగిడుతాయి గాలులు. నిల్చేందుకు సూది మొనంత చోటు సంపాదించి ఆపై విస్మృతికై పరితపించే బ్రతుకుల వలె
ప్రతి అంగుళం అంగుళం మేర నేలను మ్రింగేందుకు మాటి మాటికీ విజృంభిస్తుంది సముద్రం తరంగ వేగ సమాలోల మౌతుంది మనస్సు.- ఇసుక ఎడారి నాలుక చాచి దూరంలో సరస్సువలె కన్పించే చంద్రుని వైపు పరుగు తీస్తుంది. ఎంతకూ అందుకో జాలని భూమి. పర్వత శిలా పాదాల ముందు తిరుగుతూ పూల వరుస వలె కన్నీటి చుక్కలు చిమ్ముతూ పర్వత హృదయ కార్కశ్యానికి రోసీ రుసరుస లాడుతూ పరుగుడితాయి నదులు ! ఉన్మత్త ప్రలాపాలతో తిరిగే పవన గతికి తలలూపే వృక్షాలూ అవతరించే అనల రూపాలూ అశాంతిలో మై మరచి నగ్న సత్యం చేసే యుద్ధ మూర్తి దాహకమతి భీభత్స కథా రూపం. మానవ ప్రగతి పథంలో ప్రకృతి ననువదిస్తూ వెలుగు పూడ్చలేని లోయలూ ! లోయల్లో గుంపులుగా ప్రబ్బికొన్న నీలి మబ్బుల వలె అగ్ని గతికి భస్మమవని చీకట్లూ ఉన్నాయి ! స్పర్శగుణం ఎరగనీ చలన శక్తి లేనీ నీడలూ ఉన్నాయి. మనిషిలో అశాంతి కివి అంటు మొక్కలు! అనతి దూరంలో ఒడ్డున శిలపై నుండీ ఈ వికృత సమాజంలో వీధి వీధినా అశాంతి దుఃఖ నిరాసనా కాంక్షుల 'శాంతి' వాక్ అమృత ధారా సేచనం.
I. 10. మనో దర్పణంలో అడుగు తీస్తే నుయ్యో గొయ్యో తెలీదు కదలితే ప్రక్కన జంతువులో మృగాలో తెలీదు మనుషులో రాక్షసులో దెయ్యాలో తెలీదు సహస్ర జిహ్వలతో జ్వలదగ్నుల వలె ఆలోచనలు కర్ణ వీథి కెగబ్రాకే భిన్న ధ్వనుల వర్ణ రీతులు. బాల్యం నుండి యౌవనం యౌవనం నుండి వృద్ధాప్యం
ఆరోహణ అవరోహణ దశలు దశలుగా సాగుతుంది ప్రయాణం అవిరామంగా మౌఢ్య బలం వినిపించే దరీ వాయు ఘోషలతో యుగాలుగా వేరొక దశ ఎరగని కొండలపై మెరపులతో కన్నీరు కారుస్తాయి పయోద పంక్తులు ఎండకు తపించీ, చివర కొక నీటి చుక్కెనా నిలవ ఎరగని కొండ రాళ్ళు! అసంఖ్యాకాలు ! సమాజంలో పీడిత జన సమూహాలూ. తల్లి ఒడిలో కళ్ళు మూసి చేతులు చాచి తడుముతూ వెలుగు మాసిన వసి ముఖంతో వణికే చిరు పెదవులతో ఎండిన గొంతుకలతో ఆక్రందించే శిశువులవలె విసరే గాలికి నేలపై నిల్వ లేని గడ్డిపోచలు బండలపై బోదెలపై విరిసి కురిసి వర్షం సహనం కోల్పోతూంది తక్షణం ఉన్మనీ చరమ దశ నందుకునే ఝంఝా సంగీతంతో వాయూచ్చల దుగ్ర రావ ప్రకృతిలో పటుతర భీభత్స రచన. నదీ మహావర్తంలో చిక్కుకొని పల్లటిల్లేను నావలు తలకు మించిన వ్యూహంలో అసువులు కోల్పోయేను. గాలి రొద ప్రసారం చేసే వృక్ష వితతి దిగ్భిత్తికలకు వ్రేలాడే మబ్బు గబ్బిలాలు అక్కడక్కడా సన సన్నని నీడ బొమ్మలూ ప్రకృతి సమాజస్థితికి సంకేతంలా ఉంది. నటనా చాతురీ నిగూఢ హాసం పెదవుల పొందికపై సదా ఒత్తిగిలే దుష్టోద్యోగి మనఃప్రకృతి వలె ఎప్పుడు పగిలిపోతుందో తెలీని అగ్ని పర్వతాలు మనోంతరాన సుళ్ళు తిరిగే ఊహల స్వేచ్ఛా సంచారం కార్యదశలో భయ సన్నివేశం వలె కల్లోల వాతావరణం నవ్వు తెరలు కప్పి మానసిక హత్యలు జరిపి పదు నెక్కిన ఊహలతో ప్రక్కన నడిచే మనుషుల వలె రివ్వున దూసుకపోయే మెరపు బాకులతో పిడుగుల జడితో చిందులు త్రొక్కే కారు మొగిళ్ళు అక్కడక్కడ వేసవి కృశించి నీరసించిన మొక్కలు దూర దూరంగా తప్పుకొన దాగి దాగి మలగే జీవులు బాటసారుల కళ్ళలో దుమ్ముకొట్టి ఆపైన అమాయకంగా కన్పించే ఇసుక దిబ్బలూ.
అక్కడక్కడా గొంతులు సవరించుకునే పిట్టలూ దగ్గర దగ్గరగా తూలి తూలి కదలే ప్రాణి సమూహం గ్రీష్మమందుకుంటే చాలు ఎండిన మ్రోడులతో తగలబడిపోవడానికి ఎదురుచూస్తున్నట్లుంది అరణ్యం. సుత్తెల మ్రోత ఎరగని కొండరాళ్ళు వర్షపు చినుకుల చవి చూడని మట్టి దిబ్బలు ఋతు పరివర్తన శక్తికి తాళలేని ప్రాణులూ చిగుర్పూ పెరుగుదల ఎరగని బ్రతుకులూ. అనియమిత మానవ ప్రగతి చరిత్రలో పూర్వాపర స్థితుల మధ్య ఏర్పడే లోయలు కళేబరాలతో పూడ్చబడీ మట్టి దిబ్బలయ్యేను ఈ దిబ్బలపై రప్పల వలె వసించేరు జనం.
I. 11. లయలో కోరికతో వెనక్కి తిరిగి చూడకనే ముందుకు సాగే ప్రవాహం వలె అణగిన కోర్కెలతో ఒకచోట నిల్చిన పడియ వలె ఋతు మనోజ్ఞ సౌందర్యం తెలీని కాల చిత్రం వలె నదీ సమార్ధ కర స్పర్శ ఎరగని శైల జాలం వలె బహువిధ జీవితాల్ని తలపించే ప్రకృతి రూపాలు ! పరిపాలింపబడి అనిదం పూర్వ స్థితులచే విపరీతపు గాలిచే బహు దూరం విసరబడి శక్తి పరిధిలో మలచబడి విచిత్ర రీతి గల్ల చపేటం వలె మ్రోగే వాయు ధ్వని వలె క్షితిజంలో సాగే మృదు కఠోర స్వరాల వలె చరించేరు మానవ రాక్షస తత్యానేక మతులు ! వర్ణోదక సమార్ధ భూసారంతో ఉద్గమించి పుష్ప ఫల భారంతో సుందరంగా వంగీ శిశిర తీవ్రతకు ముడుచుకొనీ ఆకులు రాలీ నగ్నమయ్యే లతా తరువుల వలె జీవితాలు ! జీవన సంతోష రేఖలూ పతన విషాదచ్ఛాయలూ బింబించే రూపాలతో ఆయుఃపరిమితి వెళ్ళబుచ్చే చైతన్యం కన్పించీ కన్పించని లౌకిక మూర్తులు ! వాయు ఝంఝ రాక్షస కృత్యం ఒక దిశ స్వభావంలో ఒదిగి
వినిపించే జన సముద్ర మహాఘోష ! అనుకోని స్వప్న ఘటన ! ఒక కోరికతో ఒక లయలో సాగుతుంది కలతతో అలజడిలో నిదురలో మృత్యువులో నియత రేఖ ననుసరించి అనువర్తన జీవితం అవిజ్ఞేయంగా అనిశ్చితంగా కన్పిస్తుంది సంక్లిష్ట రూపం.
I. 12. పృ ్వ గీతం రెండు కళ్ళు విప్పి ఎంత చూచినా తృప్తి చెందక ముఖాని కెదురుగా సూర్య చంద్రులు గుర్తుగా వంగిన ఆకాశం లేచి విశాలమై భూభాగం ఇచ్చిన అవకాశ స్థలి నిశ్శబ్దంగా కదులుతూ వినబడే సంగీతం వింటూ కనబడే దృశ్యం చూస్తూ పొలాలు ఎడారులు కొండలు అరణ్యాలు నదులు జనపదాలు అనుభవిస్తూ ఎంత దూరం వచ్చాను? ఎంతకాలం గడిచింది? వికసించిన పద్మం వలె నిశ్చల క్షితిజ రేఖలు హత్తుకొనేంతగా ప్రయాణ పదం ! సాగేను.- నిండుగా వృక్షాలు నావైపే చూస్తుంటాయి ప్రేమతో నదులు నా ముందే కదలుతుంటాయి చేతులు చాచీ గాలులెదురౌతాయి గత స్మృతుల వలె మంచు రాలిపడుతుంది. ఆకాశాన కదలే కారు మొగిళ్ళ గుంపులు భూమిపై సరసర పరుగెత్తే త్రాచు పాము ప్రవాహాలు కొంత దూరాన దూర దూరంలో కపాల రంధ్ర నిర్గత వాయు స్వరాలు వినీ హర్షంతో ఎగిరే పిట్టలూ భయంతో ముడుచుకొనే మనుషులూ దూరం సుదూరం సాగిపోయే ఊహలో ఒక ప్రక్క కొరిగి తిరిగే భూగోళం ! ఊహ గతంగా పెంచుకొని వేదన మానవుల కోసం ఎంతగా తపించి పోతున్నాను? అడుగడుగునా కంటి నాకర్షించేవి ! రంగులు వేసిన మట్టి బొమ్మలేనా ? నలువైపుల పరికిస్తూ గమనం సాగిస్తూన్న నేను నేనుగా గుర్తు పట్టడానికే ఎంత కాలం పట్టింది.
ఎక్కడ ఎవరిని చూచినా వారిలో నా రూపమే ఎక్కడ ఎవరు పలికినా అందులో నా స్వరమే కనబడే వినబడే జగత్తును పరిపాలిస్తుంది మానవ మేధ కనబడని వినబడని లోకాని కావర్జితమౌతుంది హృదయం. గడచిన స్మృతులు వెలుగు కంబాలై నిలుస్తాయి మరచిన స్మృతులు నిదురలో స్వప్నాలై తేలుతాయి. గుంపులు గుంపులుగా ఊహలు అగ్నులై ముబ్బులై మనస్సునాక్రమిస్తాయి, క్షణాల్ని నిలిపేస్తాయి. అంతలో మహాధ్వని ! అంతలో నిశ్శబ్దం ! నాల్కలు తెగిన గంటల వలె ! నా చుట్టూ గాలి పిలుపుకు పలుకలేని ఆకురాలిన చెట్లూ! గాలి స్పర్శకు పులకించలేని ఎండిన సరస్సులూ ! కళ్ళ ఎదుట మౌన రోదసీ కుహరం, స్తబ్ధ సమాజం వలె ! ఎదలో మ్రోగే ఆవేదనా సంగీతం మార్పుకు సంకేతం వలె ! నా శిరస్సు ఆకాశం వలె అందని ఎత్తులో ఉంది నా పాదాలు నదీ తరంగాల వలె ఒకచోట నిల్వలేకున్నాయి నా మనస్సు గాలి వలె వెలుగు వలె అంతటా ఆడుతూంది నా చూపు పక్షి వలె దిక్కుల్లో దూసుకుపోతూంది. అన్ని ఋతువుల్లోను కలిసిపోతూ కాలగమనంలో ఒకటై ఎంత దూరమైనా సాగిపోయి వెనక్కు మరలి రా స్ఫురించదు ఆకాశం గొంతులో గొంతు కలిపి పృథ్వీ గీతం పాడుతూ ఎన్ని రోజులు గడిస్తే అన్ని రెక్కలు మొలిచినట్లు ! కాల మహాపద్మం జీవితం. ఎన్ని రేకులతోనో వికసిస్తుంది, ఆకర్షిస్తుంది.
II. మానవీయం వాయు సంగీతానికి సమార్ధమై లయించి నదించే గ్రీష్మవేళ హిమశైలం వలె సూర్యకిరణ తీవ్రతకు వాడిపోక
II . 1. అశాంతిసీమలు చాంద్రీ మృదూహలకు మెత్తబడే నీల గగనం వలె
తాకితే కాల్చని అమృత కాంతి స్పర్శలో ఆనందాన్నిచ్చే అంతా రూప సౌందర్య శిఖ వలె నిశ్చల సమ రేఖా స్థితిలో నున్న నా మనశ్శిఖరంపై ఎక్కడిదీ అశాంతి ? జీవితమే కళాకృతిగా మారడానికి నాంది ? దీర్ఘ భుజగం వలె బుసకొడుతూ నటత్తరంగిణి వలె చెంగలిస్తూ మలకలుగా మెలికలుగా తిరిగిపోయేను కాలం ! మండే అహంకారంలో మసలే చీకటి గుంపులో విసరే చురుకు గాలిలో అశాంతి ! ఆకారం మలచుకొంటుంది జలధిలో ఎగసే అలలవలె మనస్సులో తీవ్రమైన ఊహలు ఆనంద లోకాధిపతులపై హత్యావినాశన యత్నం! కాలచక్రంలో ఆకుల వలె ఋతు పరివర్తనతో రూపురేఖలు మారే ప్రకృతి గతిలో రాత్రి కళ్ళలో గగన మస్తిష్కంలో మనో రోదసిలో అలజడీ అశాంతి. హోరున విరుచుక పడే వార్షిక ఝంఝ వలె మనస్సులో స్త్రీ స్ఫులింగమై అశాంతిని మేల్కొల్పేను. సంధ్యా సమస్యలు ఎదురై చుక్కల ముఖాలే ప్రశ్నలై మనసుకు వెలుగు కరువై సంప్రదాయ రేఖ చెదురుతుంది చీకట్లను చీల్చే కాంతి విప్లవం రెక్క విప్పుతుంది సమభావనకై అలజడి ఘర్షణలో అశాంతి ! మానవతా కేంద్రం నుండి సాగే ప్రగతి శక్తుల చలనంతో విభేదాల గోడలు కూలేప్పుడు హద్దులు చెరగేప్పుడు దైనందిన సమస్యలకు స్వస్తి చెప్పి ఎంతకూ తీరని సందేహాలతో ఆకాశం అవతలి లోకంపై ప్రశ్న లెరగని సమాధానాలతో విశ్రాంతి కలవడిన గుండెల్లో అశాంతి ! హాహాకార హసంతులు ! అశాంతిలో వీర కృత్య చిహ్నాలు చరిత్రలో ప్రగతి సోపానాలు ! పూర్వం వెలసిన అశాంతి స్థితులు రాజుల కీర్తి గౌరవాలకు కొలతలు ! తెరలు తెరలుగా జారిన భిన్న భిన్న వర్ణోహలు పొరలు పొరలుగా ఒదిగిన వివిధ వర్గ శ్రేణులు. మానసిక వ్యాపారంలో క్రియా కలాపం వదలి మనిషి నిజంగా జీవితంలో శాంతిని కోరేనా? సమాజంలో శాంతికై అశాంతి ; అశాంతి నుండి శాంతి అశాంతి ఎరగని స్థలం ఉందా ? కాలం ఉందా ?
హృదిలో సూక్ష్మసూక్ష్మంగా తీవ్ర తీవ్రంగా చెలరేగే మాయని అశాంతి చిహ్నాలు ! మనోజీవి ప్రతిభా రూపాలు రాతి యుగం నుండి అణు యుగం వరకూ నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం సామ్యవాదం వరకూ చరిత్ర గతులన్నీ అశాంతిలో రూపొందినవే !
II . 2. ఆగని భ్రమణంలో ఊహల ఉన్మేషంతో రూపొందేను ప్రపంచం కదలికతో గమనం, అభిరుచితో జీవితం ధూళి క్రమ్మి రంగులతో భాసించే స్థితుల వంటి మనిషిలో సాధనతో గమ్యం చేరే సంకల్పం ద్వావా పృథివి మేల్కొన్న సమయం నుండి సమాజంలో ఏ ఒక్కరి నిష్క్రమణంతో ఆగదు పరివర్తనం అనుభవాలు స్మృతిదీపాలై నిలుస్తాయి దారిలో చలన శక్తుల గమనంతో జీవిత నిర్వచనం మారుతుంది.- మృత్యువు కివతల నున్న సజీవ లోకంలో అడుగు తీసివేసే లోపల ఒకదాని నొకటి మించీ, మించని వేగంతో సాగేను భిన్న భిన్న మూలాలతో అసంఖ్యాక ముఖాలు ఆడబడుతూన్న చదరంగాలూ, వైకుంఠపాళీలూ. ప్రొద్దు పొడవగానే అశాంతి ముఖాలతో రాత్రి కురిసిన చీకట్లకు తడిసీ చివికీ బిగిసిన సమస్యల సంకెళ్ళతో కదలే సంకెళ్ళ గలగలతో సంక్షుభిత విభుగ్న పరికుంచిత రేఖలతో వేదనా విదీర్ణ పరిపాండుర ముఖాలతో కోర్కెల కుబుసం ధరించి కదలేరు మనుషులు. గుప్పిళ్ళు గుప్పిళ్ళుగా విసరిన చీకట్ల వెనుక నుండి నింగి బూది కుప్ప నుండి జలజల రాలే తూర్పార పట్టిన నిప్పుకణాల వలె మనుషులు జేవురించి మసిబట్టి పాలిపోయి మాడిపోయి నిరంతరం భ్రమించే అశాంతి సమాజ గోళాలు. ఎదురెదురుగా జంటగా మూకలో ప్రతి చోటా ఎప్పుడు చూచినా ఒంటరిగా సామాజికంగా నిన్నటి గురించి నిరాశ నేటి గురించి అతృప్తి
రేపటి గురించి మాత్రం అందమైన కలల బొమ్మలు. మనిషిలో కన్పించకుండా తిరిగే అసంఖ్యాక రూపాలు ఒక నీలి తెర తొలగిపోయి అవతరించే ఉదయం వలె ఒక ఘటన ముగిసిపోయి బయట పడేను నిజ రూపం పెదవులపై చిరునవ్వులు ! నవ్వుల వెనుక తిట్లు ఏడ్పులు ఆక్రోశాలు అరపులు మంచు చలి ఎండ వేడి గాలి తెరలపై తెలుపు నలుపు ఎరుపు రంగు విరుపులు! ప్రకృతి పరిణామంతో అవధి ఎరుగని కాలంతో ! ఆనందమో విషాదమో సంయోగమో వియోగమో ! మానవీయం.
II. 3. జాతకంలో మార్పుతో రాత్రి పన్నెండు గంటలు ! రోజు జాతకంలో మార్పు ఈ రోజు నిన్న అయి, 'రేపు' ఈ రోజు అవుతుంది ఋతువు లెన్ని వచ్చి పోయినా జీవధార ఉంటేనే జీవితం. రోజు లెన్ని మలుపులు తిరిగినా లక్ష్యం ఉంటేనే ప్రయాణం. పల్చని మంచు వలె తెర వలె నీడ వలె ఆలోచన దీని వెనుక అంటుకొనీ రమణీయాకృతి స్త్రీ కాలు జారినపుడు గాలి నవ్విన సవ్వడి కాలు సాగినపుడు గాలి మెచ్చిన ధ్వనీ. అడవిలో పొలంలో పల్లెలో పట్టణంలో శ్రమ వర్తనంతో సాగేను జీవిత చరణం, చేతి కందని ఎత్తులో గాలికి మ్రోగే ధ్వజస్తంభ ఘంటికల వలె ఆశలు అనాది వాసనల్నీ జన్మల బంధాల్ని పరికల్పన చేస్తూ ప్రేక్షకుల మనోవృత్తులతో సంబంధం లేని పాత్రలు ! అణువు నుండి బ్రహ్మాండం వరకూ అలముకొన్న అశాంతి ఆవరణంలో, మాటి మాటికీ శాంతి రేఖలు గీసుకొని సమాజం బ్రతికేను కాలం చేతులు చాచి రేఖల్ని చెరిపే యత్నం చేసేను పోషణతో ప్రారంభించిన జీవన ప్రస్థానం తిండితో గుడ్డతో ఎన్నటికీ ఆగిపోదు
పదవికీ కీర్తికీ ఎగబ్రాకుతుంది, సహజంగా తృప్తి ఎరగని విధంలోనే ఉంది జీవన పణం రణం. అలభ్యమనుకున్నా సరే ఆశా జీవులు జీవితాన్ని పిండీ విసిగీ వేసారీ చివరకు జీవితానంతర భావనలో ఆశ్రయం పొందేరు పర లోకాన్ని సృజించుకొనీ ఆనందం పొందేరు. ఋతువు శోభ కానీ హృదయ దీప్తి కానీ ఆశ్చర్యం ఆనందం చైతన్యం సౌందర్యంలో.- ఏ సూక్ష్మ తీవ్ర దశల్నీ అనుభవం పొందలేని మనో నైశిత్యం తెలీని లోహ ఖండాలు కొందరు ఆకలి గొన్న ఆశతో కసి బలిసిన కళ్ళతో ఆరని హసంతిక వలె కణకణలాడే గుండెతో ఎండ కెండీ వానకు తడిసీ చలికి బిగిసీ రాటు దేలిన దేహాలతో ద్రిమ్మరే వనచరులూ. రాత్రివేళ ఏ గుడారంలోనో చెట్టుక్రిందనో నిద్రా సుఖ కామన తీర్చుకొని బయటపడీ చౌర్యం సాగించే క్రౌర్యం కనబరచే నిశ్శబ్దం రూపుకట్టి నివ్వెరపోయే స్థితిలో నీడల వలె చుట్టుకొనీ తృప్తిగా నిదురపోయే దిశి బొమ్మలు ! వెలుగు సహించని చీకటి మతులూ. దైవబుద్ధి చేతులెత్తి శూన్యంలోకి పరుగెత్తే రాత్రి తప్ప దివ మెరుగని పుట్టంధులు ముందూ వెనక ప్రక్కల జఘన్య స్థితిలో బ్రతుకులో వెలుగు పోచ ఎరుగని భాగ్యహీనులూ ! ఎన్ని మారులు యుద్ధం వచ్చి పోయినా ఎంత కాలం శాంతి ముద్ర నెలకొన్నా పాలన తలక్రిందై పాలకులు మారినా మరు భూముల్లో చెక్కు చెదరని దిబ్బలవలె ఎక్కడబడితే అక్కడ సంస్కార హీనంగా దాదాపు అంతా మగత నిద్ర వరించిన వారే ఆకర్షణ కోల్పోని సంఘర్షణ వీడని విప్లవ మనస్తత్వంతో అగ్ని మూర్తులూ మార్పుకై రాజకీయ సామాజిక తీవ్ర శక్తులూ సమాంతరంగా దివ్య దశలు కోరే శాంత వర్తులూ
నవ్వుతూ ప్రేలుతూ కోపిస్తూ నటిస్తూ వివిధ రీతుల్లో రంగుల్లో భంగిమల్లో మంచూ మబ్బూ చీకటి గాలీ నిప్పూ వెలుగూ తెరల పొరల అంచుల్లో పరిక్రమించే ముఖ పంక్తులూ. సూదుల వంటి చూపులతో వేగంగా పెదవి బిగించి నడిచే యువకులూ ఎరుపెక్కిన చెక్కిళ్ళతో ఓపిగ్గా బరువు రెప్పలెత్తి లోకాన్ని కనికరించే యువతులూ ఆర్ద్ర పరిష్వంగంతో అమృతం వర్షించే కోష్ణ పరిష్వంగంతో అంగారం పండించే రాక్షసుని దేవతగా, దేవతను రాక్షసునిగా వెలుగూ చీకటి శిల్పంతో తీర్చే శృంగార కళికలు ! హృదయ గగనం నుండి జారే ప్రేమ బిందువుల్ని ఎప్పటి కపుడింకింపజేసే ఇసుక దిబ్బలు కొందరు అందం మట్టిలో కలిసి ఆనందం ఆకాశంలో మాయమై నిలకడ లేక మనస్సు దూదికన్న తేలికై బ్రతుకు అగ్ని కీల కాహుతియై గాలిలో లయించి ప్రాణచ్చట కాల గర్భంలో ఆశ్రయం పొందే అభిమాన వతులూ.
II . 4. పోటటీపడుతూ తమలో ఎంత లోతుగా ఆసురాంశ నిద్రాణమై ఉందీ తమ పట్ల ఎంతగా భవిష్యత్తు దాస భావం వహించిందీ తెలీని అమాయకులు, తెలిసిన విజ్ఞులు, ప్రతారించే లౌకికులూ ! అనుక్షణం ఏదో పోటీలో నిలబడక తప్పదు. అగ్ని పర్వత శిఖరంపై బ్రద్దలైనట్లుంది పగలు ఎక్కడ చూచినా తీవ్ర గమన వైఖరులే తమపై మమకారం లోకంపై తృష్ణ ప్రక్కవారితో మాత్రం అజ్ఞానంలో పోటీ. సాయం సమయం పాములు విడిచిన పుట్ట వలె ఉంది. కోర్కెలు ఫలించని ఇసుక దిబ్బవలె ఉంది సంధ్యానల కీలలకు పొగబారిన దిశలతో రాత్రి ! జీవన రణంలో అలసిన విరామ స్థితి వలె ఉంది. జాతులు జాతులుగా మాలలు మాలలుగా
ఇతస్తత ఉడ్డీన విహంగమ సమాకీర్ణమై- చివరలు నీలీకృతమై తోచే లోచన పథంతో విశ్రాంతి కోరుతుంది యాంత్రిక జన సమూహం. ప్రాణమున్నంత వరకూ త్రైగుణ్య విపర్యయంతో అసంపూర్తి కామనలతో రగిలే శ్మశానంతో ఆశా పూర్తికి చిట్టచివరి దశ స్వర్లోకం ఆపై పరమ పదం దైవం పాదాల ముందు అవనత మస్తక సోపాన దృశ్యం దైవ పదం నుండి బ్రహ్మపదం ఎగసే కోరిక ఉన్నా ! తమలోని ఆత్మరూపం తెలీని జీవ సమూహమూ. రుద్రభూమిలో శివ తీర్థం రణ భూమినుండి స్వర్లోకం మృత్యుముఖంలో సృష్టీ, నిద్రాలోకంలో స్వప్నఖండం ఆశావిస్తృతిలో తృప్తి రేఖలతో ఆనంద పరీతాత్ములూ గాలి వంటి అనుభవంలో తేలి ఎప్పుడెక్కడో కలిసి వర్షించే భూమిని పులకింపజేసి ఆనందంతో మాయమయ్యే చలచ్చంచల మేఘాల వలె ఎక్కడెక్కడి నుండో స్త్రీ పురుషులు విషాదంలో వైరాగ్యంలో జిజ్ఞాసతో భయంలో సందేహంలో అన్వేషణతో విజ్ఞానంలో వేదాంతంలో అనుభవానందంతో ధనం కీర్తి అధికారం జోడింపబడి జీవితంలో, మానవమాత్రులూ. అందం మోహం ఆనందం స్వర్గంకై ఆరాటం పోరాటం ఆటు పోట్లతో విజృంభించే విస్తరించే “అహం” భావంతో సౌభాగ్యంకై శాంతికై మానవుని తాపత్రయం సంధ్యారుణ రక్తిమతో ఆక్రందన సంఘర్షణ జీవితం వెనుక నున్న వాస్తవ శక్తుల్ని తలపించేను.
II . 5. ప్రయోగపథం మానవ మేథా శక్తితో ఆహార వ్యవహార సమస్య తీరి అరచేతిలో నిల్చిన ఇచ్ఛా మరణ శక్తితో భూమిపై యంత్రం వలె వ్యోమంలో విమానం వలె సముద్రంలో నౌకవలె విశ్వం బింబించే మస్తిష్కంతో తెలి మబ్బు కన్న తేలికైన సంకోచ వ్యాకోచ దేహాలతో సహజమైన సంప్రేరణ జ్ఞానశక్తి లేకనే అనుభూతి ఛాయ లేకుండా ఆగామి యుగంలో
అవసరాలకు మించని సంఖ్యలో అవతరించనున్నవారు విభిన్న రీతుల్లో ప్రమాణాల్లో వినిర్మిత మానవులు ! రసాయనిక జీవితంతో కొత్తయుగం తలపించే సోదరీ సోదరులు. చీకట్లను చీల్చి ఛిన్నం చేసి రూపు మాపీ ఈ దిశ నుండి ఆ దిశ కొలిచే చూపులలో జాతి వర్ణ వర్గ భేదాల్లేని శ్రేణులతో సహజోన్మీలన మతి ఎరుగని విజ్ఞాన మతులతో అశాంతి నణచీ సమతా సౌభాగ్యం పలికే వినూత్న వైజ్ఞానిక యుగ మహాయంత్ర పథం. (ఆల్డస్ హగ్జలీ వ్రాసిన "ఎ బ్రేవ్ న్యూ వరల్్డ" ఆధారంగా)
II . 6. మనో భూమికలు సూర్యుని పాదముద్ర లెంత వరకు సాగినవో ఎక్కడా ఎవరి నిజ రూపమూ కన్పించలేదు. ప్రక్కనున్న చెట్లకు నా భాష తెలీదు వాటిలో ఒకరి భాష వేరొకరి కర్థం కాదని తరువాత తెలిసింది దూరాననున్న కొండలకు నా రూపం కన్పించదు వాటిలో ఒకరిని వేరొకరు చూడలేరని తరువాత తెలిసింది. వెనుక నడిచే నీడలకు నా రూపం తెలీదు వాటికి చెవులు నోళ్ళు కళ్ళు లేవనుకున్నా కాని జీవం కూడా లేదన్న విషయం తరువాత తెలిసింది. వెలుగు గీత దాటలేని చీకటి బంతులవలె ఎక్కడబడితే అక్కడ దాగి దాగి తిరిగే- జంతువులు తప్ప ! నా కంటికెక్కడా పరిపూర్ణ జ్ఞానస్పూర్తి గల బింబాలగపడలేదు. దూరం బహు దూరం ప్రయాణించే నా పాదాల క్రింద అణగిన ధూళి రేణువులు మతి వదలని తృష్ణ తీరని కామనలూ కంటి ముందు ఎద విప్పి ఆహ్వానించే సమాజం. మింటి నుండి మంటికి జారిన మంచు తెర చాటునెవరో
నే సాగినపుడు ముందుకు సాగి నే నిలిచినప్పుడక్కడే ఆగి మనోదఘ్నంగా ఆలోచనా మూర్తి స్ఫూర్తితో కనుచూపు మేరలో నిలిచేరు కేసరచ్ఛవిని తలపించేరు. నా కాలి సవ్వడి నాకే భయంగా నా ఊహ పడగ విప్పిన పాములా నగ్నంగా వాంఛా సహితంగా నా ఆకృతి నాకే రెండు రంగులుగా ముఖం విప్పి చూసేసరికి వెనక మలిసంజ వేళల్లో జడలు రేగిన చీకటి రోదసి నావరించిన మౌన భావ సంస్థితి. దగ్గర దగ్గరగా దూర దూరం నుండి నడకలతో పరుగులతో గాలి సవ్వడి అది నవ్వు తెర ఏడుపు రొద ఏమైనా కావచ్చు. ఈ ఎడారులూ అడవులూ పొలాలూ మైదానాలూ ఆవరించిన మంచు తెర చాటు నుండి వెలుగై కన్పించే నో శాంతమూర్తి! ఎవరా విజ్ఞాన రూపం భగవంతుడేనేమో మానవ రూపంలో లోపంతో సమాజ తలంపై వివిధ శక్తుల మధ్య నా నీడను నిలిపే వెలుగు రేఖ కావచ్చు. లౌకిక జగదనుభోగంలో ఆనందం విషాదం పేరిట రసోద్విగ్న మతికి గోచరించే అశాంతి జీవన దృశ్యాలు కాల పరిమితి లేకుండా అద్దం వంటి బుద్ధిలో హృదనుభూతి కాంతితో బింబించే మనోభూమికలు !
II . 7. వాస్తవ చరణాలపై ఈ పురోగమనం ఎంతవరకు ? దిక్కుల అంచుల వరకు ! ఎంతకాలం సాగుతుంది ప్రయాణం ? మరో ఉదయమయ్యే దాకా ! ఎక్కడికీ సాంధ్యవేళ ? మరో మనో లోకానికీ, మరో సమాజ లక్ష్యానికీ. ఆ శాంతిని పట్టుకోడానికీ ఈ రూపం మారిపోడానికీ, సమాజ తత్త్వం ఇది అని, ఎవరు ప్రవచించింది నిజం ఎందరికో ఏదో తెలిసినట్లుంటుంది ఎవరికీ సంపూర్ణంగా తెలీదు ఎన్ని యుగాలు గతించినా ఇక్కడే ఉన్నాం ఉన్న చోటనే మానసిక వైక్లబ్యంతో రణమారణ భయోన్మనీ దశల్లో
ఎన్ని తరాలు గతించినా ఇంకా అక్కడే ఉన్నాం పురమనోరూపాల్లో. మానసిక వ్యాపారంతో తెలివి మీరిన ముఖాలతో ఎంత దూరం ప్రాకినా, ఎంత కాలం ఆలోచించినా అంతరిక్షం హస్తగతమైనా గ్రహాలు స్నేహితులైనా బ్రతుకు భోగ భూమి ఐనా మేర లేని వాంఛా పిపాసతో దేని కోసమో ఆవేదన ! సాధనకై యత్నం మానవసహజం. చీకటి ఓటమి నంగీకరించలేదు, వెలుగు విజయం పొందలేదు ఆకాశంవలె విస్తరించిన అజ్ఞానం తుది తెలీకుండా ఉంది దివానిశలు ఋతువులు వత్సరాలు ఒకదాని వెంట మరొకటి ఆగమనం నిష్క్రమణం పునరావృతం భౌతిక తలంపై స్వర్గమూ నరకమూ మతమూ రాజకీయమూ పరాకాష్ఠ నందుకొన్న లౌకిక స్థితి రూపాలూ తిరిగి తిరిగి మరో రూపంలో ప్రత్యక్షం. ఒక ప్రాణి సన్నని చూపులో ఒదిగి ఒక జీవి బరువు నిట్టూర్పులో తూగి సామాన్యుల కంటికి మట్టి ముద్దవలె వైజ్ఞానిక దృష్టికి భ్రమించే గోళం వలె వేదాంతికి భ్రమోదిత స్వప్నం వలె- స్పష్టాస్పష్టంగా సంపూర్ణాసంపూర్ణంగా భాసించే సుఖ దుఃఖాత్మక ప్రపంచం బహు విచిత్ర మనఃప్రభావ సంకలనం వివిధ భౌతిక శక్తి రూప సమీకరణం ప్రపంచ నిర్మాణ పరంపరకు మూల కారణం? నీరు కాదు మట్టి? కాదు! చైతన్యం అవునేమో భౌతికం కూడా! ఇంకా ఇంకా ఏమైనా కావచ్చు మరో నాటికి తల ఎత్తుతుంది మరో సందేహం కొన్నాళ్ళకు తోచే పరిష్కార సిద్ధాంతాల్లో ఎప్పటికప్పుడు వ్యత్యస్తమై పోయేను విలువలు గగన పదవి కదలే మబ్బుల వలె పవన లహరి వినిపించే ధ్వనుల వలె అంతటా సరిస్తూ తరగని వెలుగు వలె చేతికందీ అందని నీడల వలె ఆనందం విషాదం కలిసిన రూపాల్లో ఆలోచనలు ఎక్కడ మొదలై ఎక్కడ అంతమొందేదీ తెలీదు
విజృంభించే విరుద్ధ శక్తుల ఘర్షణలో పతనమై మళ్ళీ నిర్మాణోన్ముఖమై వికసిస్తుంది సమాజం అనాది నుండి సృష్టి రహస్య గవేషణలో అంకితమై పరంపరను రక్షించే వేదనా మహితాత్ములూ ఈనాటి వరకూ మారణ బుద్ధిలో తీవ్రతతో క్షమారహిత నైశిత్యంతో అలజడిలో సమాజం మతం రాజకీయం ముసుగులో దాగేను నిజరూపం! ఎన్ని అవతారా లెత్తబడినా ఎన్ని మతాలు ప్రబోధితమైనా ఎంతగా సాహిత్యం సృజింపబడినా ఎంతగా విజ్ఞానం ప్రపంచితమైనా ఎన్నిమారులు కాలం స్వర్ణ కిరీటం ధరించినా ప్రతియుగంలో అశాంతి నుండి అవినీతి నుండి దూరమైన సమయ మెంతని? ప్రతి వస్తువు నిర్మితిలో సృష్టి రహస్యం శోధించి ప్రతి చిన్ని కదలికలో కార్య కారణ మూహించి ఆకాశం పొర లొలిచే నిశిత హేతు దృష్టితో పైన ఆ పైన లోకాలు భావించి శక్తుల్ని దర్శించి మనిషిలో పక్షిలో పాములో జంతువులో పిపీలికలో ప్రాణశక్తి గుర్తించి జనూ రహస్యం శోధిస్తూ రోదసీయానంతో గ్రహతలం పై చరణంతో పురో గమన ధ్యేయం వదలని ఆశాజీవి మానవుడు.
II. 8. శాంతి చరణంకై యోచిస్తున్న శిశువు ఊహల వలె చుక్కలు చుట్టూ తడుము లాడే గ్రుడ్డివాని చేతుల వలె గాలులు అక్కడక్కడా బ్రతుకులు నిర్వేదంతో వెలుగులు! ఒకరి ఊహ వేరొకరికి చెప్పలేని మూగజీవులు ప్రకృతిలో మృదురూపం ధరించే ప్రళయం వలె గ్రీష్మంలో ఇంకే సరసి వలె, రవి అస్తమించే దిశ వలె మనసులో భయదాకృతి దాల్చే ప్రేమ వలె హృదిలో రాగం మాసీ దారి దొరకని అపరిచిత మహానగరం ఈ శతాబ్ది యంత్రీకృత జీవిత రూపం అదృశ్యమైన ఆశను ఊహలో మెరపు జ్ఞాపకం చేస్తుంది తొలి ప్రొద్దు ఏ ముఖంలో ఎప్పుడు పొడిచేదీ తెలీదు.
రాత్రివేళ భయ నిద్రా సమాధి వలె సంగీతం విరమించిన సముద్రం వలె ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తి ఆగిన శరీరం వలె ఒక్కొక్క సమయం జడీభూతమైనట్లుంటుంది. కొలిమి తిత్తుల వలె మండిస్తూ ఊపిరితిత్తులు ఏనాడో బిగిసి గడ్డకట్టిన ఆలోచనలతో ఎక్కడ వేస్తే అక్కడే మట్టి ముద్ద స్వభావంతో కబంధుని చేతుల్లో కీలు బొమ్మల వలె మనుషులు ఇంద్రియ తర్పణీయ భౌతిక సౌభాగ్యంతో గ్రహాంతర విజ్ఞానంతో హేతు పథ పురోగమనంతో, వ్యయమెరుగని వెలుగు వలె విజ్ఞేయ ప్రపంచం- అణు రజో రూపంలో రాలే రూబుల్ డాలర్ విలువలూ సైనిక బల సంపదతో ఆకలి తీర్ప యత్నించే తెలువులూ అంతరిక్ష గోళాల్లో ఆవాసానికై సంరంభం భూమిపై మనిషి తిండికీ బట్టకూ అఘోరించే అభాగ్యం భూగోళం చుట్టి రాగల అణుమారణ నవాస్త్రాలు వాటి వశంలో తిరిగే యుద్ధోన్మాదుల చిత్తాలు యాంత్రిక సౌభాగ్య వశమై ఆత్మ సౌందర్యం మరచేరు సంఘ శక్తి పీడన క్రింద వ్యక్తి వికాసం తరిగేను రాబోయే యుద్ధ జ్వర భయంతో వణకుతుంది వాతావరణం మృత్యువు స్ఫురించే సరికి కంఠం శాంతి పాఠంతో శోషిస్తుంది.
II. 9. మృత్యువెరుగని ఉదయం దగా పడిన జాతి తెరపిడి పడి ఎత్తిన నిప్పు కళ్ళు రాత్రి చీకట్లో తిరిగే పెద్ద పులి కళ్ళ వలె ఉన్నాయి. ఇసుక దిబ్బలపై ఎండుటాకులపై మొండి గోడలపై పాడు బడిన గుడులపై ఆగి ఆగి కురిసే సన్నని వర్షపు చినుకుల వలె చీకటిలో మిణుగురుల వలె స్మశానంలో గడ్డిపోచల వలె పేద వాళ్ళ బ్రతుకుల్లో చిరు కోర్కెలు తలపై వెలిగే విద్యుద్దీప కిరీటంతో వీడని ప్రాణ మిత్రం వలె ఇనుప స్తంభం ఎదురుగా కాలు విరిగిన కుర్చీ వలె సమయం
పగటి కలలు గనే కళ్ళతో ముఖ పంక్తులు కలలు కనటం మొదలు పెట్టి ఇంకా నిద్ర పోని జనం నేడు తలలు పోగొట్టుకునీ జనం రేపు నిజ స్థితికి వస్తుంది నిప్పంటుకుని మండే జ్వాలలతో ప్రయాణంలో సముద్ర గర్భంలో మునగనున్న నౌక వలె ముఖం జేవురించిన రాత్రి మృత్యువుచే ఆకర్షింపబడుతుంది నలు దిశల్లో అంతలో విప్లవాత్మకమైన మార్పులు నిద్రించి ఎన్ని వేల ఏండ్లో అయినట్లున్న అవని ఒక్కొక్క పొరను విదల్చుకొని మేల్కొంటున్నట్లుంది. పద పదంలో కాంతి చిమ్మే ఉదయ నేత్ర గగన మెదురుగా ఆగి ఆగి పరుగిడే చీకటి పిల్లల గుంపులు ప్రక్కగా చీకటి కొండపై నుండి జారే సూర్యుని వెలుగు లహరులు నడిచే పథంలో శిలా మూర్తుల్ని స్పృశిస్తూ పోయేను ఒకటి తిన్నగా లేని పిచ్చి వాని ఊహల వలె అల్లి బిల్లిగా అల్లుకొని చీలి పోయేను చీకటి బాటలు బహు దూరం నుండీ దగ్గర దగ్గరలోనూ విన వచ్చే విభిన్న కంఠ ధ్వనులు ఇంకా వదలని నిద్రలో తూగుతూ కలల గనే చీకటి మనుషులూ తెల్ల దొరల వలె కాపలా కాస్తున్నట్లు నటించే చుట్టూ ఇంకా ఆరని దీప స్తంభాలూ ఊహా లోకానికి వాస్తవ జగత్తుకూ సిద్ధాంతాలకూ అనుభవ స్వరూపానికీ మనిషీ మనిషికీ వస్తువుకూ వస్తువుకూ మధ్య విడదీసే చీకట్లు కలిపే వెలుగులూ ఆరే దీపాల పొగలు క్రమ్మి మూతపడిన సమాజం కళ్ళు ఇంకా తెర పడి పడలేదు కళ్ళు ఉన్నా అంధుల వలె ప్రాణం ఉన్నా శిలల వలె ఈ సమయం పడి ఉండి తీరవలసిందే. మనిషిపై మనిషి కన్నా జంతువుపైనే ఎక్కువ విశ్వాసం ఆలోచనల కవధుల్లేవు ఉదయం మృత్యువు నెరగదు. II . 10. ఈ వెలుగు అందరిదీ ఒక యుగం పోయి మరొకటి వస్తున్న దెంత త్వరగా ఒక మనో రూపం మారి మరొకటవతరించాలి సంపూర్ణంగా ఆరంభం నుండి నేటి వరకూ సమాజ భౌతిక శక్తుల
ఆకర్షణ సంసర్గం సంఘర్షణ ఏనాటికైననా ఒకే తీరు గ్రహ సమూహ గమనంతో ఋతు చక్ర భ్రమణంతో చేతనా చేతనం పై సమాజ కాల ప్రభావం,- ఒక తరం నుండి మరో తరానికి అందింపబడే మానవ సంస్కారాన్ని తీర్చే ఆత్మ దీప్తి ఒకటే. గగన కాసారంలో తలెత్తి సహస్ర కరాలతో ఈది వచ్చేను సూర్యుడు ఒడ్డున మేల్కొన్న ప్రాణి కోటి ఆశ పతాక ఇంకా మేల్కొననివారికి స్వప్నంలో భవిష్య దృశ్యం ఈ సూర్యుని వెలుగు లెవరి కొరకు? మేల్కోదలచినవారికీ, పరివర్తన కోరేవారికీ. మనశ్చక్షూ రుచిర కాంతి ప్రసరించి నంత మేర అదే భూమి! ఆకాశం! గాలి! నీరు! చీకటి! సూర్యుడు చంద్రుడు! నక్షత్రాలు! వెలుగు అదే! మనిషిలో లౌకిక శక్తుల ప్రతారణం! విజయకాంక్ష! • II 11. పరివర్తన గమ్యంతో పునర్జన్మ ఎత్తాలి మనిషి! తప్పదు సుమీ ఇక దుఃఖంలో మ్రగ్గి పోక కష్టంలో నిల్చి పోక పతనంతో పారి పోక మరణంతో మారి పోక మరో మనో లోకాన్ని కల్పించుకోవా లిప్పుడు పేదవాని కోరికలో కుంచితమై ధనవంతుని ఆశలో విస్తృతమై పరిమితి ఎరగని ఈ సుందర సమాజం జగన్నేతల చేతుల్లో తిరిగే ఆట బంతి ప్రతి యుగాని కొకే ఒక మానవ ప్రతినిధి పూర్వం ప్రతి వ్యక్తీ యుగ విధాత సంపూర్ణంగా నేడు మౌఢ్య విశ్వాస బలంతో చెలరేగే ఒక జాతి మతం అకాండ తాండవంతో పరస్పర దాటీ ఘర్షణలో నలిగి, మారి, కొత్త విధం పొందుతూంది పూర్వ సమాజం. అహంకారౌద్ధత్యం అసహోనోద్రేకం రాపిళ్ళకు తాళలేక పరుగిడి కొండల్లో దాగి చీకటి ముసుగు ధరించీ రక్షో భావమూని మానవత కోల్పేయే మనిషి, శాంతికీ యుద్ధానికీ పురోగమన మార్గానికీ తిరోగమన రీతికీ
సౌఖ్యానికీ దుఃఖానికీ జన్మకూ మృత్యువుకూ అల్పానల్ప కృత్యానికీ ప్రళయం వరకూ సాగే మహా పరిణామానికి కేంద్రం. ప్రతి మానవ మనోంతరాన వ్రేలాడేను బంధు భావ జాతి వర్ణ తోరణాలు! ఆత్మ సంస్కృతీ మహా ప్రవాహ మింక జేసే సికతా శ్రేణుల వలె మధ్య మధ్య కాల ఖండాలు! చారలు చారలుగా అట్టలు కట్టిన నెత్తుటి గీతల బొమ్మల వరుసలు! ఆట వస్తువులు! మనుషులు! పిశాచ హృదయులు విలాసాలకై భద్రపరచుకునే సంపదలు! గాలికి రాలీ ధూళి కలిసే ఆకుల వలె ప్రాణాలను కోల్పోయే అసంఖ్యాక సామాన్యులు కసి మసగిన మృత్యు క్రీడ! రారాజు లానందించే ఒకనాటి పండుగ. అవధుల్లేని సమాజ సముద్రం విడిచే మేఘ నిశ్వాస పరంపరలు సంఘటనలు ఏ భూమి సమార్థమై భోగమయమై ఏ ఖండం బీడు వడి దారిద్య్రమయమై బ్రతుకులు గడిపేదీ ఎవరికెరుక? ఎందుకనీ అంటే, సమాజంలో సర్వస్వమైన మనిషికీ ఇది మనిషిలో శక్తిదీ యుక్తిదీ. 11 . 12. నవతాస్పందనం దిశ నుండి దిశకు హుటాహుటిగా హఠాత్తుగా గుమ్ములుగా ముట్టడించి ఒక్కమారు ఊపేసే ఝంఝా పవనం వలె ఘోరాకృతి వచ్చి పడే యుద్ధాలకు క్షామాలకు భయపడీ కష్టాల్ని ఎదుర్కొనీ పరుగిడి బంధు భావ బంధాలను తెంచుకొనీ సంపూర్ణంగా ప్రేమ పూర్ణ సౌహార్ధం వదులుకొనీ ఏ దేశం గర్భంలోనో ఏ చల్లని నీడల్లోనో ఏ పచ్చని మైదానాల్లోనో ఏ ఆకలి తీరే చోటునో- ఒంటరిగా గుంపుగా తలలు దాచుకొనీ బ్రతుకు బరువు సాగించిన మానవ జాతి సమస్తం క్రమంగా సాగించి పోరాటం తమ తమ ఉనికి కోసం అలవరచుకొంది అధికార వలయాలూ కీర్తి శిఖరాలూ. ఒకనాటి అవసరం ఆనందంతో అలముకొన్న అభిరుచిలో ఊహలో వేషంలో వర్ణంలో వేళ్ళు దన్నుకొనీ మనిషిని బహిర్ముఖుని చేసిందొక భౌతిక విధాతత్త్యం.
దారిద్ర్యం దుఃఖం క్షామం యుద్ధం ప్రవాసంతో పరిణామాలకు గురియై ఎవరికి వారు విడివడీ నేల నాలుగు చెరగులా చెల్లాచెదరై విస్తరించీ తమ తమ సమూహాలు ప్రత్యేక చరిత్రలుగా విశిష్ట సంస్కృతీ నిలయాలకు ప్రతినిధులుగా జీవిత గమనం సాగించిందీ మానవ సమాజం. భిన్న భిన్న జాతులు భాషలు ఆలోచనలతో భిన్న భిన్న వ్యవస్థలూ ప్రవర్తనలూ విశ్వాసాలతో ఒకరి నుండి ఒకరు విడివడజేసింది జాతీయత్వం వీటి నధిగమించి వర్తించింది మానవతా బంధం. వేల యేండ్ల నుండీ ఈనాటి వరకూ సాంఘిక రాజకీయ నైతిక వ్యూహాల్లో మనిషిలో అవే! మూల మనోభావ సంస్థితులు. రాసులు రాసులుగా రాళ ్ళ గుట్టల వలె గుంపులు గుంపులుగా చెట్టూ చేమల వలె ఎండ కెండి వానకు తడిసి చలికి బిగిసి మట్టి దిబ్బల వలె బండల వలె మొద్దుల వలె ఒక్కొక్కచోట జడభరిత సమాజ స్థితీ ఒక్కొక్క చోట విష వలయ సమాజ గతీ కశ్మల వాతావరణంలో కంకాళపు దుర్గంధంలో మానవ రూపాల్లో నిలిచిన బూది కుప్పలు కళాహీన క్షుధాకర్శిత పీడిత బానిస లోకం పురా కీర్తి చక్రం బరువు క్రింద అణగి నలగీ భర్మ హర్మ్యపు గోడల నీడల్లో ఎదుగు మానీ తనకు దొరికిన స్థలంలో తలదాచుకొనీ చీకటి కలవాటు పడీ వెలుక్కు వెరగొందీ చీమల వలె దోమల వలె ప్రాణ దఘ్న భయంతో పుట్టిన క్షణం నుండీ చచ్చే క్షణం వరకూ సంకల్ప నవోదయ మెరుగని త్రపా హీన సేవామతులు ఎక్కడ చూచినా అధిక సంఖ్యలో జీవో విలువలు. గ్రీష్మాతప శుష్కితమై శిశిర శీర్ణ పత్రమై రథ్యావీధి నడవ నేర్చిన మౌనాకృతులు, ఉదయ రథ చక్రం వెలుగు చాలు నంటీ నీడ బొమ్మల వలె కదలిపోయే సంధ్యా జీవులు!
ఆకాశచ్ఛత్రం క్రింద హద్దు మీరని ఆశలతో తమ నీడే ఒక బొంతగా చుట్టుకున్న అర్థనగ్న మూర్తులు నాలుగు చక్రాలూ విరిగిన ధర్మ రథ శకల పంక్తులు నిరంతరం పీడించే చిక్కు వీడని సమస్యలకు ప్రతీకలు ఆ రోజు గడిచిపోతే చాలు నూరేండ్లు నిండినంత ఎతె నా ఊహా గగనంలో ఎండిన ఒరుగుల వలె వ్రేలుతూ కాలిన కట్టె ముక్కలవలె గడిపే జీవచ్ఛవాలూ నరనరాల తేజస్రవంతులు ప్రవహిస్తూ ఆకృతులు నవాగ్ని శిఖలుగా ఉత్తుంగ తరంగ నటదుద్వేగంతో పరుగులు తీసే ఉప్పెన వలె విరుచుక పడే సమీకృత ప్రజావితతి క్రాంతి విక్రాంతి తప్పదు. కూలిన కోటలు ఎగిరిన సింహాసనాలు హతమారిన ఆహంయువులు అణగారిన అగ్ని గుండాలు దారిలో మేల్కొనవు శవాలు! గతి తప్పదు చరిత్ర భ్రమణం తిండికి బట్టకు స్వేచ్ఛకు కరువు లేని సామ్య భావ సామాజిక వ్యవస్థలోనూ మానవ జాతి సమగ్ర వికాసం ఏనాటికైనా భౌతిక శక్తులతో నైతిక రక్తితో మానసిక వికాసంలోనే !- ఒక మహాయుగ పథాన వేగ దీప్తితో సాగే సమాజ రథ చక్ర విఘట్టితమై నలగీ కలగీ గాలి కెగసే అణు ధూళికి వెరగొందక వైజ్ఞానిక భూమికలో నవ సమాజ రూపంతో మానవతా హృదయంతో పురోగమన లక్ష్యంతో నేటి మనిషి ఎత్తక తప్పదు! విశ్వ సంస్కృతీ రూపం పద పదంలో కొత్త శక్తి ధ్వనిస్తూ ఎద ఎదలో కొత్త సృష్టి స్పందిస్తూ స్వేచ్ఛా నవం 2. పడగెత్తిన ఉదయం కావ్యం (1973) మాదిరాజు రంగారావు అంకితం జీవన సహచరి
శ్రీమతి ఇందిరకు
పడగెత్తిన ఉదయం
పడగెత్తిన ఉదయం కావ్యం స్వేచ్ఛా కవిత్వంలో ప్రయోగాత్మక రచన. ఒక వ్యక్తి జీవితంలో ఇరవైనాలుగు గంటల్లో అంటే ఒక రోజులో పొందిన అనుభవ రూపాల
సంకలనం.
పడగెత్తిన సమయం తనలో శక్తిని సమీకరించుకొని సిద్ధమైన కాలాన్ని సూచిస్తూంది.
ఉదయం
శుభ్రతకూ, స్వచ్ఛతకూ, వివేకానికీ, ఆశకూ ప్రతీక. ఉదయంతో సమాజంలో గతిశీలం క్రియాత్మకత ఇనుమడిస్తుంది. ఉదయ రూపాన్ని ఎందరో కవులు సమయ సందర్భాల్నిబట్టి అర్థవంతంగా వర్ణించారు. పడగెత్తడం ఉన్నతినీ, వికాసాన్నీ, జాగరూకతనూ క్రియాశీలాన్ని శక్తి ప్రసారాన్ని భావింపజేస్తుంది. "భూమి నిదుర నుండి మేల్కొంది"తో ఆరంభమైంది. “నిన్నటి రాజరికం నుండి నేటి ప్రజాస్వామ్యం వలె”, ఉదయ రూపం కన్పించింది. దేశంలో స్వాతంత్ర్యానంతర ప్రజాస్వామ్య స్థితి సూచితం. ఈ కావ్యం ఒక వ్యక్తి మానసిక తలంపై ఉదయంతో ఆరంభమైన సామాజిక రూపం మరో ఉదయ సూచనతో ముగుస్తుంది. ఈ రోజు పై మమత “వికసించిన మందారం”గా ఆశాస్ఫూర్తితో ఆరంభమయింది. మునుముందెట్లా ఉన్నా ఆ సమయం మనిషిలో నిర్మాణ వికాస స్పందనం సహజం. నేలపై జీవితంపై దృష్టి ప్రసరిస్తుంది. మధ్య చిత్రాలెన్నో! “యువకుడు ధరించిన సూటువలె ఉదయం రెపరెపలాడుతుంది. మెడలో వ్రేలాడే నెక్ వలె” మబ్బు ముక్క కదలుతుంది. ఎండ పైకెక్కగానే సమయం తిరగబడిన ప్రజవలె” చెలరేగిన సమాజ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అణువణువూ చలనంతో ఆరాటంతో పోరాటంతో జీవితం ఎదురవుతుంది. ఆకాశం అగ్నిచిత్రం వేయబడినట్లుంటుంది. ప్రజాస్వామ్యంలో హక్కులకై కనీసపు అవసరాలకై ఉద్యమించే సమాజం ఎదురవుతుంది. సమయం “దాహంతో పరుగెత్తు” తూన్నట్లనిపిస్తుంది. జీవితచక్రాలు వడివడిగా పరుగెత్తడమూ జరుగుతుంది. దారిన
ఒకచోట
రాజకీయ చలన్మతీ, మరోచోట వీథిమూలన గారడి చతురుడూ కన్పిస్తారు. ఇంకోచోట “తాకట్టు పెట్టిన” అంతరాత్మతో కదలే స్వార్థపరులూ ఎదురవుతారు. కట్ట తెగిన కోష్ణ సముద్రంవలె సమాజం! ఈ విధంగా యథార్థ జీవిత శకలాలు ఒకచోట యోజితమై కళారూపాన్ని పొందాయి. "చూస్తూ చూస్తూండగానే” కాలం గడుస్తుంది. పరివర్తనం కన్పిస్తుంది. జీవితంలో అనేకమైన సాధారణానుభవాల చిత్రణతో తీర్చబడింది. ఒకచోట పగలు “చెలరేగిన గ్రీష్మం వలె” భావితమైంది. ఇది జీవితంలో కఠోర వాస్తవాన్ని సూచిస్తుంది. సాయంకాలమయింది. గాలి స్తంభించింది. ఏదో తెలీని ఆనందం పెల్లుబుకు
తుంది. ఆనంద బింబం కోసం మనస్సు ఎదురుచూస్తుంది. పగలు ఎండలో పరితపించిన శరీరాలకు అలసిపోయిన మనస్సుకూ చంద్రబింబంకై నిరీక్షణం సహజం. సూర్యుని అస్తమయం దాకా వేచిఉండే ఓపిక లేని చీకట్లు దూకనున్నాయి! తలలపై గడ్డిమోపులతో- స్త్రీలూ, చేతిలో ఒడిశెలతో పురుషులూ ఇళ్లకు మరలుతున్నారు. ఇది గ్రామీణ వాతావరణం లోనిది. రవి "మహావృద్ధువలె” నిష్క్రమించాడు. శశి “శిశువు వలె” ఉదయిస్తాడు. “దీనజనుల హృదయ శబ్దాన్ని మోసుకొనీ" గాలి “చెవిలో బాధారహస్యం” ఊదుతుంది. సినిమా జ్ఞాపకం వస్తుంది. ఎదురుగా "ఎయిరోడ్రామ్లో దిగే విమానంలా" నీటుగా ఎదురయ్యే స్త్రీ! ఆమె సాంఘిక సేవా ధురీణ! “చేతిలో చందాపుస్తకం”తో కదులుతూంది. ఒకటేమిటి! ఎన్నో దృశ్యాలు! దేశద్రిమ్మరులూ, దీపస్తంభాలూ, ఎండిన గొంతులతో దీన జనాళి! మబ్బు గురించి ఆలోచన! నీటి చినుగు గురించి ఊహ! వాస్త చిత్రణంలో ప్రతీకల ప్రయోగంతో రచన సాక్షాత్కరిస్తుంది. “రాత్రి వస్తుంది మాయ లాంతరులో", సమయం “బిచ్చగాని వేషంలో ఎదురవుతుంది”. కూచోని “కథలు వినే పిల్లల వలె” పైన చుక్కలు! ఈ సన్నివేశంతో మనస్సులో వెండితెర మెదలుతుంది. అడ్రసు పారేసుకున్న చంద్రుడు “ఎవరి కోసమో ఒంటరిగా వెదకుతూ” మెల్లగా నడుస్తూన్నట్లుంది. గాలి మాత్రం నిద్ర ఎరక్కుండా పహారా కాస్తుంది. రాత్రి ఎప్పటికో మెల్లగా నీలిమబ్బు రెక్క విప్పినట్లుంటుంది. గ్రీష్మతాపం వెనక్కు తగ్గింది. అంతటా ఆహ్లాద రూపం బింబిస్తూంది. చీకటి రైలు పరుగెడుతూంది. మబ్బులో మెరపువలె మనస్సులో ఉదయ స్ఫూర్తి! ఈ ప్రయాణంలో “ ఈరోజు” జారిపోయి, “నిన్న” అవుతూంది. “ముళ్ల కొమ్మల నుండి గులాబివలె” ఉదయం తలెత్తుతుంది. వెలుగు రాకతో చీకటి పాయలుగా చీలింది. నీడలు మాత్రం సాహసిస్తున్నాయి. మరో రోజు నవనవోన్మేషంతో ఎదురవుతుంది. ఉదయం పడగెత్తుతుంది. ఇదో అవిచ్ఛిన్న పరంపర! దేన్ని మరచినా దీన్ని మరవలేం. ఎప్పటికీ జ్ఞాపకముండే ఉషస్సు ముద్రతో మనిషి మేల్కొన్న స్థితి ఎంతో విలువైంది. మానవ
సంస్కృతికి
నిలయమైంది. ఉషస్సు గురించి ఊహ, అనుభవం, కవితాత్మకమైంది. మనిషిలో
సహజమైన
స్వచ్ఛమైన ఆత్మ ప్రకాశానికి సంకేతం. ఆ రోజు ప్రయాణం "రైలు మాని మధ్యలో విమాన మెక్కినట్లుంది” అనడం గడచిపోయిన జీవితాన్నీ, మారిన గమన రూపాన్నీ సూచిస్తోంది. “గతానికి గుడ్ బై” చెప్పడంతో మరో ఉదయంతో ఇంకో రోజులోకి ప్రవేశించే మలుపును గుర్తు చేస్తూంది. గతం ఇపుడు పాతబంధువు, ఉదయం కొత్త బంధువు. దీనితో భవిష్యత్తుకు స్వాగతంతో ఎప్పటికపుడు మార్పును పొందే జీవితం దర్శనమిస్తుంది. ఈ కావ్యాన్ని సమయపటలంపై భౌతిక మానసిక స్థితిగతుల దృశ్యచిత్రంగా భావించవచ్చు. జీవితం “ఫోటోగ్రాఫ్ కాదు", ఏ రోజు అనుభవం దానిదే, ఏ రోజూ ఏ రోజుకూ డిటో అసలే కాదు. ఏ మనిషీ రాతి బొమ్మ కాదు. ప్రతిరోజు కొత్త అనుభవంతో రూపొందే సజీవరూపం, జీవితం.
ఈ కావ్య నిర్మాణరూపం, ఒకరోజులో వివిధ సమయ దశలపై వాస్తవ జీవిత రేఖలతో వెలసింది. ఒక వ్యక్తి జీవితగతికీ సమయగతికీ బింబ ప్రతిబింబ భావంతో ప్రకృతి భూమికపై అనుభవ దృశ్య పరంపర ఐదు కోణాల్లో కల్పితమైంది. 1. మొదటి సమయ దశ మెట్లెక్కి వచ్చే ఉదయంతో యోజితమైంది. ఇది జీవితంలో పైకి వెళ్ళగోరే మనిషి చుట్టూ కన్పించే పరిసరాలు, వాస్తవాలు కలిగింది. 2. రెండో సమయ దశలో పైకెక్కిన పొద్దుతో ఎండ! గ్రీష్మభావనతో చిత్రితమైంది. పగలు జీవితంలో ఎదురయ్యే నిబిడమైన తీవ్రమైన వేగమైన అనుభవ రూపానికి చిహ్నంగా స్వీకృతమైంది. ఆశ-నిరాశ, శాంతి-అశాంతి సంఘర్షణతో సమన్వయంతో జనచలనం ఎదుర్కొనే వడగాలితో వాతావరణం పదునెక్కిన వ్యవహార జగత్తును ప్రతిఫలిస్తూంది. లౌకికమైన క్రియాకలాపాల ఆధిక్యాన్ని సూచిస్తూంది. 3. మూడో సమయదశ సాయంసంధ్య. విషాద రేఖలతో ఎదురైనా ఆశారేఖవలె చంద్రబింబం
విశ్వాసాన్ని
పెంచేదిగా అవతరిస్తుంది. ఇంతవరకూ చెలరేగిన అలజడి ఉపశమిస్తుంది. ఇది విరామ సమయంగా గుర్తింపబడింది. దీని నుండి బయటపడే మనస్సు ఆశావహమైంది. ఈ సందర్భంలో చైతన్య స్రవంతి (స్టీమ్ ఆఫ్ కాన్హెన్నెస్) ధోరణిలో ఆలోచనారూపం ప్రవహించే సంవిధానం అవలంబింపబడింది. ఇందులో ఆంతర సంభాషణం (ఇంటర్నల్ మోనలాగ్) కూడా ఉంది. 4. నాలుగో సమయదశ రాత్రి. చీకట్లోను చుక్కలు స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నం కన్పిస్తుంది. ఇది మనోనేత్రం, సుందరస్వప్నాల్ని కనే సమయం. భయం ఒక ప్రక్క తారాడే మాట నిజమే. భయాన్ని తొలగించే విశ్రాంతిలో నీలిమబ్బు రెక్క విప్పడం, పగటితాపం చల్లబడే స్థితికి నిదర్శనం. సన్నని జల్లు! మెరిసే మెరుపు! ఆర్ద్రమైన అవని! ఇంద్రధనూ రూపంలో లోపల విరిసే ఆశ, నిద్రలో విచిత్రమైన అనుభవగుణం చిత్రితమైంది. ఇంకా మనిషి పూర్తిగా మేల్కొని బయటికి రావడానికి సమయం పడుతుంది. 5. చివరి ఐదో సమయదశలో మంచుతెర కదలుతుంది. ఆశాపతాక రెపరెపలాడుతుంది. మరో ఉదయస్ఫూర్తి మెదలుతుంది. దీని పరిణత రూపమే మరో ఉదయం. ఇది నవనవోన్మేష మైంది. ఏరోజు కారోజు సరికొత్తగా దర్శనమిస్తుంది. ఈ రోజు ఏ రోజుకూ డిటో కాకూడదనే! ప్రతిరోజూ మనిషి కొత్త విశ్వాసంతో కొత్త ఆలోచనతో ప్రయాణానికి సిద్దం కావడం జరుగుతుంది. ఈ పరివర్తనతో మనోభూమికలో ప్రయాణం వేగాన్ని అందుకుంటుంది. ఇది విశిష్టమైన అనుభూతి గుణం కలిగిన పరివర్తనం. "రైలు మాని విమాన
మెక్కినట్లుంద”న్న
మాటలో మార్పుతో కలానుగుణమైన విశేషానుభవం సూచితమైంది. ఈ అయిదు సమయదశల భూమికపై రూపొందిన కావ్యంలో చైతన్యస్రవంతి సంవిధానంతో భావరూపాల ప్రతీకల సహాయంతో రచన ఆవిష్కృతమైంది. పడగెత్తిన ఉదయం సామాజిక స్పందనతో ఒక వ్యక్తి బాహ్యమైన ఆంతరమైన భౌతిక మానసిక స్థితి చిత్రణంతో రూపొందిన కావ్యం.
Detroit, MI - U.S.A. 22-6-2001 - హరితస్వేచ్ఛాకవిత్వం I - మాదిరాజు రంగారావు 11. పడగెత్తిన ఉదయం భూమి నిదుర నుండి మేల్కొంది
I. 1. భూమి మేల్కొంది నిన్నటి రాజరికం నుండి నేటి ప్రజాస్వామ్యం వలె పగటి కలలు మానింది నింగి వాస్తవికతను బింబించే మనస్సు వలె వడి వడిగా కొసరుతున్నాయి గాలులు అధికారం కీర్తికై ప్రజా ప్రతినిధుల వలె. చెట్లు తలలూపుతున్నాయి వారి సేవక గణం వలె గిరులు నిలద్రొక్కుకొన్నాయి పరమ మొండి ఘటాల వలె యువ చైతన్యం వలె నదులు పరుగులు తీస్తున్నాయి. మహా భుజగం వలె సమాజం మలుపు తిరుగుతూంది. ఉదయం మెట్లెక్కి వస్తూంది మనస్సు పదిమందిలో కలిసింది. సమాజ హృదయ చలనం వేగం హెచ్చింది. దిక్కుల్లో ప్రవహిస్తున్నాయి వెలుగు వాకలు మరో రోజు వస్తుంది తప్పదు కానీ ఈ రోజుపై మమత వికసించిన మందారం. రవి దారాలల్లే లోపుగా చీకటి తప్పుకుంటూంది నేర్పుగా నీడ మరువరాని చీకటి బంధువు దోషివలె ఒక మూల ఒదిగింది దీన్ని క్షమించినట్లుంది రవి చూచీ చూడనట్లున్నాడు. కదలే ఊహలవలె చెదురు చెదురుగా మబ్బులు ముక్కలు ముక్కలుగా సూర్యుని హరింపజేస్తున్నాయి నీడ బొమ్మలు డిఫెక్టర్లు, అక్కడక్కడా తలలెత్తాయి. ఆకాశం సచిత్రంగా ఉంది, ముఖం సాలోచనగా ఉంది. నిజానికీ వెలుగు కొత్త కాదు ఈ చీకటి అంతకంటేనూ స్థితి భావనలో ఉంది క్రొత్త, దృష్టి రూపంలో ఉంది భేదం
వెలుగు వెలుగు! విజయశ్రీ శోభిత మూర్తీ! వెలుగు. నవ్వు! మా వాలకం చూచి విరగబడి పగలబడి నవ్వు! నీకు తెలుసు మా వర్ణ రూపం, మాకు తెలుసు నీ గుణ రూపం మింటిలో ఒంటరిగా రవి, మంటిపై ఒంటరిగా నేను అతడు కన్పించకపోతే ప్రపంచానికి చీకటి నేను కన్పించకపోతే సమాజంలో వెలితి తెలి నీలి వంపులుగా విరుగుతూంది ఆకాశం అహంకృతితో బుసకొడుతూంది గ్రీష్మం రాత్రి నుండి ఉదయం కోటికి పడగెత్తినట్లుంది. మృత్యువు చాచిన చేతుల వలె ఎదురుగా ఎండిన కొమ్మలు! నిరీహతో నిశ్శబ్దం విసుగెత్తి ఆవులించినట్లుంది రోదసి పాడు పడిన గుడి ప్రక్కగా నీరు లేని బావి దగ్గరగా నెరియలు పడ్డ భూమిపై ఆకులు రాలిన చెట్ల క్రింది నుండీ కాలాన్ని నిందిస్తూ బయలుదేరా నతాకాశాని కెదురుగా దూరంగా కుక్కలు పోట్లాడుకుంటున్నాయి దగ్గరలో పిల్లి ఎలుకను తరుముతూంది ప్రక్క ఇంట్లో అదే పనిగా ఏడ్చే పిల్లల్ని ఊరడించలేక తల్లి సతమతమౌతూంది స్టీలుచెంచా ఎత్తుకొని ఎగసీ కొరుకుడు పడని కాకి పక్క ఇంటిపై వదిలేసింది, దానికై వెదకుతూ పిల్లలు మూగారు కాలం గడవదూ! ఆ ప్రశ్న దేనికి? ఎవరి కోసమాగుతుంది మనింట్లో పెండ్లికా? ఆజన్మమిత్రం మనస్సు హెచ్చరించింది. అప్పుడే అంటించిన సిగరెట్ వలె ఉంది ఉదయం ఎవరికీ సమయం లేదు కాస్త నిల్చోడానికీ కూర్చోడానికీ నొసటిపై వేలాడే ప్రశ్నలతో ఎదలో దాగిన జవాబులతో ఈ పగటి ఫోకస్లో కాల చిత్రం తిలకించడానికి మిత్రమా! నీకు నాకే ఉంది సమయం చేతినిండా వీరి నెవరినీ ఎరగను కాని పరిచయమున్నట్లే ఉంది కళ్ళలో మెరుపులు చూస్తే వెలుగు నెరిగినంత బాగా. ఇదో చిన్న హోటలు! బీర్వాలో మిఠాయిని కళ్ళప్పగించి చూస్తూ ఒడిలో పడిన బూందీ పూసా ఏరుకొని మరీ నోట్లో వేసుకుంటూ తేనీరు సేవించే రిక్షావాలా మన సింపతీకి తగినవాడు, మనపై ఏ ఎపతీ లేనివాడు.- ఇంతకు ముందా చెట్టు క్రింద మనం కలిసిన చోట
ఈ వేడి నీటికేనేమో అర్థించి బోణీ మీదేనని ప్రార్థించి సవారీ తీసుకొచ్చి 'పడగొట్టి' ఇందులోకి దూరాడు! ఎవరికి వారు పని తొందరలో బయట పడాలనే! అదో రకం ముఖ పరామర్శలూ! పరిచయ స్పర్శలూ తప్ప ఇక్కడ పెద్ద పెద్ద కబుర్లేమీ వినిపించవు ఏమని వర్ణించనీ పరిసరాలు! ఏవో నాలుగైదు కాలెండర్లూ ఒకటి రెండు కాళ్ళు అదుపు తప్పి ఊగే కుర్చీలూ బల్లలూ పట్టుమని పది మంది వస్తే కూర్చునేందుకు చోటు లేదు దూరంగా వీధిలో నడిచే బండ్ల వరస సవ్వడి వింటూ ఆ రాగం లయలో ప్యాన్ లేదని విసుక్కుంటూ కూర్చున్నా “ఆ డైలీ ఇటు దయచేస్తారా?” నా మీద నుండి చేయి చాచి ఆవల నున్న వ్యక్తి నొకరు అడుగుతున్నారు. “అబ్బ ఈ వాసన ఎక్కడి నుండి" అని క్రాస్ చేసాడో వ్యక్తి. “రాజకీయ సరోవరాల్లో చొచ్చిన లులాయాలూ వరాహాలూ చిమ్మే గంధ రేఖలు సుమండీ!" అన్నాడొక హాస్యప్రియుడు అలా ముందుకు వాలిపోయి కబుర్లేవో చెబుతూంటే అలా వాలిపోయి వెనక్కు “సరే” నంటూ నిట్టూర్చాడు మిత్రుడు మా మధ్య నున్నవీ కంటికి కన్పించేవి టీ కప్పులు! మాత్రమేనా మా మధ్య లేవూ! కదలే ఊహలూ కన్పించని ఊహలూ లోయలూ! కదలీ కదలని గాలులూ! మెరసీ మెరవని వెలుగులూ లోయలు! గాలులు! వెలుగులు! ఇంకా మరచిన నీడలూ! పొగలు చిమ్ముతూ వెళ్ళుతున్నాయి బస్లు ఫుట్ బోర్్డ పై నిల్చొని వేలాడుతున్నారు ఫీ ప్యాసెంజర్లు జీవన ఘర్షణలో వెనకబడిన అర్థరహిత వర్గ శకలాలు ఇందాక బస్కోసం చెట్టు క్రింద వేచి ఉన్న పెద్ద మనిషి జ్ఞాపకం లేదూ! నలుగురు పిల్లలతో అదిగో! వీధి మూల పాతిన కుటుంబ నియంత్రణం బోర్డు చూస్తూ చూస్తూ నిల్చొనీ సాగాడు ఎక్కడికి? ఇంటికే! చెట్ల తల వెంటు కల్లోకి పొడవు చేతులు చాచి గాలి మెల్ల మెల్లగా దువ్వుతూంది యువకుడు ధరించిన సూటు వలె ఉదయం రెపరెపలాడుతూంది మెడలో కంఠానికి వేలాడే నెక్ టై వలె అక్కడక్కడా మబ్బు ముక్క మాట బయటికొచ్చే లోపల ఊహ మలపు తిరుగుతూంది ఈ క్షణం కాల ఖండం! అల్పమైందైనా కొంత తృప్తినిస్తూంది
బ్రతుకంటే భాయి చూడు! కడుపు కింత తిండీ ఆపై మేనికింత గుడ్డా ఉనికి కింత గూడూ ఇంతేనా? ఆపైన అంటే వెంటనే ప్రస్తుతానికి సెలవంటావు మనంలేంది ప్రపంచమెక్కడిది? మనస్సులేంది మానవత ఎక్కడిది? పదిచోట్లకు నడిస్తేనే అనుభవ పరంపర పొందేది మృత్యువు మధ్య పెరిగినవాణ్ణి నిజమెలా చెప్పగలను? నిజానికి మనకూ జీవితానికీ చాల దూరం నిజం చెప్పాలంటే మనం సంపూర్ణంగా బ్రతికే ఉన్నామా? నిజం చెబితే నిజంగా లోకం భరిస్తుందా? హర్షిస్తుందా? చూస్తూ చూస్తూ ఉండగనే అపుడే ఎంత ప్రొద్దెక్కింది? మన దేశంలో ప్రణాళికల అంకెల సైజులో ఉషస్సును చూడ్డమే పడదు లేచే సరికే ఉదయమైపోతుంది ఊహ క్రమ్మిన కళ్ళు ఊహ కొదగని ఆకాశాన్ని చూస్తున్నాయి ఎవరి సీమల్లో వారు! ఎవరి ఊహల్లో వారు ప్రతి ఒక్కరి ప్రయాణమూ పరిమితమే ప్రతి ఒక్కరి ఆలోచన చక్ర భ్రమణమే వెలుగు దివ్వె కింద చీకటీ చీకటి గద్దెపై వెలుగూ! అణువణువూ చలనం ఆరాటం పోరాటంతో జీవితం చీకట్లో మట్టిలో మృత్యువులో నుండి పరివర్తన! మరో రూపం.- తిరగ బడిన ప్రజ వలె చెలరేగింది గ్రీష్మం
II. చెలరే గిన గీ ష్మం
వీధిలోకి అడుగేయడంతో కన్పించే మొదటి దృశ్యం కళ్ళు బయర్లు క్రమ్మే ఎండలో ఆకాశం అగ్ని చిత్రం వహించింది. పృథ్వి పచ్చదనం దాచుకుంది గుండె వెచ్చదనంతో నిండింది గుంపులు గుంపులుగా పక్షులు దొరికిన నీడ నాశ్రయిస్తున్నాయి పట్టపగలు రోడ్ ప్రక్కగా చుట్టూ దారాలు దింపి గాలి కెగిరి పోకుండా రాళ్ళతో నిలిపిన గొడుగు క్రింద వంచిన తల ఎత్తకుండా చెమట బిందువులు రాలుతూ చెప్పులు కుట్టే ముసలి మొగం ప్రక్కనే తోడుగా నీటి చుక్కకై మొగం వాచిన చెట్టూ! టాక్సీలు తిరుగుతున్నాయి ఎన్నికల్లో నాయకుల వలె
ఎన్నికల్లో నిల్చిన ప్రజా ప్రతినిధులకు మల్లే బిచ్చగాండ్లు హోటల్ ముందు దారికడ్డంగా నిల్చున్నారు అన్ని వాయిద్యాలూ ఒక్కమారు యథేచ్ఛగా మ్రోగినట్లుంది అపుడపుడు మన శాసన సభలూ ఈ బజారుకేమీ తీసిపోవు ఎండ లక్షాధికారి మెడలో జరీ కండువా వలె ఉంది వ్యాపారి నడుస్తున్నాడు కిళ్లీ నమిలి నడిరోడ్పై ఒలికిస్తూ బొడ్లో దోపిన తాళం చెవుల గుత్తి క్రిందికి వ్రేలాడుతూంది ముందుకు జారిన బొర్రపై ఒక్కటి చరచాలనిపించింది ఎదురుగా వచ్చే ఏమీ తెలీని అమాయక కుర్ర కుంకకు! నదులూ మైదానాలపై నుండి వచ్చే గాలేనా? ಆ దీని సంగీతం చట్టుబండలు కాను, ఎడాపెడా వాయించేస్తూంది వచ్చేది ఒక్క నీలి మేఘాన్ని తరలించుకొని రాకూడదూ! ఆశకు అవసరం ముఖ్యం, ఔచితి లేదు, సమాప్తి అంతకన్నా లేదు ఒక గడప దాటి మరో గడపకూ ఒక చెట్టు నుండి మరో చెట్టుకీ ఉద్యోగం లేని విద్యావంతులవలె వేడి గాలులు తారాడుతున్నాయి ఒక బాధ నుండి మరో బాధలోకి ఒక గాధ నుండి మరో గాధలోకి కాలు గాలిన పిల్లుల వలె ఒక్కొక ముఖం ఒక్కొక సైన్బోర్డలా ఉంది. ఒక్కొక్క మస్తిష్కం ఒక్కో గది ఒక్కొక్క గుండె ఒక్కొక్క బల్్బ ఎవరినీ లెక్కచేయకుండా వీధిలో శబ్దం పైబడి చిరాకు పెడుతూంది వీధిలో గుడ్డ పరచుకొని కూచున్న బికారి దేశానికి ఎవరెంత విసరినా ఒక్కరోజు తృప్తిగా గడవదు. చూపుమేర ఊరుబయట ఎక్కడో ఒకచోట పచ్చదనం ఊరులో దీన్ని మ్రింగే వెచ్చ వెచ్చని కడుపులెన్నో! పేకాటలో తురుఫ్ ముక్కలవలె రాజకీయ చలన్మతులు! ఉపన్యాసాలు గలగలల వలె ఎండుటాకులు రాలుతున్నాయి నిన్న చూచిన ముఖాలే! నిన్న విన్న గొంతుకలే! వచ్చిపోయే వాళ్ళను వీధి కళ్ళప్పగించి చూస్తోంది బారులుగా గుదులుగా జనం చెలరేగిన బాలసముద్రం! మండుతూన్న శ్మశానంలో కోర్కెలు చివురించే దెన్నటికి? ఏడుస్తూన్న సమాధులపై నిశ్శబ్దం మాట్లాడే దెన్నటికి? ఎండ రెపరెపలాడుతోంది ఆకాశం శవం కన్నా భయంకరంగా ఉంది భయ సందేహాలు జ్వలిస్తూ
సమయం దాహంతో పరుగుతీస్తూంది ప్రతిమలు వెలుగు కలలుకంటూ శాపగ్రస్తంగా పడి ఉన్నాయి ప్రమోషన్ గురించి ఆలోచిస్తూ మెట్ల ప్రక్కన నిల్చున్నాయి యంత్రాలు అదేపనిగా శ్రమశక్తిని శబ్దిస్తున్నాయి వీధి మూల గారడివాడు పిడికిలి విప్పి అరచేయి ఊది రూపాయి నోట్లు సృజించి డబ్బులడుక్కుంటున్నాడు. సామాజికులూ పాల్గొనే ఈ నాటకంలో నట ప్రేక్షకుల మధ్య ఏ భేదం లేదు. వ్యాపారంలో అంతరాత్మ ఎప్పుడో తాకట్టుపడింది మనస్సు కీలు బొమ్మ వలె ప్రవర్తిస్తూంది ఇనుప యంత్రం వలె తిరిగే జీవిత చక్రాల్ని చూచి వసంతం అడుగేసేందుకు వెనుకా ముందూ ఆలోచిస్తోంది. గగన ముఖంపై సెగ గడ్డవలె సూర్యుడు తెల్లదనం మాయమైంది పచ్చదనం వాడిపోయింది ఆకాశం నీలి అందం సరస్సులో కన్పిస్తూంది భూమిపై ఎర్రని ఉద్రేకం ఉరకలెత్తుతూంది- అగ్ని పర్వతం బ్రద్దలవనున్న క్షణం వలె వాతావరణం ఎంత తప్పుకున్నా మీద మీదకు కదలి వస్తోంది పోటీ పడుతూ సూటిగా ఈటెల వలె దూసుకపోయే మతిలో రాకెట్లతో, గతిలో బుల్లెట్లతో మనుషులు! నాలుక తడియారి మెలికలు తిరిగీ ఎర్రని ఎండలో ఇసుక దిబ్బపై పడిపోయే మనిషి చెవిలో గాలి బ్రతుకు పాట ఊది పోస్తూంది వేడిగా ఇపుడు నీరూ నీడ గురించి కల తప్ప ఏముంటుంది? గుడి ప్రక్కనే గుడిసెలో మడి లోకాని కావల తడి యారిన గొంతుకతో కథ ఆగిన బ్రతుకులో యౌవనం వేసిన మొగ్గ వడగాలికి కోత వడింది తనయ ముఖం తలపుతో తల్లిగుండె బీటలు వారింది మండి మండి అవని ఎర్రని వెలుగులతో బూది కుప్ప అవనుందా? తిరిగి సృజన మహిమ చూపనుందా? మంటలతో సుళ్ళు గొన్న వాతావరణంతో సమాజం కట్టతెగిన కోష్ణ సముద్రం వలె కదలుతూంది.
III. పరివర్తనా ముఖం
పగలంతా ఎండకొట్టి దుమ్ము చిమ్మి విసిగింది దిక్కుల చూర్లు పట్టుకొని వెలుగులు వ్రేలాడుతున్నాయి వాతావరణం స్తంభించింది, గాలి కావాలి గాలి వేగంగా రావాలి ప్రతి ఒకరూ కోరేది ఇదే జాలరి వల పన్నినట్లు నీడ క్రమ్ముకొస్తూంది ఇది సాయం సంధ్య, సమస్యలకు నిలయం, ప్రశ్నల తూణీరం సూర్యుని మృత్యువుతో చీకటి బ్రతకాలనుకుంటూంది. సటాచ్ఛటలు విదల్చి నిల్చిన సింహం వలె నున్న సంధ్య కాలుని వేటకు బలియై శవ రూపం పొందుతూంది పక్షి వాలుగా దిగుతూంది! చీకటి పల్చగా మొదలైంది ఒక సుదీర్ఘ విషాదమేదో కొండవలె నిల్చినట్లుంది ఏదో తెలీని ఆనందం బింబం వలె రానుందా? విషాద స్వరంతో సాయం సంధ్య ఒక్కమారు ఎరుపు నుండి నలుపులోకి దిగిపోతూంది గాలి సోమరి మబ్బులను జో కొడుతూంది స్థితి ఒక కొలిక్కి రావడానికి త్వరపడుతూంది పడమటి తలుపులు మూతపడీ అవని నడుము వాల్చే వేళ చుక్కల చిరు వెలుగుతో ఆశలు రెపరెపలాడుతున్నాయి వాగు పొంగువలె ఎగసే ఆత్మీయతతో ఆకాశం పండు వృద్ధు వలె ఉంది. గుండె లోతు నుండి వెలిగే వేదనతో భూమి కదలని గోవు వలె ఉంది. ఎక్కడో పూచిన పూల వాసన ఎదను విచలితం చేస్తూంది ప్రక్కనే ప్రవహించే వైతరణి దేహాన్ని గగుర్పొడిపిస్తూంది ఆ దూరాన గుట్టపై దేవుని చూడాలంటే ఎంత శ్రమ ఆ పైకి చేరుకోగనే అంత శ్రమ! ఏమయ్యేదో! గుండె నిండుగా ఊపిరి తీసుకునేది శరీరం చైతన్యంతో పరవళ్ళు తొక్కేది మంచు క్రమ్మిన గగనం వలె స్మృతులు నిండిన మనస్సుతో మేడలూ గుడిసెలూ దాటి దూరం వెళ్ళి నిల్చున్నా ప్రపంచం స్థాణువైందా? అనిపిస్తూంది, కాని కాదు.
జడస్థితిలోనూ మంద్రంగా అంతశ్చలన ముంటుంది గుడిసెలతో ఊరు చివర పెరిగిన గడ్డం వలె ఉంది విద్యుత్తంత్రుల అవసరంతో చెట్లకు క్రాప్ చేసారు సూర్యుడస్తమించే దాకా ఓపిక లేని చీకట్లు దూకబోతున్నాయి. అనాధ శిశువుల వలె అక్కడక్కడా నీడలు పడిఉన్నాయి ప్రక్క చేనులోకి ఎలుకలు పరుగిడుతున్నాయి సందుల్లోకి చీమలు, బారులుగా వెళ్ళుతున్నాయి కంచె పక్కగా తొండలు దౌడుతీస్తున్నాయి పాము నెరియ లోనుండి తలెత్తి లోపలి కెళుతూంది. అలసి సొలసి లోలోపల మసలుతూ మరలుతున్నారు పొల్లాల్లో నుండీ కర్మాగారాల్లోనుండీ అర్థనగ్న శరీరులు. మానవత చోటు చేసుకొన్న వాలకంతో పైకి నవ్వుతూ అర్థవాద వికృత మతులు తరలుతున్నారు.- నెత్తిపై మోపులతో బరువుగా నడుస్తున్నారు స్త్రీలు చేతిలో ఒడిశెలతో ఇంటికి మరలుతున్నారు యువకులు దూరమైన వ్యక్తులు ఇంటి తలపులో నిమగ్నమైనారు ఇంతసేపు చిరుమబ్బును తలపించే ఫ్యాక్టరీ పొగ ఆగింది అవనిపై దూకడానికి చీకట్లు ముని వ్రేళ్ళపై ఉన్నాయి జగత్తును తమలో బంధించేవీ, తమ ఉనికిని గుర్తింపజేసేవీ దిక్కుల్లో నుండి నేరుగా కళ్ళ నాక్రమింప జూస్తున్నాయి ధూళి క్రమ్మిన అద్దంలో బింబం వలె ఉంది కాలం ఎంతలో వస్తుంది ఒక తరం పోయి మరో తరం! అంతలో వస్తుంది మార్పు జీవనగతి ఆలోచనలో రవి వృద్ధు వలె నిష్క్రమిస్తే శశి శిశువు వలె ఎగసేను ఒక సమయ సమాప్తితో మరో దశ ఆరంభమౌతుంది వెలుగు సుళ్ళుగా తిరిగీ చీకటి సంద్రంలో కలుస్తూంది జీవన సంరంభం నుండి పక్షులు స్వేచ్ఛను కోరుతున్నాయి జీవన వ్యాపృతి నుండి వ్యక్తులు విరామం కోరుతూన్నారు. శత్రువు నుండి బదులు లేని వీరుని వలె ఇంతవరకూ విజృంభించిన ఎండ అలసిపోయింది ఇంత సేపూ కాల్చుకతిన్న సూర్యుడు మెల్లగా కందగడ్డ ముఖంతో తప్పుకున్నాడు. ఎంత విషాదమీ సాయం సంధ్య? నీలి వాన కురవనుందా? ఇసుక దిబ్బపై నిల్చిన మనస్సు సరిస్తూంది నది వలె
ఊహ విరిసి క్రమ్ముతూంది నీలి మబ్బు వలె పచ్చని పచ్చని బ్రతుకు బయలు చూచి ఎంత కాలమైంది? చల్ల చల్లని ఎదలో నీటి జాలు చూచి ఎంత కాలమైంది? అందని వెలుగు బంతిలా మానవత దొర్లుతూ పోయేనా?
III . 2. సాయంకళలో అడుగులో అడుగేస్తూ నడచే దీనుల హృదయ శబ్దం మోసుకొనీ ఊగుతూ తూగుతూ కదలుతూ గాలి వచ్చిపోయే వారి చెవిలో బాధా రహస్యం ఊదుతూంది బడలికతో నిదుర కొదుగుతున్నాయి ప్రాణులు దుఃఖంలో ఆశ వలె ఉదయించింది చంద్రబింబం కుంటుపడిన కోర్కెల వలె చుక్కలు మొరాయిన్నాయి. చల్లారిన శిఖలతో రోజు బూది దిబ్బ వలె ఉంది అలసిన గుండె ఏ కప్పు క్రిందో విశ్రాంతి కోరుతూంది చిరుగు పట్టి మాసిన గుడ్డలతో బయటికి రా వెరచే వారి వలె నీలిదిశల మాటున మబ్బులు తారాడుతున్నాయి మనసు లో పొరల్లో దరిద్రుని ఈహల్ని తలపిస్తున్నాయి గతుకులు పడిన భూమిపై పశ్చిమ క్షితిజ దృశ్యం చరిత్రలో మిగిలిన శిథిల సౌధం వలె ఉంది సమాజ రథ చక్రార పంక్తి వదలని సంధ్యా జీవులతో కాలం చీకటిని ఎదిరించేందుకు సిద్దమౌతున్నట్లుంది. “సినిమాకు వెళ్ళదామా?” “ముందు టీ వనై టూ” “నీ మొగం సినిమా” ఇంకా ఫస్ట్కు పదిరోజులుంది "పార్్క లోని స్నేహితులు! అదె చెట్లు! మన కోసం నిరీక్షిస్తాయి” “పద”! అంటూనే నాలుగు అడుగులూ రోడ్ను క్రాస్ చేసి తీరిగ్గా పెద్ద హోటల్ ముందు నిలిచాయి. ఆమె నీటుగా ఎయిరోడ్రామ్లో దిగే విమానం వలె ఎదురైంది చందా పుస్తకం తీసేనని పరిచితులకు భయం వేసింది అంతటా కలయజూచింది సెంటర్లో వెలిగే గ్రీన్ ట్ ఇంతకూ ఆమె! ఎవరంటే సాంఘిక సేవా ఘన మతి. అంతా కాసేపటికి తేరుకొని ఎవరి పనిలో వారు పడ్డారు మనస్సు నిండిన చిత్రంతో నేను బరువుగా లేవక తప్పలేదు లోనికెళ్ళినవాళ్ళు బయటికి రావడానికెంతో సేపు పట్టదు
ఆలస్యం చేస్తే వేటింగ్ క్యూ చేతిలో కప్ లాగేట్టున్నారు. కాలి క్రింద సిమెంట్ రోడ్ ఎంత దూరం సాగింది? నేటి సమాజమూ అంతే ఘన ప్రమాణమందుకుంది. అపుడే సన్యాసులు బిచ్చగాండ్లు ఇళ్ళ ముందు మూగారు పగలు కళ్ళు మూస్తున్నట్లుంది సాయం కళ్ళు తెరుస్తూన్నట్లుంది. కడుపులో శూన్యంగా నున్న ఆకాశం పీడకల కంటూంది దూరం నుండి చూస్తే దీపస్తంభం, నీడ ఉరి తీసిన మనిషివలె ఉంది ఉరీ! చావు! అమ్మయ్యో! ఆ మాటలంటేనే భయం!-
III . 3. అపుడపుడూ నేనూ నా స్నేహితుడూ ఈ కాలిబాటనే ఒకరి చేయి ఒకరు పట్టుకొనీ వచ్చేవారం మునిమాపులో ఒకరి ప్రాణం ఒకరు ఆచి కొనీ సాగేవారం ఒక మూల విసరేసిన పెట్టెలో ఎలుకల వలె మైదానంలో నిలిపిన గుడారాల్లో దేశద్రిమ్మరులూ ఈ రోజు పడమటి దిశ అంతరించిన వెలుగు రేపు తూరుపు దిశ మొలకెత్తేనని ఆశ, రోజూ వచ్చేవే ఇరు సంధ్యలు! అయినా ఎంతో కొత్తగా కన్పిస్తాయి బ్రతుకు బరువు రంగులతో సరికొత్త రూపం ధరిస్తాయి! చెట్లపై నుండి వెన్నెల సందు చేసుకొని ప్రసరిస్తూంది ఆకుల చెక్కిళ్ళపై జారి నీలి ముసుగులోకి తొంగిచూస్తూంది చుట్టూ చీకటి గోడల వరస కన్పించీ కన్పించడం లేదు ఈ స్థితి గమనం తీరు ఊహ కందీ అందకుండా ఉంది రాత్రి గుట్టలపై నిలిచిన గుడిసెలు నీటి అలల మధ్య పడవల వలె ఉన్నాయి ఎప్పుడు అదృశ్యమై పోయేదీ తెలీదు! ఎప్పుడు బయట పడేదీ తేలీదు! అశాంతిలో మౌనంగా మనిషి విడిచే విశ్వాసాల్లో అనలం విప్లవ భవమై ఊపిరి తీసుకుంటూంది మరోవైపు నుండి భూమి రేణువుల్లో గాలి తరగల్లో సమీచీన సంస్కార గంధం మనస్సును శాంతపరుస్తూంది కూడకముందే మబ్బుల్ని గాలి చెదర గొట్టజూస్తూంది. తృష్ణార్తయైన భూమి బీటలువారి చెక్కలైంది
ఎక్కడో దూరాన కెరటా లెగసే సముద్రం! ఇక్కడో కాలి క్రింద ఎండిన గొంతుతో జనావని మబ్బు మాటలతో ఊహలతో ఇసుక తిన్నెపై చేరాం అయ్యో! నీటికా? నూనెకా? అంటే రెండూ అవసరమే నీరు ప్రాణం నిల్వడానికీ నూనె సంస్కారం పెంచడానికీ ముందు నీరు బ్రతుక్కి ప్రాణం! ఆపైన అవసరం సంస్కారం. ఇక్కడ నీటికై నూనెకై అన్వేషణ సంఘర్షణ నిరంతరం మబ్బులు చీల్చుకొనీ మెరపుతో వాన తప్పకుండా వస్తుంది ఉదయంపై ఆశ కొన ఊపిరిలోనూ రెపరెపలాడుతుంది భిన్న శక్తుల సంచలన సమాకలనంతో జరుగుతూంది పురోగమనం. చేతిలో మాయ లాంతరుతో వచ్చింది రాత్రి సర్వం తనలో లీనం చేసుకో జూస్తూంది
IV. వెలుగు నీడలో
చీకట్లో స్వతంత్రంగా మనేందుకు చుక్కలు ప్రయత్నిస్తున్నాయి చలి గాలిలో వత్తివలె కాలం వెలుగుతోంది బరువుగా బిచ్చగాని వేషంలో ఉన్న ఈ సమయం చేతిలో ఒక్కపైసా విదలించే చేయి కన్పించడం లేదు అలసిన శరీరాలతో సోలుతూ గూటికి చేరలేని పక్షులు ఏ చెట్టునో ఆశ్రయం పొందుతున్నాయి ఏ పంచన చేరి గడపజూస్తున్నాయి చలి గాలికి తాళలేక సూర్యాగ్నిని తలచుకుంటూ తమలో వెచ్చదనాన్ని హెచ్చవేసుకుంటున్నాయి నిశ్శబ్దం గుండెలో కత్తులు దూసినట్లరుస్తున్నాయి చీకటి సునాయాసంగా ఊపిరి తీసుకుంటూంది ప్రపంచానికి కాగే స్థితి లేదు, మనస్సుకు నిలిచే ఓపిక లేదు కష్టమూ సుఖమూ ఆగిపోదు, దుఃఖమూ ఆనందమూ నిల్చిపోదు నిద్రకు చోటు వెతుక్కుంటూ దొరికే ఆశతో నీడతో మిత్రునితో ఇంకా వేచి ఉన్నా. తండ్రి మెడ చుట్టుకొని వ్రేలాడే శిశువు వలె చంద్రరేఖ తల్లి కొంగు పట్టుకొని తిరిగే శిశువుల వలె చుక్కలు. ఈ రాత్రి తలుపుకు వేసిన తాళం చెవి ఎక్కడుందో తెలీదు
ఎందరో తలుపు బయటనే ముంగిట్లో నిలిచి పోయారు. చంద్రుడు లేని రాత్రి వలె జీవితం మబ్బులో మెరపు వంటి తెలివితో మంచు శాలువా కప్పుకొని ఈజీచైర్లో పడుకున్న రీతి ఉంది సమాజ మానసం- ఎనెస్తీషియాలో ఆపరేషన్ వలె నిశ్శబ్దంలో గతిరేఖలతో అక్కడక్కడా సమయం సవ్యాజంగానే ఉంది ఎదపై అడుగుతీసి అడుగు వేసే శిశువు వలె నిశ్చితంగానూ సుకుమారంగానూ గడుస్తుంది కాలం అగాధమైన సముద్రంలో భయరహిత ప్రాణుల వలె చెట్ల కొమ్మల్లో పక్షులు ముడుచుకొని పడుకున్నాయి సృష్టిలో విషమ స్థితుల్ని మరపించే నిద్రాలోకంలో మనోనేత్రం సుందర స్వప్నాల్ని కంటున్నట్లుంది. చీకటి మరుభూమిలో ఒకే ఒక గగన వృక్షం క్రింద కూర్చొని కథలు చెప్పుకునే పిల్లల వలె చుక్కలూ మేడ గోడల ప్రక్కనే నీడలు చుట్టచుట్టుకొని పరున్నాయి బీద బిక్కు ఉన్నచోటునే కలలు పోగుచేసుకుంటున్నారు శిథిల నిర్మాణాల్ని పట్టుకొని వ్రేలాడుతున్నాయి గబ్బిలాలు విశేషం లేని బ్రతుకులు సశేషంగా ఆకర్షిస్తున్నాయి బలహీనులు లోలోన కుమిలి ఏడుస్తున్నారు మంచి వాళ్ళ మనుకునే వాళ్ళు హాయిగా నిదురిస్తున్నారు పిచ్చి వాళ్ళు నిద్ర పట్టక అరుస్తూ వీధుల్లో తిరుగుతున్నారు నిదుర పోవడానికి చోటు దొరకని వారుండనే ఉన్నారు. బలరహితుల ఆశ్రయానికీ బలసహితుల సాహసానికీ వీలైన ఈ సమయం ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తున్నారు ఏదో కదలిక! అంతలో నిశ్శబ్దం ఇంతలో ధ్వని! నిదుర నిలుస్తుందా? మెలకువ ఆగుతుందా? నిరాశ పరచుకున్న ఎడారిలో ఆనంద ప్రవాహమూహిస్తూ శాంతి చెరగిన రాత్రులు వెలుగు పావురాల్ని తలుస్తూ మేల్కొన్న మనిషి గమనం ఇంకా మొదలు కాలేదు. వెండి తెర మెదలుతూంది మనస్సులో నీడ కల కదలుతూంది దానిపై వెండి తెరపై కాలం బింబిస్తోందా? నీడ బొమ్మలతో సమాజం రహిస్తుందా?
IV. 2. అర్థరాత్రి మేల్కొనే అర్థరాత్రి ఆవులిస్తోంది వదలని సమస్యల్లో మేల్కొనీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుంది వాతావరణం అంబేదగా తయారైనట్లుంది సద్దుమణగినా ఎక్కడి నుండో సవ్వడి వినిపిస్తూనే ఉంది అడ్రస్ పారేసుకొని ఎవరి కోసమో వెదుకుతూ ఒంటరిగా మింటిలో నడిచే దెవరది? ముఖంపై జుట్టును పైకి దువ్వుతూ నిల్చేరు? చీకటి గోడపై పచార్లు చేసే దెవరవది? నగరానికి వచ్చిన కొత్త మనిషా? రాజకీయ ఖైదీయా? జైల్ సెంటీ యా? బయట పడిన మనో బింబమా? వీధి దీపాలు కునికి పాట్లు పడుతున్నాయి గాలి ఏదో చెప్పబోతోంది కాని పెగలడం లేదు నిదుర తెర ఉండి ఉండి జారుతూంది దీపాల్లో మెరసే రంగులతో రాత్రి స్వప్న కాసారం వలె ఉంది బంధింపబడిన మనిషి నేరం గురించి యోచిస్తున్నట్లుంది మహా వృద్ధు ఆరాటంతో తడుముతూ అడుగు వేస్తున్నట్లుంది. ఈ సమయం వెలుగు దాచి చీకట్లును పంచుతూంది ఎక్కడో మేల్కొన్న అలికిడి వినిపిస్తూంది సమయం గళంలో స్వరాన్ని సరి చేసుకుంటున్నట్లుంది రాత్రి నిదుర లోతుల్లో చీకటి పారుతూనే ఉంది వెలుగు అంచులు కన్పించీ కన్పించకుండా ఉన్నాయి దోమల సంగీత ధునికి కళ్ళు తెరపిడి పడని మెలకువ! నిద్రా శిథిలాల్లో హఠాత్తుగా ఉలికిపాట్లు కలవరింతలూ! ఎక్కడెక్కడో ఎత్తిన చేతులు! ఐదు మొనల బాకులు! ధ్వని! అంతలో నిశ్శబ్దం! గడియారం సవ్వడీ! గుండెలయ! వీటి మధ్య నుండి నిశ్శబ్దం సుకుమారంగా కదులుతూంది శబ్దం మధ్య మధ్య నిశ్శబ్దాన్ని పదును పెడుతూంది ఆకాశం ముఖం చాటుచేసుకొని కన్పించడం లేదు నెత్తురు చిమ్మే వెలుగు గాయాలు! అడవిలో కొరవి దయ్యాలు- నిశా ముఖాన నెత్రుగీతలు స్పష్టంగా చిత్రాకృతి వహిస్తున్నాయి మనస్సుకు చీకటి ఎక్కడలేని పని కల్పిస్తూంది యుగాలుగా నిశ్చలంగా ఒకే చోట పడి ఉన్నాయి గుట్టలు
యుగాలుగా ఉత్సాహంతో ప్రవహిస్తున్నాయి నదీ నదాలు భూమిపై స్వర్గాన్ని ఊహిస్తూ నారక మతితో మనుషులూ దారి ప్రక్కన ఆకర్షిస్తూ పేర్లు చెక్కిన కీర్తిశిలలూ, స్తంభాలూ, సముద్రుడు చేతులు చాచి ఎన్ని యుగాల నుండో భూమిని తనలో కలుపుకో జూస్తున్నాడు. జగత్తు నిద్రాముద్రితమై కల్లోల స్థితి ఆగినట్లుంది అలజడి చెందిన మతులకు నిద్ర ఒక విశ్రాంతి పదం విషాదంలో ఆలోచన కలిసి అందంగా ఉందీ సమయం కిటికీ నుండి చూస్తే కన్పించే ఏకాకృతి! చీకటి కాదు కాదు దూరం నుండి రానున్న వెలుగు నీడ కావచ్చు మనస్సు చెదరిన స్థితిలో భ్రాంతి రూపం ఔనేమో! భగవంతు డెక్కడున్నాడు? ఇది ఆతని నీడేమో? గతమూ భవిష్యత్తూ తెరచిన వర్తమానం కళ్ళు నా కళ్ళ ముందు సమాజం, కళ్ళ వెనక అతీతం. ప్రపంచ నాటకరంగంపై పాత్రలు మనుషులు ; ఉండి ఉండి పూవులా పక్షులా అగ్నులా అనిపిస్తుందొకొక్కప్పుడు. అణువణువూ చైతన్యంతో కొత్తరూపం వహిస్తూ క్షణక్షణం మనస్సులో కొత్త ఊహలు ధరిస్తూ గ్రహాల పరిచయంతో దేవతల కల్పనతో చీకటిలో వెలుగై పురోగమించేను మనిషి! నదీ ప్రాంతాల్లో నుండి గాలులు ప్రియోక్తులూ ఎడారి ప్రదేశాల్లో నుండి గాలుల ప్రార్థనలూ పచ్చిక మైదానాల్లో నుండి గాలుల దీవెనలూ ఒకదాని తరువాత మరొకటి మొదలైంది భగవంతుడు ప్రసాదించిన వరం! ఎంత కోమలంగా ఉంది ఇంతకు ముందు వరకు కఠోరంగా ఉంది అంతలో మారింది నెత్తురు గడ్డకట్టి నరాలు స్తంభించినట్లు శాపగ్రస్తమై పడి ఉన్న ఈ చీకటి శిథిల ప్రపంచంపై చైతన్యం వెలుగు రవ్వలు రాల్చేనా? పుష్పించేనా? నిద్ర ఎరగని గాలి సమాజంలో జీవరహస్యమూదుతూంది. కాలం నీలి మబ్బు రెక్కలు విప్పింది పెంకె ఘటం గ్రీష్మం వెనక్కు తగ్గింది
V. మబ్బు రెక్కల క్రింద
అంతగా చూపిన ప్రతాప చిహ్నాల్లో ఏ ఒకటీ నిల్వ లేదు నేలను మండిస్తూ నింగిని మెరపిస్తూ జలధిలో పొగలు రేపే గ్రీష్మం చివరకు చెమటలు పట్టి బేజారైంది ప్రాణి కోటి కాహ్లాదంగా ఆకాశం క్రిందికి దిగినట్లుంది క్షుధార్తుల పక్షాంచలాలు స్పృశిస్తూ వ్యథార్తుల ఆశాంచలాలు తడుపుతూ అరమూత కాటుక కళ్ళలో మేల్కొన్న మెరుపు తీగెల సౌరుతో వచ్చింది మెరపు మెరసీ, గాలి వీచీ, కిటికీ తలుపులూగిసలాడాయి శిఖలు చేతులు ముడుచుకున్నాయి, మొగ్గలు ముఖాలు విచ్చుకున్నాయి మాయలేడి వలె చీకటి రైలు పరుగిడుతోంది ఇక వెలుగు రైలు రావడానికెంతో సమయం లేదు మేఘాలు బంధువుల వలె వరసగా వచ్చి చేరుతున్నాయి బిగబట్టిన ఆశల పెదవులు సడలుతూన్నాయి దాగిన రహస్యంతో పైకి రానున్న మహా పద్మం వలె ఉంది గగనం. దిక్కుల చెక్కిళ్ళు నిమురుతూ, మెరపు చూపులు చికిలి పెడుతూ మత్తిల్లిన ఘన శరీరాల్ని చురుగ్గా పదును పెడుతూ కదలే గాలి ఎదపై కాలం నిశ్చింతగా వాలినట్లుంది. నిదురకూ మెలకువకూ మధ్య సరించే చేతనా తరంగాలతో పవన శక్తి కదులుతోంది దిశ నుండి దిశ దాకా నింగి తంబురా వలె మ్రోగుతోంది. మబ్బు క్రమ్మి గొడ్డలి విసరినట్లు మెరుపు మెరసింది శక్తి ఉద్భవించింది, క్షణం కాంతి ప్రసరించింది రూపం మారింది, మరో రూపమవతరిస్తోంది.స్వేచ్ఛాకవిత్వం I - మాదిరాజు రంగారావు పాలిపోయిన భూమి రాగ సుందరమౌతూంది ఆశల్లో ఇంద్రధనుస్సు ఇంకా గుప్తంగానే ఉంది భూమిలో సుఖజీవనంకై మనిషి తాపత్రయం మనిషి కోరేదీ అంతరాయ మెరుగని సంతోషం ఇది దొరకదు సంపూర్ణంగా, దొరికినదానితోనే తృప్తి పడాలి ఆందోళన చెందే ఈహలు, పసిపాపల వలె విశ్రమించాయి మనసులో ఊహలో పెదవిపై శబ్దంతో
నింగి నుండి వర్షంతో అవనిపై సృజనతో అలల వరుసవలె అనుభూతులు కదిలేను జ్ఞానంతో మనస్సు వలె మెరుపుతో మేఘం విలసిస్తూంది ఉల్లోల జల తరంగ రావంతో అవని ఆకాశాన్ని కీర్తిస్తోంది శబ్దానికంతం లేదు! శబ్దం లేని క్షణం లేదు! అగ్ని ఋతు నిష్క్రమణంతో ప్రకృతి శోభా హరితమైంది మృత్సా గంథంతో కృత్నమైన అమృతానుభూతి వశమైంది గాలి చెంగలిస్తూంది లేడి వలె, మాట ఎగురుతూంది పక్షి వలె! మబ్బులో మెరుపు వలె ఉదయ స్ఫూర్తి! మరో రోజు మొదలు! ఇంకా మనిషి నిదురలోనో కలలోనే ఉన్నట్లుంది. చీకటి తెర తొలగుతూంది, బూది రంగు మారుతోంది మానసికానుభవ దృశ్యం ఫిల్్మ వలె కదలుతూంది నీల గగన మైదానంలో పోరాడే శశి శిశువు అలసిపోయాడు నిశా శిలా సంధుల్లో నుండి దిక్కులు చివుళ్ళు తొడుగుతున్నాయి సగం నిదురు సగం మెలకువతో ప్రపంచం నలుపు తెలుపు రంగులతో కొత్త చిత్రమేర్పడుతూంది మాటలతో నవ్వులతో పాటలతో కేరింతలతో వెలుగు మలుపు తీసుకుంటూందీ సమయం నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దాన్ని ఒడిసి పట్టుకుంది కాలం, నిన్న నేడు రేపు మొదలుగా కాలం వేసే అడుగులు ప్రవాహం నీటిలో సుడులతో తొలగిపోయే అలలు! ప్రయాణంలో ఈ రోజు జారిపోయి నిన్న అవుతూంది ఎదలో స్మృతులు భయం వదలి హ్లాదమయమౌతున్నాయి కొండపై అగ్ని జ్వాలా భ్రాంతి! పక్షులూ ఇంకా కలగంటున్నారా! నిదుర చాలించండి ప్రియమిత్రులూ! ఉదయం పడగెత్తుతూంది
VI. హంస వలె నేను
చెదురు చెదురుగా అక్కడక్కడా నిలిచిన మంచును గాలులు దూర దూరంగా జరుపుతూ పోతున్నాయి రాత్రి వెలిగిన భయం ఇంకానా? ఎపుడో ఆరిపోయింది మంచు గుండెల్లో అగ్ని రగిలింది పక్షులూ ఎగరండి గగన సముద్రం తిలకిస్తారా? అదెంత పని మీకు
అవనిపై దృశ్యాలు చూస్తారా? మీకిదో పని కాదు. ముళ్ళ నుండి గులాబి వలె దిక్కుల్లో నుండి వస్తూంది ఉదయం ఎదపై ముత్యాల దండ వలె మంచు బిందువులు నిల్చేను తల్లి కొంగుచాటున పిల్లలవలె తొంగి చూచేను వెలుగుల వెలుగు ಜಿಲ್ಲ విరిసింది! ఉషస్సు శుచియై నిలిచింది. గంధం తెర వ్రేలి వచ్చింది! మనస్సు కొంత ఊర్పు తీసుకుంది ప్రపంచం విషాదం నుండి తేరుకుంది, ఆనందం ముఖంలో వెల్లివిరిసింది ప్రతి మనిషీ ప్రయాణం సాగించాలిసిందే ఎవరి కిష్టమున్నా లేకపోయినా ప్రపంచంలో. రేణువుల సందుల్లో ఉందీ పిడికిలి సందుల్లో ఉందీ ఆకాశమే దిక్కుల మధ్య నుందీ ప్రపంచమే! ఎక్కడైనా బ్రతుకు బ్రతుకే జగత్తును వెలుగు క్రమ్ముతూంది! మనస్సును వివేకం క్రమ్మాలి ప్రతి రోజూ వచ్చే రోజుకు మొదటిదీ, పోయిన రోజుకు చివరిదీ విప్పారిన రెక్కలతో నిటారుగా నిల్చిన శరీరాలతో ప్రపంచంలోకి ప్రవేశించే ముందు ఒక మాట కాలాన్ని కప్పుకొని నిద్రించకండి, మనస్సులో నీడల్ని వెలిగించండి. ఈ చెట్టు అగ్నికి దగ్ధమవుతుందని భయపడ నక్కరలేదు ఈ చెట్టు నీటిలో కొట్టుకపోతుందని దిగులు పడ నక్కరలేదు ఇది అగ్ని కాదు, ముంపు కాదు! వెలుగు! వెలుగు! జీవన సంకేతం! చీకటి రాకతో ఒకటైన నీడలు క్రీనీడలు వెలుగు రాకతో ఎక్కడి వక్కడ విడిపోయాయి వెలుగు నింగి నుండి దిగిన హంస వలె ఉంది, సమాజ సరస్సులో మానవీయ పద్మం వలె సూర్యుడు సృష్టికి ఆశా పతాక! మనిషిలో మానవతకు ప్రతీక!- నిన్నటి రాత్రి గతానికి దగ్గరి బంధువు
VII. మరో ఉదయం
నేటి ఉదయ సంధ్య వర్తమానానికి పరమ మిత్రం ఎందరో ప్రేమించిన చంద్రుడు చూపు నుండి తొలగాడు జీవన రుచితో ప్రజతో పయనం తప్పదు మృగమూ మొక్కా పక్షి జంతువూ కాదనీ తాము మనుషులమనీ అందరికీ బాగా తెలుసు
అయినా అపుడపుడూ మరచిపోవడం కద్దు అపుడపుడూ ఇక్కడ నదులే ఎండిపోతాయి అపుడపుడూ ఇక్కడ పచ్చదనం లోపిస్తుంది. రాతి యుగం నుండి స్పుట్నిక్ యుగం వరకూ అరణ్యం పల్లె పట్టణం జీవిత సంస్కృతి చరణాలతో నిద్ర కల మెలకువతో బ్రతుకు దారి మలుపులతో ప్రయాణం సాగుతుంది గతాన్ని భద్రపరచుకొనీ ఈ గుట్టల్లో చెట్లల్లో ఎవరా సంచరించే మూర్తి ఈ నీడల్లో మబ్బుల్లో ఎవరా పలకరించే రూపం ఈ చీకటి కోటపై నుండి ఎవరా లంఘించే బింబం పడగెత్తిన ఉదయం మానవ నవోన్మేష హృదయం
VII. 1. చైతన్యంతో ఒకటై నిశ్శబ్ద యంత్రం నుండి ధ్వని వెడలుతూంది జనం కదులుతున్నారు మెలకువను ఋజువు చేస్తూ నిదురపోయిన కొందరికన్నా శిలలే నయమనిపిస్తూన్నాయి వేదనతో గుండె నిలిచి ఉద్రేకంతో నరాలు బిగిసి సంక్షోభం పొందే సమయం ఉదయం మొగ్గవేసింది దారిలో గాజు ముక్కలు కొనదేరి మెరుస్తున్నాయి అనుభవాలు జ్వలిస్తున్నాయి భూతాలు పొంచి ఉన్నాయి లోకం ఏడ్చినా చేతగాని విధంగా సమాజం బ్రతకలేక చావదు జడత్వం క్రమ్మిన బ్రతుకుతో కిటికీ తలుపులు మూసుకొని ఇంకా లోపలే ఉన్నవాళ్ళు! ఈ సమయం బయటికి రావాలి. వివేక విలసనంతో క్రియా శక్తితో మనో లోక దీప్తితో ఎవరు కాదన్నా మెలకువ పైబడి తరుముకొనే వస్తుంది దారిలో నిలబడి దెయ్యాలు మంచి చేసుకో జూస్తాయి భౌతిక సత్యంతో, చారిత్రకావసరంతో నేటిని గుర్తించి చెదరిన జనశక్తులు సంఘటితమై ఒక్కటై వెలగాలి చైతన్యంతో నిరాశతో భయపడి పరుగెత్తక కాలాన్ని మేల్కొల్పాలి! ఎడారి దాహం తీరితే చాలదు! సస్యశ్యామలం అవాలి. ఉదయ హర్షంతో పసికందు నరాల్లో నెత్తురు వలె అవనిపై చైతన్యం జాలువారుతూంది తెల్లని పావురాళ్ళు తీర్చిన మనః పరిషత్తుతో
సమాజమా! నీ గురించే ఆలోచన జరుగుతూంది ఈ కృతి భూమికలో నీ గురించి ఉద్దేశించి ఈ సమయం నా గురించి మాట్లాడక తప్పడం లేదు.
VII. 2. గుడ్ బై చావు ఘడియ సమీపించి వాలిన ముఖంతో చంద్రుడు నిష్క్రమించిన ఆ రాత్రి మళ్లీ మళ్లీ వస్తుంది జీవన రాగంతో నృత్యం చేసే ఉదయమూ వస్తుంది అయితే ఈ రోజు! ఏ రోజుకూ డిటో కాకూడదు మంచులో ఆర్ద్రత, నీటిలో ప్రేమ, గాలిలో మానవత అద్దుకొని వచ్చే ఉదయం స్వేచ్ఛాశక్తిని నింపుతూంది చారిత్రక యధార్థ్యంతో వైయక్తిక చైతన్యం సమాజాభ్యుదయానికి మొట్టమొదటి ఆశా రూపం పూలలో మధు ధారవలె నరాల్లో శక్తితో వచ్చే ఉదయమెపుడూ క్రొత్తే! హృదయమెపుడూ సజీవమే. గడచిన రాత్రి కార్నివాల్లో చూచిన ముఖాలు పేరు కింకా బ్రతికే ఉన్నాయి అక్కడక్కడా! ఈ పొద్దు మూల మూలల నక్కి నక్కి చీకటి వాగులు ప్రమాదగీతాలు పాడుతూ వచ్చిపోతూనే ఉన్నాయి ఓ మైత్రీరమ్యుల్లారా! మీరే చెట్టెక్కి కూర్చున్నా ఈ గడసరి ఉదయ ముఖం మిమ్మల్ని ఇట్టే పట్టేస్తుంది- మీ ముఖాలు పరిచయమే! మీ చర్యలు అవగతమే పూవులో వెచ్చని రసధునితో ఇంద్రధనువు మనస్సుతో ఉషస్సు వంటి ఊహతో మేల్కొన్న మనిషీ పరిచయమే సిద్ధాంతం అవసరమే! చర్చల సుడిగుండంలో తలదూర్చే మనిషీ కవీ ఎక్కడ తేలేదీ తెలీదు. ఎత్తూ లోతూ గల అనుభవం హేతు దృష్టికందదు నమూనాలో జీవిత గతి నిర్దేశించడం కుదరదు ప్రతి వస్తువునీ చీకటి వేరు చేస్తే ప్రతి మనస్సునీ వెలుగు కలిపేస్తుంది గడ్డి పోచకై అర్రులు చాచే ప్రాణి కోటితో పాటు చల్లని గాలికీ హ్లాదపడే హృదయ లోకమూ ఉంది అంతటా నిశ్శబ్దం! ఎక్కడుంది? నిద్రలోనూ లేదు.
నిశ్శబ్దానికి పెద్ద శత్రువు హృదయ స్పందనమే అంతటా వెలుగు ఎక్కడ? ఏ నీడను మాపగలం. బ్రతికున్నట్లు ఋజువు కేదో శబ్దించ నక్కర లేదు ఎదుగూ బొదుగూ లేని రాతి బొమ్మ కాదు మనిషి వ్యక్తుల సంస్కారంతో సమాజం అస్తిత్వాన్ని పొందుతుంది సమాజశక్తులతో వ్యక్తి మూల రూపమేర్పడుతుంది కర్పూరం వంటి కాలం పరిమళించడానికి వెలుగు లిప్త చాలు జీవితం ఫోటోగ్రాఫ్ కాదు ఫే మ్లో బంధించడానికీ ఉదయంలో ఎర్రదనంతో పాటు వివిధ వర్ణమయం సమాజం సూర్యుణ్ణి అదే పనిగా చూస్తే మిత్రమా! గ్రుడ్డిదనం వస్తుంది. హ్లాదైక తేజాన్ని ఆత్మలో ఆవాహన చేసుకోవాలి! మనో భూమికలో ఈ రోజు ప్రయాణం అనుకోకుండా రైలు మాని మధ్యలో విమానమెక్కినట్లుంది - గుడ్ బై. స్వేచ్ఛా నవం 3. ముక్తధాత్రి కావ్యం (1972) మాదిరాజు రంగారావు అంకితం రాజనీతి వాహినిలో చెదరని బింబం మానవీయ సాహితిలో సహృదయ స్పటికం పూర్వ ప్రధానమంత్రి మాన్య శ్రీ పి.వి. నరసింహారావుగారికి ముక్త ధాత్రి బంగ్లాదేశ్ విమోచనోద్యమ కృతి, ముక్తధాత్రి. స్వేచ్ఛా కవిత్వంలో వెలువడిన ఉద్యమ కావ్యం. 1971లో ఈస్్ట పాకిస్తాన్లో ప్రజలపై వెస్్ట పాకిస్తాన్ సేనల బలప్రయోగ ప్రవర్తనకూ నిరంకుశ ధోరణికీ వ్యతిరేకంగా ప్రజల్లో ఉదయించిన స్వాతంత్య్ర కాంక్షనూ ఉద్యమశక్తినీ దాని పర్యవసానాన్ని చిత్రిస్తూంది. “ముక్తివాహిని” ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్ర రూపానికి ప్రాతినిధ్యం వహించింది. ఇది క్రియాత్మకమైన పాత్రను నిర్వహించింది. బంగ్లాదేశ్ భారతదేశ సహకారంతో కొత్త రాజ్యంగా ప్రపంచపటంపై అవతరించిందది. ఈ కావ్యం స్వాతంత్ర్యం కోసం నినదించే ప్రజల "అమర్ బంగ్లా! సోనార్ బంగ్లా" స్వరలహరితో ఆరంభమయింది. “స్వేచ్ఛావాయువుల్ని గదిలో ఎవరు బంధించగలరు?”
“స్వాతంత్ర్యకాంక్షల్ని చీకట్లో ఎవరు దాచగలరు?" ఒక్క నిరంకుశులు తప్ప! రాజకీయ కుటిల నీతి కారణంగా ప్రజలు పీడనకు గురి అయ్యారు! ప్రాణాలరచేత పట్టుకొనీ “ఆకులవలె” కదలిపోయారు. పాక్ సేనల దుశ్చర్యలకు గురి అయిన ప్రజల దుస్థితి కరుణ రసాత్మకంగా తీర్చబడింది. యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి హిమశీలవలె బిగిసింది. ప్రజలు కత్తులవలె నిలిచారు. జనం మధ్య నుండి విప్లవ సంకేతంగా “నెత్తురు మడుగులో విరిసిన అగ్ని పుష్పం వలె” ముజీబ్ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు చిహ్నంగా నాయకత్వం వహించాడు. అతని "పేరు విప్లవం"గా, అతని “ఊరు స్వాతంత్య్రం"గా నిలిచింది. అతడో ఉద్యమమూర్తిగా తోచాడు. ఈ సమయంలో అతని ముందు నిలిచిన ప్రజల కళ్ళ నుండి “నీటిచుక్కలు రాలే”దశ దాటింది, ఇపుడు “నిప్పురవ్వలు రాలు”
తున్నాయి.
అంతలో స్థితి కరుణం నుండి వీరానికి పరివర్తితమైంది. ఈ కావ్యంలో జ్వాలా తరంగాలు, జ్వాలా చలనం, మంటల మాటలు శీర్షికలతో ప్రజల స్వాతంత్ర్యోద్యమం ప్రతీకాత్మకంగా నిర్వహింపబడింది. ఈ ఉద్యమం స్వేచ్ఛా సమాజ లక్ష్యం కలిగింది. "తూర్పు మేల్కొంది గుహ నుండి సింహం వలె బోర్ల పడిన చీకటి తలయెత్తజూస్తూంది". మేల్కొన్న తూర్పు, రాజకీయ చేతనతో అవతరించబోయే బంగ్లాదేశ్న, బోర్ల పడిన చీకటి అపజయం పొందనున్న నిరంకుశ రూపాన్నీ సూచిస్తాయి. చీకటి తన అపజయాన్ని అంత త్వరగా అంగీకరించదు. ఈ లోగా ఎంతో మారణకాండ జరగడం తథ్యం. ఇది ఎటువంటి సంక్షోభానికి దారితీసిందీ కవితాత్మకంగా చిత్రితమైంది. “మెషిన్ గన్ ధ్వనుల్లో సంగీతం వినిపించేరా? సైనిక పద ఘట్టనలో మృదంగం మ్రోగించేరా? బాంబుల వర్షంతో శాంతిని పండించేరా? అహం బలం ఘర్షణతో మనిషిని రక్షించేరా?”- ప్రజల్ని కాపాడే నెపంతో రంగంలోకి దిగిన సైనిక బృందం సృష్టించిన భీభత్స దృశ్యం శాంత జీవనానికి భిన్నంగా పరిణమించింది. ఇది నియంతృత్వ చర్యకూ ప్రజాస్వామ్య లక్ష్యానికీ మధ్య అనివార్యమైన సంఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంలో ప్రజాస్వామ్య భావనకు స్ఫూర్తినిచ్చే చరిత్రగతి విధం దృష్టికి వస్తుంది. నియంతృత్వ చర్యల్లో హృదయవిదారకమైన సంఘటనలెన్నో ఉన్నాయి. కొడుకు కళ్ళముందు తండ్రిని లాగి కాల్చిన సన్నివేశం
మొదలుగా
ఎన్నో భయంకర దృశ్యాల మధ్య “ముక్తివాహిని” జాతీయ భావనతో పురోగమించిందది. త్యాగశీలంతో విప్లవతేజంతో విషాదకథను అంతం చేసేందుకుద్యమించింది. "తరలింది ముక్తివాహిని నటదగ్ని తరంగధుని” నిరంకుశ పాలననుండి దేశానికి ముక్తిని కోరే దేశభక్తి సేనా సమూహం, “అగ్ని కీలా సదృశం”గా వర్తించింది. ఇది చివరకు దేశ స్వాతంత్ర్యంతో ప్రజల జీవితక్షేత్రంలో విషాదం బదులు పచ్చదనాన్ని తెస్తుందనే ఆశ. భవిష్యత్తుకు
ప్రజాస్వామ్య పథాన్ని చూపిస్తుందనే ప్రజల విశ్వాసం. ఇది భారతదేశ రాజనీతిలో
భాగంగానూ
పరిణమించింది. ఉద్యమ తీవ్ర చలనంతో నిశ్శబ్దం బ్రద్దలైంది. రణ చక్రభ్రమణం శిఖర స్థాయినందుకుంది. చివరకు చీకటిలో “ఢాకా”, “తుఫానులో కొమ్మ చివర వ్రేలాడే పక్షివలె” అయింది. ఉదయమయ్యేసరికి కథ ఎదురు తిరిగింది. చరిత్ర కొత్త మలుపు తిరిగింది. ఢాకా నగరం నుదుటిపై "నెత్తురుబికి బొప్పి” కట్టింది. “ఎండిన చెట్ల కొమ్మల్లా” చేతులెత్తిన పాక్ సైనికుల దృశ్యం ఎదురైంది. ఈ పరిణామం చరిత్రలో ప్రజా విజయంగా నిలిచింది. జనస్వామ్యం గెలిచింది. శాంతికేతనం ఎగిరింది. సోనార్ బంగ్లాదేశ్ అవతరణంతో వంగపిత ముజీబ్ స్వప్నం వాస్తవమైంది. ఈ కావ్యం ఆరంభం నుండి చివరి వరకూ వస్తువు ఉద్యమ చరణంతో విజయ లక్ష్యం కలిగింది. ఇది వివిధ వాస్తవ స్థితిగతులాధారణంగా, ఈ శతాబ్దిలో విమోచన ప్రధానమైన చారిత్రకాంశం కేంద్రంగా నిర్మితమైంది. ఇది అక్కడక్కడా భావరూపాల (Images) ప్రతీకల (Symbols) సంవిధానంతో నిర్వహింపబడింది. స్వేచ్ఛా కవిత్వంలో దీర్ఘమైన రచనల్ని నిర్వహించే శిల్పం వేరు. మొదటినుండి చివరి వరకు ఉత్సుకతను ఉద్వేగాన్ని స్థాయిని నిలపవలసి ఉంటుంది. రచనలో గాఢత తీవ్రత వేగం చెదరకుండా చూడవలసి ఉంది. ఈ కావ్యంలో స్వాతంత్ర్యోద్యమంలో చర్యల్ని ప్రతిచర్యల్నిబట్టి ఏర్పడే సామాజిక స్థితుగతులతో భావసూత్రం రూపొందింది. ప్రజా లక్షితమైంది. అంతర్జాతీయ కోణంలో ఉద్యమస్ఫూర్తి కలిగిన సామాజిక స్పందనంతో ఆవిష్కృతమైందీ కృతి. Detroit, MI - U.S.A. 25-6-2001 - హరిత III. ముక్తధాత్రి అనలతోరణం ఈ గాలిలో అణువణువులో అమర్ ఈ భూమిలో కణ కణంలో సోనార్
I. 1. సాగివచ్చే నీడలు బంగ్లా స్వరారకం బంగ్లా శక్తి నాదం దేహంలో ప్రవహించే రక్త ధునీ తతుల వలె మహానదులు ఉపనదులూ అయినా ప్రజ దరిద్ర శప్తం స్వేచ్ఛావాయువును గదిలో బంధింప గోరే
స్వాతంత్రా కాంక్షను చీకటిలో దాచగోరే ఎవరు వారు? విష కాలా కాలాహులు సమర భావ రూషితులూ! ఏక దేశ సోదరులా? కాలాహి విహారంలో కుటిల నీతి కరాళ గతికి ప్రాణాలరచేతుల్లో బంధించి భయంతో పరుగెత్తే వీరెవరీ పరిశుష్కిత రూపులు మరెవరీ శోకతపు లు? అన్నార్తులు! కాదు! కాదు! పంగ్వంధులు కాదు! కాదు! అంతకంటె భిక్షువులూ ధన మానం కొల్లబోయి మిగిలి ఒకే ఒక ప్రాణం పక్షుల వలె ఎగిరి ఎగిరి పరదేశ మతిక్రమించేరు సీమ దాటి ఆకులవలె దొరలి దొరలి పోయేరు వేల వేల సూర్యులు వెలిగి వెలిగి ఆరినట్లు కోటి కోటి చంద్రులు వెలిగి వెలిగి మాసినట్లు మానవ మహాశోకం ముద్ద కట్టినట్టి విధం యుగాల నుండి వచ్చే సంస్కారం భగ్నమై నియంతృత్వ పవనంతో జ్వలించే శ్మశానమై భుగ్నభావ లసిత క్షణం, స్వాతంత్య్రశయ చరణం. పోరాడే వెలుగుతో పాలువోక తారాడే నీ సమయం ఈ శ్మశాన వాటికలో చూచేమా పచ్చదనం? అవునీ మంటలే ఇస్తాయి మహోత్సాహం దురూహ ననుసరించి సాగే దుష్క్రియా పర్యవసానం ఏ భుజ పీఠం వహిస్తుంది? ఏ ఋజు లోకం సహిస్తుంది.- సాంధ్యవేళ నీడలపై ఉదయం కోరే వెలుగులు ఎదురెదురై క్రమ్ముకొనీ పందిరి వలె నిల్చాయి. గుట్ట కొకరు పుట్టకొకరు చెదిరిన సామాన్యులు చీకటి గుహలో బంధితులై జన గణ ప్రతినిధులూ
I. 2. ఆశాస్నేహంతో కిటికీ నుండి చూచి వెలుగు ప్రక్కకు పోతూంది నాలుక దాకా వచ్చిన ఊహలు మాయమై అంతలో ఎదలో వేదనతో జ్వాలలై ఎగసేను ప్రతిక్రియ చూపేను జరిగే విషాద ఘటనల్ని గాలి గొంతెత్తి వినిపిస్తూంది ప్రతి నది ఘోషిస్తోంది వింతగా. అంతా చరిత్రలో భాగమే.
ఎవరికీ అర్థం కావడం లేదు, అంతా భద్రమే నన్నట్లుంది విలపించే ఈ ఖండం విరుచుక పడిన సముద్రం ఇదీ నాటిది కాదు! సమాప్తి కర్మ సాక్షికే తెలుసు! నక్కలూ సింహాలూ పులులూ జనపదాల్లోకి చేరాయి అనుమానం కాదు! ప్రజల్ని అడవుల్లోకి తరుముతున్నాయి చెట్లూ కొండలు సైతం, కోప కుటిల భ్రుకుటులయ్యాయి. ఇది మానవులేలే రాజ్యం వలె లేదు. ఇక్కడ చిర సమార్జిత సంస్కారం సమాధి పొందింది ప్రతి నిమిషం ఇక్కడ చీకటిలో తిరిగే అగ్నిగోళం వలె ఉంది ధ్వనీ నిశ్శబ్దాల మధ్య సూటిగా లేచిన పొగ నిరంకుశ చర్యకు చిత్ర రూపమిస్తోంది. బ్రతుకుపై ఎంతెంతో ఆశా స్నేహంతో ప్రాణం ఆరడానికి మనిషి ఏ వత్తీ కాదు రాత్రి హిమశిలల వలె బిగిసింది. ఊహలు కత్తులవలె నిలిచాయి ఈ తీరు చూస్తే బ్రతుకు పరమార్థమంతా యుద్ధమే నన్నట్లుంది.
I. 3. అనల పద్మం స్వేచ్ఛా మానవ మూర్తి వెనక జన సందోహం చూపులు దిగుతున్నాయి దిశల్లోకి బాకులవలె నిశ్శబ్దం బరువుగా వాలింది నిశ్చలంగా నిలిచింది బూట్ల చప్పుడుకూ, బులెట్ల ధ్వనులకూ, నిశ్శబ్దం ఎక్కడికక్కడే సె సులుగా తెగిపోతూంది. పక్షులరుస్తున్నాయి, ఏదో పసిగట్టినట్లుగా కదలిక లేనట్లుంది, ప్రాణం మాత్రం ఉంది ఊహ ఆడుతూన్నట్లు లేదు, మతి ధృతి నిలిచే ఉంది. ఇది మూర్ఛాసమంగా ఉంది అందరూ రాళ్ళేనా? కాకపోతే యంత్రాలా? శరీరం రాయైందా? ఊహ కూడా రాయేనా? సైనికుల కొక్క ఇనుప చక్ర సంచలనం తప్ప ఏ మృదులమైన అనుభూతీ ఉన్నట్లు లేదు. అంతటా మెరపులే! పిడుగులే మొగిళ్ళు ఎక్కడ? మొగిలు లేదు! ఉంది మృగతృష్ణ అంతటా చెట్లపై నిలకడ ఎరగని పక్షులరుస్తూనే ఉన్నాయి
ఆ మూర్తిలో ఉలుకు లేదు! పలుకు లేదు! ప్రక్కకు తిరిగాడు కన్నీటి చుక్కలు రాలాయి! అగ్నికి రాళ్ళు స్పందించాయి భూమి లావా అయింది! రోదసి ఆరుణిమవహించింది. ఎవరతడు? విప్లవ సంకేతం స్వేచ్ఛకు చిహ్నం. నెత్తురు మడుగులో విరిసిన అనల పద్మం!
I. 4. పేరు విప్లవం, ఊరు స్వాతంత్య్రం నర రూప విశేషాలు మనుషుల్ని వెంటాడేను. రక్షోభావ కృత్యాలు మనసుల్ని భయపెట్టేను ఎప్పుడో కావలసిందిపుడు మొదలైనట్లుంది. ఒక మహా మతం పేరిట పీడ కల నర్తిస్తూంది. రాత్రి సరసిలో చుక్కలవలె నిదురపోతున్నారు ప్రశాంత పద్మపత్రాలపై మెషిన్ గన్ ప్రేలింది- బరువుగా కదిలే క్షణం ఒక్కమారు వేగం అందుకుంది ముజీబ్ ! బయటికి వచ్చాడు మృత్యుంజయుని వలె. సైనికుల చేతుల్లో రైఫిళ ్ళ మెషిన్ గన్లూ కళ్ళముందు మృత్యువై ఊయల వలె ఊగాయి దీపం వలె మౌనంగా ముందుకు నడిచాడు తుపాను ముందు ఘడియవలె వాతావరణం స్తంభించింది ఎత్తిన కత్తిలా నిలిచిన నిశీధి ముఖం నుండి నెత్తురు చుక్కల వలె క్షణాలు జారుతున్నాయి. అతని కళ్ళ ముందు కపోతాలు శ్రేణులుగా సాగి సైనికుల శిరస్త్రాణాలపై ఆయుధాల మొనలపై క్షణం నిలిచి నిలిచి ఆగి ఆగి పై పైపైకి ఎగసి పోయేను. "ఎర్రని కళ్ళతో అతడు ఆకుపచ్చని పిట్టగా" మారాడు. చీకటిలో దీపశిఖ ఎడారిలో సరస్సు దైన్యంలో వసంతం! అతడే బంగ్లా నేత. ఏ నీడ కూడా తొంగి చూడలేని గడిలో మసిపూసిన అద్దాల గదిలో బంధించారు. ఈ సమయం పిచ్చెక్కినట్లు వీచే తుపానులో ఒడ్డును కోస్తూ పొరలే నదిలో పయనించే నావ నుండి నాయకుడు జారిపోయినట్లుంది. వత్తులు వణుకుతున్నాయి గాలికి విపరీతంగా
ఒక్కొక్క క్షణం మునివ్రేళ్ళపై నిలిచి కదలిపోతూంది సెలయేళ్ళు రక్తంతో నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. గజిబిజిగా అల్లుకున్న అబద్ధాల కుతంత్రాల్లో స్వేచ్ఛా భావన అణగేనా? స్వాతంత్రానలం ఆరేనా? తుపాను శమిస్తుందనీ నాయకుడు తిరిగి వస్తాడనీ ప్రాణాలుగ్గబట్టుకొనీ ప్రయాణికులు సాగుతున్నారు ఏ స్థితిలో అయినా! దేనికైనా ఉద్ధృతి ఎంతసేపు? బలాత్కార శమనంపై ప్రజల విజయంపై ఆశ సహజం! దిక్కులు మంచుతో ఏడుస్తున్నట్లుంది. ప్రజలు అతనికై ఎదురుచూస్తునన్నారు. అతని స్వరం వినబడుతూనే ఉంది లోలోన మ్రోగే ప్రబోధ తరంగంతో ఇంతటి భీభత్సంలోను భవిష్యత్తు ఆశా శిల్పమై పశ్చిమ వలయంలో స్వేచ్ఛాబింబం మెరుస్తూనే ఉంది. అతని నందుకునేందుకు ఎగసేను వాచాపారావతాలు అతని చుట్టుకునేందుకు తరలేను ఊహా జలధరాలు. జనంలో నిలిచింది అతని పేరు - విప్లవం. అవనిపై వెలసింది! అతని ఊరు స్వాతంత్య్రం. -
II. 1. జ్వాలా తరంగాలు తూర్పు మేల్కొంది గుహనుండి సింహం వలె బోర్ల పడిన చీకటి తల యెత్త జూస్తూంది రాత్రి గన్న పీడకలలు ఆశ్చర్యంగా కళ్ళ ముందు తారాడేను పూల వనమంతా జ్వాలలు చిమ్ముతున్నాయి జలధిపై పక్షుల వలె ఊహలు కదలుతున్నాయి ఒంటరి ప్రజ చుట్టూ చీకటి క్రమ్మింది బ్రతుకులో సుఖ సంతోషాల్ని ఎప్పుడో మరచారు జ్ఞాపకముంది ఒక్కటే ఈ రోజెట్లా గడుస్తుందన్నదే ఒక రోజు కోసం మరో రోజు ఆగదు. పక్షులు వగతో కొమ్మల్లో ఆకుల్లో ముఖాలు దాచుకున్నాయి నింగిలో మొగిలు కోసం చాతకం వేచి ఉన్నట్లుందీ స్థితి ఎడారి ఎదలతో తిరుగుతున్నారు ప్రజలు
గోడల మధ్య నీడల వలె భయకంపితులై వసించేరు. ఏడ్చి ఏడ్చి దేహం మొద్దుబారి శిలా సదృశమైంది కళ్ళు అనల శైల శృంగాల వలె ఉన్నాయి ఇప్పుడు కన్నీటి చుక్కలు జారవు కాని నిప్పురవ్వల్ని చెరగి పోయొచ్చు.-
II. 2. జ్వాలా చలనం ఉదయం లేచి చూస్తే మంచు వెనక అగ్నిశిఖలు మంచు కరుగుతూంది, ఆపై పచ్చదనం దగ్ధమవుతూంది ఒక్కొక్కచోట కొండలే కొండలు! నదులే నదులు! పైన పిట్ట ఆడదు, క్రింద మనిషి పొడ కన్పించదు మతం రాజ్యానికి పరమ మంటూ గతం జీవితానికి భాగ్యమంటూ గడచాయి ఇరవైనాలుగు వత్సరాలు కరువూ కాటకం కన్నా హీనంగా ఈ ఖండం చరిత్ర పుటలు త్రిప్పితే ఏముంది? అంతా బ్లాంక్! అక్కడక్కడా పొసగని మాటలూ! అంతా హాలో! అవీ కొట్టేసిన ఎరుపు గీతలూ! ఈ వలయం పాలించే నియంతకెంత తృప్తి? అంతటా శాంతి! సమాధిలో ఉండే రీతి కళ్ళు మూసుకుంటే ఆగిపోదు జ్వాలా చలనం. పిచ్చి చూపుల్లో అందాలు వర్ణించేవారుంటే వ్యర్థమైన వ్యవహారంలో రాజనీతి లెక్కించే వారుంటే ఆడకేం? సాగకేం? ఈ సైనిక నియంతృత్వం ఆట! వాస్తవికతకు అట్టడుగున ఆదర్శాలకు దూరంగా సమాధుల్లో సంచరించే ఆత్మలు గల పాలకులూ నవ్వులోను కోపంలోనూ ఒకే భావ మహంకారం తాండవించే చర్యలతో, కొమ్ములతో గిట్టలతో నేల చిమ్మి నింగి పొంగి బరి తెగిన అహంయువులు! నిరాయుధులపై నిస్సహాయులపై విరుచుకపడే కాళరాత్రి వలె సైనిక బృందం! వీరిలో ఓ క్షణమైనా వెలుగు మొలక కన్పించేనా? వీరికై మోకాళ్ళపై ఆ దేవుని ప్రార్థించే క్షమాగుణ క్షణాలు తప్పక ఆగమిస్తాయి!
అహం నుండి ఎగసీ కొండవలె నిలిచిందీ, ఎంత కదలని మొద్దెనా అంతంలేంది కాదీ సమయం కొండపై పూల తీవెలు వచ్చేనా? చుక్కలంటే ఆశలు మెరసేనా? ఏ గుట్టల వెనకో, ఏ రాళ్ళ చాటునో దాగిపోతాయి పిట్టలు ఏ గాలి తరంగాల్లోనో ఒదిగిపోతుంది స్వరం! కలల దారుల్లో అంతలో విరిగిన రంగుల బొమ్మలతో మనసు వీథుల్లో వరసగా ఆరిన వివేక శిఖలతో నియంతృత్వ వ్యూహంలో భగ్నమైంది జీవిత శిల్పం నదీ తరంగాల్లో ధ్వనిస్తూంది సుళ్ళుగా విషాదం. అందరికీ తెలుసు ఈ స్వప్నం అబద్ధమనీ అయినా చూపు అటే! ఇదీ! బ్రతుకులో భాగమేగా ఒక్క సాయం సమయంతో గ్రంథం అధ్యాయం ముగియదు ఒక్క ఉదయ రేఖలతో జీవితం ఆకృతి దిద్దుకోదు పరివర్తనకై సమరం తప్పని దేశ చరిత్రలో రక్షస్స్వభావం స్ఫులింగమై శాంతి ముఖం జేవురించింది. విప్లవ శక్తి తలెత్తింది ఇపుడు అగ్ని కిరీటం ధరించింది.
II. 3. మంటల మాటలు అలజడి హఠాత్తుగా! పిడుగులు దొర్లినటె ంది శూన్య గృహ ప్రాంగణంలో కళ్ళ కెదురుగా వెనుక్కు విరిచి కట్టిన రెక్కలతో భర్త నిల్వునా నీరై నిలుచున్న కొడుకూ, పిల్లలూ బంధువుల విషాద స్మృతులు తడుతూన్నవి ఎద తలుపులు అంతలో వికృత శబ్దం! అనుసరించి విలాప ధ్వని! వికృతశబ్దం! వీటి మధ్య నిశ్శబ్దం సెలయేరు వలె సరిస్తూంది నిశ్శబ్దాన్ని రగిలిస్తూ మండిస్తూ జ్వాలా సంగీతం అందుకుంది! ఇంట్లో గబ్బిలం మూల నుండి మూలకెగిరింది భార్య కళ్ళలో పట్టపగలు చీకటి విరబూసింది క్షణం చకితమై, కళ్ళు మూత పడినాయి కాలం ఆగింది! హృదయం మంచు శిల అయింది. ఇక్కడి బరువుల్నీ బాధల్నీ ఏ బండీ మోయలేదు ఇప్పటి అన్యాయాల్ని అవమానాల్నీ ఏ క్షితిజం భరించలేదు-
ఇక్కడి తోటలో గాలి సుళ్ళు తిరిగి విలపిస్తూంది పూల పాటలు కాదు! ఇవి చావు పాటలూ! మాటలూ! తమశ్చక్రాలపై కదలే విషమ క్షణాల సంపుటితో చరిత్ర మనిషి భవిష్యత్తును పరీక్షకు నిలుపుతూంది శతాబ్దాల సంస్కృతి రగిలి భగ్గుమంటూంది మంటలు పాడే సంగీతం మనసును చీలుస్తూంది. నిదుర పాలించే జగత్తులో, నిశ్శబ్దం శాసించే వేళలో అభద్రంగా వినిపించే జ్వాలావిల తరంగాలకు ధగధగలాడుతూంది శరీరం, విలవిలలాడుతూంది ప్రాణం గాలులు వీస్తున్నాయి మెలికలుగా మలకలుగా సూటిగా భయంకర వార్తలు మోస్తున్నాయి మంటగా కసిగా పక్షి నడిగితే తపతప రెక్కలారుస్తూ పోతుంది నదినడిగితే బిలబిల అలలు విదిలిస్తూ పోతుంది మ్రోడై శిలయై దుస్థితిలో నిలిచిన వాణ్ణి! మరచీ మనిషిని అడక్కు మతిపోతుంది. మంచి చుట్టుకొని చెడూ, చెడు నంటుకొనీ మంచీ పొరలుగా వలయాలుగా, విడదీయరాని బ్రతుకులతో పొర లొలుచుకుంటూ వలయాలు దాటుతూ గమించేరు ప్రజలు మేఘం మంచిదే, పిడుగు చెడ్డదా? వర్షం మంచిదే వరద చెడ్డదా? స్వాతంత్ర్యం కోసం ఉద్యమం అవసరమౌతుంది ఉద్యమంతో బాధలు మహాగ్ని సదృశమౌతాయి! కూర్చొన్న ఆలోచనతో ఆదర్శం విజయం పొందదు ఆచరణ గమనంతోనే తెలుస్తుంది పర్యవసానం. చంపేరు, చనిపోయేరు మంటలై ఎవరి కొరకు? రాసులుగా పుర్రెలు, వాకలుగా కన్నీరూ నెత్తురూ! పేకముక్కల్ని కలిపేసి వెదజల్లినట్లుంది ఢాకా ఎవరీ రాజ్య నియంత? ఎవరీ జన వ్యవహర్త? పాన్ షాప్ వ్యాపారి నుండి పాఠాలు చెప్పే గురువుదాకా అంతా ద్రోహులే! శిశువు నుండి వృద్ధుల వరకూ. మెషిన్ గన్ ధ్వనుల్లో సంగీతం వినిపించేరా? సైనిక పద ఘట్టనలో మృదంగం మ్రోగించేరా? బాంబుల వర్షంతో శాంతిని పండించేరా? అహం బలం ఘర్షణతో మనిషిని రక్షించేరా? ఎవరి ప్రపంచం వారికి ప్రియాతిప్రియం అయినా
ఎవరి ఊహ వారికి సత్యం పరమ సత్యం అయినా సమరస భావంతో మనవలసిన యుగంలో పైశాచిక కృత్యాలు, మారణ పథ వ్యూహాలూ! నియంతృత్వ గతికీ ప్రజాస్వామ్య రీతికీ
ఈ
సమయం
పోరాటం
కిర్మీరం - మనోఫూమికలో
అనివార్యమౌతూంది
లౌకిక శక్తులతో అనురాగ బంధంతో ఈ నేలపై సమ సమాజం పల్లవితం కావాలి.
II. 4. అమానుషం తండ్రికి బయటికి లాగి సైనికులు కాల్చేయడం యువకుడు కళ్ళప్పగించి చూస్తూ నిల్చున్నాడు ముఖం జేవురించింది, కళ్ళ నుండి నిప్పులు రాలాయి ఒక రెప్పపాటు కళ్ళు మూతలు పడ్డాయి, చీకట్లో ఊహ మెరిసింది ఒక ఊపున పరుగు తీసాడు అడవిలోకో కొండలోకో తెలీదు జయ గభీర నినాదంతో సోనార్ కంటబడేనా? జనస్వామ్య వాహినీ తరంగమై పితౄణం తీర్చేనా? హంతకుని ముఖం అద్దంలో ప్రతిబింబిస్తూంది రాయి విసరితే అద్దం ముక్కలౌతుంది, శత్రుముఖం అందని స్థితిలో ఉంది. తాడు విసరి మెడకు ఉరివేయాలిసిందే. నఖ శిఖ పర్యంతం శక్తిలోనూ లిప్త లిప్త శాంతి కోరినా స్వేచ్ఛా స్వాతంత్ర్యంకై ఉద్యమ చరిత్రలో వీరం తప్పదు. భీభత్స పథంలో హృదయం శాంతి కోరినా గాలి ఎక్కడి దక్కడే స్తంభించినట్లుంది చావూ, యుద్ధం తప్పవు ప్రజల బ్రతుకులో.- పిచ్చి వాన కురిసేనా? జల ప్రళయం వచ్చేనా? గ్రీష్మం వాలకం చూస్తే చూడాలిసిందెంతో ఉందనిపిస్తుంది భవిష్యత్తు అగమ్యగోచరం వర్తమానం చెప్పరాని కల్లోలం నదీ జల సమార్ధమైన ఈ భూమి వేడి గాలిలో మండుతోంది ఎక్కడ చూచేనా ప్రశ్నలే! ఎవరది? ఎందుకీ మారణ వ్యూహం! కిటికీ తలుపు తెరిస్తే భయం! ఎపుడు బులెట్ దూసుకపోతుందో బయటి కడుగేస్తే అనుమానం! ఎవడు కళ్ళు కప్పి తరలించేనో నిలువునా కాలుతున్నాయి నివాసాలు దేవుడేమైందీ తెలీదు
నేలకొరిగిపోతున్నాయి శరీరాలు, రాత్రి కాదు పట్టపగలే. శవాలు! రాబందులు! సైనికుల ‘మార్్చ' ఘన శబ్దం నరులు కాదు దానవులు, సైనికులు కాదు వానరులు నాల్క ఉందీ మాట్లాడేందుకు, వాక్కు ఉందీ ఊహ చెప్పడానికీ జనం నాల్క కదలడం లేదు, వాక్కు పెకలడం లేదు. జాతిని సంరక్షించే పేరిట జరిగే ఘోర కృత్యాల్లో మిగిలింది జనం పైబడి విరుచుక తినడమొక్కటే అపుడపుడూ చూస్తూ ఉంటాం! పురాణేతిహాసాల్లో విన్నాం ఇవి చెట్లపై ఉండేవనీ అడవుల్లో తిరిగేవనీ వెక్కిరింపు చేష్టలతో కక్కసింపు మాటలతో ఎండిన ఆకులతో ఇది! అకాలంలో గ్రీష్మం అహో! ఈ వానర నృత్యానికీ కాలం వసంతమైంది. గడ్డకట్టిన సమయ శిఖరంపై వానర గణాలు కూర్చున్నాయి మాటకూ పాటకూ కరిగిపోయే విధం కాదు అదలింపుకూ బెదరింపుకో కదలిపోయే రకం కాదు మెడ పట్టుక వ్రేలాడతాయి ఎద పగిల్చి మూచూస్తాయి నెత్తురు మంటలపై అలలై గంతులు వేస్తాయి. తమశ్చక్ర వలయం వలె క్రమ్మింది చమూ సమూహం నిప్పులు చిమ్మే ధ్వనులతో రక్తం ఒలికే రూపాలతో అహంక్రియా రేఖలతో వానర గణ సంచారంతో చూస్తే గాని నమ్మలేని చిత్ర పటం వలె ఉందీ స్థితి. అగ్నిలో వేగి వేగి ఎద ఒక శీతల వాక్కుకై చీకటిలో తడబడుతూ చేయి చాచి ఊతకై ఎవరో ఆపు నికై వేచి కళ్ళు కాయలు కాచి పలికే శబ్దానికి సమాధానం ప్రతిధ్వని వింటూ గడిపేరు విషలిప్తలు! ప్రజ లిక్కడ శపు లు. గుట్టల చాటుగా చెట్ల మాటుగా స్త్రీలు పురుషులు పిల్లలు మోయలేని భారంతో వంగి క్రుంగి మూకలుగా అరచేతుల్లో ప్రాణాలతో బయటపడితే చాలునన్న భయ భ్రాంతి భ్రమణంతో! ఎటు చూచినా దిగంతం వీరి కథ ఎవరు వినేరు? చెట్టూ గుట్టా? తప్ప శూన్యమైన ముఖాల్లో నిగురు కప్పిన నిప్పుంది అందరి పెదవులపై నిశ్శబ్దం! అయినా ఎదలో ఆశ ఎవరో త్వరలో వచ్చేరనీ, బ్రతుకుల్ని ఉద్ధరించేరనీ
సూర్య కిరణ పంక్తికి చంద్రుడు ప్రకాశించినట్లు వస్తుందీ ఖండానికి భవిష్యత్తూ శుక్లపక్ష భాసురంగా కోట్లాది శోకార్తుల ఊహకు కల్పనగా. ఆశకు ప్రతిబింబంగా, తరలింది ముక్తవాహిని విప్ల నవ తేజంతో నటదగ్ని తరంగధుని. భారత రాజనీతిలో భాగమైన బంగ్లా ముక్తి వాహిని పాక్ సేనపై విలయోద్దతి విరుచుకపడింది
III. విలయ చక్రం
నెత్తురుతో మంచు సోనలు సనసన్నగా సరిస్తున్నాయి నేలపై గంగా పద్మా బ్రహ్మపుత్ర జలాల్లోకీ గ్రీష్మం నుండి మొదలై శిశిరం వరకూ సాగిన అగ్నిశిఖా విలసనానికి రాత్రీ పగలూ భేదం లేకుండా కమరిన ప్రాణాలు కొన ఊపిరితో స్పందిస్తూన్నాయి. యుద్ధచ్ఛాయ క్రమ్మిన వాతావరణం పీడకల వలలో చిక్కిన ఒంటరి మనస్సుతో ఉంది.- గ్రీష్మంలో వీచే చెంపపెట్టు వడ గాడ్పుల వలె నియంతల సిగ్గుమాలిన చేతలు మనసుని వాయిస్తున్నాయి ఏ దిక్కులు వినేను ఏడ్పులు? ఏ నక్షత్రాలు కనేను చూపులు! జలధారకు మొగం వాచి భూమి దప్పిక గొని ఉంది మొగాన నిప్పులు విదిలిస్తూ కాలం రక్తధార చిలుకుతూంది భగవంతుడు చాచిన ఛాయా హస్తాలు అక్కడక్కడా మానవతా సంకేతాలు మిగిలాయి వీటిని దగ్ధం చేసే ఈహలతో నియంత జ్వాలా హస్తాలు చాచేను, ధూమశిఖలు విసిరేను. చండంగా తాండవించేను! పాపం తెలీదు రానున్న పరివర్తనం. రాత్రి తరవాత రాత్రి ఏకాంతంలోకి పోతూంది బ్రతుకు వెంట బ్రతుకు ధూళి కణాల్లో కలుస్తూంది జన హత్యా పైశాచికం అందరికీ తెలిసిన రహస్యం శాంతి భద్రత పేరిట దాచేందుకు సకల వికల యత్నం. ఆటవిక రంగంపై కిరాతకం నృత్యం చేస్తూంది అలసిన హృదయం నిశ్శబ్దంగా వాలిపోతూంది.
పిడికిట దాగిన రహస్యంతో కళ్ళలో వెలిగే వత్తులతో ప్రజలు నక్కి నక్కి కదలేరు! ఏమైనా ఆగనిదీ సంరంభం ఎంతటి గ్రీష్మంలోనూ వటవృక్షం చావదు ఎంతటి ఇసుకలోనూ జీవనది ఇంకదు. బాంబులు అరుస్తున్నాయి రైఫిళ్ళు మాట్లాడుతున్నాయి టాంకులు ఉదోషిస్తున్నాయి విమానాలు ఆలాపిస్తున్నాయి నీడల వలె శరీరాలు ఎక్కడబడితే అక్కడ భయంకరంగా మృత్యు రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి శవాల్ని శ్మశానానికి చేర్చే ప్రసక్తి పట్టనట్లుంది. ఇక జీవితాల్ని గురించి ఆలోచన ఎక్కడిది? ఆకులు కప్పిన ముఖాలతో మట్టిలో మాసిపోవలసిందే! చెట్టుకీ ఇంటికీ మనిషికీ మధ్య! కదలే మంటల పొగల తెరలు హిమశిలవలె గడ్డ కట్టింది సమయం! ఇది కరిగితే తప్ప జీవన గమనం లేదు! కళ్ళలో ప్రాణాలతో బంధువులూ మిత్రులూ పొలిమేరలు దాటి పోయేవారు పోగా శవాలుగా మారీ కాల్చబడీ భగభగమండే నిప్పు! సైనికుల కళ్ళను ధగధగలాడిస్తూంది యుద్ధం కల్లోల సముద్రమై పొంగుతూంది జాతి జీవిత నౌక ఎగసే అలలపై భ్రమిస్తూంది ప్రతి వ్యక్తీ కర్ణధారి! భవిష్య ఫలానికి సంకేతం క్షణాలు చరిత్రకు మలుపు తెచ్చే వేగంలో ఉన్నాయి స్వేచ్ఛా తరంగాలపై విహరించే నవోహలతో ఇనుప పంజరం నుండి స్వర్ణ హంసలు ముక్తికై యోచిస్తున్నాయి. ఆత్మలు మేల్కొనే ఉన్నాయి, శరీరాలున్నా లేనట్లే! అనలం వలె కదలే కావ్య మహారూపం అందుకుంది స్వేచ్ఛా కవితా చైతన్యం. III .
III. 2. నిశ్శబ్దం బ్రద్దలౌతుంది రాకెట్ల ధ్వనికి నిశ్శబ్దం బ్రద్దలై ముక్కలై పడిపోతూంది వెలుగు పోరాడుతూంది ముసురు పట్టిన చీకటితో
తలుపుల్లేని జైల్లో పిచ్చివాండ్ల వలె హంతకుల వలె దేశభక్తులు పాలకుల కఠోర దృష్టిలో ఈదరాని కల్లోల సముద్రాలు. ఒకదానినొకటి హత్తుకొని వరసగా క్షితిజంలో మంటల పొగల ఆర్చీలు లేచాయి సైనికుల సంచలనంతో నగరం సాంద్రమైన భయ లయలో ఊగుతోంది యుద్ధ దాహక చరణ ప్రమాదం హఠాత్తుగా నాటకంలో ప్రతి నాయకునిపై విరుచుకపడింది, చీకటిలో ఏదో పసిగట్టీ నీడలు గప్చుప్ గా పడి ఉన్నాయి విపత్తులో కలత చెంది వాతావరణం కలవరిస్తోంది చివరి దశలో వత్తి వలె ప్రభుత్వం భగ్గున మండుతూంది.- సమీపిస్తున్న రాత్రికి ముందు వాలే చెట్ల నీడలతో చెరువు నీటి అద్దం వలె ఉందీ దేశం రేడియో వినిపిస్తోంది, పౌరులకు హెచ్చరిక “సైరన్ మ్రోతతో స్వయంరక్షణకు సిద్ధం కండి, పిల్లల్నీ వృద్ధుల్నీ అస్వస్థుల్నీ వదిలేయండి”. శత్రువులు రాకెట్లు విసరేరు, రాత్రులు బాంబులు వేసేరు సాతంకంగా బయటికి వచ్చేసి నేలపై బోర్లగిల వాలిపోయి చెవులో దూది పెట్టుకొనీ చేతులతో ముఖం కప్పుకొనీ ఆలె యర్ సైరన్ మ్రోగే వరకూ లేచే పనిలేదు. వెచ్చని స్త్రీ కౌగిలిలో ఒదిగీ టె న్సెస్లో ఉన్న సైనికులకీ ప్రళయ వార్త వినిపించిందో? లేదో? రాత్రి పార్టీలో ఎంత తిని తాగిందీ అంచనాల్లో హోస్్ట లుబ్ధత్వం స్మరిస్తూ నవ్వుతూ చిద్రుపలు చిద్రుపలుగా క్లబ్బుల్లో కబుర్లాడే ఆఫీసర్లకీ వార్త అందిందో లేదో? మండే గ్రీష్మంలోనూ ఎక్కడో? ఉదయమో సాయమో? పూలు పూయకపోవు ఇంతటి నిరాశా చక్రంలోనూ ఒకటి రెండు తేజో లతికలుండకపోవు ఇపుడుంది నిదురకాదు, నిదుర వంటి స్థితి కలకాదు కల వంటి నీడల భ్రమావరణం కళ్ళ చివర విషసర్పాలు బుసకొట్టే సైనికులకు ఎదురుగా ఉందొకటే చకిత వ్యూహంలో శత్రువు నుండి మృత్యువు! చీకటిలో ఢాకా!
సగం నిద్రలో హఠాత్తుగా మేల్కొన్న పర్వతంవలె ఉంది పెను తుపానులో ఊగే కొమ్మ చివర వ్రేలాడే పక్షివలె ఉంది లైట్లు ఆరిన భీ నీడల గదిలో రాత్రి ముసుగులో ఏడ్చి ఏడ్చి స్రుక్కి నేలపై వాలిపోయిన స్త్రీవలె ఉంది. మెలకువ పూర్తిగా కలిగేనా? ఊపిరి నిండుగా తీసేనా? గండం నుండి బయట పడి శాంతి పొందేనా? ప్రతి రాజకీయ మతిలో ఈ స్థితిలో విచికిత్స సహజం ఇనుప కమ్ముల వంటి క్షణాల్లో నిలిచి ఉందీ ప్రజ తాళం వేయబడింది. ఎవరూ బయట పడేట్టు లేదు. తాళం చెవి ఎక్కడో దూర దేశంలో ఉంది తాళం పగులగొట్టే సాహసమే ఈ ఉద్యమం. రాత్రి గడచీ దుఃఖం అంతరించీ తొలి ప్రొద్దు చూడాలిసి ఉంది మంచు తొలగీ అద్దాలు బ్రద్దలై బంధన నుండి బయటపడాలిసి ఉంది నరకంలోనూ లేకపోలేదెక్కడో కించిత్ అనుకూలం ఆనందం అయినా నరకం నరకమే! అదే ఈ బంధనం! త్యాగం శ్రమ సాధన ఫలితం బంగ్లాదేశ్ రానున్న స్వాతంత్ర్యానికి ప్రతిబింబం, స్వేచ్ఛారూపం. భయంతో తలుపులు బిగించుకున్నవారు వణకుతున్నారు. బ్లాంకెట్ కప్పుకున్నవారు ముడుచుక పడుకున్నారు కుంపటి ముందున్న వారు చలి గురించి ఆలోచిస్తున్నారు. భయంకరంగా తలెత్తిన అనల శిఖరాలపై నుండి జలధి వాహినీ తరంగాలు ఏకమై పదమెత్తాయి శక్తి ధురా త్యాగమతులు క్రాంతి పథ సూచికలు ప్రజాస్వామ్య పతాక క్రింద ఒకటై రూపొందేరు మానవ దుర్దశ తలచుకొని కళ్ళలో నీరు తిరిగేను బిందు బిందువులో విద్యుత్తు మనస్సుకు చైతన్యం ఇచ్చేను ఈ రోజు వచ్చిందెప్పటివలెనే, చలి వెనక్కు అడుగేసింది యుద్ధ చిత్ర పరంపర మధ్య సూర్యుడు వెలుగుతున్నాడు. కళ్ళు తెరిస్తే చూపుల్లో మంటలు, పెదవి విప్పితే పలుకుల్లో మంటలు నెత్తురు అలల వెంట తలలెత్తి, చెంగుచెంగున దూకేను మంటలు ఎక్కడ చూచినా ఎరుపే పగలూ రాత్రీ కళ్ళల్లో సంజల వలె మంటలు! మంటలు ఎరుపులు! ఇప్పటి ప్రతి ఉదయం రక్త భావ సంకలితం ఇక్కడి ప్రతి హృదయం అగ్నిగోళ వర్తనం
దిక్కుల్లో ఎరుపు విరిగి, ఆశల్లో తెలుపు వచ్చి మనస్సు ప్రన్నని శాంతి పొందాలిసి ఉంది- రాక్షసి బొగ్గు గుండెలతో గుట్టల వలె సైనికులు నిప్పు రవ్వ పడితే ప్రళయోద్దతి అవుతుంది నీటి జల్లు కురిస్తే శరణాగతి అవుతుంది సముద్రం వేరు చేస్తుంది ఖండ ఖండాల్ని భూమి వేరు చేస్తుంది జల నిలయాల్ని రాజ్యంలో పాలనా సంస్కార హీన వర్తనం వాడి కత్తియై ప్రజల్ని ముక్కలు చేస్తుంది మొగిళ్ళు క్రమ్మిన ఆకాశం కుంభవృష్టికి సిద్ధంగా ఉంది కుంభవృష్టి ప్రళయానికీ నేల తట్టుకొని నిలిచేనా?
III. 3. కథ ఎదురు తిరిగింది మైదానంలో ఆటబంతి వలె పరుగెత్తి పరుగెత్తి కాలం ఆగినటె ంది. మౌనశిఖరం వలె మారుతూంది. కథ ఎదురు తిరిగింది, ఘోరంగా బెడిసి కొట్టింది ఊహింపరాని మార్పుతో చరిత్ర మలుపు తిరగబోతూంది. ఈ క్షణం పాద రస కణమై వేళ్ళకు చిక్కేట్లు లేదు దీన్ని చేతిలో వహించడానికి నేర్పు కావాలి. పట్టీ పట్టని మనస్తత్వం పోయింది దిక్కుల్లో మత్తు వదిలింది ప్రజల్లో సత్తువ వచ్చింది, చీకటి స్థితి తొలగింది ఢాకా సిటీ నుదుటిపై నెత్తు రుబికి బొప్పి కట్టింది సముద్రతీరం పగిలి ముక్కులైన అద్దం వలె ఉంది జలధి అంచుల దాకా అనల జ్వాల లలముకొని అదృష్టం దిగ్బంధితమైంది, ప్రాణం కంఠ గతమైంది ముఖం బిగిస్తే సరిపోదు తల వేడెక్కితే చాలదు విలయచక్రం శక్తిని మించిన విపత్తును తెచ్చింది నౌకల్లో విమానాల్లో హుటాహుటి వచ్చిన మృత్యు మూర్తులు పాపం! చేతులు కడుక్కోని ఏమీ ఎరగనట్లు నిల్చేరు. ఇపుడీ వీరులంతా శరణ్యులు శిఖరమూడిన పర్వాతాభులు బ్రతికి ఉన్న శవాలు : పాక్ పంపిన రణగ్రస్తులు, జనశపు లు నిన్న ప్రజల్ని వేటాడిన మృత్యువు నీడలు. శరీరాలు చీల్చి ఎముకలు మిగిల్చిన సేనలు
ఇపుడో బారులుగా నిల్చిన శిలా శ్రేణులు ఒక నేరం కప్పేయడానికెన్ని పన్నాగాలో! కొమ్మలెండిన చెట్ల వలె చేతులెత్తి నిల్చేరు శరణు పొందిన సన్నివేశం! రణచరిత్రకు శశికిరీటం నిన్నటి అగ్గి కొండలకు బదులు నేడు మంచు కొండలు! సైనికుల అడుగు జాడలు బంగ్లా నేలపై ఇసుకలో గ్రుచ్చిన కత్తుల మొనలవలె ఉన్నాయి గత చరిత్రను విశేష లిపిలో జ్ఞాపకం చేస్తున్నాయి ఈ జాతి జీవితంలో డిసెంబర్ పదహారో తేదీ అభినవ తేజంతో పొందిన పునర్జన్మకు సంకేతం. ఎంతలో గడచిపోయాయి విషమ ఘడియలు సమాజ చైతన్యంతో జనస్వామ్యం వికసించింది హృదయం మరచిన అనుభవాన్ని తిరిగి పొందింది బ్రతుకులో మాసిన పచ్చదనం మళ్లీ మెరసింది క్షితిజంలో నిశ్శబ్దం ఝణఝణ మ్రోగుతోంది అవనిపై నైశ్చల్యం గలగల కదలుతోంది ఊహలో మొలకెత్తిన కోరిక చివురించేను చూపులో మృదు తేజం స్వాగతం పలికేను వ్రేళ్ళపై నిలవలేకుండా గాలి పైపైకి త్రోసుకవస్తోంది అంతటా మానవతా ధుని! హత్తిన స్నేహ లహరి పర్వతంపై నుండి సముద్రంలో పడి మునిగీ సుడిగుండంలో చిక్కీ బయట పడినట్లుంది ప్రజ, ఉజ్వల స్వరంతో కాలం స్వేచ్ఛగా పాడుతోంది శరీర కణకణంలో స్వాతంత్య్ర దినం నర్తిస్తూంది.-
IV. 1. విజయ వర్షం రాత్రి వర్షం కురిసిందా? ధాత్రి హర్షం విరిసిందా? ఎన్నాళ్ళ కెంత హ్లాదం! బంగ్లా సేనల చలనంలో! దిక్చక్రం ఆశ్చర్యం పొందింది ఆనందం విషాదాన్ని మ్రింగింది. ఎంత బరువూ మనస్సుకు శ్రమ అనిపించడం లేదు. అమరుల కపాలాలు సంగీతం వినిపిస్తున్నాయి బ్రతికిన ఎదలో ఆశా జలదం ఊగుతోంది విముక్తగణ విభాతంలో దేశం మునిగి తేలుతూంది.
ఇనుప కవాటాలు బ్రద్దలై మహా రాక్షసం ఆట కట్టింది రక్త చిత్రాలకు బదులు పూల గుత్తులు వ్రేలాడుతున్నాయి కిటికీలు తెరచుకున్నాయి తలుపులు తెరచి ప్రజలు స్వేచ్ఛా సమీరాన్ని ఎద నిండుగా అనుభవిస్తున్నారు. మాతృభూమి మృత్సా గంధం ఘ్రాణ తర్పణంగా పీల్చేరు ద్వావా పృథివి ఆనంద వదనంతో మైదానం పరచుకొంది సంధ్యా ధరాలపై కోటి ఇంద్ర ధనుశ్చిత్రాలు నిండాయి. వర్షపు చినుకుల ఆనందబాష్పాలు! పూల జల్లుల జయోత్సాహం! ఉదయశిఖరంపై రవి సాక్షిగా బంగ్లాదేశ్ పతాక దేశభక్తుల త్యాగంతో గగన హృది రెపరెపలాడేను పాక్ సేనల లొంగుబాటుతో స్వప్నం నిజమైంది. స్వాతంత్ర్య మహానుభూతి జనశక్తిలో ఒకటైంది. మంచు సోనలు ముఖంలో తరలుతున్నాయి త్యాగచిత్రం కళ్లలో కదులుతూంది. ప్రభాత సరస్సులో శుభోదర్క పద్మం సరికొత్తగా అవతరించిన బంగ్లాదేశం ఎటు చూసినా అమృతవేళ! జలధి వాహినీ తరంగ హేల! బంధం ఉన్నంతవరకూ వీడదు ఈ మైత్రీ స్తబకం హంసలు ఎగురుతూన్నాయి కళ్ళలో వెలుగు టీరికలతో కాలం కదులుతూంది గగనాన చంద్రరేఖ వలె ఊహలు వెలుగుల్ని వర్తిస్తున్నాయి ఈహలు చీకట్లను వదలుతున్నాయి.
IV. 2. మరోచరిత్ర ఎరుపు తెచ్చుకున్న రెక్కలతో ఎంత దూరమెగరగలదు? సమభావం లేక పక్షి నేలపై కుప్పగా కూలింది ఒక చరిత్ర సమాప్తితో మరో చరిత్ర సమారంభం! ఒక దేశ వికార శకమంతరించింది. మరో దేశ రమణీయ రూప మందుకుంటూంది! ఈ గడ్డపై సమాజంలో శతశతాబ్దాలుంటుంది పరాభూత భగ్న ధగ్ధ జన వేదనా చిహ్నం శరీరం నగ్నమై ఎముకలు చూర్ణమై మిగిలిన ఆత్మ ఇపుడు శక్తి సంభరితమైంది ఇనుప చువ్వల రాతి పంజరంలో నుండి
సోనార్ గాలిలో చిలకలెగురుతూన్నాయి కట్టు కథల కట్లు విచ్చుకుని, ప్రియంగా బ్రతికేను భూమి ఆకాశం ఆలోచన అనుభవం అంతా కొత్తగా ఉంది. ఇంకా అక్కడక్కడా పాములు పొదల్లో దాగి ఉన్నాయి విషానలంతో బయటికొస్తే వాటికి వ్రాసిపెట్టే ఉంది. ఇపుడు ఏ దిశలో మంటలు లేవు! హాహాకారాలు లేవు ప్రతిచోటా వెలుగు! వెలుగు! వెలుగు! జయజయధ్వానం! శక్తి ఉంది రక్తి ఉంది. రక్షణకూ శిక్షణకూ రాక్షసరీతుల్ని సమూలంగా ఛేదిస్తూ మానవ సంస్కృతికి మనోహరాదర్శంగా, మతాతీత సమభావం స్పందించే జనస్వామ్యం! శత్రు గర్వమణగింది. ఎవరిపై కోపం లేదు. ఈ గడ్డ ఇపుడు శాంతి నికేతనమైంది మృత్యు హేతి ఎవరి మెడపై లేదు.
IV. 3. ప్రజాస్వామ్య చరణం వాస్తవమెరిగీ ఎరగనట్లు కళ్ళుమూసి పాలు త్రాగే పిల్లులూ మీ క ్ళపుడు మంటలకు బదులు కన్నీళ్ళతో నిండుతాయి? రావణు డంతమైనాడా? హిట్లర్ చనిపోయాడా?- హెలో! ఎప్పుడు? ఎక్కడో? చెప్పు! భౌతికంగానా? రావణుడూ హిట్లరూ ఉండనే ఉన్నారు! పురాభావంతో మన నీడ వెనకే దాగి దాగి ఉంటారు సమయం కోసం పొంచి పొంచి చూచేరు మెషిన్గాన్ ధ్వనితో మారణాస్త్ర ప్రభతో అహం బలం మౌర్జ్యం ముప్పిరిగొన్న తత్త్వంతో అందరికన్నా ముందుగా చరిత్రలో అడుగేయాలనే ప్రజలెందుకు బ్రతికున్నట్లు ఎవరి నడగాలిసిన ప్రశ్న? దిక్కులనా? దేవుణ్ణా? కాదు కాదు ప్రజలనే నీలి పండు నోట్లో వేసుకుంటే చేదు! విషం! ప్రాణభయం! ముందు గరళ కంఠులవాలి! ఆ తరువాయి చంద్రకిరీటత్వం! నిన్న శూన్య దృష్టులతో తొంగి తొంగి చూచినవారు నేడు వాసంత పూర్ణ చంద్రకాంతి నేత్రాలతో తిరిగేరు ఇన్నాళ్ళు దాగిన రహస్యం పటాపంచలై సత్యం మెరిసింది
ఎటు చూచినా కంటికి తృప్తిగా ఒకే ఒక కాంతి రూపం! అనల ధూమచ్ఛటలకు బదులు వెండి మంచుతో ఉదయం మారణాయుధ ధ్వనికి బదులు విజయేందిరా హర్షగీతం గతంలో లేచిన ధూళి కరుణాసేచనతో అణగింది మతం పేరిట మంటలు, సహన వర్షంతో ఆగాయి చల్లబడిన శ్మశాన తలంపై రాగ సృష్టి మొలకెత్తేను మానవతా సుందరమై సమతా కిర్మీరమై, ఎక్కడ చూచినా అద్దంలో వలె మానవ మహారూపమే సంస్కృతిలో దేశం దళమై కళయై, ప్రజాస్వామ్య రూపమై.
