Anandadhuni — Volume I — Addendum 1

ఆనందధుని — మొదటి సంపుటం — Addendum - 1

1975 · Telugu (te) · 44 pages · Human-proofread

ఆనందధుని

మాదిరాజు రంగారావు

ప్రచురణ :

సాహితీ బంధు బృందం

వరంగల్లు.

1975

స్వేచ్ఛా కవిత్వం

ఆనందధుని

ఆచార్య మాదిరాజు రంగారావు

SWECCHHA KAVITHVAM

ANANDADHUNI

Prof. Madiraju Ranga Rao

© Dr. M. Santhosh Kumar

Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28

ప్రథమ ముద్రణ: Ananda Sankranti

D/ 13-1-1975

పునర్ముద్రణ: జూన్ 2026

అనుపమ ప్రింటర్స్

శాంతినగర్, హైదరాబాద్

ఫోన్ : 040–23391364

అంకితం

సహృదయులు

డాక్టర్ వడ్లకొండ

వెంకట రామనర్సయ్యగారికి.

నీరు ఇగిరి పోతుంది

నిప్పు మండి పోతుంది

గాలి ఎగిరి పోతుంది

మనిషి బ్రతికి కలిసేను

మట్టిలో, ఆకాశంలో,

అవును గాని – మిగిలేది,

మనోజ్ఞ మానవతావిష్కారం

ఎద కంటికి కర్పూర చిత్రం.

ప్రకాశకీయం

U

కొన్నాళ్ల క్రితం మేము

డాక్టర్ మాదిరాజు రంగారావుగారి ‘‘వెలుగులో ఈ నేలపై’’

కావ్యాన్ని ప్రచురించినాము. ఈ సంక్రాంతి కానుకగా

‘‘ఆనందధుని’’ సమర్పిస్తున్నాము.

సాహితీ ప్రియులు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాము.

ఈ అవకాశాన్ని కలిగించిన

శ్రీ మాదిరాజు రంగారావుగారికి మా కృతజ్ఞతలు.

ది. 13-1-1975.

సాహితీ బంధు బృందం

ఇందులో

ఆనందధుని

స్వేచ్ఛాబింబాలు

ఇటీవలి ముక్తకాలు

కొలతలేని కాలం

జ్వాలా రూపం

i

ప్రస్తారం

ఈ కృతిలో చివరది జ్వాలా రూపం. ఇది మానవునిలోని వాంఛామతికీ,

అహంక్రియా రూపానికీ ప్రతీక. దీని ప్రసారం ఇందులో ఆవిష్కృతమైంది. బహు

పురాతనమైనవీ, సామాజిక స్మృతులు మనస్సు లోపొరలలో దాగి ఉంటాయి. ఇవి

ప్రవర్తనలో, ఆలోచనలో ఆయా సందర్భాల్లో స్ఫుటం అవడం కద్దు.

‘‘తరతరాల వలయాలు క్రమించి

వచ్చి చేరిందా నన్ను

.....................................

ఉంటుంది అరణిలో

అనల తేజంవలె రహస్యంగా’’

అరణిని మధించినపుడు అగ్ని ఉద్భవించినట్లు, మనస్సు గాఢమైన అనుభవంతో

ఒరపిడి పొందినపుడు జ్వాలాముఖం నిర్గతమౌతుంది. ‘అరణి’ అన్న శబ్దం పురాతన

స్మృతిని కదలించేది.

Freud తో ఎన్నో సిద్ధాంతాల్లో విభేదించి క్రొత్త పుంతలు త్రొక్కిన Carl Gustav

Jung ప్రతిపాదించిన collective unconscious అన్న సిద్ధాంతం ఈ రచనకు ఆధారం.

ఎంత సంస్కృత సంపన్నుడైనప్పటికీ మానవుడు చరిత్ర కందని ఎన్నో తరాల క్రిందటి

ప్రవర్తనారీతీ, అనుభవశీలమూ భద్రపరచుకుంటూ వస్తాడు. దీన్నే D. H. Lawrence

'blood consciousness' అంటాడు. James Frazer (Scottish anthropologist)

వ్రాసిన "The Golden Bough" అన్న గ్రంథంలో చరిత్రకందని దశనుండి మొదలుకొని

అనేకమైన విషయాలు మానవ సంతతి గురించీ - (Sociological మరియు

Psychological దృష్టితోనూ) కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ గ్రంథాన్ని

గురించి T. S. Eliot, ఒక చోట One which has influenced our generations

profoundly I mean "The Golden Bough" అంటాడు. దీన్ని బట్టి ఈ గ్రంథం

ప్రభావం నేటి భావనా ప్రపంచంపై ఎంత ఉందో ఊహించవచ్చు. ఈ విషయం

ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈనాటి సాహిత్య విమర్శలో Psychological

ii

దృక్పథంతోపాటు, Jung ప్రతిపాదించిన Archetypal theory దృష్టీ— భుజం భుజం

కలుపుతూ పోవడం గమనించవచ్చు. ఇందులో Cultural Patterns, Symbolic actions

— ఇంకా Conscious మరియు Unconscious దశల్లోని సంఘర్షణ మొదలుగా

విశ్లేషణమూ ప్రాధాన్యం వహిస్తూన్నవి.

‘‘ఈ మనోజ్ఞ జ్వాలా రూపం

అఖిల మానవాత్మకు సంకేతం’’ అని

చివరకు మానవుడు ఎక్కడ ఉన్నా ఏ కాలంలో ఉన్నా— అతనిలోని Universal

Pattern ను విశ్లేషించి చిత్రించడం జరిగింది.

‘‘ఇది ఎక్కడికీ పోదు

ఉంటుంది గుండె తోపులో

గంతులేస హరిణ మృగం వలె.’’

‘‘ఇది ఎక్కడికీ పోదు

ఉంటుంది నిద్రావనంలో

జూలు విదల్చి నిల్చే సింహం వలె.’’

స్థూలంగా హరిణ మృగం వాంఛా రూపానికీ, సింహం అహంకార లక్షణానికీ ప్రతీకలు.

ఇంకా హరిణం— రమణీయ రూపాదుల్ని బట్టి మృదు ప్రవృత్తినీ, కళాత్మక శక్తినీ;

సింహం— కఠోర ప్రవృత్తినీ వినాశన స్వభావాన్నీ స్ఫురింపజేసవి. దేనికది విడిగాకాక

మానవునిలో ఈ రెండూ ఎప్పుడూ అనితరమైన అన్వయ రూపంలో కలిసే ఉంటాయి

నిగూఢంగా. మనిషి అవసరాన్ని బట్టి ప్రకాశనాన్ని పొందుతూనే ఉంటాయి.

ఈ జ్వాలా ప్రకాశనంతో

ఉదయించిన సంస్కృతి

ఈ జ్వాలా సంచారంతో

కావచ్చు – చీకటి దిబ్బ.

గుండెతోపు, నిద్రావనం క్రమంగా Sub-conscious, Un-conscious దశలను వ్యక్తం

చేసవి. రచన చదువుతూంటే మనస్సులో ఈ ప్రవాహకాంతి స్ఫురిస్తూనే ఉంటుంది.

iii

మొదటి కృతి ఆనందధుని. ఇది స్థూలంగా అరవిందుల మహా కావ్యం సావిత్రి

చదివాక పొందిన అనుభవ పరంపర అయినా, ఇందులోనూ ప్రధానంగా పైన పేర్కొన్న

వస్తు రూపం పరచబడి ఉంది.

మానవునిలో మృత్యువును ఎదుర్కొనే ఇచ్చతోపాటు శక్తిని కూడగట్టుకునే

సంకల్పమూ ఉంది. అందుకై నిరంతర ప్రయత్నమూ సాధనా, మానవ చరిత్రలో ఎన్ని

విధాలుగానో కన్పిస్తుంది. చివరకు అతడు పొందే విజయసిద్ధి— సావిత్రి కావ్యంలో

మనకు కన్పించే ఒక వెలుగు ముఖం. దీని చిత్రణమే ఈ రచన.

ఒక విశేష దశలో మనస్సు పొందే ఆరోహణల పరంపర మానవుని ప్రయాణ

రూపంగా ఇందులో భావితమైంది. వైయక్తికమైన అనుభూతి కేంద్రంగా, Universal

Pattern లో రచన సాగింది. ఈ రచన మూడు దశలుగా వెలువడింది.

1. పరిమళ వలయం 2. ఇక్కడ ఎక్కడా లేదు చీకటి 3. ఆదిత్య వలయం.

ఇవి క్రమంగా ప్రధానంగా i.మనస్సు ii. అంతఃకరణం iii. ఆత్మకు ప్రతీకలు.

మొదటిది –

‘‘అవాలి

ఆనంద వలయం

చేరే నిశ్రేణిక

కావాలి

శుభ వాసనా రూపం

పొందే అవకాశం’’ అనీ

ఉత్తమ సంస్కార లక్షణాన్ని,

రెండవది–

‘‘భగవంతుని రాగ కర స్పర్శతో

మహితమైనట్లుంది జీవితం

లేదు ఇక్కడ ఎక్కడా చీకటి

ఏ ఒక్క బిందువులోనూ’’ అనీ

iv

చీకటి యొక్క అభావమే వెలుగు. ఇది ఆత్మకు సన్నిహితమైంది. కాబట్టి

మనస్సుకు, ఇటు ఆత్మకు మధ్య స్థితినీ,

మూడవది–

‘‘సూర్యగోళ హృదయంతో

ఇది

చావులేని ప్రపంచం’’ అనీ

పరమమైన జ్యోతీ రూపాన్నీ సూచించేవి. ఇదీ కావ్యంలోని ప్రణాళికా స్వరూపం.

‘‘తెరచుకొంది ఈ క్షణం

హిరణ్మయాజ్వల కవాటం

ఓంకారనాద సుందరంగా

హృదయ స్పందన లయతో’’

హిరణ్మయ కవాటం, ఓంకారం— రెండూ పూర్వ స్మృతులను కదలించేవి.

ఇవి భావనకు దీప్తినిస్తూ అనుభూతికి ఆకృతినీ, గతినీ కలిగిస్తున్నాయి. ‘‘హృదయ

స్పందనం’’ జీవశక్తినీ, ‘‘లయ’’ – నియతినీ, గతినీ వ్యక్తం చేసవి. ‘‘ఈ క్షణం’’

నవోన్మిషితమైన కాల రూపం.