IV. 4. బంగ్లా నసీబ్ 4.won దేవుడున్నాడో లేడో గాని మానవుడు మాత్రం ఇక్కడ నలగీ కలగీ విశ్వ సంస్కృతీ వారసుడుగా దక్కాడు. చీకటి పుటలు చింపేసి వెలుగు నృత్యం చేస్తోంది ఇపుడు తెరచుకొంది స్వర్ణ బంగ్లా దేశ ద్వారం చరిత్రలో బింబించే త్యాగశక్తి రూపంతో సమాజ గమనం ఇపుడు క్రాంతి పథాన నడిచేను, తూర్పు దిశ ఎరుపుతో వెలుగు! వెలుగు! ఆకాశంలో, ఎరుపు నుండి తెలుపు పసుపు నేలపై అంతటా ఆకుపచ్చ రంగు! ఈ రాత్రి వ్యధలేని మహోదయమై మేల్కొంది కలకూ కోరికకూ, అంతం లేదు, కాని కల నిజమైంది! కోరిక పండింది. ఆనాడు భయంతో ఎగిరి దాగిన పక్షి! ఇదిగో! ఈనాడు స్వేచ్ఛగా వచ్చి భుజంపై వాలుతూంది, ముంజేయిని ముద్దు పెట్టుకుంటూంది. ముఖంలో తొంగి చూచి హృదయంలో దూకుతూంది మానవ బాధారుణ గాధామయ చరిత్రలో వికసించిన ప్రజా పద్మం! అమర్ సోనార్ వంగ దేశం! ఇది విప్లవ సంకల్పం ప్రజ పొందిన అమూల్య వజ్రం వంగ పిత షేక్ ముజీబ్ ముక్త ధాత్రి బంగ్లా నసీబ్ ఏవీ! ఆ మాటలు ఎదలో మ్రోగుతూన్నాయి
సింహాల వలె దూకేవీ! హంసల వలె ఎగిరేవీ! “దీన అమి, రిక్త అమి, దెవర్ కిచునై ఆచె సిధు, భల బష దిలమ్, సుదుతై” అనుబంధం ఈనాటి ముజీబ్ హత్య రక్తంతో దూకిన స్వప్నం ఆనాటి ముజీబ్ విజయం రక్తంలో విరిసిన పద్మం ఇది కరాళ సమయం! ఉదయం భగ్నమైంది భవిష్యత్తు పారిపోయి అడవిలో తలదాచుకుంది. త్యాగం రాగంతో దేశభక్తి మేళవించి నిలిచిన ఆశా కిరణం! ఈ నేల నుండి తొలగింది! చరిత్రలో అడుగునబడి పొరల్లో అణగి మణగిన ఆటవిక యుగక్రీడ! ప్రదర్శన జరిగిన సమయం స్వేచ్ఛా సమాజ ముఖంపై దీర్ఘరాత్రి వాలింది. హత్యా చిత్రం- అంచుల్లో వ్రేలాడే కలల పీలికలతో కాలం బూటు కాలు ముద్రతో ఉన్మత్తాకృతి పొందింది. ఇది నీరవ సమయం! ఎత్తిన తల ఒరిగింది! వర్తమానం ఆగిపోయి పెనుబండమై నిలిచింది. రాళ్ళను తొలిచి తొలిచి తీర్చిన రమణీయ శిల్పం ఊహలు మలచి మలచి దిద్దిన కమనీయ సంస్కృతి రస సమూహం గడ్డకట్టి సంస్కారం స్తంభించింది బంగ్లాదేశ్ చరిత్ర ఫాలంపై గాయం లోయగా ఏర్పడింది. ఆటవిక మనస్తత్వం, చిందే మృత్యు సంగీతంతో వరద రహస్యంగా వచ్చింది రాత్రి అంచులు ముంచుతూ శవాల్ని ప్రక్కకు నెట్టి ఉదయానికల్లా వెళ్ళిపోయింది. కవి ఐనా నాయకుడైనా ఎవరైనా ఈ సమాజంలో మానవ వికాస చరిత్రకు వారిచ్చే కానుక ఏమనే! గాలిలో ప్రాణం, అగ్నిలో మట్టిలో శరీరం, శూన్యంలో మనస్సు కలిసిపోయి మిగిలేదేమిటి? ఇచ్చేదేమిటి? మానవతా గంధం. చీకటిలో తేలే బింబం శశియై రవియై, వివేకం. వెలుగుతో ఊగే బింబం, మానవ హృదయం. తరం నుండి తరానికి మిగులుతుంది విలువగల వ్యక్తిత్వం. స్వేచ్ఛా గుణంతో స్వాతంత్య్ర పథంలో సాధించిన సోనార్ ఖండం ముజీబ్ నాయకత్వంలో ప్రగతి శక్తుల విజయ తేజం.
సంస్కృతినీ శిల్పాన్నీ భుజాలపై ఎత్తుకొని నిలిచింది ఆర్ద్రతనూ మానవతనూ వదలేనా? ప్రయాణం మధ్యలో. కరాళ రూపం ధరించి సమయం కొడిగట్టింది. పారిపోయిన భవిష్యత్తు ఫాలభాగం చేరాలిసి ఉంది ఆగిపోయిన వర్తమానం అరచేతిలో కదలాలిసి ఉంది ప్రజాస్వామ్య చరణం సుగమంగా ముందుకు సాగాల్సి ఉంది. స్వేచ్ఛా నవం 4. ఇది వియత్నాం కావ్యం (1974) 1) విప్లవ చ్చాయలో 2) శాంతి వెలుగులో మాదిరాజు రంగారావు అంకితం అగ్ని సరస్సులో వికసించిన విప్లవ వజ్రం మహాకవి శ్రీశ్రీకి
ఇది వియత్నాం
విప్లవచ్చాయల్లో /శాంతి వెలుగులో ప్రజాస్వామ్య దృక్పథానికీ, మానవతా స్పందనకూ భిన్నంగా రాజకీయ కారణాలతో ఒత్తిడులతో ఒక దేశంలో సుస్థితిని భగ్నం చేసే తత్యానికీ, చివరకు అపజయాన్ని పొందే చర్యలకూ ప్రతిరూపం ఇది వియత్నాం. ఒక జాతిలో పుంజీభవించిన పోరాట
పటిమతోపాటు
సంకల్పశక్తినీ ప్రకటిస్తూంది. వస్తువు అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది. ప్రపంచంలో రాజకీయ దృక్పథాలకతీతంగా ప్రతి హృదయాన్ని కదలించింది వియత్నాం యుద్ధం.
స్వేచ్ఛను
కోరే, స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే ప్రతి దేశంలోని పౌరునికీ ఉత్సాహశక్తినిచ్చింది. అమెరికా ప్రభుత్వ నియంతృత్వ వైఖరీ, అప్రజాస్వామ్య చర్యల్లో అమానుషత్వమూ ప్రపంచ దృష్టికి వచ్చింది. అమెరికన్ సైనికులు కమ్యూనిజాన్ని అరికట్టే నెపంతో శాంతి రక్షణ పేరుతో
వియత్నాం నేలపై దిగడంతో ఆరంభమైందీ కావ్యం. అయితే కాలం గడిచేకొద్దీ ఓటమిని చవిచూచింది. ఆయుధ శక్తితోను విఫలమై శాంతిపై రక్తిని ప్రదర్శించిన అమెరికా ప్రభుత్వం సైనికుల్ని ఉపసంహరించుకొంది. ఇది వియత్నాం ప్రజల వీరోచిత విజయగాధతో ముగిసింది. అమెరికా సైనికుల ప్రవేశం నుండి నిష్క్రమణం వరకు జరిగిన గాధా రూపమే “ఇది వియత్నాం” కావ్యం. “ఆయుధాలు ప్రేలేను అహంకార గర్జాధ్వనితో, ఇది శాంతి సేవలో భాగమనీ ప్రచరించేరు” శాంతి సేవ పేరిట ఆయుధాన్ని చేపట్టే రాజకీయ చతురతలో బలప్రయోగ వైఖరి చిత్రితమైంది. మనుషుల్ని "మొక్కలుగానో రాళ్ళుగానో” తలచే మనస్తత్వంతో ప్రవర్తించే అమెరికన్ సైనికుల దుశ్చర్యలూ అశాంతి వాతావరణం
మనముందు
సాక్షాత్కరిస్తుంది. ఈ దుస్థితుల చిత్రణం పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారంగా రూపొందింది. వియత్నాం ప్రజలు అగ్రరాజ్య బలప్రదర్శనను లెక్కచేయకుండా సలిపిన వీరోచిత పోరాటం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. నిద్ర “ఎరగని విశయై”, “శాంతి ఎరగని జ్వాలయై”, “వీర గాథా బింబమై” జన చేతన విజృంభించింది. చెట్లపైనుండి పొదల చాటునుండి రాళ్ళు గుట్టల వెనుకనుండి గొరిల్లా విధం పోరాటం ప్రబలింది. అడవిలో కదలే కారు దారిమధ్యన నిలిచిపోయింది. ఇదో వైట్ ఎలిఫెంట్. వర్ణనలో అమెరికా ప్రస్తుత స్వరూపం వాస్తవ స్థితికనుగుణంగా భావరూపాన్ని పొందింది. ఉత్తర వియత్నాంలో స్థితి రణ రూపాన్ని పొందింది. అంతటా కాల్పులతో, బాంబులతో అనలధూమం కమ్ముకొంది. దీని వెనకనుండి వియత్నాం ప్రజల ప్రతిక్రియ శబ్దిస్తూంది.స్వేచ్ఛాకవిత్వం I - మాదిరాజు రంగారావు ఈ విషాద వాతావరణంలో “మైలై” ఒక దుఃఖావిల కరుణాత్మక ఖండం, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మైలై, వియత్నాంలో ఒక ఊరు. అగ్నికీలల్లో మండి మండి శ్మశానశకలమయింది. ఇది “నాగరక చరిత్రలో అమావాస్య రాత్రి”గా వర్ణితమైంది. ఇక్కడ అమెరికన్ సైనికులచే విషవాయు ప్రయోగం జరిగింది. నీతిలేని రాజకీయం, మానవత లోపించిన ప్రవర్తన వియత్నాం ప్రజల్ని అనేక బాధలకు గురిచేసాయి. ఇది
సామ్రాజ్యవాదాన్ని
తలపించే అహంకార బీజం నుండి మొలకెత్తిన నిరంకుశ పరిణామ రూపం. ప్రపంచాన్ని కదలించింది. హృదయమున్న ప్రతి వ్యక్తిని చకితం చేసింది. ప్రజల స్వేచ్ఛనూ స్వాతంత్ర్యాన్నీ భగ్నం చేసే అమెరికన్ ఆయుధ బలాన్ని ఎదుర్కొనే వియత్నాం వజ్ర సంకల్పం సూచితమయింది. తమ శత్రువైన అగ్రరాజ్యాన్ని “మంచుబొమ్మ” గానే వియత్నాం భావించింది, ఎదుర్కొంది, సంఘర్షించింది. "నీ వెనుక నీడలమై అగ్నులమై వెలుస్తాం”, “నీ కాలి కింద కత్తులమై మెరుస్తాం" అన్న మాటల్లో నిశ్చలమైన ఆత్మవిశ్వాసం, నిర్దిష్టమైన కార్య ప్రయోజనం స్పష్టం. వేదనాతంత్రులతో క్రందించే వీర వియత్నాం, ఉత్సాహ శక్తిని
బింబిస్తూందీ పోరాట భాగం. ఈ యుద్ధంలో అమెరికా ప్రభుత్వం నెపాల్్మ బాంబుల్ని ప్రయోగించింది. విషవాయువుల్ని ప్రసరింపజేసింది. తన విజయానికై ప్రజల విలయానికి దారితీసే విధ్వంసకరమైన చర్యలు మెట్లుగా అమర్చడం రాజనీతిలో భాగమైంది. పెద్ద దేశం అమెరికా ఒక చిన్నిదేశం నుండి వచ్చే తీవ్రమైన ప్రతిఘటననెదుర్కోలేక పోయింది. కాలం గడిచేకొద్దీ అపజయం రుచి చూడాలలిసి వచ్చింది. గౌరవంగా బయటపడలేక పోయింది. “రోట్లో తలదూర్చాక ఎంత పెద్ద తల అయితేనేం?” అన్న మాటల్లో అమెరికా జోక్యం ఎంత అనుచితమో, అసందర్భమో, ఎటువంటి అశాంతికి దారితీసేదో సూచితం. ప్రజాస్వామ్యేతర చర్యల్లో ఆర్ద్రత అదృశ్యమైంది. మానవత లోపించింది. కఠోరమైన పరిస్థితుల్లో ప్రజలు విజృంభించడం జరిగింది. విజయాన్ని పొందడమూ ప్రపంచాన్ని ఆకర్షించింది, అమెరికాను ఆశ్చర్యపరచింది. వియత్నాంలో తలదూర్చిన అమెరికా ప్రభుత్వం మెల్లగా తప్పుకునే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు శాంతి వాలింది. ఇది ఎగిరిపోకుండా శాంతి ప్రియుల ప్రయత్నమూ అవసరమైంది. దీనికై "ఎంత ఎత్తు కట్టేరో గోడలు! ఎంత ఎత్తు పెంచేరో మనస్సు” అన్న మాటల్లో భౌతికమైన కృషికన్నా మానసికంగా నిజమైన మానవతా పూర్ణమైన ప్రజాస్వామ్య వాతావరణం నెలక్పొడం ముఖ్యమన్న సూచన ఉంది. చివరకేర్పడిన శాంతి ఘట్టంలో “గత చరిత్రలో అనుభవ దృశ్యాలు ఆల్బంలో చిత్రాల వలె” నిలిచిపోయాయి. ఇపుడు శాంతికి ఆయువు హెచ్చింది. క్రమంగా స్వేచ్ఛకు అవకాశం కలిగింది. సుదీర్ఘమైన చీకటి రాత్రి కదలిపోయింది. నిన్న “గ్రీష్మాతపం వలెనున్న” కాలం ఇపుడు “వర్షమేఘ బంధుర”మయింది. ఆక్రందన ఆవేదన మృత్యువు భీభత్సం విషాదం అశాంతి నుండి, ఉత్తర వియత్నాంకు శాంతి చరణం లభించింది. కొన్నేళ్ళుగా మారణాయుధాల ధూమంతో నలుపెక్కిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రావడం విశేషం. చెట్ల కొమ్మల్లో పచ్చదనం వచ్చింది. పిడికిలి సడలింది. ఎక్కడో దూరంగా ఉన్న ఉదయం నేరుగా వచ్చి “ప్రజల ఎదపై” వాలింది. అడవుల్లో ఎక్కడెక్కడో “నీడలవలె” దాగిన వియత్నాం వీరులు, వెలుగులై “పొద్దుపొడిచిన ముఖాలతో” “శాంతి పూచిన
కళ్ళతో"
తమ నివాసాలు చేరుకున్నారు. ఇది వియత్నాం, వీరాంగణం. ఇపుడు స్వేచ్ఛతో
"రెపరెపలాడే
ఆశాకేతనం”గా నిలిచింది. ఈ ఉద్యమ కావ్యంలో విప్లవ గతిలో పోరాటంతో చివరకు స్వేచ్ఛ శాంతి విజయ పర్యవసానంతో సమాప్తమైంది. వియత్నాం ప్రజల వీరగాథారూపంగా ఆవిష్కృతమైంది. ఇది రెండు విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ కారణంగా ప్రవర్తిల్లింది. ఒకటి రాజకీయ ప్రాబల్యం ధనబలం ఆయుధశక్తీ నిరంకుశ తత్యంతో అతిశయించింది. మరొకటి మనోబలం జనశక్తి స్వాతంత్ర్యేచ్ఛతో విజృంభించింది. ఈ సంఘర్షణలో మానవత నలిగి పోయింది. ప్రజాస్వామ్యం చెదరిపోయిందది. మళ్ళీ మానవతా ముఖం శాంతితో
కన్పించింది.
విప్పారిన రెండు రెక్కలతో శాంతి ఎగురుతూంది. మానవతారూపంతో కళ్ళముందు సాక్షాత్కరించింది. ఈ విధమైన సామాజిక భావ స్థానాలలో ఈ కావ్యం వివిధ స్థితుల సంఘటనల సంవిధానంతో రూపొందింది. ఈ కావ్యం విప్లవచ్చాయల్లో, శాంతి రెక్కల క్రింద అన్న రెండు భాగాలుగా ఉంది. వియత్నాం ప్రజల సంకల్పగతినీ కార్యాచరణకూ అద్దం పడుతుంది. మానవతా స్పందనతో విశ్వజనీనత్వాన్ని పొందుతూంది. బలమైన ఉద్యమ వస్తువుతో అంతర్జాతీయ కోణంతో వెలసిన కావ్యం "ఇది వియత్నాం" స్వేచ్ఛా కవిత్వానికి వైవిధ్యాన్ని ప్రసాదిస్తూంది. Detroit, MI - U.S.A. 27-6-2001 ఇది వియత్నాం ఆయుధాలు ప్రేలేను అహంకార గర్జాధ్వనితో
I. 1. విప్లవ ్చయల్లో విని కొందరు పాపం! మతిలో జలదమని తలచేరు ఇదో శాంతి సేవలో భాగంగా ప్రచరించేరు. మొక్కల వలె మనుషులు పుడుతూ చావడమేనా? సంకల్ప వికల్పం ఎరగని మ్యూజియంలో శిల్పాలా? నాగరకత పెరిగే కొద్దీ ఆయుధాల అవసరం జాస్తీ అవుతుంది. మనిషిని చూస్తే మనిషికి భయం నీడను మ్రింగజూస్తుంది నీడ. ఆటవిక యుగం నుండీ ఆయుధాల అవసరం లేకపోతే ఊహలో ఉండేనా? ఇంతటి క్లిష్టమైన రణ వ్యూహం వర్తనలో ఉండేనా? ఇంతటి తీవ్రమైన పదును రీతి. చెట్లపైనుండి గుహల్లోకి, గుహల్లో నుండి కట్టడాల్లోకి శిలాశకలం నుండి ఆటంబాంబు వరకూ ఎదిగిన మనిషి జిగీషలో తొలిగిందా? ఆటవిక లక్షణం? మనీషలో అణగిందా? ఆక్రమణ తత్వం. కళ్ళలో పూలు పూస్తాయి కళ్ళలో నిప్పులూ వెలుగుతాయి బ్రతుకులో నిర్మాణశీలంతో విస్తరణ గుణంతో అందంలో ప్రయోజనంలో రెండిటి అవసరం వేరు ఆయుధాలు ప్రేలనీ అహంకారం గర్జించనీ జలదానికి భంగం లేదు, వీర సంకల్పానికి చావు లేదు. ప్రకృతిలో పచ్చదనం మళ్ళీ మళ్ళీ
మనసులో సంగీతం సమయ సమయం మనిషిలో శక్తి గతికీ రక్తి రుచికీ సంకేతాలు. అనల విధృతితో ఝంఝా గతితో ఈ శతాబ్ది చరిత్రలో జనగణ సమాజం నిద్ర ఎరగని నిశయై శాంతి ఎరగని జ్వాలయై వీరగాథాబింబమై, వియత్నాం నేలపై.
I. 2. ధూమం వెనుక నుండి మంటలతో విసిరే గాలుల వడిలో సుడిగొన్న సంధ్యా క్షితిజంలో కారులో సాగిపోతున్నారు ప్రళయ గతితో యుద్ధమతులు ఎక్కడికీ ప్రయాణం? ఎందులకీ ఆవేగం జనపదాల్లో చరిత్రలో ఏ శకార వ్యూహం సృష్టించాలనీ వియత్నాంలో. చెట్ల చాటు నుండీ గుట్టల చాటు నుండీ అవతరిస్తున్నారు విప్లవ స్వేచ్ఛామతులు. విరామం లేక పడే డాలర్ బాంబుల మంటలకు ఎరుపెక్కీ ధగధగలాడే శక్తికీలలు. కారు కిరువైపులా కిటికీ బెజ్జాల కమర్చిన మెషిన్గన్లు మ్రోగుతున్నాయి విచక్షణారహితంగా చీకటి నిశ్శబ్దం. ఫోకస్తో టార్గెట్ గ్రుడ్డిగా మొద్దుగా టాంక్ సాగుతోంది. గుమ్ముగా పెరిగిన చెట్ల మధ్య నుండి సందుచేసుకొనీ వచ్చిపడే రాళ్ళ కెదురుగా లావుపాటి కారు నడుస్తోంది. హెడె ట్్స పగిలినా గుడ్లక్ చెదరినా మొండిగా రాక్షసంగా దారిన కదులుతూంది పొగలు రేగి హాహాకారంతో అదిరిపడేను. మంటల వెలుగుల్లో అదో వైట్ ఎలిఫెంట్. ఈ భూమిని రక్షించేందుకు దేవదూతలు ప్రయాణిస్తున్నారు రోజొక గండంగా ముఖాన ఎవరి క్రాస్ వారే వహిస్తున్నారు. ఎవరూ తమ గోయి తాము తీసుకోనక్కరలేదు అవసరమైతే కారు ఉంది! అందుకది సరిపోతుంది. కారులో గాలిని కండిషన్ చేసినట్లే వియత్నాం ప్రజల్ని కంటో ల్ చేయాలనే తమకేం? అన్ని అమరికలతో లోపలి నుండి అడుగు తీస్తేగా. నిప్పు తమకంటనంతవరకూ! బయట ఏమూపోతేనేం బూదిగా
ధనబలం ఉన్నచోట శాంతి అదే దారికి వస్తుందా? స్వేచ్ఛను మాపే యుద్ధం శాంతిని తెస్తుందా? అడవిలో చెట్లపైనుండో గుట్టల్లోనుండో నిప్పులు చిమ్మే గుండెలతో మనుషులు కదులుతున్నారు. కారును పట్టేయాలనీ, ఏనుగును కూల్చేయాలనీ- అడవిలో కారు లేటెస్్ట మోడల్. ఆగకుండా నడుస్తోంది తిరిగి తిరిగీ ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుతోంది. మంటలు విసరే గాలి గతిలో చిక్కుకున్న సంధ్యా క్షితిజంలో బూది కుప్పలు! రాక్షసుని నిద్రలో పీడకలల బొమ్మలు. మానవతా వేదిపై అనల ధూమచ్ఛటల్లో వీర గాథా జీవితాల తోరణ మాలా పంక్తులు!
I. 3. అమావాస్యరాత్రి - మైలై గాలులు వీస్తున్నాయి కర్కశతి కర్కశంగా ఉత్తరం నుండి దక్షిణానికి జీవితం నుండి మృత్యువుకూ చెట్లను స్తిమితంగా ఉండనీయడం లేదు మనుషుల్ని ఏ కాస్త నిద్ర పోనీయడం లేదు. మంటలు ప్రసరిస్తునన్నాయి దిక్కుల్లో పడగలు చాచి అంతా ఏకం చేసేందుకో? సర్వం లీనం చేసేందుకో? గాలులు వీస్తున్నాయి సమయ దళాల్ని చీలుస్తూ గుట్టలూ మేడలూ గోడలూ! గగుర్పాటుతో నిక్కి నిలిచాయి. భవిష్యత్తు రహస్యాల్ని దాచుకునే బాలల నుండీ గతంలోని అనుభవాలు పరచుకునే వృద్ధుల వరకూ చలిలో వానలో ఎండలో భూమిపై కాలి నడకనా నీటిపై వెదురు పడవల్లో ఎదురు గాలిని ఉత్తరిస్తూ వీర జాతి నికేతనాలై ప్రయాణం సాగిస్తున్నారు. ఈ గడ్డకు ఎటువైపూ ఏ అభయ మార్గమూ లేదు "ఏ క్షణం బాంబులు మీద పడతాయో” “ఏ క్షణం విషవాయువు చిమ్ముతుందో” అనుకున్నంతసేపు పట్టదు! ఆ భయ క్షణం రావడానికి! మారణాస్త్రాల పొగల పొరలు చీల్చుకుంటూ ప్రజలు బరువులెత్తుకొన్నవారిలా వంగి వంగి పరుగిడుతున్నారు.
మంటల్లో కలిసిపోతూనో, పొగల్లో దాగిపోతూనో బూదిలో బూది పొరలై కనుమరుగైపోయేరు దూరం విసరేసిన ఆట వస్తువుల వలె పిల్లలూ క్రింద పడిపోయిన పిడుగుల వలె వృద్ధులూ! అగ్రరాజ్యం రాజనీతి మంటల వెలుగులో కోపంతో ఎరుపెక్కిన ముఖం వలె ఉంది క్షితిజం. ఈ ఊరు ముఖాన మంటలతో పొగలతో కాలం చిత్రిస్తోంది బాధారుణచిత్రం! యుద్ధతంత్రం వేగంగా మలుపు తిరుగుతోంది మూల మూలనుండి బాధా స్వరాలు వినిపిస్తున్నాయి. సనసన్నగా పరాయి సోల్జర్లు సంభాషణలు అంచెలంచెలుగా వాటిని కప్పేస్తున్నాయి కన్నుల్లో అగ్నికి బదులు నీరు కురవాలిసిన క్షణం! మనసుల్లో ఆలోచన కన్న ఆవేదన పడాల్సిన క్షణం! పక్షికీ భయమే ముడుచుకొని ఎగరడం లేదు చేపకూ భయమే దాక్కోని ఈదడం లేదు స్వేచ్ఛా సంకల్పంతో దీక్షా కవచంతో లక్ష్యంతో ఈ క్రియా భూమిపై కదిలేదీ! వెలిగేదీ! మనిషే! మనిషి నిండుగా బాంబులు మోసుకొని వచ్చేను దురంహకృతిలో వరసగా బాంబుల గుండెలు ప్రేలేను వరసగా యుద్ధంలో టాప్ ప్రియారిటటీ ఏ నిజానికో గాని మైలైలో లక్ష్యం చేరడానికెంత కాలం పడుతుందో! చేతిలో గన్ తో లేస్తూ లేస్తే జాతీయాలాపంతో పడుతూ ఒరిగిపోయే వియత్నాం వీరుల కన్నుల్లో జారే మల్లెలు జాజులు మందారాలు గులాబీలు రంగురంగుల పూలు మానవతను పందిరిగా అల్లుతున్నాయి. ఇక్కడ వీరోచితమై ఉదయం వెలుగుతూంది ఇది శుభోదర్కమై చెదరని ఆశా వాస్తవం. శత్రువు చేతుల్లో పడిన “మైలై” ఒరిగే వీరుల రక్త సరసిలో నావయై తేలుతూంది అగ్ని కీలల్లో ఒకటై శ్మశానంగా మారుతోంది.- ఎండిన బావులై కళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి ఆకాశం కురుస్తోంది అడపా దడపా బాంబుల వర్షం శాంతిని దగ్ధం చేసి సమాధులు సిద్ధం చేసి
కొవ్వొత్తులు వెలిగిస్తారా? పూలతో భూషిస్తారా? విష వాయు సేచనతో ఈ వనాన్ని భగ్నం చేసి ఏ కోర్కెల పూలు పూయిస్తారీ మారణమతులు! భీతమైన ఎదలో శాంతి చరణం నిలవ లేదు నీతి లేని రాజకీయం కల్యాణం కూర్చబోదు ఎండిన చెట్టు కొమ్మ వలె విస్తరించిన కాలిబాటన ఆకుల గలగలతో మనిషి ప్రాకుతూన్న చప్పుడూ! వీడని పొగ మంచులో ఎగిరే పిట్టల వలె మారణ ధ్వని ధ్వనికీ మధ్య సందుల్లో నిశ్శబ్దంగా మోహరించి కదులుతున్నారు వియత్నాం వీరులు! అడవిలో సెలయేళ్ళవలె గడుస్తున్నాయి రోజులు. వినేవాడుంటే చాలు! ఇక్కడ బోలెడు కథ ఉంది నేలపైన నీటిలోను శవాలు వీర గాధా శకలాలు. పక్షుల్ని బెదిరిస్తే ఎగరడం మానతాయా? మనసును అదిలిస్తే మ్రానై పడి ఉంటుందా? ఎండిన సరస్సు వలె శాంతి నిలిచి ఉంది. గ్రీష్మంలో ప్రవాహం వలె సహనం సరిస్తూంది అహం ప్రేలే యుద్ధానికి దగ్ధమౌతూంది వియత్నాం భగ్నమయ్యే జాతి స్వేచ్ఛకు సంకేతం వహిస్తూంది. సూర్యుడు వేయి చేతులు చాచనీ చంద్రుడు వేయి చూపులు సరించనీ రణ నీతికి గుడై ఈ ఊరు “మైలై” మానవతకు గుడై ఈ రోజు “మైలై”.
I. 4. మైలై మండి నీవు కసికసిగా విసరే బాంబులకు చస్తే నీ వెనుకే నీడలమై అగ్నులమై వెలుస్తాం వియత్నాం గడ్డపై విజయ వజ్ర సంకల్పంతో నీ కాలి క్రింది కత్తులమై మెరుస్తాం. పేదరికం అవమానంలో మేం చేసిన తప్పు
I. 5. చరమాంకం ఓ పెద్ద మంచు బొమ్మ కెదురుగా తెగించి మోహరించడం ఆయుధ ధన బలంతో నీవు చేసిన ఒప్పు జన మారణ రణం! సైనిక బల నీతి వ్రణం ఇరువురి మధ్య నుంది ఆరని అగ్నిరేఖ చరిత్ర ముఖంపై అడ్డంగా కత్తి గంటు! మినుకు మినుకుమంటూ ప్రాణం ఉన్నంతవరకు శరీరం కదులుతుం దొక రణ యంత్రమై వీడుతుంది తుది నిశ్వాసం రణ పతాక రెపరెపతో కాలి క్రింద నీడవలె అణగ ద్రొక్కి అపజయం ఉరుముల వలె వినిపించే మా పద ఘట్టనలో భూమి గరుకు తగ్గుతూంది, ఊహ ఎరుపు ఎక్కుతోంది మా ఊపిరి రాపిడికి గాలి పదును పొందుతూంది. మా చూపుల వెలుగులో పగలు తళతళ లాడుతూంది మా ఊహల మంటల్లో రాత్రి భగభగ మండుతుంది శాంతి లేదు సహనం లేదు నీ బ్రతుకంతా వ్యాపారం స్తిమితం లేదు భద్రత లేదు మా బ్రతుకంతా ప్రళయం. అందంగా అల్లిన అబద్ధాల కుతంత్రాల వ్యూహంలో చిక్కిన అదృష్టానికి మురిసేవా? నీ యుద్ధం నింగి నుండి మా యుద్ధం నేల నుండి రెండిటి మధ్య అంతరాన్ని కలిపే అవకాశం శూన్యం స్వేచ్ఛగా తిరిగే పక్షుల పైనా నీ కసీ, గురి! క్రింద స్వతంత్రంగా సాగే ప్రాణుల పైనా నీ అక్కసు? బ్రతుకును నెత్తురు ముద్దగ మార్చేవూ మనిషీ.- ఎదురుగా ఎగసి పదును కత్తులై చిమ్మే పొగ మంటలై పట్టరాని వ్యథతో రోజులు సంబాధంగా గడుస్తూన్నాయి. పిల్లలనుండి పెద్దల దాకా మాకు ఆశీస్సులిస్తున్నారు. నీ ఊహలో శాంతి కపోత సంచారం మృగ్యం నీ వర్తనలో అగ్ని గోళ వర్తనం సత్యం ఒక దీపం ఆరిపోతే పది పది వెలుగుతూనే వేదనా తంత్రులతో క్రందిస్తోంది వియత్నాం ఇది జ్వాలా సందర్భం! రాత్రికి చరమాంకం ఇది స్వేచ్ఛా సంరావం! ఉదయానికి సంకేతం.
I. 6. అశాంతి చక్రం ఘనత వహించిన దేశం నుండి బడుగు దేశానికి ఆహారానికి బదులు గుడ్విల్ గా బాంబుల సపె సవ్యాజమైన కరుణ బిగిసేను ఉరిత్రాడై కొమ్మకొమ్మనూ వేరుచేసే గాలి వలె రాజనీతి! పూవు పూవునూ బూదిచేసే కీలవలె యుద్ధరీతి! సౌభాగ్యం సంతోషం కోరీ అవమానం హింసకు భయపడీ రాజకీయ చతురుల చేతుల్లో పావుల వలె శాస్త్రజ్ఞులు! నేపాల్్మ బాంబు బ్రద్దలై విషవవాయువు కదలీ వియత్నాం వీథుల్లో అర్థనగ్న శరీరాలు కదలేరు జనం అడవికి శోభా రహితులై శిశిర నీతికి శీర్ణమై జీవితాలు కీర్ణమై. మహాసముద్రానికీ విశాలభూమికీ మధ్య చెలియలికట్ట ఉంది ఇక్కడ జడ జగతికీ ప్రాణ జగతికీ మధ్య రేఖ ఉన్నట్లు లేదు! నిర్మాణ దశ చిట్టచివరి మెట్టుపై ఉంది విలయ స్థితి మొట్టమొదటి వరసలో ఉంది. అపశకున లక్షణాలతో అపాయకర చర్యలతో సమయ మహా శిఖరంపై భయం గొల్పే తెల్ల మనుషులు ఎంత గొప్ప దేశమో! ఇపుడంత పెద్ద గందరగోళం ఆలోచనలో అసహనం, ఉద్రేకం వెంట ఆందోళన ఆందోళనతో ఆవేగం, ఆవేగం నుండి మారణం. అహంకార తాండవంతో, యశస్సు నిలుపుకొనే యత్నం ఈ చిన్ని దేశం నుండి బయట పడలేదు అమెరికా రోట్లో తల దూర్చాక ఎంత పెద్ద తల ఐతేనేం?
I. 7. క్రాంతి వియత్నాం తరంగాలు! తరంగాలు! విలయ ధునీ తరంగాలు స్వర్గాన్నీ నరకాన్నీ ముంచెత్తీ వేగంతో అజేయ శక్తి ధురా తరంగాలు! తరంగాలు తప్తలోక వ్యధా భరిత గాధా కల్లోలాలై సుడులతో వడులతో పొరలి తరలి వస్తూన్నవి.
నవ లోకపు తేజం వియత్నాం ఖండం వదనంలో స్వేచ్ఛా సంగీతం గొరిల్లా వీరుల ఆత్మలో. శిథిల హృదయ తలంపై ఎగసే మంటలతో మారణ చరిత్ర పేరూ, ఊరూ లేకుండా తుడిచేస్తూ తరంగాలు ఉల్లోల తరంగాలు విలయ ధునీ తరంగాలు! దిశదిశ వీర యశః కురంగాలు! నేలపై ఉత్సాహ మృదంగాలు! చితివలె మండే నిరాశపై పై నుండీ జనగణ చైత్యంతో జిగీషా రూపంతో యుద్ధ కళోన్మాదుల మతి పోగొడుతూ పొంగి పొంగి తరలి వచ్చే కల్లోల తరంగాలు బ్రతుకులో ఉందీ తెలుపు నలుపూ ప్రకృతిలో ఉంది సృష్టీ విలయమూ! నెత్తురు మంటల్లో ఆశా చిత్రం చూస్తూ బ్రతుకులు తెల్లార్చే వీర వియత్నాం నిశా వియత్ శత్రు జ్వలన లక్ష్యంతో
II. శాంతి వెలుగులో
II. 1. శాంతి బిందువు శాంతి వచ్చింది చిట్ట చివరకు ఆగి ఆగి భయభయంగా కాలిన కూలిన ఇంటికి ఇన్నేళ్ళకు అపరిచిత రూపంతో వేచి వేచి మరచి ఎదలో దారి తప్పిన వాస్తవం వలె ముసుగు తీసి తెల్ల ముఖం జేబులో పిస్టల్ దోపుకొనీ. చెట్టు క్రింద నీడలో విశ్రాంతికై నిలిచింది ఊహలో రణ వ్యూహం ఇంకా మిగిలే ఉందా? శేషాన్ని పూరించేందుకు కోపానికి తగిన సాధనం కోసమా? పై నుండి బాంబులు ఎపుడైనా పడవచ్చు. శాంతికై పూల చెండ్లు విసరినట్టు చెప్పొచ్చు. నేలపై ఎపుడైనా సాగవచ్చు కీలలు! మంచికని రణ వ్యాపారం దించవచ్చు. ఈ వాలిన శాంతి ఎగసి పోకుండా
శాంతి ప్రియులేం చేస్తారో చూడాలి. ఎంత ఎత్తు కట్టేరో? గోడలు! ఎంత ఎత్తు పెంచేరో? మనస్సు!
II . 2. కిటికీ నుండి వెలుగులో కిటికీ నుండి దూకిన వెలుగు వేలెత్తి చూపుతూంది ఇంటిపై పడిన బాంబుల్నీ అగ్నుల్నీ ముంగిట్లో ఏర్పడిన రక్తచిత్రాల్నీ కిటికీ నుండి వాలిన వెలుగు జ్ఞాపకం చేస్తోంది విరిగీ బెణికీ కాలీ కదలని చేతులనూ కాళ్ళనూ ఇది మానవ వికృతి కృతిని చూపించే ఆల్బం రెండు మూడు దశాబ్దాలు చావు బ్రతుకుల సంధ్యలో రెక్కలు కట్టేసిన పక్షి వలె నున్న ఈ దిశలో, ఇప్పుడు శాంతికి ఆయువు లభించింది; స్వేచ్ఛకు గమనం సిద్ధించింది. బ్రతుకులో మారణాన్ని మరపించే స్పందనతో ఈ సమయం మానవత ఎగిరి ముందుకొచ్చింది గుండెలో భయ శబ్దం ఎగసిపోయి తుపాకీ గుండ్లను మరపించింది కళ్ళ ముందు నిలిచిన విజయ రూపం ఇన్నేళ్ళ బాధను మరపించింది అద్దం ముందు నిల్చుంటే గదిలో ఒక ప్రక్కన కనిపిస్తోంది పదిలంగా తీసి పెట్టినట్లున్న హృదయం వలె వయొలిన్. గుండెల్లో రణ గతితో ధమనుల్లో విప్లవ ధునితో అగ్ని పర్వతం వలె ప్రేలి ప్రేలి విసిగిన కాలం శాంతించింది మతిలో కపోత శ్రేణితో నాడుల్లో సంగీత స్వరంతో విజయం పొందిన జీవితం ఇపుడు వెలసిన హిమశిఖరం! కిటికీ నుండి జారిన వెలుగు, ఆనంద హృదయమై మనిషి మనిషిలో వివిధ వర్ణ రాగాన్ని సృజిస్తూంది ఇంత కాలం బిగిసిన పిడికిలి సడలింది గుప్పిట్లో దాగిన రహస్యం జగద్వితమైంది ఎదలో నిలిచిన స్మృతి చిహ్నం ఇంటి ముంగిట్లో ఆకు రాలి వృక్షం వియత్నాం సమాజం! వృక్షాన్ని వెలుగు స్పృశిస్తోంది. వృక్షంలో ప్రాణశక్తిని సరిస్తోంది అనల పత్రా లెగసి పోయాయి, రక్తచిత్రాలు మాసిపోయాయి సమయం ప్రవహిస్తోంది విశ్వ బంధు గీతం స్వనిస్తోంది ముందున్న అద్దంలో కిటికీ నుండి కన్పించే గగన ఖండం
వియత్నాం భుజాలపై నిల్చిన చరిత్ర ముఖం వలె ఉంది. ఇక్కడ రాత్రులెంత సుదీర్ఘమైనవో
II . 3. సుదీర్ఘమైన రాత్రి దాటి మనుషుల బ్రతుకు లంత హ్రస్వమైనాయి పోరాటాని కంకితమై ఆయువు సగంపైగా చెల్లిపోయింది భయంతో మేను ముడుచు కొన్నంత వరకూ పొగతో కళ్ళు మూసినంత వరకూ అలజడికి లక్ష్యం లేనంతవరకూ రాత్రికి పరాజయం లేదు- నిటారుగా మేను నిల్చి కళ్ళు వెలుగు చిమ్ముతూ విప్లవ లక్ష్యంతో ఉదయ జయం కలుగుతుంది గమ్యంతో పరిపూర్ణమై అడుగడుగూ కదులుతుంది. శక్తితో విలోలమై కణకణమూ బ్రతుకుతుంది. రాత్రులంత దీర్ఘమైనా ఓపిక తగ్గలేదు, శక్తి తరగలేదు. జీవ కళతో కాలం ప్రగతి పథం వరించింది రాత్రి మేల్కొన్న దీపాలు మేల్కొన్నట్లే ఉన్నాయి ఏ పగలూ జ్ఞాపకం లేదు, పోరాటంలో అన్నీ ఒకటే. రాత్రి చీకట్లో తేలుతూ పడవల వలె పగలు నీడల్లో కదలుతూ నీలి మబ్బుల వలె కదలిన వీర దళం నేలకూ నింగికే పరిచితం కాలం నిన్న గ్రీష్మాతపమైంది, నేడు వర్షమేఘమౌతూంది.
II . 4. మేఘమై ప్రవాహమై రాత్రిని చీల్చే ఆరుణ గోళమై వచ్చిన పోరాటం నేడు వియత్నాంను కాంతి తోరణంగా మార్చేను నిన్న మంటల్ని వణకింపజేస్తూ వీచిన గాలులు ఇపుడు పంటల్ని హసింపజేస్తూ వచ్చేను శాంతి ఐతే వచ్చింది ప్రజ కళ్ళలో మెరుపును ప్రతిఫలిస్తూ గుండెలో పచ్చదనం నింపుతూ, ఊహలో మానవత వెలిగిస్తూ పోరాటం శాంతి రెండు ఈ స్థితిలో లక్ష్యసిద్ధికి శిఖరాలు నలుపు ననుసరించి ఎరుపు వస్తే, ఎరుపు తరువాత తెలుపు వస్తుంది సంఘర్షణ పరివర్తన సమన్వయం పురోగమనం
చరిత్ర గతిలో భాగం సామాజిక శ్రేయం గమ్యం. సైగాన్ శిఖరం తలపై, పొలిమేరల చేతుల్లో అందుకున్న పోరాటం ఆగదు, ఆగలేదు. రావలసిన శాంతి అవసరమై రానే వచ్చింది. ఇది జనపదాల్లో నగరాల్లో తెలిసిన రహస్యం. కాలంలో ఏ భాగం అక్కరలేనిదవుతుంది? మనస్సులో ఏ రూపం చూపునుండి దాగుతుంది? మ్రోగింది క్షణం వియత్నాం హృదిలో మేఘమై కదలింది సమయం చరిత్రలో వీర ప్రవాహమై. ఈ గాలిలో ప్రేలి ప్రేలి మారణాయుధాలు పొగచూరిన వాలకంతో దరిద్రీకృత రూపాలతో కొమ్మలు వేచి ఉన్నాయి అశాంతి వాలకంతో
II. 5. ఆశాకేతనం పూల కోసం పండ్లకోసం ఇన్నేళ్ళు మొగం వాచిన చెట్లు స్నేహ మతితో స్వాగతానికి చేతులు చాచినట్లున్నాయి. ఎండిన కొమ్మలన్నీ చిగిర్చాయి, మండిన బ్రతుకంతా పచ్చనైంది రాతి చేతుల పిడికిలి సడలింది, ఉదయం దిగి ఎదపై వాలింది గుండెలో కూర్చున్న భయం లేచి ప్రవాసం వెళ్ళింది మంటలతో క్రమ్మిన దుఃఖం ఎగసి దిక్కుల్లో కలిసింది వెలిగే సంతోష కళతో తరలే తరంగ ద్రుతితో రాగం గంగయై బూది దిబ్బలపై ప్రవహిస్తూంది సుదీర్ఘ యుద్ధం సృజించిన రణ మహామతిలో శాంతి నవాంకురం వెలసింది, కాంతి బింబం కన్పించింది. అడవుల్లో ఎక్కడెక్కడో దాగిన నీడలన్నీ వెలుగులై పొద్దు పొడిచిన ముఖాలతో శాంతి పూచిన కళ్ళతో మనుషులై తమ దేశానికి కొత్త అలంకారాలవుతున్నారు. ఇది వియత్నాం, ఇపుడు అభ్యుదయ పథ గతిలో వీరాంగణం! స్వేచ్ఛతో రెపరెపలాడే సమాజ కేతనం!
II. ఆవాహనం
(1973) మాదిరాజు రంగారావుభిన్నంగా ప్రత్యేకంగా ప్రతి యుగంలో సమయ సమయం వ్యక్తిత్వం ఉన్న కవి అప్పుడున్న దానికన్నా భిన్నంగా ప్రత్యేకంగా సృజనాత్మక శక్తిని ప్రదర్శించడం కన్పిస్తుంది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఎన్నో విషయాల సమాహారంగా సంక్లిష్టతను పొందే నేటి సమాజంలో ఈ లక్షణం మరీ స్ఫుటంగా కన్పిస్తుంది. మనిషీ, వ్యక్తీ, కవీ అనే మూడు అంశాలు కలుస్తూ విడిపోతూ మళ్లీ కలుస్తూ ఇట్లా జరుగుతూ ఎప్పటికపుడు ఏర్పడే సామాజికమైన ఆస్తిత్వం విశిష్టమైన రూపాన్ని పొందుతుంది. ఈ మూడు వేరు వేరు పరిధుల్ని కలిగినవైనా సృజనాత్మక రూపంలో అనుకోని అనుకోకుండా వివిధాంశాలతో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఆవిర్భవిస్తాయి. కవి దర్శన శక్తితో వీటికో అపూర్వమైన శోభ సంక్రమిస్తుంది. ఇది ఉన్నత స్థాయికి చెందింది. ఈ స్థాయికి క్రిందనున్నవి సాధారణమైన ఆకర్షణలతో అలరిస్తాయి. పై స్థాయిలో సామాజికం, మానసికం సృజనాత్మకం అనే స్థితులు నిరంతరత ప్రవాహశీలం కలిగిన సంక్లిష్ట రూపాన్ని పొందడం జరుగుతుంది. దీని రామణీయకత ఆంతరమైంది. ఇది ఈనాటి వైవిద్యోపేతమైన జీవితంలో ఎదురయ్యే వాస్తవ శక్తులతో రూపొందే సంక్లిష్ట సమాజాన్ని భావింపజేస్తుందే తప్ప వేరు కాదు. సృజన కర్తలందరూ తమ ఆదర్శాల కనుగుణంగా సమాజ నిర్మాణాన్నీ వ్యక్తి అస్తిత్వాన్నీ తమ ప్రభావ ముద్రతోనే ఆవిష్కరిస్తారు. ప్రజాస్వామ్యం ఈ విధమైన ప్రకటనా స్వేచ్ఛ కలిగింది. చారిత్రక కర్తవ్యాన్నీ సామాజిక బాధ్యతనూ తలపుకు తెస్తూనే వ్యక్తి గౌరవాన్ని కాపాడుతుంది. మరో విధంగా సమాజ వికాసానికి చోదకశక్తిగా వ్యక్తి పరిణతికి ప్రేరక శక్తిగా ఉంటుంది వీటిని సాహిత్య విమర్శలో సకారాత్మకంగా అన్వయ గుణంతో విశ్లేషించి వివరించవలసిన అవసరం ఉంది. స్వేచ్ఛా కవిత్వం అనేది వచన పద్యం, వచన గేయం, ముక్తచ్ఛందం, వచన గీతం, స్వచ్ఛంద కవిత్వం, వచన కవిత్వం మొదలైన వాటి కుండే పరిమితుల్ని తనలో అంతర్భవించుకున్న విస్తృత రూపం. ఈ సంకలనం ఆధునిక యుగంలో అనివార్యంగా కన్పించే నిరంతర పరిణామ శీలంతో భౌతిక చిత్రణంతో మానసిక ప్రకాశనంతో పరివర్తన లక్ష్యంతో ప్రగతి ప్రవాహకత్వాన్ని పొందే సంక్లిష్టమైన స్వేచ్ఛాకవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూంది. ఈ విధంగా భిన్నమైంది ప్రత్యేకమైందీ ఆవాహనం ప్రజాస్వామ్యనిబద్ధమైందీ. 26-03-2003 మాదిరాజు రంగారావు అంకితం స్వాతంత్ర్యం సాహిత్యం రెండు కళ్ళుగా
పయనించే మానవతా సమాజ హృదయం శ్రీ ఎం. ఎల్. నరసింహారావు అన్నగారికి సూచిక 1. అవాహనం పుట 2. పాత్రను విస్మరించలేను 3. అనుబంధం 4. ఒకటైన 5. కాలం గురించి 6. దేవుడైనా 7. నాముందూ వెనకా 8. నాలో బ్రతికి 9. భగవంతుడు 10. మబ్బువిరిసే 11. అంతమవని కథ 12. అంతమవనిరాత్రి 13. ఎవరది దూరంగా 14. ఎవరు మీరు 15. కత్తుల్లా వత్తుల్లా 16. కాంతి సింహం 17. కీర్తి స్తంభాలు 18. తెలుసునాకు 19. నిప్పుపూలు 20. పిస్టల్ పేల్చిన
21. మరవ లేని గాలులు 22. మూసుకున్న ఐదు వేళ్ళు 23. మేల్కొని ఉంటాను 24. రా ! రాత్రి అయి 25. రెక్కలు దాల్చిన కొండలు 26. విదూషకపాత్ర 27. వయొలిక్ పై పుట 28. శ్వేతేతర విహంగాలు 29. సముద్రం బింబిస్తూంది 30. స్నేహవీ చి 31. హృదయంతో మాట్లాడే 32. ఛాయ 33. ఆత్మబంధువు 34. ఇల్లే పదిలం 35. గాజుగది 36. చస్తూ బ్రతుకుతూ 37. దారి కడ్డంగా 38. దుమ్ములో 39. పతాకవార్త 40. పేరు జ్ఞాపకంలేదు 41. అగ్నిగానం 42. ఆసమయంరానీ 43. ఇరవై ఒకటో శతాబ్దిలో 44. ఆ ఎడారీ అడవీ 45. ఈ గీతం 46. యుగసంకేతం 47. చీకటి వెలిగించిన వార్త 48. దేవునితో గోష్ఠి 49. నగరంలో ఉదయం 50. నవ్వుతూంది వెలుగునాలో 51. నిజం చెప్పు 52. లౌకిక శ్రీ 53. మనరూపం మహీయం
54. వియత్నాంలో అమెరికావలె పుట 55. శైశవం 56. సామాన్యుని వాస్తవం 57. కదలండి శతఘ్నులవలె 58. హిమజ్వాల 59. కంపనం ప్రకంపనం 60. ప్రవాసం ఆవాసం 61. భవితవ్యం 62. జీరో జోన్ 63. అవకూడదు జ్వాలాచిత్రం 64. ఈ ఉగాది మొదటి రోజు 65. ఉగాది అడుగు పెట్టింది 66. రానీ మరోజన్మ ఈ ఉగాది 67. ఉగాది రావలసిందే 68. ఈ ఉగాది నాడైనా ఏ దిశ నుండైనా భావించకు వచ్చేనని నభోమణి. సర్వం బూది చేసి ఆశించకు చూసేమని వసంతం క్షణాలు మండుతున్నాయి చిత్రిస్తూ సంస్కృతీ దర్పణం మంటలు ఎగురుతున్నాయి కొలుస్తూ జీవిత గగనం.
1. ఆవాహనం కళ్ళలో అంగార శిఖలతో ఊహలో కంకాళ మాలతో కలలో విప్పిన పడగలతో గతిలో తూగే మృత్యువుతో నాల్కనుండి జారే సూదులతో వచ్చేవా వీధిలో శిశిరమై అనల రుచితో దహన మతితో కదిలేనా నవవసంతంకై సమాజం గాలీ వెలుగూ నీరూ అయినట్లు సృజన శక్తి రూపాలు మాట ఊహ వర్తన అవాలి శక్తి నిలయాలు బ్రతుకులో మరుగున పడిన ఆనందం రానీ బయటికి మనసులో అడుగున పడిన సత్యం రానీ చీల్చుకుని వినేవా ? సంగీతం విన్నదే చూచేవా దృశ్యం చూచిందే ఇంత వరకు విను ! వినందీ, కను ! కనందీ ! మనసులో అంతర్గతితో ముఖంలో శాంత తేజంతో
చెట్టుపై నీటి పై గాలిలో అవనిపై అంతటా రవిత తేజం ఊహలో మాటలో వర్తనలో రానీ సమ సమాజ వాసంతం మానవ తేజం నుండే వస్తుంది మహోదార సంస్కృతి ఆవాహన చేసికో నీలో శిశిర నాశన జనస్వామ్య రాగం ప్రగతి కాంతి పరిష్వంగం కోరే జనగణ దీన హీన హిమ శిలా శ్రేణులపై చరించే నేను ఎవర కోసమో జోల పాట పాడలేను క్షమించాలి వెలుగు పాత్రను విస్మరించ లేను తలెత్తే వెలుగు పై కత్తి పోటుకు చీకటి పొంచి ఉంది ఎడారి హృదయ భూమితో బికారి ముఖ గగనంతో ఎవరు వీరు! దూరంగా మాసిన దుస్తులతో చుక్కలవలె పూర్వపు రాత్రి స్మృతులు చిమ్మికొని వస్తున్నాయి పైకి! ఉదయం వస్తుంది ఉదార చరితుని వలె వెలుగులు వస్తాయి ఎడారి పై కెరటాల వలె కళ్ళలో కలల బొమ్మలతో ఊహలో పూల సింగిణులతో జీవితం మాత్రం వివిధ శక్తుల రణ వర్తన సంకులం! దుఃఖంతో వేదనతో నిండిన రాత్రి పై జాలి ఉంది సుఖ సంతోషంతో వచ్చే ఉదయం పై కోపం లేదు వెనకనే అజ్ఞాన విహంగం చీకటి రెక్కలతో ఉంది భయం తుపాను తలపిస్తుంది, మృత్యువు ఆలస్యం అంతే చిమ్మిన నెత్తురు గీతల్లో నుండి క్రమ్మిన పొగల సెగల్లో నుండి వెలుగు రూపం కోసం మనిషి పయనం సాగుతూనే ఉంది. మతాల విచ్చు కత్తుల మెరపుల్లో బ్రతుకును వెలగించ లేను ఇజాల చిక్కుటుచ్చుల తలపుల్లో హృదయాన్ని బంధించలేను తుపాను గాలి కెవరికి వారు భయపడుతూనే ఉన్నారు. సముద్రం ఉప్పొంగి క్రమ్మేస్తుందనీ అంతా శంకిస్తున్నారు అశాంతి నెవరూ కోరరు! శాంతి ఇంతలో చిక్కేట్టు లేదు విషమ స్థితిలో మనస్సు భావిస్తోంది మరో సృజన రూపం వర్షా జల సేచన కోరే గ్రీష్మ శిఖరంపై ఉన్న నేను બે ఎవరి కోసమో ఈల పాట వేయలేను ప్రతి వ్యక్తీ పాత్రకు సిద్దమైన జనస్వామ్య రంగంపై క్షమించాలి నేను వెలుగు పాత్రను విస్యరించ లేను
2. పాత్రను విస్మరించలేను ప్రగతి కాంతి పరిష్వంగం కోరే జనగణ దీన హీన హిమ శిలా శ్రేణులపై చరించే నేను ఎవర కోసమో జోల పాట పాడలేను
3. అనుబంధం నది అంటుంది సరస్సుతో “నీవూ నేనూ ఒకే కోవ” అనీ సముద్ర మంటుంది మేఘంతో “నీవు ! నేను విడిచే నిశ్వాసం” అనీ దీప మంటుంది సూర్యునితో "నీవూ నేనూ బంధువులం” అనీ నది అంటుంది ఆకాశంతో 'నీవూ నేనూ అన్నదమ్ములం' అనీ పదార్థ మంటుంది అణువుతో 'నీవు నాలో భాగమే' అనీ ప్రాణ మంటుంది గాలితో 'నీవూ నేనూ ఒకటేనా ?" అనీ ఎక్కడుంది భేదం ? రూపంలోనా ? ఎక్కడుంది సామ్యం ? భావనలోనా ? దేని రూపం దానిదే ప్రయోజనచిహ్నంతో, దీనితోనే దేనిదైనా వ్యక్తిత్వం అవసరంపై ప్రతిదీ కలుస్తుంది తనలో కలుపుకుంటుంది ప్రయోజనంతో ప్రతిదీ వీడుతుంది అస్తిత్వం వేరౌతుంది అయినా అనుబంధం తప్పదు ప్రకృతిలో ఏమైనా చివరకు దేని దారి దానిదే
4. ఒకటైన రెండు రెండు గదుల్లో రెండు ఆకృతులు ఇప్పట్లో కలవనివీ ఎప్పుడైనా కలవాలని ఎంతో తాపత్రయం పడేవీ మూసిన తలుపు సందుల్లో నుండో కిటికి రెక్కలు తెరిచో అపుడపుడూ ఒకరి నొకరు తలపులు విప్పి చూచుకునేవీ కాసేపు ప్రేమ ఒలుకుతుంది, కాసేపు ద్వేషం పొంగుతుంది ఒకటి కిటికీ వద్దకు చేరితే ఎపుడైనా మరొకటి చాటున చేరేను కన్పించకుండా’ బయట పడే కోరికతో ఒకటయ్యే ఆశతో ఏ సముద్రమూ ఆ హృదయంతో సరికాదు ఏ ఆకాశమూ ఆ హృదయాన్ని కొలవ లేదు. సూర్యుడు వెలుగు కళ్ళు తెరచిచూచేసరికి
చీకటి గది చెదరిపోయింది. సరే! మంచు పొర తొలగింది
5. కాలం గురించి మాట్లాడకు ! కాలం గురించి మాట్లాడకు దాని చావు దాన్ని చావనీ తలిస్తే చాలు ! తలుపులు తెరచుకొని వచ్చేస్తుంది పిలిస్తే చాలు ! ఎదురుగా పీట వేసుకొని కూర్చుంటుంది కాలం గురించి యోచించకు దాని బ్రతుకు దాన్ని బ్రతకనీ కాలం మౌన శంఖం, దీన్ని ఊదితే వినిపించే ధ్వని, ఈ మాట ! ఈ పాట ! మాట ఊహకు ప్రతీక ! పాట అనుభూతి మరీచి మాట ఉందే చివురాకు ! పదునైన కత్తీ ! పాట ఉందే పుష్పం ! అంగారం. మాట చెప్పలేని దాన్ని మౌనం చెబుతుంది సుందరంగా జ్ఞానానికి దూరంగా వివేకానికి దగ్గరగా తన చుట్టూ తాను తిరిగే జీవితంలో అనుభవాలు కరగిపోతూంటాయి కాలాని కంతం వూహించలేనట్లే జీవితానికీ అర్థం నిరూపించలేం అర్థ రహితంగా పరచుకొన్న ఆకాశంలో అర్థ సహితంగా వెలుగుతాడు చంద్రుడు కాలం మాట మరచి ఈ వేళ నిశ్శబ్ధంగా చీకటితో పోరాడే వెన్నెల గురించి ఆలోచిద్దాం కాలం గురించి మాట్లాడకు దాని చావు దాన్ని చావనీ కాలం గురించి మాట్లాడకు దాని బ్రతుకుదాన్ని బ్రతకనీ చినుకు పడింది సముద్రంలో దాని లోతు తెలుసుకునే కోరిక కలిగింది జలధిలోని ఉప్పన సహించలేక పోయింది గాలి విసురుకూ నిల్వ లేక పోయింది
6. దేవుడైనా సరే తన కోరికగాలికి వదలింది చూచింది బయటికి రావాలని సతమతమై చివరకు సముద్రంలో కలిసింది. ఆలలో ఒకటై చలనంలో పరవశించింది
గ్రీష్మం వచ్చింది అర్చావహ్నులతో, భీషణంగా జల బిందువు లావిరులైనాయి మారింది కరాళ ఋతువు వచ్చింది ప్రమీల సమయం చినుకు పడింది సముద్రంలో దాని లోతు తెలుసుకునే కోరిక కలిగింది మార్పులో నశించిన స్మృతి తిరిగి ఊర్పు తీసికొనేనా ? స్మృతి నిలిచేనా? మార్పు నాపగలిగేనా ? ఆఖరికి దేవుడైనా సరే ! జలధిలో కెరాటాలతో ఘర్షిస్తూ నౌక వలె
7. నా ముందూ వెనకా తుపాను గాలుల్లో వణకుతూ వృక్షం వలె ఉన్న నన్ను చూచావా ? వేడి నిట్టూర్పులు విడుస్తూ గ్రీష్మంలో అవని వలె వడ గాడ్పులకు కనలుతూ చేతులెత్తిన వృక్షం వలె ఉన్న నను చూచావా ? నిశ్శబ్దం గుండెపై అడుగేస్తూ నేను నడిచినపుడు నడుస్తూ నాతో మెలకువకూ నిదురకూ మధ్య రూపంతో ఉన్న నిన్ను చూచాను ! సూత్రానికి వ్యాఖ్యానం వలె అవరించిన ఆకాశాన జలదంలో మెరపు వలె జలదరించే ఊహలో నిన్ను చూచాను లిప్తను క్రమిస్తుంది లిప్త, శక్తిని హరిస్తుంది శక్తి రాలే ఆకూ పూవూ పండూ కాల గతిని జ్ఞప్తికి తెస్తాయి నా వెనుకే వెలిగే స్ఫుటంగా దీపాన్ని బింబిస్తూ నా ముందు మెరిసే అద్దం వలె ఎవరు నీవు ? నాలో గగన రూపమేనా ! నేను నీకు దూరమవుతున్నానా ? లేదు !
8. నాలో బ్రతికి ఉన్నట్లే నా వెనక వట వృక్షానివి ! నా ముందు నిశ్శబ్ద రేఖవు నీ ప్రత్యక్షంలో నా పాత్ర గమనం మరచి పోతాను తెలీనితనం తెలీకుండా తెలీని మలుపుల్లోకి తెలీని వానికి మల్లే తెలీకుండా తీసుక వెళ్ళుతావు ఏదో విశ్రాంతికై కొంత సేపు నామ మాత్రం నిలిచే నివాస యోగ్యంకాని ద్వీపానివి కదూ ! ఇపుడు నీకు పెద్ద తనం వచ్చింది నాకు చిన్నతనం పోలేదు నీవు కదలవు పర్వతం వలె నేను నిల్వలేను ప్రవాహం వలె
తలుపులు తెరచిన ఖైదులో ఖైదీ వలె నీవు కన్పిస్తావిపుడు ముఖంలో హ్లాదంతో శిరస్సు పై ఉష్టీషంతో చేతిలో కృపాణంతో కాలం ఇక కన్పించదు ! చేతి కర్ర మరచి పోకు ! "కుక్కలున్నాయి జాగ్రత్త” నీవు నా నుండి దూరం కావు నేను నీ నుండి దూరం కాను నేడు నీవు స్మృతిలో నిలిచేవు రేపు మేం స్మృతిలో మిగిలేం నీవు దూరమయ్యేవా ? ఏదీ నా ముఖం లోకి చూడు ఈ పోలిక లున్నంత వరకూ నీవు నాలో బ్రతికి ఉన్నట్లే!
9. భగవంతుడు విడిది చేసిన లిప్త భూమి నుండి ఎగసీ నిశ్శబ్దం నిలిచి ఉంది స్తంభం వలె అమూల్య నిధి పోగొట్టుకున్న ముఖం వలె ఉంది వాతావరణం వాలిన బరువు హృదయంతో తెరచిన నక్షత్ర నేత్రాలతో కాలం ఒడిలో పడుకున్న రాత్రి మృత్యు రూపం బింబిస్తోంది నీల జలధి తరంగం వలె ఎదురౌతూంది ప్రతీ క్షణం పెదవులు విప్పలేని పూలు మౌన శిఖల వలె ఉన్నాయి. దుఃఖం ప్రవహిస్తూంది శీర్ణ నది వలె సుఖం బిగిసి పోయింది మంచు గడ్డ వలె కొడిగట్టిన దివ్వె వలె ఉంది ముఖం సన్నని వస్త్రం వలె గాలి దేహాన్ని ఆలంకరింప జూస్తుంది. అంతలో జారి పోతూంది, కదలిపోతూంది. ఊహలో తిష్ఠవేసిన రాత్రి బ్రతుకును పాలిస్తూంది. ఈ చీకటి దారుల్లో ఈ విషాదచ్ఛాయల్లో నలుగురితో పాటు తిరిగే గాజు ముక్కల బొమ్మ లేరుకొనీ అందమైన రంగు రంగుల రాళ్ళతో జేబులు నింపుకొనీ చుక్కలు విరిసిన చీకటి చెట్టు క్రింద విశ్రమించా నా ఫాలనేత్ర కపోలా ధరాల్ని వెలుగు వ్రేళ్ళుచాచి, స్పృశించే అమృత మూర్తి ! ఎవరీ మౌన దీపం రాత్రి ఎదపై జ్యోత్సా కృతి ! మనోభూమికలో జ్యోతిర్మతి నా ఎదుట నిల్చిన రాత్రి నిశ్శబ్దంగా కరిగిపోతూంది. ఇది కల కాదు కదా ! ఎవరి మాటో అట్లా ఉంచి ఇపుడు నా రూపం నేనే గుర్తించ లేనట్లుంది. అమృత సరస్సుల వంటి ఆ కన్నుల్లోకి సూటిగా
తప్పని మరణ సూచికల వంటి నా చూపులు ప్రసరించి కలిసినపుడు ! ప్రళయ స్థితి వచ్చి పడుతుందనుకున్నా. కాని, సుగమ సుందరంగా అవతరించింది మరో సృష్టి ఇది! భగవంతుడు విడిది చేసిన లిష్ట ! వెలుక్కి మనిషి అంటే ఎంత ప్రియం !
10. మబ్బు విరిసి కురిసే వేళ మబ్బు విరిసి కురిసే వేళ మెరపు మొలక నవ్వులతో నీవు పూల రెక్కల ఊహలతో వర్షాఝరీ గమనంతో అవతరిస్తావు నాపై ఒదిగి పోయి పరిమళ వీచిక వలె ఊహలో పరచుకొనీ గగన హృదయం వలె ఊహల ఆకుల చాటు నుండి శబ్ద విహంగమై వచ్చి నీలాకాశం వంపుల్లో సుందర జీవిత దృశ్యంలో సౌందర్య జ్వాలతో విచ్చిన శత పత్రమై కన్పిస్తావు. పూర్వ స్మృతుల సౌరభంతో అవనియై భవిష్యత్తు కల్పనా చిత్రంతో గగనమై మబ్బు విరిసి కురిసే వేళ, అగ్ని బీజ హాసంతో వర్తమాన దిశలో సృజన ప్రకృతివై కదలుతావు మానవ ప్రస్థానంలో మజలీ మజిలీలో అన్వేషణ అన్వేషణలో నిరంతరం మారే రూపానివి ! భూమి తిరుగుతూంది, భూమిపై కదలే మనకు దివా నిశా రూపాల్లో రవి చంద్రుల చలన భ్రాంతి ప్రపంచం ఆకర్షిస్తూంది, ప్రపంచంలో బ్రతికే మనపై త్రివర్గ రూపాల్లో త్రికరణాధికార ప్రభావ ముద్రలు మనోనేత్రం విప్పి చూస్తే ఈ ప్రపంచం శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షం. పైన ఎక్కడో అదృశ్యంగా పాతుకుపోయిన వేళ్ళతో క్రింద కిసలయ పత్ర పుష్ప ఫలవితతి తో ఆకుల కదలికలో సంగీతం! కూర్పులో చిత్ర కళ !
11. అంతమవని కథ ముండ్లు, తుట్టెలు, పురుగులూ ప్రాణం ప్రక్కనే మృత్యువు
గగనంలోకి చొచ్చిన శిరస్సు నుండి జారిన చీకటి జడలు తరగలుదరిపడే కడలి వలె సనాతన వృక్షం పైకి మనిషిని భయపెడుతుంది లోన మనసుకు ప్రియమైందీ. ఈ చెట్టు కొమ్మల్లో గూళ్ళు కట్టుకొని పక్షులు దప్పికతో పిడచకట్టిన నాల్కలతో తపించేవీ చలికి ముడుచుకున్న శరీరాలతో వణికేవీ తడిసి ముద్ద అయి వెచ్చదనం కోసం వగర్చేవీ వసంతం కోసం కలతో ఆశతో బ్రతికేవీ ప్రకృతిలో అవరోధాల్ని నిరోధిస్తూ ఘర్షిస్తూ లంఘిస్తూ లొంగుతూ జయిస్తూ జీవ యాత్ర సాగిస్తూంది ప్రాణికోటి. అనుభూతి సమార్ధమై హృదయం, అనుభవ పక్వమై మనస్సు తుపాను రాత్రి నెదుర్కొనే మహానది వలె ఉదయారుణ రూపంతో జీవితం అన్నిటికీ సంసిద్ధం ! ఈ చెట్టు నీడలో ఒక్కసారి అద్దంలో చూచుకుంటే ! మనిషి ! ముఖంలో ఎన్ని పొరలు ఎన్ని తెరలు ! వాటి వెనుక ఎందరు ! దేవతల రాక్షసుల దృశ్యాలు ! వాటి చాటున ఎన్నెన్ని జంతువులు మృగాలు ! విపరీత తత్త్వాలు ఈ కళ్ళు, చెవులు, మనస్సు! వాటి సేవకులూ అనుచరులేగా ! ఆత్మ నావరించిన ముసుగుతో మనిషిలో వ్యక్తిత్వం ఇంతటిదా ? అంతటిదా ? ఎవరికీ అందనంతటిది ! ఎన్ని సాహస కృత్యాలు చేయించింది ? ఎన్ని నాగరక రీతులు నిర్మించింది ? ఈ ముసుగు లేకపోతే మనిషి ఏ స్థితిలో ఉండేనో ? శిలగానా ? కలగానా ? చీకటి ముద్దగానా ? రేఖలతో చిత్రమేర్పడని వెలుగు బిందువుగానా ? నీల దుకూలం కప్పుకుని వస్తుంది రాత్రి ఆకాశం వంగి విశాల పృథ్వీ ఫాలం చుంబింపజూస్తుంది చెట్టు క్రింద చీకట్లో రెప్పలు వాలి మనస్సు విశ్రాంతి కోరుతుంది. ప్రకృతి చలనంతో మనిషి గమనం! గమనంతో జీవితం ! వెలుగులో చెట్టు క్రింద రెప్పలు విప్పి మనస్సు వ్యాపార నిమగ్న మౌతుంది బంగరు పూల తెల్లని పట్టుశాలువాతో వస్తుంది ఉషస్సు దిక్కుల దృక్కులు చెమ్మగిలి మధు పరాగ కింజల్కాలౌతాయి పృథ్వీ హృదయం జీవకోటిని గుండెకు హత్తుకుంటుంది
గగన హృదయం జీవరాశిని చూచి పరవశిస్తుంది ఒక్కొక్కలిప్త ఒక్కొక్క కిరణం వలె వెలిగి కాలం దీర్ఘ కిరణ తోరణ మౌతుంది ఒక్కొక్క ఊహ ఒక్కొక్క పుష్పంవలె వికసించి మనస్సు మధు పుష్ప దామమౌతుంది బయట మంచు తొలగి పోతూంటే లోపల మసక తెరలు జారిపోతాయా ? రవి అంతటా వెలుగు వీక్షణాలు ప్రసరిస్తున్నా భువిపై స్వర్ణ పథా లందరికీ లభించవు నాగరక సంపన్నంగా ఎదిగిన ఈ వృక్షాన్ని వదలగలమా ? నిదుర పొరల వలె ఆవరించే దీని నీడల్ని మరవగలమా ? పగిలిన గాజు వస్తువుల ముక్కలు! నేలపై కదలే మట్టి బొమ్మల రీతులు ఎదురుగా ! ఈ ఆవరణంలో ఒకటేమిటి ? ఎన్నెన్నో ధ్వనులకూ ! ప్రతిధ్వనులకూ ! రూపాలకూ ప్రతి రూపాలకూ అంకితమైన బ్రతుకులో అహి వలె చుట్టుకున్న అహంకారం అడుగునున్న అంతరాత్మ తెలిసేనా ? సంకల్ప వికల్పశక్తి గల మనిషైనా స్వార్థంతో నిశ్చయ వివేక స్ఫూర్తి గల మనిషైనా ప్రయోజనంతో ఈ చెట్టు నీడ తప్పదు ! ఈ జీవిత స్వప్నం తప్పదు ఇదో ! మొదలు తెలీని, ఓ అంతమవని కథ ! ఆత్మలు ముడుచుకొని పడుకున్నాయి శవాలు లేచి తిరగడ మారంభించాయి శూన్య భాండంలో ఒక్క మధు బిందువు ఒలికినట్లు జలధి తీరాన చూపులో ఒక నావ కన్పించినట్లు ఈ రాత్రి అంతమవుతుందన్న శుభవార్త !
12. అంతమవని రాత్రి గాలికి రాలే ఆకుల వలె ఊహలు సాగిపోతున్నాయి ఎవరి కోసం నిరీక్షణ ? ఎవరు వస్తారీ సమయం ? ఎవరో అమృత మూర్తి వచ్చి ధైర్య మిస్తారనే ఆశ! అయితే ఆ వచ్చే దెవరు ? శవాల సోదరులు ! ఆ నీడలా ! పగిలిన అద్దం ముక్కల వలె స్వప్నం చెదరి పోతూంది
ఇపుడే రూప రేఖలు స్పష్టంగా కన్పించడం లేదు నిదుర వస్తే హాయిగా ఉంటుంది ! ప్రపంచాన్ని మరచి పోవచ్చు కాని ప్రపంచాన్ని మరవాలనుకోడం పిరికితనం ఉదయం కన్న ముందుగా శవాలు లేచి తిరుగుతున్నాయి నేను నవ్వి ఊరుకునే కన్నా చేసే దేముంది ? రాత్రి అసంఖ్యాక తారకల నుండి జారిన వెల్గులు శరీరాల్ని తాకి ప్రవహిస్తున్నాయి ఈ ప్రపంచం నాదై నాది కాదన్నట్లుంది చీకటిలో కొంతభాగం ! వెలుగులో కొంత భాగం ! ఉన్న ఒక్క సత్యం - సూర్యుడు, ఆశలో పాతేయబడీ ఉన్న ఒక్క చైతన్యం, కాలం చీకట్లో బంధింపబడీ ఉన్న ఒక్క ఆనందం ఇంకా చీకటి తెర వెనకే ఉంది. అంధకారంలో కన్పించనివి వెలుగులో దర్శనమిస్తాయి కొత్త ఎక్కడుంది ? ఉషస్సు వెలుగు చూపులో తప్ప ! మానవత ఎక్కడుంది ? మనిషి ఆర్థ భావనలో తప్ప ఎవరికి వారే మేల్కొన్నట్లు ప్రక్క వారిని ప్రబోధిస్తున్నారు మనిషి ఎప్పుడు మేల్కొనేను ? మనస్సు ఎప్పుడు ఉషస్సు చూచేను ? ఆత్మలు ముడుచుకొని పడుకున్నాయి శవాలు లేచి తిరగడ మారంభించాయి
13. ఎవరది దూరంగా ఎవరది దూరంగా ? చెదరిన కేశ రాజితో బొప్పి కట్టిన ఫాలంతో విసరే వాయు ఛురికలకు గంటు పడిన కపోల పాళితో. దెబ్బతిన్న బుజాలపై మాయని గాయాలతో అడుగులో అడుగేస్తూ సాగే గ్రహణం వీడని బింబం ! ఎవరిది ? ఆడిన మాట తప్పని మతితో మెప్పుకై సముద్రంలో దూకేందుకూ వెనుదీయని వరదల్లో కొట్టుకపోవడానికీ సిద్ధంగా ఉన్న మూర్తి శాంతి సహన రూపం ! చేతులు కాల్చని మణిదీపం దారిద్ర్యం ఆకలి ఎండల్లో నిన్న! గమనం సాగించిన సాహసమతి ! వేసిన తప్పటడుగు పరిణామం ఇంకా తెలిసిరావడం లేదు. భోజన వేళ టైబిల్ పై నుండి క్రింద పడి ముక్కలైన గాజు పాత్ర పై ఆశ వదలి కొత్తది యత్నించక తప్పదు
మమకారం పెంచుకొని గాజు ముక్కల్ని ఏరుతూ ఆవేదన పడే కన్నా అలౌకిక మేముంది ? చరిత్రలో ఇంతకూ ఎవరా ? జ్ఞాపకం రావడం లేదూ ? చితికిన సౌందర్య దీపం ! తెలివిలో జారిన నిజ స్వప్నం ! గంధం ఇగిరి, వెలుగు తరిగి వర్ణం మాసిన, మనోరూపం ఎక్కడ చూచిందీ గుర్తుకు రానంత వాలకంతో ఉంది ! ఎండలో చలిలో వానలో నిశ్శబ్దంగా నిలిచిన రోదసి ఆత్మ నేత్రం తెరచీ రహస్యానికి సాక్షిగా ఉంది సంస్కారం సౌభాగ్యం ఔజ్వల్యం పూర్వం ఆకాశమంత ఎత్తుగా వర్తమానం మాత్రం వాస్తవంలో పీడకలగా ! ఎవరది దూరంగా ! బరువు రెప్పల క్రింద అణగిన వెలుగుతో వెలుగు చూపుల్లో కదలే చీకట్లతో మెడపై నిల్చిన ముఖంతో మబ్బు మెరపు చూపులతో మండు టెండల ఎదలతో చెవులు దిబ్బళ్ళు వేసే గోడులతో జన సమూహ రూపం ! ఈ దేశం ! నా రూపం ! మనిషిలో చీకటి వృక్షమైనపుడు ఏ దేశమైతేనేం ! వేరు వేరు పోతల్లో అంతా ! అజ్ఞాన శిల్పాలే ! మనిషిలో మానవత పసంతమైనపుడు ఏ భాగమైతేనేం ? అంతా చైతన్య శిఖలే ప్రజలు ! నా రూపం, జనరూపం
14. ఎవరు మీరు ? అస్తమించే సూర్య బింబంతో ఆనందం వీడే ఆకాశం లాంటి నా ముఖంలోకి తొంగిచూస్తూ నీడ బొమ్మల వలె మౌనంగా వెళుతుంటారు ? ఎవరు మీరు ? సభయ రూపాలా ? ఉదయించే చంద్రబింబంతో విషాదం వీడే ఆకాశం లాంటి నా కళ్ళముందు తారాడుతూ నీలి నీడల వలె దీనంగా భ్రమిస్తూంటారు ? ఎవరు మీరు ? నిరాశా రూపాలా ? వెలిగే దీప శిఖలు ఆకాశంలో విడిది చేసే వేళ కాలాన్ని మ్రింగజూచే చీకటి వలె ఎదురౌతారు ? ఎవరు మీరు వృక్ష వర్షీయసి కోర్కెల ఆకులు విడిచే సమయం శైశిర విచార వాయువు వలె వస్తూంటారు ? ఎవరు మీరు మిమ్మల్ని చూడగానే నా గుండెలో పూచిన పూలు కళ్ళ నుండి జారి రాలి పోతాయి ! ఎవరు మీరు
గగన వీధి పాలవెల్లి వలె మస్తిష్కంలో విరిసిన ఊహలు చలించడం మాని అదృశ్యమౌతాయి ! ఎవరు మీరు దీపానికి నీడ ఎంత దూరమో ? నా కంత దగ్గరలో వెలుగు మేడ క్రింద చీకటి మెట్ల వలె నిల్చిన మీకు నా మాట వినిపించడం లేదూ ! మీరు చీకటి మనుషులా ? అరె ! కన్పించరేం ? ఇంతలో ఏమయి పోయారు ? భానూదయంతో నా శరీరం కాంతి శిల్పమయమైంది నటత్ కిరణ ప్రావారం నా భుజాంసాల్ని అలంకరిస్తూంది నా మనో రూపం జీవన రస తీర్థమైంది ఇది జీవశక్తి సంకేతం.
15. కత్తుల్లా వత్తుల్లా ఐదు కత్తుల్లా పొడవైన వేళ్ళు పొడి చేస్తాయి కలసీ విడిగా ఇవి బాంబు విసరి జీవితాన్ని త్రుంచేస్తాయి ఆశీర్వదించి ఆయుస్సు పెంచుతాయి కలసి నిలుస్తాయి శక్తికి ప్రతీకగా గాలికి ఆకులు మాట్లాడినట్లు మమతా లోలమై హృదయం ఆ రోజు రావచ్చు ! ఏ రోజైనా కానీ కత్తులు బూజు పట్టి, వత్తులు అవసరంలేనీ స్నేహ సమయం ! కత్తుల మెరుపుల్లోనూ వత్తుల వెలుగుల్లోనూ నడిచే మనిషి గుండెలో చల్లని సూర్యుడూ లేక పోలేదు ఆరోజు రావచ్చు మనిషే కిరణమై పుష్పమై బ్రతికే రోజు నీలాకాశ గుహ నుండి వెడలిన కాంతి సింహం
16. కాంతి సింహం గగన కాసార దర్పణంతో ముఖం చూచుకొని మురిసింది. బంగరు పూలు పూచిన కాంతి నికుంజం వలె రోదసీ వితర్దికపై సంతోషంగా కూర్చుంది ! నన్ను చూచి నవ్వే సింహం నాకెంతో ముచ్చటైంది దానితో సంతోషంగా కాలం గడపాలని చేయి చాయి సైగ చేసి పిలిచా నాపై జాలి కలిగి కాబోలు ! కదిలింది ప్రక్క నున్న గాజు గ్లాసులోకి దూకింది.
నీటి చుక్క తొణకలేదు గాజు గ్లాసు కదల్లేదు. వేలాడే మంచు తెర తెగిపడినట్లు గాలికి కాసారంలో లహరి లేచి పడినట్లు పగిలే వీల్లేని ఎత్తు నుండి గాజు బొమ్మ పడినట్లు నా ఎదలో సన్నని ధ్వని ! కాలం ఆగినటె ంది. గాలి తెరపై తుమ్మెద కాలి జాడ వలె నీటి అలపై గాలి తెర కదలిక వలె గుండె పొరలో జారే రాగం మొదటి స్పర్శ వలె వేళ్ళ కందీ కందని పాద రసం గుళిక వలె ! నా హృదిలో నవ్వుతూ కాంతి సింహం ! ఓటమి నంగీకరింపనీయని విజయ రూపమైంది చీకటి గుహ ముందు అగ్ని నికుంజంలా నిల్చి మెరపులా దూసుకొని వచ్చి నిండు ప్రాణం తీస్తుందనే మాట ! ప్రస్తుతానికి నిజమయినట్లు లేదు. కాంతి సింహానికి భయపడి పరుగెత్తి చీకటి గుహలోకి చేరడం కన్న మృత్యువు నయం ! భయపడడం అజ్ఞానం, దాగిపోవడం తిరోగమనం
17. కీర్తి స్తంభాలు సుజాతకుల హృదయ ద్వార కవాటాల ముందు ప్రేమామృత జిహ్వల చాచి తారాడే భుజంగాలు, శత్రువు కళ్ళముందు దివా రాత్రాలు నటించే పెను భూతాలు కాల మహావేదికపై ! నిల్చిన ఒకనాటి కీర్తి స్తంభాలు వేదనతో కంపించి హృదయాబ్జం బాధలతో శీర్ణమై తనూ శైలం నేడు ధాళ ధళ్య స్ఫటికాకృతి ప్రాంశు మూర్తియై నిలిచింది ! అందరితో మౌన భాష మాట్లాడుతుంది ప్రశాంతంగా చందన శీతల పరీమళ వాయు హాస శ్రీలతో అపరిమాణ వాజ్రేయ శరీరాలతో అవిగో ! కీర్తి స్తంభాలు గగన తలంపై వెలిగే సూర్య చంద్రులు ఏ విశ్వనాథుని కీర్తి చిహ్న కేతనాలు ఈ దిశా ఫాలం నుండి ఆ దిశా ఫాలం దాకా మంటి నుండి మింటి కెగసి నిల్చాయి
అజంతా తాజ్మహల్ వలె హేతువుకతీతంగా తెలుసు నాకు మేఘమా ! నాపై నీకెంత ప్రేమో ? పిడుగులు విసిరిందీ జ్ఞాపక ముంది సుమీ ! నీ కళ్ళల్లో మెరపు ఎంత అమాయకంగా బయట పడేదో నాకు బాగా తెలుసు ! పొగల తెరల చాటున దుమ్ము పొరల మాటున బ్రతుకుపై ఆశతో ఎద ఏడ్చే మాట నిజం ! బీట లేసిన నేలపై నీరాకకై వేచిన ఎందరికో నింగిలో నీ రూపంతో మదిలో ఎంత సంతోషమో ! అద్దంలో నీడలో వలె మనసులో బొమ్మలు ఉరుములతో మెరపులతో కదలిపోయే మబ్బులు చిత్ర విచిత్రా కృతులతో నవ్వుతో కోపంతో వచ్చిపోయే
18. తెలుసు నాకు మబ్బులు ! మనిషిలో నిరీక్షా దిశదిశలో ఆశలు ! కొత్త బంధుమూర్తులు ! అగ్ని దేవతా ముఖంలో గీష్మం నడిచే దారుల్లో సూర్యుడు తెరచిన కళ్ళ నుండి కణకణలాడే పూలు ! నియంతల హంతకుల గుండెల గోరీలపై విరబూచి వేడి నిశ్వాసం విడుస్తూ ధూమంతో మ్రగ్గే పూలు ! విద్యుత్తులా ప్రాకి శరీరంలో శిల వలె దిమ్మెక్కించే తమలో చల్లదనం ఎరగని నిప్పుపూలు ! పైకి నవ్వులు చిందే అకాల మృత్యు రేఖలు మరో రీతి నిప్పు పూలు అంతటా దొరికేవి కాదు మధుర మధుర గర్ణానినాద జలధారా మేఘంలో మృదు సుషీమ వాస్తరంగ జలధి కవి హృదయంలో నివాసం ! ఆ కవితకు వీటి పరిమళం ప్రాణాధారం స్వేచ్ఛా కాంతి కిరణం కోసం పరితపించే ఊహల్లో అర్థరాత్రి పన్నిన వలలో చిక్కిన ప్రాణికోటి గుండెల్లో
19. నిప్పు పూలు ఏ మారణాస్త్రాలకూ మాడిపోని పూలు నిప్పు పూలు ఎదలో క్రమ్మిను చల్లదనం పొగొట్టే వెచ్చవెచ్చనిపూలు !
20. పిస్టల్ పేల్చిన కవిత ఎగిరే జెండా వదిలి చేతిలో పిస్టల్ వహించాడు కుర్రడు పిస్టల్ మోతకు భయపడి దగ్గరలో ఉన్నవాళ్ళు పారిపోయారు దూరంగా ఉన్నవాళ్ళు తమలో నవ్వుకొని మిన్నకున్నారు పిల్లలకేమో ! అపుడే దీపావళి వచ్చిందా ? అనిపించింది గుండెలు సవరించుకొనే కొందరికి భయశ్రీకంగానూ ఉంది అతడు నడి వీధిలోకి రాగానే దారులన్నీ మూసుకున్నట్లుంది మిగిలింది నిశ్శబ్దం నడచే రాత్రి గుండెల అడుగుల సవ్వడీ ! పిస్టల్ మ్రోగింది మళ్ళీ, కొంతసేపటికి చూస్తే ఏముంది ? బద్దలైన ప్లాస్టిక్ తొడుగుల ముక్కలు క్రింద పడిఉన్నాయి సీసా మూత తీసే సరికి నురగలతో పొరలే బీర్ వలె కవిత్వం వీధిలో నృత్యం ఒక సరదా ! చీకట్లో పిల్లి కళ్ళ మెరపుల అందం తెల్లారింది ! వెలుగులు కళ్ళప్పగించి చూస్తూన్నాయి ప్లాస్టిక్ ముక్కల్ని ఏరి కూర్చి కేస్ నమోద్ చేసింది పోలీస్ స్వేచ్ఛాకవచం తొడిగె వెంటనే విడుదలచేసింది న్యాయస్థానం అంతలో శబ్దం వీథిలో మంటలతో పైకెగసింది కేకలతో అతడు కన్పించాడు గతి తప్పని రాత్రి వలె నిశ్శబ్దం మిగిలింది కాలశిఖపై సుళ్ళతో మౌనం వెలిగింది నీడలు చిరు మంటలతో నెత్రు చిత్రాల కలలు కంటూనే ఉన్నాయి నాలుగు వైపులా తిరిగింది అది ముఖమా ? ముసుగా ? తొడుగా ? దిశ దిశ మెరుపులతో సందేహాలు ప్రశ్నల్ని వదలుతున్నాయి. చుక్కలతో సముద్రం వలె కళ్ళు ! ఎండలో మంటల వలె మాటలు ఓపిగ్గా నిలిచి చూస్తే ఏముంది అంతా పిస్టల్ మ్రోగిన కవిత్వం తొలి మలి సంజల్లో విరిసే మల్లె పొదలపై నుండీ త్రాచుల పూత్కారాలతో, తుమ్మెద బారుల రొదలతో వెలుతురులో చీకటిలో గుప్పున కమ్మని తావులతో ప్రాణ తర్పణంగా తీవ్ర తీవ్రంగా ప్రాణ ఘాతుకంగా
21. మరవలేని గాలులు నిండుగా కపాల రంధ్రాల్ని పూరిస్తూ సంరావంతో వచ్చే గాలులు ! యంత్రం వలె వేగంతో బ్రతుకులు విడిచే బరువు నిట్టూర్పుల్నీ నాగలి వలె కదలే బ్రతుకులు విడిచే కోష్ట విశ్వాసాల్నీ
జీవితంలో మోసుకోచ్చే అనుభవ సంభారవాహులు సగం గాలిలో సగం నీటిలో ఉన్న నా గుండె నూపే గాలులు భూమికి జలదాగమన రహస్యం తెలియ జేస్తూ కౌగిలిలో వృక్షాంగనలకు కబుర్లు చెబుతూ హృదిలో అగ్ని రగిల్చి, దీపం వెలిగించి వెలుగుపంచి దశ దిశల ఆలోచనా కిర్మీర పరాగం చిమ్మే గాలులు ! అంబుధి విలోల వీచీ నిస్వానం వినిపిస్తూ బహు దూర దేశ సమాయాత వార్తావాహులు బ్రాహ్మీ ముహూర్త మహిత వేళ సృష్టి రహస్యంతో జగతిని మేల్కొల్పే ఉషః కాల సాంగీతికులు శిలల ఒరపిడితో కదలే సెలయేరు నవ్వుల సవ్వడితో నా గొంతులో పాటకు శ్రుతి పోసీ ధ్వని నిచ్చే గాలులు ఎత్తిన అలల తలలపై మెత్తని కాలూని వచ్చే గాలులు ! ఆరని ఎద మంటలతో శత్రువు వలె కదలిస్తూ కవ్విస్తూ పసి పాపల ముఖాల్లో వెలుగు నవ్వుల వలె కదలుతూ నటిస్తూ వచ్చే ఈ గాలుల్ని నే నెలా మరవగలను ? పురా ప్రకృతి బింబాన్ని స్మరింపజేసే ముద్రల్ని మరవగలనా ?
22. మూసుకున్న ఐదు వేళ ్ళ లోకంపై మమత ఇంకా వదల్లేని సూర్యుని ఆశలు గ్రీష్మంలో పలాశల వలె దిక్కులు పట్టుకొని వ్రేలాడే సమయం అసివాళ్వోయి ఒక రాతి పరువుపై కూర్చున్నారు, ఐదుగురు నెరవేరని కోర్కెల ప్రకాశనంతో కాలం గడుపుతూ ఆకాశం ఒక ఇంటి కప్పు ! ఇప్పట్లో కూలదనే నమ్మకం ! దిక్కుల గుండెల్లోకి చొచ్చిన భూమి మనిషి జన్మించడంతోనే లభించిన స్థిరాస్తి జీవన గమనాన్ని పాలించే ఊహా శక్తి ! చరాస్తి ! ఒకరి మీద మరొకరి కధికార మసలే లేదు ఎవరి కిష్టమైన పని వారు చేసుకోవచ్చు అందరికీ వెలగబెట్టాలనే ఉంటుంది కాని తగిన శక్తీ, స్తోమత కొంతవరకే ! ఈ ఐదుగురూ దేవుని కాలి వేళ్ళు అంటారు కొందరు రాక్షసుని చేతి వ్రేళ్ళ నీ అంటారు మరికొందరు
ఏమైతేనేం ! ప్రయోజనం మేర మారే మైనపు బొమ్మలు ! అపుడపుడు వినిపిస్తాయి ! ఊళలు అరపులు ఈలలు ! చప్పట్లు ఇవి వారి సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు, కాని మనిషి చేతివ్రేళ్ళు అనుకుంటేనే బాగుంటుంది సన్యసించి మిధ్యా భావనతో పరమార్థం శోధించే తత్త్వమతీ హస్త గతమైన అధికారంతో ప్రజల్ని శాసించే పెద్ద మనిషి విద్యా విలసనంతో యశో జీవితం కోరేలోక హితవాదీ పరలోక ముందో లేదో వర్తమానం కోరే వాంఛా మతీ ప్రాణాన్ని ఘనంగా తన నిల్వ ధనానికి లంకె వేసే వ్యాపారీ జీవితంలో వారి వారి ఆశల ఊహల ప్రకటనానంతరం ఎవరికి వారు లేచారు ఇంటి ముఖం పట్టారు చాచిన ఐదు వ్రేళ్ళు మూసుక పోయాయి హఠాత్తుగా మింటి కప్పు కూలినటె ంది చెల్లని కరెన్సీ నోట్ల వలె భూమి పై శరీరాలు !
23. మేల్కొని ఉంటాను బ్రతుకులో మార్పులు ఊర్పులతో పయనించే గాలుల కదలికలో పగలు మరచిన రాత్రితో, రాత్రి ఆరని తెలివితో ఉంటాను నాపై పగటి ముద్రలు పూర్తిగా వదలపు రాత్రి నాపై రాత్రి ముద్రలు పూర్తిగా వదలవు పగలు గొంగళీ పురుగు నుండి సీతాకోక చిలుక వలె రాత్రి నుండి మంచుతో అవతరిస్తుంది ఉదయం బలంగా గాలి తెర వీస్తే ఎక్కడి దక్కడ తునాతునకలై పోతుందా ? అన్నంత సుకుమారంగా ఉంటుంది సమయం పొద్దెక్కిన కొద్ది వేడి హెచ్చిన కొద్ది ప్రశంసలతో మొండి ఘట మనిపించుకుంటుంది ఉదయమయ్యే సరికి సన్నని కన్నీటి తెర వలె మంచు ! ప్రొద్దెక్కుతూన్న కొద్దీ ధైర్య కవచం వలె కాంతి ! రాత్రి అయ్యే సరికి త్యాగ జలం వలె చీకటి అంతగా మండే సూర్యుని క్రింద చెమటోడ్చుతూ అంతగా విసరే చలి గాలికి మేను ముడుచుకుంటూ ఎందరో పని చేస్తూంటే నేనింకా నిదురపోతూనే ఉన్నాను ఈ నిదుర మృత్యువు కన్న కొంత తేలికైంది
ఈ జీవితం మృత్యువు కన్న చాలా బరువైంది పగలంతా ప్రపంచం సముద్రంలో పడబోతున్నట్లుంటుంది పగలంతా ప్రపంచం అగ్నిలో ఆహుతి కానున్నట్లుంటుంది కాలు పెడితే కంఠ దఘ్నంగా కూరుకపోయే ఇసుక దిబ్బలు ! శూన్యంలో దృక్కులు ప్రసరిస్తూ దూర దూరం కదలే పెద్ద మనుషుల లాంతరు ముఖాలు ! ఇప్పు డెవరికి కావాలి ? బుజాల వెనుక నుండి నక్కలు నిక్కి చూస్తూంటాయి పాదాల వెనకాలే నీడలు నక్కి వస్తూంటాయి. ఊళ్ళు పట్టణాలు పొలాలు ఎడారులు సముద్రాలు దాటి ఇక మన గమనం, గగనంలో చంద్రుని పైకి ఆపైకి పయనానికి హద్దు లేవు ఊహకు పరిధులు లేనట్లే వర్తనకు తీరూ తెన్నూ లేదు మనసుకు విధం లేనట్లే పగటి బ్రతుక్కి వేళ్ళు దన్నుకొని అలవాట్లు ఎంత లోతుగానో పాతుక పోయి ఉన్నాయి రాత్రి అంతా ప్రపంచం శాంతి వరించనున్నట్లుంటుంది రాత్రి అంతా ఎద దేనినో అన్వేషిస్తున్నట్లుంటుంది స్థూలం నుండి సూక్ష్మానికి సాగే మనో గమనంలో నేను తప్పకుండా మేల్కొంటాను పగటి మగత పోయి తీరుతుంది ఈ భూమి పూలతో పండ్లతో పంటలతో నిండుగా ఉండాలనే ఆశ ! చావు నేలలో భయం వలె మగత ముఖంలో దాపరికం వలె నింప బడుతుంది. మనిషి కన్నీటి తెర వెనక రాత్రి వెనుక కాంతి వలె ఊహల్లో వాంఛల్లో ఆశా మనోజ్ఞ రూపాలు ఒక తరం పోయి మరో తరం వస్తూంది అసహజమైన పగటి భయం పోయి మనస్సు ధైర్య రూప మందుకుంటూంది పగటి కలలకూ పగటి మగతకూ అవకాశమీయని నవోదయ మనో రూపులు వాసంత జీవ కళలు ! వీరి కన్నుల్లో రెక్కలు విప్పి ముఖంలో పరచుకొన్న కాలం అమృతం వర్షిస్తుంది ! నేను తప్పకుండా మేల్కొనే ఉంటాను !
24. రా ! రాత్రి అయి రా రా ! రాత్రి అయి రా ! ఎందుకంటావా ? చెప్పనా రా ! నిశ్శబ్దమయి ఇక్కడ మెలకువతో పని ఉండదు శబ్దంతో స్వరంతో పనిలేదు, సంగీత ప్రసక్తే లేదు స్వప్నమయిరా ! ఈ లోకంతో పని ఉండదు బాధ ! దుఃఖం! ఆ దేవునికి వదిలేయొచ్చు! రా విప్లవమై ! వేయి సూర్యులు నీలో మండేరు మృత్యుపదం ఎదురైనా ! కొత్త సృష్టి కోరవచ్చు రాత్రి అయి రా ఎందుకంటావా ? చెప్పనా ! ఉన్న మతిని చీకటి కొనేస్తుంది, రహస్యం రక్షితమవుతుంది
25. రెక్కలు దాల్చిన కొండలు వాయువు కదలిక లేక మేఘాలు స్తంభించి పోతున్నాయి ఈ ఖండం నిష్పలంగా మారే ప్రమాదమెంతో దూరం లేనట్లుంది ఇంకి పోయి ఆవిరి ఐ పోగా మిగిలిన నీరు అడుగనపడింది ఇపుడు కన్పించడం మానేసింది. కృత్రిమమైన రెక్కలతో కొండ లెగురుతున్నాయి కళ్ళపై నమ్మకం చావని కొందరు కళ్ళప్పగించి చూస్తున్నారు సంతోషంతో వెంటబడి కొందరు తప్పుక పోజాస్తున్నారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై కోలుకొనీ కొందరు మరో వైపు ముఖం పెట్టి త్వర త్వరగా నడుస్తున్నారు కిచకిచలతో రుసరుసలతో ఆగడాలకూ ఆతతాయిలకూ దిగే కోతుల్ని దండించడానికి పాలకులు భయపడుతున్నారు ఇవి ఆంజనేయుని బంధువులని కాదుసుమా ! డార్విన్ను అనుసరించి తమ పూర్వీకులనా ? కాదు అంతకన్నా బలమైన కారణ ముంది ! మీకు తెలిసే ఉండాలి ! ఇరువురి నివాస ప్రయోజనమూ ఆ కొండలే అని ! ఇవి తృప్తిగా తిని యధేచ్చగా గంతులేస్తాయి కారణం లేకో ఉండో మీద పడి రక్కుతాయి భయపెడతాయి ప్రాణాలు తీసే సాహసమూ తెలివి లేక పోలేదు గలభాకు గాభరాపడి హడావిడిగా పరుగెత్తుకొచ్చి తమ ఉనికిని తెలియజేసే రక్షకుల నుండీ ఈ పని జరగొచ్చు
మరచాను వీటికి తోడు ! తొడేళ్ళు నక్కలూ ఉన్నాయి వీటి ఎత్తులకూ జిత్తులకూ చదరంగాలు ఆగవు వీటి ఊహను ఉపమిస్తే సరిగ్గా నల్ల బజారు అడవిలో కొండల మెండు రూపాల చిత్రణతో పోటీ పడుతూ వాతావరణ సూచనలూ వర్షాలపై వ్యాసాలూ వెలువడుతున్నాయి వర్ష ఫలం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు సామాన్యులు రెప్పలెత్తి జల మౌక్తికాలు విడిచి అడుగులు వేస్తున్నారు కొడుకులపై నమ్మకం లేక అవిశ్వాస వాతావరణంలో కొందరు ముందుగా ఎవరి కర్మ వారే, చేసుకుంటున్నారు పితరుల పై అభిమానం చచ్చిన కొడుకులు ఎక్కడైనా పెంపకం పోవడానికి సిద్ధపడుతున్నారు ఇదంతా ఎవరికి కావాలి ? కందకు లేని దురద చేమకు వలె ! జీవంగల చెట్లకూ ! గమనం గల నదులకేనేమో సామాజిక చైతన్యం గల మనసుల కేనేమో ? చెట్లలో పచ్చదనం మాయమౌతూంది నదుల్లో తరగ లణిగిపోతున్నాయి ప్రస్తుతం ! మేఘాల స్థానంలో ఎగురుతున్నాయి రెక్కలు దాల్చిన కొండలు సంఘంలో జడశక్తులు !
26. విదూషక పాత్ర నోరు తెరిస్తే మాటలుకాదు జారేది బాకులు నోరు మూస్తే చేతుల నుండి జారేది బాంబులు కాలు సాగితే నేలపై చిందిన నెత్తురు మరకలు ఆవలిస్తే గాలిలో మండే అగ్గి పిడుగులు సైగ చేస్తే కంకాళాలు లేస్తాయి కపాలాలుపాడతాయి నేనెవరో తెలుసా ? వైప్లవ యంత్రాన్ని ప్రజా తంత్రాన్ని బులెట్ వదలక ముందే ! హఠాత్తుగా శరీరంపై రక్త చిత్రాలు అంతలో నిశ్శబ్దం! ప్రాణమున్న ఘన జడం సమాజం కాసేపు బ్రతుక్కి ఉరితాడు బిగించి జోకొట్టి బార్ లోకి నడిచే అడుగుల్లో తూగే విప్లవంతో ఈ నాటకంలో నాయకుడు విదూషక మహాశయుడే భీభత్స మతి అంతో ఇంతో వహించే ఘన పాత్రే
27. వయొలిన్ పై రాగంతో వయొలిన్ పై రాగంతో వస్తావూ మైడియర్ ఫె ండ్ రా ! వెల్కమ్ దారిలో కారు వేగంగా పైబడి వస్తుంది తొలగిపో తొందరగా అదేం మెలకువ ! ఆ ధ్వని వినిపించదూ సంగీతం వినిపించేవా ? వయొలిన్ పై భృంగీ గణ నిస్వానంగా, జనంలో కదలేవా ? పొరపాటు పలికానా అయితే ఓ సవరణ రైలు విజిల్ రవళితోరా గొంతు విప్పుతావూ ! ఆపదలో హారన్ హఠాత్తుగా మ్రోగినట్లు గంతులేస్తావూ ! వేగంలో స్టీరింగ్ తప్పిన జీపు వలె దారిలో పో ! త్వరగా పైకి ! తొలగిపో ! అపాయం కలుగుతుంది జాగ్రత్త ! పగలూ రాత్రి పంచుకొని నిల్వకు సగం మనిషి సగం జంతువై నిదురవైతే ఏమౌతుంది ? వాహనమే నిన్ను తప్పుకుంటుంది జడమైతేనొ ? వాహనమే దిగాలుపడి ప్రక్కగా తొలగి పోతుంది నీ వైతే క్షేమంగా రాగంతో యధేచ్చగా పోవచ్చు ఒళ్ళు మరచి దారిలో అడుగేయకు ! కళ్ళు తెరచి నడూ వాస్తవ తలంపై మనసు విప్పి పరిమళాలహరి చిమ్ము ! వయొలిన్ పై రాగంతో వస్తావూ ! మైడియర్ ఫె ండ్ పొగ క్రమ్మని ఎదతోరా ! సాలోచనగా మరీరా ! కోర్కెలకు మెరుగు పెట్టి జిగేలుమనిపిస్తుంది వెలుగు అణగ ద్రొక్కబడిన ఆశలు బయట పడే ద్వార మౌతుంది చీకటి ఇపుడు చీకటితో పనిలేదు నిద్ర అంతకన్నా పనికి రాదు శక్తి స్పందనతోరా ! రాగ విలసనంతో రా వెలుగు మొగలి రేకై రా ! బాకు చూపులతో సింహం వలె నిల్చిన సమయం పూల చూపులతో హరిణంగా మారనీ మిత్రమా హిమ శకలం కరిగిస్తూ ప్రాణంలో ప్రాణమై రా వయొలిన్ పై రాగంతో జీవన ధునియై ప్రేరణయై
28. ్వతేతర విహంగాలు భవిష్యత్తు రేఖా గమనం మార్చే ప్రజాహస్తాల్లో చిక్కిన తమ జాతక ఫలాల కోసం 'క్యూ' మార్్క ముఖాలుచాచి రాత్రి భూమి కంకట తిరగే భూతాల దేహచ్ఛాయల వలె మూకల మూకలుగా ప్రతిచోట ! శ్వేతేతర పక్షులు ! కాంతి హస్తాల క్రింద వెలిగే శాంతి హృదయ వాటికలో
అంటు చీకటి చెట్లు నాటి నిప్పు పూలుపూయించాలనీ నింగి నావరించి భ్రమగొల్పే తెల్లని రెక్కలుచాచి మిన్ను అన్ను బట్టేట్టు నినాదార భటీ శబ్దాలతో రేపటికి వేసే బాట కన్నా ముందు మాపటి కాడే ఆటలో రక్తి కట్టాలని అహరహం వీలైనంత శక్తి సమీకరిస్తూ ఏకంగా ధాత్రి నిండా వాలిపోయి సాంతం రాత్రి మయం చేయాలనీ ఉద్రేకంతో రివ్వు రివ్వున ఎగిరి ఎగిరి వస్తున్నాయి పన్నిన కాంతి ఖడ్గ జాలంలో అన్నీ విశ్రాంతి తీసుకునేనా ? విహరించే శ్వేతేతర పక్షులన్నీ కన్పించే స్వేచ్ఛేతర కక్షలోవి
29. సముద్రం బింబిస్తూంది నాలో చెలియలి కట్టపై నిల్చిన నా ముందు వస్తూపోతున్నాయి నౌకలు ఒడ్డుకు కదలి వచ్చి మెల్లగా విరిగిపోతున్నాయి తరగలు ఏముంది అంతటా నీరు నురగ బొమ్మలూ ! తరంగ చిత్రాలూ ! దగ్గరలో పర్వతంపై మేడ అందులో జీవితం భద్రమైంది నిరంతర చలనంతో సముద్రం సమాజాన్ని జ్ఞాపకం చేస్తోంది వెలుగులో సముద్రం విరిసిన ఇంద్ర ధనుస్సు వలె ఉంది అక్కడక్కడ వాలుతూ పక్షులు కోర్కెల్లా ఎగురుతున్నాయి చీకటిలో సముద్రం వాడిన పూల చెండ్ల రాశి వలె ఉంది బుసలు కొట్టే నల్ల త్రాచులునిక్కి నిల్చి తూగుతున్నట్లుంది జవాబు లేని ప్రశ్నల తూణీరం వలె ఉంది సముద్రం దీనిపై సూది మొన కాళ్ళతో వెలుగు నడుస్తూంది దూర దూరం తీరం వదలి వెళ్ళుతున్నాయి నౌకలు మిగిలేది సముద్రం ! చెలియలికట్టపై కాసేపు నేనూ నాపై నున్న ఆకాశం ఆదర్శం వలె ప్రతిఫలిస్తుంది సముద్రంలో సుళ్ళు తిరిగే హృదయంతో సముద్రం జీవితంవలె బింబిస్తూంది నాలో అంగారనిధి గ్రీష్మ దేవత మృగతృష్ణ పెంచే వేళ
30. స్నేహ వీచి తడి ఆరిన పుడమి గొంతుక నీటికై తపించే వేళ
శిలవలె హృదయం ఘనీభవించి ప్రపంచం పర్వతమయ్యే వేళ ఎక్కడి నుండో ఏ కోన నుండో జలధి తరంగాలపై రవళిస్తూ కబుర్లతో మురిపిస్తూ వస్తుంది స్నేహవీచి నదీ సైకతాలపై లహరుల్ని కిలకిల నవ్వులతో ముంచేస్తూ వృక్షాలను కుశల ప్రశ్నలతో సంభావిస్తూ గలగల ఊగిస్తూ సమున్నత శైల మస్తకాల్ని శీతల హస్తాలతో స్పృశిస్తూ మతాల సూత్రాలకు కట్టుబడని రెక్క విప్పిన ఆనందంతో తెలుపు నలుపు జాడ్య మెరగని ప్రేమతో వస్తుంది స్నేహవీచి మనిషి మనిషి మనస్సు కలయిక విశ్వశాంతి - సమర్చనంగా శిలా ప్రతిమల నిలయం ముందు విశ్రమించిన నాచెవిలో మనస్సు కవగత మయ్యే భాషలో గుండె విప్పి మాట్లాడుతూ వెళ్ళిపోతుంది మరో కోనకు నిశ్శబ్దంగా ఉదారవచనంతో నవంనవ శీతల గంధ వాయు స్నేహ వీచి
31. హృదయంతో మాట్లాడే చెట్లు చెట్లు సందేహిస్తున్నాయి ఇంట్లోకి రావడానికి లోనికి రాలేకనే కిటికి నుండి వాలి తొంగి చూస్తున్నాయి చెట్టు ఒక మనిషి ఐతే నేను ఒక చెట్టునైతే ! అవును చిత్రమైన ఊహ ! ఒక సమయంలో సహజం! భూమి పై రాళ్ళు చెట్లు జంతు కోటిలో భాగస్వామిగా ఆకాశం కింద కుటుంబంలో పరిణామం చెందిన నేను వీటి కన్న విడిగా మడి కట్టుకొని ఒంటరిగా కాస్త బుద్ధి ఉన్నందుకు గోడలు నిర్మించుకొని చుట్టూ ఇంతవర కెంత దూరం వెళ్ళాను పరమ పద సోపానం పై పై పైకి ఎదిగి దూర దూరం కొమ్మలతో ఆకులతో నిండి తమకు తెలీకనే మన మనుగడలకు గొడుగుల వలె ఉన్నాయి నేను బయటికి రాగానే తలలు ఊపి చేతులు చాచి అప్యాయంగా ఆహ్వానిస్తాయి ! దేని బ్రతుకది బ్రతుకుతూ మెలకువలో స్వప్నం వెంట పరుగెత్తే మన కాళ్ళు భూమిపై నడచిపోతాయి నిద్రా ముద్రలో మెలకువతో నిలిచే
చెట్లు వేళ్ళతో భూమిలో నిలిచి ఉన్నాయి మెలకువ రహస్యం తెలుసుకొనేందుకు నేను వెళ్ళుతాను విశాల హృదయంతో మాట్లాడే చెట్ల వద్దకు నేనే వెళ్ళుతాను
32. ఛాయ ఎవరొహో ! నిదురించిందీ నేలపై నీలాంబుద మాలా స్నిగ్ధ తనూ ! ముహుర్ముహు రాగత వాయు వీచీ సంచాలిత పుష్పందయ పక్షాలక త్వక్తాశా కాంతి చేల ! దుఃఖ ప్రావరణావృత ! సరభస గమన పవమాన విధుతమై, గగనాంస స్రస్తమై పొరలాడే నీరదాంశుకం వలె, భువి జారి పడిన యామినీ కర్ణ పూర్ణిమా చంద్ర తాటంక ఖచిత నీల మణి వలె భూదేవి పృథుల నితంబంపై అంకిత నఖాంకుర పంక్తి వలె ఆ పవ్వళించిందెవరు ? అరుణ మయూఖాలకు వాడి శార్వరీ కైశికం వీడి శీర్ణమై ఇట బడిన మందార పుష్పదామమో ! ఇట నిదురించిన దెవరీ మసృణ తమాల వల్లరీ మతల్లికా సుషమాంగన నిస్తరంగ యామున ధుని ఖండిత జల కణ మౌక్తికావృత ఘనా ఘన మండపంలో మార్మోగే ధ్వని తరంగాలకు బెదరి ఇట బడిన దుఃఖాగ్ని సంతప్త శంపా లాసికయొ ! నవా రుణా దిత్య మూర్తి గాత్ర పరిష్వంగంలో తప్తయై సంయంత్రిత భుజం వీడి ఇట బడిన ఛాయా కాంతయొ ! సౌర మార్గ పరిచ్యుతయై వాయు హత జ్వాలయై ఏ వృక్ష వర్షీయుని దుఃఖ సంవృత జీవిత చిత్రమో ! జీవదాన విచికీర్షా హృదయుడు ద్రుత తర గమన శీలి జలధర వర హృది నుండీ భువి జారి ప్రియు నెడబాసిన త్రపా తరళ యౌ శంపా వల్లికయా ! మమతా స్విన్నమైన దివి కేగలేవుగా ! రహస్తీరాల్లో నృత్య మాడి విశ్రాంతి మెయి వాల్చితివా ? కాంతి మండలం అంచులపై దిగజారుతూ నిరాలంబమై
నిరాశతో తమకపడి ఇట బడిన చీకటి కన్నెవా ? ఏ కోరిక సుడుల ముడులు విడిపోవ తిరుగాడి కడుడస్సి ఇటబడి దుఃఖ నిమ్నగ మున్గితివి ? ఎవరవీవు ? ఏకాంతంగా కఠిన శైల తల ఫలకంపై మలిన వస్త్రం దాల్చి ధూళి రేణురూషితవై వివర్ణమైన ప్రన్నని దేహం అల్పిష్ఠ తమస్తరంగిణి వలెనై ఎవరి కొర కాచరింతు వీ మౌన వ్రతం ? దుఃఖ విదారిత హృదయంతో దృజ్మనోజ్ఞతర కాంతులు దిక్తటాల్లో విసరుతూ ఏ సాగర తీరం వెదకుతూ ఏ నాక పథం ఆశిస్తూ ఏ సుందర సౌర పదవికై ఊహా సోపానాళి వినిర్మించేవు జఘన మండల విసర్పిత నీల వసన సంశోభిత మలినీకృత దేహంచల ! విరజీకృత నీలాలక త్యక్తాశా కాంతి చేల ! ముక్తచ్ఛాయా సుందరి ! మసృణ నీల నీరద సుషమా వల్గత్ కాంతి తనూ ! ఒక వృద్ధు రోజూ వెళ్ళుతాడు మా ఇంటి ముందుగా నేనూ బయలుదేరా ఎదో పని మీద అదే సమయంలో !
33. ఆత్మబంధువు అతడు నడచి నడచి మెల్లగా ఒక పాత ఇంట్లోకి వెళ్ళాడు. వీధిలో వస్తూ పోయే జనం ! ఎంతో సందడిగా ఉంది కిటికీ తలుపులు తెరచి చువ్వలు పట్టుకొని వంగీ ఒక చెంప వాటి కానించి వీధిలోకి చూస్తూ నిల్చున్నాడు. పసివాడై పోయాడు కిటికీ తలుపులు మూసి బయటి కొచ్చాడు ఇంటి తలుపులు మీద పడేట్టున్నాయి మెట్లూ అంతంత మాత్రమే లోనికడుగు వేయడానికే భయం వేస్తుంది వీధిలో ఒక ప్రక్కన నిల్చొని చూస్తున్న నా వద్దకు వచ్చి బాబూ ! అన్నాడు, నా పేరు చెప్పి 'ఈ ఇల్లు మీదేనా ?' అన్నాను 'అవునన్నాడు 'అమ్మేయకపోయారా ?' అన్నారు తలూపి నవ్వి ఊరుకున్నాడు ; గతానికి దగ్గరి బంధువు! కళ్ళలో మెరుపులో ఆరిపోయే దీపం స్పురించింది అంతలో చల్లారీ ! మంచు బిందువులైనాయి ఒక్క క్షణం అగి, ‘నాతో వస్తావా ?' అన్నాడు
లేదు పని ఉంది అన్నా ఎక్కడికని అడగకుండానే ఏం పనిలే ! అన్నాడు బహు సామాన్యంగా నా పని తెలిసినట్లు హఠాత్తుగా నా వైపు చూస్తూ శ్మశాని కెళ్ళుతున్నా నన్నాడు కోపం వహించాడనుకుంటూనే 'అమ్మో భయం' అన్నా నా భుజం పై చేయేశాడు క్రుంగిపోతానేమో నన్నంత బరువుగా ఒక్క ఊపు ఊపి ఏదో అన్నాను ఉలికి పడతావెందుకు ? అంటూనే గబగబ నడచి పోయాడు ! అమ్మయ్య వదిలాడు ఇంకా నయం తనతో పాటు తీసుకపోలేదు ! అతని గురించి అడగడం మరచా, ఈ మారు కన్పిస్తే అడగాలనుకున్నా ఆ రాత్రే కలలో కన్పించి, మళ్ళీ తనతో రమ్మన్నాడు ప్రియంగా తోడు నీడా లేరేమో నాకు భయం వేసింది కేకవేసా మళ్లీ కన్పించి అదే మాట ! అన్నాడు ఈసారి ధైర్యంగా తలూపి మర్యాదగా 'అలాగే తప్పకుండా ' అన్నా అతని ముఖం మొగ్గ తొడిగింది. ఆ ఇల్లు నాకు వ్రాసిస్తాన నన్నాడు అమ్మేయాలా ? మరమ్మతు చేయించి అద్దెకివ్వాలా ? ఏలా ఎంత లాభిస్తుందన్న ఆలోచనతోనే తెల్లవారింది లేచి కిటికీ వద్దకు వెళ్ళి ఇనుప చువ్వలు పట్టుకొని వంగి ఒక చెంప చువ్వలపై ఆనించి నిల్చున్నా బద్దకంగా నా కంటికి ఉదయం! శ్మశానంలో మండే చితి వలె ఉంది అబ్బ అప్పుడే ఎంత ఎండ అంటూ వెనక్కుతిరిగా “ఏడు గంటలైంది మరి” అంటూ ఎదురైంది శ్రీమతి ! ఆటలో పాటలో మాటలో వ్రాతలో బహుమతు లెన్నో అన్నీ చేర్చాడు పాపం గదిలో గోడకు ఆల్మెరాలో అందంగా గతం కలలు కంటూ రోజూ ఆ గదిలోనే అతని ప్రపంచం ఒక రాత్రి దొంగలు పడ్డారు అన్నీ మూట కట్టుక పోయారు
34. ఇల్లే పదిలం ఉదయం లేచి చూస్తే గుండె గుబుక్కుమంది పోయిన వస్తువుల స్థానాల్లో ఏవేవో కన్పించాయి ! పులి చర్మాలూ ! జింక కొమ్ములూ ! పాము కోరలూ ! తేలుకొండ్లూ సింహం జూలూ, ఏనుగు దంతాలూ ! వగైరా వైగైరా అద్దం ముందు నిల్చుంటే ఇవన్నీ ఎన్ని దిశల నుండో జ్ఞాపకంగా ఆయా ప్రాణుల రూపాల్లో బింబిస్తాయి
అద్దాని కెదురుగా అతడు అడవిలో నాగరకుని వలె ప్రస్తుతానికి తుపాకి మనస్సుతో కాటే జి ఊహతో అంతలో బిగిసిన శాంతి ముఖంతో చుట్టూ శూన్యం చీకటి సంకెళ్ళ వలె కాళ్ళ క్రింద జారిన నీడలు ! గంతులేసే లేగ దూడను కట్టుకొయ్యకు చేర్చినట్లు అద్దం ముందు నిల్చున్నాడు ! క్రాప్ దువ్వుకుంటూ వెనక్కు తిరిగి కిటికీ తలుపులు వేసే లోపల ఒక మూల రాత్రి ఒదిగి పడుకున్న పిచ్చుక లేచి రివ్వున బయటి కెగిరి పోయింది సెలయేటి అలలు కాలితో చిమ్మినట్లు తలుపులు దగ్గరికి లాగే లోపల ఎక్కడి నుండో వచ్చి పిల్లి లోపలికి దూసుక పోయింది ! తలుపుకు తాళం వేసి బయలు దేరాడు పోలీస్ స్టేషన్కి వాటి తస్సాదియ్యా ! అక్కడా కుర్చీల్లో! ఇంట్లో అద్దంలో కన్పించిన రూపాలే ! తుది బిందువు ముగిసింది ! వలయం పూర్తి అయింది ఇల్లే నయమని పించింది తలవంచుకొని బయలుదేరాడు ఒక్క నిదుర తీసాడో లేదో గంగలో శవాల వలె అంతా మటుమాయం అవును ఇల్లే ఎంతో పదిలం !
35. గాజు గది మనలో ప్రతి వ్యక్తీ మతిలో ఒక గాజు గదిలోనివాసం అవతలి మనిషిని చూడడం పరీక్షించడమే కాదు తాను గోప్యంగా ఉన్నట్లు భావించడం సహజం దీనికి దరవాజాలు కిటికీలు లేనే లేవు లోపలి నుండి బయటికి మనిషి రా వీల్లేదు బయటి నుండి లోపలికి వెళ్ళే ప్రశ్న లేదు ! అద్దాలు పగుల గొడితే ఈ కోరిక తీరుతుందనే నమ్మకం ఇది ఎట్లా ఉందంటే సరస్సుపై నీటి పొర లొకటోకటీ ఒలిచేసి అందులో బింబించే చంద్రుణ్ణి బయటికీ తీయాలనుకోడం ! ఒక హద్దులేని అవసరాల కల్పనతో అపుడపుడూ ఒకరి గదిలోకి మరొకరు వెళ్ళాలనే ఉబలాటం మరీ మరీ
ఎన్ని గదులు దాటినా తనకూ అవతలి లోకానికి మధ్య ఎప్పుడూ ఒక గది అయినా నిలిచి ఉంటుంది. అడుగు ముందుకేసి సాగినపుడు ఒకటొకటీ చంద్రుని వలె ప్రహ్లాదంగా ఉంటుంది. అడుగు నిలిచి పోయినపుడు, ఎక్కడిదక్కడే సమాధి వలె భయావహంగా ఉంటుంది సృష్టి కదలికలో సమాజం అనుభవంలో ఉంది ఆనందం ఎంతటి జీవితమైనా ఏదో ఒక వ్యాపారంలో మనో వ్యవహారమే !
36. చస్తూ బ్రతుకుతూ పోరాటం బ్రతుకులో గుడ్డి గుడ్డిగా కుంటి కుంటిగా ప్రతిచోట తెలిసిన వారితో తెలీని వారితో ప్రేమతో ద్వేషంతో శాంతిలో యుద్ధంలో గ్రుడ్డి కెవరో దారి చూపిస్తారు కుంటికెవరో ఆసరా ఇస్తారు అయినా మనిషికి మనిషి గుహలోనో అడవిలోనోవసించే జంతు సమం పురామనో నిలయంలో వీటి ఆవాసం మాత్రం భద్రమే. తెలుపు నలుపు ఎరుపు ఒకదాని నొకటి క్రమ్మేయ జూస్తాయి రంగుల హంగులతో మురుస్తూ దేని కది అందం చందం తమదే అనుకుంటాయి మంచులో చీకట్లో వెలుగులో పోరాటం ప్రతిచోటా బ్రతుకులో తెలిసీ తెలియక ఎదురెదురై తీర్చేరు నవంనవంగా మనోగుణాల కలయికతో ప్రకటనంతో పోట్లాటకూ కాట్లాటకూ ఊసిగొల్పే వికృత గుణం లేంది లేదు సుమీ ! ఆనాటి ఇతిహాసం ! ఈనాటి జీవితం అందరికీ కావాలి చీకట్లో తమ ఎదలో సూర్యుని వెలుగు, ఏలా వస్తుంది ఎపుడో ! రావచ్చు చస్తూ బ్రతుకుతూంటే ! దారికడ్డంగా నిల్చిన నిన్ను చూచే సమయం లేదు నా గడుసుతనంకన్నా నీ పెంకితనం చూచి చెట్ల చాటు నుండి కాలం నవ్వి పోతూంది నా ముందుకు రాకు నా కంటికి కన్పించకు పో ! అవతలికి పోవేం ! రోజు ఇదే పని నీకు !
37. దారి కడ్డంగా ఈ గ్రీష్మాన్ని ఎవరార్పుతారు ? ఈ దరిద్ర మెవరు తీరుస్తారు నీమనో ముకురంలో బొమ్మలు ! నే చూస్తే సంతోషిస్తాయా ? మండనీ ! మండి మండి నిప్పై బూడిదై మనై పోనీ చినుకు పడి తడిసిన పచ్చిగడ్డి తన ముఖమైనా చూపొచ్చు వెళ్ళు ఆ గుళ్ళోకి ! పో ఆ సత్రంలోకి ! ఊపిరి అల ఆగేట్టుంది ! నా ముందు కన్పించకు ! నీ దీన రవం వినిపించకు బురదలో తేలే పట్టణాల్లో పైన పన్నీరు చల్లుకుంటున్నారు అసత్యంలో సత్యం వలె దుర్గంధంలో గంధం వలె ఉంది అంతరాత్మ నీవే మొగం పెట్టుకొని వస్తావు ! ఏ గణానికి చెందుతావు ! గత కాలం శైథిల్యంతో భవిష్యత్తుపై భయంతో కదలిపోయే ముఖచిత్రాల్లో కాంతి లేదు శాంతి లేదు కాలం కరగుతుంది మైనపు వత్తి వలె ఎవరు నీవు దాని వెలుగు అంచులోని నీడవా క్రీ నీడవా ? ఇపుడు నిల్వడానికి సమయం లేదు అవతలికి పో నీకే చెప్పేది పోతావా లేదా ? నీ కవిత్వం మూట కట్టుకొనీ !
38. దుమ్ములో అలలూ కలలూ అలల వరస వలె పిల్లలు దుమ్ములో అడుకుంటున్నారు వారి నవ్వులకు బుగ్గలపై మట్టి చారలు విప్పారాయి అతడో ప్రయాణికుడు ! దారిలో తారసిల్లిన పెద్ద మనిషి పిల్లల నవ్వు కన్నా ఏడుపే శోభగా ఉంటుందతనికి దగ్గరికి వెళ్ళి ఒకణ్ణి చరిచాడు కెవ్వున కేకలో సంగీతం వినిపించిందతనికి రెప్పల క్రింది నుండి చెంపలపై నీటి చారలు చూచి పాపం ! అనిపించిందేమో ! ఒక పైసా విసిరాడు ఏడ్చే పిల్లడి కన్నుల్లో నవ్వు తొంగి చూచింది అతనికి కోపం వచ్చింది ! ఎందుకో తెలుసుగా ఏదో పోగొట్టు కున్నటె ంది ! ముందు కొచ్చి ఒకటి చరచి ముంగిట మరో పైసా విసరి గబగబ నడిచి పోయాడు వెనక్కు తిరిగి చూడకుండా ! అయినా అతని వీపుకి కళ్ళున్నాయి. వస్తూపోయే జనం కాలి ధూళి వారి మధ్య నున్న అంతరాన్ని కప్పేసింది
వెనక్కి తిరిగినా చూపుకున్నా గ్రుడ్డి నయమనిపించేట్లుంది కలల వరస వలె దుమ్ములో పరుగెత్తే పిల్ల ముఖాల్లో నవ్వులు! దూరదూరం పోయినంత మేర విసరేసిన బాకుల్లా అతనికి తోచడంలో ఏ ఆశ్చర్యం లేదు ఉదయం నుండి సాయం సమయం వరకూ మండే అగ్ని జ్వాలా తోరణాలతో రోదసి నిండి పోయింది రాత్రి సమయం ఆరి బొగ్గె చల్లబడిన శ్మశానం వలె ఉంది కుంచితమై చీకట్లు క్రమ్మిన నీలాకాశంలో అక్కడక్కడా గాలికి చెదరిన నిప్పు రవ్వల వలె చుక్కలు
39. పతాక వార్త భయంతో బిగిసిన నిశ్శబ్దాన్ని చీల్చుకొనీ వెర్రి కేక ! రివ్వున గాలి వేసే ఈలలకు చప్పట్లు చరచే చెట్లు ! అలల్లేని చీకటి నీటిలో బరువైన వస్తువు పడిన చప్పుడు మేల్కొన్న మనస్సులో ఒకటి రెండు పురాస్మృతుల కదలిక కదలిక గుర్తుపట్టి ఎవరో మెల్లగా జారి పోయినట్లు గుర్తు అలికిడి విని గుంపులుగా అలజడిగా సాగి ప్రతి అంగుళం అంగుళం గాలించి కాలి జాడైనా తెలీక విసిగీ వేసారిన గాలులు, చెట్లతో గుసగుసలాడుతున్నాయి ఎప్పుడో డెక్కడో భయంతో తల దాచుకున్న చంద్రుని పాదాలు కన్పించీ కన్పించడం లేదు శవ దహన సన్నాహం జరుగుతూన్న ఆకాశం ! సృష్టి మొదలు నుండి ప్రతి రోజు ఇదే విధం చీకటి చిత్ర వధ చేయబడినట్లు ఉదయాకాశ ముఖాన పతాక వార్త నా వెనక ఈడ్వబడుతూ వచ్చే నీడలతో క్రీనీడలతో వీధిలో నేను పునర్జన్మ తెలీదు గాని ప్రతి ఉదయం మరో జన్మ ఎత్తి నట్లుంటుంది ఫిల్్మ పేరు జ్ఞాపకం లేదు చూచి ఎంత కాలమైందో
40. పేరు జా పకం లేదు మధ్య మధ్య నవ్వులు ఏడ్పులు మంటలు! మంటల పూలు కంటికి ఇంపుగాను ఎదకు నిందుగాను సాగుతోంది
ఉన్నట్లుండి మధ్య సీటు ఖాళీ అయింది కనుమరుగై పోయిన వ్యక్తి గురించి అంతా మరచారు తెరపై బొమ్మలు వస్తూ పోతున్నాయి ఇంద్ర ధనుస్సును చిన్నాభిన్నం చేసి అమర్చినట్లుంది నిశ్శబ్ధం ధ్వనిలో పరవశించి కరిగిపోతూంది రెక్కలు ముడిచిన దీపం క్రింద నీడలు కలలు కంటున్నాయి. మనిషిలో సృజన శక్తి చుట్టూ కాలం తిరుగుతోంది. చీకటి నడుము చుట్టిన వెలుగు అంచుల్లో గాలి ఒదిగి ఉంది ఎవరూ ఏమీ చెప్పక పోయినా అన్నీ చెప్పినట్లే ఉంది ఆ క్షణం నిశ్శబ్దం, నృత్యంలో అలసి తెగిన మంజీరంలా ఉంది గంట గణగణ మ్రోగింది! వెలుగు బిలబిలా వచ్చింది ఎక్కడిదక్కడ సద్దుమణగి! ఏమీ తెలియనట్లే ఉంది 'చాక్లెట్్స! డ్రింక్్స' అంటూ కుర్రవాడి కేకతో జనం ఈ లోకంలోకి వచ్చారు ఇంతసేపు పరిమళవంతంగా వెలిగిన అనుభూతి నుండి “ఇప్పుడెక్కడున్నాను?” “ఉన్న చోటునే!” జ్ఞాపకం వచ్చింది చూస్తే వెలుగులో! ఆ వ్యక్తి తన సీట్లో ఎపుడు వచ్చి కూర్చున్నాడో ? ఎవరి ఇంటి దారి వారు పట్టే ఆతురతలో ఉన్నారందరూ హాల్ బయట బ్రతుకు బండి సిద్ధంగా ఉంది, మాదే ఆలస్యం! ఇవి విద్యా నిలయాలు ! వెలుగు ఆశలు పెంచుకున్నవి వీరే నా సోదరులు ! రంగుల వలలు క్రమ్మిన స్పటికాలు ఈ దశాబ్ది ప్రపంచంలో సమస్యలకు నిలువు టద్దాలు అరచేతిలో వైకుంఠం పిడికిట్లో కైలాసం బిగించి వారే నవ ప్రభావ గ్రహాలు ! భవిష్యత్తు తంత్రకర్తలు అయ్యో ఈ దేశం ఇపుడు చల్లారని శ్మశానం వలె ఉంది పొగ క్రమ్మిన రాజకీయం వికృత శిఖలు ధరిస్తూంది సూరీడు ఉదయించి ఎంత సేపో అయింది అయినా జీవితం చీకటి గుడారం వదలదు మంచు ముసుగు వీడదు అదిగో సామాన్యులు మంటలు పూచిన తీవెలు ! ఉన్న కళ్ళు మూతలు పడి ఎక్కడి కని వెళ్ళగలరు ! అయినా సందుల్లో గొందుల్లో పడి వెళుతూనేఉన్నారు మూకలుగా ! ఒకరి నొకరు ఢీకొంటూ త్వర త్వరగా
41. అగ్ని గానం ఈఎత్తిన ఇనుప చేతుల పర్యవసానం ? ఈవేసే అడుగుల గమ్యం ప్రయోజనం నైతిక వైక్లబ్యంతో అనుచితోద్రేకంతో యుగాల సంస్కృతి శిఖలై చీలుతూంది మనిషికి మానవుడు కన్పించడం లేదు మనసులో మానవీయం ఇగిరి పోతూంది అసహనం ! అవమానం! హింస ! ఆత్మ హత్య ! ఆటవిక ఝంఝా వీచికి రవీంద్ర సరోవరాన కూలే సంస్కృతీ శిఖరం నుండి ఎటు పరుగెత్తేరు ! నీటిలోకా ? వీటిలోకా ? ఏ ఒడ్డుకు ? ఇది మన ప్రజాస్వామ్యం ! ప్రభుకాలం కాదు నేటి భారతం ఎందరి తలల పైనో కాలూని చరిత్రలో ఎన్ని పుటలో పయనించిన సంస్కృతి ఇపుడు కొండ వలె పడి ఉంది ! ఎత్తిన ముఖాలు దించేయండి వీటిలో వెలుగు లేదు ఎత్తిన చేతులు వాల్చేయండి వీటిలో లక్ష్యం లేదు భగవంతుడా ! ఎక్కడున్నావు ? నీవు ఎదుట పడినా నిన్ను గుర్తించే దెవరీ సమయంలో ? పొగల్లో వెళ్ళనీ ! మేం పోదలదలచుకొన్న చోటికి ! ప్రస్తుతానికి సెలవు ! అగ్ని గానం మానలేం ! ఒక మాట చెప్పనా మానవతాగంధంతో నీవున్న చోటికే మేం తిరిగి రావచ్చు
42. ఆ సమయం రానీ రావద్దు ఆ సమయం ఉదాసీనత ఉద్యోగం చేసే ఆ సమయం రావద్దు దీని కన్న నిద్ర మంచిది కదలిక లేని శాంతి వద్దు రానీ క్షణం విషమ పాత్రగా అది మానవతా పూర్వమై మారనీ అమృత పాత్రగా ! నిరాశ నిటారుగా పెరిగి నింగిలో తల దూర్చీ నది ఒడ్డున రేవు పై విశ్వాసంతో తిరిగే వ్యక్తికి గత విషాదం జ్ఞప్తికి తెచ్చే ఆ సమయం రావద్దు దీర్ఘమైన చీకటి ఆయువును తగ్గిస్తూ వెలిగే ఆ సమయం రానీ రారానీజడ మతిలో చేతనతో అనాది నుండీ నీవొక దేవతపు
43. ఇరవై ఒకటో శతాబ్దిలో చంద్రుడు మా మనసుల్లో హ్లాదానికి రమణీయ రూపానివి ! ఋషులచే దర్శింపబడి దేవతల కమృతాన్నంగా చుబుకంపై పుట్ట మచ్చ అందం మరచిన కవులకు ప్రేయసి వదనంగా వెలిగే అమృత బింబం చీకటి సెమ్మెపై మౌనంగా వెలిగే దీపం నీ నిద్దుర ఛాయా రూపం చీకటి నీ మెలకువ వెలుగు రూపం వెన్నెల సందేహ బీజాలకూ సమస్యా వృక్షాలకూ నిలయమైన అకాశాన నిర్లిప్తంగా ఒంటరి జీవితం గడిపేవు ! ఇక్కడి ప్రణయ కోపనులకు దౌత్యం కొనసాగిస్తూ కళల మార్పుతో అలవలె ఉన్నావు ! ఎప్పటి నుండో ! సరే ఆ సంగతి అట్లా ఉంచుదాం దేవతా భావన నుండి గోళ రూప దర్శనంతో నీ గురించి జిజ్ఞాసా పరిశోధనలో కొత్త మలుపు నీ పై ఆర్మా ్రంగ్ కాలూని సౌదర్యం కలపడంతో మొదలు హద్దుల అతిక్రమణ జరగడానికి ప్రక్కన పరాయి వాడంటూ ఉంటేగా ముఖంపై కత్తి గంట్లు పెట్టడానికి ఎవరికీ అందని ఎత్తులో ఉన్నావింత వరకూ ఇక ముందు వెలుగు కెరటంలా తేలుతూ గాలి బంతిలా ఎగిరే శరీర నిర్మితితో ప్రతి మనిషి కాంతి గోళంగా మారి నిన్ను చేరేను ప్రతి మస్తిష్కం టెలివిజన్ యంత్రమై నిన్ను చూచేను మేం నీ స్థాన మాక్రమించి, నీ గురించి పూర్వం ఈ లోకంలో వ్యాప్తమైన అభూత కల్పనలకు స్వస్తి పలికి పరిశోధనలు సాగించి నీ జీవిత తత్త్వం తేల్చి కొండ జాతి మనిషివనో రాతి నేల ఖండమనో ఇంకేవో వైజ్ఞానిక ప్రకటనలు వెలువడవచ్చు. నీతో ప్రత్యక్ష సంబంధం నెలకొనవచ్చు అపుడు నీ చుట్టూ రక్షణకై అమర్చబడిన యంత్రాలు నియమింపబడిన సోల్జర్లు పైన తిరిగే విమానాలూ, నీ జీవిత రూపం మార్చడానికై అహమహమికతో పరుగెత్తే
పరిశోధకులు నేతలు నిన్ను తమలో కలుపుకునే తంత్రాలు హద్దులతోనే దేశాల ఉనికి హక్కులతోనే నవ జీవిత సంస్థితి భౌతిక శక్తులతో బ్రతుకులో పొరలతోనే జాతులు విభేదాలు నీవో మా కంటికి రమణీయ సంస్కార పురా రూపానివి సూర్యుడున్నంత వరకూ నీ అస్తిత్వం మాసి పోదు నిను గూర్చి పగటి కలలు కన్న మేమిపుడు నిన్ను రాజకీయ వేదికగా వ్యాపార సంస్థ గానో మార్చవచ్చు కాంతి గోళం వలె వెలిగే నీవు మా అధికారానికిలోనైతే కాల పరిమితి దాటిన నీ హక్కుల పత్రం చెల్లేనా ? చలికి బిగిసిన మంచు మనిషిలా ఒంటరిగా గగన వీధి బిక్క మొగంతో పాలి పోయి కన్పించే చంద్రుణ్ణి చూచి ఊగిసలాడిన హృదయం ఒక సమయం సృష్టించుకున్న ఊహా చిత్రం ఇది గాలి రుస రుసలాడుతోంది ఎండ కణకణలాడుతోంది ఇసుక దిబ్బలపై గుడారాల వలె జీవితాలు ఎండిన చెట్ల నీడల్లో నివాసాల వలె ఆలోచనలు అవని దప్పికతో ఉంది మనస్సు తపనతో ఉంది
44. ఈ ఎడారీ అడవీ నీరు ! కావాలి నీరు ! పెదవులపై అణగిన సంతోష వార్త ఎపుడు పైకి ఉబికేదీ తెలీదు నీటికై అన్వేషణ ఆరాటం ఆరాటంతో పోరాటం ! యుద్ధం ముగిసిన దేశం వలె ఉంది వాతావరణం తిరగ్గా తిరగ్గా కన్నీటి చారికల్లా నీటి పాయలు భూమి పొదుపు చేసుకున్నవీ, ఎక్కడో దాచుకున్నవీ ఎండిన కొమ్మలతో బిరుసెక్కిన కేశరాజితో మొద్దు బారిన చెట్లు మరోజన్మకై వేచి ఉన్నాయి ఎడారి ప్రపంచంలో అడవి జీవితంతో జనం ! అపుడపుడూ ప్రాణం రుచితో పల్లవిస్తూనే ఉంది ! ఇంతటి ఎండల్లోనూ అన్వేషిస్తే దొరక్క పోదు ఒయాసిస్ ఎక్కడో ఒక నీటి జాలు గొంతులో గంగ దిగడానికీ ఇంతటి ఆర్తిలోనూ వినిపించక పోదు అనురాగ స్వరం ఎప్పుడో ఒక ఆర్ధభావంతో మనుషుల్ని కలపడానికీ
ఏ రుస రుసలోను ఏ భగభగలోను ఆగదు వ్యవహారం వ్యాపారం ! వర్షం ఆలస్యంగా వచ్చినా, అవని ఎదపై గంగ దూకినా ఈ ఎడారి రూపు మాసేట్టు లేదు! ఈ అడవి దాహంతీ రేట్టు లేదు తెలివి పదును కోరుతూంది సమయ సమయవ్యూహం ఈ జీవిత మెంతదైనా పసివాడు వేసిన వర్ణ చిత్రం
45. ఈ గీతం ఈ వేదిక నలంకరించిన తరుణ మనస్కులూ మనో భూమికలో రహస్య గనేషణ మతులూ భౌతిక జగత్తులో పరిణామ విచారణ చణులూ స్వాగతం పలికి మీకు ! ఈ గీతం వినిపిస్తున్నా అపశకునపు టూళలూ ఉద్రేకపు టురుపులూ గుండ్రాళ్ళ దొర్లింతలూ గులకరాళ్ళ కలవరింతలూ ముళ్ళ కంపల ఈడ్పులూ నిదుర లో పలవరింతలూ సుడి గుండాల తిరుగుళ ్ళ ఆవలింతలూ ! త్రేన్పులూ ఒకటేమిటి ? ఇలాంటివి శబ్దించే ముఖ యంత్రాల్ని నియంత్రించే గీతం ! వినిపిస్తున్నా! ఉత్సాహ కళికలూ ! ముగ్ధ ముగ్ధంగా కాలాన్ని కత్తిరిస్తూ ఎగురుతూ ! క్రూర కిరాతక చర్యకు బలియై విలవిలలాడే, హరిణ శాబకం హృదయంతో ఈ గీతం వ్రాస్తున్నా సౌందర్య పరిమళాలతో కాలాన్ని మరపిస్తూ ఊగే పూవుల మధు పరాగ ఊహలతో ఈ గీతం చిత్రిస్తున్నా తల్లి కలల కానందాకృతి నిస్తూ బ్రతికి బట్ట గట్టి కాలాన్ని జయించే శిశువు హృదయ గతిలో ఆయువు రహస్య శక్తితో ఈ గీతం శబ్దిస్తున్నా గాలి పిల్లలు దిశల చెరగుల్లో దోబూచు లాడినట్లు వెలుగు కత్తులు రోదసి గుండెపై తళతళలాడినట్లు శబ్ద శర పంక్తి దిశా వీధి పరుగు తీసినట్లు వర్షధార భూమిలో విలీనమైనట్లు నా మాటలు మనస్సులో పొరల్లో కదలీ అంతరాత్మలో అర్థవంతాలై మానవ జీవన వ్యూహంలో అమృత కాంతి వర్షంతో నవ నవోన్మేష సృజనాకృతి, ఈ గీతం వినిపిస్తున్నా
46. యుగ సంకేతం నిరాశలో మేల్కొంటాను ఆశతో జయిస్తాను అణువణువున నర్తించే శక్తిని నే నీ యుగ సంకేతాన్ని పగలు చెమటలో తడిసి రాత్రి అలసట క్రమ్మిన ఈ ప్రపంచ కక్ష్య రేఖను, నవ సమాజ గతి రూపాన్ని ! దీపమై వెలుగుతాను గుండెలో తోరణమై వ్రేలుతాను తలపై బొగ్గును రగుల్పుతాను మట్టిలో ప్రాణం తెస్తాను నేను జీవన సంగీతాన్ని, నేనీ యుగ సంకేతాన్ని నాకు దుఃఖం లేదు నేను పుట్టినందుకు తీరిక ఒపిక ఉంది విషాద శ్రుతి వినడానికి నాకు తృప్తి ఉంది నేను చేసే పనిలో ఆరని వెలుగు ఉంది దీపం వికసించడానికి ఆశాంతి ఆక్రందనలో జన గణం కోసం అగ్నియై మేల్కొంటాను వర్షమై బ్రతుకుతాను చంద్రునిపై ఆర్మా ్రంగ్ సోదర మానవుడు అడుగు మోపిన క్షణం గంతేసిన యుగ ప్రభాతాన్ని ఒకే ఒక హృదయమై స్పందించే ప్రపంచ దృశ్యం బింబించే టెలివిజన్ మనో రూప యంత్రాన్ని నిరాశను ఎరువుచేసి విశ్వాసం పండిస్తాను నిశిలో మేల్కొంటాను ఆశతో జయిస్తాను నే నీ జీవన సంగీతాన్ని నే నీ యుగ సందేశాన్ని ప్రజాస్వామ్య విభాతాన్ని నేనీ యుగసంకేతాన్ని
47. చీకటి వెలిగించిన వార్త రోడ్ పై ఏదో మునిగిపోతున్నట్లు ఉరికే పిల్లడి కన్నా ఏ క్షణం అపాయం జరుగుతుందోననీ, గర్జిస్తూ దూక నున్న సింహం వలె వీడని సంశయంతో ఇంట్లో ఊహ చేసే తల్లికి పట్టుకుంది భయం కాలం కదలుతోంది దున్న పోతు బండివలె అలసినా విసిగినా ఏమైనా ప్రయాణం తప్పదు కిటికీ నుండి చూస్తే పగలు పూచిన మోదుగ వలె ఉంది
గదిలో బల్బు ముఖం ఉలికి పాటుగా వెలిగింది చీకటి కెదురు ప్రశ్న వలె ధైర్యంగా నిలిచింది ఉదయ మెదురైంది రక్తారుణ పద్మం వలె హృదయం స్పందించింది జల భరిత సరస్సు వలె ఏదో మునిగి పోతున్నట్లు ఉరికే పిల్లడికన్నా ఇంట్లో వేచి ఉన్న తల్లి కెంత ఆరాటమో అతడు తన కన్నుల్లోకి దూకే ఆ క్షణం రావాలనీ ఆనందం నవనీత సుకుమారంగా చూడాలనీ నిద్రలో కన్నుల్లో జ్వలించే దీపాలు కొడిగట్టాయి తెరచిన కన్నుల్లో వెలుగులు నడవ లేని బొమ్మ లయ్యాయి వీటి చుట్టూ నీడలు భయం పొరల వలె ఉన్నాయి ప్రేమలో ఆశలో ప్రాణం వ్రేలాడుతూంది జీరాడుతూంది 'పాడు కాలం వచ్చిందంటూ ! అడుగు పెట్టారు ఇరుగు పొరుగూ ఆనాడు పత్రికల్లో వార్త ! పోలీసు కాల్పుల్లో ఆ యువకుని మృతిపై ఆనందం విషాదం నిత్యం అనుభవించే ప్రపంచంతో
48. దేవునితో గోషి ప్రగాఢ బంధం లో ఉంటూ ఎక్కడో దూరంగా బ్రహ్మైక్య భావన గురించి మాట్లాడే ఇష్టం లేదు భయం క్రమ్మిన విశ్వాసంతో తన కీర్తిని కాపాడే మనుషులపై అనుగ్రహంతో ఆగ్రహంతో వెలసే భూమిలో గాలిలో నీరులో గగనంలో వెలుగులో అణువు నుండి బ్రహ్మండం విస్తరించి పూర్వం ఎందరికో వారి వారి మనో దశల్ని బట్టి విభిన్న రూపాల్లో కన్పించీ, కన్పించని దేవునితో ఇరవయ్యో శతాబ్దిలో జరిగే టెలివిజన్ గోష్టి ఊహలో సశేషమైందీ ఆశ్చర్యంలో విశేషమైందీ ప్రపంచం విజ్ఞాన యంత్రమయమైన ఈనాడు జీవితానికి సరికొత్త వ్యాఖ్యాన అవసరమవుతూంది ఊహల స్వభావం మారి దానితో క్రియా పర్యవసానం మారి మానవ సంస్కృతి గతికి కొత్త విలువ లేర్పడుతున్నాయి ఏ ఆకారం లేని నీకో రూపం కల్పించి పూర్వం నీ రక్షణ వ్యాజంతో ప్రచార గతి మిషతో
జరిగిన అవమానాలు హత్యలు యుద్ధాలు అసంఖ్యాకాలు నీ రూపం మలచడమే పరమ ప్రయోజనంగా మారి జీవిత యాదార్థ్యం నుండి మనస్సు వివేకం కోల్పోయి భూకంపం యుద్ధం క్షామం నియంతృత్వం అన్నీ నీ దయా రహితాలుగా దుర దృష్ట హేతువులుగా బాధ్యత నుండి తప్పుకొనే అవకాశం ఏర్పడింది. ప్రకృతి పై విజయం సాధిస్తూ నిరంతరం విజ్ఞానంతో దారిద్య్రం రోగం భయం నుండి ముక్తం చేసే కృషిలో స్పుత్నిక్ దశ చేరుకునీ సామాన్యుని మాటేమిటి ? హేతువుకతీతమైన సిద్ధాంతాల పరంపరలో చిక్కుకున్న మనిషిని బంధించే సమస్యలెన్నో ? కొందరు గతానికి చాలా దగ్గరి బంధువులు వర్తమానం శిలా నిద్ర వదిలించే పరివర్తనం దూకించే విప్లవం క్షమించరాని శత్రువుతో సమానం కిరీటాలు అగ్నిలో భస్మమై స్వేచ్ఛను పొందే సామాన్యుని ప్రపంచమిపుడో హేతు మయం ఒక దిశలో యుద్ధ భయంతో మరో దిశలో విజ్ఞాన ఫలంతో మానవ సంస్కృతి పై ప్రభావం నెరపుతుంది మనిషిలో స్వార్థం వదలబడిన అణ్వస్త్రం వలె ఎదురు లేక మైదానంలో విసరిన బంతిలా సూటిగా కాల మిపుడు భవిష్యత్తు శ్రేయో రూపంమైంది దేవునికన్నా జనప్రేయోరూపమైంది కాలాన్ని నియమించ లేని దేవుడు కాలానికి తల ఒగ్గక తప్పడం లేదు ఉదయం మంచు బొమ్మ వలె మెరపిస్తూ, మురిపిస్తూ పెదవి విప్పక మౌనంగా ఉన్న నీతో గోష్ఠి జరిపేదెలా ఒక క్షణం నిశ్శబ్దంలో శబ్దంతో నే నెవరో నీవు చెప్పేదాక తెలీదు నిజం చెబుతున్నా ! మనిషే! ఒక దశలో దైవం ! నీవనుకునే నేనే, నీ రూపం ! సదస్యులు లేకుండా ఆడే నాటకం వలె
49. నగరంలో ఉదయం రాజాదరణకై తారాడే కవి రత్నం వలె నగరంలో ఉదయం ! వచ్చింది ! రవి గమనానికిదారులు తెరచే ఉషస్సు దివా దుహిత ! యజ్ఞ కేతువు ! ఇక్కడ ఎవరికీ తెలీదు ! చీకటి ఎడారి బ్రతుక్కి ఈ వెలుగు ఒక ఒయాసిస్ అని కళ్ళు విప్పి వేచి చూస్తేగా తెలిసేది ! మనిషికి ఇక్కడ గడియారమే కాలమానం ! బ్రతుకు తెరువూ భోగ భావం రెండే రెండు దృష్టి రేఖలు దాదాపు అంతా క్షణం తీరిక లేని యంత్రాలే ! గుండె డాక్టర్కు అప్పగించి బుద్ది ఎక్కడో తాకట్టు పెట్టి సూర్య చంద్రు లిక్కడ రిటైరైన వాళ్ళతో సమానం పాపం చంద్రుడు మరీ ఔటాప్ డేట్ మ్యూజియంలో నిలిపే అమూల్య వస్తువు క్రిందే లెక్క ఏదో నెట్టుక వస్తున్నాడు సద్యో యోగంతో ప్రణయ దౌత్యాది గిరాకీ తగ్గినా మూనె ట్ డిన్నర్కు అవసరమే ! ఇక వసంతం మాట పూర్వ కావ్య ప్రపంచంలోనే కోకిల మాటే లేదు హారన్ సైరన్ బహువిధ యంత్ర ధ్వనులు తప్ప ఎపుడైనా కవి వేష దారి ఈ సరంజామా పట్టుకొస్తే మర్యాదా యవనిక చాటున అదొక విచిత్ర శ్రీయే ఎప్పుడో రాత్రి చంద్ర బింబం కన్పిస్తే స్పుట్నిక్ గమనంతో ఆస్ట్రోనాట్ విహరణంతో రేపు పృథ్వీ సోదరుని వద్దకు వెళ్ళే ఆలోచనతో మానవ విజయ కేతనమై నిలుస్తుంది భావ ప్రపంచం ! నగరంలో ఉదయం ఇక్కడి ప్రజలకు మాత్రం అద్దాల కేస్లో భద్రపరిచిన బంగరు నాణెం !
50. నవ్వుతూంది వెలుగు నాలో ఓ స్వప్న హంసమా ! సమాజ బింబమా ! నీకు స్వాగతం చంద్ర బింబం నుండి ఊడి పడిన రమణీయ ఖండమా ! ఈ చీకటి బ్రతుక్కి ఊరట కలిగించే కాంతి శిల్పమా ! ఇక్కడ స్థితి శిశువు చేతిలో ఆట బొమ్మవలె ఉందా ! ఏలా వచ్చావు ? తెలిసా ? దారి తప్పా
తప్పదు నిర్బంధం ! కొంత సేపు ! చూడు మా అవస్థలు పరచుకొన్న సముద్రాలు విను ! మా బ్రతుకులు మండుతూన్న శిశిరాలు ! కన్నీటితో దప్పిక తీరదు! పాలూ పెరుగూ కాదు వెన్నెల ! ఆకలి తీరాకనే ఆనందం గురించి ఆలోచన వానలు సరిగా లేవనో పాడి పంటలు తరిగాయనో కార్మికులు సమ్మె చేసారనో పీడితులు తిరుగబడ్డారనో సమస్యలతో కదిలించనా ? ప్రశ్నలతో దిక్కుల్ని ఊగించనా ? గుట్టల్లో దారి చేసుకునీ, చీకట్లో దారి వెతుక్కుంటూ బీదరికంతో బేలతనంతో తిరిగే ప్రజ గురించీ మర్మంలేని గాథ చెప్పనా ? కర్మకాలినత వ్యథ వినేవా ? జోళ్ళు లేని కాళ్ళతో బండితోనో నాగలి తోనో బాట వెంట కదలిపోయే బ్రతుకు బరువు వివరించనా ? ఓ నా స్వప్న హంసమా! నీదో సుందర కాంతి లోకం నీలో కాన్నందివ్వడాని కెందరో ఎన్ని కలలో కన్నారు ఎప్పటి కపుడే కొత్త మాకు, సంతతి సంతతికీ క్రొత్త పాఠం చంద్రునిపై అడుగేసినా అవనిపై అడుగు ఎప్పటిదే తప్పనిదీ బయట వెన్నెల నవ్వుతూంది లోన నీడలు వెక్కిరిస్తున్నాయి ఊదాసీన చిత్రంలో రంగుల హంగులేని శూన్యబింబం సామాన్యుడు ! నిప్పు నీరు గాలి ఆకాశం మమత తృష్ణ అహం బలం ఒకదాని నొకటి అణచేస్తూనో, జత అవుతూనో త్యాగం రాగం శాంతి యుద్ధంలో ఏ వేళ సమాజం, సంక్లిష్ట వర్ణ చిత్రంలా మారేను నిరంతరం గోడ గడియారం నిశ్చలంగా చూపులు సరిస్తూంది ఎక్కడో దారి తప్పినట్లు రోజు తడబడుతూనే ఉంది దగ్గరిగా ఇనుప కమ్ములూ దూరంగా చీకటి గోడలూ ఇవి ముందు దాటి తేగదా ! ఆవలి లోకంతో పరిచయం అయ్యేది ఇక్కడ వస్తువు ఉంది, కదలిక రావాలి నీవు కదిలించే శక్తివి ఇక్కడ వత్తివుంది ! వెలుగు కావాలి, నీవు వెలిగించే రక్తివి నీకు మేము వింత ! మాకు నీవు కొత్త కాదు స్వప్నహంసమా! ఇవన్నీ మనసులో దాచుకో భద్రంగా ఎక్కడా పొక్కకు సుమీ మాకు సంస్కృతి ఉంది ! ప్రతిష్ఠ ఉంది పెట్టని కోట వరసలా పరిళమళ తరంగం వలె క్షితిజం నుండి వచ్చిన నీ చుట్టూ నా ఊహలు తుమ్మెదల్లా కదలడంలో ఆశ్చర్యం లేదు
నిను చూచిన సమయంలో దూత మేఘం మెదలుతుంది మనసులో పొరలో అనుభూతుల తలల పైకి కన్పిస్తాయి ఇక్కడా ఉన్నారు శపు లు అస్తంగమిత మహిములు గుడిసెల్లో రోడ్ల ప్రక్కనా చినిగిన బొంతలతో వంతలతో ! అనుకునేవి నెరవేరడానికీ అంటూ జాడ్యం పోడానికీ వేప చెట్టు కింద వెలసిన దేవతల్ని నమ్మే భక్తులూ అవని పై పెరిగే అడవి వలె మనస్సుల్లో భయ సందేహాలు 'కర్మఫలం' ఇంకా జీవితంలో పరమ శక్తిగా మిగిలే ఉంది మర్యాద సహనం అహింస పేరిట ఎదురుగా గోడలు నిటారుగా ఉన్నది చాలు ఊపిరాడేంత వరకూ, లేని దాని కన్వేషించనూ లేరు చీకటిలో రాత్రి తేలుతూంది, రాత్రి నుండి ఉషస్సు విడుద లవుతుంది ఉషస్సుకై మనస్సు వేగుతూంది చీకటి గుండంలో, అంతా నిశ్శబ్దం నీవు కన్పించగానే చెప్పనా ఎదలో కదిలింది చంద్రకళ నాకు జ్ఞాపకం వస్తూంది నిన్నెక్కడో చూచినట్లు వాత్సల్యంకై అలమటించే త్వక్త శిశువు కళ్ళలోనా ? పేదరికంతో మూల కొదిగే బహిష్కృతుల తలపుల్లోనా ? నిశ క్రమ్మిన మతిలో చలించే విచ్చు కత్తుల మెరపుల్లోనా ? ఉష కోసం వేచి ఉన్న నిశి నిశి ఆశా లతికల చూపుల్లోనా ? మబ్బు క్రమ్మి వర్షానికి సిద్ధమైన దిక్కుల పెదవులపై అనురాగం విరిసినట్లు ! శక్తికీ రక్తికీ బింబమై వచ్చేవా ? ఏదీ మాట్లాడకుండా అన్నీ గుప్తంగా వెలిగిస్తూ చరిత్రలో దాగిన నిజం వలె ఎంత అపురూపంగా వచ్చావు ? ఒక మనవి ! యుద్ధ రంగంలో విమానం వలె రాబోకు సుమీ ఏపుగా పెరిగిన చెట్టు క్రింద నిప్పు పెదవులు విప్పింది కొలిమి సాన పట్టించి చికిలి చేయించడానికి గండ్రగొడ్డలి సిద్ధంగా ఉంది ఇది దేని కోసమన్నది? కాలం పైగానీ తెలీదు పచ్చని ఆకుల్లో పూల గుత్తి వలె నా ఊహల్లో స్వప్న హంస సముద్రంలో ఎగసే తరంగ శిఖరంపై ఆకర్షించే మణి దీపం ! సరస్సులో సూర్య బింబం వలె మనస్సులో రహస్యాల్ని చూపిస్తోంది నిదురకూ మెలకువకూ మధ్య లోతుగా సరించే నది వలె నేను నాచుట్టూ అన్యాయం ఆక్రందన రేఖలతో దీన హీన దృశ్యం నేను పయనిస్తూనే ఉన్నా రాత్రి తరగలపై పడవనై నీవు రావాలి మళ్ళీ చీకటి చివుళ్ళ నుండి తెల్ల గులాబీ వలె స్వప్నం మెలకువగా మారేనా ? హంస తెలివిగా మారేనా ?
నేను వెదకుతూన్న వెలుగు ఎదురుగా నవ్వుతూంది నీటుగా నాలో బ్రతుకుతూంది రివ్వు రివ్వున ఎగిరే హంస వలె ప్రపంచం మనస్సు కల్పించుకుందనీ నిర్మలాకాశంలో మాలిన్యం లేదనీ జీవితం దేవుడిచ్చిన వరమనీ వెలిగే సూర్యుని వదలి ఏ నీడ లేదనీ అంటావా ? కూలి వాని గొడ్డు కారపు మెతుకుల్లో ఏయే విటమిన్లు ఉందీ చంకలో శిశువుతో స్తన్య మిస్తూ అరచే బిచ్చకత్తె నడకలో లయ ఎట్లా ఉందీ చెప్పండి !
51. నిజం చెప్పు చెప్పండి ! ఈ దేశంలో సమృద్దిగా ఉంది ! అసంతృప్తి అనీ ఆందోళన అనీ బ్రతుకులో తప్పని విప్లవం రెక్కలు విప్పిన వాతావరణంలో “ఎవడికి పుట్టిన బిడ్డరా ? ఈ స్వాతంత్య్రం” అన్నట్లుంది! దేశానికి కావలసింది ! అధికారం, వైభోగం, రాజకీయం! లేకపోతే ఏలా నడుస్తుందీ ప్రజాస్వామ్య యంత్రం” అన్నట్లుంది ! తలదన్ని తాటి కెక్కుతూంటే ! ముసుగుదన్ని పడుకొనీ కలలుగనే సామాన్యుల కేం పట్టింది చెప్పు ఈ కథ ! పోరాటం నుండి పలాయనం చిత్తగించే సమయంలో ఇపుడు మన కర్తవ్యం ! మనస్సు విన్నది కన్నది పలకడం ఈ మరుభూములపై ఉల్లోల జల తరంగాలై ప్రవహించడం
52. లౌకికశ్రీ నీవు నా ప్రకృతికి వికృతి రూపానివి నీ ఉనికి నా అంతరాత్మకు వ్యతిరేకం నీకూ నాకూ ఉన్న సంబంధం మింటికీ మంటికీ గల అంతరం ఎక్కడో అవి కలిసినట్లు భ్రాంతి ఎంత దూరం వెళ్ళినా అంతా శూన్యం ! అంతలో మ్రింగేయాలన్న ఎత్తులో ఎంతో దగ్గరిగా వచ్చినట్లుంటావు ఒకపు డనుకూలంగా మరొకపుడభేదంగా నాలోకి తీసుకోవాలనిపింపజేస్తావు నీ నుండి విడిపోవా లనుకున్నంతలో నీవు చేసే గాలి రొదను అడవిలా వినమంటావు మేమంతా పడి ఉన్న అంబేదల మనుకొనీ
అనుకుంది తుచ చస్తే తప్పవు నీ గాలి అక్కర లేదనడం తెలిసీ కోపంతో ముఖం కందగడ్డ ఔతుంది అంతలో మంచు గడ్డగా మారుతుంది లో లోపల ఏమవుతుందో భగవంతునికే తెలుసు! ససేమిరా వదలవు పీడా విరగ డౌతుందనుకుంటే నీరు లేని మబ్బు ముక్క చాటు చేసుకొని నవ్వి పోకు నీరు ఉన్న మబ్బు ముక్క నీలో కదలితే చాలు ముక్కుపై ఎరుపుతో చూపులో తెలుపుతో నడచే నా వెనుక నే రాత్రి వలె డొంక తిరుగుడు ఆలోచనలతో అపుడపుడూ వెన్నెల ముసుగుతో ముళ్ళశిఖల అనుభవంతో వచ్చే నీవు ! అబ్బో ఎంత లౌకికశ్రీవి ! లౌకిక శ్రీ !
53. మన రూపం పహీమం నీ నా వెనకటి రూపం డార్వినీయం వానరం, కావచ్చు అంతకు పూర్వం మొక్క! కాదు మట్టి ! కాదు అణోరణీయం ! సరే గాని ప్రస్తుతం మనుషులం ! అంతరాత్మ ఉన్న వాళ్ళం మనస్సు మేల్కొనీ ఉషస్సు సంతరించుకుంటే మానవులం మనసు గుడ్డి అయితే చీకటి నయం, మొద్దెతే ఎద్దు నయం చూపులో పూలు కురిస్తేనో చలనంలో గమనం వస్తేనో చాలదు వేదన స్వరమై వివేకం వెలుగై రావాలి మనిషిలో చేతన ఎవరమన్న ప్రశ్నకు గట్టి సమాధానం అవాలి జీవితం తలుపులు వేసుకున్నా వచ్చి నిన్ను పిలుస్తాను అడ్డంకులు చీల్చుకొని వచ్చి నిన్ను కలుస్తాను నీవు వెలిగించుకున్న చిరువత్తి నేను అపహరించను నీవున్న ఇంట్లో ఇంత చోటూ నేను ఆక్రమించను కాలాన్ని చుట్టకొనీ పరున్న నీవు లేచే వరకూ వేచి ఉండనా ? మంచులో వానలో ఎండలో రోదసి వలె నిలిచే ఉండనా ? తలుపులు బిగించుకొని భయంతో వేగి పోకు, లే ! వచ్చి తలుపు తీయి వెలుగులో నా ముఖం చూడు క్షణాల్ని అతిక్రమించి వచ్చి నిన్ను కలవాలనే క్షణాల్ని కౌగిలించుకొని ఒకసారి బయటికి రా తలుపులు పగులగొట్టి లోనికి దయచేయాలా !
బలం చూపాలిసిన చోట వినయం చూపిస్తున్నానా ! ఏ శక్తుల ప్రాబల్యంతో ఏ మలుపు తిరుగుతుందో తెలీని చరిత్రగతిలో ఇరువురమూ బిందువులమే మనిషి వస్తువు కాదు ప్రాణే కాదు అంతరంగమున్న వ్యక్తి ! తలుపు తీయి ! పిలుపును మన్నించి రా బయటికి వెలుగులోకి ! నీవు సమాజ గతి రూపమైతే నేను ప్రగతి శక్తి రేఖను తలుపులు మూసుకున్నా వచ్చి నిన్ను పిలుస్తాను అడ్డంకు లతిక్రమించి వచ్చి నిన్ను కలుస్తాను ! వెనుకటి రూపాలకేం ! ఈ సమయం మహతో మహీయసులం మానవులం !
54. వియాత్నాంలో అమెరికా వలె ఇది అడవి ! మొదలు చివర లేదు ! మధ్య మధ్య జన పదాలు ! ఎప్పుడు మొదలైందీ తెలీదు అంతా మధ్యలో వచ్చి పోయే వారే ! నదీ నదాల సరస్సుల తీరాల్లో, పూలతో పండ్లతో చెట్ల నీడల్లో తాత ముత్తాతల కథా గ్రామం విని ఎవరి దారిన వారు పోతారు ఒంటరిగా ఉన్నపుడు మనస్సును హెచ్చరిస్తాయి నీడలు నన్ను నేను హెచ్చువేసుకొన ధైర్యంగా నిలుస్తాను వెలుగై దూరాన ఉన్న దీపాలు నాపై ఒక చూపు నిలుపుతాయి ధైర్యంలో నన్ను నేను మరచిపోయి మరే ఆలోచనలోనో పడతాను మనిషి శరీరంపై చూపులతో కదలికలో ఒడుపుతో అలికిడికి చాటు చాటు నుండి కదలిపోతాయి జంతువులూ మృగాలు ! ఓ వైపు చీకటిలో మెరసేను చాకు చూపులూ ! రాలే నిప్పు పూలూ ! పిడికిలి బిగించి నిల్చి గిరి వలె అలజడితో కదలిపోతూ ఝరి వలె కత్తులతో వత్తులతో పగలూ రాత్రీ మనిషి ప్రయాణం ! అడవి నుండి ! పల్లెకూ ! పల్లె నుండి పట్టణానికి ఈ కథ సొంతం వినేవారెవ్వరు ? ఇది ఎన్నటికీ సశేషమే గ్రీష్మ మందుకున్నా, పచ్చని ముఖాల్లో ఆశల చివుళ్ళతో సరికొత్త సంస్కార కళతో అక్కడక్కడా ఉద్యానాలు ఎదురౌతాయి వర్షం తారసిల్లితే అంతా పిచ్చివాని ఊహా వైభవం అందుకే కథ పూర్తికాదు ! అడవి భయమూ పోదు ఎన్ని శిఖరా లధిరోహించినా అడవి తనం తప్పదు మనలో బట్ట బయలుగానో గుట్టు సవ్వడిగానో పరమ రహస్యంగానో సంస్కృతీ సంపన్న మనుకునే మనిషి ఎంత దూరం పయనించాడు
ఉపమానం కావాలా ? స్పష్టంగా, వియత్నాంలో అమెరికా వలె కాల స్థల జ్ఞానం స్వార్థం ఎరగని దశ శైశవం ఏ వికారమూ ఎరగని సృజన కళికా రూపం హాలా హల లవ మెరగని అమృత భావనా క్షీరధి పితరుల ఎద కంటికి మూర్తి గొన్న సుకృతం మొగిలు ఉడుపుల్లో పొరలీ మిన్ను మన్నులో అడీ మాయని మేనితో చీకట్లో కలిసిపోని చందమామ
55. శైశవం ఏండ్లు పై బడిన కొద్దీ బుద్ధి వికసించిన కొద్దీ ప్రకృతికి దూరంగా వికృతికి శేఖరంగా కోప తాప సంతోష విషాద స్వార్థగతులతో లౌకిక మర్యాదల్లో క్లిష్టమై క్లిష్టంగా ఎదిగిపోతుంది స్వర్గ నరక రూపాల్లో పుణ్య పాప భావాల్లో ఏ భూమిక లెరగని శైశవం మనిషి జీవితంలో ఎప్పటికీ ఇగిరి పోని గంధం బాల్యంలో స్మృతులు మనో విశ్రాంతికి నెలవులు! మథనం ఎరగని మనసులో సుధా బిందువులు
56. సామాన్యుని వాస్తవం ఈ యుగం తలుపు తెరిస్తే అణువణువులో స్పందిస్తూ హృది హృదిలో కనిపించే నవ భారత బింబం నెహ్రూ ఎదపై గులాబితో బుజాన పావురంతో అడుగుల్లో జీవ నదీ లయతో కదిలే నెహ్రూ, సామాన్యుని స్వప్నాలనికి వాస్తవం దేశ భవిష్యత్తుకు ప్రజాస్వామ్య హృదయం ఆగిన పాటను స్నిగ్ద స్వరంతో అందుకునే జారిన ముత్యాన్ని తీసి స్వర్ణంతో పొదిగే ముక్కలైన హృదయాన్ని నవాశతో కలిపే రాజనీతి మనస్వి! చీకటి గతులకు దినమణి ఏ నాటికైనా తప్పని మరణంతో నీ నిష్క్రమణం జనస్వామ్య గతికి భరత వాక్యం కారాదు
నిరంకుశం రాజరికం ప్యూడలిజం వ్యతిరేకం నీ ఆశయం త్యాగంతో రాగంతో స్వేచ్ఛా సమతకు నవతకు సంకేతం ప్రొద్దు పొడవడానికిత బదులీ రోజు
57. కదలండి శతఘ్నుల వలె మన ముఖాల ముందు హఠాత్తుగా యుద్ధం వచ్చి పడింది లెగసే పూల నదుల వలె స్త్రీలూ నిప్పులు చిమ్మే గోళాల వలె పురుషులూ నేల ఈనినట్లు వీధుల్లో మైదానాల్లో సమర భావనాయుతజన సందోహం భరత జాతి హృదయం శాంతి కపోతి నివాసం దీనిపై తుపాకులు పేల్చే హంతకుణ్ణి మరవకండి మనం పీల్చే గాలి అప్పుడే ఎంతో బరువెక్కింది లేవండి మహాగ్నుల వలె కదలండి శతఘ్నుల వలె ప్రళయ మేఘం మెరపుకు భయపడి జీవితం గమనం ఆగుతుందా ? వ్యవహారం వీడుతుందా మెషిన్ గన్ ధ్వనికి ఉలికి పడి భరతదేశం భూభాగం గౌరవం వదులుతుందా ? పిడుగులు పరిహరించే శక్తి ఆవర్తానికెంత తెలుసో ? పన్నిన భూ కబళనం సాగదని శత్రువు కంటే తెలుసు లోహ నియంత కుతంత్రం విచ్చిన్నం చేసే దీక్షలో నిమగ్నమైన సోదరీ సోదరులారా ! స్వేచ్ఛా సమాజ బలం సర్వం మీ వెనుకే ఉంది మండే శక్తులతో దేశంకై నిలిచిన సైనికులారా ! మంచు కొండల్లో విద్యుద్ధతి సాగే జ్యోతుల్లారా ! విష వ్యూహం చేదించే అమృతా శయ మూర్తుల్లారా గుండెలో బాకు రువ్వి రక్త పతాక నెగరేసే శత్రువు భూమిని వీడనిదే జయింపనిదే వారిని ప్రతిజ్ఞ వీడకండి సమర సన్నాహం మానకండి లేవండి మహాగ్నుల వలె కదలండి శతఘ్నుల వలె బరువు నడకలతో మౌన ముఖాలతో ఆక్రందన స్పందించే అమాయక గమనంతో నగవు ఎగిరిపోయిన పెదవులు బిగించి ఆకాశం వంపుల్లో ఆశలు భద్రపరచకొనీ ప్రాణా లరచేత బట్టుకొనీ పిల్లలతో పశువులతో
స్తంభించిన గాలుల్ని కత్తుల వలె చీలుస్తూ తరలి వచ్చే కాందిశీకులు !శత్రు కృతఘ్నతకు చిహ్నలు మానవ సంస్కారం లేని ఇనుప హృది కెదురుగా దేశాన్ని రక్షించేందుకు దేహాన్ని డాలుగా చేసి శరీరంపై రక్త సిక్త వ్రణాల్ని గులాబి పుష్పాలుగా ఒంటరిగా ఉన్నా తన చుట్టూ మహా ప్రజ నిలిచి ధైర్య మిస్తున్నట్లున్న హిమగిరి పంక్తుల్లో అగ్నుల వలె పదపదం ప్రళయ లయతో ఎద ఎదలో ఖడ్గ సృష్టితో సాగే సోదర సైనిక బృందం, వీరభూమి సంకేతం మూర్తీభవించిన తేజశ్శిఖరం, జాతి ప్రతిష్ఠకు ప్రతిరూపం ఈ ఉషస్సాహిత్య వీధుల్లో రెక్క విప్పిన రణచ్ఛాయలు ఈ దేశ గగన ముఖంలో సాశ్రు శిఖల విషాద స్వరాలు
58. హిమజ్వాల ఈ ప్రశాంతాకాశం ఒక్కసారిగా మృత్యు తాండవం వినిపిస్తుందేం ? ఆ హిమాలయ సీమల్లో మ్రోగే కృతఘ్నుతాభర శతఘ్ని ధ్వనులు ! ఈ గడ్డపై వీచే శీతల వాయువులు సుమనోభిరామాలు రివ్వున దూసే పదను కత్తుల్లా భాసిస్తాయేం ఆ హిమభూమిలో సైనిక నేత్రాలు వదలే అనల కీలలేమో ఇది పురాణ దేవతా సమూహం దీపించే నివాసం ఇక్కడ హత్యా బుద్ధితో ప్రవేశించే వారెవ్వరు ? సూర్య తేజాన్ని మ్రింగజూచే మబ్బు మూకలేమొ! శత పత్ర వదనంపై నెత్తురు గంట్ల వలె హిమ శీతల స్వచ్ఛ భూమిపై అగ్ని కణాల వలె మూకలుగా సీమల్ని దాటే కాలముద్రా మూర్తులెవ్వరు శాంత తేజోమూర్తి హిమచ్చ సుషమా ఫాల తలంపై అగ్ని కీలలూ రక్త ఝరులూ సృజించే చీకటి ముద్ద లెవ్వరు ? ప్రతి భారతీయుడూ విడిచే ఒక్కొక్క కోష్ణ నిశ్వాసం తమో రాత్రి వలె భయదమై దీర్ఘమై హిమ భూమి చుడుతూంది ఒక్కొక్క హృదయం రవి బింబ సదృశంగా ఉదయాస్తమయాలు ఋతువులు కామనలు సర్వం మరచి దీప్తమతియై మహాభుజగంవలె ఫణ సహస్రం విప్పి
గగన మెత్తు నిల్చిందీ భరతజాతి నిప్పు గప్పిన నివురు పెనుగాలికి లేచింది ఎటు చూచినా ఒక్కొక్క అగ్ని గోళం ప్రతి హృదయం ఉద్వేగభరితం బడబాగ్ని మహా సముద్రం ! స్వేచ్ఛా సమాజ రిరక్షా వ్యగ్రమై నా దేశం శతకోటి ముఖాలతో జ్వాలయై మేల్కొంది కొండ వలె నిలిచి కలల్లో తూగే జాతికాదిది ! చెలియలికట్ట ఎరగని వార్నిధి ! నిత్యభాస్వరదేవతామతి మహాదాహం గొన్న కాలం రక్త ఝరుల్ని కోరుతూంది కాలాన్ని కబళింపనీయం ! ఖడ్గవ్యూహాన్ని చేదిస్తాం ఎదపై నిప్పుల కుంపటి దింపిన కృతఘ్నుల్ని తుద ముట్టించేందుకు త్వరగా హిమ జ్వాల నార్పేందుకు జల సంభృత నవ ఝంఝా హుంకృతి ఉరుములతో మెరుపులతో రణ వ్యూహ నవ మతితో ప్రజాస్వామ్య చరణంతో కదలండి నేఫా ప్రాంతం తరలండి లదక్ భాగం
59. కంపనం ప్రకంపనం గదిలో కలర్ టి.వి. చేరినా ఆ ఇండ్ల వాలకం పాతదే బండ రాళ్ళ శ్రేణుల గోడలతో బరువు గాథల రూపమే నిశా వేళ అవని గర్భం నుండి ధరా ప్రకంపన తరంగానికి పై పైకి చేతులు చాచిన మృత్యువు గుప్పిట్లో నిద్రాగణం రమారమి అంతా సజీవ సమాధిలో, మళ్ళీ ఉదయమే చూడలేదు చుట్టూ చెదరిపడిన శిథిలాల మధ్య కొన ఊపిరిలో ఊగే ప్రాణం చూచే చూపుకై చాచే చేయికై, ఎడారి నాలుకతో ఎదురు చూస్తూంది సాధించే విజ్ఞానానికి తోచకుండా, ఎదిగే శక్తి శిఖరాల కందకుండా ప్రకృతి వైపరీత్యం తోనో స్వార్థ గుహాభావం తోనో చాచిన మృత్యువు రెక్కలతో భవిష్యత్తు తనముఖం చూపిస్తూంది భూ ప్రకంపనమైనా జల తాండవమైనా నలిగేది ! రేఖ క్రింద నున్న వాళ్ళే ! శిఖరాలను కూల్చిన క్షణాలు గాయాలను మాత్రం మిగిల్చాయి పీఠభూమి అనుకున్న హృదయం బ్రతుక్కి డోలాందోళనమైంది దుష్ప్రభావ రుచి చూచాకే కారణాల్ని అన్వేషించేను మనిషి ! వ్యక్తి పరిధుల్ని దాటింది సమాజ శక్తుల్ని మీరింది
సుఖానికి దారి తీసిందే విపత్తుకూ దారి తీయొచ్చు ! తెల్లవారితే పొలానికి పోవలసింది, ప్రొద్దెక్కితే ఇంట్లో పిల్లల ఆకలి తీర్చేది ఎంత ప్రొద్దు పోయినా ఉట్టిపై ఆహారం నిశ్చలంగా శూన్యంలో వ్రేలాడుతూంది రాత్రి మూడు యాభై ఐదు అంకెలపై సూచిక లాగిన గోడ గడియారం దిగ్రమతో బిక్క మొగమేసింది ఉదయం ఆగీ ఆగని కాలాన్ని వేలెత్తి చూపుతోంది చుట్టూ ముక్కలై చెదరి పడిన జీవిత శకలాలతో భయద దృశ్యాలు శిథిలాల మధ్య ఊయెలలో నిద్రిస్తూన్నపసి పాప మిగిలిన అంకురం చీకటి అంచులో చంద్ర రేఖ, రాబోయే తరాని కాశా బింబం ఆపదలో ఒక హృదయం నుండి తెల తెల్లని పావురాళ్ళు ఎగిరి వస్తాయి అదే! సమయం ! మరో మతి నుండి నీలి నీలి గద్దలు బయట పడతాయి శ్మశానం నుండి ఎగసే ధూమాన్నీ అగ్ని నీ చీల్చుకొని పోయే హాహాకార శబ్దాలు నీరవమైన గగన హృదయంపై వాడి వేడి బాకు మొనల్లా దూసేను శిశిరం శరీరాన్ని ఆవహించింది గ్రీష్మం మనోవీథి తిష్ఠ వేసింది కంపనం ప్రకంపనం భయం! మళ్ళీ జనం కళ్ళ ముందు సుళ్ళు తిరగేను ఎలక్షన్లు ఆగవు ! రైళ్ళు నిలిచిపోవు ప్రవాహం ఆగదు ! ప్రభాతం దాగదు హింస ! విధ్వంసం ! ప్రకంపనమూ ఆగదు బయటి ప్రపంచమంతా అకంపనం! అంతలో ఎక్కడో ధరా ప్రకంపనం లాటూరే కావచ్చు లాస్ ఏంజిల్్స అవచ్చు మనిషిలో తరగని సంకల్పం మానవతా రాగ ధుని మీటుతుంది చరిత్రకు కొత్త రూప మిస్తుంది బ్రతుక్కి కొత్త ఉదయం తెస్తుంది
60. ప్రవాసం, ఆవాసం సమయ సమయం విడిపోయే శాఖలతో ప్రశాఖలతో సమాజ వృక్షం బృహదాకృతియై చరిత్ర గతులతో కొత్త అస్తిత్వం పొందుతూంది ఎగిరే పక్షి దిగే పక్షీ ఏ కొమ్మలోనూ రెమ్మలోనూ చిక్కుకోదు నలిగీ మాసీ మాడీ కూడా మనసు శుభ్రమై ఉజ్వలమై విభాసిస్తుంది అగ్ని నుండి బయట పడుతుంది ఆవర్తం నుండి పైకి లేస్తుంది జీవితానికి నిర్వచనం లేదు పై పై కెదిగే స్థాయితో పాటు అక్కడక్కడా మానవతా క్షామంతో క్రిందికి జారని స్థాయి లేదు మనిషి మనోరూపం ఆసమాజ దశకు చిహ్నం. హింసకు అవమానానికి గురై అరచేతిలో ప్రాణాలతో ఎదురుపడే అగ్నులకు దూరంగా, పై బడే పిడుగుల్ని తప్పుకుంటూ భయరేఖలు చుట్టిన ప్రవాస గణం ! మానవతా సీమలో ఆవాసం !