స్వేచ్ఛాబింబాలు, ఇటీవలి ముక్తకాలు అన్న కవితలు వివిధ స్థితుల్లో వెలువడిన

అనుభవ రూపాలూ, మానసిక చిత్రాలూ బింబించేవి. ‘‘కొలతలేని కాలం’’ హిందీ

రచనకు అనువాదం.

ఇది ఈ కృతుల్లోని ఆలోచనా ప్రస్తారమూ, అనుభవ ప్రసారమూ.

ఈ కావ్య ముద్రణ విషయంలో శ్రద్ధ వహించిన సన్మిత్రులు శ్రీ పల్లా

రామకోటార్యగారికి కృతజ్ఞతలు.

– మాదిరాజు రంగారావు

పరీమళ వలయం

I

ఈ క్షణం మేల్కొంది

కాంతి బిందువై

సాగింది రేఖలుగా

కరగిస్తూ తమోరాశి

కల్పన వాస్తవమైంది

స్థావరం జంగమమైంది

శూన్యం సంభృతమైంది

కాలం తెలివి పొందింది.

ఇంత వరకు అననుభూతంగా

అందని మనోజ్ఞ రూపం,

హిరణ్య గర్భం నుండి

ఓంకారం వలె

ఆవిర్భూతమైంది ఈ క్షణం,

ఆత్మకు ఇస్తూ ఆనందాకృతి.

లౌకిక వనమంతా ఇపుడు

చివురించింది క్రొత్త తెలివి

సూర్య కిరణ పంక్తుల్లో

ప్రకాశమాన కళ వలె.

అలలో కన్పించే కదలికతో

కలలో దాగిన వాస్తవంతో

కన్పిస్తోంది చంద్రకళ

ఏ శిరోఽలంకారమా ?

ఇది మాయ కాదు.

మృగతృష్ణ కాదు

విస్పష్టమైన అనుభవ దర్పణం

ఆత్మను బింబించే క్షణం.

చీకటి కలసిపోతూంది

వెలుగులో తహతహతో

రూపు మాపుకొనే ఆశతో

అగ్నిని గుర్తిస్తూ తెలివితో.

II

క్షణాలు గడుస్తున్నాయి.

రెక్కలు సాచి నింగిలో

కదలిపోయే మబ్బుల వలె.

జీవిత చక్రనేమి క్రమణ వేగానికి

ఎగసి క్రమ్మిన దుమ్ము అణగి,

వెలుగుతూంది ఆత్మతేజం.

నిద్రా గుహ నుండి

బయటికి వచ్చిన మనస్సు

బ్రతుకుకై అన్వేషణలో

పొందిన అశాంతి వలయం

చెరగి పోతూంది

ఎక్కడిదక్కడ ఈ క్షణం.

నిప్పు నుండి వెలుగు

వేరరూపోయే లోపల

దిక్కుల్ని వెడల్పు చేయజూచే

ధూమవదనం వివర్ణమౌతూంది.

అహంకారం

దూకుతూంది సముద్రంలో

మహా భయం

కలుస్తూంది గాలిలో.

మొక్కకు కావాలి

వెలుగూ నీరూ –

మెలకువకు కావాలి

అనుభవం వివేకం.

జీవితంలో కన్పించే

సురాసుర శక్తుల సంఘర్షణ

కావాలి ప్రాణ భయం నుండి

జీవిత సత్యానికి మార్గం.

దైవాభిముఖంగా సాగే పథంలోని

మానసికమైన సుందర శిల్పాలే దేవతలు.

ఇక్కడ ఎక్కడ ఉంది

వివిధ వస్తు విభేదం

ఉంది ఇక్కడ ఒకటే

ఆత్మ కళా వైవిధ్యం.

మానానికీ ధ్యానానికీ

వ్యాఖ్యానంగా ఉందీ స్థితి

లౌకికమూ వాస్తవమూ

దాటుతున్నాయి మనో దశలు.

ఈ స్థితి ఎలా ఉందంటే

బరువు మోసుక పోయేవాడు

మధ్యలో దించుకొని కేసపు

పొందుతూన్నట్లుంది విశ్రాంతి.

ప్రతి ఉచ్చ్వాస నిశ్వాసంలో

జలధిలహరీ స్పందనతో

ప్రతి క్రియా రూపంలో

మేఘ గమన విలసనంతో,

ఈ శరీరం మానవునికి

పరమ యదార్థ రూపమై

ఈ జన్మ కాదు ఇక్కడ

ఎవరికీ దుఃఖభూరూషం.

అవాలి

ఆనంద వలయం

చేరే నిశ్రేణిక!

కావాలి

శుభ వాసనారూపం

పొందే అవకాశం.

III

ప్రకాశమాన ఆలోచనకూ

క్రియాత్మక వర్తనకు మధ్య

సూక్ష్మలోకం మంచుతెర వలె

మృత్యు నిరంకుశత్వం నుండి

స్వాతంత్ర్యం పొందింది మనస్సు

గగన రహస్యం బ్రద్దలైంది

శబ్దధుని ఆవహించింది

అడవిలో వాయుభ్రమణం వలె

కొండలపై నుండి జంపాతం వలె.

మనస్సు పొందుతూంది

సుందర ప్రవాహ రూపం

వెచ్చని మెరపు తలపులతో వచ్చే

వార్షుక మృదు భావనతో

ఎదలో సాగిన లత

పూచింది కళ్ళలో పూలు

విప్పారాయి ఆశలు

పసిడి మొగలిపట్టల వలె.

తల ఎత్తిన ఆశ్చర్యంతో

నిలచింది స్వర్గం

క్రిందికి దిగి.

వెలుగు పొరలు చుట్టుకొన్న

గాలి అంచుల్లో కదలుతూ

మనస్సు పొందుతూంది

అవిచ్ఛిన్న సంస్కార గంధం.

భూమిని ఆకాశం వలె

ఆకాశాన్ని కాంతి వలె

ప్రకృతిని అనంతశక్తి

స్పృశిస్తోంది పరుసవేదిగా.

ఆదర్శానికీ వాస్తవికతకు

ఆత్మకు శరీరానికీ

ఇంతవరకు ఎరుగని

సూక్ష్మబంధం చేకురుస్తూ.

జీవిత గమన రీతిలో

హృదయ స్పందన లయతో

శబ్దాలు తొలిచి చేసిన

రమణీయ రసాకృతి

దాటుతోంది మనోవలయం

మంత్రాక్షర ముఖంతో.

నిశ్శబ్ద వలయం వెనుక నుండి

వినిపిస్తోంది స్వర తరంగం

స్వర తరంగ వలయాల్లో

బింబిస్తోంది సంగీత చిత్రం.

స్వర్లోకం కదలి పోతూంది

స్పృశిస్తూ శారీరక జగత్తును.

జననాంతర సౌహృదంతో

వెలుగుతూంది హృదయాకాశం.

శక్తి సౌందర్య కాంతి

ప్రవహిస్తోంది నాలోకి,

ఆనందసుమ పరిమళం

ప్రసరిస్తోంది నా నుండి.

ఇక్కడ ఎక్కడా

లేదు చీకటి.

ఇక్కడ ఎక్కడా లేదు చీకటి

IV

ఆలోచనా జలతరంగాలపై

శ్రేణులుగా రహస్య రూపాలు

వేసుకున్న ముసుగులు వదలుతూ

ఆలోచనా వాయు వీచికలపై

గుంపులుగా రహస్య రూపాలు

వేసుకున్న ముసుగులు తగలబడుతూ.

ఎన్ని సంతతుల నాటివో

సంస్కార వాసనలతో

ఆలోల వర్ణాలతో

విలోల శబ్దాలతో.

వర్తమాన గగన తలంపై

వెలిగే సూర్య గోళానికీ

మెరేస చంద్ర బింబానికీ

తెలుసు బాగా వీటి స్వరూపం.

కను చూపులు ఆక్రమిస్తూ

ఎద లోతులు స్పృశిస్తూ

వ్యూహాలను దేశ శక్తితో

ప్రాణంపై నిలచిన రక్తితో

శ్రేణులుగా రహస్యవలయాలు

ఎన్ని యుగలనాటివో

జలధారా భావనతో

ఆలోల స్వరాలతో

విలోల రాగాలతో

మ్రోగే సంగీత చిత్రమై

నిష్క్రమిస్తూన్న మృదు ధ్వని.

★

అవనీ ముఖాన

నవజీవనం తెచ్చే తొలకరి వలె

మ్రింగింది ఆశ్చర్యాన్ని

ఆనందం, నృత్యంతో.

అర్ధరాత్రి గాలుల సవ్వడి వలె

మనో భూమి నుండి స్మృతులు

బయటికి తీస్తున్నాయి పరంపరగా

అడుగున దాగిన కవితా నిధులు.

భౌతిక రూపంలో వలయాలుగా

వికార దశ పొందిన ఆత్మరూపం

పొందుతూంది స్మృతుల కదలికకు

నవవర్ష రసోత్పుల్ల సృష్టి.

మలచుకొని మెట్లు మెట్లుగా

అవతరిస్తూన్నవి మబ్బులు

క్రింది నుండి పైకి పరంపరగా

ఎక్కడికి ? ఈ ప్రయాణం ?

అనుభవ సౌకుమార్యంతో

ఏ సూక్ష్మ జగత్తులోకి!

ఒత్తిగిలి పోతూంది గాలి

వినయధురీణంగా ప్రక్కలకు.

నా ముఖంలో ఉదయం

గూడు కట్టుకుంది భద్రంగా

తలపిస్తూ శిశువు ముఖం

నాకళ్ళలో వెలుగులు

సాగేను పాయలు పాయలుగా

విరబూచిన తీవెల వరుసలుగా.

మంచు ముసుగు వదలింది భవిష్యత్తు

మృత్యు రహస్యం వీడింది జీవితం.

మనస్సు నృత్యం చేస్తూంది వెలుగై

ఊహకదలుతోంది అగరు ధూపమై

భగవంతుని రాగ కరస్పర్శతో

మహితమైనట్లుంది జీవితం.