ఇదో స్వదేశంలో వెలియైన కాశ్మీర్ పండితుల ప్రవాసం ! ఆటవికం నెరపే చర్యలకు, బలియై, కళ్ళలో బిగిసిన అగ్నులతో కాళ్ళలో సుడులతో వచ్చీ ఆవాసం చేరిన ప్రవాస గణం ! ముఖంలో నిశ్శబ్ద ముద్రలోనూ కోలాహల రేఖలు ! కొండ చుట్టూ తిరిగే సుడి గాలుల్ని తలపిస్తున్నాయి దేశంలో రాజ్యాంగం సమాధానమేం చెబుతుంది ? ఏ దేశమైనా ప్రాంతమైనా ఒక్క మానవతా సూత్రం తప్ప ! జ్వాలానికేతనం నుండి బయటపడిన పిపాసార్త హృదయానికి చిలికిన ఒక్క ఆప్త బిందువు అదో మినీ హిమ కాసారం ! ఇప్పుడు మెలకువలోనే గతం స్వప్న దృశ్యమై ఎదురౌతూంది వర్తమానం ఎంత త్వరగా గతమైతే అంత మంచిదనిపిస్తూంది ! బాటను అడవి మ్రింగేసింది అనుమానం మనిషిని దారి తప్పించింది లోపల మండే తాపంతో రాత్రి చలి కాచుకునేరు జారే కన్నీటి స్పర్శతో పగలు వేడినార్చు కునేరు స్వేచ్ఛ ఎవరికి ? స్వాతంత్ర్యం దేనికి ? ఎదురుగా ఉరి త్రాళ్ళ వలె ప్రశ్నలు వ్రేలాడుతున్నాయి ఏ అంతర్జాతీయ స్వరం ఏ జాతీయ వాదం పండితునిలో పామరునిలో తిష్ఠవేసిన భయాల్ని తుడిచేస్తుంది అలసి పోయిన కనురెప్పలపై ఊగే నిదుర మబ్బు బరువుకు దేహం అవలీలగా మరో జన్మవలె శాంత సరసిలోకి దిగుతూంది ధూళిలో కలిసిన మానవతా రాగాన్నీ నీడలో జారిన భగవంతుని బింబాన్నీ దూరాన వెలిగే వీధి దీపం ముఖమెత్తి పైకి వేలెత్తీ సమాజానికి చూపుతోంది
61. భవితవ్యం ఒకే మతం ఒకే దేశమనే భావం నిజమైతే ఎక్కడిదీ ఆగ్రహం ! అసంతృప్తి ఇన్ని తుపాకి గుండ్లు ప్రేలుతాయేం ఇన్ని రక్త చిత్రాలు విలపిస్తాయేం ? బూది దిబ్బల్ని మంటల్నీ త్రోసుకొని కన్నీళ్ళు ప్రవాహం కడతాయేం ? పిల్లలూ పెద్దలూ విడిపోయి చెట్టుకొకరు పుట్ట కొకరయ్యేరేం ఇవన్నీ సాధారణమే ? ఎందుక్కాదు ! గ్రీష్మం తాండవిస్తే ఇదేమీ కన్పించదూ ఏలా కన్పిస్తుంది ? స్వార్థం పీట వేస్తే అహంలో
ఆడుకోబోయిన పిల్లలు వచ్చేరనీ తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది పనిపై వెళ్ళిన పెద్దలు వచ్చేరనీ ఇల్లాలు ఎదురు చూస్తూనే ఉంటుంది ఎందరో బంధువులకై ఆపు లకై కళ్ళు బయర్లు క్రమ్మాయి మిగిలింది మృగతృష్ణ ! కన్పించేది మృత్యు హాస దీపం ! బాంబు మెషిన్ గన్ టాంక్ ధ్వనితో వచ్చింది మహా బంధువు నీల మేఘానికి బదులుగా ప్రాణానికి అపాయం రణ ధూమం పంచ భూతాలూ పంచ ప్రాణాలూ వీటికే వేచి ఉన్నట్లుంది పచ్చని చెట్లు భగ్గున మండనీ, నదిలోనీరు ఎర్రనవనీ వేదనతో మూగవోయిన వారి మధ్య వేడుకతో చూచేవారూ ! ఉన్నారు వేయి చెప్పు లక్ష చెప్పు చరిత్రలో ఉందే మానవ సంస్కృతిపై గౌరవంతో పలుకుతున్నా ఎద ఎదలో తీవయై అల్లుకొనే మానవతా సంకల్పంతో, లౌకిక చైతన్యం ఒక్కటే ఈ ఖండం ! భవితవ్యం
62. జీరో జోన్ వాతావరణంలో గాలికి కదలే ఇరు రెక్కల కంటిన బూజుతో ఆశ, నీలి నీలి ఎరుపు తెలుపు పొగల నుండి ప్రాంగణంలో వాలుతూంది. ఇంటి ముందు చేతులు తెగిన చెట్టు చివురుకై మొగం వాచి ఉంది ఇంటి వెనుక గుండె జారిన బావి చినుకుకై ముని వ్రేళ్ళ పై నిలిచింది. బయట పడిన ఎముకల గూడుతో బుజాన నిండుకున్న జోలెతో దరిద్రం వాకిట్లో ఎదురు పడుతుంది, అసమ గతితో అనుభవ విషాదంతో ఎగసే ఆకలి సెగలపై ఒకటి రెండు కన్నీటి చుక్కలు రాలుతున్నాయి వేడి వేడి నిటూర్పు రేఖలు గాలిలో గ్రీష్మ గమనాన్ని రూపిస్తున్నాయి యంత్ర శబ్దాల్ని కలుపుకొనీ శబ్ద వీథుల నుండి గాలి ఆర్తినీ అలజడిని మోసుకొని చెట్ల బుజాలపై వాలుతూంది తెగిన కర చరణాలతో చెదరిన జీవితం వలె ఎగిరే శబ్ద శకలాలతో భగ్నమైన వాతావరణం నవమానవ వికృత శక్తిని చిగిరిస్తూంది ప్రకృతిలో ఖండిత రీతుల్ని అలంకరిస్తూంది ఎక్కడెక్కడి నుండో సంగీత ధుని చెవి దాకా ప్రయాణించే లోపల మధ్యలో కేకలు ! అరుపులు ! ఏడ్పులు ! బహు జాగ్రత్తగా కత్తిరిస్తున్నాయి దూసుకొని వచ్చే వాహనాన్ని మోసుకొని సాగే పవమానం
దారిన నడిచే మనుషుల్లో భయాన్ని విసరుతూ పోతూంది ధైర్యాన్ని కికురిస్తూ ఆహ్వానిస్తూంది అపాయ బాంధుర్యాన్ని గుర్తు చేస్తూంది నిజం ఎన్ని సార్లెనా వంచితం కావచ్చు శుష్కమై ! ఛిన్నమై పోవచ్చు ఎదురుగా మైదానంలో నడుస్తూ నలుగురితో వలయాకారంలో తిరిగి తిరిగి మొదటికే వచ్చీ చేరేరు మనుషులు అదే ! ప్రకృతి పొందే వికృతాకృతి నుండి ప్రకృతికీ జీవన రుచి గతిలో లయ నిలిచిపోతూంది తిరిగి అందుకుంటుంది సమయం ఏమీ ఎరగనట్లు నవ్వుతుంది పరిమళ మతితో పలకరిస్తుంది ముంగిట్లో పడే పిడుగును మరచి మబ్బు నుండి మెరపు జ్ఞాపకంతో ఉంది ఆశ గాలికి కదలే ధూళి ధూమం పొరలనుండి క్షణాల కొసల అంచులపై విరిసే మల్లె పూల రెక్కలతో నిజం మతిలో దిగుతుందనే విశ్వాసం ! మనిషిలో సహజం !
63. అవకూడదు జ్వాలా చిత్రం ముఖాన ముసుగు కప్పి అందంగా ప్రభాతాన్ని వీధుల్లో ఊరేగించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఏవేవో రంగులు మార్చిమార్చి ఏ ఆలోచనరానీకుండా మూగిన నీడల గుంపుల సంరంభంలో ఎవరూ కాదనడం లేదు తెలీని జనం కళ్ళకు రంగుల వల కల్పిస్తుందీ సమయం ఇది ఏదో అలంకారమనీ పదిమందీ చుట్టూ చేరారు కోట గోడల్ని దాటి ఇనుప గేట్లని దూకి పోతున్నాయి ఇసుక దిబ్బల్ని మైదానాల్ని చుట్టి నడిచి వస్తున్నాయి ఎర్రబారిన చూపులు ! అరుణ కాంతి తోరణాలు ! దారిలో అడుగుజాడలు ! పల్లెలో నగరంలో ప్రవేశిస్తున్నాయి మధ్య మధ్య విషాద కథలేంది ఏ చరిత్ర లేదు చిన్న పిల్లల మల్లే అందమైన వాగ్దానాల్ని నాయకులు ఆకర్షకంగా పంచి పెడుతున్నారు గగనాన్ని రెండు చేతుల్లో పట్టుకునేందుకై తమకు తోచిన చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తున్నారు సెకండ్లను నిమిషాలూ నిమిషాల్ని గంటలూ దాటే తొందరలో ఉన్నాయి
కాలం కదలుతూంది లేత చివుళ్ళ రెక్కలపై కాలం నిలిచింది ముసలి చెట్టువలె చేతిలో కట్టెతో కిటికీ చువ్వల మధ్య నుండి గాలి ఆగి ఆగి వీస్తోంది మధ్య మధ్య జ్ఞాపకం వచ్చే పద్యపాద ఖండాల వలె సరస్సులో కమలాలవలె మనస్సులో వర్తమాన విశ్వాసాలు ! చెట్ల కొమ్మల సందుల్లో చీకటి వలె నిలిచిపోయిన వ్యూహాలు సుత్తె దెబ్బల అనుభవంతో ఎంతటి శిల్పాకృతి పొందినా రాగరసం కోసం కణకణం తప్తమౌతుంది హృదయం ! నక్షత్రాలతో ఆకాశం వలె ప్రతిచెట్టూ వెలగాలనే పూలతో ఆనందమే కాదు ! పండ్ల కోసమూ ఆరాటపడుతుంది సూర్యుణ్ణి చంద్రుణ్ణి పలకరించే ఆలోచనలిప్పుడు చేదునూ వగరునూ రుచిచూస్తున్నాయి నిన్న ఉదయం ముఖాన వాలిన విషాదం ఇంకా రెక్కలు ముడుచుని అట్లాగే ఉంది ! ఈ ఉగాదిసృజన శక్తి సరించనీ మానవతా మాధుర్యం ఈ ఉగాది మనసులో పచ్చదనం అవకూడదు జ్వాలా చిత్రం
64. ఈ ఉగాది మొదటి రోజు గాలీ వెలుగూ ఆడని నిశ్శబ్దం గడ్డకట్టిన గదిలో రాతి పలకవలె నిలవకరా ! తలుపులు తెరచుకొనిరా ! గాలీ వెలుగూ సోకని నిశ్శబ్దం దిగమ్రింగిన మదితో మంచు బొమ్మవలె నుండకరా ఊహలు విచ్చకొని మరీ రా! బయటికి వచ్చిచూడు! చిరుగు పట్టిన బ్రతుకు బొంతలు చూడు ! దిక్కులు అంతటా ! ఎరుపు తిరిగిన నలుపు నీడలు సముద్రం మ్రింగజూస్తుంది కఠిన శైల బంధుర పర్వతాన్ని పర్వత మాక్రమింపజూస్తుంది ! క్షుబ్ద తరంగ సముద్రాన్ని కుచేల సంతాన మంటిస్తూంది నిప్పు ! అక్కడక్కడా ! కుబేర పట్టణాలు మండేను ధగధగ నిలువునా ! పొగదూరిన కళ్ళు నలుపు కుంటూ, ప్రజలీరోజు ! జ్ఞాపకం చేసు కునేరు దేవతలను ! వత్సరం మొదటిలిప్త ! గది నుండీ ! పాతబడిన మది నుండీ బయపడిన నీకు క్షితిజం ఆహ్వానం పలుకుతుంది ! అవని స్వాగతం చెబుతుంది ఆకాశాన వసంత సూర్యుని వలె వెలగనీ శక్తి నీలో
రా! బయటికి నీకాళ్ళపై నడు ! నీ రెక్కలపై ఎగురు! వంచే శక్తికే వంగుతుంది విల్లు, శబ్ద శక్తిని ధ్వనిస్తుంది లోకం శక్తి ఏ రూపమైనా కావచ్చు, గాలీ ! నీరు నిప్పు! మనస్సూ! చీకటీ దారిద్ర్యం నిండిన, ఇరుకూ అజ్ఞానం క్రమ్మిన ఈ గది నుండి పాతబడిన మదినుండి రా! బయటికి ఈ ఉగాది మొదటి పుటల్లో ! ఉషః కిరణ పంక్తియై రా విప్లవ కంఠం నుండి శాంతి స్వరమై ఎగసి నిశా శ్మశాన వేది పై కిరణ ప్రాణ స్పందనమై సాగి ఆత్మ శిఖరం పై దినమణి జోతియై వెలిగి మంచు పొర నుండి వెలుగు చందనమై విరిసి స్వప్న జగత్తును చెరపి వర్తమాన వాస్తవ మై కదలు! శూన్య నయానాల్లో వినీల మేఘ పంక్తియై తరలు ! దారిద్ర్య తాండవ శిశిరంలో వసంత రాగంతో దాహంతో అలమటించే గ్రీష్మ హృదిలో జీవధునితో కాల గతినిమార్చే ! శాంతి చరణమై గీతమైరా ! పరిణామ శిఖరమైన మనిషిలో ఉంది పూర్వ పూర్వ రూపం సంస్కృతీ సారమైన బ్రతుకులో ఉంది ఆటవికతత్త్వం అందుకే ! ఇంత అలజడి ! ఆక్రందన ! ఆశాంతి ఆస్పాలనం! స్నేహం ప్రేమ శాంతి సహనంతో రానీ సంస్కార శోభ ! ఈ ఉగాది ! మొదటి సమయబిందువుపై ఆర్ధ రాగమై రా! శాంతి కపోతమై రా! సృజన బింబిమై రా!
65. ఉగాది అడుగు పెట్టింది ఉగాది అడుగు పెట్టింది ప్రాణం ఉసురుసురు మంటూ మనిషి పై మనిషి నీడలతో రూపం గుర్తుపట్టలేకుండా ఉంది గ్రంథాలు తగలెట్టి మేధావులు చలికాచు కుంటున్నారు ఆగడాలతో దేశం ఆటవికానికి దర్పణ మవు తూంది ఇక్కడ ఏ క్షణంలో ఎవరు ఆయుధంగా మారేదీ తెలీదు ఏ ఉన్నత లక్ష్యంలేని గురిలేని స్వార్థం పిల్లాడి చేతిలో రాయిమోస్తరు ! కాళ్ళను వదలని నీడలు శృంఖలా సంగీతం వినిపిస్తున్నాయి కాలం విసుగెత్తి తిరగబడి గొంతుపై కాలూని కూర్చుంది నుదుటిపై గాయం నుండి నెత్తురుతో ఇప్పటికి గండం గడచింది కొన్ని పత్రికలు వివిధ భంగిమల్లో ప్రదర్శిస్తున్నాయి వేశ్యా పాతివ్రత్యం
వాళ్ళకీ గడవాలిగా బ్రతుకు ! గొంతు దిగాలిగా మెతుకు ఆకలిగొన్న ముఖాలు రొట్టె ముక్కతో శాంతిస్తే ఆకలిగొన్న ఈహలు అధికారంతోగాన తృప్తి పడవు ఆకలిగొన్న చేతలు రక్తంతో గాని శమించవు ఆకలి గొన్న అహంకారం ! హింసతో గాని నిద్రించదు భయాల దారుల్లో చరించే తలలపై గుండెలపై బాంబులతో విమానాల వలె ఆలోచనలు తిరుగుతున్నాయి ధూళి పొరలు చీల్చుకుంటూ భయాగ్నులు చిమ్ముకుంటూ చీకటి బాణమై హింస హృదయాల్ని దూసుకుపోతుంది తరాల సంస్కృతీ ప్రభ రంగం నుండి నిష్క్రమిస్తూంది హింసతో జయ ధ్వానం స్వర్గ ద్వారం చిత్రిస్తూంది నకిలీ గాంధీ ప్రకాశం ఉదయ భ్రాంతి కలిగిస్తూంది ఒత్తిడిలో నలిగిన బ్రతుకుతో ప్రతి ఋతువు వేసిన ముద్రలతో మొరటు దేలిన వాలకంతో కలలు నిండిన చేతి సంచీతో అరగిపోయి ముళ్ళు దిగే వీడని పాత చెప్పులతో ఇక్కడి నుండి ఎక్కడికి ? స్వర్గానికా ? దేవుని సన్నిధికా ! తలలు మునిగి లేస్తున్నాయి గంగలో కళ్ళు మూసి తెరుస్తున్నారు ధ్యానంలో స్వర్గం చూద్దాంలే చచ్చాక ఏలాగో తప్పదనీ దేవుణ్ణి తలుద్దాంలే ! అన్నీ హాయిగా అమరాలనీ ఈ మూల నుండి ఆ మూలకు ప్రయాణం చేస్తే సరిపోదు ఊహలో ప్రతిఫలిస్తూ ఈ దేశం మట్టిలో బింబిస్తూ నీ రూపం గుండెపై చేయితో ఎక్కడైనా సరే ! నిద్ర పోగల గాలి అశాంతి తీగెలపై ఈ దేశం పలుకుతూంది మృత్యు సంగీతం ఇంత కాలం నివురు వలె కప్పిన నవ్వు చెదరి పోయి వీచే గాలికి మెరుస్తూంది అంగారం తెలిసో తెలీకో అడుగు పెట్టి కిందికి దిగిన జలపాతం ! ఏలా వెనక్కి వెళ్ళిపోతుంది ఉగాది అడుగు పెట్టింది ఉసురుసురుమంటూ ప్రాణం
66. రానీ మరోజన్మ ఈ ఉగాది రానీ మరో జన్మ ఈ ఉగాది ! భయమెందుకు ! అందేనా జరిగేను మానవతా మనోజ్ఞ సిద్ధి
ప్రతి యుగ జననంలో ఉంటుంది కొత్తదనం ఊహలో వర్తనలో జీవన నవ భూమికలో ఎన్ని మార్లు పుట్టామో ! ఎన్ని సార్లు చచ్చామో ! జ్ఞప్తికుండదు ఎన్నిమార్లు పుట్టేమో చచ్చేమోనని ఎద ఆవేదన పడుతుంది నాకు వద్దు స్వర్గం ! అంతకన్న ముక్తి ! రానీహృదిలో రక్తి చివురులో మొగ్గలో పూవులో ఉంది సుమీ మరో జన్మ వాడిన పూవులో ఎండిన గుండెలో ఉంది సుమీ మృత్యువు బీజ నాశనం నుండి మొక్క వలె చావు అంచుల్లో జీవనం ! అందుకే చావంటే భయం లేదు మరో జన్మకు సంకేతం ఉగాది
67. ఉగాది రావలసిందే వికసించిన వదనం నుండి చిరునవ్వుల కింజల్కాలతో ఉగాది రానే వచ్చిందని తెలిసింది నీకూ నాకూ శూన్య శాఖా జీవితంలో పల్లవ గుణ శ్రీకారంతో ఉగాది దయచేసిందని తెలిసింది ప్రతి మనిషికీ చెట్టు చెట్టుకీ మధ్య చివురు పూల వంతెనతో అందంగా ఉగాది దిగిందని ప్రపంచానికి తెలిసింది శరీరానికీ శరీరానికీ మధ్య స్నేహ సుందర హృదయంతో కాలంపై ఉగాది ఉదార లక్ష్యం సమాజానికి తెలియాలి పూవు పూవు నుండి జ్వాలలే వస్తాయో పరిమళమే వీస్తుందో నీకూ నాకూ ఏం తెలుసు ? ఏ అగ్నికో ఏ గాలికో బాగా తెలుస్తుంది ! జీవన గతిలో అమానుషం అందరికీ తెలీదు ఈ ఉగాది ఇప్పటిదా ? ఆత్మ నాటిదీ ! ప్రకృతి అవతరించి నప్పటిదీ ! శాఖా ప్రశాఖలతో జీవితం ఎక్కడికక్కడ మహాతరు వనం మాటలో కొత్త చివురుతో ! గుండెలో కొత్త రసంతో ఉగాది రావలసిందే ! అదీ ! వత్సరాని కొకమారైనా! బ్రతుకుపై ఆశతో గుండెలో ఆయువుతో ఉగాది వస్తుంది ! పేద ముఖంలో ఒలికిన కళతో, అశాంతి నుండి, ఆర్తి నుండి, విధ్వంసం నుండి విస్ఫోటం నుండి సృజన కిరణ సమాజంతో, ఈ ఉగాది బయటికీ రానీ స్విచ్ ఆన్ చేస్తే చీకట్లో బల్బు వెలుగు విన్నాణం సృజిస్తుంది.
స్విచ్ ఆన్ చేస్తే బ్రతుకులో మందు పాత్ర మృత్యుహేల ప్రదర్శిస్తుంది ప్రతి రుతువూ మనిషిని పంజరంలో తిప్పుతుంది ప్రకృతి వరసలో కాదు జీవన చలన విధంలో వెలుగు చలనంతో విశాల హృదయ గగనంలో బారులుగా మానవతా హంసలు కదలుతాయి వెంట వెంట క్షణాల పూలమెట్లు అమరుతాయి పాత్రలు పాత్రలుగా మనుషులు మెట్లపై కదలేరు సృజనకు వెలుగు మూలమేదైనా కావచ్చు సూర్యుడో ! దీపమో ! ఆత్మబింబమో !
68. ఈ ఉగాది నాడైనా వెలుగు అవతరిస్తుంది బందువై మిత్రమై అతిథియై పగలైనా రాత్రి అయినా ఒకటే ! దీనికో సమయం లేదు అద్దంలాంటి మౌనంలో మనోరహస్సు బింబిస్తుంది మౌనం లాంటి శబ్దంలో అర్థాంతరం స్పందిస్తుంది వెలుగు కదులుతుంది మనిషిలో మనిషిలో క్షణాల్ని అల్లుతుంది రంగుల వాస్తవాలతో స్థితుల్ని నిర్మిస్తుంది అవసరాల కలనంతో వెలుగు చేతనకు సంకేతం ప్రకృతిలో మనిషిలో వెలుగు కదలుతుంది మతిలో స్క్రీన్ పై దీనికి రహస్యంలేదు ప్రసారమానంలో లిపి లిపిలో శబ్దంతో రేఖలతో చిత్రంతో ఉందొకటే మనస్సు పలికే విధం చూచేరూపం స్విచ్ ఆన్తో ఏ ఉదయమూ అస్తమయంకారాదు స్విచ్ ఆన్తో హృదిలో వసంతదిగనీ, ఉగాది నాడైనా !
III. ముక్తకాలు
(1970) మాదిరాజు రంగారావు అంకితం
జీవన సహనచరి శ్రీమతి ఇందిరకు ముక్తకాలు కాలదేవత మనసులో విరిసిన మల్లెలు ఉబికిన సంతోష లహరులు చుక్కలు - కాదు, భాగ్య హీనులు రాల్చిన బాష్ప కణాలు హృదయం ఎగజిమ్మిన అగ్ని స్ఫులింగాలు గ్రీష్మం వస్తుంది నిప్పు రెక్కలు విప్పి పసిడి కుప్ప వలె భాసిస్తుంది జగత్తు రాత్రి వస్తుంది మసక చీకటి కళ్ళతో బూది కుప్ప వలె మారుతుందదే లోకం చెట్ల కలలు పూలూ పండ్లు, ఊహాలకు రూపాలు నీడలు నదుల కలలు పైరూ పంటలు, ఊహలకు అడుగులు తరంగాలు మనిషి కలలూ ఆశా మరీచికలూ నవాదర్శ బింబాలూ అజంతా హిరోషిమా స్వర్గం నరకం ఋక్కులు సృట్నిక్ లూ చలికి బిగిసిన జీవితం అంగారం కోరుతుంది మరో ఉదయం కోసం బ్రతికేను మనిషి మనీషీ చీకటి రాత్రుల్ని మనో దీపంతో వెలిగిస్తూ మృత్యువును జయించే కోరికే చివరకు మిగిలేది పరిమళ హృదితో మల్లె పూవు, ప్రసన్న మతితో చంద్రవంక నేలపై నింగిలో కాలం విరిసిన నవ్వు మొలకలు, ఒకటి గాలిలో ఊగుతూ మరోటి చీకటిలో వెలుగుతూ విషమ విషాద వేళల్లో మనిషికి సమతను సూచించేవీ మనిషి ఊహ చివరి బిందువు ఈశ్వర కల్పన ఈశ్వరుని సృష్టి చివరి రూపం మానవ రూపం ఎవరి కోసం నిర్మిత మైందో ఈ భవనం వారి చేతలతోనే అవుతుంది నాశనం కొన్ని చెట్లు పూలెరగవు, కొన్ని పూలు పరిమళ మెరగవు కొందరికి అనుభూతి పట్టదు, అదృష్టవంతులు క్షణ క్షణం మార్పు నొందే ఈ జగత్తు ఎవరి హేలకోగాని ఏ రోజున కారోజే ప్రశ్నా పత్రం వలె ప్రత్యక్షం జవాబు కోసం మనిషి మారేను మనీషిగా దూరాన సముద్రం ! చెలియలికట్ట పై నేనూ నన్ను ఎత్తుక పోజూచే గాలీ
ఒక్క తరంగం చాలు ముంచడానికి బైట పడేయడానికీ వచ్చే అలలు పరుగెత్తే కోర్కెలు! మరలేవీ తీరని కోర్కెలు. ఏ పెదవులపై విరిసిన హాసశ్రీ లీసుమాలు సంజ వేళ వన్నెతో మరునాటికి మన్నులో విషాద గతి నందేను కొత్త వాటి కిచ్చి స్థలం నిశా మృగాన్ని వేటాడే రవి అవతరించాడో లేదో మేల్కొని నిద్రించే పర్యంతం భూమిపై మనిషిని వెంటాడేను మనిషి, నీడను నీడ పగలు రాత్రి పేరిట రాగంతో దుఃఖంతో కాలం నుదుట తోచే అదృష్ట రేఖలు ప్రిజం వంటి మనస్సు పై రూపం మారే వెలుగులు. భాగ్య హీనుని కంటి నుండి జారిన బాష్ప కణం చీకట్లో చివికే బ్రతుకు చూపే దీపం బాష్ప కణంలో నినదిస్తుంది బడబాగ్ని సంగీతం మనసు లోతులు వెదికే చూపులు కొందరివి మనిషి రూపం చూచే చూపులు కొందరివి కళ్ళే ఉంటాయి చూపులు తప్ప కొందరికి. వెన్నెలకు కులం లేదు జీవన బంధం లేదు ఇది లేంది యోగులకూ అంత కన్నా అమాయకులకూ లేదని నమ్మించడం లౌకిక మూర్తులకే సాధ్యం అగ్ని కణం బాష్ప లవం ఏదీ రాల్చని కళ ్ళ ఉంటాయి ఏ రాతి గుట్టలో ఏ ఎడారి ఖండాల్నో తలపిస్తాయి. అగ్ని నార్పుతూ కొందరు రగుల్పుతూ కొందరు తిరిగేరు సాగరం నిండా రత్నాలేనా ? భూమి అంతా బంగరు గనులేనా ? అద్దంలో ఎన్ని సార్లు చూచుకున్నా కన్పించేది ముఖం కాదు, లోతు తెలీని సరస్సు మాత్రమే అనంతంగా నిద్ర ఎరగని కీర్తి సముద్రం ప్రపంచం నిరంతరం చలనంలోనే ఆనందం, అస్తిత్వం పై విశ్వాసం అనుభవ కిరణ పంక్తుల్ని ప్రసరిస్తుంది కవిత్వం ఆలోచనా సమాజమైన మనస్సులో నభోమణి అంతా రామార్పణ మయ్యాక ఫైర్ ఇంజన్ దయచేసింది దాహంతో దారి కడ్డంగా నీటికై జన సందోహం ! అంధుడు అద్దంలో ముఖం చూచుకొని సంతోషించినట్లు మనిషి కెదుటి ముఖంలో తన ఎద చూడాలని తహతహ
ఆకాశ మతిక్రమింప పై పై కెగిరే విహంగం రవి తేజానికి బొగై ఏమై పోయేదీ తెలీదు ఆనంద రూపమైన గులాబి చుట్టూ కంటకాలు త్రుంచడం తెలీడం లోకజ్ఞత, వశం చేసుకోవడం లౌకికం అర్థ ప్రకృతి వివృత రూపాలు కళలు కవిత్వం త్యాగం కఠోర ప్రకృతి వివృత రూపాలు అధికారోన్మాద మహంకారం ఆ వస్తువు దొరికిందా ? ఎవరికి ? ఎప్పుడు ఎక్కడో చెప్పు అదే దొరికితే ! ఈ అసహనం అశాంతి ఆక్రందన దేనికి ? ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి అతిథీ చిత్రం ! యజమాని అయ్యేందుకే సకల శకల ప్రయత్నం ఇట్టే వెత జెంది అట్టే మురిసే మతికి మాత్రం అన్నిటి కన్నా అందం బింబించే అద్దం కావాలి ఇసుక రేణువుల్ని లెక్క పెడుతూ కాలక్షేపం చేయకు ఎడారి ఎద రూపం చూడు ! ప్రవాహ లహరికై యత్నించు ఈ బొమ్మలు నడవ లేవు మోసేందు కెవరో కావాలి ఎంత కాదన్నా ప్రపంచం చూస్తూ ఉండలేదు ఉజ్వల స్వాతంత్ర్యం వెలిగింది సూర్యుని వలె ఎదలో మానవత సూర్యునివలె వెలిగితే మంచిదే ఉదయం మిత్రుని వలె ఎదురౌతుంది ఆయువు గంధంతో సాయం శత్రువు వలె ఆక్రమిస్తుంది మృత్యు రహస్యంతో ఉషస్సు కెవరూ మార్గం చూప నక్కరలేదు వేదనతో తప్తమై కరుణతో స్నిగ్ధమైన మనిషికీ ఉంది సత్యం ! గ్రంథాల్లో ప్రవచనాల్లో అద్దంలో బింబింవలె మ్యూజియంలో శిల్పం వలె ! మతిలో భద్రంగా ఊహ లేంది శబ్దానికి శక్తి లేదు దాహం లేంది జీవికి రుచి తెలీదు సమాజ మహానదిలో స్వప్న లహరి వలె వాస్తవం కవిత్వం ఎడారి పెదవులపై నీటి చుక్క ఏ ముత్యమో వజ్రమో కానీ దాహ స్థితిలో మనిషికి చేతిలో స్వర్గం కన్నా అమూల్యం ఎదురుగా వస్తూ పోయే మనుషులు ! మనస్సులో తలపులు తలపుల్లో బొమ్మలు ! మారుతూ పోయే మిత్రులూ శత్రువులూ ఎన్ని ఊపిరులు వదలు తూంటే అన్ని మెట్లు దిగుతూన్నట్లు ఎవరైనా అడ్డు నిలిస్తే నెట్టేసిపో ! నీవే ఐతే తొలగి పొమ్మను ! ఏ ఎండకో ఏ వానకో ఈ చెట్టు క్రింద కలిసే మనం మాటల్లో కాక చేతల్లోను దేనికీ పొగలూ సెగలూ ?
ఎంత వయసువచ్చేస్తుందో అంత ఆయువు పోయినట్లే విహగం వలె వాలుతుంది, మెరపు వలె గతిస్తుంది. ఏ ఒక్కరి బ్రతుకూ ఏ నీడ లేని వెలుగు దివ్వె కాదు ఏ ఒక్కరి బ్రతుకూ ఏ వెలుగు లేని చీకటి ముద్ద కాదు ఏడుపు ఎక్కడ చూచినా పొందడానికీ పోగొట్టుకోనీ బ్రతకడానికీ ! ఏడుపుతో పుట్టుక ! ఏడుపుతో మృత్యువు ఒక చోట నిల్వదు ఊహ, ఒకనాటి కంతమవదు ఆజ్ఞానం ఎప్పటికపుడు సమస్య తీరినట్లు భాసింపజేస్తుంది విజ్ఞానం ఒకడు పుట్టి చేసిందేమిటి ? మరొకడు కట్టని గాలి మేడ నిజ రూపం ఎవరూ చూపించరు ! లోకం తన్ని తగలేయదూ ! ఒక్క కన్నీటి బొట్టు వెనక సముద్ర మంత సంక్షోభం ఒక్క మానవ బాధ హత్య వెనక ఆకాశ మంత కారణం ఒక్క వెలుగు ఉంగరంలో గగనం మెరుస్తుంది మరకతమై ఒక్క వెలుగు గూడులో అవని ఒదుగుతుంది గువ్వయై ఒక్కొక్క రోజు వ్యాఖ్యానించదగిన ఒక్కొక్క సూత్రం చివరి లిప్త చదివే దాకా అర్థం అంతుపట్టదు కదలే క్షణం కాల జలధిలో నిలకడ లేని తరంగం ప్రవాహానికి మహాపథం భవిష్యత్తుకు వర్తమానం కదలే సరస్సు వంటి మనస్సుపై నీడల వలె ఊహలు ఒకదాని వెంట మరొకటి ! నా ముఖం దర్శించే వీలే లేదు కళ్ళతో వెదికే ముఖాలకు పగలు దీపం అవసరం మనసుతో వెతికే మనుషులకూ అవసరం లేదు దీపం కళ్ళ నుండి బిందువుల్లో సముద్రాలు దొరలుతాయి కళ్ళ వెనక వేదనలో సముద్రాలు దాగుతాయి కళ్ళ ముందు నీలి తెర జారింది జగత్తు వల్ల కాడైంది కళ్ళ ముందు వెలుగు తెర జారింది జగత్తు వెండి కొండైంది కళ్ళు చెరువులైతే చాలదు ! ఎదలో సత్యాగ్రహాగ్ని అవసరం కాస్త పెద్ద అరుపుకే రైఫిల్తో అవతరిస్తాడు పోలీస్ ! కష్ట జీవి స్వేదం హరించే సమీర హస్తాలతో వస్తుంది ఉగాది ఈనాటికైనా బ్రతుకు పల్లవిస్తుందనే ! యుగాల ప్రాణ బంధువు కాదు నేను జలధితరంగం ! అవును కన్నీటి కెరటం కాదు నేను కదలని విగ్రహం ! అవును సమాజ చలనం కాల సముద్రంలో లోతులు చూచేది సూర్య చంద్రులే వర్తమాన శిఖరాల్ని అధిరోహించేది మట్టిపై మనిషే,
కాలం కళ్ళు మూసి పబ్బం గడిపేను అమావాస్య హృదయం కాలం కళ్ళు తెరచి బ్రతుకు నడిపేను కాంతి బింబ హృదయం కాలం కొందరికి వృక్షం మహామతికి జవాశ్వం మంద మతికి పర్వతం, అనుభవం మానసికం వ్యక్తి నిష్ఠం కాలం మరపు గతం, కాలం మెలకువ వర్తమానం మరపుతో మెలకువతో సాగిపోతుంది ప్రయాణం కాలి బాట సాగి, సాగి, కలుస్తుంది సముద్రంలో మనిషి ఊహ కదలి కదలి చేరుతుంది సమాజంలో ఖైదు నుండి విముక్తు లిద్దరు హంతకులు సాగారు ఒకరి కళ్ళలో నిర్మలాకాశం మరొకరి కళ్ళలో జ్వాలాగోళం గత జన్మలో మిత్రం వలె ఇంటి ముందు ఉదయం బ్రతుకులో ఒక్కొక్క రోజు చేతికి తిరిగి రాని రత్నం గతం మృత్యు సమం అనుభవాత్మకం వర్తమానం ఆశాభాసం భవిష్యత్తు ఈ మూడిటి సంపుటి జీవితం గాలికి చెట్లు కదలక ఉండేనా ? మ్రోడులు బండలు తప్ప గాలికి జలధి లేవక ఉండేనా ? గుంటలు పడియలు తప్ప గాలికేమో ! నీటి పై అలలు చెరుపుతూ పోవాలనీ మనిషికేమో ! మనస్సులో స్మృతులు మలపుతూ పోవాలనీ గాలి తరంగ రూపమిస్తుంది ప్రకృతిలో జలాలకు అదృష్టం అందమైన ఆకృతినిస్తుంది శూన్యంలో బ్రతుక్కి గుడ్డి రేయి వంటి స్థితిలో అద్దంలో ముఖం చూస్తే నా ముఖం మినహాయించి ఎవరెవరివో తోచాయి గులాబి వలె మరపించి ములె తేలుతూంది కాలం ముల్లు గుచ్చు కోంది జీవం ఉన్నట్టు తెలిసేట్టు లేదు చపలత్వంతో పొందే నరకం ! కాలం కన్నీటి నిప్పు కణం దివ్యత్వంలో వెలిగే స్వర్గం ! కాల ముఖంలో విరిసిన పద్మం చంద్రుడు వచ్చినా రాకపోయినా రాత్రి నిల్వదు రేపు సరేలే కానీ ఈ రోజు క్షణం వాలనీ ఉషయై చావు అజేయం అందుకే భయం, గతం రాదు అందుకే దురభిమానం మెలకువ వర్తమానం అందుకే ఇష్టం, భవిష్యత్తు భద్రం అందుకే ఆశ చెలరేగిన అగ్ని కెక్కడిది ? పూవు అనీ ప్రాణి అనీ వివేచన కదలే దీపం యోచించదు. నీడ బలం ! చీకటి అధికారం చుక్కలు చీకట్లో వెలిగేవనీ ఆలలు తీరాన నశించేవనీ స్పందించడం హృదయ స్వభావం, వివేచించడం బుద్ధి లక్షణం
జీవితం కాంతి విహగం దూరం వెళుతుంది గతిస్తుంది వెనక్కురాదు, భవిష్య దాకాకాశంలోనే సదా ప్రయాణం జీవితంలో అదృష్టమెపుడో అతిధి వలె వచ్చిపోతుంది దానికెన్నెన్ని మర్యాదలో చేయలేక చస్తుంది మనస్సు తీగెలు చుట్టిన పంజరం ఈ చుట్టూ ఉన్న ప్రపంచం మణులతో మెరసే భుజగం దీని వెనుక నున్న కాలం తుపాకి దెబ్బకు పిట్టల వలె ఎగిరే కాలం మారింది కాని రూపాయి గుప్పిట్లోని కాలం కదలడానికే భయపడుతూంది తెర పడక తప్పదు వేళకు జయమైనా అపజయమైనా కథ మలుపు తిరగక తప్ప దెవరికి పట్టినా పట్టకపోయినా దగ్ధమైన అవనిలో పచ్చదనం తెస్తుంది వర్షాశీస్సేచనం రాతి వంటి హృదిలో రాగం పలికిస్తుంది శిశూదయ బింబం దాహంతో చావ నున్నవారు మహానదిలో దింపబడినారు దాహం మాట దేవుడెరుగు తిరిగి కంటికి కన్పించ లేదు దీప శిఖ చుట్టూ ముసిరే దారి తెలీని గుడ్డి వెలుగులు శిఖను స్పృశించలేవు సరికదా చీకట్లకు దారీ చూపలేవు దుఃఖం సముద్రం వంటిది పల్లం నుండి చూస్తే కన్పించదు చెలియలికట్ట నధిరోహిస్తే గాని నిజ రూపం బయట పడదు నరకం పాపిని శిక్షించింది కాని పాపం అట్లాగే ఉంది దేహం అందుబాటులోనిదాయె మనసేమో అందనిదాయె నా కళ్లలో నీరు వేదన కావిరై పోయింది బయటికి రాకముందే అదృష్టం మేల్కొన్న గులాబి వదనంపై పొద్దున మంచు ముత్యాల తళతళలు ! నాకవసరమైనవి వదలేసి నాపై బొమ్మలు విసిరేవు నీ తెలివికి సంతోషం కానీ అరచేతిలో పూలు రాలనీ ! నిదురతో రెక్కలు వాలి కుప్పగా కూలిన కాలం మెలకువతో రెక్కలు విప్పి ఎగసే విహంగం నిన్న శిల్పంలో సౌందర్యం, నేడో శ్రమశక్తుల స్పందనం నిన్న సమస్తం దైవమయం, నేడో సామాజిక గతియుతం నిప్పులు చెరగే నిరంకుశ గ్రీష్మం మండించింది మంట గలిసింది ఓడిన లోకం గెలిచిన తానూ అందుకునే ఫలితం ఒకటే నీడ కదలుతుంది శరీరాన్ని మ్రింగే ఆశతో నీడ బ్రతుకుతుంది రవి శశి చూపుల చాటున నీలి మబ్బు దుఃఖం వెనక చంద్ర రేఖ వలె భవిష్యత్తు కలసి వస్తే పుష్పశయ్య ! లేకపోతే శర తల్పం
ప్రకృతినీ సమాజాన్నీ కలిపే సూత్రం ! మనిషిలో ఒక వైపు నింగీ ! మరో వైపు మట్టీ మధ్యలో జీవితం ప్రతి రోజు కొత్తే ప్రతి దారీ కొత్తే అంతలో పాత బడుతుంది అదృష్టవంతుని జీవితం శిలాతలం పై ధార సంగీతం వినిపిస్తుంది పనికిరానివన్నీ పురా రహస్యాల పెట్టిలో భద్రమైనాయి పోయిన రోజు కన్నా వచ్చేదే ఎక్కువ జ్ఞాపకం ముంటుంది ప్రపంచం నుండి దూరం సుదూరం పోవాలనుకొనీ తిరిగి వచ్చి చేరారు ప్రపంచం మొదటి చోటుకే బ్రతుకంటే ఏమీ లేదు ఎప్పటి కప్పుడో దోసెడు నీరు తన దాహం తీర్చేందుకో ! మరొకరికి తర్పణం విడిచేందుకో ! బ్రతు కింకా బ్రతకాలంటుంది నదిపై అలల వలె ప్రియంగా విధి పవనం వీచే కొద్దీ ఉత్సాహం ఉద్రేకం అధికమవుతుంది బ్రతుకు గడస్తుందొక్కొక్కరికి యంత్రం వలె దీపం వలె వదలని నిద్ర వలెనో, అవిచ్చిన్న యజ్ఞం వలెనో బంగారు రేకుపై తన బొమ్మన గీసి పేరు ఊరు చెక్కి సముద్రంలో వదిలాడు శాశ్వతంగా ఉండి పోతుందనీ బాగుంది ! ఆహ్వానం స్వీకరించి వేళకి ఉపవాస హఠం తప్పని బ్రతుకులో పంకజ మనుకునే వారూ ఉన్నారు బీటలు వేసిన కాలం సందుల్లో నిలిచిన కోర్కెలు వర్షం కదలికతో పచ్చ పచ్చని సంగీతం వినిపిస్తాయి భగవాన్ ! నిన్ను కీర్తించడానికి సమయ మెక్కడిది ? నేను భయపడిన తుపాన్ వచ్చే సూచన మారింది భయం మాయకు చిహ్నం మాయలో మనిషి అజ్ఞాన శిఖరం మాయంటే తెలీని తనం మహా బాగా దారి తప్పిస్తుంది భూమి పై పద చిహ్నాల్ని ఎత్తుక పోతుంది గాలి జలధిపై పద చిహ్నాల్ని వదలి పోతుంది అదే ! మన మెక్కడ కలిసామో తెలీదు విడిపోయింది గుర్తుంది వెలుగు ముద్దు పెట్టుకుంటుంది ! చీకటి బుద్ది చెబుతుంది మనసులో ఎన్నిసార్లు తలచుకున్నా వినిపించేది హృదయంకాదు ! తీగెలు సరిచేసిన వయోలిన్ ! మనిషిలో మనిషి ఉన్నతికై కళలూ సాహిత్యం ప్రకృతిపై మనిషి అధిక్యంకై అవసరం విజ్ఞానం మమతా స్విన్నమైన మతికి సీమలు తెలీవు చాంద్రీ స్నిగ్ధమైన ఎదకు వర్ణాలు తెలీవు
మలగుతూన్న క్షణం వెనుక నిలిచి ఉంటుంది చీకటి వెలుగుతూన్న క్షణం వెనుక వేచి ఉంటుంది అధికారం మల్లీ సౌరభాలు ఝం ఝా మారుతాలు మనిషి ప్రకృతిలో ద్వంద్వాలు అమృత సరో మూర్తులూ ! అగ్నిగోళ వర్తులూ మహా కాల కాసారంలో వికసించిన పద్మం సూర్యుడు, కాదు అంధకారంలో యుగాలుగా భ్రమించే హృదయాగ్ని గోళం మాట్లాడే బొమ్మలకై చిన్నారులు నోరు మూసేందుకు పెద్దలూ ఆపద శంకించి భయంతో అవకాశం నిచ్చెన తన్నేయడం సాధారణం ముందుగా శిశిరం వస్తే రానీ వసంతం పై ఆశ ఉంటే చాలు మూసే చీకటి వస్తే రానీ! ఎదలో మేల్కొని ఉంటే చాలు ! యుద్ధాలు క్షామాలు పైబడి దయచేస్తూంటాయి మేల్కొనని జనం ! గాయాల బాధ ఎరగని కళేబరం రక్తారుణ సరస్సు నుండి తల ఎత్తిన ఉదయ తేజం ఒకరికి దేవీ పద రాగం మరొకరికి విప్లవ సంకేతం రాత్రి చుట్టుకున్న కృష్ణ సర్పమైతే ఉదయం గంతులేసే గోవత్సం హింస అశాంతి ఒక వైపైతే ప్రేమ సౌందర్యం మరో వైపున రాత్రి నాతో పోటీ పడుతుంది నేను లేస్తేగా బారెడు ప్రొద్దెక్కినా రెఫరీ నిర్ణయం ఏ పక్షమైనా నేనునేనే ! నిద్రలో నావను ! రాత్రి సమాప్తికి మినుకు మినుకున ఎదురు చూస్తుంది దీపం అపుడే ఉదయం వచ్చేనా ? అని ఒదిగి ఒదిగి చూస్తుంది రాత్రి రాత్రి నిద్రించిన సూర్యుని స్వప్న రూపం చంద్ర బింబం బింబంలో సౌందర్యం చూచుకొని పరవశిస్తుంది నిశ రాత్రి మేల్కొనే ఉంటుంది కన్నుల్లో వత్తులతో సూర్యుడు లేని సమయంలో బ్రతుకు చూడాలనీ రాత్రి వాలుతుంది బరువుగా పగలు తప్పుకుంటుంది నేర్పుగా ఎక్కడో ఎడారిలో పచ్చదనం ఎప్పుడో దుఃఖంలో మాధుర్యం రాత్రి వెలుగు చుక్కల వలె కన్నుల్లో ఆశలు రోజు వెంట రోజు విసరు రాయి మోస్తరు రెక్కలాడిస్తూ ఎగిరే పక్షి ఆశా ముఖానికి వింజామర ఊహ లేంది పదానికి శక్తి లేదు, దాహం లేంది నాల్కకు రుచి లేదు రెప్పలపై ముంచుకొస్తుంది సవేగ నిద్రా కురంగం మిన్ను మన్ను ఏకం చేస్తుంది దీర్ఘ నిశా తరంగం రోదసి నావరించిన భ్రాంతి, ఆకాశ మావరించిన మౌనం అందరిలోను ఉంది, సమయానికి పనికొచ్చే నిచ్చెన వలె
లోకంలోకి రావడమంతా సమానంగా బహు సామాన్యంగా విడిపోవడమూ అంతే ! ఈ మధ్య పాత్రల్లోనే విశేషమంతా వచ్చిన పని అయ్యేంతవరకు ఎదలో ఆర్తీ కళ్ళలో ముత్యాలూ వచ్చిన పని అయిపోగానే ఎదలో శూన్యం, కళ్ళలో శిశిరం వర్ణం లేని వస్తువు లేదు, రాగం లేని మనస్సు లేదు స్థితిని బట్టి రీతిని బట్టి దీని కందం దాని కానందం వర్షా నృత్యంలో తెగిన పాద మంజీరం వలె సరస్సు స్వర్లోకం ఒలికినట్లు గట్టు నున్న మ్రోడు ముఖం ! వస్తువెంతదైనా చూచేది కళ్ళ వెనుక నున్న మనస్సే సముద్ర మెంత లోతైందైనా నావ కదలేది జల తలంపైనే విపదబ్ది మునిగి ఒకరి మనస్సు నవనీత సదృశమౌతుంది సుఖాబ్ది తేలి ఒకరి మనస్సు మహాగ్ని సమానమౌతుంది విషాద జీవితంలో హ్లాదైక బింబం పారాడే శిశు శశి అవును ! హృది నుండి ఉద్గమించిన సౌందర్య దీపం వీరుని రక్త సిక్త దేహం వలె వెలుగుతూంది సంధ్య ఒక దీపం ఆరిపోయి మరో దీపం వెలుగుతుంది. వెలుగూ చీకటి ఎన్నటికి కలవని కాల నదీ తీరాలు స్వర్గ నరక సంకేతాలు ఒకే ముఖం సుఖ దుఃఖ పార్శ్వాలు, వేళ గాని వేళ అతిథియై వస్తే వచ్చారు స్వామి ! ఆ కుక్క దేనికండీ తమరి నంటుకొనీ ! శాంతి యుద్ధంలో ఏదీ గెల్వని సమయాలే ఎక్కువ ! రెండు చివరలూ జీవితంలో కలవని రేఖలే ఎక్కువ సముద్రంలో ఓడ వలె నిద్రలో గడచింది రాత్రి ఉదయం మేల్కోగానే గిరులతో లోయలతో అసమతలం ! సృష్టి ఏమో అవదు ! ఏమో అవనున్నట్లనిపిస్తుంది జ్ఞానంతో పరాస్తమౌతూ అజ్ఞానం తిరిగి ఉద్భంచినట్లు సూర్యుడు ఆరిపోడు భగవద్భావన పోదు యుగాలు గతించినా తొలి యుగచిహ్నాలు మారవు హృదయం కోరుతుంది వేదన నుండి ముక్తి వేదన లేంది హృదయానికి లేదు దీప్తి II ఈ మంచు నాలో మృదు వల్లిని జీవింప జేస్తుంది ఈ కాంతి నాలో క్వచిదుష్ట ఝరీ స్పూర్తి నిస్తుంది రావాలి జల్లు గుండెల్ని ఆర్ద్రీకృతం చేస్తూ
పోవాలి శుష్కమైన వాలకం జన వని నుండి అవనిలో దాగిన వేళ్ళలో కొత్త సృష్టికై ఆరాటం సమాజ జీవితంలో వ్యక్తులమధ్య వైరుధ్యం కదలుతూన్న ఆలోచనలతో పవనం అనుభవాలు మీటేను వెలుగుతూన్న సంధ్యాశిఖలతో సమయం స్మృతి పథాన్ని తీర్చేను భయం క్రమ్మి క్రుంగి పోయే ఆకాశాన్ని భుజంపై నిల్పేను మనసు భయం వీచి దుమ్ము చిమ్మే భూభాగాన్ని పదం క్రింద నిల్పేను మనిషి రెక్కలపై ఎగసీ యంత్రంతో కదలీ ఎన్ని యుగాలైనా మనిషిలో ఉండే, మానవతా కాంతి బింబ మొకటే ! ముందు నడచే దీపంతో వెనక కదలే నీడ మాట్లాడుతుంది కళ్ళ నుండి జారే నీటి రుచి చప్పరిస్తూ గాలి సాగుతుంది గుండెలో అనల శకలాలు భ్రమిస్తాయి ! ఊహలో పూలమబ్బులు చరిస్తాయి దేని ప్రపంచందానిదే ! పరస్పర సంబంధం ఉన్నట్లనిపిస్తుంది. రాళ్ళు పగిలే ఉద్రేకంతో గాలి గుండెలో బాధను వినిపిస్తుంది బిందువు రాలుతుంది మబ్బు నుండి కన్పించని జలధి చరిత్రతో చెట్టు పైనా ? తీగెలోనా ? వసంత మెప్పుడు కనిపిస్తుంది ? మనస్సు శుష్కస్థితి వీడి రాగవంత మయినపుడే శిశిర మెక్కడికి పోతుంది ? ఉదయమెరగని దిశల్లోకి హృదయంలేని శిలల్లోకీ, విలయమెరిగిన శిథిలాల్లోకి గుహ నుండి మైదానంలోకీ నిశ నుండి ప్రభాతంలోకి శిల నుండి చైతన్యానికి నిరంతరం అన్వేషణే ప్రయాణం ! నేలకు సరిపడిన మొక్క తల ఎత్తుతుంది మనస్సుకు సరి అయిన ఊహ పరిమళితం కావాలి. ఎవరిపై అనల కీలా చలనం లేదు విలయపవనం లేదు నలుపు పై తెలుపుపై ఆఖరికి శూన్య ముఖంపైనా గాలి ప్రతి ఇంటి తలుపు తట్టి ఏవో కథలతో కదలిపోతుంది ఎప్పటి రహస్యాల్నో స్మృతుల అంచుల్లో విసరుతూ పోతుంది ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క వైచిత్రి ! అన్నీ ఇంటికి చేర్చే దురాశ ! ఒక్కొక్క సమయం ఒక్కొక్క ఆశ ! ఉషసులుగా మార్చే ప్రయాస ! రాత్రి భయంతో కుంచితమైన జగత్తు ఉదయ తేజంకై రాత్రి అంతా వేచి ఉన్న కళ్ళలో నిద్ర ముంచు కొస్తుంది ; మబ్బు క్రమ్ముకొస్తుంది వెలుగైన వ్యక్తిత్వం వెలుగు గురించి మాట్లాడదు భయం వదలిన మనస్సు స్వేచ్ఛను పలుకుతుంది
మనిషికి భయపడేను మనిషి బ్రతుకు తెరువు వ్యూహంలో వెలుక్కీ భయపడేను మనిషి ! ముసుగు తొలగే భయంతో దూకే అలల మధ్య జలధి నుండి తీర భూమి చేరాక అవని కన్నా ఆనౌకలో జీవితమే నమయనిపిస్తుంది చీకటి రెక్కలు చాచి గర్జిస్తూ మబ్బులు వచ్చే వేళలో మనస్సు మెరసే నక్షత్రంగా మారి ; సూర్యుణ్ణి గుర్తిస్తుంది శిశువుకే భయమూ ఉండదు; ఆఖరికి మృత్యువన్నా వెలుగైన మనస్సులో సదా ఉదయమే ఉదయం ! ఏ బాణానికీ అందని దూరంలో ఉంది నాలో మృగం ! చీకటిలో వెలిగే కొవ్వొత్తి హృదికి ఉదయ స్పర్శనిస్తుంది కట్టెకు తీగెలు బిగించిన కల్పనలో మధుర స్వరం వినిపిస్తుంది వాస్తవ శక్తులు పనిచేసే యోజనలో జీవితం కదలు తుంది అగ్ని కెక్కడిది ? విచక్షణ ! పచ్చని ఆకు అనీ అందమైన పూవు అనీ ఊహకెక్కడిది ? భేదం ! నల్లని రాత్రి అనీ ; తెల్లని పగలనీ ! ప్రపంచంలోకి రావడం మటుకు శుభ్రమైన ఉదయం వలె ప్రపంచం నుండి నిష్క్రమించడం మాత్రం ధూళి క్రమ్మిన దర్పణమై అంగిట్లో వచ్చి పడదు దివి నుండి ఆహారం దేహం పై జారి పడదు దిశ నుండి ఆచ్ఛాదం శ్రమ శక్తుల సంచలనంతో ఈ జీవిత రూపం వ్యక్తిలో కిరణంతో సమాజ రూప మందేను నాలో వెలుగే నాకోసం ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తుంది రివ్వున వీచే వాయు తంత్రులపై సంగీత చిత్రాలు వినిపిస్తాయి కళ్ళలో చూపులో ఊహలో నిశ్శబ్దం, గుండెలో శ్వాసలో వర్తనలో శబ్దం నిశ్శబ్దం మనలో శక్తికి నిలయం, శబ్దం మనలో యానానికి చరణం ఈనేల ఈ సమయం ! ఈ ఊహ ! ఈ బ్రతుకూ మనదే ! ఇంకెవరిది ? చీకటి మొలుస్తుంది మరపు వంపుల్లో, వెలుగు వస్తుంది తెలివి దారుల్లో వేటకై తీసి కెళ్ళిన తుపాకిపై పక్షి వాలుతుంది నిర్భయంగా వస్తు నైజం ఫలితం తెలీనంతవరకు ఏ భయమా లేదు ఆదర్శం ఉందే ! అద్దం వంటిది, ఎంతో జాగ్రత్తగా ఉంటేనే నిలుస్తుంది క్షణంలో క్రిందపడి ; ముక్కలై జీవిత శకలాల్ని తలపిస్తుంది సంక్షోభం నుండి రావాలి ఆర్ధాంచలంతో సౌభాగ్యం వహించే రేపు ఈ శరీరం గురించి ఎంత మరచినా దీని నిష్కృతి కిది తప్పని సత్యం శిలల్ని చెక్కుతూ శిల్పాలతో మనస్సు కళానికేతనమవుతుంది బాధ నుండి బాధకూ వెలుగు నుండి వెలుగుకూ కదలుతూ పోతుంది
అందరిలో ఉంటుంది బీజం విత్తబడీ ! ఏ పూవో ? ఏ ఫలమో ? తలపై నుండి నీతులూ ఉపదేశాలూ ! తరలిపోతాయి ప్రమూలకో ! మనస్సు ఊతగా ఎంత దూరమైనా కాలం కదలుతుంది నిశ ఎంత భయదమైనా ? ఇది లేంది ఉదయ మెక్కడిది ? నీవు చెవిలో విసరే మాటకు బదులుగా ఎదలో పలికే మాటలు తలచుకో నీ ముఖాన్ని చూచుకో కాస్త ! అద్దంలో రోజు రోజుకీ ఎట్లా మండుతూందో ! వయసు తెలీకుండానే కాలం గడచి పోతూంది ? దీన్ని మనో దర్పణంలో చూచే సమయమే లేదు ఆవిరామ తరంగాల్ని శాసిస్తుంది గట్టు, “నిలు నిలు” మనీ ఆవేగ తరంగాల్ని తోసేస్తుంది గాలి “పద పద”మనీ మెరపుతో మబ్బు జీవితంలో విస్మృత రస పథాన్ని జ్ఞాపకం చేస్తుంది. జగత్తు నుండి పొందే అనుభవం మానస గుహలో భద్రమౌతుంది మృత్యు హేలతో నదిలోకి దూకడం కాదు జీవన రాగంతో నది ! నీలో ప్రవహించనీ రాగం చిమ్మే ఆర్ధ రూపం ముందు వెలుగు సైతం ఫాలతలం వంచి కదలిపోతుంది ఈ జీవిత చిత్రం ఎప్పటికీ ముగిసేది కాదు ఏదో మిగిలే ఉంటుంది కాలం అందరికీ సమానం ! జీవిత దర్పణంలో బింబాలే వేరు ! వేరు !
IV. సమయ దర్పణం
1. నాలో ప్రవహిస్తోంది నది (1986)
2. నాకు జా పకం ఉంది (1987) మాదిరాజు రంగారావు అంకితం సౌమ్యమూర్తి శాంతమనస్వి జస్టిస్ శ్రీ వేముగంటి మాధవరావు గారికి1. సమయ దర్పణం - నాలో ప్రవహిస్తుంది నది నాలో ప్రవహిస్తోంది నది (1986) నాలో ప్రవహిస్తోంది నది, కదలి పోయే జన సమూహం వలె
కాలాన్ని తనపై మోస్తూ జీవితాన్ని తనలో స్పందిస్తూ అల అల పై ఆనంద శిఖరం అలక్రింద తత్త్వ రహస్యం నాలో ప్రవహిస్తోంది ధుని, సాగిపోయే ఆలోచనా తతివలె తనలో ఆకాశాన్ని బింబిస్తూ, తన ముందు ఆదర్శాన్ని లక్షిస్తూ ఒక్కొక్క బిందువులో క్షణ రూపం ఒక్కొక్క బిందువలో జీవన నృత్యం నాలో ప్రవహిస్తోంది నది ఆది మానవుడు విసరే కేకలతో వేద ఋక్ బంభర ఘోషతో యుగ యుగాల చరిత్రను దొరలిస్తూ ఒక్కొక్క బిందువులో సింధు వంత ధైర్యం ఒక్కొక్క బిందువులో పవన జవం నాలో ప్రవహిస్తోంది ధుని వెనక్కి చూడని కన్నీటి అలలతో ఆకాశం అదుముకున్న హృదయంతో సగం మునిగీ సగంతేలీ బుద్ధుడు క్రీస్తు గాంధి కరుణజలం! నీలో ఉంది చూడు ఈ నదీ రూపం నాలో ప్రవహిస్తోంది నది, దీన్ని ముక్కలు చేసే దురాశతో విసరిన కత్తుల తళతళలు! చీకట్లో వెన్నెల మిల మిలలు నా పెదవులపై ఊగేను నవ్వు! నా గుండెలో నవ్వేను మందారం నాలో ప్రవహిస్తోంది ధుని, కెరటాలు ఆరాటాల ఆస్పాలనంతో కెరటాల పోరాటాల జిగీషా మతితో జనాళి యోచనతో ఘర్షణతో బిందువు బిందువులో ప్రాకే విద్యుత్తు కెరటాల్ని ముందుకు నడిపిస్తుంది నాలో ప్రవహిస్తోంది ధుని, శిరశ్శిఖరం నుండి పాద మూలం దాకా ఒకటై పరుగులో జీవన సంగీతానికి శ్రుతి పోస్తూ తలపులో జీవన రూపానికి రుచి నిస్తూ ఆర్ద్రతతో ధరాతలం హరిత వనం చేస్తూ చీకట్లో ఆర్త నాదం మోసుకునీ దైన్య శీకరాలు కప్పుకొనీ నాలో ప్రవహిస్తోంది నది ఎగసే కెరటాల శిరస్సులతో భగ్న గాథలు చెబుతూ; ఆరుణ చిత్రాలు చిత్రిస్తూ మెరిసే తారల కన్నీటి ముత్యాల్ని స్ఫురింపజేస్తూ ఈ నదీ జలం లోతుల్లో ప్రణయ రహస్య ముంది ఈ నదీ వలయం అంచుల్లో స్నేహ వలయ ముంది ప్రతి ప్రాణినీ ఆకర్షించే జీవన రూపం నాలో ఉంది భూదేవత గుండెల్ని స్పృశిస్తూ మానవ జీవిత సత్యాన్ని ప్రతి ఫలిస్తూ మలకలుగా పాయలుగా వంపులుగా కొండల్ని చుట్టీ లోయలు దూరీ విషమ శిలల పై అడుగు లేస్తూ, ఎడారి ఇసుకపై తెరలుగా తరలుతూ ఒడ్డు నుండి చూచేంత సేపూ ఏ ప్రశ్న లేదు నీటిలో అడుగేయడంతో సమస్య మొదలు!
నాలో ప్రవహిస్తోంది నది! కదలిపోయే కాంతి ఝరిని జ్ఞాపకం చేస్తుంది. మేఘం కన్పించగానే ఆనందంతో నృత్యంతో పరవశించే నది! ఎడారి చూచి విలోలమై కరుణతో కపోల పాళి నిమురుతుంది ద్వేషం హింస నిండిన మానవ చరిత్రలో హైన్యాన్ని దైన్యాన్ని చూపే ద్రుతగతితో ఎదురుగా నిల్చిన శిలల్ని పర్వతాల్ని జాలిగా పలకరిస్తూ వినిపిస్తూ గళ గళత్సంగీత దుని! నీలో నాలో ఉందీ నదీ రూపం అక్కడక్కడా ఎదురుగా పడి ఉన్న మొండి బండలపై నుండి పొర్లుతూ అణువణువులో పురోగమన చైతన్య చరణాలతో దారి కడ్డంగా అడుగుల్ని చీల్చే కరకు రాళ్ళపై కదులుతూ కోలాహలంగా ప్రాణికీ మనిషికీ జీవన రుచి చూపిస్తూ పద పదంలో రాగం పల్లవించే శోభతో మనిషి మరచిన ఆర్ద్రతను జ్ఞాపకం చేస్తూ నాలో ప్రవహిస్తోంది నది నాలో ప్రవహిస్తోంది నది! పురా స్మృతుల్ని తలపుకు తెస్తూ మనిషికీ మృగానికీ భేద మంతరించే దశల్నీ హృదికీ శిలకూ అంతరం నశించే స్థితుల్ని మౌఢ్యం క్రౌర్యం ఆవహించిన జడ మతుల్నీ స్పృశించే ఆరాటంతో కదలే ఈ నదీ తీరాన! ఎన్ని ఉన్మత్త శిఖరాలు! ఎన్ని హత్యా చణ క్రీడలు పీడిత జీవితాల నుండి మ్రోగే నినాద పంక్తులతో దారిలో శిలల్లో స్వప్న జలం నింపే ఆరాటంతో యుగ యుగాలుగా ఆర్జించిన సంస్కృతీ బింబ రూపంతో తనతో కాలాన్ని పయనింపజేస్తూ తనపై సమయాన్ని అవలీలగా మోస్తూ గలగల ధ్వని కళతో ఆగని సంగీతంతో నాలో ప్రవహిస్తోంది నది హృదయ శిఖరం స్పృశిస్తూ మానవతా గభీరమై చింతనలో ప్రణవ నాద తరంత రస శ్రేణులతో గతిలో కదలే వాస్తవ జీవిత చిత్రాలతో భూమిని మ్రింగే మహదాశతో ప్రతి బిందువులో రహస్యం ప్లవిస్తూ నాలో ప్రవహిస్తోంది నది బిందువు బిందువులో బడబానల శక్తి అల్లుకొని విద్యుద్వల్లి వలె లహరుల్లో దాగిన వెలుగునీ మంటనీ కోపాన్నీ తలపిస్తుంది ఎన్ని నాగరకతల్నో వహించిన బుజాలతో ఆశా కేతనమై ఆడుతుంది తరాల నిష్క్రమణంతో వదలిన చరిత్రతో మానవుణ్ణి తలపిస్తూ తరుముకొని వచ్చే జీవన మర్యాదతో నాలో ప్రవహిస్తోంది నది. నాలో ప్రవహిస్తంది నది, ఎవరు కోరినా కోరక పోయినా అలల ఆగమనంతో మేల్కొన్న ఆశా చలనంతో
పగలు రాగంతో ఎదపై వెలుగులు హత్తుకొనీ రాత్రి బాధ్యతతో వీపుపై చీకట్లు నిల్పుకొనీ శబ్దం కరిగి నాదమై, రేఖలు కలిసి రూపమై, అనుభవం వెలిగి జీవితమై క్షణాలు సాగి కాలమై, గమ్యానికి పరుగెత్తే ఎడతెగని రైలు వలెధుని. ప్రతి వైపు నుండి వచ్చి కలిసే రేఖ లొక్కొక్క సమయంలో నదిపై తరలే కల్లోల తరంగాలకూ, ఎదలో కదలే ఉల్లోల కురంగాలకూ, జీవితంతో ఒక్కొక్క చిత్ర రూప స్ఫూర్తినిస్తాయి, బింబాలై. ఒక వర్ణం కమ్ముకొని మరో వర్ణం ఒకరూపం రూషితమై మరోరూపం గర్భితమై మానవ ప్రకృతి సమస్తం, ఋతు పరివర్తనతో నాలో ప్రవహిస్తూంది నది మనిషి శక్తిని పరీక్షిస్తూంది. లోపల కదలే జీవ రాశితో, నిద్రలో, సరస్సు వలె ఉంటుంది. లోతు తెలీని జలావేశంతో, మెలకువలో, ప్రవాహమై కదులుతుంది మనసులో ఆశలు ఉన్మిషితం చేస్తూ తీరంలో స్మృతులు వదలుతూ వర్తమాన గతి చరిత్రతో, క్షణాలు అలలపై శ్రుతి మహితంగా అణువణువూ కదులుతూ సముద్రం వైపు పరుగు తీస్తూ ఆలోచనా స్ఫూర్తితో అనుభవ స్పందనలో ఉంది! నీలో నాలో నదీ రూపం ముక్కలైన దేశాల్ని కలుపుతూ అడ్డుగా ఉన్న పొలిమేరల్ని చెరపుతూ మానవతా మధుర జలంతో స్నేహమయం చేస్తూ స్పందించే స్వేచ్ఛలో ఉత్సాహంతో బిందువు బిందువూ కలుస్తూ విడిపోతూ మారుతూ నిరంతరం ఎన్నో ప్రశ్నలకు సమాధానాల వలె ఎన్నో సమస్యలకు పరిష్కారాల వలె సమష్టి చైతన్యంతో నాలో ప్రవహిస్తోంది నది ఆకాశం నుండి సరించే సూర్య కిరణ పంక్తుల్లో ఒకటై పోతూ దూరాన దిశల నుండి జారే చీకటి చినుకుల్లో కలసిపోతూ కన్నీటికి నిలయమైన కళ్ళలోని నిద్రిస్తూ ఉద్రేకం ఉరకలెత్తే గుండెలో దూరుతూ రేణువు రేణువుపై చేసే నృత్యంతో, జీవిత దృశ్యం తలపించే నీల వర్ణ ప్రళయం రచిస్తూ, హరిత వర్ణ సౌందర్యం సృజిస్తూ నాలో ప్రవహిస్తూంది నది మనసులో మ్యూజియం జాడలతో భూమితో గలగల సంభాషణతో హృదిలో దీప శిఖా సంవేదనతో గగనాన్ని గుండెపై భద్రంగా నిలుపుకొనీ ఎగసే పక్షుల శ్రేణీ బింబంతో శూన్యాన్ని సౌందర్య దృశ్యంతో పల్లవితం చేస్తూ కుసుమితం చేస్తూ పేర్చిన మొగలి రేకుల పంక్తిగా నాలో ప్రవహిస్తోంది నది దూకిన హంసీ సమూహయానంగా
అఖిల సంస్కృతి దశల్లో మానవ పరిణామ దశలకు సాక్షిగా నాలో ప్రవహిస్తూంది నది! మనిషి ఆశాబింబపై గీతమై అపుడపుడూ ప్రాణుల్ని హతమార్చే నియంత వలె తుఫాను భీభత్సంతో దుస్స్వప్నం అంతం చేస్తూ భూదేవి కళ్ళలో పెదవులపై శరీరం అణువణువూ సృజన శక్తి లాస్యంతో నాలో ప్రవహిస్తోంది నది అవనిపై దారి చేసుకొనీ పోరాడుతూ బలంగా, స్వేద జలాపూర్ణమై వేగంగా మనిషిలో బాధల్ని కరిగిస్తూ, భయాన్ని దూరం చేస్తూ చాంద్రీ సిత కరాలతో స్పృశిస్తూ నాలో ప్రవహిస్తోంది నది నేలపైమట్టి పొరల్ని దువ్వుతూ రాళ్ళపై గుట్టలపై నిల్చిన మనుషుల్లో రంగు రంగు పూలనీ ఆదర్శ ఫలాల్నీ సృజిస్తూంది సంఘర్షణలో మానవతా సందేశం వినిపిస్తూంది అణగి పోని విశ్వాసంతో ఉచ్చలిస్తూ ఆగిపోని పోరాటాల పతాకలతో హింసలో పీడనలో బాధాసిత కథలతో చరిత్ర నవ గతులతో అక్షర బిందు పంక్తుల సుదీర్ఘ రచనలో సందేశం శబ్దిస్తూ సతతం కదలే చరిత్రలో అలలు పుటలతో గతిలో సమూహ చైతన్యంతో కన్నీళ ్ళ స్వేదమూ కలిసి ఒకటై నాలో ప్రవహిస్తోంది నది. తరంగ గతిలో వాస్తవాన్ని బింబిస్తూ ఫేన పంక్తిపై స్వప్నాలు మోసుకొనీ నిశ్వబ్దాన్ని స్వర చిత్రతాలతో నింపుతూ సుప్త చేతనలో గుప్త మూలంనుండి నాలో ప్రవహిస్తోంది నది నిద్రించిన వ్యధ మేల్కొని వెనక్కు తిరిగి చూడకుండా పరుగెత్తినట్లు మళ్ళీ నిద్ర అనేది ఎరక్కుండా ఎక్కడా నిశ్శబ్ద మనేది లేకుండా ఎదురు బడిన శిలలపై గలగల రవళితో నాలో సరిస్తోంది ధుని తప్త ముక్త రిక్త మృత్యు విషమభూముల్లో జీవన పద చిహ్నాలతో అణువణువులో నిద్రా ముద్రల్ని వదిలిస్తూ రాగ కళనిలుపుతూ ప్రాణితంగా పగలూ రాత్రి వివిధ తరంగ ధునితో ప్రవహిస్తోంది నది ఉదయ కాంతి ప్రతిఫలించే అరుణధారలతో వైష్ణవ ప్రతికృతిగా దేశం నుండి దేశానికొకే బాట ఒకే ఊహ ఒకే ఒక లక్ష్యంతో నలు దిశలా చిమ్మేస్వర లహరులతో చివరకు కరుణ జలధి కలుస్తూంది ప్రతి అలలో సూర్య కాంతి నిలుపుకొనీ కణ కణంలో రస రూపం నింపుకొనీ ప్రతి ఎదలో హరిత వనంపై ఆశతో సంపదకు ప్రేరణయై జన చేతనయై
బిందు బిందు ఘర్షణలో విద్యుదగ్నితో తరంగాల పోరాటంలో పరివర్తనతో వేగంలో జన సమూహ శక్తి నటత్ రూపంతో దురిద్రాశా ముఖాన రసమయ శీకర కళతో నాలో ప్రవహిస్తోంది నది ప్రతి తరంగంలో అనల స్వరం పలుకుతూంది ప్రతి స్వరం చలనంలో కరుణ రసం చిలుకుతూంది ప్రతి ప్రాణీ ఎరిగిన హృదయం భాషతో సుదీర్ఘమైన ఆయుః ప్రమాణంతో పాయలుగా చీలుతూ కలుస్తూ తరలే ప్రజా సమూహం వలె నాలో నది! ఒకపుడు మనలో సుప్తమై ఉండొచ్చు! హిమ తుషార శ్రేణుల్లో ఒకప్పుడు మనలో గుప్తమై ఉండొచ్చు! పాతాళం అంచుల్లో శ్రమ ఫలాకృతీ! ఆనంద రూపమూ! తనతో ముడిపడీ! కర్మాగార ధ్వనీ శ్రమ జీవన లయ! సంచరణాకృతితో స్థల స్థలంలో నవ రాగం ప్లవించే నాద ఝరీ చరణాలతో దేశ దేశ జాతి జాతి సుమ సౌందర్యంతో అనుభవాన్ని పంచుతూ మానవ కథా మహా గీతమై నాలో ప్రవహిస్తోంది నది మహా స్వప్నమై సహస్ర ఫణ సర్పమై ఖండ ఖండ కాలాని కఖండ సంకేతమై గాలి కెగిరి ఒక దిశలో కదలే ఆశ్వత్థ వృక్షం ఆకుల గలగలతో భయం ప్రేమ కోపం శాంతి భావగతితో మానవ వమాజ బింబమై నిరాశా శిలల్ని స్పృశిస్తూ ఆశా శిఖరాల్ని లక్షిస్తూ రాత్రికలల్ని నిజం చేస్తూ స్నేహ హస్తాలతో స్నిగ్ధ హృదయంతో నాలో ప్రవహిస్తూంది నది ప్రతి మలుపులో ఒక్కొక్క చరిత్ర ముఖాన్ని స్పృశిస్తూ తీరాల్లో ఉదార గుణ ముద్రలు వదులుతూ, సికతా రేణువుల్లో ఆనంద కళికలు బింబిస్తూ నిరీహనూ నిష్క్రియనూ పద పదం వదిలిస్తూ ఎడారి ఎదను ప్రేమ జలంతో చకితం చేస్తూ ప్రవహిస్తోంది నది. వివిక్త రిక్త క్షితిజంలో దూర దూరం పోయినంత మేర రసమయ దృశ్యంగా మౌన ముద్ర వీడని శిలాశ్రేణికి రాగ రసంతో అందినంత మేర ఆర్థాకృతి నిస్తూ బిందు బిందువులో గుప్తమై సూర్యుని మృదు తేజంతో నిద్ర అనేది ఎరగకుండా కలలనేవి తెలీకుండా పగలూ రాత్రీ ఊహలో పద పదంలో అమృత పంక్తియై నాలో ప్రవహిస్తోంది నది బిందువు నాక్రమించి మరో బిందువు తరం నుండి తరం వలె నిబిడమై కదలే మహా ప్రజవలె చరిత్రలో సంస్కృతీ రూపం వలె గడియారం ముళ్ళను కదిలిస్తూ గుండెలయను పలికిస్తూ
ఏడ్చే వాళ్ళు లేని దీన హీన శిలలపై కన్నీటి పూలు చిమ్ముతూ ప్రయాణ దాహంతో చాచిన దోసిళ్ళలో దూరదూరం నీళ్ళు చల్లుతూ భయపు పొరల్ని చీల్చేస్తూ ఆశ్చర్య తరంగాల్ని దిశల్లో విసరుతూ కల నుండి వాస్తవానికి దిగిన వర్తమాన ప్రపంచ చిత్రం వలె పైపై నుండి దీర్ఘ దీర్ఘంగా కష్టాల్లో బాధల్లో ఉదార కిరణ పంక్తి వలె ఎదలో శబ్ద ప్రపంచాన్ని మోసే టెలిగ్రాఫ్ తీగల్లో ధ్వని ప్రసారాన్ని తలపిస్తూ బిందువు బిందువులో ప్రేమ నిండిన త్యాగ చలనంతో నాలో ప్రవహిస్తోంది నది, ప్రతి వ్యక్తికీ జీవన లక్ష్యం బోధిస్తూ నాలో ప్రవహిస్తోంది నది, నదిపై వంతెన, వంతెన పై నుండి క్రిందికి చూస్తే పగలు సూర్యుణ్ణి రాత్రి చంద్రుణ్ణి చుక్కల్నీ తనలో బింబించుకొనీ పిడికిలి నుండి బయట పడిన రహస్య చిత్రం వలె కన్పిస్తూ వంతెనపై మిత్రులూ బంధువులూ అపరిచితులూ ఎందరెందరో! వంతెనపై అడుగేసే మనిషి! చివరిదాకా ప్రయాణం చేయక తప్పదు భగవంతుని గురించి ఆలోచనకూ ఆకాశం చూచేందుకూ సమయం లేదు శిలలుగా పడి ఉన్న హిమం బిందువు బిందువులై కదులుతూ తరలుతూ క్షణాలు నిండిన జీవిత కథలతో, స్వేచ్ఛకై ఆరాటంతో, శాంతికై వేదనతో బిందువు బిందువులో కొత్త సృష్టికై కలలతో అల అలలో అవనిపై దూకేందుకు కోర్కెలతో బిందువు బిందువూ కలసి అసంఖ్యాకంగా ఏకమై సమాజమై ఒకే స్వరం, ఒకే ముఖం! ఒకే ఆత్మతో నాలో ప్రవహిస్తోంది నది లోతు తెలీని రాత్రి నిద్ర నుండి మేల్కొన్న ఉదయం వలె ఉదయం సూర్యుడు పై కెక్కే కొద్దీ మోదుగ పూల జ్వాలా నృత్యం వలె కష్టం, దుఃఖం మరచి పనిపై కదలే శ్రామిక జన సమూహం వలె ఆకలి గొన్న కంఠం నుండి ఎగసే బాధా శబ్ద తరంగిణివలె మానసికోద్వేగ రణత్ మంజీర ధ్వనులతో నాలో కదులుతోంది నది తుపాను వేళ వల్గత్ తరంగాలతో గతిలో వినాశన శక్తితో బ్రతుకుపై విషాద ముద్రల్ని వదులుతూ, నాలో ప్రవహిస్తోంది నది చరిత్ర కంటిన మాలిన్యాన్ని మృదు కరాలతో శుభ్రం చేస్తూ ఆవేశ తరంగాలతో వివేక జలాలతో మానవతను గుర్తుచేస్తూ నాలో ప్రవహిస్తోంది నది! శాంతి దేవతా కాంతి వదనంతో ప్లే గ్రౌండ్లో తెల్లని దుస్తుల్లో వరసగా పరుగెత్తే పిల్లల వలె తుది రేఖ లెరగని జీవితం వలె నిర్వచితం కాని కవిత్వం వలె స్విచ్ ఆన్ చేసిన టార్్చ లైట్ వెలుగు పుంజం వలె ఎక్కడెక్కడో దాగిన భయ సుందర ప్రాణుల్ని ఎదుట నిలుపుతూ
స్పందనలో వర్తమాన జీవిత దృశ్యంతో నాలో ప్రవహిస్తోంది నది నాలో ప్రవహిస్తోంది నది నాలో భాగమై రమణీయ స్త్రీ రూపమై విడిపోయే ఊహరాని ధాత్రీ బంధంతో, నాలో జీవితమై చేతనయై మార్మిక క్షితిజం నుండి క్రిందికి దిగిన వాస్తవ ప్రపంచంతో దీర్ఘాయువు చరిత్రతో మరచిన అనుభవాల్ని అనుక్షణం జ్ఞాపకంచేస్తూ ఆగని గతిలో మానవ చరిత్రతో నాలో ప్రవహిస్తోంది నది. రాత్రి కురిసిన చీకటి జాడల్ని తెల్లవారే సరికే మాత్రం కన్పించనీకుండా రాత్రి స్వప్న ఖండాల్నీ పగటి ఇంద్ర జాలాన్నీ అగాధంలోకి విసరేస్తూ క్షణం నుండి క్షణానికీ స్థలం నుండి స్థలానికీ కదలుతూపోతూ నాలో ప్రవహిస్తంది నది! దీనిలో బింబాల్ని అందుకో జూచేను మనిషి యుగాల సంస్కార ప్రభతో! నాలో ప్రవహిస్తోంది రసధుని! ఎన్ని యుగాలైనా పాత పడని ఉదయం వలె ఎన్ని తరాలైనా మాసి పోని త్యాగం వలె దూకే మంటల్నీ ఎగసే నిప్పు కణాల్నీ జల శీకరాలతో అద్దుతూ బిందువులో విద్యుత్కళికలతో ఎగసే ఉద్వేగ శక్తితో శూన్య దిశల్ని కలుపుతూ పోయే వాస్తవ జీవన రూపంతో ఆహ్లాదం కలిగిస్తూ నాలో ప్రవహిస్తోంది నది అరణ్యం నుండి బండల సందుల్లో నుండి ఇరుకు లోయల్లో నుండి త్రాళ్ళు తెంచుకొనీ విముక్తమైన స్వేచ్ఛ వలె వెనక్కి తిరక్కుండా నాలో పరుగిడుతోంది నది, లయ తప్పని వేగంతో ఎంత దూరం పయనించినా అలసి పోని అడుగులు వేస్తూ ధరిత్రిపై సరించే అఖండ జాగృతియై వ్యక్తిత్వం వెలిగే చేతనతో నాలో ప్రవహిస్తోంది నది, ఒంటరిగా స్నేహ రుచితో తాను కదలుతూ ఎందరివో అవసరాలు తీరుస్తూ ఉదయం పగలూ సాయం రాత్రీ స్వర్ణ ధవళారుణ నీల వర్ణ రూషితయై రాత్రి నిద్రలో నీడ వలె కదలుతూ పగలు అగ్నిలో వెలుగై తరలుతూ అంతలో స్ఫటికమై అతీత రసాకృతియై నాలో సరిస్తోంది ధుని ఒరపిడిలో అలజడిలో ధైర్యంతో దూసుకుపోతూ ఉద్రేకం ఉల్లాసంతో గమ్యంపై విశ్వాసంతో బిందువు బిందువులో క్రియాశక్తితో విజయ రహస్యం స్మరింపజేస్తూ జీవన గతిలో అనుభవమూ ఆలోచన నిండిన పార్శ్వాలతో పిడికిట్లో బంధించలేని స్వేచ్ఛతో నాలో ప్రవహిస్తోంది నది వెలిగే ప్రపంచానికి బింబమై కదలే జీవితానికి ప్రతిరూపమై క్షణంలో నశించే స్థితి నుండి అనుక్షణంలో అవతరించే స్థితులతో
కణ కణం జీవ ధారా శక్తితో మనిషిని సంకల్ప శిఖరంపై నిలుపుతూ పగలు అగ్ని కళలపై నుండి రాత్రి భస్మ రాశిపై నుండి పొరలి తరలి ఆకాశ బాహువలయంలో చేరే లక్ష్యంతో నాలో ప్రవహిస్తోంది నది ఆకాశం ఆదర్శానికి నిలయం! అవని వాస్తవ గమనానికి స్థిర తలం పగలు అలంకరించే సూర్య తేజంతో రాత్రి బింబించే నక్షత్ర కాంతితో వివిధ వర్ణ భేదాల్ని ఒకే ఒక రసాకృతిగా తీరుస్తూ మానవ ప్రస్థానమై నాలో ప్రవహిస్తోంది నది! మంజీర గుంజన్మృదు పద విన్యాసంతో యుగాల సంస్కృతితో, జాతి మత భేద రహిత సుస్వర మహితంగా కణ కణంలో కరుణతో మున్నీటి కథలతో! సంగీతమై జీవితమై ప్రాణంలో స్పందనతో ఊహలో చలనంతో ధరణీ పరిష్వంగ రాగ ధునీ ప్రకాశనంతో శక్తి చరణ ప్రసారంతో నిరంతర వర్తన పరివర్తనతో విషమ తలంపై సమతా భావంతో జీవన మర్యాదా లోలమై క్షితిజం చేతిలో మ్రోగే విపంచి నాదమై హృదిలో ఎగసే కపోతీ పంక్తియై ఆత్మ రూపమై, నాలో ప్రవహిస్తూంది! చైతన్య ధుని! అగ్ని నృత్యం చేసే అవనిపై ఆనంద వల్లీ కళలు నింపే కోర్కెతో వెలుగై దారిలో చీకట్లను పాతాళం లోకి తోసేస్తూ సత్యమై సస్య శ్యామల జీవితంతో, శిశిర ముఖంలో వసంతమై సుందరమై సుమ కేతనంతో మనో భూమికలో శివమై నాలో ప్రవహిస్తోంది నది! జీవిత కావ్యమై రసధునియై! (1987) మాదిరాజు రంగారావు అంకితం విమర్శలో పరిశోధనలో సాహితీ శిఖరం శ్రీ కోవెల సంపత్కుమారాచార్యులుగారికి
1. నాకు జా పకముంది నాకు జ్ఞాపకముంది, బస్ బరువుగా మృదువుగా కదులుతూంది చేతిలో వాలిన నక్షత్రాల్ని పిడికిట్లో బంధించి దిగే బిక్షువును దీప స్తంభం వలె కింద నిల్చిన కుర్రవాడు రెండు చేతులతో అందుకున్నాడు చేతులతో పరిసరాల్ని తడుతూ, చూపులో వెలుగు రెక్కల్ని దువ్వుతూ బిక్షువు, బస్ స్టాండ్ ప్రక్కనే చెట్టు క్రిందికి
చేతిలో కర్రపై కాల వేగాన్ని నిలుపుతూ కదలాడు చెట్టుక్రింద తీరిగ్గా కూచొని పలకపై బలపంతో లెక్కలు గుణించే జ్యోతిష్కుని కళ్ళలో జాతకాలు గ్రహాల దశాంతర్దశలతో తిరుగుతున్నాయి. హఠాత్తుగా పగిలి క్రింద రాలి పడే అద్దం ముక్కల వలె మధ్య మధ్య నవ్వుల గలగలలు దూరం నుండి వినిపిస్తున్నాయి ప్రతి ముఖంలో రహస్యం కాపాడబడుతూ ఆట ముక్కలు ఆడబడుతున్నాయి లక్ష్య మెరగని సమాజం గుండెపై దొర్లే బరువులా దూరం నుండి వినిపించే వాహనాల ధ్వని వింటూనే అరచేయి ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కపెడుతూ బిక్షువు నడిచేను ధూళి కమ్మీ పొగ బట్టీ కొడేసీ నీడ క్రమ్మిన అమ్మ కళ్ళు తళుక్కు మనిపించే ఆరాటంతో కళ్ళలో మెరసే నక్షత్రాలతో కుర్రకుంక దిక్కుల్ని తరుముతూ ఇంటి ముఖం పట్టాడు ఇంటి నుండి వీధిలోకి కదలీ క్రిక్కిరిసిన బస్లోకి తోసేయబడీ “పర్్స కొట్టేస్తా” రన్న వదలని భయంతో పెద్ద మనిషి జాగ్రత్త పడుతున్నాడు ముందుగా ఎక్కి కూర్చున్న పిచ్చివాణ్ణి పట్టుకొని కండక్టర్ దింపేశాడు అతడెపుడో దూరి ఎక్కడో వెనక నిల్చోడం చూచి చూడనట్టున్నాడు నాకు జ్ఞాపక జ్ఞాపకముంది, రైల్వే ప్లాట్ ఫార్పై జనం ప్రయాణంకై ఎదురు చూస్తున్నారు శబ్ద ప్రపంచం కోలాహలంగా ఉంది అక్షయ తూణీరం వంటి మనస్సు నుండి ప్రశ్న వెంట ప్రశ్న ఉద్గమిస్తూంది దగ్గరలో కాంటీన్ పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తూ కదులుతూంది రైలు ఆగిందో లేదో ఒకర్ని తోసేసి మరొకరు! వెళ్ళాలనే తొందర! పంజరం నుండి వదలబడిన పక్షుల వలె గూటికి చేరే ఆవేగం చేతిలో గొలుసుకు పెట్ డాగ్ తో యువతి వేగ మందుకుంటూంది పగలూ రాత్రీ ఎడగెతని సంరంభంతో ఇదో అవిశ్రాంత బలసముద్రం రైలుకై ఎదురుచూస్తూ ప్లాట్ ఫార్మపై పచార్లు చేసే నా కెదురై బుజం మీద చేయేసి, “గుర్తు పట్టారా?” అని నవ్వు విసరుతూ రైలు రాకతో “బైబై”, చెప్పి, ఓ మనిషి మిత్రమై నిష్క్రమించాడు రైలెక్కి జేబులో చేయి వేస్తే, శూన్యం, మా స్నేహానికి మిగిలిన చిహ్నం నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడెక్కడికో? ప్రయాణికుల గమ్యమే సంకల్పమై చెట్లనీ కొండల్నీ ఊళ్ళనీ భూముల్నీ వెనక్కు పరుగెత్తిస్తూ రైలు పరుగిడుతూంది వినేందుకు ఓపిక ఉండాలేగాని ప్రయాణికుల జిహ్వాగ్రంపై శబ్దం బీజం నుండి శాఖలుగా కథలు నృత్యం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది ఎదురుగా ఉన్న వ్యక్తి ఆపై వ్యక్తికి న్యూస్ పేపర్ అందిస్తూ గుడిసెలకు నిప్పు రెక్కల వచ్చిన వార్తను వినిపిస్తున్నాడు.
తాష్లో కింది పెదవి పై పన్నుతో నొక్కి “దీనితో సరి” అని ఒకరు చేతిలో కార్డు తీసి విశ్వాస రమణీయంగా ఆపైన విసరేరు రైలు దారి తప్పకుండా కదలుతూంది, ఆట దారి వెతుక్కుంటూ సాగుతోంది నాకు జ్ఞాపక ముంది; ఆ ఇల్లు మానసిక భద్రతకు నిలయం జీవికకై ఎక్కడెక్కడో తిరిగి ఏ వేళకో గూటికి చేరినా మనిషిలో వీచే అశాంతినీ మండే బాధనూ మరపించే అమృత హృదయం, వేదనా గ్రీష్మంలో చల్లని నీడై, నిరాశా శిశిరంలో వెచ్చని నెలవై జీవిత వ్యథల్నీ మరపిస్తుంది, ఓపిగ్గా ఎన్నెన్ని కథలో వినిపిస్తుంది గోడకు సీల దింపుతూ వేలు చితికి గంతులేసి చివరకు సాధించిందీ అమర్చిన పోటో చూస్తూ ఆర్ద్ర నయనాలతో చూస్తూ నిల్చిన తల్లీ ఆశ సడలిన ప్రపంచంలో పచ్చని ముఖంతో అలంకరించే అవకాశాన్ని బయట గోడ సందుల్లో నుండి మొక్కలు జ్ఞప్తికి తెస్తున్నాయి నే వదలిన ఇల్లూ ఆగదీ చుట్టూ బంధు గణం తిరిగే జనతతీ ఎవరికోసం ఎవరు వచ్చేరో తెలీదు! ఎవరెవరో వెంట పడుతూంటారు ఎవరికి వారు కళ్ళలో అంగార కణాలతో పెదవులపై నవ కళికలతో ఎదలో బొగ్గు ముక్కల్నో మంచు ముద్దల్నో పూల మొక్కలో నిలుపుకునేరు ఉదయం ఉషః కిరణాలు ప్రవేశించనే లేదు ఇంట్లో గూడు నుండి పక్షి లేచి కూర్చున్న నా బుజాలపై నుండి ఎగిరి నిలువుటద్దం ముందు వాలింది అద్దంలో బింబించే ముఖాన్ని ముక్కుతో గీరడం మొదలు పెట్టింది నా అలికిడి విని చకితంగా కిటికీ నుండి బయటి కెగిరి పోయింది ఒకనాడు ఆటలో పిల్లలు విసరిన బంతికి అద్దం పగులు వాసింది అద్దం ముందున్న పక్షి కొక్కొక్క శకలంలో ఒక్కో రూపం కన్పించింది అన్నింటితో ఒంటరిగా పోరాటానికి సిద్ధమైంది మరునాడు కొత్త అద్దం వచ్చింది! విజయానికి తృప్తిగా ఒకే రూపం ఎదురైంది ఎదురుగా ఉన్న అద్దంలో ముఖం చూసుకొని పక్షి మురిసిపోతుంది గూటి నుండి రాలే ఎండు పోచ మనిషిలో పక్షిని విస్మరించనీయదు నాకు జ్ఞాపకముంది, వరండాలో కూర్చొనీ ఓ వృద్ధు గతంలో వెలిగిన తోరణాలూ పిల్లల భవిష్యత్తూ ఏ కరవు పెట్టేను ఆ కథలు అనుభవ గగనంలో ఎన్నటికీ తరగని చంద్ర కళలు పండిన జీవితంలో పరిమళించే వాత్సల్యంతో, వాలే కిరణాల కెరటాలు ఆమె సన్నని వక్కపొడి నమిలేంత సేపూ కాలం నిలిచే ఉంటుంది ఆమె దృష్టిలో తానో భగవంతుని వెలుగు దీపం ఆమెలో రాత్రి కురిసే మంచును కరిగించే ఉదయ కిరణముంది ఇళ్ల మధ్య పెరిగిన చెట్టు తమదేనంటూ ప్రక్క వాళ్ళు తగవుకు దిగేరు
పెదవులపై నుండి ఎగసి పడే రాళ్ళకెన్ని గాజు ఎదలో భగ్నమైనాయి ముక్కలైన హృదయ దర్పణంలో ఏదీ స్పష్టంగా ఆలోచనకు నిలవదు కదలే బొమ్మల గురించే కాదు, వెలిగే సూర్యుని రూపమూ దృష్టి కందదు రాత్రి లైట్లు ఆరిపోయి, అగ్గి పెట్టెకై టేబిల్పై వెతుకుతూంటే చేయికి మెత్తగా తాకింది; భయ లహరితో దేహం జలదరించింది ఇంతలో లైట్లు వెలిగాయి; మనస్సు చీకట్లో మునక వేసి తేలింది చూస్తే ప్రక్కనే అభయ రూపంతో పెడ్ డాగ్ ధైర్య దీపం వలె ఉంది మెట్లపై నుండి మెల్లగా గదిలో ప్రవేశించిన నాలో రహస్యం వెలుగులో జారుకుంది, నీడలో ఒదిగి పోయింది పైన తిరిగే ఫ్యాన్ రెక్కల్ని తప్పుకొని పక్షి ఒడుపుగా ఎగిరిపోయింది నాకు జ్ఞాపకముంది, అతడు మరచిన సిగరెట్ కేసున్ను ఆమె బ్యాగ్ వేసుకొని అగ్గి పులె కదలిపోయింది జీవితంలో విచిత్ర ఘటన ఒక విధం మనస్తత్వాన్ని వెలిగిస్తుంది పై నుండి నీరు దొరలే నిశ్శబ్దం శిల వలె సమయం స్నిగ్ధంగా నవుతుంది ముందున్న పజిల్తో పగలు యోచిస్తుంది గాలి విజిల్తో కదలిపోతూంది ఇంటి వెనక మామిడి చెట్టు మండే గ్రీష్మంలో పచ్చగా పండ్లతో బాధారుణ ప్రపంచంలో ఆశా రూపం వలె నిలిచి ఉంది దీని నీడలో పూర్వ స్మృతులు; తప్త హృదిలో జలద పంక్తులు కిటికీ ఒక వైపు నుండి మరోవైపు దారాలతో అల్లిన సాలీడు వ్యూహం రవి కిరణాలకు మెరుస్తూంది; గాలి కదలికకు అలల వలె ఊగుతుంది నేలపై నిజం నుండి క్షితిజంలో కల్పన వలె యూకిలిప్టస్ చెట్టు నీడ కోరే ఎదను శిఖరంపై నిలుపుతుంది; ఆకాశాన్ని చూపిస్తుంది పగలూ రాత్రీ చక్రాలపై పయనంలో సందేహ పర్వతాలు అగమ్యారణ్యాలూ ప్రవహించే కలలతో ఒక తరం, ఎదురయ్యే ప్రశ్నలతో మరో తరం నిలుస్తుంది జలధిమధ్య ఎవరూ ఉప్పు నీరు గురించి చర్చిస్తూ దాహం మాట మరచిపోరు నాకు జ్ఞాపక ముంది కిటికీ అద్దం నుండి రోడ్పై జన సమూహ తరంగాలు పైకి చాచిన అసంఖ్యాక హస్తాలతో దూసే నిరంతర నినాదాలతో గోడకు నిలిపిన చిత్రపటంలో క్షితిజంలో సంధ్యారుణ మేఘం! మండే అరణ్యానీ దృశ్యం వలె; ఎగసే మహా జలధి నృత్యం వలె ప్యాన్ గాలి కెగిరి చెదరి కదలే కాగితాల రెపరెపల్లో నవ్వులు సిగరెట్ వెలిగేందుకు గీసిన అగ్గిపుల్ల ధ్వనిలో ఎగసిన ఆర్తి స్వరం ఉదయం నుండి రాత్రి పొద్దు వరకూ ఆ ఇల్లు కోలాహల సముద్రంలో శబ్దాన్ని వహిస్తుంది నిశీథి నుండి ఉషస్సు వరకూ ఆ ఒంటరి గది
కలలు కనే దీపంతో నిశ్శబ్దంగా వెలుగుతుంది ఉదయం మొదలౌతుంది గూళ్ళ నుండి పక్షులెగరడంతో వరండాలో న్యూస్ పేపర్ దూకడంతో చేతిలో చిల్లర డబ్బుల గలగలతో కిటికీ నుండి గగనం అంతులేని ప్రశ్నల బరువుతో తొంగి చూస్తుంది కిటికీ బయట అవని! తృప్తి లేని సమాధానం వలె పరచుకొని కన్పిస్తుంది “నగరం భయంతో మండే ఈ సమయంమెక్కడికి?” అని వెనుక నుండి మాతృ స్వరం ఆలోచనకు మలుపు నిస్తూంది ఎత్తి వేసిన కర్ఫ్యూ గస్తీలో గన్ పాయెంట్పై నిలుస్తుంది ఇంటి ముందు బిక్షువు పై అనుమానం! ఏమో? సి.ఐ.డి. కాదు గదా! ఇంట్లో విద్యార్థి ఉదయం నుండీ పుస్తకం పట్టాడు! సినిమాకు ప్లాన్ కావచ్చు! ఉదయం తొలగనే లేదు, గ్రీష్మ పాత్ర ధరించి కాలం ఎదురౌతుంది చేతిలో గ్లాస్ నీటిలో ముఖం అద్దుకొని సూర్యుడు తృప్తిపడేను గ్రీష్మంలో పుంజీభవించిన జీవ శక్తితో మామిడి పరిణత రుచినిస్తోంది అప్పుడే నీటి చుక్క కోసం భగీరథ యత్నం మొదలైంది ఈ ఉదయం హిమసారం చేతి కందే స్థితిలో లేదు అగ్నీ ఆర్తీ చెరో వైపు వివిధ భంగిమలు ప్రదర్శిస్తున్నాయి కాలం మారిందని పెద్దలు తమలో అనుభవ శక్తిని మేల్కొల్పుతున్నారు పగలు కంకర కుప్పపై విశ్రమించిన కూలీలతో లారీ దూసుక పోతుంది ఇది, ఏ స్థితిలోనూ ఆగని పేద బ్రతుక్కి సంకేత మవుతూంది ఇంటి ముందు దీపం లేకున్నా చీకట్లో ఎవరూ దారి తప్పలేదు మాటలతో పాటలూ ప్రసంగాలూ వీధి నుండి ఉచితంగా వినిపిస్తాయి ఎవరికి కావలసిందీ అందిందీ చక్కబెట్టు కోవడమే ఇక్కడి పని! మనస్తత్వం పొరల్లో లోతుగా వేళ్ళు నిల్చి జీవిత వృక్షం రూపొందేను మనిషిలో ఆ చెట్టు వేసే పూలు పండ్లూ వివిధంగా ఆలోచన కందుతాయి ఎప్పటికప్పుడు కొత్త మనసులతో ఊహలతో సమాజం స్పందిస్తూంది ప్రతి బిందువులో ఒదిగి ఆకాశం ప్రతీ బీజంలో మేల్కొనీ జీవం ప్రతి అణువులో నిలిచి శక్తి ప్రపంచం! తర తరానికీ కొత్త రూపం! మంద్ర మధ్య తీవ్రంలో నిరంతరం బహిరంతస్సంఘర్షణతో జీవితం క్రమగతిలో జ్వాలయై లహరియై సామాజిక తలంపై కదలుతూంది నాకు జ్ఞాపక ముంది! ఎక్కడెక్కడో ఏరిన వస్తువుల్నీ కలలతో పాటు భద్రంగా నింపుకొని చేతిలో మూటతో చంకలో శిశువుతో ఆ వ్యక్తి ఎదురైన వారిలో ఎవరెవరినో శపిస్తూ వెళ్ళుతూంది ఆ మాటల్లో అగ్ని శిక్షలు వారిలో రహస్యాల్ని గుర్తింప జేసేనా? ఆమె ముఖంలో సెగలు చుట్టూ ఉన్న మాలిన్యాన్ని పవిత్రం చేసేనా?
బస్ స్టాండ్ వద్ద ఎదురుగా మూటతో చంకలో శిశువుతో కూచుంది ఆమె కెవరూ గుర్తులేరు! లక్ష్యమూ లేదు! ఆ శిశువూ మూట తప్ప! అలసిపోయి రెప్ప వాలిన శరీరంపై స్వేచ్ఛగా దొరలే మొగ్గ వలె శిశువు ఆడుకునేను! చేతిలో ఎవరో అందించిన బ్రెడ్ ముక్కతో అక్కడే దగ్గరలో కుక్క పిల్ల ఆశతో తిరుగుతూంది ఆ పైన కాస్త దూరంలో ఆవు అరటి గెల వైపు ముఖం చాస్తూంది బస్ వచ్చేసింది, హడా విడిలో కుక్క పిల్ల బ్రెడ్ ముక్క కాజేసింది ఆమె లేచింది, ఏడ్చే శివువుతో అక్కరకు చుట్టం మూటతో బస్ ఎక్కింది నాకు జ్ఞాపకముంది! ఎగసే పాటతో అభినవ కల్పనతో వికసించే మరో యువతి బ్రతుకు పరిపూర్ణతకై తపించే తరుణంలో మెట్టి నింట్లో మొదటి రోజు మొగలిరేకైందో లేదో మరునాడు ఉదయం అనల కణం రాజుకొని అలసిపోయి చీకటి అంచుపై వాలిపోయింది నూరేండ్లు అందుకుంది! కిరోసిన్ అత్తరుతో ప్రేమ శిఖ దగ్ధమైంది! అంచెలపై ఆకాశాన్ని అందుకున్న సంవేదన మిగిలింది! పగలూ రాత్రి అంతలో రెండు క్షణాల్లో కుదింపబడినాయి! చుట్టూ కళ్ళు తెరచి వింత చూచే సమాజం గుండెపై ఒక్క తన్ను తన్ని క్షణంలో రెక్కలపై ఆయువు ఎగసిపోయింది! ఆకాశం అంచుల్లో కట్నాలూ! భూమిపై శిలల వలె మనుషులూ మానవతా మందారం అగ్ని చక్రమై బూది పొరలై తిరుగుతూంది నాలుగు వైపుల గోడల వలె నీడలు! వెనక బయటపడని సూర్యుడు యుగాలుగా వెలుగుకై నిరీక్షణలో బ్రతుకులు బండ బారాయి నీడల సందుల్లో నుండి ఒకటి రెండు మార్పు కిరణాలొస్తే ఏమౌతుంది? మరునాడు పత్రికల్లో విషాదవార్త చర్చలకీ కాలక్షేపానికీ ప్రత్యక్షం నాకు జ్ఞాపకముంది, మరో రోజు స్నేహితులంతా పిక్నిక్లో ఆటలతో పాటలతో విశ్రమాకృతులై కల వంటి స్థితిలో ఊగుతూ తూగుతూ ఏరు ఒడ్డున కూర్చున్నారు పై నుండి క్రిందికి జలాపూర్ణమై జారుతూన్న వికీర్ణ జల మౌక్తికాలతో సంధ్యా సవితృ కిరణాల్లో ఆలోచనా మణియై కళయై ఆమె వెలుగుతూంది కాలి ముని వేళ్ళతో నీళ్ళు చిమ్ముతూ తీరానికి అడుగు వేసింది వారి ముఖాల నుండి మాటల చూపులు తేనే టీగెల వలె ఉత్ర్కమించాయి గీసిన అగ్గిపుల్లలూ విసరిన సిగరెట్ పీకలూ హాలా రస శీకరాలూ దేన్నీ గమనించకుండా! సంధ్యా కిరణమై ఆలోచనా కళయై అడుగు వేసింది నీడలతో చీకటి! వస్తూంది; అంతా లేచి అడుగు ముందుకు వేసారు ఆమె సూర్యుని చివరి కిరణం వలె నిలిచింది, నీటిలో హంస అయింది
పైకి చూస్తే అంతలో చంద్ర బింబమైంది అంతా ఇంటి దారి పట్టారు ఉదయం లేచి కళ్ళు తెరవగానే గోడపై కాలెండర్ వ్రేలాడుతూంది నిన్నటి తేదీని జ్ఞాపకంగా భద్ర పరచుకొనీ స్ఫుటంగా కన్పిస్తూంది నాకు జ్ఞాపకముంది, కిటికీ అద్దం నుండి కన్పించే వీధి దృశ్యం పొందినవీ అందినవీ రంగుల కలలు జేబులో వేసుకొని భద్రంగా ముఖాల కమర్చిన రంగు బల్పులతో మనుషులు వస్తూ పోయేరు తీరిక దొరికితే చాలు ఎదుటి వారి కళ్ళలో ముఖంలో మనసులో అబద్దాల మడతల్లో దాగిన నిజం గురించి అన్వేషణ సాగించేరు ఎదురైన మనిషి ముఖంపై అనల చిత్రం విసరుతూ సూర్యుని రథ చక్రాన్ని చుట్టి వచ్చే అనల స్వర భాస్వరంతో ఎదకు పసి కందును హత్తుకొనీ గుండెలయకు సమంగా అడుగులు వేస్తూ కన్నుల్లో నిశా జలధి తీరాన జ్వాలా దృశ్యంతో బయట ఆటలోనో పోట్లాటలోనో గాయపడిన పిల్లాణ్ణి ఎత్తుకొనీ కను రెప్పల్లో వంగిన నీలాకాశంతో తల్లి ఇంటికి వస్తూంది చెట్ల క్రిందనో దిశ ల్లోనో ముసుగుల్ని విసరేసి వెలుగుల్ని రువ్వుతూ ముఖంలో మాయ లేని మర్మం లేని స్పాటిక మానస బింబంతో అంతలో కలిసిపోయి పిల్లలు ఆటకై గంతులేస్తూ పరుగెత్తేరు నాకు జ్ఞాపక ముంది, జ్వాలా సింహంపైకి దూకనున్న ముఖంతో బులెట్ తగిలి పడే పర్వత ఫలకం వంటి వీపుతో రైఫిల్ ధ్వని సుడి గుండంతో, విసరిన బాంబు గుండెతో అడవి నుండి నగరానికి తరలే కధా ప్రపంచం వీధిలోకి అడుగేసి ఇంటికి తిరిగి వచ్చే నమ్మకం లేదు ఏ రోజు ఎప్పుడు రెక్కలు విరిగి కుప్ప కూలేదీ తెలీదు ఇంటి ముందు వెలిగే వీధి దీపాలు అవే ప్రతి రాత్రీ ఆలోచనలకు సరికొత్త రూపాన్నిస్తాయి దారిలో వెలుగు నీడలు అనుభవాలకు కొత్త ముఖాల్నిస్తాయి ఇంట్లో క్షణం దీపాలారి పోతే ప్రాణం లోయలో పడినటె తుంది అస్తిత్వాన్ని ఋజువు చేసుకునేందుకు కళ్ళు యమ యాతన పడతాయి అదృష్ట బిందువుల వలె వెలిగే దీపాలతో ప్రాణం కుదటబడుతుంది వెలుగులో పట్టించుకోని ఊహలు చీకటిలో తరుముకొనీ వస్తాయి చీకటిలో భయ సముద్రం వెలుగులో ఆనంద గగన మవుతుంది వీటి అవసరం ఒక ఎత్తు! అనుభవ యోగం మరో ఎత్తూ! రాత్రి నిశ్శబద్ధంలో మునిగిన చౌరస్తా! ఉదయం శబ్దంపై తేలుతుంది కోలాహల లహరుల్లో మనుషులు ఒకరికి తెలీకుండా మరొకరు!
ఒక స్వప్నం కదిలిపోతే! మరొకటి దాన్ని స్థానంలో సిద్ధమవుతుంది వివిధ వర్ణ జీవితాన్ని వాస్తవం నిలుపుతుంది! ఆ క్షణం సత్యమై నాకు జ్ఞాపకముంది ఆరోజు నవ్వుతూ ఎదురైన ముఖాన నిప్పులు చిమ్మే చిచ్చుబుడ్లూ చెట్ట కొమ్మలకు మొగ్గలు తొడిగిన మంటల చివుళ ్ళ భవిష్యత్తు వ్యవస్థకై పోరాటంతో అశాంతి శిఖరాలపై అడుగులతో నేలపై పొగలతో నీడలతో కదలి పోయే జ్వాలా శిఖలు రోజూ సూర్యుడు పైకి వస్తాడు మనిషి హృదిలో సృజనతో మంచు ముఖాన అరుణ బింబమై, ప్రకృతి నొసట అదృష్టబిందువై ఇసుకపై అడుగు జాడల్ని గాలి ఎత్తుక పోజూస్తుంది ఉన్నవాడో లేని వాడో ఎవరైతేనేం? అంతరంగం మాత్రం ఆలోచనా కులాయంలో నివసించే కపోతం ఉదయం లేవగానే బయటికి పోతుంది, రాత్రి కాగానే గూడు చేరుతుంది సమాజ కర్మాగారంలో ఉదయం బ్రతుకు తెరువును గుర్తుకు తెస్తుంది చీకటి తెరపై చంద్ర బింబం మనిషి పాత్రను గుర్తుకు తెస్తుంది. జీవిత యంత్రాన్ని సంకేతాలతో శాసించే ఇనుప చేతుల నీడల్లో పగలు ట్యూబ్ లైట్ వెలుగులో రాత్రి పెట్టెలో నక్షత్రాల్ని లెక్కపెడుతూ ప్లాస్టిక్ ముఖాలతో బ్రతుకులు తెల్లారే జీవితాలూ కన్పిస్తాయి నినాదాల మధ్య పెళ పెళ శబ్దం! పూల తోటలో కమరిన వాసన పొగల నుండి తరలింపబడే మానవా కృతుల వెనక దృశ్యంలో ఆత్మ శిఖరం నుండి దూకే వెలుగుతో మరణ భయాన్ని విసరేసే భవిష్యత్తు వాస్తవ చిహ్నాలూ! సమస్యకు కొన్ని పరిష్కార చిహ్నాలూ! మంచుతో బరువెక్కిన గాలిలో నిలువెత్తు ఎగసిన దుమ్ములో తల ఎత్తి చూచే పనిలేదు! తెర తొలగాకే సూర్యుని ప్రసక్తి! జీవితం ! గడియారం ముళ్ళ ఆవర్తనం కాదు మెరపులతో పిడుగులతో! చీకటి అంతం కాదు నాకు జ్ఞాపకముంది, ముందు తెలీని ప్రయాణంలో వర్తమాన క్షణం మౌన దీపమై దారి చూపిస్తుంది చరిత్రలో వెలుగు ఉన్నా నలువైపుల నీడల సన్నాహమే ఎక్కువ అజ్ఞానం దారిద్య్రం కన్నీటి మెరుపులో తళుక్కుమంటాయి మృత్యు రహస్యం మనస్సుపై గీసిన అగ్గిపుల్ల వలె వెలుగుతుంది స్వేచ్ఛనూ మానవతనూ మంటలపై వ్రేలాడ దీస్తూ బెంజ్మన్ మోలాయిడ్ను ఉరి తీసిన రేడియో వార్త ఆర్తి నిండిన ఆగ్రహంతో టెలివిజన్ దృశ్యం
నియంతల్ని శపించే మాతృ హృదయ నిర్దోష! హిమ హృదయంపై ఒక శిఖరం నుండి మరో శిఖరానికీ మధ్య రక్త బిందువు లొలికే శిరస్తోరణాల పంక్తులూ ఒక్కొక్క బిందువులో ఒక్కొక్క సూర్య గోళం తిరిగేను ఒక్కొక్కటీ ఒక్కొక్క విషాద గాధను తలపించేను ఎక్కడ మానవతను జ్వాలలు చుట్టినా నన్ను దహిస్తున్నట్లుంటుంది ఎక్కడ ఆత్మ బింబాన్ని నీడలు క్రమ్మినా నన్ను పీడిస్తున్నట్లుంటుంది ముష్టి యుద్ధం నుండి మిసైల్ ప్రయోగం వరకూ హత్య నుండి ఉరిశిక్ష దాకా మానవ చరిత్రలో మారణ దృశ్యాలన్నీ వీడని ఆటవిక రూపాలే నిశ్శబ్ధ స్రవంతి వలె జీవితంలో వయస్సు కదలి పోతుంది చరిత్ర కవసరమైన ఊహలతో భవిష్యత్తును వెదకే చూపులతో వర్తమాన సమాజంలో కొత్త తరం త్వరత్వరగా ఎదుగుతూంది వెనుక నుండి దూకే అల వలె మరో తరం సిద్ధంగా ఉంటుంది మనిషిలో మానవతా రూపం ప్రక్కనే హింసతో రక్త చిత్రమూ ఉంది మనసులో ఉదయ రంజనంతో పాటు అనల చరణమూ ఉంది తన ప్రక్కన జరిగిన హత్యకు తోట పూలు వూయడం మానదు తన నీడలో హింసకు చెట్టు చివురేయడం, ఆపదు తూనిక రాళ్ళతో కొలిచే బ్రతుక్కి ఉదార లక్ష్యం అందదు నాకు జ్ఞాపక ముంది, మబ్బులో మెరపు చకచ్చకితంగా ఆలయాంగణాన చెట్టు క్రింద దరిద్రాంగన కన్నీటి బిందువులో ముఖం చూపి ఎట్లా దూసుక పోయిందీ పొలం గట్టుపై రెప్ప లెత్తిన కర్షకుని కళ్ళలో ఆశలు నిలిపి నీడైనా చూపకుండా ఎట్లా మాయమైందీ రాత్రి వేళ శబ్దించే ఏ అరుపు ఏ జడ రూపాల్ని మేల్కొల్పిందీ విప్లవ మృదంగ ధ్వనితో అడవిలోకి పరుగెత్తిందీ నక్షత్రాల వెలుగులో వెతుక్కుంటూ దారి పట్టుకొనీ ప్రయాణించిన మనిషి, ఉదయం వెలుగులో దారి తప్పిందీ అంగారం జ్వలించే ఆలోచనతో సమయ పటాన్ని రక్తమయం చేస్తూ భవిష్యత్తు కలలతో ముంగిట్లో అగ్ని గోళాల్ని భ్రమింపచేస్తూ నాకు జ్ఞాపకముంది, గ్రీష్మ నిశ ఇంట్లో విద్యుత్ప్రసారం ఆగి, దేశాన్నీ కాలాన్నీ శపిస్తూ చలిస్తూ విసన కర్రల కోసం వెదకుతున్నారు అట్ట ముక్కలకై గాలిస్తున్నారు పాత మిత్రుని కొత్త ముఖం వలె చీకటి ఇప్పుడే పరిచయమైనట్లుంది. నగరంలో నిన్నటి దహన కాండలో పొగ బారిన
ముఖాల సౌందర్యాన్ని ఏ కిరణాలు సమయం దర్పణంలో చూపిస్తాయి మనస్స ఎవరి కోసమో ఎదురు చూస్తోంది! ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది తలుపు తెరచి చూస్తే ఆట పట్టించాలనుకున్న పక్కింటి కుర్రకుంక! ఎవరో పూలు కోసి ఒడి నింపు కొనీ ఇంతలోపట్టుబడీ మనో దారిద్ర్యం మూట విప్పి ప్రదర్శించడమొక, ప్రహసనమైంది కొన్ని క్షణాల కంటిన సుగంధ లేశంతో తెల్లారిన తెలివితో కొందరు వీధులు తిరిగీ మనుషుల్ని అడిగీ జీవితాల్ని అమ్మజూచేరు మంచు క్రమ్మిన పూలలో స్వేచ్ఛగా రేకులు విక సించాలని ఆరాటం రాత్రి బిగిసిన మంచు కరగి ప్రవహించాలనీ ఆవేదన కిరణాలు ఒకటే అయినా ఒక ముఖంలో వర్ణం మరో ముఖంలో కన్పించదు ఉదయం రోజు వచ్చేదయినా! ఏ బ్రతుకులోను నిన్నటి వాలకం బింబించదు జీవనా వర్తంలో భ్రమిస్తూ బయటికి దారి కోసం వెదకుతూ పోవాలసిన చోటికి తప్ప! అన్ని చోట్లకు పోతారందరూ ఆశ ప్రగతికి సోపానాలు చెక్కుతుంది, జిగీషకు లక్ష్యం నిలుపుతుంది నాకు జ్ఞాపక ముంది మట్టి నుండి సువర్ణ పుష్పాలు చిదిమే పనిలో కృషీవలుడు మట్టి మనిషిగా చరిత్రలో ఏ సోపానంపై నిలిచిపోయిందీ జలద హృదయ గగనం నుండీ గ్రీష్మం గొంతు తడిపే వాన పడగానే బ్రతకడానికి భూమిపై భూమిలో శక్తులతో సంఘర్షణ మొదలౌతుంది దారి ప్రక్క ఎతె న దీప స్తంభాలు చేతి దీపాలను వెక్కిరిస్తున్నాయి తాము చూపే వెలుగు సరిపోదు; మరో చిన్ని వెలుగు సరిపడదు! రాత్రి మంచులో తడిసీ చెట్టు, ఉదయకిరణం కోసం ఎదురుచూచేను చీకటి సాహసించని మనశ్శిఖరాన్ని క్షణమైనా అందుకోవాలనీ మనిషి! బుజం నుండి దించేవీ బుజం పై కెత్తుకొనేవీ జ్ఞాపకం పెట్టుకోవడంలోనే జీవిత గమనంలో పగలూ రాత్రీ జ్ఞప్తికి లేకుండా పోతున్నాయి దున్నిన భూమి పంటకు రాగానే ముఖాన మన్ను చల్లి పైన నిప్పు విసరి ఆత్మ హత్యా నేరం వేసే! ఎప్పటికీ తమ విజయమే కోరే వీరులు ప్రాణం గాలిలో కలుస్తుంది నిజం ఆకాశంలో అదృశ్యమవుతుంది నాగరక శిఖరాలపై సూర్యుడు నిద్రలోనే! ఇంకా కలవరిస్తూంటాడు దాహంతో నిల్చిన మనిషికి నీటి బావులకై వేసిన ప్లాన్ చూపి ఊపిరి సలప నీకుండా రాజకీయం ఉపన్యసించే లోపల ఉదార మేఘం చెదరి పోయింది కారుణ్య స్రవంతి ఇంకి పోతుంది జీవితంలో మనిషి ప్రయోజన రేఖ సరళంగానో వక్రంగానో
ఎక్కడో తలెత్తే స్థితిని ఎక్కడో రూపొందే స్థితితో కలిపేస్తుంది వేలి గోటితో చిమ్మ బడిన కంటి చివరి నీటి బిందు వెగసి ఆకాశంలో నక్షత్రం కావచ్చు! ఎదపై అనల కణం అవచ్చు నాకుజ్ఞాపకముంది ఎండలో పగలు జ్వాలా కెరటాలతో సముద్రం వలె ఎత్తిన పిడికిలితో జన శక్తితో ఒకే ఒక రూపంగా కన్పిస్తుంది నిరసనలో ప్రతిఘటనలో ఒకే గళన్నినాద పంక్తులతో కదలేను దారి ప్రక్కనున్న ప్రతి వ్యక్తినీ చైతన్యతరం ధారలోకి లాగేస్తూంది పరపీడన దారిద్ర్యం అజ్ఞానం ఎరగని ఆదర్శంలో వివిధ శ్రమ శక్తుల సమ సమాజ స్వేచ్ఛా నవ వ్యవస్థకై మానవీయ తేజంతో కదులుతూంది ప్రజా స్వామ్య గణం రైపిల్ వదలిన బులెట్ల ధ్వనికి ప్రజలు కాగితం ముక్కల వలె చెదరేరు కర్ఫ్యూ తొడిగిన శాంతి కవచంతో నగరం భయ శిలపై మౌన శిఖ అవుతూంది ప్రయాణంలో పరస్పర కలహాలతో హత్యలతో ఎన్ని యుగాలు గడిచాయి ఒకరి లక్ష్యం మరొకరికి శూన్యమై ఎంత చరిత్ర మట్టిలో కలిసింది వీధుల్లో గుడిసెల్లో చెట్ల క్రింద ఆకలి గొన్న ముఖాల్ని ఏ ఎలక్షన్ పెట్టెల్లో పెట్టి తాళం వేస్తే సరిపోతుంది సమాజంలో స్వేచ్ఛ కోరే మనుషుల్ని ఏ గదిలో తోసేస్తే పీడ విరగడౌతుంది? నాకు జ్ఞాపకముంది చీకటి మైదానంలో విడవబడిన వాలకాలు దారి తప్పీ వెలుక్కి మొగం వాచి తమ నీడల్ని తామే మోసుకొనీ నడిచేను కంఠ స్వరంలోని ఆర్తి గాలికి పదును పెడుతూంది మతిలో ఆలోచన కాలాన్ని రెక్కలపై ఎగరేస్తూంది కలలుకనే ఆస్థికలు మనిషిలోనే కాదు భూమి పొరల్లోను ఉన్నాయి చీకటి బూజలపై దూకే కాంతి సింహం మనిషిలోనూ ఉంది పగలు మెలకువలో పనిలో మరచినా రాత్రి కలలో నిజ రూపం దూకుతుంది బొగ్గు గనులు త్రవ్వుతూ రత్నం కోసం వెదకీ వేసారి కోపంతో నిప్పు రవ్వ విసరీ చివరకు భస్మాకృతి కోరే నిరాశామతులూ వాస్తవ జగత్తును మరచి అందని తత్త్వం వల్లించే జీరో మతులూ గోడ వెనుక నున్న వెలుగు నన్వేషిస్తూ కన్పించే మంటల్లో పడే భ్రాంతిమతులూ మేల్కొనే పగలు, నిద్రిస్తూ నిద్రించే రాత్రి, మేల్కొనే వ్యాపార మతులూ మాటకు జవాబు వస్తుంది! విసరిన రాయై నడతకూజవాబు వస్తుంది మెలకువ నుండి నిద్ర దాకా జ్వాలా ముఖాలతో కథలే కథలెదురౌతాయి గతం కళ్ళు తెరచిన శిధిలాల్లో వాస్తవాల్ని అన్వేషిస్తూ దొరికిన వస్తువుకు పురా రూప మిస్తూ దొరకని వాటికి పునా రూపం యోచిస్తూ పాషాణంలో స్వప్నాన్నీ శిల్పాన్నీ మలచుకునే కాంతిమతులూ
ఊరి బయట శ్మశానాలపై సమాధులపై నుండి శాంతి వచనాలతో కన్పించేరు నాలో గత స్మృతుల్ని దువ్వతూ పట్టుకుచ్చుల వలె కదలే గాలులు చెరువు గుండెపై నుండీ చెట్ల బుజాలపై నుండి మొక్కల తల నిమురుతూ తీవెల ముంగురులు సవరిస్తూ కపోల పాళి మీటుతూ నాతో వస్తాయి నాకు జ్ఞాపక ముంది, కల్పనా హిమం వెనక నున్న ఉదయ సూర్యుడు ! దారి పొడుగునా గుర్తులతో జ్ఞాపకాలతో ప్రయాణం సాగుతూంది ప్రాణ మున్నంత వరకూ గుండెలో సూర్యుని ఛవితో జీవితం ఎదురయ్యే పొడుపు కథల్లో రహస్యం విప్పుతూ పోతూంది భూతలం దాటి జలధిపై ఆకాశం, జీవితం వలె ఎదురౌతుంది వివిధ వర్ణాలంకృతమై క్షితిజం సమయ దర్పణం వలె కన్పిస్తుంది ఒకరొకరి చేతులు కలిసీ, ఒకరొకరి ఊహ లల్లుకొనీ మనుషులు మనుషుల మధ్య నిశ్వబ్దం! మంచుతో వెన్నెలతో చీకటితో వెలుగుతో తరం కదలుతూంది గుండెలో పరుగెత్తే రైలుతో కాలం పయనిస్తూంది నిష్క్రియను సాయం సంధ్యలోకి విసరేస్తూ నాకు జ్ఞాపకముంది, జీవితంలో క్షణాలు పక్షుల వలె ఎగిరేవీ, పెంపుడు చిలకల వలె పంజరంలో నిలిచేవీ చిల్లర డబ్బు వలె గలగలలాడేవీ, పిల్లల ఆట వస్తువుల వలె ఆడేవీ అన్నీ మనస్సు కాప్సెల్లో అనుభవ రూపాలతో భద్రంగా ఆకర్షించేను బ్రతుకు బరువుతో మెల్లగా నడచే నా వెనుక నుండి పెట్ డాగ్ ఉత్తరీయం చుంగుల్ని అందుకునీ లాగుతూ ఆడుతూ వస్తుంది బిందువు బిందువుతో కలిసి ఏర్పడే జన సముద్రంలో ప్రయాణం ఎవరికైనా తప్పదు! పడవలో అందరికీ కన్పించని తీరంపైనే దృష్టి! చేతులకూ కాళ్ళకే కాదు మనస్సుకీ పడిన పంకెళ్ళతో మనిషి పద పదం సంకెళ్ళ ధ్వనిలో మూల్గే బ్రతుకు బరువుతో గుండ్రని చరిత్ర దారిన ఎంత దూరం వెళ్ళింది జ్ఞాపకముంది పూలు పండ్ల చెట్లతో చిత్రాలతో ప్రతిమలతో అద్దాల బీరువా ఉదయాన్ని భ్రమింప చేసే జ్వలదహంకారంతో పాటు ప్రవాహాన్నీ స్మరింపజేసే ఆశామయస్వరమూ ఆలోచనలో అంగారం జ్వలిస్తూ పూల తోటను మండించే మనుషులూ కొన్న మట్టి బొమ్మను గుండెకు హత్తుకొనీ వీధిలో మనిషి తగిలి పగిలిన ముక్కలపై పిల్లడి అశ్రు కళికలూ ఆహారంకై ఆరంభమై స్పర్థ, భూమికై విస్తరించి స్వార్థం పీడనలో సంపదతో అధికారంతో సమాజ మెట్లా జటిలమైందీ మొన్న ప్రశ్న ఎరగని శిలా గణం నేడు ప్రశ్నించడం మొదలు పెట్టింది
నేడు క్రమంగా సమాజం జన చేతన శక్తుల చరిత్రయై కదులుతూంది నాకు జ్ఞాపకముంది, కిటికీ నుండి చూస్తే కన్పించింది కన్నీళ్ళతో కదలే చంద్ర బింబం, క్షిపణుల వలె దూసే పారావతాలూ ఎవరో తలుపు తట్టిన అలికిడితో! లేచి తలుపు తీసే సరి కెదురుగా మంచు శాలువా కప్పుకొనీ ఎర్రని ముఖంతో వీడని చీకటితో మనిషి! అలసటతో బరువెక్కిన కళ్ళతో వీడని చీకటితో పగలంతా తిరిగి ఏష్ టే లో చెదరని సిగరెట్ వలె రెండు చేతుల్లో ముఖంతో ఇంటి ముఖం పట్టిన యువాకృతి అడుగుల వెనక ధూళి పొర లెగసేను ముందు నడచే ఇనుప పాదాల క్రింద ఎత్తిన ఇనుప పిడికిళ్ళ మధ్య నలిగి పడిన స్వేచ్ఛా మందారం గుర్తులు నేలపై రక్త చిత్రమై కన్పించేను మనవతా గంధంతో ఉదార పవనం ఉండి ఉండి మధ్య మధ్య కదల్లేని చెట్ల వద్దకూ, మెదల్లేని రాళ్ళ వద్దకూ వెళ్ళి వస్తూంది పై దేవతల్ని క్రిందకి దింపి చుట్టూ అలముకొన్న మౌనాన్ని చీల్చి గుండెల్ని అనల ధారలో ప్లవింపజేసి, ఈ వ్యవస్థను మార్చే నినాద పంక్తి! సమయాన్ని చక్రం వలె పరుగెత్తింపజేస్తూంది ఉద్రేకోత్సాహం రాత్రిని మంటలతో నర్తింపజేయచూస్తూంది వెనక్కు తిరగడం లేదు, ప్రక్కఉ మరలడం లేదు సముద్రం బింబించే కళ్ళల్లో ఉదయం జ్వలిస్తూంది పైన కదలే మబ్బు ఆలోచనకు లక్ష్యాన్ని గుర్తు చేస్తూంది మట్టి నుండి లేచిన మొక్క! ప్రాణ శక్తి అస్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూంది వాలిన శిరస్సుల్ని నిటారుగా నిలుపుతూ వంగిన కాళ్ళను సరిచేస్తూ ముడిచిన చేతి వేళ్ళను విప్పుతూ పవన హస్తం కదలుతూంది మార్పుకు సంకేతమై మ్రోడుల్ని మధుమయం చేసే, ఆనంద సమయం నాకు జ్ఞాపకముంది ఆ గుడిసెలో దీపశిఖ పొద్దు పొడిచినా ఆకాశం వలె పరచుకొన్ని ఆకలితో కూర్చునే ఉంది చుట్టూ అవే ముఖాలు! చూపులకు బదులు ఆయుధాలు కన్పిస్తున్నాయి సంకల్పం మౌనాన్ని కదిలించే పలకించే మ్రోగించే సాధనమవుతూంది అంతర్వనంలో సింహం బయటికి వచ్చి మృదు హాసం చేస్తూంది మనో వనంలో కురంగం స్వేచ్ఛగా ఎగిరి గంతులు లేస్తూంది కళ్ళు పైకెత్తితే ఆదర్శం తొంగి చూస్తుంది కళ్ళు దించితే వాస్తవం ఎదురౌతుంది లయ సంభ్రమంగా తిరిగే చక్రాలపై మనషులతో రిక్షా దూరం బహు దూరం బాటను సాగదీస్తూ పోతూంది, ఊహను మరలిస్తూంది ఉన్మాదంతో ప్రేలే బాంబుల మధ్య ఉద్వేగంతో మ్రోగే రైఫిళ్ళ మధ్య
ఆగిపోయే నిశ్వాసాల మధ్య నుండి శాంతి వచన రేఖలు విన్పించేను వినిపించే మాటలో అర్థాన్ని అనుభవిస్తూ కనిపించే పూలనూ ఫలాల్నీ అనుశీలిస్తూ నేలలో దాగిన వేళ్ళను వెదకుతూ మనస్సు కదులుతూంది బస్కై వేచి ఉన్న క్యూలో ఎదురు చూచే చూపులో వరసగా వచ్చిపోయే వాహనాలు! దేని గమ్యం దానిదే ఎవరి ప్రయాణం ప్రయోజనం వారిదే ! ఒక మూల నుండి విడిపోయిన శాఖల్లో నుండి ఉపశాఖలతో వృక్షం వలె కదలి తరలే మానవ సమాజం, వివిధ వర్ణ సంకలనం, ఈ నగరం సమాజాన్ని ప్రేమిస్తూనే తోటి మనిషితో పోటీతో సాగే ప్రయాణంలో ఎక్కడికక్కడ అతృప్తి ఆవేదన ఎప్పటికప్పుడు స్పర్థతో సంఘర్షణ ఆకు పూవు కొమ్మ ! చెట్టులో భాగాలు దేని ప్రత్యేకత దానిదే సమాజంలో! జీవన గమన విధంలో ఎవరి వ్యక్తిత్వం వారిదే నాకు జ్ఞాపకముంది దగ్గరలో వెలుగు లేకపోయినా కంటి నుండి జారే బిందువులో ఉంది ఒక్కొక్క బిందువు వెలుగుతో చీకటిని సిగ్గుపడేట్లు చేస్తుంది ఏడుపు! ఎవరి కిష్టముంటుంది? ఇష్టం లేకుండానే వచ్చేస్తుంది సంతోషమూ అంతే! తీరాన కెరటం వలె విరుచుక పడుతుంది పూలతో పండ్లతో చెట్టు ఆలోచనలో మబ్బుకై ఎదురుచూస్తుంది మాతృ హృదయ గంధంతో రస స్విన్నం కావాలనుకుంటుంది రాత్రి మంచుకు దాహం తీరదు, పగలు వెలుక్కి ఆకలి తీరదు నీరుకీ తిండికీ కరువైన మనిషిలో అగ్ని వృక్షం పడగెత్తుతూంది హిరణ్య హస్తం క్రింద వెండి గొడుగు క్రింద కవిత్వమూ కళ అవనతమై తోరణమై అలంక్రియను పొందే రోజులు మారాయి సూర్యుని ముఖంలో కన్పించని వర్ణ చిత్రం చీకటిలో కన్పిస్తుంది అందని కళా రహస్యాల్ని ఎక్స్రే చూపులు ఆవిష్కరిస్తాయి నాకు జ్ఞాపక ముంది దూరాన బిగ్గరగా విజిల్ వేస్తూపోయే రైలు గురించి పొలం దున్నే వాడికీ ఇష్టమే! చేతిలో నాగలి వదలేందుకూ సిద్ధమే ! ఇంటి ముందు పడి ఉండే కుక్కను వదలి ఇంట్లో పడకేసిన అవ్వను మరచీ గ్రీష్మంలో నేల చెక్క వాలకంతో ప్యాక్టరీ గేటు ముందు చక్రం వలె నిల్చేను జనం మధ్య మాటల్లో నాలుక పదును తేలుతుంది గ్రామీణ మౌన రూపం వీడి వదనం, నాగరక జల్పనం వహిస్తుంది మేడ, గోడ నీడలో కాల వేగ గతితో, యంత్రంలో భాగమై హృదయం చలిస్తుంది నవ్యతపై ఆకర్షణతో పరివర్తనపై కోరికతో జీవన రుచి సహజం
ప్రతి పదంలో జన గణం కాంతి బింబ సోపానం కోరుతుంది రాత్రి కలలు ఎగిరిపోయి మనస్సు రాగ సృష్టి వహిస్తుంది నిశలో చీకటి నద్దుకున్న బాధా స్వరంలో అగ్ని, కాలాన్ని భస్మం చేస్తుంది రేపు ఉదయ చరణంతో భవిష్యత్తు స్వప్న బింబం కోసం వ్యక్తినీ సమాజాన్నీ రాజకీయ కాంతి ఝంఝ రెపరెపలాడిస్తూంది మేఘం ఇంటి ముంగిట్లో నర్తించలేదనో ఇంటి వెనుక క్రీడించలేదనో ఎదురు చూచే ముఖ పంక్తులు సాయం సంధ్యా క్షితిజాకృతి వహిస్తున్నాయి నాలుగు వైపుల నుండి అనుభవ కిరణాలు జీవితాన్ని శిల్పంగా మలుస్తున్నాయి మనిషిలో అనువణువు నృత్యంతో సజీవ ప్రపంచం కదులుతూంది గదిలో బల్బు వెలుగు స్పర్శతో వచ్చిపోయే మనుషుల్ని ఆనందింపజేస్తూంది ఎదలో ఆరిన బల్బుతో మనిషి హింసనూ హత్యనూ అవాహన చేసేను మనిషి వస్తువు కాదు, చీకటికీ వెలుగునీ స్పందించే మనోమూర్తి నిజాన్ని గుండెలో పొదచాటునో, గుహ లోనో దాచుకొనీ వెలగని బల్బులతో బూది పొరలతో వాలకాలు కన్పిస్తాయి రెక్కలు విప్పి ఎగిరే పక్షీ గర్జిస్తూ చరించే సింహమూ మనిషి ఆశలో అహంకారంలో రెండూ ఉన్నాయి అనుభవం లేకుండా అన్వేషణ లేకుండా ఏ రోజూ ప్రయాణం ఉండదు జన విముక్తికై పోరాటంలో ఎగసే ప్రతి స్వరానికి విలువుంది ఇలపై కాంతి చరణం వేసి దిశలో కాంతి హృదయం విప్పి స్నేహ రుచితో రాగ కళతో కదలే మనిషిలో విశ్వగీతం! గమ్యం చేరే కోరిక శ్రమను మరపిస్తుంది అనుభవాన్ని వెలిగిస్తుంది ప్రతిక్షణ మేదో మృదు ధ్వనితో రణిస్తుంది బింబంతో ఉదయిస్తుంది గతాన్ని వెనక వదిలేసి రైలు స్టేషన్ నుండి స్టేషన్ చేరుతుంది రైలు దిగి అవనిపై వేసే అడుగుల్లో అనుభవం స్వేచ్ఛతో స్పందిస్తుంది నాకు జ్ఞాపకముంది ప్లాట్ ఫార్పై గేట్ వద్ద పలచని మంచు క్రమ్మినట అనల ముఖంతో ఒంటరిగా వచ్చి పోయే రైళ్ళను చూస్తూ జన కోలాహలం మధ్య కూర్చున్న మౌన బింబం పతితో! వంచితో ! ఉన్మదిష్ణువో ఎప్పటికీ! సమాజానికి మిగిలే ప్రశ్న! రాత్రి ప్రయాణంలో రైల్లో తెరచిన కిటికీ నుండి క్రిందికి దూకిన వెలుగు ఎవరికి అందకుండా భయ భయంగా మమ్మల్నే అనుసరిస్తూంది వెలుగునూ నీడనూ మరిపిస్తూ టా న్సిస్టర్లో పాట స్వనిస్తోంది పెన్సిల్ చెక్కే పిల్లవాడి చేతి వ్రేళ్ళ సందున చకచక కదలే కొత్త బ్లేడ్ అంచు వలె సన్నని మెరపు నాలో స్మృతుల్ని కదలిస్తూంది ఎప్పుడో ఎక్కడో చూచినవీ తోచినవీ క్షణంలో ఒక చోట చేరేను
సజీవ చిత్రాలై స్మృతిలో అలంకరించేను, ఊహలో పరిమళించేను బిగిసిన మంచు ముద్దల వలెనో వ్రేలాడే ద్రాక్ష గుత్తుల వలెనో ఏదో జరిగే నిరీక్షణలో! చేతిలో పేక ముక్కలతో ! టేబిల్ ముందు ముఖాలు అంచనా తారుమారు చేసేందుకు జోకర్ ఉండనే ఉంది నాతో పోటీపడే తరంగాలు! ఎంత ఎగసి పడితేనేం? తీరం దాకానే నా వెనుక వచ్చే రాత్రులు! ఎంత ఘనమైతేనేం? ఉదయం వరకే ఎంతటి వెలుగులోను మనస్సు ఏదో సమస్యను పట్టుకొనే ఉంటుంది ఏదో ఒక కథలో వలయంలో రేఖతో సంబంధం కలిగే ఉంటుంది చెట్లకూ శిలలకూ స్వప్నాల్ని వదలి, వాస్తవ శక్తుల్ని మోస్తూ నిశ్వబ్దంలో శబ్ద శిల్పంతో శబ్దం నుండి కళా చిత్రంతో యాత్ర సాగుతూంది ప్రయాణంలో నన్నందుకునేందుకు కాలం నా నీడ పట్టుకొని వ్రేలాడుతూంది ఒక్కొక్కపుడు నాలో ప్రమాదానికి గురైన కంపార్ట్మెంట్ను తలపిస్తుంది రైల్లో చేతులకు సంకెళ్ళతో కూర్చున్న వ్యక్తి కళ్ళలో మెరపులు! ప్రయాణికుల మనసులో రహస్యాల్ని వెలిగిస్తున్నాయి ఆలోచనలో మరో నాటకం ఎదురౌతుంది ఎదురుగా ఉన్న పాత్ర కేంద్రంగా అంతా తమ పాత్రల్ని స్మరిస్తున్నారు. శరీరాల్ని మరచి మనస్సులను మోస్తూ ఆలోచనా స్రవంతిగా రైలు పరుగెత్తుతూంది
V. కిర్మీరం (1953-1975)
మనోభూమికలో జీవనరేఖలో 1. ఉష ఆగమనం 2. అమృతలిప్తలు 3. ఆనందధుని 4. జీవనబింబం 5. లలిత కవితలు 6. రేఖాచిత్రాలు మాదిరాజు రంగారావు అంకితం భక్తి హృదయం శక్తినిలయంతో జన సేవలో జీవితం అయిన
ప్రియ సోదరుడు శ్రీ మాదిరాజు వేంకటేశ్వరరావు కు
I. మనోభూమికలో
1. ఉష ఆగమనం పరివర్తన సీమల్లో పరిభ్రమించే నేను ఆముఖం కోసం చూస్తున్నా కన్నుల్లో వెలుగై హృదిలో ప్రాణమై కదలే రూపంకై వెదుకుతున్నా భూమి నీరూ తేజస్సు గాలి ఆకాశంలో మొక్క ఆకు, పూవు, ఫలంలో పక్షి జంతువు రాక్షస మానవ దేవతల్లో సామ్యం చూపేదీ భేదం చెప్పేదీ పంట కొచ్చిన క్షేత్రాల్ని మ్రోడు వారిన వృక్షాల్ని పరామర్శిస్తూ సంతోషం సన్మార్గం దుఃఖం దుర్మార్గం ఆశ ఐశ్వర్యం క్షేమం నిరాశలో ప్రశ్నిస్తూ సమాధానం చూపేదీ, పలికిస్తూ అనుభూతి నిచ్చేదీ ఇక్కడే ఉంది! అరుణ కిరణ సరణియై సామాజిక చేతనయై ఉష! ఎక్కడో చూచినట్లుంది? ఎంత కాలమో అయినట్లుంది! ఈమెను చూస్తే (1) రాత్రి దర్పణంలోచంద్ర బింబం, మనః కాసారంలో రాజహంస జ్ఞాపకం వస్తాయి జలధిలో అల జలదంలో మెరపు శిశిరంలో అంకురం తలపుకు వస్తాయి ప్రశ్నలో సమాధానం వలె ప్రశ్న వెనక పరిష్కారం వలె కన్పిస్తుంది (2) చైతన్య సీమలో అడుగిడగానే నాలో అభిమతి ఎదురై తోడ్కొని వస్తుంది రూపం నుండి మరో రూపంతో నాలో విశ్వాసం తెస్తుంది ఆశకు ప్రాణం పోస్తుంది సుడి గుండాల్ని సుడి గాలుల్నీ లెక్క చేయకుండా హృదిలో నౌక వలె చరిస్తుంది ఈమె అంత స్సౌందర్యం కన్నుల మెరపుల్లోనే కాదు కన్నీటి చినుకుల్లోను ఉంది వెనక స్వప్న కథలతో వచ్చేది ఇప్పుడు వాస్తవ స్థితులతో వస్తూంది వెలుగుతో వచ్చే ఈమెకు రోదసినై స్వాగతం పలుకుతాను పూర్వం ద్యావాపృధివి ఆనందిస్తే ఇప్పుడో మహా జనం సంతోషించేను గతం వెళ్ళు వ్యాపించిన అవని వలె మూల శక్తి అనుకున్నా పురా వృక్షానికి పూచిన ప్రణవ పుష్పంగా భావించా ఇప్పుడు వర్తమానంపై చూపుతో అవనిపై అడుగులతో వస్తూంది చైతన్యం విరిసిన ఆత్మ రోదసిలో భామతి ఉషస్సు అవతరిస్తూంది
సహమతి! సూర్యునివలె ప్రసరించే నాలో చైతన్యం పరీవృతమై ఉంది
2. సౌందర్య శిఖ వచ్చింది! కాంతి మతి! నీడ ఎరగని దీపశిఖ! ఉషస్సు అంధకార పంక్తుల్ని చందన కాంతి తరు సమితిగా తీర్చే శక్తి రేఖ ముఖంలో హాస పంక్తి అలలతో, కళ్లలో అమృత బిందు కిరణాలతో మొదటి ఉదయ నిశ్వాసంలో ఆశా పతాకల మిలమిలలతో వర్షం ముందు శీతల వాయువు వలె లిప్తల మెట్లపై సుకుమార లహరియై వచ్చే ఈమె పాదాల ముందు బారులుగా వెలుగు మబ్బులు నిలుస్తాయి ఈ సమయం దివ్యమైన అనుభూతి హృదయంలో పల్లవిస్తుంది పెదవిపై కుట్మలిస్తుంది వాక్కులో సుమిస్తుంది ఊహలో పరిణమిస్తుంది ఝుంఝూనిల తీవ్రత్వం నైశిత్యం ఎరగని మొదటి వాసంత క్షణం పరిమళ వదనంపై రోచిరాసంతో విచ్చిన హిమ స్వప్న పద్మం! మృదు ధ్వనులు లీనం చేసుకునే అఖండ శాంతి రూపం ఈ రోజు ఈమె ఆగమనం కాలచక్రం తీసుకునే మొదటి ఆవర్తం సూర్య కిరణం భూమిని స్పృశించే ముందు పల్చని మంచు గాలి తెరపై ఈమె రూపం కనక శత పత్రంపై చంద్ర బింబ స్ఫూర్తి కలిగిస్తుంది దివి నుండి దూకే దివ్య కాంతి ధుని ! భూమిపై పరిమళ ఝరియై కదలుతూంది భావ జగతిలో ఈమె అవతరణం మొట్ట మొదటి వసంతాన్ని చూచినట్లుంది ఈమె కళ్ళు! తేజో లతలు! దిక్కు లేని చీకటి రాయిని చలింపజేసేను (2) (1) చంద్ర రేఖ బింబిస్తూ ఎగసే కెరటాల వలె దిగ్వసనం ధరించి సముల్లలత్ వక్షోజాలతో స్మిత రుక్ దీపంతో నవనీత పాత పదగతితో శరన్మేఘ శిల్పాకృతి అవనిపై అడుగిడుతుంది. ఎదలో వీణా నాద తరంగం వలె సాగుతుంది అలలు తలలు పంచుతాయి గాలులొక పక్కకు ఒదిగి ఒదిగి పోతాయి గులాబి రేకు పెదవులపై ఇంద్రచాప వర్ణాల్ని సముద్రంపై కెరటాల్లా గాలి సమీకరిస్తుంది, మేళవిస్తుంది, సౌందర్య సమర్చనంగా అర్పిస్తుంది నాద లహరి వలె కాంతి వలయం వలె విచ్చిన కనక శతపత్రంవలె ఈమె అవతరించగానే నిద్రించే లిప్తలు మేల్కొంటాయి సాంగీతికులౌతాయి
మందీభవదీహలు చేతనా రుచిరాలౌతాయి నీటి ఒరపిడికి అణిగీ, వడికి లేచీ ఎగసే కెరటాల వలె ఈమె అడుగులు కదలుతాయి, మనస్సును మరపులో బంధిస్తాయి రవి అస్తమించగానే ఈమె ఊహకు ప్రతి రూపం చంద్ర బింబం కన్పిస్తుంది క్షణాల పై చంచల వర్షాంబుదం వలె సాగిపోయే చలన్మతికై ఎన్ని ఆలోచనలు గాలి పటాల వలె ఎగసి పోయాయి ఎన్ని అబ్దాలు మంచు కొండలై నిలిచిపోయాయి ఎన్ని వసంతాలు దుఃఖ హసంతికలై ఎదను మండించాయి కళ్లలో వత్తులతో కాలం మంచు బొట్లు రాలుస్తూ కరగిపోతుంది నిద్రా సరస్సులో స్వప్న కల్హారం జాగ్రదావస్థలో చంద్ర బింబం ! మబ్బును దూసికొని మెరపువస్తుంది కొండను చీల్చుకొని నది వస్తుంది విత్తును పెకల్చుకొని మొక్క వస్తుంది నభస్సును విచ్చుకొని నీవు వచ్చేవా సముద్ర మవతల నీవు, ఇవతల నేను! చంద్రనౌకలో రానా? దిశ నుండి దిశకు నిల్చిన శశిరశ్ములు పట్టుక రానా? సుందరమైన ఆనంద మహానుభూతికి ప్రమాణ రూపం స్వర్గం ఆ స్వర్గ ఖండం ఉషస్సు ! ఉదయ కిరణ సంగీత మయం! నిను పరివేషించిన స్వర్లోక గవేషణలో ఊహలు వాంఛలు ఆకాశంలోకి చూచే వృక్షాల వలె జలధిలోకి కదలే నదులవె కన్పిస్తాయి ప్రభాత వేళ మంచు ముసుగుతో ముగ్ధ ముగ్ద సంతోష తరంగం ఆ రూపం నిశ్శబ్దం నిండిన రోదసి హృదయంలో పూల మబ్బు వలె అవతరిస్తుంది గ్రీష్మ స్వప్న సముద్రం నుండి సాగే మేఘ మాలికవలె భూదేవత పెదవులపై నవ్వు మొలకతెచ్చే వర్ష ధారవలె అబద్ధం వంపులొరసీ సాగే నిత్య సత్య వాహిని వలె జీవన లహరులపై పూల నౌకవలె కదలే సౌందర్య శిఖ వలె శిశిరంలో వసంత పుష్పమై, పుష్పంలో ఫల రూపమై ప్రేమ పూర్ణ కాంతి శ్రీ! ఆసీమాంతం చెంగలించే రసధుని! సృజన తృష్ణలో మొదటి ఉదయ కిరణం స్త్రీ రూపం పొందుతూంది అడుగుల్లో లిప్తల మంజీర ధ్వనులు! తనువులో కాంతి వల్లీ సౌందర్యం ఊహలో ఉషస్సు అవతరించని కళ లేదు, కవిత్వం లేదు మనసుపై పొరల్ని వెలుగు కెరటం వలె పునీతం చేసి పోతుంది శంపాలతల చూపులతో నవాశాబింబ నేత్రాలతో సౌందర్యశిఖ ! ఉషస్సు పొందే మరో రూపమే! మనిషిలో సృజన కాంతి హృదయం
3. రసాకృతి ఎదలోతుల్లో నుండి వచ్చే సౌందర్య రసావిష్కారం నీ ఆకృతి నీ చైతన్యం మూర్తీభవించిన శిల్పం నాస్మృతి నావహించిన నీ భావన నిద్ర నుండి నిశ్శబ్దం నుండి నిశా సీమ దాటే సమయం మనో జగత్తును ప్రభాతమయం చేసే ఉదార జ్యోతిస్సాహితి అశ్రు కణ సమూహం శిలా రూపం పొందినట్లు గ్రీష్మ పవన రేఖల్ని చుట్టీ మండే అగ్ని వలె ఆర్తం రవం మ్రోగి మ్రోగి నిల్చిన మ్రోడు వలె ఉన్న నాలో సృజన శక్తి మేల్కొల్పే ఉషః కిరణ రసాకృతి ఆకాశం వలె అందని నీ స్పర్శానంద భావనలో నరాల్లో పరుగెత్తే అమృత భరోత్సాహంతో సమున్నత ముఖమెత్తి దీర్ఘమైన రెక్కలు చాచి నీకై యత్నించా నిశా పటలంపై చంద్రరేఖ నవ్వుతో ! ఎంత కాలం నుండో హిమ శిల వలె నున్న నన్ను రసధునిగా మార్చావు నా మనస్సుకు నీ రూపమెంత దగ్గర? అంటే ! కంటికీ వెలుక్కూ ఉన్నంత ! నాడు రాగ స్నిగ్ద ముఖంతో నాలో లీనమైన నీ రూపం మరలినట్లే తెలీదు మలి సంజలా వాలి పోయే నా కనురెప్పల్లో ఎప్పటికీ తొలి సంజలా నీ ఆకృతి ప్రవేశిస్తుంది, దృగతీతమై నిలుస్తుంది ! లేవగానే అద్దంలోముందు నా ముఖానికెదురుగా కన్పిస్తుంది కాల ముద్రలు లేని నీ ముఖం, ఉషః కాంతి హృదయ పద్మం పురా రహస్యాల్ని స్మరింపజేసే వాసనా ప్రతి బోధకంగా నిశ్వాస రేఖలతో వాయు నాద పరిషత్తులు కదలుతాయి జీవనాడుల్ని తంత్రుల వలె స్పందింపజేసే గాంధర్వ కళా మూర్తి రాగ ద్వేషా లెరగని నగ్న సహజ మనః ప్రకృతిలో ఆనందాకృతి! కళ్ళ నుండి కాంతి ప్రసరిస్తూ మొగిలు నుండి మెరపుల వలె అమృత భాష మాట్లాడుతూ ఉదధి పొంగ వినిపిస్తా కాంతి గీతం సప్త వర్ణ కిరణాకృతి కదలిరా! వెలుగుంగరాల వలె ఊహలు సాగగా గగనుని సిగపై వ్రేలే వాడని చాంద్రీ దామం వలె ప్రతి నిశీథి బింబస్తూరా నిభృత కళా మనోసరసి! మెరపు తీగెతో వెలుగుతూ నీలి మబ్బుగా ఈ శరీరాన్ని మలుస్తా కదలే నీటిపై వంతెనలా ఈ బ్రతుకును నిర్మిస్తా! కాల రథం పై రా! పదును కత్తికి రెక్కలు తెగిన గిరిలా దిక్కులు చూస్తూ ఉండలేను
వీచే చలి గాలికి వణకే వృక్షంలా దేహం ముడుచుక ఉండలేను రానీ అభయ కోష్ణ కర స్పర్శతో! నీ ప్రేయో రూపం నాలోకి చైతన్య కళా మూర్తివి ఉషసివి అమృతశక్తివి నీవే దేవతనో నేనెరుగను పొరలు పొరులుగా రూపొందిన మతిలో వేయి రెక్కలు విప్పి కదలే వెలుగు మూర్తీ! నాపై కాంతి పూలు ప్రసరిస్తూరా! మనసుపొంగ వినిపిస్తా సువర్ణ హృదయ గీతం జ్వలదూహ శిఖలతో ఆహ్వానిస్తా పవమాన పంక్తి వలె రివ్వున రా కలసిపోయి ఇరువుర మొకటిగా ద్యావాపృథివి వలె ప్రకాశిద్దాం అణువున కతీతంగా సర్వాంతర్లీనంగా నర నారీ సుషమా రూపం స్ఫురించేను నీ కను రెప్పల తెరపిడితో ప్రభాతమేర్పడుతంది నీ కనుచూపుల్లో సూర్యుడు పోషితుడవుతాడు నీను చూచేందుకు శరీరం విప్పారిన నేత్ర గోళమౌతుంది నీ దివ్య కరస్పర్శ మనస్సును ధవళ శిఖరంగా మారుస్తుంది ఆలోచనల్ని మల్లీ మందార పారిజాతాలుగా తీరుస్తుంది నిశ్వబ్ద రాత్రి నీ రూపం ఎదలో దీపశిఖయై వెలుగుతుంది స్వప్నంలో గీతమై పలుకుతావు గీతంలో స్వప్నమై నిలుస్తావు నీ రాకతో ఆదర్శానికీ వాస్తవానికీ మధ్య రేఖ చెదరుతుంది నీ కదలికతో నాలో క్రమ్మిన అసత్యపు పొర తొలగుతుంది నీ కను రెప్పలు నాపైసరస్సు పై ఉదయ దిశల వలె వాలతాయి నిశాయతనం నుండి నీవు సత్యమై మెలకువయై సుందరమై వస్తావు ఉదయం మొదటి సూర్య కిరణం వలె నా ఎదపై వ్రాలినపుడు వస్తే వేరొక రాత్రి త్వరగా పోవాలని ఆలోచన కలుగుతుంది నిశ్శబ్దపు నడకతో తుమ్మెద ఝంకారంతో జలపాతం హోరుతో సూర్యుని చిట్టచివరి సాయం కిరణంతో పూర్తిగా విడిపోతావు సంతోష విషాదాలు సమంగా పొందే చంద్రబింబం చూస్తే జ్ఞాపకం వస్తావు తమస్సముద్రం దాటి ఏలారావాలనా? నా చూపుల వెలుగు వంతెనపైరా బడబానలంతో సముద్రం వలె, విద్యుత్కాంతితో పయోదం వలె ఊహాశోభతో శబ్దం వలె, ప్రణవంతో విశ్వం వలె నీతో నేను ! హృదిలో నిను పొందిన నేను నీకో రూప మిచ్చి పరిధిలో బంధించలేను (3) (4) శబ్దం అగ్నిలో జ్వలిస్తూ పోయేను ఊహలు గాలిలో అదృశ్య మయ్యేను! ఈ ఉషస్సౌందర్య రసాకృతి! నాలో వీడని మానుషాత్మను పొందుతూంది
4. సౌందర్య రాగం సమయం మధు సౌందర్యంతో సరిస్తుంది అనుభవం హిమ పరిమళంతో మత్తెక్కిస్తుంది. పగటి ఆరాటం అణగిపోతుంది రాత్రి భయం మాయవుతుంది అలలపై రవి కిరణాల వలె ఆలోచన ఆనందాన్ని కొలుస్తున్నట్టుంటుంది హృదయం నీలి మబ్బునో పూల తీగెనో తలపిస్తుంది ఎప్పటి కపుడు రహస్యం తెలుస్తూనే ఇంకా మిగిలినట్లే ఉంటుంది శరీరంలో అణువణువూ ఒక్కొక్క వెలుగు దర్పణ మవుతుంది మనస్సులో ఒక్కొక్క ఊహ కిరణ పుష్పమవుతుంది ఈ వేళ కదలే ఊర్పులు పూలు పూస్తాయి కదలికలో చిరు అలలు ఎగసి పడతాయి ముఖంలో చంద్ర కళ లొకటొకటీ ఒలుకుతాయి గుప్పిట్లో ఒదిగిన స్వర్గం అరచేతిలో బయటపడి నట్లుంటుంది. కళ్ళలో ఆనంద పుష్పాలూ! ఫాల తలంపై అదృష్ట బిందువులూ వెలుస్తాయి గర్వం మంచు వలె కరిగిపోతుంది, స్నేహం మొగలి వలె గుప్పుమంటుంది ఇపుడొకరి ముఖంలో మరొకరు చూచేది ఉషస్సు హ్లాదబింబం మాత్రమే ప్రశ్నలు మొగ్గలై అంతలో సమాధానాలు వికసిస్తాయి రాగ కర స్పర్శతో అంతరంగం విరిసిన పద్మ మవుతుంది ఒక్కొక్క దళ మొక్కొక్క రాగ చ్ఛాయను పొందుతుంది అనుభవంలో మ్రోగే ఏ వీణనో వయోలిన్నో సితార్నో తలపిస్తుంది ప్రవాహంలో విద్యుత్తు వలె ఉత్సాహంతో మంచు నుండి సూర్యుని వలె ఉద్వేగంతో అల నుండి అలను అందుకున్నట్లు సరికొత్త సంకేతాలు స్ఫురిస్తాయి చీకటిలోను బ్రెయిల్ లిపి వలె సర్వం అలవోకగా అవగతమువుతుంది స్పందనలోప్రాణం హృదయ రాగం పలుకుతుంది అలల మధ్య ఎగసే వెలుగు వలె ఏకాంతం ద్వంద్వమై కదులుతుంది నర్తిస్తుంది వాలిన పక్షు లెగిరేందుకు సిద్ధమైన ట్టుందీ నిశ్శబ్దం ! మనస్సు శాంతి సింహ మవుతుంది హృదయం ముగ్ధ హరిణ మవుతుంది ఎంత గొప్ప అనుభవమైనా అంచుల్లో ఒదగక తప్పదు ఎంత దీర్ఘ తరంగమైనా ఒడ్డున ఆగిపోక తప్పదు తెరపడ్డాక షేక్స్పిరియన్ఏంటిక్్స జీవితం ప్రత్యక్షమవుతుంది స్మృతి బింబాలు మెల్లగా మనో మ్యూజియంలోకి చేరతాయి
శిలలో శృంగార శిల్పంగా ఎదలో అప్సరో నృత్యంగా మిగిలీ రెండు వెలుగు బింబాలూ జీవితంలో వేరు వేరు భూమికల్లో కన్పిస్తాయి కదలుతాయి ప్రస్తారం అమృత లిప్తలు అరవిందుల డివైన్ లైన్, (దివ్య జీవితం), ఆనంద ధుని అరవిందుల మహా కావ్యం సావిత్రి చదివాక పొందిన సూక్ష్మమైన అనుభవ పరంపరా రూపం. ఇది నిర్దిష్టం కాక, అమూర్తంగా ఆవిష్కృతమైంది. మనిషిలో ఆరోపణ దశల్ని పొందే క్షణాల్లో మృత్యువును ఎదుర్కొనే ఇచ్ఛతో పాటు లోపలి శక్తిని కూడ గట్టుకునే సంకల్పమూ ఉన్నాయి. అందుకై నిరంతరం ప్రయత్నం జరుగుతుంది. సాదన అవసరమౌతుంది. మానవ సంస్కృతిలో ఇది ఎన్ని విదాలుగానో కన్పిస్తుంది. దీని అస్తిత్వాన్ని బహుముఖంగా గమనించవచ్చు. చివరకు పొందే విజయ సిద్ధి సావిత్రి కావయంలో ఆత్మోన్నతి కభిముఖంగా కన్పించే ఒక వెలుగు ముఖం, దీని ఆలోకనా చిత్రణమే ఈ కావ్యం. ఇందులో ఒక విశేష దశలో మనసుస పొందే ఆరోపణం ఆత్మ భావనా విలసితంగా సాగింది. ఈ రచన మూడు దశలుగా ఉంది. 1. పరీమళ వలయం, 2. ఇక్కడ ఎక్కడా లేదు చీకటి, 3. ఆదిత్య వలయం. ఇవి క్రమంగా భౌతికం నుండి మనస్సుకూ అంతః కరణంనికీ ఆత్మకూ ప్రతీకలు. మొదటిది ఉత్తమ సంస్కార బంధురమైన వాతావరనాన్నీ, రెండోది, సాధానాత్మకమైన ప్రపంచాన్నీ, మూడోదీ పర్యవసానమైన దివ్య రూపాన్నీ భావింపజేస్తాయి. చివరి లక్ష్యం ఆత్మోన్నతియే, ఇది వ్యంజితమైంది. చీకటి లేకపోవడం (అభావం) వెలుగు. ఇది ఆత్మకు సన్నిహితమైంది. రెండోది మనస్సుకూ ఇటు ఆత్మకూ మధ్య స్థితి. మూడోది ఆత్మ వివృతి తేజఃపుంజం, తేజఃప్రకాశం, తేజః ప్రసారంగా దర్శనమిస్తాయి. ఇందులో హిరణ్మయ కవాటం, ఓంకారం అరణి ఇట్లా అనేకం పురా స్మృతుల్ని కదలించేవి. ఇవి వస్తువులోని భావ రేఖలకు దీప్తినిస్తాయి. అనుభూతికి లోతైన స్థితినిస్తాయి. ఆకృతికి విస్తృతమైన పరిధినివ్వడం సరేసరి. ఇందులో హృదయ స్పందనం జీవన శక్తిని గతిలో లయనూ నియతినీ, వ్యక్తం చేస్తుంది. ఇది ఒక నవనవోన్మిషితమైన కాల ఖండంగా భావితమైంది. ఈ కృతిలో చివరిది జ్వాలా రూపం. ఇది మనిషిలోని వాంఛమతికీ అహంభావానికీ ప్రతీక. దీని ప్రసారం ఇందులో అవిష్కృతమైంది. బహుపురాతనమైన సామాజిక స్మృతులు మనస్సులో పొరల్లో దాగి ఉంటాయి. ఇవి మానసిక ప్రవర్తనలో ఆలోచనలో ఆయా సందర్భాల్లో ప్రస్ఫుటం అవడం కద్దు. అరణిని మధించినపుడు అగ్ని ఉద్భవించినట్లు మనస్సు భౌతికాభౌతిక స్థితుల ఒరపిడితో గాఢమైన అనుభవ దశల్లో రూపంతో నిర్గతమైతుంది. ఇందులో ప్రాయిడ్తో ఎన్నో సిద్ధాంతాల్లో విభేదించి కొత్త పుంతలు త్రొక్కిన
కార్్ల జెస్టోవ్ యుంగ్ ప్రతిపాదించిన సామాజిక అవ్యక్త చేతన (Collective Unconsious) ప్రసక్తమైంది. ఎంత ఆధునికతను పొందినప్పటికీ వ్యక్తిలో చరిత్రకందీ అందని ఎన్నో తరాల క్రిందటి ప్రవర్తనా రీతులతో అనుభవ మర్యాదలతో సంస్కృతీ స్వరూపంతో భద్రపరచబడి ఉండడం విశేషం. దీన్ని డి. హెచ్. లారెన్్స "Blood Consciousness" గా గమనించాడు. స్కాటిష్ ఎం పాలజిస్్ట జేమ్్స ఫే జర్ "The Golden Bough" అన్న మహా గ్రంథంలో చరిత్ర కందీ అందని దశ మొదలుకొని అనేక సంస్కృతీ పరమైన అంశాల్ని విశ్లేషంచి చర్చించడం జరిగింది. ఇవి సామాజిక మనో వైజ్ఞానిక దృష్టితో వివరింప బడినాయి. టి.ఎస్. ఇలియట్ ఈ గ్రంథం గురించి ఒక చోట "One which has influenced our generations profoundly I mean "The golden bough" అంటాడు. దీని ప్రభావం నేటి రచయితలపై అంతో ఇంతో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈనాటి సాహిత్య విమర్శలో చారిత్రకసామాజిక దృక్పథానికిమనో వైజ్ఞానిక దృష్టి పుష్టినిస్తూంది. ప్రస్తుతానికి వస్తే ఈ కృతిలో సాంస్కృతికమైన ప్రతీకాత్మక సంవిధానం ఉంది. మానిసికంగా వ్యక్త చేతన మరియు అవ్యక్త చేతనకు సంబంధించిన వివిధ దశల్లో ఏర్పడే సంఘర్షణపై దృష్టి కన్పిస్తుంది. సామాజిక తలంపై భౌతిక శక్తుల ప్రమేయమూ ప్రాబల్యమూ విస్మరించని వాస్తవ రేఖలూ నా ఇతర కృతుల్లో వలె కాక ధునిలో సూత్రప్రాయంగా ఉన్నమాట నిజం. అయితే దీని ఉద్దేశం వేరు. వస్తు ప్రస్తారమూ వేరు. మనిషి ఎక్కడున్నా ఏకాలంలో న్నా ఎదిగే దశలతో మానసికంగా సమున్నతమైన విశ్వ భావనకనుగుణంగా తీర్చబడిందీ రచన. జీవితంలో బాధల నుండి దుఃఖాల నుండి హద్దుల నుండి అజ్ఞానం నుండి అసంపూర్ణత నుండి మృత్యువు నుండి ఉత్తమ స్థితికై ఉన్నత దశకై, దివ్య దశకై జరిగే ప్రయత్నాల్లో సంఘర్షణల్లో విజయమే మానవ లక్ష్యం కావాలి. పరిపూర్ణత సిద్ధించాలి. ఈ దశలో అన్వేషణ సాధన సిద్ధికై చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దీని స్పర్శ మాత్రమే ఈకృతి ! - మాదిరాజు రంగారావు
2. అమృత లిప్తలు నాపై నుండి దూకినరాత్రి ఆవలి గట్టున నిలిచింది
1. శిఖరమై బింబమై సవితృ రూపం ఎదురుగా! నున్న చంద్ర బింబం పాలిపోయింది
నిశ్వబ్దంగా నిర్వ్యాపారంగా ఉన్నట్లుందీ క్షణం నేను నడుస్తున్నా ఉదయం శిఖరమై. వికస్వర రేఖలూ ఆనంద లహరులూ కన్పిస్తూ విన్పిస్తూ ఎరుపు నుండి పుసుపూ తెలుపు లోకి ఉదయ సంధ్య మారుతూంది లోలోన ఆలపిస్తూ రాగం గాలి ముంగిట్లో తారాడుతూంది ఎదురుగా నిలిచిన వెలుగు లోలోన అనురాగం పొంగుతుంది దిక్కుల్లో వెలుగు వలె నరాల్లో నెత్తురు నదిలో ఆర్ద్రత వలె మనసులో అనుభూతి సూర్యుని తేజం వలె చింతనలో ఔజ్వల్యంతో నేను కదలుతూన్నా వెలిగే కర్పూరం వలె వేల వేల రేకులతో పరిపూర్ణ బింబమై ఎవరికీ తెలీకుండా క్షితజ పద్మం విరిసింది ఎంతో పొందికగా వెలుగు దారాల గూడు అల్లుతూ కొమ్మ నుండి కొమ్మకు తిరుగుతూ సాలీడు కన్పించేను ఒక గాలి తెర వీచి, ఒక మంచు పొర సోకి ఏ దారమెక్కడ తెగేనో? ఈ సాలీడెక్కడ దాగేనో? కనులు ముకుళిస్తే రాత్రి కన్న కలలే కాంతి వర్ణ చిత్రంతో సాక్షాత్కృతి పొందేనా? ఈ సృష్టి దృశ్య పరంపర భ్రమోదిత స్వప్నమా? కాదు కాదు ఇప్పటికి పరమ యథార్థ రూపం నా చూపు ప్రసరిస్తోంది పొదిగి కొని వర్ణాలెన్నో నేను ప్రయాణిస్తున్నా కాంతి మనోభూమికలో నా కళ్ళ కలల్ని వదలాయి నా చూపు వెలుగు చిమ్ముతూంది నా చిత్తం చైతన్యం సరిస్తూంది నా హృది సంగీతం స్పందిస్తూంది ఇక్కడ నుండి చూస్తే నా చూపు మేరల్లో నే చూడాలిసిన వస్తు బింబా లెన్నెన్నో! ప్రతి బింబంలో నేనూ! నా చుట్టూ వర్ణాలెన్నో ఎక్కడి వక్కడ విడిపోయి మిగిలే దొకటే ఒకే వర్ణం తెలుపు! చిత్రమై సంగీతమై కవితయై. నా ముఖంలో మౌనం అఖండ ధైర్య వహించింది సత్యం వెలుగు దుస్తులు ధరించి నిలిచింది రివ్వున ప్రాణ బంధుమై వచ్చి ముని వ్రేళ్ళపై వాలిన వెలుగు పరిష్వంగంలో మనస్సు ఒదిగింది ప్రకృతిలో అణువణువునా స్పందనం
స్పందనలో చివురెత్తే కొర్కెలూ ఆకాశం నిండింది శబ్ద తరంగ దళాలతో భూమి విరిసింది ఏడు రంగుల పంటతో విషాద రేఖలు తుడిచేసే విజ్ఞానానికి చిహ్నమై దర్శనకు దర్పణమై విజయానికి కేతనమై రవి అంతస్సు నుండి శక్తి సరిస్తూంది నాలోకి అగ్ని వలె జ్వలిస్తున్నా నేను మణి వలె వెలుగుతున్నా అహంకార బహు భూమికల్లో వివిధ పాత్రల ప్రకాశనంతో మనస్సులో కోర్కెలలల్లుకున్నాయి విడదీయరాని అనుబంధంతో అవని పచ్చగా నవ్వుతూంది దేహం వెచ్చగా విరిసింది మెడ కెత్తనున్న కాడి వలె ఎదురుగా అదృష్టమైన జీవితం ఈ సమాజ మింతవరకు కెన్ని మారు లావృత్తమైందో రూపం పోల్చుకోడానికి బుద్ధి యోచన కొదిగేను
2. వలయంలో వివిధ దళ రాగంతో పరిమళ మధు భావంతో స్మృతుల పరంపరలో పద్మాలు వరసగా విరిసాయి అవతరించిన ఊహకు శిల్పం అబ్బింది మేల్కొన్న మనస్సుకు పరిమళం హత్తింది ఎట్టెదురుగా వికసించిన ప్రొద్దు తిరుగుడు పూవు కాల హరణ జీవితాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తోంది తోట పరిమళం వలె నేను కదులుతున్నా వలయం నుండి వలయంలోకి విజయ లిప్తలపై కొత్త చూపు వచ్చింది దిక్కుల్లో ఏ శక్తీ అడ్డు నిల్వలేదు తెరలు వ్రాలాయి ప్రక్కగా పొరలు వ్రీలాయి కుప్పగా నింగి నుండి వాలే పక్షుల వరసల వలె చెట్టు నుండి సాగిన పంగల కొమ్మల వలె
3. వలయం నుండి బ్రతుకులో వంపుల అందంతో దిశల్లోకి చొచ్చిన వెలుగుదారులూ
ఈ వెలుగు దారుల్లో విచిత్రాకృతులెన్నో చూచీ చూడనివీ యుగాలుగా వచ్చే నీడ వదలని దివ్వెలూ, ఎప్పటి కపుడు గండం గడిచే బ్రతుకులూ ఎప్పటి కపుడు మార్పును పొందే ఊహలూ ఎందరో ప్రయాణిస్తున్నారు అందరితో పాటు నేనూ అందరిలోనూ నా రూపమే నాలో ఎందరి రూపాలో నాకు జ్ఞాపకం వస్తూంది ఈ ముఖా లెక్కడో చూచినట్లు నిన్న మొన్ననే ఈ దారినే రేపూ కన్పించవచ్చు మళ్ళీ ఎదురుగా భవిష్యత్తు ఉంది, దిక్కుల్లో ఒదిగి సిద్దంగా గతం గుహ వలె నిలిచింది వర్తమానం పక్షి వలె ఎగిరేను నేను వెళ్ళుతున్నాను ఇంటి నుండి మరో ఇంటికి నేను మసలుతున్నాను ఎద నుండి మరో ఎదకు క్షితిజ రేఖా ధరాలపై వినిపిస్తోంది గాంధర్వం మనోనుభవం పంచుకొనీ హృదయ చలన మందుకొనీ, ఎంత కాలం నుండో మౌనంగా ముడుచుకొన్న వెలుగు లెగురుతున్నాయి వెచ్చ వెచ్చని ఉత్సాహంతో మాటలో పాట కోసం వేచీ ఆటలో నటన కోసం చూస్తూ లాభాలు నష్టాలు గుణించుకునే స్థితిలో లేదు మనస్సు క్షణాల ఇనుప పాదాలపై కాలం పరుగెత్తుతూంది కోర్కెల పాములు నలగిపోతున్నాయి దారిలో స్మృతుల వలె రాలుతూ పూలు పరిమళం విసరుతున్నాయి అనంతంతో అంతం ఇక్కడే ఉన్నట్లుందీ వాలకం చూస్తే చెట్ల క్రింద కొందరు బ్రతుకులు కొలుచుకుంటూ కూర్చున్నారు అజ్ఞాన చ్ఛాయల్లో అందం చిమ్ముతోంది ప్రకృతి క్షితిజంలో వివిధ వర్ణ రూపాలు భ్రమిస్తున్నాయి మనసులో బహు కాంతి ముఖాలు ఎదురుచూస్తున్నాయి చంటి పిల్లల వలె వెలుగు చుంగులు పట్టుకొని ఇంకా అక్కడక్కడా చీకట్లు వ్రేలాడుతున్నాయి బ్రతుకంటే మిత్రమా! చీకట్లో నీడలు వెతకడం కాదు వెలుగుపై చీకటి చిమ్మటం కాదు చీకటి నలంకరించడం కాదు క్షణాలు వరసగా రెక్కలపై ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాయి నేను కదలుతున్నా మెలకువలో జలధిలో సూర్యుని వలె నేను కదలుతున్నా నిదురలో గగనాన చంద్రుని వలె పగలూ రాత్రీ ఎద ఎదను స్పృశిస్తూ
అమృత లిప్తలపై పద పదం ఊనుతూ కాలాంశానికీ కాలాంశానికీ మధ్య శక్తి, ఆకర్షణ! స్థల బిందువూ స్థల బిందువుకూ మధ్య శక్తి, ఆకర్షణ!