లేదు ఇక్కడ ఎక్కడా చీకటి

ఏ ఒక్క బిందువులోనూ.

n

ఆదిత్య వలయం

V

సూర్యగోళ హృదయంతో

ఇది,

చావు లేని ప్రపంచం.

ఎంత కాలం నుండో

ఉన్ముఖీకృతమైన మనస్సు

పొందుతూంది ఈ క్షణం

వాక అతీతమైన విభూతి.

కాలానికి దీప్తినిచ్చే

ఆదిత్య తేజోరాశితో

ప్రకాశిస్తోంది జీవితం,

తెర తొలగిన వర్ణచిత్రం వలె.

కరగింది లౌకిక భావన

పరిమళాంచిత కర్పూరమై

మిగిలింది లౌకిక రూపం

సౌవర్ణ కళా ప్రశస్తమై.

ఆలోచన కదలుతోంది

అవ్యాహతంగా నిబిడంగా

ఆర్ద్రమైన సముద్రంపై

వీచే పవమాన పంక్తి వలె.

జడంలో నిదురిస్తూ

ప్రాణిలో కదలుతూ

హృదయంలో రాగంతో

కదలే శక్తి రూపం,

ఆకాశాన్ని త్రోసికొని వచ్చేది

భూమిని చీల్చుకొని పోయేది,

ఒదిగింది అణువణువునా

అంభోబిందులోల సముద్రమై

వెలుగు కళ్ళ నుండి

రాలుతూ నవ్వు పూలు

ఎత్తిన గగనం వదనంవలె

ఉంది హృదయం– ఈ సమయం.

చావును వదలేసింది ఊహ

చీకటిని వదలిన ప్రభాతం వలె.

n

మట్టిలో ఆడుకునే పిల్లడికి

వీధిలో దొరకిన ఆట వస్తువువలె,

కలిగిస్తూంది ఈ ఉద్వేజితక్షణం

స్వర్గం కన్నా మహితమైన ఆనందం.

చీకట్లో నిన్నటి వరకు

మిణుగురులవలె మెరసిన కళ్ళు

మారాయి ఇపుడు–

సూర్య చంద్ర బింబాలుగా.

ఇక్కడ తల ఎత్తినవి

భగవంతుని ముఖాలే !

ఇక్కడ పూచినవి

భగవంతుని ఆలోచనలే !

వైకుంఠమూ కైలాసమూ రెండూ

రెండు భుజాలపై నిలచినట్లుంది

ఆవహించింది చైతన్యం

గాంగ ఝురీ సదృశంగా

ఆకాశాన్ని వంచి

భూమిని అణచి–నిల్చిన

శక్తికి సంకేతంగా.

వర్తమాన శిఖరంపై

నిల్చిన నా మతిలో

అనంతమైన గతమూ భవిష్యత్తూ

ఒకే రూపానికి రెండు ముఖాలుగా.

తెరచుకొంది ఈ క్షణం

హిరణ్మయాజ్వల కవాటం !

ఓంకార నాద సుందరంగా

హృదయ స్పందన లయతో.

ఎగసి వ్రాలింది ఉషస్సు

నా ముఖంపై శాశ్వతంగా

అవతరించింది షట్పదమై

నా ఊహలో ఝుంకృతితో.

VI

నిలచింది వాయు మండలం

చేతులు చాచి ఆహ్వానిస్తూ

నిలచింది సముద్రవలయం

మునివ్రేళ్ళపై నిరీక్షిస్తూ.

తొలకరి వానకు ముందుగా

వీచే చల్లని గాలికి తలెత్తి

ఒళ్ళు మరచి ఊగే

వనంవలె ఉంది మనస్సు.

ఎండిన నదిలోని ఇసుక వంపులవలె

మలుపులు తిరిగిన విషాదం,

ఒక్కమారు మాయమైంది

వర్షధారా సంభరిత నది వలె.

గమ్యం చేరడానికి

తహతహతో సుళ్ళు తిరిగే

తుఫాను గాలి, శాంతించిన

ఆకాశంవలె ఉంది మనస్సు.

చీకటికి తెలీదు

సూర్యుని ప్రకాశ హృదయం,

గుహలకు పిచ్చుక గూళ్ళకు

తెలీదు ఆకాశ వైశాల్యం.

చీకటి నుండి గుహ నుండి

బయట పడిన మనస్సుకు

తెలుస్తుంది అంతో ఇంతో.

మేఘ జీవన సందేశం

వినాలని చెవులు రిక్కించిన దిశలూ,

సూర్యుని కళ్యాణ రూపం

చూడాలని కళ్ళు పరచుకొన్న ఆకాశమూ,

అవనతమైనాయి నా ఎదలో,

సంక్షిప్తమైన రూపంతో.

ఈశ్వర సంకల్పాన్ని

ప్రదర్శించిన మహాశక్తి,

ప్రకృతి నుండి మనస్సు దాటి

స్పృశిస్తోంది ఆత్మ సీమలు.

అమృత ధామం నుండి

వచ్చే వసంత కిరణాలకు

పునస్సంజీవితమై

వెలుగుతోంది నా రూపం.

సృష్టి ప్రథమ రూప

వాసనా బీజం నుండి

బ్రతుకులోని శిఖరభూత

సంస్కార వృక్షం వరకు,

ప్రకృతిలోని రూప వికాసం

ప్రాణిలోని జీవ స్పందనం.