4. మరో వలయం ఘర్షణతో విరామంతో సంఘర్షణతో స్పష్టీ విలయం పునస్స్పష్టీ సంసర్గం సంబాధం విభేదంతో వివిధ శక్తి గతుల సంకలనం! మనస్సు స్పట్నిక్ వలె ఎగసి పైకి దూసుక పోతూంది ఒక వలయం నుండి మరో మరో వలయం లోకి జీవన సంభార వహంతో మౌనంగా ప్రయాణిస్తున్నా నైశ్చల్య సీమలు దాటీ నీరవం పొరలు చీల్చి కంటిముందా వర్తంతో చెవికి దాని సంగీతంతో మనసులో ఊహ సంవర్తాకృతి పొందుతూంది ముఖమెత్తి చూస్తే ఆపై తెరచిన మెలకువ తలుపులు ఓంకార శబ్ద సుందరమై దూర దూరం నుండి పిలుపులు లుప్తమైన శక్తి స్థానంలో మరో శక్తి నిండుతూంది వాగతీతానుభవం మనోహర సాకారం పొందుతూంది అవధి లేని శాంతిలోనూ! అనంతమైన కదలిక ఉంది ఏ క్షణమూ లేదు విరామం ఉంది నిరంతరం చైతన్యం కళ్ళు విప్పిన తలపులతో మనస్సు ఉదయాకాశం వలె ఉంది అంతరాంతర భూమికల్లో తలుపులు తెరచుకున్నాయి విచిత్ర తేజః ప్రసారంతో ఆశ సువర్ణ సుందరమైంది చీకటిని హ్లాద పరచే చంద్రుని వంటి ఎదతో రాత్రిని కరగించే సూర్యుని వంటి ఎదతో పైరు ఎదలో ఆశతో ఎడారి నిద్రలో కలతో జలధిలోని ఉద్రేకంతో సరస్సులోని సహనంతో వస్తువునూ మనస్సునూ కలుపుతూ పయనిస్తున్నా తేజసూత్రంలో బిందు బిందు కళనై లిప్తల తరగలపై వెలుగు పడవనై అవనీ పాల భాగాన తరంగాల ముడతల్లో దాగిన అదృష్ట సీమలు దృష్టమవుతున్నాయి ఇదో సుదీర్ఘ ప్రయాణం ఎప్పుడెక్కడ తేలీదీ తెలీదు
తీరాలు పరిచయ మౌతున్నాయి తరంగాలు వచ్చి పోయేను ఒక మహా సందేశంతో రాన్ను మరో ఉదయం నాలో మౌనంగా మలచుకుంటూంది నవాకృతికి రేఖలు
5. మలుపు నుండి మలుపు శరీరంలో అణువణువున న్యూటా న్ల పరిక్రమణం వలె మనసులో లిప్త లిప్త జీవన రహశ్చిత్ర చలనం నీరు నిప్పూ గాలీ ధూళీ పామూ పక్షీ పశువూ మనిషీ అంతటా ఏకోన్ముఖమై ఆత్మశక్తి నిండిన తేజం కాలం సాగిన మొదటి బిందువు ఊహ మొదలైన తొలి రూపం నా వెనకే నిలిచి ఉంది స్థిరంగా నాలోనే దాగి ఉంది బలంగా నేను నిల్చిన చోటు నుండి దూసుకుపోతున్నాయి రేఖలు అణువణువునూ ఉత్తరిస్తూ అంతలో పొందుతున్నాయి రూపాలు. ఇక్కడి వస్తు రూపం ఆత్మకు బహు సన్నిహితం ఇక్కడి సౌందర్య శక్తి శిల్పం ఒదిగిన అనుభవం ఈ వలయంలోకి ప్రవేశిస్తూనే ఆనందం నదిస్తుంది అమృత లోకం జనిస్తుంది, దివ్య శక్తి బ్రతుకు నావహిస్తుంది ఈ క్షేత్రంలో వచ్చే మలుపుల్లో నాలో క్షణం క్షణం మార్పు అణువణువున సాగే అన్వేషణం అన్వేషణలో అనుభవ తేజం కాలం అంచుల్లో నిదురలో అలికిడి లేని స్థితికీ జడంలో ప్రాణం లేని స్థితికీ భేదం అవగతమౌతుంది గ్రహాలన్నిటినీ నియమించే సూత్ర గ్రంథి విశ్వంలో ప్రకృతినీ మనిషినీ బంధించే సూత్రశక్తి మనసులో ; అహంకార సంవృతమై రాగ భోగ రూషితమై బరితెగిన నీడల వలె ఇక్కడ ఈహలు రూపొందవు
6. మిగిలింది దివ్య బింబం శ్రవణ సుభగంగా వినవచ్చే సంగీత ధునీ గతికి సంతోష తుషారంతో ఆశలు కళకళలాడుతున్నాయి దాగిన రహస్యాల్ని వినిపిస్తున్నాయి దశ దిశలూ
ఒక నాటి కంత మవని కథ స్పష్టంగా వినిపిస్తూంది ఇక్కడ కంటికి కన్పించదు దేవుళ్ళ పూజారుల లోకం అనుభవం జ్వాలగా మారి మరో లోకం వెలుగుతూంది వాక్కులో రాగ రసం ఒలికి ఆత్మలో ఆనందం చిలికి బ్రతుకు నావహించి నిలిచింది మొదటి కిరణ దివ్య శక్తి! ఎంత లోతుల్లో నుండో వెలుగు చిమ్ముకొని వచ్చింది ఈ వెలుగు ప్రవాహానికి చీకటి ఎపుడో కొట్టుకపోయింది మనస్సు పరుగిడుతూంది సూర్యుని చుట్టూ భూమివలె తమస్సు వెనుకబడుతూంది దీపం వెనక నీడ వలె ఎక్కడెక్కడి నుండో మబ్బు మూక క్రమ్ముతూంది అంతలో పిడుగు శబ్దం వినిపిస్తూంది మెరపు రూపం కనిపిస్తూంది ఆకాశం నీలి మబ్బు రెక్కలతో దిక్కులు పరచుకొంది ఎదకు చల్లని గాలితో భూమిపై గొడుగు వలె ఉంది ఆగని ప్రయాణంలో ఎప్పటికపుడు కొత్త అనుభవంతో వినని సంగీతం వినిపిస్తూంది చూడని దృశ్యం కనిపిస్తూంది ఇక్కడ జడంలో శబ్దముంది శూన్యంలో శక్తి ఉంది మృత్యువు నుండి చేతనతో కదలే సంస్థితి ఉంది వెలుగు ఉంది ఆగనిదీ పరిమళ ముంది దాగని దీ హృదయ ముంది ఊదుతూ మౌన శంఖం అవిరళంగా నిల్చేందుకూ పెరిగేందుకూ పోటీ పడే స్వర్గ నరకాల రూపు మాపే సవితృ రూపం ఉంది ఒకే ఆత్మతేజం! అనుభవ పరమార్థంతో బ్రతుకు వెలుగుతూంది వెలుగు మొగలి పట్టలతో మనస్సు చుట్టుకుంది ఆవలి గట్టున నిలిచిన రాత్రి నిలువునా కరిగిపోతూంది అమృత లిప్తల మెట్లపై మిగిలిం దొకే దివ్య బింబం!
3. ఆనంద ధుని ఈ క్షణం మేల్కొంది కాంతి బిందువై తమో రాశిని కరగిస్తూ రేఖలుగా సాగింది కల్పన వాస్తవమైంది స్థావరం జంగమమైంది. శూన్యం సంభృతమైంది కాలం తెలివి పొందింది ఇంతవరకూ అననుభూత మనోజ్ఞ రూపం హిరణ్య గర్భం నుండి ఓంకారం వలె ఆవిర్భూతమైంది
ఈ క్షణం ఆత్మకు ఆనందాకృతి నిస్తోంది సూర్య కిరణ పంక్తుల్లో ప్రకాశమాన కళ వలె లౌకిక వనమంతా ఇప్పుడు కొత్త తెలివి చివురించింది అలలో కనిపించే కదలికతో కలలో దాగిన వాస్తవంతో చంద్ర కళ స్పురిస్తోంది, ఇదే శిరోలంకారమో? మాయ కాదు, మృగ తృష్ణ కాదీ స్థితి స్పష్టమైన అనుభవ దర్పణంలో ఆత్మను బింబించే క్షణం చీకటి కలసి పోతూంది వెలుగులో తహతహతో రూపు మాపుకొనే ఆశతో, అగ్ని గుర్తిస్తుంది తెలివిగా క్షణాలు గడుస్తున్నాయి బరువును మోసుకొనీ రెక్కలు సాచి నింగిలో కదలి పోయే మబ్బుల వలె జీవన చక్ర గతికెగసి ఎగసి క్రమ్మిన ధూళి అణగి మణగిపోయే ఆత్మ తేజం పొందుతూంది నిద్రా గుహ నుండి మనస్సు బయటికి వచ్చింది బ్రతుకు అన్వేషణలో పొందిన అశాంతి వలయం ఎక్కడి దక్కడ చెరగి పోతూందీ కాంతి సమయం
1. పరీమళ వలయం
2. ని ్రణి నిప్పు నుండి వెలుగు వేరయి పోయే లోపల దిక్కుల్ని మలినం చేసే ధూమ వదనం వివర్ణమౌతూంది అహంకారం సముద్రంలో దూకుతూంది మహా భయం గాలిలో కలిసిపోతూంది మొక్కకు వెలుగూ నీరూకావాలి మెలకువకు వివేకం అనుభవం అవసరం. జీవితంలో దశ దశలో తప్పనివై కన్పించే సురాసుర శక్తుల సంఘర్షణ పరిణామం ప్రాణ భయం నుండి తొలగి ఆత్మ బలంతో జీవిత సత్యానికి తీసే మార్గం అవాలి. దివ్యాభిముఖంగా సాగే ఆలోచనా పథంలో
మానసికంగా నిల్చిన సుంర శిల్పాలే దేవతలు ఇక్కడ వివిధ వస్తు విభేదం ఎక్కడుంది? ఆత్మ కళా వైవిధ్యం! ఒకటే ఉంది మౌనానికీ ధ్యానానికి వ్యాఖ్యానంగా ఉందీ స్థితి లౌకిక వాస్తవ కథా మనో దశల్ని దాటిందీ ఈ స్థితి ఎట్లా ఉందంటే బరువు మోసుకపోయే వ్యక్తి మధ్యలో దించుకొని కాస్త విశ్రాంతి పొందుతూన్నట్లుంది ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సరసి లహరీ స్పందనతో ప్రతి క్రియా రూపంలో జలద గమన విలసనంతో ఈ ఉపాధి మనిషికి పరమ యధార్థ భాసురమై ఈ జన్మ ఇక్కడ ఎవరికీ దుఃఖ భూయిష్ఠం కారాదు ఆవాలి ! ఆనంద వలయం చేరేందుకు నిశ్రేణిక కావాలి ! శుభ వాసనా రూపం పొందేందుకవకాశం ప్రకాశమాన ఆలోచనకూ క్రియాత్మక వర్తనకూ మధ్య మంచు తెర వలె సూక్ష్మ స్థితి లోకం చిరంగా
3. వెలుగు స్పృహతో మృత్యు నిరంకుశత్వం నుండి స్వాతంత్ర్యం పొందిందీ గగన రహస్యం బ్రద్ధలై శబ్ధ ధుని ఆవహించింది అడవిలో వాయు భ్రమణం వలె కొండపై నుండి జలధార వలె వెచ్చని మెరపు తలపులతో వార్షిక మృదు భావనతో మనస్సు పొందుతూంది, సుందర ప్రవాహ రూపం ఎదలో సాగిన లత కళ్ళలో పూలు పూచింది పసిడి మొగలి పట్టల వలె ఆశలు విప్పారాయి ఆశ్చర్యంలో తల ఎత్తిన స్వర్గం క్రిందికి దిగి నిలిచింది వెలుగు పొరలు చుట్టుకున్న గాలి అంచుల్లో కదులుతూ మనస్సు పొందుతూంది అవిచ్ఛిన్న సంస్కార గంధం భూమిని గగనమణి వలె ఆకాశాన్ని కాంతి వలె ప్రకృతిలో అనంత శక్తి పరుస వేదికగా స్పృశిస్తోంది వాస్తవమూ ఆదర్శానికీ, శరీరమూ ఆత్మకూ మధ్య ఇంత వరకూ ఎరగని సూక్ష్మ బంధం చేకూరుతోంది జీవన గమన రీతుల్లో హృదయ స్పందన లయతో
శబ్దాన్ని తొలిచి మలచిన రమణీయ రసాకృతి మంత్రాక్షర వదనంతో మనో వలయం దాటుతూంది నిశ్శబ్ద బిందువు వెనక నుండి స్వర తరంగం వినిపిస్తోంది స్వర తరంగ వలయాల్లో సంగీత చిత్రం బింబిస్తోంది శారీరక జగత్తును స్పృశిస్తూ స్వర్లోకం కదలి పోతూంది జననాంతర సౌహృదంతో హృదయాకాశం వెలుగుతూంది శక్తి కళా సౌందర్య కాంతి నాలోకి ప్రవహిస్తూంది ఇక్కడ ఎక్కడా చీకటి ప్రసక్తి లేదు. ఆలోచనా జల తరంగాలపై శ్రేణులుగా
4. ఇక్కడ ఎక్కడా చీకటి లేదు వేసుకొన్న ముసుగులు వదులుతూ తమ రహస్యరూపాలు ఆవేదనా వాయు వీచికలపై గుంపులుగా వేసుకొన్ని ముసుగులు వదలుతూ తమ రహస్య రూపాలు ఇవి విలోల శబ్దాలతో ఆలోల వర్ణాలతో సంస్కార వాసనలతో ఎన్ని సంతతుల నాటివో? మనో గగన తలంపై వెలిగే సూర్య గోళానికీ మెరసే చంద్ర బింబానికి బాగా తెలుసు వీటి స్వరూపం. ఎదలోతులు స్పృశిస్తూ కను చూపులు ఆక్రమిస్తూ వ్యూహాల్ని దూసే శక్తితో ప్రాణాల్ని నిలిపే రక్తితో యుగాల కథా వీచికలపై శ్రేణులుగా రహస్య రేఖలు ఆలోలాసార స్వరాలతో విలోల ప్రసార రాగాలతో జలధారా భావనతో మ్రోగే సంగీత చిత్రమై ఎదలో మృదు ధ్వని ! సరస్సులో చేప ఈత వలె అవనీ ముఖాన తొలకరిలో నవ జీవనం వలె ఆనంద నృత్య కళతో ఆశ్చర్యాన్ని మ్రింగేసింది అర్థ రాత్రం చల్లని గాలుల వలె మనోభూమి నుండి స్మృతులు! వరసగా బయటికి వస్తున్నాయి అట్టడుగున నున్న కవితా నిధులు భౌతిక రూపంలో సాకారం పొదిన ఆత్మ స్మృతుల కదలికతో రసోత్పుల్లమౌతూంది మెట్లు మెట్లుగా మలచుకొని క్రింది నుండి పైపైకి మబ్బు లవతరిస్తున్నాయి, ఎక్కడికీ ప్రయాణం?
అనుభవ సౌకుమార్యంతో ఏ దూర జగత్తులోకి వినయ ధురీణంగా గాలి ప్రక్కలకు ఒదిగి పోతూంది నా ముఖంలో ఉదయం భద్రంగా గూడు కట్టుకుంది శిశువు కళ్ళు తలపిస్తూ నా ముఖంలో వెలుగు విరబూసిన లే తీగెల పాయలుగా సాగేను. భవిష్యత్తు మంచు ముసుగు వదలింది జీవితం మృత్యు రహస్యం వీడింది మనస్సు నృత్యం చేస్తోంది వెలుగై ఊహ కదలుతోంది అగరు ధూపమై ఎక్కడా ఏ ఒక్క బిందువులోనూ చీకటి లేదు దివ్య రాగ స్పర్శతో జీవితం మహితమైనట్లుంది ఆదిత్య వలయం
1. ఊహలో ఉషస్సు సూర్య గోళ హృదయంతో ఇది చావు లేని ప్రపంచం ఎంత కాలం నుండో ఉమ్మభీకృతమైంది మనస్సు కాలానికి దీప్తి నిచ్చే ఆదిత్య మృదు తేజంతో ఈ క్షణం వాగతీత స్థితి విభూతి పొందుతూంది తెర తొలగిన వర్ణ చిత్రం వలె జీవితం ప్రకాశిస్తోంది లౌకిక భావన కరిగింది, పరీమళాంచిత కర్పూరమై వాస్తవ రూపం నిలిచింది, సౌవర్ణ కళా ప్రశస్తమై జడంలో కదలికతో ప్రాణశక్తి కలకంటోంది హృదయంలో రాగంతో శక్తి రేఖ కదలుతూంది ఆకాశాన్ని విచ్చుకొని వస్తుంది, భూమిని దూసుకొని పోతుంది అణువణువున ఒదుగుతుంది, అంభో బిందు లోలమవుతూంది సముద్రంపై ఆర్థంగా వీచే పవమాన పంక్తి వలె ఆలోచన కదులుతూంది, నిబిడంగా అవ్యాహతంగా వెలుగు కళ్ళ నుండి నవ్వు పూలు రాలుతూ ఎత్తిన గగన వదనం వలె ఉంది హృదయం చావును మరచిన మనస్సు శుభ్రంగా చీకటి వదలిన ప్రభాతం వలె ఉంది మట్టిలో ఆడుకునే పిల్లాడికి వీధిలో దొరికిన ఆట వస్తువు వలె
ఈ ఉద్వేజిత క్షణం స్వర్గం కన్నా మహితమైన ఆనందాన్ని కలిగిస్తూంది నిన్నటి వరకు చీకట్లో మిణుగురుల వలె మెరిసిన కళ్ళు ఇపుడు సూర్య చంద్ర బింబాల వలెనున్నాయి ఇపుడు తలలెత్తేవి భగవంతుని ముఖాలే ఇపుడు పూచేవి భగవంతుని ఆలోచనలే వైకుంఠం కైలాసం రెండూ భుజాలపై నిలిచినట్లుంది చైతన్యం ఆవహించింది గంగాఝరీ సదృశంగా ఆకాశాన్ని వంచి భూమిని అణచి నిల్చే శక్తికి సంకేతంగా వర్తమాన శిఖరంపై నిల్చిన నా మతిలో ఉన్న అనంతమైన గతమూ భవిష్యత్తూ ఒకే రూపానికి రెండు ముఖాలుగా వెలసాయి ఈ క్షణం తెరచుకుంది! హిరణ్మయోజ్వల కవాటం హృదయ స్పందన లయతో ఓంకార నాద సుందరంగా ఉషస్సు ఎగసి వాలింది నా ముఖంపై శాశ్వతంగా షట్పదమై ఝంకృతితో తిరుగుతూంది నా ఊహలో చేతులు చాచి ఆహ్వానిస్తూ వాయు మండలం నిలిచింది ముని వ్రేళ్ళపై నిరీక్షిస్తూ సముద్ర వలయం కదలుతూంది తొలకరి వానకు ముందు వీచే చల్లని గాలికి తలెత్తి ఒళ్ళు మరచి ఊగే వనం వలె ఉంది మనస్సు ఎండిన నదిలో ఇసుక వంపుల వలె మలుపు తిరిగి విషాదం వర్ష ధారా జల భరిత నదితో ఒక్క మారు మాయమైంది గమ్యం చేరే తహతహతో మనస్సు హఠాత్తుగా తుపాను గాలి శాంతించిన సముద్రం వలె ఉంది చీకటికి తెలీదు సూర్యుని ప్రకాశ హృదయం గుహలకూ పిచ్చుక గూళ్ళకూ తెలీదు ఆకాశ వైశాల్యం చీకటి నుండి గుహ నుండి బయట పడే మనస్వికి తెలుస్తుంది! అంతో ఇంతో
2. నే నీ క్షణం మేఘ సందేశం జీవన హృదయం వినాలని చెవులు రెక్కించిన దిశలూ సూర్యుని కళ్యాణ రూపం చూడాలని కళ్లు పరచుకొన్న గగనమూ నా ఎదలో అవనతమైనాయి సంక్షిప్త రూపంలో
ఈశ్వర సంకల్పాన్ని దర్శించే మహాశక్తి ప్రకృతి నుండి మనస్సు దాటి ఆత్మ సీమల్ని స్పృశిస్తోంది అమృత ధామం నుండి వచ్చే వసంత కిరణాలకు పునస్సంజీవితమై నా రూపం వెలుగుతూంది స్పష్టి ప్రథమ రూపం వాసనా బీజం నుండి బ్రతుకులోని శిఖర భూత సంస్కార వృక్షం వరకూ ప్రకృతిలోని రూప వికాసం ప్రాణిలోని జీవ స్పందనం దివ్య దశకు చేర్చే జ్ఞానం ఎప్పటికపుడు నవోహతో మనస్సు పరిణత సిద్ధితో పునారూపం పొందుతోంది అస్తమయం ఎరగని ఆదిత్య కిరాణాలు నాలోకి ప్రసరిస్తున్నాయి వైవర్ణ్యం ఎరగని చాంద్రీ రాగం ఒక ప్రక్కగా పరచుకొంది నేనీక్షణం అనేక వాసంత సూర్యుల కళ్యాణ కాంతికి సంకేతం నేనీక్షణం అనేక రస ప్రవాహాల ఆనంద నృత్యానికి అవనీ చక్రం జ్వాలా రూపం ఎక్కడిదీ జ్వాలా రూపం? ఏ దిశ నుండి నాలో కెప్పుడు దయ చేసిందీ? దివ్య వదనం బింబిస్తూంది ప్రతి చుక్కలో పూవులో తరగలో క్షణంలో మేల్కొన్న కళ్ళలో పూచిన గులాబి అంచుల్లో తిరుగుతూ కళ్ళలో ఒదిగిన మెలకువ వెలుగు గట్లపై కదలుతూ ఎక్కడిదీ జ్వాలా రూపం? ఎప్పుడు దయచేసిందీ? ఏ నాడులు సంస్పృశించి సంగీతం ఒలికించాలనో మరోజన్మకై ఏ రూపం తగల బెట్టి బూడిద చేయాలనో చెప్పా పెట్టకుండా దయచేసింది పిలువని అతిథియై తిష్ఠ వేసింది మా ఇంటి వాకిట్లో ఆరుణ సుమ తోరణమైంది మా ఊరి బయట కింశుక సుమవనమైంది నిలుకడగా నిలుస్తుందా? ఎక్కడిదీ జ్వాలా రూపం? ఏ తపస్సులో పుట్టింది? ఏ ఉదయంలో పెరిగింది కణకణం వెలిగించి తేజో జగత్తు నిలుపుతుందా? కణకణం దహించి నవరూపంగా మారుస్తుందా ఎక్కడిదీ జ్వాల రూపం? ఏ దిశ నుండి దయచేసింది? ఏనాడో అరణి నుండి ఉద్భవించిన అగ్ని ఈ రహస్య రూపం ధరించిందా? నవ నాడుల తీగెల్లో ప్రవహించే విద్యుత్తు ఈ ప్రకాశ రూపం పొందిందా? తర తరాలు క్రమించి వచ్చి ఇపుడు నన్ను చేరిందా?
యుగయుగాలుగా గమించి ఇలాగే మునుముందూ పోయేనా? ఎక్కడిదీ జ్వాలా రూపం? ఎక్కడిదీ కానే కాదు ఎంతో పరిచయ మున్నట్లుంది, అంతలో కొత్త దనం వహిస్తుంది ఏ దిశ నుండీ రాలేదీ జ్వాలా రూపం నా నుండే ప్రతి దిశకూ ప్రసరించింది చీకటీ వెన్నెల వెలుగూ ఏ భేదం లేకుండా దిశ దిశ నుండీ నాలోనే సరిస్తుంది, చరిస్తుంది ఆత్మలో నిహితమైన తేజః ప్రభావం మనిషిలో వాంఛా బీజం తొడిగిన పల్లవరాగం మనసులో అహం వృక్షం వేసిన సంతానఫలం అణీయం నుండి మహీయం వరకూ అందరిలో ఉంది సముద్రంలో బడబాగ్ని వలె గుప్తంగా అరణిలో అనల తేజం వలె రహస్యంగా ఈ జ్వాలా ప్రకాశంలో ఉదయించిన సంస్కృతి ఈ సంచారంతోనే చీకటి దిబ్బ కావచ్చు ఇది ఎక్కడికీ పోదు గుండె తోపులో ఉంటుంది చెంగున గంతులేస్తుంది హరిణ మృగంవలె ఇది ఎక్కడికీ పోదు మనో వనంలోనే ఉంటుంది జాలు విదల్చి నిలుస్తుంది ప్రభాత సింహం వలె ఈ మనోజ్ఞ జ్వాలా రూపం అఖిల మానవాత్మకు సంకేతం చివరైనా బూదైనా మనిషిలో మనసే కారణం
II. జీవనరేఖలో
4. జీవన బింబం జన జీవన కిర్మీరం నా రూపం నవ మానస నిర్మాణం నా బింబం ప్రకృతిలో భాగమైంది మనిషితో హార్ధమై జీవన రుచితో ఏర్పడింది బలధన శక్తులతో రణ సహ యుక్తలతో పద పద మెదురౌతుంది అనల పాద శిఖలతో అవనిపై ఒకరొకరూ ఒకరు ధూమమై సాగేరు, ఒకరు ఖడ్గమై దూసేరు
దయా రహితంగా తరుమబడేరు, క్రుధా చరణంతో విసరబడేరు గుండెలో గాయం వేదనతో జ్వలిస్తుంది మంటలో రాగం గాథతో స్వనిస్తుంది శుష్కమైన చెట్టూ స్నేహ శూన్య దీపం ఎన్నో జన పాత్రల్ని తలపిస్తాయి జూలు విరిసిన సింహమై భీ తరంగ చలనంతో దూకే హరిణ సమూహమై ఆనంద లహరితో నిరాశలో ఆశతో మనిషిలో క్రోధ సింధువు! చరిత్రకు నిలయం జీవితంలో ఆశతో ఉదయ సంధ్యాస్ఫూర్తితో పక్షి నింగిలో ఎగసేను మనిషి వీధి లోకి కదలేను మనిషితో మనిషి కలిసి రాగంతో బంధంతో కాలానికి గతి నిచ్చేరు ఏ నీడలో కొమ్మ విరిగి పై బడుతుందనో ఏ వేళలో నింగి ఒరిగి అణచేస్తుందనో భయం లేకపోలేదు ఉదయం అలలై కదలి రాత్రికి ఎండిన ఆకులై మరలేరు ప్రాణం నిల్చేందుకూ జీవితం వెలిగేందుకూ శ్రమ ఫలం పొందేందుకూ కణ కణంలో శక్తి అవసరం; ఆజీవన యంత్రం ఈ భౌతిక బింబం దప్పిక వస్తే కంట్లో నీరు ఉంది ఆకలి వేస్తే లోలోన బాధ ఉంది అనుభవ శిఖరాలపై తగిలిన గాయాలు వీరికి దీప శిఖలై దారి చూపేను శిశిర ముఖంతో గుడిసె శీర్ణమైన కల వలె ఉంది వంగిన భుజాలతో వృద్ధును తలపిస్తూంది (2) ఊగే పంజరంలో కదులుతూ పక్షులు స్వేచ్ఛా భ్రాంతిని పొందేను విడిపించబోతే పెద్దగా అరుస్తాయి! అలవాటుగా చువ్వల్ని పట్టుకుంటాయి కళ్ళలో భయ రేఖలతో! తలుపు తెరచినా బయటికి రావు రెక్కల్లేని పక్షులైన మనుషులకున్న బంధన వలయం ఒక పంజరమే కాళ్ళకే కాదు మనస్సుకూ మట్టితో సంబంధ ముంది చేతులకే కాదు మనస్సుకూ పనితో సంబంధ ముంది కాలం విసరే దెబ్బలకు పడిలేస్తూ సంఘం నిలిపే చోట అడుగులేస్తూ ప్రతి మతిలో హామ్లెట్ ఊహా సంకోచం! ప్రతి హృదిలో ఒథెల్లో మూడోద్రేకం ఉదయ సూర్య కిరణం గుడిసె ముంగిట్లో వేచి ఉంటుంది లోపలి నుండి మనిషికై, అతని కళ్ళలో చీకటి లోతు కనుగొనాలనీ! గుహకు గూడుకూ విశాల దిశ చూపిస్తూ శిల నుండి కల నుండి హేతు రశ్మికదలుతుంది ఎప్పటికీ మిగిలే ఉంటుంది పయనంలో విజ్ఞాన సోపాన క్రమం సంస్కృతీ ప్రస్థానంలో అరణ్యం ప్రకృతి బంధమైతే నగరం ఆలోచనా యంత్రం
సంస్కృతిలో గర్వించే శిఖరాలు సామాన్యుని బ్రతుకులో ఆటంకాలవుతాయి దారులు మలపుల్లో గోడలు అమాయకంగా ప్రయాణ దిశను మారుస్తాయి శూన్యమైన కాలాన్ని చిత్రమయం చేసే తప్తమైన గుండెల్ని రాగ మయం చేసే అనుభవం ఎవరి సొత్తూ కాదు, ఆలోచన ఎవరి ఆస్తీ కాదు! గుడిసె నుండి మేడ వరకొకే ఆశా పథం; బిక్షుక గణంతో ఒకరు అన్నంతో తృప్తి పడితే మరొకరు స్వర్ణంతో తూగేరు గాయ పడిన గుండెపై అరచేయితో నాల్క తెగిన గంట వలె ముఖంతో నీడల్నీ మనుషుల్నీ గుర్తించే భేదం చెదరీ, సమయం ఎదురౌతుంది! నాగరక దశ దశలో నిలిచిపోయిన జీవితా లెదురౌతాయి గాలి కదులుతూంది పాటలతో మంటలతో పరివర్తన చేతనతో పై నుండి ఏ దేవత పూనకం లేదు, వెనుక నుండి తాళ్ళు లాగడం లేదు. ఉరుముల వంటి ఆవేశం లేదు; మెరుపులతో బ్రెయిన్ వాష్ లేదు ఉందొకటే! మానవ స్పందనతో మానవతా గంధంతో సంస్కృతి! బూది అయిన క్షణాల నుండి కూడా మొగ్గనూ పండునూ కోరుతుంది ఈ గుడిసె ఎదగని ఆలోచన వలె ఉంది! మేల్కొనే శక్తిలేని కొండవలె ఉంది ఒక దోసెడు చల్లని నీరు కోసం ముఖం తపిస్తుంది ఒక్క మంచు అద్దిన ఉదయ కిరణం మాత్రం కరుణతో సరిస్తుంది ముఖాలపై నీడను తొలగించే ప్రయత్నం చేస్తుంది ఎతె న మేడల బుజాలపై నుండి శిరస్సుపై నుండి దూకుతుంది ఎండకు మాడి పోని చల్లని ముఖంతో మనుషులెదురౌతారు వేడికి కాలిపోని పచ్చని గుండెతో బ్రతుకులెదురౌతాయి శ్రమ జీవన చలనంతో వర్తమాన చరిత్ర! నడుస్తూంది కళ్ళలో మేఘంతో గుండెలో అగ్నితో మనిషి శక్తి బింబిస్తూంది గుడిసె నుండి నీడలు బయటి కొచ్చీ, వెలుగులో ఒకటైనడుస్తున్నాయి నిరంకుశుల నిశాగతుల్ని మాపే కిరణశక్తి వహిస్తున్నాయి ఇపుడు మేల్కొన్న ప్రజాశక్తి వర్గ రహిత కిర్మీర రూపం ఉదార లక్ష్యంతో కదలే ప్రజా స్వామ్య శక్తికి నిలయం అశాంతి హృదికి తావు లేకుండా శాంతిని వెల కమ్మేవారెవరు? అరణ్య మతికి వీల్లేకుండా కోర్కెల్ని కొలిచీ ఇచ్చే వారెవరు? గుడిసె ముఖం అదే! ముఖంలో నిశ్శబ్దం తొలగింది మనిషి ముఖం అదే! ముఖంలో ఆకాశం వెలిగింది అమ్మకానికి సిద్ధ:గా దీని చుట్టూ ఎంతో కథ ఉంది నిజమే అమ్మకానికి రాకుండా దీని చుట్టూ ఎంతో వ్యథ ఉందీ నిజమే
మనం బ్రతికేది ఎవరి మెప్పు కోసమో కాదు మనం నిలిచింది ఎవరి భూమిపైనో కానే కాదు దేన్ని వదలినా మరచినా దీన్ని వదలలేం, మరవలేం మనిషిలో అంగారం ఆనందం ఎన్నిటినో స్వంతం చేసుకోజూస్తాయి (2) రోజూ, కన్నీటితో తడిసిన చెక్కిళ్ళతో అగ్ని తప్త హృదయంతో భయాన్ని కప్పుకొనీ పగలు కన్నా రాత్రి నయ మనిపిస్తుంది శూన్య హృదయంతో ఆలయానికి కదలి, సూర్య కాంతితో వెలిగి పోవాలనే కోరిక నిప్పు కణాలతో అలంకరించిన మనస్సు పుష్పమయం కావాలనేకోరిక గుండెలో మేల్కొనే గాయాల్ని రాత్రి మరపిస్తుంది దాచేస్తుంది నిద్ర నుండి లేచే సరికి ఉదయం మళ్ళీ రణ చరణంతో సిద్ధమవుతుంది నిజం అగ్ని అయితే కానీ! పెదవులపై గుండెలో చల్లగా సరించనీ కళ్ళలో కిరణమై, ఆత్మలో వివేకమై మనిషిని చేతులపై కెత్తనీ కర్మసాక్షి కన్పిస్తేనేం? కిరణ పంక్తి ప్రసరిస్తేనేం? గుడిసె రూపం మారందీ! ఈ నిద్రా జగం వీడందీ! హిమ శిలవలె నున్న గుడిసె చుట్టూ ఉదయ కిరణం తిరిగి పోతుంది శ్రమ శిఖ వలె నున్న మనిషి వెనుక ఉదయ కిరణం కదలి పోతుంది శ్రమ శిఖల కృషి ఫలం ముక్కలై జంతువుల కాహారం కారాదు ప్రజాస్వామ్య స్నేహంతో శ్రమ శిఖలు వెలుగు తోరణం అవాలి వ్యక్తిలో చారిత్రక శక్తితో సమాజం కిర్మీర తేజమై కదలుతూంది స్వేచ్ఛలో శ్రమ శిఖలు యుగాల సంకెళ్ళను వదిలేసాయి గూడులో పక్షి గుడిసెలో మనిషి ఇరువురి స్థితు లొకటే నిరంతరం వర్తన పరివర్తనతో జీవితం ఎద కంటికి కిర్మీరం బిందువు బిందువులో బింబం, బింబ గణంతో సమాజం కళ్ళలో బింబించేది వేరు, మనసులో కనిపించేది వేరు స్వేచ్ఛా చరిత్రలో సమాజ జీవితం వేగాన్ని అందుకుంటూంది నిరాశను ఆకాశంలోకి విసరుతూ సమతను పృధ్వీ హృదయం పై నిలుపుతూ ఈ సమయం జన శక్తికి నవం నవ చేతనతో పురోగమన మవసరం సంస్కార గంధాన్ని మోసుకొనీ గాలులు వీస్తాయి వర్ణ చిత్రాలు నింపుకొనీ కాంతులు ప్రసరిస్తాయి, అయినా ఎక్కడి కక్కడ క్షామ రేఖపై గుడిసె బ్రతుకులో నిలువెత్తూ శిశిరమే
నింగికీ నేలకూ ప్రకృతికీ మనిషికీ తప్పని అనుబంధం జలదం మానస భౌతిక స్థాయిలో నవ జీవన దర్శన చిహ్నం, ఎక్కడుంది ? గుడిసెలో నిశ ఏ రోజూ ఆర్తి చిత్రాన్ని స్వప్నిస్తుంది గుడిసె ముగింట ఏ వేళ క్షామ ఖండం దర్శనమిస్తుంది. వేడి గాలిలో హిమ శకలమై చల్ల గాలిలో అనల కణమై సమాజం నుండి శక్తి పొంది వ్యక్తి తిరిగి సమాజానికే ఇచ్చేను రోజూ సూర్యుడు తమ కోసమే ఉదయిస్తాడని విశ్వాసమున్నా మబ్బు మాయం చేయొచ్చు! అగ్ని వలయం చూడనీయక పోవచ్చు వర్గం ప్రతి వర్గం శక్తీ ప్రతి శక్తీ క్రియ ప్రతి క్రియతో జీవిత సంఘర్ణతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూచే సమయ మెక్కడిది? ఎండిన ఆకుల వలె ఊహలతో మూసిన దారుల్లో కోర్కెలతో అపరిష్కృత సమస్యకు దీన రూపమై, శిథిల భావ వ్యవస్థకు చిహ్నమై బక్క చిక్కి బయట పడిన ఎముకలతో గుడిసె గూడు వలె ఉంది స్వార్థం శ్రేయం అసహనం మానవత దేని కది ప్రత్యేకంగా మనస్సు అరల్లో భద్రంగా ఉంటాయి, ఏ అవసరానికో పైకి లేస్తాయి గుడిసె! అదే! దీన జనం బ్రతుకు అదే! మనిషిలో స్వార్థం ఇప్పటిదా? రాత్రి నిలిచిన కథలో పాత్రల్ని ఉదయం అవలీలగా అందుకుంటుంది మనిషిలో జంతువు ఆట నేర్చీ పాట నేర్చీ రంగం పైకి వస్తుంది మనసులో ఆడే జంతువు రాగం పెంచినట్లే ప్రాణం తీసేస్తుంది. నిన్న మలిపిన దీపాన్ని నేటి నిశ వెలిగించి గడపక తప్పదు అగ్ని జ్వలించే ముఖాలతో ఇక్కడ ఎవరికీ వారే అతిథి స్వరూపులు ఎవరికీ దారి తప్పే భయం లేదు! మరో దారి ఉంటేగా! యుగ యుగాల ప్రయాణంలో సమస్య నుండి సమస్యకు కదలుతూ గతాన్ని కన్నీళ్ళతో తుడిచేస్తూ మరపిస్తూ పోవాలనే! శిలపై ప్రవాహమై సరించాలనే! నిశ నుండి ప్రభాతమై రావాలనే ఆశ సహజం! తరం నుండి మరో తరం! పయనం! సాధనం వేరు మలుపు మార్గాని కంతం కాదు, పగలు వెలుక్కి సమాప్తి కాదు రాత్రిని చూడకుండా రోజుకు సంపూర్ణత లేదు! మనిషిలో సరేసరి! కిర్మీరంలో ప్రతి వర్ణంతో బింబానికి కళ సిద్ధిస్తుంది సమాజంలో ప్రతి వర్గప్రమేయం జీవితానికి రూప మేర్పడుతుంది (4) దిక్కుల్లో నుండి ప్రేయో మేఘాల్నీ కొండలపై నుండి శ్రేయో సూర్యుణ్ణి ఎడారిలో ప్రవాహాన్నీ మనస్సులో ప్రకాశాన్నీ మనిషి కోరేను
శాంతి సుఖద భావనలో అన్నీ సహజం! జీవనసాధనలో సంశయ గ్రస్తం ఎపుడో వదలి పోయిన మేఘం స్వేచ్ఛాకృతితో రస సేచనతో తిరిగి వస్తుంది కృషి కారులు పాదాలకు వరించిన సంకెళ్ళను మేఘ గర్జా ధ్వని తొలగిస్తుంది సూర్యుడు వెనక్కి పోడు! ప్రయాణం నిలిచి పోదు మనిషి ఆగిపోడు! సమాజం విస్మృతం కాదు ప్రేమతో పాటు హింసనూ తలపించే చరిత్రలో పుష్పంతో పాటు బులెట్ కూడ శరీరాన్ని అలంకరిస్తూంది జ ఉదయం వస్తుంది మనలో మంచును తొలగించే వెచ్చని మృదు స్పర్శతో పేవ్మెంట్ అంచు నుండి యూనిఫార్్మ తరంగాలతో పిల్లల్ని టీచర్, పడవై టా ఫిక్ సముద్రాన్ని నిర్భయ సుందరంగా దాటిస్తూంది దిక్కుల కళ్ళు తెరిపిస్తూ పరుగెత్తే వాహనాలు లేత మనస్సులపై వేగాన్ని వదలుతున్నాయి; సె ర్యాన్ని నిలుపుతున్నాయి ఈ సమయం రోడ్ను క్రాస్ చేయడమంటే ఒకే రన్తో వన్డే మాచ్ను గెల్వడం! అన్నమాటే బస్ కోసం ఎదురు చూచే పిల్లల కళ్ళలో చాక్లెట్ రెపరెప లాడుతూంది లోనివి బైటికి రాకుండా ఏ గోడ లేదు ఆఖరికి మెష్ కూడ లేదు పిల్లల్లో ప్రాణ భీతి కొసదేరుతూంది పెద్దల్లో వేగ దీప్తి కొడి వేస్తూంది భయం చరణాలకు బ్రేక్ వేసి మృత్యువు అంచుల్లో నిలుపుతుంది సిటీలో ఈ ఉదయం! పిల్లలు హృదయంలో వీడని జీవన కిర్మీరం పేవ్మెంట్పై కార్నర్లో సూర్యునితో పాటు రోజూ చాలీ చాలని కటీపీస్ బ్రతుకులూ తమ పని చేసుక పోయేను గుప్త రౌద్ర ముఖాలతో మౌన నిధులు, కొందరు వీధిలో విస్ఫోటనా యంత్రాలై, ఆందోళనకు తంత్రులై కదిలేరు మారే ప్రకృతీ సమాజంలో బాధలో విషాదంలో ప్రేమలో సంతోషంలో కాలాన్ని మరచి కొందరు బ్రతుకును తూచేరు కాలాన్ని గెలిచి కొందరు పైపై వెలగ జూచేరు మనస్సులో కదలే కోర్కెలపై పేపర్ వెయిట్ వలె సూపర్ ఈగో చీకటిని మరచి పోతుంది! కాంతి శిఖరాన్నే చూస్తుంది రాత్రి గస్తీలో జవాన్ రౌండ్లో లాఠీతో నేలను శబ్దిస్తూ పోయేను పట్టుబడ్డ మనిషి కళ్ళలో కర్మ సాక్షి చూపులు కదులుతున్నాయి నిజాన్ని ఎవరు బుజాలపై మోసుకొని ముందుకు తెస్తారు? గతాన్ని ఆయుధం చివర నిలుపుకొని ఎవరు ముందుకు తీసుకొస్తారు నేలపై చిందిన రక్త బిందువులో మానవ చరిత్రను కాల్చే అగ్ని ఉంది
కాలం నడుస్తూంది నాలోకి పారాణి అడుగులతో కాలం నిష్క్రమిస్తూంది నా నుండి గాయాల శరీరంతో నగరం శబ్ద ధునితో మౌన మెరుగని కవిత్వం వలె ఉంది శబ్దం ఆకాశం వైపు పరుగెత్తితే, అర్థం మనస్సులోకి దూకుతూంది మనిషి భౌతికమైన పొరలతో బ్రతికేను మనసు లోపొరల్లో అరలతో నిలిచేను రాలిన మంచుకు తడిసి పలకని తంత్రి జారిన ఉష్ణ బాష్ప కణంతో స్వనిస్తుంది వాయు శక్తి లేంది మ్రోగని వంశి మనోవేదనతో నినదిస్తుంది గుడిసెలో శిశిర దృశ్యం వెనుక నుండి సన్నని బాధా స్వరంలో ఎదకు తప్ప చెవికి వినిపించని వెచ్చని వేదనా సంగీత ముంది (5) తీరని ఆకలితో అగ్నియై ఆరని దప్పికతో శిఖయై కదలే జీవితం ఏ ఆశా ఫలానికో శమిస్తుంది? ఏ కీర్తి ధారకో అణగుతుంది మండే అరణ్యంలో గుండెపై గన్తో మనిషికెదురుగా మనిషితో శాంతి టైటిల్తో పెయింటింగ్ గదిలో గోడకు వ్రేలాడుతూంది ఏ రోజు పేజీ ఆ రోజుతో తొలగి పోతుంది ఏ రాత్రి దీపమా రాత్రితో తొలగిపోతుంది ఇప్పటి చరిత్ర ఎప్పటికో ముఖాన రంగు చల్లుతుంది ఎప్పటి చరిత్రో ఇప్పుడు గుండెపై ఏమైనా అవుతుంది ఏ మనిషిని చూచినా శిశిరంలో చెట్టు వలె ఆకు రాలే భయం జీవితంలో పోగొట్టుకుందే ముందుగా ఊహకు వస్తుంది ఎదురుపడే ముఖానికీ ముఖానికీ మధ్య ఆకాశం ఎదురౌతుంది దీన్ని తన వశం చేసుకోగలిగిం దొక్క ఆత్మ విహంగమే ఎదురుపడే ఆలోచనకూ ఆలోచనకూ మద్య సముద్రముంటుంది దీన్ని అవలీలగా దాటగలిగే దొక్క ఆత్మ నౌకే కదలి పోయే ప్రజాచరణ పంక్తులతో ముద్రలతో గుడిసెనూ మేడనూ ఓ కాలి దారి కలుపుతుంది విస్మరించిన శిలా క్షణాల్ని, పయనం చెక్కుతుంది నిద్రపోయిన నిప్పు కణాల్ని పవనం ఊదుతుంది వీధిలో ఒక ప్రక్క ఊదే నాగస్వరానికి లేవ లేక లేచి తలెత్తే పామును పాముల వాడు ఆటకై కట్టెతో కదుపుతున్నాడు మనిషి జీవిత మెన్నో శక్తుల సమూహం,
స్వేచ్ఛలో సృజన రూపం వహిస్తుంది జీవిత యాత్రలో! అనుకోకుండా సమయం సింహమై దూకొచ్చు, బాంబై ప్రేలొచ్చు రక్త చిత్ర మెదురైనా, భగ్న దృశ్యం కన్పించినా భవిష్యత్తుపై ఆశ మనిషిలో కిర్మీరమై ఆకర్షిస్తుంది మనిషిలో మానవత పుష్పమై కిరణమై శాంతి చరణంతో హద్దు లేని ఆకాశం క్రింద అవనిపై సీమలు చెరిపేస్తుంది వ్యక్తిలో దివ్య కిరణం వెలుగు కళతో ఉద్గమిస్తుంది సామాజిక చేతనతో జీవితం కిర్మీర బింబ మవుతుంది
5. లలిత కవితలు ఉదయ చరణ మంజుల నిస్వానం నా ఎద మ్రోగెను లలిత పవన సంచలిత నవాబ్దం నా ఎద సాగెను ఈ సమయం నా చరిత్ర చూపుల్లో నవ విజయం ఉదయ వదన మందార శ్రీధుని నా ఎద నిండెను తరుణ తరణి చుంబితమై ఆశలు నా ఎద పండెను ఈ సమయం నా ధరిత్రి ఊహల్లో విజయ తరం నా గతిలో గంగా గోదావరి పరుగులు తీసెను నా తలపై హిమ శిఖరం శాంతి కపోతం రువ్వెను ఈ సమయం నా ధరిత్రి చరిత్రలో జయ నృత్యం ఉదయ చరణ మంజుల నిర్వాణం నా ఎద మ్రోగెను
1. ఉదయ నృత్యం తరం తరం నవ తరం నవ మానవ జయ యుగం అవనిపై సమ బావం వికసించే తరుణ తరం తర తరం నవ తరం నవ మానవ జయ యుగం బ్రతుకు సుమం మధు పెరిగిన భ్రమర గణం ఉదయ తరం పాల తలం గగన సమం వెలిగే విజయ తరం మత ఝంఝను మతి పవనం ఎరగని వెలుగు తరం తరం తరం నవ తరం నవమానవ జయ యుగం అవని తలం పద పదం అమృత శిఖలు వెలిగించే
గగన పదం క్షణ క్షణం అరుణ దిశలు వికసించే నవ తరం నవ మానవ జయ యుగం యుగ యుగాల అంధజగం విదలించిన కాంతి గణం పద పదాన ఉదయ ముఖం కుసుమించిన వీర తరం తరం తరం నవ తరం నవ మానవ జయ యుగం
2. తరం తరం
3. జయ పతాక జయ పతాక ! జయ పతాక ! జయ జయ జయ ! జయపతాక ఎద నిండుగా కనువిందుగా కదలి యాడే జయ పతాక ఆ నభోవీధి దాకా చూపులోనా ఊహలోనా అలలుగా నా జాతి విజయం కదలియాడే జయ పతాక ఉదయంలో నవరాగం శాంతిలో ఆనందం పైరులో సౌభాగ్యం ప్రతిఫలించే జయ పతాక నవ్వుతూ వచ్చేను ఉదయం ఆర్తితో కదలేను శిశిరం
4. సంగీతమే సంగీతం పాటతో కన్నీటితో సాగిపోయే మంచులో, సంగీతమే సంగీతం పైన గాలికి ముక్కలై తిరిగి కలిసే మబ్బులో నవ్వు పువ్వులు రువ్వుతూ కదలు వర్షా పదంలో, సంగీతమే సంగీతం పూల తరగల వాలుతో అలల నురగల జాలుతో పైని మబ్బుల నీడతో కింద కదలే ఝరుల్లో, సంగీతమే సంగీతం శిశువు ఎదలో సరించే కొత్త నెత్తురు వాకలో బ్రతుకు దిశలో దివ్వెయై వెలుగు వెలిగే ప్రాణిలో, సంగీతమే సంగీతం శయ్యపై నలిగి వాడిన పూలు చూచే వేళలో మనసులో ముర్మురించే స్మృతుల పరిమళ లహరిలో సంగీతమే సంగీతం నిశా రూపం మాపుతూ వెలుగు రెక్కల ఊపుతో సాగు ఆశా కపోతీ యాన సుందర దీప్తిలో, సంగీతమే సంగీతం ఎద విదల్చీ మతి చిగిర్చీ కదలు వర్షా పదంలో లోన వేదన బింబమై వెలుగు స్పందన రేఖలో, సంగీతమే సంగీతం
5. తెలుపు అంతట తెలుపు అంతట! తెలుపు తెలుపు! వెలుగు లిప్తలు కదలి నపుడ తెలుపు ఎదలో తెలుపు తెలుపు! అమృత లిప్తలు వెలిగినపుడు ఉదయ సంధ్యా గతుల్లో ఎరుపు విరిగిన తెలుపు! తెలుపు! రాత్రి జారిన నవ్వులో నలుపు విరిగిన తెలుపు తెలుపు! కడలి తరగల అంచులో భీతి నణచే తెలుపు తెలుపు అవని హృదయం పొరల్లో జీవ మొసగే తెలుపు తెలుపు తెలుపు దిశలో తెలివి తెలుపు! వెలుగు లిప్తలు విరిసినపుడు తెలుపు ఎదలో తెలివి తెలుపు! అమృత లిప్తలు కురిసినపుడు తెలుపు అంతట ! తెలుపు తెలుపు! వెలుగు లిప్లులు కదలినపుడు తెలుపు అంతట! తెలుపు తెలుపు! అమృత లిప్తలు వెలిగినపుడు లేదు నాకు జ్ఞాపకం మనం రాత్రి కలవడం పరిమళాల దారిలో ఝంకృతితో సాగడం లేదు నాకు జ్ఞాపకం మనం రాత్రి మరలడం లేదునాకు జ్ఞాపకం శశి ఎప్పుడు మలిగిందీ లేదు నాకు జ్ఞాపకం రవి ఎప్పుడు వెలిగిందీ
6. లేదు నాకు జా పకం రా! రమ్మ రమ్ము ఈ క్షణం! రా! రమ్మురమ్ము ఈ క్షణం కడలి కెరటం ఊపుతో వెలుగు చరణం ఊహతో రా రమ్ము రమ్ము ఈ క్షణం! రా! రమ్ము రమ్ము ఈ క్షణం రాగ పద్మం విరియగా మానవీయం వెలగగా
7. ఈ క్షణం బాధ ముడిచిన పొట్లమై గుండె అంచుల నిల్వగా మొగలి రేకుల అంచులో ఒదిగి పోయే లహరియై ఆకు రాలిన జాడలో మొగ్గవేసిన నవ్వుతో రా! రమ్ము రమ్ము ఈ క్షణం ! రా రమ్ము రమ్ము ఈ క్షణం!
8. ఓ మహాత్మా తర తరాల నిశల బరువుతో అణగిన ఈ రూపం యుగ యుగాల పద ఘట్టనలో నలిగిన ఈ దేశం ఓ మహాత్మ! నీ కరుణకు ఎదురు చూచు! ప్రతి అణువు ప్రది హృదిలో మానవ సమతా యుగ మవతరించె ప్రతి గతిలో నూతన జన రూపం కదలి వచ్చె ఓ మహాత్మ! నీ కరుణకు ఎదురు చూచు! ప్రతి అణువు ఉదయం ఎరగని మానవ హృదయంలో రవి బింబం సహనం శాంతి అహింసా ఫలమే ఈ స్వాతంత్య్రం ఓ మహాత్మ! నీ కరుణకు ఎదురు చూచు! ప్రతి అణువు నిశనే ఎరిగిన జీవిత వలయంలో పథ మంతా ప్రతి అణువూ వెలుగ సాగె! ఓ మహాత్మ నీ గతిలో నిదురే ఒక భోగంగా గడిపే ఈ నేలపైన ప్రతి అణువూ నడవ సాగె! ఓ మహాత్మ నీ వడిలో జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ హిమ శిఖరం నీ హాసం! మా తలపై చంద్రరేఖ! గంగా ఝరి నీ చరణం! అణువణువూ అర్ధమయం జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ! మలయ పవన వీచీ తతి మాపై నీ కరాంచలం ఈ శతాబ్ది నీ చరిత్ర మా బ్రతుకుల ఉదయ ఫలం జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ! ప్రతి నిశ నీ చరణంపై వాలనిదే సాగిపోదు ప్రతి ఉదయంలో నీ పద చిహ్నం మా కాదర్శం జనతా హృదయాశయ నవ విజయ తరణి! ఓ మహాత్మ! జనతా హృదయాశయ నవ యుగ చేతన! ఓ మహాత్మ! ఇది గ్రీష్మం! ఇది గ్రీష్మం! అణువణువున అనల కణం ఇది వర్షా చరణం! నవ సృజనకు సంకేతం
9. యుగ చేతన
10. కిర్మీరం ఇది శిశిరం ఇది శిశిరం! చెడు ఊహల పతన భరం మధు సమయం మధు సమయం! జీవన రస చషకం జీవిత చలన తలం! పలు ఋతువుల సంకలనం ప్రతి వర్ణం ప్రసరించే కిర్మీరం ! జీవితం !
11.జయ! జయ! జయ! జయ జయ జయ నిఖిల లోక నీరాజిత దివ్య చరిత జయ జయ జయ విజయచరణ కరుణాకర జనయిత్రి నీ చల్లని చూపులో పరవశించు జగమంతా నీ చూపుల దారిలో కదలి పోవు జగమంతా శుష్కమైన కణ కణం అమృత పదం నీ చరణం తప్తమైన అణువణువూ నవ జలదం నీ రూపం మానవాళి పుణ్య ఫలం అందించిన దివ్య సుమం మా నివాళి ఇదే తల్లి నీ మూర్తికి శుభ సమయం ! ఈ దేశం నా దేశం మన దేశం మధుర భరం ఈ దేశం మన దేశం ప్రియ భారత హృదయ వనం ఒకే గుండె ఒకే ఊహ ఒకే ఒక మతి గతితో జాతి వర్ణ మతం భయం మరపించే రసధునితో శీత నగం కాశ్మీరం అరుణాచల జలధి సీమ జనతా సంస్కార ప్రియం అణువణువూ కాంతి భరం ఎరుపు తెలుపు నలుపు రంగు రంగుల తోరణాలు వెలుగు వెలుగు వెలుగు శాంతి కపోతాలు బారులుగా ఈ దేశం నా దేశం మన దేశం మధుర భరం ఈ దేశం మన దేశం ప్రియ భారత హృదయ వనం
12. ఈ దేశం
6. రేఖా చిత్రాలు లైట్లు హఠాత్తుగా ఆరిపోయాయి గది అంధీ భూతమైంది అరచేతిలో నుండి అంతా జారి పోయినట్లుంది రాత్రి హంతకుని వలె లేచి నట్లుంది ఎక్కడి వారక్కడే నిలిచి పోయారు
1. అరచేతిలో పిల్లలు ఏడుపు లంకించుకున్నారు వృద్ధులు తడుము కొంటున్నారు ఎవరో అగ్గి పుల్ల గీసారు కన్నుల్లో చిందులు తొక్కింది వెలుగు ఎవడో హంతకుడు ముఖం త్రిప్పుకున్నట్లుంది ఎవరో భుజంపై చేయి వేసినట్లుంది ‘ఎక్కడ’ ఇక్కడే ! అంటూ లైట్లు వెలిగాయి వెనక్కు తిరిగి చూచే లోపల అంతా అరచేతిలోకి తిరిగి వచ్చినట్లుంది ప్రక్కనే నా నీడ కనిపెట్టుకొనే ఉంది ! నేనేదో వ్రాసుకునే వేళకు మావాడు 'నాన్నా' అంటూ ఎక్కడి నుండో వెల్లువ వలె వచ్చీ రావడంతోనే చేతిలో నుండి పెన్నులాక్కొని నా చేతిలో పుస్తకం పేజి పై గుండ్రంగా సున్నా చుట్టి మధ్య రెండు చుక్కలు పెట్టాడు పెన్ను లాక్కున్నా మారాం చేసి సాధించాడు సూటిగా బాణం గీసి 'ముక్కు' అని నా వైపు చూచాడు
2. చిత్రానికి విచిత్రం మీసాలో పెదవులో రెండు గీతలు పొడిగిస్తూంటే
చేతిలో పెన్ను లాక్కున్నా, వాడికి కోపం వచ్చింది మళ్ళీ అంతలో ఊడి పడి నా వెనుకనే కుర్చీ చాటు నుండి తొంగి చూస్తూంటే వాడివైపు చూస్తే జాలి వేసి నేనే పెన్ ఇచ్చా పెద్ద సున్న చుట్టి 'బొజ్జ' అని నవ్వడం మొదలు పెట్టాడు నేనెక్కడ పెన్ లాక్కుంటాననో గబగబా కాళ్ళు అని రెండు నిలువు గీతలు గీసి పెన్ నా మీద విసిరేసి పరుగెత్తాడు ఇంతలో మిత్రులొచ్చారు! చిత్ర చూపించా నేనే “వాడి మొగం” అనడం తప్ప అంతా 'బాగుంది' అనే వారే! కొనదేరిన తెలివితో ఇంతకూ తాము సహృదయులన్న విశ్వాసానికి ఏ లోటూ లేనట్లుగా ఉందా వాలకం చూస్తే !
3. జవాబుకై చూడకుండా 'పూలు'! ‘పూలు' అందమా ? గంధమా ? ఏమదీ చెప్పు! వాటి ప్రయోజనం” అంటూ అగ్గిపుల్ల గీసాడు మిత్రుడు ఎదురుగా ఆ వచ్చిన జ్వాలా రూపం అగ్ని పుష్పం! వలె అతని కంటికి చిత్రంగా ఉంది నాలుగు మాటలూ మెరసాయి మంటలో! “పూలు! పూలు! అందమా! గంధమా ఏమదీ !చెప్పు మరోసారి” అంటూ గొణిగే మిత్రుని పెదవుల సందున వెలిగింది సిగరెట్ ! పూల తీగె సాగింది పొగ! మనస్సు మలుపు తిరిగింది పూలపై కసి, ఆపైన పూల గురించి ఆలోచనగా మారింది కాలం కదలింది! ఏ జవాబుకూ ఎదురు చూడకుండా మిత్రునిలో పూల ఆలోచనా పరిమళం వదలీ, ఎవరో తలుపు తడుతున్నారు ఏ చుట్టమో పక్కమో! అవచ్చు ఏ మిత్రమో అర్జంటు పని మీద రావచ్చు మెలకువ వచ్చింది! లేవానుకొనీ బద్దకంగా పక్కకు తిరిగా! నిశ్శబ్దం! అంతలో చప్పుడు
పాపం ఎవరో? అనుకొనీ లేచి తలుపు తెరిచా ఎవరూ లేరు! గాలి ! ఆప్యాయంగా నా చెక్కిళ్ళు స్పృశించింది చేతి వ్రేళ్ళతో కత్తి పదును చూచినట్లు ! అంతా నిశ్శబ్ధం! శూన్యం ! ఎవరో పాపం! ఎంతకూ బదులు పలుకు రాక, అయ్యో! మరలి పోయి ఉంటా రనుకున్నా తెల్లారింది! మేల్కొని లేచి చూస్తే అద్దంలో ముఖంపై అట్టకట్టిన సనసన్నని నెత్రు చారిక ! కాదు! హసన్మందార కుసుమ దళం చీలిక ! సూర్యుని వెలుగులో మెరుస్తూంది ప్రాచీ దిఙ్ముఖంపై కుసుంభారుణ తిలక శోభ నా ముఖ దర్పణంలో బింబిస్తూంది రేకగా
4. బొమ్మా! బొరుసూ బార్లగా తలుపు తెరచి ఉంది రాత్రి వలె తలపు మూసుకుంది చిన్నారి ప్రపంచంతో పొన్నారి ఊహలతో రాత్రీ, పగలూ వీడని గాజు గది, ఆ గదిలో ఒక ప్రపంచం ఎవరో ఒకరు దానిపై రాయి విసరే వారే ఎవరో ఒకరు తొంగి తొంగి చూచే వారే మనిషి భయ పడడం ఉన్నదే! అటు వైపు చూడక పోవడమూ ఉంది
5. మోడల్ గది అద్దాలున్నంత వరకే సీమాంచలం ఈ అద్దాలు తొలగిస్తే మరోసీమాంచలం రాత్రి చీకటిలో చంద్రునివలె ఉదయం మంచులో సూర్యుని వలె గదిలో నేనూ గది బయట సమాజం ఆరాటాలతో పోరాటాలతో అటు పోట్లతో
బయటి నుండి అద్దాలపై ప్రసరిస్తుంది చీకటీ వెలుగు వెన్నెల పరావర్తమై చిత్ర రూపాల్లో కిర్మీరమై ఎప్పటి కపుడు నాకో వ్యక్తిత్వాన్ని ఇస్తాయి
6. వాస్తవానికి బింబం పర్వత పంక్తులూ మైదానాలూ దాటిపోతున్నాయి హయాలు నింగీ నేల కలిసిన చోటికి చేరే ఆ వేగంతో అహరహమూ ఎక్కడి కక్కడ తృప్తి పడుతూ ఎప్పటికపుడు ఆశ వహిస్తూ అహం చావని మమత పోని అలల వలె దూకేను హయాలు రోజు పోయి రోజు వచ్చే మలుపులో కాస్త విశ్రాంతి మంచులో ముక్తా హారాల్లా ఎండలో మోదుగు పూల గుత్తుల్లా అంతలో వల్గత్ తరంగాల్లా గాలి కెదురు తీర్చిన కత్తులై ఒక చోట కాక పోతే మరో చోట ఉచ్ఛావచంగా పయనిస్తున్నాయి గాలిలో విశ్వాస లతలు అల్లుతూ నేలపై డెక్కల ముద్రలతో దారిలో దాహమై ఆగే వేళ నీటిలో తన బొమ్మ చూసి మురుస్తూ జన పదాలు అరణ్యాలు కత్తిరిస్తూ దాటుతూ సీమ దాటి సీమలోకి పరుగిడుతున్నాయి గాలిలో అశ్వ సమాకృష్యమాణ రథంపై వెలిగే సూర్యుని వలె నా పయనం ఊహ నుండి ఊహలోకి ఔను ఇది స్వప్నం కాదు వాస్తవానికి బింబం నిశా పత్రికలో ముందు తోచే వెలుగు రేఖలు కార్టూన్
VI. వర్తమానం స్క్రీన్ పై
(1974) ఇందులో 1. వెలుగులో ఈ నేలపై (1974) 2. మేల్కొన్న ఈ సమయం (1975) 3. శబ్దమై ప్రాణమై (1976) 4. అగ్నిమయం జీవితం (1980) 5. కాలాన్ని నిలిపి క్షణం (1979)
6. ఈ తరం స్వర చిత్రం (1986) 7. అశాంతి ఆర్కెస్ట్రా (1991) 8. వర్తమానం స్క్రీన్ పై (1991) అంకితం ప్రజాస్వామ్య సంస్కృతీ మనస్వి రచయిత మాన్యశ్రీ పి.వి. నరసింహారావు గారికి వెలుగులో ఈ నేలపై సూచిక 1. కిరణలహరి పై పుట 2. సమైక్య శిఖరమై 3. వెలుగులో లక్ష్యం 4. ప్రభా రూపం 5. వాంఛా రూపం 6. సమయ స్పందనం 7. వర్తమాన శిఖరాలు 8. సమయ దృశ్యం 9. అద్దం ముందు
10. పనిలో ఆలోచనలో 11. జ్వాలా క్షణాలు 12. నీలి పందిరి క్రింద 13. నాగరక సోపానాలపై 14. ప్రజాస్వామ్యం వైపు 15. స్మృతి భూమి 16. జన శక్తి వైపు 17. ఆదిత్య కాంతిలో 18. ధరిత్రిపై 19. మానవ చేతనతో 20. స్వేచ్ఛా చేతనతో 21. ఆత్మ బింబం
1. వెలుగులో ఈ నేలపై (1974)
1. కిరణ లహరిపై ఈ ధాత్రి చూచింది, ఎన్ని సంధ్యా ముఖాలో దేశ స్వాతంత్ర్యం ఆయువు బంగరు రేకులు తొడిగింది పద్మాతపత్రం వలెనున్న ఈ ఉదయ గగనం కింద నిలిచి త్రివర్ణ పతాకానికి మొదట వందనం చేసాక మనం
ముచ్చటించు కుందాం మనలో మాటగా అన్నీ ప్రాక్ సరసి సూర్యుని వెలుగు వలె సరదా పూచిన పందిట్లో దండలు త్రెంచేయమనీ ప్రదర్శన నిలిపేయమనీ ఏవో ఏకరువు పెడితే చూస్తూ చూస్తూ ఎలా ఉండగలను ? ఇంతటి సంతోషం సంరంభంలో మనమంతా భాగస్వాములమే మబ్బుల మాటు నుండి ఊగి జారే కోష్ణ ఉదయ కిరణాలకు కరిగి మెరిసే హిమ శకలాల వలె క్షణాల కదులుతున్నాయి శిల వలె పడి ఉన్న మౌన గళం ఊద బడిన శంఖమైంది జడ హృదయం మీటిన వీణయై నాదం పొందుతూంది పగలు శబ్ద వ్యూహాల్లో తిరిగి తిరిగి అలసి సొలసి నిశ్శబ్ద శిఖరానికి రాత్రి చల్లగా చేరుకునే గాలి, విభిన్న స్థానాల నుండి వివిధ రాగ సంపుటితో స్నేహ శక్తి నింపుతూ మనోవీధి కదలుతోంది. కలవరింతలతోనో ఏమీ ఎరుగనట్లో ఏమీ పట్టనట్లో ఉన్న నిన్నటి వాతావరణం సమస్తం నేడు హత్తుకుని జాతీయ రాగం అణువణువూ స్వేచ్ఛా గంధంతో ప్రాణాసార ప్రసారానుభవాన్నిస్తోంది గంటలు మ్రోగుతున్నాయి నిదుర నుండి మేల్కోని మ్రోతలు ! ఎద ఎదలో దూర దూరం నుండి ఆశయం ప్రతిధ్వనిస్తోంది జాతిలో పరిపూర్ణత క్రమ్ముకొనీ శూన్యత పోవాలి స్ఫూర్తిలో కర్మణ్యం తరుముకొనీ నైశ్చల్యం పోవాలి ముఖ రేఖల్లో రూపొందిన స్పష్టమైనత గతితో ఈరోజు అద్దం వలె కర్తవ్యం బింబిస్తోంది టెలిగ్రాఫ్ తీగెలపై ప్రసరించే వార్తా చిత్రాల వలె ఆలోచనా తంత్రులపై అనుభవ దృశ్యాలు కదలుతున్నాయి ఇది బాష్ప జలం కార్చే సమయం కాదు ఇది ఆయుధాలు పేల్చే తరుణం కాదు ఈ రోజుకు అణువణువును తీర్థంగా మలచే శక్తి ఉంది ఈమనసుకు మట్టి మండి స్వర్గాన్ని తీర్చే శక్తి ఉంది పగలు ఎగసి క్రమ్మిన దుమ్ము పొరల్ని అణచేస్తూ రాత్రి అంతా కురిసిన మంచు తడి ఆరనే లేదు ఈ బ్రతుకెన్ని సంద్యా ముఖాలో ఇంకా చూడాలని ఉంది ! ప్రతి ఎద ఒక మృదుల సూర్య బింబ మవాలిసి ఉంది
2. సమైక్య శిఖరమై నా కాళ్ళు కదులుతున్నాయి గంగా గోదావరీ ప్రవాహం పంక్తి వలె నా చేతులు మెదలుతున్నాయి కృష్ణా బ్రహ్మపుత్ర తరంగాల వలె ఈ దేశ స్వరూపంలోని భిన్న స్వర మేళనంతో ఈ దేశ ప్రకృతిలోని వివిధ శక్తి పరంపరతో ఎదురౌతుంది తేజో రూపం స్వర్గం కన్నా గరీయం. బ్రతుకులో బీటలు వారిన నేలతో మనసులో దొరలే పిడుగులతో ఎదురుగా నినాద తరంగాలతో ఈ సమయం సమాజ వలయాలు కూలే గిరి శిఖరపుటలజడితో, దూకే ప్రవాహోద్రిక్త గతితో కదలే ప్రజా సమూహం ఇప్పుడో, చెలరేగిన బాలసముద్రం స్వాతంత్ర్య దినాన నేడు ముని వ్రేళ్ళపై నిలిచింది వినమ్రంగా రోజూ ఉదయం మౌన క్షణాలతో అవతరిస్తుంది రోజూ సాయం విషమ క్షణాలతో నిష్క్రమిస్తుంది ఈ రోజు ఉదయం పలుకుతూంది ప్రియంగా ఈ రోజు సాయం కదులుతూంది సమగతితో జడులుగా వెలుగు వెదజల్లుతూంది ఝరులుగా చైతన్యం సరిస్తూంది వివిధ భావ జనంలో స్నేహ కళ వికసిస్తూంది నిశ్శబ్ద ముఖాల నుండి జలద నాద మొలుకుతూంది బిందు కోటి సమస్తం ప్రాణిత గణ మూర్తి అవుతూంది హింసారుణ మతి లోను శాంతి పుష్ప ముదయిస్తూంది ఈర్ష్యా ద్వేషాలు క్రమ్మి మరుగు పడిన ఆత్మీయత మనోరూప యంత్రాన్ని అర్ధ మయం చేస్తూంది అనుభవ మున్నంత వరకు పరమ యధార్థమై జీవితం అలసినా శరీరాలు పద పదం పరుగులు తీస్తున్నాయి తరలీ మాటలు ఎద ఎదనూ రాగంతో కలుపుతున్నాయి అంతరాలు విభేదాలు తొలగి కవితా మయమై హృదయం స్వేచ్ఛా సంచారం పొందుతూంది, బ్రతుక్కి లక్ష్యం తలపిస్తోంది.
3. వెలుగులో లక్ష్యం దూరాన ఒడ్డగిలిన రథం కాలిబాటన బండీ రోడ్ పై కారూ
ప్రక్కనే సమాయత్త యంత్రాలు జీవితాన్ని నడిపేవీ కాలాన్ని దూసేవీ దేవాలయ గోపురాలు ! గత స్మృతుల మొగలి పట్టలు కర్మాగార శిఖరాలు ! వర్తమాన ప్రగతి ముఖాలు వర్తమాన కవాటాలు తెరచి లోనికి ప్రవేశిస్తే ఏముంది ? ఇంద్రధనూ రూపం కొందరికి మృగతృష్ణా భావం కొందరికి కరుడు కట్టిన చీకటి కొందరికి శిథిల శూన్య గృహం కొందరికి ఈ బాధలూ గాధలూ ఎవరికి సమాజానికా ? వ్యక్తులకా ? వ్యక్తుల సమాహారమైన సమాజం భేదిస్తుంది అస్తిత్వంలో ఎవరి బాధ్యత వారిలో చివురిస్తేనే సమాజ సౌభాగ్యం ఫలిస్తుంది అందరికీ ఉంటుంది అకాశాన్ని అదుముకునే ఆశతో బ్రతుకులో అంచుల్ని స్పృశిస్తూ ఆనందం ప్రవహించాలనీ ప్రతి వ్యక్తీ ఉన్నమత్ జల తరంగమై తేనే దేశం సస్యశ్యామల వాచ్యం సంతోషం సరిస్తోంది నాలో పగలు మంచు సోన వలె ఆలోచన వెలుగుతూంది నాలో గగన నేత్ర కాంతి వలె త్యాగ భూమి నుండి పుట్టిన స్వాతంత్ర్య మహావృక్షం ఛాయల్లో ఎద ఎదలో సమైక్య బింబం ఈ సమయం తేజోరూపం ! లక్ష్యం ప్రజా హృదయ క్షేత్రంలో స్వర్ణ కాంతి సస్య ఫలం !
4. ప్రభా రూపం నా మనస్సు నటత్తరంగ శ్రేణులతో తలెత్తి నిల్చిన సముద్రం నా ఊహ జనతా గాథా కల్లోలంతో శివ మెత్తిన ఉదయ గంగ నా నరాల్లో జీవశక్తులు కదలుతూన్నవి సశబ్దంగా మెలకువ తీగెల్ని మీటుతూ అంతర్నాదాన్ని పలికిస్తూ ఈ నాటి ఆతప జ్వాలలు రేపు వర్ష ధారలు తెస్తాయనే ! జలదానికి వర్షం వలె నాకు ఆనందం హృదయ సహజం నా కళ్ళ నుండి రాలే అగ్నికి గ్రీష్మం సంతప్త మవుతుంది నా కళ్ళ నుండి జారే నీటికి అవని దయార్ధ మవుతుంది ఈ జన్మభూమి పై నవనవ రూపంతో అనవరతం సాగిపోయే నేను ఏచోట నిలిస్తే అదే ! నా ప్రియ వాసం ఒకపుడో అపశకునపు పక్షి అడ్డంగా దూసుకు పోతుంది ఒకపుడో శుష్క పత్రం ఎదురుగా ఎగిరి రాలి పడుతుంది అనంత సమాజ ముంది నాలో బీజం వలె ఒదిగీ
అంతమూ ఉంది నాలో ఎక్కడికక్కడ దిశల వలె నిలిచీ మునుముందు తలపుల్లో మధురంగా తోచే అనుభవమై ఆనందానికి దారి తీసే వర్తమాన విషాద మూ ఉంది నాలో తలుపులు మూసుకున్నా మిత్రమా వెలుగు వస్తుంది సందుల్లో నుండై నా మనల్ని కలవడాకి ప్రతి ఉదయం యుగ యుగాలుగా చాచిన ఆశీః ప్రసారకరాలతో నా కళా శిరస్తలోపరి ఆకాశం నిలిచి ఉంది ప్రభారూపమై నన్నందుకో జూచే కాలం నాకో బారెడు దూరంలో ఎపుడూ, కాలానికి విసుగూ విరామం లేదు నా కంతకన్నా లేదన్నట్లుంది నా రూపం కదలుతూంది మనిషిలో వెలుగు మూర్తులు వడలుతూ నే కోరను స్వప్నంలో మెరపులు ! రానీ తమస్సు గాఢ నిద్రగా ఆ పైన నా కంటికి జాగృతి ! నా ఇంటికి శాంతి ప్రభాతోరణం !
5. వాంఛా రూపం నే కోరను వెనక్కు మరలడానికి ! నే వీడను స్వర్గంకై జీవితాన్ని నే కోరను నాకై ప్రార్థించమనీ ! నే కోరను పరదేశ వారసత్వం సింహాసన శిథిలాలకై చింతించను కిరీట శకలాలకై యోచించను నా జాతి బికారి కాదు, నా సమాజం ఎడారి కాదు, నేనో వసంతం ! వృద్దు ముఖం ముడుతల్లో భద్రమైన అనుభవాన్ని పరిశీలిస్తా యువతా జన వదనంలో పల్లవించే ఆలోచనల్ని గుర్తిస్తా ఓపిగ్గా దర్శిస్తా మానవ సంస్కృతిలో వెలిగే ఆత్మ తేజం విషమ క్షణాలు మరవాలని భగవంతుని ప్రార్ధించను అవి గాయాలై చిహ్నాలై హృదయాన్ని అలంకరించనీ అవి మరవని గుణ పాఠాలై జాతిని మెలకువలో నిల్పనీ నే కదలుతా మేఘం వలె వివేక పదం నుండి విజ్ఞాన శిఖరం దాకా సూర్యుని రూక్షే క్షణానికి దగ్ధ మయ్యే భయమూ లేక పోలేదు సూర్యుని కెదురుగా, మానవత విప్పారిన చల్లని గొడుగై జీవ కోటి కాహ్లదంగా నిల్వడం నా కెంతో గర్వం అహం నుండి ఉద్భవించే అగ్ని క్రియా రూప చిత్రం మనచుట్టూ పరిభ్రమించే ఈ చరిత్ర కీర్తి సమస్తం నే కోరను నైశ్చల్యం నే వీడను జీవిత వాస్తవం పై గమనం వద్దు వద్దు ఏకాంతం, గుహ లోకీ మాయ లోకీ పలాయనం
వికసించిన ఉత్సాహ తేజం జాతి కిపుడు కావాలి వాడి రాలి నశించే ముందు, ఆశలు ఫలింప గోరీ తరం నుండి తరానికి ఫల రూపం అందిస్తూ పైన పక్షులు నింగిలో క్రింద చేపలు నీటిలో భూమి పై ప్రాణులు ఇంకెన్నో వాటిలో ! బ్రతుకుకై బాగుకై పరిక్రమించే పరిశ్రమించే మనుషులే ! మహా సంస్కృతీ పరంపరకు వారసులు ! నాకు తెలుసు మనిషిలో దేవతలూ రాక్షసులూ పక్షి పామూ జంతువూ, వివేక విలసనంతో దిశ దిశ అణు వణువూ మనిషి అధిపత్యమే!
6. సమయ స్పందనం ఉదయం సాయం సంధ్యల వలె శాంతి యుద్ధ జీవితంలో ఏదో ఒక రూపంలో ఆనందం విషాదం ఎదురయ్యేను అభాగ్య అశాంతి దారిద్య్రం ఆక్రోశం ఆవేదన తొలగించే నవ సమాజ నిర్మాణంలో మానస బిందువుతో భౌతిక రేఖనూ గగన తలం మార్మోగే గర్ణామృదంగ జలంతో జ్వాలల్ని తొలగిస్తూ ఎద ఎద తడుతూ అనురాగ స్వరంతో అమృత లిప్త స్పందిస్తాను నరాల్లో ఉత్సాహం చిందులు త్రొక్కుతూ తేలి తేలి కదిలే శరీరం ఎంతలో ఎన్ని వాద్యాలుగా మారుతుందీ సమైక్య హృదయం మనస్సులో స్వాతంత్ర్యం పరవళ్ళు తొక్కుతూ అశ్వగతి పొందుతూంది హిమ బిందువు నుండి ప్రవాహ గతితో సముద్రం వరకూ చేరే సత్యమై శివమై సుందరమై జీవిత శిఖరంపై ఒకే తేజో రూపం, దేశం అంతరంగం అడుగునున్న ఆలోచన మేల్కొంది మానవతా రాగంతో భారతాత్మ బింబంతో ఈ నేలపై పద పదంలో ఒకే సంస్కృతీ పద్మం ఈ గడ్డపై కణ కణంలో ఒకే సమైక్య వాదం హిమ స్ఫుట శుభ్రమై సాగర రసార్ధమై ఆనందాకాశమై అనుభూతి వాహినియై సామాన్యుని ఆలోచనలో జీవిత వ్యాఖ్యానమై ఈదేశం నాదేశం ఈ సమయం మహా కావ్య రూపం అంగార కణం వంటి వర్తమాన సమస్య వదిలి
7. వర్తమాన శిఖరాలు ఎలా ఊహించగలం భవిష్యత్తు స్వప్న ఖండం ? ఈత చెట్లకు మల్లె తల విరబోసుకొన్న క్షణాలు మహా వేగ ధురామతి చేతిలో కారు వలె దూసుకు పోతున్నాయి సమయ ముఖంలో గాయాలు లోతులూ నెత్తురు చారికలూ ఒకనాటి కలంకార చిహ్నాలుగా గుర్తింపుకు రావచ్చు ? ఒక క్షణం అడవిలో పైకి దూకనున్న సింహం వలె ఎదురౌతుంది ఒక క్షణం ప్రేలనున్న మెషిన్ గన్ వలె సూటిగా చూస్తుంది యజ్ఞ వేది నుండి సాగే నీల ధూమ జటాచ్చటలతో యంత్ర శిఖరం నుండి నీల ధూమ వలయ పంక్తులతో ఆకాశం నీలి ముగ్గు వేసినట్లుంది, మంచితో చెడూ తప్పదు ఇంతసేపు ప్రయాణంలో ఎక్కడ వేసినత గొంగళి అక్కడే ఉందా ? ఇంతవరకేవో ఘన కార్యాలు ఒరగ బెట్టలేదనీ కాదు తాబేళ్ళ వలె పరిశ్రమలు భుజగాల వలె ఆనకట్టలూ ఎన్నికలూ వెలుగు నీడలు క్రీడలాడే రాజకీయాలూ ఈ పురోగమనంలో అలసి సొలసి నీడ పంచన చేరుకున్న సామాన్యుల ముఖాల్లో ఆరోగ్యంగా ఆనందంగా తృప్తి రేఖ వికసించింది, సామాజికత న్యాయంతో వ్యక్తి గౌరవ శిఖరం ఎదగంది ఈ ప్రయాణానికి ప్రయోజనమేమిటి ? జీవితాన ఉత్సాహ మెక్కడిది ?
8. సమయ దృశ్యం ఉదయం రోదసి కళ్ళు చెమ్మ గిల్లినట్లు మంచు తెరలు చెట్ల తలపై పూలుగా చేతుల్లో మొగ్గలుగా మంచు బిందువులు ! దారుల్ని మూసి సందు లేకుండా ఆశల్ని నిలిపి మంచు వెండి పూతగా సూర్యునికీ ప్రపంచానికి మధ్య పిలవని పేరంటం వలె నిలిచింది ఇంకా దిక్ స్వరూపం సమగ్రంగా ఆవిష్కృతం కావలసి ఉంది ఇంకా మనిషి మనోరూపం సంపూర్ణంగా మేల్కొవలసి ఉంది ఇక్కడ నిజంగా మనుషులంతా మేల్కొనీ లేరు ఆలోచనా రంగం పై ఇంకా స్వప్న దేవతలు నర్తిస్తున్నారు ! ఎముక ముక్క నోట కరుచుకొని ఇటూ ఇటూ చూసీ చూడకుండా మంచు పొరలు చీల్చుకుంటూ పరుగిడుతోంది కుక్క
అపుడే చల్లారిన శ్మశానంలో నిప్పు రవ్వల కళ్ళతో ఒక్క ఊపులో కవోష్ణ శరీరంలో ఊదిన శక్తి స్ఫులింగంతో రెక్క లొచ్చిన వెలుగుల వలె నీడల వలె పక్షులు మంచులో నుండి దారి చేసుకోనీ ఆపై కెగిరి పోయేందుకు సాహసం చేస్తున్నాయి మైదానాల్లో నుండి కాలి దారిన, సన్నని కాలవల్లో పడవల వలె మెల్లగా శ్రమ జీవులు జీవన గమ్యాలకు తరలుతున్నారు పొద్దు పొడిచీ పొడవక ముందే లేచి కిటికీ వద్ద నిలిచిన నా కంటికి కన్పించే మొదటి జీవన గతిలో ప్రయాస దృశ్యం చల్లగాలికి బరువుగా కదలే ఊపిరి తీగెలపై కాలం ఊగుతోంది ఊగే కాలానికి సనసన్నని వెలుగు కాస్త ఉత్సాహ మిస్తూంది మంచు వదలిన గాలి ఏదో రహస్యం చెప్పబోతోంది మంచు తొలగీ ముఖంపై బయట పడిన రహస్యం సమయం తిష్ఠ వేసిన పెద్ద వడ్డీ వ్యాపారి వలె ఉంది అద్దం ముందు నిల్చున్న నా ముఖంలో రీల్ వలె దృశ్యత పరంపర కదలుతూంది వేడి వేడి టీ రుచితో ఉత్సాహ లహరి అందుకుంది
9. అద్దం ముందు గంధంలోనో మంటల్లోనో ముంచెత్తే స్మృతులు నన్ను త్రిప్పి త్రిప్పి ఎక్కడో ఆనంద లహరి పైనో వేదనా కోలాహలంలోనో వదలుతాయి ఉత్సాహంతో వెలుగు తోట అయితే నిరాశలో చీకటి కోట అయితే ఎదిగే మనిషిలో అడవీ ఉంది పెరిగే అడవితో ఆటవికమూ ఉంది బయట కిటికీ చువ్వల పై నుండి ఆకులతో పూలతో లోనికి ప్రాకే తీగె వలె ఆలోచన ఓ వీడని బంధమైంది ఫ్యాక్టరీ గొట్టం నుండి ఎగసే పొగ మబ్బు వలె రోజు క్రింది నుండి పైకి మొదలౌతుంది కుంటుపడిన లిప్తలతో బద్దకంగా నడుస్తుంది వరదల్లో ప్రాణి వలె ఆచూకీ లేకుండా వెళ్ళి పోతుంది దీన్ని గురించి ఆలోచనతో సతమతమై చురుకుదనం వచ్చే లోపల కొండల మధ్య వాగువలె ఎవరి ఆర్తిలో వారు నడుస్తుంటారు మరొకరి మాట వినే తీరిక లేదు, ఎవరి స్వర ప్రపంచం వారికి ప్రియం ఒకరి ముసుగుపై మరొకరికి వల్లమాలిన ఇష్టం
తమ ముసుగులోపల లేందేదో అందులో ఉందని అనుమానం చీకటి ఒక పెద్ద ముసుగు ! దిశ దిశ నుండీ పగలూ రాత్రి, దీన్ని తీయడానికో ప్రయత్నం దీన్ని వేయడానికో సంరంభం రాత్రి నల్లని బోర్డు పై తెల్లని అక్షరాల వలె వెలిగే లైట్లు బయటి ముసుగును తొలగిస్తాయి కాని లోపలి ముసుక్కి వెళ్ళలేవు ఆకలి కడుపులతో చీకట్లో దాగిపోయే ఇష్టంలేక బయటపడి కొందరు అగ్నులై నడిచేరు కొందరు రాత్రిని దహింపజూచేరు చీకటి వ్యాపారం విరివియై వెలుగు గింజ కరువవుతూంది కళ్ళలో పగలు రాత్రి ఊయల వంతెన తాళ్ళ వలె ఊగుతున్నాయి గట్టు పైన తుమ్మ చెట్టు వలె కర్షకుడూ గేటు వద్ద దీప స్తంభం వలె కార్మికుడూ
10. పనిలో ఆలోచనలో ఊపిరి సలపనంత పని ఎందరికో మతి మందగించే ఆలోచన ! సమాజంలో జీవితం గురించి నిప్పు పూలు పూచే మనస్తత్వం ! ఎక్కడి కక్కడ తలుపులు మూసుకొని కిటికీలు తెరచి మధ్య తరగతి సందేహులు ! అన్నానికి లోపం లేని వాళ్ళు యజమానీ శ్రమజీవీ ఇరువురి సంబంధం ఇంతవరకూ ధనంతో ప్రయోజనమూ, పనితో క్షుద తీరడమూ సమతా మానవతా లక్ష్యంతో శ్రమలో ఆనందం ఇంకా రావలిసి ఉంది ! ఎవరికి వారు తన్నుకు చస్తున్నారు కంచె పేరుతో నీరు పేరుతో అపాయపు గుర్తుల్ని చూచీ చూడకుండా పరుగిడుతున్నాయి వాహనాలు గమ్యం చేరే తొందరలో ఎక్కడ ఎవరు క్రాస్ చేసేదీ తెలీదు ! ప్రయాణంలో సూత్రాల్లో బిగించిన పరమార్థం పట్టుపడక దారి తప్పేరు పనిచేసే కుర్రవాని ఐదు ఒకట్ల నోట్ల పిడికిలి సడలింది ఎన్ని రోజులు శ్రమ తూగిన ఫలమో సీసాపై సీసా ఖాళీ చేసి ఆ పైన సినిమా చూడడమే మిగిలిన కర్తవ్యంగా ఉందీవారం వీధుల్లో గుంపులుగా నినాదాలతో నడచే అగ్నుల వలె యువకులు వివిధ వర్ణ సమరభావ పక్షాల రాజకీయాస్త్రాలు ఢీకొంటున్నాయి అరచే వారికీ పొడిచే వారికీ అగ్ర తాంబూలం ! వీర సన్మానం దొరకుతోంది బ్రతుకుపై రుచి చావని వృద్ధులు మరో జన్మకై వేచి ఉన్నారు దండ తెగిన ముత్యాల వలె ఎవరికి వారు దొరలి పోతున్నారు
రానున్న శతాబ్దిలో సౌభాగ్యంపై ఆశతో కాలం స్వప్నంతో ఉంది ప్రస్తుతం మండే ఎడారిలో పచ్చని ఆలోచనతో బ్రతుకుతూంది ఎంత పరిచయమున్నా అపరిచితునివలె ప్రవర్తిస్తుంది కాలం పరిచయం లేకపోయినా ఆపు ని లా హవణిస్తూందీ రోజు ఉదయం వదిలినట్లు వదలి తిరిగి పడే బంధనలో బాధతో జీవితంలో నిగళ ఘలం ఘలల్లో ఎక్కడో కించిత్ మెరుపు రేఖతో ప్రయాణిస్తోంది దేశం స్వేచ్ఛా యుగ ప్రజాస్వామ్య లక్ష్యంతో జీవితానికి ఆగడం లేదు ప్రయాణానికి విరామం లేదు రావాలి శ్రేయో సంస్కారంతో ప్రజాస్వామ్య మనో వికాసం సమతా మానవతా ప్రగతి భావ వర్తనతో దర్శనమై
11. జ్వాలా క్షణాలు అణచిన శక్తులెగసి విజృంభిస్తే పాతిన రూపాలు చీల్చుక పై బడితే స్వార్థం శిఖి శిఖా మస్తకంతో ఆకాశపు టెత్తు పెరుగుతూంటే అసహనం ధూమ వదనంతో దిశల్ని సంకుచితం చేస్తుంటే ఇంతవరకు చిరాకుతో సణగే శాంతి భద్రతలు నిప్పులు త్రొక్కిన అడుగుల వలె గంతులేస్తున్నాయి హక్కులకై పోరాటంలో పదవులకై నేల విడిచి సాముతో కుమ్ముతూన్న పొడుస్తూన్న నినాద శబ్ద తరంగాలు, ఆయుధాలు ! మాటల బాకులతో ఈటెలతో పోరాడుతూన్న కరపత్రాలు అహం ఎగిసేను బడబాగ్నియై, జనం తరలేను ధూమ వదనంతో రాళ్ళు సంగీతం పాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది వాలకం మ్రోళ్ళు నృత్యం చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందీ అంగణం సామాన్య జన శ్రేణులు అలల వలె బుజా లెగుర వేస్తున్నారు బుట్టల్లో ఎరలతో చేపలకై వెళ్ళే వాళ్ళు వెళ్ళుతున్నారు జేబుల్లో కత్తెర్లు సర్దుకుంటూ తారాడే వారూ ఉన్నారు చేతిలో సిరంజితో డాక్టర్ కిటికి నుండి దృశ్యంచూస్తున్నాడు పెళ్ళున విరిగిన మనస్సుతో బీటలు వారిన స్థితిలో ఈ సమయం ముఖాన కారం చల్లినట్లున్నా ఓ శాంతి రేఖ కాస్త నిలుస్తుంది నవ్వుతుంది దారికడ్డంగా తేమలో పడుకున్న కుక్కపై ఎక్కడినుండో రాయి పడింది నలుపెక్కిన సమయ ముఖంలో ఇంకా వెలుగు కళ రావలిసి ఉంది
12. నీలి పందిరి క్రింద జన సమూహ నినాదాలు ! నినాదాలు ధ్వన్యనురణన క్రీడలు మ్రోతలు అటు నుండి రాళ్ళ ప్రహారాలు ఇటు నుండి బులెట్ల విహారాలు పగిలిన లైట్లు అద్దాలు కాలిన వస్తువులూ ! ధూమ శిఖా హల్లీసకం ! ఉన్నట్లుండి ప్రేలింది రైఫిల్ ! హాహాకారం ఎగసింది ! సంక్షోభం రేగింది. ఏమీ ఎరగనట్లున్న సూర్యుని క్రింద ఆకాశం పొగలల్లుకొనీ నీలి పందిరిగా మారింది తేనే పట్టుకు సెగ తాకి చెదరిన తుమ్మెదల వలె జన సందోహం కసిగా చురుగ్గా చెంపల్ని తాకుతూ వేడి గాలులు విసురుతున్నాయి నఖ శిఖ పర్యంత ఉద్రేకం ఉవ్వెత్తుగా ఉరకలు తీస్తోంది. ప్రక్కన దారి దొరికిన ఝరుల వలె ప్రదర్శకులు పరుగులు తీస్తున్నారు చిరిగిన పొగ మంటల దుస్తులతో నిటారుగా నిలిచింది రోదసి జనగతి మందగించింది, మృత్యువు సమీపంగా కదలుతోంది కన్నుల్లో అణచుకొని వెలుగు ఎదలో దాచుకొని సహనం మండే అడవిలో ప్రాణుల వలె, భయాశ్రితులు పరుగిడుతున్నారు ! బుల్లెట్ల ధ్వని ఆగింది నిశ్శబ్దపు బాటలో బూట్ల శబ్దం హెచ్చింది గాలిలో ఆడపాదడపా ప్రతిధ్వనులతో హెచ్చరికలు తరలుతున్నాయి శ్మశానంలో సాయం సంధ్యా కీల అయిన ఈ సమయం కాలు విరిగిన వ్యక్తి వలె కదల్లేక కదులుతూంది క్షణాలు ప్రవహిస్తున్నాయి ఆగి ఆగి నిప్పులార్చుకుంటూ రగిలిన ఉద్రేకం మండి మండి సాయం వేళకు అలసి సొలసింది నినాదాలు మణిగాయి వివాదాలు సర్దుకోలేదు రాళ్ళతో టియర్ గ్యాస్ షెల్సో దూసిన బులెట్లతో దృశ్యం వికల వస్తుశకలాల్ని బింబించే శిథిలాల ఫోటో వలె ఉంది ఓడి పోతున్న నైతిక మూల్యాలతో గెల్వ జూచే హింసా సంచారంతో ఎరుపు క్రమ్మిన నలుపు రంగులో సంధ్యా మేఘం వలె ఉంది వాతావరణం పిత్రార్జితం బంగారు ప ్ళరంలో వస్తే కష్టానికి నిర్వచనం తెలీదు స్వార్జితం వెండి ప ్ళరంలో నిల్వడానికి కష్టానికి వాఖ్యానమవసరం కాలాన్ని ఎక్కడి కక్కడ కత్తిరించి దాటాలని ప్రతి వ్యక్తి తాపత్రయం ఎప్పటికప్పడు కత్తిరించిన ముక్కలే దారి కడ్డమవుతాయి ఇనుప గుండ్ల వలె దొరలుతూంది రోజు వెంట రోజు అడుగుపడే లోపల ఎప్పుడెవరు చితికి పోయేదీ తెలియదు
మతం పేర గతం పేర భాష పేర వర్ణం పేర హక్కు పేర అశాంతి ఊపిరి తీసుకుంటూంది అలజడి అందలమెక్కుతూంది చెలరేగిన సమాజ తీరాన కాళ్ళు చాచి వరద లాపినట్లు శాంతి భద్రతల పేరున సినీ షూటింగ్ బందో బస్తులు పిట్టలు కొట్టుక బ్రతికే వాడో పెద్ద వీరు డయినట్లు చిత్రణలో బొమ్మలతో శీర్షికలతో ఉదయం పత్రిక లెదురౌతున్నాయి మంటలు నుండి ఆర్తి నుండి దేశం కోలుకునే లోపల ఇరుగు నుండి పొరుగు నుండి జ్వాలా సంచలన వార్త ! కష్టంలో హృదిలో విసరే వేడి గాలికి దుఃఖంలో చెక్కిళ్ళపై జారే కన్నీ రారి పోతూంది, ఈ జాతికిదో సహన శక్తికి సంకేతంగా చెలరేగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు దూరం నుండి గాలి అశేష వేగంతో వచ్చి చెవి ప్రక్కన హోరు పెడుతోంది సాగలేక సగంలో చతికిలబడ్డ పగటి పీడ కలలతో రోజుకో మొగంతో రోజులు వచ్చి పోతున్నాయి అనుభవం ఆలోచన పరస్పరం ఎదురై ఢీ కొని వేరై జీవితమూ సిద్ధాంతమూ చెరొక వైపు పోతున్నాయి గ్రంథాల్లోని పంక్తుల్ని అవగాహన చేసుకొనే లోపల వ్రేలి కొసల కందీ అందకుండా జీవితం పరుగెత్తుతూంది రధ గజ తురంగ కిరీటాల్లేని ప్రభువులూ ఎదురౌతారు ప్రతినిధుల సభల్లో మంత్రాలు వినిపిస్తున్నాయి చింతకాయలే రాలడం లేదు మంత్రగాడు దండం త్రిప్పుతూ లేనివి చూపించేను ఉన్నవి మరిపించేను, వ్రేళ్ళు దన్నుకున్న వేదాంతం బ్రతుకుల్ని అందంగా శూన్యంలో నిలుపుతూంది అవమానం కలచినపుడు మనిషి సూర్యుని వలె ఉదయిస్తాడు రాపిడితో నలిగినపుడు కొత్త శక్తి లావా వలె ఉద్యమిస్తుంది. కత్తిలా దిగినపుడు మాట నిప్పులా తాకినపుడు ప్రవర్తన దాసోహమనో తిరగబడో లోపలి మనిషివేటుతో పలుకుతాడు తిండికీ బట్టకూ తప్పనివై పోరాటాలు విషమిస్తే కల్లోలమై సమాజం ఎగిరిపడే అనల శకలాల వలయమే ! స్వాతంత్య్రం సమభావం అలంకార సమమై ఈ సమయం
ड
సామాన్యుని కే కర్తవ్యం బోధిస్తుంది ఏడ్వమనా ? ఎదిరించమనా ? ఆయుధాన్ని చేపట్టమనా ? అహింసను అవలంబించమనా ? సహనాన్ని కాపాడమనా ? శాంతిని నిలపమానా ?
13. నాగరక సోపానాలపై అటవి కన్నా భయదమైనా మృగం కన్నా హీనమైనా మనిషి మాత్రం నాగరకతకు శిఖరం, విజయం వైపే పయనం చీకటి డ్రస్లోనో మంచు షర్్ట వేసుకోనో ఉన్న జనపదం కొరడా వలె సూర్య కిరణం చెళ్ళుమనే దాకా కదలేట్టు లేదు పిడుగుల వలె దొరలేరు ఉల్కల వలె ఎగసేరు హింసా యుధులు ! సమతకై అలజడినీ మార్పుకై హింసనూ కోరేరు విప్లవమతులు! హింసారుణ కరాళంగా వ్యవస్థను దగ్ధం చేయాలనుకోనే కోరికలు అందకుండా తెలీకుండా వెనుక నుండి నీడయై మ్రింగేయజూస్తుంది ఉండి ఉండి వినబడే అలజడికి ఆక్రందనకూ సమయం వరదలకు ఉలిక్కిపడే ఒడ్డు వలె క్షణ క్షణం కంపిస్తోంది. జ్వాలా వదన సహస్రంతో దేశ భవిష్యత్తును తీర్చాలనుకునే సోదర బృందం తపనను వీచే గాలి రికార్డు చేసి వినిపిస్తోంది చావు నుండి తప్పించుకునే యత్నంలో దానిలోనే పడుతున్నారు, పడేస్తున్నారు పీడనలో రాపిడి పొందిన మనస్సు పొందాలి బ్రతుకులో ఉదార వ్యక్తిత్వం భౌతిక శక్తితో మనస్తత్వరీతితో కదలే బ్రతుకులో అన్నీ వాస్తవాలే ! వాస్తవాలకు ప్రతినిధి మనిషి ! ఆదర్శాలకు బింబం ! ఈ సర్వంసహ పై ప్రతి మతానికీ ఉంది స్థానం చెట్టు వలె ఒకటి నీడ వలె ఒకటి కొమ్మపై గూడు వలె ఒకటి మనిషిలో ఎప్పటికపుడు సీమలు మార్చేవీ పరివర్తన పొందేవీ ప్రతి రెండు ప్రపంచాల మధ్య భేదం అనివార్యం ఈ రెండు భావాల మధ్య సహభావం అవసరం
14. ప్రజాస్వామ్యం వైపు చరిత్ర పద చిహ్నాలుగా మిగిలిన శిథిల సౌథాల్ని అంటుకొనీ అనాథలూ నిరాశ్రయులూ ఓ పంచన వాలి యున్న నీడలు ! మనస్సు తవ్వుతుంది, స్వక్షేత్రంలో పొడ సూపిన నిధికై కర్షకునిలా జీవితం పలుకుతూంది వర్తమాన తంత్రులపై వయోలా వలె పచ్చని మనస్సుతో బంగరు తలపులతో ఉన్న ఆశా వహులూ నల్లని దుఃఖంలో మంటల ఆర్తిలో ఉన్న బాధా మతులూ ధూళి కణమై లేచి చుక్కయై అలయై సాగి సముద్రమై నిలవాలనే
అంతా వలయంలో బిందువులే ! అంతా బింబానికి కళలే ! సిద్ధాంతం సందర్భంతో నీతినీ నియమాన్నీ ప్రశ్నించే తరం ఏ పేరిట నిరంకుశత్వం కోరదు ఏ రూపంలో రాజరికం కోరదు ఉదార ప్రజాస్వామ్య వాదం వేగంగా అంతరాల తగ్గించే సాధనం వ్యవస్థలో మార్పుతో వ్యక్తిలో మానసిక వికాసమూ అవసరం అందరిలో ఒకే భారతాత్మ ! వికసించిన శాంతి తేజం గ్రీష్మ వర్ష శిశిరాల్లో తీవ్ర ప్రకృతి శక్తుల మధ్య నిలిచీ పెరిగి ఎదిగి బ్రతికే జీవ సంభృత మహా వృక్షం ఈ దేశం వర్గ రహిత వర్ణ రహిత బహు భాషా సంస్కార కిర్మీరం
15. స్మృతి భూమి చేయితో చేయి కలిపి ముఖంలో ముఖం నిలిపి ఎదలో ఎదతో చరిత్ర మాట్లాడుతూంది రాత్రి పగలూ గత చిత్రాల్ని బింబిస్తూ అది రాజ సౌధం ! కొండ పైనుంది, సామాన్యులకు ప్రవేశం లేదు స్మృతులతో వాయువు సన్నగా సంగీత చిత్రాలు వినిపిస్తూంది కొండ చుట్టూ రాతి కోట ! రక్షక భటులతో ఆయుధాలతో ఎన్ని కళ్ళో ఒకే వస్తువును చూస్తాయి ! ఆలోచనలెన్నో వస్తాయి ! చివు ్ళత్తిన భయంతో సామాన్యులు తల వంచి నిశ్శబ్దంగా నడుస్తారు. ఎవడో ఎపుడో గానీ మొగ్గ వలె తలెత్తడానికి సాహసించడు అపుడపుడూ వెలువడే శబ్దాన్ని నిశ్శబ్దం దూరంగా తరిమేస్తుంది కోటలో ఉండేవాడు అతడు రాజు ! తలెత్తే ఒకే వ్యక్తి వీరు ప్రజలు ! కోట బయట తలవాల్చబడిన వ్యక్తులు ఇరువురి మధ్య తెంచరాని బంధం ఎప్పటిదో ఒక గాలి వంతెన ఇదీ నిన్నటి కథ ! నేటి కథ వేరు ! ప్రజాస్వామ్య గాథ ఎండలో వానలో చలిలో కాలాని కెదురొడ్డి రాతి గోడలు మాత్రం నేటికీ అవశేషాలతో ఆకర్షిస్తాయి క్షణాలు పరుగిడుతున్నాయి మార్పుతో నిలకడ లేకుండా గ్రీష్మ దాహాన్ని తీరుస్తూ వచ్చే తొలకరి అడుగు వేసింది నిశ్శబ్దాన్ని చీల్చే శబ్ద ఘోషతో తుఫాను వచ్చింది, అణగింది అంతటా కొత్తపాయలతో స్వేచ్చా జల సంచార ప్రవాహాలు ! శరత్తు వచ్చింది అభయ హస్తంతో దిక్కుల్లో కొత్త తెలివితో ఋతువు మార్పుతో కాలం కొత్త ముఖంతో అవతరిచింది
చరిత్ర మలుపు తిరుగుతుంది పాత ముఖాలు కొట్టుకపోతాయి ఆకొండ చుట్టూ రంగం సిద్ధమైంది రాజ సౌధం ! ప్రజా భవనమైంది ఇది సామాన్యుని ఆశలు దశ దిశలూ ధ్వనించే నిలయమైంది ఇదో జన హితైక జంత్ర వాద్య సమ్మేళనంగానూ మారుతుంది పాలకులకూ ప్రజలకూ మధ్య ఏదో వంతెన ఎప్పటికి ఉంటుంది చేయితో చేయి కలిపి ముఖంలో ముఖం నిలిచి ఎదలో ఎదతో బంధమై నిశ్శబ్దం ఎదురుగా కోట శిథిల రూపంలో గతానికి బంధువైంది. నిశ్శబ్దం పలికేను జీవిత వాస్తవాన్ని బింబిస్తూ వర్తమానం స్క్రీన్ పై
16. జన శక్తి వైపు రాజరికం వెళ్ళిందెపుడో చీకటి గుహలోకి దాని స్థానంలో ప్రజల ప్రభుత్వం కొండపై బండలపై వ్రాసిన “ప్రజాస్వామ్యం” అక్షరాలు ఆకర్షిస్తున్నాయి అక్షరాలు వచ్చిన వాళ్ళు చదువుతున్నారు ! రానివాళ్ళు బొమ్మలు చూస్తున్నారు అలవాటు చొప్పున గుహల్లో నుండి జంతువులూ మృగాలూ బయటికి వస్తాయి అవకాశాన్ని బట్టి ఆరగిస్తాయి! కడుపులు నింపుకొని పోతాయి కొండపై ప్రభుత్వానికి వీటికీ స్నేహ బంధం ముందని వదంతి ప్రక్కన చరియల్లో మైదానాల్లో తరాల బ్రతుకు గతులతో జనం ఉన్నట్లుండి ఒకనాడు మేల్కొన్న కాల సింహం జూలు విదల్చింది ఉరుములతో ఘన మేఘంవలె జనం శక్తియై కదలింది కొండపై నుండి దిగి వచ్చి క్రింద ఇనుప చువ్వల వరండాలో ప్రభుత్వం పచార్లు చేస్తుంది మంటల కెదురుగా కదలుతుంది అద్దంలో వెలుగు చూసి మురిసి పోతుంది ఆయుధాల ధ్వనుల మధ్య శాంతి మంత్రం పఠిస్తుంది మౌన ముద్రా ముఖంతో నిశ్శబ్దం బుసలు కొట్టే ఆలోచనతో రాజనీతి తాండవంతో సమస్యకు సంకెళ్ళు వేసి నిష్క్రమిస్తుంది చల్లారిన పాలపొంగులా ఆగిన నీటి వరదల్లా అంతా యథా ప్రకారమే ఎవరైనా కోపిస్తే ఏడిస్తే పైరవీ పదవీ యోగం ఉండనే ఉంది కాకపోతే ప్రయాణంలో ఉండనే ఉన్నాయి రాజ మార్గాలు ! దొరలి పోవడానికి లోయలూ ! కొట్టుకు పోవడానికి నదులూ ఆకలితో అలమటించే జంతువులూ మృగాలూ చెప్పనవసరం లేదు శాంతికి భంగం లేకుండా తిండికి ఇబ్బంది కలగకుండా ప్రజ ! లోయల్లో మైదానాల్లో తమ జీవితం గడపడమే జనంపని ! కొండపైన జనస్వామ్య ప్రభుత్వం ! క్రింద ఉంది హక్కులున్న సమాజం
శాంతి సోపానం పై ఈ శతాబ్ది ప్రయత్నిస్తోంది ప్రశ్నలకు జవాబులకై
1. ఆదిత్య కాంతిలో నేర్పిన విద్యతో సాధించిన విజ్ఞానంతో తెలివి బయట పడే లోపల రోజులు ముత్యాల వలె దొర్లిపోతాయి, కొత్త ప్రశ్నలు చేరతాయి ఎవరికో అదృష్టవంతులకు తప్ప అందరికీ ప్రశ్నలే ప్రశ్నలు ! తిండీ తిప్పలు ఉద్యోగం అవకాశం జీవితంలో బాధ్యత గురించీ ఒక్క అడుగు వేసే లోపల కాలం పది అడుగులు దాటి పోతుంది ప్రశ్నకు జవాబు వచ్చే లోపల ఆ సమస్య పాతబడి పోతుంది ఎక్కడికక్కడ నియమాల సందుల్లో నుండి అవతారాలు లేస్తాయి ఎన్నో మాటలు వింటూ రంగులు చూస్తూ సంస్కారం పెరుగుతూ బ్రతుకు రూపం మారుతుంది, మనో రహస్యం ఎక్కువవుతుంది స్వర్గం మోక్షం సంగతి అట్లా ఉంచి ఉదయించే నైతిక తేజంతో స్వేచ్ఛగా వికసించనీ వ్యక్తి రూపాన్నీ, సామాజిక శక్తినీ సమయం ఆలోచన ఒకటైసరించనీ జీవితం ఏ ప్రశ్నకూ సంపూర్ణ సమాధానం ఈ శతాబ్ది కాదు ఏ యుగమూ ఇవ్వలేదు
2. ధరిత్రిపై ప్రతిబింబంతో నిదురకూ మెలకువకూ మధ్య వంతెన వలె మనస్సు వంతెనపై పయనించే మనుషులు వాస్తవ ప్రతిబింబాలు అవసరమూ అనుభవమూ భౌతికమై మానసమై ఆర్థికమై ఎదలో స్పందనతో అంతరంగ కిరణంతో నడిచే భూమికలు స్వాతంత్ర్యం వెలుగుతో నిర్మించిన సామాజిక సోపానాలపై ఇపుడు రావలిసింది నోట్లో బాంబులతో కళ్ళలో నిప్పులతో కాదు ఊపిరిలో ఉత్సాహంతో దేహంలో వెలుగు ధారతో జడత్వం విదల్చి మనస్సుకు నవత్వం కూర్చే శక్తులతో నవసమయం మార్పు భౌతికమే కాదు మానసికమూ అవసరం భవిష్యత్తు ఏ ఒక్కరిదీ కాదు మొత్తం సమాజానిదీ
3. మానవ చేతనలో బ్రతుకులో బరువునూ ఊహలో నిశ్శబ్దాన్నీ భూమినీ ఆకాశాన్నీ గతంలో గాంభీర్యాన్నీ భవిష్యంలో విస్తృతినీ జలధినీ దిక్చక్రాన్నీ ఎత్తులో ఆశ్చర్యాన్నీ లోతుల్లో సె రాన్నీ అహంతో వినయాన్నీ వర్తమాన అస్తిత్వాన్నీ క్షణ క్షణ చలనాన్నీ దివ్య బిందువుతో కలిపే సృజన శక్తి సంకేతం, నిర్మాణ భావ చిహ్నం, ఈ మానవ చేతన శ్మశానంలో నిజంకాదు పచ్చని జీవితం, సమాధి నుండి రాదు ఛాయావృక్షం హింసతో స్వాతంత్ర్యం ఊపిరి తీసుకోదు రక్తంతో మనో భూమి మొలకెత్తదు కత్తి అవసరమే రక్షణకై మేర మీరితే ఎతె న మహాసంస్కృతి మస్తకాన్నే ఉత్తరిస్తుంది
4. స్వే ్ఛ చేతనతో నిద్రించే రాత్రి తలుపులు తట్టి ఎంత గొంతు చించుకుంటేనేం ? నీవు లేవవు, తలుపు తీయవు! అందుకే తెలీదు నా రూపం తలుపులు బద్దలు కొట్టి లేపందే, నీవు లేవవనీ నాకు తెలుసు ఇదిగో ఈ స్వాతంత్ర్య మూర్తి ! చేయి పట్టుకోనిరా బయటికి కాంతి బిందు నేత్రాలతో, చీకటి హృదయంలో ఉదయంతో కదలే మన ముందు, త్యాగ కుసుమ తోరణాలు స్వాగతం చెబుతాయి మనలో వసుధైక భావం ! వసుధపై మన అపూర్వ బింబం మానవ చేతనలో స్వేచ్ఛకు సంకేతం, చరిత్రలో ప్రగతికి సోపానం
5. ఆత్మ బింబం ఎక్కడో వెతక నక్కర లేదు, ఇక్కడే ఉన్నాను అనుభవ రూపంలో నినాదం కాదు సిద్దాంతం కాదు అతీతం కాదు పురాణం కాదు అన్నిటినీ అధిగమించిన నిజం అన్నిటినీ విలీనం చేసుకున్న వాస్తవం అణువు నుండి అణువుకు క్షణం నుండి క్షణానికి అనుబంధంతో ఎడారిలో పచ్చని నిజమై బంధం నుండి స్వేచ్ఛతో ఇక్కడే ఉన్నాను తప్పని విషమ లిప్తలు ఎరువై ప్రతీ క్షణం భవిష్యత్తు బార చాచి
ఊపిరి తీగెలపై కాలాన్ని సాగిస్తూ వర్తమానం ఆయువు పెంచుతూ, అహం నుండి క్రమించే ఆనందాన్ని, చీకటి నుండి వచ్చే ఉదయాన్ని ప్రపంచం మేల్కొని ఉన్న మనస్సుకు ఏ క్షణానికా క్షణం ఒక సమస్య భూమి ఆకాశంతో పాటు ఆశలూ కలలూ కామనలూ మనిషిని వీడవు ! ఇక్కడే ఉన్నాను నేను స్వర్ణ సత్యంలో వజ్ర సుందరంలా ఇక్కడే ఉన్నాను నేను బ్రతుకు నేలపై కృషి ఫలంగా మానస శిఖరం నుండి వివేక లహరి వరకు విరిసిన జన గణంతో ఎక్కడో వెతక నక్కర లేదు ఇక్కడే ఉన్నాను అంతరంగ మూర్తిని ! పలుకుతూ అందరిలో వివిధ రాగ కళనై మెదలుతూ అందరిలో ఒకే ఆత్మబింబమై జన స్వామ్య చిత్రమై వర్తమానం స్క్రీడైపైమేల్కొన్న ఈ సమయం (1975) అంకితం మహాకవి శ్రీ శ్రీ కిమేల్కొన్న ఈ సమయం సూచిక 1. వర్తమాన స్పందనం పుట 2. నిన్నను మరచి ..... 3. శూన్యాన్ని స్మరింపజేసి 4. నిశ్శబ్ద చరణాలపై 5. పొలిమేరలు అంతరాలు 6. లెక్కలేని ప్రాణం
7. వెలుగు వార్త 8. వేళకు లే ! నిద్రించకు 9. నవ్వకు విరగబడి నవ్వకు ! 10. ముఖం ఎత్తిందో లేదో 11. ఆడబడే చీకటి బంతులు 12. సూర్య బింబమై
2. మేల్కొన్న ఈ సమయం (1975)
1. వర్తమాన స్పందనం అరుణ కిరణ పంక్తి వెనుక నుండి మంటల అరపులు నడచే సూర్యుని గుండెలో ఎగసే మంటల సుడులు నడి నెత్తిన సూర్యుడు నిటారుగా మస్తిష్కంలోకి దిగేనా ? ముందుకు వెళ్ళే సూర్యుడు వెనక్కి అడుగు వేయలేడు మండి మండి సాయం సంధ్య కట్టెల వలె బూది తలపులు రాలుస్తుంది ఇపుడు రాత్రి కన్పించదు గుండెలో విప్లవంతో భ్రమించే సూర్యకణాలే తెల్లవారితే చెమ్మగిల్లిన కళ్ళతో, పాలిన ముఖాలతో సాగే జీవితాలు ఉదయ కిరణ శ్రేణుల్లో పలికే స్వాగత వచనాల్ని వినాలిసి ఉంది ! సాయం కిరణ పంక్తుల్లో ఒలికే తృప్తి రేఖల్ని చూడాలిసి ఉంది
2. నిన్నను మరచి నిన్న దూసిన బులెట్ల గాయాల పచ్చిదనం ఇంకా మాన లేదు నిన్న క్రమ్మిన ధూమ శిఖల నీలి ముద్ర లింకా వీడలేదు
ప్రయాణంలో బడలిన శరీరం సత్తువ చేదుకుంటూంది హక్కులకై ఆక్రందన కల్లోల నినాదాలు పరివర్తనకై పోరాటం ! అశాంతి నాటకంలో విరామ శాంతి వలె ఈ సమయం ఎదురౌతుంది ఇపుడు పలకాలిసింది, వెనుకబడిన హిమ హృదిలో తరణి కిరణ సంగీతం నిన్నను మరచి ఏ గోతిలోనో వదిలేసి వర్తమాన ప్రగతి హృదయం ఆవిష్కృతమవుతూంది వివిధ వర్ణ మత ప్రభలతో సుందరమై భుజాలపై కాశ్మీర్ శాలువాతో మేల్కొన్న ఈ సమయం స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగులు వేస్తోంది
3. శూన్యాన్ని స్మరింప జేసే గ్రీష్మం మాట ఎత్తకముందే కళ్ళ ముందు నేల బీటలు వారుతుంది కళ్ళలో శిశిరంతో కలలో వసంతంతో, ఎడారిలో నడక సాగుతూంది గమ్మం కన్పించకముందే అడుగుల ముందు పెద్ద లోయ నిలుస్తాయి ధరలతో పాటు పైకెగరలేని సామాన్యుల చెవుల్ని స్పృశిస్తూ విషమ వార్తలు మెరుపుతో ఆశను చూపేవో పిడుగుతో దగ్ధం చేసేవో దూసుక పోతున్నాయి ఈ దేశంలో బ్రతుకు దూకడమే గాని నడవడం లేనట్లుంది గుడిలో గంటలు ఆశల్ని ప్రతిధ్వనిస్తూ భయాన్ని కరిగిస్తూ మ్రోగుతున్నాయి మబ్బుగా మారిన స్వాతంత్ర్యం విద్యుదున్మేషంతో గర్జాగళంతో పైన నిల్చింది మబ్బును గాలిమాయం చేయ జూస్తుంది మెడలో నెక్ టైని గాలి ఎత్తుక పోజూస్తూంది ఈ సమయం మాటలతో కాక మంటలతో ఆలోచన కదలుతూంది ఇదీ దేశంలో సామాన్యుని జీవితం శూన్యాన్ని స్మరింపజేసే చిత్రం ఈమబ్బు దేన్ని మెరిపిస్తుందో ? దేన్ని అర్ధం చేస్తుందో తెలీకుండా ఉంది ఇది జన హృదయంలో మునుముందు నవోదార సమాజానికి నాంది పలికేనా ?
4. నిశ్శబ్ద చరణాలపై విసరిన ఆయుధం చుట్టూ నిశ్శబ్దం శాంతి వచనాలతో తిరుగుతుంది చెవి సోకే మాట చుట్టూ నిశ్శబ్దం మౌన దీక్షతో నిలిచి ఉంటుంది మెత్తగా శరీరాన్ని తాకే గాలి అంచుల్లో నిశ్శబ్దం రహస్యం చెబుతుంది ఎన్ని ముక్కలై చెదరినా నిశ్శబ్దం అంతలో పూర్వ రూపం పొందుతుంది ఎంతటి శబ్దమైనా నిశ్శబ్దాన్ని ఎన్నటికీ పూర్తిగా అంతం చేయలేదు
అలజడిలో ఆవేదనలో అశాంతిలో నిశ్శబ్దంపైకెగసి నిలుస్తుంది నిశ్శబ్ధం మేఘం వలె కదులుతుంది మెరపు వలె మాయమవుతుంది సహనంలో నిశ్శబ్దం, సరస్సులో చంద్రుని వలె బింబిస్తుంది శబ్దంలో మేల్కొన్న నిశ్శబ్దం మనో భూమికలో అర్థవంతమైన ఉదయం
5. పొలి మేరలు ! అంతరాలు! సరస్సులు ఎడారులు, మనస్సులో పొరల మధ్య ఎడారులు ! అంతరాలు ! లోలో పొరల్లో సరస్సులు ఎడారులు ! పొలిమేరలు ! విభేదాలు దప్పి కేసిన ప్రయాణికుని గొంతులోపడే తడి చార వలె నీటి జాలు ఒక చోటి నుండి మరో చోటికీ జనం గుంపులుగా కదలేరు ఎడారి బ్రతుకులో ఎక్కడెక్కడో పచ్చదనం లేకపోలేదు పొలిమేరలలో ఒక వైపు గుడిసెలు ! మరో వైపు మేడలు అంతరాల సుస్థితికై పొలిమేరల రక్షణకై సేవకులు భటశ్రేణి కండరాల నాట్యంలో అహంకృతిని అందంగా మలచుకొన్న అధికారం వెనుక ధనం బలం కుర్చీ చుట్టూ తిరిగే జీవితాలు వర్తనకూ వర్తనకూ ఆలోచనకూ ఆలోచనకూ మధ్య ఘర్షణలో ఒలికిన రక్త బిందువు చరిత్ర నుదుటపడి తిలక రేఖ అయ్యేను
6. లెక్కలేని ప్రాణం సముద్రంపై కదలే మబ్బు నీడల వలె ఎదురైన ముఖాల్ని దాటుతూ ఆపూట కేమి లేదో యోచిస్తూ ఇంట్లో అడుగు పెట్టాడు ఊగే బంతి పూల వలె ముంగిట్లో పిల్ల లెదురయినారు ఇంట్లో ఉన్న నలుగురూ రాత్రి అడవిలో ఊగే చెట్ల వలె ఉన్నారు గతం వర్తమానం అంతా కలిసి ముద్దగా ఉన్నట్లుందీ సమయం క్షణం ఆగిపోతున్నట్లుంది మనస్సు నిశ్చేష్ట స్థితి పొందుతూంది లైటు ఆరి చీకటి చూపే వెలుగు స్తంభం వలె ఉందీ వేళ వ్రేళ్ళ సందులో సిగరెట్ పొగ తరలే ప్రాణంవలె సాగుతూంది బాష్ప బిందువులో వెలుగు దుఃఖంలో ఆశను తలపిస్తోంది నెత్తురు కణంలో తేలే కిరణం జీవశక్తిని తెలుపుతోంది ఊరుపు అలపై తేలే హంస ప్రాణ శక్తిని స్ఫురిస్తోంది
నిద్రలో ఏ గుడిలోనో మ్రోగే గంటలు వినిపిస్తున్నాయి మేల్కొని లేచే లోపల ఎదురుగా ప్రేలిన పిస్టల్ ధ్వని మేల్కొన్న సమయం చెదరకుండా మెల్లగా జారుతుంది కళ్ళలో సూర్యులు తిరుగుతున్నారు ధమనుల్లో అగ్నులు నర్తిస్తున్నాయి కిరణం తొలగి పోతున్నట్లుంది ప్రాణం రెక్కలు విరిగి నట్లుంది డాక్టర్ ఊడిపడ్డాడు ! ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళాడు ఎవరి పనుల్లో వారు ! ఎవరికీ తీరిక లేదు అంతా మామూలే ! ఎంత ప్రాణ భయమో అంత ఆపదకు సులభ మార్గం శరీరంలో చేతన జారే లిప్త ! సమాధికి మొదటి మెట్టు ఎంతో ఖరీదనుకున్న వస్తువు జీరో విలువకు దిగింది ? హత్యా ? ఆత్మ హననమా ? పోస్్ట మార్టమ్ రిపోర్్ట రావలిసి ఉంది కలో ? వాస్తవమో ? మనో వైజ్ఞానికుణ్ణి సంప్రదించాలిసి ఉంది ముడి వీడిన మూట నుండి జారే వస్తువు పై వ్యధతో దోసిల్లో పడిన కన్నీటిని కదిలించే ఊర్పుతో విరామం లేని రొదతో సమయం కదలి పోతూంది
7. వెలుగు వార్త గాలిలో ఎగసిన స్ఫులింగం మధ్యలోనే బూదిని కౌగిలించుకొంది బొగ్గు కణికై జారిపడిన మరణ వార్త కోపంతో కోడె త్రాచై వ్యాపించింది సాగే ముందు సమాజ ముఖంపై అతడు నిలిపిన అగ్ని ప్రశ్న అట్లాగే ఉంది సమాధానం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి కూలేముందు చరిత్ర ముఖంపై అతడు నిలిపిన బాధా సమస్య అట్లాగే ఉంది, పరిష్కారం కోసం పరిశోధన జరుగుతూంది వాహనాలు కదలిపోతున్నాయి ఆలయాలు నిశ్చలంగా ఉన్నాయి అడుగు వేయకుండా కాళ్ళను చుట్టిన ఉదయ వార్త ఎదురుగా దేహం ! సంధ్యా బింబం వలె ఎదలో ప్రతిఫలిస్తూంది ముని మాపు చెరువులో చెట్టు నీడ వలె కళ్ళ ముందుతారాడే శాంతి తన మనుగడకై అపుడపుడూ అశాంతి కోరుతుందా ? ఈ దృశ్యం చూస్తే హృదయం విలోల జలధి యౌతుంది మతిలో సమయం సాయుధ మౌతూందా ? అన్నట్లుంది ! పట్టరాని అశాంతి నృత్య మెంత సేపు జరుగుతుంది
ఆగిన ఆలోచన అంతలో ప్రవాహమై పరుగిడుతోంది ప్రవాహ మెంత వేగమైందైనా పడవ నడిపే వ్యక్తిలో మనో బలం ముఖ్యం ప్రవాహ మెంత వేగమైందైనా పడవ నడిపే నైపుణి పైనే ఉంది ప్రయాణం
8. వేళకులే నిద్రించకు ఆ అర్థరాత్రి ఎవరా నిన్ను మేల్కొల్పింది ? మేమే ! సగం నిద్రలో లేచావా ? ఇప్పటి కింకా నిదురే పోలేదా ? రెండూ ఒకటే ! ఇంకా నిద్రలో తూగుతున్నట్లుందే! సరె కాని ! ఒక చెవి ఇటు పారేయ్ విను ! మేమూ తూగుతున్నట్లుంది ! గాంధీ నెహ్రూ బుద్ధుని గురించి కల లింకా నెమరేస్తూ పడుకున్నావా ? మేమూ అవే మాట్లాడేం మధ్య మధ్య నాలుక కరుచుకుంటూ ! నీకు జ్ఞాపకం లేదు ? అమ్మయ్యో! అపుడే ఎన్నేళ్లు వెలిగిపోయాయి దూలాలు పుచ్చిపోతే పోటీలు పెడుతూ, గోడలు కూలితే తెరలు కూరుస్తూ పంది కొక్కులు చేరితే బోనులు నిలుపుతూ, కలుగల్లో మట్టి కూరుస్తూ స్వాతంత్య్ర దినోత్సవానికి వెల్లవేస్తూ ఆ నివాసమే సంస్కృతి చిహ్నం మా కానందం మా కళ్ళలో పొద్దు పొడుస్తూంది మాటల్లో పొద్దు క్రుంకుతూంది చీకటికి భయం వేసి మూల మూలల్లో ముఖం దాచుకుంటూంది మళ్ళీ నిదుర పోయే లోపల చివరి మాట కాస్త విను ! వేళకులే ! సగం నిద్రలో తూగుతూ కలవరింతలూ మానేయి, ఈ రోజైనా! ఈ ఇల్లు కూలే లోపల లేస్తావు కదూ ! అపుడు నిన్ను లేపే వారుండరు ఎవరి భయంలో వారు ! ఎవరి స్వార్థంలో వారు ! ఎవరికి పట్టింది ? ఆ నిద్ర ఏదో త్వరగా కానీ! మేల్కొని మాత్రం కలలు గనకు ! నీ కలల్లో మమ్మల్ని తూగించకు నీ ఊహల్లో వేగించకు, వికసించకు! నిద్రపోయే దేశమా ! నీ నిద్రే మాకో అడ్డు తెర ! మా స్వేచ్ఛకు సావకాశం అర్థరాత్రి మేల్కొల్పింది ఎవరైతేనేం మనవాడే మానవుడే! శాంతమూర్తి! మళ్ళీ నిద్రిస్తే ఇప్పట్లో లేవవనే నమ్మకం ! అదే మాకు రక్షా కవచం !
9. నవ్వకు విరగబడి నవ్వకు ! నవ్వకు ! పగలబడి నవ్వకు ! గుండె తూగి చేతిలో పడేను నవ్వకు ! విరగబడి నవ్వకు ! గుండె జారి నేలపై పడేను దూరం వినరి పడిన నవ్వుల్ని చుక్కలు వెతుక్కుంటాయి
ఈ నవ్వులు నీ మనో భూమిక సూచికలై అదృశ్యమయ్యేను చీకటి అరచేయిలో నిరుపేదల బ్రతుకు దివ్వెలు మినుకుమంటున్నాయి చెదరిన గాజు ముక్కల్లో ఆశలు మొలకలుగా వెలుగుతున్నాయి మొక్క వోయిన పగటి ఖడ్గాన్ని గాలులు సాన పడుతున్నాయి మసక చీకటి ఇసుకలో వెలుగు జాడల్ని గుర్తించీ గుర్తించని విధంగా పెద్దలు చీకటి నీడల కన్నా ఇంటికి పోయే తొందరలో ఉన్నారు ఉన్నట్లుండి వీధి దీపాలన్నీ ఒక్కమారు మేల్కొన్నాయి మొగ్గలో రాలి పడే సామాన్యుని పగటి కలల వలె నవ్వకు పగలబడి నవ్వకు ! ఎవరిని చూచి ! నిన్ను చూచి నీవే ! నవ్వకు ! నవ్వకు విరగబడి నవ్వకు ! ఎవరిని చూచి ? మనిషిని చూచి మనిషే !
10. ముఖ మెత్తిందో లేదో కాలం ముఖమెత్తిందో లేదో, మనస్సు చంకెక్కాలని చేతులు చాస్తుంది ఆలస్యం చేస్తే మారాం చేస్తుంది పట్టు పడుతుంది విలపిస్తుంది కాస్త చనువిస్తే కొండెక్కించమంటుంది చందమామను తెమ్మంటుంది చంద్ర బింబంతో ఆడుకోవాలనీ చుక్కల పూలు కోయాలనీ కోరుతుంది ఆకాశాన పరుగెత్తాలనీ అసంభవాన్ని సంభవం చేయాలనీ కోరుతుంది శైశవం దాటే కొద్ది బీజాలన్ని వృక్షాలై కొమ్మలు చాచి నిలుస్తాయి నడక వచ్చిందో లేదో మనస్సు అందుకోవాలన్నా అందదు కాలానికి విసుగు లేదు కాని మనస్సుకు తీరిక ఉండదు మనస్సు ఎప్పటికీ శిశువుగానే ఉండలేదు కాలం మాతృత్వం వీడదు
11. ఆడబడే చీకటి బంతులు ఆలోచన ఆగుతుంది క్షణం పెను బండ వద్ద ప్రవాహం వలె ఆలోచన క్షణంలో ఎగుస్తుంది ఆవేశంలో గాలికి అల వలె నడవనీ ఉద్రేక శిఖరాలు తిరగనీ కల్లోల వలయాలు ప్రాణ వంతమైంది బ్రతుకుతుంది శక్తియుతమైంది నిలుస్తుంది త్రుటిలో వనం దగ్ధం కాదు వ్రేటుతో పర్వతం ముక్కలు కాదు అడవులూ పర్వతాలూ ఈ ప్రయాణంలో తప్పనివీ అనుభవంలో దోషాన్ని దూరే కన్నా దండన విధించే కన్నా సరించనీ సమస్యపై ఎక్్స కిరణం చీకటి క్రమ్మిన హృదిలోకీ అగ్ని చిమ్మే మతి లోకీ
పెదవులపై పిట్టల వలె ఎగిరే మాటలు, తుపాకి గుండ్ల వుతున్నాయి ఎదలో నెమళ్ళ వలె ఆడే ఊహలు నవ మారణాస్త్రా లవుతున్నాయి మండే ఎండల్లో రోడ్ ప్రక్కన నిశ్చలంగా పడి ఉన్న కుర్రవాణ్ణి ముందెట్టుకొని ఉదోషణతో తల్లి డబ్బులు పోగు చేసుకొనేను దప్పిక తీరని కళ్ళతో ఆకలి తీరని ముఖంతో కళ్ళుమూసి పడుకున్న దౌర్భాగ్యుని సమీపంలో మృత్యువు చదికిల బడి ఉంది అలంకారంతో ఒళ్ళు విరుచుకొనీ నిల్చిన మేడ ముందు అడుక్కునే విషమ సమాజంలో ! పీడితులు పరిచ్యుతులు ఆటలో చీకటి బంతులు !
12. సూర్య బింబమై నిద్రలో చీకటి మాయమౌతుంది మెలకువతో వచ్చి వాలుతుంది పగలు మండి మసియై రాత్రి మొలకెత్తుతుంది పచ్చగా నిలుస్తుంది దిశ నుండి దిశకు కదులుతుంది ఒడ్డు నుండి ఒడ్డుకు ఈదుతుంది భయానికో ప్రయోజనానికో దీనితో నేస్తం చేసేవారూ ఉన్నారు స్వార్థానికో అలసట మరిచేందుకో దీన్ని మన్నించే వారూ ఉన్నారు ఒకపుడీ చీకటి పూలు పూస్తుంది, ప్రమిదయై వత్తికి ఉపయోగిస్తుంది దీన్ని ఎవ్వరూ అంతం చేయలేరు, దీనితో ఎప్పుడే అవసరమో తెలీదు ఏదో రూపంలో చీకటి లేకపోతే, ఇంతటి మానవ చరిత్ర ఉండేదా ? ఒకపుడు చీకటి క్రమ్మి దారితోచక ఉక్కిరి బిక్కిరై చావడమూ ఉంది ఒక్క వెలుగు పోచకై అర్రులు చాచి చీకట్లో కుమ్ముకొని చావడమూ ఉంది ఈ చీకటి ఫల రూపాన్ని ఆప్వాదించని వారెవ్వరు ? దీని రుచి లేంది ఎవరికైనా జిహ్వ తుప్పు పట్టిపోదూ! ఎగిరివచ్చి వాలే చీకటి పక్షిని మౌనంగా స్వీకరించు నొసట పూచే దీని పూలను దూసి భద్రంగా దాచుకో ! నిలువునా ఎదురైన చీకటి ఓ చిన్న దీపం వెలుగులో మాయమైనట్లున్నా ! దారి మధ్య మనస్సులో పులి వలె పీట వేసుక కూర్చుంటుంది ! ఏమైనా ఇది ఉండనే ఉంటుంది ! మనలో ! ఏదో స్థాయిలో ! ఈ సమయం మనిషి చేయగలిగిందొక్కటే ! మనస్సులో సుకుమార సూర్యబింబమై మేల్కోవడం !శబ్దమై ప్రాణమై (1976) అంకితం కీ॥ శే॥ శివలెంక శంభు ప్రసాద్ గారికి
తెలుగు జాతి ఎదలో సంస్కృతీ స్పందనమై నాకు తెలీకుండా నిశ్శబ్దంగా నాలో ఉన్నావు కదలీ కదలని చంద్ర రేఖ వలె పవమాన మూర్తివై కాంతి లహరివైశబ్దమై ప్రాణమై సూచిక పుట 1. 2. 3. నాలో ధ్వనిస్తూ బిందువూ ఆకృతీ నిశ్శబ్దముఖాన 4. ప్రాణమై 5. మిగిలిన శకలాలు 6. వీచే గాలిలో 7. నిద్రించనీ తృప్తిగా 8. ఎవరి ముఖం చూచినా 9. ప్రతి దిశలోనూ 10. నేటి నిజంకానీ 11. ఈ శిలలు నిశ్శబ్ద శిఖరాలు
12. చీకటి అడుగు తీసి 13. శిశిరంలో 14. రాత్రి రైలు కదిలింది 15. కదలే శిలల్లో 16. వెలగని దీపాల్లో 17. దుగాలిసిన వెలుగు . . . . 18. పదపద పయోదమై 19. అద్దంలో 20. ఈ ముఖాల వెనుక నుండి 21. నాలుగు దిశలూ, దారులూ 22. ప్రాణియత్నం 23. ఎట్లాగో ఇంకా 24. అనుబంధం 25. జీవితమై
3. శబ్దమై ప్రాణమై
1. నాలో ధ్వనిస్తుంది నాలో ప్రపంచం శబ్దమై ధ్వనిస్తుంది, నాలో సమాజం ప్రాణమై వెలుగుతూంది నాలో దిశ దిశ తలెత్తిన ఆకాశం ఆత్మకు సంకేతమై ప్రతిఫలిస్తుంది క్రింద పరచిన ఎదతో అవని బ్రతుక్కి ప్రతిరూపమై నిలుస్తూంది ప్రాణం నుండి బీజ భూతమైన ప్రపంచం సంకల్పంతో శాఖాకీర్ణమైన జీవితం అనుభవానికి వాస్తవమైందీ ! ఆత్మకు సన్నిహితమైందీ !
2. బిందువూ ఆకృతి రాత్రి కళ్ళలో దిగిన ఆదర్శ ప్రపంచంతో పడుకుంటాను ఉదయం కళ్ళ ముందు వాస్తవ సమాజంతో మేల్కొంటాను అటు ఆదర్శం ఇటు వాస్తవం రెండు తీరాల మధ్య వర్తమాన ప్రవాహంలో పడవ వలె నేను ప్రతి వస్తువుకూ చరిత్ర ఉంది, మనిషి చరిత్ర గతి రేఖ ఉనికిని స్థిర పరుచుకొంటూ రూపాన్ని సరిదిద్దు కొంటూ గమనాన్ని నిర్దేశించుకుంటూ సాగే సంఘర్షణ క్రియామతి మనస్సు సంస్కృతీ బిందువు, ప్రవర్తన ఆకృతికి రేఖా రూపం
3. నిశ్శబ్ద ముఖాన నిశ్శబ్ద ముఖాన పల్లవించే చైతన్యం వలె ఉదయించే సూర్యుడు నిశ్శబ్ద ముఖాన కదలే ప్మృతులు మంచు వలె రాలేను శిలపై కురిసే వాన జల్లు వలె నిశ్శబ్ద ముఖాన శబ్దం అనుక్షణం వర్ణాలు మారే ముఖంలో శబ్ద రూప చిత్రాలు ప్రతి క్షణం ఊహలు తరలే మనసులో నిశ్శబ్ద పవన గంధం ఆరిన నిప్పులో, ఆకు రాలిన మ్రోడులో ఇంకిన సరస్సులో నిశ్శబ్దం ఆకృతికై తహ తహ లాడే బిందువులో నిశ్శబ్ద జీవనం బ్రతుకులో ఆరాటపడే ప్రాణ శక్తిలో నిశ్శబ్ద రేఖా చిత్రం హృది నుండి ఎగసే అనుభవం వలె నిశ్శబ్ద ముఖాన చంద్రుడు సూర్య చంద్రులు వెలిగే ఆకాశాన నిశ్శబ్దం నుండి శబ్దం వస్తువూ స్మృతీ ప్రతిభాసించే మతిలో నిశ్శబ్దం నుండి శబ్ద ప్రపంచం దిక్కుల్లో ఉదయంవలె శరీరంలో ప్రాణ స్పందనం
ఆకలి ఉసి గొల్పిన తెలివితో మనిషి యాత్ర ప్రారంభం ఆకలి తీరడంతో వెలుగులోకి సాగే పై దశ మొదలు! ఏదో పోగొట్టుకొని దారిలో వెతుక్కునే వ్యక్తి వలె రాత్రి చంద్రుడు గుంపులో ఉన్న మనిషికి ఒంటరి తన మెక్కడిది ? గుంపు తనలో ఉన్నపుడు సమాజంతో భేదం లేదు
4. ప్రాణమై మనసులో మూల నుండి మూలకు ఖేచరాలు శ్రేణులుగా ఎగిరేను మనసులో చోటు నుండి చోటుకు భూ చరాలు వరసగా కదిలేను మనసులో ఒడ్డు నుండి ఒడ్డుకు జలచరాలు మూకలుగా ఈదేను ఆకాశం భూమి సముద్రం వంటి మనస్సుతో మనిషి, మనిషి మాత్రమే కాదు
5. మిగిలిన శకలాలు చెట్లు గాలికి జల జల పూలు రాలుస్తూ త్యాగాన్ని నిర్వచిస్తాయి గాలి నిశ్శబ్ద నిశా శరీరాన్ని స్పృశిస్తూ ప్రేమను ఒలుకుతుంది మనిషి ఉంది గాలిలో కాదు అవని పై వాస్తవ తలంపై ఎండ విరిసీ మంచు రాలీ నీడ తొలగీ శిల లట్లాగే ఉన్నాయి పేదగా అంబేదగా యుగాల దుఃఖ తప్త శకలాలుగా ఉదయమైందో లేదో బ్రతుకంటే ఏమిటో దిశలే చూపిస్తాయి
6. వీచే గాలిలో గాలి వీస్తుంది, పైకి తీసుకెళ్ళే మబ్బుతో, ప్రాణం లేచి తేలినట్లుంటుంది ఒక్క ఉరుముతో అందరూ అభయనికేతనం కోరతారు ఒక సమయంలో ప్రియమైందే భయ బాధా కారణమౌతుంది ఆకర్షణతో వికర్షణతో మోదమై ఖేదమై మరో శక్తికి సంకేతమౌతుంది నాకు మొదటి నుండీ పని ఆ మబ్బుతో ఈ నీరుతో మబ్బు కన్పించే సరికి మనిషి చరిత్ర జ్ఞప్తికి వస్తుంది ఆహారం వ్యవహారం అధికారం సౌఖ్యంకై తపించే నీడలతో కాల పటంపై బింబించే వివిధ వర్ణ సమావేశ చిత్రం నా రూపం ! రొట్టె కోసం ముద్ద కోసం ఎక్కడ లేని బలంతో అంగలేస్తూ భయాన్ని చీల్చే మెరుపుతో ధైర్యం మెరసే ఆలోచనతో
ఇసుకపై కాలే కాళ్ళతో ఆశతో శూన్య ముఖ వాలకంలో ధన సుఖ సంపాదనకై బంతుల వలె తరలేరు మనుషులు
7. నిద్రించనీ తృప్తిగా ఎక్కడి నుండో పక్షులు వచ్చి చెట్ల గుండెల్లో తల దాచుకుంటాయి ఇది పై కెగరడంతో బ్రతుక్కి పాఠం మొదలౌతుంది ఇవి క్రిందికి దిగడంతో విశ్రాంతికి నాంది అవుతుంది ఒక్క అంగలో గగనం బంధించాలనీ త్రుటిలో ఆకాశం మూట కట్టాలనీ మనస్సు తహ తహతో కుదుపు కుదిపి ముందుకు నెడుతుంది అక్కడి నుండి అంతా కొత్త ! అప్పటి దంతా పాత బడి పోతుంది పక్షులు వచ్చి విశ్రమించనీ, రెక్కలు విప్పి వలయాలు దాటనీ గుంపులుగా పక్షులు రానీ శాఖ పై గూడులో తృప్తిగా నిద్రించనీ జన్మతో మనిషిలో ఎదిగే చెట్టు గురించి వేరే చెప్పాలా ?
8. ఎవరి ముఖం చూచినా ఎవరి ముఖం చూచినా తమ వైపే తిరిగి ఉంటుంది ఎవరి చూపులు చూచినా తమ వైపే కదులుతూంటాయి ఎవరి అడుగులు చూచినా తమ వైపే తిరుగుతూంటాయి ఎవరి స్వరం విన్నా తన రాగమే పలకాలని ఉంటుంది ఎందరి రూపం చూచినా ఏ ఒకరి లోను పోలిక ఉండదు ఎవరి నీడ చూచినా ఒకదానిపై మరోటి పొంచి ఉంటుంది ముఖం ముడుతల్లో భద్రంగా ఎన్ని ఏండ్లు ముడుచుకున్నా మరో ఏడు ఎదురవగానే కొత్త ముఖం చూచినట్లే ఉంటుంది పగటి కలలు కంటూ తీరిగ్గా రాత్రి చుక్కలు లెక్కిడితూ ఓపిగ్గా క్షణాల నీడల నుండి వాటిని దాటే ప్రయత్నమే బ్రతుకంతా చీకట్లో భయంతో కంపించినపుడు ధైర్యంతో నిలిపిన శక్తీ మనస్సు కోపంతో చెదరినపుడు పిచ్చెత్తకుండా నిలుపుతుంది చీకటి నడక నేర్చిందో లేదో వెలుగును తరుమ జూస్తుంది వెలుగు తన శక్తిపై నిలిచిందో లేదో చీకటి దాని కాళ్ళ వద్ద జీరాడుతుంది ఎంతో యత్నంతో తొలచిన శిల్పంలో అన్నీ అమరుతాయి ఆత్మ తప్ప
ఎన్ని ఉన్నా ఆత్మ లేంది జీవితాని కస్తిత్వం లేదు, పరమార్థం లేదు దిశ దిశ నుండి గాలి మనస్సును దూరం తీసుకపోతుంది ఉన్న స్వేచ్ఛతో సమయం ఉదారం కానీ, కాంతి బిందువుతో మనోజ్ఞం కానీ
9. ప్రతి దిశలోనూ నాట్యం చేసే ఆలోచనతో నాలో పరచుకొన్న సముద్రం చంద్రుడు కన్పించగానే నా విషయం పూర్తిగా మరుస్తుంది నదిలో ప్రయాణంకై ఎవరూ కాదనకుండా రావచ్చు ప్రవాహంలో కొట్టుక పోడానికి మాత్రం ఎవరూ రారు మనిషిలో ఆలోచన కత్తి అంచు అవకూడదు కాని మనిషి ఉన్న పరిసరాలూ శత్రుమయం కారాదు చేతుల్లో సత్తువ చేరగానే కాళ్ళలో బలం రాగానే ఇంట్లో పసి కూనకూ బయట పడాలనే ఆరాటం కళ్ళలో పరచుకొన్న ఆకాశం ఒక సమయం కాంతి వర్షిస్తుంది గుండెలో ఒదిగి ఉన్న అనురాగం ఒక సమయం జలద మవుతుంది మబ్బును కదల్చి జీవనం తెచ్చే గాలి, నిప్పును రగిల్చి మంటనూ రేపుతుంది బిందెడు నీరు కావాలి, కాని బావిలో బొక్కెన మునిగేట్టు లేదు నేల పొరలెన్ని ఒలిచినా నీటి చుక్క కన్పించని దశలో ప్రవాహాన్ని గుర్తించడమే కాదు దాన్ని సమీపించే భయమూ పోవాలి అదృష్టం కలిసివస్తే ఏ రత్నమో అవలీలగా దొరకొచ్చు జీవిత మున్నంత వరకూ సమస్య లెక్కడికీ ఎగిరి పోవు భూమి ఉన్నంత వరకూ సముద్ర మెన్నటికీ ఇగిరి పోదు ప్రతి ఉదయం కొత్త మనిషి నాలో అవతరించేను పలకరించేను ప్రతి రాత్రి ఆ మనిషి నా నుండి చెప్పకుండా నీడతో నిష్క్రమించేను
10. నేటి నిజం కానీ ఎదురయ్యే ఆశల్లో మబ్బులు వ్రేలాడీ క్రింద నదులు జీరాడీ చెరువుల కడుపులు నిండీ గ్రీష్మం నిన్నటి వార్త వర్షం నేటి నిజం కానీ గుండె నుండి మాట వరకు చెరువు నుండి పంట దాక ఒకే సృజన శక్తి పరంపర, మొలక నుండి ఫలం వరకు సర్వం శుషీభూతం చేసే ఋతు నిష్క్రమణంతో
ఎండిన నది అయినా మండే రక్త తరంగం కారాదు మనస్సును ఆర్ద్ర చేసే ప్రతి ఋతువు కాహ్వానం ! అవని పాడనీ జల ధుని ఆడనీ గుండెలో ప్రాణ శక్తి వెలగనీ ! ఈ సమయం నిశ్శబ్దంగా పడి ఉన్నది రేపు మ్రోగే వాద్య బృంద మవుతుంది పూలతో పండ్లతో చెట్లు మనిషి హృదయ రూపాల్ని తలపిస్తాయి ఒక తరం నుండి మంచీ చెడూ గ్రహిస్తూ మరో తరం వస్తుంది ఈ చెట్లను వదిలేస్తే మనిషి కథా ప్రసక్తి లేదు ఈ మబ్బును వదిలేస్తే జీవిత గమనం లేదు వర్తమాన స్వాదు ఫలం కోరి మనిషి పెరిగేను కాలంజాడల్లో అవసరాలతో, అవి తీరే ఆలోచనతో
11. ఈ శిలలు నిశ్శబ్ద శిఖరాలు నిశ్శబ్దం తిరుగబడిందా పీడనలో అసహనం హింసతో జ్వాలా పద సంచారంతో సమయ శిఖరం బ్రద్దలైందా ? సంపాదన ఓ మూలకు రాని కార్మికుల గళం నుండి ఆర్జన ఓ కారుకు రాని కర్షకుల కంఠం నుండి వెలువడిన శబ్ద తరంగం ఏ సంగీతం వినిపిస్తుంది హెచ్చిన సంరంభంతో ప్రజ ! నినాద తరంగాలు ! నిశ్శబ్దాన్ని కవ్విస్తున్నాయి ! శబ్దాన్ని అలంకరిస్తున్నాయి ఆకలి మంటను చుట్టుకొని పడుకొన్న గుండెలో రక్త కణం మంటయై కదులుతుంది చీకటి పైకి ఉదయం రా రాదని తలుపులు వేసే రా ? తలుపులు తెరవ లేదని ఏ కిరణం ఆగదు ఎదలో కదలుతుంది అంకురమై, ఊహలో నర్తిస్తుంది ధారమై ఉదయం కదలనీ స్వేచ్చగా, వెలుగు రానీ స్వచ్ఛంగా క్షితిజం శబ్దాన్ని అనువదించనీ హృదయం ప్రాణాన్ని అనురణించనీ జనం నిండుగా కదలనీ శబ్దం కదలనీ, వెలుగుతో నాల్క పై
12. చీకటి అడుగు తీసి చీకటి అడుగు తీసి వెలుగు అడుగు వేయగానే ముంజేతిపై కపోతంతో కాలం ఎదురౌతుంది క్షితిజం వెలిగిస్తూ నీహారం కరగిస్తూ సమయం మనిషికి తన రూపాన్ని తనకే గుర్తింప జేస్తుంది ! సముద్రం వంటి సమాజంలో మహాప్రాణి వలె మనిషి ! సముద్రం నుండి బయట పడితే మిగిలేది జడం ! కాసేపు దాహాన్నీ ఆకల్నీ నిప్పు రవ్వల్లా ఆర్చుకుంటూ చిరు కోర్కెలతో పిట్టలే నీడ పంచనో చేర జూస్తాయి ! కష్టాల్ని విసరేసి, దుఃఖాల్ని విదలించీ నిరాశను తగలేసీ లోయ నుండి నేలకూ ఎడారి నుండి మైదానానికీ మనిషి తరలేదు కన్నీరెండి మండే చెక్కిళ్ళపై కదలే వ్రేళ్ళు వెచ్చని స్వరం వినిపించేను ఎండిన కట్టెకు బిగించి తీగపై మధుర స్వరం వినిపించేను శబ్దమై ప్రాణమై ఆపై సోపాన క్రమంలో జీవితమై ఆశా కవచంతో ముందుకు నడవడమే మనిషి ముందు కర్తవ్యం !
13. శిశిరంలో శిశిరంలో చేతులెత్తి చెట్లు ఆక్రోశిస్తాయి సన్నని జ్వాలయై ఆశ నాలుక చాస్తుంది ముఖాన టవల్ కప్పుకొని ఆకాశం విలపిస్తుంది మబ్బు పొడ లేదు చివురు ముఖం లేదు చినుకు కన్పించదు బ్రతుకు గడచే కరువూ, మ్రోడూ బ్రతుకంతా పరచిన ఎడారి ! సమయాని కన్నీ సిద్దిస్తూ పోతే, జీవిత మెట్లా అవుతుంది ? రాత్రి రైలు కదిలింది స్టేషన్ వీడుతూంది
14. రాత్రి రైలు కదిలింది ప్లాట్ఫార్్మ పై లైట్ల వెలుగులో ప్రయాణికుల ముఖాలు మెరుస్తున్నాయి స్తంభాలకు వేలాడే వెలుగు బల్బుల్ని మింగేయాలనీ చీకటి వేచి ఉంది క్రింద పారే నదిలో బ్రిడ్్జ పై దీపాల ప్రతిబింబాలు కలలవలెఉన్నాయి అక్కడే చీకటి ముని వ్రేళ్ళపై నిల్చొనే ఉంది
ఉన్న కాస్త సమయమూ సాగనీ గాలి బ్రిడ్జి దాటనీ అంటుంది మనస్సు పాపం అన్నా భయం లేని శాపం అన్నా విచారం లేని మొండి ఘటాల వలె ఇరు వైపులా కొండలు పెనుబండలు నిటారుగా రొమ్ములు చాచి ఉన్నాయి స్టేషన్ చేరే వరకూ చెప్పరాని తొందరలో గుండె దడ దడ లాడుతూంది ఇంజన్లో కణకణ లాడే నిప్పును జ్ఞాపకం చేస్తుంది బయటి వెళ్ళితే ఇంటికి వచ్చేదాకా భయ బంధువుతో కాలక్షేపం! సంభాషణలో కాలానికి కథ తొడుగుతూంది క్షణాలు విడిపోతూ కాలాని కాభరణాలుగా మారే తొందరలో ఉన్నాయి మతిలో అనుభవ చిత్రాలు అద్దంలో ప్రతి బింబాలవలె తోస్తున్నాయి మరో స్టేషన్ వచ్చే వరకూ వేగంలో పదిలంగా కన్పించే విరామం ఆలోచనా తరంగాలతో విశ్రాంతి ఎరగని సముద్ర తీరంవలె ఉంది
15. కదలే శిలల్లో భూమి పై బ్రతుకుకై బ్రతుకులో ప్రాణంకై మానవతా వజ్రంపై సంఘర్షణ సాగుతుంది వ్యక్తి తలం నుండి సమాజ తలంపై ఈ సమయం నిశ్శబ్దంగా నింగిలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి కాక నేలపై శిలనూ చెట్టునీ మనిషితో మనిషినీ అనుబంధం చుడుతూంది నీలి అంచు ఆకాశంలో వెలుగులతో ముఖ చిత్రం మారుతూంది పాత బడిన రాత్రి భయం ఉదయం నీడయై మొలకెత్తుతూంది భౌతికం నుండి మానసికానికి వ్యక్తి నుండి సమాజానికి అనుభవ ప్రపంచంతో ఆలోచనా కిరణంతో మనస్సు కదులుతూంది ఉబికిన కండరాలతో సాగిన ధమనులతో అరుణ వదనంతో విసరే మెరపు చూపులతో కదలే మేఘ కళతో, తోచే బ్రతుకులో రవ్వల వలెనో ఆకుల వలెనో క్షణాలు నిశ్శబ్దంగా రాలి పోయేను బరువుతో వంగి పోక, నిరాశతో కుంగిపోక, ఈ సమయం కదలనీ భయం నుండి స్వేచ్ఛలోకి, వెలుగు లోకి, ఈ సమయం కదలనీ ఊపిరి అలపై తేలే, సంస్కార కళతో, నవ సమాజ వర్తనతో తరలనీ వెలగని దీపాల్లో దాగిన కలలు నీవు చూశావా ? కదల్లేని సరస్సులో అణగిన ఉత్సాహం కన్నావా ? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కదా ? ఎంత దూర మంటూనే చదికి లబడిపోయేవా ?
16. వెలగని దీపాల్లో గ్రుడ్డిదనం చెవిటిదనం జన్మ శిల్పమయి పోయిన నాయకులకు శిలా ప్రతిమ వేయడమే మిగిలిందిక ? ఎటు నుండి ఎటు వైపుకు శాంతి పదం ప్రగతి పథం ఏది శాంతి ? ఏది కాంతి ? ఏ గుండెకు ? ఏ కళ్ళకు ? చెవిటికి వినరాదని మేఘం గర్జన మానదు గ్రుడ్డికి చూపు లేదని ఉదయం నర్తనం ఆగదు పక్షుల శబ్దాల్లో ఏ అర్థం పలికేదీ వాగుల నడకల్లో ఏ రాగం ఒలికేదీ చూడు చూడు ! ఏ చేతులు ఏ వెలుగుల నార్పేదీ పలుకు పలుకు ! ఏ ఎండలు ధారలనింకించిందీ బ్రతుకు బరువు ! ఏ మనిషిని మట్టిలో అణచిందీ భగ్న మనసు ! ఏ బ్రతుకును గాలిలో కలిపిందీ ! కొండల్ని పిండి చేస్తే మనస్సుకు మెలకువ వచ్చేనా ? అద్దాన్ని పగుల గొడితే ముఖం ముక్కలయ్యేనా ? అద్దంలో బింబించే వాలకాన్ని దాచేసే సమయం రావద్దు
17. దూకాలిసిన వెలుగు నీ స్మృతి శిఖరం పగులు వాసి ఎంత కాలమైంది ? నీ ముఖ దర్పణం ముక్కలై ఎంత కాలమైంది ? నీ ఆలోచనలో శిఖలు ఆరి ఎంత కాలమైంది ? చెప్పు ! హింస నీకు ఆయుధమై ఎంత కాలమైంది ? అశాంతికి శ్రేయో గీతం అఖండంగా పాడేవా ? పగలు నిశ్శబ్దపు లోయల్లో వసించేవా ? రాత్రి నేలపై విలయశబ్దమయ్యేనా ? బూది దిబ్బలు కెలుకుతూ నిప్పు రవ్వలు చిమ్ముతూ హసించేవా ? నటించేవా ? అవతారానికి మురుస్తూ అగ్ని పథం గుర్తుగా నెత్తురు అడుగుల ముద్రలు శ్రేయో గతికి లక్ష్యంగా క్షితిజంలో అగ్ని ప్రభలు ! రోజు పై రోజు మంచు తెరలతో తరుముకొని వస్తుంది పై నున్న ముఖ బింబాల్ని కన్పించ నీయడం లేదు వెలుక్కి అడ్డు నిల్చే మంచు పొరను చీల్చి
వెలుగు దూకాలిసిఉంది ! జనతా సౌభాగ్యంగా స్వేచ్ఛగా
18. పద పద పయోదమై పద గమనంలో కొత్త లయ స్వరసరణంలో నవ రాగం ఏ దైవం కాదు నీవు ! అంత కన్న ఏ బొమ్మ కాదు బొరుసు కాదు అవును నీవు మానవుడవు ! జీవ కణం నుండి ఆత్మ వరకు వారసుడవు ఏ పాప మెరగంది భయం దేనికి ? ఏ దురాశ లేంది ఆందోళన దేనికి ? అహంకార విస్పోటంతో గడుసు దెయ్యాలు చోటు చేసుకొంటాయి లేని పోని భయ క్రీడలతో చుట్టూ నీడలు బొమ్మలుగా భ్రమింపజేస్తాయి నీలో తగిలించుకున్న రూపానికి నిప్పుపెట్టి మాపేయి నీలో వ్రేలాడే నీడల్ని మాపే రవి కాంతి సోకనీ గతం నుండి వర్తమానానికి పచార్లు చేస్తే పరిపోదు ఆలోచనా సంస్కారంలో నవ ఝరీ పరివర్తన రానీ కాలం చెల్లిన ఆకుల్ని రాలుస్తూ వేచివున్న చివుళ్ళను సుమింపజేస్తూ ముఖంలో పైరు కళతో ఊపిరిలో ప్రాణి ఆయువుతో పద పద! పయోదమై ప్రవాహాని కుత్సాహ శక్తి నిస్తూ కదలు కదలు ! మనిషీ ఎడారికి జీవన ధన మిస్తూ కాలాన్ని చీల్చే జ్ఞాపకాల కాంతితో, కాలాన్ని దూసే ఆలోచనా తరంగాలతో సమాజంలో భాగం నీవు ! నీలో ఈ సమాజంనీ అస్తిత్వానికి మూలం !
19. అద్దంలో అద్దంలో చూస్తే ముఖంలో ఒక్కొక్క రేఖ సముద్ర తరంగంలా తీరంలో అవని అంచులతో వలె చేతి వ్రేళ్ళకు స్ఫురిస్తుంది ఒక్కొక్క రేఖలో పూలతో పండ్లతో చెట్ల వరస జ్ఞాపకం వస్తుంది ఒక్కొక్క రేఖలో పొలాల గట్లూ ఎడారి పంపులూ తలపుకు వస్తాయి పగటి చరిత్ర మరచి కూర్చున్న మనిషి నిశా ముఖంలో రేఖల సందుల్లో నుండి ఉదయ రేఖలు పొడ సూపాలి
20. ఈ ముఖాల వెనుక నుండి ఈ ముఖాల్లో కొత్త బింబాలు ఈ రేఖల్లో ఉదయ ప్రభలూ చూడాలి
ఇక్కడ మంచు గుట్టల వలె గడ్డ కట్టిన కలలున్నాయి ఇవి కరగీ తొలగీ ప్రయాణానికి సుగమం కావాలి ఈ కలలు ప్రవహించాలనీ సంగీతం వినిపించాలనీ ఉంది ! మ్రోడు వారిన బ్రతుకులూ దిబ్బలేసిన ఎడారులూ లేకపోలేదు ఈ స్థితులు వెలుతురులో సౌభాగ్యం పల్లవించాలని ఉంది మ్రోడులు పచ్చని ముఖంతో దిబ్బలు జీవన ధునులతో ఈ శిలలు ! ప్రాణిత రూపాలై జీవితం పొందాలనీ ఉంది !
21. నాలుగు దిశలూ, దారులూ ఊపిరాడని గదితో ఏంపని ? వెలుగు నిల్వని బ్రతుకుతో ఏం పని ? గదికి దిశలు నాలుగు చూపుకి ఒకటే, మనస్సుకు దిశ లనంతం నాలుగు వైపుల నుండీ ఆకర్షణలో వికర్షణలో నాలుగు దారుల మధ్య మనిషి దారి ప్రక్క కన్పించే సమాధి గురించి శ్మశానం గురించి అడక్కు సమాధిని పెల్లగిస్తే కన్పించేముంది ? అగ్ని మనస్సులో ఉందే ! శ్మశానం కెలికి చూస్తే కన్పించేదేముంది ? ఆ ఊహలో అగ్నియే ! దారులన్నీ చీలే రూపం ప్రయాణంలో మనిషికి తెలిసే జీవితం అన్నీ ఒక చోట కలిసే రూపం గమనంలో మనసుకు తెలిసిందే
22. ప్రాణి యత్నం ప్రక్కపై నుండి లేవగానే మరచింది జ్ఞాపకం వచ్చింది పిట్టలు కిచ కిచ మంటూ గూడు కోసం పుల్లలేరుకొస్తున్నాయి బ్రతుకు గూడు కోసం మనిషిలో సంస్కృతి స్ఫురించింది క్రింద జారి పడిన పుల్లల్ని పైకి చేర్చే పనిలోనూ పిట్టలు ! కాస్త అలికిడికి భయపడి బయటికి తుర్రుమంటాయి అలకిడి సర్దు కోవడంతో రివ్వున లోనికి వస్తాయి ఆవగింజంత అనుమానంతో పర్వతమంత భయం పూచిక పుల్ల కోరికతో ప్రపంచం నిండే ఆలోచన అవరోధాలు తొలగే యత్నంలో ప్రాణి జీవితం రణ సదృశం కావచ్చు ! స్వప్నం మిగలవచ్చు !
23. ఎట్లాగో ఇంకా 'ఎట్లాగైనా బ్రతుకు' అని అనునయిస్తూ ఉదయిస్తాడు సూర్యుడు 'ఇంకా బ్రతికి ఉన్నావా' 'మంచిది' అని ఆశ్చర్యపడతాడు చంద్రుడు పౌర్ణిమ అడిగింది 'నీవు ఇక్కడే ఉన్నావా ? అనీ అమావాస్య వెతికింది " ఎక్కడున్నావు నీవు ? అనీ కాలానికి నేనేం సమాధానం చెప్పేది ? నేనే ఒక ప్రశ్నను ! పగలు బ్రతుకు బరువైతే రాత్రి నిదుర బరువులో గడుస్తుంది ఉదయం ప్రశ్నిస్తుంది "రాత్రి ఎట్లా గడిపావు ? సహనం కోల్పోలేదూ ? అని పగలూ రాత్రి తీరాల మధ్య ప్రవాహమై కదిలే నా చుట్టూ ప్రతిదీ నాపై పయనంకై అహరహం యత్నించేవే !
24. అనుబంధం నాలోని నిరాశను విసిరేశా ఎదురుగా ఎడారియై నిలిచింది నాలోని విషా దాన్ని తరిమేశా దూరంగా లోయై నిలిచింది నాలోని ఆలోచనల్ని వదిలేశా, పైన నీలి మబ్బులై సాగాయి నాలోని ఆనందాన్ని దుమికించా, ముందు పచ్చని చెట్టె వెలసింది నాకూ ప్రకృతికి వీడని అనుబంధాన్ని చూపిస్తాయి తలపిస్తాయి అన్నీ నాకు తప్పనివై జీవితంలో అనుకోకుండా దూరదూరం పోతాయి,
25. జీవితమై ఉదయ నీహారంతో మెరిసే శరీరాలతో దారి ప్రక్కన శిలలు ! రావలిసిన మార్పుకై వేచీ ! తరాలుగా పడి ఉన్నాయి నన్ను చూచి నవ్వబోతాయిః నాతో మాట్లాడబోతాయి ! పడి ఉన్న రూపాలకు ప్రాణం పోస్తూ మాసిన ముఖాల్లో రాగం తెస్తూ దిశ దిశ సమాజంలో ! ప్రజాస్వామ్య చైతన్యం ! ఇంత కాలం నిద్రించిన శిలల్లో ఇపుడు కొంత సంగీతం వినిపిస్తూంది ఇపుడు మనస్సు పరివర్తనతో భావ తప్త సువర్ణమై వెలుగుతూంది ! దీని కెంత ఆలోచన జరిగింది ? దీని కెంత సంస్కారమవసరమైంది ? తరాల శిలల నుండి చీకటి వేరౌతూంది వెలుగు నిలిచి పోతూంది ఈ శిలల్లో నుండి గాలి శబ్దమైంది సంగీతమై ! పలికాలిసి ఉంది
ఈ శిలల్లో నుండి గాలి ప్రాణమైంది జీవితమై ! కదలాలిసి ఉంది ఈ శిలల్లో నుండి వెలుగు జీవితమై సమాజమై ! చూడాలిసి ఉంది ! సమాజంలో ఉంది త్యక్తమై తిరస్కృతమై శిల వర్తమాన తలంపై మహా పరివర్తన కోరుతూ, శబ్దమై ప్రాణమై జీవితమై ఎదిగే శిల, మూలం ! ప్రతి మనిషిలో ఉంది పురా రూపమై బింబమైఅగ్నిమయం జీవితం (1980) అంకితం మహాకవి దాశరథికిఅగ్నిమయం జీవితం సూచిక 1. అగ్నిబుజాలపై పంజాబ్ 2. సూర్యునికీ చిరచిర పుట్టిస్తూ పుట 3. అగ్ని నుండి మేఘమై ..... 4. దాస్య శృంఖల మ్రోగుతూ 5. యాత్రా పథంలో 6. శ్రమ బిందువులో 7. మానవతా సందేశం 8. అగ్నిమయం ఈ సమయం
9. సమాప్తినందుకొనీ 10. ఏ బ్రతుక్కి ఆ బ్రతుకు 11. కిటికీలు మూయకండి 12. నిశ్శబ్దం ప్రేలుతూంది 13. అగ్నిమయం వాస్తవం 14. నిశ్శబ్ద గవాక్షం నుండి
15. కన్నీటి కధతో 16. ఏకాంత సమాజం .....వర్తమానం స్క్రీన్ పై - అగ్నిమయం జీవితం
4. అగ్నిమయం జీవితం
1. అగ్నిబుజాలపై పంజాబ్ దగ్గరలో ఉన్న మనిషి హృదయ స్పందన కన్నా ఆయుధ శబ్ద తరంగ మెంత దూరం నుండో వినిపిస్తూంది వీథిలో బడిలో ఇంట్లో ఆఫీస్ లో మృత్యు భయం తరుముతూంది శాంతిని గిరి శిఖరంపైకి అంతరాత్మను ఆకాశంలోకీ విసరుతూంది ఆలోచనల్ని సిద్ధంచేసి ఆయుధాలతో ఉగ్ర శిఖలు దూసుక వస్తున్నాయి
అక్కడక్కడ నెత్తురు మరకలు తప్ప మరే కీర్తిజాడలూ లేవు. రక్త చిత్రం ధూళిలో కలిసిందో లేదో, అగ్ని చిత్ర మవతరిస్తూంది ప్రజల ముఖాల్లో పూలు వాడిపోయి రేకలు ముడుచుకున్నాయి ఈ సీమలో ఆధునికం ఆటవికం జీవితాన్ని చెరొక వైపు నుండి ఒకటి మార్పుకీ మరొకటి సంక్షోభానికి లాగుతున్నాయి మంచు పిడికిట్లోఉన్న ఆకాశంలో సూర్యుని ప్రభ కన్పించడం లేదు స్తంభించిన వాతావరణాన్ని చీల్చుకొని నడవాలిసి వస్తూంది శాంతి సహన జీవితం జన సమ్మతమైనా ఇక్కడ ఆశాంతీదే పైచేయి ! కల్లోలం సముద్రం వలె ఉంది. అసహనం అగ్ని వలె ఉంది. వెలుగు తన ముఖం కాస్త దాచుకుంది, కాలం స్వప్నం వలె ఎదురౌతూంతి. ఇక్కడ తమ్ములూ చెల్లెళ ్ళ ఆకలితో కాదు ఆకలి తీరాక తీరికలో మెరపుల వలె ప్రశ్నించేరు ! పిడుగుల వలె నినదించేరు కత్తులు తూటాలు దూసిన దేహాలపై రాలే కన్నీటి బిందువులు మండే గాయాల మంటల్ని ఉపశమింప జేస్తున్నాయి ఈ బిందువుల్లో ఆర్తి, అగ్ని స్పర్శను తలపిస్తూంది సజీవ హత్యా కాండలో ఆదర్శం ఉన్మత్త సముద్రం వలె ఉంది ఏ మహాత్ముని నీడ కూడ సోకలేని రహస్య వ్యూహంతో ఉంది ఎద ఎదకూ మధ్య ఎడారి పరుస్తూంది ఎద ఎదలో కలహ ధ్వని సృజిస్తూంది ఇనుప కవచంతో బాష్ప నయనాలతో ఇప్పుడుందొకే ఒక అశాంతి బింబం ! హింసతో హత్యలతో విభుగ్నస్థితిలో సమాధులూ శ్మశానాలూ చేరుస్తూంది ఈ సమయం శాంతి సందేశంతో ఏ ఉదార మేఘమో కరుణిస్తే తప్ప ఇక్కడి బ్రతుకులో పచ్చదనం కన్పించేనా ? పరిమళం నిశ్వసించేనా ? ఈ చెట్టు చిగిర్చేందుకూ ఫలించేందుకూ అన్నీ సమయాని కమరేవైనా ఈ చెట్టు క్రింద మంటల సంగతి ? దీన్ని పెకలించి మరో చోట వేసేరా ? నేలపై నెత్తురు తడితో ఏదో కొత్త చెట్టును మొలకిత్తించాలనే ఆశ ! అమృత సరస్సులో అగ్ని వీచే సంచారం, జబీ హృదిలో ఆయుధ సన్నాహం అమృత సరస్సులో కదలే మానవతా మధు రుచి చూడాలిసి ఉంది జపీ హృదిలో ఎగిరే స్వర్ణ కాంతి కపోతాన్ని చూడాల్సి ఉంది.
2. సూర్యునికీ చిరచిర పుట్టిస్తూ క్షితిజంలో అంగారం చిమ్ముతూ, తీరాన అగ్ని శిఖలు దూకిస్తూ రక్తంతో పేంట్ చేసిన ముఖాలతో, నిప్పు రవ్వలు పొదిగిన నేత్రాలతో
అడుగుల క్రింద మృత్యు చలనంతో, వీపు వెనుక ఆయుధ సంరంభంతో అమృత సరస్సు అశాంతి సముద్రమైంది అనల శిఖలపై నృత్యం చేస్తుంది పంజాబ్ ఇంటి నుండి వీధిలోకి అడుగులు కదిలాయో లేదో ఏ వైపు నుండి ఆయుధం దూసుక పోయేదీ తెలీదు ఇరువైపుల అగ్ని చిత్రాల ప్రదర్శనతో అమానుష విషమ చక్ర ఘట్టనతో విషాద రాగం సమాజాన్ని బంధిస్తోంది, వ్యక్తి ముఖంపై నీలి తెర జారుతూంది కర్ఫ్యూలో బొగ్గు వలె పరచుకొన్న అశాంతి క్షణాలు విసరేసిన నిప్పు రవ్వ కంటుకొని కణకణ లాడుతున్నాయి. ప్రతిరోజు జన పదంలో మొదలయ్యే ఆర్తి స్వరం శ్మశానంలోనో సమాధిలోనో అణగి పోతూంది కాళ్ళు ముడుచుకొనీ పెదువులు బిగించీ గాలికి రెపరెపలాడే పేజీలతో ఏ ఆయుధ మలంకరించేదీ తెలీని రహస్యంలో ఉన్నాయి మత గ్రంధాలు మౌఢ్య శిలపై రక్త రేఖ నిలుపుతూ, ఆటవిక రాజకీయం నెగ్గ జూస్తూంది ఇపుడు మనిషిని మనిషి వేటలో, జంతువు కన్నా మృగం కన్నా హీనం మతం ఉదార భూమికను వదలి, వెనుక నుండి గొడ్డలి వలె పని చేస్తూంది ఒక ప్రక్క ఆకలికీ అలజడికీ మరో ప్రక్క హా హా రవ హింసకూ సమాజం తెరచిన నోరు తెరచినట్లే ఉంది ! ఇపుడు నోట్లో రాలేది నిప్పు రవ్వలే !వర్తమానం స్క్రీన్ పై
అగ్నిమయం
జీవితం
- ధూళిలో పొగలో ప్రేమ కళికనూ అనురాగ కాంతినీ వెదకుతూ ఎతె న మౌఢ్య ప్రాకారంలా ఎదిగిన చీకట్లలో చిక్కుకొనీ స్వేచ్ఛ కోసం రక్షణ కోసం ప్రజ సతమతమౌతున్నారు నీటి పాయ మిగిలిన ప్రవాహం అంచుల్లో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నారు. హృదయంలో ఉదయ పతాకను దించేసి ఎగసే మంటల కెరటాలతో పూలూ పండ్లవలె బాగ్ బాంబుల్ని దాచుకొనీ విద్రోహులు కదలుతూన్నారు విస్ఫోటంతో భయ భ్రాంతమైన మనస్సుయుద్దావని వలె ఉంది. ఉగ్రవాద క్షతమైన క్షణాలు నెత్తురు లొలుకే నీడల వలె పడి ఉన్నాయి వెనుక నుండి ధూళి లేచి వీధిలో నిప్పు రవ్వలతో క్రీడిస్తూంది ఎవరికి వారేడ్వడంతోనే సరిపోతూంది మరొకరి కోసం తీరికేది ? ఉన్మత్తుని ఆలోచన వలె రాత్రీ పగలూ వేడి గాలి వీస్తోంది పల్లెలో పట్టణంలో పొలంలో తోటలో మనిషినీ చెట్టునూ ఊపుతోంది జారిన స్వర్ణ తోరణం తగిలి నాయకుల ఫాలం బొప్పికట్టింది
దివ్యత్వానికి చిహ్నమైన ఆలయం సమాజానికి విలయ బిందువు కాకూడదు జీవన సంస్కృతికి సంకేతమైన మతం, రాకెట్ దాడికి సిద్ధం కాకూడదు ఇప్పుడు నిజంగా ఏ భీ విషయం లేదు ! అంతా ఆతంక మతి గతిలోనే గుప్పిట్లో నుండి ఒక్కొక్క విషమ స్థితి కళ్ళలో ఎదపై దూకుతూంది నక్షత్రాల క్రింద పూల చెట్టు మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తూన్నాయి జ్వలన్మందార గుచ్ఛం వలెనో గురిపెట్టిన గన్ పాయెంట్ వలెనో ప్రేమకు చిహ్నం గులాబి గాయానికి చిహ్నమై కీర్తి వహిస్తూంది సమయం ఆపదల ముళ్ళ నుండి ముఖమెత్తి సూర్యునికి చిరచిర పుట్టిస్తూంది
3. అగ్ని నుండి మేఘమై ఎత్తిన నల్ల రాతి పిడికిలి నుండి అగ్నులు చిమ్ముతున్నాయి స్వేచ్ఛా తేజం తీవ్రమై క్రియా శక్తికి పదును తెస్తూంది దేశ దేశ సీమలు దాటి స్వాతంత్ర్య ముఖం నినదిస్తోంది జాతి వర్ణ భేదం లేని వర్గరహిత సమ భావం నవ రాగం స్పందిస్తూ అందిస్తూ చరిత్రలో సమాజానికి కొత్త విలువ లేర్పడుతున్నాయి నిశ్శబ్ద గర్భం నుండి శబ్దం ప్రేలుతోంది నిశ్శబ్దం అంచుల్లో శబ్దం మండుతోంది బీటలు వారిన ముఖంతో లోయ లెర్పడిన శరీరంతో వెలుగు గుండెపై చీకటి సరాసరి దిగుతోంది త్యాగ పతాకతో దూకే ఒక బెంజ్మన్ మొలాయెడ్ వెనుక నుండి సామాన్యులు సాహస శక్తితో అగ్ని తోరణాలయ్యేరు అందరిదీ ఒకే లక్ష్యం ! దేశ చరిత్రలో ప్రజాస్వామ్య వాస్తవం తెలుపు లేదు నలుపు లేదు ! ఏ భేదం లేదు వెరపు లేదు వెలుగు తప్ప ! ఏ వర్ణం లేదు మానవులంతా ఒకటే ! మానవతా రాగం ఒకటే ఇది మరచిన సమయం ఒక విషాద కావ్యం
4. దాస్య శృంఖల మో గుతూ ఎదురయ్యే ఆపదకూ హింసకూ మృత్యువుకూ బెదరి భయంతో ఏ జాతీ స్వేచ్ఛను వదలుకోదు, ఏ గుండెలోనూ ఆశయం తొణకదు చరిత్రలో ప్రతి మలుపులో జాతి కొక అగ్ని పరీక్ష !
ఆలోచనతో ఆదర్శం పై అనుభవ చలనంలో చుట్టూ ఇనుప ముళ్ళ తీగెలైన నీతి నియమ పంక్తుల్ని ఛేదించే కోరికతో ! ముందు కెళ్ళే సాహస మనివార్య మవుతూంది ఆజ్ఞానారణ్యంలో గుహల్లో సామాజిక పురా రూప పంక్తులతో మనిషిలో మరో జగత్తు ఉంది ! యుగాల సాహస చరిత్రతో బంధంతో ! అడవుల్నీ సముద్రాల్నీ జన పదాల్నీ దాటి కఠిన శిలా శాసనాలు ప్రేలుస్తూ పరాధీన జన సమూహ గళం నుండి శబ్ద శక్తి, స్వేచ్ఛకు పిలుపునిస్తూంది నరాల్లో రేగే పీడిత హృదయాగ్నిని ఆకుల్లో దాచేరా ? పూవుల్లో ముడిచేరా ? దాస్య శృంఖం ముక్కలయ్యే శబ్దం, స్వేచ్ఛా పక్షి రెక్కలు దువ్వుతూంది.
5. యాత్రాపథంలో జీవన పథంలో ఇరు వైపుల నున్నవి ఆశా ముఖాలు దీపాలని తెలుసు చీకటి మంజూషికలో నున్నవి మణులో ? ఫణులో ? అస్త్రాలో తెలీదు రాత్రికి తుది ఉంది ; మనిషి మతిలో దాస్యానికి రూపం లేదు పట్ట పగలు కర్ఫ్యూలో జడ రూపం కన్నా నిశ నయ మనిపిస్తుందివర్తమానం స్క్రీన్ పై
అగ్నిమయం
జీవితం
- దెబ్బతిన్న పగలు చీకటి గాయాలతో ఒరిగిపోతూంది వెలుగు శూన్య సదనం కావచ్చు కాని ధైర్యాన్ని కోల్పోడం లేదు ఆర్తి నిశ్శబ్దాన్ని భరిస్తుంది కాని నిష్క్రియను కోరదు ఆదర్శంలో త్యాగం కీర్తి కళలతో విశ్వరూపం పొందుతూంది జగత్తు పగలు వెలుగుతుంది మండుతుంది రాత్రికి చల్లబడుతుంది మనిషి వెలిగి మండి మండుతూ ఎపుడు చల్ల బడేదీ ఎవరికీ తెలీదు యాత్రా పధంలో చీకటిపై పోరాటం సాగుతూనే ఉంటుంది స్పందనలో ఆలోచనలో క్రియలో రవి తేజం ఆగదు.
6. శ్రమబిందువులో శ్రమ బిందువులో మౌక్తికాన్ని గుర్తిస్తూ శ్రమ సంపదతో జీవితం నిర్మిస్తూ శ్రమను ప్రేమిస్తూ జనస్వామ్య సామాజిక శక్తియై ఉద్యమిస్తూందీయుగం స్వార్ధ శ్రేణి శ్రమ శక్తిని తృష్ణ తీర్చే సాధనంగా మారుస్తుంది శ్రమపై సానుభూతి వృత్తితో బ్రతికే శ్రేణి కూడా ఉంది
భృతి దొరకడమే వరమై పరిసరాలు అవసరాలు బ్రతుక్కి రూపాన్నిస్తాయి బ్రతుకు విలువ సంపదతో కొలిచే శ్రమ గౌరవాన్ని పొందుతూంది పంజరంలో ప్రాణి చలనానికి ఏ గుణం లేని స్వేచ్ఛ ఉంది అడవిలో స్వేచ్ఛకు దారి దొరకని నగరంలో ఆటంక ముంది ఊదిన కొలిమి మంటపై ఉదయ పుష్పం వలె శ్రమలో ఆనందం పొందే ఈ యుగం మనిషిలో కళ్ళ మెరపులో కన్పిస్తుంది నవ జిగీషా రూపం
7. మానవతా సందేశం గళ గళం నుండి స్వేచ్ఛ శబ్దమై ఆపై ఆయుధమై వర్తిస్తూంది ఉద్యమం వెన్నెల్ని కూడా రక్తచిత్రంతో అగ్నిమయం చేస్తూంది నిన్న వియత్నాం నేడు దక్షిణాఫి కా రేపు మరో దేశం సానుభూతి ఎదకు ఒక్క కన్నీరేకాదు ! పరిష్కార స్పర్శకూడ అవసరం ధమనుల్లో స్వేచ్ఛాగ్ని నిరంకుశత్వాన్ని బూది చేస్తూంది దీన్ని చూచే మతి లేకపోయినా చూడవలసే వస్తుంది. అడుగడుగున బంధనలో ఆలోచన ఆయుధమై కదలుతుంది అదే శరీరం ! అవే గాయాలు అయినా ఊహలో లక్ష్యంతో మరో జగత్తు ఎక్కడ శిరస్సు వంగినా తమస్సు వాలినా రావలసింది కావలసింది స్వేచ్ఛా తేజమే ! ఎక్కడ మంట లెగసినా ఆర్తి మండినా రావలసింది కావలసింది మానవతా మేఘమే !
8. అగ్నిమయం ఈసమయం ఈ సమయం అగ్ని మయం; శిలా రూపాల్లోను అనలకణం జ్వలిస్తూంది సర్కస్ తీగెపై నడుస్తూన్నట్లు జీవిత క్షణాలు ఊగుతున్నాయి చూచే వాళ్ళకు తమాషా అయితే ఆ నడిచే మనిషో చావు బ్రతుకుల సంధ్యలో కదలే ఇనుప సంకెళ్ళ ధ్వనిలో కలిసి స్వరం బరువుగా వినిపిస్తోంది ఎవరి స్వరం వారిదే ! ఏ స్వరాన్నీ ఎవరూ ఆపలేరు అణచలేరు మార్చలేరు ! అగ్నిమయం ఈ సమయం హృదిలో రాగ మెప్పుడో ఇగిరి పోయింది కణకణంలో కోపం కసి ద్వేషం కలిసి ఒకటై పోయాయి
కర్ఫ్యూలో తెరచిన ఆకలి నోట్లో రైఫిల్ గుండు ఎగసివచ్చి పడుతూంది. నాల్కపై నీటి బిందువుకు బదులు చిమ్మిన రక్తపు చుక్కలు రాలుతున్నాయి పైబూది పొర ఎగిరి పోయి మిగిలిన అనల కణ రాశి వలె ఉందీ సమయం, క్షుభితమై, స్వేచ్ఛకై తపించేను సామాజిక శక్తియై
9. సమాప్తినందుకొనీ అణువుతో అణువూ బిందువుతో బిందువూ ఊహ నందుకొని ఊహ స్వరంతో స్వరం అడుగు వెనక అడుగు ! సమాప్తినందుకొని ఆరంభం ప్రతి అంతరంగంలో సత్యం వెలిగే సూర్య బింబం వలె ఉంది బ్రతుకులో ఎగసే పొగతో ధూళితో మబ్బుతో కంటికి కన్పించదు క్షితిజ తూణీరంలో వెలుగూ చీకటి బాణాలతో నిల్చిన కాలం తలపై నుండి రాకెట్లు దూసుక పోతున్నాయి. షర్పై ఒలికిన సిరా చుక్కలతో స్కూల్ నుండి పిల్లలు వస్తున్నారు అగ్నులు నిద్రించిన హిమ కళికలు భవిష్యత్తు గగన మణులు !వర్తమానం స్క్రీన్ పై -
అగ్నిమయం
జీవితం
ఉదయం నుండి చీకటిపడేదాక ! మట్టి పై మేడకట్టే సంరంభం రాత్రి నుండి ఉదయమయ్యే దాకా మట్టిలో మేడనుకలిపే యత్నం ఉదయమూ రాత్రీ సృజనకూ విధ్వంసనకూ చిహ్నమైతే కానీ అగ్ని కళ అవసరమే, కాని జీవితం అగ్నిమయం కారాదు
10. ఏ బ్రతుక్కి ఆబ్రతుకు ఈ లేఖ నీ చేతిలో వాలిపోయి వేళ్ళ పై హార్మనీ మెట్ల వలె కదలుతూంటే నీలో శిశిరం వికసించిన సుమ హృదయమవుతుందనీ అనుభవం హిమాలయ శిఖరాన్ని స్పృశిస్తుందనీ నాకు తెలుసు నా నుండి నీవు ఈరోజు మరో రోజు నందుకునే దూరంలో ఉన్నా ప్రక్క గదిలో నా పిలుపు కందే దూరంలో ఉన్నట్లే ఉంటుంది పెదవుల మధ్య చిరునవ్వుతో అలంకరించిన ఈ లేఖ నీ చేతిలో మడచిన మొగలి పొరవలె అందగిస్తుందనీ తెలుసు నిన్ను చుట్టిన వినీల లిప్తల్లో మృదు తేజం తెస్తుందనీ తెలుసు నిశ్శబ్ద ప్రపంచానికి శబ్ద ప్రపంచాన్నిస్తుందనీ తెలుసు శూన్య మనః క్షితజంలో జీవన దృశ్యాల్ని చూపిస్తుందనీ తెలుసు
ఉన్నదానితో తృప్తిలో శూన్యత ఉన్నదే ! లేని దానితో క్షోభ చెందడం అలవాటే జగత్తు నుండి ఎదురయ్యే ప్రశ్నలకు శబ్ద రూపంలో మనస్సు ఇచ్చే అందమైన సమాధాన నిధానమే కవిత్వం. అద్దం ముందు నిల్చుంటే నా ముఖం బదులు నీ ముఖం కన్పిస్తుంది ఇక్కడి భయాల్ని రాయాలనే వాస్తవాల పొరలు విప్పి చూపాలనే ఉంది నీ గురించి ఆలోచన పరిమళమై వెలుగై అన్నిటినీ ముంచేస్తుంది ఏ రోజు కారోజు ఎంతో మిగిలే ఉంటుంది ఏ బ్రతుక్కి ఆ బ్రతుకు స్వయం సంపూర్ణం కావాలనే, ఇక్కడ వీధుల్లో చిన్నప్పటి నుంచీ చూచే బిక్షుక గణం అట్లాగే ఉంది వృత్తితో మార్పు లేదు, ప్రవృత్తి విస్తరించింది, పాత్రల వేషాలు మారాయి ద్వేషం అసహనం హింస బిగించిన వయొలా తంత్రుల వలె ఉన్నాయి కదిలిస్తే విషాద బింబ మొలికేట్లున్నాయి పలకిస్తే విలయ వీచి చిమ్మేట్లున్నాయి చెట్లపై పుష్ప ఫలాల్లో అరుణ ముఖాలు కలసిపోతున్నాయి ఇంటి వెనుక తీగెల్లో అనల కీలలు మెలగుతున్నాయి నీ పుట్టిన రోజు జ్ఞాపకం ఉంది ఆరోజు బంద్, మర్నాడు కర్ఫ్యూ రవి కిరణం సైతం నేలపై పాదం మోపడానికి భయపడుతున్న స్థితి ఇండ్ల చాటునో మనుషుల వెనకనో దాగి దాగి గాలి కదలుతూంది మనుషుల ముఖాల్లో ఎప్పటికీ అస్తమించే సూర్యుని జాడలే ! ఇక్కడ ఎవరూ ఒంటరిగా లేరు ! ఎవరి పనిలో వారున్నారు మనుషుల్ని శిల్పాలుగా చెక్కుతూనో, సర్కస్ జంతువుల్లా ఆడిస్తూనో నీడల్ని తొలగించే కాంతి హస్తాల కోసం నిరీక్షిస్తున్నారు దావాగ్ని నార్పే శాంతి మేఘం కోసం వేచి ఉన్నారు ఎంతటి కష్టాల్లోను బ్రతికేది, పగలబడి నవ్వడానికే ఆ నవ్వు గాలిలో ముక్కలై ఎగిరి నక్షత్రాలు కావచ్చు బూది లేచిన నిప్పు కణాలు కావచ్చు వేదనతో నిండిన గుండె నిద్రిస్తున్న జ్వాలా ముఖి వలె ఉంది విస్ఫోటనకూ విస్ఫోటనకూ మధ్య సమయం కన్నీటితో అలంకృతమౌతూంది బోనులో నుండి బయట పడి నిశ్శబ్దాన్ని భగ్నంచేసే మృగాలతో పరిచయంకొందరికి స్నేహంగా మారుతూంది ఎక్కడి వాళ్ళు అక్కడ నిష్క్రమించినా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఎన్ని చుక్కలతో ఎదురైనా ! పైన చంద్రుడు కన్పించినా రాత్రి రాత్రే !
దూరాన లేచే పొగ ! ఏ జలదానికీ సంకేతం కాదు దగ్గరలో వెలిగే దీపం ! ఏ ఉదయానికీ ప్రతీక కాదు దారిలో మెర్క్యురీ దీపాల వెలుగులో నడిచే నా కళ్ళను బుద్ధ మూర్తి, ఖుజరాహో, అజంతా శిల్పాల షోకేస్ ఆకర్షిస్తూంది ఈ ఆకర్షణలోనే ఈ లేఖ నిలిచి పోవడం మంచిదేమో !
11. కిటికీలు మూయకండి కిటికీలు మూయకండి తెరచే ఉంచండి, తలుపులూ తెరవండి ఏ క్షణంలోనో మానవతా గంధంతోవర్తమానం స్క్రీన్ పై - అగ్నిమయం జీవితం ఏ మనిషో కన్పించవచ్చు లోనికి రావచ్చు ఇక్కడ అందరికీ ప్రవేశ ముంది ! హృదయ పూర్వక స్వాగతమూ ఉంది ఎవరో శూన్యాన్ని వస్తుభరితం చేస్తారనీ, దైన్యాన్నీ సంపన్మయం చేస్తారనీ ! ఆశలో కోరిక ఆరంభలోనే ఉంటుందని తెలుసు ! హేతువు మీరిన స్పందనతో స్పందన మించిన హేతువుతో సూర్యుడు వెలిగినా మనసులో కిటికీలు తలుపులూ తెరవడ మవసరం ! ఆలోచనా పథం లేంది సమాజంలేదు అనుభవ శిల్పం లేంది జీవితం లేదు కిటికీలు తెరవండి ! ఎదురుగా కణకణలాడే నిజం కన్పిస్తుంది ! స్థలానికీ కాలానికీ ఇష్టానికీ అతీతమైన స్వేచ్ఛా సౌందర్యంతో మంచు తొలగిన సూర్యుని కిరణాల్లో మానవతా మందారమూ కన్పిస్తుంది తెరవండి తలుపులు ఏ మనిషో చేతనతో ఆత్మ బింబమై రావచ్చు గగనంలో వెలిగితే సరిపోదు సమాజంలో కిరణాలు కన్పించాలి.
12. నిశ్శబ్దం ప్రేలుతూంది శిలలో నిలిచిన నిశ్శబ్దం ప్రేలుతూంది, ప్రేలుతూంది నిశ్శబ్దం జీవితాన్ని స్పృశిస్తూ వాస్తవాన్ని ధ్వనిస్తూ నిశ్శబ్దం మ్రోగుతూంది గదిలో అద్దాలు పగిలే శబ్దం ! చెట్లు కూలుతూన్న శబ్దం ! పాతాళం లోతు వలె భయం, పర్వతశిఖరం వలె ఆశ్చర్యం, చెరో వైపు శిలలో దాగిన నిశ్శబ్దం ప్రేలుతూంది; శిలల కలలు భగ్నమౌతున్నాయి మేడల్లో నిద్రించే వాళ్ళు విసుక్కుంటున్నారు ఆపద శంకిస్తున్నారు. సామాన్యులు పట్టనట్లు తమ తమ పనులు చేసుక పోతున్నారు ఒక చేత పావురాయి నెగరేస్తూనే మరోచేత బాంబును విసరేరు
ఈదారినే నిరీహతో నిష్క్రియతో తూగేవారూ ఉన్నారు ప్రేలే మారణ శబ్దం గర్భంలో కూరుకపోయేవారు ఉన్నారు. నేలపై నెత్తురు చూచి గుండె చెదరి శిలలయ్యేవారూ ఉన్నారు. నిశ్శబ్దం గుండెల్లో శబ్దాన్ని మ్రోగిస్తూ శబ్దం అంచులో నిశ్శబ్దం వెదకుతూ క్షణాలు దోసిట్లో నుండి జారే పూల మొగ్గల వలె కదలి పోతాయి నిశ్శబ్దం గుండెలో సంగీతమవచ్చు; కళ్ళముందు పూలుగా రాలవచ్చు నిశ్శబ్దం గుండెలో విషాదం మ్రోగించ వచ్చు ఆ పై రాళ్ళుగాను పడవచ్చు శిలలో నిలిచిన నిశ్శబ్దం ప్రేలుతూంది ప్రశ్నల మెరపులతో సమస్య శబ్దస్తూంది పీడిత జన గాధా ధ్వనితో వాస్తవ గతి జీవన స్వరమై
13. అగ్నిమయం వాస్తవం సమాజ సంస్కృతి నుండి సామూహిక శక్తుల వర్తనతో స్థలం నుండి స్థలానికి మనిషి, వికసించే చేతనతో ప్రతీ జీవిత కథా భాగాలు సమాజ చరిత్రలో భాగాలే వెనక బడిన దృశ్యాల్ని స్మృతి కిరణం చూపిస్తుంది పెదవుల కదలికలూ నాలుక మలపులూ వేరైనా స్పందన ఒకటే అగ్నిమయం వాస్తవం నుండి అంతరంగాన్ని అందుకోవాలనే ! జ్వలించే ఆశతో దీపించే రాగంతో రగిలే వేదనతో ఈ జీవిత మొక విధంగా అగ్నిమయం వాస్తవం, హిమశిఖరంపై సూర్యునివలె అనుభవ శిఖరంపై మనిషి మనిషిలో నుండి సత్యమై సుందరమై అంతరంగ వాస్తవం
14. నిశ్శబ్ద గవాక్షం నుండి నిశ్శబ్ద గవాక్షం నుండి అనల చలన హస్తాలతో గాలి వీస్తోంది దారిన పోతూ గదిలో అద్దంలో తన వాలకం చూసుకుంటూంది తనలో తాను నవ్వుతూ నడక సవరించుకోనీ కదలుతూంది రాత్రి అంతా గది నిలువునా మౌనశిలవలె నిశ్శబ్దంగా ఉంటుంది ఉదయం కాగానే జీవన చలనంతో శబ్దమయ మవుతుంది కిటికి నుండి ఉదయం కన్నీట తడిసిన లేఖ స్ఫురిస్తుంది
మంచులో జారిన కిరణాలు విషాదమద్దిన ఆలోచనలవలె ఉన్నాయి మంచు తెరకదిలింది కన్నీటి పొర తొలగినట్లుంది చేతిలో పత్రికలో అక్షరాల మెరపుల్లో వేదనా శిఖలతో పంజాబ్ శ్రీలంక లెబెనాన్ సౌత్ ఆఫి కా బాధారుణ శకలాలు ! మంచుగడ్డ నుండి విస్పోటం సరోజలం నుండి మెషిన్ గన్ అట్టహాసం- వర్తమానం స్క్రీన్ పై అగ్నిమయం జీవితం యుగాలపై ఎదిగిన సంస్కృతీ శిఖరాలు కన్పించకుండా పోతున్నాయి గోడవంటి మౌఢ్యం తలపై మండే సూర్యుడు ఎంతసేపని ఉంటాడు గగనం నుండి జారే కన్నీటిని అవని ఎంతని లీనం చేసుకుంటుంది బాధతో వేదనతో అంగార వీచి సహస్ర చరణాలతో క్రమిస్తూంది నిశ్శబ్దాన్ని వెదరు వలె చీలుస్తూంది దారిలో ప్రవాహమై అన్నీ ముంచేస్తూంది ముందు జీవితం పీడన నుండి అవమానం నుండి ముక్త కావాలి దైన్యాన్ని మాయంచేసే మానవతా జలదం వెనుక నుండి రావాలి ఆటవిక యుగాన్ని అంటిపెట్టుకున్న క్రూర భీభత్స దృశాల్ని తలపిస్తూ నిశ్శబ్ద గవాక్షాలను వణకిస్తూ శబ్ద చిత్రాలు కదలుతూన్నాయి నిశ్శబ్ద గవాక్షం నుండి ఉదయం రక్త సిక్త ముఖంతో ఎదురౌతూంది ఆకాశం అనలచ్ఛాయల్ని తన బాహువుల్లోకి తీసుకుంటుంది అల్లుకున్న ధూమ శిఖల్లో చిక్కిన కాలాన్ని ఉద్దరించే చేతుల్లో అగ్ని నార్పే పరికరాలకన్నా ప్రాణంతీసే సాధనాలే ఎక్కువగా ఉన్నాయి హింసకూ అలజడికీ ఎవరూ సుముఖంకాదు ! అయినా వచ్చి పడతాయి స్తంభాల వెనక గోడలమాటున కేకలూ కాల్పులూ అనుమానం కదలుతూంది రాత్రి పూర్తిగా మేల్కొనే ఉంటుంది ! నిద్ర పోవడమెపుడో మానేసింది మండే గాయాల్ని ఉదయం మంచు పొరతో అద్దుతూంది మనిషి అందాన్ని బింబించే అద్దం పగిలింది చెదరిన అద్దం ముక్కలు కాళ్ళను నిలిపేస్తున్నాయి గవాక్షానికెదురుగా చెట్టు పై గూడు భద్రతను జ్ఞాపకం చేస్తూంది పృధ్వి నుండి గగనం దాకా మనిషి కోర్కెలు నేర్పుగా సంచరిస్తున్నాయి ఒక వైపు వీధిలో మంట బెట్టిన మానవత నిలువునా మండుతూంది దీన్ని సమీపించేందుకు ఏ జలదమూ సాహసించడం లేదు
15. కన్నీటి కథతో జలధిలో ఆయుధాల్ని ఎవరు విసరేస్తారు ? మనో గుహలోనించే ఉంటాయి
అరచేయి రేఖల్లో దారితప్పిన జీవితం, నోసటి రేఖల్లో తేలుతూంది భవిష్యత్తుకై ఒక్కొక్కపుడు గతాన్ని మరిచి పోవలసి ఉంటుంది వర్తమానం పై ఆశ ప్రయాణంలో తప్పదు, భవిష్యత్తు రహస్యం తెలీదు వాస్తవ దృశ్యంలో మృత్యు రహస్యం హఠాత్తుగా ప్రేలుతూంది ఎదలో విభావరీ శిఖలతో జనగణం సంధ్యాతరంగ మౌతూంది ఇక్కడ దేవతలకేం కొదవలేదు ! మానవతా మూర్తులకు తప్ప అవతలి వ్యక్తి బుజాలపై బరువు తోసి తప్పుకునేవారే ఎక్కువ! నిశ్శబ్ద గవాక్షం నుండి చూస్తే మానవతా మందారం ధూమయితమై నఖశిఖ పర్యంతం మండే ఆలోచనా కింజల్కలతో కన్పిస్తుంది ద్వేషానల పవనంతో సమయం సంధ్యాచరణాలపై కదలుతూంది శత్రుత ఎరుగని ఆకులపై పండ్లపై మృత్యు శిఖలు విసరుతూంది ఇళ్ళముందు బారులుగా గోడలు ! ముఖాన రాతలతో శరీరాన మచ్చలతో తలుపులు కిటికీలు మూయబడి జీవితాలు సమాధుల్ని సంవదిస్తున్నాయి పట్ట పగలే వచ్చి రాత్రి ఏ ఉన్మాదచర్యకో పైబడుతూన్నట్లుంటుంది మ్లాన హృదయంతో నగరం చలన రహిత ఛాయారూపం పొందుతూంది. శాంతి వనంలో పొదచాటున మృత్యు ముఖాలతో దాగేరు నీడ వెనుక అగ్ని శిఖలతో అమాయక కవచాలతో నిలిచేరు పచ్చని ఆశలో మండే కొలిమిని సృజించే మానవతా శత్రువులు ! నాగరక జీవితంలో గీసిన అగ్గిపుల్లలు కన్నీళ్ళతో జీవితాన్ని పండించే స్థితి వచ్చి వాలింది ఎండిన ఆకులతో వాడిన పూలతో శోకశాఖలు కదలు తున్నాయి ఈ సమయం సంక్షోభ సమాజం రుద్రభావ బంధుమౌతుంది ఉదయ సూర్యుణ్ణి అపహసిస్తూ జలదాల్ని చిన్నా భిన్నం చేస్తూంది ఒకవైపు మెరపులతో మబ్బులు ! మరో వైపు పొగలతో మంటలు ! ఈ నీడల్లో మంటల్లో ముసుగులో మానవతా ముఖం కరువైపోయింది రాత్రి నుండీ మండి అణగిన జ్వాలలపై ఉదయం కన్నీరు కారుస్తోంది జ్వాలలేంది ? కన్నీరు లేంది ? కథ ఏదీ ? ఈ కథతోనే జీవితమంతా ! ద్వేషంతో ఎరుపెక్కిన చెక్కిళ్ళను మంచు గాలి జాలిగా నిమురుతూంది హింసతో పదునెక్కిన చూపుల్ని ఎగిరే పావురాళ్ళు తప్పించుక పోతున్నాయి నిశ్శబ్ద గవాక్షం నుండి సంధ్యా దృశ్యాలు ! వీధిలో సామాన్యుని జీవిత శకలాలు పైకి చూస్తూ ప్రార్థన చేసే దోసిట్లో కన్నీరేకాదు ప్రక్క నుండి రాళ ్ళ పడొచ్చు
నిశ్శబ్దం మండుతూంది నిశ్చలంగా ! నిశ్చలం శబ్దిస్తూంది వేదనతో చీలే పొగల సందు నుండి ఎగిరే పావురాళ్ళు ! నీలి నీలి గద్దలుగా కన్పిస్తున్నాయివర్తమానం
స్క్రీన్
పై
-
అగ్నిమయం
జీవితం
16. ఏకాంత సమాజం ఈ జ్వాలలపై ఎవరు నీళ్ళు పోస్తారు ? కొందరికి మంటలతోనే జీవితముంది ఈ అలజడి శాంతి కోసమేనని అనుకొనీ ఆనందించే వారూ ఉన్నారు దాహంతో అలమటిస్తూ సమాజం సాయం సంధ్యా సమంగా ఉంది అక్కడక్కడ వర్షా స్వరంతో కదలే మానవతా పయోదాలూ లేక పోలేదు ఎంత వెలుగు దూకినా ధూళిలో కలిసిన ముఖాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి పులివేషం వేసే వీధి వీరునివెనుక పిల్లలు ఆడుతూ పాడుతున్నారు మధ్య మధ్య తోకలాగుతూ భయ తరంగాల్ని విసురుతున్నారు బిస తిప్పి నడిపేందుకు మనస్సు యంత్రం కాదు చెరపి తిరిగి వ్రాసేందుకు సమయం పలక కాదు. పీడనలో దోపిడిలో రాపిడిలో సాగే చరిత్ర బాధలో వేదనలో నిరాశలో కదలే జీవితం ఒక దానితో మరొకటి ! వేసిన అడుగులు తిరిగి వెనక్కి జరగవు చీకటిని చెరపే చేతులే చీకటి వలనూ విసరుతాయి ఒక చేతిలో పావురంతో ముచ్చటిస్తూ మరోచేత కత్తి పదును చూచేరు ఎవరూ చదవలేని గ్రంథం సమాజం, అందరినీ ఆకర్షిస్తుంది ఇంద్ర ధనుస్సు వలెనో మృగతృష్ణ వలెనో నిశ్శబ్ద గవాక్షం నుండి కన్పించే, దృశ్యపరంపర అందరికీ ఇష్టమే సెంటర్లో వెలిగే దీప స్తంభం వస్తువును విలువలతో చూపిస్తోంది. ఎప్పటికపుడు కలిసి విడిపోయే పరిచయ రూపాలతో ప్రజాగణం! పోరాట కెరటాలతో కదలే సమాజం ! బిగించిన పిడికిట్లో భద్రమైన ఆదర్శాలతో నిలిచేను ! తెరచిన పిడికిట్లో నుండి జార్చే వాస్తవ శక్తులతో కదలేను సంవేదన సంఘర్షణ సమన్వయంతో నిరంతరం మాటలతో ఆయుధ చలనంతో ఇంచుమించు రణ సమమౌతూంది హృదిలో శాంత క్షణాలు జారే బిందువుల వలె నిశ్శబ్దంగా ఎదురౌతాయి బిందువు బిందువూ కలిసి ప్రశాంత జీవిత బింబమవుతూంది గిరి శిఖరమై ప్రవాహమై సమాజమై కదలుతూంది నాలో
అపుడు మిగిలేది ! ఎక్కడికక్కడ ఏకాంత సమాజమే !కాలాన్ని నిలిపి క్షణం (1979) అంకితం ఏ రోజూ ఉభయ సంధ్యలూ ఒకటే అయిన కీ॥ శే॥ మాదిరాజు రామకిషన్ రావు పెద్ద అన్నగారికికాలాన్ని నిలిపి క్షణం 1. సూచిక ఆర్ధమై తేజమై 2. ఈ తీరం నుండి 3. 4. 5. ఈ చెట్టూ ఈ ఇల్లూ ఈ నీడన చెట్టు క్రింద ఈ దిశనుండి పుట 6. కాంతి స్పందనతో ..... 7. వర్తనలో శక్తియై 8. మానవతా రాగంతో 9. ఉదయ చేతనతో
10. ఆర్తినుండి 11. ఎవరా జీవించేది
5. కాలాన్ని నిలిపి క్షణం
1. ఆర్ద్రమై తేజమై సుదీర్ఘ నిశ్వాస పరంపరతో జలధి ఆయుః ప్రమాణాన్ని తలపిస్తోంది పవమానం పాడుతూ ఊపులో స్మృతులకు గాంధర్వ రూప మిస్తోంది రక్తంలో కణ కణంలో వసంత సూర్య బింబం వెలుగుతూంది దేహంలో అణువణువులో వన దేవతా ముఖం చిగురిస్తూంది కాల బింబం నాలో హరిణమై అంతలో సింహమై కదలుతూంది కాల ముఖం నాలో సపుష్పమై ఫలభరమై నిలుస్తూంది కిరణం అలవలె ఎదపై వాలుతూంది తొలగే ఊహ రానీకుండా శరీరంలో సన్నగా కోష్ణ స్పర్శ తెలీకుండా సరిస్తోంది తీగె వలె చేతుల్ని పైన వేసుకొనీ అధరాన్ని హాసంలో తేలుస్తూ చిలుక వలె కిరణం ముంజేయిపై నిలుస్తూంది, పూవును తలపిస్తూంది నేను జంతువున్నీ మృగానీ కాదు మానవుణ్ణి బంధువునీ జీవన గమన శక్తుల కేంద్రాన్ని కాలాని కాకృతి నిచ్చే శిల్పిని గుహా ముఖాల్లో నదీ తీరాల్లో అడవుల్లో కొండల్లో నా పాద ముద్రలు కన్పిస్తాయా ? నా కంఠ రవం వినిపిస్తుందా ? నైల్ నదీ తీరంలో రైడ్ యూప్రిటస్ అంచుల్లో ఓల్గా మేరల్లో గాంగ ధునీ సీమల్లో నేకన్న కలల్ని విన్న కథల్నీ కదల్చేనా ? రహస్యాల్ని వెలిగించేనా ? చలదరుణాధరాలు నాలోని మౌన గగనాన్ని శబ్దించేను ! జలదం మౌళిపై నిలుస్తుంది పవనం గుండెల్లో పలుకుతుంది కాలం ఆర్ధమై కదలుతుంది మనిషి తేజం కావ్యమై వెలుగుతుంది
2. ఈ తీరం నుండి నే నెవరినో చెప్పనా ? ఈ తీరాన ఆర్తిలో విలోలమై వికలమై అవని పై ఎగసిపడి కదిలే మానవ కథా తరంగ రూపాన్ని
అనితర శక్తులతో కాలం బింబించే సమాజ కళాకృతిని నన్ను చూస్తూంటే సూర్యుడుదయించే గగన ఖండం స్ఫురిస్తుంది రాలే ఆకులతో, వాలే నీడలతో, కాలంతో పాటే కదలుతాను. నా చుట్టూ రాత్రులు ! సూర్యుణ్ణి అందుకోవాలని తిరుగుతాయి నా చుట్టూ నీడలు చీకట్లను దాటేయాలని కదలుతాయి నాలో వెలుగులు ! చీకట్లను అణచేసే అడుగులతో గిరులు ఆకాశం వైపు చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉన్నాయి నదులు నేలపై నిర్భయంగా అన్నీ తెలిసినట్లు పరుగిడుతాయి పక్షులు తిరిగి తిరిగి తెలిసో తెలీకో మరో ప్రపంచంలోకెగిరి పన్నిన పెద్దవల వలె నున్న విశాల నగరంపై వాలుతాయి దూరాన వెలుగులో కరుణతో కరగే తుషార పంక్తి తెర వెనుక ఆకలితో వాలిన మంటలూ దుఃఖంలో చెదరిన నిప్పు కణాలూ చీకట్లను మెత్తగా చీలుస్తూ వెలుగుల్ని ఓపిగ్గా చిత్రిస్తూ వెనుక నుండి గాలి నెట్టే కొద్దీ ముందుకు సాగే తరగలం ఎగసే అరుణ బింబం నాలో వివిధ వర్ణ రూపాలు నింపుతుంది రోజులు వాలే వెలుగు నీడలతో నాలో వర్ణ చిత్రాల్ని చూపుతాయి ఈ చెట్టు ఏనాటిదో ? చిన్ననాటి నుండీ చూచేదీ
3. ఈ చెట్టూ ఇల్లూ గ్రీష్మ విస్ఫారంలో దైన్యంతో జలద చలనంలో హర్షంతో నిలుస్తుంది ఈ ఇల్లు ఏనాటిదో ? చిన్న నాటి నుండీ చూచేదీ స్నిగ్ద సమయాలతో విషమ వేళలతో స్మృతిలో చిత్రార్పితమైందీ బ్రతుకులో కఠోర వాస్తవాలకు మనసులో అగాధ రహస్యాలకూ ఈ కొండలూ సముద్రాలూ ప్రతీకలుగా తోస్తాయి బీడువలె పరచుకొన్న బ్రతుకు ఒక్క మేఘం కరుణిస్తే చాలదు చేతిలో చాక్లెట్తో ! పిల్లడిలా సంబరపడుతుంది ! ఒక రాయి చూస్తుంది మరో రాయి వైపు ప్రపంచం తీరే తెలీనట్లు పరివర్తనలో ప్రయోజనం తెలిస్తేగా, ఉలి తాకిడిలో శిల్పం చూస్తేగా ఊహలు సాగుతాయి మెరపులతో జలాభిషేచనతో గుండెలో ఉరుములతో వరదలతో భయం పొరలూ తప్పకపోవచ్చు మబ్బూ నీరు పైరూ పంట ఇల్లు మనిషి రూపాన్ని మారుస్తాయి సమాజ జీవితంలో కొత్త సృజన లోకాన్ని చూపుతాయి
ఈ మబ్బూ చెట్టూ ఇల్లూ ప్రకృతి మనోబంధాలకు భూమికలు
4. ఈ నీడన చెట్టు క్రింద ఆర్తి నుండి ఆనందాన్నీ ఊహ నుండి అనుభవాన్నీ వెలిగిస్తూ మంచు మెట్ల పై నుండి ఏ నీడ జాడ లేని హృదయంతో ఉషస్సు నాలోకి కదలుతూంది, నా రూపం మారుతూంది స్మృతి భూమి నాక్రమించి మనో వృక్షం శాఖోప శాఖలుగా ఎన్ని ప్రాణులకో ఆశ్రయమైందీ ఎన్ని కథలకో సాక్షిగా ఉంది ఆకాశం లోకి తలెత్తి గాలికి కదలే ఆకులతో చక్రూ రమ్యాకృతి ! చంద్రుడు దీనిపై నుండి విహగం వలె నిశ్శబ్దంగా ఎగురుతాడు దీన్ని చుట్టూ చీకటి గజం వలె తిరుగుతుంది వెలుగు అశ్వం వలె దూకుతుంది చుట్టూ పిల్లల గుంపు లా వెన్నెల ! కొమ్మల్లో భద్రంగా ముసలి చీకటి పైన నిప్పులు కురుస్తున్నా హృదయం హిమాభంగా ఉంటుంది గ్రీష్మంలో ఆద మరచి ప్రాణులు దీని పంచనే విశ్రమిస్తాయి కదలే పవన తరంగాల పై తేలే అనుభవ చేతనతో మనుషులు జాతి వర్ణ భేదం మరిచి మానవతా స్పృహపొందేరు తప్తమైన అవని వెనుక నుండి పచ్చని జ్ఞాపకాలు తలెత్తుతాయి చెట్టు దాపున శాంతి మండలం చేరే అనుభవం కలుగుతుంది బీటు వారిన భూతలం వర్షంతో మారి సమమైనట్లు చీలికలైన హృదయం, రాగంతో తడిసి ఒకటౌతుంది జ్వాలల వలె సాగే ఊహలు అంతలో శమిస్తాయి పూస్తాయి అలజడి పైబడి వచ్చినంత త్వరగా శాంతి అవతరించదు ఇక్కడికి రాగానే కళ్ళు నిదుర పొలిమేరలు చేరతాయి ఆగినట్లున్న కాల తలంపై ఊహ సాగుతుంది శాంత ధునియై కొమ్మకు పూచిన నక్షత్రం ఉదయం చేతిలో ఫలమై పడితే అదృష్టం కొమ్మ చాటు నుండి నక్షత్రం కాళ్ళపై బడి అంగారమైతే దురదృష్టం ఈ చెట్టు భుజాలపై బాల సూర్యుడుదయిస్తాడు మనిషి శక్తికి దీపమై దీని తలపై ఆకాశమూ చేతులపై క్షితిజమూ వ్రేళ్ళలో దిశలూ దీని పరిచయంతో హృదయం విరాట్ అనుభవం పొందుతుంది ఇక్కడ కాలం క్షణం ఆగుతుంది ఆ పై శ్రుతి సుభగంగా నదిస్తుంది వర్తమాన ధరణీ తలంపై నుండి నాలోకి నిరంతరం భవిష్యత్తులోకి !
5. ఈ దిశ నుండి నాలో చలించే ఊహలో, నదిలో అల వలె లయ ఈ దిశ నుండి ఆ దిశకు గుండెలో జీవ స్పందనం కాల చక్ర రవళితో అనుభవ కళతో పయనం సాగుతుంది వర్తమాన తరంగాలోలమై సమాజ తీరాల్ని స్పృశిస్తుంది గగనంలో తేలి గాలిలో కలిసే మేఘం సృష్టి మొదటి రూపం దున్నిన చాళ్ళతో భూమి దీనికై మొగం వాచి వేచి ఉంటుంది దిశల కళ్ళు కాయలు కాస్తాయి ! మనిషి హృదయం పరితపిస్తుంది మబ్బులు ఏకమై ఆనంద నృత్యం చేసే లిప్తకే సమాజంలో ప్రతీక్ష ! ఊహలో అనంతమైన కాలం తెరలు తెరలుగా కదలి వస్తుంది వెలుగూ చీకటి చరిత్ర పుటలతో దశలు దశలుగా తరలుతుంది మనిషి కదిలేను ! దాహం ఆకలి తీరే గతిలో తరంగ ద్రుతితో సమాజం అణువణువున ఆర్తి హరించే మానవతా వర్షంకై నిరీక్షణం
6. కాంతి స్పందనతో కాల జలధిపై నౌక వలె వస్తూ పోయే ఈ ఉషస్సు హిరణ్మయ తేజో రూపం ! మానవ చైతన్యానికి సంకేతం ఆనందానికి లక్ష్యమైన సమాజ కళ్యాణ తేజం సువర్ణమూర్తి ఇపుడు సౌందర్యం వర్షిస్తుంది ప్రొద్దెక్కితే గాని సౌఖాగ్యం తెలీదు పవమాన పరిమళంతో సువర్ణ కాంతితో తెలీని అనుభవాన్నిచ్చేను శరీర స్పృహను దాటిన దివ్యదశను బింబించేను శూన్య జీవితంలో వెలుగు నింపే శిశువు నవ్వు వలె ఉషస్సు ప్రతికోణాన్నీ కలిపే రేఖలతో వెలుగు ముగ్గుల్ని తలిపించేను అరుణోదయం ఏ నియంత తలపై మణి కిరీటం కాదు బ్రతుకులో దాగిన రహస్యాల్నీ ఒదిగిన సముద్రాన్నీ చూపుతుంది వివిధ కాంతి మేళనంతో ఆత్మలో బింబించే ఆనంద రూపం కదలే కాలం వేసే పగలూ రాత్రీ పాద ముద్రల హ్లాద రూపం ప్రొద్దు పొడవగానే ముఖంలో ముఖం పెట్టి రహస్యం చెబుతుంది ప్రతి ఉదయం ముందు ఉషస్సు వెలుగు నిచ్చెన వలె నిలుస్తుంది ఆలోచన నుండి అనుభవానికి క్రమంచే మనస్సుకు చిహ్నం చూస్తూ చూస్తూండగానే రాగం అదృశ్యమౌతుంది, భోగం మెరుస్తుంది పక్షుల కలకలనూ ఆకుల గలగలనూ ప్రక్కకు నెట్టేసి
మంచు కరగిపోతుంది అనల స్వరం వినిపిస్తుంది నేలపై వరసగా నీడలూ పైన మండే సూర్యుడూ నెత్తురోడే పిడికిలి వలె అరుణోదయం కదలుతుంది ప్రతిమల్లో గమన వైఖరి వస్తుంది తరగల్లో తురగ వల్గనం కన్పిస్తుంది సూర్య కిరణ చైతన్యం అణువణువున సంక్రమణం పొందుతుంది ఈ వేళ స్వేచ్ఛా విహంగం రెక్కలు సాచి దిక్కుల్ని కొలుస్తుంది ఇపుడు మనిషి అస్తిత్వం తనదే దేనికీ ప్రతిబింబం ప్రతి రూపం కాదు రాత్రి అయినా అర్థంలేంది కాదు ఏ సమయమూ వ్యర్థం కాదు ఉదయం మనిషికి జీవన స్పందనలో కొత్త లయతో గతినిస్తూంది
7. వర్తనలో శక్తియై జలధి తీరాన ఆర్ద్ర పవన తరంగం వలె ఈ సమయం హృదయం పలుకుతుంది సంగీత ధునీ స్వరం పగలు కదలి పోతుంది అహంకార శిఖలు వెలిగి చీకటి క్రమ్ముకొస్తుంది. చంద్రుడెంత వెలిగినా రాత్రి రాత్రే ! ఆకు రాలీ పూవు పూసీ జ్ఞాపకాల దిగంచలాల్లో కదిలే కాలం చంద్రుడు వెలిగే ఆలోచనతో చుక్కలు మెరసే ఊహతో ఎదురౌతుంది శిథిలాల్లో పగిలిన పెంకులతో ముక్కలైన బొమ్మలతో గతంలో చీకటి ఎక్కడెక్కడి కథలతోనో ఆకర్షిస్తుంది ఏకొండ వద్దో ఏకోనలోనో ఏగుహలోనో ఏనదీ తీర్థానో పగలూ రాత్రి జాడలు ప్రయాణంలో మురిపిస్తాయి ! పగలు బరువైన పని ఉందని రాత్రి రావడం మానదు అంతా నిద్రలో ఉన్నారని రాత్రి వేచి నిలిచిపోదు ! చూచే వాళ్ళు లేరని వెలుగు దిగులుతో దిశల్లో ఆగిపోదు ఎవరికీ మెలకువ రాలేదని ఉదయం నిరీక్షణలో నిలిచి పోదు పగలూ రాత్రి సుఖాల్ని దుఃఖాల్ని నింపుకొని పోయే కాలం ఉదయాని కల్లా కొత్తగా సంస్కార సుందరంగా అవతరిస్తుంది. అలలపై లేడి వలె ఎగురుతూ, తుషారాల్లో పూల వలె ఊగుతూ సముద్రంపై సమయ బింబం సహస్ర కరాలతో వస్తుంది చెట్టును చూస్తే తరాల జ్ఞాపకాలు ఇల్లును తలిస్తే అనుభూతి ష్మృతులు గిరిని చూస్తే చెదరని ధైర్యం ఝరిని చూస్తే దూకే ఉత్సాహం జల ధిని చూచినపుడు అందని లోతు గతాన్ని తలపిస్తుంది
మేఘాన్ని చూచినపుడు భవిష్యత్తు ఎదురౌతున్నట్లుంటుంది అరణి వంటి బ్రతుకులో వర్తనతో సంకల్పం అగ్నియై శక్తియై, సమాజానికివస్తుంది నవం ప్రగతి రూపం
8. మానవతా రాగంతో ఎదురుగా నిల్చిన దీప శిఖ వెనుక జడ శక్తి దాగి ఉంది దూర దూరం విస్తరించిన గగనం శూన్యం ఒదిగి ఉంది ఈక్షణా లొకటొకటీ మనస్సులో వికసించి పరిమళించేను కిటికీ ప్రక్క వెలిగే పూల తీగెల్ని వెలుగు గోముగా స్పృశించేను క్షణాల యోగంతో కిరణం బ్రతుకును వెలిగిస్తుంది క్షణాల ఘర్షణలో స్ఫులింగం బ్రతుకును దహిస్తుంది ఆకుల శిరస్త్రాణాలతో గొరిల్లాల వలె చిన్న చిన్న గిరులు వెలుగు రెక్కలతో సూర్యుడు యుద్ధ విమానం వలె ఎగసి క్రింద నున్న నీడల్ని తొలగించే ప్రయత్నం చేసేను ఈ క్షణాలు మంచు పొరల్ని కరిగించే కిరణ ముఖాలు చెట్ల, భుజాలపై ఆకాశం, మనిషి మనస్సులో ఆశా రూపం ఆనంతమై ఒక దాని కన్న మరొకటి అంతమైనట్లు కన్పిస్తాయి జీవిత నౌక ప్రయాణంలో తనలో ప్రపంచంతో నిదుర నుండి లంగరెత్తితే ఆగకుండా సాగాలిసిందే సముద్ర మెంత లోతుంటేనేం పొడవైతేనేం ? ఒక్క నావ చాలు ! సూర్యుడెంత తీవ్ర మైతేనేం తలపైన ఒక్క గొడుగు చాలు ! పగలు వచ్చే ఎదురు దారినే రాత్రి వస్తుంది నిదుర తెర వెనుక నుండే కలల బొమ్మ లొస్తాయి రాత్రి సమీపిస్తూందో లేదో రవి దగ్ధమైన విషాద వార్త ఉదయం పొడసూపిందో లేదో! బ్రతికి ఉన్నాడన్న గాథ నడుం వంచి ఎత్తే సరికి రోజు సగం పైన దాటుతుంది పదం ఎత్తి వేసే సరికి నీడ సనసన్నగా దూరదూరం సాగుతుంది పయనంలో మన అడుగు జాడలే మనకు దూరమవుతాయి బిందువు బిందువును కలిపే రంగవల్లుల్లా వివిధ ఘటనలతో జీవితంలో ఉదయ రూపం! మానవతా రాగమయం అయితేనే పరిపూర్ణత !
9. ఉదయ చేతనతో ఏ అణు స్పుట్నిక్ సంస్కృతీ కేతన మెగసినా ఇక్కడ అదే నాగలీ కొడవలీ బండలు తొలిచీ శిల్పాలు స్పజించీ చివరకు రాతి వలె పడి ఉన్న మనిషే అడవులు మార్చి నాగరకత నిర్మించి అడవి వలె పెరిగే మనస్సు మాత్రమే స్వేచ్ఛ దొరకని సంకెళ్ళు వీడని బ్రతుకులో వేలాడే నీడలు పయనం పెరిగిన కొద్దీ వెంట వెంట పొలిమేరలు దూరమవుతాయి పొలాల్లో గనుల్లో కర్మాగారాల్లో ఉగ్రశక్తి నర్తనతో నరాల్లో కర్షక కార్మిక జీవితాలు శిశిరంలో చిటారు కొమ్మన చుక్కలు ! అజ్ఞానం దారిద్ర్యం మౌఢ్యం గోడ లొకటొకటీ ఎత్తుగా కళ్ళు పైకెత్తితే మెరపులు పిడుగులు, కళ్ళు దించితే అంగార శిఖలు బండరాళ్ళను తొలిచి హసింప జేసిన సోక్రటిస్ వట్టి కట్టెను చెక్కి ఆకర్షింపజేసిన జీసస్ మనిషికి మనిషికి మధ్య వంతెన వేసిన బుద్దుడు ఆర్ధ హృది నుండి ఎగసిన కరుణ రస మూర్తులు ! ధమనుల్లో అనల విపంచికా రుతులు నటించినా గుండెల్లో విప్లవ దోరణీ ధునులు నదించినా చరిత్ర నుండి గుణ పాఠం ఎంత వరకు లభించింది ? ఎవరికి తోచిన అర్థం వాళ్లకు యధార్థ మనిపిస్తోంది విశ్వాసాల ఘర్షణలో సమన్వయంతో సమాజం పురోగమిస్తుంది ఉదయంలో చేతనతో ఆత్మ రూపం జీవన శిల్పాన్ని పొందుతుంది. రవి కిరణం కోసం నిరీక్షించే క్షణాల్లో నాలో కలలు హిమా కృతులు ! రాత్రి వేళ చంద్ర రేఖల్ని తలపిస్తాయి నాముందు పరచిన నిశా కార్పెట్పై నడుస్తూంటే నా అడుగు జాడలు వెలుగు ముద్రలై అలంకరిస్తాయి చుట్టూ చెట్లు కొండలూ బంధువుల వలె నిలిచి ఉన్నాయి
10. ఆర్తి నుండి ఉదయం విరిసిందో లేదో ఉత్సాహ నర్తనంతో హిమ సమూహం అవనిపై ఆర్ధ ముద్రలు వదలుతూ తరలి పోతుంది గాలులు పరుగులు తీస్తూ గిరుల వీపు తడుతూ పోతాయి చెట్ల తలల్ని నిమురుతాయి శూన్య గళాల్ని పలికిస్తాయి
హిమాకృతులు కలలు మాయమై కాంతి చిత్రాలు ప్రత్యక్షమవుతాయి ఆర్తి నుండి ఆనందానికి, నడచినంత మేర ఒకే మానసిక బింబం ఆర్ద్రమైన ఆలోచనా గగనంలో ఇదో అంతరంగ ఉషోదయం !
11. ఎవరా జీవించేది భూమి కలలు కొనై నా వాస్తవమై సమయం వెలగనీ జడ భారం వదలి మనిషి జీవితం శక్తి మయం కానీ జాతి పేర మతం పేర నిప్పు లెగసే సమాజం నవ మానవ సంస్కృతీ మనోజ్ఞం అవనీ నిన్న రేగిన అలజడి క్రమ్మి నేడు అగ్ని వర్షం కురుస్తూంది గాలి తలుపు తట్టిలేపి కొరడా వలె వీపు చరచి వెళుతూంది చెట్లు ఎక్కడికి పోతాయి ఉన్న చోటునే ఉలికి పడేను శూన్యమైన గగన కళతో భగ్న స్మృతులు నింపేను ప్రతి పూవు అనలు కణమై, ప్రతి శాఖ కొరవి దీపమై ప్రతి చెట్టు ప్రతి కొండ ధూమ గణాన్ని తలపిస్తోంది నదిలో సూర్య బింబం వలె హృదిలో చేతనతోనే సమాజం కదలుతుంది స్వప్నం నుండి వాస్తవానికి !ఈ తరం స్వర చిత్రం (1986) అంకితం పత్రికా రచనా ప్రపంచంలో సంప్రదాయ దిశనూ ఆధునిక దిశనూ కలిపే వెలుగు వంతెన కీ॥ శే॥ శివలెంక శంభు ప్రసాద్ గారికిఈ తరం స్వర చిత్రం సూచిక పుట సూచిక పుట 1. స్వేచ్ఛా సమసమాజమై 28. 2. ఎగసి పోనీ శబ్దమై 29.
ఈ ఉదయం స్వర చిత్రం 388 రోజు పరుగిడుతూంది 389 3. రవం, ఆరవం 30. రోజూ అద్దంలో చూస్తాను 390 4. అరుణకిరణం గుండెలో 372 31. అశాంతి రెక్కలక్రింద 390 5. గతిలో చైతన్యం 32. బింబమై పురా బిందువై 391 6. ఈయుగంలో ప్రజాస్వామ్యం 374 33. బ్రతుకు రెక్కలపై 7. స్వేచ్ఛా స్పందనం 34. తరంతరం అన్వేషణతో 392 8. ఈ ఉదయం క్షణాలపై 35. భోపాల్ విషాదం 9. రాగంతో తేజంతో
36. చరిత్ర తేజం 10. ఆశా స్పందనం 11. ప్రశ్నాపతంగం 12. నాయాతనలో పక్షి 13. నాతో పరుగెత్తుతూంది కాలం 14. కొన్ని క్షణాలు 15. నిశ్శబ్దం శబ్దకళమై 16. అద్దంలో చూపించు నా ముఖం 381 17. చూడవచ్చు స్వేచ్ఛగా 18. స్పందనతో సృజనతో 19. ఒక్కొక్కఅడుగేస్తూ 20. సృజనలహరి 21. మనోబింబమై 22. నాకూ సూర్యునికీ మధ్య 384 23. వాస్తవంలో హద్దులు 24. రాత్రి గురించి 25. తెల్లని పొగల మధ్య
26. ఊహలో క్రియలో 27. ఈ స్వప్నం అంతమై
6. ఈ తరం స్వర చిత్రం
1. స్వే ్ఛ సమ సమాజపై ఈ యుగ జన సందోహం గుండెల్లో రవి బింబం రవి బింబం ప్రతి రూపం స్వేచ్ఛా సమసమాజం ఆరనిదీ మాయనిదీ ప్రతి ఒక్కరి గాధలో బాధమయ గతిలో కణ కణలాడే క్షణాలపై కదలే ప్రజాస్వామ్య హృదయం బీద బిక్కి గుడిసె చుట్టు తిరిగి తిరిగి రవి కిరణం వాళ్ళ బ్రతుకు బండపై తిష్ఠ వేసి కూర్చుంది ఆతప పద చిహ్నాల్లో బ్రతుకుల్లో అంగారం అంగారం అంచుల్లో దాహంతో ఆకాశం ఆకాశం మండీ ఆలోచన రేగీ నేలపై జనగణం నిప్పు రగిలి మండే ఎండిన తరుశాఖలపై జీర్ణ కీర్ణ పర్ణాల్లో మరణ ధ్వని మెదలుతూంది. సంధ్యా పద చిహ్నాల్లో నిశా మనో వాటికలో అగ్నులు నీలో నాలో ఊపిరిలో తరగలుగా చూపుల్లో తీగెలుగా నీడల్లో వేదనగా ఏ మేఘం త్యాగంతో దహన శక్తి శమిస్తుంది ఎంత ధార వర్షిస్తే మనో వనం ఫలిస్తుంది పిడుగులతో మెరపులతో పెను తుపాను భీభత్సం జలార్ణవం అపని ఆర్తి సమాజ పథ గమనంలో తప్పదు నేమి క్రమణం పరివర్తన చక్రం రా రానీ ఆమేఘం మనుషుల్లో చివుళ్ళతో రస ధుని సంగీతంతో రా రానీ రవి హర్షం మానవతా కిరణంతో స్వేచ్ఛా సమ సమాజమై
2. ఎగసి పోనీ శబ్దమై శిశర చరణం ముఖంలో బూది కుప్పలు ముఖంలో ఎవరు ? వీరెవరు ? ఆశా దాహ మతితో నేలపై చేయి చాస్తే నిలుస్తూ, అడుగు వేస్తే కదలుతూ
ఎవరు ? వీరెవరు ? బాధా స్ఫులింగాలను చిమ్ముతూ నిప్పు అంటిన బొగ్గులై ఎవరు వీరెవరు ? దహన మతితో దారిలో తప్త సికతా రేణుశ్రేణులు చిమ్ముతూ సాగిపోయే వేగ మూర్తులు లోహ గగనం నుండి జారే ధారాధునులు వీరెవరు ? ఇంత వరకూ నీడలై గోడ వదలని బొమ్మలై వెలుగులో నావలై అంతలో జాతి జీవన తలంపై నేడు కదలే రగ్నులై నాల్గువైపుల ఎగసి నిల్చిన కోట గోడలు కూల్చి పై కెగసి పో జూచేరు ! కోట లోపల పట్టణం బాంబు విసరిన దృశ్యమై మనిషిలో వికృత రూపం పరిచయాని కొస్తూంది శిశిర చరణం బ్రతుకులో ఆవహించిన వాలకంతో రోజు గడవడ మెలాగని దారిలో బిక్షుక గణం ! హేతు వేమిటి ? వర్గ సృజనా ? కర్మయా ? స్వార్థ వాస్త రీతులా ? అర్థమవనీ కాకపోనీ ఎగసి పోనీ వాస్తవం శబ్దమై గగనాంచలంలో సార్థమై నవ సమాజంలో
3. రవం, ఆరవం అగ్ని చరణం వేసే భగ్న హృదిలో హాహా రవం ! కోలాహలం నగ్న సత్యం పలికే స్వర్ణ తరుణం ఆహా రవం ! హాహా రవం ! సమర పవనం వీచే భీతి సమయం ! హాహా రవం ! సంధ్యా భరం ఉదయ వదనం నిలిచే రాగ హృదయం ! ఆహా పదం ! శోభార్ణవం వర్ణ కలహం చెలగే అరుణ సమయం ! హాహా రవం ! భీభత్సకం ఆర్తి హృదయం పొందే విషమ గతిలో ! ధారా రవం ! బాధా భరం
4. అరుణ కిరణం గుండెలో అరుణ కిరణం గుండెలో నిలిచి మనిషీ కదలిరా విజయ చరణం బ్రతుకులో నిలిపి మనిషి సాగిపో యుగ యుగాల శిథిలాలను పద పదాన కదిలిస్తూ తర తరాల జ్ఞాపకాలు మనస్సులో బింబిస్తూ శుష్కమైన కరాలతో ఎదురుగా తరుగణం శూన్యవలయం పాయలుగా నదీ జలం ! నిశి తారలతో తరళ గగనం
పిపాసార్తయైన అవని ! కణకణంతో దాహభవం ప్రయాణార్థియైన మనిషి పద పదాన ఆటంకం పగలంతా మండిన క్షణాలు రాత్రి బూదిలో దాగుతాయి గుండె నుండి జారిన ఆశలు దారిలో ఎదురౌతాయి కళ్ళు తెరిస్తే ఉండే జీవితమే రెప్పవాలితే వేరౌతుంది సమస్తం తళతళ సంస్కృతిలో ఆలోచన ఆనందం సహనం అమేయం. కణ కణలాడే చరిత్రలో ఆరాటం ఆవేశం హింస అనంతం సమాజ సంస్కారంతో మనస్సు కాంతి ముఖం పొందుతుంది. జలధియై ఈహ నిరంతరం కదలుతుంది, జలదమై ఆశ ఎపుడో కురుస్తుంది సస్యమై బ్రతుకు ప్రతిరోజా కన్పించదు, ఆదర్శం ఎప్పటికీ అందబోయే బింబం హృదయ నభంపై వెలిగే మానవీయ సూర్యునితో ప్రజాస్వామ్య పతాకతో ఆర్థ రాగ ఉదయమై పదపదం ఒకటిగా ప్రజా గణం కదలుతూంది కాంతి బీజముఖాలతో చేతనా ప్రభవాంకురంతో చుట్టూ నవసమాజం ఇక పగటి వెలుగే కళ్ళలో ! రాత్రి చుక్కలు నిదురలో అరుణకిరణం గుండెలో
5. గతిలో చైతన్యం కదిలే జన సందోహం కండల్లో గుండెల్లో అనల సరిదుద్వేగం లయ సంభ్రమ స్పందనం ఎండల్లో నీడల్లో ఉత్తేజం ఆరాటం గిరి శిఖరం లోయల్లో ఆలోచన వాస్తసమూ మూడో కాలు సహాయం కోరే మతి పయనం విలయా వర్తంతో విషమ తలంపై క్రమణం కళ్ళలో ఆకాశం ఆకాశంలో బింబం బింబ కాంతిలో మారే చిత్ర ప్రపంచం వాస్తవ గతి రేఖలతో సామాజిక వర్తనం మానసిక ప్రసారంతో అల్లిన సంక్లిష్ట పటం ఎప్పటిదీ దైవం కల్పన ఆర్తిలో అమృత ధునియై చైతన్యం వహించిన అనుభవ కళతో ఎదలో జననం మృత్యువు మధ్య ఆగని మహానదివలె కాలం నేలకు నింగికి మధ్య చిక్కని ఉదయంవలె ఆదర్శం తీరంపై ఆశ వినా ప్రవహిస్తుంది ఝరిణి తీరంపై చూపులతో పయనిస్తుంది పడవ
ఉంది సాయం సంధ్యలో భయద మృత్యువు స్వప్నం ఉంది ఉదయం సంధ్యలో రాగ జీవన తేజం రాత్రి కదలుతుంది రోజు వెంట రోజు కొత్త ఊహల శిఖలతో రాత్రి తరలుతుంది రోజు వెంట రోజు గుండెలో రవి క్రీడతో మనిషి మనిషి మధ్య కల్పిత భేదం గగనంలో లీనమై నవ సమాజ చలనంలో మానవతా దర్శనంతో కదిలే జన సముద్రం లయలో యుగ చైతన్యం నడిచే జన సందోహం ఎద ఎదలో ప్రజాసామ్యం
6. ఈ యుగంలో ప్రజాస్వామ్యం ఈ యుగంలో ప్రజాస్వామ్యం నవ్య మానవ ప్రగతి రూపం గళంతో గళం కలిపి ఎగసి వచ్చే విశ్వ హృదయం మతం మతం వెలుగు కళలై కలిసి పోయే తోరణంతో జీవ కళతో సమాజంకై కాంతి ధారా సేచనంతో శాంతితో పరివర్తనాశా సమూహాలకు విజయ వేదిక మానవతపై రక్తితో నవ శక్తి గతితో ఇక్కడుంది సమానత్వం సోదరత్వం వ్యక్తి స్వేచ్ఛా సహజ రూపం భయం నిండిన గుండె లోపల వేగ రక్త ప్రవాహ రూపం భయం వీడిన గుండె లోపల శాంత సూర్యుని కిరణ తేజం నిన్ను నీవే మంటలో కాల్చుకుని తింటావటేమిటి నిన్ననేడు రేపు రూపం సంస్కృతీ పరిణామభాగం అడుగు సాగీ, హలం కదలీ, చేయి కలిసి తిరిగి యంత్రం ఊహ విరిసీ బ్రతుకు మారీ చేరుకుందీ నేటి దశకు ఆర్తిలో నవ సమాజంకై త్యాగ ధారా సేచనంతో ప్రగతిలో పరివర్తనాశా భావ వర్తికి ఉంది విజయం మనిషి మనిషికి హృదికి హృదికి మధ్య దారుల వెలుగు నిండి వెలుగులో నవ శక్తి గతితో ఎత్తనీ సమ సమాజాకృతి అరుణ కిరణం గుండెలో నిలిచి మనిషీ కదలిరా పవన చలనం అంతటా అణువు అణువు సాగనీ విజయ చరణం బ్రతుకులో నిలిపి మనిషి సాగిపో మానవీయ సూర్యునితో ప్రజాస్వామ్య పతాకతో
7. స్వే ్ఛ స్పందనం ప్రాణి కళ్ళలో మేల్కొన్న ఉదయం బ్రతుకంతా వెలుగుతుంది ఇపుడు నిజాన్ని దాచే నీడలూ లేవు, లో లోన నిదురై దువ్వే చీకటి లేదు మృదు హాసంతో వెలిగే చాంద్రీ ధునులు స్మృతుల అంచుల్లో సరిస్తాయి దిశల్ని స్నేహ కళతో నింపే వెలుగు ఏ ఆకృతిలో ఉన్నా ప్రియమే మంచులో నీరు దాగి ఉంది దీని తీరు వేరు, అందం వేరు మైత్రిలో ఆర్ధ గుణం వేరు, ప్రేమలో ప్రవాహ రూపం వేరు వ్రాలే రవి కిరణాల ముందు దీప శిఖ జాడే జ్ఞప్తికి లేదు రాగ హృదయం విప్పారి పోవలసిన దిక్కులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కళ్ళు విప్పేప్పటికి శిశువు మతికి అంతా శూన్యం గుర్తు పట్టేప్పటికి ఎదురుగా వివిధ వర్ణ ప్రపంచం పిడికిలి నుండి ఆకాశం క్రమంగా పైకి ఎగిరి పోతుంది అడుగుల క్రింద భూమి నెమ్మదిగా ఒదిగిపోతుంది కాల శకలం స్మిత సుమమై మొదలై అనుభవ సీమల్ని చుడుతూ హిమ నగమై గాంగ ధునియై ప్రాణ భరమై నిలుస్తూంది ప్రతి భావన అందాలు నింపుకొని కల్పన కాకృతినిస్తూంది ప్రతి స్పందన రాగం కూర్చుకొని ఎద అంచులు తాకుతూంది ఎదలో ధగధగలాడే తృష్ణతో మనిషి మనీషీ కదిలేను మనస్సు సంధ్యా రూపమై నిశలు పవళ్ళు దాటుతుంది ఎక్కడ చూచినా పాయలు పాయలుగా జన సమూహాలు శిఖరం నుండి తరలే ప్రవాహ దృశ్యాల్ని తలపిస్తున్నాయి దేశాల పొలి మేరలు దాటి వర్ణాల పొరమేరల్ని చీల్చుకోని వచ్చే వెలుగు గుండె కేదో తెలిసీ మానవతా భాషలో చెబుతూంది మారణాయుధం కళ్ళలో నీరు ! సోనలై సరించే క్షణం వస్తుంది బాంబు గుండెలో పచ్చని శాంతి వికసించే రోజు వస్తుంది భయం వదలి స్వేచ్ఛ స్పందిస్తూ హిమం వదలి కాంతి భాషిస్తూ నిద్రా జగం వీడి పదం కదలి మనస్సు శాంతి పథ మధిరోహించనీ
8. ఈ ఉదయం క్షణాలపై ఈ ఉదయం క్షణాలపై ప్రతి వ్యక్తి అంగలేస్తూ పోయేను ఎగసి క్రమ్మిన ధూళి దులుపుకొనే తీరిక లేదెవరికీ
కఠిన శిలలు తొలిచే ఉలియై ఆలోచన కదిలేను ముందుగా క్రీనీడ అడుగులు వేస్తూంది, చేతిలో బ్యాగ్ జిపన్ను సరిచేస్తూ రోడ్ను క్రాస్ చేస్తూ మరో క్రీ నీడ చేతులు కదలిస్తూ ముందుకు వస్తూంది వారి పాద మనోజ్ఞతా గతిలోని హార్మనీ వాహనాల గమనించినట్లు లేదు బస్ రాకతో ఎగబడే జనం కోలాహలం ! అనుకోని వాన జల్లుతో ఎక్కువైంది టేబిల్పై విసరిన పేక ముక్కల్లా తీరు తీరు వాలకాలతో బస్ లో జనం లోపల ఉక్కిరి బిక్కిరి వాతావరణంతో తమకు తాము సర్దుకుంటున్నారు. పుస్తకాల బరువుతో వంగిన లేత మొగ్గలు బుజం బుజం హత్తుకొనీ నాలో దిక్కుల్నీ మబ్బుల్నీ స్పృశించే బాల్యస్మతులు చిమ్మేరు మాటలు పిలుపులు కేకలు గంటలు హారన్ శబ్ద చిత్రాలు నింపుకొని నిలకడ లేని స్థితులు సూటిగా సుళ్ళుగా గుండ్రంగా కదలిపోతున్నాయి ప్రతి గుండె ఈ రోడ్ను క్రాస్ చేసే వేళ సుడిలో చేప మోస్తరు ! వచ్చిపోయే ఎండతో నీడలో ముఖాల దోబూచు లాడుతున్నాయి వాల్ పోస్టల్ బొమ్మలతో మనోనేత్రాలు మాట్లాడుతున్నాయి కారు నిశ్శబ్దాన్ని వదలి వెళ్ళితే, లారీ నిశ్శబ్దాన్ని తరుముకొని పోతూంది టెలిగ్రాప్ తీగెలపై కూర్చున్న పక్షుల్ని ఫైర్ ఇంజన్ ధ్వని లేపేస్తూంది ఫుట్ పాత్పై పనిలో వంగిన తలల్ని గాలి పైకెత్తజేస్తూ పోతూంది గుండెలో సూర్యుని తేజంతో ధమనుల్లో ప్రవాహ నర్తనంతో కడుపులో దూరిన రోటి చాయ్ బలంతో సమయాన్ని అరగదీస్తూ అలసీ సొలసీ ఏ చెట్టు నీటనో గోడ పంచనో వ్రాలే శ్రమ జీవులు ! ఎంతో బరువు మోసి అలసి వంగిన మూపులతో క్రుంగి సడలిన సంధులతో వృద్దుల వలె పూర్వపు మేడలు ! నిన్న గాక మొన్న నిటారుగా అందంగా పైకి వచ్చి నిల్చిననీ నగరానికి నిండుదనం కొత్తదనం తెచ్చే యువ సద్మాలు ! అనుక్షణం బ్రతుకుల్ని వేగిరపెడుతూ కార్లు బస్సులూ దూసుకపోతున్నాయి అర్థరాత్రం వరకూ సద్దు మణగని శబ్దజగం సంక్షుబ్ద చిత్రం వలె ఉంది. ఇనుప చువ్వల వలె వేళకు నిల్చి వెదురు బద్దల వలె వంగుతూ లోపల మండే నిప్పుల కుంపటితో మనిషిలో మనీషినీ చూడొచ్చు ! తనపై కదలే బరువును అవని ధూళి పొరపై తేల్చేస్తూంది ప్రతీకార శిఖలు ఉదయ సాయం సంధ్యల్ని జ్ఞాపకం చేస్తున్నాయి నిశ్శబ్ద కుట్మలంపై చిరునవ్వుతో తీగె కిటికీ చువ్వల కెగబ్రాకుతోంది వీధిలో ఎగిసే ధూళికీ ధూమానికీ విషాద ప్రశ్న వలె మారుతోంది ఇక్కడెందరో తత్వాలు నినదించేరు ! లో లోపల తీరని కోర్కెలతో తపిస్తూ ఈ సమయం అనల గతిలో సంఘర్షణ వాతావరణాన్ని వణకిస్తోంది
కొండ చరియ పైబడినట్లున్నా బాధా లహరి ముంచుకొచ్చినట్లున్నా వేగం హెచ్చిన జీవన గమనంలో మనుషుల ముఖాల్లో కన్పిస్తుంది ! హాయిగా పై కెగుర బోయే ఆశా విమానం !
9. రాగంతో తేజంతో నేలపై గాలికి రాలిన ఆకు గతాన్ని జ్ఞాపకం చేస్తుంది వర్తమానం మును ముందు కొచ్చి నిల్చి అన్నింటినీ నెట్టేస్తుంది పురా శిధిలాల్లో అదృశ్యమాన తలంపై అనుబంధంతో చరిత్ర మనస్సును లాగుతుంది తెలీని చోట తెలీకుండా నిలుపుతుంది గతం ఏనాటికీ తరగని వాదం వలె వినిపిస్తుంది కొత్త జలదాన్ని సృష్టించే సముద్రం వలె కనిపిస్తుంది చండమైన గ్రీష్మ విధి నెదుర్కొనేందుకు సిద్దంగా ఉంటుంది వర్తమానం ఎదలో మేఘ సంగీతం వినిపించే నభం వలె నిలుస్తుంది జలధిలో ఎంత సుఖంగా పయనించినా అవని పైకి రావలసిందే ఏదో పోగొట్టుకుంది దొరికీ ఎద ఆనందంతో ఎగిరి గంతేస్తుంది నీటిలో గగన మణి ప్లవించే విధంగా ఆశలో శాంతి స్వప్నం ఒదిగి ఉంటుంది ఉదయం ఎన్ని మార్లు రావడం లేదు ? ఎంతమంది మనస్సు మేల్కొంటూంది మనిషిలో నిద్రా జడం లేంది ? ఇంత చీకటి చరిత్ర రూపొందేదా? ఎంతో కొంత చరిత్ర బుజాన వేసుకొనీ మనిషి దారిలో సులభంగా విడిచి, అల వలె కదలిపోయేను మానవతను తలపించే రాగంతో ప్రతి ఎదలో సంగీతం ఉంది దానవుణ్ణి తరమేసే తేజంతో ప్రతి వ్యక్తిలో వెలిగే ఆత్మ ఉంది కళ్ళు మూసి కళ్ళు తెరచి నా చుట్టూ తిరిగే నిశీథి ఉదయం నీడై వాలుతుంది మెరపు తీగె గుడిసె చెక్కిళ్ళ పై జారే కన్నీటి చార ఉదయం మంచుతో కన్పిస్తుంది సూర్యుణ్ణి మింగేసి కూర్చున్న రాత్రి విలా ఉదయం ఎగిరిపోతుంది పద పదాన చీకటి !
10. ఆశా స్పందనం ఉదయం వెలుగుతో దూర దూరం నీడై తొలగుతుంది ఉన్నకాస్త వివేకాన్నీ మలిపి నిద్రలో ముంచేసి నిశ నిలవాలను కుంటుంది దీర్ఘ శిలా పంక్తి వలె పైన హిమ తలం వలె బిగిసిన కాలం లోపల చేపల వలె స్మృతులు కదిలేను ఎదలో చంద్రుని వలె నిశ్శబ్దం, ఝరిణి వలె శబ్దం చీకటికి భయపడే మతికి, వెన్నెల ధైర్య కళ నిస్తుంది కొండ చాటున తేజస్వి ఎంత సేపుంటాడు ? ముఖంలో ఊహలో రాగంతో బింబించేను క్షితిజ హృదయం ఉదయం స్పటికం వలె ఆకర్షిస్తుంది ఎవరు తలుస్తారీ నీడల్ని? ఆర్తిలో మనిషి తప్ప ! ఆవేదన అశాంతి నిరాశ ఒకదాని కన్న ముందొకటి వస్తుంది సహనం శాంతి తృప్తి ఒకదాని వెనుక మరొకటి ఉంటుంది పాతాళం నుండి అవనికి గగనం నుండి భూమికి అనుభవం చేరడంలో ఉంది జీవిత వాస్తవం ! సంపద సమంగా పొందడంలో ఉంది సమానత్వం
11. ప్రశ్నా పతంగం గగనాన పతంగం చూస్తూంటే పిల్లల మనస్సు ఎగసే హిమ శిఖర మవుతుంది గగనాన పతంగం ఎగురుతూంటే పిల్లల ఊహ సరించే ప్రవాహ మవుతుంది గాలి బుజాలపై తేలుతూ మేఘాల్ని చేరాలనే పతంగం మనిషి శక్తిపై యుక్తిపై ఆశతో కదలే ఒక జీవితం గాలి విసరి ఊగీ తెగి పతంగం ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుంటుంది ఏ స్తంభం తీగకో తట్టుకుంటుంది, ఆక్షణం గుండెకు చుట్టుకుంటుంది పతంగం ఒరిగి పోతూంటే లోయలోకి జారుతున్నట్లుంది పతంగం తిరుగుతూ తిరుగుతూంటే సుడిలో భ్రనిస్తున్నట్లుంటుంది ఆశా మృదు రేఖలతోతరలి తరలి మబ్బు అంచులు దువ్వుతూ దారం తెగిన పతంగం కదలి కదలి దిగిపోతూ మనః పథాన ఆడుతుంది క్షణాల వ్రేళ్ళ సందుల్లో కదులుతూ గాలి ఊహల అంచుల్లో తేలుతూ జీవన పథ గమనంలో, ఇది మనిషి ఉన్నతికీ అవనతికీ సంకేతం
పైన ఎగిరేంత కాలం ప్రభయై దిగిపోయే క్షణం దీపమై ఈ పతంగం ! కాలం విసరే అందమైన ప్రశ్నకు చిహ్నం
12. నా యాతనలో పక్షి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు చేతిలో పక్షి ఒదిగి ఉంటుంది ఇంట్లో నుండి బయటికి రాగానే కన్పించకుండా ఎగిరిపోతుంది ఇంట్లో అడుగు వేసే వేళ కెక్కడి నుండో వచ్చి వాలుతుంది పెదవులపై మాటగా గళం నుండి పొటగా ఎగసి నుదుటిపై చెక్కిళ్ళపై కళ్ళలో ఉదర్కమై బింబింస్తుంది పగలు ప్రపంచంలో చూచిన కథ మధ్య మధ్య వినిపిస్తుంది. నేను లేచే సరికి నీటుగా చేతిలో ఒదిగి ఉంటుంది. జీవితంలో నిరీక్షణకూ ప్రయత్నానికీ వెనుక నున్న అంతరంగం ఇంట్లోకి అడుగేయడంతో పక్షియై వాలుతుంది, ఆకర్షిస్తుంది ఈ పక్షికి తెలిసిన ప్రపంచం నాకు నిజంగా తెలీదు నాకు తెలిసిందల్లా ‘యేన కేనాపి ఉపాయేన' బ్రతకడ మొక్కటే ! ప్రవహించే నదితో ప్రతి రోజూ పరుగెత్తే నేను అంతరంగం మరచి బయటపోటీలో నా యాతనలోనేను ! ఇంట్లోకి రాగానే పక్షి జ్ఞాపకం వస్తుంది, నన్ను చేరుతుంది
13. నాతో పరుగెత్తుతూంది కాలం కాలం నాతో పరుగెత్తుతూంది నా కన్నా ముందు పోవాలనీ కాసేపు నిలిస్తే చాలు ! ఆదీ అనుమాన బిందువై నిలుస్తుంది నేను నడచే మార్గం చుట్టూ కొండలూ అడవీ జనపదాలూ నేను కదలే మార్గ మంతా దుమ్ము రాళ్ళు మలుపులతో విషమ తలం నా వెనుక క్షితిజం నిలువునా అవని నుండి లేచిన జనాళితో నా ముందు క్షితిజం నిటారుగా అవనిపై కదలే జనాళితో నిశ్శబ్దాన్ని తరుగుతూ వీచే గాలిలా నాలో ఆవేదన పట్టాలపై రైలు వలె ఆలోచన, నింగిలో విమానం వలె అనుభవం ప్రయాణంలో మారే దృశ్యాలు కళ్ళ ముందు కదలుతాయి ఊహలో నిలుస్తాయి శరీరంలో కోష్ణ లహరీ ప్రవాహ ముంది మనస్సులో సూర్యుని తేజముంది నాతో పరుగెత్తే కాలం దేహాన్నీ మనస్సునూ సమార్ధ కరాలతో స్పృశిస్తూంది
14. కొన్ని క్షణాలు ఎన్ని నిశలో నిద్రా సముద్రంలో పడవల వలె తేలిపోయాయి ఎన్ని పవళ్ళో సెమ్మెపై దీప శిఖల వలె వెలిగిపోయాయి ఒక్కొక్క పడవ ఒక్కొక్క యాత్రను, ఒక్కొక్క దీపం ఒక్కొక్క కథనూ చెబుతాయి హిమ శిఖరంవలె ధవళ శుభ్ర మనస్సుపై దేవతలకే నివాసం ప్రవాహం దూకుతుంది త్యాగకరంగా సమాజ కల్యాణకరంగా నరాల్లో షహనాయి స్వనిస్తుంది గుండెలో మృదంగం శబ్దిస్తుంది జీవితంలో ఏ శత్రుత్వం మెదలని తలచని కొన్ని క్షణాలుంటాయి ఆక్షణం హిమ నగం కావచ్చు స్నేహ కిరణం కావచ్చు ప్రేమ లహరి కావచ్చు
15. నిశ్శబ్దం శబ్దకళయై ఎక్కడుంది నిశ్శబ్దం ? ఆవరణమావరణం శబ్ద తరంగమయమే ఆలోచనలో నిశ్శబ్ద శిఖరాలను గాలి స్పృశిస్తూపోతుంది మనస్సును మానవ సంస్కృతీ తీరాలకు తీసుకపోతుంది గమ్యం అందుకున్న ఆనందమంతలో సశేషంగానే మిగులుతుంది ఒక పొలిమేర అంతమైత మరో పొలిమేర మొదలౌతుంది, అంతే ! పొలిమేరల్లో గుహ నుండి బయటి కొచ్చే పెద్దపులి కన్పించవచ్చు పెద్దపులి సాయం సంధ్యా దృష్టి నుండి పరుగెత్తే సారంగం కన్పించవచ్చు నిశ్శబ్ద హిమజలం ప్రవాహమై శబ్ద సౌందర్యం ఒలుకుతుంది. పెద్దపులి ఎప్పుడో కాని కన్పించదు ! ప్రయాణంలో, అరణ్యం! ఆనందాన్నిస్తుంది ఎండకు కరిగే హిమశిల వలె నిశ్శబ్దం శబ్ద కళయై ప్రవహిస్తుంది
16. అద్దంలో చూపించు నా ముఖం " అద్దంలో చూపించు ! నా ముఖం, ఎందు కిచ్చావీ చీకటి బ్రతుకు” చరణాలావృత్త మౌతున్నాయి, స్వరం శబ్ద స్ఫులింగాల్ని చిమ్ముతూంది మధ్య మధ్య కంఠం బొంగురు పోతూంది అంతలో సర్దుకుంటూంది తనలో శబ్ద శక్తిని వడబోసి పైకి పాటగా ప్రసరిస్తున్నాడతడు ఇనుపతీగె చుట్టిన చేతి వ్రేళ్ళతో చిత్ర గతుల్లో డోలక్ మ్రోగిస్తున్నాడు పాటలో ఆర్తి ప్రవహిస్తోంది కంఠ నాళాలు బిగిసాయి ముఖం ఎర్రబడింది
టవల్తో మెడ పై నుండి గొంతు చుట్టూ ముఖం తుడుచుకున్నాడు ఎదురుగా ఉన్న డబ్బాలో డబ్బు వేసి జనం ఒకరొకరూ ఇక్కడికి వచ్చినపు డెరుగని బరువుతో కదలిపోతున్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, కొందరు చూచీ చూడకుండా పోతున్నారు కాస్త విరామంతో అతడు మరో ఆపర్తానికి పూనుకున్నాడు వాతావరణం విషాదం కప్పు వేసింది. మనశ్శిఖ ఆలోచనా గభీరమైంది చుట్టూ చేరిన జనం ! బుజాలపై సందు చేసుకొని అతని చూడాలనిపించింది ముందుకు నడిచా ! ఆ రెండు కళ్ళు చిన్న గుంటలు! శరీరంసన్నని తీగెలా ఉంది ముఖంపై ఒత్తుగా లోతుగా గంట్లుగా స్ఫోటకం వదలిన గుర్తులు ప్రక్కనే ఓ ఆడ మనిషి ! ఒళ్ళో చిన్న పిల్లాడు ఆడుకుంటున్నాడు రెక్కల్ని రెపరెపలాడిస్తూ ఎండ నా తలపై నిలిచింది అతడి ముఖంలో చెమట బిందువుల్లో వేడి కిరణాలు స్నానం చేస్తున్నాయి మరో ఆవర్తం మొదలు కాబోతోంది ! ఇంతలో బస్ వచ్చేసింది పిల్లల దగ్గరి నుంచీ పెద్దల దాకా ఎగబడి త్రోసుకొని ప్రవేశిస్తున్నారు బస్ కదిలింది బరువుగా ! పాట వినిపిస్తోంది ! బస్ వేగం అందుకుంది అద్దంలో చూడ లేని ముఖం వినిపించే ఆవర్తం గాలిలో తేలి ఆపై ఊహలో కదలి స్మృతిలో నిలిచింది అద్దంలో నిశ్శబ్ద కళయై “అద్దంలో చూపించు నా ముఖం ఎందు కిచ్చావీ చీకటి బ్రతుకు” అద్దంలో అతనికి చూపలేని ముఖం సమాజానికో అద్దం వంటిది
17. చూడవచ్చు స్వేచ్ఛగా ఈ చీకటి గది నుండి పచ్చని మైదానంలోకి మమ్మల్ని కదలనీండి ఏ కిరీట చ్ఛాయలో తోడు అక్కర్లేదు, ఏ శాసన ధార క్రింద నీడ అక్కర్లేదు మేం పోతే పోతాం కొండల్లోకో అడవుల్లోకో పెద్దపులి కడుపులోకో నిప్పు గాలి విసరకండి ! నీలి మబ్బు నుండైనా నాల్కపై చినుకులు రాలనీండి విషమ వ్యవస్థలో తెగని సమస్యలతో ఈ చీకటి జీవిత మక్కర్లేదు మమ్మల్ని వెన్నాడకండి మనసారా మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనీండి ! చెట్లతో మాట్లాడనీండి రాళ్ళతో పలకనీండి మనిషితో బ్రతకనీండి మా తలుపు ముందు భయంతో ముడుచుక పడుకున్న రాత్రి మా వేడి కన్నీటి బిందువులు జారిపడి మేల్కొంది, లేచి కదిలింది రాలిన ఆకుతో మృత్యువు జ్ఞాపకం వస్తుంది నిజమే వేసిన చివురుతో జీవన రహస్యమూ తెలుస్తుంది
ఈ హిమ పాతం నుండి మమ్మల్ని వెచ్చని వెలుగు లోకి వెళ్ళనీండి ఊపిరి సలపనీని అవమానానికి భయానికీ హిమపాతానికి దూరంగా వెలుగు రెక్కలతో స్వేచ్ఛగా ఎగిరే హంసల్ని మా ముఖంలో చూడవచ్చు, మాదారిని మమ్మల్ని వెళ్ళనీండి ! స్వేచ్ఛగా
18. స్పందనతో సృజనతో గ్రీష్మం వస్తుంది విత్తును మట్టిలో అణచేస్తుంది వర్షం వస్తుంది. తరం నుండి తరం మొలకెత్తిస్తుంది జీర్ణపర్ణాల్ని త్రోసేస్తూ ఎండిన తీవెల్లో జీవన రుచి నింపుతూ ఎటు చూచినా ! ఆర్ద్ర వాతావరణం సృందనతో సృజన శక్తి సంకేతం గర్జాధ్వని ! మెరుపు వాన ! వరదలూ ! తుపాను ! భీభత్సం అయినా ఇష్టమే ! శివుని మూడో కన్నులో పచ్చదనం చూచే సమయం ! “ఎవరు నీవు" ? ప్రశ్నకు సమాజంలో “నేను” అనే సమాధానం మబ్బు నుండి మెరపు వలె, పిడుగు వలె, జల్లు వలె అస్తిత్వంతో మనిషి మనిషిలో విభిన్న వ్యక్తిత్వం ! తరం నుండి తరం భిన్నం స్వేచ్ఛా కిరణం ! మానవతా గంధం పచ్చని కీర్తి ఒకటే అందరిలో ఒక్కొక్క అడుగేస్తూ పోయే జీవితంలో చీకటి లో రక్షణకై చేతిలో ఆయుధం పంటలకై చేతిలో నేల దున్నే హలం ఘన గళంలో ఉంది గగనాన్ని మేల్కొల్పే శక్తి శిశు రవంలో ఉంది మనసుల్ని మేల్కొల్పే శక్తి జనమతంలో ఉంది సమాజాన్ని నడిపే శక్తి
19. ఒక్కొక్క అడుగేస్తూ శిశిరం రాకతో క్రుంగిన ప్రకృతి గుండెలో వసంతం వస్తుంది జారే కన్నీటి బిందువులో ఉదయ నృత్యం ఆశను వెలిగిస్తుంది. ప్రకృతిలో సమాజంలో మార్పు, మనిషికి నవ జీవన సంకేతం.
20. సృజన లహరి వెలిగే దీప శిఖ ప్రాణి ఆయువును జ్ఞాపకం చేస్తుంది ఎగిరే పక్షి ప్రాణిలో ఆశా విస్పారాన్ని సూచిస్తుంది
పూచిన పూవు వాస్తవాన్నీ రాలే ఆకు భ్రమనూ జ్ఞాపకం చేస్తాయి మనిషిలో సమాజంలో ప్రకృతిలో బింబ ప్రతి బంబాలనివార్యం సింహాసనం ముక్కలైనా కోట గోడలు కూలినా కిరీటం ఒరిగినా సవరిస్తూ నిర్మిస్తూ ఏదోరూపంలో మనిషి బలం అక్కడే తిరుగుతుంది మట్టి నుండి మొక్కతో, మట్టిపై ప్రాణితో, శిల నుండి శిల్పంతో జగతిలో మనిషిలో నిర్మాణ రూపం జరుగుతుంది, నిరంతరం. ఆటవికం నుండి నాగరికం నుండి మనిషిలో సంస్కార తేజం విషాదం నుండి వివేకం నుండి మనసులో నవ సృజన లహరి నిద్ర ఏ గుహలోకో ఎగిరి పోయింది మెలకువ కాంతి కింజల్కలతో ముంగిట నిలిచింది
21. మనో బింబమై తలుపు తెరవగానే వెలుగు కరాలు చాచి నాపై వాలింది మూసిన దిశలు తెరచుకున్నాయి రాత్రి ఓటమి పొందింది కాని మనిషి కింకా గెలుపు లభించలేదు వీధిలో కదలే మనుషులతో వికీర్ణ శబ్ద సమూహాలు అంతటా సవేగ దృశ్య పరంపర ! సరిగా చూచేందుకు సమయం లేదు మనస్సులో స్వప్న కథా శేషం అట్లాగే ఉంది ఉదయమైనా వాస్తవ మింకా వెలగాలిసి ఉంది చీకటి భయం పోలేదు గాని అణగిన క్షుధాగ్ని గీతం తిరిగి అందుకో నుంది అన్నీ యథాతథంగానే ఉన్నాయి రాత్రి తెగిన బంధాన్ని మాత్రం ఉదయం నిలుపుతూంది అందుకే మనిషి మనిషిగా కన్పించేను
22. నాకూ సూర్యునికీ మధ్య నాకూ సూర్యునికీ మధ్య వెలుగు నీడల చదరంగ ప్రపంచం పైన ఆకాశం అందని వేదాంతం వలె, క్రింద అవని తప్పని బ్రతుకువలె యుగాల వెలుగులతో పాటు తరాల చీకట్లనూ బుజాన వేసుకోని బరువు నీడలు వదలుతూ వెలుగు ఆశలు కోరుతూ సమాజం వడబోసిన సంస్కారం మనసులో ఆలోచనకు ఆకృతి నిస్తోంది
మేల్కొన్న మనస్సుకు బయటి సూర్యుణ్ణి చూడాలనిపించడంలేదు వికలమైన హృదయం సుస్వరతను పొందాలిసి ఉంది రాగంతో ఆర్ద్రతతో మనిషి గమ్యం చేరాలిసి ఉంది ద్వేషంతో జ్వలించేవి నానుండి వీడి వెడలి పోతున్నాయి స్నేహంతో వెలిగేవి నాలోకి కదలి నిలిచి పోతున్నాయి రాత్రి నిదురలో ముంచేస్తుంది, ఉదయం మెలకువలో తేలుస్తుంది నాకూ సూర్యునికీ మధ్య వెలుగు వంతెన ! క్రింద జీవన ధుని !
23. వాస్తవంలో హద్దులు శిల వద్ద నిల్చి పొదల వద్ద ఆగి ముని వ్రేళ్ళపై నిల్చి తడుముకుంటూ కదలీ తూగీ పాయలుగా పరుగెత్తే ప్రవాహ పంక్తుల వలె దేశం నుండి దేశానికి బ్రతుకు నుండి బ్రతుక్కి ఆలోచనా సమూహాలు ఒక అనుభవంతో మరొకటి మరో అనుభవంతో మరొకటి కదలి పోయేను సమాజంలో ప్రతి మనిషికీ నిహతం కాకుండా జీవించే హక్కు ఉంది బ్రతుకు బరువుకూ ఒరపిడికీ మనస్సు వికలం కావచ్చు శకలం కావచ్చు ముక్కలైన మనసు బింబానుభవం ఎన్నటికీ సంపూర్ణం కాదు మనిషి శక్తి అమేయం, మనోరూప మనంతం, దారులూ అనేకం సముద్ర మెదురైతే చేప అవుతుంది, ఆకాశం కన్పిస్తే విహంగమవుతుంది నేలపై జంతువో మృగమో కావచ్చు ! ఒకరి చేతిలో బొమ్మై ఆడొచ్చు నేల పై ఏ నిలయంలోనో వెలుగుచూడని శిల్పం అవచ్చు. నీడకై తపనతో పూవుకై ఆశతో ఫలంకై ఆర్తితో కదలే మనిషికి వాస్తవ మెదురౌతుంది, ఆటకు హద్దులు చెరగిపోతాయి ! స్వార్థంలో ఆదర్శం అదృశ్యమవుతుంది
24. రాత్రి గురించి అద్దంలో ముఖం వలె మనిషి మాటలో మనస్సు కన్పిస్తుంది ఊహలో పురా సంస్కృతీ చిహ్నం చంద్ర రేఖ వలె మెరుస్తుంది శిథిలాల తవ్వకాల్లో మొన దేరిన శిలా శకలాల్లో అన్వేషణకు సిద్ధమై మనస్సు పురా రూపాన్ని దర్శిస్తుంది అనుభవం గూడులో వివేకం పక్షి రూపం వహిస్తుంది మధ్య మధ్య నిశాంతరాలతో పగలు తరువాత పగలు
మధ్య మధ్య ఎడారులతో శిఖరం తరువాత శిఖరం చరిత్రలో దిశ దిశ తిరిగి తిరిగి పక్షి కథలో పాత్ర అవుతుంది మనిషి శక్తి కాహ్వానం పలికే ఉదయం శిఖరంపై వెలుగు నిలుస్తుంది నీడలు జారిపోతాయి పక్షి గురించి ఆలోచన ఎక్కడిది ? నా వెనుక నీడలో నిర్భయంగా ఉంది ! పక్షి!
25. తెల్లని పొగలు మధ్య తెరచిన కిటికీ నుండి గాలికి నాపై రాలిన ఆకు స్మృతుల్ని కదలిస్తూంది ఈ చెట్టు ! ఎన్ని కథలకో సందర్భాలలో సాక్షీభూతంగా ఉంది గిరిజాల పెద్ద మనిషి మాజీ రంగస్థల నటుడు కిళ్ళీ నములుతూ వస్తున్నాడు డాబా గోడకు ప్రాకిన తీగె పై పైకి పోయే తాపత్రయంలో ఉంది, దైవం తమ కోర్కెల్ని విని తీర్చేందుకు భక్తులు గంటల్ని ఖంగున మ్రోగిస్తున్నారు గాజు ముక్కల్ని అమర్చిన గుడి గోడ గురించి చర్చ తాండవిస్తూంది గోడ సందులో పెరిగిన చెట్టు కొమ్మల్ని నరకాలా ? వద్దా ? అని గలాటా ! ఆగని సంఘర్షణలో పచ్చి ఆకుల వలె ప్రాణాలు రాలి పోయేను తెగని సంక్షోభంలో కాళ్ళు చేతులు కొట్టుకొనే రాజకీయ పార్టీ వలె టీపాయ్ పై వేట్ తొలగిన న్యూస్ పేపర్ గాలికి రెపరెప ఎగిరి పడుతూంది ఎండలో గొడుగుతో పెద్ద మనిషి వడిగా వంకరగా నడుస్తున్నాడు సువ్వ మొన పొడుచుకొనీ ఆ ప్రక్కన కళ్ళుపోనీ చెవిలో గుబిలి తీయనీ ఎప్పటికీ తెగని వాదనలా లారీలు బస్సులు వరసగా దూకుతున్నాయి నిన్నటి నియంత నేడు అద్దాల అల్మెరాలో కన్పించేను నిన్నటి నాయకుడు నేడు ప్రజల మధ్య ధూమ శిఖ అయ్యేను ఒకరి కొకరు సమాంతరంగా నడుస్తున్నారు ! కలిసే ప్రశ్న లేదు అంతలో కర్ఫ్యూ విధించిన నగరం భయంతో మౌన పర్వతం వలె ఉంది అడ్రసు తప్పిన ఉత్తరాల వలె ! బూట్ల చప్పుడుతో హెచ్చరికలు ! దూసుకొని పోయే జీప్ ధ్వని ! దగ్గరలో ప్రాణి నలిగిన సవ్వడి ! పట్ట పగలు చిమ్మిన మసక చీకట్లో స్థితి ఊపిరాడకుండా ఉంది సైనికులు మార్చింగ్ శబ్దానికి టెలిగ్రాప్ తీగెలపై పిట్ట లెగిరిపోతున్నాయి భూమి ఉలిక్కి పడుతూంది ! క్షితిజం సంకుచితమై కన్పిస్తూంది ఆగని చేతి గడియారంతో నెత్తురు దుస్తులతో గాయపడిన శరీరాలు పావుల కదలికలో వచ్చే చావుకలంకారాలుగా ఉన్నాయి
స్మృతిలో మిగిలే ముద్రలు ! మానవ చరిత్రలో మరపురాని సందర్భాలు ఇక్కడ ప్రాణానికి విలువలేదు ! ఆకు కంటె ఈక కంటే తేలిక ! సిద్దాంతం ఏదైనా చట్టం ఎట్లా ఉన్నా మానవీయం ఓటమితో సాయం సంధ్యామయం కాకూడదు గీసిన అగ్గి పుల్ల అంటుకుంది, పెదవుల మధ్య సిగరెట్ వెలిగింది గాలికి ఊగే దారాలతో సాలీడు పటంలా సన్నగా సాగే తెల్లని పొగల మధ్య కిటికీ ప్రేమ్ జీవితం ! సందేహ సంధ్యలా బిగింపబడి ఉంది!
26. ఊహలో క్రియలో ఈ శిలామయభూమిపై ఏ పచ్చని ఊహ మొలకెత్తేను ఈ శిలా గణ తలంపై ఏ ఆర్థ కణం ప్రభవించేను గతాన్ని అరణ్యంలోనే నిద్రపోనీ! మేల్కొల్పితే మనల్ని మ్రింగేస్తుంది వర్తమానాన్ని మేల్కొనే ఉండనీ! దీన్ని నిద్ర పుచ్చడం ఎవరి తరం కాదు భవిష్యత్తును పైన గగనంలో నిల్వనీ ! ఇపుడు దీన్ని దించడం కలలో మాట సముద్రంలో పయనించే నావకు తీరం చేరడమే లక్ష్యం జల ప్రపంచం ఎంత అందమైందైనా ! భూ ప్రపంచానికి రావలసిందే ఆ వణకే చెట్ల చాటున కన్పించీ కన్పించని మనిషి హృదయ ముంది స్పందన విను మెల్లిగా ఆ బ్రతుకు భాష తెలుసుకో ఓపిగ్గా ! చెట్ల పంగల్లో నుండి జారిన త్రాచుల వలె చేతులు కన్పిస్తాయి చెట్ల ఆకుల్లో నుండి నిప్పు రవ్వల వలె కళ్ళు మెరుస్తాయి ఆ కదలని చెట్ల చాటు నుండి కదలే రహస్య జీవితాలు కన్పిస్తాయి ఆతంకమయినా విప్లవమయినా అరణ్యం ఆధారం కారాదు ప్రజలకై ప్రజల మధ్య ప్రజల ఆమోదం శ్రేయం ముఖ్యం. చీకటి ముసుగు, వెన్నెల ముసుగు, నీడ ముసుగు, నిప్పు ముసుగు, పొగ ముసుగు ఒకటేమిటి ? ముసుగు నుండి ముసుగు లోకి మారే ముఖాలు ! ఏ వ్యక్తి అయినా ? సమాజమైనా ? నిజంగా వాస్తవాన్ని భరించేనా ? చెట్ల వెనుక నున్న రూపాల్ని! అతంకమో విప్లవమో కన్పించనీయడం లేదు భయదారణ్యంలో ఆకృతులు ! సముద్రంలో జీవకోటి వలె మునుగుతూ తేలుతూ ! ఈదుతూ ! కన్పిస్తూ వసించేరు తుపాను ప్రకృతికి సృజన కళనూ ఇవ్వలేదు సౌందర్యాన్నీ ఇవ్వలేదు ప్రకృతికి ప్రతిరూపం సమాజం
ఏరోజూ భీభత్స ముఖంతో కన్పించడం కుదరదు ఏ దృక్పథమైనా ఎదురైన మనిషిని ప్రేల్చేసే ఆయుధం కాకూడదు ఏ క్రియాచరణమైనా ఎదలో గంగను ఇంకించే గ్రీష్మం కాకూడదు. రాత్రి రానీ ! శ్రాంతులకు విశ్రాంతి పదం ఏ రాత్రీ విషాదం కారాదు నక్షత్రాల పద్మ వ్యూహం నుండి నేలపై వాస్తవానికి రావడం మంచిది నక్షత్రాలపై ఆశ తో ఆదర్శం, మనిషి చేతిలో ఖడ్గం కావచ్చు ! బాంబు కావచ్చు శిలా హృదిలో ఆర్ద్ర కణం కదలనీ ! శిలా మతిలో పచ్చదనం నిలవనీ ?
27. ఈ స్వప్నం అంతమై ఎటు చూచినా ప్రకృతి ! వెలుగులో తేలే భూమి ! చెట్లు! పక్షులు ! పర్వతాలు! నదులు ! సముద్రం ! జీవకోటి ! మరో వైపు మానవ సమాజం ద్వేషం కోపం తాపం ఘర్షణ యుద్ధంతో చక్ర నేమి క్రమణ జీవితం ముంగిట్లో కాంతి తోరణంతో అదృష్టం తలెత్తిం దనుకునేంతలో గడప దాటగానే స్వప్నం అంతమై ఎదురుగా కత్తి మొనతో దృశ్యం సమాజం సదా కత్తి మొన అంచునో చివరో నిలిచి ఉండలేదు కత్తికి భయపడే ప్రాణి ప్రక్కనే కత్తి చేత బూని మనిషీ సిద్ధం ! పూర్వా పర సంధ్యామతి రూపాలతో సమాజం క్రమిస్తుంది ఒక వైపు సూర్య బింబం మరోవైపు చంద్ర బింబం ఆకర్షిస్తాయి యుగాలుగా అదే మనిషి! జీవితంలో మౌలిక మనో రూపంతో స్వార్థం త్యాగం! ద్వేషం స్నేహం, రణం శాంతి ముఖాలతో మార్గాలు మారినా సాధనాలు వేరైనా సంబంధాల్లో ప్రేరణ శక్తులు ఒకటే లక్ష్యం చేరుకునే ఈహ ఒక్కటే, పయనంలో అనుభవ చలనం ఒకటే !
28. ఈ ఉదయం స్వర చిత్రం నా వెనుక నుండి కోటి ముఖాలు హిమ నగ దర్పణంలో బింబిస్తూ దీప తోరణాలై మెరుస్తాయి కాంతి కెరటాలై కదలుతాయి కిటికీ నుండి చూస్తూ అణువణువూ సర్వం ఆత్మ రూపమైన ఉదయం గూళ్ళ నుండి ఎగిరే పక్షుల వలె మనస్సు నుండి స్మృతులతో నాలుగు వైపుల వివిధ వర్ణబింబాలు ! నా ముఖానికి ప్రతిరూపాలు ! సూర్య కిరణ ప్రతిఫలనంతో శ్రమ బిందు సౌందర్యంతో కదలే సమాజ సందోహంలో భాగమే నా ముఖంలో రంగుల అలలు !
కిటికీ నుండి కనిపిస్తుంది చిల్లి పడిన జేబు నుండి జారిన డబ్బులకోసం ఏడుస్తూ వెదికే కుర్రవాడు వెలిగి వెలిగి కను మూసిన దీప స్తంభాన్ని చేరుకున్నాడు ఎవడో చిలిపి కుంక ! విసరిన రాయికి కారు అద్దాలు పగిలిన ధ్వని ! మెడ వెనక నుండి ఎద పైకి తీసిన ఒడిలో పసి మొగ్గతో బిచ్చ కత్తె ముని వ్రేళ్ళతో నుదురు మీటుతూ పాట పలుకుతూ పోతూంది రాత్రి కనిపించని రహస్య దృశ్యాన్ని చిత్రించడానికి రాత్రి గడ్డ కట్టిన చల్లని నిశ్శబ్దాన్ని కరిగించడానికి తిరిగే ముఖాల్లో ఆర్తి శిఖలు చాలు ! ఆక్రందన వేడి చాలు !
29. రోజు పరుగిడుతోంది రోజు కదలుతుంది, మండే అరుణ చరణాలతో ఎవరికీ తెలీని దూరం దేహంపై తీవ్ర రశ్మి మెరపులతో, నరాల్లో ప్రవహించే కోష్ణ ధునులతో చీకటి మనుషుల్నీ చెట్ల నీడల్నీ వీపుపై మోస్తూ కదలుతూంది రాలిన ఆకుల్నీ తరుముతూ, ఆకలితో మనుషుల్ని పరుగెత్తిస్తూ కళ్ళలో దూకిన మసక చీకటితో తలపై మండే సూర్యునితో ఇళ్ళ ముందు అరచే క్షుధార్తులతో రోజు మొదలౌతుంది తలపై కాంతి కిరీటంతో చేతుల్లో ఆశా పుష్పాలతో గాలి లోపలి కొస్తుంది రోజు నడుస్తుంది నిప్పులపై, స్వేచ్ఛకై ఆరాటంతో హక్కులకై నినాదాలతో సింధూర ముఖంతో బంధూక భావనలో పగటి క్షణాల కదలుతాయి తెలుపు లేదు, ఎక్కడో పచ్చదనం, ఎరుపుతో సంఘర్షణ, మెరుపులో అశాంతి ఉదయ సాయం సంధ్యలు ఆటు పోటు వలె వచ్చి పోతాయి జీవితం తీరం నుండి తీరానికి రోజూ ప్రయాణిస్తుంది జన వాహన సంకుల ధ్వని తరంగాలపై రోజు పరుగిడుతుంది దీనికి విరామం లేదు ! సమాప్తి లేదు ! శాంతి అంత కన్నా లేదు
30. రోజూ అద్దంలో చూస్తాను ఈ రూపాన్ని రోజూ వెలుగులో అద్దంలో చూస్తాను నేలపై గోడపై నీటిపైనా నాకెంతో దగ్గరగా కన్పిస్తుంది
నా ఉనికితో దీనికో గుర్తింపు అవలీలగా సిద్ధిస్తుంది నా ముందు నాకన్నా ఆకర్షణతో అందంగా వచ్చి నిలుస్తుంది సన్నని అలల కదలికలో నేను మరచిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏదో కథ చెప్పడానికి సిద్ధమైన దూర బంధువు వలె ఉంటుంది నాలో ప్రతిదీ సమీక్షించే చిత్ర గుపు ని వలె అవతరిస్తుంది అద్దంలో కన్పించే రూపం నాలో అంతరంగ మూర్తికి బింబం అద్దంలో కన్పించే నాలో అందమైన అహంకార శిల్పమూ ఉంది నేలపై గోడపై నీటిపై కదలీ నాలో భయాన్ని క్రీడింపజేస్తుంది గుహ నుండి బయటికి వచ్చే సింహం వలె ఆలోచన కదలుతుంది అపుడపుడూ ఎదుటి ముఖంలో పైకి తెలీకుండా ప్రతిఫలిస్తుంది మెత్తని అలల కదలికతోనేకోరిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏదో ముడి విప్పడానికి సిద్ధమైన ప్రియ మిత్రం వలె ఉంటుంది దీనికి నా మెత్తని గుండె లయతోపాటు అడుగుల సవ్వడీ బాగా తెలుసు ముఖంలో ఉషస్సు బుజాల వెనక పొంచిన తమస్సు బాగా తెలుసు బింబం ప్రతిబింబంగా అవతరిస్తుంది నీడ క్రీనీడగా కదలిపోతుంది అంతరంగం కన్నా నాలో అహంకారంలో వీటితో అస్తిత్వమున్నట్లుంది
31. ఆశాంతి రెక్కల క్రింద నిన్న ధూళిలో కలిసిన అశాంతి నేడు నిద్ర నుండి లేచింది విషాదంలో ప్లవించే ఎదను గాలి మృదువుగా నిమురుతూంది ప్రతి ముఖంలో ఆవేదనా గాధ, ప్రతి చూపులో విషమ స్థితి ! అశాంతి రెక్కల క్రింది అసహనం బ్రతికి, బట్టకడుతూంది. అద్దం వలె మెరసే ఆదర్శం పై విసరే రాళ్ళ అలజడితో కలత చెందిన సమాజంలో మానవత సుళ్ళు తిరుగుతోంది నాలుగు వైపుల ప్రశ్నా ముఖాల నుండి ఆక్రందనల్ని గుండెకు హత్తుకొని క్షితిజం మౌనంగా ఉంది చీకట్లో పొదల వలె జనపదాల్లో తీరని బాధా గ్రస్తులు విప్పారిన ఇనుప రేకుల వలె కన్పించేరు, నడిచే తీగల వలె నగరాల్లో తీరని ఆశా గ్రస్తులు లేచిన ఇనుప చువ్వల వలె వీధుల్లో కదిలేరు ఆత్మచిత్రంలో వివిధ వర్ణ రేఖలు ఒకదాని నొకటి బాధిస్తున్నాయి ఆత్మ సంగీతంలో వివిధ స్వరాలు ఒకదాని నొకటి హింసిస్తున్నాయి సమాజంలో లేచిన ఆశాంతి ఉదయమే అంగార మద్దుకుంటూంది
శిల వలె బిగిసిన కాళ్ళతో ఇక్కడ గాలి కదల్లేకుండా ఉంది అగ్ని ఆలోచనలో మొలిచింది వృక్షమై ఆకాశాన్ని అంటుకో జూస్తూంది ఎగిరే హంస హింసానుభవంలో కొన ఊపిరితో రెపరెపలాడుతూంది కాలం స్మృతి చిహ్నంకై ఎదురు చూచే శిలా ఫలకం వలె ఉంది గొప్ప వారసత్వం ఉన్న మనిషి అశాంతి రెక్కల క్రింద నీడయై చరించేను
32. బింబమై పురా బిందువై నగరం నాటకం వలె ఉంది అంతలో అరణ్య మౌతుంది సమయం దర్పణం వలె ఉంది అంతలో సముద్ర మౌతుంది రాత్రి అయినా నిద్రను మ్రింగేసి మేల్కొని ఉండే పాత్ర లున్నాయి కాళ్ళ క్రింద అలలై కదలే క్షణాలు చిరు కత్తులై కదలుతాయి రాత్రి వస్తుంది, చీకట్లను కళ్ళలో గుప్పుతుంది, పోతుంది పగలు వస్తుంది, భయాన్ని గుండెలో నాటుతుంది, పోతుంది జీవికకై ఆరాటం వీధుల్లో పోరాటం పొగలతో మంటలతో అగ్నులై కాలం ఎప్పుడూ ఎవరినీ గుర్తించని తొందరలోనే ఉంటుంది ఒకపుడు కుంటిగా మరొకపుడు గుడ్డిగా మరొకపుడు చెవిటిగా ఏ మొగమోటం లేకుండా ఎదురౌతుంది తొలగిపోతుంది ఎతె న మేడ కింద నీడ వెలుగుకోసం పై పైకి చూస్తుంది చెవిలో దూరని కథల్ని గాలి ఎలాగో వినిపింప జూస్తుంది కష్టాల్నీ భయాల్నీ అరచేతిలో అదుముకొని ఇంత దూరం వచ్చిన ఈ మనిషిలో వసించే నగరంతో పాటు వదలిన అరణ్యమూ ఉంది బింబమై చెదరని పురా బిందు చిత్రమై
33. బ్రతుకు రెక్కలపై జన సంకుల నగరంలో ఘన కోలాహల ధునిలో అడుగు పెట్టిన మతిలో స్వర్గ శకలం ! ఇంద్రచాపం ! అందుకోనూ హత్తుకోనూ, పద పదం ! ఆరాటం ! ఆవేదన ! ఆవేగం ! ఆరోహణం అవరోహణం! పగలంతా తిరిగి నిరుద్యోగి ! కొమ్మలు తెగిన చెట్టు క్రింద కన్పించేను సంకీర్ణ శబ్ద ప్రపంచంపై నుండి తేలుతూ పాట వినిపిస్తోంది
సముద్రంలో నావల్ని కెరటాల వలె వాహనాల్ని మనుషులు తప్పకునేరు రోడ్ మధ్య అలజడిలో నుండి ఈదే చేపల వలె కదలేరు వేగంగా బ్రతుకు నుండి బ్రతుక్కి ఒక చోటు నుండి మరో చోటుకు అన్వేషణతో మాటతో పాటతో ఆలోచనతో తరంతరం నిరంతరం ప్రయాణం రాత్రి ఎదపై వెలిగే చంద్రుని వంటి రస హృదయంతో పగలు మతిపై వెలిగే సూర్యుని వంటి తేజో మస్తిష్కంతో ఆవేదన ఆవేగంతో శబ్దం నుండి సంగీతానికి చలనం అనుభవంతో ఆలోచనతో వాస్తవం నుండి ఆదర్శానికి పయనం మనిషి చుట్టు నీడలు ! క్రీ నీడలు ! చీకటి రూపాల మధ్య అందరాని హిమ శిఖరం ! హిమ శిఖరంపై నుండి కాంతి లహరి, బిందువు నుండి వలయానికి, వలయంలో అంతర్వలయ సమూహం బ్రతుకు రెక్కలపై నగరానికి, నాటకంలో అంతర్నాటక దృశ్యం మొదలు !
34. తరంతరం అన్వేషణతో వీథి దీపాల కళ్ళు తెరచి నగరం రాత్రి అంతా మేల్కొని ఉంటుంది జన కోలాహలంతో నగరం రాత్రి దాకా విశ్రాంతి ఎరగని సముద్రం ఆలస్యమయ్యే తొందరలో బుజాలెగరేస్తూ వాహనాలు పరుగెత్తుతాయి వీటి మధ్య బుజం మారని బ్రతుకు బరువులో కలలుగనే తీరికెక్కడిది ? దారిలో, పాతిన వెదురు గడల కిరువైపుల కట్టిన తీగెపై మెడలో తాడుకు వ్రేలాడే పాపతో తీరిగ్గా నడచే జీవితాలు అపుడపుడు శబ్దం ఎదపై సూది మొనవలె గ్రుచ్చుతుంది రాయై తగులుతుంది బాకై దిగుతుంది శిఖయై కాలుస్తుంది పయనిస్తుంది వణకే పెదవులపై మాటలు మంటలపై ఎగసే పక్షుల వలె ఉన్నాయి వీపుపై బరువు దించే లోపల మనిషి కాళ్ళ క్రింద బాంబు ప్రేలుతూంది సూర్య కిరణాల్ని అల్లుకొని అనల లతలు ఊగుతున్నాయి తరాన్ని అతిక్రమించి మరో తరం కదలుతూంది స్వేచ్ఛగా తరం తరం అన్వేషణతో కదలుతుంది వెలుగుతూంది భౌతిక శక్తుల మధ్య కన్పించే సంస్కృతి లక్ష్యంకై ఎదుగుతూంది దారిలో కాలం హరిణమై అశ్వమై యంత్రమై ఎదురౌతూంది గదులు గదులుగా నీడలు వెలుగులు సరి క్రొత్త ఆట కాహ్వానిస్తాయి రేపటి గురించి కలలు గనే అర్థరాత్రి సమయం పగటి శ్రమ మరచి అంతా నిదుర పోతున్నారు
35. భోపాల్ విషాదం విష వాయువు వాతావరణాన్ని మృత్యు వలయంగా మారుస్తోంది వెలుగేమిటి ? వెన్నె లెమిటి ? పూవు లేమిటి ? ప్రాణు లేమిటి ? హఠాత్తుగా కదలే భయం తరంగాలపై నగరం అటూ ఇటూ ఊగుతోంది ఒక్క మారు లేచి జనం, వెన్నాడే మృత్యు భయంతో పరుగెత్తేరు ఇల్లు వదలి వీధి దాటి నగరం వీడి కాలి ముని వ్రేళ్ళపై పరుగెత్తేరు అణువణువూ క్షణంలో ప్రాకే మృత్యు జాలంలో చిక్కింది ? ఒక్క మనుషు లేమిటి ? విష వాయువు కదలినంతమేర సర్వప్రాణులూ ఉక్కిరి బిక్కిరౌతున్నారు, సముద్రంలో మునిగే అనుభవంతో ప్రాణం పోసే గాలే ప్రాణం తీస్తుందీ విషమ స్థితిలో ఇంతవరకు సుగమంగా సాగిన జీవితం, అగమ్యంలోకి పరుగెత్తుతూంది స్వర్గం కూలి లోయలో పడుతూంది విషాదం శిలామయమౌతూంది మృత్యు తీరంలో మృత్యుచ్ఛాయల్లో మృత్యు భయంతో ప్రాణి కోటి కదలుతూంది, ఆశా సూత్రానికి వేలాడుతూ ఆరిపోతూన్న వెలుగుల్లో వినీల మవుతూన్న జీవిత కథతో అర్థరాత్రి మృత్యు పవనానికి సమాజం శీర్ణమై కీర్ణమై ఎగసి పోతూంది ఉదయమైంది ! అయినట్లే లేదు ! నలు వైపుల వికలస్థితి ! భీభత్సం నగరమంతా ఒకే మంచు ముసుగులో ఆర్త స్వరంతో ఊగుతోంది సగం నగర మింకా నిద్రలో ముడుచుకునే ఉంది ! లేవనే లేదు యాంత్రిక జీవనంలో వెలుక్కి బదులు చీకటి చిమ్మిన విలయ సమయం అవనిపై కదలుతూన్న మరణభయ ధూమ శిఖల సమూహం మృత్యు పాద ముద్రలతో అంకితమైన భీభత్సం మనిషిలో అలసతకూ ఆశ్రద్ధకూ వికార చిహ్నం ! స్వచ్ఛమైన గాలి కోసం భయంలేని స్థలం కోసం విషాద ముద్రతో బరువెక్కిన అడుగులతో జనం ! భయ భూతాన్ని నిలిపిన ఉదంతం ఒక పీడ కలగా మిగిలింది ఈ విషాక్త వాతావరణం నుండి అమృత స్వరం తప్పక వినిపిస్తుంది ! నీలి ముద్రల్లో మృత్యు హాసంలో నిన్న తేలిన చరిత్ర భోపాల్ విషాదం స్మృతిలో ఎప్పటికీ మిగిలే ఉంటుంది నాగరక సమాజంలో అశ్రద్దకూ అలసతకూ చిహ్నంగా
36. చరిత్ర తేజం ఆర్్చ గేట్ వద్ద రక్షక భటుడు ! వెలుగు నుండి వేరైన చీకటి పక్షి! ఆ ఉదయం క్షణాల్ని ఉన్మాదపు రెక్కల నీడతో కప్పేసింది. గేట్ దాటింది హిమ తుషార స్నిగ్ధ కిరణం జన గణ హృదిలో రెపరెపలాడే ఆశా కేతనం గుహలో లోయలో చరించే ఆటవిక మృగ రూపం మృత్యువును గుప్పించింది, ప్రధాని నేలపై కూలింది. శిఖరం నుండి మానవ సంస్కృతి పాతాళానికి జారిన సమయం శిలా మౌఢ్యం వెనుక నుండి పన్నిన బర్బర నీతికి కె మాక్్స. ఉదయ శరీరం సాయం సంధ్యా జపా సుమ గుచ్ఛమైంది చిమ్మిన రుధిర కణకణంలో త్యాగ ఫలం బింబిస్తూంది స్తంభించిన గాలి తలపై నుండి విషాద వార్త ఎగసి దూకి ప్రాకింది మనుషుల్ని దిగ్రమలోకి విసరింది అణువణువునూ అనలం స్పృశిస్తూన్నట్లుంది గుండెలు హహాకారంతో కణకణలాడాయి. హత్యా భీభత్స దృశ్యం గీసిన విషాద చిత్రం వలె ఉంది ఆమె ఇంట్లో అంతా తన వాళ్ళే! ఉండవలసిన వాళ్ళే ! మహా దేశ సముద్రంలోని శకల బిందువులే ! క్షుద్ర నీతి వ్యూహంలో పావులుగా మారారు జాతి సమున్నతికి సంకేతమైంది. హిమ సుషమా శిఖరమైంది క్షణంలో క్రిక్కిరిసిన గత స్మృతుల్లో ఒక వెలుగై మిగిలింది ప్రజల కన్నీటి అలలపై తేలుతూ శిథిల జీవిత గాధల్ని స్పృశిస్తూ శ్రమ జీవన సౌభాగ్యం ఆదర్శంతో అమరమైన భారతేందిర నవ సమాజ నిర్మాణంలో చరిత్ర సృజించిన తేజం. (1991) అంకితం సేవా చందన మతి సోదరుడు శ్రీ మాదిరాజు వెంకటేశ్వర రావుకు 1. సూచిక ఈ శతాబ్ది స్వేచ్ఛలో
2. హిమజలాల్లో అగ్నులై పుట 3. ఇక్కడికి నేను వచ్చింది 4. ఆలోల స్వరం 5. ఒంటరి రూపం 6. దారిలో అంగార కణం 7. ప్లాట్ఫార్్మ పై 8. ఆదేవునికి తెలీజేస్తూ . . . . 9. వాస్తవ చేతనతో 10. శ్రమబింబం 11. ఇంకా మిగిలే ఉంది 12. అహంక్రీడ 13.
కిరణ కిరణం 14. కరుణించే ఆశతో 15. ఆర్కెస్ట్రా హృదయం
7. అశాంతి ఆర్కెస్ట్రా
1. ఈ శతాబ్ది స్వేచ్ఛలో ఈ శతాబ్ది అగ్ని పథాన్ని గమించింది, రెండు యుద్ధ శక్తుల మధ్య జ్వలించింది నియంత పాదాల ఇనుప చక్రాలపై వినీల భీ శ్రేణుల పై నడిచిందీయుగం ప్రజాస్వామ్య విజయమూ చూచింది, జనం కలల్ని యధార్థానికి చేరువ తెస్తూ లెనిన్ పిడికిలిలో శ్రామికజన కేతనమైంది ! మహాత్ముని ఎదలో శాంతి విహాయసమైంది. ఆసియా దారిద్ర్యం ఇంకా తీరనే లేదు, ఆఫి కా హాహాకారం గ్రాఫ్ మారనే లేదు స్వేచ్ఛకై పోరాటం ఎంతో ఉండనే ఉంది, ఆటవిక క్రీడల సరదా ఉండనే ఉంది మనిషిపై ఆశకు అణు ఘట్టితనవ జపాన్ చిహ్నమైంది దూసికొని పోయే క్షిపణిపై నుండి ఈ శతాబ్దం పోనీ ! ఒక్క తూర్పునే కాదు మార్పు ! అన్ని దిశలా ! మార్పు రానీ అరణ్యం హరీంద్రమై మేల్కొందీ, సమాజం సముద్రమై పొంగేను జడంలో కణకణంలో చైతన్యం, ప్రతిచోట స్వేచ్ఛకై సంగ్రామం మండెలా దేశ విమోచన చరణం, ఈ శతాబ్ది స్వేచ్ఛకు మహోదయం.
2. హిమ జలాల్లో అగ్నులై అవని కార్షణ శక్తి ఉన్నట్లే మనిషిలో మనో భూమికీ ఉంది అశాంతి హింస ఎవరి కిష్టం ? అయినా బ్రతుకులో తెలిసీ తెలీకా తప్పడం లేదు దేశ రాజకీయంలో జీవన తలంపై ఉదయాస్తమయాలకు భేదం లేదు సూర్యుని మొదటి కిరణంలోనే హిమ హృదయం విషాదంతో ఎదురౌతుంది కాశ్మీర్ పంజాబ్ చండ్ర నిప్పుల కళ్ళతో హిమ జలాల్లో అగ్నులైనాయి మంచు పొగల్లో గోడ వెనక చీకటి కప్పుకొనీ అజ్ఞాత శక్తులు కదలేను ఉగ్ర వాద హింసతో అదర్శం ముక్కలైంది, ఆనందం మాయమైంది
ఈ వీధి దాటితే మరో వీధి ఆ ఊరు దాటితే మరో ఊరు అక్కడా అగ్ని చక్రమే! ఎక్కడ చూచినా ఆతంక వలయాలే ! వివేకాని కందని గతిలో ప్రతి తీవ్ర మతి ఒక ఆయుధమై పని చేస్తూంది నిషేధించిన అక్షరాల్ని చదవాలనీ ఆ ముఖాలతో మాట్లాడాలనీ మానవతా స్పర్శతో సమాజం శాంతిని కోరుతూంది సుఖ నిద్రకు బదులు రాత్రి రాలే అగ్ని కణాల్ని చూడాలిసి వస్తూంది కలహాలతో కళేబరాలతో అవని రణానికీ సమాధికీ సమీపంలో ఉంది ఏ మనిషీ అగ్నుల మధ్య జ్వలిస్తూ ఎల్ల వేళల నిలవ లేడు బంధన నుండి పీడన నుండి ఘర్షణ నుండి అశాంతి నుండి చరిత్రలో నెమిబియా స్వాతంత్య్రం ! ప్రగతి దిశలో మహోదయం ఎక్కడైనా ఎప్పుడైనా జీవితంలో మానవీయం విలువ లొకటే మనస్సు సహజంగా రుద్థం కాదు ; జీవితం నగ్నం కాదు నీలాకాశం నుండి రాత్రి కొంత సేపటికైనా శశి బింబం వస్తుంది ఒక అలంక్రియ పోతే మరొకటి ! ఒక విధం బదులు మరో విధం భయంలో విషాదంలో హృదయం స్వేచ్ఛను కోల్పోతుంది తీరిక లేని పగలు బంధనలో కన్పించని స్వేచ్ఛా రూపం చేతిలో ఏ కల్తీ తుపాకీ లేకనే హృదిలో స్వేచ్ఛా శక్తితో ఒక వైపు నేపాల్ ప్రజ ! ప్రజాస్వామ్య కేతనమై నిలిచింది. ఉదయ కిరణ స్పర్శకు హిమ శిల కరిగి కదలి ప్రవహిస్తూంది, పీడనలో వేదనతో సామాజిక చేతనతో రసమయ శబ్దం నాలో ఇక్కడికి నేను వచ్చింది సమాజ తలంపై ఏ చెట్టు వలెనో నిలిచి పోయేందుకూ కాదు
3. ఇక్కడికి నేను వచ్చింది ఏ రాయి వలెనో మౌనం వహించేందుకూ కాదు పర్వతాలు నదులు దాటి ఇంత దూరం ప్రయాణించింది సంస్కృతీ శిఖరంపై నిరంకుశంగా హతమయ్యేందుకూ కాదు ప్రజాస్వామ్య సందేశంతో నాలో నీల మేఘ బృంద సంచారం దిశ దిశలో కరుణతో వర్షిస్తుంది ఎద ఎదలో సమతతో స్పందిస్తుంది ఎప్పటి కప్పుడు స్వేచ్ఛలో కొత్త క్రొత్త శక్తుల్ని సృజిస్తుంది ఒక్కొక్క బిందువుతో ఒక్కొక్క ప్రపంచాన్ని హర్షింప జేస్తుంది ఆటకై ఇంటి ముందు బొమ్మలు పరచుకొన్న చిన్ని పిల్లల్ని
సన సన్నని పూల చినుకులతో అలంకరిస్తుంది పాత కలల్ని ముక్కలు చేసి కొత్తకలల్ని సృజిస్తుంది స్వేచ్ఛకై నినాదంతో నిరాశాహతుల్లో కొత్త శక్తి సమీకరిస్తుంది బయటి రూపం భౌతిక శక్తుల ఘర్షణకు హింసకు గురైనా మనిషి లోపల ! రూపం అమృత శక్తితో బయటికి వచ్చేను ! శ్రమ బిందువు రాలే సంధ్యతో యంత్ర వేగ పదగతిలో జనాలోల కోలాహల సమాజం ఆర్కెస్ట్రా వినిపిస్తుంది, ఇపుడు సోలో ప్రసక్తి లేదు.
4. ఆలోల స్వరం నలిగిన దారే అయినా అన్వేషణలో లక్ష్యంకై ఉన్న దారి చీలుతూంది కొత్త దారు లేర్పడతాయి కొత్త సమస్య లెదురౌతాయి సమయాన్ని బట్టి ఎదపై ఏ నిప్పుల కుంపటో? ఏ మబ్బుల పందిరో నిలుస్తుంది! ఏ పూల గుత్తో ఏ ముళ్ళ కిరీటమో ఎదురౌతుంది అగ్నులపై నడుస్తూ మానవ బాధ్యత వరించే జీవితం త్యాగాన్ని వరిస్తుంది ప్రేమను పంచుతుంది శిశు దశలో హిమ దర్పణమై ఆపై తెలివి మీరి రణార్ణవమై మనో ముఖాని కొకవైపు సంతోషం మరో వైపు ఆవేదన! బాధా జగత్తు నీడ నంటి ఉంటుంది! ఆనంద జగం వెలుగునంటి ఉంటుంది! నీడలో వెలుగు ముగ్గులతో! వెలుగులో నీడ ముద్రలతో ప్రతి ఒక్కరి జీవితం!
5. ఒంటరి రూపం ఒంటరిగా ఉన్నా మనో దీపం చీకట్లను చీలుస్తుంది వెలిగిస్తుంది. లోపలికి దారి చూపిస్తుంది, రహస్యాల్ని బయట పెడుతుంది రాత్రి నిదుర లోయల్లో ఉదయం మెలకువ మైదానంలోకి వచ్చే సరికే ముంది? ఆ వదలిన దృశ్యాల మౌలిక ముద్రలే ఇక్కడా! చేతి వేళ్లు తాకితే మౌనంగా రేకులు రాలే గులాబి హృదయాన్ని కదిలిస్తుంది! వేదన రగిలిస్తుంది రవి వేళ్ళు తాకితే మౌనంగా కరిగిపోయే మంచు
హృదయాన్ని తేలుస్తుంది సంతోషం వెలిగిస్తుంది తల తెగి జారిన రక్తంతో తడిసిన నేలపై కూడ విత్తు చిగురిస్తుంది సృజన శక్తికి ఆగ్రహమూ అనుగ్రహమూ ఒకటే ఆకుల వలె ఆలోచనలు గలగలలాడినా పూల వలె ఆశలు తళతళలాడినా ఆగ్రహంలో దాగిన అనలం ఆయుధమయ్యేందుకు సిద్ధమవుతుంది
6. దారిలో అంగార కణం దారిలో అంగారకణం దూరం నుండి ఎర్ర గులాబి వలె ఆకర్షిస్తుంది. కాస్త దూరంలో దూసిన ఖడ్గం రక్త బిందువుతో వికర్షిస్తుంది అంగారం గాలి కెగిరి గుడిసెపై పడితే అంతా పరశురామ ప్రీతియై! క్షితిజం సాయం సంధ్యా స్థితి పొందొచ్చు, బ్రతుకు ఎడారి సమం కావచ్చు మెషిన్ గన్ హస్తమైనా కత్తి పదును అడుగలైనా ప్రభావ శక్తితో హతం! దీని ముందు అన్నీ వ్యర్థం! అంధకారంలో అంగారకణం అవసరానికి ధైర్య చిహ్నమవుతుంది వెలుగు లేని రాత్రి ఇదో చిన్నికిరణ శకలం కావచ్చు అడవి బ్రతుకులో అగ్ని నేత్రం! దీనిపై రాత్రి చీకటి తెర జారుతుంది రాత్రి కుంపటిలో అగ్ని ముఖం! దీనిపై తెర కదులుతుంది భవిష్యత్తు కుత్తేజం, ప్రస్తుతానికి ప్రేరణం, సంఘర్షణకు బీజం వ్యక్తిలో అంగారం అహంకార పుష్పం! బలమైన ఆకర్షణ నిలయం దారిలో కాచుకొని అందరికీ, తమ వైపు చూస్తున్నట్లుంటుంది. అపుడపుడూ చేతిలోకి తీసుకోవాలనిపించే, వజ్రం వలె ఉంటుంది. జీవితంలో అహంకారం దారిలో పుష్పమై వజ్రమై తోచే అంగార కణం.
7. ప్లాట్ ఫార్మపై ప్లాట్ఫార్్మ పై జనం ఓపిగ్గా కూర్చొనీ నడుస్తూ కాలం గడుపుతున్నారు ఏ భాషా ప్రాంతం వర్ణం అయినా అందరికీ సమావేశ నిలయంగా ఉంది దీప స్తంభాలు స్నేహ మూర్తుల వలె ఏ భేదం లేకుండా ఉన్నాయి ఒక్క మారు లైట్లు వెలిగి స్టేషన్ షెడ్ ఆవులించినట్లుంది ఒక ప్రక్క విరిగిన బెంచ్పై ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. ఎవడో విచ్చ గాడనుకోవచ్చు, ఎవడో త్రాగి పడుకున్నాడనుకోవచ్చు!
వాలకం చూస్తే నిరాశా శకలమో! క్షామ ఖండమో! సందేహం కలుగుతుంది. మెర్క్యూరీ లైట్ల వెలుగులో సగం సగం మెరుస్తూ ఇనుప పట్టాలు సన్నని గాలికి అలలు కదలే నీటి పాయల వలె ఉన్నాయి. బయటి నుండి నినాదాలు స్టేషన్లోకి నిశితంగా దూకుతున్నాయి కంటికి కన్పించని సంకెళ్ళను గల గల ధ్వనింపజేస్తున్నాయి దరిద్రయానంలో పచ్చ లైటు మెరవచ్చు, ఎర్రజెండా ఊగొచ్చు శిలా శ్రేణిపై మేఘం కన్పించ వచ్చు, రైఫిల్ తలెత్త వచ్చు ఆకలి నుండి నీలి రాక్షసుడు రావచ్చు, విప్లవ రూపం ఎగసి పడొచ్చు అలజడి ఎక్కువైంది! ఆయుధం ప్రేలింది, ఆ పడుకున్న వ్యక్తి లేచాడు మళ్ళా నిద్ర కొరిగాడు ఆ కలకలం వచ్చే దిశ వైపు తిరిగాడు అలజడి శాంతించింది! ప్రయాణ సంరంభం తప్ప బయటి శబ్దం లేదు గుండెను గుబగుబలాడిస్తూ రైలు వచ్చే గంట గణగణ మ్రోగింది విసరిన దుప్పటిలా లేచాడతడు, కల నుండి వాస్తవానికి దిగినట్లుంది ఇంతలో రైలు వచ్చేసింది, కాలం ఆగినట్లు నటిస్తూంది బుజాన బాగ్ తో చేతిలో మడిచిన న్యూస్ పేపర్తో రైలెక్కాడు ఎదురుగా గ్రీన్పే ట్! గార్్డ విజిల్ వేసి పచ్చ జెండా ఊపాడు రైలు కదిలింది. అతణ్ణి చూచే చూపులు పరుగెత్తే రైలు వెంట బడినాయి అతని మూర్తి ఆలోచనలో సందేహ రూపమైంది ఎదురుగా ప్లాట్ఫార్మ్ర్కు దూరంగా రెడ్ లైట్ వెలిగింది రైలు ఆగింది! అతడు కన్పించలేదు! చూపులు మరలాయి అతడె వరైతేనేం? బిచ్చగాడు కాదు, మత్తులోనూ లేడు బట్టలు మాసాయి, గడ్డం పెరిగింది, ముఖం అలసిపోయి ఉంది, అంతే! అనుమానం ఎక్కడికైనా లాక్కొనిపోతుంది! భయం ఏమైనా ఊహిస్తుంది! మనస్సు చేతనైందే చేస్తుంది, నిజం ఎంత లోతునైనా లెక్క చేయదు అలజడికీ అతనికీ సంబంధం ఊహలో బహు సులభం లోతు బావిలో బింబం, సూర్యుడు నిటారుగా తలపై ఉన్నపుడే కన్పిస్తుంది!
8. ఆ దేవునికి తెలిజేస్తూ అరణ్యంలో మృగాల భయానికి హరిణాలు కన్పించడం లేదు మృగరాజు జాడలేదు మనిషిలో అరణ్యం ఇప్పటిదా? ఎప్పటిదో! కర్ఫ్యూలో నగరం, పొలిమేరల్లోనే తరుమబడీ పాతేయబడీ వెలుగుల్లో నుండి ఒకటి రెండు సందుచేసుకొని నగరంలోకి ప్రవేశిస్తాయి
ఇక్కడ జీవితం క్షణాలపై కొత్త రంగుల రూపాన్ని పొందుతూంది ఎవరూ గుర్తించరని ధీమా! చెట్లపై నుండి ఎండలో కోట జ్వలిస్తూ భయం గొల్పుతుంది కోట గోడకు తాకి గాలి తుది శ్వాస వలె నిలిచి పోతుంది కోట గోడ నుండి మరలి మరో శ్వాసతో కదలి పోతుంది శబ్దం ఆగిపోతుంది, ఆగిన శబ్దం వెనకనే మరో శబ్దం తరుముతుంది గుండెల్లో పొగ క్రమ్మి ముడుచుకొనీ పూలు కొమ్మ నుండి విడిపోయే భయంతో వణకుతున్నాయి శాంతికై అగ్ని మీటుతూ ఒక చోట, స్వేచ్ఛకై తుపాను రేపుతూ మరోచోట ఆయుధాల సంభాషణతో కోలాహల వాతావరణం నాటకీయ మవుతూంది ఎంతో కొంత సహాయానికి తోడూ సానుభూతి ఉండనే ఉంది. కశ్మీర్ పంజాబ్ రుమేనియా అజబెజాన్ అశ్రు నయన జన గణం జ్వాలా సమూహాల మధ్య బ్రతుకుతూ మేఘ రాగాన్ని కోరుతూంది కళ్లు తెరచి లేచి మనిషి బయటి ప్రపంచలోకి అడుగు వేసే లోపల ఆయుధం ప్రేలుతోంది! ప్రాణం ఆకు వలె రాలి పోతూంది సముద్రం అడుగు క్రింద కదలినా, అరణ్యం కాలి కింద అణగినా శిరస్సుపై ఆకాశం హాట్ విధయయినా, మానవత లేంది, శోభలేదు. జంతువు కదులుతూంటే వెనుక నుండి మృగం అడుగేస్తూ వస్తుంది పొదలోనో చెట్టుపైనో దాగిన వేటగాడు, వీటి జాడ పసిగడుతూ తిరిగేను మానుషీయంతో పరిపుష్టం అవని జీవిత మొక అస్థి పంజరం పాపంతో నిండిన మట్టి కుండను పగలగొట్టి బయట పారేసి చేతులు దులుపుకొని పోయే రోజులు పోయాయి భద్రంగా ఏ బ్యాంకులోనో దాచుకొనే కాలం ఇది అయినా ప్రౌఢ సుందరంగా నిల్చిన గుడి గోపురం ఆ దేవునికి సూటిగా సమాజౌన్నత్యాన్ని సూచిస్తూంది అంరిక్షంలో తిరిగే సెట్్ట విశ్వమానవుణ్ణి స్పందిస్తూంది పగలు వలె స్ఫుటంగానో రాత్రి వెల గుప్తంగానో
9. వాస్తవ చేతనతో సమయం సమయం నాలో కదలుతూంది సమాజం వాస్తవ చేతనతో శబ్దం మనస్సులో వెలుగునూ చీకటినీ ఆవిష్కరిస్తూంది శబ్దం అంచుల్లో ఆలోచన జీవితాన్ని మోసుకపోతూంది
ఈక్షణం జీవితంలో ఉన్న వర్ణం మరో క్షణంలో ఉండదు మైదానంలో నా ప్రక్కనే మొలిచిన లేలేత మొక్క చేతి వ్రేళ్ళకు శిశు శరీరం తాకి నట్లనిపిస్తూంది చేతిలో నుండి గాలి కెగిరి వాలిన కాగితం పై అక్షరాలు గుహ బయటి కొచ్చిన పులి కళ్ళ వలె మెరుస్తాయి అంతలో అందమైన జింక వలె కాగితం నా వశమౌతుంది సముద్రంలో పడవల వలె చేతనలో స్మృతులు! దండలో పూల వలె స్వేచ్ఛా సూత్రంలో అనుభవాలు మృగ తృష్ణ ముఖాలతో ప్రక్క నుండి కదలే శ్రామికులు జీవితంలో ఒక ప్రక్కన ప్రకృతీ మరో ప్రక్క యంత్రం రెండిటినీ కలిపే ప్రవాహ తరంగ రూపం అవసరం కాలాన్ని శ్రమ సుందరంగా తీర్చే క్రియా చిహ్నం యంత్రం మనిషిలో పొందిన సంస్కృతికి ప్రతిఫలనరూపం దారిలో అర్థ నగ్న శరీరాల్ని చీకటి దాచేయ జూస్తుంది ఉదయం వస్తుంది! వాస్తవ చేతనతో అలంకరిస్తుంది కొందరికి ఉదయమెంత ఆలస్యంగా వస్తే అంత మంచిది దాహంతో నున్న ముఖాల్ని స్పృశిస్తూ మంచు తెర కదలిపోతుంది ఏ గొంతూ తడపలేదు, ఆశను పోనీదు, స్నేహస్పర్శ వీడదు ఏ కాస్త దూరంలోనో ఏ యేరో, నదో ఎదురుపడొచ్చు ఏ కాస్త దగ్గరలోనో ఏ నూయో చెరువో ఉండక పోదు! అయినా ఈ మొక్కనూ, ప్రాణినీ, మనిషినీ, మనిషిలో ఆర్తినీ తడిపే మేఘం! రావలసిందే వస్తేనే బ్రతుకు! వాస్తవ చేతనలో ఆర్కెస్ట్రా ధ్వనితోనే సమాజం ఆనందం ఈ శతాబ్ది కావ్యమై
10. శ్రమ బింబం ఈ శతాబ్ది నవ మానవ గాథమయ ప్రజాస్వామ్య హృదయాశయ పథవిలోల! మనిషి మనిషి కలిసి విశ్వ తోరణమై మనసు మనసు వెలిగి నిశా ప్రభాతమై స్వేద జలం రక్త బలం కలిసి మనిషి గంగా ఝరీ నైలు తటీ ఓల్గా హృది భయం వదలి వెనుక గతం లోయల్లో కదలుతూంది జనత! విశ్వ చరితయై హలం కలం యంత్ర శక్తి బింబితమై జీవితమై మానవీయ దర్పణమై జన జీవన భిన్న భావ కోలాహల నవ మానవ భిన్న వర్ణ రాగాంచిత!
ఆకాశం అంచులు తన రెక్కలపై ఎగరేస్తూ పోయే హింసీ రూపం నాలో అవని హరిత హృదయం తన రెక్కలతో కాపాడే వినీల జలదం రూపం నాలో మానవ చరిత్ర చిహ్నం మట్టి పొరల్లో దాచే ధరణీ విశాల రూపం నాలో చుట్టూ విసరే రాళ్ళకు తగిలిన దెబ్బలు మరచే మానవతా మధు రూపం నాలో మంటలపై నడిచీ, నెత్తురు చినుకుల్లో తడిసీ ప్రాణిత శాశ్వత బీజం నాలో ఆత్మకు గుణమూ రూపం ఇచ్చే జీవన సత్యం బింబిత కవితా లోకం నాలో ఎక్కడో లేను నేను ఇక్కడే ఉన్నా హలం పదం దారి వెంట నీ ఎదుటే ఏ పొలం గట్టు పైనొ వృక్షం నీడనొ నీ గమనం దారి వెంట! నా పదచలనం వీడని పలుగూ పారా సాధన సంపదతో రాలిన స్వేద కణం త్యాగ ఫలం గాథలతో నాడూ నేడూ నీవో! జనం శక్తి చిహ్నం ఎక్కడనో లేను నేను! మానవీయ రూపం అణువణువును శ్రమ చేతనతో తీర్చే సుందర మానవ శక్తుల దారుల నే నున్నా మట్టిని చిరు పాపల నవ్వుల వలె మురిపించే నీ శ్రమ జల కీర్తికి బింబం వలె నేనున్నా
11. ఇంకా మిగిలే ఉంది వర్తమాన శబ్దం ఇరు వైపుల నిశ్శబ్దం జీవితాన నిశ్శబ్దం! గోడల సీమలతో ఎన్ని ఇళ్ళు! గోడలపై కప్పులతో నిల్చీ ఒకటొకటీ స్మృతిలో రహస్యమై గాజు బొమ్మ వలెనో మట్టి బొమ్మ వలెనో నేలపై మతి జారే వినీల సమయం ముక్కలుగా చెదరే శబ్ద భయంతో జ్ఞప్తికి వస్తుందీ గోడ! నిశ్శబ్దంగా గోడ ప్రక్క నిద్రించే మనిషిని లేపేను నిశ్శబద్ధం నుండీ శబ్దం వలె సూరీడు ఈ మెలకువ ఉంది చూడు! ఆనాటికి సరి అందుకే సమాప్తి కాదు! ఈ సూర్యుని పని సన్నని జల రాగంతో పిలుస్తోంది హృదయం ఆర్కెస్ట్రా శబ్ధంతో ధ్వనిస్తోంది నగరం గాలిలో నినాద తరంగాలు జ్వలించేను జీవన శక్తుల పోరాటంతో సమయం శిల్ప వలె మనిషీ! శిల్పంతో విపణి రుచీ
ఎర్రని వెచ్చని గాలికి వశమై ఈ ఉదయం ఇంటి చుట్టు చెట్ల నుండి పూవు ఫలం రాలేను తొలగి పోయి రూపం మట్టిని కలిసేను చుక్కల వలలో చిక్కిన చంద్రుడు ఎటు పోయేను? ఎక్కడికని పోయేను? మానవ హృది గుహలోకి వ్యక్తి వెనుక నుంది సామాజిక చరిత్ర ప్రతి పదం ముద్రపై వ్యక్తిత్వం ఫోటో ఎత్తిన చేతులతో చేతులపై రవితో అలయై కదిలే పాద పంక్తి గతితో హక్కులకై పోరాడే జన గణ రూపం మార్పును కోరే నవ స్వేచ్ఛకు సంకేతం చలనంలో వేళ్లు తెగిన గతంతో గమనంలో సుళ్ళు తిరుగు బలంతో తరాల శ్రమ శక్తుల పై నిల్చిన సమయం చరిత్రలో వేల వేల పూల వికాసం బుజాన నాగలితో ముఖాన మేఘంతో కదలే మనుషుల నీడల కల్పనతో యుగాల దారిద్య్రం నిజమై కళయై, జగంలో ఎడారి ఇంక మిగిలే ఉందీ
12. అహంక్రీడ మనిషి చరణ యుగం పైకి ఎంత ఎగసినా అవని హృదయ తలంపైకి రావలసిందే ఘన వన జన పదాలతో అనుబంధంతో ఈ సర్కస్! తమాషా! ఎప్పటిదో పాతది తనువుపై గాయాల రవి శకలాలతో ఉంది దేశం శాంతి వెన్నెల కోరుతూ పట్ట పగలే రాత్రి కోరే కళ్ళతో ఉంది హృదయం రేపు పై పేరాశతో ఈ ముఖంలో ప్రళయ సమయం చిహ్నమున్నా దాగి ఎచటో గుండెపొరలో ఉంది రాగం దేవ దానవ సమర గతిలోమానవీయం శక్తి రూపం, ఉంది చిరమై శాంతి రూపం చంద్రునిలో మచ్చల వలె చరిత్రలో గాయాలు దూరమైన కొద్దీ అవి ధవళ ధవళ రూపాలు ఎడారి తళతళ మెరిసీ లోయల మాటే లేదు. ఎప్పటివో? గతం శిఖలు! స్మృతిలో మాలా రూపం ఇరు సంధ్యల మధ్య పగలుగా కదిలే జీవితాన
ఇరు సంధ్యల మధ్య రాత్రిగా నిలిచే జీవితాన ఏదో ఒక వర్ణంతో నిజం ముఖం రూషితమై ఏ పగలూ ఏ రాత్రీ లేదు శూన్యాకృతి! అంతా శిలా హృదయ ముఖం అనల పత్రమై తేజం స్వేద జలంపై తేలే నావ రీతి కదిలేను ధారలుగా మండుటెండలో కదిలే మృదు దేహం వెనుక నుండి ఛిన్న భిన్న పీడిత మానవ రాగం విజయ గాథతో శయస్సుకై నెరపిన యోజనవలె ఈ సమాజ జీవితాన సంస్కృతీ ముఖ శిఖరాలు! చలనంలో జ్వలనంతో, హననంపై మననంతో జరిగే ప్రస్థానంలో అమూర్తమై ఉంది అహం. మనిషిలోని సమర శక్తి ఖననం దహనం కాదు చిరం అనల శిఖలు దూకు ఆవేశంలో పొంగీ వికార వదనంతోనో భీభత్స రవం తోనో శాంతి నీడ చేరుకొనీ సిద్ధం అవుతుంది మళ్ళీ హిమ సదృశం కన్నుల్లో బాష్ప లవం తప్పదు కాదేనాటికి బహిష్కృతం, సృష్టిని హింసను మనలో చేతనయే వహిస్తుంది నీటిని అగ్నిని మనలో ఈ హృదయం ప్లవిస్తుంది అణువణువులో నవనవమై జీవ శక్తి హర్షణం ప్రతి మనసులో తరాల ఎరుపు తెలుపు ఘర్షణం ఆత్మ శిఖర సీమలపై జన రక్త గాత్ర వాలకం మంటల కిరీట పంక్తి వెనుక నుండి ఆయుధం పీడన బల ఘర్షణ శక్తుల అనలం చలనంతో హిమ స్పర్శ కోరుతూంది మనవ హృదయం మండీ మంటల చిత్రాలు చూచి హ్లాదపడే కళ్ళ వెనక ఉంది బలం ధనం కన్న అహం క్రీడ నిశా శైలి నిప్పంటిన వనం లాగ ఉంది మనిషి హృదయం మంచు కురిసి శాంతి అలసి ఎదలో నిశ వాలీ ఉదయం విరిసిన మోదుగ సుమ వదనం కోరే ఇరాకొ కువాయటో! పెటో డాలర్ జ్వలనం
13. కిరణ కిరణం కిరణ కిరణం దివా సమయం సమర శక్తికి చరణమై జలద పటలం వెనుక నుండీ సింహ వదనం అరుణమై నేలపై నిశ్శబ్ద గుహలో నుండి ఆయుధ గర్జనం చెట్ల చాటునో! గోడ వెనుకో! మినీ విప్లవ స్థావరం హత్య జరిగిన చేతిలో శిశిర సంధ్యా వాలకం వ్యక్తి కన్నుల వెలుగులో మంచులో అమాయకం ద్వేష కోప సమాధిపై హింస మొలిచే వేళలో తర తరాలు విషాద ఫల రుచులు చూడక తప్పదు నిన్న జరిగిన హత్య మరచీ నేడు శాంతిని కోరు హృదయం ఉంది మనలో శాంతి చెక్కిన మానవీయం భావమయమై పొరలు పొరలై నిలిచి నిలిచీ హిమ సమూహం పంజరం వలె ఊపిరాడక సూర్య బింబం సతమతం అవుతుంది ఉదయం కన్నుల్లో జ్వలిత పవన ప్రతిఫలనంతో నరాల్లో ఉదయ లహరి సంచలనంతో నినాదాల ముఖాలతో ధ్వని శిఖ శిఖియై జనగణ చలనం గమనం! పరివర్తనకై స్వేద జలంలో తేలీ అనల శిఖలతో కదిలీ ధరా గగన రూపం కొలిచేనీ మనిషి చరిత్ర పుట పుటలో అక్షర శక్తులు నెత్తురులో మునిగీ బాష్ప జలాలపై తేలీ వ్యక్తిలోని శక్తికి లేదు, లేదు మరణం గ్రహణం మానవీయ రక్తికి ఏ సమాజమైన ఒకటే తరం తరం శిశువు ముఖం విభాత బింబిత రూపం దగ్గరలో! రావలసిన చరిత్ర మూర్తికి చిహ్నం పగలు సూర్య కిరాణాలకు గాయాలు జ్వలించేను రాత్రి చంద్ర కిరణాలో శాంతినీయ లేవు మనిషి మనిషి నడుమ నడుమ వీధి వీధినా ఆనల తరళ జన పటలం కదలేనీ సమయం ఎండిన కొమ్మలతో గాలికి కదలని స్థితి శబ్దంలో సహన స్థాయి ఏ గాలికో పోయేను మాటల్లో హృదయ స్పర్శ ఏ దిశనో ఆగేను
14. కరుణించే ఆశతో ద్వేషంతో కోపంతో సంక్షోభంతో వచ్చే చీకటి ఉందీ మన ఉన్మాదంలో ఎదలో వెలుగు విత్తు వృక్ష రూపమై ఎదిగి నిలిచి పోవాలని కోరిక సహజం సూర్య బింబ వదనానికి నలుపు రంగు పులిమీ దిష్టి బొమ్మ చేసేందుకు నీలి నీలి యత్నం దిశ దిశ నుండీ దూరం చాచిన చేతులతో మనిషి వెనకనే మనిషీ! కదలే నో బ్రషో జ్వాలాతతి చలనంతో దహన సమయ గమనంతో ధరిత్రిపై సృజించలేం! హరిత హృదయ ఉదయం ఎవ్వరి కోరిక పైనో రానే రాదీ ఉదయం రావలసిన వేళకే వచ్చేస్తుందా సమయం ఎవ్వరు గిట్టిస్తేనో గిట్టేది కాదు నిశ ఇష్టమున్నా లేకున్నా! వేళకు వచ్చేస్తుంది మారణాయుధం ధరించి ఎన్ని ఏండ్లు తిరిగేరు? శిశిర జ్వాల తలపిస్తూ ఎంత కాలం బ్రతికేరు? కర్ఫ్యూ నిశ్శబ్ధంతో బంధితమయ్యే రోజు సూర్యోదయ మైనట్లే లేదీ కోసే చలిలో భాను శక్తి కిరణం అనుభవ మైతే గాని విముక్తి జరిగే సూచన యే లేదు హృదయంలో ఉంది అగ్ని నిరంతర శక్తితో ఎంతటి ఘన లోహానై నా కరిగించే దీప్తితో వస్తువు లెన్నెన్నో జీవిత సంపూర్ణతకై ఒకటొకటీ సంస్కృతిలో భాగంగా నిలుస్తాయి నిప్పంటిన ఆలోచనతో పరుగెత్తే మనిషి ఈ దారిన ఆదారిన ఆయుధమై శరీరం అనల రాశి దాగిన నివురై ఉందీ సమయం శాంతి కోరే ఖడ్గం వలె ఉందీ వేళ మనస్సు అగ్ని కణం వలె మనిషీ అగ్ని సమం ఆలోచనతో జీవిత చలనంలో గమనంలో అనల మనో గతితో రాత్రి శిలా సంధుల్లో నుండి ఎగసి అగ్ని పూలు నవ్వి నవ్వి మండేనీ పవన కథల దారుల్లో భాష మధ్య మతం మధ్య అనుమానం నీడలతో మానవతా హృదయ శక్తి కురిత్రాడు బిగించేరు
కర్ప్యూ మరణ భయంతో బరువెక్కిన గాలిలో కదలీ కదలని శబ్దం! ఎరుపెక్కి జ్వలిస్తూంది దుఃఖంలో వేదనలో వదనం ముడుచుకొనీ అమృత హృదయమేదో! వర్షిస్తుందని చూస్తూ రగిలి రగిలి మంటలతో కదులుతూంది ఈ క్షణం వెనుక నుండి ఏ జలదమో! కరుణించే ఆశతో
15. ఆర్కెస్ట్రా హృదయం పేరూ ఊరూ ముద్రలతో కాలం గోడల మధ్యన నిల్చిన ఓ ఖైదీ చాచిన బిక్షా పాత్ర మనస్సుతో, వాలిన ఎడారి దారి కళ్ళతో ఓ మనిషీ గమనంలో వేగం హెచ్చిన మాట నిజం, పయనంలో లక్ష్యం మరవని సమయం లయతో హృదయం స్పందన కలిగే ఉందీ, ధూళీ ధూమం నుండి విముక్తమై ఇంత వెలుగు కోసమై ఈ రాత్రి కదులుతూంది ఇన్ని నీళ్ళ కోసమై ఈ పగలు వెదకుతూంది చీకటి శబ్దం ప్రేలే వర్తమాన గతిలో మానవ హృదిలో ఉందీ! మానవతా మంత్రం పెదవులపై నుండీ ఎగసి దిశ దిశ ఎద ఎద కదిలీ శబ్ద సమూహం సాంఘిక శక్తులతో ధ్వనించేను నిగళాలను ఛేదించీ స్వేచ్ఛకు ప్రాణం పోసీ యుగాల దారులు మార్చే నిరసన ప్రతిఘటనంతో జన శక్తులు నిండిన పాత్రల మానవ గాథలు శ్రేణులు శ్రేణులుగా ఒకటొకటీ ధరిత్రి సర్వం వెనువెనుకే చీకటి వెలుగులతోజీవన వ్యూహం నిప్పుకణం! మంచు లవం! బాష్ప జలం! అంచులలో వెలిగే చేతనతో చుంబితమై దీపంతో దీపం వలె కదిలే ఆవేశంతో పొంగే ఆలోచనతో ఈ సమయం ఈ మృత్తిక పై పచ్చని వనిలో ఆశారుణ సంగీతం రానీ ప్రజాస్వామ్య నవసమాజ చలనంతో పవనంలో గతులతో, కిరణంలో రుచులతో ప్రజలో పలుకుతూంది సూర్యుని ఆర్కెస్ట్రా హృదయం.వర్తమానం స్క్రీన్ పై (1991) అంకితం
జీవిత పథ సహచరి శ్రీమతి ఇందిరకువర్తమానం స్క్రీన్ పై సూచిక పుట 1. వర్తమానం అంచులపై 2. వర్తమానం వెనుక నుండి 3. స్వేచ్ఛలో హద్దులు 4. మార్చ ఆన్ 5. సమయం వస్తుంది 6. అగ్ని దీప్తి - కాంతిరక్తీ 7. ఈ రోజున ఆదారినే 8. ఈ రోజున దారి అదే 9. ముసుగై కళయై 10. ఒక మాస్్క వదలి 11.
గది లోపల బయట 12. స్మృతులతో 13. అభిజ్ఞానంవలె 14. ముక్కలైన అంచులపై 15. టా న్స్పరెంట్ కర్టెక్ 16. ప్రతీక్షాముఖంతో 17. బ్రతుకుతుంది శాంతి .... 18. శ్రామికగీతం 19. నగరం దర్పణంలో 20. నిర్వచనాతీతం 21. మేఘమై జనగీతమై 22.
ఉదయించే శక్తినై
8. వర్తమానం స్క్రీన్పై
1. వర్తమానం అంచులపై ముందు నభం ఇరు వైపుల అవనిపై వర్తమాన పద చలనం చేతి కందీ అందని మహదాశలో వ్యక్తి మనో వర్ణ రూపం కళ్ళలో విజయ లక్ష్యంతో గుండెలో తరుణ రాగంతో నినాదం నిరసనతో, సంఘర్షణ సమన్వయంతో సామాజిక అస్తిత్వం హిమ ముఖాలకు స్వస్తి చెబుతూ కోష్ణ పవనం కదలుతూంది అణగి మణగిన జన ప్రపంచం ముక్త కంఠం పలుకుతూంది బొగ్గులో దాగిన అగ్ని బీజం వలె వ్యక్తిలో ప్రగతి శీలం నవ సమాజం ఊహతో జనశక్తి రూపం పొందుతూంది సంఘర్షణ లేంది జీవితం లేదు సంచలనం లేంది పరివర్తన లేదు సామూహిక శక్తిలో వ్యక్తి పాత్ర ఉంది యుద్ధ నీతి రీతులతో సిద్ధమై స్క్వేర్ తరువాత స్క్వేర్ వస్తుంది సందేహ దిశల్ని చూపుతుంది వర్తమానం దారి పొడవునా భవిష్యత్తు వేచి ఉంటుంది
2. వర్తమానం వెనుక నుండి ఇండ్లపై చెట్లపై నుండి కోట కన్పిస్తుంది త్యక్తమైందీ జీర్ణమైందీ పైన సాగే రణ విమానం కోట కీర్తిని కొలుస్తూంది గతానికి రెక్కలిస్తూంది శిల వలె నిల్చిన గతం చుట్టూ పవన తరంగం వలె తిరిగే వారున్నారు నమూనా లేని సామాజిక గతిలో నలిగిపోయిన వెన్ని స్థితులో రంగ స్థలంపై నటించే పాత్రలు కొన్ని మాత్రమే అపుడపుడు ప్రేక్షకులూ పాల్గొని పాత్రలకు కొత్త మలుపు నిచ్చేరు. నిన్న ఊగే పంజరం నుండి విడుదలైన చరణ యుగం నేడు మ్రోగే శృంఖలాల్లో శబ్దిస్తూంది తెలిసిన ప్రశ్నకో తెలీని ప్రశ్నకో గురి అయి ఆందోళనతో ముఖం ధూళి గణంలో చిక్కీ హృదయం సంధ్యా సరస్సులో దూకొచ్చు యుద్ధంలోనే కాదు శాంతిలోను వివేకం అవసరం జీవితమే వివేక ప్రమేయం కోరని ఆటోమేటిక్ యంత్రం కాదు
భవిష్యత్తు దిశలో పరివర్తనకై ప్రేరణతో ఘర్షణతో క్షణాలు కదలి పోతున్నాయి రంగు రంగుల బెలూన్ల వలె అందని కాంతులతో కలలు నిజాల్ని క్రమ్మేస్తున్నాయి ఈ స్వప్నం నిజమయ్యేనా ? ఈ కాంతులు మన కందేనా ? వర్తమానం చివరి బిందువునీ ముందు కాలం మొదటి బిందువునీ గమనంలో అనుభవం మనిషినీ మనిషినీ కలుపుతుంది నిరంతరం
3. స్వేచ్ఛలో హద్దులు పక్షి గగనం కొలవ జూస్తుంది మనిషి భూమినీ ఆకాశాన్నీ కొలవ జూచేను హృదిలో ఎడారి ఉంది ఒయాసిస్ ఉంది మైదాన ముంది ప్రవాహ ముంది. కళ్ళలో నక్షత్ర కాంతితో ప్రకాశించే సూర్య కిరణ ముంది సాగరం లోతు భయం లేదు పర్వతం ఎత్తు భీతిలేదు సాగర తీరాన మనిషి పద చిహ్నాల్ని నిలుపుతూ పోయేను పర్వత దేశాన మనిషి వన బీజాలు నాటుతూ పోయేను కలహ ధ్వని రాగంతో హింసన చణ చరణాలతో జన బృందం మధ్య నుండి నీడ లెగిసి కత్తులై దూసేను నేను ప్రాణినీ మనిషినీ వ్యక్తిని సమాజావసర విజయ శక్తిని అవనిపై కరుణతో కదిలే సమతా మానవతా యుగ మూర్తిని ప్రయాణంలో అలసినపుడు దారిలో నీడ నిస్తూ ఆశ మాత్రం చెట్టు వలె ఎదలో నిలిచి ఉంటుంది మేఘాల్ని మోస్తూ గాలి దిశల్ని కలిపే యత్నం చేస్తుంది చెట్లు గిరులు మేడలు తమ స్థాయిలో నిరోధిస్తూనే ఉంటాయి. మనిషిలో జైలు శిథిలం కాదు నిశ్చలంగా ఉంటుంది ఎతె న గోడల్ని తాకుతూ గాలి స్వేచ్ఛకై తారాడుతుంది శిలల కలల్ని శిల్ప కళలో మెరపిస్తూ ఒకరు జనం బాధల్ని విశ్వ హృదిలో నినదిస్తూ ఒకరు
4. మార్్చ నడిచే దిశా వీధి విప్లవం ఖడ్గమై మెరపుల్ని ప్రదర్శిస్తూంది ఈయుగం శిరస్సుపై ప్రజాస్వామ్యం వజ్రమై ఆకర్షిస్తూంది గాయపడిన క్షణాలపై జాలి చాలదు
యుద్ధ విరమణ రేఖపై శాంతి చాలదు అగ్ని శిఖలపై కదలే శ్రమ జీవన వాస్తవం ఆర్తి వదలి ఈ సమయం పొందాలి జనస్వామ్యం ఇపుడు కన్పించేది రవి కాదు, జన కోపంలో అంగారం ఇపుడు విన్పించేది అగ్ని కాదు ! ప్రజల మౌనబాధా హృదయం అంగారం చైతన్యం ! నీ నుండి నాలోకి మన నుండి మనిషిలోకి మార్్చ
5. సమయం వస్తుంది నాలో అణువణువులో పృథ్వీ రూపం కణ కణంలో గాథాకాశం ఎదురుగా బహు శక్తులు ఘర్షించే సామాజిక జీవన దృశ్యం ఎవరి కోసమో ఎదురు చూచి ప్రతి రోజూ ఎద ఎడారి అవుతుంది ఇంటి ముందు వీధి దీపం సుదూర నక్షత్ర పథాన్ని చూపిస్తుంది. ఉదయం లేవగానే సూర్య బింబం సముజ్వల స్వప్న విభాతం కళ్ళలో దింపుకొనేమా ? చేతులు చాచి పొందేమా ? ఇది అందని సత్యం దీని ప్రతిఫలనం చంద్రబింబం, నా హృదయానికి ప్రతిరూపం శక్తి బిందువు వివృత రూపం బాధకూ వేదనకూ సాక్షి ఆలోచనలో హంసయై తేలుతుంది ఊగే వర్తమాన లహరి పై ఒయారంగా నడచి వస్తుంది రాత్రి జ్ఞాపకాల్ని వెలిగిస్తూ జారే కన్నీటిని తుడిచేస్తూ శశి కిరణం వరసగా ఆలోచనల్ని వెలిగిస్తూ కదలుతుంది దీప స్తంభాలకు వ్రేలాడే ముఖాలు సూర్య తేజాన్ని ప్రేమించలేవు జెండా కర్రపై వెలసిన ముఖాలు నేలకు దిగేనా ? వెలిగేనా ఒక సమయం వస్తుంది కళ్ళు మూసినట్లుతోచే చీకటితో ఒక సమయం వస్తుంది కళ్లు తెరచేట్లు చేసే కాంతితో
6. అగ్ని దీప్తీ - కాంతిరక్తీ సముద్ర మంత భయంతో నభస్సు బావురమని, గుండెలో దూకుతూంది జీవితం బింబించే నిలువెత్తు ఆదర్శం, వీధి నుండి విసరిన రాళ్ళకు ముక్కలైంది గడప దాటితే గాయా లలంకరిస్తాయి, మనిషిలో సింహమైన హింసకు ముద్రలై
నిశ మనిషిలో పేరుకొని తుహిన శిల అవుతుంది, ఒక సమయం ఉషస్సు మనిషిలో కదలుతూ వెలుగు నది అవుతుంది, మరో సమయం గడ్డ కట్టిన నినాదం సరించే కిరణం రావాలి స్తంభించిన పద యుగం నడిచే తరంగం అవాలి. జ్వాలా దర్పణంలో మండే సంస్కృతీ దృశ్యాలు ఒకదాని తరువాత మరోటి పొగ జ్ఞాపకాల్ని కప్పేస్తుంది, రవ్వల మధ్య మానవతా మందారం కమలుతూంది అగ్ని శిఖలతో పాటు అమృత కళలతోనూ వర్తమానం స్క్రీన్ పై జన గణ దృశ్యం ? పొడిచే చుక్కల ప్రశ్నలతో గగనం సంధ్యా సందేహమయమైనా ఉదార హృదయంతో ఉదయం పృథ్వికి స్వాగతమిస్తుంది నాలో అణువణువు సమాజ శక్తి నికేతనం నాలో కణ కణమూ వ్యక్తి పాత్రకు సంకేతం అగ్ని దీప్తి ఎంత అవసరమో కాంతి రక్తీ అంతే అవసరం !
7. ఈ రోజున ఆదారినే తల వంచి అమాయక నిజం వలె ఉన్న గుడిసె అగ్ని కాహుతియై స్మృతిలో మిగిలింది కళ్ళలో హిమాం దిశలతో మనుషులు కదలి పోయేరు దీన జన వినీల గాధ అంతరాత్మను పొరల్లో నుండి పైకిలేపుతూంది రాత్రి వినిపించే నక్షత్రం పాటకై ఉదయం వ్యర్థ ప్రయత్నం చేస్తూంది విసరిన రాళ్ళకో ఆయుధ చర్యకో పగిలిన టవర్ క్లాక్ పనిచేయడంలేదు ఇప్పుడు కళ్ళలో బాష్ప బిందు వెక్కడిది ? మండే ఉన్మత్త జ్వాల తప్ప ! మూటలో వస్తువు లొకటొకటీ తీసి పుట్పాత్పై అమర్చి రోజూ దీప స్తంభాని కానుకొని కన్పించే వృద్ధు ! ఈ రోజు గైర్ హాజర్. హింసతో ప్రతి హింసతో మానవ చరిత్రలో పొందిందాని కంటే సమాజంతో పాటు వ్యక్తీ కోల్పోయిందే ఎక్కువ మస్తకం నుండి పాదాల వరకూ మట్టియై సస్య గతి పొందే మనిషిలో మూర్తి లోహమయమయినా హృది శిలా సదృశం కాకూడదు ఎద కాసెట్లో రికార్్డ అయిన జీవన శాంతి సంగీతం హిమ తుషారం చిమ్మొచ్చు ! అనల సేచనం చేయొచ్చు ! గ్రీష్మ తాప దృశ్యాల్ని పొడిగిస్తూ ; జలద బృందాల్ని తొలగిస్తూ
హింసానల చరణ పంక్తితో సాగే ఏ సిద్ధాంతం సహనార్హం కాదు సహనం బద్దలై ఉద్వేగ జల ధార లెటుపోతాయి ఉన్మాత్త గతిలో పొలాలపై పొర్లి జన పదాలు ముంచి భీభత్సం చేసే అశాంతి నిలయంలోకీ హృది కాసెట్లో పాత పాట మలగిపోయి కొత్త పాట వినిపిస్తోంది అనల ప్రవాహంలో ఇంకా బ్రతికి ఉన్న జనం ఆర్తిని ధ్వనిస్తూంది. రాగ లహరి నణచేస్తూ సైరన్ మ్రోత దూసుకొనీ వినిపిస్తూంది ఇపుడు కవిత్వం ఏ కోట ద్వారానికో వ్రేలాడే శిల్ప తోరణం కాదు.
8. ఈ రోజున దారి అదే ఈ రోజు అదే దారిన ! నిప్పంటిన చెట్టూ వనం మాదిరి ముఖ ముఖంలో రూపం వేరు ! క్షణక్షణంలో దృశ్యం వేరు పద పదం ధూమావృత శిఖలతో చరణాలు కదలుతున్నాయి అయితే ఇది అడవి కాదు! నగరం అడవిని తలపిస్తూంది. ఏదో ఘర్షణతో ప్రతి రోజు రక్త చిత్రాలతో నిష్క్రమిస్తూంది అశాంతిలో కన్నీళ్ళతో అగ్నులతో పగలు రాత్రిలోకి దాటుతూంది అడవైనా నగరమైనా ఎడారైనా పల్లె అయినా ఆయుధాల విషాద ధ్వని ఒకటే ! మూసిన తలుపుల్ని ముక్కలు చేసేను దాగిన బ్రతుకుల్ని బయటిక లాగేను ఎక్కడుంది ? సంపూర్ణ సత్యం ? ఎక్కడి కక్కడే ఖండ ఖండంగా కన్పిస్తుంది స్వేచ్ఛకూసమతకూ అంకితమైన నవ సమాజం మానవీయం కోరుతూంది పదం కదలి చేయి కలిసే నవ తరం పైకి గగన భయం శీర్ణ పరచే యువ గణం పైకి తుపాను వస్తుంది భీభత్సంగా, అశాంతి నురిమి పోతూంది ఇది సామాజికమే అయితె ! ఎప్పటికీ ప్రమాదమే ! తన ముఖాన్ని బింబించే అద్దాన్ని పగుల గొట్టే చేతుల్లో కన్నీరు మనస్సు లోని గుప్త రూపాన్ని జ్ఞాపకం చేస్తుంది, హఠాత్తుగా మానవతా పూర్ణమైన కంఠ ధ్వనిలో పాయలుగా విభిన్న రాగాలు ఏ వ్యక్తి సమీపానో ఏ ఊరు సీమలోనో ఏ జాతి నీడనో నిలిచి పోవు ! చీకటిలో అడుగేసీ పాతదనం కదలిపోతూంది సూర్యుని జాడలతో కొత్తదనం వచ్చేస్తూంది తన చుట్టూ మట్టితో మట్టిలోని మొక్కతో బ్రతికే వ్యక్తితో మనిషి గుండె పలుకుతూంది ధరా విశాల భావనతో మానవీయ రాగం ఎంతటి స్వర్గ ఖండం కానీ ఎంతటి స్వర్ణ లోకం కానీ మనిషి ఊహ నుండి వచ్చేదే ఏదో శ్రమ నుండి పొందేదే,
ఒక ఉదయం బ్రతుకులో చేతిలో రాలిన ఫలం కావచ్చు ఒక సమయం బ్రతుకులో గుండెపై గురిపెట్టిన గన్ కావచ్చు
9. ముసుగై కళయై ఉదయం మేల్కోగానే వెలుక్కి తొలగే చీకటి అంతలో దిశ దిశ నుండి ప్రవేశిస్తుంది లోపల ముసుగై నిలుస్తుంది. చీకటి తొలగీ మంచు మెరుస్తుంది, తెరలుగా కదలుతుంది లోలో ప్రవేశిస్తుంది, లోపల పొరలుగా వ్రేలాడుతుంది. చీకటి తొలగీ ఇంటి ముందు మల్లె మందారం గులాబి పారిజాతం నాలోకి ప్రవేశిస్తాయి ; నాలో అర్ధ భావ కళలై శోభిస్తాయి శబ్దం ప్రవేశిస్తుంది నాలో తొడుగై పోతుంది. ఉన్నట్లే సంగీతమౌతుంది ఘర్షణలో ధ్వనించే ఆర్తి నా చుట్టూ తిరుగుతుంది, నినాదమౌతుంది కళ్ళు తెరచి చూచేంతసేపూ పాత్ర ఏదో నటనలోనే ఉంటుంది ఏ పొరలోనో ఏ దుస్తుల్లోనో ప్రవేశించింది ప్రవేశించి నట్లే ఉంటుంది, నాలో స్వార్థం వెలుగై సరిస్తూ అగ్నియై జ్వాలిస్తూ చీకటై వెన్నెలై బ్రతుక్కి పాత్ర రూప మిస్తుంది పొరయై తెరయై ముసుగై తొడుగై, ఏ తొడుగూ లేని ముఖం లేదు, ఏ ముసుగూలేని మనస్సు లేదు వినీలాకాశానికి ఉంది పొర; గభీర సముద్రానికీ ఉంది పొర.
10. ఒక మాస్్క వదలి మనిషి ముఖాన ముసుగువలె వెలుగు, నవ్వుల రంగులూ ఒక దిశనుండి ముఖాన ముసుగు వలె పర్వతం, ఏ మార్పులేకుండా ఉంది ఊహ కందని ధరిత్రి చరిత్రలో ఎప్పటిదో పూర్వ రూపం ధరిత్రి ముఖం పై చెట్లు పొదలూ అపుడపుడూ నీలి మేఘాల నీడలూ, శిలలూ శాసనాలతో శిల్పాలతో కోటలూ జీర్ణమైన గోడలూ అంతా అమాయక వాలకంతో మూసిన చరిత్ర గ్రంధం వలె ఉంది. ఉదయం మంచు కదలుతుంది గిరి తటాన భయాన్ని విదలిస్తూ వెలుగుతో హ్లాదమైన రూపం ! ముసుగుపై ఇదో మరో ముసుగు ఆవేశాన్ని ఆనందాన్ని హత్తుకొనీ ప్రేమను కరుణను నింపుకొనీ కష్టాలు బాధలు దాగని హృదయంతో పైనుండి జలపాతం దూకుతుంది
మస్తిష్క శిఖరం నుండి పాద దేశం దాక ఆర్ధమైన అనుబంధంతో కణకణంతో స్పందనతో మానవతా సుందరమై పాయలుగా సరిస్తుంది వర్తమాన తలంపై తుషార పంక్తి విసరుతూ జలరాగం చిందుతూ ఆశాంతి హృదయంతో జలపాతం నేలపై దూకుతుంది మానవీయమై కొండతో విసిగి పోయి అపుడపుడు మనస్సు లాగుతుంది జలపాతంతో కదలే కోర్కెతో ! ఒక్క మాస్్క పోతే మరో మాస్్క
11. గది లోపల బయట మనస్సు గదిని తలపిస్తోంది, గదిలో నీడలతో శరీరాలు కదలుతున్నాయి ముఖాన రక రకాల ముసుగులతో పాత్రలు వస్తూ పోతూంటాయి గోడకు వేలాడే క్యాలెండర్లో ఈ రోజు తేదీ వెలిగే బల్బు వలె ఉంది తేదీల అంకెలు వరసగా అనుభవాన్ని నింపే చరిత్ర కాప్సెల్్స వలె ఉన్నాయి వచ్చిపోయే సంధ్యా ముఖాలతో గది భవిష్యత్తును ఆహ్వానిస్తుంది గోడపై గాంధి బుద్ధుడు చిత్రాలు దర్పణంలో ఆశా రూపాల వలె కన్పిస్తున్నాయి ఎతె న మేడలు అదృశ్యహస్తాల నీడలతో గదిని వినీల పరుస్తున్నాయి నేను పోగొట్టుకుంది మనస్సు కాదు, దాని లోతులో రహస్య గాధ మనస్సు చూపే ఆకాశం అందదు, పొందే ఆరణ్య మార్గం తెలీదు. నీతికీ నిజానికీ దూరమై మారే ముసుగులు సమాజంలో జీవిత స్వరూపానికి సరికొత్త వివరణలూ వ్యాఖ్యానాలూ వ్యక్తి రూపం గది లోపల బయటా ఒక్కొక్క విధంగా కన్పిస్తుంది గదిలో ఆకాశం దిగుతుంది ! గది బయట అరణ్యం అవతరిస్తుంది
12. స్మృతులతో కొత్తగా లేచిన సౌధాల్నీ ఎత్తుగా నిల్చిన దీపస్తంభాల్నీ దాటుతూపోయేం ఇరువురం ; నదిలో వెచ్చని అలల వలె, ఆగని పరిమళ లహరుల వలె రాత్రి వీధి అంతా నిర్జనంగా ఉంది, ఎక్కడో ఒక వాహనమో ! మనిషో ! ఈ సమయం పల్చని వెలుగుతో ముళ్ళు తీసేసిన మొగలి పట్ట వలె ఉంది దారిలో గోయి పక్క నుండి, దారి మూసిన తోటను చుట్టి దారి లేని కాంపౌండు చుట్టూ తిరిగి శిల్పం ఎరగని శిలలు పక్కగా, దీపం ఎరగని గుడిసెలు దాటి గమ్యం చేరాం అనలాన్ని ఆలోచనకు రానీకుండా గుండెను హత్తే చల్లని గాలిలో
రైల్వే స్టేషన్కు వచ్చేశాం ! ఇద్దరమూ, ప్లాట్ ఫార్్మ చేరుకున్నాం మా ఇరువురి మధ్య ఏ ముసుగు లేదు ! ఈ సమయంపై రాత్రి ముసుగు స్టేషన్ పై మంచు ముసుగు ! మనుషుల ముఖాలపై వెలుగు ముసుగు ! దూరాన రెడ్ లైట్ నాలో విచ్చిన ఎర్ర గులాబిని తలపిస్తుంది ఇప్పట్లో మా రైలు వచ్చేట్టు లేని సూచన మైక్లో వినిపించింది నా కెదురుగా ఉన్న ముఖం నాలో నిశ్శబ్ద సౌందర్యాన్ని కదలిస్తూంది ఆ వెలిగే దీపాల్ని చిన్న పిల్లల్లా లెక్కపెడుతూ ఎప్పటికీ పూర్తికాని లెక్కతో నేనూ బెంచ్పై కూర్చున్నాం నాల్కపై ఐస్క్రీం చల్లదనం కన్నా చిరు వేడినే కలిగిస్తోంది మా కవసరంలేని రైలు వచ్చేసింది ! మా కవసరముంది మాత్రం ఆలస్యం ! స్నేహానికీ ప్రేమకూ వశమైన కాలం ! క్షణాలపై పరుగెత్తుతూంటుంది. ఇంతలో రెక్క వాలింది, దూరాన పచ్చలైట్ వెలిగింది రైలు రానే వచ్చింది, నేనొకణే మిగిలా ! లైలు కదిలింది ఇప్పుడు ఫ్లాట్ఫర్మపై లైట్లు కన్నీటి బిందువుల వలె ఉన్నాయి మనస్సు కాన్వాస్ పై అప్పుడే స్మృతి రేఖలు మొదలైనాయి ఆలోచనా జలపాతంతో నేనొకణ్ణి ఇంటి ముఖం పట్టాను ఇపుడు స్టేషన్కు వచ్చేప్పుడు కన్పించిన దృశ్యమేదీ కన్పించ లేదువర్తమానం స్క్రీన్ పై -
వర్తమానం
స్క్రీన్
పై
ఈ సమయం మనోలత పూచిన స్మృతి పుష్పం వాడదు, రాలదు మా ఇష్టంలో కదలిన కాలం ఇప్పుడు తన ఇష్టంలో నిలిపేసింది ఆమె మరచిం దేమో నని నేను, నేను మరచానేమో నని ఆమె ఒకరికి తెలీకెండా మరొకరం, దూరాన్ని స్మృతులతో కొలిచేం
13. అభిజా నం వలె ఆకాశం వైపు చూచే మీనార్ శిఖరం వలె ఆదర్శం బిందువూ సముద్రం వలె స్వరమూ సంగీతం వలె వ్యక్తీ వమాజం పరస్పర స్నేహంతో కలుస్తాయి, అన్యోన్యాకర్షణలో నిలుస్తాయి వాస్తవ జీవితంలో లంబరేఖల్ని ఆదర్శ బిందువు కలుపుతుంది ఇంటి వెలుపల పచ్చని చెట్టు ఉంది ; లోపల వెచ్చని జీవిత ముంది మనిషిలో పెరిగే చల్లని చెట్టు ఉంది దాని వేళ్ళలో కన్పించని అగ్ని ఉంది చెట్టును నరికే వారున్నారు ; కోష్ణ స్పృహను బుగ్గి చేసే వారూ ఉన్నారు కాలాన్ని వెంట ఈడ్చుకొనీ జీవితం ఇండ్లు దాటి మీనార్లు దాటి కదలుతూంది బిందువు బిందువు మధ్య విరుద్ధ శక్తులతో చరిత్ర నిర్మితమౌతూంది
రేఖల రేఖలతో కొత్త చిత్రరూపమేర్పడుతుంది ఆలోచన ఉన్నా సంస్కారమున్నా అశాంతి ఆందోళన వచ్చే దారులు వేరు అజ్ఞానం ఎక్కువై వేళ్ళను నరకేయొచ్చు సంస్కారం లోపించి కొమ్మల్ని కొట్టేయొచ్చు, ఆనంద గాఢగానో విషాద గాథగానో మీనార్ నిలిచి పోవచ్చు ఉదయం పుష్పమై సంతోష బింబమై ముఖంపై వాలుతుంది ప్రేమతో ఎదలో కదలుతుంది సువర్ణ నాణెమై ఆపైచేతిలో కరెన్సీ రూపమై ఈ సమయం మేల్కొన్న మనస్సుకు గమ్యం చేరే శ్రేణిక వలె ఉంది కోపంతో రంజితమై హింసతో రక్తిలమై మాసికలతో పేలికలతో అనగ్న రూపాన్ని ఎవరు చూచినా చూడకపోనీ రోజు కొత్తగానే వస్తుంది ఉదయం లేవడమాలస్యమైతే తీక్ష కిరణ మెదురౌతుంది పనీ పాట్లతో భ్రాంతిలేని స్వేచ్ఛ లేని శ్రమ సమాజం కన్పిస్తుంది చీలిపోయే బాటల్లో నుండి హైవే దొరికితే అదృష్టం. దుష్యంతునికి అభిజ్ఞానం వలె ఉదయం మనోనేత్రాన్ని తెరపిస్తుంది ఇది నిరాశా ముక్త సమయం విషాదం నుండి ఆనందంలోకి తిరిగేను ప్రయాణ విపణిలో ఇది రేపటి వరకూ చెల్లే చేతిలో విలువైన కరెన్సీ
14. ముక్కలైన అంచులపై రైలు వర్తమానం అంచులపై స్టేషన్ దాటింది వేగం అందుకుంది పుట్ బోర్డపై నిల్చి వ్రేలాడే వ్యక్తి దగ్గర లగేజ్ ఏమంత ఉంటుంది ? తలుపు వద్దనే జనం ఉక్కిరి బిక్కిరౌతున్నారు స్థలమెక్కడుంది ? ఈ సమయం ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణం చేయాలిసిందే ఇష్టంతో భయంతో ప్రయాణం జలపాతాన్ని కావలించుకున్నట్లుంది దూర దూర నుండి భవిష్యత్తును తనలోకి తీసుకునే వర్తమాన క్షణాలపై రైలు పరుగెత్తుతూంది ! సడన్ బ్రేక్ పడింది, రైలు ఆగింది. పట్టాలపై చిమ్మిన రక్త చిత్రం, గుర్తించలేని భీభత్స దృశ్యం పరుగెత్తే ప్రపంచం ఆగింది ! మృత్యువు తన దారిన పోనేపోయింది కాసేపటికి సైరన్ మ్రోగింది, దిగిన జనం, ఎక్కసాగారు, టె యిన్ కదిలింది, తెరచుకొన్న అందరి ఎద తలుపులు మూసుకున్నాయి రైలు కదలే ధ్వనిలోను శిలపై అలల వలె నిశ్శబ్దం కదలుతూంది ఆక్సిడెంటో! ఆత్మ హత్యో ! సమాచార మేదైనా పర్యవసాన మొక్కటే వివరణ యేదైనా నిర్వచన మొక్కటే, నిర్ణయ మేదైనా మరణం సునిశ్చితమే !