దివ్య దశకుచేర్చే విజ్ఞానం

ఎప్పటికపుడు నవోహలో

పొందే పరిణామ రేఖలతో,

పునా రూపం పొందుతూంది

ఉజ్వల సిద్ధితో మనస్సు.

అస్తమయం ఎరుగని

ఆదిత్య కిరణాలు

ప్రసరిస్తున్నాయి నాలోకి,

వైవర్ణ్యం ఎరుగని

చాంద్రీరాగం

పరచుకొంది ఒక ప్రక్కగా.

నేనీ క్షణం,

అనేక వాసంత సూర్యుల

కల్యాణ కాంతికి

సంకేత స్థానం.

నేనీ క్షణం,

అనేక రస ప్రవాహాల

ఆనంద నృత్యానికి

అవనీ చక్రం.

స్వేచ్ఛాబింబాలు

I

పడవను ప్రక్కకు నెట్టాలని

చూస్తుంది తరంగం

తరంగం తలపై కాలూని

దాట జూస్తుంది పడవ

నాకేమిటి ? ప్రతివాడికీ ఇదే

ప్రపంచంతో గల సంబంధం

ఎక్కడికీ వెళ్ళిపోదు సముద్రం

మానలేం చేయకుండా ప్రయాణం.

II

ఉదయం అడుగుతుంది.

రాత్రిచేసిన అపకారం ఏమని?

రాత్రి అడుగుతుంది.

పగలు చేసిన ఉపకారం ఏమని?

ఉదయానికి జవాబుగా

కళ్ళు తెరుస్తాను.

రాత్రికి సమాధానంగా

కళ్ళు మూస్తాను.

III

నేను లేచేంత వరకు

నిలచి ఉంటాయి ఓపిగ్గా

తలుపు వద్ద క్షణాలు.

ఉదయం కాగానే, లేచి

తలుపు తీయడంతో,

ప్రపంచం నుండి నా లోకి

ఉల్లాసంగా ప్రవహిస్తాయి.

రహస్య ప్రకాశనంతో

అలల అడుగుల సవ్వడితో

క్షణాలు, పిలువని అతిధులు.

IV

సంధ్యా వలయాల నుండి క్రమిస్తా

రవీందుమతి ప్రభతో.

జ్వలత్ అశాంతి శిఖరంపై

చరిస్తా వర్షా మేఘమూర్తినై.

నిదుర నుండి, రాత్రి నుండి –

యుగాల అంచుల దాటి పయనిస్తా

మంచువలె కరగి నీరై నదియై,

అగ్నివలె మండి వెలుగై తేజమై.

V

నేనెపుడో బ్రతికిన వాణ్ణి

ఏ శిలపైనో పడుకున్న వాణ్ణి

ఏ గుహలోనో నిద్రించిన వాణ్ణి

నేనిపుడు బ్రతికే ఉన్నానా ?

కాలం కదలుతూంది జలధివలె

ఎంత వాడికీ తెలీకుండా లోతు

ఎటు పోవడానికీ వీలు లేకుండా

పడవ దొరికితే ? ఒక రకం అదృష్టం.

VI

రోజు వెలుగుతోంది వత్తివలె

చుట్టూ ముసరికొన్నాయి పురుగులు,

దీప దైన్యం చూచేట్టు లేదు

చీకటి నవ్వు సహించేట్టు లేదు.

కొండ్లమధ్య పురుగును పట్టి

కుట్టడం మానేసిన తేలువలె

కాలం ఉపేక్షించిందా? నన్ను

కాలం క్షమించిందా ? నన్ను.

VII

అద్దంవలె ఎదురుగా

నిలచింది కాలం

బింబించే నా రూపం

ఎత్తుక పోయే ఆశతో,

ఇంతలో వచ్చి

అద్దాన్ని ముసరిన మబ్బులు

కురిసిన ప్రవాహగతిలో

నేను – ఒక నౌకను.

VIII

వర్షా నృత్యంలో

తెగిన పాద మంజీరంవలె

ఉంది సరస్సు నిశ్శబ్దంగా,

గత స్మృతుల కదలికతో.

కదలుతూన్నవి మెత్తని క్షణాలు

పసి అడుగులు పరుగుతీసినట్లు.

నవ్వుతూంది ఎండిన మ్రోడు ముఖం

స్వర్లోకం తొణికిసలాడినట్లు.

IX

వెచ్చని వాన, నిశ్శబ్దంతో,

రహస్య సంభాషణ చేసప్పుడు,

పచ్చని తలపులతో అవని

ఆకాశాన్ని అదుముకునేప్పుడు,

వెలిగే క్షణాలు ఎవరివి ?

మట్టి ప్రమిదల శరీరాలతో

ఎదలు వత్తులు చేసి వేచే

నీవీ, నావీ ! పూర్వంనాటి నుండ.

X

ఒక శతాబ్ది నుండి మరో శతాబ్దిలోకి

పయనించే లోపల మనుషులు,

ఒక నీడపోయి మరో నీడ ముందు

నిల్వజూస్తుంది క్రమ్మి మనసును.

ఈ నీడ నుండి బయటపడే లోపల

అవుతుంది ఒక యుగం పరిసమాప్తి.

ఒక్క వెలుగు మనసు సోకితే చాలు !

సంస్కృతీ శిఖర మెక్కినంత బులుపు !

XI

నిదుర నుండి లేపితే మధ్యలో

బలవంతాన ఎవడో గరుజు కొద్దీ

విరిగి చెదరిన కలల బొమ్మలతో

కులే నిశ్శబ్ద శిఖరాల క్రింద

భయ క్షణాలపై నడచే వీళ్ళు !

కళ్ళు నలుముకుంటూ ఉదయాన్ని చూచి

నెత్రు మడుగని కళ్ళు మూసుకొనే

వీళ్ళు, మనవాళ్ళు – దీపికలై

వెలుగు ఇవ్వకపోతే మానేరు

తగులబెట్టకుండా ఉంటే చాలు !

మెలకువ మాట దేవుడెరుగు

కాలానికి సంకెళ్ళు కాకుంటే చాలు.

XII

దిక్కుల్ని ఎత్తుతూ మూల నుండి

వీచే గాలికి, రాగంతో

కురేస వర్షధారా ప్రసారం

నదిస్తూ, నినదిస్తూ –

హృదయ స్పందన లయ

శబ్దిస్తూ అవిరామంగా,

మబ్బు మెరపులో

తోచే ఆశా రూపంగా

వాన చినుకుతో

వచ్చే సృజన శక్తిగా,

ఉంటుంది నాకు ప్రతి క్షణం

బిందు ముఖంతో సదా.

n

ఇటీవలి ముక్తకాలు

గత జన్మలోని ప్రియమిత్రం వలె

ఇంటి ముందు వ్రాలింది ఉదయం

నా ముఖంలో చివురించింది ఆనందం

నా కళ్ళలో వికసించింది వివేకం.

బ్రతుకులో ఒక్కొక్క దినం

చేతికి తిరిగిరాని రత్నం

కాంతుల మిరుమిట్లతో సగం

జీవితం అవుతుంది రామార్పణం.

ప్రతిరోజూ మనకు అపరిచితమే

ప్రతిదారీ మనకు క్రొత్తే,

అయినా అంతలో సుపరిచితమై

పాతబడుతుంది మరునాటికే.

కఠిన శిలాపంక్తులవలె

పరచుకొన్న కాలంపైనా అనవరతం

ప్రవహిస్తుంది, అదృష్టవంతుని జీవితం

జలధారా సందోహమై, సంగీతమై.

రేగే ఆకులతో ఎగిసే తలపులతో

పరుగిడే ఈ జీవితం ఒకనాటికి

నిలచిపోయే స్థానం ఒకటే ఒకటి,

కాలాన్ని కబళించి వెలిగే మృత్యు శిఖరం.

రాత్రి మేల్కొనే ఉంది

కన్నుల్లో వత్తులతో, ఎందుకా ?

నా బ్రతుకును చూడాలని

సూర్యుడు లేని వేళల్లో.

పనికి రానివి వర్తమానంలో

విసరేయి భవిష్యత్తులోకి,

ఆ రహస్యపు పెట్టెలోని

అమూల్య వస్తువులన్నీనూ.

మనపై నుండి ఎగసి దూకి

బ్రతుకును సమార్ద్రం చేస

తొందరలో ప్రవహించే కాలంలోనే.

కొట్టుక పోనూవచ్చు అనుకోకుండా.

నేను ఉంటాను

వచ్చే రోజుకు జ్ఞాపకం

నాకు ఉండవు

పోయిన రోజులు జ్ఞాపకం.

ఎంతకాలం గడచిందో

జ్ఞాపకం లేదుగాని.

మరపు మటుకు నిలిపింది.

అనంత కాలాన్ని ఒక్క క్షణం.

వస్తుంది ఫైర్ ఇంజన్

అంతా అయ్యాక రామార్పణం

దారికి అడ్డంగా ఎండలో

త్రాగే నీటికై జనసందోహం.

ఈ కొండపై సామాన్య మానవులు

రాజరికపు టానవాళ్ళు

భద్రపరచిన సమాధులపై

వెలిగే వత్తులతో ప్రమిదలు !

రాత్రి నిదురలో– ఆలోచన

చుట్టుకుంది కృష్ణ సర్పమై.

ఉదయం మెలకువతో ఆలోలమై

గంతులేస్తుంది గోవత్సమై.

కుత్తుక బంటి బురదలో

కూరుకపోయిన సాయం సూర్యునికీ

ఉంటుంది ఆశ ఎవరో రక్షిస్తారనే ?

లేంది చూచేమా ? మరో ఉదయం.

పోనీ ఎవరిదారిన వారిని

నిల్వకు ఎవరిదారికీ అడ్డం

ప్రస్తుతానికి ఈ మనో గుణం

బ్రతుక్కి ఇస్తుంది మహాసత్త్వం.

చీకట్లను వడపోసి మరీ

ప్రసరింపజూస్తుంది వెలుగు

ఏలాగో సందుచేసుకొని

దూరి పోజూస్తున్నాయి చీకట్లు.