వ్యక్తి పై మృత్యు సమయం పట్ల ఉండే జాలి జీవితం పట్ల ఉండదు. మరునాటికే ఏ గుర్తు ఉండదు ; ఒక్క మానవతా చిహ్నం తప్ప ! ఈ విషాద స్థితి, తెలీని రహస్యంగా ఉంటేనే శాంతి కవచం భద్రంగా ఉంటుంది ముక్కలన్ని పేర్చి మనిషిని చేసి పోస్్ట మార్టమ్ జరిగింది మనిషే ! ప్రాణి ! ఏమైనా సామాజిక శక్తి ఒకటి తరిగింది మనిషిలో చిట్ట చివర అల్పశక్తి ఒకటి స్కోరు చేసింది
15. టా న్స్పరెంట్ కర్టన్ తెరచిన కిటికీ దగ్గర కుర్చీలో అతడు పలకని వైయొలిన్ వలె ఉన్నాడు. ఆ వ్యక్తి రెండు కళ్ళు న్యూస్ పేపర్ అక్షరాల్లో మునిగి తేలుతున్నాయి పిల్లల బూట్ల చప్పుడు కన్న వేగంగా స్కూల్ బస్ హారన్ ధ్వని వినిపిస్తూంది బరువుకు వంగి గాలికెగసిన తీగె వలె హఠాత్తుగా తలెత్తి చూచాడు. పొడుగ్గా నిశ్శబ్ద దళం వలె నున్న హాల్లో ఆమె ఒక ప్రక్క నిలిచి హిమ కళిక వలె ఆకర్షించేను చేతిలో పేపర్ రెపరెపల మధ్య పాట వినిపిస్తోంది ? రేడియోలోనా ? గాజు గ్లాసులో కరిగే మంచు ముక్కల్లా గళం నుండి పాట జాలు వారుతూంది కూర్చిలో వైయొలిన్ మాదిరి కూర్చున్న వ్యక్తి మౌనం మంద్రంలో శబ్దించింది పాట ఆగింది ! ఆమె గదిలో నుండి కిరణం వలె హాల్ లోకి వచ్చింది అతడు తీగె తెగిన శబ్దం వలె ఏదో గొణిగాడు, ఆమె హాల్లో నుండి గదిలోకి వెళ్ళింది. ఆ పాటే తిరిగి అందుకుంది అక్కడి నుండి బిగిసిన మౌనంతో బ్రెడై ఫ్ కదిలింది. చెదరిన స్వప్నం నుండి గది ఒక్క మారు మెలకువ లోకి వచ్చినట్లుంది. రాత్రి అంచుల్లో చీకటి శిలల మధ్య ప్రయాణం చేసి అలసినట్లున్న ఆమె కళ్ళలో నుండి వెలుగు సూదులుగా జారింది అంతలో గగనం వలె పరచుకొన్న ఆసమయంలో రెక్కలు విప్పి ఎగరనున్న హంసవలె హృదయం స్పందించింది ఆమె పెదవులపై స్వేచ్చా పక్షాలతో శబ్దం ఎగిసింది “నా పాట ఎట్లా ఉంది ?” “బాగా లేదూ” అంటూ ఆత్మీయ రాగం ఒలికింది. హాల్లో కిటికీ సమీపంలో సోపాలో కూర్చుంది, అదే పాట వినిసిస్తోంది. గేట్ వద్ద కుక్క అరుస్తూంది ! ఎవరో కొత్త వ్యక్తి వచ్చిన అలికిడి ! వీధిలో అదే ! వాహనాల ధ్వని ! పొగతో గుఫ్న పెటో లు వాసనతో
సమయం ధూళి శాలువా కప్పుకొంది సర్వం మరపిస్తూ మెల్లగా కదలుతూంది జీవిత వాస్తవంలో ఆపాట ఆమె స్మృతిలో మొగలి రేకై నిల్చింది ఇష్టమైంది రేడియోలొ వినాలని ఉంది ! ఆ కోరిక ఎట్లా సాధ్యం ? వీధి నుండి ఇష్టం లేని శబ్దంతో వాహనాల గంధం మళ్ళీ మళ్ళీ వస్తూంది ! అతని చేతిలో న్యూస్ పేపర్ మూసి ఉంది చూపులు కిటికీ నుండి బయటికి దూకుతున్నాయి భగ్న శాంతిలోనూ ఆ పాట నందుకునే హృదయ గళంలేకపోలేదు దారిలో పిల్లల అడుగుల లయ వినిపిస్తూంది ఇంకా వినాలనిపిస్తూంది ఆదిత్య జీవితంలో మిహికానుభవం నాల్కపై ఐస్ క్రీం వలె ఉంది వ్రేలికి బాగా వదులైన ఉంగరంలా సమయం జారి పోతూంది ఆదిత్య కుర్చీలో అట్లాగే ! మ్రోగని వయొలిన్ వలె ఉన్నాడు మిహిక సోపా నుండి లేచింది పలికే తీగె వలె కదిలింది ఇరువురి మధ్య మౌనం గాలికి కదలే టా న్స్పరెంట్ కర్టెన్ వలె ఉంది కర్టెన్ పై వెలుతురు చిహ్నాలు ఎవరికి పట్టింది వయొలిన్ తెలిసిన మనిషికీ ! తీగెలు మీటే హృదయానికీ ! ఎవరిని కదిలిస్తాయి ? మధుస్పర్శ ఉన్న హృదయాన్నీ
16. ప్రతీక్షా ముఖంతో ప్యాక్టరీ గొట్టం నుండి పాయలుగా విడిపోయే ధూమ రేఖల మధ్య నుండి పక్షు లెగిరి వచ్చి చెట్లపై వాలుతున్నాయి, గూళ్ళలో చేరుతున్నాయి ఎగిరే రెక్కల్లో శక్తి పుంజుకొనీ స్వేచ్ఛా సమూహాలుగా దూసుపోతున్నాయి కళ్ళలో అరుణ బింబాలతో గుండెలో విజయ దర్శన కాంక్షతో గొంతులో నిశిత నిరసన శబ్దంతో శ్రేణులుగా పక్షు లెగిరిపోతున్నాయి వీటి కలకలంలో మంచును దూరం చేసే అగ్ని ఉంది వీటి ఉడ్డీనంలో చీకటిని చీల్చే కాంతి రేఖ ఉంది. గేటు ముందు నిల్చిన బిక్షువు రెక్కలు దాచుకొని బ్రతికేను రోడ్పై నినదించే జన పంక్తి ప్రక్కనే సాయుధ భటులు నడిచేరు. అంత ఎత్తులో ఎగిరే పక్షిని బులెట్ వచ్చి దూసింది క్రిందికి ఒరిగే రెక్కలు సంధ్యా దిశల వలె మృత్యు నృత్యం చేసాయి మాసిన వెలుగులో ఈ దారిన బీభత్స గణం ముఖాలపై రవి హృదయ రాగం ప్రతిఫలించేందుకు వెనకాడుతోంది పక్షి గొంతునుండి శబ్దం ఆగింది, రెక్కల్లో స్వేచ్ఛ పడిపోయింది
నింగిలో చెట్టుపై పక్షి జనస్వేచ్ఛకు సంకేతమైనిల్చింది వెలుతురు మెట్టు మెట్టుకూ మధ్య చీకటి మృత్యు సమమౌతూంది పక్షికి మనిషికీ మధ్య స్వేచ్ఛపై అనుభవంలో అంతరం ఉన్నట్లు లేదు నిన్న కురిసిన అగ్నితో శ్మశానమైన హృదిలో ముందు శాంతి సేచన జరగాలి అపై హింసకూ ఆయుధానికీ సెలవుతో గుండెలో స్వేచ్ఛ సుమించాలి.
17. బ్రతుకుతుంది శాంతి వర్తమానం స్క్రీన్పై దృశ్య బింబాలన్నీ నీలో నాలో ఉన్నవే యువ బృందం రగిలిన అరణ్యం సెర్్చ లైట్ చూపులతో మార్్చ ఆన్ గతితో వినీలార్తి సమాజంలో సౌభాగ్యంకై భవిష్యత్తు చరిత్రకు గీసే రేఖలతో ఎదలో కోపం కసితో ప్రతి చర్యకు ఆరాటం ఆస్పాలనం చేసేను కళ్ల చివర జ్వాలా శిఖలతో పెదవులపై జ్వాలా శబ్దంతో దీర్ఘ నిద్ర నుండి నిశిదిశ నుండి అగ్ని ఖడ్గమై మెరసేరు అగ్ని సేచనతో స్వప్నించే విలయ మేఘమై కదిలేరు ఇపుడు ఓర్పు లేదని తెలుసు ! ఎవరి తీర్పుతో పని లేదని తెలుసు సమాజ శ్రేణుల్ని బద్దలు చేసే మారణ కల్పనతో అడవి నుండి జన పదాల్లోకి రహస్య ముద్రలతో నడిచేరు తప్త హృదయంతో అశ్రు నయనాలతో యుగాలుగా పన్నిన వలలో చిక్కిన అలల అడుగుల్లో అగ్నులు దాచుకొనీ విప్లవ శిఖరంపై మబ్బుల్ని ఎత్తుకొనీ మనిషికై కోరే విముక్తికై విప్లవ శక్తి కుంది ఒకటే విస్పోటనం లక్ష్యం ఏ విధి లేదు ! దైవం లేదు ! ఉందొకటే సాహసం విధ్వంసనం చీకట్లో ముడుచుకునే గుణం లేని సుడిలో తిరిగే అవసరం లేని ఒక చోటు నుండి మరో చోటికి భయం లేని కాలి బాటల్లో స్వార్థ సమాజాన్ని దగ్ధంచేసే వ్యర్థ నినాదాల్ని నగ్నం చేసే రాత్రి మరచి భీతి వదలి పట్టపగలు వీచే అనల పవన మూర్తులు స్వప్నం పిడుగై జారిపోతుంది, స్వర్గం నిప్పు కణమై రాలిపోతుంది తెల్లని పావురాళ్ళ జాడ లేదు ఎర్రని మాట తప్ప ఏదీ వినిపించదు పీడనకూ హత్యకూ మధ్య ధాత్రి కంపిస్తుంది రాత్రి చలిస్తుంది చరమ నిశ్వాసంలో ఫ్లవించే భయ సంగీతం వినిపిస్తుంది ఎవరికి రుచిస్తుంది ? ఎవరికి రక్తినిస్తుంది ?
ఆన్ చేసిట్యూన్ చేసిన రేడియో వలె ఈవేళ మనస్సులో స్మృతులు ఎప్పటి కపుడు సర్్చ లైట్ దృష్టితో అప్పటి కపుడు మార్్చ ఆన్ మాటతో యువ బృందం ! మండే అరణ్యం ! అరణ్యంలో ప్రేలే ఆయుధం ! ఆశ్రువులో అగ్ని బిందువుతో ఘర్షణలో అనల చరణంతో మరో క్షణంలో నీవు లేకున్నా నేను లేకున్నా ! ఈ సమాజం బ్రతుకుతుంది శాంతికై !
18. శ్రామిక గీతం లెండి ! లేలెండి ! ఓ క్షుధార్తి బంధితులారా లెండి ! లేలెండి ! ఓ శ్రామిక సోదరులార ! లెండి నిస్సహాయులార ! అవని పై దీనులార ! న్యాయంకై, నిరాదరణ గర్జా ధ్వని రణిస్తోంది జ కొత్త ప్రపంచం ప్రభవిస్తూంది ! మంచి సమాజం ఉదయిస్తూంది ! బంధించవు మనల్ని ఇకపై బంధించవు సంప్రదాయ శృంఖలాలు ! లేలెండి లెండి ! దీనులార ! ఏ బానిసత్వమూ మనల్ని కట్టివేయలే దికపై లెండి ! లేలెండి ! ఓ శ్రామిక సోదరులార ! (యూజినీ పాటియర్ ఫె ంచి కవిత అంగ్లానువాదానికి స్వేచ్ఛానువాదం)
19. నగరం దర్పణంలో I ఈ కూజాలో నీరు పృథ్వీ తలంపై మేఘం ఎపుడో వర్షించింది ఈ కుర్చీలో మనిషి ఎపుడో జీవాగ్ని నుండి ప్రాణం స్పందించిన రూపం పురా యుగం ముద్రలతో ఈ మనస్సు అప్పటిదే! దృష్టిరేఖ ఇప్పటిది ప్రతి దశలో ప్రతి యుగ చిహ్నాలు పొందే మనో రూపం, మనిషిది. అహంకార గుహ నుండి క్షుధా పీడిత హరీంద్రం వన మంతా చరిస్తుంది స్థితి పరివర్తనతో జన జీవన సూత్రం తర తరానికి మారుతుంది ముఖంలో నీడలతో కన్నుల్లో వత్తులతో దారుల్లో పోయేరు జనంలో మనిషి ముఖం పై ధూళి మంచు అనలం ఒకదాని వెంట ఒకటి! పేజిల్లో నిద్రించే అక్షరాలు చూపులో మేల్కొంటాయి
జీవిత వనంలో దారిచూపుతాయి కోలాహలం నగరం రాత్రి నిశ్శబ్ద కళ వహించిందో లేదో బాధా నది చలనం గమనం హృదయంలో వినిపిస్తుంది కోలాహల నగరం పగలు బ్రతుకు బరువు వహించిందోలేదో అనలం అలము కొన్న అరణ్యం వలె రూపం మెరుస్తుంది. పగలూ రాత్రీ మనిషి సమిధయై మండేను అగ్ని కణమై వెలిగేను ఎంత ఎదురెదురుగా ఉన్నా మనిషి వదన ముకురంలో బరువులో హరువులో జారిన తెరల్లో నిజం కన్పించదు. దారిలో గుడి మెట్ల పై బిక్షువులు దొప్పల కళ్ళలో నిప్పు రవ్వల ఊహలు వీరి గమ్యం సీమల్లేని ఆకాశం, ఆదర్శం లభ్యం కాని ఆహారావాసం ఉదీర్ణ సంస్కృతిలో సమాజ శక్తుల పాత్ర చరిత్ర నిర్మిస్తూంది కాని వెనుకనున్న జన బాధా చిత్రాల్ని విస్మరిస్తుంది. నదిలో నీరు పొంగి పొరలి ఇరు తీరాల్లో ప్రజ పోతే పోయారా ? అరచైతిలో వైకుంఠం చూపేరా అరమూత కళ్ళలో తెరదించేరా ? కదలీ కదలని పథకాలకు మహా నిద్ర వరమై వచ్చేనా ? గుడిసె ముందు పూల మొక్క! గుడిసె పైన బీర తీగె ! గుడిసెలో అనగ్నమూర్తి క్షుధ వేసిన కోపఫలం రచి ఇంకా తెలీదు II ఎదేమైతేనేం ? ఉదయం రానీ ! రాత్రి పోనీ ! తనకో బెర్్త తొరికితే చాలా ? లోకం చీకట్లో చావనీ ! కల్యాణ సూర్యుడు తన ఇంట్లో దిగితే చాలు కొందరికి రవి కిరణాలు వదలిపెట్టిన క్షణాల్ని శశి కిరణాలు అక్షరాలుగా మలుస్తాయి నగరం ఆహ్వానిస్తుంది శబ్దం నుండి అర్థవంతమైన నిశ్శబ్దంలోకి శబ్దం ఇక్కడ సక్రియకు సంకేతం ! శాఖోపశాఖలుగా పెరిగిన మహా వృక్షం టెలిగ్రాఫిక్ సంభాషణతో జనం ! తరం వెంట తరం వేగం కన్న వేగంగా! రాత్రి వెన్నెల వీధులు మాలగా వాలిన శాంతి కపోతాల వలె ఉన్నాయి అగ్గి పుల్ల గీసి అంటించే వారు లేదు ! ధూళి ధూమం చిమ్మే వీలు లేదు ఎంత త్వరగా నగరం శబ్దంలోకి ఆకర్షిస్తుందో ? అంత త్వరగా ముంచేస్తుంది విషమ జీవితంలో ఇక్కడ రాత్రికీ పగలుకూ భేదం లేని వేళ లూ ఉన్నాయి అర్ధరాత్రి నగరం వాలిన తరంగాలతో శాంత సముద్రంవలె ఉంటుంది ఉండి ఉండి రహస్యంగా నగరం ఏ కత్తి పోటుకో గురికావచ్చు
అగ్ని పధంలో బాధా పుష్పమై అపుడపుడు దాహంతో నభంవైపు చూస్తుంది మంచు పథంలో బాధాగీతమై అపుడపుడు, దీప స్తంభానికి ప్రాకుతుంది తనలో అగ్ని జ్వలిస్తున్నా ఉదయం రవి ప్రపంచంపై ప్రేమను పంచేను ఏ సందు నుండైనా జారి మొగ్గలకూ ప్రాణులకూ హ్లాద స్పర్శ నిచ్చేను పచ్చని చెట్టూ జల కణమూ మన కన్నా మండే సూర్యునికే అవసరం ! ఒకరి ముఖంపై మాస్్క ను మరొకరు కాజేసి తమ కవచం మరచేరు బస్ సీటులో జారిన పర్్స వదలి త్వర త్వరగా దిగి పోయేరు మృత్యు సమయం లోను క్షణం తీరిక లేని నగరంలో సదా ఆర్కెస్ట్రా వినిపిస్తూంది ! ఏ మూల నుండో సోలో ! సూర్య కిరణం కొత్త ఆశలతో రోజు పుటపై కొత్త బొమ్మలు గీస్తుంది ఎప్పటి కపుడు చర్యకు సిద్ధంగా ఉన్న రణ విమానం వలె ఉంటుంది వెలుగు లేని బీద గుడిసెలో గాయపడిన ఉదయం కుంటుతుంది పగిలిన కూజా నుండి నీరు వలె రాత్రి నుండి ప్రభాతం వ్యాపిస్తుంది III బీచ్ నుండో పార్్క నుండో పాటలు వింటూ వచ్చే నాలో సాగే స్మృతుల్ని టా ఫిక్ స్క్వేర్లో ఎదురైన ఎర్ర లైట్ నిలిపేస్తుంది. గాయాల్ని జ్ఞాపకం చేస్తుంది అంతలో వెలిగే పచ్చ లైట్ మునుముందుకు నడిపిస్తుంది అంగారం నుండి విస్ఫోటనం నుండి బయట పడే నీలో నాలో ఉంది ఒక నగరం హృదయం! అపుడపుడూ ప్రేలే ఆలోచనా గోళంతో బాల్కనీలో కుర్చీలో కూర్చున్న నా ముఖం పై స్ట్రీట్ లైట్ కళ్ళలో నీడల్ని దాచేస్తూంది ! వెలుగును చూపిస్తోంది ఇంట్లో పిల్లల సందడి ! అశాంతిలో రక్తిని నిలుపుతూంది కొత్త సింఫనీలో సంగీత ఖండం వినిపిస్తూంది సమాజంతో జీవిస్తున్న నాలో ఎప్పటి కపుడు మార్పు సహజం ఈనగరం ! స్వేచ్ఛారూపం ! ఎప్పుడు మండేది తెలీని గోళం వెలుగు ప్రశ్న చూడకుండానే కళ్ళలో సమాధానం దొరుకుతుంది బాధల్ని వహిస్తూ దరిద్రాన్ని మోస్తూ తెలివిగా వెలుగుతుంది ఇక్కడ శబ్దం కర్పూర ఖండం కాదు బాధా వీధుల్లో వెలిగే దీపం సంస్కార అంచుల్లో చక్ర ధారా ఘట్టనలో మానవీయం మెరుస్తూనే ఉంది ఎప్పటి కపుడంగారం నుండి విస్ఫోటనం నుండి బయట పడుతూ నీలో నాలో ఉందీ మానవ హృదయం జనతా శ్రమ కేతనమై, వాస్తవమై
20. నిర్వచనాతీతం శబ్దం నుండి శబ్దానికి సరిస్తూ నాలో విద్యున్నవ భావ ముంది మనిషి మనిషినీ పలకరిస్తుంది ! హృది హృదినీ వెలిస్తుంది అనాగరకం లేదు అమానుషం లేదు అయోమయ మసలే లేదు దీని వెనుక నుంది తత్త్వం ! బ్రతుకులో రమణీయ రహస్యం మాయను హిమ శిఖరంపై వదిలి ఆత్మను శక్తి ఝరిలో నిలిపి మనిషి స్వేచ్ఛకు చిహ్నమై ఈ కవితలో ఉంది సమ సమాజ వాస్తవం ! శిలలో మార్పును కోరే, ప్రగతిపై రక్తి ని పించే కళా రూపం జన స్వామ్య చరణ పథం ఈ కవిత నిర్వచనానికతీతం.
21. మేఘమై జనగీతమై స్మృతుల్ని వర్షిస్తూ జన గణంలో మేఘమై కదలి పోతున్నా దిశల చివరలో నుండి గ్రీష్మం ! నా ముఖాన్ని పరికిస్తోంది పిడికిట్లో ఆకాశంతో గుండెలో గర్జనతో నడిచే దారిలో పద పదం ధరిత్రి ఖండంపై అణువణువూ ఓ గాథతో ఆత్మీయం, దూరాన భయ సముద్ర ముంది కారుణ్యం ఒలికే అంచు కూడా ఉంది ఆకాశం అవని మధ్య ఏ రోజూ ఆర్తి నుండి జన పథాన నా గమనం నిశ్శబ్ద హిమాసారంతో ఆర్ధమై ఉదయ కిరణంతో ప్రపుల్లమై ఏ వైపు తిరిగినా ! ఎదురుగా ! మేల్కొన్న సమాజ పద్మం ఓంకారం నుండి ఝంకృతితో నాలో శబ్దం ధ్వనిస్తూంది పెదవులపై రాగంతో ముఖంలో ఉదయంతో కదలుతూంది ప్రజ
22. ఉదయించే శక్తినై అద్దం వలె శబ్దం నాలో కదలే సమాజాన్ని బింబిస్తూంది దారిలో ఎప్పటివో పగిలి చెదరిన అద్దం ముక్కలు ప్రతి అద్దం ముక్కలో జన చలనం బింబిస్తూంది పయనంలో వెలిగే దీపాలు దూర దూరమవు తున్నాయి సంఘర్షణలో మలిగే దీపాలు దగ్గర దగ్గరవు తున్నాయి భయం నుండి పుట్టిన రాత్రి చీకట్లో, కంట్లో వెలుగు చుక్కలతో కదలే వారున్నారు ; “ఎంత కాలం ? ఎంత దూరం” అంటే
" ఓ వెలుగు మనిషిని చూచే దాకా” ! " ఓ శాంతి ఉదయం దొరికే దాకా” అని. నిశలో మనస్సు మునిగి వెలుగులో ముఖం తేలి ఉంటే సరిపోదు వెనక నున్న నీడల్ని పట్టించు కోకపోయినా లోపలున్న నీడల్ని కనిపెట్టక తప్పదు సూర్యుని హృదయం గురించి రాత్రి వెలిగే చంద్రుడు చెప్పాలి మానవ విజయం గురించి పీడిత జన జీవితం చెప్పాలి ప్రతి దారీ మనల్ని వదలి వెనక బడుతుంది చీలిపోతుంది రేపటి చరిత్ర గమనానికి నేడో ప్రతి వ్యక్తీ ఒక ఉదయ శక్తి! ఏ వ్యక్తి జయం సమాజ భిన్నం కాదు, కిరణాలు కలిస్తేనే ఉదయం
VII. అగ్ని నుండి ఆనందానికి
(1994) అంకితం జీవన పథ సహచరి శ్రీమతి ఇందిరకు 1. అగ్ని నుండి ఆనందానికి సృజనోన్ముఖం : పుట 2. ప్రకృతీ జీవన బింబం 3. పురా భూమికతో 4. చరిత్ర శిఖరాల నుండి 5. మ్యూజియం లోకి
6. అభియానం 7. జీవన చలనం 8. సినేరియో 9. ఆత్మోన్మీలనం 1. ఒకటో సర్గ
సృజనోన్ముఖం చైతన్యంతో పృథ్వి సృజనోన్ముఖమైంది
1. జీవిత చలనం స్థూల సూక్ష్మ దశల్లో జీవ గుణంతో జడంలో ప్రాణశక్తి స్పందించింది. విశాల ధరణీ వదనంలో మౌనవ్రతం సడలింది. గగన నిటల తటంపై చిరంతన రహస్యం వెలిగింది. బీజంలో జీవశక్తి చెట్టులో పూలనూ పండ్లనూ మేల్కొల్పింది. జీవ కణ సమాగమంతో శిశు దశలో దివ్య కిరణ ప్రవేశంతో పూర్ణాకృతి! సృజన సరణ మనీషతో స్పందన గుణ హృదయంతో ప్రకృతి బింబమై ఘర్షణలో ధర్షణలో నిలిచి మనిషి ఎదిగేను. పాంచభౌతిక శరీరంలో దివ్య చేతన కుట్మలించింది. మహిత భావనా దళాలతో మనస్సు పుష్పితమయింది. ఆనంద స్పర్శతో సంకల్పం మధు పరిమళ భరితమయింది. భౌతికరూపంలో సుందర జీవన స్థితిలో మనస్సు రుచికై గతికై ప్రేరేపించేను, సంపూర్ణ గుణ రూపంవైపు మరల్చేను.
చేతన సరించింది, ఆకాశాన్నీ క్షితాజాన్నీ భూమిని ఆవహించింది. అణువణువులో ఆకర్షణశక్తితో సరిక్రొత్త రూపాలకు దారితీసింది. భౌతికం నుండి అభౌతిక దశల్లో ప్రాణ తలం నుండి మనో భూమికల్లో వ్యక్తి నుండి సమాజ తత్త్వానికీ వివేకం మనిషిని పయనింపజేసింది. దశదశలో దారిలో సాధనలో అనుభవంలో చీకటి పైబడుతుంది. కళ్ళ నుండి అగ్నిశిఖలు చిమ్ముతాయి, దైవం జ్ఞాపకం వస్తుంది. వేదనతో శుష్కమైన హృదయం దివ్యమైన బిందువుకై తహతహ ప్రేమతో గగనమై కరుణతో మేఘమై ధారలతో నదియై పోవాలని. భౌతిక రూపాలన్నీ స్థూల సూక్ష్మ దశల్లో శరీరం నుండి మంద్ర మధ్య తీవ్ర స్పందన భేదంతో చేతన వైపు ఉన్ముఖమయ్యేను. ' ప్రాణి స్వచ్ఛందంగా జన్మించి త్వగావరణ మాంసల శరీరంతో మనిషై కణ కణంలో వసంత కిరణ చలనంతో స్వేచ్ఛగా ఆపై ఛాయా ప్రియ రూపంతో ఆనంద సరణి జీవితం కోరేను వాస్తవ తలం నుండి కల్పనా జగంతో సృష్టి అంచుల్లో ఆత్మశిఖరంతో అదృష్టం చూచేందుకూ రహస్యం వెదికేందుకూ తత్త్వాలోకనం చేసేను. ఏది ఎట్లా ఉన్నా ఆత్మ జీవన యాత్రలో మనిషి ముందుకు పోవడమే కాని వెనక్కు మరలడం లేదు. రక్త మాంస ధాతుమయమై అస్థి నాడీ జన్యు ధృతితో షోడశ శతమై ఆయువు శక్తి జ్వలించింది, తేజాన్ని పొందింది, రక్తి మెరసింది, వికాసాన్ని పొందింది. ఆత్మకు తప్ప కాలానికీ స్వేచ్ఛ లేదు, జీవితానికీ స్వేచ్ఛ లేదు ఆయువు నుండి మృత్యువు దాక, శ్వాస చలనం నుండి విలయ పవనం దాక నివాసం నుండి ప్రపంచం దాక, వ్యవహారం నుండి అతీతం దాక అనుభవంలో జీవితం బంధమై సాధనమై సత్యమై వర్తించేను. సంకల్పం ఉదయ పుష్పం వలె వికసించింది దీన్ని సంపూర్ణంగా వహించే శక్తి మనస్సుకే ఉంది
2. సంకల్ప పుష్పం వస్తువులో సత్యం గుప్తమై ఉంది, సత్యంలో సౌందర్యం నిహితమైంది. మంచుతోనో చీకటితోనో ముసుగుతోనో వ్యక్తిలో అందని ప్రపంచముంది. జీవన సమస్యల్లో పోరాడే కోరిక లక్ష్యానికి కీలకమైంది చీకటి ఇక్కట్లు దాటుతూ నీడల పాట్లను తొలగిస్తూ ప్రతి మనసులో సామాజిక బంధంతో వెలుగు ప్రపంచముంది
శారీరక స్పర్శతో సుఖ తరంగ స్పృహతో స్పందనతో స్నేహ శాంతి కరుణతో ప్రాణీ మనిషీ వ్యక్తీ వేరు, వైయక్తిక సామాజిక స్థాయిలో విభేదించేరు. ఇంద్రియ శక్తుల వశమై ఒక పార్శ్వం భౌతిక భూమి అవుతుంది ఇంద్రియ శక్తుల స్వాధీనంతో ఒక పార్శ్వం ఆత్మ శిఖరమవుతుంది మనస్సులో సూర్యుని అరుణ రశ్మితో హృదయంలో చంద్రుని సుధా కాంతితో భౌతికం నుండి మనిషి అతీతాని కభిలాష పడేను! నిరంతరం. ఎంతటి ప్రజ్ఞాన మతిలోను ఎంతటి ఉదాత్త కర్మలోను అజ్ఞానం పొర వలె నిలుస్తుంది, భరింపరాని తేజస్సు నుండి రక్షిస్తుంది చీకట్లో రజ్జువు సర్పమై, ఎండలో ఎడారి జల దర్పణమై నిలుస్తుంది. వివేక హంస అవతరిస్తుంది తత్త్వ ప్రపంచం నిర్మితమవుతుంది ఒక ప్రపంచ ప్రభావంతో మరో ప్రపంచం అవతరిస్తుంది. రెండో సర్గ
ప్రకృతీ జీవన బింబం
1. పురా రూపంలో మస్తిష్కంలో భౌతిక ప్రపంచం నిలిచింది, మనస్సులో అనుభవ బీజం వృక్షమైంది. చూచే దానిపై ఆలోచన వెలిగింది, చూడని దానిపై కల్పన రూపొందింది. పైన రవి చంద్రులతో ఆకాశం, క్రింద ప్రకృతి జీవన దృశ్యాలతో అవని. ఆశా నిరాశల్లో ఉన్న దాన్ని అందుకోవాలనీ అందనిదాన్ని పొందాలనీ అభిలాష ప్రవృత్తమైంది, అన్వేషణ సాహస గమనానికి దారి తీసింది పదగమనంలో గుండె లయలో ఆయువు ఝరియై సరిస్తూంది. ప్రాణ మయ శక్తితో శిఖరభూత మస్తిష్కంతో దేహం పోషితమై నడుస్తూంది. ఉదార హృదయంతో భూమి పరిమళ సంజ్ఞతో పిలుస్తూంది. అమూర్తమైన ఉషస్సులో స్త్రీ భావన హృదయ కళా తంత్రుల్ని మీటుతూంది. అలయై శిల్పమై సౌందర్య కీర్తికి రూపమై ప్రేమ మూర్తికి చిహ్నమైంది. సజీవ కల్పనలో నవనీత శిల్పంతో హృదిలో స్పందన గుణ చరణాలతో పురుషుని జీవితంలో స్త్రీ, ఆర్ద్రమై, పార్శ్వమై ప్రవేశించింది, శక్తి అయింది. రక్తంలో ప్రసన్నంగా హృదయంలో కోష్టంగా, అరుణ రశ్మి వెలుగుతుంది.
ఊహలో అందంగా, అనుభూతిలో హ్లాదంగా, చంద్ర రశ్మి సరిస్తుంది. ప్రకృతి రూపం సమయ సమయం జీవన బింబాన్ని మారుస్తుంది గ్రీష్మంలో నీరు ఆవిరై మార్పుతో మేఘం! సర్వం రస రమణీయం చేస్తుంది.' తుపాను వీస్తుంది విప్పారిన పడగలతో, సంపద ముంచేస్తూ ప్రాణాలు హరిస్తూ భీభత్స గుణం శాంతించిందో లేదో, అదే స్థల సీమల్లో జన పునరావాసం! భయ ముద్రల జ్ఞాపకాల కన్నా, జీవన గమనంలో అప్పటి అవసరాలు ముఖ్యం. కష్టంలో గుండె రాయి అవుతుంది, వజ్రమవుతుంది. కష్టం తొలగ్గానే మట్టిముద్ద అవచ్చు, నవనీతం కావచ్చు. ఉదార జలద శకలమవచ్చు, ప్రవహించే త్యాగ ధుని కావచ్చు. గ్రీష్మం వంటి బాధలు చెలరేగినా, మనిషిలో పచ్చని చెట్టు ఉండనే ఉంది. చెట్టు క్రింద పుట్ట, పుట్టలో నుండి లేచే పామూ, పైన అందీ అందని కొమ్మలూ కొమ్మల సందుల్లో గూడు, గూటిలో పక్షి, పక్షి కోసం ... ఇదో కథ! మూల ప్రకృతి ముఖంతో జానపద కథాబంధంతో, పురా రూపంలో సాగేను.
2. బయట పడని రహస్యం ఉదయ నదీ జలాల్లో నిలిచి దోసిట్లో తీసుకున్న నీళ్ళలోకి సరాసరి సుకుమారంగా దిగిన సూర్యుడు ఎదలో రాత్రిని తొలగించేను మెత్తని కిరణాలతో పూల రెక్కల చేతు లందుకునీ హత్తుకునేను జలాల్లో నుండి బయటికి వచ్చిన నన్ను తనలో ఒకటి చేసుకునేను. బిగిసిన పెదవి దాటని నవ్వుతోనో, పల్చని వెలుగు నవ్వుతోనో వస్తూపోయే దారిలో రాయి ఎప్పటిదో, చెట్టు క్రింద అట్లాగే ఉంది. ఈ మధ్య పూలతో చిగిర్చి ఏ చేతుల మీదో దేవత అవుతూంది మేఘం నుండి ఉరుము వంటి, మెరపులతో పిడుగు వంటి అశాంతిలో సుఖానికై ఆరాటం అన్వేషణ ఆలోచన! ప్రతిదిశలో సాగుతూంది. మంచు చెట్లతో కబుర్లు చెబుతూంది, వెలుగు గాలితో మాట్లాడుతూంది. నిద్రించిన ఎడారి ఎదలో పచ్చని స్మృతుల్ని మేల్కొల్పుతూన్నాయి. ఉదయ కిరణాలు మంచుపై జారుతూ స్కేటింగ్ చేస్తున్నట్లుంది. కిరణాల ప్రతిఫలనంతో వనం పురివిప్పిన నెమలి వలె ఉంది నీళ్ళపై వెలుగులు గాలికి పాలపై పల్చన మీగడ ఊదినట్లుంది. నీటిలో తరణితో అలల్లో బింబ జగత్తు నిజమన్నట్లు కదులుతూంది. నీటి పాయకై పచ్చదనంకై పొద్దెక్కిన కొద్దీ ప్రతి కిరణం వెదకుతూంది. తమ నిజ రూపం తమకే తెలీకుండా వివిధ పాత్రల ముఖాలతో
మనుషులు దాహంతో ఏ నీటి ఒడ్డునో చేరుకునేరు కిరణాలై సాగేరు. ఉదయం ఆయువు పరుస్తూ వస్తుంది, పగలు జీవితాన్ని పరుస్తూ పోతుంది. గుండెల్లో నిద్రించే కిరణముంది, గుప్పిట్లో బయట పడని రహస్యముంది.
3. శిలలో, గీ ష్మంలో శిలా వదన పంక్తు లెదురయ్యే సమయం! అలయై కదలక తప్పదు శరీరంలో అనలముంటే చాలదు! శక్తిగా మారాలి గమనానికి ఉత్తేజం రావాలి. జీవితంలో యుద్ధమెన్ని విధాలో? దేని వ్యూహం నిర్వహణం దానిదే. బోనులో సింహం వలె మనిషి గుండెలో సూర్యుడు ఇంధనంలో శక్తి వలె కణ కణంలో అణు తేజం నీటిని వణికించే చలిలోనూ ఆలోచన చల్లబడదు. వ్యక్తిలో భాగమై, గుప్తమై ఎప్పటివో వీడని ప్రాక్ రీతులతో వికసించిన సంస్కృతిలోను మనస్సులో అరణ్యరూపముంటుంది. అరణ్యం కాలుతుంది, కాలనీ, సముద్రం మండుతుంది, మండనీ మంటల్ని రేపే శక్తి వెనకనే, ఆర్పే జలదం కదలుతుంది అలలపై తేలుతుంది. ధ్వని వినిపిస్తుంది, అంతలో మరో ధ్వనిని అల్లుకొనీ దూసుకొని వెళుతుంది. నేలపై నాగలి గీతలతో చాళ్ళలో చినుకులతో విత్తులతో జీవితంలో. నూతన గతి సంబంధాలతో జన సంరంభం! మార్పుకి తలుపులు తెరచేను మరో రుతువులోను అపుడపుడూ గ్రీష్మం ఆస్పాలనం చేస్తుంది. తనలో మిగిలిన రెండు మూడు అంగార కణాల్ని రాలుస్తుంది, పోతుంది. మరునాటికి పల్చని మఖ్మల్ ఎండలో తెలుపూ పసుపూ రంగుతో అగ్ని దాచుకొనీ ఆర్ద్రత నందుకొనీ కాలం హేలా సుందరంగా వస్తుంది. అయినా అక్కడక్కడా ఎదురుగానే ఎండి పోయిన జీవిత దృశ్యాలెన్నో? శుషీభూత రూపంతో మాట్లాడితే తెలుస్తుంది! శిలలో మార్దవం! బాధారుణ బింబంతో మాట్లాడితే తెలుస్తుంది గ్రీష్మంలో ఆర్ద్రత!'
4. విశ్రాంతి కోరే సూర్యుడు పక్షులొకచోటినుండి మరో చోటికి సుందర శ్రేణీ యానంతో మైళ్ళకు మైళ్ళు తరలిపోతాయి, దారి తప్పకుండా తిరిగి వస్తాయి. పక్షుల శబ్దం ఏ వాద్య సమ్మేళన్నో తలపిస్తుంది.
మొదటి ఉదయ కిరణం కనురెప్పల్ని ముద్దు పెట్టుకొనేసరికి లేస్తాయి. ఉదయ కిరణ పథంలో మనిషి జీవన యాత్రకు చిహ్నమై ఎగురుతాయి. రాత్రి ప్రాణి కోటి చిక్కిన చీకటి వలను ఉదయ కిరణం ఛేదిస్తుంది. పల్చని మంచులో ఉదయ సూర్యబింబం జెల్లీతో ఐస్క్రీం కప్పు వలె ఉంది. మంచు పొరలతో ఉషఃకిరణ పంక్తులు తెల్లని ఉన్ని దుస్తులు ధరించిన స్కూలు పిల్లల వలె ఉన్నాయి, వాతావరణ మలంకార సహజంగా ఉంది. తీగెలకు వ్రేలాడుతూ జారుతూ క్రీడించే చిన్న పిల్లల వలె ఉన్నాయి. చెట్లపై ఆగినవి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లున్నాయి. సూర్యరశ్మితో జగత్తు బంగారపు ముద్దవలె కన్పించినా ఎగరడానికి సిద్ధంగా ఉన్న స్వర్ణ హంసవలె తోచినా ఎంత వన్నె ఉందీ! ఎంత విలువ ఉందీ! కాలం గడిస్తే కానీ తెలీదు, జీవితంలో అవర్ణమో! వివర్ణమో! సువర్ణమో! తపనీయ సమయం? రావాలి. పర్వతం ప్రార్థనలో నిమగ్నమైన వృద్ధు వలె ఉంది మంచు అద్దినకోమల కరాలతో ఆదిత్య కాంతి సమాజంపై నిన్నటి గాయాల కుపశమనం చేస్తున్నట్లుంది. దోసిట్లో నుండి నదిలో విడిచే మంత్ర పూత జల ధార వలె ఉంది. సమయం మీటేందుకు సరిచేసిన తంత్రులతో సితార్ వలె ఉంది. పగలంతా వెలిగి వెలిగి సూర్యుడు నిశ్శబ్దంలోకి జారిపోయేను ఏ పచ్చని నీడనో ఏ చల్లని హృదిలోనో విశ్రాంతి కోరేను.
5. రాత్రీ - ఉదయం ముందు పరచిన చుక్కల వంటి వస్తువుల్ని త్రోసేసి చేతులు చాచి పైకి దూకి పూల గుత్తివలె ఎదకు హత్తుకొనే శిశువువలె ఉంది చంద్రబింబం శిశు దశనుండీ చంద్రబింబంతో స్నేహం ఎన్నటికీ వీడని అనుబంధం. చీకటి భయదమే కావచ్చు! గగనంలో నక్షత్రం ధైర్యానికి కేతనం దూర దూరం నుండి ఆహ్వాన పత్రమై మనలో ఆశను నిలుపుతుంది. లో నుండి నిదుర ముంచుకొస్తే, పై నుండి మెలకువ దూకుతుంది నక్షత్రాల బాధా స్వరం వెన్నెల్లో కన్నా చీకటిలోనే బాగా వినిపిస్తుంది ప్రతి ఉదయం సరికొత్తగా చీకటి నుండి బయట పడేస్తుంది ప్రతి వ్యక్తినీ తేజంతో జీవన సమరానికి సిద్ధం చేస్తుంది.
6. కాలాన్ని మార్చే వెలుగు ఉదయం నుండి రాత్రికీ, రాత్రి నుండి ఉదయానికీ ఆవర్తంలో రాగంపై అభిలాషతో కాలం మనిషిని నిరీక్షణలో నిలుపుతుంది. రాత్రి మాట చెప్పనవసరం లేదు, ఒకపుడు దాటేందుకే శక్యం కాదు సముద్రంపై ప్రయాణ నౌక వలె అన్నిటినీ తీరాన వదలేస్తుంది. రాత్రి గడ్డ కట్టిన నిశ్శబ్దాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతుంది అంతలో బిగిసి పోతుంది శిలయై, చీకటిలో ఒక్కటై, ఆ సమయం! ఆదిత్య కాంతి స్పర్శతో భయంతో నిమిత్తం లేకుండా పోతుంది కాలాన్ని మార్చే వెలుగు, కళ్ళలో మెరుస్తుంది ముఖంలో నర్తిస్తుంది.
7.భవిష్యత్తు ప్రతినిధిగా సముద్రమెంత చంచలమైనా ముందుకే గాని వెనక్కు పోవడమెరుగదు ఝంఝ ఎంత బలమైందైనా విధ్వంసమేగాని సృజన ఎరగదు గ్రీష్మంలో ప్రవాహంవలె, శిశిరంలో చెట్టు వలె మనిషిలో మానవత జీవితంలో ఇంకిపోయే రాలిపోయే సమయమూ రావచ్చు. జలధి తీరాన గాలి పాత పుటల్ని మూస్తూ కొత్త పుటల్ని తెరుస్తూ వస్తుంది ఈ అలల పుటలకు సమాప్తి లేదు, మానవ చరిత్రకంతం లేదు ఆలోచనలో ఆకాశంతో దోసిట్లో వెలుగులతో ఎదురుగా క్షితిజం! యువశక్తిని తలపిస్తూంది, భవిష్యత్తు ప్రతినిధిగా వెలుగుతుంది.
8. ప్రకృతికి ప్రతిబింబం సంధ్యా క్షణం జ్ఞానానికి చిహ్నం కాదు, అజ్ఞానానికి సూచన కాదు జ్ఞానం పొరలు వీడని అజ్ఞానానికీ, అజ్ఞానం పొరలు క్రమ్మే జ్ఞానానికీ సంకేతం' ప్రయాణికుల్ని మోసుకొనీ ప్లాట్ఫార్్మ దాటి ఉత్సాహంతో మరో స్టేషన్కు చేరబోయే రైలువలె ఉందీ సాయం సమయం ప్లాట్ఫార్్మ పై ఇరు చివరల నుండి ఒకచోట ఎదురుపడే ప్రయాణీకుల హృదయాలవలె సంధ్యా క్షణాలు కదలుతున్నాయి. అహంకార శిఖరంపై గులాబి పూవై ఉత్సాహ వల్లికి మల్లీ సుమమై రాత్రీ పగలుతో, నిశ్శబ్దం శబ్దంతో, వినాశం సృష్టితో ప్రపంచం ప్రకృతి పరివర్తనలో భాగమై జీవన సరణంలో ప్రయాణమై మనిషిలో మహా జీవితం ప్రకృతికి ప్రతిబింబం!
మూడో సర్గ
పురా భూమికతో
1. కాలి బాటలో అజ్ఞానాన్ని కరగిస్తూ ఉపాయాన్ని వెలిగిస్తూ మనిషి మస్తిష్కంలో శక్తి వివేకంతో మేధ ఎంత పనైనా చేస్తుంది. కళ్ళు ధరించిన మబ్బు ముక్కలతో పగలు వెన్నెల అవుతుంది సూర్యుని స్థానంలో చంద్రబింబం భ్రమా భంగిమలో తోచేను. చేపల్ని వలలో బిగించే మృగాల్ని గొలుసుతో బంధించే నేర్పు వచ్చింది భవిష్యత్తులో ఫలంపై ఆశతో భూమి ఎదను నాగలి ప్రేమతో దువ్వుతుంది దున్నిన భూమి అయినా తనలో ఎంతో రహస్యాన్ని దాచుకునే ఉంటుంది. పొడి పొడియైన మృత్తికలో నవ సృష్టి అదృష్టాన్ని పరీక్షకు నిలుపుతుంది. కళ్ళ ముందు నీలిమేఘం బరువైన నీటి మూటల్ని విప్పి తేలిగ్గా వదలుతుంది నదీసుందరి వస్త్రాంచలం వదలకుండా గాలి హేలా తత్పరంగా కదలుతుంది. తడిసిన పొలం నుండి కర్మాగారం వరకూ శ్రమజీవన బంధు దృశ్యం. క్రిందిస్థాయిలో హింసనూ భయాన్నీ, పై స్థాయిలో శాంతినీ ప్రేమనూ వహించే మనిషిలో ఎప్పటివో పురా రూపాలు! ప్రాక్ మానవ జీవన చిహ్నాలు, అక్కడక్కడా కొండలు అనుద్విగ్నంగా యుగాలకు సాక్షీభూతంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ నదులు కదులుతూ విశ్వ జీవన దృశ్యాన్ని ప్రకటిస్తున్నాయి. అడవి నుండి పొలాలు, ఊళ్ళు దాటి నదీ సరస్తీర సముద్రం దాకా, శరీరంలో నరాల వలె అడవిలో పృథ్విపై కాలి బాట విశ్వమానవ బంధు సూత్రాకృతి, కదలుతూ పోతూంది
2. ప్రాణంతో ప్రస్థానం నిన్నటి అస్తిత్వం నేటికి పాతబడిపోయి శుష్కమై బీజభూతమై మిగులుతుంది శిథిలాల నుండి ముండ్ల నుండి సమరూపం పొందాలని ఆరాటపడుతుంది చెట్టుపై మట్టి అంటని ఆకులు రాలి మట్టిలో కలుస్తాయి ఎండినా చెట్టును వదలని వేళ్ళు సమయం కోసం నిరీక్షిస్తాయి. ఇసుక దిబ్బలపై కాళ్ళీడ్చుకుంటూ ఇసుక తుపాన్ నుండి బయటపడి
ఒయాసిస్ కన్పిస్తే చాలు ఒంటెలపై పోయే ప్రాణం లేచి వస్తుంది. మబ్బు నుండి సూర్య కిరణం వలె ధార నుండి ఆశాలత వలె జీవశక్తితో బయటపడే ప్రాణంతో ప్రస్థానం సాగుతుంది. ఎక్కడెక్కడో బయలుదేరి ఎక్కడెక్కడో విస్తరించి అరణ్యమూలం జానపద నాగరక జీవనధృతిలో సజీవమై భద్రంగా ఉంటుంది
3. మారే దృశ్యం ఏ ఆజ్ఞకూ శాసనానికీ అంతరాత్మ కట్టుబడదు, దేనికైనా సిద్ధమౌతుంది. చెట్టు కొమ్మ సమాధిపై పూలు రాలుస్తుంది, అతీత శక్తికి ప్రేరణ అవుతుంది. భౌతిక దశ దాటిన తృప్తితో మనోముకుళాన్ని స్ఫుటితం చేస్తుంది జీవితం, మలుపులు పోయి మెలికలు తిరిగి అల్లుకొనీ, చెట్టుకొమ్మల వలె అనుబంధం పొందంది శోభ లేదు పరిపూర్ణత లేదు నిలువెత్తు కాన్వాస్ వలె క్షితిజం, వర్తమాన చిత్రంతో ఆకర్షిస్తుంది. మనిషికొక అర్థంలో, మనసుకొక దారితో దృశ్యం మారుతూ పోతుంది.
4. జీవన కాంతితో తరతరాల సంస్కృతీ తోరణాల్లో పూర్వకాంతి శిఖలతో జీవితాలు గుంపులు గుంపులుగా ప్రపంచ వ్యాప్తంగా చెదరిన ఆశా చిహ్నాలు బాధల రంగులద్దిన శాలువాతో ఆనంద తీరానికి సాహసిస్తాయి.' తప్త శుష్క నదీతటాల మధ్య కొత్త జల ప్రవాహం వలె శిశువు ముఖంలో అమాయక మధుర స్నిగ్ధ బింబం వలె, ప్రకృతి సృజన గంధంతో నవ జీవన కాంతితో వస్తుంది ఉగాది. పూర్వం గడపదాటని నీడ లిపుడు తలుపు తెరవగానే మెరపులై వెలుగులై, స్నేహంగా లోనికి వస్తాయి ఇపుడు భస్మరాశి నుండి రాగ ముఖ మవతరిస్తుంది. ఇపుడు నీడ ముఖంలో కాంతిరేఖ ఒలుకుతుంది.
5. ఉగాది ఒకటే అర్థరాత్రి పన్నెండు గంటల కొకరు గుడై చెబుతారు ఉదయం ఆరుగంటల కొకరు స్వాగతం పలుకుతారు. పెదవులపై పవిత్రాక్షరాలతో మానవతా సూర్యుని కెదురుగా
దోసిట్లో భావజలంతో సమాజనదిలో కటి దఘ్నంగా నిలిచిన నాలో, కళ్ళలో ప్రేమ సుమాలతో హృదయంలో త్యాగధనంతో, ఆత్మ, సమరంలో పైకెగిరిపోయిన శాంతిని ఉత్సాహంతో అందుకుంటుంది. జీవితంలో అడుగున బడిన ఆర్ద్రతను ఆనందంతో చేదుకుంటుంది. నిశ తరువాత నిశ మనో విశ్రాంతికి నిలయమై ఉదయం తరువాత ఉదయం చేతనకు ప్రేరణయై ఎపుడు చివురు వేసినా, ఎపుడు పూత తొడిగినా ఉగాది మటు కేడాదికి ఒకటే! ఇది మానవ పురా బింబ కేతనం! నాలుగో సర్గ
చరిత్ర శిఖరాల నుండి
1. యుగం నుండి యుగానికి నదీ తీర మైదానాల్లో మెదట బట్ట గట్టిన మానవ సంస్కృతి కీర్తి శిఖర పంక్తులతో మనః పటలంపై కదలుతూంది. బిందువుతో బిందువు రేఖతో రేఖ కలిసీ చర్యపై ప్రతిచర్యతో రణ గతి నీతితో మనిషితో మనిషి అనుబంధం సామాజిక సత్యం. దాహం తీరేందుకు నదిలో దిగి దోసిట్లో గ్రహించిన ప్రవాహంతో జీవిత మెక్కడ మొదలైందీ చరిత్ర ఎట్లా ఏర్పడిందీ తెలుస్తుంది. దాహం తీరి బయటికి రాగానే, వివిధ ఘటాకృతుల్లో ఆకాశం వలె దేశ వర్ణ వేష భాషా రూపాల్లో జీవన దృశ్యం ప్రత్యక్ష మవుతుంది. ఇపుడు ఆలోచనా స్వరంలో హృదయం వినిపించే భాష వేరు వివిధ వర్ణ ప్రాంత భాషా భేదాల్లో బ్రతికే మనస్సు గీసే చిత్రం వేరు ఇతి హాసం బ్రతికే ఉంటుంది, శిధిలాల్లోనే కాదు, పరంపరా గాధల్లో గ్రంధాల్లోనే కాదు, జీవిత సాధనాల్లో మనో రీతుల్లో జీవ కణాల్లో శిధిలాలు మనిషి శక్తినే కాదు సమయం ఒత్తిడినీ జ్ఞాపకం తెస్తాయి. అరణ్యాలూ కొండలూ నదులతో పాటు జంతువులతో సంబంధం ఉన్న చరిత్రలో ప్రాణంపై జాలి కన్నా శత్రువు పై విజయమే లక్ష్యమౌతుంది. సంస్కృతిపై స్పందన కన్నా శత్రు చిహ్న విధ్వంసమే ముఖ్యమౌతూంది. పురా వైభవాన్ని తలుస్తూ శిధిల శిఖరాలపై అడుగులు వేస్తూ
యుగం నుండి యుగానికి కాలం అవలీలగా కదలిపోతుంది. సాహస కృత్యాలతో వీర గాధలు చరిత్రను స్వర్ణమయం చేస్తాయి. ఒక దిశ నుండి మరో దిశకు కీర్తి పక్షాలపై పయనింపజేస్తాయి. ఆరామాలూ ఆలయాలూ విశాల శాలలూ ప్రజలకు ప్రయోజనంతో పాటు పరమార్థాన్నీ చూపాయి. క్రుంగిన మనస్సుకు ఎంతో ఉత్సాహ శక్తినీ ఇచ్చాయి. ఆకలితో కదలి శ్రమ శక్తీ యుక్తితో సంస్కృతి సాధింపబడింది. భయం వదలే ఉపాయంతో, శాంతి పొందే మార్గమూ దొరికింది. చీల్చబడిన వెదురు నిశత ముఖంతో బాణమై వీర విహారం చేసింది. ఖండితమైన వెదురు నవ యోగంతో వేణువై నిస్వనించింది స్వాహాలో ముక్త ఝరీ చరణంతో ప్రణవంతో భ్రమరీ ఝంకారంతో నవ్వులో ఏడుపులో మాటలో పిలుపులో నాద తరంగం రుచి పొందింది. శబ్ద బిందు సమూహాల నుండి నాదం సారభూతమై సంగీతాకృతి పొందింది. వాయు తంత్రీ వాద్యాలతో సంస్కృతిలో సంగీత పద్మం కొత్త రేకులు తొడిగింది., గళంలో ఆకాశం, శబ్ద గుణంతో స్వర సంచారం పొందింది. సాధనలో సంగీతం దివ్య కళకు మధుర హృదయమైంది. మూలాధారం నుండి సహస్రారం వరకూ చలితమై సరితమై ప్రవహితమై పరవశింపజేసింది, ఆత్మానందం లక్ష్యమైంది. సమాజంలో సంస్కృతి ఉన్మిషితమైంది, మనస్సుకు దివ్య దశ గమ్యమైంది. జన గళం నుండి స్వేచ్ఛ అగ్ని ఝరియై నినాదమై పతాకమై రావలసిన మార్పుకీ సామాజిక చేతనకూ సంకేతమైంది. రెపరెపలాడే జాతి పతాక నీడలో వీర కృత్యాలు తళతళలాడాయి.
2. రణపతాకతో దేశంపై జాతిపై సుందర భావనతో ప్రేమ మనో గగనాన్ని చుంబించింది. సమాజ సౌభాగ్యం లక్షించే చేతనతో చరిత్ర పునరాకృతి పొందింది. అయుధంపై శాంతి చిహ్నంతో స్వార్థ శక్తుల జైత్ర యాత్ర మొదలైంది. పరాభూత దృశ్యాలతో విజయ గర్వంతో చరిత్రకు కీర్తి శిల్పం చేకూరింది. రక్షణకు సాధనమైన ఆయుధం, శిక్షణతో రణ శక్తి కంగమైంది. ఆయుధ శక్తిలో అతినవ్యపురోగమనం విజయాని కాయువైంది.
3. మనిషిలో కోటతో అహంకార శిఖలతో క్షాత్రం ఘనీభవించిన కోటలు, పౌరుష కళా ఖండాలు, సమరశక్తి రాజనీతి బింబించే శిథిలమైన చరిత్ర రూపాలు ప్రక్కకు తీసి పెట్టిన పాగాలా కోట గోడ ! ఇంకా అంటి పెట్టుకున్న ఆవాసాలు ! గబ్బిలాలు మూషికాలతో పాటు ఏ గోడో కూలే భయం లేకుండా మనుషులూ ! బలమైన తుపాను గాలికి ఇంటి కప్పు ఎగిరిపోయే ప్రమాదమూ ఉంది ఫాల తలపై జారే వెన్నెల, ముఖంపై చీకటిని తుడిచే ప్రయత్నం చేస్తుంది శిధిలమైన కోట బుజాల సందులో నుండి రోజూ కర్మసాక్షి పయనిస్తాడు మార్పు ఎరగని సమాజానికి సాక్షిగా ఏండ్లుగా వట వృక్షం నిలిచి ఉంది చరిత్రలో విషాద ఖండం సైతం స్మృతిలో మధుర బింబంగానే నిలుస్తుంది కాలం గడచి గడచి కల్పనతో చరిత్ర పురాణ రూపాన్ని పొందుతుంది పచ్చదనానికీ కొత్తదనానికి దూరమైనా కోట మానవ శక్తికీ పరిమితులకూ లక్ష్యంగా నిలుస్తుంది ఎవరి దృష్టిని బట్టి పాత్రను బట్టి యుక్తిని బట్టి శక్తిని బట్టి వారు దర్శిస్తూ, నటిస్తూ బ్రతుకుతూ జ్వలిస్తూ తమలో కోటను నిర్మించుకునేరు ఇనుప మేకులపై కత్తి అంచులపై ప్రజల్ని కొందరు నడిపించేరు మానవతా నగర ద్వారం మరచి, అరణ్య భావంతో సంచరించేరు యుద్ధ భావ జ్వలనంతో నేల మోదుగ పూలు పూచి నట్లుంది నియంతల అహంకృతితో సమాజం అనల శిల్ప మవుతూంది స్వేచ్ఛ కోసం సమత కోసం పీడిత గణం జ్వలించి పోరాడేప్పుడూ సామ్యవాదం ప్రజాస్వామ్యం చరిత్రకు క్రొత్త మలుపు నిచ్చాయి.
4. శాంతి పథం ఒక్కొక్క జ్వలదగ్ని వ్యక్తిత్వం మంటల వెనుక శాంతి పధం స్వప్నిస్తుంది. దీపమై చీకటిని తొలగించేను, ఉదయమై సమాజాన్ని మేల్కొల్పేను బానిస లోకానికి స్వేచ్ఛా చిహ్నమైంది, పీడిత జనాళి కభయ ముద్ర అయింది మనిషిలో సంస్కృతి రూపం వికసించిన మానవతా తేజం! కన్పించని సంకెళ్ళతో మాట్లాడే అనల హృదయాన్ని ఆలోచన ప్రేమతో హిమ సదృశమై స్పృశిస్తుంది. వ్యక్తి పరిధి దాటి సామాజిక శక్తిని పొందుతుంది.
5. చీకటి ఆయుధం హింసకో హత్యకో తిరుగుబాటుకో దిగే పూర్వ రంగ మెవరికి తెలుస్తుంది హేతువుతో త్రవ్వితే గాని చరిత్రలో వివేకాని కందదు సామాన్యుని కన్నీళ్ళ వెనుక నున్న చీకటినే దీపాలు వెల్గిస్తాయి ! ఆ చీకటి ఒక సమయం అగ్ని పర్వతం కావచ్చు ఆయుధం కావచ్చు
6. అశాంతిలో శాంతి స్పందన లేని మూర్తుల మధ్య స్తంభాలతో బ్రతుకుతున్నట్లుంటుంది ఎంతటి దరిద్ర ఖండంలోను ఎక్కడో విత్తు నుండి పచ్చని జీవితం వస్తుంది నవ్వుతుంది, ఎదుగుతుంది, పవన కథా వచనాలకు పరవశిస్తుంది ఎంతటి అశాంతిలోను ఎక్కడో శాంతి చివురించడం సహజం క్రీస్తు శరీరంపై నెత్తురు చారలు, చివర కంతటా ప్రేమ సుమాలే విరిసాయి సామాజిక జీవి మనిషి ! అవసరాల స్పందనలో భౌతిక శక్తులతో గడిపేను. భౌతిక శక్తుల ఘర్షణలో అలసిపోయి అభౌతిక శక్తులపై ఆశలు అల్లేను.
7. శాంతికళతో వజ్ర దేహాలతో మెలి తిరిగిన కండలతో ముష్టి ఘాత ప్రతి ఘాతాలతో మొదలైన యుద్ధం ఆయుధ భేదాలతో వ్యూహ నిర్మాణాలతో యంత్ర శక్తిని పొందింది రాజనీతి వెలసింది. మల్లె మొగ్గ వలె జన్మించిన మనిషి అగ్ని శిఖయై బ్రతికేను రేపటి యుద్ధం కోసం ఈనాడు సౌభాగ్యం పదలుకునేందుకూ సిద్దమయ్యేను యుద్ధం ముగిసిందో లేదో మనిషి ముఖ ఫలకంపై శాంతికళతో ఉపనిషన్మంత్రమో ధర్మచక్రమో శిలువో చంద్రవంకో ప్రతిఫలిస్తుంది
8. కొత్త పథం ఉక్కు రెక్కలతో ఎగిరే విహంగాలు కోటపై రాతి పాగాను ధ్వంసం చేసేను, ఉక్కు పాదాలతో వాలి, స్వేచ్ఛా విహంగాలు శిలా బాహువుల్ని ధ్వంసం చేసేను. యుగ మహా గ్రంథంలో కొత్త అధ్యాయం కొత్త పథంలో మొదలౌతుంది. చరిత్ర ఏ రోజు కొత్త రూపం పొందుతుంది, పతాక శీర్షిక మారుతుంది పాత పుటలు స్మృతిలో మిగిలి, పరిశోధన కవసరమౌతాయి.
చల్లారిన అగ్నుల వలె పాత తరం మాసిపోతుంది. సమిధల వలెకొత్త తరం సవన వేదిన లంకరిస్తుంద. ఏనుగు అంబారీ సరదా హొయలుతో, హయ రింఖా లయ గతితో కత్తుల తళతళతోశేషించిన రాజరికంలో కిరీట మొకటే తక్కవ ! ఎవరెవరినో ఉరి తీయడానికో మసి చేయడానికో కసి తీరడానికో సమాజ మెన్నటికీ ప్రభుత్వాన్ని ఎన్నుకోదు, కోరదు, చరిత్రలో స్వర్ణమో లోహమో దేనిచే నిర్మితమైనా శృంఖల, స్వేచ్ఛను బంధించేదే వ్యక్తిలో స్వతంత్ర ప్రపంచం, దేనికి కట్టుబడని అంతరాత్మ రూపం స్నేహంతో శాంతీ, వైరంతో యుద్ధం, రాజనీతిని మలచాయి పిడికిట్లో సంకల్పం చరిత్ర కనేక ముఖాల్ని ఇచ్చింది బాధలతో బీటలు వారి సమాజం మహాత్ముల కరుణతో అర్థమైంది సృజన శక్తి కవకాశంతో మానవ ప్రేమ సుమాలంకృతమైంది కళా విజ్ఞాన కాంతి ప్రతిఫలనంతో సమాజం సంస్కృతీ సముజ్వలమైంది నిన్నటి యుద్ధంలో గాయాలు వీరాభిమాన దీపాలై వెలిగాయి పెదవులపై స్మిత కళికతో శాప శిఖతో, కళ్ళలో సరస్సుతో సముద్రంతో ఫాలంపై రక్తితో రోచితో హృదిలో భక్తితో కలిసి కాలం కావ్యాన్ని సృజిస్తూంది ఐదో సర్గ
మ్యూజియం లోకి
1. కార్నివాల్లో ఈ కార్నివల్లో నేనే స్థానంలో ఉందీ నా కన్నా చూచే వాళ్ళకే బాగా తెలుసు ఎప్పుడే మలుపు తిరిగేదీ తెలీదు, ఎపుడే కోరిక వెలిగేదీ తెలీదు ఇప్పు డెవరి బుజాలపైనో కాదు, తన కాళ్ళ పైనే మనిషి ప్రయాణించేను చుట్టూ అలలూ దూరాన మబ్బులూ, చుట్టూ మనుషుల చలనం వర్తనతో కదలే బ్రషో ఏర్పడే వాటర్ కలర్ చిత్రం వలె దృశ్యం కొత్తగా ఉంది. కాలంలో మార్పుతో చూచే కళ్ళ ముందు అలజడిలో ధూళి పొర, దూర దూరం కదలుతూ ఎగసే పారాషూట్ వలె ఎగసి పోతూంది ఆటవిక సమూహాల ఆర్భాటాలతో, ఆధునిక సమాజాల ఆవేశాలతో మానవ సంబంధాలతో మానసిక బింబాలతో ఈ సమయం ప్రపంచం బహు వస్తు విశేషాలతో మనస్సులో తెరచిన మ్యూజియంను తలపిస్తూంది
అన్నట్లు ప్రస్తుతానికి వస్తే మ్యూజియం ఎదురుగా నాలుగు వైపుల నుండీ కదలే ఉత్సాహ జన గణ శ్రేణులతో స్క్వేర్ కోలాహాలంగా ఉంది వివిధ స్థాయిల్లో గళ రవాలు ఖండ మిశ్ర లయల్లో అడుగులు సహ జీవన శక్తులతో సంక్లిష్టమై అవని బరువుగా ఊపిరి తీసుకుంటూంది. జనంలో నుండి ఒరసుకొని ఆహారంకై ఆవు కదలుతూంది. ఎవరూ దండనకు సిద్ధంగా లేరు, మెల్లగా ప్రక్కకు తప్పుకుంటున్నారు.' బస్ స్టాండ్ వద్ద శిశువుతో మాతృ హృదయం మాట్లాడుతూంది. శబ్ద చిత్రాలతో బయటి ప్రపంచం, నిశ్శబ్ద చిత్రాలతో మనః ప్రపంచం! ఒక్కొక్కవైపు నుండి ఒక్కొక్క విధంగా భద్ర పరచిన వస్తు సముదాయంతో అమర్చిన మ్యూజియం, కొత్త ప్రపంచమై ఆకర్షిస్తూంది. ఆటవికం నుండి నాగరికం దాక మూల మూలల నుండి చేర్చిన వస్తువులు సమాజ గతిలో పలు మానవ సంబంధాల సమాహార రూపంగా ఉంది వెలుగులో ఊగుతూ చీకటిలో తేలుతూ ప్రతి వస్తువులో మానవ చిహ్నం అద్దాల అల్మరాలో గోడలపై బల్లలపై వరసగా తీర్చిన వస్తువులు మట్టివీ గాజువీ దారు లోహ నిర్మితాలూ, శ్రమ చరిత్ర కళా కృతులు నిశ్శబ్ద నేత్రాల్లో దాగిన కోర్కెలు అలలుగా బింబిస్తాయి సీమల్లేని సాగరంలో పయనించే జీవితంలో సజీవ కల్పన ఉంది. ఎవరికి వారు కొత్త అయినా ఈ మ్యూజియంలోకి వచ్చే సరికి యుగాల మానవ చరిత్ర సంబంధంతో ఎంతో పరిచయంగా ఉంటారు ఒక్కొక్క వస్తువు విశేష కదా రూపం ఉన్న అవకాశాన్ని అలంకరిస్తూంది. భౌతిక మానస స్థాయిల్లో శ్రేణులుగా చారిత్రకు చిహ్నాలతో జీవితంలో పొందే అనుభవాల వస్తుమయమై, ప్రతి వ్యక్తిలో ఒక్కొక్క మ్యూజియం ఉంది, భద్రంగా.
2. మేల్కొల్పబడిన చరిత్రలో రోజు నుండి రోజు వలె ద్వారం తరువాత ద్వారం వస్తుంది సమయానికి తలుపులు తెరచి ఆగంతుకుల్ని ఆహ్వానిస్తుంది. శిశువు వలె ఆనంద కళా కరాలు చాస్తుంది ! తెలీని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఎన్ని గడచినా ద్వారాలకు సమాప్తి లేనట్లుంటుంది. ఎంత చూచినా ఇంకా మిగిలే ఉన్నట్లుంటుంది. మ్యూజియంలో ప్రతి వస్తువూ వెలుగునే ప్రసరిస్తుంది.
మనస్సును చేతనతో ఆనంద కళాకృతిగా మారుస్తుంది. ఒక వస్తువులో వెలుగు స్వేచ్ఛా వర్తనమేకానీ బంధించే మాల కాదు ఒక వస్తువులో చీకటీ పచ్చ తోరణమే కాని భయ పెట్టే పార్శ్యం కాదు. హృదయంలో దాగిన లోతుతో మౌన ముద్రతో గంభీరమైన హాల్ అణగిన తరంగ సమూహంతో వర్తమానం నుండి గతానికి నడిపిస్తుంది. ఎక్కడెక్కడో బొమ్మల వలె ఎప్పుడెప్పుడో జారి పోయిన మనుషులు ఎప్పటికో దారిలో కన్పించి ఎదుట నిలిచి మాట్లాడుతూన్నట్లుంటుంది. స్వజీవితంలో బయలు దేరి పర జీవితాల్లోకి ప్రవేశించినట్లుంది ఈ ప్రదర్శనశాల దేనికీ పరిమితం కాదు, దేనై నా చుట్టి వస్తుంది ఏ వస్తువునైనా హృదయంలో బహు సుందరంగా ఇముడ్చు కుంటుంది. తనలో భద్రపరచుకొనీ మనిషిలో శక్తిని గుర్తు చేస్తుంది. ఇక్కడ విన్నదీ కన్నదీ ఆలోచనలో అల్లుకొని పోయిందీ, ఊపిరిలో ఇవతళించిందీ అన్నీ మనిషి అస్తిత్వ నిర్మాణ రూపాలే, ఏ వస్తువు సమీపించినా వివిధ ముఖాలతో నడచే యుగాలతో వర్తమానం నుండి గతంలోకీ గతం నుండి వర్తమానం లోకీ యాతాయాత దృశ్య రూపమే నిలుస్తుంది అంతరంగాన్ని స్పృశిస్తుంది. మ్యూజియం వెళ్ళే దారిలో ఒకటి రెండు గాయాలతో ఇతిహాసంలో స్థానంకై చేతిలో “వీరమణి” “యోధాగ్రణి” పతకాలతో తిరిగేవారూ కన్పిస్తారు. తాము పోవలసిన చోటికి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు. తమకు కావలసిన స్వప్నాన్ని కళ్ళు తెరచి మరీ పొందుతారు. ఈ మ్యూజియం సమయ సమయం వేసిన రేఖలతో సమాప్తం కాని వర్ణ చిత్రం కాలం చెల్లిన నాణాలకు భద్రమైన నిలయం, సమాజంలో భాగమైంది. చరిత్ర బంధంతో అవసరాల సంబంధంతో విలువ తరగని ఆదర్శం, విపణి వీధిలో నిలిపితే నిత్మావసర వస్తువు లభించదు. దీన్ని కరగించి కొత్త రూప మిస్తే చరిత్ర సహించదు సమాజం క్షమించదు. ఏ సాధనంతో ఉన్నతినీ అభినవ స్థితినీ అందుకుటుందో దాన్ని ప్రతిదీ అవలీలగా వదలిపోతుంది. కాల గర్భంలో కలసిపోయిన వెన్నో ? మిగిలింది ఏ ఒకటో ఆరో! కలసి వస్తే ఏ మ్యూజియంలోనో అలంకృతం కావచ్చు. మ్యూజియం పేరుతో మనిషి చరిత్ర మేల్కొల్పబడుతుంది మనోదర్పణంలో వురా రూపాలు బింబిస్తూ పోతాయి హృదయం సంస్కృతీ గంధంతో పరమిళిస్తుంది ఆలోచన చరిత్ర రెక్కలపై కల్పనలో విహరిస్తుంది. వర్తమాన శిఖరం నుండి గతాన్ని అంతరంగం వీక్షిస్తుంది
గతం లోతుల్లోని జీవితాన్ని గుర్తిస్తుంది. చరిత్రగతిలో పురా గాథల ముద్రలతో జీవన బింబ సమూహంతో ప్రతి వ్యక్తి మనస్సులో ఉంది ఏదో ఒక సంచార మ్యూజియం ! దుఃఖం నుండి అశాంతి నుండి ఆనంద స్పర్శతో, మ్యూజియంలో క్షణాలు కదలుతాయి, వెలుగుతాయి, ఎగురుతాయి కాలాన్ని మరిపిస్తాయి. బయటి మ్యూజియంలో వస్తువుల్ని చూస్తూ వాటిని భద్రపరచుకొనీ మనిషి మనిషికి మనస్సులో ప్రత్యేక రూపంతో మరో మ్యూజియం ఉంది ఇది వ్యక్తిలో అనుబంధం పెంచుతుంది, సమాజంతో సంబంధం కాపాడుతుంది. ప్రవాహం వలె చరిత్ర కణ కణం సంస్కృతితో మహితం చేస్తుంది అవనీ ఫాలాన్ని చుంబిస్తుంది, అల అలలో కోరిక జ్వలిస్తూ పోతుంది దీని తీరాన మ్యూజియం, వెలుగు వంటి ఆదర్శంలో బింబిస్తూంది ఇదో అమూల్యమైన సంగ్రహ రత్నాకరం మనిషిలో కళకూ కీర్తికీ యుక్తికీ శ్రమ జీవన నక్షత్రాల గగనం మ్యూజియం మెట్లు దిగుతూండగానే వాస్తవ చరణాలపై అభిమానంతో మ్యూజియాన్ని మరపిస్తుంది సమాజం. ఆరో సర్గ
అభియానం జనంలో వ్యక్తి గళం స్వరమై అలయై వ్యక్తిలో జన రవం ధునియై కథయై ఒకదాని బంధంతో మరొకటి ఒకదాని భూమికతో మరొకటి
1. ప్రగతి ముఖంతో అభియానాని కస్తిత్వ బిందువులై కదలుతాయి. మనిషితో మట్టిలో తలెత్తే సువర్ణపుష్పం, సమాజానికంకిత మవుతుంది శ్రమ సంస్కృతీ ప్రవాహశక్తి మట్టినుండి వాస్తవాన్ని ఆవిష్కరిస్తుంది. మనస్సు రాత్రి విశ్రాంతి తీసుకుంటుంది, ఉదయానికి శక్తి పుంజుకుంటుంది నభస్సు రాత్రి చంద్రుణ్ణి ప్రసాదిస్తుంది, పగలు సూర్యుణ్ణి అవతరింపజేస్తుంది. గోడల్ని భేదించే తెరల్ని చీల్చే చీకట్లను తరిమే చైతన్యసాధనంతో యుగాల సింహాసనా లొరిగాయి, తరాల కిరీటాలు దొర్లాయి
మేఘ సందేహంతో మనో గగనం తహతహలాడుతుంది ప్రొద్దున మంచు కన్నీటితో కాస్త దాహం తీర్చుకుంటుంది. ఇంతలో నిశ్శబ్ద యవనికపై శబ్దచిత్రాలు బాంబు విస్ఫోటనంలో ఛిన్నాభిన్నమౌతున్నాయి ముఖంలో ఎర్రని పక్షితో కళ్ళలో మాసిన వెన్నెలతో ఆశా స్తంభాలపై సామాన్యుని కథా శిల్పం కన్పిస్తుంది. స్వర్గంలో దేవతల చుట్టూ తిరిగే మనుషుల్లో జీవితంలో నిజం గురించి ఆలోచన మొదలు జీవిత పటంపై శూన్యస్థానాల్ని చిత్రరేఖలు దిద్దుతూ ఎందరో మహానుభావులు సంపూర్ణతకై ప్రయత్నిస్తూనే ఉన్నారు. అహంభావ జీవితంలో మానవుని తొలి ఆయుధం భయం నుండి రక్షణకై పదును తీర్చిన శిలాఖండం శక్తి ప్రదర్శనలో శిఖరమైంది, అణ్వస్త్రం ఈనాటి మహా సాధనం. భూమిపై అనుబంధంతో, క్రియపై విశ్వాసంతో విభిన్న శక్తుల సంఘర్షణ సమన్వయంతో పోయిన కొద్దీ సమాప్తి లేని ప్రగతిపథం, ధనం కీర్తి సంపద సౌభాగ్యం ఆలోచన అన్వేషణతో జీవితం, హాసం ఆనందం విషాదం శోకం అభ్యర్థన ప్రార్ధనతో ముఖాలు మారతాయి.' అర్థరాత్రి నిష్క్రమణంతో బుద్ధుని హృదయం
2. ఆత్మగంధంతో విసరే రాళ్ళ వర్షంలో క్రీస్తు హర్షిత్ఫుల్ల వదనం శాంతిశిఖను గుండెలో మూటకట్టిన మహాత్ముని అమృతరూపం ఇంకెవరిలో ఈ ఆత్మగంధమంటే? పాపమెరుగని పసిపాప హృదిలో కళంకమెరుగని ప్రేమలో! మచ్చలేని త్యాగంలో! వేదనలో అగ్ని కీర్తినీ, ఊర్పులో గ్రీష్మవీచినీ బాధలో నిశా ముఖాన్నీ దివ్యకాంతి తొలగిస్తుంది మనిషి మనిషి బంధంతో అల అలయై మానవతా రాగం నీడల్ని హ్లాదమయం చేస్తుంది, రేఖల్ని చిత్రంగా తీరుస్తుంది అనుభవ చుంబితమై మనిషిలో అపూర్వ వ్యక్తిత్వం సత్త్వకాంతితో ఉదయిస్తుంది రజోదీప్తితో విస్తరిస్తుంది తమస్సులో లయిస్తుంది. ఏ బొమ్మ గీసినా దానిలో మరో మనిషి అంశ ఉంటుంది
శరీరమే రంగు మట్టితో రూపమేర్పడినా ఆధారం భూమి సంపదే. లో లోపల అగ్ని లేంది! శరీరాని కస్తిత్వం లేదు రోజు అభినవంగా ఉదయిస్తుంది, గాయాలతో అదృశ్యమవుతుంది భయాన్ని దూరం చేసే, ధైర్యాన్ని జ్వలితం చేసే పరపీడన తొలగించే, అభియానం అవసరమవుతుంది. ఏది భయం? ఏది రణం? ఏది శాసనం? ఏది బంధనం? జనహితానికి భిన్నమైందీ, మానవాత్మకు రోధమైందీ. ఆకలి కన్నా ఆకాశం మహనీయం కాదు క్రోధం కన్నా అనలం మహోగ్రం కాదు
3. ప్రయాణంలో సహనం కన్నా అవని సుదృఢం కాదు, కరుణకన్నా జలం ఆర్ద్రం కాదు స్వేచ్ఛకన్నా గాలి వేగం కాదు, మనిషిని మించిన ఏ రూపబింబం లేదు. ప్రయాణంలో ఒకరితో మరొకరు మాట్లాడితేగాని తెలీదు పది అడుగులు నడిస్తేగాని తెలీదు, ఒకరి తత్త్వం మరొకరికి.
4. ఏకాంతం నుండి ప్రజలోకి రాజ్యంతో అధికారం, మతంతో పరలోకం, చరిత్రలో ప్రశస్తితో వివిధ క్షేత్ర పంక్తులొకటొకటీ జీవితంలో ప్రవేశించాయి. వర్ణం మతం కుటుంబం జాతి దేశం బలమై కవచమై ఆయుధమై ఆకర్షణతో వివిధ శక్తులకు స్థావరమై సంస్కృతికి రంగాలైనాయి. భౌతిక మానస చరణాలతో వివిధ దశల్లో సమాజం క్రింది నుండి పై స్థాయి వరకెన్నో విషమ గతులకు గురైంది. దాస్యాన్నీ పీడననూ నిరసించే తొలగించే స్వేచ్ఛా స్ఫులింగం వ్యక్తి నుండి సమాజంలో స్వాతంత్య్ర శక్తిని వెలిగించింది త్యాగం దయ నుండి ఒలికిన హిమ కిరణం ఘర్షణలో గాయాలతో మండే శరీరాన్ని అమృతాయమానం చేసింది. ఎగుడు దిగుళ్ళను సరిచేసే సంరంభంలో చీకట్లను మాపే ఆరాటంలో హింస నుండి శాంతి దాకా ఎవరి సంకల్పం వారిది ఎవరి ఆయుధం వారిది. శరీరం దాటి చివర కాత్మ ఒకటే అయినా శరీర మున్నంత వరకూ ఎవరి పాత్ర వారిదే! ఏ పాత్ర లేకపోయినా నాటక మసంపూర్ణమే.
నిశ్శబ్దం నుండి శబ్దం లోకి ఏకాంతం నుండి ప్రజలోకి జీవితం కదలుతుంది. ఆలోచన సంస్కారంతో, కన్నీరూ అగ్నిశిఖలతో, తరం నుండి తరం కొత్త శక్తితో, అతి నవ్యసమాజం కోరుతుంది, కొత్తయుగం నిర్మిస్తుంది.
5. ప్రేమకు అంతా ఒకటే అంకెకు చేరిన మరో అంకె వలె మనిషితో మనిషి అనుబంధం అనుభవ గతిని పెంచుతుంది సమాజ శక్తిని నిలుపుతుంది. శ్వాస వెంట శ్వాసతో పదం వెంట పదంతో ఆరోహణ వెనక్కి చూడదు అడుగు జాడ కన్పిస్తే చాలు దాని లక్ష్యం ఊహలో మెదలుతుంది ఏ విజ్ఞానాన్వేషణో ఏ తత్త్వావలోకనో మనస్సుకు వెలుగునిస్తుంది మృత్యుంజయ భావనతో ముందుకు వెళ్ళే కోరిక మొదలవుతుంది. నాల్గు దారులు కలిసే చోట అరణ్య కిరీటం సింహ వదనం వలె రెడ్ లైట్ అరణ్యసుమహృదయం హరిణరూపం వలె గ్రీన్ లైట్. భయం నుండి ద్వేషం నుండి మనస్సును ముక్తం చేస్తూ జనపదం మధ్యలో సమాజ నిర్మాత విగ్రహం! త్యాగానికి చిహ్నం. కొరకంచు వలె తిరుగుతూ ఎదురయ్యే విషమ స్థితిలో పగలు బయట బయట కాలుతుంది, రాత్రి లోలోపల మండుతుంది. కిటికీలతో సహా మూయబడి మౌనముద్ర వీడని ఇళ్ళముందు భయభయంలో కొత్తవార్త చెవి నేసేందుకు గాలి తారుడుతూంది. ఇసుకలో కూరుకున్న పాదాలతో చీకటిలో చిక్కుకున్న శరీరాలతో అక్కడక్కడా ఇప్పట్లో బయట పడలేని శిథిల భావ రూపాలు! బీటలు వారిన ముఖాలతో ఎండిన లోతు కళ్ళతో ప్రతిమలు ఏ శిలా మ్యూజియంలోకో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి! కనిపించని వినిపించని కదలికతో మంచు వలె బిగిసిన క్షణాలపై ఖంజరైన అడుగులతో, బ్లేడ్ అంచు మెరసే వ్రేళ్ళ గోళ్ళతో ఆయుధంపై విశ్వాసంతో నీడ జారిన అగ్ని ముఖాలతో తిరిగేరు కళ్ళనుండి రాలే బిందువులకు కుల మెక్కడిది? మతమెక్కడిది? ముఖంలో తోచే చిత్ర దృశ్యాలకు జాతి ఎక్కడిది? దేశ మెక్కడిది? గాయాల మంటలు శత్రువుకీ మిత్రునికీ ఒకటే, మానవప్రేమ కంతా ఒకటే. వివిధోద్యమ రూపాలు హక్కులతో పతాకల రెపరెపతో భగ్గున ఎగసే నినాదాలతో స్వరంలో కొత్త బ్లేడ్ పదునుతో
6. వెలుగు స్పర్శతో చరిత్ర మలుపుపై దారిలో తరంగ చేతనతో కదలే అంగార వల్లులు సంకెళ్ళు వేసేందుకే కాదు ఆయుధం విమోచనకూ ఉపయుక్తం కావాలి. ఇపుడో ఆతంకం పిడికిలితో శాసనాన్ని బ్రద్దలు చేస్తూంది ప్రేమను ఒరలో దాచి కత్తిని మెరపిస్తూంది, రక్త చిత్రం వేస్తూంది జ్వలించే క్షణాలతో సమరం అనల సదృశమవుతూంది సమయం పేజీవలె పూర్తి అయి తిరగంది, గ్రంథం నడిచేదెట్లా? కళ్ళు తెరవందీ, చెవులు వినందీ ఊహ కదలందీ మనస్సు వెలగందీ జీవిత మెట్లా అన్వర్థమవుతుంది? ప్రయాణమెట్లా సాగుతుంది? వ్యక్తిలో సామాజిక తత్త్వంతో అనుబంధం సంబంధం అవసరాలతో భౌతికమై మానసమై జీవితం దశలుగా చరిత్ర గతి మారుతుంది. బానిస బంధనతో నిరంకుశ నియమంతో చేతులకీ కాళ్ళకీ వేసిన చీకటి సంకెళ్ళు వెలుగు స్ఫూర్తి స్పర్శతో చెదరి వీడి మాయమైనాయి. ఇనుప తలుపుల నోరు మూసుకొనీ, రాతి గోడల చేతులు బిగించీ జైలు నిశ్శబ్దంగా నిలిచి ఉందీ, దీని ముందు కఠిన శిలలు కాపలా.
7. ఎవరికి వారే శబ్దం సమీపించడానికి, సమయం అడుగేయడానికీ భయపడుతున్నాయి మూలపడిన వాద్య విశేషాలతో సన్నివేశం శూన్యమైన నాటకరంగం వలె ఉంది. ఇనుప సూత్రంలో బంధింపబడిన అగ్నికణాలవలె మనుషులు ఆశ లణగిన ముఖాలతో హంతకులూ దుర్మార్గులూ దొంగలూ సీసాల్లో బిగించిన తుపాను కెరటాలవలె మలచిన ఆదర్శరూపాలు. ఆశలకణగని ముఖాలతో దేశభక్తులూ తీవ్రవాదులూ మనీషులూ శాసన స్వప్నాల్లో క్రీడించే ఉన్మత్త నిరంకుశ గణం వేరే వీరికి వేరే జైలు అక్కర్లేదు, ఎవరికి వారే ఒక జైలు రూపం!
8. స్వే ్ఛ లక్ష్యంతో శరీరంలో పెరిగే అగ్నివృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి
రంగుల మంటల పూలు పూస్తుంది, శాత్రవ హింస ఫలం వేస్తుంది మానవ రక్త కణ వనంలో సింహముందీ హరిణముందీ ఒకటి ఆలోచనలో భయం తెస్తే మరొకటి హృదయంలో ప్రేమనిస్తుంది నరాల్లో రక్తంలో అగ్నితో ఆలోచన విలయరూపం వహిస్తూంది సమయం భీభత్స దృశ్యంతో అలంకృతమవుతూంది. సాహసం జ్వాలయై కదలుతూంది వివేకం నీడయై వెనకబడుతూంది భయ సంభ్రాంత స్థితిలో శాంతమో ఆయుధమో శరణ్యమవుతూంది. పొదల చాటు నుండీ కొమ్మలపై నుండి శిశు హృదయం పేరిట కత్తి విసరినా సమన్యాయం పేరిట బాంబు విసరినా, గాయాలు బాల సింహ ముఖాలౌతాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రంకై ఉద్యమమో విప్లవమో గుణమూ వేగంతో నవ సాహస చరిత్రలో జనశక్తుల గమ్యానికి చిహ్నాలు, క్రాంతికి మార్గాలు! చుట్టలుగా బిగిసిన గోడల చేతు లెక్కడి వక్కడ ముక్కలై పడిపోతాయి ఇనుప రెక్కల తలుపులు తెరవబడి స్వేచ్ఛా ధారలు బయటి వచ్చేస్తాయి స్వాతంత్య్రానందంతో శబ్దం గంధమయమై ఆప్యాయంగా సంచరిస్తుంది. అపాయ భయం వీడిన మనస్సు విశాల గగనమవుతుంది. ఇపుడు సమయం జీవన శిల్పంతో సంగీత స్పర్శతో చరిస్తుంది ప్లవిస్తుంది స్నేహ శాంతి కళికలతో మానవ చేతన సమాజానందాన్ని బింబిస్తూంది గాలికి చెదరిపోయే మేఘ సమూహం కాదు, జాతి చరిత్రమూలంతో విస్తరించిన శాఖలతో సమాజ వర్తన రూపం మనీషా మనోజ్ఞమైన సంస్కృతీ పరిణామ తేజం కొమ్మ కొమ్మకూ అవకాశంతో వేరు వేరు పరిణతాకృతులు పొందేను ఆర్ద్రతతో కళతో శాంతంతో వీరంతో రక్తితో శక్తితో వ్యక్తిత్వం ధరించేను మానవ జీవన ధారలో పరివర్తన గుణంతో జాతి, నిన్న పొందిన అర్థం వేరు నేడు పొందే అర్థం వేరు. ప్రజాస్వామ్య లక్ష్యంతో స్వేచ్ఛా సమతా న్యాయం సౌభాగ్యం కోరుతుంది. వికసించిన మనో నయనం శ్రమ దృశ్యాన్ని దర్శిస్తుంది జీవన సౌందర్యంతో బ్రతికే విశ్వ సంస్కృతీ సమాజం
9. గోడలతో కప్పు క్రిందికి వృక్షానికి మూలం వలె మానవతతో పూవుకై ఫలంకై చేతులు ప్రసరిస్తుంది. ప్రతి మతంలో సహజ శ్రేయో రూపం బ్రతికే ఉంటుంది దారిలో ఎందరివో పద చిహ్నాలొక దానిలో మరొకటి కలసిపోతాయి.
ప్రయాణమనంతమైంది, ఆలోచన నిరంతరమైంది హేతు శక్తి మార్గంతో ఆదర్శం లక్ష్యానికి సాధనమవుతుంది. సహస్ర తంత్రులపై సంగీతం వలె మనిషిలో మానవతా స్పందనం దివా కాంతి నిష్క్రమణంతో మనిషి మనిషి మధ్య రాత్రి టేబిల్పై ఐస్క్రీం కవ్వలె గగనంలో చంద్రబింబం చుక్కల వలె మనుషులు సర్వం స్వంతం చేసుకోజూచేరు. మనిషి మనిషి పయనించే లౌకికపథమొకటైనా, విశాల ప్రపంచంలో సమయ గమనం వేగం సంబంధం లక్ష్యం భిన్నభిన్నమవుతాయి. నీతి వేరు అవసరం వేరు, అర్థం చేసుకొనే రీతి వేరు ఏవైపు మనో గవాక్షం తెరిస్తే, ఆవైపే దృశ్యం కన్పిస్తుంది. సమాజంలో స్నేహధార శీర్ణమై శుష్కమై సికతా శ్రేణి మిగిలేను ఉత్సాహ లహరికై, ఆరాటం, ప్రేమ నిర్భర జలాలకై ఆవేదన సహజం పృథ్వీ హృదయ తలంపై భ్రాంతి కాంతి సీమలతో జీవ శక్తి లుప్తమైన సికతా రేణు సమూహ పంక్తులు. పైన నీలమేఘం కదులుతూన్నా క్రింద శుష్కభూమి తలంపై దాహం తీరేందుకై ఏ జలాధారానికో వెళ్ళాలిసిందే విస్తృతావనిపై ఎక్కడో సస్యరాజి! స్వప్నఖండమైతే సరిపోదు! ఆకలి తీరేందుకు ప్రాణం ఎదురుచూస్తూ ఉండాలిసిందే! ఆకాశం కప్పుగా సర్వప్రపంచ మందరికీ ఒకే నివేశన మనుకున్నా జీవన వాస్తవంలో గోడలతో నిల్చిన ఓ కప్పు క్రిందికి రావలసిందే. ఏడో సర్గ
జీవన చలనం
1. శాంతి శిల్పం ఏదో కాస్త హాయిగానే ఉన్నా మనుకుంటే అర్థరాత్రి భూకంపం కూలిపడే నిర్మాణాలు, అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవాహ ప్రసరణం ఒకటేమిటి? మనిషి చేతిలో లేని విషమ క్షణాల్లో భిన్న భిన్న దృశ్యాలు నిప్పంటుకున్న జనారణ్యం! బడబాగ్ని రేగిన జనసముద్రం తగలబడే నగరం! ఒకటొకటీ! భయం నీడలు క్రమ్ముకొన్న జీవనం '
అశాంతి ప్రమిదల్లో నిండిన రక్తబిందు సమూహంతో దీపం స్వాగతమిస్తూంది టియర్గ్యాస్ షెల్్స ధ్వనికి భయ స్థగితమై కాలం కాళ్ళు పరుగిడుతున్నాయి. నడుస్తున్న పగలు తలపై వెనుక నుండి దెబ్బ పడుతూంది విశ్రమించిన రాత్రి ఎదపై ఎదురుగా కత్తి మొన దిగుతూంది కొరడా కొసల మెరపు చూపుల్లో చుట్టబడిన ప్రాణం ఊపిరాడడం లేదు. నది నుండి సరస్సు దాకా తీరం ఎరుపు అంచులతో ఉంది ఎర్రని చిత్రాలతో జలాలు తెల్లని వెలుగుల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి ఆ కన్నీటి కన్నా ఈ రుధిర ధారే నయమనిపిస్తూంది! జీవన సమరంలో అలసి రాత్రి కాస్త విశ్రాంతితో జీవన సమరానికి తిరిగి ఉదయం సంసిద్ధమయ్యేను అనల హృదయంతో గ్రీష్మోత్సాహంతో జ్వాలయై నిల్చేను చీకటిలో వెన్నెల్లో రసఖండంకై మనిషి అన్వేషణ ఆగదు గుడిసె నుండి పేవ్మెంట్ వరకు దారిద్య్ర జటాచ్ఛటల వెనుక ప్రతి ఊహలో సుందరమైన భవిష్యత్తు పరుగెత్తే స్వర్గమృగం! భేద భావంలో శాంతి లేని మనిషి జీవితం చంద్రుడు లేని నిశాభాగం ప్రగతికీ ఆటంకానికీ ఆదర్శానికీ, అవకాశ వాదానికీ మధ్య సంఘర్షణ ఆశా గతికీ శ్రమ ఫలానికీ, న్యాయానికీ కుటిల నీతికీ మధ్య ఇనుప తెర! కన్పించీ కన్పించని విషమస్థితిలో ముందుజాగ్రత్తగా శాంతి భద్రత కేర్పాట్లు రణగతిలో సాగేను పీడితుల వ్యధాగ్నిలో చలి కాచుకునేవారూ ఉన్నారు తాడితుల వ్యధార్తితో పాట లమ్ముకొనే వారూ ఉన్నారు. సగం కాలి సగం మిగిలిన సమిధల పొగ నిశ కాయువు పోస్తూంది. వదలిన రాకెట్నుండి ధూమాగ్నిచ్ఛన్నమై క్షితిజ ముఖం అన్వేషణలో ఉంది శాంతి యుద్ధం పొలిమేరల్లో ఖాకీ దుస్తుల్లో చేతిలో మెషిన్గానో సైన్పస్్ట, ఐక్యరాజ్యసమితి అద్దాల బీరువాలో శాంతి ఒక అందమైన శిల్పం.
2. అశాంతి మధ్య అందమైన ప్రభాత పద్మ మొక్కొకపుడు అనల గుచ్ఛమవుతుంది ఎవరి క్రోధ ధారకో రేకులు మంటలై ఎవరిపై ఎగిరి పడేదీ తెలీదు అశాంతి శబ్ద తరంగాలపై సమాజం ప్లవిస్తుంది నియంత పద ఘట్టనలో సహనం ధూళి మయమవుతుంది.
నదిలో అలల్ని అగ్ని శిఖలుగా తోటలో కొమ్మల్ని ఆయుధాలుగా నాగరక స్వార్థంలో భాషా మత ప్రాంత వర్ణ కలహ చలన దృశ్యం! అలజడి భయ భీభత్స వినాశంతో మానవ గమనంలో రాజనీతి మృత్యువు విసరిన వల కాకూడదు, రాత్రి విసరిన బాంబు అవకూడదు. ఎడారి బుజాలపై ఎక్కు పెట్టిన క్షిపణులతో సమయం మృత్యు హేలకు సిద్ధమై అగ్ని పత్ర మవుతూంది వెన్నెల రాత్రి ఎడారి చల్లని కళ్ళు తెరచింది, అగ్ని కళ్ళు మూసుకున్నాయి మనిషికి తగిలిన గాయాలు పాటల ముఖాలతో శాంతి నలంకరిస్తున్నాయి.
3. బాధారవం నగరం వేల వేల చేతు లెత్తి పిలుస్తుంది వేల వేల కళ్ళతో కనిపెడుతుంది. దూరం నుండి ముని వేళ్ళపై నిలిచి ఎవరినైనా ఎప్పుడైనా ఆహ్వానిస్తుంది వేసిన దాని కన్నా వేయాలిసి ఉన్న పేయింటింగ్ కాన్వాస్ వలె ఉంది పొందిన దానికన్నా పొందాలిసి ఉన్న నవ యౌవన దశ వలె ఉంది నిర్మాణ పరిశ్రమల సంస్కారంతో క్షితిజం నాగర రూపాన్ని పొందుతూంది దారులు వేరైనా కష్టజీవి నినాదమొక్కటే హక్కులకై స్వరమొకటే దూసుకపోయే దిశలొకటే, విశ్వ పరిస్పందనలో బాధా రవమొకటే. రంగు రంగుల్లో స్వేచ్ఛగా ఎగిరే ఆలోచనా విహంగాలు సువర్ణ శలాకావృత శబ్దపంజరంలో బంధింపబడతాయి విహంగాని కొక భాషతో, పంజరానికో సీమతో గగనం ఒక మహా శబ్దకోశమవుతూంది.
4. పంజరంలో, అపుడపుడూ పంజరం తలుపు తెరచినా అలవాటుగా పక్షులు తిరిగి చేరతాయి భ్రమావరణ భ్రమణంతో విశ్వం చుట్టి వచ్చి పంజరాన్ని అలంకరిస్తాయి. చేయి చాచిన వసంత శాఖపై కోకిల ఇప్పుడు 'కీ' ఇస్తే పాడే నమోనా ఇంట్లో టేబిల్పై చేరింది, చుట్టూ ఉన్న అద్దాల్లో బింబిస్తుంది ఆకర్షిస్తుంది మార్కెట్లో దొరుకుతుంది పంజరంతో నిమిత్తం లేదు వసంతంతో పని లేదు గంజి పెట్టిన సిల్కు లాల్చిలా పెళపెళ తళతళలాడే కవిత్వానికే కాదు పాలిస్టర్ బుష్ షర్్ట కవిత్వానికీ ప్రేరణ నిస్తుంది, చప్పట్లకు దారితీస్తుంది. కొమ్మల్ని ఊపుతూ గాలులు కలల్ని పూయిస్తాయి వేషాల్ని అనుసరిస్తూ నీడలు వెలుగుల్ని మ్రింగేస్తాయి
చుట్టూ సమాజ జలాల మధ్య ద్వీపం వలె మనస్సు చుట్టూ బాధల సువ్వలపైనుండి హంసవలె స్వేచ్ఛ! వసంత శాఖపై ఇపుడు ఆటోమేటిక్ కోకిల వచ్చింది ‘కీ’ ఇచ్చే అవసరం లేకుండానే సమయానికి పాట పాడుతుంది ఉగాది సందర్భమే కాదు, తలచుకుంటే మరేదైనా సృజించవచ్చు పంజరం నుండి స్వేచ్ఛ, టేబిల్పై ఓ శాఖపై, ఇంతకన్న సంతోషమేముంది? నిశ్శబ్దాన్ని శబ్ద ప్రపంచంలో ముంచేస్తూ పైన విమానం ఎగిరే పక్షుల రెక్కల్ని తప్పుకుంటూ వెళ్ళుతూంది
5. సంక్లిష్ట వాస్తవం కొరడా కొస తగిలి గుర్రం దారిన వేగాన్నందుకుని పరుగెత్తుతూంది జట్కాలో గమ్యం చేరే తొందరలో మనుషులు కుదుపుల్ని సహిస్తున్నారు. సంకీర్ణ శబ్దాల నుండి గీతా ప్రవచనం మైక్లో వినిపిస్తూంది ఎవరి మనో భూమికను బట్టి వారి జీవితాని కన్వయం సిద్ధిస్తుంది. వినీ వినీ వీధిలో విధ్వంసక శబ్దం శ్రవణ సహంగా మారుతూంది గుడి మెట్ల వద్ద బిక్షువు ముందు విసరిన చిల్లర నాణేలు తళతళ ! అతనిలో దైవభక్తికన్నా మనిషిపై ఆశను పెంచుతూంది. దూరాన గంతేసే కప్పకై కదలే పాము సరసర! అంధ బిక్షువు చేతి నుండి జారిన కర్రచప్పుడు! దాహం వేసే గళంలో జారే మంచి నీటి గుటక! మెట్టుపై పసికూన ఆరాటంతో పాలు తాగే చిరు శబ్దం! షామియయానాలో వివాహ సంరంభంలో ప్రేక్షకులు వినే క్రికెట్ కామెంటరీ స్ఫూన్ ఫుల్ నవ్వుతో లోపలి కడుగేసే పిల్లల సరదా సందడి శ్రమిస్తూ జ్వలిస్తూ పుష్పిస్తూ పరిమళిస్తూ వర్తమానం కదలిపోతూంది ఈ సంక్లిష్ట శబ్ద ప్రపంచం, చలన కలన జీవితానికి బింబం
6. ఆర్తిలో ఆశవలె వెలిగీ వెలగని దీప స్తంబాల క్రింద చిరు నవ్వుల చాంద్రీ కళలు ! అశాంతి హృదయానికి రాత్రి వేళ శాంతి నిచ్చే శృంగార శిఖలు ! రాత్రి పోగోట్టుకున్న మానవతా వజ్రాన్ని ఉదయం వెదికే అడుగు జాడలు
ఏ చక్రం క్రిందనో నలిగిపోవచ్చు, ఏ ధూళిలోనో కలిసి పోవచ్చు! గతం మతం నయన గుహల్లో నుండి అసహనం హింస ! అనలమై సర్పమై ఆయుధమై మృత్యువై సమీపిస్తున్నాయి అనలంలో అరుణోదయం చూస్తూ ఆయుధం లక్ష్యానికి సాధన మవుతుంది పూల రెక్కల్లో మారణమై దాగి మృత్యువు రానే వస్తుంది అందంగా రహస్యంగా హృదయంపై స్వర్ణ ఛురికయై మృత్యువు రానే వస్తుందే దో ధునిలో నిదురలో ఈనాటి విషాదోన్మత్తకర స్థితిలో సామాన్యులు కోరేదీ జీవన సుగమం ప్రేమ కరుణ హృదిలో విప్పారిన రెక్కలతో మానవతా మృదు తేజం రాజకీయ చదరంగం ఆట వేటలో గళ్ళుగా మారే లిప్త లిప్తపై వెనుక నున్న గుప్పిలి వీడిన వేళ్ళు ముందుకు వచ్చి పావులు కదలిస్తాయి అనల సుమం వలె వికసించిన సంకల్పంతో స్వేచ్ఛకై అణువణువూ పోరాడే తేజంతో మానవ సంస్కృతి ఇంకా ఆర్తిలో ఆశ వలె నిలిచే ఉంది. గతం బుజాలపై నుండి స్వేచ్ఛగా మతాల గారడి మాటల్లో నుండి సత్యమై భయం వీడి జన హృదయం నిలుస్తుంది అఖండమై ప్రజాస్వామ్య విజయమై'
7. మానవత కన్పిస్తేనే నిశీథి శిథిలాల నుండి ఊపిరితో ఉదయం వునర్నవ శక్తికి సంకేతం చెట్లపై పక్షులు లేవక ముందే ఆశల్లో ప్రాణులు దగ్ధం కాకూడదు ఆశయం నీటిలో జారిన మూట అయితే ఆలోచన రెక్కలు మొలిచిన జ్వాల అయితే ఇక మిగిలే దేముంది ? శూన్య శిథిల ప్రపపంచం తప్ప ! కాలి క్రింద నలిగిన చీకటి ధూళి నుండి ఉదయం వెలుగుతో మనిషి కదలివస్తే ఆనందం, మానవత కన్పిస్తేనే అందం, జీవితంలో.
8. ప్రగతికి సమాప్తి లేదు గ్రీన్ సిగ్నలైపై ఆశతో ఉన్న ప్రయాణికులతో స్టేషన్ రైలుకై ఎదురు చూస్తూంది ఈ సమయం ప్రయాణికుల ముఖం ప్రవాహంకై ఎదురు చూచే భూమి సమం కాసేపు సహనం ! కాసేపు చిరాకు ! ఏది ఎప్పుడు మారేదీ తెలీకుండా ఆశ్చర్యంలో ముంచి తీస్తూ సమయం వర్ణరేఖలు మారుస్తుంది
జీవితంలో భాగమైన ప్రకృతిని, మరవడానికి వీల్లేని ఆనుబంధాన్నీ ప్లాట్ ఫార్్మ చివర పెరిగిన చెట్టు జ్ఞాపకం చేస్తూంది ప్లాట్ ఫార్మపై నుండి చూస్తే ఫ్యాక్టరీ గొట్టాల నుండి పైకి లేచే ధూమ పంక్తి, సూర్య బింబం వైపు మెల్లగా కదలుతూంది సూర్యునికీ భూమికీ మధ్య రక్షణ కవచాన్ని ఒలిచేస్తూంది ప్రాణికి మృత్యు రూపమై సుదీర్ఘమైన ఆయుశ్శాఖల్ని కత్తిరిస్తూంది విద్యుత్తు అనగానే షాక్ కన్నా చీకటిలో వెలుగు చూపే ల్బూ స్తంభించిన గాలిని కదిలించే యంత్రం గమ్యం చేర్చే అభినవ వాహనం మానవ విజ్ఞాన శక్తికి చిహ్నాలై మనః పటలంపై బింబిస్తాయి. శ్రమ శక్తిని గుర్తించిన ఈ యుగం శ్రామిక స్వరానికి పదును తెచ్చింది వాళ్ళ పిడికిళ్ళను ఆయుధాలుగా మార్చింది అణగిన ఆశల్లో చైతన్యం ఊదింది శిలా సమాజ రూపం చెదరింది. మూసిన ఇనుప కవాటం తెరచుకుంది విద్యు ద్యుగంలో శ్రమశక్తి కీలకమైంది, శ్రమ శబ్దం సంగీతమైంది. చరిత్రకు సామ్యవాద ప్రజాస్వామ్య సమాజ గమనం వచ్చింది ఒకే క్రాంతి యానంతో ఒకే విశ్వ చేతనతో జన శ్రేణి అభినవ రూపం వస్తు తత్త్వాన్ని కప్పిన పొరలు, రహస్య తలంపై నిల్చిన తెరలు ఆశ్చర్యం అంతరించిన అభినవ వాస్తవంతో, ఒకటొకటీ తొలగి పొయాయి చుక్కల వలె మెరుస్తూ ఉదయం వలె వెలుగుతూ నవోహలతో జీవితం భౌతిక బీజం నుండి ఉద్భవించింది, మానవతా జలంతో స్నపితమైంది ప్రకృతిలో భాగమైన సమాజ పరిణామ శిఖరం ప్రజాస్వామ్యరూపం వ్యక్తిలో చేతన నిలిపే మానవత కంతం లేదు సమాజాని కాయువు నిచ్చే ప్రగతికి సమాప్తి లేదు ఎనిమిదో సర్గ
మనోభూమి సినేరియో I చేతనలో మనస్సు మనిషికీ జగత్తుకూ భావ బంధమై నిరంతర చలనంతో పాత్రల్ని సృజిస్తుంది నిష్క్రమింపచేస్తుంది
1. భావబంధమై జలధి వలె తనలో ఎన్నిటినో దాచుకొనీ అలల వంటి ఊహలపై వహిస్తుంది జీవితాన్ని పాలించే వైయక్తిక స్పందనతో సామాజిక ప్రేరణతో
ప్రకృతిపై విజయానికాధారమైంది, సమాజ ప్రేరణకు నిలయమైంది నిద్ర నుండి నిష్క్రియ నుండి అంధీ భూత స్థితి నుండి కర్మలోకి కళలోకి మెలకువ లోకి మనస్సు రావలసిందే వెలుగై పోవలసిందే ! వెలుగవడంతో జీవితాని కందం ! మనిషి కస్తిత్వం ! సమాధిని చీల్చుకొని వస్తుంది, శిల వంటి నిజాలను కదలిస్తుంది. తీవ్రమైన తాపంలో చలిలో నిలిచే ప్రకృతిలో భాగమైన మనిషిలో సంకల్పం ప్రకృతిపై ప్రభుతకు దారితీసింది మనోభూమిపై వనం మధ్య మధ్య వేదనతో అంటుకుంటుంది ఇది ఆరేందుకే పుష్కలావర్తక మేఘ బృందమూ అక్కర లేదు ప్రేమ లహరితో ఆరుతుంది ! కన్నీటి బొట్లతో శమిస్తుంది' మనస్సు మానవీయమైంది జీవితం మాననీయమైంది
2. మాననీయమై ఎపుడో మట్టిలో శీర్ణమయ్యే అగ్నిలో దగ్ధమయ్యే శరీరమైనా శిశిరాన్ని శూన్యాన్నీ కోరదు, వసంతాన్నీ సంపూర్ణతనే కోరుతుంది భౌతిక రూపంలోనూ అణువణువుకూ అర్ద్ర మనః కాంతి అవసరం భావ గతి లోప్రతి రేఖకూ హ్లాద కళా లహరి ఇష్టం గుడిసె గురించి చింతనతో పాటు మేడపై కల్పన కూడా సహజం. ప్రేమ సరిస్తుంది విశ్వ బంధు గుణంతో, దివ్యమై.
3. రోజు ఎగసి వస్తుంది గభీర జలాలపై నావ వలె చేతనలో స్త్రీ అకృతి ! స్త్రీ శక్తి సమాకర్షరణలో ప్రేమ కథావతార లెన్నో! గుప్తమై బయటికి లోపల అనుభవకళతో దర్శనీయ మౌతుంది నిరీక్షణలో నయనాల్లో మొగ్గలు పుష్పాలై జారుతాయి బిందువుగా నిల్చిన స్థితి రమణీయ ప్రవాహ మవుతుంది బీజ భూత వ్యక్తిత్వం సౌందర్య కల్పతరు వౌతుంది సుప్త శక్తి మేల్కొని, ఉషశ్చిత్రం వెలుగుతుంది హిమ జల శుభ్రమై స్త్రీ తేజం సరిస్తుంది ఒక్కొక్క వెలుగు బిందువు ఆశా బీజమవుతుంది మానవతా సేచనతో ఫలాకృతి పొందుతుంది
రక రకాల పూలతో పండ్లతో ఒడి నిపుకొని ప్రయాణం సాగుతుంది అలంకారానికో ఆరాధనకో ప్రేమకో ఆహారానికో దేనికైతేనేం ? మనిషి కను రెప్పలపై నుండి రోజు ఎగిరిపోతుంది ఆర్ద్ర హృదయ కవాటం తడుతూ రోజు ఎగసి వస్తుంది సినేరియో - II నిద్ర నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళగానే వెలుగు పక్షి ముంజేయి పై వాలుతుంది క్షణం ఆగి క్షితిజం లోకి దూసుకపోతుంది ఆ పక్షి మాటే జ్ఞాపకముండదు జీవన వ్యాసంగంలో వ్యాపార మనస్తత్వంలో నిద్రా నిశీథి గూటి నుండి ఎగసి ఎదపై వాలి నట్లనిపిస్తుంది ముంజేయి పై నిల్చి ఎగిరి పైకి పోయి నట్లనిపిస్తోంది పక్షి మాట మరపున బడుతుంది, నిదుర ముంచుకొని వస్తుంది మనస్సు విస్మృత నికేతనం వరిస్తుంది.
1. నిద్రనుండి లేచి
2. విజల్పనం మనిషిలో చెట్టు ! పక్షుల ఆవాసం ! తనతో బ్రతుకు తూన్నట్లుంది మనసులో విగ్రహాలు ఉత్సవ రూపాలు, తనతో ఆనందిస్తున్నట్లుంటుంది రాగంతో చెట్టు తనతో పరవశిస్తుంది, పూలతో పండ్లతో శ్రమ గాత్రుల కింత నీడను ప్రసాదిస్తుంది నిరీక్షిస్తుంది! సుమ స్పర్శకోసం విగ్రహాలు నిలిచి ఉంటాయి ఫలా స్వాదం కోసం పక్షు లెదరు చూస్తాయి అలికిడి లేనపుడో నిదురపోయినపుడో పక్షులు దిగి వచ్చి విగ్రహాలపై వాలతాయి నిర్భయంగా తిరుగుతాయి ! ఎగిరిపోతాయి మనస్సులో సందేహం గమనిస్తూనే వివేకం సమాధానం చెబుతుంది చేతలు వీర కంచుకం తొడుగుతుంది, వివేకం శాంతి పాఠం స్పందిస్తుంది మానసిక స్ఫూర్తిలోనే ఉంది తృప్తి ! ఆనందం శాంతి ! లేదనుకుంటే చెట్టూ లేదు పక్షి లేదు విగ్రహాలూ లేవు ! ఉత్సవాలూ లేవు! ఏదో పరిహాస విజల్పనం తప్ప!'
ఏ మంచుతోనో ఉదయం తెల్ల ముఖం వేస్తుంది ఏ మబ్బుతోనో పగలు నీలి ముఖం వేస్తుంది గడియారంలో పెద్ద ముల్లు చిన్న ముల్లు మధ్య నుండి కాలం కాస్త విరామంగా అవలీలగా తప్పించుకుని పోతుంది కాలి సందులో నుండి దొర్లుతూ పై కెగర వేయబడుతూ ఆటలో ఫుట్ బాల్ వలె కాలం అందీ అందకుండా పోతుంది వెలుగు ఆకర్షణతో చీకటి వికర్షణతో లహరియై శిల్పమై ! బలమైన కోర్కెల సందడిలో మనుషుల మధ్య మనిషి ! కాలంపై
3. ఆశ ఫలిస్తుంది ఒకరి బాధ మరొకరిలో అల్లుకొనేను, ఒకరి కథ మరొకరిలో చిగురించేను పాత బరువు దించుకొనే యత్నంలో కొత్త బరువు నెత్తుకునేను మధ్య మధ్య బ్రిడ్్జ సంగీతంవలె ! సరి కొత్త హ్లాద రేఖ చేరుతుంది బాధా గాధల మధనంతో కధనంతో జీవన సినేరియో గృహావరణ ప్రాంగణంలో పూలపై ధూళి క్రమ్మి వచ్చే తుమ్మెద జాడలేదు ఎప్పటికపుడు జీవితంలో కోరింది లభించదు ! ఆశతో ప్రతీక్ష సహజం వాన జల్లుతో ధూళి అదృశ్యమై సర్వం శుభ్రమై ఆశ ఫలిస్తుంది
4. మనిషీ సమాజానికీ మధ్య చేతనలో సూర్య తేజం మనిషి ముఖంలో చంద్ర బింబమవుతుంది అనుకోకుండా ఏనిశా మతికో సమయానికి దారి చూపిస్తుంది భూమిపై నడుస్తూంటే ప్రతి అడుగూ స్వాధీనం చేసుకోవాలనిపిస్తుంది నదీ తీరాన నడుస్తూంటే జల మంతా ఉన్న ఘటంలో నింపుకోవాలనిపిస్తుంది అగ్నిని చూస్తే భయమే అయినా అవసరాని కెంతగానో ఆదుకుంటుంది మనిషిని చూస్తే భయం లేకపోయినా అవసరం మీరి జ్వాలా వల్మీకమయ్యేను శాంతిని నదింప చేసేందుకూ స్నేహాన్ని సరింపజేసేందుకూ భగీరథ యత్నంలో సమయ సమయ మెందరో భస్మీభూతులయ్యారు ! గ్రీష్మ తాపంతో గాలి తుపానై అలలు సముద్రం దాటతాయి సముద్ర సమీపంలో ప్రపంచమైపోతేనేం ? ఏమీ కాదనే నమ్మకం ఒక ప్రక్క ఆర్తితో మరో ప్రక్క శాంతితో బింబం సంపూర్ణ మవుతుంది వివిధ శాలా మనో మందిరం ! మనుషులతో వస్తువులతో నిండే ఉంటుంది
మనిషికి సమాజానికీ మధ్య పల్చని స్క్రీన్ వంటి మనస్సు సంకోచ వ్యాకోచ గుణంతో వివిధ దృశ్యాల్ని బింబించే సినేరియో సినేరియో - III
1. మారిన లక్ష్యం మనస్సులో నిల్చిన భయ శిఖరాలపై ధైర్య పతాక ఎగురుతూంది ఆత్మాకాశంలోకి తలెత్తి ప్రతిదీ అందుకునే ప్రయత్నం జరుగుతూంది వ్యక్తీ ప్రపంచ తీరాల మధ్య ప్రవహించే అనుభవ రూపం జీవితం ప్రాణమూ ఆత్మ శిఖరాల మధ్య నిల్చిన వంతెన ఈ శరీరం మానవతా పరిమళ తేజంతో అద్దిన మనోరూపాని కేభేదం లేదు. ప్రార్థనతో శుభ్రమై ధ్యానంతో ఉజ్వలమై వేదనతో పునీతమై ఆత్మ శక్తిచే అపూర్వమైన వ్యక్తిత్వం సమాజానికి కొత్త ముఖాన్నిస్తుంది దుఃఖం దౌర్భాగ్యం పోయేందుకు సంతోషం సౌభాగ్యం పొందేందుకు దేవతల్ని పొందిన మనస్సు సమాజ సంస్కృతిలో కొత్త అడుగు వేసింది మృత్యుం జయ లక్ష్యంతో విజ్ఞానం, శోధన మతికి పదును పెట్టింది గగనంలో జ్యోతిర్గణ సంచారంతో జాతక చక్రంలో దశాంతర్దశలకూ లిప్త లిప్త సంబంధం యోజితమైంది, కాల గమన విధి రూపం దర్శితమైంది దైవాన్ని ప్రశ్నించడంతో జిజ్ఞాన, మలుపు తిరిగింది, జీవిత లక్ష్యం మారింది.
2. మనిషి దీపమయం కాల పరిణామ పార్శ్వాల్లో అజ్ఞానం పొరలు తరిగాయి మౌఢ్య భీతి విరిగిపోయింది, అవివేకం తెరలుజారాయి. యుగ యుగానికి విజ్ఞానం విజయ శిఖరాల్ని అందుకున్నా భౌతిక శక్తికీ అతీత శక్తికీ మధ్య రహస్యం మిగిలే ఉంది సౌభాగ్య తలాలవైపు మనస్సు పురోగమిస్తుంది. చైతన్య శిఖరాల వైపు మనీష ఉన్ముఖమవుతుంది.' ఎన్ని భౌతిక శ్రేణులు దాటినా ఇంకా మిగిలే ఉంటాయి ఎత్తుల్ని అందుకునేందుకై లోతుల్ని స్పృశించేందుకై సీమల్ని దాటి పయనించేందుకై కణ కణంలో ఉత్సాహం
చీకట్లను శిల్ప శాలలుగా తీరుస్తుంది, స్నేహ ప్రమిదలుగా మారుస్తుంది. శబ్దాన్ని శబ్దం ఆలోచనతో ఆలోచన దీపాన్ని అనుసరించి దీపం ! జ్వాల నుండి వెలుగు అలయై ప్రసరిస్తుంది మనిషికి రాగాన్నిస్తుంది ప్రతి వ్యక్తిలో చేతనలో ఒక జ్వాలా రూపముంది జలధిలో అలల వలె ఇది పొందే రూపా లనేకం ! వత్తి ఆర్ద్రమై వెలిగేందుకు దీనికింత స్నేహం కావాలి స్వేచ్ఛగా ఊపిరి తీసుకునేందుకు దీని కింత అవకాశం కావాలి పెదవులపై ప్రార్థనా స్వరాల్ని, గాలి చేరవలసిన చోటుకే చేరుస్తూంది కళ్ళలో ముఖంలో మనసులో ఆలోచనలో వెలుగుతో మనిషి దీపమయం
3. ఎగిరే సీతాకోక చిలుకలవలె దృష్టి కందని సూర్య బింబం వలె మనశ్శిఖరంపై తేజం దృష్టి నిలిచే చంద్ర బింబం వలెమనస్తలంపై కాంతి మనస్సులో వెలుగు ఊహల్ని మీటుతుంది రంగుల్ని చిమ్ముతుంది ఎగిరే సీతాకోక చిలుకల వలె మనోభూమిపై వెలుగులు ముఖంలో ప్రశ్నల్ని మాయం చేస్తాయి, సంతోషంలో సమాధానాల్ని నింపుతాయి భూమి పథం నుండి మనశ్శిఖరం దాకా శ్రేణులుగా ఒకే సామాజిక చేతన మనిషి గురించి మానవతా కేంద్రమైంది, ఎప్పటికీ. వాస్తవం నుండి ఉద్భవించింది, ఆదర్శాన్ని అభిలషించిందీ అంతర్భగమై జీవితంలో స్వప్నమూ ప్రవహిస్తుంది చేతిలో తీసుకున్న మట్టి వివిధ సుమ పరాగమై భావజగత్తును ప్రదర్శిస్తుంది చేతనతో ప్రేరితమై భయం నుండి ముక్తమై భౌతిక శక్తులతో జీవితం, ప్రేమ హృదయ చుంబితమై హేతు కిరణ పరిష్కృతమై, కదలుతుంది యుగం నుండి యుగానికి మానసతేజంతో నవ మానవ సమాజం. ఒక్కొక్క నక్షత్రాన్ని అల్లుకొనీ వెలుగు పందిరౌతుంది రేపటి సౌభాగ్యంకై శిలల్లో ఈనాడు జీవన శిల్పం అవసరం ఎదురు గాలిని చీల్చుకొని దూసుకపోయే రైలు వలె నీల గగనంలో ఎత్తుకెగసి సాగే విమానం వలె నాలో శబ్ద చలన ప్రపంచంతో ఆలోచనా నవ రూపం తొమ్మిదో సర్గ
ఆత్మోనీలనం
1. కిరణమై పుష్పమై గగనం నుండి క్షితిజంలోకి క్షతిజం నుండి భూమి పైకి వెలుగు వలె భౌతిక మనో విజ్ఞాన భూమికల్లో సామాజికశక్తులతో ఆలోచన పాత్రలకు చైతన్య రూప మిస్తూ, మానవ సంస్కృతిని వికసింపజేసేను గతంలో తేజం వదలదు, మనస్సు నంటి పెట్టుకొనీ ఉంటుంది చీకటి వస్తుంది పోతుంది, మనిషిలో అడుగు జాడ నిలుపుతుంది వెలుగు వస్తుంది పోతుంది, మనసులో సృజన శక్తి పెంచుతుంది దిశ దిశలో వస్తువులో మార్పుతో ప్రకృతి తన శక్తిని ప్రకటిస్తుంది పంచ భూతాల పంచీకరణతో పంచేంద్రియాలతో కార్య కారణ భావంతో చైతన్య మూలమైన దృశ్యాదృశ్య ప్రపంచం ఆత్మ దర్శన గుణంతో మనిషికి క్రొత్త పథం చూపింది ప్రతి వస్తువూ మనిషివైపే చూస్తున్నట్లుంటుంది పరస్పరానుబంధంతో జీవితంలో భాగమై వస్తువులన్నీ సమాజం కోసం వేచి ఉన్నట్లుంటాయి ప్రతి వస్తువునూ శరీరంలో రంగవల్లికా కవోష్ణ శక్తితో హృదయాని కదుముకొనీ మనిషి సామాజిక శక్తియై రూపొందేను ప్రయాణంలో ప్రపంచం తనలో ఒకటై పోతుంది. శాంతి కోసం వెదకే గాలి తుపానై గుండెను తాకవచ్చు. విశ్రాంతి కోసం వెదకే అగ్ని, భగ్గున గుండెను మండించవచ్చు చీకట్లో వెన్నెల తీగెతో శరీరాంచలం పరీవృతం కావాలనిపిస్తుంది ఆర్తిలో అగ్ని దాహం నుండి మనస్సు విముక్తం కావాలనిపిస్తుంది సమాజం పాతదే ! మనస్సు పాతదే ! అయినా ఎప్పటికపుడు అతిధి వలె పరిచయ మున్నా లేనట్లే ప్రవర్తిస్తాయి ! ఏ రోజు కా రోజు ప్రతి ఉదయం మృదు సమయం నిద్రా జడం వీడిన చేతనతో ఎదురౌతుంది కిరణమై అంకురమై పుష్పమై జీవితాన్ని అలంకరిస్తుంది.
2. భవ్య సమాజానికి మానవ భౌతిక రూపం అంతశ్చేతన కవరోధం కాదు పరిమితమైన ఆయువుతో ఘటితమైన వస్తు గుణంతో స్థూల శరీరంలో సూక్ష్మ సూత్రమై జ్ఞాన శక్తిచే ప్రకాశ రూపమై క్రింది నుండి పై స్థాయి వరకూ జీవితాని కారోహణమే ! లక్ష్యం సంకల్పం ఆదర్శం సాధన గమ్యం ప్రతి వ్యక్తిలో భిన్నం అనుభవాన్నీ ఆలోచననూ సమాజం స్వంతం చేసుకుంటుంది భౌతిక గతిలో అస్తిత్వంతో అభౌతిక దశకై ఆవేదన దివ్యత్వంపై అభిలాష ! ప్రతి మనిషిలో పరిణామ సహజం ఎంతబలం సమార్జించినా ఎంత మేధా శక్తి సమకూడినా ప్రతి దశలోనూ మనిషి ఎక్కడిక్కడ అజ్ఞాన కళా పుష్పంగానే మిగిలేను నిద్ర నుండి మెలకువతో; పరిణత మనో వికాసమే చైతన్య తత్త్వం; సృష్టి పరిణామంలో భాగమై ఆత్మోన్నతితో జీవితం ! భవ్య సమాజానికి మార్గం శరీరం నండి మానసికానికీ, భౌతికం నుండి అభౌతికానికి అతీతం నుండి దివ్యత్వానికీ పరిణత క్రమమే ఆత్మసాధనం చేతనతో అంతరంగం అతీత శక్తిని స్పృశిస్తుంది అనుభూతి జలంపై మనస్సు సుగంధ యాన పాత్ర అవుతుంది స్వేచ్ఛా సమతా పూర్ణమైన శ్రేయో కాంతిలో పయనించడమే సత్యం సుందరం ఆనందంకై జీవిత శిల్పంలో మానవ లక్ష్యం
3. జీవిత శిల్పంలో విజ్ఞాన కిరణం కొమ్మలు వేసింది, ఆత్మోన్మీలనకు మార్గమైంది సువర్ణ పుష్పాలతో అమృత ఫలాలతో గుణ కర్మ సంకల్పాలతో ఆత్మ ప్రసారంతో మనిషిలో దివ్య శక్తి అవిష్కృతమైంది మృత్యువు శాశ్వత సత్యానికి ప్రవేశం ద్వారమైంది జన్మాంతర క్రమం అనేక ద్వారాలతో ప్రవృత్తమైంది మృత్యువు మెట్లపై ప్రయాణం వీరశాంత కీర్తితో సంపన్నమైంది పరమాణువులో కనబడని సత్యం అనుభవంలో దృశ్యం నుండి అదృశ్యానికీ, అదృశ్యం నుండి దృశ్యానికీ సరించే శక్తిలో భాగమై మనిషి భౌతిక మానస జీవన యాత్ర సాగింది. దీపం నుండి దీప సంతతితో బింబమై పూర్ణమై వ్యక్తమై
వ్యక్తి నుండి సమాజానికి రావలసిన పరిణత రూపం! సామాజిక లక్ష్యం పూర్ణం నుండి పూర్ణంలోకీ. మనో నికేతనంలో ఒక ద్వారం తరువాత మరో ద్వారం
4. పూర్ణంలోకి
5. అనుబంధంతో శరీరం అణువణువులో పృథ్వీగంధం, రక్తంలో కణకణంలో పిలిచే సముద్రం కాలం చేతిలో ఏ రోజూ ఓడిపోతూ ఆ రోజైనా గెలిచే కోరిక! ఆరోహణలో కన్నా అవరోహణలోనే వేగం ఎక్కువ! సంకల్పం పూచిన అనుభవ పుష్ప రూపం పురోగమనం! ఒక వైపునుండి మరోవైపుకు నీడ పగలంతా కదలుతుంది. వ్యక్తి మాత్రం పగలూ రాత్రీ భేదం లేకుండా అన్నివైపుల కదిలేను ఎప్పుడో అర్థరాత్రి వరదల్లో కొట్టుకపోయిన నికేతనాన్ని ప్రాణం మిగిలీ మరో చోటికి తరలీ మనస్సు ఇప్పటికీ వెదకుతుంది, ఆ అనుభవం గురించీ ఆ ఊరు గురించి ఆ ఇల్లు గురించీ అనుబంధంతో ఎందరో చుట్టూ చేరి ఏవేవో కథలు చెబుతూ పోతారు.' ఉదయం శుభ్రమైన గోడలతో నగరం మనస్సులో
6. ప్రతి మునక నుండి పాత రాతలు మరచిపోయి, కొత్త రాతల కెదురు చూస్తుంది. ఇంటి ముందు పూలకొమ్మ అనుభవ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇంటిదారి మలుపులో రాయి! ఆలోచన నంతరాయంతో నిలిపేస్తుంది నిన్న చూచిందీ నేడు చూచేదీ ఉదయ ముఖం అయినా ఒకటి కాదు వెలుగుల అల్లిక వేరు అందం వేరు, రంగుల కలయిక వేరు ఆలోచన వేరు నిన్న ఉన్నదీ నేడు ఉన్నదీ మనిషి మనో రూపం ఒకటి కాదు ఊహ వేరు అనుభవం వేరు కళ వేరు కర్మ వేరు ఫల భావం వేరు సృజన శక్తితో నాలో హవణించే కవితలోను సంగీతం లోను మనో జలాల్లో వేసే ప్రతి మునక నుండి ఒక ధ్వని వినిపిస్తుంది.
7. హంసాకృతి అగ్నిమూలం నుండి కాంతియై ఎగసిన జీవితం నిర్భయంగా వెలుగుతుంది దిక్కుల్లో ప్రభా కళలు మిగిల్చి శాంత గగనంలో లీనమవుతుంది సంపూర్ణతకై శ్రమించే వ్యక్తిలో కాంతితో అమృతమూ అవసరం మనస్వి యశస్సముద్రంలో జలాల్లో నౌక వలె స్వేచ్ఛ ననుభవించేను. శరీరం సుఖాన్ని కోరుతుంది, జీవితం సౌభాగ్యాన్ని కోరుతుంది మనస్సు గమ్యం శాంతి శిఖరం, ఆత్మ లక్ష్యం ఆనంద గగనం భౌతికం నుండి సూటిగా అతీతానికి తేజమై మెరపు దారితో శబ్దధుని నుండి ఆత్మ సరస్సు దాకా కాంతి యానంతో శాంతి మంత్రంతో అంతరంగం నుండి ఆత్మ సందేశంతో హంస కదలుతుంది. ఏ భయం నుండో దూకిన పదం కాదు ఏ ఆశ్చర్యం నుండో జారిన స్వరం కాదు దుఃఖం వేదన వెనుకనున్న ఆనందానికి సాధనమై హంసాకృతి ఆత్మదర్శనావిష్కారం! మానవ సంస్కృతీ శిఖర ఫలం! ప్రకృతి నుండి పదార్థం ప్రాణంతో జీవితంతో ప్రాణం జీవితం నుండి మనస్సు సంకల్పంతో మనస్సు సంకల్పం నుండి కర్మ కళ సాధనతో బిందువు నుండి మొదలై సంపూర్ణం వైపు గమనం,
8. శాంతి గమ్యం వివిధ శక్తి స్థానాలతో వివిధ రాగ ధారలతో స్త్రీ పురుష యోగంతో జగత్తులో సత్యమైందీ, ఆత్మ సుందరమైంది దివ్యానుభవం కలిగిందీ. శరీరంలో నిలవక తప్పని మనస్సు ముఖం దివ్య శిఖర చేతనతో ఆత్మ గగనం వైపే! చైతన్య పరిణామంలో పయనించే మానవ సంతతి అతీత చేతన దాటి దివ్య దశను పొందేను. వ్యక్తిలో దివ్యమై పరివర్తన, సమాజంలో సత్యమై ఆనందానికి సువర్ణ కవాటం తెరుస్తుంది. సౌభాగ్యానికి సకర్మ వికాసం తెస్తుంది శక్తి భరమై సమ సమాజావిష్కారం విశ్వ హృదయ స్పందనతో అతి మానస చేతనలో భూమికతో ప్రేయమై శ్రేయమై వస్తుంది
కెమెరా ఫోకస్లో,ఇది టెలిస్కోప్ దృశ్యాల ఆల్బం టెక్నికళతో స్పందమాన స్వేచ్ఛా కవితా మహాకావ్యం నిఖిల మానవ క్రాంతితేజం, మనో బింబం, శాంతి గమ్యం.
VIII. ఈ శతాబ్ది రెక్కలపై
(1993-1996) 1. జైలు కార్నర్ నుండి 2. ప్రయాణం నుండి ప్రయాణం 3. డైరి దర్పణంలో 4. ఈ శతాబ్ది రెక్కలపై సూచిక 1. నిర్బంధంలో పుట 2. జైలు గదిలో 3. సమాజ సంగ్రామంలో 4. అశాంతి ముద్రలు
5. వివిధ పథాల్లో 6. బాధా శకలాల మధ్య 7. జైల్లో ఖైదీ 8. ఖైదీ ముఖంపై 9. అనుకోని స్థితిలో 10. అపకీర్తి శాలువాతో 11. ఏవైపు నుండో ఆయుధమై 12. నిశ్శబ్ద యంత్రం వలె 13. నాగరక సమాజానికి (1993) అంకితం కారణం ఏదైనా స్వేచ్ఛ తొలగిన ఖైదీలకు మానవతా బంధంతో
1. జైలు కార్నర్ నుండి
1. నిర్బంధంలో నిర్బంధం నుండి ఏకాంతంలోకి ఏకాంతం నుండి సమాజంలోకి చరిత్రలో మనిషి ప్రయాణం స్వేచ్ఛా పథ పథంకై అన్వేషణం ఖైదీ ముఖాన తెర వెనక జీవిత రహస్య దృశ్యం సానుభూతి నయనాలకు కన్పించే వాస్తవ శిఖరం ఇక్కడ ఒక్కొక్క అవమాన క్షణం ఒదిగిన బొగ్గు కణం అధికారం మండే నిప్పుకణం శాసనం వెలిగే ఆజ్ఞాచరణం పరచిన భయంతో సముద్రం వలె నిశ్శబ్ద వాతావరణం తాళం వేసి ‘కీ’ మరచినట్లుంది, నాగజెముడు తిష్ఠ వేసినట్లుంది. ఎగిసే పక్షివలె దూకే పిడుగు వలె ఉన్నట్లుండి ఉలికిపాటు ధ్వనితో కారాగార వాతావరణం! జైలు గదిలో కిటికీ నుండి గగనంలో వెలుగు బింబం కన్పించేనా? మాల నుండి జారిన రుద్రాక్ష వలె గదిలో నిర్బంధంలో కూర్చొని నిన్నటి వరకు ఉషఃకిరణం! నేడేదో నేరానికి నిశీథినీ శిల! బైట వరండాలో శబ్దించే గోడ గడియారంతో లోన ఖైదీ గుండెతో నిర్బంధంలో కదిలే క్షణాలు పరుక్కి పోటీ పడుతున్నాయి. పుష్పం చుట్టూ తిరిగే షట్పదం గురించీ డ్యూటీలో రహస్యోద్యోగి ఆరా తీసేను అణచేసినా మాపేసినా చీకటి శిశువు వలె నేరం తలెత్తుతుంది ఖడ్గ పాదాలతోనో బాంబు హృదయంతోనో ఎదురుగా కదలివస్తుంది. రక్తసిక్తమైన ఆలోచనల్ని శుభ్రం చేసే కరుణ కరాలతో ఏ రాత్రివేళో చంద్రబింబం ఎక్కడో కాస్త బయట పడేను దీని వెనుక రాగాన్ని పెంచే ఉదయ హృదయం లేకపోలేదు ఉదయ కిరణాలకు స్పందించే మానవ హృదయమూ ఉంది.
2. జైలు గదిలో
3. సమాజ సంగా మంలో ముఖాని కెదురుగా మరో ముఖం చూపులతో చూపుల్ని కత్తిరిస్తూ పోయేను ముఖం ప్రక్కనుండి మరో ముఖం చూపులతో చూపుల్ని అల్లుకొనిపోయేను లోపల మూసిన దిక్కులు తెరుస్తూ అంతరంగ ద్వీపంలో మరో మనిషి లోపల ముడచుకొన్న రెక్కలు విప్పుతూ అంతరంగ గగనంలో మరో మనిషి, పయనంలో లక్ష్యం మరచి సముద్రంలో తీరం తప్పిన గమనంతో దీన హీన ముఖాలతో మౌన శోక భారంతో గుండెలో మండే కుంపటితో తప్త జ్వలన హృదయంతో మనిషిలో మనిషి మనిషితో మనిషి ఓడవచ్చు గెలవచ్చు సమాజ సంగ్రామంలో ఓటమి గెలుపూ ఒక్కసారితో ముగిసేవి కాదు. అశాంతి ఆర్కెస్ట్రా మధ్యలో శాంతి స్వరం వినే కోరిక తీరిక ఉంటేగా చేతితో ఆయుధమెందుకంటే? ఏది న్యాయమో? ఏది నేరమో తెలిస్తే చరిత్ర గతి వేరుగా ఉండేది! సమాజ ధుని భిన్నమై సాగేది. జైలు చుట్టూ శిలా పంక్తితో నిల్చిన నిశ్శబ్ద శిఖరం ముడేసిన నిప్పు కణాలవలె జైల్లో నిర్బంధ గణం
4. అశాంతి ముద్రలు ఏ సమయంలో నిప్పు పెట్టేనో ఏ సమయంలో గోడ కూల్చేనో పారిపోవచ్చు పట్టుబడవచ్చు! ఒకరి వర్తన మరొకరికి నమూనా కాదు. చీకటిని ఆయుధంగా పేల్చి ఉదయం సృజించాలనుకునేవారు లక్ష్యం చెదరో గమ్యం దొరక్కో కారాగారం చేరుకునేరు కన్నీటిని కార్చిచ్చుగా మార్చే మౌనాన్ని మంటలుగా చెక్కే ఖూని! రౌడి! ద్రోహి! దోషి! అశాంతి ముద్రాలంకారాలు! అశ్రువులో ఆరని దీపంతో కణకణంలో ఆరని అంగారంతో చెదరని నిశ్శబ్దంతో కట్లెట్ వలె నాలుగు గోడల మధ్య మనుషులు. పాపానల తప్తమైన హృదయ వనీ క్షేత్రంలో పుణ్య భావనా స్పర్శతో హరిత దళం కోరేరా? నివురు గప్పిన కోప శిఖలతో అణగిన అసహన బింబాలు జైలు వీరికి విశ్రాంతి నిలయమా? విడుదలై అగ్ని చిమ్ముతూ పోయేరా?
5. వివిధ పథాల్లో దరిద్రాన్ని దహించే సంకల్పంతో, తిరుగుబాటు అగ్నిపథంలో రక్తమాంసాల్ని మంటలుగా మార్చి హింసతో సద్యః ఫలం కోరే వారూ భోగి మంటల్లో ఉత్సవం తిలకిస్తూ రంగుల జ్వాలల్లో సంగీతం వినేరు సంకెళ్ళను వరించే ఆదర్శంతో, త్యాగ శిఖలకు వారసులయ్యేరు. చరిత్రలో కొత్త అధ్యాయంతో సమాజ చేతనకు పతాకలు కుమిలిపోయి కళలు తరిగి గాయపడిన రణ మనస్కులు. కళ్ళలో కదిలే పతాకతో చూపులో త్యాగ లహరితో కష్టజీవుల గెలుపుకోసం ఆర్త హృదయుల శాంతి కోసం రేపు చూచే ఉదయంపై ఆశతో మరో ప్రపంచం కల్పనతో పరచిన ప్రజ చూపుల తివాచీపై నడచే ఉద్యమ బింబాలు. జైలు నుండి విడుదలై మస్తక శిఖరంతో నడచేరా? వెళ్ళి తమ ఊరు వాలకం చూస్తే అదే ముఖం! పౌడర్ అద్దుకొనీ ఎంతటి వ్యక్తికైనా సమాజ బంధంతోనే విలువ ఏ పరిమళ పుష్పమైనా ఆ చెట్టుకొమ్మతోనే జీవితం. జైలుకు నలువైపుల ఇనుపతీగెల సీమావరణం కంటి కంటకంగా గుండెకు భయం బరువుగా
6. బాధా శలాకల మధ్య మంట లణగిన శరీరంతో అశాంతి పర్వతం వలె వాతావరణం కణకణ లాడే కొరివి వలె నాల్గు వైపుల ఒకే ఒక శాసనం పహరా కేకకు స్వప్నం కూడా ఉలిక్కిపడి అదృశ్యమౌతుంది సందుల్లో నుండి బయటపడే మినుమినుకు చూపులతో ఇక్కడ పగలు కన్నా రాత్రి ఎంతో తెలివైందనిపిస్తుంది దీర్ఘాయువు జైలు కట్టడం ఎన్ని చేదు అనుభవాలో మింగేసింది శాంతి ఎరగని భీభత్స స్వప్నాలతో ఎగరలేని స్వేచ్ఛతో జీవితం భయానికి వడి వేయబడింది, అనుశాసనానికి ముడి వేయబడింది మధ్య నుండి క్షితిజ కంఠం వివృతమై కరుణ బిందువుకై తపిస్తోంది. బాధా శలాకల మధ్య బందీయై హృదయం రెక్కలు రెపరెపలాడిస్తోంది. జైల్లో పాతేసిన ఖైది జీవితం కొత్త సృష్టికై కలగంటూంది శిక్షలో పరితాపంతో సంస్కరణ దిశలో మలుపు తెచ్చేనా పులి చర్మంపై చారల వలె నిందితుడి శరీరంపై వాతలు
నిప్పు రవ్వలు తాపినట్లు, శరీరంపై గాయాల మచ్చలు
7. జైల్లో ఖైదీ తమలో హింస తృప్తి పడేందుకు లోపల కోపం రక్తి కట్టేందుకు కొరడా లారి తుపాకి చివరకు ముష్టిఘాతం క్రోధాలంకారాల్ని అలరించేను చూచే దృష్టిపై సంశయం పల్చని పటమై కమ్ముతూంది వేసే అడుగులపై అనుమానం శృంఖలయై తగులుతూంది దోషి ముఖంలో కన్నా వెనుకనున్న నీడలో అగ్ని దాగి ఉంటుంది భటుని మనసులో కన్నా అతని ఆయుధంలో కోపం నిలిచి ఉంటుంది. ఏ కాలో చేయో బెణికో విరిగో మనసు నలిగో చెదరో దెబ్బతినో ఇనుప విగ్రహాల కిక్కడ నవ యోగం జరుగుతూన్నట్లుంటుంది క్షణాలు పూయడం లేదని విశాల కాల శాఖిని నరకలేం వ్యక్తిలో విషమ దోషానికి ఏ సమాజ రూపాన్నీ శపించలేం ఏ ఖైది ముఖంపై ఏ ఖైది అరచేతిలో ఏ దోషిఎదపై మొదటి ఉదయ కిరణం సిరీ చుక్క వేసేదీ తెలీదు మానసిక భయంతో జైలు రహస్య జీవితాన్ని పేరుస్తూంది రక్షణ పేరుతో ఆయుధం శిక్షకు సంసిద్ధమౌతూంది అయుధం మనసును నియమించ లేదు, ప్రకృతిని శాసించలేదు ఆయుధం వ్యధను పెంచుతుంది, కథకు మలుపు తేవచ్చు వర్తమానం వంతెన కింది నుండి అనుభవాల ప్రవాహ పంక్తులు వర్తమాన గగన ఖండంలో జ్ఞాపకాల విమాన శ్రేణులు !
8. ఖైదీ ముఖంపై పగలూ రాత్రి భేదం లేని జీవిత కథల రేకులతో సమయ సమయం స్మృతి పుష్పాలు ! కొత్త అనుభవ సంస్కారాలతో విశ్వాత్మ చేతనా బింబం ! మానవుడు యుగ యుగాల చరిత్రకు చిహ్నం ఈ దేశం ఆ దేశం ఏమిటి ? ఏ ప్రజ అయినా మంచీ చెడు సంకలనం హింస ! భయారణ్యానికి తెరచిన శిలా ద్వారం కరుణ ! హృదయ నికేతానికి తీసిన రస ద్వారం ఏ జెండా కీర్తి నీడ నుండో, ఏ చీకటి గుహ వీథి నుండో ఏ రెడ్ లైట్ క్రీ నీడ నుండో, నేరం వ్రేలాడే నిటల తలంతో
ఒకరి తరువాత మరో ఖైది, అనల కణం దాగిన మౌనంతో
9. అనుకోని స్థితిలో వెంటాడే పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకున్నా ప్రవహించే ఉద్యమాల నుండి నేలకు చేరిన ఓడల వలె కొందరు, మునిగిపోని సంతోషంతో కొందరు సమాజ సంస్కృతిలో వైషమ గతుల్లో బొప్పి కట్టిన పాలతలంతో ప్రతి ఖైదీ గత చరిత్ర రూపం అనుకోని స్థితి రేఖల చిత్రం ఒక్కొక్క ఖైది అడుగుల శబ్దం వేరు బరువు వేరు లయ వేరు విరామం వేరు బుజాల వెనుక పొంచిన మృత్యువుతో ధూళి పారల మధ్య నుండి వచ్చిన వారే రవి చంద్రుల దాగుడు మూతలతో ఏగగనమో ఏ చెట్టో ముఖాన ఎండిన కొమ్మలతో కన్పిస్తుంది; మనసులో దాగిన మాట మరచి శబ్దం ఆకాశం పరచుకొని వస్తుంది. ప్రతి యుగంలో యుగ ప్రభావంతో ప్రతి తరంలో తరం రాగంతో సానుభూతి నిలయమై క్రోధ దీప్తి వలయమై ఖైదీలు అంతరంగంతో పని లేని అంతర్గుణంతో పని లేని భౌతిక జీవితంలో రథం నుండి తొలగిన చక్రాలు ! జైలు గోడ కావల సంతత జల పాతం, జైలు గోడ కీవల నిలువునా ఏకాంతం, దప్పికతో ఆకాశం, ఆకలితో అవనీ, దోషంతో మనిషీ, బంధనలో ఖైదీ గ్రీష్మంలోనూ ఇసుక తిన్నెల మధ్య, నీటి పాయ వలె జీవితం సరిస్తుంది
10. అపకీర్తి శాలువాలతో అపకీర్తి శాలువా కప్పుకుని కటకటాల్లో నిల్చిన జీవితాలు మౌన స్తంభాల కెదురుగా వరండాలో మూల నిలిచిన కుండీలో పూలు ! మరచిన జీవిత సౌరభాల్ని రంగుల్ని జ్ఞాపకం చేసేను వెనుక ముందాడే వెలుగపై గాలి భయ భయంగా అడుగేస్తోంది నిన్న చేతుల్లో మొలిచిన కత్తులు ఇక్కడి కొచ్చేసరికి జారిపోయాయి మనస్సులో క్రోధం ప్రవహిస్తూంది, చేతి వ్రేళ్ళలో మంటలు పూచేను వికలమై చెదరిన స్వరాలనుకోకుండా ఒకచోట సంగమంతో కొత్త జీవిత ప్రపంచంతో ఒక చోట సమాహితమైనట్లుంది
కొండపై నిల్చిన ఒంటరి భయాన్ని తరిమే సమాజ రూపంకై సమాజం నుండి దూరమైన మనసులు బెంగపెట్టుకున్నాయి చీకటి ముఖంపై వెన్నెల కీర్తి వలె వెన్నెల హృదిపై గులాబి శాంతి వలె బుద్దుడో ! క్రీస్తో ! మహాత్ముడో ! ఖైదీ ప్రపంచానికి భవిష్యత్తు ద్వారం. ఈ ద్వారం కన్పించడమే గొప్ప విశేషం! నింగికి సరిపోని స్మృతులతో నాలుగు గోడల మధ్య ఖైదీ ఈ శిక్షలో ఉన్నంత వరకూ భిన్న స్వర సంగమం ఎట్లా ఉన్నా ప్రియమే తరువాత పక్షి వంటి గతితో ఎవరి దారి వారిదే సమాజ కథలో.
11. ఏవైపు నుండో ఆయుధమై శిశువు మనసులో ఆలోచన వలె ప్రహరీ గోడపై నుండి గాలి జైలు గది చుట్టూ తిరుగుతుంది, పరుగిడుతుంది, ఖైదీని పలకరిస్తుంది స్వేచ్ఛగా, ఇనుప ముళ్ళ తీగెలపై నుండి సుళ్ళు తిరిగి మనిషి స్వరం బయటపడి జన వనాల్లో తిరుగుతుంది, ఎద తడుతుంది ! వస్తూ పోయే మౌన జన శరీరాలతో గేటు వద్ద వాతావరణం చేతిలో ఆయుధంతో పంక్తి నుండి వేరై నిటారుగా నిల్చిన సెంటీ దూరాన బుజంపై పాత పిరంగితో జరిగిన కోట బురుజుపై నుండి ఆకాశ హృదయాన్ని హత్తుకొనీ పక్షుల శ్రేణులు నిర్భయంగా ఎగిరేను దూరాన కన్పించే కొండ ప్రక్క ప్రవాహంలో దాహంతో నీటికై దిగే మనిషి దోసిట్లో నీళ్ళు తీసుకునే లోపల ! చేతుల కనుమాన శృంఖల పడవచ్చు ఏ వైపు నుండో ఏ ఆయుధమో ప్రేలి పులో సింహమో నయమనిపించవచ్చు మారణ గుణ క్రమణంతో మనిషిలో శక్తి జ్వలిస్తుంది సృజన సమయ స్పర్శతో మనిషిలో శక్తి పుష్పిస్తుంది
12. నిశ్శబ్దయంత్రంవలె భయారణ్య హృదయంతో రహస్య గుహా నివేశనంతో నిశ్శబ్ద యంత్ర విధం ఖైదీ; నేరం ముద్ర పడిన బందీ ఆరోజు దూకే ఉషః కిరణంతో శిక్షలో ఒక రోజు తగ్గిన సంతోషం ! మూటలో రత్నంపై కోరికలా, జైలు అవతల ఉదయంపై ఆశ ! రేపటి గురించి స్వప్నం లేకపోతే, ఇక్కడి జీవితం సాయం సంధ్యాశిలే !
నిర్బంధం గడుపు ముగిసి విప్పే జైలు గేటు రెక్కల్లో నుండి ప్రవాహకరాలపై కదలే పవనం వలె, జడం నుండి రాగం వలె గాలి చేతులపై ఎగిరే విహగం వలె స్వేచ్ఛా స్వర స్పందన రూపం స్వేచ్ఛతో మనిషి సంబంధం ! ఏ రాతి గుణ బంధనతో తెగదు మట్టితో భౌతిక సంబంధం ! గాజు గదిలో నివాసంతో ఆగదు ఎంతటి స్వర్గం చేతికందినా ఎంతటి స్వర్గం అనుభవించినా మట్టిపై నడవాలిసిందే మట్టిపై ఎదగాలిసిందే, పరిమళించాలిసిందే అవని వాస్తవ శక్తికి చిహ్నం, మనస్సు ఘర్షణకు మూలం విశాలావనియై హృదయం, ఉన్నత శిఖరమై మనస్సు జైలులోను జీవితం భౌమమై దివ్యమై స్వేచ్ఛను కోరేను. ఏనాడైనా జైలు, యుగాల నాటి ఇనుప పంజరం భయ గభీర పార్శ్వ రూపం భద్ర పరచిన ప్రాచీనావశేషం పుటల కొద్దీ నేర చరిత్రను తలపించే మౌనగ్రంధం చేతిలో బిక్షా పాత్ర వలె మౌనంగా నిలిచి ఉంటుంది
13. నాగరక సమాజానికి, గుండెతో పిడుగులు దాగిన మబ్బు వలె నిశబ్దంగా నిలుస్తుంది మౌనం నిశ్శబ్దం ఇక్కడ శరీరాన్ని ఆలోచనల్నీ పాలింపజూస్తాయి నలు వైపుల గాలి కోసం ముఖాలెత్తీ వెలుగు కోసం చూపులు త్రిప్పీ గదిలో ఖైదీలు చివరకు గోడలపై బొమ్మలుగా అవతరిస్తారు చీకట్లో పడేసిన శిలల్లో ప్రాణం పల్లవిస్తుంది, రాగం గుండె నూపుతుంది ఈ ప్రాణం ఈ రాగం జడం నుండీ మృత్యువు నుండి వేరు చేస్తూంది గొలుసులు వీడిన మేఘంలో మెరుపు మనిషిలో స్వేచ్ఛను గుర్తింపజేస్తుంది సుఖం లేని సంతోషం లేని సమయం పగిలే అణువణువులో ప్రేమను పుష్పించవచ్చు, ద్వేషం రగిలించవచ్చు విరాగం ప్రవించవచ్చు ఇక్కడ చీకటి చిరంజీవి ! ఆపదలో అగ్గి పుల్ల, ఆప్త బంధువు! జైల్లో ఎవరి అనుభవం వారిదే, సొంత ఆస్తిగా మిగులుతుంది ఎప్పుడైనా సెల్ నుండి బయటి కొస్తే వెలుగులో గాలి స్తంభంపై హంస వలె ఆకాశం కన్పిస్తుంది. ఖైదీని మరపిస్తుంది, మనసును వెలిగిస్తుంది జీవితం శూన్యం కాదనిపిస్తుంది, నిశ అంతలేంది కాదనిపిస్తుంది. ఖైదీలో సంస్కరణం పరివర్తన తెచ్చే గుణం నాగరక సమాజానికి దారిచూపే సంకేతం.
(1993) అంకితం బంధుమూర్తి హితైషీ శ్రీ బొప్పరాజు లక్ష్మీకాంతరావుగారికి సూచిక పుట I ప్రయాణంలో II మానుషీయం III ఈ శతాబ్ది అంచుల్లో I. ప్రయాణంలో
3. ప్రయాణం నుండి ప్రయాణం చరిత్రలో స్వేచ్ఛకై సమాజంలో ఆరాటం సూర్యునితో ప్రయాణంకై జీవితంలో ఉత్సాహం వెలుగుకై నిరీక్షిస్తూ సూర్యునికై ప్రార్థిస్తూ ముఖాలు !
1. సూర్యునితో ప్రయాణం కొమ్మ కొమ్మన గాథా పత్రాల్లో మంచు అద్దిన బాధా పుష్పాలు దేనికీ భయపడని మానవ గుణ కర్మల సంరంభంతో ఒక దాని తరువాత మరొక రోజు వరసగా ఎగసిపోతుంది మనో వీధి ఉడ్డీనానికి రెక్కలు అవసరం లేదు ఎగిరే శక్తికి మతిలో స్థానం దొరకితే చాలు ! ఉజ్వలంగా వెలిగే సూర్యుడు సమయం తీరే సరికి విషాద కిరణ పంక్తులతో సముద్రంలో మునిగి నట్లయ్యేను చీకటి వస్తుంది, నలు వైపుల దారుల్ని మూసేస్తూ, ఆ వచ్చిన దారినే వెళ్ళేందు కెక్కడ లేని సందేహంలో మునిగేను
వెలుగు వస్తుంది, నలు వైపుల దారుల్ని తెరచి అనుకున్న సమాయాని కేదారినో అవలీలగా ఎగిరి పోయేను మనసుకు స్నేహ సుందరంగా, అంతో ఇంతో సత్యానికి దగ్గరగా ఇష్టమున్నా లేకున్నా అతిథి ఆదర్శం వలె ఎదురౌతుంది అవనిపై ఎర్రని గాయాల మంటల్ని ఏ పవమాన సూక్తులూ ఆర్పలేవు గగనాన మినుకు మినుకు చుక్కల్ని ఏ చీకటి స్పర్శ తుడిచేయలేదు జలధిపై నౌక వలె రాత్రి చంద్రుని వలె నిజం ఒంటరిగా నిలుస్తుంది కుంకుమ రేఖ లేని ముఖంతో ఏ ఉదయమూ ఎదురు కాకూడదు. ఆర్ద్ర హృదయంతో ఉదయం వచ్చిన సూర్యుడు సాయం సమయంలో అగ్ని హృదయంతో ఏ ఉరి కంబానికో ఎక్కుతూన్నట్లుంటాడు ఏ బుట్టలోనో తట్టలోనో సూర్యుణ్ణి దాచేసే ఆలోచన ! ఏ లోయలోనో సముద్రం లోనో తోసేసే పన్నాగం చరిత్రలో ఇప్పటిదా ? ఎప్పటిదో ? సృష్టి మొదలు నాటిది! వజ్రాన్ని గుర్తించే విజ్ఞాన మున్నా హంసను వేరు చేసే వివేకమున్నా మీరా వలె విషపానం చేసేందుకు అమృత సరో హృదయం కావాలి చీకటిలో ప్రయాణ మంటే ప్రేమతో సూర్యుణ్ణి అన్వేషించడం సూర్యునితో ప్రయాణ మంటే జీవించే మనస్సుతో వెలగడం చీకటి కంటకాలపై ఒరిగిన మానవతా పతంగం
2. ప్రయాణంలో పతంగం ఆశా రాగంతో గగనంలో ఎప్పటి కప్పుడెగురుతూండాలనే పతంగం ఎగరేసే కళ్ళ ముందు సూర్య కిరణం పట్టు రిబ్బన్ అవుతుంది వీటి మధ్యనుండి ఎగిరి గగనం చుంబించాలనే తహతహ ప్రతి క్షణం మరో పదం ముందుకు వేయాలనీ అనిపిస్తుంది అనుక్షణం శ్వాస వెంట శ్వాస వలె యాత్ర సాగాలనీ అనిపిస్తుంది చెట్టుకీ చెట్టుకీ తీగెకూ తీగెకూ మధ్యయాత్రలో నీలి మంటల అభినయం ! పచ్చని ముఖంలో రక్త చిత్ర గీస్తుంది, పూల రేకుల్లో విషాద రాగం తెస్తుంది చెట్టు కొమ్మకన్నా ఇప్పుడు బస్ టాప్ నయమనుకొనీ స్వరంలో హారన్ ధ్వని సాధన చేస్తూ కోకిల పయనిస్తూంది సమయంతో మారే కోలాహల ప్రపంచంలో సంగీత హృదయం లేకపోలేదు సమయం కాని సమయంలో ఏడ్పును మాన్పించే
జోల పాటతోనే ఉన్న సమయం కాస్తా సరిపోతూంది ! అశాంతి బూట్లపై నడిచే జీవితం వెనుక నుండి మార్్చ ఆన్ శబ్దం ఇనుప చక్రాలపై నడిచే జీవితం పోయినంత మేర ఏ దారిన వెళితే ఆదారిన ఇనుప పట్టాలు సిద్ధంగా ఉండవు
3. ప్రయాణ సౌందర్యం అడుగు తీసి అడుగు వేయడమే పరమ పద సోపాన మనుకునే చీకటి మతులకేం తెలుస్తుంది ! సూర్యునితో ప్రయాణ సౌందర్యం ముందు నడవాలిసిన నాయకు లేచేయి కోసమో నిరీక్షిస్తున్నారు. నేలలో కాళ్ళు పాతుకుపోయినట్లు నిలబడి దిక్కులు చూస్తున్నారు. పొంచిన నక్కలు సేవలతో సింహాల్ని అడుగు ముందుకు వేయనీయడంలేదు బయటి ప్రపంచాన్ని చూడనీయవు మరొకరిని దగ్గరికి రానీయవు ఈ సమయంలో భయా లొకటా ? కాలం చెల్లినవీ కాలం మూడినవీ అస్త్రభయం శస్త్ర భయం పక్కనున్న మనిషి భయం ! నీడ భయం ! లేకపోతే స్వయం భయం ! స్వార్ధ భయం ! పరార్ధ భయం ! భయ రేఖపై నుండి నెత్తురు బొట్లుగా ఒలికి సిగ్గుతో నేలపై పడుతూంది స్వార్ధపు ఇనుప పట్టెలో ఆత్మ వజ్రం బంధితమైంది ఒరిగిన హృదయ గగనం భూమి భుజాల్ని పట్టుకోజూస్తూంది సూర్యుడే మజిలీ వద్దనో అగి, ఏ చెట్ల చాటునో చిక్కి ఏ మబ్బు మాటునో దాగి, ఏ కోట వెనుకనో నిల్చి మనిషి చూపుకందీ అందకుండా దాగుడుమూతలాడే మాట నిజం రక్తంలో మంటల ఆలోచనతో మంటల మధ్యవేడి అనుభవాలతో అగ్ని పథం ఎదురైనా ! ఈనాటి ప్రయాణం ఆగిపోదు ! రక్త చిత్రాల నుండి ! మంటల పాటల నుండి, నిజం ! ఉదయించే అమృత బింబం ! రేపు ఎగిరే విజయ పతంగం ఈ ప్రయాణ సౌందర్య రూపం ! మానవ సంస్కృతీ చిహ్నం
4. ప్రయాణంలో సూర్యుడు బై పాస్ సర్జరి జరిగిన పేషెంట్ వలె పల్చని మంచు డ్రెస్లో ఉదయదిశ తేలే మంచు ముక్కలతో చల్లని పానీయం గ్లాసు వలె మంచు కిరణాలతో పరీతమై, తూర్పు కిటికీ నుండి సూర్యుడు !
నిన్నటి గాయాల్ని మరచి కాలం ప్రయాణానికి సిద్ధంగా ఉంది. నిప్పంటిన స్వప్న వనంతో ఉదయం కంటికి చిత్ర శాల వలె ఉంది రాత్రి వెలుగు వత్తులై కూర్చున్న వారు ఉదయం మొగ్గలై కొమ్మకెక్కేరు అందంగా ఏకాంతంగా మొదలైన రోజు పొద్దెక్కే కొద్దీ సంరంభం అందుకుంది ప్రయాణంలో ఎన్ని ప్రశ్నలకో సమాధానంగా ఆల్ ఇన్ వన్ వలె సూర్యుడు ఊహల అల్లికలో క్విజ్ దారులతో మనిషి వ్యాపార తత్త్వం హవణిస్తూంది మొనదేరిన కత్తి వాలకం నుండి జారే రహస్య ముఖంతో అడుక్కి అందని లోతు హృదిలో బాంబు దాగిన గుహతో ఈ సమయం చరిత్రకు కొత్త దశ నిచ్చే యుద్ధ పూర్వ రంగం వలె ఉంది విడిచే బాణం గురి నుండి ఎగిరి తప్పుకొని పరిగెత్తే హరిణం వలె హృదయంలో భయ లయ వేగంతో ఏ చాటు మాటుకో త్వరపడుతూంది విసరిన రాయికి దూరమై, విడిచిన శరం నుండి తప్పుకొనీ పైబడే అగ్నికి రక్షణ కవచంగా, దూసే తూటాకు జవాబుగా మనిషి ప్రాణ రక్షణకై ఉపాయ శిక్షణతో జీవితం గట్టెక్కుతూంది సమరం పయనానికి లక్ష్యం కాదు, జీవితంలో సమరం స్వల్పకాలమే ఇది దూరాన ఇంద్ర ధనుస్సు వలె తోచి, దగ్గరలో గండ్ర గొడ్డలి ఔతుంది కాలి బాట నుండి విమాన పథం దాకా యాత్రా రూపా లెన్ని మారినా మానవతా శత పత్రం వెదికే సూర్యుని హృదయం మాత్రం ఒకటే
5. మనిషిని గుర్తించే ఏ సమయమో జీవితంలో సూది మొనలపై అడుగులతో పయనం తప్పదు వాస్తవ పర్వత పంక్తులపై నుండి ఆలోచనల పావురాళ్ళ పైకెగసిపోతాయి నరాల్లో నదులు నృత్యం చేసినా రక్తంలో జ్వలదగ్ని నాట్యం చేసినా మనస్సు మనోహర వాద్య యంత్రమై మానవతా ధునికై ఎదురు చూస్తుంది సమయానికి సముచిత రాగం పలికితేనే జీవితంలో అందం ఆనందం ! ఊహ లెట్లాగైనా సాగనీ చూపు లెట్లాగైనా ఉండనీ అరచేతుల రేఖల్లో కోర్కెలు పడవల్లా తేలేను ప్రార్థనా మాత్రాన చేతుల్లో ఏ ఫలాకారమో అవతరించాలనే ! మాయ ఎక్కడో లేదు ! వెనుక నుండి పడే చీకటి ముసుగులో ఉంది ముందుకు తూగే దురాశలో ఉంది ! రాసే కలం కొనతోవాలే నీడలో ఉంది ఒక భయ సమయం సముద్రమైతే మనస్సు నావగా సిద్ధమవుతుంది. గదిలో నిశ్చల నిశ్శబ్దం గురి పెట్టిన ఆయుధం కాకూడదు
మబ్బు ఎవరిదైనా కానీ ! ఎగిరే పక్షి వశం ఆకాశం ! వర్షం మాత్ర కర్షకునిదీ ! నీరు దాహ మేసే ప్రాణిదీ ! ప్రయాణంలో సూర్యు తేజం మనిషిని గుర్తించే మనిషిదీ ఎదలో మానవతా శాఖలుగా కదలే శబ్దం చిగిర్చి కవిత్వమై పుష్పిస్తుంది
7. అధునా
1. ఏ తీరం గుహలో సింహం నిద్రించే సమయం వలె సమాజ జీవితంలో విరామచరణం గర్జించే ఆయుధ విన్యాసంతో సామాన్యుని పయనం వినీల సమయమౌతుంది నిశా బంధువై హృదయం, ఖండ ఖండమై సత్యం చిన్న భిన్నమైన వేళ శిశిరం ఆకులు రాల్చే పవనం వలె మారణ చలనంలో సమాజం బుద్దుని చంద్ర బింబ కాంతి వంటి శాంతి ముద్ర కోరుతూంది హృదిలో శైల పంక్తి మాటలాడడం ఎరగదు ! వర్షం గురించి కాదు, వసంతం గురించి కూడ నింగి వైపు శిరం ఎత్తి చూడలేని మనసు చంద్రునితో చుక్కలతో చూపు లెట్లా కలిపేను ? నేలపైన పదం మోపి నడవ లేని హృదయం వాస్తవ శక్తులతో చేతు లెట్లా కలిపేను ? నిశ్శబ్ద నిశీథి ఏకాంతం నుండి తరలి సుఖ దుఃఖాలను మరచి ఏ తీరం చేరేను ? మేఘ జలధి వంటి కాలం దివా నిశలు కదలుతూ రాగం పలకవచ్చు, ఉప్పెన శాపం విసరవచ్చు, వనధి వంటి కాలం మనిషిలో ప్రవేశించి అమృతం ఒలకవచ్చు, గరళం చిమ్మ వచ్చు
2. యాత్రలో - మనిషిలో భావం అడుగు నుండి పై కెగసి స్వప్న శిల్పం అవచ్చు, శిలా దైవం కావచ్చు బాధలతో గాధలతో తప్పదు జీవితం; హృదిలో అనలం ఆరని అనుభవం ద్వేషంతో సుందర మానవ భావం, కళ్ళ ముందు నిలువునా భస్మమవుతుంది
మానవతా బంధంలో కొత్త ప్రపంచం మనః కాంతి రాగంతో నిర్మితమవుతుంది యాత్ర కెపుడు ముందు చూపే ఉంటుంది స్మృతులకు వెనుక చూపే
3. శక్తికి సంకేతం సూర్యునికి లేని వేదన మబ్బుకు లేని దాహం మంచులో వానలోను తృప్తి లేని కోరికలో ప్లవింపజేస్తుంది మానసమో భౌతికమో కానీ రెండు కలిస్తేనే జీవితం ! రవి నిష్క్రమించాక రాత్రి చంద్రునితో పయనం తప్పదు హృదయ మున్న కాలంతో ప్రయాణం స్త్రీ ప్రేమించే జీవన యానం వంటిది. వర్తమాన గతం మధ్య ఘర్షణలో ఆశా నీహారంతో శాంతి పథం కన్పిస్తుంది నీహారం తొలగి దిశలు మేలుకొనీ సుందర భవిష్యత్తుపై కోరిక సహజం హృదయం నిరంతరం దీపమై వెలుగుతుంది పగలూ రాత్రితో భేదం లేదు హృదిలో శాంతి పుష్ప ముఖం ! గ్రీష్మంలోనూ శిశిరంలోనూ రాగం వీడదు. అనల పథంలో అరుణ ముఖం నుండి జారే బాష్ప కణంలో అభినవ మానవ చిత్రం మనసుకు కన్పిస్తుంది ! భగవంతుడు గుప్తమైన సుప్తమైన మనలో రూపం ! కథలోను కలలోను మనిషి ప్రయాణం వ్యక్తమౌ మనోరూపశక్తికి సంకేతం (4)
II. మానుషీయం
నగరం ముఖంపై చకిత చకితంగా దూర దూరం చిమ్మిన రక్త రేఖల్లో వివిధ జంతు రూపాల ఆభాసతో ఈ రోజు విధ్వంసక మారణ దృశ్యం ! శ్మశాన భూమి వంటి కోష్ఠంతో సమాధి తలంపై శూన్యంతో భయానికి తోడుగా గుండెలో మొనదేలుతుంది బాధా శిఖరం శాంతీ కాంతీ లేని కాలాన్ని సృజిస్తూ సర్వం శిశిరం చేసే యంత్రమై అడ్డులేక ప్రవహించే విద్యుత్తు వలె క్రోధ గుణంతో మనిషి మబ్బు నుండి పిడుగులా జనం మధ్య ప్రత్యక్షమయ్యేను ఒరలో దూరిన ఖడ్గంలా పొగల చాటున అదృశ్యమయ్యేను అడవిలో కొండల మధ్య తగల బెట్టిన బస్ తో పాటు
ఆక్రందించే ప్రజల గళాల్లో ఆవేదన విని ఆనందించేరా ? పొదల బుజాలపై దిష్టి బొమ్మలు, రహస్య మతిలో కెరటాలపై ఓడలు వీరి చూపుల్లో ఏముంది ? నిప్పు రవ్వలు రాలే హింస తప్ప వీరి గుండెల్లో ఏముంది ? ఆర్ద్రత ఎరగని కొలిమి తప్ప ! వీరి ఆలోచనల్లోనో ? చేతులు చాచిన ఇనుప తలుపులు వ్యక్తిని వ్యక్తి మ్రింగ జూచేను ! మనిషిని మనిషి క్రుంగ జేసేను ఆచైతన్య రూపాలే ! ఈ పృథ్వీ సంతతి ! మతులన్నీ ఎన్నటికీ ఒకటికావు గొంతులో నీళ్ళకు బదులు నిప్పులు వదిలే చేతుల్లో కరుణ ససేమిరా ఒలకదు, ఆయుధం మహాబాగా నప్పుతుంది. గ్రీష్మం మబ్బును కనపడనీయదు శైలం పవనాన్ని కదలనీయదు మృత్యువెంత పాతదైనా, ఎప్పటి కప్పుడు కొత్తే ప్రకృతిలో గ్రీష్మ స్పర్శ సహజం అయితే సహింపరానిది విలయ తాండవం. (1) (2) (3) పూవుపై పక్షిపై చంద్రునిపై గురి పెట్టే తుపాకి మాట వాస్తవమౌతూంది ఆదర్శం మారణ గంధాన్ని వీస్తూంది, మానవత శ్వాస ఆగినట్లవుతూంది ఎండిన కొమ్మకు గ్రీష్మంలో ఎండ అంటుకున్నట్లు దారిద్య్రం పాట మధ్యలో అరిగిన పిన్ తిరిగే రికార్డు వలె ఆకలి దారిన పోయే వ్యక్తి విసరిన నాణాన్ని స్లిప్లో కాచ్ వలె బిక్షువు గ్రహించేను దూరాన ప్రేలిన బాంబు సమయాన్ని శిలువపై నిలుపుతూంది నీడను వాహనంగా చేసుకొని మనిషి రహస్యంగా పరుగెత్తేను హృదయ గహ్వరం నుండి దెబ్బదిన్న శాంతి పరుగెత్తుతూంది గెలుపుకీ ఓటమికీ, ఆరంభ బిందువు ఒకటే చీలే బిందువు నుండి పొందే పరిణామం వేరు (4) (5) మంచు దువ్విన బంతి పూవు రాలినట్లు ఉదయం వస్తుంది కోట బురజుపై తోపు వలె భయం ఎదురౌతుంది ప ్ళరంలో స్వాగత హృదయంతో ప్రతిరోజు ఎదురుపడదు మోదమో భేదమో స్వప్నమో ఎదురైంది స్వీకరించక తప్పదు దీపమై హారతై కదలిన జనం కళ్ళు నేడు కోపంతో శాపంతో నిలిచేను
ప్రయాణంలో విషాదాన్ని మరచేందుకైనా మనిషికి శిశు హృదయం అవసరం భూమిపై కాళ్ళు నడిస్తే చాలదు, కళ్ళలో నీల జలదం కదలాలి ముఖంలో గులాబి పూస్తే చాలదు, గుండెలో ఉదయం పూయాలి కాలం వెలుగు కాదు చీకటి కాదు, మనిషి దేవత కాదు జంతువూ కాదు మనస్సు మంచు కాదు అగ్ని కాదు, సామాజిక చలనంతో ఏదైనా అవచ్చు ఏజాతి అయినా ఏ ఖండమైనా ప్రపంచమెప్పటికపుడు స్వార్థంతో హింసకు అంటువేసిన వనమవుతుంది (6) రణ, మారణ చరణాలతో విభేదాల సమాజ గతిలో హింస నుండి శాంతికి ! ప్రస్థానం కోరిక ఈనాటిదా ? పూర్వం బాణాల్ని విసరితే ఆధునికం క్షిపణుల్ని విసరుతూంది ఆయుధం జీవించే అవసరం ఒకటే, అపాయంతో క్రీడించే తత్వం ఒకటే. ఏడుపు అలవాటై పోయింది, అలజడి వంటబట్టినట్లుంది ధూమ కీర్తికి లోటు లేదు, ఎటు చూచిన అగ్ని సరస్సులే సన్నని మంచు పొరల్లో నుండి ఉదయిస్తేనే సూర్యుని కందం విశ్వ కథా చరిత్రలో మానుష రూపం ఒకటే ఎత్తిన ఇరు చేతుల్లో ఒకటి నలుపు ఒకటి తెలుపు ! కీర్తి అలలపై తేలి తేనే ఎంతటి ప్రతిభకైనా అందం రాత్రి బల్లపై ఒంటరి కాండిల్ తలపై జ్యోతి స్వప్నించే బాల తరణి వాలిన భయంతో దిగిన అనుమానంతో నలు వైపుల చీకటి లోయలు దీపం తనలో మౌనంగా బాధా రూపం వహిస్తుంది రంజితమై వెలుగుతుంది, అంకితమై బ్రతుకుతుంది గదిలో వెలుగు సరసిని సృజిస్తుంది, దారిలో వెలుగు పాయ సరిస్తుంది అవసరానికి దీప శిఖ; జీవితంలో మినీ సూర్యుడు సమయానికి బాష్పకణం, జీవితంలో హృదయార్పణం నిశిపిడికిలి సడలిందో లేదో వెలుగు స్వేచ్ఛగా పరుగెత్తుతుంది స్వాగతం పలికే కాంతి తోరణం ! ఎప్పటికి శిరస్సు పైనే ఉంటుంది ఆశాస్తంభంపై వాలిన హంస ఎంతెత్తునుండైనా ఆనందాన్ని పంచుతుంది ఆలోచన ఎక్కడి కైనా చేరుతుంది ఎత్తు అనీ లేదు దూరమనీ లేదు (7) (8) (9)
రణ, మారణ చరణాలతో విభేదాల సమాజ గతిలో హింస నుండి శాంతికి ! ప్రస్థానం కోరిక ఈనాటిదా ? పూర్వం బాణాల్ని విసరితే ఆధునికం క్షిపణుల్ని విసరుతూంది ఆయుధం జీవించే అవసరం ఒకటే, అపాయంతో క్రీడించే తత్వం ఒకటే. ఏడుపు అలవాటై పోయింది, అలజడి వంటబట్టినట్లుంది ధూమ కీర్తికి లోటు లేదు, ఎటు చూచిన అగ్ని సరస్సులే సన్నని మంచు పొరల్లో నుండి ఉదయిస్తేనే సూర్యుని కందం విశ్వ కథా చరిత్రలో మానుష రూపం ఒకటే ఎత్తిన ఇరు చేతుల్లో ఒకటి నలుపు ఒకటి తెలుపు ! కీర్తి అలలపై తేలి తేనే ఎంతటి ప్రతిభకైనా అందం రాత్రి బల్లపై ఒంటరి కాండిల్ తలపై జ్యోతి స్వప్నించే బాల తరణి వాలిన భయంతో దిగిన అనుమానంతో నలు వైపుల చీకటి లోయలు దీపం తనలో మౌనంగా బాధా రూపం వహిస్తుంది రంజితమై వెలుగుతుంది, అంకితమై బ్రతుకుతుంది గదిలో వెలుగు సరసిని సృజిస్తుంది, దారిలో వెలుగు పాయ సరిస్తుంది అవసరానికి దీప శిఖ; జీవితంలో మినీ సూర్యుడు సమయానికి బాష్పకణం, జీవితంలో హృదయార్పణం నిశిపిడికిలి సడలిందో లేదో వెలుగు స్వేచ్ఛగా పరుగెత్తుతుంది స్వాగతం పలికే కాంతి తోరణం ! ఎప్పటికి శిరస్సు పైనే ఉంటుంది ఆశాస్తంభంపై వాలిన హంస ఎంతెత్తునుండైనా ఆనందాన్ని పంచుతుంది ఆలోచన ఎక్కడి కైనా చేరుతుంది ఎత్తు అనీ లేదు దూరమనీ లేదు (7) (8) (9)మస్తిష్కం దేనై నా వహిస్తుంది బరువనీ లేదు రహస్యమనీ లేదు మనిషిలో అంతరంగం కనబడని అక్షయ తూణీరం కొర్కెలకు మితం లేదు బాణాలకు కొదవ లేదు పగటి వేషంతో బ్రతికే మనిషికి అంతర్ముఖ మెక్కడిది ? తనలో మంచు నవ్వాలనీ ఆనలం అలమటిస్తుంది తనలో వేడి మొలకెత్తాలనీ హిమం ఎదురు చూస్తుంది బ్రతుకు మంటపై నడిచేందుకు హృదయం హిమ సుందరం అనాలి. కాలంపూల రెక్కలపై వాలినట్లే ఇనుప చక్రాలపైనా కదలుతుంది
కళ్ళలో చీకటి చివురిస్తే క్షమార్హమే కాని ఎదలో వనమైతేనే ప్రమాదం సరించే రైలు కిటికీ నుండి చూస్తే మరచిందేదో అందుకునేందుకు శాంతి పరుగెత్తు తున్నట్లుంటుంది మనసులో మనిషి నిరీక్షిస్తున్నట్లుంటుంది (10)III. ఈశతాబ్ది అంచుల్లో దృశ్యం నుండి దృశ్యం
1. శిశు బింబం కనురెప్పలపై చీకటి తొలగింది మనో భూమిపై రంగు సిద్దమైంది సరసిలో అలల వలె చేతులు కాళ్ళు ! లేత తమల పాకు వలె శిశువు ! రెప్పలు తెరచిన నక్షత్రాలు లోకం చూచేందు కారాట పడుతున్నాయి లేత కిరణాల్లో మెరసే మంచు బొమ్మవలె శరీర మాకర్షిస్తూంది అమాయక సౌందర్యంతో మానవ రూపం సృష్టిని భావించ జేస్తూంది వెలుగు బిందు స్పర్శతో దీపం నుండి దీపం ! సమాజ సీమలు పెంచేను అవని పైకి రాగానే గొంతు చీల్చుకొని వచ్చే స్వరం స్తంభించిన గాలిని చకితం చేస్తూంది, సంతోషపవనంతో తరంగ మవుతూంది రవిచంద్రుల ఆశీః కళతో ఆకాశం దిగినట్లున్న వదనంతో ఎవరో పూల చేతలు కప్పేరు వెలుగు గుండెకు హత్తుకునేరు కాళ్ళు కదిలయో లేదో ! కిందనున్న అవని ఎద చాచింది చేతులు కదిలాయో లేదో! ఎరుటనున్న దిశలు విచ్చుకున్నాయి మస్తిష్కం మండేట్లుగా మేధ పదునెక్కేట్లుగా ఎంత ఆలోచన చేసినా చుట్టూ అజ్ఞానం ఉండనే ఉంది ఆశ పెద్ద పులి వలె మనిశ్శిఖరంపై పీట వేసుక కూర్చుంది
2. తీరం నుండి భయంలోను వింతైన ఆకర్షణతో అనల దృశ్యం మతిలో బింబిస్తూంది వ్యూహంలోకి ప్రవేశించకముందు బాలారుణ బింబం వ్యూహంలోకి ప్రవేశించాక వీర మణి అవక తప్పదు తీరం నుండి తీరం చేరే అనుభవాన్ని అంటుకునే ఉంటుంది, అపాయం దూరం తెలీని పయనంలో నిరంతరం దృశ్యం నుండి మరో దృశ్యం !502
3. ఉపాయ శిల్పం చిన్నతనం నుండి పక్షులు కోర్కెల్ని జ్ఞాపకం చేస్తాయి పెదవులపై ఎగసే శబ్దాలు పక్షుల్ని తలపుకు తెస్తాయి ఏ చెట్టూ నీడను దాచుకోదు, ఏ నదీ నీరు నిరాకరించదు చెట్టునీ ఈ నదినీ మనషినీ ప్రయాణంలో వదలక తప్పదు పొదల మాటు నుండి చకితంగా గుట్టపై నుండి చురుగ్గా ధగధగ లాడే పులి కళ్ళు స్మృతి పథాన తిష్ఠవేస్తాయి ప్రక్కనుండి దూసుకపోయే బాణం వలె ఊహ సరిస్తుంది జీవితానికి తీర భూములు రెండే ! ఒకటి భయం ! మరొకటి ధైర్యం సాధారణ జడ రూపమై నావ ఉందే ! జలధి ముందు నిల్చిన పిడికిలి ! తీరానికి దాట వేసే ఉపాయ శిల్పం ! ప్రస్థానంలో తేలే విజయ శిఖరం ఉదయం దూకుతుంది, కిటికీ నుండి తెల్లని గండు పిల్లివలె పగలు ఎదురౌతుంది మైదానంలో కదిలే హరిదశ్వం వలె చిత్రం వేసే ముందు తొలి రేఖల్లో పూర్వ రంగం వలె రాబోయే జీవిత దృశ్యంకై ఉషస్సు ఎదురు చూస్తుంది
4. ఏమైనా కావచ్చు పెదవులపై పూచే పూలతో కళ్ళ నుండి జారే ముత్యాలతో వ్యాపారం ఆర్ద్రత కోల్పోయిన సమయ రూపం ఎడారి కావచ్చు మ్రోడు కావచ్చు లోలోన మండి మండి కాలం కణకణలాడే కొలిమి కావచ్చు క్రిందికి దిగిపోయి కాలం రాతి పొరల లోయ కావచ్చు దిశ దిశ జారిన ఉదయం పాతదే ఎప్పటిదో చరిత్ర కందని రూపం ఎదురుగా నడచే సమాజం వేరు, వెనుక నుండి వచ్చే బింబం వేరు పగలు మండిన మంటలు చల్లబడి పోవడానికీ ఎద శాంతి పొందడానికి మనిషికి నిశ అవసరం
5. మంటల నుండి వేడి భరించలేని కిరణం ఏ పచ్చని చెట్టునో చుట్టుకుంటుంది ఏ చల్లని నీటి పైనో ఈదుతుంది ! ఏ చీకటి జలధిలోనో దూకుతుంది పదునెక్కిన బాకులో సూర్యుని వేడి దాగి ఉంటుంది ఉపయోగించనంతవరకు అద్దంలో తోచే రవి తేజం
చీకటి కలవాటుపడి చీకటిని కోరే హృదికి వెలుగు కన్పిస్తే విసుగు ! రవి తలపుకు వస్తే వెరపు ! అద్దంలో స్వప్నం వలె గగనంలో చంద్రుడు మెత్తని కోర్కెల వలెమొలకెత్తిన నవ్వులతో ఈ నగరం ఆకర్షణకు నికేతనం ఇక్కడ ? కర్ప్యూలో గస్తీ సైనికుని శిరస్త్రాణంపై గన్ పాయెంట్పై రవి కిరణం మెల్లగా తలవాల్చేను చుట్టూ ఇనుప తీగెల ఊహలతో అనుమానపు కంటకాలతో ఎగసే సన్నని ధూళి ధూమ ప్రావారంతో తెలిసిన రహస్యం వలె ఉంది పగలు సూర్యుడు ముళ్ళకు పదును పెట్టేను అంతకన్నా ఇంకేం చేస్తాడు ! అతనికి ముళ్ళంటే ఇష్టం లేకపోయినా చీకటి రాత్రి ముళ్ళకు ముసుగు తొడిగేను ఇంతకన్నా ఇంకేం చేస్తుంది ! చీకటికి ముళ్ళంటే మహా ఇష్టం
6. కర్ప్యూలో జన పదం మౌన బంధంలో ఉంది విశ్రాంతి చరణంతో నిశ్శబ్దంగా ఉంది. ఊహలు చీకటి గూళ్ళల్లో ఒదిగీ కర్మసాక్షికి తెలీనివీ ఉన్నాయి. ఇది కర్ఫ్యూ
7. నాలుగు దారుల మధ్య నాలుగు దారుల మధ్య విగ్రహం ! విగ్రహంపై దిశల నుండి అనుగ్రహ బిందువులే రాలతాయో! ఆగ్రహ శకలాలే పడతాయో ! ఈ లోపల ఏ హింసో ప్రేలి ముక్కలు ముక్కలై ఎగిరిపోవచ్చు ఆపాయ ముద్రలో నున్న జీవితానికి వేదాంత గోపురమే శరణ్యమా ? గాలి తగిలిన గాయాలతో రెక్కలు ముడుచుకొని నడుస్తూంది ఏ మూల నుండో ఎగరిన ఆయుధం ఆ రెక్కల్ని ఖండింప జూస్తుంది504 మనషుల మధ్య గాలి మానవతను వెదకుతూ పోతూంది పత్రికల్లో నీలి పాగల మధ్య నిజం ముఖం మాయమవుతూంది ఓటమికీ గెలుపుకీ మధ్య సన్నని తెర కదలుతూంది గెలుపూ ఓటమీ రంగులు ఇరువైపుల నుండి ప్రతిఫలిస్తున్నాయి మనిషికీ మనిషికీ మధ్య ! భయం నిండిన లోయ ఉంది !
8. చరిత్రలో భాగమై లోయపై మానవతా సుందరంగా ఒకే ఒక వంతెన ! యుగాల నాటిది
గట్టుపై గండ శిల ! దూరాన వంగిన బుజాలలతో గుడిసె ! మోకాళ్ళ మధ్య దూరిన ముఖంతో, నేలను తడిపే బాష్ప బిందువులతో ఎడారి ఆరచేయి వలె దరిద్ర మయముఖంలో ఈ రోజు మారిన గతితో రేపటి స్వప్నం కోసమే ఉంది చెట్టు క్రింద పిల్లలు కొమ్మల్లో చిక్కిన ఒక్క పతంగంకై ఎగిరేరు అనుభవంతో గమనం మారే జీవితంలో ఎన్నటికీ ఆశ పరిపూర్ణంకాదు నదిని సముద్రాన్ని చేరనీ బిందువు బంధింపబడదు సమాజ చలనంలో వ్యక్తి చరిత్రలో భాగం, చరిత్రకు కారణం
9. ఎవరు రానీ రాకపోనీ ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు పనికి రావాలి వచ్చి తీరాలి వాళ్ళు కన్పించడంతోనే కళ్ళలో పొద్దు పూలు పూస్తుంది వాళ్ళు వేళకు రాకపోతే కాళ్ళ క్రింద మంటలు రగిలినట్లే వాళ్ళు కంటికి కన్పించకపోతే కళ్ళు ముళ్ళుకావచ్చు, శిలలు కావచ్చు పొద్దు పొడిచిన ముఖంలో చీకటి ఒదిగిన బ్రతుకుతో ఎక్కడో గుడిసె నుండి ఎప్పుడో చీకటినే బయలు దేరేరు గుడిసెకు తాళం వేయడానికి తలుపంటూ ఒకటుంటేగా దొంగల భయం ఉండడానికి కుండలో ఏమన్నా ఉంటేగా చెట్టూ చుక్కలూ ఉన్నంతవరకు ఏ నీడకూ ఏ వెలుక్కు కరువు లేదు ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు మాత్రం వచ్చి తీరాలి505 పెద్దోడు పెద్ద కూలికీ చిన్నోడు చిన్న పనికీ బుడ్డాడు చేతి కింద చేయిగా; ఎవడు పని ఇస్తే వాడే దేవుడు
10. ఎవడు పనిఇస్తే వీళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు ! ఆకలి చావులు వినిపించకుండా దీన్ని అనుభవించే వాళ్ళ కన్నా చూసేవాళ్ళను ఓదార్చేందుకూ అసలు వాళ్ళను వదిలేసి ఆ పై వాళ్ళను ఓదార్చేందుకూ ఎందరో సతమతమవుతున్నారు, బ్రతుకును నాటకీయం చేస్తున్నారు వీళ్ళతోనే పొద్దు పొడుస్తుంది వీళ్ళతోనే పొద్దు గ్రుంకుతుంది, వీళ్ళతోనే చరిత్ర వెలుగు పుటలు తిరిగేదీ ధరిత్రి సువర్ణ పుష్పమయ మయ్యేదీ కొరకంచు వలె కాలే జీవితం ఏ వెలుక్కీ పనికి రాదు
11. మనస్సు మనస్సే చుట్ట కాల్చుకోడానికో, నిప్పు రాజేయడానికో తప్ప బరువుల్ని ఎత్తుతూ దించుతూ కాళ్ళకు సంకెళ్ళు పడుతూ వీడుతూ ఇది దుఃఖాన్ని ధరణిపై నిలుపుతుంది; ఆర్తిని ఆకాశాన చుడుతుంది. వెలుగు తెలీని నేత్రాల్లో మెరుపు తీగల్ని మెరపిస్తుంది కన్నీరు కురిసే పాట పాడుతుంది పిడుగులు విసరే ఆట ఆడుతుంది. ఆకలి గొన్న చేతుల్లో మాత్రం పంచబడే మాటలు రాలతాయి దప్పిక గొన్న ముఖంపై దూరం నుండి టారై లైట్ వెలుగుతుంది. మనిషి మృగం కాదు శిల్పం కాదు సూర్యుణ్ణి మాయంచేసే చీకటీ కాదు ఆకలీ ఆర్తీ ఉన్న మనిషి మనిషే, శాంతి ఆనందం కోరే మనస్సు మనస్సే కొమ్మల్లో నుండి ప్రాకే చంద్రుణ్ణి చూస్తే ప్రేమలో చిక్కుకున్న హృదయం జ్ఞాపకం వస్తుంది ఆందనంతవరకూ ప్రేమ పూలలో జ్వాల కావచ్చు అందిన క్షణంతో ప్రేమ చేతిలో అమృత మవుతుంది
12. తనకు తెలీకుండా ప్రేయసి కళ్ళలో కన్పించే వాలిన ఇంద్ర ధనుస్సు ముందు ఎంత అందమైన ప్రపంచమైనా పెన్సిల్తో పిల్లలు వేసే బొమ్మే ప్రేయసి బాహు లహరులపై ఆలోచన మంచు అద్దిన రాగ బింబమై ప్లవిస్తుంది మెరుపు తప్ప గర్జన లెరగని నీల మేఘమై పయనిస్తుంది జ్ఞాపకాల మెట్లపై సితార్ వలె దివ్యమైన ప్రేయస్స్వరం సరిస్తుంది తనకు తెలీకుండా శరీరం పుష్ప నౌక వలెనో చంద్ర హంస వలెనోకదులుతుంది ఎక్కడి కక్కడ సౌందర్యం పూర్ణమై మనోహరాకృతి వహిస్తుంది ఎక్కడి కక్కడ పరిమితమై జననం నుండి సరిస్తుంది ఆకర్షిస్తుంది క్షితిజం నుండి విసరి కురిసే బాష్ప జలాలతో తడిసిన భూమి సృజిస్తుంది సర్వం సమర్పిస్తుంది జగత్తుకు కానుకగా
13. ఎక్కడి కక్కడ సంకల్పమూ ఏ పరిణామ గమనాన్ని ఆపలేదు ఎంత శక్తి ఉన్నా
జీవితంలో ఆజ్ఞానం అనంతంగా మిగిలే ఉంటుంది అదే ! రహస్యం ! వీడని భూమికి దగ్గరగా చూడని స్వర్గానికి ఆప్తంగా మనస్సులో మధు భర పరిమళ లహరితో శుభ్రమైన ఉషస్సు స్పందిస్తుంది. పాల జలధి వలె విరిసిన మనస్సు దృష్టాదృష్ట సౌందర్య మూర్తిని తనలో బింబించుకో జూస్తుంది, తనలో లీనం చేసుకో జూస్తుంది.
14. ప్రశ్నా చిహ్నం ప్రశ్నతో సమాధానం, సమాధానం వెనుకనే మరో ప్రశ్న ఉంటుంది ఏ ప్రశ్న నేర్ప బడదు ! నేర్చిన ప్రశ్న కొయ్య గుర్రంతో సమానం నొసలు ప్రశ్నిస్తుంది ! కళ్ళు ప్రశ్నిస్తాయి, సమాధానం చెబుతాయి పెదవుల ప్రశ్నిస్తాయి! సమాధానం చెబుతాయి ! హృదయం ప్రశ్నిస్తుంది ! సమాధానం పొందుతుంది ! ఒక ఆలోచనే కాదు శరీరమూ ఒక ప్రశ్నే సమాజ చరిత్రలో మానవ రహస్తత్వం ఒక ప్రశ్నే507 రంగూ రీతీ మార్చే శక్తులతో పణంతో రణంతో పడుగు పేక జీవితం ! అజ్ఞానం దారిద్ర్యం మనిషిని చెరో వైపు రెక్కపట్టుకొని పయనింపజేస్తాయి చరిత్రకు మరుపు జాస్తి ! ఎంతో త్రవ్వితే గాని ఏ కాస్తో కన్పించదు దొరికే వర్తమాన సమాధానం వెనక ! భవిష్యత్తు ప్రజ్ఞాన చిహ్నముంది
15. శ్రమ బిందువులొకటై శ్రామికుని బుజాల వలె బరువు మోస్తూ ఎక్క డెక్కడో దారులు కలిసేను మనిషికి నగరం దిగిన ఇంద్రధనుస్సు, ఆశా విహంగాని కాశతలం ఇక్కడ తీర్చిన ఉద్యానవనంలో మనుషుల్లా నిల్చీ చెట్లు పిల్లల ఆటల్లో అమాయకతకీ పాటల్లో కళాత్మకతకీ సాక్షులుగా ఉన్నాయి. ఈ చెట్టు ఏ కిటికీ రెప్పలు గానో ఏదర్వాజా రెక్కలుగానో రూపాంతరం చెందుతుంది ! ఎన్ని విధాలుగానో జీవితంలో ప్రవేశిస్తుంది నగరం వెలువల ఏ అదృష్ట దేవత ఆగమనానికో పరచిన పట్టు కార్పెట్ వలె నది ! జీవన రుచితో చలన కీర్తి ! ఈ నది ప్రతి రోజూ యుగాల నుండి ఆవిరామంగా జారిపడే సృష్టికర్త శ్రమ బిందువు లొకటై సమూహమై ప్రవహిస్తున్నట్లుంటుంది
16. శక్తి నదీ తీరంలో రైతు పిడికిట్లో దున్నే నాగలితో చేతిలో పంట కోసే కొడవలితో శక్తి నదీ తీరంలో శ్రమ ఫల కేతనంతో నాలో సృజన భూమి బింబిస్తూంది ఒక్కొక్కరిలో ఏకాంతం సరస్స వలె నిలుస్తుంది గణాలతో సమూహాలతో సమాజం నది వలె ప్రవహిస్తుంది నాలో పరుగెత్తే రైలు ముందు చీలిన ఇనుప దారుల్లో ఒకదిశ నెన్ను కొనే వీలుంది ! దారి తప్పే ప్రమాదమూ లేకపోలేదు హెచ్చు తగ్గుల పెట్టెలతో ప్రత్యేకమైన గదులతో రైలు వలెనే సమాజమూ ఎక్కడి కక్కడ ఖండమై ! ప్రయాణంలో ఏకమై కన్పిస్తుంది యాత్రలో క్షణాలు మనసులో స్మృతుల్ని రికార్డు చేస్తాయి సమయంలో సందర్భంలో తప్ప ఎప్పుడు బడితే అప్పుడు పలకదు !కొండల్లో లోయల్ని
దాచేసే
చీకట్లో
విధి
దీపం
ఒకటే
నేస్తం
17. ఒక్కొక్క రోజు డిటెక్టివ్ నవల్లో పేజీలో పదాల్లో ఉత్సుక క్షణాలు కదలుతూన్నాయి పెదవుల్ని సీల్ చేస్తే, చేతులు పిడుగుల విసరవచ్చు చేతుల్ని బంధిస్తే, కాళ్ళు పెను తుపాను కావచ్చు. మతం పేర వాదం పేర పైకి తన్నిన బంతి వలె, పైకెగసే పతంగం వలె కదలే ఫాల తలంపై రక్త పుష్పం బదులుగా పుష్ప రాగం కన్పించాలి కణకణలాడే నిప్పు కొలిమి వలె ; చిక్కువడి ముడిపడిన దారం వలె గిరగిర తిరే బావి గిలక వలె, బాధలో సమస్యలో జీవితం ! ఒక్కొక్క రోజు పత్రిక ఎదురౌతుంది పతాక శీర్షికలో వికార ముఖంతో
18. సంకల్ప బిందువు ప్రతి మృత్కణంలో తన పద చిహ్నం నిలవాలనీ పోరాటం ప్రతి మస్తిష్కంలో తన ఆలోచన బింబించాలనీ ఆరాటం తలపై కిరీటం పడిపోయి, చేతిలో జెండా నేల కొరిగేను మరో తలపై కిరీటం నిలిచి, మరో చేతి జెండా ఎగసేను కష్టంలో రాయై దుఃఖంలో అగ్నియై రణ క్రీడతో రణించే వ్యూహ రచనలో జీవిత వర్తనలో తర తరాల అనుభవాలు !
అనుభావం భగ్నమైనా అనుబంధం చిన్నమైనా మానవ గుణంతో జీవన లయపై గతిపై ఆకర్షణతో మనిషి ప్రయనం మనిషి వైపే శ్రమ శక్తీ పోరాటం సమాజానికి రెండు కళ్ళు నాగలీ కొడవలీ శ్రమ జీవికి రెండు చేతులు కృషితో సుభిక్షం అన్వేషణతో పురోగమనం సమాజంలో ప్రయాణ దశ దశలో మొదటి చిరవ బిందువులు ఆహారం ఆహార్యం ఆధికారం ఆనందం సంపదతో బిందువు బిందువునూ ఒక రేఖలో ఉత్పత్తి శక్తులు కలిపేను.
19. విభజన రేఖలు భూమి నాశ్రయించిన స్థిర జీవితం దాహానికి కాల్వలు త్రవ్వింది వైవిధ్యం విషమత్వం అసమానత సమాజ రూపానికి కత్తెరలైనాయి అటవికం నుండి ప్రజాస్వామ్యం దాక శ్రమ జలాలపై తేలే సంస్కృతి ముఖాన రక్త రేఖలు చిలికింది ! సరి కొత్త పాత్రనూ వహించింది రెక్కల్లేని పక్షి వలె బుజాన నిశ్శబ్దాన్ని మోస్తూ కదలుతూ ఎక్కడో అలికిడితో గుచ్చుకునే అనుమానం ముల్లుతో కొమ్మకూ ఆయుధానికీ భేదం లేని అరణ్యంలో సమాజ ధార నుండి తొలగిన విప్లవ చరణాలు ! అనల కీలల కింజల్కాలతో విచ్చిన ఇనుప మొగ్గలు బ్యాక్టరీ మూడో కన్నుతో నిశి నిశి తిరిగే ఆశాంతి మూర్తులు
20. సమరం వచనం హోలీ రంగులు పులిమిన ముఖాన్ని గుర్తించే యత్నం జరగేను రంగుల్లో మాయమయ్యే నిజాన్ని పట్టుకొనే ప్రయాస పడేరు శిలవలె ఘనీ భవించిన హృదయంలో ఏ విప్లవ శిఖలు దూకితేనేం ? తుప్పు పట్టిన కృపాణ మతిలో ఏ వచన సుధ ! సేచితమైతేనేం ? మనశ్శిఖా బ్రష్ తీర్చిన కోపం క్రౌర్యం ద్వేషం హింస రంగులతో మనిషిలో నుండి రక్త చిత్రం బయటికి వస్తుంది
21. యశశ్చిత్రం మనః కిరణం బ్రషో తీర్చిన సహనం త్యాగం శాంతి ప్రేమ రంగులతో
మనిషిలో నుండి ఉషశ్చిత్రం ఎగసి దూకుతుంది చిత్ర ప్రదర్శన ప్రాంగణంలో 'సత్యం వద ధర్మం చర' తోరణం సమాజ చేతనలో చరిత్ర పుష్పించిన మానవ రూపం ఉదయ నదీ దీరాన నడుస్తూంటే ప్రక్కనున్న శిలలు జాలిగా చూస్తాయి కదలే కాంతి అలలతో నది ! పుటలు తిరిగే కాలం వలె ఉంది అదృశ్యమాన గతంలో వర్తమానం భవిష్యత్తుకు గతి తర్కంతో పయనిస్తూంది గతంలో పోరాడే భౌతిక పరివర్తనం వ్యక్తి నుండి సమాజానికి క్రమిస్తూంది.510
22. నడిచినంత వరకు ఎవరో విసరిన రాయికి పగిలి ముక్కలుగా జారిపడిన ఆద్దంలో దారిలో తన ముఖాలు చూసుకొని మనుషులు ఆనందం పొందే మనుషుల మధ్య పూల బుట్టలో ప్రేలిన బాంబు ధ్వనికి నింగిపరుగెత్తుతూంది “నిజం”, విలువైన వజ్రం అందుకే ! ఎక్కడో జాగ్రత్తగా భద్రపరిచబడింది ఆహారంకై సంతోషంకై పక్షి ఎంత దూరమైనా సరే పరుగెత్తుతుంది సైబీరియా నుండి రాజస్థాన్ సరస్సుకూ హిమ సరోవరం నుండి అమెరికాకూ సౌదర్యం సంస్కృతీ ఔన్నత్యం స్పందన కలిగిన తేజం నా రూపం వాడి కత్తుల తోరణాల నుండి ఎగసి నిలచిన మానవ కీర్తి శిఖరం చుట్టూ కోట వలె చరిత్ర నిల్చి ఉన్నా గగనం నుండి శక్తి దిగుతుంది ఈ భూమి గొప్పదనం ? అజ్ఞాన పీఠాన్ని అధిరోహించ నంత వరకే ! అడుగు ముందుకు కదలుతుంది ; రేణువు రేణువులో చలనం అడుగు ముందుకు వేయడమంటే అజ్ఞానం వెనక్కి వెళ్ళడమన్న మాట పాత రేఖల్ని తుడిచేస్తూ కొత్త రూపాన్ని సృజిస్తూ, సహస్ర కర పంక్తులపై శ్రమ స్వప్నం వాస్తవమౌతుంది ప్రతి మనిషిలో వెలుగు పూవో పండో పొందే సమయంకై అనుభవ గంధంతో ఆలోచనా సేచనతో ప్రతి లిప్త ఎదురు చూస్తుంది జీరో వెనక సంఖ్య చేరుతూ అనంతంగా విలువ పెరిగినట్లు శూన్యానికి భావం చేరి మనిషిలో ప్రపంచ మవతరిస్తూంది భిన్న స్వరాలతో వర్ణాలతో వాతావరణం సముద్రమై మ్రింగ జూస్తుంది మనిషి పడవై తేలేను, వెళ్ళిన కొద్దీ అలలు తలలు వంచుతూపోతాయి.
23. పడవై
24. కారుణ్య సేచనం ఎపుడో చిల్లి పడుతుందని కుండలో నీళ్ళు నింపడం మానేయం ఎపుడో చినిగిపోతుందని వస్త్రాన్ని ధరించడం మానేయంమబ్బు క్రమ్మీ నీడ వాలీ ధూళి సోకీ
నిశ
మ్రింగే
సమయంలో
ఏది “సత్యం” “ఎక్కడ ?” అన్న బహు ప్రశ్నలకు సమాధానంగా ఒకరిచేతిలో విష పాత్ర కదలుతుంది మరొకరి దేహంపై క్రాస్ నిలుస్తుంది. పరీక్ష గడిస్తే ! సత్యం శుభ్రంగా వజ్రమై బయట పడుతుంది వెలుగు ఎవరినీ ఆర్థించదు, చీకటిని చీల్చుకొని వస్తుంది కన్నీరు వెనుక కదలుతుంది, కన్నీటిని తుడుస్తూ వస్తుంది చీకటి ప్రశ్నయై బంధిస్తే వెలుగు సమాధానమై విప్పుతుంది హనన ప్రపంచంలో ధర్మ పథం కారుణ్య కాంతితో పలకరిస్తుంది
25. ప్రజాస్వామ్యమై పెదవులపై నుండి శబ్ద ప్రపంచం బయట పడనంతవరకే స్వంతం ఒకసారి బయటికి దూకేస్తే గగనం అంచుల దాకా అందరిదీ ఆలోచనలో పరుగెత్త లేని చెట్లు తలలూవూతూ నిలిచిపోతాయి ఆలోచనల్ని ప్రశ్నించే గిరులు తలలెత్తి మరీ ఆకర్షిస్తాయి చేతిలో ఈ శతాబ్ది మహేతిహాసం పుట పుట తిరుగుతూంది వ్యక్తి తలం దాటి సామాజిక వాస్తవ రహస్యాల్ని ఆవిష్కరిస్తూంది భౌతికం అతీతం అభౌతికం వీలు వెంట మనిషిలో వివిధ స్థాయిల్లో దొంగలో దొరలో హంతకునిలో తమ తమ పాత్రలు నిర్వహిస్తాయి నిన్నటి మానవ సంకల్పం మేఘమై పిడుగులతో మెరపులతో నేడు కాంతి జలం వర్షిస్తూంది ! ప్రజా స్వామ్య బంధువై అదో దక్షిణాప్రికా
26. స్వాతంత్ర్య బింబం స్వాతంత్ర్య సవితృ బింబం ప్రజాస్వామ్య కాంతిని ప్రసరిస్తూంది వర్గం వర్ణం భేదం లేకుండా మనిషి మనో రూపం వెలిగిస్తూంది ఎండిన గరిక పోచల్లో రాజనీతి నైశిత్యం మెదలుతూంది
ఎండిన మట్టి కణాల నుండి నేడు హరిత స్వప్నం నిజమవుతూంది నిరంకుశ శిలల్ని లోయలోకి దొర్లిస్తూ ప్రజాశక్తి కదలుతూంది మౌన శంఖం నినదిస్తూంది, భయం నుండి దారి ముక్తమవుందిఏ శైల సౌధ శిఖరంపైనో
సూర్యుణ్ణి
బంధించడం
కుదరదు
ఏ రాత్రి కోటగోడ వెనకాలో సూర్యుణ్ణి పాతేయడం జరగదు గతానికీ భవిష్యత్తుకూ మధ్య గతి తార్కిక భౌతిక సంబంధం ఈ శతాబ్ది అంచుల్లో మానవ సమాజ ప్రగతి సంధ్యా రూపం శరీరంపై గాయాలు అగ్ని చిమ్ముతున్నాయి ధమనుల్లో రక్తం అతంకం స్వనిస్తూంది
27. సమాజ జలాల్లో స్వేచ్ఛకై సమాజ మెగసీ జ్వలిస్తూంది సమస్యల హృదయాని కానందమెక్కడిది ? క్షితిజం ఒక చేతిలో సూర్యోదయం మరో చేతిలో సూర్యాస్తమయం జీవితం ఒక అంచులో పూల చెట్లూ మరో అంచులో ఆయుధ పంక్తీ ! ఆలయ నుండి ఘంటారవం మరచిన అమూల్యాన్ని అనురణిస్తుంది దారిలో హారన్ మ్రోత రానున్న అపాయ వేగాన్ని మెరపిస్తుంది కొత్త దారి పట్టిన మనిషి చివర గమ్యంలో స్వంత దారి కోరేను మోసమో మార్పో ఏం చేసినా అది దారి తప్పిన జీవితం కోసమే ఆ పిచ్చి కళ్ళలో ఆశ్రువులు తొలకరి చినుకులనే భ్రాంతి నీయకపోలేదు. దోసిట్లో జారిపొరలే దుఃఖం సమాజ జలాల్లో కలిసే కన్నా మార్గమేముంది?
28. సంకల్పం సంకల్పం సరిస్తుంది ప్రవాహపై ప్రసరిస్తుంది పరాగమై నిరంతరం క్రియాత్మక జీవితంలో శ్రమ చేతన బిందువై, రేఖయై, రూపమై సామాజిక స్పందనతో మనోమయమై స్వేచ్ఛలో మానవ ప్రస్థానంతో అగ్నిపై అలల అడుగులతో నడుస్తుంది, ముళ్ళలో గులాబి పూవై నిలుస్తుంది గ్రామం నగరం రెండూ; ఒకే ప్రస్థానాని కిరుతీరాలు విశాల పక్షాలతో ఎగసే జీవన తీరాల్ని సంకల్పం కలుపుతుంది దూసే కత్తుల సందుల్లో నుండీ కదలే నీడల మధ్యలో నుండీ అనుభవ సీమల్ని సృజిస్తుంది; ఆలోచనా శిఖరాల్ని నిలుపుతుంది513
సంకల్పం పెదవులపై శబ్ద శరీరంతో కదలుతుంది ఎగురుతుంది ఈ దేశం ఆదేశం సీమలు లేవు, ఈ మనిషి ఆ మనిషి భేదం లేదు
29. వెలుగులోకి నదీ తీరాన ఇసుక గూళ్ళ నుండి చెట్టు కొమ్మల్లొ పక్షుల గూళ్ళ నుండీ మనిషి మస్తిష్కంలో జీవన ప్యూహం; ధూళి నుండి కలత నుండి వెలుగులోకి భౌతిక యంత్రం నుండి మానస బంధం వరకు సంకల్పం సంకల్పం వెనుకే మహాసేన వలె భవిష్యత్తు కదలుతుంది నడిచే శ్రమ చరణాలకు గమనాగమన కేంద్రం సంకల్పం ఇరువైపుల జన గణంతో వర్తమానం కదలుతుంది అభినవ సంకల్పంలో పాషాణ కణ ప్రతిమలకు స్థానం లేదు హృదయ కిరణ చికిత్స పొందే మానవతకు మరణం లేదు ఈ శతాబ్ది వదనంలో స్మృతి పథం నుండి నిరంకుశం విస్మృతమై జన సంకల్పంతో వెలిగేను ప్రజా స్వామ్య రమణీయమై వృద్దు ముందు శిశువుల వలె కొమ్మకు చివుళ్ళు ! నిశ్శబ్దం అంచుల్లో భవిష్యత్తు ఫాల తలంపై ప్రతిఫలిస్తూంది ముఖాన భయారణ్యంతోనో చూపులో అంగార సేచనతోనో పగటి వేషం వేసుకొనీ పిలవకున్నా కోరిక ముందు ఎదురౌతూంది
30. దర్శన చిత్రం ముక్కలుగా చెదరి పడిన వర్తమాన దర్పణ శకలాలనుండి భవిష్యత్తు గురించి ఆలోచన కొత్త సంకల్పానికి దారి తీస్తూంది సంకల్పనవోదయంతో ధారలో అలలు చిమ్ముతూ పోయే నావెనుకనే వీడని మహాసంస్కృతి! అణువణువులో ఒక్కొక్క సూర్య బింబం శబ్ద హృదయం నుండి ఊదిన మౌన శంఖరవమై నిశ్శబ్దశాఖాపుష్పం నుండి ఎగసిన శబ్ద భ్రమరమై నాదంతో ఈ శతాబ్ది అంచుల్లో దృశ్యం నుండి దృశ్యం, ప్రజాస్వామ్య దర్శనండైరి దర్పణంలో (1995) అంకితం జీవన పథ సహచరి శ్రీమతి ఇందిరకుడైరి దర్పణంలో సూచిక
I. అశాంతిఖండం 1. శాంతి ఎదురౌతుంది పుట 2. నిశ్శబ్దంగా 3. నాగరకతాస్వప్నం 4. విజయపుష్పమై 5. పరివర్తన చిహ్నం II. నిశాఖండం 6. రాత్రివేళ 7. శాంతి కళ 8. శబ్ద ప్రపంచంకై 9. మానవత ఒకటే 10. అబద్ధాల అలలపై III. మారణఖండం 11. కంటి చివర
12. మార్చేవ్యూహం 13. శాంతి అక్షరాలు 14. ఉదాహరణ కాదు 15. బహు దగ్గరగా 16. హృదయంలో తేజం IV. ఆశాఖండం 17. 18. V. ప్రయాణఖండం 19. ప్లాట్ఫార్పై సృజనకై ప్రార్థనకై 20. స్మృతిలో దృశ్యం 21. ముందు కదలేమనిషి 22. శీర్షికవలె 23. రైలు సిద్ధమైంది
3. డైరి దర్పణంలో
I. అశాంతి ఖండం
1. శాంతి ఎదురౌతుంది శాంతి ఎదురౌతుంది ! సమాజ హృదిలో సుళ్ళు తిరిగే అశాంతితో రాత్రి చుక్కల వలె చెక్కిళ్ళపై అశ్రు బిందువులతో ఎక్కడా ! ఈ శాంతి గురించే వార్తలు మాటలు రెక్కలు కట్టుకొని ఎగురుతాయి భయం ఉన్మత్త శిఖరంతో నిలుస్తుంది విషాదం అంగార ముఖంతో జ్వలిస్తుంది గేటు దాటి బయటి కడుగేస్తే కాపాడేందుకో కబళించేదుకో గాని చేతిలో ఎత్తిన ఆయుధంతో పరుగుతీస్తూ వార్తా దృశ్యమెదురౌతుంది. బోస్నియా, చెచెన్యా కావచ్చు నిరసన పదం, విప్లవారణ్యం అవచ్చు మల్లె మొగ్గ వలెనో మందారం వలెనో ఉదయించిన శిశువు శరీరం పేవ్మెంట్ పైనో ప్లాట్ ఫర్పైనో ధూళి పాట్లంలో చెండు వలె ఉంది. కన్నీరుతో తడిసి రక్తంతో అట్ట కట్టీ శరీరం మంచులో బిగుస్తూంది మంచు బొట్ల తోనూ ఉదయం సర్వం పుష్పించాలనే ! కోరిక సహజం రాత్రి గగనంలో మెరసే నక్షత్రాలు ప్రయాణంలో వాస్తవ సూక్తు లైతే నేలపై ఎగసే ధూళి రేణువులు బ్రతుక్కి అనుభవ సూచన లౌతాయి
2. నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా చెట్లను ఆయుధ శాలలుగా మార్చే క్షణాలు శాంతికి స్వస్తి రేఖలు ఒక్కవాడి శబ్దంతో వేడి శబ్దంతో నిశ్శబ్దం క్షతగాత్ర మవుతుంది ప్రశ్నల కంటకాలతో ముఖ మరణ్యమవుతుంది దశ దిశలు శాఖలతో సమాజం జవాబుకై ఎదురు చూస్తుంది ఎక్కడో గులాబీ ముఖం కన్పిస్తుంది ప్రక్కనే ఆనల వల్లి తలెత్తుతుంది ఒక్కొక సమయంలో ఏదైనా సాధ్యమే, జీవన పరిణామంలో ప్రతిదీభాగమే అందని ఎత్తులో వ్రేలాడే ఉట్టిలా నిద్రలో మలచబడిన స్పప్నంలా సందేహాలకు సమాధానాలున్నా, పొందే వాస్తవ మంతంత మాత్రమే518 ఆయినా జీవితం ! జన గణ శ్రమ చరణాలతో నడుస్తూనే ఉంటుంది
చుట్టూ నవ సమాజ శక్తులతో, మరో ప్రపంచ మెదురౌతూనే ఉంటుంది
3. నాగరకతా స్వప్నం ఊపిరికీ అలజడికీ మధ్య నుండి శాంతి ఎట్లాగో బయట పడుతూంది ఈ చివర నుండి ఆ చివర వరకూ నినాదమో వివాదమో ప్రవాదమో గుండెల్ని ఊపి మంటల్ని స్పజించీ ఆయుధ స్వనాలతో దిక్కుల్ని ఆకర్షిస్తాయి ఇంటి ముందు మొక్కలూ మొక్కల మధ్య పిల్లలూ కనే కలలూ వీధి నుండి దూసే మారణ శబ్దాలకు చెల్లా చెదరై మాయ మవుతున్నాయి నేలపై విజయ రాగం స్వనించాలనీ మనసులో ఇంద్ర చాప మతతరించాలనీ మనిషిలో కోరిక ! అంతరాత్మను మరపిస్తూంది చరిత్రను శిలా పాదాల తోనో కంటక కరాలతోనో నడిపిస్తూంది రోజూ కొత్త సందేశంతో సూర్యుడొస్తే రోజూ పాత సందేహంతో మనిషి మేల్కోనేను ఎడారి హృదయాన్ని వనంగా మార్చే యత్నమే నాగరకతా స్వప్నం
4. విజయపుష్పమై ఆశా జీవన ధుని మినిషిలో యుగాల దాహాన్ని తీరుస్తూ వస్తుంది దీని ప్రక్కనే శిఖరాలతో సూక్ష్మ హరిత స్పందనతోనూ గిరి ఉంది అరణ్యం నుండి నగరానికి దారి ఏ నిలయానికో రహదారికో పాయలుగా శీర్ణమవుతుంది ! మనిషిలో శక్తికీ యుక్తికీ సంకేతం ! ఒక రస హృదయం తప్ప ! నదిలో ఏలాంటి మార్పూ కన్పించదు తీరం నుండి తీరానికి పై నుండి వాలిన వంతెన కన్పిస్తుంది దాటరాని దేదీ లేదనిపిస్తుంది, మరో జగత్తును పరిచయం చేస్తుంది బిందువు నుండి బిందువు విడిపోతూ బిందువుతో కలుస్తూ నిరంతరం ప్రవాహం సమాజాన్ని తలపిస్తుంది, ప్రకృతిగమనాన్ని బింబింస్తుంది. చంద్ర బింబంతోనో సూర్య గోళంతోనో పోటీపడి ఎగసే ఆలోచన కళ్ళముందు ప్రవాహమై కన్పిస్తుంది, చేతిలో విజయ పుష్పమై వాలుతుంది519 గుడి గోపురం పై నుండి దూసి పచ్చని క్షేత్రాల్ని స్పృశిస్తూ ఉదయ హృదయం, గడ్డ కట్టిన అశాంతిని సరింప జేస్తుంది
5. పరివర్తన చిహ్నం భయాల్ని ఏ నూతి లోనో తోసేస్తూ బాధల్ని ఏ గోయిలోనో విసరేస్తూ
వేయి కరాంచలాలతో వెలుగు కళ చిమ్ముతుంది బీదరికం నిండిన జోలెనూ పేదరికం దాగిన బొంతనూ ఏ కొండ పైనో ఏ కోన లోనో విసరేస్తుంది మండే గాయాల్ని మెత్తని మంచు రేకులతో అద్దుతుంది దుఃఖితుల వెచ్చని చెంపల్ని చల్లని రాగంతో నిమురుతుంది చీకటి శిలల్ని సమూహంగా వెలుగు అలలుగా మారుస్తుంది చేతిలో నాగలీ కొడవలీతో పాటు గుండెలో ఉత్సాహ శిఖల చలనంతో జీవిత చలనంలో సంఘర్షణ సమయ సమయం నవ చరిత్ర సృజిస్తూంది బడుగు రేఖ దాటీ జోలెను వీడే ప్రజాస్వామ్య పథం, పరివర్తన చిహ్నం
II. నిశా ఖండం
రాత్రి వేళ సూర్యుని వలె ఇపుడు నా ముఖం మరో వైపు నుండి చుక్కలద్దిన వెన్నెల షామియానాలో నీడలు చేతులు కలుపుతున్నాయి గాలివేసే చాటు ప్రశ్నలకు లలితంగా కదలుతున్నాయి ఈ రాత్రి మరో తీరానికే వంతెనపై ప్రయాణమెలా సాధ్యం ? ఏ రోప్ వే ఆశ్రయం దొరుకుతుంది ? మార్పు ఒకటే సాధనం ప్రస్తుతానికి చంద్రుడూ చుక్కలూ తృప్తిగా విశ్రాంతి పొందేరు రేపును హృదిలో నింపి ప్రస్తుతాన్ని అనుభవంతో స్మిగ్ధపరచేరు కళ్ళలో ఆకాంక్షల్నీ హృదిలో ఆలోచనల్నీ రేపు అందిపుచ్చుకోవచ్చు రాత్రి వేళ సూర్యుని వలె ఇపుడు మరో వైపు నున్న నా ముఖాన్ని మీరెలా చూడగలరు ? మీ చేతులూ గ్రహించ లేవు
6. రాత్రి వేళ
7. శాంతి కళ పగటి సూర్యుడెపుడో మండి నెత్తురు బురదలో పడి కూరుక పోయాడు పైకి తీయడం కుదరని పనే ! ఆ విషయం ప్రస్తుతానికి వదలేయండి కొండపై కూర్చున్న చంద్రుణ్ణి దింపడమూ ఇపుడు కుదరని పనే పోనీ ! చంద్రుణ్ణి తొలగిస్తే ? సత్యాన్ని చాటు మాటునే ఉండనీయండి ! నిశా జీవితాన్ని వేలెత్తి చూపొద్దు! ఏ సుఖంలో నో ఊగి పోనీండి
ఏ మగతలోనో నిద్ర పోనీండి ! ఏ జలధిలోనో కలవనీండి కాకపోతే నిరంకుశత్వం గురించి ఏ కథలో గాధలో చెప్పుకోవచ్చు ఆమరే శాంత కళను చెదర నీకండి ! రేపటిని పునర్నవం చేసేదివ్యౌధం ! చీకట్లో ఏ భేదం ఉండదు ! అందరి ముఖాలూ ఒకటిగానే కన్పిస్తాయి స్పర్శలో స్పందనలో అతీత గుణ మానవతా చలనంలోనే భేదం
8. శబ్ద ప్రపంచంకై సమాజం స్పందించే శబ్ద ప్రపంచంకై నిశ్శబ్దం ఏకాంతంగా ఎదురుచూస్తుంది ఒక కేక ఒక పిలుపు ఒక మాట మనిషిలో గతి శక్తిలో చలన రూపాలు ! సమయం హిమ ఘన మైనపుడు కిరణం కను మరుగైనపుడు చీకటితో నిశ్శబ్ద మనివార్యం ! అశాంతిలో ఆవేదన తప్పని సరి ! చీకటిలో ముంచి తీసిన నా ముఖాన తగిలిన గాయం గీసిన అగ్ని రేఖతో కాలం చేసిన సంతకం వలె ఉంది అదే వాలకం అవే చేతులూ కాళ ్ళ ! అకృతిలో భేదం లేదు మస్తిష్క మనోజ్ఞశాల అదే ! శాలలో జరిగే ప్రయోగాలే వేరు ! కోరిక శంఖాన్ని పూరిస్తుంది, అవసరమైన బాణాన్ని సంధిస్తుంది అన్ని ఋతువులూ కలిసిన దృశ్యం బహు రసాలూ కలిసిన రూపం మస్కిష్కం నుండి విడుదలౌతుంది ఆ సమయ మింద్ర జాల మవుతుంది అంతరంగం వెలుగు చీకటి మయమవుతుంది నిజ జీవితం బింబిస్తుంది
9. మానవత ఒకటే సూర్యకిరణాలు చీకటి శిలల్ని వివిధ భంగిమల్లో చెక్కుతాయి ముఖంలో హృదిలో ఆలోచనతో ఆశతో ఆనందం వివిధ పక్రియల్లోమనుషు లెందరో అన్ని
శిల్పాలు
మనసు
లెన్నో
అన్ని
వ్యక్తిత్వాలు
!
మంచు తెరలు కప్పేస్తాయి ! అంతలో తొలగి పోతూంటాయి ! ఎంత కాలంగానో జ్వలించే గాయం ! సమయం సమయం సరిసిలో అనల పద్మం కావచ్చు ! ధారలో అగ్ని గుండ మవచ్చు నాలో సమాజం, సమాజంలో నేనూ, అగ్ని పొంచి చుట్టేస్తూనే ఉంటుంది శిల్పాన్ని పరామర్శ చేస్తుంది, జీవన శాఖల్ని అలంకరింప జూస్తుంది అటు ఆలోచనా జలధికీ, ఇటు హృదయ గగనానికీ తప్ప గాయాల ఆర్త స్వరం ఎవరి కెంత దూరం అందుతుంది
తనువు తగలేయబడుతుందో దేహమదే తగలబడుతుందో కాని మంటల్లో నుండి ఎగసే స్వరం మానవ నాగరకతను కూల్చేస్తూంది గళ గళం నుండి స్వరా లెన్నో! నాలుక్కి చేతనైనన్ని భాషల్లో మంట లణగుతాయి ! చరిత్ర కల్పనలో వాస్తవం మాయమౌతుంది తెగిన బంధాల మధ్య ! మానవత ఒకటే నిశ్శబ్దంగా నిలిచి ఉంటుంది.
10. అబద్ధాల అలలపై అబద్దాల అలలపై అనుమాన భయాల్లో ఈతతోనే గట్టుకుచేరేది సమయానికి ప్రయాణంలో అనుకున్నవి దొరకడం అదృష్టమే ! అవినీతి ముళ్ళ మధ్యనున్న గులాబి ఆకర్షణకూ ఆహ్వానానికీ షట్పదం వచ్చి వాలుతుంది! ఈ ముళ్ళే రక్షణ పంక్తి కావచ్చు తీతువు ధ్వనుల మధ్య చకోరం నిశ్శబ్దంగా వెన్నెల సేవిస్తుంది మంచి గంధం చెట్టు మూలాన్ని భుజగ వలయం అలంకరిస్తుంది క్షితిజం గుండెలో కత్తి వలె వాహనం దూసుక పోయే రోడ్డు మధ్యలో ఏ ఆవో వచ్చి అందంగా నిలుస్తుంది ఏమేకో చమక్కున గంతు లేస్తుంది పూలు పండ్లతో ఆకర్షించే సమాజంలో కొమ్మ నుండి కొమ్మకు దూకే చెట్టు నుండి చెట్టుకి పరుగెత్తే కపి గణాలదే మెజారిటీ ! ఇక్కడ అనుమానంతో ప్రతిదీ అగ్ని పరీక్షకు స్థాన మవుతుంది చేవ గల జీవితం అనలాన్ని సహిస్తుంది, వ్యక్తిత్వంలో ఏ అణువూ కోల్పోదు సహిస్తూ పోరాడుతూ చివరకు అస్తిత్వ మమృత దీపమవుతుంది522 హంసతో ఎవరికీ పనిలేనట్లుంటి, దీన్ని గురించే దృష్టి ఉన్నట్లు లేదు క్షీరాన్ని నీరాన్ని వేరు చేసే శక్తి మనిషిలో అంతరంగానికి సహజం పర్యావరణం కలుషిత మవకుండా గరళాన్ని కబళించే కాలకంఠుని వలె తప్త దరిద్రంలోను ధరా హృదయం రస స్పర్శ వీడదు సృజన శక్తి కోల్పోదు చీకట్లో తేలి వెన్నెల అద్దుకొనీ అనుమానం కప్పుకొనో నిద్రలో మునిగీ ఒకపుడు ముక్కలుగా జీవితంలో నిశ అనుభవానికి వస్తుంది పై చుక్కలూ తన వంతు చంద్రుడూ వెలిగినా సామాన్యుని జీవితం నిశాపర్వం సత్యం గురించి సందేహార్థాలకేం ? ఉషస్సు జాడలేంది పగలు ప్రసక్తి ఎక్కడిది ?
III. మారణ ఖండం
11. కంటి చివర కొన్ని క్షణాలు అనుకోకుండా గుండెపై మొగ్గలై, పూలై అభినందిస్తాయి కొన్ని క్షణాలు కనపడీ కనపడకుండా గుండెపై సూదులై కత్తులై దిగుతాయి కొన్ని ఆకస్మాత్తుగా ఎదురౌతాయి దారి మధ్యలో బాంబు హృదయంతోనో మందు పాత్ర మస్తిష్కంతోనో ఆగని పెద్ద అల వలె జీపు పరుగెత్తుతూంది, ఉండి ఉండీ నీలి పొగ చిమ్ముతూ ఉక్కిరి బిక్కిరి చేస్తూంది, కనిపించని మనుషులపై గురి పెట్టిన చూపులతో భయ భయంగా జీపులో మనుషులు యంత్రాలై ప్రయాణించేరు దూసుక పోయే వాహన వేగానికి అడవి హృదణ్ణం జలజల మంటూంది వాహనం సమీపించే కొద్దీ వంతెన భయంతో నిశ్శబ్దంగా వంగిపోతూంది ఆయుధాలు ప్రేలిన ధ్వనులు అంతలో నిశ్శబ్దం ! విషాద రేఖలతో వెలుగు ! ముని మాపు మసక పడినట్లుంది. పగిలిన ముక్కలై చెదరిన కాలం దిక్కుమాలిందై బావురమంది అంతలో అరపుల్ని ఆక్రందనల్ని గాలి చెట్టు చెట్టుకూ చేర వేస్తూంది మరో చెవి కందించేందుకు వెంపర లాడుతూంది ఆ నిర్జన స్థలంలో ఇపుడు కన్పించిన శవమే ఒక సమాజ చిహ్నంవిప్లవం అంగ
వేసిందనుకునేవారూ
విద్రోహం
పిడికిలెత్తిందనుకునే
వారూ
!
ఏదైతేనేం శాంతి రంగంపై చట్టం తన పని చేసిందనే వారూ ఒక ఆటవికనాటకం ముగిసింది ఆదిమ క్రౌర్యమూ కసీ కంటి చివర ఆశ్రువులకు వ్రేలాడుతున్నాయి
12. మార్చేవ్యూహం నిర్జన వన మార్గాన రాలిన ఆకుల క్రింద రహస్యంగా పరచిన గాజు ముక్కలపై నుండి దెబ్బతిని పోయిన అడుగుల రక్త చిహ్నాలు ! చుట్టూ అశాంతి హింస భీభత్సంతో అదృశ్య శిఖలు తిరుగుతాయి రాత్రి వేళ చెట్లు తిరుగుతూన్నట్లుంటుంది ఎత్తిన గొడ్డళ్ళ వలె కొమ్మలెదురౌతాయి
చాకు చూపులతో ముఖాలు జారుకుంటాయి గన్ పాయెంట్ పై జీవన హేలతో సమాజాన్ని అర్ధవంతం చేయాలనే తపన వ్యక్తి హింసతో శత్రు దళనంతో సమాన న్యాయం సాధించాలనే కోరిక ! అడవిలో ఇసుక పలకపై వ్రేలితోనో పుల్లతోనో వయోజన విద్య ఇల్లు మనిషి పూవు పండు బదులు అడవి గొడ్డలి గన్ను బాంబు పదాలు పెంచిన తల్లికీ తండ్రికీ తెలీని రీతిలో నేర్పబడుతున్నాయి ఈ వ్యూహం చెట్టు చెట్టునీ సాయుధ వ్యక్తిగా మారుస్తూంది ప్రమిదలో వెలిగే దీపం చీకటిని తొలగించడానికే కాని బొందిని దగ్ధం చేయడానికి కొంపను తగలబెట్టడానికీ కాదు
13. శాంతి అక్షరాలు శోకం ఘనీభవించిన మాతృ మూర్తి నిపుడు ఓదార్చే సాహస మెవరి కుంది ? నష్టమైన మానవ మనోజ్ఞ రూపాన్ని ఏశక్తి ఏయంత్రం తిరిగి సృజిస్తుంది ? ఎడారిలో ఇంకిన మానవతను ఏ ఆదర్శం పైకి తెస్తుంది ? క్షత గాత్రమైన సమాజం నెత్తురద్దిన చీకటి రూపం వలె ఉంది అరణ్యాన విషాదేతిహాసం జ్వలిస్తూంది గాలిలో అశాంతి ప్లవిస్తూందిచిందర వందరగా ఉన్న
స్థితిలో
ఎవరి
జేబు
నుండో
బాగ్
నుండో
కాగితం ముక్క ఆగి ఆగి ఎగురుతూ గాలిలో తేలుతూంది అక్కడ చేరిన ముఖాల్ని స్పృశిస్తూ ఏదో రహస్యం చెప్పబోతోంది ఓ జర్నలిస్టు ఎదురుగా చేతులు చాచి కాగితం ముక్క నందుకున్నాడు దీనిపై “శాంతి” అక్షరాలు వ్రాసి చిన్ని ముద్దుతో గాలిలో పైకి వదిలేసాడు
14. ఉదాహరణకాదు ఈ నగర మెప్పటి కప్పుడొక స్వప్న దృశ్యం ఎప్పటికీ కోరే శాంతి స్వప్నం ప్రతి నగర మొక సుదీర్ఘ సంస్కృతీ జలాలపై ప్రయాణిస్తూ ఉంటుంది చరిత్ర మూలల్లో నుండి ఎగసే స్మృతులకు కల్పనలు పూస్తాయి స్మృతి సీమల్లో ఎదిగే కీర్తి స్తంభాలు సగర్వ మస్తకాలతో ఆహ్వానిస్తాయి గతానికి చెందిన విషాదం పూర్వ రాగ స్పర్శతో మధుద్రవంలో ముంచి పైకి తీసినట్లుంటుంది ఎంత సాధించినా ఎన్ని మెట్లెక్కిన్నా మనం మరవందీ మనల్ని వీడందీ రణం, అవసరంగా తోచే పణం ! మనిషిని వరించే అగ్ని ఫలం
స్వార్ధం ఆయుధ మవుతుంది, హింస అలజడి ఘట్టనలో రాజకీయం నడుస్తుంది ప్రతి అలజడిపై నిరసనపై అధికారం నిప్పు పూలు చిమ్ముతుంది ఎంత గొప్పదైనా ఒకనాటి ఘటన చరిత్రలో మరో నాటి కుదాహరణ కాదు పూలను మంటలుగా, మంటల్ని పూలుగా చూచే అనుభవం రాజకీయాల్లోనే సాధ్యం
15. బహుదగ్గరగా జీవన రణంలో మొదట గాయపడేది, హృదయం రణానికి విరామం ఉండొచ్చు కాని సమాప్తి బిందువు లేదు ప్రకృతీ సమాజ సంఘర్ణణలో ఆకలీదాహంతో నేలపై భౌతిక మానస దశల్లో మానవ జీవిత మొక అభియానం దాహం వేసే కళ్ళముందు ఉదయ సూర్యుని వెలుగు భరత నాట్యం చేస్తుంది తూర్పు దిశ టేబిల్పై మధువు నిండిన గ్లాస్ వలె సూర్యుడు ఆకర్షించేను ఎటు చూచినా ఉదయ సమయం భ్రాంతి మృగతృష్ణతో అందంగా ఉంది525 ఎడారిలో తిరిగి తిరిగి ఎక్కడో పచ్చని చెట్టు దొరికి అడవిలో శత్రు భయంతో కదలి కదలి చల్లని స్నేహ పవనం తాకీ నిన్నటి గాయాల్నీ మంటల్నీ మృగ తృష్ణల్నీ మనస్సు మరచిపోతుంది పచ్చని వర్తమానంలోకి పయనింపజేసి ఆదర్శం నవ సమాజాని కాహ్వానం పలుకుతూంది పసి హృదయం తీగెలతో చెట్లతో మనిషితో ఏకమవుతుంది పెద్ద మనస్సు తీగెలకూ చెట్లకూ మనిషికీ బహు దగ్గరగా పలకరిస్తుంది
16. హృదయంలో తేజం తుపాను రెక్కలతో ఎగిరే కాల మపుడపుడూ రాక్షసంగా ఎదురౌతుంది ఇనుప పాదాలతో నడచే సమయం అపుడపుడూ నిరంకుశంగా మారుతుంది రవి బింబాన్ని సైతం అమ్మకానికి పెట్టి చంద్ర బింబాన్ని తాకట్టు పెట్టి అవసరానికి పబ్బం గడుపు కొనే చీకటి బేహారులూ తటస్థపడతారు ముక్కలు ముక్కలై చెదరి వెలుగు నెత్తు రొలికే పెద్ద గాయం వలె ఉంది బొగ్గు రాశిగా రాలిన చీకటి క్షణంలో అంటుకోడానికి సిద్ధంగా ఉంది చీకటికై రాత్రి దాకా వేచి ఉండనక్కర లేదు కళ్ళు మూసుకోనక్కరలేదు తుపాను వెనక ఇనుప పాదాలపై నడచే మనిషిని చూస్తే చాలు ! తెలుస్తుంది ఎడారీ మ్రోడూ ప్రక్కనే ఎగసే బూది పొరల్లో నుండీ కదలే మారణ రణ జీవిత చిత్రం చూస్తే చాలు ! తెలిసి పోతుంది
సూర్యుణ్ణి మోసం చేస్తే వచ్చే బహుమానం మానసిక దారిద్ర్యం మారణ తోరణ హేల ! ఏ రోజు చీకటి హృదయాల్ని క్షమించాలనీ, అస్తమించే సూర్య హృదయాన్ని ప్రార్ధించండి రేపు జీవితంలో వెలుగు మనసు ఆవహించాలనీ హృదయంలో సూర్య తేజాన్ని నిలుపుకోండి IV. ఆశాఖండం
17. సృజనకై సృజన సమయంకై మట్టి పరితపిస్తుంది ఏ కుండగానో కుంపటిగానో మొక్కగానో రూపాంతరం చెందాలనీ నాగలి చాలులో బీజ పంక్తీ కోరుతుంది సౌభాగ్యంతో నేల నుండి మనిషిని ఆకాశ మెత్తుపెంచుతుంది పయనానికి సంకల్పం మూలం ; గమనశక్తి ఆధారం చక్రం సహకరిస్తుంది, రెక్కలు సహాయ పడతాయి చుట్టూ చేసే ప్రదక్షిణ ప్రయాణం కాదు, ప్లవర్ వేజ్ ప్రపంచం జీవితం కాదు జన హృదయంతో సామాజిక చలనం ఎన్ని రాగాల్లోనో ఎన్ని వర్ణాల్లోనో ! వాద వివాదానికీ సిద్దాంత రాద్దాంతానికీ అందకుండా విచరిస్తుంది ఒకదారి పల్లెకూ మరొకటి పట్టణానికీ ఇంకొకటి ఆరణ్యానికీ ఈదారు లెక్కడెక్కడో ప్రయాణంలో కలుస్తూ చీలుతూ విడిపోతాయి వ్యక్తి రేఖలతో సమాజ సంబంధాలతో పెద్ద చిత్ర పట మెదురౌతుంది అనల కెరటాల్ని దాటాలిసిందే, కత్తుల వంతెనపై నడవాలిసిందే ముళ్ళ పొదల్లో నుండి మలపుల్లో అపాయ ముఖాల్ని తప్పించుకోవాలిసిందే పూల వలెనో కార్పెట్ వలెనో ఒకరి అడుగుల క్రింద మరొకరి బ్రతుకులు మౌన సోపానాల వలె మలచు కొని నిలిచేవీ ఎదురౌతాయి శాంతి దేవత కళ్ళ నుండి ఎన్ని బాధా పుష్పాలు రాలిందీ గాయపడిన మనస్సుకే జ్ఞాపక ముంటుంది ! కనలే వ్యక్తి అంగార కణం కావచ్చు, అరచే వ్యక్తి ఆయుధ మూర్తి అవచ్చు బిజీసిటీ వీధిలో దృశ్యం తిరగేసి వర్ణ చిత్రం వలె ఉంది బీటలు వేసిన నేల వలె ముఖంలో ఆలోచన సందేహంలో సందేశంకై ఎదురు చూస్తుంది
18. ప్రార్ధనకై ఇంటి ముందు "బిక్షాం దేహి” స్వర మిప్పటిదా ? ఎంత చరిత్ర కలిగింది ! ఈ సమాజ గతిలో భాగమైంది, ఇది నిలిచిపోతే కాలం అగినట్లే ! గోడపై కాలెండర్ కాలం వేసే అడుగుల్ని క్రమం తప్పకుండా సూచిస్తుంది ఆరోజు అడుగులెంత విలువైందీ, బరువైందీ మరునాటికి గాని తెలీదు కదలే ముళ్ళతో గడియార మెప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంది ఏక్షణమూ నిదురపొర ఎరగదు ముందు చూపు కోల్పోదు దేవునికర్పితమైనా పూల మాల వలె క్షణాలు స్మృతిలో పరిమళంతో ధూళి గతం కావలసిందే టేబిల్పై ఐస్ క్రీం కప్పు వలె గగన తలంపై చంద్రుడు చుట్టూ ఎత్తిన ముఖాలతో స్నేహితుల వలె చుక్కలు! చిరుగాలికి తల పంకిస్తూ ముంగిట్లో పాదు గుండెలో నుండో వరండాలో తొట్టి ఎద నుండో గులాబి పలకరిస్తూంది పొంచిన చీకటి పులి, క్రౌర్యాన్ని తలపుకు తెస్తూంది అక్షయ కిరణ పరంపరతో చంద్రుడు మతిలో ఆలోచనా తూణీరాన్ని నిలిపేను బయటి కిటికీ అద్దాలు పగిలిన శబ్దంతో కల చెదరిపోతుంది మేల్కొనే రాత్రి కళ్ళలో ఏముంది ? శాంతికై కలగనే అశాంతి సముద్రం ఎంత వదలాలనుకున్నా విషాదం నీడ వలె వెంటబడుతుంది కాళ్ళకు సంకెళ్ళు, పడినా, చేతుల్ని మాత్రం ప్రార్ధనకై వదిలేస్తుంది
V. ప్రయాణ ఖండం
19. ప్లాట్ఫార్్మ◌్ప నక్షత్రాల మధ్య నుండి చంద్రుని వలె చదరంగం వ్యూహంలో వ్యక్తిపయనం ఒక వైపు నుండి వీడ్కోలు ! మరో వైపు నుండి స్వాగతం ! ఒక స్టేషన్ వదలిన రైలు మరో స్టేషన్ చేరినట్లు రైలు ప్లాట్ ప్లార్పై చేరే వేళకు రాత్రి కళ్ళు విప్పుతుంది
వెలుగు హృదయం విప్పి అందరితో మాట్లాడుతుందిప్లాట్ ఫార్్మ పై వచ్చే రైలు దూరంగా
నిల్చిన
చీకటిని
వణకిస్తూంది
దగ్గరలో ఉన్న వెలుక్కి చెమటలు పట్టిస్తూంది కదలని చీకటైనా తొలగని శిల అయినా అక్కడ బల్ల క్రింద పడుకున్న కుర్రవాడే ఏ శబ్దాని కెగరి పోని పక్షి ! రైలు రాకకు మేల్కోని బల్బు రెక్కలు విప్పి గొంతు నుండి ఎగసే పాట వలె, పెదవులపై కదలే మాట వలె కదలే రైలు చక్రాల గమనంతో జీవితం కదలుతుంది పయనిస్తుంది అవసారానికి బయలు దేరినా, ప్లాట్ ఫార్పై ఆనందం పొరల మధ్య వచ్చి పోయే ఏ రైలుకూ పట్టని ! వీడని బాధా ప్రపంచ ముంది మనస్సు తెరపై ఒక్కొక్క దృశ్యం, డైరీలో పేజీ వలె తిరుగుతుంది క్షితిజం జన తంత్ర పతాకయై రెపరెపలాడనీ విప్లవం సాయుధమై ప్లవించనీ వాడు మాత్రం వాడే ! ప్రయాణికులు పరిచయ మున్నట్లే ప్రవర్తిస్తారు
20. స్మృతిలో దృశ్యం ఆరేయ్” అని “ఒరేయ్” అని నోటి కొకటి ! పలికేది మాత్రం సర్వనామమే ! స్టేషన్కు అటు వైపు కదలితే సంకెళ్ళు ! ఇటు వైపు నడిస్తే అనల హస్తం ! అందుకే అటూ ఇటూ కాని చోట ప్లాట్ ఫార్్మ◌్ప అతని నివాసం ! ఇది యథాతథానికి శరణ్యం ! భయం లేని భద్రమైన స్థానం పుట్టుకతో పడిన ఇనుప ముడి తొలగే మార్గ మింత వరకూ అందలేదు అతనికి కల తెలుసు ! ఆకలి తెలుసు ! చలనం తెలుసు ! ప్రయాణం మంటే భయం వచ్చిపోయే ప్రయాణికులతో పరిచయం ఒడ్డును అలలతో సమానం రాత్రి నుండి ఉదయానికీ ఉదయం నుండి రాత్రికీ కొందరికి ఆ మధ్య ఆగే స్టేషన్తో పనిలేనే లేదు ! పేద మొగంలో లోతు కళ్ళలో కొందరికి దొంగ వేషంలా తోస్తుంది వీటి వెనక అమ్మకనే కలలు ! అతనికి తప్ప ఎవరికి కన్పిస్తాయి ఎక్కడో జారిన సీల కోసం ఏ వాహనమూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళదు డైరీలో రాయని పుట వద్ద ఏ చరిత్ర ఆగదు ! అదృశ్యం కాదు!ఆగే రైలు పెట్టె కెదురుగా ఉన్న
అతణ్ణి
“కూలీ”
అని
పిలిచే
వాళ ్ళ
ఉన్నారు
ఎదురుగా గోడకు పోస్టర్ దూకెందుకు పొంచిన పెద్దపెలి బొమ్మతో వన్య రక్షణ దృశ్యం, ఆకర్షిస్తూంది మనిషిని ఆలోచింప జేస్తూంది
రైలు పెట్టె కదిలింది, కదిలే రైలు పెట్టెకెదురుగా క్లాస్లో బోర్్డ పై లేత మనస్సు గీసిన మొదటి బొమ్మలా ఆ కుర్ర కుంక చేతిలో పడిన చుక్కల్ని లెక్క పెడుతూ, ఆవేళ అదృష్టానికి విలువకడుతూ వీడియో చిత్రం వాలకం, ఆ దృశ్యం స్మృతిలో డైరీలో ఒక పైజీ.
21. ముందు కదలే మనిషి ప్లాట్ ఫార్్మ బెంచ్పై మాసిన దుస్తులతో ఇనుప స్తంబానికానుకొనీ ఇనుప స్తంభం రంగులో కలిసిన ముఖంతో బంధించిన బాల సముద్రాలవలె ముఖాన రెండు కళ ్ళ బోనులో కదిలే పులులు వలె ఉన్నాయి. దుఃఖం నుండిఎగసే అగ్ని అణగింది బాధ నుండి లేచిన కంటకం వంగింది సాహసమెత్తిన ఆయుధక్రియ ఆగింది, జన సముద్రంలో సుడిగుండం నిలిచింది. ఆ వ్యక్తి స్తంభించిన గాలిలో ఆకు కదలని నిశ్శబ్ద వృక్షం వలె కూర్చున్నాడు ఫాలంపై గాయం పగలు వెలిగే ఎర్రని బల్బువలె ఉంది ఇది అపాయాన్ని సూచించేనా? కొత్త దారి చూపించేనా? చూచే వారిలో సంశయం! ఆలోచనతో చిగురిస్తుంది! కష్టంలో బాధలో తృప్తి ఆనందంతో అశాంతి పోరాటంలో శక్తీ సంకల్పంతో అలల మధ్య అగ్నిని తలపించీ అలల నుండి మంటలు మెరపించీ విరామ చిహ్నం వలె కూర్చున్నాడు! భ్రమ లేదు సంభ్రమమంతకన్నా లేదు. అల కదలిపోయి దాని స్థానంలో మరో అల వలె వచ్చిపోయే జనం కళ్ళకు ముఖం దర్పణం వలె ముక్కలుగా పగిలినట్లుంది! ప్రతి ముక్కలో విషాద శకలం! ఎండ చల్లబడినట్లున్న ఆ కళ్ళలో మల్లెపూలు చూడాలని ఉంది తుపాను రెక్కలు ముడిచిన ముఖంలో సమాజ శాంతి చూడాలని ఉంది. పయనంలో ఏ ముఖమైనా తటస్థ పడొచ్చు! దీనికి సమయ నియతి లేదు గెలుపు నుండి ఓటమీ ఓటమి నుండి గెలుపూ చక్ర భ్రమణం! ప్లాట్ఫార్్మ పై అలల వలె కదలే ముఖాల్లో పచ్చ లైట్ బింబించిందిమాటలు పూర్తి కాకుండానే
రైలు
రానే
వచ్చింది.
ఆ వ్యక్తి లేచాడు, అతని మస్తిష్కానికి సమాంతరంగా ఎత్తిన రైఫిల్ వెనుక నుండి కదులుతూంది, నగ్న రహస్యం వలె ముందుకు కదిలాడు.
22. శీర్షిక వలె చిన్నతనంలో తప్పిపోయిన లేత కిరణం, ప్లాట్ఫార్్మ పై వచ్చి పోయే రైలు వేళ కందుకునేను ప్రతి స్త్రీలో అమ్మను చూచేను శబ్దం నుండి జారిన అక్షరం వలె ఒంటరిగా నిలిచేను ఒక వాక్యంలో స్థానం కోసం ఎదురుతెన్నులు చూచేను. ఈ ముఖంలో విషాద రాగం విన్పించడమే కాదు కన్పిస్తుంది కూడా కూలీ పిలుపులోనో వెన్ డార్ కేకలోనో జన కోలాహలంలో అలవలె ఎగసే అభిలాష అణగిపోతుంది, దూరం నుండి ప్రార్థన అణగిపోతుంది దీన స్వరంలో పగిలిన అద్దం వరసగా రాలే ముక్కల ధ్వని వినిపిస్తుంది బావిలో చంద్రబింబంవలె ముఖంలోకి తొంగి చూడాలనిపిస్తుంది. భవిష్యత్తులో ఆశ వలె చెంపల్ని అరచేతుల్లోకి తీసుకోవాలనిపిస్తుంది. ఈ కూన రాకకోసం ఎక్కడో తల్లి! గడప ముందు దీపంవలె ఎదురుచూస్తుంది చంద్రవంక వలె నడచీ ఇంట్లో అడుగు పెట్టాలనే కోరిక సహజం. అల వలె కదలే ఆరాటం వెనక నుండి అగ్ని శిఖ దూకేనా? అభిజ్ఞానం జారిన ఉంగరం వేలు వలె ఇక్కడే నిలిచేనా? ఏ అరణ్యం లోనో గన్ పాయింట్ అయి తిరగవచ్చు నుదుటిపై మానిన గాయం, దీన భయ శీర్షికవలె ఉంది.
23. రైలు సిద్ధమైంది ఆగిన రైలు పెట్టెలో నుండి జన కోలాహలంలో ప్లాట్ఫార్్మ పైకి మనిషి దిగుతూందీ దింపబడుతూందీ తెలీకుండా ఉంది అందరికీ తెలీని రహస్య పుటల్ని తిప్పే గాలి ఉక్కిరి బిక్కిరౌతూంది హృదయాల్ని మాత్రం నిశ! చేతివ్రేళ్ళతో మృదువుగా స్పృశిస్తూంది.జనం వెన్ను తట్టి మరీ ఆ
కలరవం!
అటువైపు
లాక్కొని
పోతూంది
దెబ్బతిని వాలిన వ్యక్తి కన్నా చూచే వ్యక్తి పొందే బాధ అనల్పం! ఆలయ గోపురం ఎగిరి మసీద్ మీనార్ దూకి చర్చి ఆర్చి దాటి శాంతి వచన మింకా రావలసి ఉంది, అతడే మతమో తెలీదు! ఏ ఊరో ఏ పేరో తెలీదు! ఏ గుర్తింపు కార్డు బయటపడలేదు కన్నీటి చుక్క రాలడం హృదయ సహజం! సానుభూతి చూపడం మానుషధర్మం క్రూర కర్మ క్షమింపబడుతుంది మరో రోజుకు హిమం వలె కరగిపోతుంది మనిషిలో మానవత ఉదయం చేతిలో పద్మం వలె
శుభ్రమై సుందరమై క్షణాల్ని పరిమళంలో అద్దుతుంది మరో తరంపై విశ్వాసం గుండెపై శిశువు వలె భవిష్యత్తును పైకెత్తుతూంది ఈ ఆశతోనే సమాజం జీవించేదీ ఈ ధైర్యంతోనే జనం ఉన్మదితం కానిదీ. అతని చివరి శ్వాసలో తుపాను కంపిస్తూంది అతని చివరి చూపులో సూర్యుడు గొడుగేసుకునేను విజిల్తోపాటు పచ్చజెండా ఊగింది ప్లాట్ఫార్్మ వదిలేందుకు రైలు సిద్ధమైంది. (1996) అంకితం పరిశోధనలో నిర్దేశకులూ కవీ, శాంతమూర్తీ ఆచార్య పల్లా దుర్గయ్యగారికి ఈ శతాబ్ది రెక్కలపై పుట 1. నారీ వాద పథం 2. i) దళిత స్వరం ii) దళిత స్పందనం 3. శాంతిస్వప్నం 4. ఈ శతాబ్ది రెక్కలపై ..... 553535 4. ఈ శతాబ్ది రెక్కలపై
I. నారీ వాద పథం
వెనుక కదలే నీడకు భయపడీ పారిపోయే రోజులు పోయాయి రాత్రి వేళ గుర్తించి వేలెత్తి చూపే వీధి దీపం భయం లేదు
1. నారీ స్పందనం ఇపుడు కళ్ళలో ఉంది చీకటి కాదు, తేలే నిశ్శబ్ద సూర్యుడు మాత్రమే తాము కోరేదీ తమకు కావలసిందీ ఏ చెట్టో ఏ పందిరో ఆశ్రయం కాదు చెట్టునూ పందిరినీ సైతం కాపాడుతూ పోయే నవ నారీ వాద చైతన్యం. పడినా చెదరినా ఓడినా గెలిచినా అడుగడుగునా వ్యక్తిత్వంతో బ్రతికే అస్తిత్వంకై పోరాడే స్వేచ్ఛామయ ప్రపంచమే ఇప్పుడు తమదువుతూంది. అనుమానం పెనుభూతం మనిషి వెనువెనుకే ఉంటుంది కిరీటం క్రింద విస్మరణ గుణం రహస్యంగా నిలిచే ఉంటుంది కాలిన కోర్కెలతో వాడిన ఆశలతో హృదయం శూన్యమయ్యే సమయం ఆలోచనలో మార్పుకు సర్జరీ ఒకటే శరణ్యమవుతూంది. యుగాలుగా ఎదుట నిల్చిన ప్రశ్నలకు సమాధాన వ్యక్తిత్వంతో స్త్రీవాద చైతన్యం భవిష్యత్తుకు ఉదయ రూపమిస్తూంది సమాజ చరిత్ర పుటల్లో భవిష్యత్తుకు క్రొత్త శక్తుల్ని సృజిస్తూంది.
2. నారీ బింబం యుగాలు గడిచినా ఉద్యమాలు నడిచినా నారీబింబం ఇప్పటిదాకే అప్పటిదే హృదయ పాత్రలో వేసే భిక్షతో! క్షితిజంలో! విసరబడిన భవిష్యత్తుతో పుట్టింది మొదలుకొనీ బాధ మృత్యువు అంచుల్లోనే నివాసం మృత్యువంటే ఇపుడే భయం లేదు! ఎన్నోసార్లో ఎదురై తోక ముడిచింది. ముందువైపునుండి బలమైన చేతులే ఎదపై అనల బంధం కావచ్చు వెనుకవైపు నుండి కలగన్న చేతులు మెడలో ఇనుప బంధం కావచ్చు.క్షణ క్షణం గాయపడే
మృదు
వ్యక్తిత్వం
చల్లని
మాటకై
ఎదురు
చూచేను
వెచ్చని స్పర్శకై కలలుగనేను, చివరకు నేలపై చూపులు నిలిచేను బాధ దీపమై ముఖాన్ని వెలిగిస్తుంది; ఆమె కదలుతూంది తిరుగుతుంది జీవితంలో మట్టిబొమ్మగానో; గాజు బొమ్మగానో, కొయ్యబొమ్మగానో సమాజ దాహానికి కుజురాహో! అర్ధ నగ్న శైలి ఉండనే ఉంది
సమాజ రూపానికిపుడు కొత్తగా అర్థవంతమైన రీతి ఏర్పడుతూంది గమన దిశలో మార్పుతో నారీ బింబం! ఇతిహాసాన్ని లాగి పట్టుకొని మునుముందుకు నడిపించే ఉపమేయం వలె ఉంది.
3. చరిత్రను పరుగెత్తిస్తూ ప్రతి రోజూ మండే వృక్షమైతే నీడ కోసం గూటి కోసం ఎక్కడికి వెళ్ళాలి? శ్రమ ఎపుడో రాత్రి చల్లదనాని కుపశమిస్తే! అప్పటికి నిదుర వచ్చేస్తుంది ఇదొకటే సుఖ ద్వీపం మిగిలింది మేల్కోడంతో పైన ఉదయభయం చిమ్ముతుంది ఆమెలో మౌనం ఇనుప కవచమైంది, ఏ స్పర్శ వికాసాన్నివ్వడం లేదు ఆమెలో ఘనీభవించిన నిశ్శబ్ద తలంపై రాగం స్కేటింగ్ వలె వచ్చిపోతుంది. ఒకటి రెండు కన్నీటి చుక్కలు ధైర్యం చేసి ముందుకు వస్తాయి అరచేతిలో కాయలు కాచి వేళ్ళు వంగిన అరచేయి దొప్పలో రాలి అంతలో భయంతో చెదరిపోతాయి ఇదోమానసిక స్థితిలో జరిగే స్థితి అనే చిలక్కొయ్యకు వేలాడే సంతోషమే మిగిలేను. ముడిచిన రెక్కలతో ఎగిరేందుకు, పాతిన కాళ్ళతో నడిచేందుకూ వీల్లేకుండా సమాజంలో తనకు దొరికిన స్థానం, తలపై మొలిచే గడ్డి పోచలతో మీనార్ వలె ఉంది గోడ గడియారం ముళ్ళవలె ఆలోచన సాగుతుంది. ఈ సమయం ఆమెలో స్త్రీవాద చైతన్యం చకచ్చకితమై విద్యన్నవమై చరిత్రలో వెనుకబడిన శక్తి గతిని ఉద్యమింపజేస్తుంది మౌనాన్ని మ్రోగిస్తూ, నిశ్శబ్దాన్ని తొలగిస్తూ, సమయాన్ని మాట్లాడిస్తూంది గోడల్ని తొలగిస్తూ శిఖరాల్ని దాటుతూ, చరిత్రను పరుగెత్తిస్తూంది.537 కెమెరా ఫోకస్లో ఈనాటి స్త్రీ ఒక విజేత వర్తమాన స్వేచ్ఛా లహరిపై అస్తిత్వం పొందుతూంది “బందిపోటు” భావన నుండీ “మృగారణ్యం” తత్త్వం నుండీ అగ్నిపంజరం స్థితినుండీ, అనలబంధం సమస్య నుండీ ముక్తమయ్యే చేతన, సామాజిక శక్తితో సాకారం పొందుతూంది. స్త్రీత్వం పాపం కాదనీ, శాపమసలే కాదనిరూపిస్తూ అరచేయిలో ఒదిగిన ఆకాశం పైకెగసి శబ్దిస్తూంది. ఎదురులేని అభిమానంలో “విద్యుద్దండం”తో, వెలుగుతూంది “నీడ వెనకనున్న అదృశ్యరూపం” మారుతూంది,
కొత్తముఖం అవతరిస్తూంది ఇపుడు స్త్రీ ఏ ప్రదర్శనలోనో క్రీడా యంత్రం కాదు వర్తమాన క్షణాలపై నడచే చంద్రరేఖ అసలే కాదు, వర్తమాన తంత్రులపై మ్రోగే స్వతంత్ర హృదయం నారీ స్వామ్య పథంలో పరిణత సమయ శిఖరం.
4. కెమెరా ఫోకస్లో శిఖర తలంపై పరివర్తన తేజం కెమెరాను మ్రింగేసే ఉన్మేషం వలె ఉంది నుదుటిపై కుంకుమ కోపిస్తూనో ముఖాన పసుపు శపిస్తూనో సూర్య చంద్రుల్లాంటి రెండు కళ్ళనూ కలిపే సూత్రం విసరేస్తూనో గాలి రెపరెపలో పాతపైటను తగలేస్తూనో కన్పించే ఉద్యమదృశ్యంలో స్వప్నం నిజమౌతూన్నట్లుందీ సమయం, కెమెరా ఫోకస్లో !2. దళిత స్వరం
1. సంభాషణ చరిత్రలో సమాంతర పంక్తుల్ని మధ్య మధ్య కలిపే దళిత రేఖలు క్షేత్రాల నుండి యంత్రాల దాకా సమాజ బంధాల్ని నిలిపే శక్తులు రోజూ మునుముందుగా బహు చురుగ్గా వీరి ముఖాన పొద్దు పొడుస్తుంది అరిగిన అరచేతుల్లో ధూళి క్రమ్మిన రేఖల్లో నక్షత్రాల్లోని గగనం కన్పిస్తుంది. ప్రతి రోజు కొత్త బ్లేడ్ వలె పొరపాటునో అలవాటునో గాని పాత గాయాలు మానక ముందే కొత్త గాయాల్ని సృజిస్తుంది. సమాజానికి వీరు మూలాలు కావచ్చు, సమయశక్తికి చక్రాలు కావచ్చు హరిజనుడనో గిరిజనుడనో ఎవరో వేలెత్తి చూపే దాకా తెలియలేదు ఏ బుద్దుడో క్రీస్తో గాంధియో పిడికిట్లో వెలుగులు విదిలిస్తే చాలదు సమాజంతో ఇప్పటికీ వీరి అనుబంధం ఏ రాళ్ళతోనో చుక్కలతోనో! అన్నట్లుంది రాత్రి చీకటిలో ఒకటై, ప్రకృతి హృదిలో వెచ్చగా అర్థనగ్న శరీరాలతో బ్రతికేరు; ఆకురాలిన రుతువు వలె నిలిచేరు
2. ఉపాయనం పుట్టిన సమయమొకటే వీరికి ఉదయం ఆ తరువాత ఉదయాలన్నీ నిశలే ఊహలో ఎగసే స్వప్నమొక్కటే వీరికి జీవితంలో ఉపాయనం.
ఊళ్ళో వీరు నడచే దారులు నిశ్శబ్దంగా మాట్లాడతాయి! దారులు చీలేచోట సశబ్దంగా చర్చలు జరుగుతాయి దూర దూరం నుండి ఆదర్శాల పతాకాలు మృగతృష్ణలుగా కన్పిస్తాయి దగ్గర దగ్గరలో ఆశలు అందని అలల వలె దొరలిపోతాయి. మనిషిచే మనిషి బహిష్కృతి, చరిత్రలో ఏ మలుపులో మొదలైందో? తరాలుగా పేర్చిన శిలా ప్రాకారాలు నిషేధించిన మనిషిని లోనికి రానీయవు హృదయాన్ని నిర్జన స్థలంలో వదలేసి క్రుంగిన దేహాలకు బంధనతో శిక్ష ఏ రూపంలో ఉందో? ఆపై వర్ణాలంకారంగా మారింది.539
3. అవసరమైంది ఏ గోడకో బండకో విసరేసిన శిరస్సు ఓ విషాద కథ చేబుతుంది ఏ ధర్మసంస్థకూ పట్టింపు లేదు, ఏ న్యాయశాలలో ప్రవేశం లేదు ఐదు నక్షత్రాల ఆశ్రమాలున్నాయి, ఏడు నక్షత్రాల వైద్యశాలలెగసాయి రేపేం జరుగుతుందో తెలీదు కాని ఈ రోజు ఇట్లా గడచిపోతే, అదే గొప్ప! ఈ మౌన ప్రతిమలు మాత్రం ఏ చెట్టు మొదట్లోనో! ఏ కప్పు క్రిందనో ఏ గోడవెనకో, ఏ స్తంభం మాటునో బాధ ముడుచుకొని బ్రతకాలిసిందే. ప్రవాహాన లోతుగా నిల్చిన కాళ్ళతో వంతెన వలె నున్న వీళ్ళు భుజాలపై వీపులపై గట్టు నుండి గట్టుకు బరువుల్ని చేర్చేరు ప్రపంచానికవసరమైనవన్నీ వీరి చేతులపై తిరగాలిసిందే వీరి పొట్ట కవసరమైంది మాత్రం! ఎవరి చేతుల్లోనూ లేదు.
4. మనిషి మరచింది తరాలుగా జారిన కన్నీటి బిందువులు బిగిసి హిమ శిలలైనాయి ఒకటి రెండు నిప్పురవ్వలు విసిరితే! చాలదు! హిమానీ రూపం తరగదు వీళ్ళ శరీరాలపై గాయాలు వీరెవరో సచిత్రంగా చెబుతాయి. విషాద మొలికే తరంగం వలె దూకే కొరడా కొస చురకలతో సన్నని బరికె దెబ్బలతో చరిత్ర విషమగతుల్ని పొందింది చెరపినా చెరగిపోని శాశ్వత చిరునామ ఫాలతలంపై వ్రేలాడుతూంది శాశ్వతమనుకునే రూపాల నీడలు వెనుకనుండి ఉరిత్రా భయపెట్టేను ఊరు బయట చెరువులో నీరు దోసిట్లో తళతళ మెరసేను త్రాగేముందు తోటి మనిషి మరచిన మానవతను జ్ఞాపకం చేసేను. సరస్సులో కావలసినంత నీరుంటేనే! అలలు పైకి లేస్తాయి
మెట్లపై సరిగమలు పలుకుతాయి సమాజంలో స్వరాలు వినిపిస్తాయి ఊరవతల దూరదూరంగా పొదలవలె అణగి మణగిన బ్రతుకులు చేతులు ముడుచుకొనీ అలసట తెలీని మ్రోడుల వలె ఉన్నాయి.
5. వలవేసీ తెరచిన సమాజ పుస్తకంలో అచ్చు తప్పు పదాల వలె గుడిసెలు ఉదయం తెరపై వీడని చీకటి పక్షులు జ్ఞాపకమొస్తాయి. ధూళిలో ఊపిరి తీస్తూ వదలుతూ ఆకలీ దారిద్య్రం అంచులపై కదలుతూ ఉదయ సంధ్యలో గుడిసె నుండి రాతి ప్రతిమల వలె నిష్క్రమించేరు సాయం సంధ్యలో గుడిసెలోకి మట్టిబొమ్మల వలె ప్రవేశించేరు సమాజంలో ఉప్పు సముద్రంలో చేపల వలె బ్రతికేరు ఎవరి కెప్పుడవసరమైతే వలవేసీ వారిని ఒడ్డుకు లాగేరు ఎవరికెప్పుడవసరమైతే వారి కలల్ని సర్దడమే వారి పని
7. హిమశిలతో సమానం మనిషి ఎడారి దాహంతో ఎండిపోతున్నా ఊరు బావికి దూరంగా ఉండాలి మృత్యుభయంతో వణకుతున్నా ఊరి వెలుగువైపు చూడకూడదు మానవతపై మూతలా పరచుకొన్న నీలి రెక్కలు తొలగవు. మానవతపై నీడలా పరచుకొన్న స్వార్థశక్తులు వీడవు వీరిలో పొరపాటున రేగిన కోపం లోలోపల దహనం కావలసిందే పైకి పొగ కూడ కన్పడ కూడదు, లోలోపల చుట్టుకపోవలసిందే. చుట్టూ అసంఖ్యాక శూన్య హస్తాలు తమ అవసరాలకు ముందుకు చాస్తాయి శ్రమ గురించి ఆలాపనతో శ్రేణులుగా వివిధ వర్గ ముఖాలెదురౌతాయి రెప్ప వాలని ఆర్తి నయనాలతో నడుం వంచని వేగ చరణాలతో ఎవరెవరికో కాలికి ముల్లు దిగకుండా చూడాలి దారిలో పూలు పరచాలి. ద్వేష బీజాలు కత్తులై వెలసినా తామే సందుచేసికొనీ తప్పుక పోవాలి వేదనతో ప్రాణితం కాని హృదయం జీవం లేని హిమ శిలతో సమానం. క్యాలెండర్లో తేదీ మార్పుతో రోజు ముఖం మారుతుంది వీరి బ్రతుకులో ఏ రోజూ ముఖ రూపం ఒకే విధం!
8. తీరని కోర్కెలు విషాద ముద్రతో మానవ సంబంధాలు వాడిన ముఖ తోరణాలయ్యేను
మస్తిష్కంలో అమరిన డైనమేట్తో ఇప్పుడు మనిషికి నిద్ర ఎట్లా వస్తుంది? పచ్చని స్వప్నమెట్లా దిగుతుంది? దీనికి బీజం చరిత్ర అనుభవమే541 ఆకాశం నుండి ఆగ్రహాఘాతానికీ సముద్రం నుండి భీభత్స తరంగాలకూ కష్టాల్నీ నష్టాల్నీ వహించేది! సమాజంలో గట్టునున్న దరిద్ర శాఖలే! వీరి స్వప్నంలో విమానం తీరని కోర్కెల్ని మోసుకొని విహరిస్తూంది వీరి మెలకువలో రైలు తమకు తెలీని గమ్యానికి నిండుగా పరుగెత్తుతూంది. దళిత జన చరిత్రలో అభినవ బింబం నేడో విజయ శక్తి పొందుతూంది. దీన హీన బాధా గతం జ్వలిస్తూంది సమతా వాస్తవం చివురిస్తూంది మతమూ సంస్కృతి పేరిట ఇంతవరకూ దారి మూసిన హస్తాల్నీ వీటి వెనుక దాగిన శక్తుల్ని! దళిత స్పందనం ప్రశ్నిస్తోంది.
9. సువర్ణ పుష్పమై మౌనంలో పెకలిన శబ్దం! రక్త చిత్రాన్ని ప్రతిఫలిస్తూంది. నిశ్శబ్ద గాథా కథనం! తిరగబడే హెచ్చరిక అవుతూంది. ఆకలిలో ఎరుపుదనంతో ఆలోచనలో పచ్చదనంతో, కాలం దళితమై బంధించిన ప్రవాహ గమనం వలె మరో వైపు మరలుతూంది. నిన్న కూలిన భేద భావ శిథిలాల నుండి ఎగసిన కలహ శిఖలు మరచి ఈ శతాబ్ది అంచుల్లో దళిత గణం ప్రజాస్వామ్య శక్తులతో కదలుతూంది అగ్ని శిఖలపై నుండి, ముళ్ళ తీగెలపై నుండి మానవీయ స్పర్శతో దళిత శక్తి ఉదయిస్తోంది సువర్ణ పుష్పమై మానవతా బింబమై. దళిత స్పందనం
10. సమయాన్ని నడిపే ప్రశ్నలు మేం ధూళి కమ్మిన శ్రమ రూపాలం! ఆడబడే ఆట బంతులం సమాజ సోపానాల ప్రక్క శిల్పంకై ఎదురుచూచే చీకటి శిలలం మాకూ హృదయముందో లేదో? ఎవరికి తెలుసు? బ్రతుకు ఆటలో మా గెలుపు గగన కుసుమ మయింది! మృగతృష్ణ అయింది!542 ఎండ వాన చలీ అన్నీ ఒకటే! మాలో యంత్రానికి శక్తినిచ్చేవే మాకూ వెలుక్కీ ఇంతవరకూ అందని దూరమే, ఆఖరికే మూరో! జానెడో! తలుపు లెవరికి తెరవబడతాయో? ముంగిట్లో స్వాగత మెవరికి లభిస్తుందో? ఎదురైన ముఖాలెవరిని గుర్తిస్తాయో? ఎవరిని సమాదరిస్తాయో తెలుసు! ఆ వీధిలో దీపాలకూ ఆ ప్రక్కనున్న చెట్లకూ మరీ మరీ బాగా తెలుసు!
ప్రశ్న ఏదైనా ఒకే ఒక “శ్రమ” సమాధానంతో తరలే కర్మ దళితులం. ఉదయం స్క్రీన్ పయి శ్రమ సాధనాలతో కదలిపోయే మనిషి బొమ్మలం! కళ్ళలో ఆరని జ్వాలతో ముఖంలో దాగిన అలలతో అడుగులతో దారుల్ని కొలుస్తూ కదలే మానవ యంత్రాలం! దేనికీ ఆగకుండా సమయాన్ని నడిపే ధూళి క్రమ్మిన శ్రమ శక్తులం! అరచేతిలో అదృష్టం కొందరికి ఒలుకుతుంది కొందరికి చిలకబడుతుంది. ఎదురైన రాత్రి కొందరికి పిడికిట్లో ఖడ్గమవుతుంది కొందరికి కళ్ళముందు భయ సముద్రమవుతుంది ఉదయ వర్ణం ఒకరి ముఖంలో పాట అవుతుంది మరో ముఖంలో సుందర చిత్రమవుతుంది దివా రూపం కొందరి భుజాలపై పర్వతమవుతుంది కొందరి అడుగుల క్రింద రెడ్ కార్పెట్ అవుతుంది సమయం కొందరికి మృగతృష్ణయై దూరమవుతుంది కొందరికి స్వర్ణ హరిణమై వశమవుతుంది
11. ప్రశ్నిస్తూ ఎప్పటికపుడు ఎక్కడికక్కడ! ప్రశ్నించే మనిషికి ఇపుడు కొత్త గతితో కొత్త రుచితో కొత్త శక్తి చూపేను.
12. మనో బంధం ఎక్కడి నుండో విమాన యానం చేసి ఈ నేలపై కాలుమోపగానే చుట్టూ ఉన్న సమాజ పరిష్వంగంతో ఎగసీ ఆనంద తరంగంపై తేలీశరీరమెపుడు కారులో
వాలిందో
తెలీదు
పారవశ్యం ఆలోచన రెండూ మనస్సుకిరుపార్శ్వాలైనాయి! సాగే కారులో ముందున్న అద్దంలో ప్రతిఫలించే ఉదయ సూర్యుని వెలుగు మారే సప్తవర్ణ రేఖలతో మారే సంబంధాల కద్దం పడుతూంది. కారులో శరీరం ఏకాంతంగా ఉన్నా మనసు మాత్రం సమాజం మధ్యనే ఉంది ఉదయ పరిమళ మద్దిన గాలి ఎదలో రాగ బంధాన్ని సృజిస్తూంది ఆలోచన స్మృతులతో జ్వలిస్తూంది; ఇంధనానికే లోటూ లేదు ఒక బ్రతుకు మరో బ్రతుక్కి ఇంధనమై సమాజ జీవితం వెలుగుతూంది. ఊరు ముందు మామిడి తోట ఉత్సవ కళ రాశి పోసినట్లుంది
చెరువులో నీరు కాస్త ముందుకొచ్చి ఊరు చెంపల్ని స్పృశిస్తూంది వరద పాయ అపుడపుడూ ఊరు నితంబాన్ని చుట్టబోతుంది ఆ చెట్టూ ఆ చెరువూ ఆ ఇళ ్ళ! ఆ మనుషులతో అనుభవం అందమైన స్మృతి నివేశనానికి తలుపులు తెరుస్తూంది. కారు సరాసరి పాత మేడ ముందు ఆగింది, ధూళి బెలూన్ వలె ఎగసింది చుట్టూ పిల్లలు మూగారు. "ఎవరు మీరు? ఏం కావాలనే” ప్రశ్నల మధ్యలో పెద్దలు చేరారు. "ఇప్పుడిక్కడ ఎవరూ లేరని” పలికారు ఇంతలో ఈరడు లోపలి నుండి వచ్చి గేటు తీసాడు అతడు అప్పటికీ ఎప్పటికీ అదే! గుడిసెలో నివాసం! అతనిలో ఏ మార్పు లేదు! ఒక్క కాలంపై వయస్సులో తప్ప! పైకి రాయి విసరి కాయలు రాల్చిన చింతచెట్టూ కన్పించింది ఎన్నిసార్లో తాడు తెగి బొక్కెన మునిగిన బావీ! చూచాడు ఆ ఆగంతుకునిలో ఈ విశేష క్షణం! ఈరడిలో మాత్రం బహు సాధారణం! ఎప్పుడో తాళం వేసిన ఇల్లు స్వేచ్ఛకై ఎదరుచూస్తుంది దుమ్ముతో బూజుతో ద్వారం ముఖాన్ని గతంలో దాచేస్తుంది. తాళం వేసిన తలుపులు మౌనంగా రహస్యాన్ని కాపాడుతున్నట్లుంది ఆ వచ్చిన వ్యక్తి వాలకం చూస్తే! వచ్చినంత సేపైనా ఉండేట్టు లేదు చెట్టుతో సహా ఎంత ధర పలికేదీ అంచనాలో మునిగి తేలుతున్నట్లుంది కారు వెనక్కు తిరిగింది! తిరుగు ముఖం పట్టింది. ఈరడు గేటువేసి లోపల గుడిసెలోకి వెళ్ళాడు. యోజనలో ఎవరి మార్గం వారిది పయనంలో ఎవరి గమ్యం వారిది ఈరడి బ్రతుకెప్పటికీ యథాస్థితి! రేపేమౌతుందో తెలీని జీవితం! దళిత శబ్దం సార్థకంకావచ్చు! సామాజిక చలనంలో ! ఎంతకాలం రక్షణ చేసినా, భద్రతకెప్పటికీ ముప్పేపొంచి ఉంటుంది. గుడిసెనుండి మేడపైకి మాలో ఎదిగిన వారూ ఉన్నారు
13. మేమూ మీ వారమే వాళ్ళు మా గురించి పట్టించుకోకపోరు, అంత పట్టించుకోకపోవడమే మంచిది లేకపోతే ఏముంది? బాబు! మేం పాపులమో! పావులమో! కావలసిందే మా బ్రతుకుల్లో చిచ్చు పడవచ్చు, మా బ్రతుకులకు ఉచ్చు పడవచ్చు. మెట్టు మెట్టుపై వాలిపోయే మస్తకం అడుగడుగున నలిగిపోయే హృదయం
తరుముకొని వచ్చే రాత్రిని సైతం, నిలిపేస్తుంది! చరిత్రకు షాక్ ఇస్తుంది స్వప్నం మంచు రూపం వహిస్తుంది, నిజం నిప్పు రూపం పొందుతుంది అరచేయి రేఖల్లో అడుగునబడి కన్పించని మా అదృష్టం ఇప్పుడు, సామాన్యుని స్వేచ్ఛకు సమతకు సంకేతమై, మినీ సూర్యబింబమవుతూంది.
14. ఉదయ స్వప్నం కణ కణంలో కన్పించని అలజడి! రణ రణంలో చరిత్రకు సోపానం! వాస్తవం! ఎవరూ పట్టించుకోకపోయినా పిచ్చి సమయం మధ్య మధ్య జ్ఞాపకం చేస్తుంది. మనిషిలో ఎప్పటికీ ఏదో కల! మరో కలతోనే అడుగు ముందుకు సాగుతుంది కలలో అలంకృత మనో రూపాలే! పుట్టుకతో రెక్కలతో ఎగసే ఆదర్శాలు రాజకీయమో సామాజికమో ఏదైనా! ఒక్కొక్క కల ఆడబడే పేకాట వాస్తవంగా నిన్నటి కల రాలిపోకపోతే నేటి కలకవకాశమెక్కడిది? గేటు ముందు ఆకలితో నిల్చిన దరిద్రుని పాత్రలో చెట్టునుండి రాలిన పూవు అవసరం లేంది! నిప్పు కణంగా విసిరవచ్చు! స్వప్నశకలంగా వదిలేయొచ్చు!545 కలకు అంతస్తుతో పనిలేదు, కలకు పనికిరాని వస్తువు లేదు! కల డైనమో అయి వెలుగు తేవచ్చు కల డైనమేట్ అయి ప్రేలవచ్చు. కలకు వాస్తవం మూలం కల వాస్తవానికి చిహ్నం.
15. కెమెరా ముందు దరిద్రం వహించిన మనిషికి చంద్రుడు బిగిసిన మంచు దిమ్మెవలె తోచేను ఆటలో ఓడిపోయిన తెల్లని పావులవలె పైన చుక్కలు కన్పించేను నాలుగు దిశల మధ్య అవని ముందున్న వధ్య శిలవలె నిలిచేను అస్పృశ్యత! దేహానికా? ఆత్మకా? భౌతికం అజ్ఞానంలో భాగమైతే కానీ దేహం జీవితాని కాధారంగా గుర్తిస్తే, చరిత్రకెంతో పని మిగులుతుంది. దారి ప్రక్క మలిన దేహాలను, మంచు ్లజ్ తొడిగిన కిరణాలతో ఉషస్సు ఉదార హృదయంతో స్పృశిస్తోంది, ఉదయం వీడని స్వప్నం వలె ఉంది సౌధ శిఖరంపై విహరించే దృష్టి! మెట్టు లేని గుడిసె చుట్టూ తిరుగుతూంది ఓట్లు కోరే ముఖ యంత్రం కావచ్చు! దృశ్యం తీసే టెలివిజన్ కెమెరా కావచ్చు. ఎప్పుడో గాయపరచి సరాసరి దూసుకపోయిన బాణం ఇప్పటికీ స్మృతి మ్యూజియంలో భద్రంగా ఉంది సమాజ ప్రదర్శనలో అక్కడే! గుర్తుగా ఉండనీయండి.
16. ప్రశ్నల బోనులో రెఫరీ ఊరు బయట ఆ శరీరం నిల్చిన వెదురు బద్దవలె నడుస్తుంది ఊరు లోపలికి చేరగానే వంగిన వెదురు బద్ద అయి కదులుతుంది అజ్ఞానం మనిషిని శిలగానో చీకటిగానో చేస్తే అవమానం మనసును అగ్నిగానో ఆయుధంగానో మారుస్తుంది అనుమానం అడుగు ముందుకు వేయనీయదు వివేకం మాత్రమే అమృతపథం చూపుతుంది. ఉద్రేకం ఆవేదన నుండి ఇప్పుడు రాలేది కన్నీళ్ళు కాదు! శక్తి బిందువులు గతంతో మతంతో కాదు ఇప్పుడు మనిషితో! మనిషిలో గులాబితోనే పని!శుష్కమైన
తత్త్వారణ్యం
రగిలి
రగిలి
తగలబడుతూనే
ఉంటుంది
చుట్టుకునే మంటలు “జీవన్ భద్రాణి పశ్యతి” జ్ఞాపకం చేస్తున్నాయి గాయాల్నీ గాయాల వెనుకనున్న చరిత్రను ఒక్కమారు మెరపిస్తున్నాయి ఇపుడు కాలం రసాత్మకం కాకపోనీ! కనీసం మానవాత్మక మయినా కానీ. దళిత స్వరం సూటిగా సామాజిక న్యాయ రశ్మి విసరుతూంది కర్మ సాక్షి పాదాలకు ప్రశ్నల సంకెళ్ళు వేస్తూంది చీకటి ఆటలో జరిగిన అధర్మానికి రెఫరీని ప్రశ్నల బోనులో నిలుపుతూంది. ఇపుడు మేం దళితులం కాదు, జ్వలితులం ఇప్పుడు మేం గళితులం కాదు, ఉన్ముఖులం. ఇరవై ఒకటో శతాబ్ది ముఖ బింబాలం! మా కళ్ళలో ఇప్పుడు చీకటి లేదు, స్వప్నం లేదు మండే వాస్తవముంది! అదే మాకు ఉషస్సు ఉషస్సు భుజాలపై ఎగిరే పావురముంది! పావురాన్ని ముంజేయిపై ఆడించే హృదయముంది. మాకు జ్ఞాపకం లేకపోలేదు నీటికై మొగం వాచిన కళ్ళ ముందు ఎడారి దారీ నీటికై నడచే కాళ్ళ వెనక జీరాడే ఇనుప తాడూ ఎవరికీ జ్ఞాపకం చేయనక్కరలేదు నిన్న ఈ అసమ సమాజ గ్రంథంలో స్థానం లేదు నేడు సమ సమాజం పుట పుటలో అక్షర సేన మేమే. నిన్నటి శిల నేడు అలయై మెదలుతూంది నిన్నటి స్వప్నం నేడు ఉదయమై వెలుగుతూంది.
ప్రకృతిలో భాగమై పెరిగిన మా ముఖంలో రాత్రి మెరపు కత్తివలె గతం చలిస్తుంది.
17. ఆత్మ ప్రత్యయం కళ్ళలో కత్తి మొన అంచులు కన్పించకపోవు స్వరంలో బోను వీడిన సింహగర్జన లేకపోలేదు. రాయి విసరితే పగలడానికిపుడు మా జీవితం మట్టి కుండ కాదు రేపుకై వేచి ఉండనవసరం లేదు, ఈ క్షణంలో ఉదయ దర్శనమే కర్తవ్యం ఆ మేడ ప్రక్కనే మా మేడ భుజంతో భుజం కలిపి ఎదుగుతూంది. ఆకలి ఎవరికైనా అంగారమే! దరిద్రం ఎవరికీ అలంకారం కాదు ఏమైనా అవమానం క్షమార్హం కాదు! వివేకం సమయ గతికి స్వర్ణ పథం ఒక్క స్నేహబిందువు! యుగయుగాల మనోదాహాన్ని తీరుస్తుంది ఒక్క ఆత్మస్పర్శ! తరతరాల హృదయ శూన్యాన్ని పుష్పితం చేస్తుంది. ఎగసే సన్నని పొగతో టీ కప్ వలె మంచు పొగతో వెలుగు నిండిన కిటికీ ప్రక్కనే కూర్చున్న నాలో! ఉందీ! తలెత్తిన నా వర్తమాన బింబమే. 547548
3. శాంతిస్వప్నం చెరువు కట్టపై నుండీ పొలం గట్టుపై నుండీ కాలి బాట మలకలు తిరిగి నడచి నడచి చిన్న స్టేషన్ చేరుకుంది బాల్యం.
1. ఉత్సాహ కవచంతో అనురాగం ఉత్సాహం సంకల్పం అలలై తెలీని ఆవేశం అంచుల్ని స్పృశిస్తాయి సరికొత్త ఆలోచన గమన శక్తితో ఇనుప పట్టాలపై రైలువలె పయనిస్తుంది రైలు కోసం మెదురు చూచీ ప్రయాణం సాగింది, పెద్ద స్టేషన్ చేరుకున్నా లైట్లతో ఎతె న ఇనుపస్తంభాలు చాచిన కొత్త యుగం చేతులవలె ఉన్నాయి. అణువణువు స్వేచ్ఛా స్పందనతో నిశ్శబ్దం నుండి శబ్దసమాజంలోకి పయనం పదునెరగనీ ముడి దెలీనీ బాల్యం లేత హృదికి మెత్తని ఉత్సాహ కవచం స్టేషన్ నుండి దారి కిరువైపుల పేవ్మెంట్పై ఆశా ముఖాలు
బ్రతుకులో కలల స్కెచ్లో నిమగ్నమైనాయి. ఆ ప్రక్కనే దూరాన గ్రౌండ్లో లేత ముఖాలు క్రికెట్ ఆటతో కాలాన్ని తరుగుతున్నాయి. క్షణాలు కిరణాల వలె దిగి కొత్త ముఖాల్ని పరిచయం చేస్తాయి పగలు విమానంలో ఎత్తుకపోతాయి, రాత్రి రెక్కలతో కప్పేస్తాయి బండల గుండెలపై కాస్త ఆర్ద్రత వదలి అలలవలె కదలిపోతాయి సమస్య తెరవాలనీ సమాధానం విప్పాలనీ కదలి వచ్చే గాలిని చూస్తే మతిలో పరివర్తన మెదలుతుంది! ఆలోచనకు ప్రేరణ కలుగుతుంది అనుమానం చెట్టుకు వ్రేలాడుతుంది, సందేహం సమాధాన సీమల్ని పెంచుతుంది ఉపాయం అణుమతిని వృక్షీకరిస్తుంది హిమతలంపై స్కేటింగ్ వలె ఆలోచన! ఏ నియంత పద ఘట్టనకో ఈ అవని బ్రద్దలై ముక్కలై పోదు ఏ గద్ద రెక్కల విసుర్లకో ఈ దిశలు చెదరి ఎగిరి పోవు
2. ఉదయ స్పర్శతో తుపాను చర్యకు రాత్రి కంపిస్తుంది అరణ్యం రోదిస్తుంది జలధి ఘోషిస్తుంది ఆగని సుదీర్ఘ యాత్రలో మనిషి దశ దశలో నిలిచీ పోరాడేను గత జలంపై విషాదం వదలి ప్రవాహ గతిలో జీవన రుచి తరలనీ సమయ చషకం అనుభవంతో నిండనీ, వదనబింబం మెరుపుతో మెరవనీ కాల మెంత భీషణాతపమైనా మహా సముద్ర రూపాన్ని మాపలేదు పైకెగిసిన ఆవిరి మేఘమై వర్షమై ధునియై జలధిలోనే కలుస్తుంది లోలోపలి జ్వలన బింబ ప్రతిఫలనంతో జీవితం వెన్నెల మయమవుతుంది సృజన హృదయరాగ స్పర్శతో నిశ కూడ ఉదయ పుష్పమయమవుతుంది
3. మ్యూజియం మెట్టుపై ఈ మ్యూజియం కారిడార్లో నడిచేప్పుడెన్నో అనుకోని దృశ్యాలు ఎప్పటికపుడు తారసపడతాయి వివిధ జీవన భంగిమల్ని బింబిస్తాయి స్వప్నానికి తెరచిన కిటికీ వలె రాత్రి చంద్ర బింబం కన్పిస్తుంది! అతిధికి తెరచిన తలుపు వలె ఉదయ సూర్య బింబ మెదురౌతుంది వీధిలో ఉదయకిరణాలు తెల్లని కుక్క పిల్లల వలె కదలుతాయి పల్చని పట్టు వెలుగులు ముఖాన ఉత్సాహాన్ని అద్దుతాయి బయటికి రాగానే మరచి పోలేందీ మొదటి మెట్టుపైనే ప్రత్యక్షం
మానసిక క్షామంతో ఎడారి ముఖంతోచిప్పతోనో జోలె తోనో దోసిలి తోనో! చీకటి చిమ్ముతూనో నీడ విసరుతూనో ఆ సమయానికి, వస్తే మీపై, ఈ దేశంపై, ఆదేవునిపై మౌన పర్వతంపై నుండి జల పాత తుషారం వలె చంద్ర బింబం నుండి వెన్నెల ప్రసార పుంజం వలె
4. ఆరోహణం సూర్య బింబం నుండి ఒజోన్ వడపోసిన తేజం వలె మహాత్ముని ఆగమనం పరివర్తన సంకేతం శాంతిధునికి ఉదయ శిఖరం, బొగ్గు ముక్కల్ని నిప్పు కణాలుగా గడ్డి పోచల్ని వాడి కత్తులుగా గుడిసెల్ని గుడులుగా పేదల్ని నారాయణులుగా మలచీ550 ఈ శతాబ్ది ఫాల తలాన్ని దిద్దిన ప్రజాస్వామ్య శాంతరూపం చీకటి నుండి మంచు నుండి వెలుగు నుండి మానవీయమై స్వాతంత్ర్యం వైపు ఆరోహణం స్వేచ్ఛా సమ సమాజం లోకి పయనం ఇంటి ముందు చీకటి దీప స్తంభంపై వాలి నిదుర పోయింది స్వాతత్ర్య సూర్యోదయం అర్థ రాత్రి బుజాలపై అవతరించింది ముక్త జనతా నినాదంతో విశ్వ హృదయం ప్రతిధ్వనించింది
5. కలిపే రేఖతో నిన్నటినీ నేటినీ కలిపే రేఖతో ప్రక్కనే విడదీసే రేఖ కూడా ఉంది ఎదురైన శిలా మస్తకాల్ని దువ్వుతూ అడ్డమైన కంటక ముఖాల్ని తొలగిస్తూ కదల్లేని కాలాన్ని కదలిస్తూ నడిపిస్తూ పద పదం మును ముందుకే పయనం ఆకలి మంటల్ని ఆర్పేందుకు రాలే కన్నీటి చుక్కల కోలాహలంలో ఎదురైన మట్టి దిబ్బల్నీ దుబ్బల్నీ సస్యశ్యామలం చేసే నవ చలనం! పచ్చ గడ్డి కోసం వచ్చిన లేళ్ళు ఇనుప కంచె తీగెల్లో తల దూరుస్తాయి ముళ్ళ కంచె సందుల్లో కాలు చాస్తాయి, నెత్తురు గాయాలతో బయట పడతాయి నక్కిన నక్కల్నీపొంచిన పులుల్నీ ఏ మాటుకో ఏ చాటుకోతరిమేస్తూ నేటిని రేపుతో కలిపే రేఖతో పద పదం మును ముందుకు నవ గమనం!
6. తెలుపు నలుపు పదంలో ఒకపదంలో తెలుపు ఒక పదంలో నలుపు! ధర పలుకుతుంది తెలుపు నలుపు కల గలిసిన గళ్ళలో! ఎల్లలుగా ఆలోచనా రూపాలు!
ఏ వన్నె అయితే నేం? తెలుపుంటే చాలు ! అనుకునే వారూ ! ఏ పాటైతే నేం? గిట్టు బాటైతే చాలు! పైకి పోదా మనునేవారూ గుహ నుండి బయట పడినా మరో గుహ ఇంకా ఆలోచనలో మిగిలే ఉంది గాలి లేని వెలుగు రాని పేటిక వలె! లోపల ఏముందో రహస్యం తెలీదు అనుభవమూ విజ్ఞానమూ ఇరు తీరాల మధ్య కదలే ప్రవాహం జీవితం ఎక్కడ ఆగేదీ మలుపు పొందేదీ తెలీదు, కళ్ళ ముందు కదలే వాస్తవం చుక్కలతో గెలిచినట్లు రాత్రి నవ్వుతుంది వెలుగుతో గెలిచినట్లు పగలు మండుతుంది551 వాస్తవానికీ స్వప్నానికీ మధ్యరేఖ! మారవచ్చు మాయం కావచ్చు
7. మినీ సూర్య బింబాలు ప్రవాహం వెనక్కి నడవదు, శిలల్నిసైతం పలకరిస్తూ పోతుంది ముండ్ల పొదల్ని కనికరిస్తుంది, ప్రవాహమెపుడూ ఆర్థ హృదయ రూపమే చీకటి సముద్రమై ముంచేస్తూంటే సమస్య జటిలమై ఉచ్చు బిగిస్తూంటే నీడ ఎదురై ఉరి త్రాడు వేస్తూంటే మనో బల మొక్కటే శక్తికి నికషం! చీకటి ఏ నిషేధాలకూ లొంగదు! నీడ ఏ నియంత్రణకూ తొలగదు ! మనిషి తొడుగు కాదు! మడుగు కాదు, సృజన శక్తికి కీర్తి రూపం మనసు గొడుగు కాదు పిడుగుకాదు, సృజన తరువుకు బీజ రూపం నిశ్శబ్దంగా నడిచే మేఘం! అవసరానికి ఉరుములతో ప్రశ్నిస్తుంది పీడిత గళ రవం వినిపిస్తుంది! మెరపులతో మార్గం చూపిస్తుంది చీకటి కటకటాల్ని త్రోసేసి, రాత్రి ఇనుప గోడల్ని కూల్చేసి ముందుకు సాగే చేతల్లో స్వాతంత్య్రం, వికసించిన ఉదయ తేజం పగలు గగనాన సూర్య బింబం మొక్కటే! ఎపుడు నేలపై సూర్య బింబాల నేకం!
8. ఒకటీ అనేకం జనస్వామ్య ప్రాంగణాన వ్రేలాడే తోరణంలో ఒక్కొక్క మస్తకం వెను వైపు జారిన చీకటి రాత్రిలో ఒక్కొక్క నియంత కథ విన్పిస్తుంది పై నుండి పక్షి వచ్చి వాలుతుంది తోరణ పంక్తి చుట్టూ విహరిస్తుంది ఆహారంకై భ్రమిస్తుంది ఎగురుతుంది, ముక్కుతో పొడిచి నిష్క్రమిస్తుంది కల్లోల శిఖరం నుండి శాంతి వనం లోకి మనిషి జీవితం కోరేను నిశ్శబ్ద శిఖరం నుండి శబ్ద ప్రవాహం లోకి మనిషి ప్రయాణం తరలేను చీకటికి ముఖం ఒక్కటే ; వెలుక్కి ముఖా లనేకం
చీకటిలో దారి ఒక్కటే, వెలుగులో దారు లెన్నో! వ్యక్తిలో జ్వాల ! కొత్త అనుభవంతో సమాజాన్ని వెలిగిస్తుంది కనురెప్పల అంచుల్లో జలద శకలం సిద్ధంగా ఉంటుంది !
9. సమయ రాగం ఆరని మంటల మధ్య నుండి హిమ శిఖరం తలెత్తుతుంది సర్వం బూది కాకుండా అభయ హృదయంతో ఆకర్షిస్తుంది సన్నని జ్వాలలు తీగెలై జీవితం వయొలిన్ గా మారవచ్చు అనుభవం కమాన్ వలె కదలుతూ సమయ రాగం వినిపిస్తుంది మంటల నుండి జీవితం స్వర్ణమయమై బయట పడవచ్చు సమాజాని కలంకారం కావచ్చు ; అనల కణమై ఎగిరి పడవచ్చు సమూహాల్ని గాయ పరచవచ్చు ; ఏదైనా సరే భరించాలిసిందే ఎప్పటికీ మనిషి సిద్ధంగా ఉండాలిసిందే ! అనుభవంలో తరలే అనల శిఖలపై నుండో నీటి ఆలలపై నుండో ప్రయాణం చేయక తప్పదు జ్వాలపై నుండి కదిలేప్పుడు హిమ పటలం కావాలనిపిస్తుంది అలలపై నుండి నడిచేప్పుడు అవని తలం చూడాలనిపిస్తుంది
10. శిఖలపై అలలపై నేల ముక్క కన్పిస్తే చాలు మును ముందుకు దూకేయా లనిపిస్తుంది నేలపై ఎప్పటికైనా ! మనిషి కానందమే కాదు అవసరం కూడా ! బావిలో సరసిలో నదిలో జలధిలో ఆశా హృదయ సీమలు వేరు వ్యక్తీ జీవితం సమాజం ప్రపంచంలో అవసరాలు తీరే ఉపాయాలు వేరు
11. ఆశా స్వప్నం స్వేచ్ఛ కోరే ఉద్యమాన్నీ ఉద్వేగాన్నీ ఏ సీసాలోనో ఏ పీపాలోనో బంధించలేం ఏ అడ్డుకట్టవేసో నిలిపేయలేం, ఏ బండి చక్రానికో కట్టేయలేం ఉద్యమ చరిత్రలో ఉద్రేక శిఖరంపై ఉరి తీయబడిన స్తంభంపై నుండి మనిషి విషమ స్వరం ! వినిపించేనా ? గ్రహణం పట్టిన బింబం కనిపించేనా ? చేతులు కంటిన రుధిరం చల్లారిన మంటల్ని తలపిస్తుంది మనస్సు కంటిన పీడనం కడిగినా పోని చీకటై నిలుస్తుంది త్యాగ స్నిగ్ధ జనసమూహ పద చిహ్నం వెనకే ఆశా జలదం కదలుతుంది
పచ్చని సమసమాజ దర్శనంతో ఉరుములతో మెరపులతో కొత్త సృష్టికై553 4. ఈ శతాబ్ది రెక్కలపై
1. శ్రమ సాధనాలతో వెనుక మహా సముద్రం వలె సమాజం ముందు మహా నది వలె జనాకీర్ణం ఇపుడే ఇంద్రజాల స్పర్శ లేదు, మంత్ర నగర ప్రసక్తి లేదు ఉదయ సూర్య కిరణం మంచు తెరల్ని ఒలిచేస్తూంది వీటి వెనుక ఏ దేవతావాసమూ లేదు, ఏ అప్సరో నృత్యమూ లేదు మనస్సు వంతెనపై జీవన ధుని దాటి ఏ దిశకైనా పయనించవచ్చు మనిషిలో విశ్వాస క్షణాలు జీవితంలో కొంత అమాయకంగా నిజం అంతరంగం మేల్కొనీ అల అలలో నిజాన్ని వడపోస్తూంది సమాజ చేతనపై విశ్వాసం ఈనాటి చారిత్రికావసరం ఈ ఊరు, ఈ సమాజం ఈ ప్రపంచం ఒకదాని కన్న మరొకటి ఒకదాని కన్న మరొక పెద్ద పెద్ద ప్రేముల్లో బంధించిన రూపాలే అయితే జీవితంలో నిజం నిజంగా ఎప్పుడు బయటపడుతుంది ఏదో చివర కాస్త మిగిలాకో! ఏమీ లేకుండా అయి పోయాకోనా ? బ్రతుకులో గతించిందీ గడించిందీ లోతు అందకుండా ఉంది సముద్రంలో నీరు వలె పైకి అంతా సమతలంగా ఉంది చేతిలో ఒక రూపాయి ఎగిరి వచ్చి పడితే చాలదు కాలం ఎప్పుడో ఒక సుగంధ శకలమై వెలిగితే చాలదు కలం నుండి ఒక కల్పనా శిల్పం కన్నా అనుభవంతో జీవన లహరి గొప్పది క్రియలో ఒక విలయ తేజం కన్నా ఒక సృజన కిరణం గొప్పది చేతిలో ఆయుధాలకు బదులు శ్రమ సాధనాలతో, ఈ శతాబ్ది ఉదయం నా నుండి కదలుతూంది, సమాజంలోకి ప్రవేశిస్తూంది కాలి క్రింద శిఖర శిఖర మొక్కొక్క సోపాన మవుతూంది తలపై గగన వలయం, ఆశీర్వసంత మవుతూంది
2. మానవతా పుష్పమై ప్రతి శిఖర శిఖరం మధ్య అవని మాతృ హృదయ మవుతూంది554 రాత్రి గోడకు వ్రేలాడే ఇనుప కవచం వలె, చీకటి మనిషి మతి కెదురుగా ఆఖండమైన ధైర్యాన్నిస్తూంది నిశ్శబ్ద స్తంభాలకు దీపాల వలె ముఖా లెదురవుతున్నాయి
ఆశా గుహ నుండి అవసరానికి కిరణం సింహమై కదలుతూంది ఆశా వనం నుండి అవసరానికి కిరణం హరిణమై దూకుతూంది దాహం వేసే గాజు గ్లాసులో కరిగే మంచు ముక్కల్లా క్షణాలు వర్తమాన ప్రసార ప్రవాహాన్ని పొందుతున్నాయి. అలగానో సరిసిగానో ఊహలో కదలుతూంది జీవితం కత్తి అంచు తళతళల్ని మరపిస్తూంది ఆకలి చిమ్మే ఆనలాభిషేకంతో దరద్రం ఎరుపెక్కుతూంది ఆకలి ఎరగని ఆశా బింబంతో అదృష్టం అలంకృత మవుతూంది మనిషిలో రాతి కొండపై ఆక్కడక్కడా చెట్లు మొలిస్తే చాలదు అణువణువున చేతనతో హరిత హృదయం స్పందించాలి గాలినీ వెలుగునీ ఆప్యాయంగా ఆహ్వానించే ఆ చెట్టు కొమ్మకు ఏ పాపమూ తెలీకుండా, ఏ ప్రమేయమూ లేకుండా ఓ మనిషి వ్రేలాడ దీయ బడొచ్చు ! ఓ ప్రాణి ఉరితీయ బడొచ్చు ! నిన్నటి ఎదగాయం బదులు ఈనాడు మానవతా పుష్పంఅమరాలి ఆయుధాలకు బదులు చేతిలో శ్రమ సాధానలతో ఈనాడు ఉదయం నా నుండి కదలుతూంది, సమాజంలోకి ప్రవేశిస్తూంది
3. ఈశతాబ్ది స్వేచ్ఛకై నాలో స్వేచ్ఛ రెండు చేతులపై రెండు రెక్కలు చాచి ఆకాశాన్ని కొలవ జూస్తుంది, స్వంతం చేసుకో జూస్తుంది ప్రశ్నకు సమాధాన మిచ్చే తీరిక లేని బహు తొందరలో మనస్సులో విక్రమార్క సింహాసనాన్ని అధిరోహింప జూస్తుంది బంధనలో స్వేచ్ఛనూ అన్యాయం నుండి రక్షణనూ కోరే సమయం ఉద్యమం శరణ్య మవుతుంది, కాని సహజ సాధనం త్యాగం మాత్రమేస్వేచ్ఛలో పూల దండ
వహించే
చేతులు,
స్వేచ్ఛకై ఆయుధాన్నీ కాదనడం లేదు భయంలో వేదనతో ఘర్షణలో హింసతో వెనుక నుండి దుఃఖ నిమ్నగ సరిస్తుంది ఆటవికమైన ఉన్మత్త నిశా నిరంకుశ గతిలో సూర్యుని ఉదయ కిరణం స్వేచ్ఛకు సంకేతం మంచు క్రమ్మిన మొగ్గ వలె గుప్తంగా ఉంటుంది ముళ్ళ నుండి గులాబి వలె పైకి లేచి ఆకర్షిస్తుంది ఒక్కొక్క సూర్య కిరణం సమయ సమయం
పక్షియై ఎగురుతుంది పచ్చని ఆకై దిగుతుంది గాజు పాత్ర జలం కాంతి పూలపడవై తేలుతుంది అవసరంతో రాకెట్ వలె దూసుకపోతుంది, మిసైల్ అయి పయిబడుతుంది మనిషి పాద మొకటి పాతాళంలో, మరొకటి అవని తలంపై క్రింది నుండి ఈమధ్య పైకి స్వేచ్ఛకు సోపానాలెన్నో! మనిషి మనిషి మధ్య ముళ్ళ పొదలు ! పూలు పూయడం దేవుడెరుగు ! కత్తి మొనల్ని తలపించకుండా ఉంటే చాలు ! మనిషి కెదురు పడే మనిషి ముఖంలో శ్రమ సాధనాలు బింబించనీ చేతిలో ఆయుధాలకు బదులు శ్రమ సాధనాలతో ఈ శతాబ్ది ఉదయం నా నుండి బయటికి కదలుతూంది, సమాజంతో ఏకమై మానవతాపూర్ణమై
IX. అగ్ని పీఠం
కావ్యత్రయం (2002) 1. క్రాస్పెర్ 2. సీజ్ ఫైర్ 3. నేడు రేపు మధ్య మాదిరాజు రంగారావుటి నిటిలో ఆంతర్యం “అగ్నిపీఠం”, కోపానికీ, ద్వేషానికీ, రణానికీ, ఇంకా దమనానికీ అక్రమ చర్యకూ, అశాంతికీ నిలయ ప్రతీకగా ఉంది. ఇరుపక్షాల మధ్య ఆలోచనల్లో ప్రవర్తనల్లో లేచే స్ఫులింగం పరిసరాల్ని దహిస్తుంది. ఎవరిదీ దోషం అన్నది? సులభంగా తేలే విషయం కాదు. ఇందులో ఎన్నో వైయక్తికమైన రాజకీయమైన సామాజికమైన కారణాలు, ఒకదానినొకటి పెనవేసుకొనీ నిరంతర పరిణామ పర్యవసానాలుగా దృష్టికి వస్తాయి. అయితే వీటిని ప్రజాస్వామ్య దృక్పథంతో కొంతవరకు పరిహరించవచ్చు, తగ్గించవచ్చు. దీనికొక స్థాయిలో అవగాహన, ఉదారత, సంస్కారం, మానవత అవసరం. ఇకపోతే సమాజంలో నిజమైన ప్రజాస్వామ్య రాజ్య రూపం, దీనికెంతో సహకరిస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఈ టి నిటి 1. "క్రాస్ ఫైర్” ; 2. “సీజై ర్” ; 3. "నేడు రేపు మధ్య" మూడు కావ్యాల సంపుటి. సమాజంలో 1. అశాంతీ, రణస్థితి; 2) దీన్ని అదుపు చేసే మనో రూపమూ పరిస్థితీ ; 3. ప్రకృతిగతంగాను జీవితంలో విషమ పరిస్థితుల వల్లనూ ఏర్పడే సంక్షోభం
విధ్వంసం ; దీని నుండి బయటపడే మానవ ప్రయత్నం - అభిలాష, శక్తి - యుక్తి, శాంతి లక్ష్యం “అగ్నిపీఠం”లో ప్రతిపాదితమైనాయి. ప్రజాస్వామ్యంలో “అగ్నిపీఠం” క్రమంగా మనిషిలో ఉత్తమ సంస్కార గుణాలతో ఉన్నత లక్ష్యాలతో "శాంతిపీఠం" కావాలనే కవి ఆకాంక్ష. ఇది టి నిటీలో భావసూత్రం, మానవీయ కథలో చలన దృశ్యాలకాధారమైందీ. ఈ కవిత్వంలో ఒక కొత్త ప్రయోగ ప్రయత్నం జరిగింది. అది ప్రకృతీ, సమాజం, మనోభూమిక నిర్వహణాంశాలుగా, రూపాన్ని నిర్మించడం. ఈ దిశలో విశ్లేషణతో సమాలోచనార్హమైందీ. 11-3-2002 - - మాదిరాజు రంగారావు I. క్రాస్ ఫైర్ సూచిక మొదటి భాగం 1. ఏమైనా 2. కరుణలో ముంచీ 3. క్రాస్ ఫైర్లో 4. ఎర్రెర్ర నవ్వు 5. మూడు గీతాల్లో 6. నిరాశకూ నిరీక్షణకూ మధ్య 7. మట్టి మనిషి 8. ఏ మెట్టుపై 9. కిరణం మునిగిపోదు రెండో భాగం 10. ప్రదర్శనలో
11. సిగ్నల్ రెక్కలు 12. ప్రజాస్వామ్య బింబం 13. అరణ్యం కాకూడదు 14. చినుకూ సమాజం 15. అమృతయానం
I. క్రాస్ ఫైర్
(కావ్యం) (2002) అంకితం ఉదార చరితకు ప్రతీక ప్రియసోదరుడు డా॥ మాదిరాజు హరికిషనా వుకు561 Haritha, Madiraju, Devulapalli M.A.(Lit.) క్రాస్ పైర్ - సమాలోచనం క్రాస్ ఫైర్ కావ్యం స్వేచ్ఛా కవిత్వంలో ప్రజాస్వామ్య కవిత్వ పార్శ్వానికి ప్రాతినిధ్యం వహిస్తూంది. సైద్ధాంతికంగా విభేదించే ఇరు పక్షాలు తమ మధ్యనున్న హద్దుల్ని అతిక్రమించి తీవ్రమైన కార్యాచరణకు తలపడడం, విషాద పర్యవసానానికి సిద్ధమవడం “క్రాస్ ఫైర్” స్వరూపం. ఏ పక్షమైనా మానవీయమైన విలువల్ని విస్మరించి ఒకరిపై మరొకరు హింసకూ కాల్పులకుద్యమించడం జరుగుతుంది. ప్రజాస్వామ్య దృష్టిలో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో రాజనీతి ప్రజ్ఞతో ఉదార ప్రవర్తనతో మానవుడు - మానవత పట్ల గౌరవం విశ్వాసంతో ఈ స్థితి నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. ఏమైనప్పటికీ మనిషి జీవించే హక్కును ఎవరూ నిరాకరించడం కూడదు. మనిషిని అవమానించే ధోరణి పనికిరాదు. కావ్యంలో ఈ స్ఫూర్తి లక్షితమైంది. సమాజంలో అభిప్రాయ భేదాలు, సంఘర్షణలు వస్తువుగా, స్థూలమైన స్థితులు,
ఆధారంగా రచన నిర్వహింపబడింది. భౌతిక స్వరూపం కన్నా మానసిక చిత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రచన సన్నివేశ నిర్మాణంతో ఆరంభమైంది. ఒక ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉదయం నలుగురు మిత్రులు కలిసారు, ఏదో సరదాగా జరుగుతున్న కాలక్షేప సమావేశం అది. ఒక వ్యక్తి ఆ సమయంలో గదిలోకి ప్రవేశించడం జరిగింది. ఆమె చేతిలో న్యూస్ పేపర్ ఉంది. ముఖంలో మౌనం! విషాద ఛాయ ఆవరించింది. ఆమె నుండి సమాచారాన్ని అభిలషిస్తున్నట్లున్నవి వారి ముఖాలు! వారి ముఖాలు ఆతురతతో మొగ్గలుగా మారాయి. ఈ భావన వారి ప్రతీక్షావ్యగ్రతను సూచిస్తూంది. ఆమె ముఖం చూస్తే ఏదో సీరియస్ విషయమే జరిగినట్లుంది. ఆమె పేరు స్నేహ. ఈ సందర్భంలో అన్వర్థమయింది. ఆమె చూపులో పలకరించే వాలకం ప్రతిఫలిస్తుంది. ఆనాటి పత్రికలో విషాదవార్తా శీర్షిక ఫోటోపై చిన్న ట్యూబ్ లైట్ ఉంది. ఇది జరిగిన ఘటనపై తెలీని అంశంపై వెలుగు ప్రసరిస్తూన్నట్లుంది. ఈ స్థితికి కారణాలనేకం. ఎవరి అభిప్రాయం వారిది. ఎన్నో అంశాలు ఈ విషయాన్ని పెనవేసుకొని సంక్లిష్టమైన రూపాన్ని గుర్తుచేస్తాయి. ఇవి దేశం రాజ్యం వ్యక్తిగతం శ్రేయస్సు, అభిప్రాయం, ఆదర్శం మొదలుగా పర్యాప్తమై కన్పిస్తాయి. అగ్నిసదృశమైన స్థితిలో మనిషిలో జాలి దయ కరుణ ఉదారత మొదలైన ఆర్ద్రభావాలు ఎక్కడో సన్నని నీటిజాలులా మిగిలే ఉంటాయి. ఈ అంశం గోడకు వేలాడే పిల్లల్ని దువ్వుతూన్న పులి చిత్రపటం ద్వారా సూచితమింది. పెద్దపులి కళ్ళు మెరుస్తూ భయాన్ని562 కలిగిస్తాయి. అందులోను అందముంది. ఎంత క్రూరమైందను కున్నా తన పిల్లల్ని ప్రేమించకుండా ఉండలేదు. ఇది ఆర్ద్ర భావోపేతమైంది. హింసా ప్రవృత్తి కలిగిన జంతువులో ప్రేమ వర్తనం, పరస్పర విరుద్ధ భావ మేళనాన్ని గుర్తుచేస్తుంది. ఇక మనిషి విషయానికి వస్తే మనస్సు ఎన్నో పరస్పర వ్యతిరేక భావ సమూహాల సంకలనరూపం. ఎప్పుడేది ఎందుకు బయటికి వస్తుందో స్పష్టంగా చెప్పడం కుదరదు. కారణాలు ఒక్కొక్కపుడు గుప్తంగా సాధారణ బుద్ధికందకుండా, అభిప్రాయ భేదాలకు వీలు కల్పిస్తూ చరిస్తాయి. అందుకే మనిషి జీవితం, సమాజ గమనం బహుసంక్లిష్టంగా గోచరిస్తుంది. ఈ సమయం! వార్తా పత్రికలో మొదటి పేజిలో ప్రచురితమైన మనిషి బొమ్మపై ఫోకస్! అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆనాటి వార్తలో చోటుచేసుకున్న వ్యక్తి ఎన్ కౌంటర్లో అసువులు కోల్పోయిన మనిషి. అతని ప్రాణం విలువవైందే, అతని జీవితం నడుస్తూన్న చరిత్రలో భాగంగా వర్తించింది. ఈ వస్తువులో రచన సామాజిక స్పందనతో శబ్దిస్తూంది. ఇతని మరణవార్త హృదిని కదిలించేది. ఇది టే నుండి జారిపడిన వస్తువు ధ్వనిలో గర్భితమైంది. ఇతరుల అభిప్రాయాన్ని మన్నించడం, ఎదుటి వ్యక్తిని గౌరవించడం ప్రజాస్వామ్యంలో కీలకమైన
అంశాలు. మానహక్కుల్ని గౌరవించే సమాజ సంస్కృతికి చెందినవి, అనుల్లంఘనీయాలు. నిరసన, ప్రతిఘటన ఏ తీవ్రస్థాయికి చెందినప్పటికీ పాలనారూపం లోహ పదం కారాదన్నదే నిరంకుశ వైఖరిని నిరసించే మాటలు. ఈ విధం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను బింబిస్తూంది. ఏమైనా మనిషి మనస్సు అరణ్యం కాకూడదు. అరణ్యం మృగాలకు ఆవాసం. అందువల్ల పర్యవసానాన్ని సులభంగా ఊహించవచ్చు. అయితే అభిప్రాయభేదాలున్నప్పటికీ సిద్దాంత ప్రచారాలున్నప్పటికీ ఇపుడు కావలసింది, మనిషి ఒక చేతిలో శాంతిపుష్పం, మరో చేతిలో ప్రజాస్వామ్య కేతనమన్న చిత్రం, మనిషిలో సృజనశీలమైన నిర్మాణాత్మకమైన ఆలోచననూ భౌతికమైన సామాజికమైన దర్శనాన్ని ఆవిష్కరిస్తూంది. అగ్నిపీఠం కావ్యత్రయం (టి నిటి)లో మొదటిది “క్రాస్ ఫైర్” ఈనాటి సమాజ గమన చిత్రణం. Detroit, Michigan, U.S.A. 14-2-2002 - - హరిత563
1. క్రాస్పెర్ - కావ్య హృదయం “క్రాస్ ఫైర్” లో కావ్యంలో వస్తువు సామాజికమైంది. దీని నిర్వహణం భావ రూపాల్నీ, ప్రతీకల్నీ ఆశ్రయించింది. దీని లక్ష్యం ఉదార ప్రజాస్వామ్య భావనతో నిర్దిష్టమైంది. సమాజంలో వివిధ సందర్భాల్లో ఆదర్శాల సంఘర్షణ వల్ల సమస్యల ఒత్తిడి వల్ల తీవ్ర వైఖరి నవలంబించడంతో ఈ స్థితి ఉత్పన్నమవుతూంది. రాజకీయంగానూ, సామాజికంగానూ వైయక్తికంగానూ ప్రత్యేక స్థితుల్లో “క్రాస్ ఫైర్” అనివార్యమవుతూంది. ఈ అగ్నిరేఖలు రెండు పక్షాల మధ్య వివిధ స్థానాల్ని అతిక్రమించడం జరుగుతుంది. ఈ స్థితిలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇవి సమస్యల అవసరాన్ని బట్టి స్థితుల వేగ గమనాన్నిబట్టి విషమస్థాయిని పొందుతాయి. ఈ స్థితి విధ్వంసనకూ బాధకూ వేదనకూ అశాంతికీ దారితీస్తుంది. దీన్ని పరిహరించడం అవసరం. ప్రజాస్వామ్యంలో చర్చల కవకాశం, ఇతరుల అభిప్రాయాల పట్ల గౌరవం సమన్వయ గుణంతో పాటు ఉదారత మానవత లక్షణాలతో దీన్ని నియమించవచ్చు, దుష్ప్రభావాన్ని తగ్గించనూ వచ్చు. ఈ కావ్యం ఒక గదిలో మిత్రుల సమావేశంలో బయటపడిన మరణవార్తతో చాలా సహజమైన సన్నివేశంతో ఆరంభమైంది. క్రమంగా వర్తమాన రాజకీయ సామాజిక స్థితుగతులతో తీర్చబడింది. కావ్యంలో ఇది ప్రత్యేక స్థితి నుండి విశ్వజనీన స్థితికి క్రమిస్తుంది. ఇందులో సమకాలీన చరిత్రలో మన చుట్టూ ఉన్న సమాజంలో వ్యక్తుల
స్వభావంతో వాస్తవాల పునర్నిర్మాణం జరిగింది. ఈ సంవిధానంలో కల్పన తన పాత్రను నిర్వహించింది. ఇది వివిధ భావ రూపాల్లో మలచబడింది. ప్రతీకల్లో ధ్వనితమయింది. సామాజిక స్పృహతో పాటు వైయక్తిక మానసిక స్పందనల్ని కలిగింది. ప్రజాస్వామ్య లక్ష్యంతో ఆవిష్కృతమైంది. తెలుగు స్వేచ్ఛా కవిత్వంలో ఆధునిక చేతనకు ప్రాతినిధ్యం వహిస్తోందీ కృతి. చరిత్రలో వర్తమాన సామాజిక తలాన్ని చిత్రిస్తూంది. సాహిత్య చరిత్రలో స్వేచ్ఛాయుగం స్వాతంత్య్రానంతరం ఆలోచనా నవ్యతను స్వేచ్ఛను ప్రతిబింబిస్తూంది. 8-3-1999 డా॥ మాదిరాజు సంతోష్ కుమార్564
I. క్రాస్ఫర్
మొదటి భాగం
1. ఏమైనా ఎదుటి మనిషి క్షేమంకై సిప్తో స్నేహంలో పత్తో మిత్రబృందం సైజ్కు మించిన డ్రెస్లో కోలాహల ప్రపంచంతో డ్రాయింగ్ రూమ్ చేతిలో వార్తా పత్రికతో స్నేహ లోపలి కడుగేసింది. నిశ్శబ్ద ముఖాలు మొగ్గలై మాట కోసమెదురు చూస్తున్నాయి. ఆమె నడకలో రహస్యం బిగిసి బిగిసి కదులుతూంది ఆమె కళ్ళలో ఆలోచన నిలిచి నిలిచి హెచ్చరిస్తూంది చూపులు సూటిగా వాడిగా అందరినీ పలకరిస్తున్నాయి. పత్రికలో ఫోటోపై శీర్షిక చిన్న ట్యూబ్లెట్ ఉంది. పల్చని మంచు కేస్లో అనల ప్రతిమలా వర్తమానం నిలిచింది. పిల్లల్ని దువ్వే పెద్దపులి చిత్రంతో గోడపై క్యాలెండర్, పెద్దపులి కళ్ళలో భయబిందువు చూపుల్ని బంధించి నిలిపేస్తూంది. ఫ్యాన్ గాలి అశాంతి రెపరెపల్ని టెలిప్రింటర్లా వినిపిస్తోంది. సమాజ భీభత్సంపై టార్్చ లైట్ ఫోకస్లా ఫోటోలో మనిషి మానవ గౌరవ చిహ్నమూ, సమాజ చరిత్రలో భాగమూ, అతని అడుగుల కింద అవని నిన్న కంపించిన మాట వాస్తవమే టే నుండి జారిపడిన సాసర్వలె వార్త అను రణించింది. ఈ సమయం పగిలిన అద్దంలా చెదరి పడిన జీవిత ఖండం
ఏ ముక్కలో ఏ నిజం ప్రతిఫలించేదీ తెలీకుండా ఉంది. న్యాయం కావచ్చు! చట్టం కావచ్చు! ప్రతీకారమవచ్చు! ఆదర్శం కావచ్చు. జీవించే హక్కును మనిషి నుండి మాయం చేసే లోహపదం కారాదు. విషమ లిప్తల ఆలోలంలో అడవిలో ధైర్య శిఖరం ఎపుడు మునిగేదీ తెలీని భయ ద్వీపం వలె ఉంది
2. కరుణలో ముంచీ భవిష్య సమాజ స్వప్నంకై వర్తమానం రణ సదృశమవుతూంది ఇది పోటీ లేని పోరాటం! దీని కిప్పట్లో అంతం లేనట్లుంది.అగ్నిపిఠం - క్రాస్ ఫైర్ సమస్యల మధ్య సంక్షోభం మధ్య ఇనుప స్తంభంలా ఉన్న అస్తిత్వం ఏ గన్ పాయింట్కి బాంబు గురికో మట్టిపాత్రను జ్ఞాపకం చేస్తూంది. పెదవులపై నిశ్శబ్ద ముద్రతో సాహసం విషాదాన్ని వరిస్తూంది నిన్నటిలా ఈ రోజు భయ సముద్రం అవకూడదనే! ఈ నాటి బాధ రేపు వ్రణంలా మారకూడదనే! చక్రంవలె భ్రమిస్తూనో ఆకు వలె రాలుతూనో పోయే మనిషిని రక్షించుకునే బాధ్యత సమాజంలో మనిషిదే. సమస్యల వంతెనపై స్వాతంత్య్రం, అవతలి గట్టుపై ఆశతో ఉంది పెద్దపులి కంటి వెలుగు బోనులో మనిషి రూపం మెరుస్తూంది. తెల్ల కాగితం వలె ఎదురైన ఈ రోజు ఎర్రబడి భస్మం కావలసిందేనా? ఈ కాల్పులెంతవరకు? సూర్యబింబం నల్లబడేంత వరకా? చంద్రకళలు ఎర్రబడేంత వరకా? మనిషి మసి అయ్యే దాకానా? వార్త కెక్కిన వ్యక్తి మిత్రులెవరో బంధువులెవరో కానీ, అతణ్ణి మానవతా బంధం మాత్రం కరుణలో ముంచి పైకి తీసి చూపుతూంది. రాత్రి అయినా ఊరు మెలకువలో ఉంది క్రాస్ఓఫైర్లో ఎవరికి నిద్ర పట్టి చస్తుంది?
3. క్రాస్పెర్లో అడవిలా ఆటవికాన్ని కమ్ముకొనీ, సముద్రంలా ఉద్రేకాన్ని నింపుకొనీ తప్పిపోయిన శాంతి కోసం దిక్కులు చూస్తూంది. వీధి దీపం? మనిషి వెనక కదలే నీడల్ని కొలుస్తూంది దారిలో రహస్యాల్ని కనిపెట్టే గూఢ చరం చేస్తుంది
ముఖంలో ఉపాయాల్ని పసికట్టీ కళ్ళలో ఆయుధాల్ని వెదుకుతూంది జారే కన్నీరు తుడిచే బదులు కళ్ళలో సూదులు కదలిస్తూంది. అడుగుల వెనక వచ్చే అడుగులు చరిత్ర చిహ్నాల్ని చెరపేస్తున్నాయి దారిలో ప్రతిమలు భౌతిక సీమల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. హింసనూ హత్యనూ చూపే రేఖలతో చాచిన చేతులు విశ్వమానవ మనోజ్ఞ శిఖల్ని ఆర్పే పనిలో తేలుతున్నాయి. వీపుపై దెబ్బల వలె ఊరుపై అడపా దడపా కాల్పులు చాటైన ముఖాలు గాయాలతో బయట పడుతూన్నాయి. శాంతి ఎపుడు బడితే అపుడు వచ్చి ముంగిట్లో నిలవదు రన్నింగ్ రేస్లోనో గన్ పాయింట్తోనో పొందేది కాదు సమాజంలో దైన్యం హైన్యం పోరాటానికి దారి తీస్తూంటే అరచేయిలో అమృత కలశం చూపే రాజకీయ జాలికులూ ఉన్నారు
4. ఎర్రెర్ర నవ్వు ఆకాశంలో చుక్కలు అసహాయ సానుభూతి చూపిస్తున్నాయి ప్రతీకార ఖడ్గంపై అహంకారం విజయాన్ని కాంక్షిస్తూంది. కాగితంపై అక్షరాల వలె వీథి దీపాలు మినుకు మినుకుమంటున్నాయి అక్షరాల నుండి ఆలోచనల వలె వెలుతురు రెక్కలు చాస్తూంది. మనిషిలో కలలన్నీ బయటికి రావు! వచ్చినవీ మెలకువలో నిలవ్వు మనిషిలో సంభాషణ వెనక! అంతర భాషణం సాగుతూనే ఉంటుంది రాత్రి అంతా ఊరు మెలకువలో గడిపేస్తూంది క్రాస్ ఫైర్ ఆగినా, తప్పి పోయిన శాంతి కోసం ప్రకటన! ఉదయం పత్రికలో అరుణాక్షర కిరణాల్లో కన్పిస్తుంది బూదిలా ఎగసే మంచులో ఎర్రెర్రని నవ్వు జారి పోతూంది.
5. మూడు గీతల్లో బొమ్మ మనిషికీ మనిషికీ మధ్య కన్పించని సరిహద్దులకు రెండు వైపుల ప్రేలే గన్ వదలే తూటా బ్రతుకును చిత్రపటం చేస్తూంది? మండే వనంపై నీలి మబ్బులా ఓ ఆలోచన రాకపోదు? దారి తప్పిన అడవిలో దొరికే కాలి బాటలా అనుభవం లేకపోదు. మనిషిని మనిషి దగ్గరికి తీసుకునేందు కెన్ని అడ్డు గోడలు!
మనిషిని మనిషి గుర్తించేందు కెంత సమయం పడుతూంది? స్వార్థం మనస్సును స్తంభింపజేస్తూంది; అణచేస్తూంది మూలాలు కన్పించడంలేదు ; దర్శనం అసంపూర్ణంగా మిగిలిపోతూంది దరిద్రం కాళ్ళకు సంకెళ్ళు వేస్తోంది; అవసరం పెదవుల్ని కుట్టేస్తోంది మనిషితో మనిషి సంబంధాలు విపణి ధరలు పలుకుతున్నాయి వీధిలో నడచే పాదాలు నీడల్ని వదలే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖంపై దూకే వెలుగులు బయటి ముసుగుల్ని తోసేయ జూస్తున్నాయిఅగ్నిపిఠం - క్రాస్ఫర్ స్వేచ్ఛా దీపం చేరేందుకు సమాజంలో ఎన్ని దారులో అన్ని యాత్రలు! ఒకటొకటీ గమ్యం చేరే లోపల చీలిపోతుంది ఎక్కడో ఆగిపోతుంది (2) జేబులో డైరీలో క్రితం తేదీ పేజీలో వ్రాసిన మాటలు ప్రయాణం వెనుక దాగిన విషాద జీవితాన్ని గీసి చూపిస్తున్నాయి. “ఈనాటి వరకూ నా ముఖం నిజ వర్ణం ఎరుగదు నా మస్తిష్కం నిశ్శబ్దమసలే ఎరుగదు; నిద్రలో తప్ప! ఇన్నాళ్ళు కాళ్ళు ఇసుకలో కూరుక పోయినట్లున్నాయి ఇపుడు ముడిచిన రెక్కలు విప్పినట్లు స్వేచ్ఛ లభిస్తూంది యంత్రం వలె తిరిగే శరీరం మానుషాన్ని పొందుతూంది మృత్యువు నిజంగా సంతోషానికి దారితీసే ద్వారం వలె ఉంది? చిత్రంగా! మృత్యువు తప్ప! జీవితమంతా రహస్యమన్నట్లుంది” కాగితంపై ఒక ప్రక్క రోజువారీ అవసరాల పట్టీ లెక్కకూ అవసరాలకూ మధ్య అంతరం మాత్రం అనంతం కింద అస్థిపంజరం వలె మూడు గీతల్లో గీసిన బొమ్మ.
6. నిరాశకూ నిరీక్షకూ మధ్య నిరాశకూ నిరీక్షకూ మధ్య రోజు మొదటి మెట్టుపై గగనంలో ఉడ్డీనానికి మథన పడే చిన్నన్న వెనుకనుండి నిర్వ్యాపారాన్నీ నిష్క్రియతనూ జనశ్రేణి నిందిస్తూంటే ఇంటి కప్పుపై చేరి కోడై కూయడం ఆరంభించేను చేతిలో గన్ ఊరు అవతల నిర్వ్యాజంగా నిరాటంకంగా కన్పించిన బాతుల్ని పక్షుల్ని హతమార్చడం సాగించేను. శ్రమ సాధనాల లంకరించే చేతులు; భయ స్థానాలవుతున్నాయి దారుణ మారణ సంస్కృతి బ్రతుకులో భాగమైపోతూంది.
పయనంలో నినాదాలు వినిపిస్తాయి; పతాక లెదురౌతాయి అడవి అడుగులకు దారి చూపిస్తుంది; కొండలు తలలు వంచుతాయి దారిలో ప్రతి మజిలీలో మనిషి మనిషి కలిసిన దృశ్యపరంపర అర్థం లేని దనుకున్న శబ్దం! ఎదురై గుండెకు హత్తుకుంటూంది ఆలోచన పురి విప్పుతుంది; అనుభవం హరివిల్లు అవుతూంది. శిశువు తొలి విజయం నేలపై అడుగు వేయడం మనిషి చిర విజయం మనస్సును వెలిగించడం సుఖంలో రెండు పుష్పాలు; దుఃఖంలో రెండు బాష్పాలు జీవిత గమనంలో తప్పనివీ; ఒడిలోనో చేతిలోనో రాలేను. భౌతికం మూట సర్దుకొని ఎక్కడికి పోతుంది? మర్నాడు మరో మూటతో సిద్ధమవుతుంది, ఎదురవుతుంది. నిరాశ నుండి నిరీక్ష నుండి రోజు చివరి మెట్టుపై ఉడ్డీనానికి సంరంభం! అంతా ఇంతానా? గుండె ఎగిరేంత!
7. మట్టి మనిషి ఎపుడో ఎత్తుకున్న బండను ఈ మట్టి మనిషి దించనే లేదు ఇదో నేరానికి శిక్ష అనేవారూ ఉన్నారు ఇదో సర్కస్ లో భాగమనే వారూ ఉన్నారు. కాళ్ళు చక్రాలైతేనేం; వలయంలో భ్రమణం! ఏ గమ్యం చేరుస్తుంది. పంటకొచ్చే భూమికి జవాబుదారీ ఈ మట్టి మనిషిదే మరొకరి కుంపటిని గుండెపై మోసే బాధ్యత ఇతనిదే సమాజ సముద్రాన్ని ఎంతకాలం శ్రమతో మధించినా వచ్చే అమృతం ఎప్పటికపుడు అదృశ్యమవుతూంది ఉప్పు నీరు మాత్రం ఈ మట్టి మనిషి వంతవుతూంది తోటలో వెన్నెలకు కాపలా కాస్తూ ఎండలకు పగటి గొడుగు పడుతూ బ్రతుకులో మిగిలేదీ ఎత్తుకున్న బండే, దీనితోనే సహవాసం ప్రతి జనపదం శ్రమ నిలయం అవచ్చు, ప్రతి అరణ్యం ఆశ్రమం కాదు. బండలా మిగిలిన బ్రతుకు దెబ్బలూ గాట్లు వహిస్తుంది ఏ వాలకాలో చెక్కబడతాయి! ఏ పిచ్చి గీతలో గీయబడతాయి ఇదో శిల్పమనీ భావించే తెలివి మీరిన వారూ ఉన్నారు దీన్ని స్వార్థంకై కీర్తించే యంత్ర ముఖాలూ లేకపోలేదు. ప్రతి చెమట బిందువు శ్రమకు చిహ్నం కాదు
ప్రతి పాద ముద్ర భవిష్య పథ సూచన కాదు ప్రతి అరచేయిలో శ్రమ రహస్యం బయట పడదుఅగ్నిపిఠం - క్రాస్ ఫైర్ ప్రతి నొసలుపై శ్రమ కణం మూల్యాంకనం జరగదు నాటకం చూచే సంతోషంలో సమయం తేలిపోతుంది బయటికి వస్తూనే వేసే అడుగులు ఇనుపబిళ్ళ లవుతాయి బయటికి రాగానే చాచిన చేతులు ఇనుప కడ్డీలవుతాయి ఇపుడు హృదయం తీగె తెగి మూల బడిన వయొలిన్ తో సమానం. జనస్వామ్య కిరణం గతానికి గుడై చెబుతూంది శ్రమ జీవన ముఖాలతో నవ చేతన మాట్లాడుతూంది పెదువులపై శబ్దం స్వేచ్ఛారుచితో ధ్వనిస్తూంది. మనిషి తనూ స్పర్శతో అవని గర్వంతో పులకిస్తూంది
8. ఏ మెట్టుపై ఇనుప కవచం ముక్కలై మనిషి మనోజ్ఞరూపం బయటపడుతూంది మనిషి వెనక రణ దృశ్యం! విశ్రాంత సముద్రం వలె ఉంది ఆకాశం ఆహ్వానిస్తూంది పక్షితో పాటు క్షిపణినీ అవని స్వాగతమిస్తూంది నాగలితోపాటు యంత్రాన్నీ ప్రజాస్వామ్యం పిలుస్తూంది మనిషి మనిషికి స్వేచ్ఛనిస్తూ గడ్డకట్టిన సమాజం ప్రవాహశక్తి పొందుతూంది అరచేయి శూన్యం కాదు! ఏదో పనితో ప్లవిస్తూంది అయినా అతృప్తి ఆకాశాన్ని అంచెలుగా కొలుస్తూంది ఆశకూ ఆదర్శానికీ మధ్య రోజు సతమతమవుతూంది ఆలోచనకూ అనుభవానికీ మధ్య మనస్సు నలిగిపోతూంది వాస్తవానికీ లక్ష్యానికీ మధ్య బ్రతుకు చెదరిపోతూంది అంతలో దూరం నుండి అలార్్మ ! విప్లవ సంకేతం! పూల వనంపై నిప్పులు నృత్యం చేస్తున్నట్లుంది ఏ మెట్టుపై ఎప్పుడు ఘర్షణ రేగేది తెలీకుండా ఉంది.
9. కిరణం మునిగి పోదు పొద్దెక్కే కొద్దీ ఎండ తిరగబడే ప్రజ వలె ఎదురౌతూంది మిట్ట మధ్యాహ్నం పై పై బడే ఆతంక గణం వలె వస్తూంది
పొద్దు వాలే సరికి చుక్కలు తీరని సమస్యల వలె మెరుస్తాయి మతిలో స్పందించే జనశక్తి సమాజ రథమై కదలుతూంది. భూమికై అంకితమైన వాళ్ళకు భూమిపై హక్కు లేదు అరుణ స్వరం ఎంతటి నిశ్శబ్దానై నా సాహసంతో తరుగుతూంది శ్వాససూత్రం ఎంతటి శరీరానై నా ఆయువుపై భరిస్తూంది. సంకల్పం ఎంతటి జీవితానై నా రెక్కలపై వహిస్తూంది. కదలని ఊపిరిలో స్పందన రావాలంటే నిలిచిన అడుగుల్లో చలనం కావాలంటే బిగిసిన జీవన లిప్తలు సరించాలంటే ఎన్ని సూర్య బింబాల్ని చూడాలిసి వస్తుందో! శతాబ్దాల క్రితం మూసిన తలుపు లిపుడు తెరుచుకున్నాయి. ఈవాల్టి ప్రభాతం అందరికీ సమంగా స్వాగతమిస్తూంది గ్రీష్మంలో జలపాతం వలె చీకట్లో ఎర్రని నిజం వలె రాళ్ళ నుండి ముళ్ళ నుండి స్వేచ్ఛ మనిషిని పూవై స్పృశిస్తూంది పయనం మొదలు కావడం వేరు; గమ్యం చేరడం వేరు ఇపుడు శుక్లపక్ష మొకరిదీ; కృష్ణపక్షమొకరిదీ కాదు నిప్పుల పైనా స్వేచ్ఛ ఆగిపోదు; మాడి పోదు, చలిస్తుంది సరిస్తుంది ఎంతటి ప్రవాహంలోను కిరణం మునిగిపోదు, ప్లవవిస్తుంది. 570571 రెండో భాగం
10. ప్రదర్శనలో ఆదర్శాల ప్రదర్శనలో శిల్పాలు వీథి నృత్యం చేస్తున్నాయి భుజాలపై ఎగిరే పతాక చిహ్నాలెపుడు మారేదీ తెలీదు జ్వాలల్ని చూస్తూ ప్రజలు ప్రక్కకు తప్పుక నడుస్తున్నారు వరసగా అంటించిన పోస్టర్లతో, గోడ, సినిమా రీలులా ఉంది. నాటకంలో ఎన్నికల అంతర్నాటకంలో ఎవరి రహస్యం వారిది అందని వస్తువుకై పరుగులో ఎవరికి వారు విడిపోతున్నారు ఎవరి విజయం వారికి ఫాలతలంపై రెక్కలతో ఎగురుతూన్నట్లుంది మధ్య మధ్య అనుకోకుండా ఏ సుడిగాలో తుపానో ప్రకంపనో దయచేయొచ్చు వీథి నుండి మరో వీథికి వచ్చేప్పటి కొక అంకం ముగుస్తుంది ఏ వ్యక్తీ ఇపుడొకే పాత్ర కాదు బహుపాత్రల సంకలనం పాత్ర నుండి పాత్ర మంచెపైకి అవలీలగా వస్తూ పోతూంటాయి
ఒకటి నిప్పురవ్వై ఎగరొచ్చు మరోటి కన్నీటి బిందువై రాలొచ్చు దారిలో ఎదురయ్యే శిల్పాలు దేవతల వాలకాన్ని తలపిస్తాయి బ్రతికుండగానే కొందరు స్మారక శిలలు కావాలనుకుంటున్నారు ఫాల తలంపై ఆకాశం సిగ్గుతో తలవంచుకుంటూంది హృదయంలో అస్తమయ క్షితిజం తప్తమై నిష్క్రమిస్తూంది రాత్రి వస్తుంది తప్పనిసరిగా విశ్రాంతికి వీలుగా స్వప్న సంతోషంగా రాత్రి ఎంతో మిగిలిఉన్నా ముఖాల్లో రవి బింబంకై తహతహ మరుగుతూంది కళ్ళ ముందు భ్రమలు కదలుతున్నాయి! కళ్ళనుండి జ్వాలలు సరిస్తున్నాయి ఇపుడు రాజకీయం ఆదర్శ హృదయం కాదు, ఆకర్షణ యంత్రం మాత్రమే.
11. సిగ్నల్ రెక్కలు ఉద్విగ్న భంగిమల్లో శిల్పాలు వీధి వీధినా పట్టు ప్రభలతో కదలుతూన్నాయి ప్రభలు పూల గుత్తులై ఎదురైన వోటరు చేతుల్ని అలంకరిస్తాయి చేతులు తప్పితే వెలుగులై కాళ్ళ వద్ద జీరాడతాయి కాళ్ళు తొలగితే మెడలో దండలౌతాయి; నెక్ టై అవజూస్తాయి ముందుకొచ్చి కబుర్లు చెబుతాయి వెనుక నుండి చాకులు దూస్తాయి చాచిన ఎడారి నాలుకకు; ఏ దిశా ప్రవాహమూ చాలనట్లుంది. ఎరుపెక్కిన కోర్కెల శిఖలు ఒకటొకటీ కళ్ళనుండి జారతాయి అరచేతుల్లో మరకలు గుల్ మొహర్నో మోదుగ పూలనో తలపిస్తాయి ఈ గుర్తుల్ని స్మృతిలో భద్రంగా దాచుకునే వారున్నారు. ఈ మరకల్ని ఏ వృష్టి శుభ్రం చేస్తుంది? మానవహక్కు జలం తప్ప రాజకీయ ధూళి ధూమం ప్రావారమై అడ్డంగా కదులుతూంది దీని వెనుక కాంతి లాస్యమో! ఖడ్గ నృత్యమో తెలీడం లేదు ఈ ప్రావారం తొలగితే గాని, అసలు ముఖాలు స్పష్టంగా కన్పించవు రాత్రి ఆకాశంలో చుక్కలు, పగలు నేలపై ఉత్సాహ శిఖలవుతున్నాయి. పట్టపగలు పెద్దలు ఎడారుల్ని వదిలి పంటల్ని ఎత్తుకపోయేరు గుడ్డలో చుట్టిన హృదయ మణితో అంతలో జారుకునేరు ప్రదర్శనలో గాజుకేస్లో వజ్రం వలె పైన! కర్మ సాక్షి కన్పించేను నినాదాల్లో ప్రవాదాల్లో మునిగిన అంతరంగం ఈ మధ్య మాయమైంది రేపటి అధికారంకై ఈనాటి ఆలోచనలు పిచ్చుక పిట్టల్లా ఎగురుతున్నాయి ఈతచెట్ల వంటి భయ సందేహాల మధ్య బంతుల వలె ప్రతినిధులు ఎన్నికల్లో ఉద్విగ్న శిల్పాలు! ప్రజాస్వామ్య యాత్రలో సిగ్నల్ రెక్కలు
12. ప్రజాస్వామ్య బింబం జన చేతన మేఘం! ఎద ఎదలో కనిపిస్తూంది అమృత కుంభ హృదయంతో గరుత్మంతునిలా ఎగసీ మానవతా గంధంతో ప్రతి బ్రతుకును స్పృశిస్తూంది; నిండు గుండెతో దూరం బహుదూరం కదలుతూంది రాలే ప్రతి బిందువూ నేల లోతు చూడాలనే మేఘం పయనించేంత మేర శ్రమ జీవన దృశ్యం! ననేలపై కృషి సంతకంతో కదలే మనిషిలో మేఘం మౌనాన్ని పలికిస్తుంది; శబ్దాన్ని మీటుతుంది రస ముద్రలు నిలుపుతుంది బ్రతుక్కి అభయమిస్తుంది అనుభవానికి భేదం లేదు; ఆలోచనకు సీమల్లేవు ఆర్తి నుండి చాతకం వలె మనస్సు ముక్తమవుతూంది నవ సమాజ శక్తులతో జీవన రుచి పొందుతూందిఅగ్నిపిఠం - క్రాస్ ఫైర్ అవని ఫాలతలంపై శ్రమ జీవన భవిష్య రేఖతో పరిణామ చరిత్రలో శాంతి ఖండం మొదలౌతూంది. నీలి మబ్బు చేతి కందదు హృదయ వదనం చుంబిస్తుంది స్వేచ్ఛకు ఎత్తు ఎంత ఇష్టమో! పవన పథమూ అంతే ఇష్టం పుట పుటలో నీలి మబ్బు అక్షరాల బాహువుల్లో ఒదిగిపోతుంది సమస్యలకాప్తరూపం, పీడిత జన సందేశం, ప్రజాస్వామ్య బింబం
13. అరణ్యం కాకూడదు నీలి మబ్బు రాకతో కన్పిస్తుందొకటే సమమైన ఆరరూపం ఇపుడు మట్టి శిశువనీ స్వర్ణ శిశువనీ ఏ భేదం లేదు దప్పికతో ఆగిన ఎడారి పచ్చని చేయి ఊపుతుంది బాధా ముఖంలో నిల్చిన కంటకం రస బిందువు జారుస్తుంది కోపంతో చిందులేసే కొరకంచు శాంతిపాఠం రవళిస్తుంది. భూమి ఆహారాన్ని ప్రసాదిస్తుంది ఆకాశం కల్పనను ప్రేరేపిస్తుంది చెట్టంతైనా ఆకాశమెత్తు పెరిగినా మనిషి గిట్టేది మట్టిలోనే మస్తిష్కంపై కదలే నీలి మబ్బు ఎదలో దిగుతుంది చెట్టుకన్నా ముందు మనిషినీ ప్రాణినీ పలకరిస్తుంది నేల కంటకుండా కదలినా నీలిమబ్బు రాకపోతే
అరణ్యం అగ్ని జడలు విప్పుతుంది సమాజం అనల ముఖం చూపుతుంది చేతిలో నాణాల వలె చినుకులు పేద గుండె నాదుకుంటాయి ప్రదర్శనశాలలో చిత్రాల వలె పనిపై కదలే శ్రమ సాధనాల వలె ఎగుడు దిగుళ్ళనూ బీటల్నీ సమతలం చేస్తూ ఎండిన గుండెను తడితో స్నేహ సుందరం చేస్తూ బడికెళ్ళే పిల్లల భుజాలపై వేలాడే బాగ్లల వలె నీలి మబ్బులు పెరిగిన అరణ్యం మృగ సంచారంతో చూడ్డాని కందంగానే ఉంటుంది కాని చూస్తూ చూస్తూ జీవితం మాత్రం అరణ్యం కాకూడదు దారిలో శిల మైలురాయి అవచ్చు; ఆయుధం కావచ్చు కాని మొలకెత్తిన జీవితం ఎదురైతేనే అర్థం ఆనందం నీలి మబ్బు చూపుడు వేలు కింద ఈ శ్రమ సమాజం ఇంద్ర ధనుస్సును మరిపించ వచ్చు వయొలిన్ వినిపించవచ్చు చినుకు పడింది
14. చినుకూ సమాజం సమాజ దాహం తీర్చడమే కాదు మొక్కనూ మొలిపిస్తుంది చిను చినుకూ కలిసి అవనిపై సరిస్తాయి చినుకు చినుకూ తరలి జలధిలో కలుస్తాయి గ్రీష్మంలో చినుకు వజ్రం, ఆనంద కణం అమూల్యం చినుకు చివరి మాట కాదు, సమాప్తీ కాదు చినుకు పడడం అదృష్టమైతే చినికి చినికి గాలి వానతో తుపాను రావడం దురదృష్టం ఒకటి మరో దానికి కారణం; ఒకటి మరో దానిలో భాగం చినుకు చేతిలో పూవై రాలొచ్చు గుండెలో ఆశై మొలవచ్చు చినుక్కీ ప్రవాహానికీ మేఘానికీ అనుబంధం మనిషీ సమాజం పరిణామాలకు ప్రతిరూపం మనిషి పురోగమనంతో సమాజ పరిణామంలో ఇప్పుడీ దారిన పాలకీ మోసే బుజాలు కన్పించవు ఇంతవరకు నీడల్లా అణగి ఉన్న ఆలోచనలు
15. అమృతయానం వెలుగు అలల్లా కదలుతూన్నాయి పురోగమిస్తున్నాయి. వీరి బాష్పబిందువులో రవి కిరణం మునకేసేందుకు భయపడుతూంది వీరి బాష్పబిందువులో మునిగిన మానవత ముఖమెత్తేందుకు సిగ్గుపడుతూంది ఇపుడు వీరి మాటల్లో అభ్యర్థన లేదు ప్రార్థన లేదు భయ ముద్ర లేదు గుండె దూసుకపోయే బాణం ముంది తూటా ఉంది క్షిపణి ఉంది అరణ్య గర్భం నుండీ నగర హృదయం దాకా ఒకే అభియానం నీదీ నాదీ, మనిషి మనిషి కథతో అందరిదీ, చరిత్రలో మనదీఅగ్నిపిఠం - క్రాస్ ఫైర్ ప్రయాణంలో అన్వేషణలో ప్రతి మనిషిలో చైతన్యం ఒకటే దారిలో గాలీ నీరూ భూమితో పాటు మానవతా బంధం ఒకటే తోటలో కొత్త మొక్కలు వస్తాయి; కొత్త పూలు రాకమానవు కొత్త జీవితం తెస్తాయి; కొత్త సంస్కృతి పరిమళిస్తుంది. ఇపుడు కావలసింది ఒక చేతిలో సుత్తీ మరో చేతిలో గొడ్డలీ కాదు చరిత్రలో నలిగి చినిగి మాసిన మాసికల మారణ పతాక కాదు ఒక చేతిలో శాంతి పుష్పం! మరో చేతిలో ప్రజాస్వామ్య కేతనం సృజన కిరణ హృదయంతో అవసరం, మనిషి అమృతయానం!
II. సీజ్ ఫైర్
(కావ్యం) (2002) అంకితం జీవన సహచరి శ్రీమతి ఇందిరకు II. సీజ్ ఫైర్ సూచిక0 1. గది కిటికీ నుండి 2. కళ్ళలో నవశతాబ్ది 3.
లయ దొరకని చరణాలు 4. అద్దాల కేస్లో 5. సమయ రాగం 6. వెలుగు ముఖం కోసం 7. టా న్స్పరెంట్ హృదయంతో 8. ఆశ్చర్యం లేదు, విచిత్రమూ లేదు 9. మండే నిశ్శబ్దంలా 10. తలుపులు తెరవడమే 11. ఆశ్చర్యం లేదు, అనుమానం లేదు 12. ఆశ్చర్యం లేదు, అస్పష్టత లేదు 13. ఆశ్చర్యం లేదు, అవాస్తవం లేదు 14. ఆశ్చర్యం లేదు, అంతర్ముఖం లేదు కార్గిల్ కవితలు : 1. రెక్క ఒరిగిన ఈ రోజు 2. టాస్ సోల్జర్
3. ఇంకా తెరపడలేదు. 4. యశస్తోరణం సీజ్ ఫైర్ - సమాలోచనం సమాజంలో మానవ జీవిత పథంలో, వివిధ దశల్లో లక్ష్యంలో భేదాలు కారణంగా సంఘర్షణ అనివార్యం. ఇది కొన్ని సందర్భాలలో తీవ్రరూపాన్ని ధరిస్తుంది. రణ భావాన్ని పొందుతుంది. అయితే మనిషిలో వివేకంతో నిఖిల మానవ శ్రేయో భావనతో ఉదారతతో దీన్ని ఏదో ఒక విధంగా అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కొక్కపుడు క్లిష్టదశలు ప్రాప్తిస్తాయి. సంక్షోభం సంభవిస్తుంది. ఏ మూల నుండో ఆశాకిరణంకై మనిషి ప్రయత్నం జరుగుతుంది. దీని పర్యవసానమే సీజై ర్ కావ్యం. ఇరువర్గాలు, పక్షాలు, తమ తమ ఆయుధాల ఉపయోగానికీ, మారణ ప్రవర్తనకూ విరామం ఇవ్వడమన్నమన్నమాలు. దీనివల్ల నలిగిపోయే శాంతి కొంత ఊపిరి తీసుకొనే సమయం దొరుకుతుంది. మనిషిలో స్వార్థమే కాకుండా పట్టువీడని ధోరణి, తన లక్ష్యంపై దృఢ వైఖరి. రణ మారణ స్థితులకు దారితీస్తుంది. ఆధునికయుగంలో అవసరాలూ, పరిస్థితులూ, అభిప్రాయ భేదాలు, ఆదర్శ రూపాలు, సంఘర్షణకు దారితీసే అవకాశమెక్కువగా ఉంది. ఆధునికమైన సాధనాలతో, త్వరగా మరింత తీవ్రరూపం ధరించడమే కాకుండా పరిధి విస్తృతి పొందడమూ జరుగుతూంది. ఆధునిక జీవితంలో ఎన్ని తరాల నుండో పాదుకొన్న పీడనం, తత్కాల సమస్యలవల్ల అలజడి అశాంతి, క్రమంగా హింసకు దారితీయడం జరుగుతుంది. ఇది సమాజంలో వివిధ స్థాయిలో కన్పిస్తుంది. దీన్ని నివారించేందుకు లేదా అదుపులో పెట్టేందుకు వ్యవస్థల్లో, సామాజిక రాజకీయ ఆర్థిక దృక్పథంతో ప్రజాస్వామ్యమొక్కటే పరిపూర్ణమైందని చెప్పలేం కాని ఉన్నవాటిలో మేలైందిగా కనిపిస్తుంది. సీజై ర్ కావ్యంలో వస్తువు ఈ సూత్రంపై యోజితమవుతుంది. ఈ వ్యవస్థలో ఇతరుల అభిప్రాయాల్ని మన్నించడం, చాలా భాగం ఎక్కువమంది అభిప్రాయాల కనుగుణంగా వర్తించడం, లేదా వ్యతిరేకుల అభిప్రాయాల్ని కూడా పరిగణన లోకి తీసుకోవడం, సమస్యను తనదైన దృక్పథం నుండే కాకుండా అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా చర్చల ద్వారా పరిశీలించడం, న్యాయం చేకూర్చే విధంగా అందరినీ కలుపుకొని పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛ- సమానత్వం-న్యాయం (ఆర్థిక సామాజిక) అంశాల్ని - సిద్ధాంత ప్రమాణంలోనే కాక
అనుభవ సందర్భంలో గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఎన్నో మతాలు, ఎన్నో విశ్వాసాలు, ఎన్నో సాంస్కృతిక రీతులూ ప్రాంతీయ భాషా భేదాలు ఉన్న భారతీయ సమాజంలో ప్రజాస్వామ్యం, మేలైన పరిణామాల్ని కలిగిస్తుందనే విశ్వాసం.580 సీజై ర్ కావ్యం ఇంతకుముందు వెలువడిన క్రాస్ఫర్లో భావ స్థానాల కొనసాగింపు మాత్రమే. సమాజంలో ఎదుర్కొనే ఆర్థిక సామాజిక రాజకీయ విషమ స్థితులవల్ల విపరీత ధోరణులవల్ల అనివార్యమయ్యే సంఘర్షణలూ - రణ సదృశస్థితినీ తొలగించే అవసరం ఎప్పటికీ ఉంది. కాబట్టి ఈ కావ్యం 'సీజై ర్' లో వస్తువు సామాజికవసరమైంది. కావ్యం గది కిటికీ నుండి కన్పించే సంగ్రహ దృశ్యంతో ఆరంభమవుతుంది. గది అంటే చాలా తక్కువ పరిమితులతో కూడిన స్థితి సూచితం. దీనినుండి బయటి దృశ్యం, సమాజంలో మన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరిగే స్థితికి సంకేతం. గదికి ఒక కిటికీ, ఇది లోపలి ప్రపంచానికీ, బయటి ప్రపంచానికీ సంబంధాన్ని స్థాపిస్తుంది. మనిషి ఆలోచనలోను ఈ స్థితి అనివార్యమైంది. ఇది మనిషిలో స్వేచ్ఛగా వీచే ఆలోచనకూ సూటిగా దూకే వెలుక్కీ ప్రవేశరూపం. లోపలి ప్రపంచానికీ బయటి ప్రపంచానికీ మధ్య రాకపోకలకు సాధనం. వ్యక్తీ - సమాజం మధ్య సంబంధాన్ని స్థాపించేది. ఇట్లా ఒక్కో ఖండిక ఒక్కో విధమైన వైయక్తిక సామాజిక స్థితిగతుల్ని చిత్రిస్తూంది. చివర కార్గిల్ కవితలు జాతీయ భావనాత్మకాలే కాక మానవీయ స్పందన రూపాలుగానూ సమాలోచనకందుతాయి. మనిషిలో నీలి సముద్రం పాలసముద్రంగా రాగ సముద్రంగా మారాలనే కవి ఆశ. నీలి సముద్రం మనిషిలో చీకటి పార్శ్వాన్నీ, పాల సముద్రం, రాగసముద్రం మనిషిలో వెలుగూ, ఆర్ద్ర పార్శ్వాల్ని వ్యంజింపచేస్తున్నాయి. ఇందులో అయోమయం లేదు, అంతర్ముఖమూ లేదు, ఉంది ఒకే ఒక భౌతిక మానసిక తలాలపై వర్తించే సామాజిక స్వరూపం! ప్రజాస్వామ్య భావనతో దర్శితమైంది. కావ్యత్రయం (టి నిటి)లో రెండోది “సీజై ఫైర్” వర్తమాన సమాజ స్థితి చిత్రణం. Detroit, Michigan, U.S.A. 16-2-2002 - హరిత సీజీ ఫైర్ - ఆలోకనం జీవితం నిరంతరం సంఘర్షణమయం, రణయుతం, రణచ్ఛాయాన్వితం, ఇది వివిధ తలాలపై క్రమిస్తుంది. బహుముఖాలుగా వర్తిస్తుంది. దీనికి విరామం అవసరం. ఈ స్థితే సీజ్-ఫైర్. మనిషి లక్ష్యం ఎన్నటికీ, శాంతి, సౌహార్ధ, సౌభాగ్య సమాజమే. ఆధునిక యుగంలో హక్కులకై పోరాటం మొదలుకొని ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనే
సందర్భాలనేకం. పీడనం, అశాంతి, అలజడి, హింస వివిధ స్థాయిల్లో కన్పిస్తాయి. అభిప్రాయాలూ సిద్ధాంతాలూ ఆదర్శాలపట్ల అవలంబించే తీవ్రవైఖరి కారణంగా, ఉద్రిక్త వర్తనం ఫలితంగా సంఘర్షణ క్రమంగా రణ సదృశమవుతుంది. ఈ కావ్యంలో నేడు సమాజం ఎదుర్కొనే విషమ స్థితులూ, విపరీత ధోరణులూ దృష్టికి వస్తాయి. ఈ భావనా కేంద్రంగా వివిధ సంఘటనలూ స్థితులూ అంశాలూ చిన్న చిన్న సన్నివేశ సంవిధాన నిర్మాణాల్లో అవతరించాయి. మనస్తత్వ ప్రధానంగా పాత్రలపై వెలుగు ప్రసృతమైంది. ఇందులో వస్తువు ప్రతీకలతో భావ రూపాలతో, సంభాషణపై కథనంపై దృష్టితో ఆవిష్కృతమైంది. ఇది వర్ణనా ప్రధానం కన్నా భిన్నమైన అభివ్యక్తి గుణం కలిగింది. ఈ సీజ్-ఫైర్ కావ్యం. దీనికి ముందు వెలువడిన క్రాస్-ఫైర్ కావ్య పరిణామ రూపం. మొదటిది పూర్వభాగంగానూ, రెండోది ఉత్తర భాగంగానూ గమనించవచ్చు. ఈ రెండింటి సమాహారమే జీవన రణ రూపం. ఇవి స్వేచ్ఛా కవిత్వంలో ప్రజాస్వామ్య పార్శ్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఉత్తమ సంస్కారంతో ఉన్నతమైన జీవన సంస్కృతి కలిగిన వ్యక్తి మనస్సులో ప్రేమ ఉదారత సమన్వయం శాంతినే కోరతాడు. సమాజంలో అనివార్యమైన సంఘర్షణల్నీ అశాంతిని తొలగించే తక్కువచేసే శక్తి ప్రజాస్వామ్యానికే ఉంది. ఇది సిద్ధాంతానికే పరిమితం కాకుండా ఆచరణలోను పరివర్తితం కావాలి, అప్పుడే ఆదర్శం ఫలప్రదమవుతుంది. 28-3-2000 మాదిరాజు రంగారావు II. సీజ్ ఫైర్
1. గది కిటికీ నుండి మనిషిలో గది కిటికీ అద్దాల రెక్కలు తెరచే ఉన్నాయి బయట గాలీ నీరూ వెలుగూ భూమీ, చేతనాచేతన ప్రపంచం తన కోసమే నన్నట్లుంది ఒకవైపు ఆకలీ మరోవైపు ఆలోచనతో జీవితంలో మనిషికి అవసరాలు ముఖ్యం మైలు రాయి నిశ్శబ్దంగా దారి చూపిస్తూంది వాహనాలు సశబ్దంగా ప్రవాహ గతినిస్తున్నాయి ప్రయాణికులు వెనక్కి చూచే సమయం లేదు. రాత్రి వస్తుంది భయ సుందరంగా, చీకటి బొమ్మతో ఆడుకొనీ నిద్రపోయి లేచే సరికెదురుగా చీకటి దిగిన మనిషి రూపం!
పుట్టిన సమయంలో భయం, మొదటి కేకతో రూపు దిద్దుకుంటుంది, రెండో కేకతో గూడు కట్టుకుంటుంది కాలం గడిచే కొద్దీ ధైర్యం బ్లేడ్ కదులుతుంది, భయాన్ని ముక్కలు చేసే కోరిక చలనంతో జీవన రణంలో గాయం లిపి ఒక్కొక్క సమయం ఒక్కొక్కరి కొక్కొక్క విధంగా అవగతమవుతుంది. గాయం లిపి తెలుసుకునే లోపల మరో గాయం, అవతరిస్తుంది అవలీలగా పొద్దునే మంచు ఊగే వెచ్చని కిరణాల్లో సమయం అద్దం నుండి చూస్తే, గుహ నుండి బయటికొచ్చి, శాంతి కవచం ధరించిన సింహంలా కదలుతుంది. వెలుగు మొగ్గల్ని తలపించే క్షణాలు అగ్ని పత్రాల్ని రెపరెపలాడించవచ్చు. రైఫిల్కు రెక్కలతో పని లేదు అది వదలే బులెట్కుంటే చాలు! కాలానికి రంగు రుచితో పనిలేదు దాన్ని వహించే మనస్సుకుంటే సరి. బయటి దృశ్యానికీ లోపలి దృశ్యానికీ మధ్య రేఖ చెదరి పోతూంది, మారిపోతూంది, అదృశ్యమవుతూంది కిటికీ మాత్రం నామ మాత్రంగా నిలిచిపోతూంది.
2. కళ్ళలో నవ శతాబ్ది పైన కిటికీ వద్ద కూచున్న నా చేతిలో పెన్ చివర నిశ్శబ్దం నుండి శబ్ద ప్రపంచం ఒకటొకటీ ఆలోచనా రేఖపై కదలుతూంది. ఒకవైపు కొత్త ప్రపంచంతో మార్చింగ్ తరం, మరో వైపు పాత ప్రపంచంతో జాగింగ్ గణం. దూరం నుండి బీట్ సంగీతం ప్రయాణగతికి లయనిస్తోంది. పక్కనుండి వాహనం దూసుకునీ లయ చెదరినట్లనిపిస్తోంది. దారిలో ఆగి ఆగి ఎదురయ్యే సన్నని మంచు తెర ఐస్ క్రీం కప్పు అంచులా పెదవుల్ని స్పృశిస్తోంది. ఎక్కడికక్కడ ఆగినట్లున్న దారి పోను పోను కారు ప్రయాణంలో ఎంతకూ అందకుండా పోతూంది. పక్కనే శ్రమ జీవి, తలలో బ్రతుకు మూటతో కదిలేను
మైలు రాయి, కదిలే మనిషి లక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూంది. ఈ దారిన చెట్టు నీడ ఏ ఒక్కరిదీ కాదు, స్వేచ్ఛా గమ్యం చేరే హక్కు అందరిదీ. ఒంటరితనం ప్రశ్న లేదు, ఎవరో కలుస్తూ పోతుంటారు, అంతా తమకు చెందినట్లే, అంతా తమకు కావలసినవారే. దారి పక్కన రాలే ఆకులపై కన్నా పూచే చెట్టు కొమ్మపై దృష్టితో నిరాశ వెనక బడుతూంది, ఆశ ముందుకు నడిపిస్తూంది. కిటికీ నుండి కళ్ళు కొత్త శతాబ్దికై ఎదురు చూస్తున్నాయి. చిన్నారి ఎప్పుడు వచ్చిందో, నా చేయి పట్టుకొని నిల్చుంది. అవనిపై క్షితిజం వలె ఎత్తిన ముఖంలో మొగ్గ తొడిగిన జన స్వామ్యం బింబిస్తూంది.
3. లయ దొరకని చరణాలు సంఘంలో లయ దొరకని జీవన చరణాలు అరణ్య హృదయం లోకి దారితీస్తున్నాయి. ఇక్కడికి రావడం ఏదో నేర్చుకునేందుకే అది మృగేంద్ర సాహసం కావచ్చు! అరణ్య రహస్యం కావచ్చు. జీవించే మనిషి హక్కు నిలుపుకునేందుకూ కావచ్చు. క్రాస్ బాధ్యత పూనే సహనం కోసం కాదు. గతానికీ వర్తమానానికీ మధ్య బంధం తెగింది. యాత్ర ఆగింది, చీలిక ఏర్పడింది, దారి చీలింది. చీలికలో నలిగే కన్నా, గోతిలో పడే కన్నా మరో దారి నవలంబించడం అప్పనిసరి అవుతూంది. ఇది జీవనయాత్రలో భిన్న మార్గ భేదమే. ఇక్కడెవరికీ ఎవరితో చిర శత్రుత లేదు. కృత్రిమ పాత్ర నెరగని నగ్న హృదయంతో అరణ్యం నిస్వార్థంగా స్వాగత మిస్తుంది. అమానుషం లేదు, అనుమానం లేదు, స్వేచ్ఛ కంతరాయం లేదు. పక్షి రెక్క అంచు నా బుజాన్ని స్పృశిస్తూ పోతుంది. పగిలిన బండల్నీ ముక్కలైన భూమినీ పిండి బ్రతుకుతూ, జరిగే పోరాటం, భూమి కోసం కన్నా మనిషి అస్తిత్వ కోసమన్నట్లుంది. బరువైన గాయాల్ని మోసుకునీ, రేగే మంటల్ని దాచుకొనీ
మారే వర్తమాన గమనంలో, అడుగుల్లో లయ కోసం అన్వేషణ! దిశ దిశ నుండి స్వరాలు కొమ్మ కొమ్మ నుండి ఆశలు ఆగీ ఆగని పిల్లల్లా గంతులేస్తూ అలరిస్తాయి, పలకరిస్తాయి అవనిపై పుట్టినా ఏదీ అవని ఒడిలోనే దాగిపోదు! పై పై కెదగాలనీ దూరదూరం విస్తరించాలనే కోరిక సహజం! తలుపులు మూసిన సాయం కాలం వంటి బ్రతుకులో ఆరుతూన్న నిప్పు కణంలోనూ శక్తి బీజముంది. పాలిన ముఖంలో పూచే ఆశలో సూర్యుడు! ఎక్కడో లేడు; బ్రతుకు శబ్దిస్తుంది గుండెలో, కవిత ధ్వనిస్తూంది నాడిలో.
4. అద్దాల కేస్లో వర్తమాన చరిత్రలో నిబద్ధమైన హేతు పాత్ర దారికడ్డంగా ఉన్న బండల్ని నిన్న పేల్చేసింది జారి పడిన మానవ హక్కుల పత్రంపై శీర్షిక వలె ఉంది అడ్రసు జేబులో లేదు, పిడికిలిలో ఉందేమో! ఎవరి నెవరు గుర్తులు మాయకుండానే గురిచేసినా ఓ స్వప్నం నిజం కావడానికి హింస ఆదర్శం కారాదు ప్రవాహం గడ్డ కట్టినట్లుంది, అంగారం ఆరినట్లుంది రణంలో పడిపోయిన ఆదర్శ చక్రాన్ని తలపిస్తోంది. బాధా హృదయంతో ఆయుధం పట్టుకోవలసి వచ్చిందా? అనుమానాస్పదంలో రహస్యం తొడుక్కోవలసి వచ్చిందా? బయట పడిన పులి అదృశ్యమయి నట్లనిపిస్తుంది, కాని లోపల అద్దాల కేస్లో భద్రంగానే ఉంది! తిరుగుతుంది కూడా మేఘ గర్జనం విన్నంత మాత్రాన ఆకలి తీరదు మెరుపు తీగె మెరసినంత మాత్రాన ఆశలు పూయవు. తలపై ఆకాశాన్ని తాటి చెట్టు కొలవ జూస్తుంది
5. సమయ రాగం అద్దాల గది నుండి అంతరంగం అన్ని దిశలూ చూస్తుంది. బికారి వాల్పోస్టర్లో సినీ సంతోషాన్ని పొందుతున్నాడు యువ చరణాలు జలధి తీరాన అలల వలె తరలుతున్నాయి.
శాశ్వతంగా విశ్రాంతి పొందిన మనిషి మూసిన కళ్ళలో కలలు బిగింపబడినాయి. ఒకడో పక్షానికి విద్రోహి మరో పక్షానికి వీరుడూ విషాదమైనా ఆనందమైనా ఒంటరి నిద్ర పోనీదు, అందరినీ మేల్కొల్పుతుంది. నిలయాల నుండి నీడల్లా బయటి కొచ్చి చూచి పోతున్నారు. దారిలో విద్యార్థులు మూసిన పుస్తకాల్లా ఉండిపోయారు. ఇక్కడున్న సమూహాన్ని మానవతా స్పృహ కలుపుతూంది. కళ్ళలో నీళ్ళపై ఇందాకా దాగిన రహస్యం తేలుతూంది. ఇప్పటి దాకా ద్వేషాన్ని పెంచిందీ, కోపాన్ని రగిలించిందీ ఇపుడు ప్రేమను ప్రభవిస్తూంది, కరుణను ప్రవహిస్తూంది. దర్పణంలో స్వీయ ముఖం బదులు సమాజం బింబిస్తూంది కత్తి పదును చూచే వేళ్ళు పూల రేకుల్ని ఊహిస్తున్నాయి. విస్ఫోటానికెపుడో సరిచేయబడిన సమయం మారనుంది మానవతా ఘన రాగానికి ట్యూన్ చేయబడుతూంది.
6. వెలుగు ముఖం కోసం ఫే మ్లో ఫోటోగ్రాఫ్లో పైన కిటికీ వద్ద మనిషి ముఖం, ప్రవాహంలో తేలే పూల శాఖల్లా కింద చీలిన దారులు. బాల్కనీలో పక్షి వెంటిలేటర్ వైపు చూచి బయటి కెగిరేను ఆ పక్షితో మరో పక్షి సమాంతర రక్తితో పై కెగురుతూంది. ప్రయాణంలో నడిచే మనిషిలో నుండి పులి ఎన్నడో ఆకలి తీరేందుకు హఠాత్తుగా బయట పడుతుంది ఎదురుగా నున్న చెట్టు అస్థిపంజరాన్ని తలపిస్తూంది. పులి నడచినంతమేర మృత్యుముద్ర పైబడుతూన్నట్లుంటుంది.అగ్నిపిఠం - సీజై ఫైర్ అడవిలో పులి ఆకలి అవసరం దాని హద్దులోనే ఉంటుంది. ఆకలి తీరాక వెనక్కు మరలుతుంది, నివాసం చేరుతుంది. మనిషిలో నుండి బయట పడిన పులి వెనక్కి రావడం జరగదు మనిషిలో పులి ఆకలికి, ఏ సమయంతోను ఏ మేరతోను పనిలేదు. ఎదురుగా నున్న దీప స్తంభానికి ఉరి వేసుకున్న నీడ, సమాజంలో మనిషి విషాద క్రియను జ్ఞాపకం చేస్తూంది. ప్రయాణం సాగినంతమేర వేట, మనిషి జీవితంలో భాగమైంది
మనసులో ఆఖేటం! అదను కోసం చూస్తుంది, లేస్తుంది, తన పని చేస్తుంది. చెట్టు నుండి రాలే ఆకులు విషమ క్షణాల్ని కప్పేయ జూస్తున్నాయి. గాలికి ఇసుకపై అక్షరాల వలె సూక్తు లెగిరి పోతున్నాయి. సాయం సంధ్య ఆకలితో ఆకాశాన్ని నమిలేయ జూస్తూంది చీకటి ముఖం స్వార్థంతో భూమిని మ్రింగేయ జూస్తూంది. గదిలో ఎదురుగా అద్దంలో కన్పించే వస్తూ పోయే మనుషులు ఆలోచనకు పని కల్పించే యంత్రాల వలె కదలి పోయేరు.
7. టా న్స్పరెంట్ హృదయంతో ఒక చేతిలో కాఫీ కప్ వర్తమానాన్ని ఆస్వాదిస్తూ మరో చేతిలో పెన్ పాయెంట్లో భవిష్యత్తును దర్శిస్తూ కిటికీ వద్ద కూర్చున్న నా దృష్టికి ముందుగా పోయే దారిన జన జీవన సంకుల దృశ్యం ఫిల్్మ రీల్ వలె కదలుతూంది. ఆకలి కథతో సుడిగాలిలా చెలరేగిన ప్రశ్నా ముఖం ఏ జవాబు దొరక్కుండానే నేలపై ఒరిగి పోతూంది. చేతి నుండి ప్రస్తమయ్యే ఆయుధంలా పడిపోతూంది. తలపై ఏ దెబ్బో! కాళ్ళకే గొలుసో! చేతులకే కత్తెరో పడీ ఒరిగిన మనిషి వెనక దాగిన ఏ ప్రశ్నకూ సందేహానికీ ఇంత వరకు పూర్తిగా సమాధానం దొరకనే లేదు. పై నుండి నక్షత్రం కాదు కదా! పూవు కూడా రాలదు. నేలపై కన్నీటి కణం మాత్రం! రాలి పడుతుంది, మనిషిపై పుట్టినందుకు చూపే ఘన కార్యంలా. హితవాదీ మితవాదీ నిర్మాణశీలీ విధ్వంసకారీ ఆశామతి నిరాశామతి ఒక్కొక్కొరూ ఒక్కొక్క బింబమై, కళ్ళలో తడి వెన్నెలతో ముఖాల్లో రవి కిరణాల్ని అందుకునేరు. స్తేయం కన్నా భిక్షాటనం కన్నా సమాజంలో హక్కులకై పోరాటంలో ఈ సమయం సీజై ర్ సమాజంలో శాంతికి ద్వారం వలె ఉంది. పై తరం కథా సూత్రాన్ని కిందితరం అందుకోవాలి నిజమే కాని ఒక తరం కథా గమన విధం మరో తరంలో ఉండదు. పేరూ ఊరూ కులం మతం కన్నా మనిషీ ప్రాణమూ! మిన్నె నిజం! నిప్పులా వెలుగుతూంది; టా న్స్పరెంట్ హృదయంలో!
8. ఆశ్చర్యం లేదు, విచిత్రమూ లేదు ఆశ్చర్యం లేదు అంతకన్నా విచిత్రమూ లేదు. మరో ఉదయం ఋతువూ వత్సరం శతాబ్ది అన్నీ సమాప్తి లేని ప్రవాహ పరంపరలో పడవలూ, ఓడలూ భయం నుండి ముక్తం కాని స్వేచ్ఛలో ఘర్షణ నుండి విరామం లేని భావనతో ప్రయాణమే గమ్యం చేరుతుంది? జీవితమే సంస్కృతి బింబిస్తుంది? ప్రయాణంలో కనుమరుగైన సూర్యుణ్ణి, వేలి ఉంగరం వజ్రంలోనైనా చూడాలనే ఉంటుంది. మానవతా విఘాత చిహ్నం అవనిపై నెత్తురు మరక శతాబ్ది హింసను బింబించే చరిత్రకు పీఠికలా ఉంది. పగటి చివరి కిరణం విషాదంతో ఆగినట్లుంది. సాయం సంక్షిప్త సంధ్య, నేలపై తల్లి ఎదపై వాలినట్లుంది. సూరీడు గమనం, చేతి గడియారంలో బంధితమైంది. బరువు గుండెతో తల్లి తలెత్తలేకుండా ఉంది. వేడి ఆలోచనతో తండ్రి దిక్కులవైపు చూచేను. జనం ఆలోచన అమాయక సీమల్ని దాటింది. జన సంభాషణ మృత్యు ముద్ర చుట్టూ తిరుగుతూంది. ఇక్కడ చేరిన మనుషులకూ నీడలకూ భేదం లేకుండా ఉంది. రవి వదలి వెళ్ళిన కిరణాల్ని గుండెలో నింపుకొనీ శశి మరచి పోయిన వెలుగుల్ని ఊహలో దాచుకొనీ, సాగే ప్రయాణంలో ఈ సమయం, పాట కన్నా మాటకే విలువ!
9. మండే నిశ్శబ్దంలా ఆశ్రయం కోసమో నిలయం కోసమో సాగే పయనంలో మధ్య మధ్య మండే నిశ్శబ్దాన్ని భరించక తప్పదు, తగల బెట్టే మంటల వెలుగు కన్నా చీకటి నయమనిపిస్తుంది. చంపే వ్యక్తీ చంపబడే వ్యక్తీ మానవ మూర్తులే ఇరువురి భావ తీరాల మధ్య స్నేహ ధార ఇగిరిపోయింది, ఇంకిపోయింది ; ఇసుక పంక్తి మిగిలింది. దారి కిరువైపుల నుండీ చూపుల స్వాగతాలు తప్ప
చాచే మనుషుల చేతులు కలిసే వీల్లేదు. దారి పొడవునా ఇరువురి మధ్య ఇనుప ముళ్ళ కంచె వెలసేను. మోసే క్రాస్లోను ఎరుపు తెలుపు నీలి రాజకీయాలు ఎదురయ్యే ముఖాల్లో బొమ్మలు! మానవేతర విశేషణాలు! విసరేందుకు రాళ్ళేరుకునే రెండు చేతులూ, పూల గుత్తులు గ్రహించేందుకు సమయం పడుతుంది.
10. తలుపులు తెరవడమే కత్తి దిగీ, బులెట్ దూరీ, మానవ బాంబు విస్ఫోటనంతో మనిషి చివరి ఊపిరి, సృష్టి అంచుల్ని కంపింప జేస్తూంది. మనిషి చివరి చూపు, సమాజ ముఖాన్ని మాడ జేస్తూంది. వ్యక్తి హక్కుతో సామూహిక సామాజిక హక్కులూ అనివార్యం విధ్వంసం హననం స్వేచ్ఛాచరణ గతికి విరుద్ధం జీవించే హక్కును కాదనడం మానవ సంబంధాన్ని మూసేయడమే. విపణిలో వీరగాధ అమ్మకానికి ధర పలకబడుతూంది. మనిషి శక్తి మంట గలిసి ప్రతిమ మిగిలిపోతూంది. రాళ్ళు పూలు పూయవు! ప్రతిమలుగా చెక్క బడొచ్చు మనిషి పూలు పూయక పోనీ! ప్రతిమ లవకుండా ఉంటే చాలు! మనిషిలో మానవత చేతికందేపరిమళ గుచ్ఛం కాదు. మనిషిని పురి కొల్పే, ఎద ఎద కందే, కిరణ పుంజం! అవును. రాత్రి మంచులో తడిసిన మనిషి నెత్తురు చిత్రం ఉదయం! మనిషి పోలికతో జీవ రూపం పొందుతూంది. విధ్వంసం లోనో ఎన్కౌంటర్లోనో మాయమైన మనిషి కోసం ఇపుడు ఏడ్వాలనిపించడం లేదు! ఏకాంతమూ కోరడం లేదు. బ్రతికి ఉన్న మనిషిలో శాంతి కిరణ ప్రసారంతో నవ శతాబ్దిలో స్వేచ్ఛా సృజన గతికి తలుపులు తెరవడమే.
11. ఆశ్చర్యం లేదు, అనుమానం లేదు కిటికీ నుండి కన్పించే జీవిత దృశ్యంతో స్మృతి జాలం కదలుతూంది వదిలేయబడిన పెంపుడు కుక్క విషాద ముఖంతో పిల్లడు నడచేను. ఎయిర్ కండీషన్ గదిలో కంప్యూటర్ వేళ్ళు స్పృశిస్తూ పయనించే
మనిషిలో ఆశకు పలు ముఖాలు! ఒక్కొక్కటీ ఒక్కొక్క దిశ చూపుతూంది. ప్రతి దిశ చూస్తూ తన చుట్టూ తాను తిరగడమే గమనంలా ఉంది. పురి విప్పిన నెమలి బదులు మతిలో సెట్ లైట్ భ్రమణం. కాళ్ళ కింద శిఖరం కోసం మనో రూపం ఎదుగుతూంది. చేతి కందే దిశ కోసం ఆలోచన చేతులు సరిస్తూంది. సమస్య శిఖరం నుండి అశాంతి జలపాతం దూకుతూంది. పేద అడుగు లోయ నుండి ఆవేదన ఎగసి చిమ్ముతూంది.అగ్నిపిఠం - సీజ్ఫర్ వ్యక్తి మాట లేకపోయినా జన భాషణం ప్రతిధ్వనిస్తూంది. వ్యక్తి గుర్తు మాసిపోయినా జనతా ముఖం ప్రతిఫలిస్తూంది. ఫి జ్లో ఐస్ క్రీంలా స్మృతులు బహుభద్రంగా ఉన్నాయి. ప్రతి పనికీ సమయం వలె స్మృతులు సనూస్వాదనకూ ఉంది. నివాస గృహం ఎప్పటికీ తుదిరేఖల్ని దిద్దుకోవాలిసే ఉంటుంది. భవిష్యత్తుకు చేర్చే మెట్లు ఎప్పటికీ పూర్తి కావలసే ఉంటాయి. తోటలో పూల కొమ్మకు నిప్పంటుకున్నా, కొందరికి తమ గదిలో ఫ్లవర్ వేజ్కు ధనం పూయాలనే! పేజీలో మలుపులు తిరిగే కవిత్వ పంక్తులో పదావళి, నెక్లెస్లో వజ్రాల వలె మెరసేను. ప్రవాహంలో పడవల్లా ఆలోచనలు కదిలేను. అశాంతిలో శాంతి ద్వీపం ఊహలో మెరసేను. సగం పైగా భూమి నీటిలో, సగం పైగా జీవితం రహస్యంలో బయటికి కన్పించే ప్రపంచం కన్నా లోపల దాగిందే ఎక్కువ. గొలుసేసిన సూట్కేస్తోనూ ప్రయాణంలో లగేజ్ తప్పదు! ఆశ్చర్యం లేదు. కిటికీ నుండి దృశ్యం! తెరిచిన మరో సూట్కేస్! ఇపుడే అనుమానం లేదు.
12. ఆశ్చర్యం లేదు, అస్పష్టత లేదు ఆశ్చర్యం లేదు, అంతకన్నా అస్పష్టత లేదు నిశ్శబ్ద బిందువు బిందువుతో సశబ్ద ప్రవాహం వలె రోజు వెంట రోజు వర్తమాన జీవిత వాస్తవం శ్రమ జీవన చలనంపై సమాజ గమనం పైన గది కిటికీ ముందు సమయ ముఖం వ్రేలాడుతూంది కిటికీ నుండి మెల్లగా లోపలికి కదులుతూంది. ఏదైనా సహింపక తప్పదు ఏమైనా భరింపక తప్పదు!
మధువో! పిడుగో! రథచక్రమో! విమానమో! హరితమై ధ్వంసనమై పీడనమై పయనమై మరో కిటికీ నుండి వెళ్ళిపోతుంది! గుర్తులు మిగులుతాయి. పంటలతో యంత్రాలతో శ్రమ శక్తికి కేంద్రమై విజ్ఞానం ఆనందం మానస తల నిలయమై మనిషిలో సృజన రేఖలిన్నీ అన్నీనా? ఎన్నెన్నో! మనిషిలో మనిషి ఒకరా? ఇద్దరా! ఎందరెందరో! కదిలే ఇనుప చక్రాల ధ్వని వలె పీడిత జన స్వరం కిటికీ నుండి లోపలికి దూసుకొని వస్తుంది, ఎద కదలిస్తుంది! పరచీ జనం నడచే రెడ్ కార్పెట్ వలెపగలు ఎగసే ధూళితో చుట్టబడుతూంది! గుర్తుపట్టలేకుండా! కిటికీ నుండి బయటికి చూస్తే చిత్రంగా అగ్నితో నెత్తురుతో మెరసే చీకటి చిత్రం మనిషిలో వికార రేఖ శకార రూపం పొందినట్లుంది! వెంట నున్న నీడలు సిగ్గుతో తొలగిపోతున్నాయి. కిటికీ కెదురుగా చంద్రబింబం వ్రేలాడుతుంది కిటికీ నుండి లోపలికి నాలోకి దూక బోతున్నట్లుంది! చదువుతూన్న పుస్తకం వలె కిటికీ తెరచే ఉంటుంది. సీజై ర్తో ఈ రోజు కన్నా వచ్చే రోజు నయమనిపించడంలో ఆశ్చర్యం లేదు, అస్పష్టత లేదు.
13. ఆశ్చర్యం లేదు, అవాస్తవం లేదు జనం నుండి జనంలోకి శరీరం వెళుతూంది పథం నుండి పథానికి అడుగులు కదలుతున్నాయి. అనుభవం నుండి అనుభవానికి ఆలోచన సరిస్తూంది. ప్రతీ ముఖంపై ఓ రంగుల పతంగం ఎగురుతూంది ఇదో పై కెగసిన అలవలె పక్షివలె ప్రతిఫలిస్తూంది ఎంతో పరిచయమున్నట్లే నాలో భాగ మయిపోతూంది. ఈ గట్టు నుండి ఆ గట్టుకీ ఆ గట్టు నుండి ఈ గట్టుకీ సూర్యుడు సముద్రంలో ఈదేను, మనిషిలో అంతరంగ చిహ్నం! కిరణం ఆయువు పోస్తూంది, ఆత్మకు ఆకృతి నిస్తూంది. అరణ్యంలో దారి చూపినట్లే ముఖంలో బొమ్మలాట చూపుతూంది.
బులెట్ దూసుక పోయిన గాయం నిలిచిన రాత్రి వలె ఉంది. బ్రయొలి లిపితోనే సర్వం అర్థమయేట్లుంది. లోన మానసికమై, బయట సామాజికమై, వెనుక చరిత్రతో సీజై ర్లో రణం బూది డ్రెస్లో అనలం వలె ఉంది. ఒకటి రెండు క్షణాల తుపాను చక్రంలో భీభత్సం నుండి బయటపడిన మనిషికిపుడు అలంకారంతో పనిలేదు. సీజై ర్తో శాంతికి తెరచిన తలుపులు విషాదాన్నీ మృత్యువునీ దూరం నెట్టేసే చేతుల వలె ఉన్నాయి. మనిషి మనిషిగా తీగెపై అనన్వయంతో మీటిన స్వరాల వలె సంకులమైన క్రాస్ రోడ్ను దాటడంలోనే ఉంది, ప్రయాణ రహస్యం. గాయంపై మంచు ముక్కలా ఉంది సీజై ర్ కాలంలో కరిగిపోతూ మంటల్ని స్మృతిమయం చేస్తూంది. గది కిటికీ మూత పడదు, దృశ్య పరంపర ఆగదు. ఆశ్చర్యం లేదు, అంతకన్నా అవాస్తవం లేదు.
14. ఆశ్చర్యం లేదు, అంతర్ముఖం లేదు ఆశ్చర్యం లేదు అంతర్ముఖం లేదు! ఉందొకటే జీవన రణం నిరంతర ఘర్షణలో మధ్య మధ్య ఓ విశేషం! సీజ్ ఫైర్ వైరుధ్యం తప్పని గమనంలో, సౌహార్దం తొలగిన ముళ్ళపై వేదనతో ముడుచుకున్న హృదయం నడుస్తూన్న సమాజ చిహ్నం ఆకలీ అసతల శిఖరాల మధ్య పోరాటంతో స్వార్థం ద్వేషం లోయల్లోకి జారిపోతూ మొగలి పట్టలో గన్తో, మందారంలో బాంబుతో మానవ రూపంలో నాశన చణ విస్ఫోటనం. నలిగీ ముక్కలు ముక్కలై చెదరిన శరీరంతో మానవ సంస్కృతీ ప్రపంచం, భగ్గు భగ్గున మండుతూంది. క్యాలెండర్ మారుతుంది, కాని మనోమూలం ఒకటే జడాన్ని కదిలించే నిశ్శబ్దాన్ని పలికించే ఆ శక్తి ఒక్క హృదిదే. ఉత్సాహం అంచుల్లో సముద్ర చలనంతో, ఉద్రేక శిఖరంపై ఆకాశం శాలువతో మట్టి కణంలో మంజీర ధ్వనితో, రోజు పుటలో చెరగని హక్కులతో కన్నీటి బిందు సమూహం వెలుగు రేఖలతో, మారిన అభినవ రూపం
నవ సహస్రాబ్ది ముఖాన పారాడే సమాజ చేతనం నిన్న, కడుపులో దవానలంతో, మెదడులో ఆయుధంతో రేపు, పిడికిలి గుండెలో గగన మంత జనస్వామ్య బింబంతో మనిషిలో నీలి సముద్రం రాగ సముద్రమో పాల సముద్రమో అవడంలో ఆశ్చర్యం లేదు, అంతకన్నా అయోమయం లేదు అంతర్ముఖం లేదు.
2. కార్గిల్ కవితలు
1. రెక్క ఒరిగిన ఈ రోజు ఈ రోజు రెక్క ఒరిగి పడిపోయినట్లుంది. తొలి సంధ్యలోకి విషాదచ్ఛాయ సరించినట్లుంది. నిశ్శబ్దం చుట్టుకున్న కొండల గుండెల్లో శబ్దం స్పేర్లో దాచిన టైం బాంబును తలపిస్తూంది. సీతాకోక రెక్కలపై ఎగిరే వయస్సు ముళ్ళ పొదలపై జీరాడుతూంది, కొడలపై ఎగ బ్రాకుతూంది. నిశ్శబ్దం తప్ప రహస్యం తెలీని కార్గిల్, ప్రమాదాన్ని ఛేదించే త్యాగంతో ధ్వనిస్తూంది. కొండలపై నుండి ప్రేలే ఆయుధాల శబ్ద సేతువు జన గణ మన ఉత్సాహ రేఖను తలపిస్తూంది. సమయం నిప్పు కణాలపై నడుస్తూన్నట్లుంది నిశ్శబ్దం ఇనుప కవచం ధరించినట్లుంది.అగ్నిపిఠం - సీజ్ ఫైర్ పులి ఎదురైన హరిణాల్లా క్షణాలు చెదరి పోతున్నాయి. స్వేచ్ఛగా కదిలే గాలి మారణ ధ్వనితో కుంటుతూంది. అనుమాన దశ దాటింది, పసికట్టే 'డాలీ' అవసరం లేదు. రాత్రి పుటలో శబ్దం, వెలుగులో అర్థవంతమవుతూంది. చీకట్లో టార్్చ లైట్ వలె, ధైర్యం దారి చూపిస్తూంది. హృదిలో కర్తవ్యం, నేలను హత్తుకొనీ ఆకాశాన్ని ఆహ్వానిస్తూంది. చీకట్లో పిల్లి కళ్ళవలె సీజై ర్ క్రికెట్ బాటింగ్లో తప్పిపోయిన బంతికై అన్వేషణలో విరామంతో బ్రతుక్కి తప్పని శాంతికై సిగ్నల్వలె ఉంది సీజై ర్.
2. టాస్ సోల్జర్ దారిలో దృశ్యం వైపు కదిలే డాడీ చేయి పట్టుకొనీ పాప నడిచింది, “అదేమిటి?” “ఎవరు” అనీ అడగకలేక పోయింది. హఠాత్తుగా ఆ వ్యక్తి ప్రయాణం నిలిచిపోయింది. చేతి గడియారం మాత్రం పనిచేస్తూనే ఉంది. అడుగులో దూకే మార్్చ ఆన్ గమనం ఆగింది. చేతల్లో కదలే పులి పంజా బొమ్మై పోయింది. లోపల వెలిగే సూర్యుడు మాయమైనట్లుంది. కళ్ళలో ఒలికే జీవ లహరి తొలగిపోయింది. పిడికిలి సడలినా వేళ్ళు ఆయుధాల్లా ఉన్నాయి. దేహం దేశాని కర్పితమైంది, ప్రాణం జాతిలో కలిసింది. రెక్కలపై ఎగిరే ఆయువు నిలువునా చీలిపోయింది. అగ్నికణంలా ఉద్యమించే శరీరం మంచుగడ్డలా పడి ఉంది. రణంలో ఆరిన అనలం ఏ జ్వాలా రాగం వినిపిస్తుంది. గడ్డకట్టిన మనస్సుపై ఏ ఊహ పడవ పయనిస్తుంది. నేలపై ధూళి కమ్మిన క్షత శరీరం శుభ్రమైన పెట్టెలో; విలువైన మనిషీ మానవతను భద్ర పరచినట్లుంది. చరిత్ర అద్దిన అనల చిత్రాలతో చీకట్లను మోసుకొనీ సమయం దుఃఖ విషాద తీరాల మధ్య సరిస్తూంది. కార్గిల్ అయినా కొసావా అయినా కుప్పం అయినా కాశ్మీర్ అయినా ఎగసి వచ్చి ఎదపై వాలే ఆర్తి విహగ మొకటే. తలుపులు మూసిన ఇంట్లో చీకటి వాలినట్లు ధనస్సు నుండి ముక్తమైన బాణంలాగా చదువుతూన్న పుస్తకం హఠాత్తుగా మూతబడినట్లు అనల వీచి పరుగెత్తే నిశ్వాస సూత్ర పంక్తితో తల్లీ! తండ్రీ! సతి! పిల్లలు! మిత్రగణం! మనుషులు. శోకంతో చీలిన బాధా ప్రవాహంలా కన్పించేరు. ఈ సమయం సానుభూతి వెలుగు జాడ, ఒక్కొక్కరికో వీర పథం చూపుతూంది. మాయమైన సూర్యుణ్ణి అంతరంగంలో చూపేందుకు ప్రతి పౌరుని గుండె తలుపులు గట్టిగా తడుతూంది కల్లోలం అణగిన జలధిలో అలల్లా వరద తీసిన నదిలో పూల పడవల్లా
రణ విరామ క్షణాలు! మనస్సులో నిలిచేనా? ధరణీ విశాల హృదయంపై ధూళిలో కలిసిన కార్గిల్ సోల్జర్ ఈ గడ్డపై మొక్కయై కవితయై శాంతి హస్తం చాచేను ఈయ నెవరో పాపకు తెలిసినా తెలీక పోయినా దారిలో దృశ్యాన్ని చూచి చలించింది, డాడీ చేయి వదిలింది, అరచేయి వేళ్ళతో కళ్ళ తడి తుడుచుకుంది. అతని గురించి మతిలో కంప్యూటర్ పని చేసినా స్పందనలో మానవ చేతనతో అతడెవరో చెప్పకుండానే తెలిసింది. దృశ్యంలో పాప మనస్సు టాస్ వేసినట్లు తిరుగుతూంది సింహమో చక్రమో వీరమో శాంతమో! ఏ వేపైనా నాణెం ఒకటే! అది సోల్జర్ అపూర్వ వ్యక్తిత్వం! 596597
3. ఇంకా తెర పడలేదు నాటకం పూర్తి అయింది, కాని ఇంకా తెరపడలేదు. పాత్రలింకా రంగస్థలంపైనే కదులుతున్నాయి. పాత్రలు స్టేజ్పై ఉన్నంత వరకు ప్రేక్షకులు సీట్లు వదలేట్టు లేరు ఇక్కడే పాత్ర సొంతం కాదు, ఎందరి ప్రభావంతోనో రూపొందింది. శిరసై నా బుజాలైనా పాదాలైనా గాయం ఏ అంగానికైనా బాధ, మొత్తం శరీరానిదీ, సంవేదన సమస్త దేశానిదీ. రాళ్ళపై శాంతి బిందువులు కురిసినట్లే జారిపోతాయి. ధూళి కమ్మిన ముఖం కడుక్కునేందుకు నీళ్ళు కరువవుతున్నాయి. ఇక మిగిలింది కళ్ళలో నీరు మాత్రమే అవీ బయటికి రాకుండా లోపలి అగ్ని నిలిపేస్తూంది. స్నేహంలో దేశాల మధ్య సరిహద్దు రేఖ అమరిన పూల దండ ద్వేషంలో అదే విద్యుదనల దీర్ఘ సర్ప మవుతూంది. వాస్తవరేఖపై మంటల్ని మోదుగ పూలను కొనీ చాచిన స్నేహ హస్తం చంద్రవంక కొడవలి గాట్లతో శీర్ణ కమలంలా ఉంది. ఎదురుగా వెళ్ళిన ముఖంపై నిప్పు కణాలు చెరగినట్లుంది. పూలు పరచిన కళ్ళలో కత్తి మొనలు దూసినట్లుంది. గిరి శిఖరాలపై ఎప్పుడో మొలకెత్తిన అనల ఫలం ఇప్పటికి జాతికి రుచి తెలిసి వస్తూంది. హిమ ధవళ ఫాలంపై నెత్తురు చిందే గాయానికి
దేశం మహోదగ్ర రుద్రాకృతి ధరిస్తూంది. వెండి పూతతో మసకేసిన పాలనా చక్షువు ముందు రాజనీతి నిలిపిన అగ్ని ప్రశ్నే! కార్గిల్ సంక్షోభం. కాశ్మీర్ సుందర స్వప్నం! ఇప్పుడు! ద్వేష ఫలంగా మారుతూంది. హిమ గిరి హృదయం! వీర స్పర్శతో అనల గర్భ అవుతూంది. కొండల్లో శతఘ్ని శబ్దాన్ని, కవి హృదయం అనువదిస్తూంది చరిత్రలో తప్పని వీరాన్ని, జనచేతన ప్రతి ధ్వనిస్తూంది.598
4. యశస్తోరణం మూడు వన్నెల జాతీయ పతాకలో చక్రం వలె సైనిక వలయం చిన్ని చిన్ని గిరుల్లా అద్దిన తెలుపు పూలతో కదిలేరు ప్రతి మట్టి కణంలో ప్రాణాన్ని జోడించేరు ప్రతి అంగుళం నేలను అడుగుల్లో బంధించేరు. హిమ పటలాన్నీ ధూమ మండలాన్నీ చీల్చుకొని సాగేరు. శత్రు శిబిర విధ్వంసం నుండి జాతి శిఖరం లేస్తూంది. ఇక్కడి హిమ శిఖరాలకు గర్జించడమే తెలుసు. ఇక్కడ పారే నదులకు వీర నృత్యమే తెలుసు. సైనికుల అడుగుల్లో లయ పొందిన రణ భవిష్యత్తు విజయ కేతన చలనంతో దిశా ఫాలంపై బింబించేను. టైగర్ హిల్పై త్రివర్ణ పతాక రెపరెపల్లో సైనికులు అగ్ని నుండి బయటపడిన సువర్ణ మూర్తుల్లా వెలిగేరు. క్షణం క్షణం తాము వరించే మృత్యు గండం నుండి అనుక్షణం విజయ బింబంగా బయట పడేరు. వీరుల ఉత్సాహ తేజంపై జాతి లేచి కదలుతూంది. వీరుల ఉద్వేగ రాగంతో జాతి గుండె పలుకుతూంది. నిరంతర పోరాటం సైనిక లక్ష్యం! తరాల కాదర్శ రూపం! ప్లేన్ నుండి భుజాలపై దిగే శవ పేటిక రత్నగర్భలా ఉంది. హిమావృత రణ పథాన చరించిన అగ్ని గోళం ఇపుడు భద్రపేటికలో ధవళ పుష్పగుచ్ఛంలా నిద్రిస్తూంది. వీర క్షితిజంలో గిరిపై యశస్తోరణమై సైనిక బృందం. గుండెపై అరచేయితో, పైకెత్తిన మరో చేయితో, ప్రజ! III. నేడు రేపు మధ్య సూచిక
I. మొదటి భాగం : ప్రకృతి పార్శ్వం ..... II. రెండో భాగం : భౌతిక పార్శ్వం III. మూడో భాగం : సామాజిక పార్శ్వం : 1. అంబులెన్సో సూర్యుడు 2. గుండెకు పచ్చదనం 3. మానవీయ వాస్తవం 4. అదృష్ట పార్శ్వాలు 5. కవిత ఒక క్రీడ కాదు 6. కాలం విసిరే జోక్ 7. అశాంతి ప్రశ్న 8. బ్లాక్ బోర్్డ పై 9. ప్రజాస్వామ్య వాస్తవం
III. నేడు రేపు మధ్య
(కావ్యం) (2002) అంకితం ఉదార చరితకు ప్రతిబింబం ప్రియసోదరుడు డా॥ మాదిరాజు హరికిషనా వుకు (GRIMSBY - U.K.) Haritha, Madiraju, Devulapalli M.A.(Lit.) నేడు రేపు మధ్య - సమాలోచనం నేడు రేపు మధ్య కాల గమన రూపమే జీవితం. అనుభవంలో ఉండేది వర్తమానం, ఇది ప్రవాహ సదృశమైంది. దీని చలనం ఒక విధంగా ఉండదు. ప్రవహించే తలాన్ని బట్టి, ప్రకృతిలో మార్పునుబట్టి ఉంటుంది. అసమత్వం విషమత్వంతో పాటు ఆఘాతం విపరీతం తమ ప్రభావాన్ని నెరపుతాయి. ఈ విపరీతాల్లో భూమికి సంబంధించింది
భూకంపం.
తుపాను వలెనే భూకంపమూ విపరీత మారణ స్థితి రూపమే. ఇటువంటిదే ఇటీవల గుజరాత్లో వచ్చిన భూకంపం. రిపబ్లిక్ రోజు సంతోషంతో అలరించే సమయం ఉదయం, భూకంపంతో విషాదం అలముకొంది. ఈ దారుణమైన మారణ వార్తకు స్పందించిన కావ్యం, "నేడు రేపు మధ్య", మానవ జీవితంలో ప్రకృతి వైపరీత్యాలు నెరపే ప్రభావంతో మొదలైన కావ్యం, ఆ పైన సమాజ వైషమ్యాలతో విషాద స్థితికి లోనయ్యే మరో విధమైన పార్శ్వంతో ప్రజాస్వామ్య వాస్తవంపై ఆశతో ముగిసింది. ఒకటి ప్రకృతి పరంగా వస్తే మరొకటి మానవ పరంగా సంక్రమిస్తుంది. ఈ కావ్యం మూడు భాగాలుగా ఉంది. మొదటి భాగం ప్రకృతి పార్శ్వంలో భూకంపానికి గురి అయిన కంచ్, అంజార్, కాండ్లా, మోబి మొదలైన ప్రాంతాల దుర్భర నిస్సహాయ స్థితీ, దృష్టికి వస్తుంది. రెండో భాగంలో, భౌతిక పార్శ్వంలో వివిధ ప్రాంతాల్లో వార్తలు పీడనం హింస ఆధారంగా స్తంభించిన విషాద జీవిత స్థితి చిత్రణంతో పాటు మనిషిలో నాశన గుణం, అమానుష వర్తనంతో తల ఎత్తే సమస్యలు రూపితమయినాయి. మూడో భాగంలో సామాజిక పార్శ్వంలో ఈ రెండింటికన్నా భిన్నమైనవీ సమాజంలో నెలకొన్న దుస్థితులు చిత్రితమైనాయి. చివరలో ప్రజాస్వామ్య చేతన ప్రాముఖ్యం
వివృతమయింది. II వైపరీత్యం ఏ ఒక్క వ్యక్తికీ పరిమితం కాదు. మొత్తం సమాజాన్ని కుదిపేసేది. ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా మరికొందరు బాధలకు గురి అవుతారు. "నేడు రేపు మధ్య” వాస్తవానుభవ జీవితాల్ని ప్రభావితం చేసే స్థితి భవిష్యత్తు గురించి ఆలోచింపజేస్తుంది. వ్యక్తితోపాటు సమాజం పొందే నష్టం అపారమైంది. ఇది పరోక్షంగా వ్యక్తులపైనే ప్రసరిస్తుంది. గుజరాతైపై 'విధి మోపిన ఇనుప పాదం' తో ఇక్కడి జీవితాలపై “నీలిముసుగు” విసరబడింది. మృత్యుమయమైన వాతావరణంలో మళ్ళీ జీవకళ తొణికిసలాడవలసి ఉంది. ఇది మనిషి శక్తితోనే సాధ్యమన్న విషయం ప్రతిపాదితమైంది. నేడు రేపు మధ్య జరిగే భౌతిక మానసిక ప్రయాణ రూపం ఈ కావ్యం. ఇది ప్రకృతీ, మనస్సూ సమాజం పరంగా జరిగే వైపరీత్యాలు, వైషమ్యాలు, అసమానతల్ని గురించి చిత్రిస్తుంది. వీటిని అధిగమించే మనిషిలో శక్తిని వెనువెంటనే స్ఫూర్తి తెచ్చే మానవీయ భావనా రూపం "నేడు రేపు మధ్య" కావ్యం. Detroit, Michigan, U.S.A. 26-2-2002 - హరిత603 నేడు రేపు మధ్య - పీఠిక ఈ కావ్యం మూడు భాగాలు. మానవ జీవితంలో ఒకవైపు ప్రకృతి వైపరీత్యం మరోవైపు మనిషిలో నాశన గుణం, నెరపే ప్రభావ చిత్రణం. మొదటి భాగంలో సమాజంపై ప్రకృతి విధ్వంసన వర్తనం, రెండో భాగంలో ప్రకృతి దుష్ప్రభావం మానవ దుష్ప్రవర్తనం దృష్టికి వస్తాయి. మొదటిది వస్తుపరంగా, రెండోది భావపరంగాను నిర్మాణ రూపాన్ని పొందాయి. రెండూ దీర్ఘ కవితా రూపాన్ని పొందాయి. మూడోది ఖండికలుగా విధ్వంసన మనోరూపం, ఇంధ్రధనూ రూప చిత్రాల్ని తలపిస్తుంది. మూడింటిలోను భావసూత్రం ఇంచుమించు ఒకటే. ప్రకృతి మానసిక సామాజిక తలాలపై విధ్వంసం, హింస, అశాంతి, అపకృతి, అవమానం, దుఃఖం, పీడన నుండి ప్రేమ, శాంతి, నిర్మాణం, ఉపకృతి, గౌరవం, సౌభాగ్యం ఉదారతవైపుకు ప్రయాణింప జేసే విధంగా ప్రజాస్వామ్య భావనా లక్ష్యం కలిగింది. (1) ప్రకృతి పరంగా చూస్తే ఉదాహరణకు గుజరాత్, లాతూర్ భూకంపం కావచ్చు. ఒరిస్సా పెను తుపాను కావచ్చు, జపాన్ దీవుల్లో బద్దలైన అగ్నిపర్వతం ప్రభావం కావచ్చు, (2) మానవ సమాజ పరంగా పరస్పరాహరణం, అణ్వస్త్ర భయం,
విధ్వంసనచణ విస్ఫోటం కావచ్చు. ఇవన్నీ నేడు మన అనుభవంలోనివే. (3) మూడో భాగంలో 'అంబులెన్సో సూర్యుడు' మొదలు 'కాలం విసరే జోక్' 'అశాంతి ప్రశ్న ఒక వాక్య దర్పణం’, ‘ప్రజాస్వామ్య వాస్తవం' వరకూ కవిత్వంలో సృజన సూత్రం, భావరూపంతో ప్రతీకతో కళాత్మకంగా యోజితమైంది. విధ్వంసన వర్తన సమూహాల మనోరూపంతో జీవిత విశ్లేషణతో నిర్మితమైంది. రచనలో పదవిన్యాసక్రమంలో మార్పులతో వాక్య లయలో మార్పులతో మధ్య మధ్య సంభాషణ గుణంతో భావజాలాన్ని మనస్సులో స్ఫూర్తి కట్టించే అంతర్గత సంవిధానం, అవలంబింప బడింది. ఈ గుణం కావ్యంలో పోను పోను సాంద్రమైంది. ప్రతీయమానత్వాన్ని పొందింది. నేడు రేపు అనేవి నిరంతరం వస్తూ పోయే కాల విభాగాలు. వీటి మధ్య కదలే మనిషి మనోరూపం కేంద్రంగా, ప్రకృతి సమాజం పార్శ్వాలతో జీవితం చిత్రితమైంది. స్థలం చేత కాలం చేత అనుభవం చేత సీమితమైనప్పటికీ విశ్వ జనీనమైన అంశాలూ కన్పిస్తాయి. ఇవి కష్టం సుఖం ప్రేమ కరుణ హింస శాంతి న్యాయం సమానత నీతి అవినీతి పీడనం రణం ఉదారత స్వేచ్ఛ మొదలుగా మానవీయమైన మౌలిక భావ జగత్తులోని, జీవిత వాస్తవాల్ని బింబించేవి. ప్రకృతిలో వైపరీత్యం మనిషిలో విషమ వర్తనం, ఒకే నాణెం రెండు రూపాలుగా గుర్తింపబడినాయి. వీటిని జయించడానికి ఒకవైపు నుండి భౌతిక విజ్ఞానం మరోవైపునుండి తత్త్వ ప్రపంచం అవతరించాయి. దీన్ని604 సవరించడానికి కృషి జరుగుతుంది. క్లిష్టస్థితులనుండి మనిషి తనలో శక్తిని సమీకరించుకొనీ, వృద్ధి పరచుకొనీ ఎప్పటికపుడు అభినవ రూపాన్ని పొందడం సమాజ చరిత్రలో స్పష్టంగా కన్పిస్తుంది. ఇది హేతుయుతమైన మానవతారూపంతో అవసరమైంది. ఒకటీ రెండు భాగాల్లో వస్తువు భౌతిక పరిధుల్లో నిబంధింపబడింది. మూడో భాగంలో వస్తువు మనః పరిధుల్లో చిత్రితమయింది. రెండూ జీవితంలో వాస్తవాలే. అయితే కవిత్వంలో ఏదో విధంగా కొంత కల్పన చోటు చేసుకుంటుంది. ఇది అనివార్యం. ప్రతి కవీ తనవైన నిర్మాణ పద్ధతుల్ని కలిగి ఉంటాడు. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంతగా కవి ప్రత్యేక వ్యక్తిత్వం అవగతికి వస్తుంది. కొందరిలో వీటిలో కొన్ని ఇంతకు పూర్వం పరిచయమున్నవీ ఎక్కువ తక్కువల్లో దృష్టికి వస్తాయి. పూర్వం ఉన్నవీ, క్రొత్తవీ ఏ అంశాలు ఏ నిష్పత్తిలో రూపొందిందీ, సమాలోచన జరుపవలసి ఉంటుంది. ఈ కవిత్వంలో మన జీవితంలో భాగమైందీ ఒక స్థితి ఆధార వస్తువుగాను ఉద్వేగం సంవేదన శక్తి కేంద్రాలుగాను, భావ రూపం, ప్రతీక, మానసిక చిత్రణం నిర్వహణ భాగాలుగాను, మానవీయ స్పందనంతో సృజన రూపం విశ్లేషణకందుతుంది. ఇది ప్రయాణ సాధనం మాత్రమే. ప్రయాణ లక్ష్యం ప్రజాస్వామ్యం. కవిత్వం లాగే విమర్శ కూడా ఒక కళ, రెండూ నా కూడా ఒక కళ, రెండూ నా దృష్టిలో విడదీయరానివి. మంచి విమర్శ ఎప్పటికీ కవిత్వావగతికి, అనుభవ విస్తృతికీ ఉపయోగపడుతుంది. ప్రకాశ
రూపాన్ని సిద్ధింపజేస్తుంది. అస్తిత్వాన్ని దృఢతరం చేస్తుంది. దీనికి మంచి అభిరుచి సమాలోచన గుణంతో కూడిన సాహిత్య సంస్కృతి అవసరం. దీనికీ ప్రతిభ ఎంత సారవంతమైతే ఇతర సహకారాలతో అంత మంచి విమర్శ ఉద్భవిస్తుంది. కవిలో విమర్శకుడూ, విమర్శకునిలో కవి ఉంటారని చెప్పడమే నా ఉద్దేశం. సమాజంలో బయటి మనిషీ, మనిషిలో మనిషీ, కవీ ఈ ముగ్గురి సమష్టి స్వరూపం, ఈ స్వేచ్ఛా కవిత్వం. విభిన్న కోణాల్లో నేడు రేపు మధ్య - కదలే వాస్తవ జీవితాన్ని బింబించే దర్పణం. ఇదే కవి అంతరంగం, అంతరంగ కవిత్వ స్వరూపం. సాహిత్య చరిత్రలో స్వేచ్ఛా యుగం, ఆధునిక సమాజశక్తిని బింబిస్తూంది. “అగ్నిపీఠం” టి నిటిలో మూడోది "నేడు రేపు మధ్య” ప్రకృతీ సమాజ వస్తుగతమైంది. మాదిరాజు రంగారావు605
III. నేడు రేపు మధ్య
మొదటి భాగం ప్రకృతి పార్శ్వం రిపబ్లిక్ రోజు రాకతో ఉదయం విభిన్న స్వరజగత్తుతో ప్లాట్ఫార్్మ కోలాహలంగా ఉంది, ఆనందం అందుకుంది. క్షణాల్లో మహాధ్వని! అంతలో ఆర్తారావం! వెనువెంటనే నిశ్శబ్దం! తెరచిన శవ పేటికగా మారింది. గుజరాత్పై విధి ఇనుప పాదం కదిలింది మృత్యువు ఒకేసారి నీలి ముసుగు విసిరింది. చెట్టూ జంతువు మనిషీ భేదం లేకుండా అస్తవ్యస్తమైంది. విరిగి నలిగి చెదరి కూరుకుపోయిన మానవ రూపాలతో దారుణ మారణ భయ దృశ్యం! ధరణిపై అవతరించింది. తల్లివంటి సర్వంసహ భగ్నమైంది. సర్వం శిథిలమైంది జాతి పతాక గగనంలో రెపరెపలాడే సమయం, భుజంపై పెను గాయాలతో దేశం విలవిలలాడింది. కచ్ హృదయం బద్దలైంది, భుజ్ ముక్కలైంది. అంజార్ స్కూల్ పిల్లల సజీవ సమాధి విషాద వార్త! కాండ్లాలో కూలీల కార్మికుల హాహారవం. మోబిలో ప్రేమ చిహ్నం మణి మందిరం, వరదలకు నిలిచింది, భూకంపనకు విరిగింది.
వాతావరణం ఏడ్పునే మరచింది, ఎక్కడిదక్కడ స్తంభించింది. నిశ్శబ్దం మహదాశ్చర్యంతో, విగ్రహాకృతి పొందింది. తత్త్వాన్ని మరచీ, మాయను వదలీ మిగిలిన బ్రతుకుల్ని, ఎదురైన కఠోర వాస్తవం కౌగిలించుకుంటూంది. మత భేదాల్ని మరచిన మానవీయం, మందిరాన్నీ మసీదునూ చర్చినీ ఒకే పంక్తిని నిలుపుతూంది. ప్రాణంతో బయట పడిన కుక్క శిథిలాల ముందు, ఒంటరిగా కదులుతూ ఏ మనిషికో కాపలా కాస్తూంది. నీరూ అగ్నీ గాలీ ఆకాశం పృథ్వీ తత్త్వాలతో ప్రాణాన్ని ఇచ్చే పంచీకృత భూత రూపాలు ప్రాణం తీసే దంష్ట్రలు కావడం ప్రకృతి వైపరీత్యం. ధైర్యం ప్రేమ త్యాగం ఉదార కరుణలతో విషాదం నుండి నిరాశ నుండి మనిషిలో మరో మనిషి! విధ్వంసన సమయంలో సృజన శక్తికి బింబమై. రాత్రి వెన్నెల ముఖంపై బంతిలా దొర్లుతూంది. ఇక్కడో దీపం! అక్కడో దీపం! మిగిలిన బంధువుల్ని తలపిస్తూన్నాయి. హఠాత్తుగా తెగి ముత్యాలు జారిపోయిన హారంలా ఉంది, వీథి. విషాదం అంచున ముక్కలు ముక్కలైన శాంతి మధ్య కరుణ తరంగం కోసం ఎదురు చూచేరు ప్రజ! నిద్రించే నిశ్శబ్దంలా ఒకరు, కొన ప్రాణంతో నెలవంకలా ఒకరు! దెబ్బతిన్న తల్లి గుండెపై శిశువులా ఉంది మరో ఉదయం! తరతరాలు చెప్పుకునే విషాద గాథ మిగిలింది ఇపుడు బుద్దుడు కళ్ళు తెరచినట్లుంది ఇపుడు క్రీస్తు జీవితుడయినట్లుంది. ఆరు బయట తల కింద కలల మూటతో నిద్రించే వారూ తలపై బాధల ఆకాశంతో చదికిల బడిన వారూ గూడులేని దీనులకు చాచిన హస్తాల్లా టెన్టు, చెదరిన వాక్యాల్లో పదాల్లో ముఖాలు! అర్థాలు దాగీ! ఎటు వెళ్ళినా ఊరు తరువాత ఊరు, భీభత్స సముద్ర తీరం నుండి మరో తీరం చేరినట్లుంది. మరో ప్రమాదం ఎపుడు రహస్యం విప్పేదీ తెలీదు. క్షతగాత్రుల మధ్య నుండి ప్రయాణం
. వెదురు గడ వంతెనపై కల్లోల ప్రవాహం దాటుతూన్నట్లుంది. ఆర్తరవం దిశలు అల్లుకొని పోతూంది. త్యాగపేటి నేలపైకి దిగుతూంది. ప్రాణం లేని విమానం! పైన సహాయంకై తిరుగుతూంది. బండికాణి ఎత్తే రెండు చేతులూ పోయాయి, పొలానికీ తోటకూ వెళ్ళే రెండు కాళ ్ళ నలిగాయి. జీవిత శిలల్ని చెక్కే మనసులు గాయాలతో శిలలైనాయి. బరువుపై బరువుతో కింది నుండి మూల్గులతో పిలిచే, ఓ తల్లిని! పైకి తీసే జవాన్ మెడలో వాలిన రెండు చేతులూ కృతజ్ఞతా సుమ దామమై మానవతను అలంకరించేను. చుట్టూ విరిగి పడిన రాళ్ళ మధ్య మొగ్గవంటి పాపను పైకి తీసే చేతులు! పచ్చని ఆకుల వలె కదిలేను. ఎతె న అంతస్తు భవనాల శిథిలాల మధ్య కన్పించే శిశువు, సజీవమై భవిష్యత్తును భద్రపరచేను. ఒకటి రెండు మెరపులు! సజీవ సంకేతాలు, అణగారిన జీవితాలపై ఆశను వెలిగించేను. ఇపుడీ ప్రాంతం నీలి మేఘంకై ఎదురు చూడడం లేదు. స్నేహహస్తం కోసం త్యాగ బింబంకోసం ఎదురుచూస్తూంది. పై మేఘ శకలాలు ప్రజల కళ్ళలో దాగినట్లుంది. సముద్ర బడబానలం వారి ముఖాల్లో తిష్ఠ వేసినట్లుంది. ఎవరి బాధకు సాక్షి వారే అయినా బాధ్యత అందరిదీ. బాధ నుండి వేదన నుండి మృత్యువు నుండి కొత్త మనిషి! ధైర్యంతో రాగంతో జిగీషతో కదిలేను. ప్రకంపన రేఖ భూమిని కత్తిరించినంత మేర, ముక్కలైన మట్టి బొమ్మల్లా క్షతగాత్రులు. చెదరిన బాధా గాథలతో అకాల శిశిర రూపాలు. సరికొత్త జీవితాలకై కదలిపోతూన్న దృశ్యం. స్వప్నం జారిపోయిన సౌరాష్ట్ర! దిగ్రమలో మునిగింది. రెక్కలు పోయిన పక్షి అయింది, పురి తెగిన నెమలిలా ఉంది. మనిషి బాధ్యత శక్తిని మించి పోతూంది. పాలనా వేగం లక్ష్యాన్ని చేరుకోలేకపోతూంది.
ఇది విధి పేరిట మనిషి శక్తిని విస్మరించే సమయం కాదు. భాష దేశం మతం హద్దుల్ని చెరపేసే మానవీయ సందర్భం. సమయం తెల్లని అక్షరం ఎరగని బ్లాక్ బోర్్డ ఉంది. రేపు పత్రికలో నీలి అక్షరాల్లో చుక్కలు కన్పించవచ్చు. ఇపుడు కావలసింది వాగ్దానాల స్వప్నం కాదు. ఇపుడు అవసరమైంది క్రియలో నిర్మాణ వాస్తవం. నిప్పంటిన దుస్తులతో పరుగెత్తే కాలాన్ని ధైర్యంతో నిలిపి కరుణతో జీవన రుచి చూపించాలిసి ఉంది. పేరుకు మాత్రం ఊళ్ళు మిగిలాయి కాలం ఒక్కసారి పేరుక పోయింది. దీన్ని కరగించేదీ, కదలించేదీ, సూర్య తేజం ఒకటే. స్నేహితులూ బంధువులూ కనుమరుగయినారు. చల్లని గాలి వణకుతూన్న చేతుల్ని స్పృశిస్తూంది. రాత్రి చేలి వెచ్చదనం కోసం జేబుల్ని వెదకుతూంది. విద్యుత్తు లేని చీకట్లో టేబిల్పై కొవ్వొత్తి వెలుగు బతుకును సార్థకం చేసుకుంటూంది కూలిన శిథిలాల మధ్య మిగిలిన గోడల వెంట తిరుగుతూ ఓ కుక్క ఆగి ఆగి మిగిలిన మనిషి కాళ్ళను పెనవేసుకుంటూంది. సర్వం భగ్నమై నగ్నమై బికారియైన స్థితిలో కళ్ళలో దాగిన ఆశలు శిథిలాన్ని వెదుకుతున్నాయి. ఇప్పటికీ తెరచి ఉన్న కళ్ళలో చీకటి నిలచే ఉంది. ఉదయాలు వస్తూ పోతున్నా చీకటి ఇప్పట్లో తొలిగేట్టు లేదు. శుభ్రమైన హిమ పటలంపై రక్తచిత్రం రణ చరణం లేకకుండా భీభత్స దృశ్యం. సేనా పద ఘట్టనలో నలిగినట్లున్న జన సమూహం! ఉపశాంతికై ఆరాటం! ఏ శత్రువూ ఆయుధమూ లేకుండా మారణ భూమి అయింది ప్రకృతి వైపరీత్యంతో కాలం! ప్రశ్నా చిహ్నమయింది. దారి మధ్య పడిన శిలల్ని తప్పించుకొనీ జీవన చలనంతో సాగే సరికొత్త జీవితం మొదలు! సూర్యునికి చావు లేదు, సప్త వర్ణాశ్వ గమనం ఆగదు! రంగుల కాగితం పూలు అతికిన మనోరూపం ఇపుడు స్వచ్ఛమైన మనోజ్ఞ పుష్పాల్ని వికసించేను
ప్రేమ కరుణ వీరం త్యాగం వివేకం శాంతి సృజనతో చిరంగా నవంగా బ్రతుకు సాగాలనే సంకల్పం! మనిషిలో మహాబోధి చివురిస్తూంది. మనిషిలో శాంతి శిలువ తలెత్తుతూంది. మనసులో జీవన ధుని కదులుతూంది. ఆత్మలో శాంతి పాఠం స్వనిస్తూంది. మనువుకు తెలీందీ, మిగిలే ఉంది. మార్కు ్క అందందీ, దాగే ఉంది. పరిణామ శిఖరాలకు కొలత లేదు ప్రయాణ మజిలీలకు మితం లేదు తుపాను తాండవయినా, భూకంపం ఆందోళనమయినా మనిషి బలం ధనం సంకల్పం వికల్పం! శక్తీ యుక్తీ ప్రజ రూపం! ప్రజ కోసం! మానవ చైతన్యం అస్తిత్వం! సంస్కృతి! సర్వం లక్ష్యం ఒకటే! నవ సమాజం.నేడు రేపు
మధ్య
కాల చక్ర గమనంలో భూకంపం పెను తుపాను భీభత్సం ప్రమాదం సమాజ గతి చలనంలో పరస్పరాహరణం రాజకీయ విస్ఫోటం అపాయం రోదసిలో కక్ష్యపై ఉపగ్రహ భ్రమణంలా కండె చుట్టు దారంలా సామాజిక జీవితం నేడూ రేపూ మధ్య కదలే దృశ్యం పై ఆవిగ్నం ఆవేదన మారే గమ్యంపై ఆలోచన! జిగీష! కంటి రెప్ప లెత్తి మనిషి ఆదిత్యుని చూడలేడు ప్రతి ఫలనం మాత్రం అనుభవ రమణీయం అందదు శాంతి జగం అంతరంగ రూపం ఏ నిజమూ ఏ సమయం సంపూర్ణంగా అందదు జీవన వ్యాపారంలో మనిషి దృష్టి నేలపై చేతు లెత్తి ప్రార్థనతో కష్టంలో గగనంపై ఆకాశం నుండి ఇలకు దిగడం మానవీయం వీధి దీప పంక్తి రాత్రి వెలక్కపోయినా స్తంభం నుండి స్తంభానికి పయనం తప్పదు చీకటి భరించలేని సమయంలో మనుషుల్లో వెలుగుకై అసహనం సహజం! అన్వేషణ అవసరం ఆకలి కాగలేని మహర్షి పుణ్యధామాన్ని శపించేను
ఆకలి కాగలేని మనిషి కంతరాత్మ గుర్తుండదు! దారిలో వృద్ధ వ్యాఘ్రం ఉపదేశంతో కన్పిస్తుంది వేదికపై చతుర జంబుకం ఉపవాసంలో కూచుంటుంది. మనిషి నేడు నేలపై నడుస్తూన్నట్లు లేదు రెండవ భాగం భౌతిక పార్శ్వం సర్కస్లో తీగెపై కదలుతూన్నట్లుంది మనిషిలో మానవత చెలమలో నీరు లాంటిది అవసరాన్ని బట్టి పాత్రల ప్రమాణంలో నిలుస్తుంది. కంపనలో చెదరనీ, వరదలో తేలనీ, కరువులో మాడనీ విస్ఫోటం ముక్కలు చేయనీ ఆఘాతం పరస్పరం గాయపరచనీ సమయం శిలా నిశ్శబ్దమైనా తమ ఊరు తమ ఊరే తమ ఊపిరి అలలపై తేలుతుంది ప్రియంగా పలాయనం పునరాగమనం! నిర్గమనం, పునరావాసం. ఈ సమయం కావలసింది పొట్టకై చేతులకు పనీ బొందితో కైలాసం కాదు, చేతిలో వైకుంఠం కాదు సామాన్యుని జీవితమే అధినేతల మధ్య ఆటబంతి కారాదు. అప్సరోనృత్యంలో మంజీర పద ధ్వనికి సహకృతి కన్నా ఆపదలో ఆర్త రవానికి అనుస్పందన అవసరం ఆగిన రథ గమనానికి చేయి ఊత అవసరం. తెగిన బ్రతుకు సూత్రాన్ని సరిచేయడం కర్తవ్యం నేటి వస్తువు ప్రజ! మహాపాత్ర ప్రజ! చర్యతో రేపటి కథ ప్రజదే ప్రగతి చక్ర చలనంలో ఒక సంస్కృతి చెరగిపోయి మరో సంస్కృతి సమయ సమయం సంఘంపై కొత్త ముద్ర వేస్తుంది విజ్ఞానం చూపే దారిలో వివేకం గమ్యం చేరుస్తుంది. అనుభవం మనసుపై ఫిల్్మ ఫోటోలు దింపుతూంది తెలిసీ తెలీకుండా ఏ పక్షో శునకమో వానరమో పద్మమో ఫోటోలో చోటు చేసుకుంటాయి, మనిషి మనో మూలాలకు సూచికలై, ఏది ఎపుడు బయట పడేదీ తెలీదు. ఈ నిస్తబ్ద నిశ్శబ్దం సహజమైంది కాదు మారణ స్థితు లెన్నో వెను వెనుక దాచుకొందీ!
ఒకవైపు నుండి భూకంపం పెను తుపాను మరోవైపు నుండి పరస్పరాహరణం విస్ఫోటం ప్రకృతీ సమాజం రెండూ తెలిసో తెలీకుండానో మనిషికి సమయ సమయం మిత్రులూ శత్రువులూ రేపు కోతకు రాబోయే పంటపై సంతోషం కన్నా నేడు పేదరికంలో బాధ కడుపును కోసేస్తూంది. నేడు కళ్ళ నుండి రాలే వేడి కరుణ జలం రేపు పీడిత జనంలో వాస్తవ శక్తుల్ని పండిస్తుంది. ఇవే కంపనకు లయనిస్తాయో ఇవే తీవ్రతకు చేతులందిస్తాయో కారణం విధాత కాదు సమాజం, మనిషిలో మనిషి! మనిషితో మనిషి, సంఘంలో మనిషి! బాధ ఒక అస్త్రమై నిజాన్ని బద్దలు చేస్తుంది బాధ ఒక వాద్యమై కవిత్వాన్ని శబ్దిస్తుంది. ఇది మాయ కాదు! మిథ్య అంతకన్నా కాదు నేడూ రేపూ మధ్య నిజం! సమాజ శక్తుల చలనం! గాయానికి తగిలే ఎర్రని గాలి ఊహల్ని అనలమయం చేస్తూంది గాయానికి సోకే పచ్చని గాలి స్మృతుల్ని ఉల్లసితం చేస్తూంది ప్రమాదమో! అపాయమో! హృదయ మంతరిక్ష గోళాన్ని మరపిస్తూంది సమర్థుని యాత్రలో విమానయానమైనా చివరకు మిగిలేది మట్టితో బంధమే. ఫ్యాక్టరీ సైరన్ కొత్త రోజుకు ఊపిరి ఊదుతూంది స్కైలాబ్ మేధతో నిలువునా పైకెగసే విజ్ఞానం నవ జనస్వామ్య సమాజానికి ప్రేరణ అవుతూంది కంప్యూటర్తో మనిషి విశ్వరూపం ధరించినా జీవితంలో హృదయం సుస్వరత కోల్పోరాదు రైఫిల్ గొట్టం చివర తుమ్మెద వాలి లేచి తిరుగుతూంది చుట్టూ కలఝంకృతి నాదంతో గురి చెదర గొడుతూంది విజ్ఞానం మరచిన హృదయ సుమాన్ని జ్ఞాపకం చేస్తూంది. నేడూ రేపూ మధ్య స్థితుల్లో నలిగే కవి హృదయం ఉదార చరితతోఅక్షరాలకి ప్రాణం
పోస్తూంది,
సమాజాని
కాయువు
నిస్తూంది
జడం నుండి జంతువుల నుండి మనిషిని వేరు చేస్తూంది పాత వాసనల్ని మరపిస్తూంది, కొత్త జన్మకు మూల మవుతూంది.
సమాంతర ప్రతీకతో ఎంతటి మనిషీ జీసస్ కాలేడు మోసుకెళ్ళే టి.వి. కెమెరా కూడా శిలువగా తోచవచ్చు. చుట్టూ పెరిగే కొమ్మల్నీ కంటకాల్ని తొలగిస్తే నిజం అంతరంగంలో అవశ్యం బింబిస్తుంది. ప్రకృతి వైపరీత్యం, మనిషి స్వార్థ వర్తనం అడుగులు రెండూ, సృష్టికి ఇరు పార్శ్వాలు ఒకదాని తరువాత మరొకటి ఆఘాత విఘాతాలతో సమాజ రూపాన్ని గమనాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఒకవైపు నుండి కాల సముద్రం మ్రింగేయ జూస్తుంది. ఒకవైపు నుండి నీలి రాజకీయం మాయ చేయ చూస్తుంది దేశ పాలనా చక్రంలో గ్రహాలు మాటి మాటికీ కలిపి ఆడే పేక ముక్కల్లా తిరుగుతున్నాయి. చేతి గడియారంలో తేదీ, వారం మారుతూంది కాలెండర్లో వారం నెల తొలగి పోతూంది గుడిసెల్లో పేవ్మెంట్పై బ్రతుకు లెప్పటికీ ఒకటే. ఎగసి వచ్చి పక్షి అల్ప ప్రాణిని తన్నుక పోతూంది పురి విప్పిన జాతీయ పక్షి విష బీజాల కొరిగి పోతూంది మనిషి రుచి మరిగిన పులి! పొద చాటున పొంచి ఉంది శిఖరంపై నిలిచిన వ్యక్తి చేతులు చాచి మరో మనిషి శ్రమ ఫలాన్ని ఆహారించేను. రోడ్పై పగిలిన అద్దాలతో కాలిన బస్ సమస్య ముఖాన్ని వికృతం చేసి చూపుతూంది ఒక ఘటన లిప్తను అనల బంధువై రగిలిస్తూంది ఒక స్థితి అగ్నిని నృత్య భంగిలో కదలిస్తూంది. కళ్ళ నుండి జారే బిందువు బిందువులో ఆవేదన స్పందించే హృది కేభాషా భేదం లేదు బాష్ప కణం అద్దంలో స్మృతి ముఖాన్ని బింబిస్తూంది మరవలేని దృశ్యాలు స్మృతి శాలను అలంకరిస్తున్నాయి. రేపుపై విశ్వాసం పెంచుతూంది, రోడ్ ప్రక్కన చెట్ల వరస ఒకరి చేయి ఒకరు పట్టుకొనీ రోడ్డు క్రాస్ చేయ గోరే యూనిఫార్మో స్కూలు పిల్లల జట్టులా ఉంది. పట్ట పగలు అంధకార శకలాల్ని ఆనందించే వారూ ఉన్నారు
ఒక సమయం వెలుగే కాదు! అంధ ముఖాలూ పరిపాలిస్తాయి శాంతి సభలు జరుగుతున్నాయి, అశాంతి గోళాలు తిరుగుతున్నాయి ఒక సమయం ప్రజాస్వామ్యం ఇనుప పాదాలపై నడిపింపబడుతుంది. ఎప్పటికపుడు గీయబడిన రక్తరేఖలతో ఈ రోజు, మారణ చిత్రాల గ్యాలరీ వలె ఉంది. దారిన దృశ్యం, భీభత్స ముద్ర నుండి తప్పుకోలేక పోతూంది పయనం సాగే కొద్దీ మృత్యువుకు దగ్గరవుతూన్నట్లనిపిస్తుంది. ఆయుధం వహించి నడిచే వ్యక్తి గురి పెట్టడం తెలింది అమాయక ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది విధి గురించి ఆలోచన! అపుడు మొదలవుతుంది అసలు ఆయుధం ధరించే అవసరం పై ప్రశ్న ఉండనే ఉంది! ఇది మనిషిలో స్వార్థ మూలానికే కాదు, నాశన గుణానికీ చిహ్నం; మనసులో పొరలు ఆకాశం వలె ఒలిచే కొద్దీ వస్తాయి ఆటవికం నుండి నాగరకం దాకా దశ దశ లెన్నో పరిణామ దృశ్యాల్ని చూచేందుకు జీవిత మంతా చాలదు ఎపుడెపుడో వస్తాయి! భూకంపం! పెనుతుపాను ప్రకృతి చర్యలు ఎప్పటికీ ఉంది! మారణ గుణం, నీలి రాజకీయం, అణ్వస్త్ర భయం!! ఇవి సమాజ వనంలో దవానలంగా మారితే! మహాప్రమాదం! 614615 పరుగెత్తే రైలు జడ శక్తిని అనువదిస్తూంది పై కెగసే పక్షి నర శక్తిని అపహసిస్తూంది స్వార్థ చింతనలో మనిషి జడశక్తికి లోకువయ్యేను విధ్వంసమయినా కల్లోల మయినా నలిగేది సామాన్యుడే మరునాడు పత్రికలో ఫోటోలు స్వేచ్ఛకు సంకేతాలు! కూలింగ్ గ్లాస్గోంచి ప్రజల బాధల్ని చల్లగా తిలకిస్తూ జనం ముఖంపై దుమ్ము చిమ్మీ ఇంటి ముఖం పట్టేరు కెమెరా చిత్రాల్ని బంధిస్తుంది; పత్రిక లలంకరించు కుంటాయి ఏ దోషం ఎవరిదో అందరికీ హృదిలో బాగా తెలుసు ఏ దోష మయినా న్యాయాలయం ముద్రతోనే గుర్తింపు వెనుక నుండి పని చేసే ముఖాలు అంతరంగాన్ని మూసేస్తాయి. నేటి గురించి చింతతో పాటు రేపటి గురించి ఆలోచన
నేడు అన్వేషణతోపాటు రేపటి గురించి దర్శనం రేపు మనిషి సిగ్గుతో తలవంచుకోకుండా ఉండాలనే! అయితే వివేకమున్న హృదయం, ప్రయాణాని కవసరం శాసన పాలన న్యాయం పేరుతో ఆశా ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఐరావతం అశ్వం మహాపక్షి రథం రూపాలెన్నెన్నో పై నుండి అవనికి దిగాకనే కథ పరిచయ మవుతుంది కథలోకి వచ్చాకనే జన వ్యధ వినిపించడం మొదలవుతుంది అంతరంగం మంచు తెరల చాటున దాగి పోవచ్చు మందపు ఇనుప పొరల క్రింద అణగి పోవచ్చు స్వేచ్ఛలో స్వచ్ఛమైన అంతరంగం అంతరించదు దీపమై బింబమై ప్రయాణం సాగిస్తుంది. ఇది దారిలో మనిషిలో తెలివితో శిలా లోహ దారు ప్లాస్టిక్ రూపాల్లోకి మారొచ్చు అంతరంగం అందరికీ అందే వస్తువు కాదు ప్రదర్శన శాలలో నిలిపే శిల్ప ఖండమూ కాదు! గగనం నుండి వర్షధార భూమికి తెచ్చే సందేశం ఒకటే విశాల సృజన తలంపై నవసమాజ శక్తి వికాసం! అవని తనలో తొలకరి ముత్యాలు దాచుకుంటుంది మనిషి తనలో కన్నీటి ముత్యాలు బయటికి వదలేను పవనం దిశ దిశ కిచ్చే సందేశం ఒకటే ప్రాణ ప్రసారంతో సమాజం ఆయువు పెరగాలనీ, ఈ దేశ జనావాసం గుడిసెల్లో పేవ్మెంట్ పైనే ఎక్కువ ఏ రూపంలో నైతేం? అన్యాయానికీ అసమానతకూ కారణం మనిషిలో స్వార్థం. స్వార్థంలో పెరిగిన వ్యవస్థలో మనిషిని మనిషి మోసం చేసేను! మనీష నమ్మింప జేసేను. మూలమైన కోరికపై ధనం కీర్తి అధికార యుక్తులతో సమాజం అరణ్య మవుతుంది, దుర్గమమవుతూంది అరణ్యం జంతువులకూ మృగాలకూ ఆవాసమయింది. మనిషీ జీవితమూ సమాజం గురించి చర్చిస్తూంది సెమినార్ విన్నవారి మనస్సులో నిలుస్తుం దొక ప్రాణం లేని మినార్ ఇదో కీర్తి స్తంభం! నీడనూ ఇవ్వలేదు, గూడునూ కూర్చలేదు, క్రాస్ రోడ్ మధ్య నిలిపిన బుద్దుని ముఖం
చర్చల్లో తప్పి పోయిన వస్తువును జ్ఞాపకం చేస్తూంది రాత్రి అన్నిటినీ తనలోకి తీసుకుంటుంది ప్రాణినీ అప్రాణినీ రాత్రి అంటే చాచిన సుదీర్ఘ మృత్యు హస్తం కాదు అలసిన ప్రాణికీ, మనిషికీ మనసుకూ విశ్రాంతి నికేతనం ఇపుడే ప్రార్థన వినిపించదు ఏ గుడి గంటలు మ్రోగవు అంతా నిశ్శబ్దం! ఎక్కడో ఎప్పుడో ఒక శబ్దం తేలిగ్గా జారిపోతుంది. పొద్దునే వెలుగు నదిలో చీకటి కొట్టుక పోతుందనుకునేరు కాని మనిషిలో లఘిమయై ప్రవేశిస్తుంది, తిష్ఠ వేస్తుంది పదును కత్తిలా పనిచేస్తుంది! అనూహ్యంగా వర్తిస్తుంది లో లోపల వృక్షమై శాఖలతో అంతరంగాన్ని కప్పేస్తుంది ప్రతి వ్యక్తీ ఏదో నేరంలో భాగమే నేరాన్ని మరొకరి బుజాలపై వదిలేయడం సులభం అంతరంగ సాక్ష్యానికి పాండితితో పని లేదు! వివేకంతోనే పని ప్రతి మనిషికీ తెలుసు! తనలో గదిలో ప్రాక్ ప్రతిమ లున్నాయనీ వీటిని మనిషి వదల్లేడు! మరచిపోడు! ముక్కలు చేయడు! వీటిపై అనుబంధం పెంచుకోవచ్చు! ఊహలో ఆరాధన పెరగవచ్చు. నిష్క్రియతకూ జడ శక్తికీ నిలయమైన ప్రతిమల్లో వివేకం కోసం అన్వేషణ! చైతన్యం కోసం ఆవేదన! మనిషిలో భూకంపంలో, తుపానులో, పరస్పరాహరణంలో, విస్ఫోటంలో వివేకం పనిచేస్తుంది అంతరాత్మ జ్ఞాపకం వస్తుంది! గతం దారి ఆగిన విశాల నిశ్శబ్ద నికేతనం ఇక్కడ వరసగా ప్రతిమలు నిలబడతాయి పురా శిథిలాల్లో బయట పడే నిర్మాణాలు! మనిషి కలల కొకనాటి కల్పనా రూపాలు అజ్ఞానం భయం స్వార్థం ఎక్కడ బడితే అక్కడ బొమ్మలుగా మారతాయి; మనుషుల్లో బ్రతుకుతాయి అద్దాల కేసులో వ్యాపార ప్రదర్శనలో నిలిపే బొమ్మలకు హృదయ స్పందనలో ధ్వని సౌందర్యం ఎట్లా తెలుస్తుంది. ప్రకృతి విలయ హస్తం, మనిషి కుటిల పాదం ఒక్కొక్క సమయ మొక్కొక్కటి సమాజాన్ని పీడిస్తాయి దుమ్ములో బ్రతికే మనుషులు దుమ్ములో కలవడానికి ఒక విషమ లిప్త చాలు ఎంతో సమయం పట్టదు.
భూమి కంపించి బీటలతో లోయ లెదురవుతాయి తుపాను చెలరేగి నిరాశ్రయ రూపంతో జలమయమవుతుంది విస్ఫోటంలో శరీరాలు ముక్కలై దూర దూరం ఎగిరి పడతాయి ఆహరణంలో మనుషులు గాయాలతో అలంకృత మవుతారు. అంతరంగ నిష్క్రమణంతో మనిషి! జడంతో సమానం మానవతను మరవక పోయినా! ఒక దశలో శవం, సహనీయం కాదు నేడు ప్రజ చేసే ప్రజాస్వామ్య ప్రయాణం, రేపు గమ్యానికి చేర్చే అనుభవ చైతన్యానికి మూలం. నేడు రేపు మధ్య మూడో భాగం సామాజిక పార్శ్యం
1. అంబులెన్లో సూర్యుడు సూరీడు కాదు చంద్రుడూ కాదు సాక్షి ఇపుడు సాక్షి! చేతిలో టారైట్! అవచ్చు. ఆ దేహం గోడకు విసరిన రబ్బరు బంతి మోస్తరు క్షతమయిన హృదయం నిశ్శబ్దంలో మునిగింది. ఇక్కడ కళ్ళున్న మనిషి ఉన్నట్లు లేదు! అది రాత్రే! సూరీడు కాదు చుక్కలూ కాదు సాక్షి ఇపుడు సాక్షి! దారి ప్రక్కనున్న దీప స్తంభం కావచ్చు హతమయిన మానుషం నిశ్శబ్దంలో కలిసింది. ఆ దేహం జీప్ టయిర్ క్రింద గాజు బొమ్మ మోస్తరు! ఇనుప స్తంభమయినా పట్టిన చేయి తడి చప్పున వీడదు. సూరీడు కాదు గగనమూ కాదు సాక్షి! ఇపుడు దిక్కులు చూచే క్లాక్ టవర్ సాక్షి దారి ఆగినట్లుంది! కళ్ళు వాలి పోయినాయి. నేడు రేపు మధ్య నలిగిన నీలి ఘటన దృశ్యంలో వాస్తవం ఆత్మ హనన యత్నంతో అలంకరింపబడుతూంది. సూరీడూ కాదు సమాజమూ కాదు సాక్షి ఇపుడు సాక్షి! అంతరంగంలో వెలుగు మాత్రమే! నేడు రేపు మధ్య గతం అవలీలగా దూకింది. మధ్యలో తెగిన యువతి జీవితం మునిగిన చంద్ర బింబం
పొద్దునే వార్తలో న్యాయం రంగు దుస్తులు ధరించింది ఉలిపిరి మంచులో సూర్యుడు అంబులెన్సో కదలుతూన్నట్లుంది.
2. గుండెకు పచ్చదనం ఎంతటి మహానగరంలోను పొద్దునే ఎక్కడి నుండో చెట్టు కొమ్మ నుండి పక్షి గొంతు వినిపిస్తుంది. దూరం నుండి మరో పక్షి బదులు పలుకుతుంది. మనిషికి తెలీని స్పందనతో మనిషిని వశం చేసుకుంటుంది. పొగలో ధూళిలో కలకలంలో కోలాహలంలో అణగిన ప్రకృతి మూల రూపాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆర్ద్రత లుప్తమై విరామం నశించిన జీవితంలో పక్షికి నిలయమైన పచ్చదనం మనిషికీ అవసరం పక్షి రవంలో మధు ముద్ర ఉంది, శబ్ద మూల ముంది ఇది మనిషికీ మనిషికీ మధ్య స్నేహానికాహ్వానమయింది. చెట్టుపై పక్షి పలుకుతో రోజు ఆరంభ మవుతుంది. మనిషిలో గుండె బరువుతో రోజు సమాప్తమవుతుంది. మనిషిలో ఆర్ద్రత వీడని పచ్చని ఆలోచన అవసరం లేనపుడు తలకు పచ్చని పాగా ధరించే వారూ ఉన్నారు ప్లాస్టిక్ బొమ్మల మధ్య సూది మొనంత పచ్చదనంతో మనిషి హృదిలో దిగేను గగన మంత ఆనందం.620 వార్తా పత్రికలో చుట్టిన చిచ్చు బుడ్డిలా రైల్వే స్టేషన్ ముందో బస్ స్టాండ్ వద్దో రోజూ కన్పించే ఆమె మస్తకం పై
3. మానవీయ వాస్తవం పట్టపగలు సూర్యుడు వేడి కిరణాల బరువు దించుకునేను. ప్రక్క నుండి వాహనాలు దూసుకొని పోతున్నా తొలగదు! మృత్యు భయం లేదు! బ్రతుకు భయం తప్ప! చేతిలో నక్షత్రాల్లేకుండా నివాసానికి వెళ్ళితే రాత్రికి చంద్ర ఖండ మెట్లా గొంతు దిగుతుంది. మెలకువలో క్షుధా గోళమై తిరిగే జీవితం
రాత్రి ముసుగులో ఎంత సేపు దాక్కొని ఉంటుంది ప్రతి రోజు నేలపై ధూళి నుండి లేచే సరికి ఇంకో రూపంలో శూన్యం మరో జన్మ ఎత్తినట్లుంది. చుట్టూ ఉన్న పేదరికం కొందరికి ఫోటోగ్రాఫ్లో గోడ కలంకారం కావడంలో ఆశ్చర్యం లేదు తిరిగి తిరిగి విసిగి విసిగి చివరకు ఆయుధమై ఎవరికి, గురి అయ్యేదీ తెలీదు, ఉరి అయ్యేదీ తెలీదు! అక్కడక్కడా కదలుతూ బ్రతికే ఆమెలో ఇంకా సమాజం గురించి చిక్కు ప్రశ్న! మనసు కొక్కానికి తగల్లేదు ఆమెకు సమాజానికి అనుబంధం! భ్రమ కాదు! స్వప్నం కాదు వర్తమాన చరిత్రలో నేలపై నడచే మానవీయ వాస్తవం. ఏ వాల్ పోస్టర్లోనో అందాల ప్రదర్శనలోనో బొమ్మలూ చేతిలో పత్రికతోనో బ్యాగ్ తోనో రైలు దిగే బస్ ఎక్కే ప్రతిమలూ ఆమె జీవితంలో దూసే వాడి ప్రశ్నలకు సమాధానం కావు ఆమె కోల్పోయే బ్రతికే హక్కుకి ప్రత్యామ్నాయం లేదు.621
4. అదృష్ట పార్శా లు ఎక్కడో కలిసి అదృష్టం! మాట వరసకు పలకరిస్తుంది ఎంత కాలం నుండో కలవని పాత బంధువులా కనిపిస్తుంది. ఒకపుడు కన్పించి ఊపిరి ఆగేట్లు హత్తుకుంటుంది రెండు మాటలు రాలక ముందే కనుమరుగై పోతుంది మరొకపుడు కాస్త ఎడంలో త్రుటిలో తప్పుకొని పోతుంది ఇంకొకపుడు కుర్చీలోనో సోఫాలోనో ఆప్త మిత్రంలా చేరుతుంది. రైలు పట్టాలపై రహదారిపై కాలి బాటనా గాలి దారినా నాతో పయనిస్తుంది కాని, అపరిచితంగానే ఉండి పోతుంది నాతో పయనిస్తూనే హఠాత్తుగా ఎక్కడో విడిపోతుంది. ఎపుడో చకితంగా హేతువు కందకుండా ప్రత్యక్షమవుతుంది కదలని నాలోకి చేతనయై ప్రవేశిస్తుంది కదలే నానుండి అవలీలగా నిష్క్రమిస్తుంది. తలుపులు తెరచి ఉన్నా ముంగిట్లోనే వెలుగులు పరచి ఉన్నా చీకటి అంచునే కదలుతుంది
తన వెనక గ్రీష్మాన్ని మోసుకొనీ నానుండి మబ్బుల్ని కోరుతుంది తన వెంట ఆర్కెస్ట్రా శబ్దిస్తూ నా నుండి మౌనం కోరుతుంది పావురాళ్ళను ఎగరేసే బదులు నిప్పు కణాల్ని చిమ్ముతుంది వెచ్చదనం ఒక పరిమితి దాటితే శ్మశాన స్పర్శ తప్పదు కన్నీటి బిందువుల్ని వ్రేలి గోటితో మీటుతుంది నన్ను క్రాస్ చేసి ముందుకు వెళ్ళి పోతుంది అదృష్ట గమనంలో ఆలోచన వేగాన్ని అందుకుంటుంది ప్రవాహ చలనంలో నేనూ కదలి పోవడం! సహజం.622 నా కాళ్ళు శిఖరంపై పాతుకున్న వేళ్ళని తెలిసీ తెలీకా మబ్బు నుండి మెరపులా అదృష్టం నన్నెత్తుక పోజూస్తుంది నా చేతులు ప్రవాహం అంచున కదలే అలలని తెలిసీ తుపాను వెంట మబ్బులా నన్నెత్తుక పోజూస్తుంది జీవితంలో అంతవరకూ చూడబడని రూపం అదృష్టం ఎవరో కాదు! ఒకే నాణెం పై వాస్తవానికి మరో పార్శ్వం! ఆటలో ఏ ఒకరి చేతిలోనూ నిలవని బంతి! అదృష్టం ఆట ఆగదు! అదృష్టం నిలవదు! మనిషికి జిగీష సహజం! అదృష్టం మనిషి పయనంలో దొరికే రెండంచుల సాధనం తాను నరికితే ఆనందం! ప్రజ్ఞా ప్రతిఫలనం! నరకబడితే విషాదం! విధి! నేడు రేపు మధ్య అడుగువేసే మనిషి చరణం శిఖర స్పర్శ కోరుతుంది మనిషి మనో నేత్రం ఇంద్ర ధనుసు కోరుతుంది పొద్దెక్కిన కొద్దీ వాస్తవ దృశ్యాలు చూస్తుంది చీకటి రాకతో రాత్రి కల్పనకు సిద్ధమవుతుంది. ఇనుప చువ్వలా నిలిచిన ఆలోచన కూడా ఏదో ఒక రోజు పుష్పించాలనే కోరుతుంది. కవిత ఒక క్రీడ కాదు నేడు రేపు మధ్య తెరచిన కవాటంలా సమయం వీడ్కోలు మరచి పోతుంది, స్వాగతం పలుకుతుంది. సమాజ కథలో కొంత మిగులుతుంది సాయం సంధ్యలో కొంత కలుస్తుంది మరి కొంత చీకటి జలాల్లో కలసి పోతుంది
మరి కొంత రేపటికి చేతుల్ని అందిస్తుంది. సమాధుల్ని త్రవ్వీ శ్మశానాల్ని వెదకీ ప్రయోజనం లేదు కావలసిన వాటి నమూనాలు మనోంతరంలో భద్రంగానే ఉన్నాయి. నేడు రేపు మధ్య పుటలపై శబ్ద సమూహాల్ని నడిపే మానవ సంబంధాలు వేటి పనిలో అవి ఉన్నాయి లోపలి నుండి స్వేచ్ఛ లభించి బయటపడిన శబ్ద సమూహాలు కాగితంపై లిపిలో బంధితమవుతాయి పెదవులపై పాట ఎప్పటికో గాని ఎగరదు పెదవులపై మాట దూకేందుకు సిద్ధంగా ఉంటుంది నేడు రేపు కతీతంగా శబ్ద శక్తి వెలుగుతుంది. నేడు రేపు మధ్య అస్తిత్వం పుష్పమో అంగారమో! హ్లాదం ఒక వైపైతే! సంవేదన మరో వైపు ఆగిపోయిన స్వప్నం! ఓ కెరటమై లేవచ్చు అణగిన ఆదర్శం! ఓ దర్శనమై రావచ్చు. ఆశల్ని మోసే కిట్ వంటిది వర్తమానం కాలంతో స్థలంతో బంధం అనివార్యం ప్రయాణం నిలవదు! జీవన రణం ముగియదు. నేడు రేపు మధ్య మానసిక ప్రయాణం గడియారం అంకెలపై ఆరోహణతో చేతుల్లా రెండు ముళ్ళనూ పట్టుకుని సాగేను శ్రమ శిల్పికి గడియారంలో తెలిసిన అంకెలు రెండే, ఒకటి పనిలోకి వచ్చేప్పటిదీ రెండోది పని నుండి నిష్క్రమించేప్పటిదీ చంద్రు డాలస్యంగా రానీ రాక పోనీ ఫరవాలేదు కాని శ్రమ సంకేతం సూర్యుడు సమయానికి మేల్కోవలసిందే. నేడూ రేపూ మధ్య తమ అవసరాలు తీర్చే మినీ కల్పతరువు ఇంట్లో కుండీలో పెరగాలనే ప్రతి వ్యక్తిలో కోరిక ఎదురైన పుష్ప గుచ్ఛంలో దాగిన విస్ఫోట పదార్థం ఎగిరే పక్షికేం తెలుస్తుంది తన రెక్క అంచుతో గుచ్ఛాన్ని స్పృశించి వెళుతూంది. ముఖం లేకపోయినా ఫరవా లేదు కాని ఎదురుబడితే మనిషి గురి పెట్టే ఆయుధం కారాదు
ఎక్కడో దాగిన రహస్యం బాష్పకణంలో తళుక్కుమంటుంది. ఒక్కొక్క మనిషిలో ఏ తీగెనో చెట్టునో కదిలిస్తే ఒక సమయం పూలకూ పండ్లకూ బదులు నిప్పులు రాలే ప్రమాదముంది కళ్ళలో దుమ్ము చిమ్ముతూ సుడిగాలి రేగుతుంది నీడనిచ్చే తడికెల్ని అమాంతం ఎగరగొడుతూంది నేడు రేపు మధ్య భేదం లేకుండా బయట పనిచేసే బుజాలపై ఎండ ఎర్రని శాలువా వలె నిలుస్తూంది శ్రమ ముందు కాలం తలవంచుక వెళ్ళిపోతూంది. నేటి వాస్తవం నుండి రేపటి దర్శనంతో సమాజం జ్వాలయై అలయై తీగెయై జీవితాన్ని కదిలిస్తుంది రాత్రి ఎంత ఎత్తు ఎగిరినా ఎంత లోతు దిగినా మనిషి, పొద్దునే నేలపైకి వచ్చి తీరాలిసిందే వ్యక్తిలో మానవత ఉద్దరణిలో నీరు లాంటిది మనిషిలో దానవత మబ్బులో పిడుగు లాంటిది రెడ్ కార్పెట్పై నడుస్తున్నా వెనక కత్తి నిలచే ఉంటుంది స్వాగత స్వరం వెనక నిష్క్రమణ స్వరం ఉండనే ఉంది. 624625 అద్దంలో దీపం వలె కవిత వెలుగుతుంది స్పృశిస్తే కాల్చదు, సరికదా హత్తుకోవాలనిపిస్తుంది కవిత ఓ క్రీడ కాదు! విలాస యాత్ర కాదు అనుభవం దర్శనం ఒకటైన శబ్ద హృదయం కవిలో వేదన వదలిన బింబంతో బయటపడుతుంది మనిషికీ మనిషికీ మధ్య దీపం! తన ముఖం దాచుకోదు! నేడు రేపు మధ్య నిలిచిన అంతరంగ ముకురం అబద్దం చెప్పదు దీన్ని పూర్తిగా చూచే తీరిక వినే ఓపిక మనిషికి ఉందా? అని.
1. కాలం విసరే జోక్ శుష్క వదనం అపహసిస్తూంది! ఈ దరిదాపున వసంతం లేదు నాకు తెలుసు! కాలం విసరే జోక్, ఒక మృదుకఠోర వాస్తవమనీ
వర్తమానం నిప్పురవ్వల కార్పెట్లా పరచుకుంది చెదరే ఆశ వెదురు బొంగులా చీలుతుందనీ తెలుసు! చేతి నుండి జారిపడి ముక్కలైన గాజు పాత్రలా శాంతి! చేతులు చాచి ఎదురు చూస్తుందనీ తెలుసు నటనా సమాప్తిలో మైత్రి నీడలా దూరదూరం జరిగిపోతూంది ఇదో మినీ ఎడారినో! మృగతృష్ణనో! తలపిస్తుందనీ తెలుసు. ఇంద్ర ధనుస్సులా మానవత ఎపుడెంత సేపు కన్పించేదీ తెలుసు! ఇదొక ఇంద్రజాలంలో భాగం కావడం కాలం విసరే జోక్! నాకు తెలుసు, సమయం! మనిషి చేతిలో ఆట బంతి అనీ ఆడే శక్తితో పాటు నేర్పుతోనే రక్తీ విజయమా అనీ పైన కదలే నీలి మబ్బు కోసం నిరీక్షణం లేకుండా నాలో ప్రవహించే జీవనది జలధిలో కలుస్తుందనీ తెలుసు! ఊహ వెనక సముద్రం! మానసికం ; కళ్ళముందు సమాజం! భౌతికం! మనిషి అనుభవ జగత్తులో! ఈ జీవితం బింబ ప్రతిబింబ భావం! శ్మశానం తలుపు ఎన్నటికీ తెరవబడదు సమాధి తలుపు తెరచినా ప్రయోజనం లేదు! హృదయం మాత్రం నేడు చేతిలో వయొలిన్ వలె ఉంది దీన్ని వినేందుకు మనిషికి! చెప్పరాని వెల ఉందనీ తెలుసు! నాకు తెలుసు! కాలం విసరే జోక్ ఒక మృదు కఠోర వాస్తవమనీ.
3. అశాంతి ప్రశ్న మానవ సంస్కృతి చిహ్నం బమియాన్ బుద్ధప్రతిమ దేశాన్నీ కాలాన్నీ జయించే సాంస్కృతిక చేతనకు ప్రేరణం. మౌనోపదేశంతో నిలిచిన శాంతి శిఖరం చెలరేగే అలల మధ్య నిశ్శబ్ద ద్వీపం తాలిబాన్ ఆలోచనలు ఆయుధాలై ఎగసాయి రెక్క విరిగిన పక్షుల్లా క్షణాలు వాలిపోతున్నాయి హింసకు ద్వారమయిన అనాగరిక చర్యలో దెబ్బ దెబ్బకు రాలే ప్రతి ముక్కలో బుద్ధశక్తి పునర్భవం. కళ్ళలో వెలుగు పావురమై ఎగసింది ముఖంలో తేజం దిశల్లో కలిసింది. కూలిన ప్రతిమ చుట్టూ మహా సంఘ స్వప్నం జ్వలిస్తూంది
గుప్పెడు రాజనీతి మంచుకీ దోసెడు శాంతి జలసేచనకూ చిటికెడు సానుభూతి జల్లు, ఆరేది కాదీ అగ్ని! నాలుగు గోడల మధ్య తాలిబాన్ సమాజం కదల్లేని రాయిలా! సమాధితో సమానం. తలుపు మాట సరే! కిటికీ కూడ లేని మనస్సు మానవతా చరణాలపై ఇనుప సంకెళ్ళు విసురుతూంది. తాలిబాన్ వేసే అడుగులో అశాంతి జాడ ఎర్రగా కాలిన ఇనుప ముద్రను తలపిస్తూంది! మత మౌఢ్యం ఇనుప పరదావలె నిలిచింది. దిశా శాంత ముఖంపై నీలి పొగ! కదులుతూంది. ఆటవికంతో బిగించిన గాజు సీసాలా తాలిబాన్ వాలకం! జలధి మధ్య అనల ద్వీపంలా అఫ్ఘన్ స్థావరం పచ్చదనం కన్నా ఎండిన మ్రోడు ముఖాలే ఎదురవుతాయి పెను బండలు కూడా ఇక్కడి దరిద్రాన్ని తిరస్కరిస్తాయి! జీవిత కాన్వాస్పై వాస్తవం నిలువునా ద్వేషంలో ముంచిన బ్రష్ గీసిన చిత్రం వలె ఉంది. ఉద్రేకం తీగెలపై తుపాను గర్జిస్తూంది. ఉన్మాదం అంచుల్లో అశాంతి కదలుతూంది. రాత్రి వెనుక నున్న సూర్యుని గురించి కాదు చింత! ధూళి ధూమం వదలని పగటి బింబం గురించే! మనిషిలో సంస్కారం అశాంతి ప్రశ్నకు వేలాడుతూంది మనిషిలో ఆటవికం అశాంతి ప్రశ్నతో ఆడుకుంటూంది. మనసులో సద్భావన సజీవ రూపమై కదలుతూంది భౌతిక దశలో మనిషి కీర్తి శిల్పమై నిలుస్తూంది. సందర్భం అతిథివలె వస్తుందనుకుంటే హఠాత్తుగా శత్రువువలె ఎదురవుతూంది! ఆలోచన ఎదపై పూలదండ అయ్యే బదులు అంతలో కదలీ దవానలమై చుట్టేస్తూంది. తాలిబాన్ ముఖాల్లో అనల వృక్షం శాఖలు శాఖలుగా! దూరాన మంచు తెల్లని జెండా వలె ఆకర్షిస్తూంది. ఈ బుద్ధుని ప్రతిమ ఏ ఒక్కరిదీ కాదు! మానవ జాతిదీ పైన కదలే మేఘం! ఏ ఒక్కరిదీ కాదు. సమస్త ప్రాణిదీ. అవనిపై రేఖల హద్దులతో దేశాల్ని నిర్మించవచ్చు మతంతో గీసే మారణదృశ్యాల్లో శాంతిని దర్శించలేం
సమయం విధ్వంస చరణాలతో పరుగెత్తుతూంది ఇది మనిషి ఓటమిని తలపించే క్షణాల సంకలనం!
4. బ్లాక్ బోర్్డ పై బ్లాక్ బోర్డపై తెల్లని వాక్యాల వరస వయొలిన్ తీగెల్ని తలపిస్తున్నాయి ఎంతటి ఘన పండితులయినా లిపి తెలిందీ భాష తెలీందీ పామరజనంతో సమం. రోజు మొదట బ్లాక్ బోర్్డ ప్రత్యక్షమవుతుంది. దీనిపై చిక్కగా నిండుగా చీకటి ఒక ఆకర్షణ శాంత జలధిపై నావల్లా నిశ్శబ్ద గగనంలో విమానాల్లా పద వాక్య విన్యాసాలు అవనినీ అంతరిక్షాన్నీ ఆలోచనలో తేల్చేను బెలూన్కు వాహన మక్కర లేదు అది గాలి వాటును దాటలేదు ఆలోచనకు సాధనమవసరం అనుకున్న విధంగా సాగేందుకు! చాచిన కుడిచేయి ఒక దిశను చూపిస్తుంది చాచిన ఎడమచేయి మరో దిశను చూపిస్తుంది రెండు రేఖలూ కలిసే చోటు సాధ్యమే సాధ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది వివేకం! బ్లాక్ బోర్్డ ముందున్న మనసుల్ని కాంతి స్పృశిస్తుంది ఊహలో సింహంలా దూకొచ్చు, జింకలా ఎగరవచ్చు. పదం వెనక మరో పదం వాక్యం వెనక మరో వాక్యం లోలోపల ఏముందో తెలుసుకోడానికి సముద్రంలో చేపలా ఈదాలిసి ఉంటుంది. అన్వేషణతో కిరణంలా సంచరించాలిసి ఉంటుంది. ఒక ముఖంలో మరో ముఖం! ఒక్కో కోణంలో ఒక్కో వాలకం. ముందున్న కిటికీ నుండి చూస్తే శిఖరాలతో జీవితం శిఖరానికీ శిఖరానికీ మధ్య పైకి కన్పించని లోయలు! వెనకున్న కిటికి నుండి చూస్తే అలలతో సమాజం
సముద్రం అలలపై ఆతపంలో ఆవిరితో మార్పు సహజం. బ్లాక్ బోర్్డ కూ చాక్ పీస్ కూ ఏ లిపి భేదం లేదు. కాంతికీ కరానికీ పగలూ రాత్రీ భేదం లేదు. గదిలో విద్యుత్తు నిలిచిపోయిన సమయం చీకట్లో టేబిల్పై చేయి! పేపర్ వేటా న్నూ అగ్గిపెట్టెనూ సులభంగా గుర్తిస్తుంది. బోర్డపై ప్రతి పదాన్నీ చూచే ఓపిక ఉండాలి కాని కిటికి నుండి జనదృశ్యాన్ని చూచే తీరిక ఉండాలి కాని, ఇది అంతం లేని అనుభవ గ్రంథం, ఏ రోజుతోనూ సమాప్తి కాదు. బ్లాక్ బోర్్డ మొదలయిన రోజు వాక్య దర్శనంతో ప్రకాశిస్తుంది.
5. ప్రజాస్వామ్య వాస్తవం ఏ శకమయినా శతాబ్ది అయినా మానవజాతి సారబింబం మనిషిలో ప్రవృత్తి ఎప్పటిదే ఇతివృత్తం మాత్రం కొత్త! సమాజంలో వ్యక్తులు భావజాల నిర్మిత ప్రతిమలు ఒక దశలో ముక్తమై స్వాతంత్య్రం పొందేరు అంతరంగ ప్రేరణ లేంది ఎక్కడ వేసిన అడుగు అక్కడే. ఆలోచన చలనంతో అనుభవం సౌందర్యంతో స్వేచ్ఛాయతనంతో ఎవరి జీవితం వారికో ప్రియమైన సమాజ ప్రయోగశాల మనిషికీ, మనిషికీ మధ్య స్వార్థం ఒక బిగిసిన మంచు గోడ! ఏ గోడల్లేని సమాజంకై పరితపించే వారు ఉన్నారు ఋషులూ కవులూ తాత్త్వికులూ రాజనీతి దర్శకులూ ఒకరిపై బరువు దించీ, మరొకరి బరువునెత్తుకొనీ సాగే పయనం ఎక్కడికక్కడ ముగిసినట్లే ఉంటుంది కాని, దాటేది మజిలీ మాత్రమే భయం నుండి భయంలోకి గమ్యం నుండి గమ్యానికి గది నుండి గదిలోకి ఊరు వదలి మరో ఊరు గన్పాయెంట్◌ూ కొంత దూరంలో మనిషికీ మధ్య నేలపై నెత్తురు మరకల్ని తుడిచే కర్చీఫ్ మంచు తెర గురికి అడ్డంగా వచ్చి నిలుస్తుంది, మనిషి హక్కును తళుక్కుమనిపిస్తుంది.
విధ్వంసానికి స్వేచ్ఛతో సాహసం సరిపోతుంది నిర్మాణానికి స్వేచ్ఛలో సంకల్పం అవసరం పచ్చని కొమ్మ నుండి పుష్పాలు! ఎన్ని రంగుల్లోనో! నిలిచిన రాయి, పలకదు! మనిషిలో మనిషిని పలకరిస్తుంది విసిరిన రాయి, గది అద్దాల్ని గల గల మాట్లాడిస్తుంది ఎగిరిన రాయి, ఫాలంపై విధి చిత్రాల్ని బయట పెడుతుంది భవిష్యత్తుకు ప్రవేశ ద్వారం ఒకటే! ఉదార ప్రజాస్వామ్య వాస్తవం.
X. కిరణపథం
(2002) 1. స్వేచ్ఛకు సిగ్నల్ 2. స్విచ్ ఆన్ మాదిరాజు రంగారావుఇది సెప్టెంబర్ పదకొండు 2001 న W.T.O. (U.S.A.) పై ఉగ్రవాదభీభత్స చర్యకు క్షతులైన హతులైన వివిధ దేశాలకు చెందిన మానవ బృందం విషాదస్మృతికి చిహ్నంగా అంకితం I. స్వేచ్ఛకు సిగ్నల్ 1) విషాదపర్వం సెప్టెంబర్ పదకొండు కిరణపథం పుట 1. 2. చెదరిన సంకేతం 3. మసిబట్టిన అద్దంలో 4. ఇపుడు కావలసింది 5. విధ్వంసం నుండి నిర్మాణానికి
2) కిరణ పర్వం 6. సమాజం నాలో బంధువై, భాగమై 7. ఆగని గమనం 8. కథలో ఘట్టం 9. స్క్వేర్ లేబుల్కై 10. ప్రగతిలహరి 11. స్వప్నం - నిజం 12. ఎన్నటికీ జ్ఞాపకం చేస్తుంది 13. అందీ అందని పక్షియై 14. స్వేచ్చకు సిగ్నెల్ II. కిరణ పథం 3) స్విచ్ ఆన్ 15. గమ్యం నుండి గమ్యానికి 16. సమయ మేఘం 17. ఆయుధం చివర ఓ పూవుర్వి
18. చీకటి చరణం క్రింద 19. దొరకని వెలుగు 20. జనదర్పణం ముందు 21. రణం రణ సదృశం 22. బొమ్మతో అనుబంధం 23. ప్రతిరోజు 24. స్పందనతో 25. కొత్త జగం 26. సృజన కిరణం 657634 Smt. Haritha Madiraju, Devulapalli కావ్య పరిచయం స్వేచ్ఛకు సిగ్నెల్, సంపుటిలో విషాద పర్వంలో అయిదు కవితలూ, W.T.O. (U.S.A.) పై ఉగ్రవాద భీభత్స చర్యనూ దాని ప్రభావ పర్యవసానాన్నీ వస్తువుగా స్వీకరించి వ్రాసినవి. ఏ సమ చర్య అయినా విషమ చర్య అయినా 'రణ'మైనా, 'వేట' అయినా, పరిమితుల్ని దాటకూడదు. ప్రజల స్థితినీ గమనించాలిసి ఉంది. క్లిష్టస్థితిలో ఉదార గుణంతో మానవతా స్పందనంతో, మానవీయ భావనతో వర్తించడం అవసరం. దీనితోనే వ్యక్తి వికాసం సమాజ సౌభాగ్యం సాధ్యం. దీనికి వైజ్ఞానిక సాంకేతిక విజయాలు జోడింపబడాలి, అపుడే సమగ్ర వికాసం సాధ్యం. కిరణ పర్వంలో తొమ్మిది కవితలు సమాజంలో ఎ) ఒక విధం ప్రస్తుతం నెలకొన్న హింసనూ అలజడినీ అశాంతినీ మితిమీరిన విపరీత ఉగ్రవాద ధోరణుల్నీ దృష్టిలో పెట్టుకొనీ, బి) మరోవిధం, మనిషిలో సృజన శక్తినీ నిర్మాణగుణాన్నీ స్వేచ్ఛా ప్రియత్వాన్నీ భావిస్తూ వ్రాసినవి. “స్క్వేర్” కవితలో చివర ఇది సూచితమైంది. మొత్తం మీద ఈ భాగంలో 1) సామాజిక వాస్తవికత, 2) వ్యక్తి మనోరూపం వివిధ స్థాయిల్లో చిత్రితమయినాయి. ఇక కవిత్వానికి వస్తే ఒక్కొక్క కవితలో అభివ్యక్తిలో నిర్మాణంలో వైవిధ్యం ఉంది. ఇది ప్రత్యేకతను భావింపజేస్తూంది. చివరి కవిత,
“స్వేచ్ఛకు సిగ్నెల్” ఆదర్శానికి అద్దం పడుతూంది. కిరణం స్వేచ్ఛకు సంకేతం, ఇంకా వివేకానికీ వికాసానికీ విశ్వప్రేమకు చిహ్నంగాను ఉంది. ఈ కావ్యం వర్తమాన స్థితిగతులకు స్పందనగా వ్యక్తీ సమాజ స్థాయిల్లో మానుషీయం మరియు మానవతా చిత్రణంతో ఆకర్షిస్తుంది. “స్విచ్ ఆన్” సృజనాత్మకమైన నిర్మాణాత్మకమైన ఆలోచనకూ క్రియనూ ప్రోత్సహించే బలపరచే రచన ప్రజాస్వామ్య భావనాయుతమైందీ. Detroit, Michigan, U.S.A. 2-3-2002 - హరిత635
I. స్వేచ్ఛకు సిగ్నెల్
1. విషాద పర్వం మరపు రాని విషాద స్మృతులను భద్ర పరచిన కాప్సెల్ ఇరవై ఒకటో శతాబ్ది సెప్టెంబర్ పదకొండో తేది అమానుష ఘన వల్లి ధాటికి మానవీయం వణకింది మారణ కాండ చరిత్రకు కొత్త నడత నేర్పుతూంది. విమాన యానాఘాతంతో ఫేన పంక్తుల్లా కూలిన టవర్్స! లేచిన ధూమ గణం అడుగున, రక్త సిక్త మృత్యు చిత్రం ముక్కలు! బయటపడే భయ విలయ రూపం, చేతి కందని నీడలా కదులుతూంది. గాలిని చీలుస్తూ ఆర్త రవం సంకులమై కీర్ణమై విషమ శ్వాసతో సమాజం క్షణం నిస్తబ్ధ మయింది. మనిషిలో నవ యుగ సంస్కృతి క్షత మయినట్లుంది వికాస సదనం బదులు భీభత్స వాటిక ఎదురవుతూంది. మనిషికి మనిషి భయం, తలపులో అనుమానంతో సుదీర్ఘ రణ సంకల్పానికి బీజ భూత మవుతూంది ఈ శతాబ్ది ఆరంభం రణ నీతి చరిత్రలో బాంబింగ్ వ్యూహంతో, గగన తలం నుండి
వేటకు శ్రీకారం జరుగుతూంది.
1. సెప్టెంబర్ పదకొండు రహస్య చరణాలపై కదలే అగ్ని నుండి ధూమ పంక్తి జనం కళ్ళు మూసేస్తూంది. పరిసరాల్ని కలుషితం చేస్తూంది. కొన్ని తేదీలు దారిలో వెలుతురు మైలు రాళ్ళను తలపిస్తాయి కొన్ని తేదీలు దారిలో చీకటి తోరణాల్ని నిర్మిస్తాయి.636 మనిషి నుండి లేచిన నీడ పెరిగి మనిషిలో వెలుగును మ్రింగేయ జూస్తూంది. దీన్ని తుద ముట్టించేందుకు, మూలం ఏ గుహలో దాగిందీ తెలీడం లేదు. గాలి స్తంభించింది వెలుగు మాసి చీలికలై పేలికలయినట్లుంది ఉండి ఉండి ఉగ్రవాదం నవ మారణ హేలకై, స్థలం నుండి స్థలానికి వేదిక మారుస్తూంది, బాధను పంచుతూంది. ఇపుడు ముందున్న మొట్ట మొదటి పని, కోలాహల జనం కన్నీటి వంతెన దాటడం. నిటారుగా నిల్చిన నవ మానవ వికాస చిహ్నం తల తీసిన గాయంతో క్రుంగి శిథిల మయింది గడ్డ కట్టిన జలం అప్ ఘన స్థానం చలి రంపం కొనలు కొండలూ, మౌఢ్యం దిగిన ఆటవిక నిలయం క్షిపణి దాడికీ మృత్యు కీలకూ, అనల ధానిక అయినా కన్నీటి చెరువయినా సామాజిక చలనంలో మనిషే మానవతకు మానిక. మంచు నుండి సూర్యుని రింఛోళిలా బాధ నుండి జీవితం తేరుకోవలసి ఉంది మానవత నుండి తొలగే మంటల్ని తొడుక్కొనీ అన్వేషణలో దొరకని 'నిజం', వాస్తవానికి నిశీథి చంద్రరేఖ వలె ఉంది. 'నిజం' మనిషికో విధంగా మితమైంది. విద్రోహం నుండి ముక్తమై కన్పించిన లిప్త,
ఎదలో వజ్రమై తళుక్కు మంటుంది.
2. చెదరిన సంకేతం నీలి ముసుగు క్షణం తొలగుతుంది, అంతలోనే మళ్ళీ కమ్మేస్తుంది. నిజానికీ రహస్యానికి పగలూ రాత్రీ భేదం లేదు. ఎంతటి విషాదంలోను సమాజం తలుపులు మూతబడవు రహస్యంలో 'చేదు నిజం'కై అన్వేషణ ఆగదు, అభియానంలో. బ్లాంక్ పేపర్లా రోజు పరచుకుంటూ పోతుంది, దీనిపై ఒక్కో లిపీ, వివిధ వర్ణ చిత్రాలే కాదు, గాయాలూ చోటు చేసుకుంటాయి. మౌన సంధ్య సందేహాన్ని దాచేస్తూంది అమానుష దృశ్యంలో భీభత్సం కరుణగా మారుతూంది. మనిషిలో మనిషి ఇప్పుడు! ఎగసి కదలే జల కణ రూపంలో నడిచేను. గాయం స్మృతులకు అద్దం వలె ఉంది గాయం ఆలోచనకు పదును పెడుతూంది ఎట్టెదుట మానవ వికాస చిహ్నం చెదరినా తొలగినా ఎదలో మానవత చివురిస్తేనే! సుమిస్తేనే భవితవ్యం. ఇది శప్త భూమి సుప్త ఖండం! ఘన పర్వత స్థానం నడుమ నడుమ! మెలకువ గుర్తుగా పచ్చని శకలాలు! ఇక్కడ పూర్వ యుగ రణ దాహం ధగధగలాడుతూంది చేతిలో కత్తి చివర చంద్ర రేఖ తళతళలాడుతూంది. చరిత్ర ప్రజలదీ, చివర సిగ్నేచర్ ఏ ఒక్కరిదో! నియంతదీ. ఈ భూమి ఆకాశం గాలీ నీరూ వెలుగు తనదే నన్నట్లుంది. అసహనం క్రౌర్యం మౌఢ్యంతో సాగే రణం మరణం పణమైంది, ఇప్పట్లో ముగిసేట్టు లేదు.
3. మసిబట్టిన అద్దంలో గోడ చాటు నుండి ఆయుధాలు ప్రేలేను.
బండ మాటు నుండి బాంబులు దూకేను. తాలిబాన్ శాసన కారాగారంలో ప్రజలు స్వేచ్ఛకై దిశలు చూచే ఎగర్లేని పక్షులు చేతులు కట్టేసినట్లు ఆకుల్లా కదలేరు కాళ్ళకు గొలుసేసినట్లు బండల్లా నిలిచేరు. హింస ఇచట పాలనలో భాగమయింది శాంతి ఇపుడు రణంలో మరణం తరవాతే నన్నట్లుంది మానవత మసి బట్టిన అద్దంలో బింబంలా ఉంది. మనిషితో మనిషి కలిసి బ్రతకడం తెలీని వాదం మనిషిని మనిషి వేటకు పురికొల్పే నీ సమయం. అగ్ర రాజ్య నీతిలో వేటకు గురైన తాలిబాన్లు కొండల్లోకీ గుహల్లోకీ ఇనుప గుండ్లలా దొరలేరు. కత్తుల పందిరి కింద మానుషీయం అదృశ్యమయింది. ప్రతి దిశలో దగ్గ దృశ్యం వికలమైన సంధ్యా చిత్రం వలె ఉంది. మతం పేర రణంతో చెలరేగే మారణేతిహాసంలో చివరనైనా మానవతా పర్వం ధ్వనిస్తేనే అందం. తలుపులు తెరచిన ద్వారం నుండి కాకుండా కిటికీ నుండి దూకుతుందీ ఉగ్రవాద రూపం నాగరక ప్రపంచానికి దూరంగా స్థిరత లేని శిలా జీవనం, కొండల్లో కోరుతూంది రహస్య నివేశనం. సమాజాన్ని ఖండ ఖండాలుగా హింసించే తీవ్రవాదం
4. ఇపుడు దాటాలిసింది ఉన్మాదం కన్నా తుపానుకున్నా భూకంపం కన్నా భయదమైంది ఇది వెన్నెముక లేని అమానుష రహస్య ప్రకారం దీని నీడలు మృత్యువును మోస్తూ పోతాయి.ఊహలో ఉన్న వెలుగు కాస్తా దూరమవుతూ
పోతుంది
వేడి వేడి చూపుకి కిరణ కిరణం వంగిపోతుంది నీడకీ వెలుక్కీ మధ్య అఖాతం క్రోధానలంతో నిండిపోవడంలో ఆశ్చర్యం లేదు. అమావాస్య స్తంభంలా ఉన్న ఈ చిరు జగత్తులో
గోరంచు చంద్ర రేఖ ఒకటే వెలుగూ! ఆదర్శం! ఆటవికమూ సాహసమూ ఇక్కడ ఆకట్టే అలంకారాలు సౌభాగ్యమూ సంస్కారమూ ఇక్కడ చెల్లని నాణాలు. ఆధునికతను దగ్గరికి రానీయని అగ్ని వృక్షం దూర దూరాన స్వేచ్ఛను మంటల సైగలతో ఆపేస్తూంది. ఇపుడు దాటాలిసింది, ఉగ్రవాదం సుడిగాలిలో, అగ్రశక్తి పిడుగు దాడిలో గాయాల మంటలతో కన్నీటి అలలతో కథలై చిక్కిన కరుణ దృశ్య పరంపరనూ, ముక్కలైన మానుషీయాన్నీ. నేలపై నెత్తురు మరకల్ని తుడుస్తూ నడచిన బుద్ధ మూర్తి శిరస్సుపై ఇపుడు అనలాభిషేకం
5. విధ్వంసం నుండి నిర్మాణానికి భయంతో ఊగే రాత్రికన్నా పెద్ద సైజు నీడలా అనుమానం, మనసును భయదంగా వేటాడుతూంది. విషాద పర్వంలో సమస్య పొడవునా దారి నిప్పు కణాలు పొదిగిన కార్పెట్లా ఉంది. నిర్మాణ చరణంలో నవ ప్రపంచ సంస్కృతి పచ్చని ఊహ పరచిన ప్రగతి దారినే. ప్రతి శ్వాస చివర ఒక్కొక ఆకు కదలుతుంది తరు తరువై వనమై జీవితం విస్తరించాలనే!640 సమయం పలు రంగుల్లో ఉరి త్రాడు పేనుతూంది విధ్వంసానికీ నిర్మాణానికీ అంతరం! దారం దూరే సూది బెజ్జం! ఆరోహణకు ప్రతి రూపం! ఎతె న టవర్! పైన మబ్బుతో చేతులు కలిసినా, మబ్బులో మెరుపులో చూపులు నిలిపినా వాజ్లో ఒక్కో రంగు గులాబితోనే పూర్ణత!
2. కిరణ పర్వం విషాద పర్వంలో నేనే కాదు నీవూ కన్పిస్తావు బంధువై.
నాలో కిరణాల తీగెలపై ఆత్మీయ స్వరం నాలో సముద్రం అలలపై సమాజ స్వరం. వ్యక్తి ఆర్తి నుండి జనాక్రోశం దాకా
6. సమాజం నాలో బంధువై, భాగమై ఒక్కో లిప్త అగ్నికి సమిధయై ఆగ్రహం ప్రదర్శిస్తోంది. మనిషిలో మానవత అనుభవంలో కాంతిని దర్శింపజేస్తోంది. మనస్సుకు హఠాత్తుగా ఎగిరే రెక్కలు రావడం సహజం. ఎదురైన ముఖంలో ముఖం శాంతి చిత్రాన్ని గీయాలను కుంటూంది. కలిసే చూపులతో చూపులు స్నేహ మాలను కట్టాలను కుంటాయి. స్వేచ్ఛ కోసం రాతి గోడల్ని కూలుస్తూ పోయే స్వేచ్ఛ కోసం ఇనుప కంచెల్ని తొలగిస్తూ పోయే అభియానంలో నాతో పాటు నీవూ కన్పిస్తావు, భాగమై.641 అగ్ని కణాల్నీ ఎర్ర గులాబీల్నీ గుర్తించడమే కష్టం, గుర్తించే లోపల చేతులు కాలినా ఆశ్చర్యం లేదు వాస్తవంలో అంతో ఇంతో ప్రమాదాల్నీ భరించక తప్పదు. ఈ యాత్రకు విరామం లేదు, విసుగు అసలే లేదు దూరాన మైదానం ఆకాశం కలిసిన దృశ్యం! విశ్వం నా చూపుడు వేలుపై నిలిచి నట్లుంది! ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా అద్దంపై రాయి విసిరినట్లే. విస్ఫోటం ఏ విధం అయినా సమాజం వికలం కాక తప్పదు. గతంలో పురా రూపాల అవశేషాలపై మతంతో స్వప్న రాజ్యం నిర్మించాలనుకోవడం భ్రమ! మంచు కొండపై ఏకాంతం భగ్న మవుతుందనీ మేఘ గర్జనం నిలవదు; పిడుగుపాటు ఆగదు! ఇసుక తిన్నెపై అమరిక ఛిన్నమవుతుందనీ గాలి వేగం తగ్గదు, ప్రవాహ గమనం ఆగదు. ఎత్తు వేసాన పాచిక విసిరాక, సమయం,
మెడలో పూల దండ వేయొచ్చు, సర్పాన్నీ విసరొచ్చు! ప్రతి చర్యనూ డాలర్తో డమ్మీతో ముడిపెడితే పరిహాసం ఆడిస్తుంది ప్రతి మాటనూ కోడ్తో, కథతో సరిపెడితే సందర్భం వికటిస్తుంది! పయనంలో యశస్తంభం మైలు రాయిని కప్పేస్తుంది! చేదు నిజాలూ, చెదరిని నిజాలూ పయనాన్ని నిలిపేస్తాయి! దారిలో, చక్రం కింద పడిన మనిషి ఆర్తీ ఉంది! దారినే, చక్రాన్ని నిలిపి ప్రశ్నించే మనిషి క్రోధమూ ఉంది!
7. ఆగని గమనం గోడలూ కిటికీలూ ద్వారాలూ తొలగిపోతూ దూరమయ్యే అవకాశంతో ఆయతం! ఒక్కో ఆవాసం మారుతూ పోతూంటుంది. నాతో పాటు నీవూ అంటే! సమాజ రేఖలో చలన బిందు రూపాలం ఎక్కడి కక్కడ గోడలూ కిటికీలూ ద్వారాలతో నివాసం! ఏ రోజు కారోజు కథలో ఘట్టాన్ని లంఘిస్తున్నట్లుంది. దేని కది అనుభవంలో సముద్రం. ఒక్కో సమయం నేలపై నడుస్తున్నా జల తలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇదో విరోధాభాస! జీవితంలో సహజమైందీ. కరుణో! ఆనందమో! ఏదైనా కొసమెరుపు బాష్ప జలమే! ఊపిరిలో ఉత్సాహంలో మెత్తని అనల ముందనీ తెలుసు! వీరమో రౌద్రమో! ఏదైనా ఆకృతిలో అనల ప్రకాశమే! మానవ కథా మూలం లేంది ఏ సృజనకు శాఖారూపం లేదు. పగలూ రాత్రీ ప్రతి రోజూ నిరంతరం మెలకువ తీరం నుండి నిదుర తీరానికీ, నిదుర తీరం నుండి మెలకువ తీరానికీ, చేరుకోవడంలో ఓ చదరంగం ఆట ఉంది! ఇదో సమయజలం! ఎక్కడో ఈదేసి వదలేది కాదు.
ఇదో శ్వాస సూత్రం! ఎక్కడో ఆపేసి! వదలేది కాదు. నేలపై నడక భౌతికాన్ని తలపిస్తుంది. జలంలో ఈత మానసాన్ని బింబిస్తుంది. ఎప్పటి కపుడు ముందు కొచ్చే అలల్లా ప్రజలు! దేనికది ఒడ్డున మరలే అలల్లా చరిత్ర పుటలు!
8. కథలో ఘట్టం మనిషి మనిషి చర్యతో ప్రతిచర్యతో కొత్త కథ! ఇదో మ్యూజియంలో భద్ర పరచేదీ కాదు, నా అడుగులు! చరిత్ర పుటలు! నా చలనం! సమాజ హృదయం పగటి తీర యానానికి ముగింపు? ముందున్న భవిష్యత్తులోనే! రాత్రి తీర యానానికి ముగింపు? వెనకున్న అద్దంలోనే! బొమ్మను చూస్తూంటే, మూర్తిని చూస్తూంటే
9. స్కే ర్ లేబులై స్మృతులు సాలీడు పటంలా అల్లుకుంటాయి. అల్లిక నుండి మనస్సు అవలీలగా బయటపడుతుంది. రబ్బరు బొమ్మను! ఒత్తితే కీచుమంటుంది! మట్టిబొమ్మ కింద పడితే ముక్క లవుతుంది! లోహ విగ్రహం! మనిషి శక్తిని పరీక్షిస్తుంది! బంగరు బొమ్మ ఆశకు ఆయువు నిస్తుంది! సమాజ చలనంలో వేగంతో ఆకర్షణతో ఇవి మూర్తం నుండి అమూర్తానికి పయనింప జేస్తాయి. పైకి వెళ్ళే కొద్దీ భావ ప్రపంచం దగ్గరవుతుంది. కిందికొచ్చే కొద్దీ వస్తు ప్రపంచం దగ్గరవుతుంది. ప్రతి మెట్టుపై సాలభంజిక ప్రశ్న ఉండనే ఉంది పరీక్షకు నిలిస్తేనే ఎవరికైనా సింహాసనం దక్కేది! మరో బొమ్మ! ఎర్ర టోపి పెట్టుకొన్న రైఫిల్ లేబులై ఆరాటం! చిరు పోటీ! స్క్వేర్లో స్వేచ్ఛగా.
మరో బొమ్మ! తెల్ల శాలువ కప్పుకున్న వయొలిన్! విమానాన్నో విగ్రహాన్నో పేల్చేస్తే ఆదర్శం అంతం కాదు చిత్రాన్ని తగలేస్తే ఆ రూపంపై ఆలోచన తొలగి పోదు వ్యక్తిని హతమారిస్తే నవ సమాజం వచ్చి వాలదు.
10. ప్రగతి లహరి ఉత్సాహం అంగారమయితే ఉద్యమాని కవసరమే, కాని ఉదగ్రమైన అంగారానికి విచక్షణ! శూన్యం! గమనంలో అంగారానికి నియంత్రణ మవసరం. అవని ఆకాశం నది సముద్రం! చెట్టు పూవూ ఫలం! దేని కది సమగ్రం! మనిషి మనిషి స్వతంత్రం! సహ యోగం ప్రకృతి సహజం; సహభావం సమాజావసరం. ఇసుకలో ఇంకి పోయే ప్రవాహం జీవనది కాలేదు. సూర్యరశ్మికి ఎండిపోయే చెట్టు, ఎంతటిదైనా పూవూ పండే కాదు, నీడనూ సరిగా ఇవ్వలేదు. నిద్రించే హిమ శిలల్ని లేపి కిరణం నేలపై పాపల్లా చిరు అడుగు లేయిస్తుంది. సరి కొత్త తరం ప్రగతి లహరి అవుతుంది. అనల దృష్టి మాడ్చేస్తుంది; శాంతి వచనం మార్చేస్తుంది. దుఃఖంలో కన్న హృదయం హింసలో ముక్క లవుతుంది. మారణకాండలో సమాజం! వెనక్కి తరలే ప్రవాహం! ఈ భూమిపై తోటకీ పొలానికీ ఆపద లేదు బ్రతుక్కి ఆధార రూపాన్ని ఏ నాగరకత కోల్పోదు. ఎపుడో కాలి బాటన అరి కాలిలో దిగిన ముల్లు ఇప్పటికీ సొరుగులో పొట్లంలో భద్రంగా ఉంది. నగరంలో ఫె ఓవర్ అందాన్ని బంధించిన నిర్మాణం స్థలాన్నీ కాలాన్నీ జయించే మానవ శక్తికి చిహ్నం. ఇపుడు సిమెంట్ రోడ్పై పాద రక్షలతో నడచే నాలో ముళ్ళతో గులాబి ముద్ర ఉండనే ఉంది. చెట్టు పాతదే! పూవు కొత్తదీ నది పాతదే! లహరి కొత్తదీ వ్యాపారం పాతదే! ఎదుర్కొనే సాధనం కొత్తది.
వ్యవహారం పాతదే! చేరాలిసిన గమ్యం కొత్తది. -
11. స్వప్నం – నిజం వస్తువులో కొత్తదనంతో సృజన దర్శనం, స్థలాన్ని కాలాన్ని జయించే మానవ శక్తికి సంకేతం. గడియారం చేతులు రెండూ కాలాన్ని శిశువులా తేలిగ్గా నడిపిస్తాయి. కాళ్ళు భూమినీ చేతులు ఆకాశాన్నీ హత్తుకొని మును ముందుకు పోజూస్తుంది మనిషి జీవితం. మనిషిలో స్వప్నం మనిషిని పైకెత్తేస్తుంది. మనసులో కిరణం మనిషి నిజం చూపిస్తుంది.
12. ఎన్నటికీ జా పకం చేస్తుంది మల్లె పూవును చూస్తే మనిషి రూపం జ్ఞాపకం వస్తుంది. సంస్కార ప్రసారంతో ధవళ ధవళ కీర్తితో. గులాబి పూవును చూస్తే మనిషి రూపం జ్ఞాపకం వస్తుంది ఉత్సాహ శిఖరంతో అనురాగ హృదయంతో. మోదుగ పూవు ఎదురయితే మనిషి రూపం జ్ఞాపకం వస్తుంది జన పద బంధువై, ప్రాక్ రూప చిహ్నమై. మొగలి పూవు కనిపిస్తే మనిషి రూపం జ్ఞాపకం వస్తుంది శ్రేణుల సమాజంలో జీవన సహభావంతో. ఒక పూవు చీకటి బాగ్ నుండి బయట పడొచ్చు ఒక పూవు మంచు కర్చిఫ్ నుండి సైగ చేయొచ్చు ఒక పూవు వెలుగు కేస్ నుండి పలకరించొచ్చు. నేను నా కవిత్వంలో ఎప్పటికీ జ్ఞాపకం చేసే పూవును
మానవతా మనోజ్ఞమై, జీవన రుచి చిహ్నమై.646 మనిషిలో అనుమానం ఎదురవుతుంది ఘర్షణలో ముష్టిబంధంతోనే కాదు, మానవ బాంబుతోనూ, ప్రతీకారం గాలిలో నిప్పులా ఎగసి పడుతుంది క్షమా హస్తం గాలిలో మంచులా పారాడుతుంది. బాహువుల మధ్య బంధించాలనుకునే ఆదర్శం, సందులో నుండి చిన్ని పక్షియై ఎగిరిపోతుంది. బహు తేలిగ్గా జారిపోయే కలల్ని మూట కట్టుకొని పోయే కన్నా,
13. అందీ అందని పక్షియై బరువైనా జారిపోని వాస్తవాల్ని మోసుకొని పోవడం సులభం. ప్రవాహాశ్వంపై రవిలా పయనించే నాలో సమాజం అల అలయై తాకుతుంది, కదలుతుంది పై నుండి కొత్త అలలతో ప్రవాహం మార్పుకి సంకేతం. కట్ట వేసిన నీటిలో నీరజం, సహనానికి పొందిన బహుమానం. మూసిన సమాజం తలుపులు తెరచే లోపల బయట నుండి కిరణం ప్రవేశించే లోపల, హింస ఎటు వైపు నుండి దూరేదీ తెలీదు సహనం ఎటు వైపుకు మరలేదీ తెలీదు. నేరంలో వాస్తవానికి పైకి కన్పించని హేతు బీజం దరిద్రమో అన్యాయమో అవమానమో అణచివేతో! దరిద్రం అవనిపై హద్దుల్ని అతిక్రమింపజేస్తుంది అన్యాయం రవిని చూపుడువేలుతో ప్రశ్నిస్తుంది.
14. స్వేచ్ఛకు సిగ్నెల్ అవమానం చేతిలో ఎరుపు బల్బుని వెలిగిస్తుంది అణచివేత ఆకాశాన్ని పిడికిట్లో బంధింపజూస్తుంది. దీనికై నిరీక్షణ! శిఖర శిఖరంపై
దీనికై అన్వేషణ హృది హృదిలో దీనికై స్పందన అణువణువునా దీనికై ఆలోచన పదపదంలో. చెట్టుకి కట్టేసి మనిషిని సమాజంలో చెట్టును సైతం తగలేసే దృశ్యమూ కన్పించకపోదు. ఊహ ఆకులా తేలిగ్గా రాలుతుంది బాధ రాయిలా బరువుగా దొరలుతుంది. వనిలో హరిణం గంతులేస్తూ కనిపిస్తుంది దిశగా అశ్వం పరుగు తీస్తూ పోతుంది. తలుపులు మూసినా కిటికీ నుండో సందునుండో వదనంపై కిరణం గులాబిలా వాలుతుంది. గుండెపై గాయాన్ని తనలో హత్తుకుంటుంది గుండెకూ గులాబికీ భేదం లేదనిపిస్తుంది. అడపా దడపా కిరణంపై దాడి జరక్కపోదు అపుడది చేతిలో ఆయుధమై కూడా నిలవచ్చు! ఆలోచనా జలంలో లోతుల్ని చూపిస్తుంది. అనుభవానికి ఎత్తు వంపుల రేఖాచిత్రాన్నిస్తుంది. వెలుగు నుండి ప్రశ్నను విడుదల చేస్తుంది. వెలుగులో పరిష్కారాన్నీ సూచిస్తుంది కిరణం ప్రగతికి వాహం కిరణం స్వేచ్ఛకు సిగ్నెల్. 647648
II. కిరణ పథం
3. స్విచ్ ఆన్ కొత్త ప్రపంచంతో మజిలీ వేరవుతుంది కొత్త స్పందనతో అస్తిత్వం మారుతుంది.
15. గమ్యం నుండి గమ్యానికి మనిషి మనిషి పరిచయంతో కొత్త కోణమేర్పడుతూంది.
మజిలీ మజిలీకీ దూరదూరం సమాజం దగ్గరవుతూంది. రూపం అరూపం ఒకదానివెంట మరొకటి వైరుధ్యం సహయోగం ఒకదానితో మరొకటి. అనుభవ చలనంలో బ్రతుకు పాఠ్యగ్రంథమవదు నిర్ణయ సూచిని బట్టి ప్రయోజన శక్తులు కదలవు. నిష్కానికో మంత్రం చదివినా రూపాయికో పద్యం అల్లినా లో విలువల చక్రాలపైనే మనిషి మహిత భవితవ్యం. ఒత్తిడి ఎక్కువయినకొద్దీ విలువలు ప్రశ్నకు గురి అవుతాయి. కొత్త విలువలతో కొత్త మజిలీతో చిరునామా మారుతుంది. పది తలలున్నా చేసే ఆలోచన ఒకటే పది కాళ్ళు ఉన్నా చేరే గమ్యం ఒకటే అస్తమయం ఎరుగని సూర్యుడు మనిషిలో మనిషి కిరణానికి భేదం లేదు, పయనానికి హద్దుల్లేవు. కిరణం వెంట కిరణం, పదం వెంట పదం వాక్యంలో సరికొత్త అర్థంకై అన్వేషణ, పయనంలో. ఊరు ముద్ర స్మృతిలో ఈదుతూ కన్పిస్తుంది ధైర్యంలో ఆశ, కొండల్నీ లోయల్నీ దాటిస్తుంది నిర్భయంగా ప్రేమ నెత్తుర్నీ గాయాల్నీ తుడిచేస్తుంది మానవత మెరుపై హృదిహృదినీ సూత్రంలో బంధిస్తుంది. మాటలు నేర్చిన చిలక మౌనంగా ఉండలేదు ఉపదేశం పలుకుతుంది! ఎవరి దారి వారిదే! చివరకు.649 సమయం మేఘమవుతూంది, ఆశ ఆకాశమెక్కేను, కాని వెలుక్కి ముసుగేస్తూంది, సూర్యుణ్ణి మాయం చేస్తూంది సందేహాల్ని మెరుస్తూంది, సమస్యల్ని గర్జిస్తూంది సమయం మేఘమవుతూంది, మనిషి దీన్నే కోరేను. మండే గాయాల్ని తుడిచీ బాధల్ని మరిపించే మేఘం, కొత్త ఊపిరితో సమాజ రూపానికి ఆయువు పోస్తూంది. లలిత లలితంగా కదలుతూంది, కఠోరంగా శబ్దిస్తూంది కరుణ చిలుకుతూనే, కత్తుల్నీ మెరపిస్తూంది. నేలపై జలదం లిపి, మనిషి మనిషికీ బాగా తెలుసు దున్నే నాగలికి తెలుసు! నేలపై విత్తుకు తెలుసు. నాలుగు మబ్బులు కలిస్తే చాలు! నిరభ్యంతరంగా చినుకులతో మెరపులతో ధారా సంవేదన ధునితో సంగీత కచేరినో కవితా సమావేశాన్నో తలపిస్తుంది.
జలదం కురిసేముందు వాతావరణ ప్రాంగణం రైల్వే ప్లాట్ఫార్్మ పైకి రైలు చేరేముందు కదలే కోలాహల జనసమూహాన్ని తలపిస్తుంది. మేఘానికి ఎడారీ, వనమూ భేదం లేదు పిల్లలకు మహాఇష్టం! పెద్దలకు చిరుభయం! మేఘం మేఘానికీ జనస్వామ్యమతికీ ఆగడం తెలీదు. జనచేతనకూ యువశక్తికీ విరామం లేదు.
16. సమయ మేఘం
17. ఆయుధం చివర ఓ పూవు! జలధి వీపుపై పడవల్లా గగనాన కదలే మేఘం ఏకాంతం నుండి బయల్దేరీ సమాజానికే అర్పితం. పిల్లల మనసులో కొత్త అనుభవం రెక్క విప్పుతుంది వృద్ధు మనసులో పాత స్మృతులు గంతులు వేస్తాయి.650 మబ్బు ఎత్తునీ దూరాన్నీ కోరుతుంది నీరు, లోతునీ ప్రసారాన్నీ కోరుతుంది. ఆశకు హద్దుల్లేవు, కల్పనకు నియతి లేదు. చంద్రుడు వెండి నాణెం అవచ్చు సూర్యుడు బంగరు నాణెం కావచ్చు. వెండి నాణెం కోసం ఆరాట పడినా బంగరు నాణెం కోసం ఆవేదన పడినా హేతు గతిపైనే, వాస్తవ జీవిత చలనం! తరాల సంస్కృతీ ప్రభలోనూ చీకటి వీడని మనిషిలో జలదంతో ఆయుధం చివర ఓ పూవు పూస్తుందనే ఆశ! సూర్యుడో వైపునుండీ చంద్రుడో వైపునుండీ మానవతా సుమం కోసం వెదుకుతూనే ఉంటారు. కొండల్ని తొలిచే సాహసంతో హింసకు వేసిన ద్వారం నుండీ శ్రేణులుగా హంసలే కాదు, మాలలుగా మబ్బులూ వస్తాయి. తపించే మనిషికై స్నేహబిందువుతో శాంతి సందేశంతో.
టార్్చ చేసిన రైలు పెట్టె తగలబడిన మనుషులతో బొగ్గు కుప్ప అయింది. బాంబులు ప్రేలీ మంటలు రేగీ ఇళ్ళకు ఇళ్ళు ఆవాసం అగ్నుల్ని తొడిగినట్లుంది. తలకు పొగల్ని చుట్టినట్లుంది. కమురు వాసనతో శరీరాలు నేలపై ఆరీ ఆరని దివిటీల్లా పడి ఉన్నాయి. గ్రెనైడ్లతో బులెట్లతో రక్తసిక్తమైన అక్షరధామంలో
18. చీకటి చరణం క్రింద పిల్లలూ పెద్దలూ నేలపై పగిలిన ట్యూబ్ లైట్ లా పడి ఉన్నారు.651 ఒక్కొక్క విషాద ఘటన మధ్య క్షణాలు అగ్గిపెట్టెలో నిప్పు పుల్లల్లా ఎపుడు బయట పడి గీయబడి జ్వాలారాగం వినిపించేదీ తెలీకుండా ఉంది. అమాయక జనంపై మృత్యువు ఇనుప గోళ్ళతో పొంచి ఉంది రాజకీయ వ్యూహంలో మృత్యువు జయకేతనాన్ని విప్పజూస్తుంది. తూటా దూరిన దేహం నుండి మానుషీయం దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడుతూంది. చుట్టూ కళ్ళు ఆర్ద్ర కిరణం కోసం ఎదురు చూస్తున్నాయి చుట్టూ ముఖాలు ఉదార పవనం కోసం వేచి చూస్తున్నాయి. రాయి నుండి పెటో బాంబు వరకూ ఆటవిక ఘట్టనలో ఈ గాయాలు, ప్రజాస్వామ్యానికే కాదు మానవ చిర సంస్కృతికీ చెరగని ప్రశ్నల చిహ్నాలు! ఇదో జాతి మతం ప్రాంతంపైనే కళంకం కాదు మానవ సమాజవదనంపై వేసిన చీకటి చరణం! అనల ప్రవాహంలో సమయం మునిగి తేలుతూంది ముక్కలు ముక్కలై కాలం కదల్లేని స్థితిలో పడింది. పట్టపగలు మంటలతో మారణ కాండ నర్తిస్తుంది. రవి కిరణం అడుగు వేయడానికి భయపడుతూంది. రాత్రికి రాత్రి పొగలతో ధూమ పంక్తులు నడిచేను
శశి కిరణం చేయి చాచేందుకు భయపడుతూంది. నిజం నెత్తురోడుతూ అనాథలా భ్రమిస్తూంది నిలిచి నిలిచి మధ్య మధ్య గమ్యంకై వెదుకుతూంది.
19. దొరకని వెలుగు భాష చెదరిపోతూంది మాట బొమ్మ ముక్కలైపోతూంది అర్థం గంధాన్ని కోల్పోతూంది, మిగిలేదొకటే ఇక! ఎవరో కాదు! 'కీ’ ఇస్తే రెండు కట్టెలపైన నడిచే మనిషి! ఉపదేశానికీ ఆచరణకూ మధ్య అఖాతం రక్తసిక్త జలాలతో నిండిపోతూంది. కత్తిపోట్లకూ విస్ఫోటాలకూ ముక్కలు ముక్కలయిన సమయ దర్పణం సందుల్లో నుండి పరుగెత్తే మనిషి నీలిబింబం! ఎవరూ గుర్తుపట్టలేకుండా ఉంది! వెండి ప ్ళరంలో బహుమానంగా మానవత ఎదురవదు దీనికెన్ని అవరోధాలో! విరోధాలో! దొరికినట్లే వెలుగు దొరక్కుండా పోతూంది. దూర దూరం నుండి ఎగసివచ్చే పెను తుపాను ఒకే ఒక సమయ చపేటంతో చెదరిపోతుంది. రాలే ఆకులో మిగిలిన చిట్టచివరి కోరిక నక్షత్రమై పూవునో పండునో స్వప్నిస్తూంది. గ్రీష్మంలో మామిడి పూస్తేనే ఫలిస్తేనే సృష్టికందం మనిషిలో ఎద పలికితేనే ఒలికే తేనే బ్రతుక్కి అందం. మనిషిలో భయంకరమైన కోరిక ఏదో సమయం
20. జన దర్పణం ముందు అడవినుండో గుహనుండో బయటపడే జంతువో మృగమో కావచ్చు. మనిషిలో పయనం ప్రవాహం కావడం జీవితం మనసులో అనుభవం సరస్సు అవడం అవసరం! బెజ్జం నుండి జారే మట్టి కుండలో నీరులా సమయం కదలిపోతూంది! క్షణాల్ని నెడుతూ!653
జీవితం చెట్టుకు పూచే పూవూ కాదు, పండూ కాదు, చలనంలో ఘర్షణతో బంధంతో నిరంతర పరిణామ నవం. మృత్యువు చుట్టుకున్న మానవ బాంబు విస్ఫోటంతో కిరణాలు పొగచూరేను! పూలు గాలిలో మాడిపోయేను! జ్వాలా శలాకల బోనులో సూర్యుణ్ణి ఆదుకునే సాహసం ఎవరికుంది? ఒక్క మానవతా హిమ హృదయానికి తప్ప! అనల సదృశాలైన ప్రశ్నలకు అనలసమాలైన జవాబుల్లో, చేసేదేముంది? ఎదలో ఉదార జలదంకై నిరీక్ష తప్ప! ఒక్కోరోజు ఒక్కో పుటలా తిరిగిపోతూంది పుట పుటలో వాక్యాలు ప్రయాణ చిహ్నాలైపోయేను. అలసిన కను రెప్పలపై రాత్రి నెమలి ఈకలా కదులుతూంది తెరచిన కళ్ళ ఎదుట సమయం! జన దర్పణమై నిలుస్తుంది. రణమో రణసదృశమో! ఎవరికొరకు? మారణం ఏ నేతలోనో జృంభమాణ అహంభావ తృప్తికై. వ్యూహంలో సైనికులై అడవుల్లో కొండల్లో ఉదగ్రులై పొగల్లో సెగలతో అనల సదృశమూర్తులు! ఎక్కడో పేలిన ధ్వని సూటిగా శత్రువుల్ని మెరపిస్తూంది గాయాలతో బయటపడొచ్చు, ప్రాణాలూ ఎగిరిపోవచ్చు. గన్ మ్రోతకు చెట్లు వణకేను, గిరులు నివ్వెరలో మునిగేను ఈనాటి రణానికి రాత్రీ పగలూ భేదం లేదు ఈ పోరు తమకోసమేనన్నట్లు ఉత్సాహపడేరు ఇరువురు నేతల చేతలు కలిస్తే వీరు, ఎవరి దారి వారిదే. ఇక్కడ గుండె ఇనుప గుండె అయితే తప్ప నిల్వడం కష్టం తీరిక వేళలో ఊహలో మనస్సు పుష్పగుచ్ఛమవుతుంది.
21. రణం రణ సదృశం పరివార వాతావరణాన్ని కోరే మనుషుల కళ్ళు రాత్రి నక్షత్రాల ఆకాశాన్ని చూచి స్తిమితపడేను. సమయం అనల కంటకాల్లో చిక్కుకున్నట్లుంటుంది. హతులే కాదు క్షతులూ వారి బంధువులూ మిత్రులూ ఎందరో! వీరి కన్నీరు తుడిచేందుకెన్ని చేతులయినా చాలవు వీరి జీవితాల్ని సరిదిద్దేందుకు విధి సాహసించడం లేదు హతులై భర్తో తండ్రో, కొడుకో, సోదరుడో, అభద్రతలో
తెగిన దండ నుండి ముత్యాల్లా ఎవరికి వారు జారిపోయేరు. బొమ్మతో వర్తమానం! చేతిలో నిలిచినట్లుంటుంది బొమ్మతో భవిష్యత్తు! తన అంచుల్లో ఉన్నట్లుంటుంది. ఏ గీత మచ్చ లేని అద్దంలో సూర్యునిలా శిశుహృదిలో బొమ్మ అస్తమయం ఎరగని బింబం! అడుగులు తడబడుతున్నా బొమ్మ చేతిలో ఉండాలిసిందే! పడుకున్నా నిద్రిస్తున్నా బొమ్మ ప్రక్కనే ఉండాలిసిందే! తనకన్నా ముందు బొమ్మకేసే ఆకలి గుర్తుకువస్తుంది తనకన్నా ముందు బొమ్మ పొందే ఆయి! బాధ! తెలుస్తుంది బొమ్మ జారిపోతే గుండె జారినట్లుంటుంది జీవిత బంధమేదో తెగిపోతున్నట్లుంటుంది. బొమ్మ గురించి ఊహ! సీతాకోక చిలుకలా తిరుగుతుంది బొమ్మ గురించి ఈహ! ముళ్ళులేని గులాబిలా హత్తుకుంటుంది. తనతోపాటు దీనికీ నిద్ర! మెలకువ! దుఃఖం! సంతోషం! ఏ రహస్యమూ లేదు! అంతా సశబ్దమే! సప్రకాశమే! ఒక మెట్టు ఎక్కితేనే మరో మెట్టు ఎదురయ్యేది ఒక అల కదలిపోతేనే మరో అల కదలివచ్చేది తేలికైన మంచు అద్దిన ఉదయం, శిశువు మనస్సు మంచు అదృశ్యమై యువకవోష్ణమవుతుంది. చిన్ని లోకం నుండి పెద్ద లోకం పరిచయమవుతుంది అమ్మానాన్నతోపాటు మోడల్్స మరొకరు మరొకరు ప్రవేశించేరు. క్రితం వరకూ ఉన్న స్థితి ఇపుడు చెదరిపోతూంది కదలే పెద్దల చేయి పట్టుకొనీ చిన్నారులు భుజాలపై కూర్చునీ శిశుమూర్తులు! కళ్ళలో నీరు ఎండి గ్రీష్మంలో బావుల్ని తలపించేను ముఖంలో రాగం తరిగి శిశిరంలో తరువుల్ని తలపించేను. ఎక్కడో పక్షి! భయపడుతూ భయపడుతూ ఎగురుతూంది అక్కడో ప్రవాహం! పాట మరచి ఆట నిలిపి కదలుతూంది. శిశువుకు చేతిలో బొమ్మ ఆనందధామం ఎపుడైనా ఎక్కడైనా మాట్లాడే అవకాశరూపం తనలో కదలే ఊహల్ని బొమ్మకు చెప్పేను ఆ బొమ్మ చెప్పలేని మాటలూ తనే పలికేను. చిన్ని చిన్ని లహరుల్లా కదలే అడుగులతో
22. బొమ్మతో అనుబంధం ఆటతో పాటతో చేతిలో బొమ్మతో స్వేచ్ఛకు ఆరాటపడేను ఎవరైనా ఆపితే భయంతో పరుగెత్తే శిశువు నెమలి ఈకల చేతుల్ని! అమ్మ అందుకునేను. శిశువుకు చేతిలో బొమ్మ విలువైన వస్తువు దీనిముందు స్వర్ణం కరెన్సీ అయినా దిగదుడుపే వెచ్చని మాతృ హృదయం తప్ప! ఆమె చల్లని చేతులు తప్ప! పరిమితుల్లో నుండి బయటపడే కోరికతో ఎక్కడికక్కడ తలుపులు తెరుచుకునేను ఇంతవరకూ స్వార్థమెరుగని శిశుహృదయం లౌకిక ముద్రలతో రేఖలతో రూపం మారేను. క్రమంగా తనకూ బొమ్మకూ భేదం లేకుండా పోతుంది మెల్లగా తననుండి బొమ్మ దూరమయిపోతుంది! మనస్సులో దిగిపోయి, ఎక్కడో నిలిచిపోతుంది! వెనకనుండి కదిలించే బొమ్మలే లేకపోతే! అంతా శూన్యమే!656
4. సృజనకు స్విచ్ ఆన్ చేస్తే చీకట్లో బల్బు పూలపందిరి అవుతుంది స్విచ్ ఆన్ చేస్తే దారిలో మందుపాత్ర మృత్యువు అవుతుంది బ్రతుకులో వ్యూహరచన ఇప్పటిది కాదు మనసులో రణేచ్చ ఇప్పటిది కాదు. గునపానికో బాంబుకో కూలిన శిథిలాలు శకలాల సమాకలనంతో నిర్మాణం ఎన్నటికీ కుదరదు. మనిషితో మనిషి పోటీ పడినప్పటిదీ రణం మనిషితో మనిషి బ్రతికే కథతోనే బంధం ఆరు ఋతువులూ మనిషిలో భ్రమిస్తూంటాయి ప్రకృతి క్రమంలో కాక, జీవిత విధంలో. ప్రతిరోజు చేతిలో ఖడ్గ కిరణాలతో అవతరించదు ప్రతిరోజు చూపులో హంసీ యానంతో నిష్క్రమించదు. స్పందనతో హృదయం, చలనంతో సమాజం మనిషి హృదయంతో సమాజం, పృథ్వీ సహనంతో సమాజం
విజయంతోపాటు అపజయాన్నీ వహిస్తుంది మేధావితో పాటు ఉన్మాదిని సహిస్తుంది. ఒక్కో అల క్రమం తప్పని ఒక్కో స్థితి ముద్రతో సముద్రాన్ని చూస్తే సమాజం గుర్తుకువస్తుంది. రంగురంగులతో వివిధ రేఖలతో భిన్న కోణాలతో ఒక్కొక్కపుడు సమాజం! ఆకాశాన్ని తలపిస్తుంది. మెరపులతో పిడుగులతో భయపెడుతుంది కాని మబ్బులతో చినుకులతో ఆర్ద్రతనూ చూపుతుంది.
23. ప్రతిరోజు
24. స్పందనతో నేలపై చిందే నెత్తురు చిత్రంతో జీవితాన్ని ప్రదర్శించడం గుండెలో దిగే బాకులోయతో బలం విలువ కొలవడం శ్మశానానికో సమాధికో కొత్తదారులే వేయడమే మనిషిలో మానవతా ప్రవేశానికి ద్వారాలను మూయడమే. చీలికలో పేలికలతో సమాజాన్ని ఒకటిగా నిలిపలేని హింసకు వేసే ద్వారం నుండి హంసల్ని నడిపించలేం. భీభత్స కాండ నుండి శాంతిని మీటాలనుకోడం వికటించిన మేధతో ఉన్మాదంలో పోటీ పడడమే. ఎంత పెద్ద జయస్తంభయినా గగనం ముందు శిశువే! ఎంత మండే సూరీడయినా నీటి గ్లాసులో తేలాలిసిందే! స్విచ్ ఆన్తో శబ్దం అర్థాంతరం పలుకుతుంది. స్విచ్ ఆన్తో మనస్సు కొత్త జగం చూపుతుంది. కిరణం కదులుతుంది, పేపర్ పయి స్క్రీన్ పయి లిపితో శబ్దంతో రేఖలతో చిత్రంతో. దీనికి రహస్యం లేదు, సంఛన్నమూ లేదు ఉందొకటే మనస్సు పలికే విధం, చూపే పథం. కిరణం కదలుతూంటే వెనువెనుక నుండి పక్షులు శ్రేణులు శ్రేణులుగా కదులుతాయి. పూలు పంక్తులు పంక్తులుగా అమరుతాయి. మనుషులు పాత్రలు పాత్రలుగా వెలుస్తారు.
కిరణం ప్రసరిస్తుంది బహువిధ కోణాల్లో ఇది నిజజీవితానికిస్తుంది వివిధ రూప నిర్మాణం మిత్రమై బంధువై అతిథియై అవతరిస్తుంది దీనికో సమయం లేదు. పగలైనా రాత్రి అయినా సరే!
25. కొత్తజగం
26. సృజన కిరణం దీని సృజన రూపమేదైనా కావచ్చు! దశదశల్లో సూర్యుడో! దీపమో! ఆత్మో! కిరణం కదులుతుంది చీకట్లోనూ మస్తిష్కంలో అనలమై ఉత్సాహంతో, అలయై ఉదారంతో. ఫాలంపై వాలుతుంది, కళ్ళలో సరిస్తుంది. మనసును బంధిస్తుంది, ఆశా సూత్రబంధమై. శాంతికీ ప్రేమకూ ద్వారరూపమవుతుంది మాటకూ పాటకూ ఆర్చి అందమవుతుంది. కిరణగమనం? శూన్యం నుండి శూన్యానికి మనిషి పయనం! శూన్యం నుండి శూన్యానికి మధ్య అవనీ ఆకాశంతో ప్రపంచం మధ్య శాంతి సంఘర్షణతో సమాజం. అద్దం లాంటి మౌనం సచిత్రమవుతుంది మౌనం లాంటి శబ్దం బహ్వర్థకమవుతుంది. నలువైపుల మహా శూన్యం గుండ్రంగా దిశదిశలో తలుపులు తెరచే ఉంటాయి ద్వారం నుండి ద్వారానికి జీవిత చలనంలో కిరణంతో శూన్యం పరిపూర్ణత పొందుతూంది. కిరణం కదలుతుంది పేపర్ పయి స్క్రీన్పయి జీవితాన్ని అల్లుతుంది తంతువాయు పటంలా సమాజాన్ని నిర్మిస్తుంది, శక్తుల సమవాయంతో కిరణం మానవతకు సంకేతం, సృజనకు స్విచ్ ఆన్. మాదిరాజు రంగారావు కృతులు - 1953-2025 A) స్వేచ్ఛా కవిత్వం
- I. స్వేచ్ఛా కవిత్వం - మొదటి సంపుటం రచనా కాలం 1953 2002 i. స్వేచ్ఛా నవం : 1. మానవీయం 2. పడగెత్తిన ఉదయం 3. ముక్తధాత్రి 4. ఇది వియత్నాం 5. యుగ సంకేతం ii. 6. ఆవాహనం iii. 7. ముక్తకాలు. iv. సమయ దర్పణం : 8. నాలో ప్రవహిస్తోంది నది 9. నాకు జ్ఞాపకముంది v. 10. కిర్మీరం 11. మనోభూమికలు vi.
వర్తమానం
స్క్రీన్ పై : 12. వెలుగులో ఈ నేలపై 13. మేల్కొన్న ఈ సమయం 14. శబ్దమయి ప్రాణమై
15.
అగ్నిమయం జీవితం 16. కాలాన్ని నిలిపి క్షణం 17. ఈ తరం స్వరచిత్రం 18. అశాంతి
ఆర్కెస్ట్రా
19. వర్తమానం స్క్రీన్పై Vii. 20. అగ్ని నుండి ఆనందానికి viii. ఈ శాతాబ్ది రెక్కలపై 21.
జైలు
కార్నర్ నుండి 22. ప్రయాణం నుండి ప్రయాణం 23. డైరి దర్పణంలో 24. ఈ శతాబ్ది
రెక్కలపై
25. శాంతి స్వప్నం ix. అగ్నిపిఠం 26. క్రాస్ ఫైర్ 27. సీజ్ ఫైర్ 28. నేడు రేపు మధ్య X. 29. కిరణ పథం 30. స్వేచ్ఛకు సిగ్నెల్ *II. స్వేచ్ఛా కవిత్వం - రెండో సంపుటం రచనా కాలం 2003 - 2012 31. అభిషేకం 32. ఆగమనం 33. ఎప్పటికీ కొత్తే 34. సృజన దర్శనం 35. మరో వైపు 36. హృదయ మేఘం 37. సమకాలీనం 38. అభినవ యానం 39. ఆత్మ బంధం 40.
సృజన
మేఘం 41. ఉగ్ర చరణం 42. సవారంభం 43. గిఫ్ ప్యాకెట్ 44. నవ దర్శనం 45.
పునర్దర్శనం
46. నడిచే వెలుగు చుట్టూ 47. అపూర్వ 48. అజ్ఞాతం నుండి 49. రోజు వస్తుంది 50.
ఉద్యమ
చరణం 51. ఆల్బంలో ప్రజాస్వామ్యం 52. అద్దంలో ప్రజాస్వామ్యం 53. ప్రవాహంలో
ప్రజాస్వామ్యం
*III. స్వేచ్ఛా కవిత్వం - మూడో సంపుటం రచనా కాలం 2013-2015 54. ఖడ్గం కన్నీరు కార్చదు 55. చార్ ధామ్ 56. ఆల్ ఇన్ వన్ 57. ఉద్యమ పథం 58.
అడవిలో
ఆయుధం 59. చెదరిన ప్రజాస్వామ్యం 60. గాయ పడిన ప్రజాస్వామ్యం 61. ఈనాటి నిజం 62. ఇంకా బహు దూరంలో ప్రజాస్వామ్యం 63. సంస్కృతి హృదయం నుండి 64.
తెలంగాణ
స్వరం, ఆత్మబంధం *IV. స్వేచ్ఛా కవిత్వం - నాలుగో సంపుటం రచనా కాలం 2015 నుండి 2018
65. వర్తమాన స్వనం 66. లైన్ క్లియర్, 67. వర్తమాన వాస్తవం 68. వర్తమాన లహరి 69. వర్తమాన యానం 70. వర్తమాన సంకేతం 71. ఇదే దారి 72. నవ మానవం 73.
ప్రపంచీయం
74. హృది కిటికి నుండి 75. కార్నర్ కవితలు V. స్వేచ్ఛా కవిత్వం - ఐదో సంపుటం రచనా కాలం 2017 నుండి 2019 ఇది జీవితం : 76. ప్రశ్నలతో ఇప్పటికీ 77. బ్రతుకులో కవితయై 78. గమ్యంపై గురితో 79. అస్మితలు, అస్తితలు 80. వాస్తవ చక్రంపై 81. ఎవరి దారి వారిది 82. అశాంతి పరిచయం
83.
కవిత నా ఆత్మ 84. కాలం కప్పులో 85. నిప్పు రెక్కలపై 86. సమాప్తి కాదు 87. కాలానికి కృతజ్ఞతలు 88. సమయ పథం 89. ఇది అందరిదీ 90. సమాంతరం 91. ప్రాణం కన్న మిన్న
92.వర్తమానం
ఆనవాలు
93.
నీడ
నుండి
వెలుగులోకి
94.
అక్షర
ముకురం
95.
జీవితం
స్వతంత్రం
96. కాలంతో నేను 97. కర్తవ్యంలో కవిత VI. స్వేచ్ఛా కవిత్వం - ఆరో సంపుటం రచనా కాలం 2019 నుండి 2020 98. ఏది కవిత 99. వర్తమానం ముందుకే 100. మార్పుకు సిగ్నల్ 101 కవిత ప్రభుతతో 102 హృదయ దర్పణం 103. నేను నేనే 104. స్వేచ్ఛలో స్వతంత్రం 105. భవితకు
సంకేతం
106. అక్షరంలో స్వేచ్ఛ - సమాజ యానం 107. స్వేచ్ఛలో బంధనం 108. కాక్టెయిల్ *VII. స్వేచ్ఛా కవిత్వం - ఏడో సంపుటం రచనా కాలం 2020 నుండి 2022 109. రేపటికి రిజర్వులో 110. అక్షతం 111. లాక్ డౌన్ 112. వర్తమానం మెట్లమీంచి 113 అజేయం 114 ఈ వారం కవిత 115. గుడ్ బై 116. అక్షర హృదయం 117. గాయ
పడిన
శాంతి 118. వార్తలో కవిత 119. నిప్పులపై మేఘం 120. తెలియని వాస్తవం *VIII. స్వేచ్ఛా కవిత్వం - ఎనిమిదో సంపుటం రచనా కాలం 2022 నుండి 2023 121. మార్నింగ్ వాక్ 122. విప్లవ ప్లవనం, స్వేచ్ఛలో మనోజ్ఞం 123. అదృష్టం 124.
మేల్కొన్న
కవిత 125. ఆగని పయనం 126. కవిత్వమొక థెరపి, తెలంగాణ స్వరం *IX. స్వేచ్ఛా కవిత్వం - తొమ్మిదో సంపుటం రచనా కాలం 2023 127. హృది నుండి హృదికి 128. రౌండ్ టేబుల్ 129. మానస తంత్రులపై 130. సరికొత్తగ 131. ఆశానవం 132. మౌనం మాట్లాడుతుంది 133.శిల నుండి రసాకృతి 134. అశాంతి
చక్రంపై
135. మేనిఫెస్టొ X. స్వేచ్ఛా కవిత్వం - పదో సంపుటం రచనా కాలం 2024 136. కవిత సర్వ స్వతంత్రం 137. ఇది మలి తెలంగాణ 138. నిజయానం (బొన్సాయ్
అనంతం) 139. స్వేచ్ఛామేఘం, మెరపులు తలపులు 140 స్వేచ్ఛా పవనం * XI. స్వేచ్ఛా కవిత్వం - పదకొండో సంపుటం రచనా కాలం 2025 141. జీవన దర్శనం 142. అద్దంలో అనల చిత్రం 143. ముక్తకాలు 144. ఆశాబద్ధం B) పరిశోధన - సమాలోచనం 1. కవిత్రయం సృజనకళ (సిద్ధాంత గ్రంథం) 2. నవల స్వరూపం 3. పరిశోధనా స్వరూపం 4. అధికార భాష 5. అనువాద కళ 6. దాశరథి కవితా సమాలోచనం 7. ఆలోకనం 8. సమదర్శనం 9. సృజన రూపం- మానవీయ భావన 10. సృజన చేతన - భావ రూపాలు 11. Facets of to Free-verse 12. శ్రీశ్రీ మహా ప్రస్థానం సమాలోచనం 13. రామాయణ కల్పవృక్షం-సృజన చేతన 14. స్వేచ్ఛా కవిత్వం ప్రజాస్వామ్య దర్శనం 15. స్వేచ్ఛా కవిత్వం మానవీయ దర్శనం 16. స్వేచ్ఛా కవిత్వం - సహృదయ స్పందనం 17. గురజాడ ఆధునిక చేతన (2013) 18. కవితా సమాలోచనం-2017 19. కవితల సమాలోచనం 2019 20. సాహిత్య విమర్శ వ్యాసాలు
-సంక్షిప్త పరిచయం మాదిరాజు రంగారావు గారి జననం జూన్ 8, 1935న పండితాపురం గ్రామం, ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం. మాదిరాజు రంగారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి నిజాం కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ (O.U), హైదరాబాద్, తెలంగాణలో చేరారు. మాదిరాజు రంగారావు తెలుగు మరియు సంస్కృత సాహిత్యంలో M.A. సంస్కృతం 1960 (O.U), M.A. తెలుగు 1962 (O.U), Ph.D. తెలుగు 1966 (O.U) మరియు యూనివర్శిటీ గ్రాంట్్స కమిషన్ (యు.జి.సి, UGC) యొక్క పరిశోధనా పండితులు. డాక్టర్ మాదిరాజు రంగారావు ఆంధ్ర మహాభారతం మరియు ఆంధ్ర మహాభాగవతం యొక్క విమర్శనాత్మక సంచికా సంపాదక మండలిలో సభ్యులుగా ఉన్నారు. 1964లో హైదరాబాద్లో
ని
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో డాక్టర్ రావుకు మొదటి విద్యా సంబంధ
నియామకం
లభించింది. ఆ తరువాత తెలంగాణలోని వరంగల్లో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలో
ఆచార్యులుగా,
బోర్్డ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్గా మరియు డీన్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆచార్య రావు
యు.జి.సిచే
మంజూరు చేయబడిన రెండు ప్రధాన పరిశోధన ప్రాజెక్్ట గ్రాంట్లకు మరియు భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ, న్యూఢిల్లీచే స్పాన్సర్ చేయబడిన ఒక పరిశోధన ప్రాజెక్్ట గ్రాంటుకు
ప్రధాన
పరిశోధకులుగా ఉన్నారు. ఆచార్య రావు 'రసధుని సాహితీ పరిషత్తు' అనే సాహిత్య
సంస్థకు
వ్యవస్థాపకులు
మరియు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రముఖ కవి, రచయిత మరియు సాహిత్య విమర్శకులైన
ఆచార్య
మాదిరాజు రంగారావు, సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక కవిత్వం మరియు విమర్శతో
సహా
తెలుగు
సాహిత్యం యొక్క వివిధ ప్రక్రియలకు విస్తృతంగా సేవలనందించారు. మాదిరాజు
రంగారావు
గారు
తమ స్వేచ్ఛా కవిత్వం మరియు సాహిత్య విమర్శ రచనల ద్వారా సమకాలీన ఆధునిక
తెలుగు
సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రముఖ పత్రికలైన
భారతి,
స్వతంత్ర,
స్రవంతి, జయంతి, ఆకాశిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రభూమి
వంటివి,
మాదిరాజు రంగారావు గారి సృజనాత్మక రచనలను క్రమం తప్పకుండా ప్రచురించాయి. ఆచార్య మాదిరాజు రంగారావు కవిత్వానికి మూల స్తంభం మానవతా ఆదర్శాలు మరియు శాంతికి ప్రతీకగా నిలిచే ప్రజాస్వామ్య దృక్పథం. ఇదే వారి స్వేచ్ఛా కవిత్వానికి ఆయువు
పట్టు.
మాదిరాజు రంగారావు గారు స్వేచ్ఛా కవిత్వ ప్రక్రియలో సాగించిన ప్రస్థానం వారి విశిష్ట
వ్యక్తిత్వం,
సామాజిక స్పృహ, మానవతా భావాలు, ప్రజాస్వామ్య సామ్యవాద సామరస్య దృక్పథం
మరియు
శాంతి సందేశం ద్వారా సుసంపన్నమైంది. మాదిరాజు రంగారావు గారి 'పరిశోధన మరియు
సాహిత్య
విమర్శ' రచనలు సాంప్రదాయ సాహిత్యం, సాహిత్య ఇతివృత్తాలు, భావజాలాలు, మానవ
అంశాలు
మరియు సార్వత్రిక దృక్పథం యొక్క సృజనాత్మక మరియు కళాత్మక విశ్లేషణపై దృష్టి
పెడతాయి.
తన
సుదీర్ఘమైన మరియు అత్యంత ఫలవంతమైన సాహిత్య జీవితంలో, ఆచార్య మాదిరాజు
రంగారావు
యొక్క సృజనాత్మక రచనలు జూన్ 21, 2025న వారు కాలధర్మం చెందిన నాటికి 'స్వేచ్ఛా
కవిత్వం’
పై 150కి పైగా, సాహిత్య విమర్శపై 20కి పైగా, మొత్తం సుమారు 170 పుస్తకాలుగా
వెలువడ్డాయి.
BRIEF SKETCH Madiraju Ranga Rao was born on June 8, 1935, in Pandithaapuram village, Khammam, Telangana. Madiraju Ranga Rao completed High School Education from Govt. High School, Khammam and joined Nizam's College Osmania University (O.U), Hyderabad, Telangana. Madiraju Ranga Rao was a student of Telugu and Sanskrit literature, obtained M.A. Sanskrit 1960 (O.U), M.A. Telugu 1962 (O.U), Ph.D. Telugu 1966 (O.U) degrees and was a research scholar of the University Grants Commission (UGC). Dr. Madiraju Ranga Rao was a member of the Editorial Board for the
critical
editions of Andhra MahaBharatham and Andhra MahaBhagavatham.
Dr.
Rao's
first academic appointment in 1964 was with the Department of
Telugu,
O.U,
Hyderabad, then a long tenure at Kakatiya University, Warangal,
Telangana
as
Professor, Chair Board of Studies, and Dean for Faculty of Arts
followed.
Prof.
Rao was the Principal Investigator on two major research project
grants
awarded
by UGCand one research project grant sponsored by the Department
of
Human
Resources, Govt of India, New Delhi. Prof. Rao was the Founder and
President
of
'Rasadhuni
Sahithi
Parishath'
literary
organization.
Prof. Madiraju Ranga Rao, an acclaimed poet, writer and a literary
critic,
contributed extensively to various literary genres of Telugu literature
including
classical literature, modern poetry, and criticism. Prof. Rao established
his
niche
in contemporary modern Telugu literature through his literary works
in
‘Free
Verse' (Swecchaa Kavithvamu) and Literary Criticism. Popular journals
published
his creative writings on a regular basis and this list includes Bharathi, Swathanthra, Sravanthi, Jayanthi, Akashik, AndhraPathrika,
AndhraPrabha,
AndhraJyothi, AndhraBhoomi and several others. Central to Prof. Madiraju Ranga Rao's poetic purpose was humanistic
ideals
and
a democratic ideology that symbolized peace. This was the very
essence
of
his
'free verse' poetry. Prof. Madiraju Ranga Rao's journey in the genre of
‘free
verse' poetry is enriched by his unique personal spirit, social
consciousness,
humanitarian feelings, a democratic ideology, and a message of
harmony.
A
substantial number of Prof. Rao's contemporary modern 'free
verse'poetic
works
are based on his creative mindset pertinent to historical development,
existing
situations, social realism, element of reason and reform, humanistic
sentiment
with a sign of peace and harmony. Prof. Rao's ‘literary criticism' works
focus
on
creative and artistic analysis of classical literature, literary ideologies,
human
elements, and universal outlook. During his long and highly
productive
literary
career, Prof. Madiraju Ranga Rao's creative writings culminated in
more
than
150
books on 'free verse' poetry and over 20 books on 'literary criticism' -
a
total
of
about 170 books - published until his departure on June 21, 2025.