రానీ క్రియాశీలానికి

ప్రయోజన తత్త్వం

రానీ కళారూపానికి

సామాజిక వివేకం.

ఉచ్చ్వాస నిశ్వాసాలతో

వర్తమాన గత రూపాల్లో

ప్రవర్తించే కాలానికీ,

క్రియా రూపం జీవితం.

రాత్రి పర్వతం వలె

కన్పించింది ఆశ్చర్యంతో,

పగలు ప్రవాహ రూపంలో

కదలుతూంది– కాలం.

ఎరుపు తిరిగిన ముఖంతో

మండే నిప్పు పెదవులతో

పూలు వాడిన కళ్ళతో, ఏమిది ?

ఏముంది ? పట్టపగటి బ్రతుకు.

నలగి తరగి పెరిగే మానవుడు

కాలానికి ఇచ్చే కానుక ?

హింస, అసహనం, అశాంతిలో

ఉదయించే ఆత్మజ్ఞత.

గాలికి కొట్టకపోయే వాడైనా సరే

నిల్వజూస్తాడు కొండవలె బ్రతుకులో

ఎవడూ వదలడు దేనినీ గాలికి.

గాలికీ కొట్టుకపోయేదైనా– ఆఖరికి.

పర్వతం గాలిని నిలిపితే

గాలి సముద్రాన్ని లేపుతుంది

స్వభావం మనిషిని స్తంభేస్త

మనిషి సమాజాన్ని నిందిస్తాడు.

కాల సముద్రంలో లోతులు చూచేది

నీవూ నేనూ కాదు సూర్యచంద్రులు

వర్తమాన శిఖరాలు అధిరోహించేది

రవీ చంద్రుడూ కాదు, మానవుడు.

ఈ ముఖరేఖల తరగలపై

నటిస్తూన్నవి ఎన్ని చిత్రాలో ?

ఆపై నుండి క్రింది వరకు

ఊహకు వచ్చినన్ని బ్రతుకులో

ఈ గదిలో బంధించారా వ్యక్తిని?

ఆకాశాన్ని పట్టినట్లు గుప్పిట్లో

వర్షధారలు కురేసచోటు నుండి

వెలుగు నిప్పులు దూకుతాయి పైకి.

ఆ గుట్టవద్దకు చేరే వరకు

ఆపైది రాయి వేస్తుంది గుండెలో

ఈ నదిని దాటిపోగానే

మరో నది కారజేస్తుంది నీరు.

ఉంటుంది దారి ప్రతి మనిషికీ

పరుగెత్త డానికెప్పుడైనా ఎక్కడైనా?

చేస్తుంది ఊహ ప్రతి మనసూ

ఏడుస్తూ ఎవడిపైనో అంతో ఇంతో !

చెట్టు గుట్ట మట్టీ, లక్షణంతో

ఆది మానవ బాల్య గానమూ

విశ్వమంతా ఉన్ననాలో, లేనిదో?

ఏమీ లేదు, ఒక్క ‘‘నేను’’ తప్ప.

వెతుకుతూన్నవి అడుగులు నేలపై తిండికై

ఎగురుతూన్నవి మాటలు గాలిలో కోర్కెపై

కదలుతూన్నవి ఊహలు మనసులో నీడలై

ఎంతైనా ఎక్కడికి అక్కడే! ఈ ఘటానికి!

నీడలో ఇంత సుఖంగా గడపాలనీ

నీడలో కొంత చాటుగా బ్రతకాలనీ

ఎంతగా కోరిక ఉన్నా మనిషికి!

బయట పడేయాలనే, ఎప్పటికీ వెలుగుకు!

మనుషుల తలలు వేటాడే మనస్తత్వం

చివరకు నిల్వునా బూది అయ్యే వైలక్షణ్యం,

పులుల నుండి రక్షణకై ప్రయత్నంలో

పులులై వ్యవహరించే వికృతత్వం

ఆహారం కోసం సాహస కార్యాల్లో

నిమగ్నమైన జీవితంలో,

ఆహారంతో పాటు ఆనందమూ

పొందడమే ఆ శ్రమకు ఫలం.

పేరోల కీర్తిని కొలిచే పిరమిడ్లు చూచి

పట్టరాని ఆనందం పొందిన మనస్సు

కాలం మీద మారిన దృష్టితో నేడు,

పొందుతూంది పనివాండ్ర గుండెల సవ్వడి.

దగ్ధమైన భూమి నుండి పచ్చదనం

మొలిపిస్తుంది వర్షాశీర్నాదం,

రాతివంటి ఎదలో అనురాగం

దుమికిస్తుంది శిశూదయ బింబం.

వేటతో మొదలై దాడితో కొనసాగి

సమరంలో శిఖరమెక్కిన హింసా ప్రవృత్తి,

వెనువెంటనే సాధించిన ఘనకార్యాలు

బాణాలు, తుపాకులు, బాంబులు, రాకెట్లు.

తలచుకోగానే సర్జన్ చేతిలో కత్తి

రెపరెపలాడేను వెలుగు రెక్కలు,

భయాన్ని చీల్చినపుడే మతిప్రభ

మెరుస్తుంది మిల మిల ప్రాణ దీపం!

రోజులు వస్తు పోతున్నాయి అదే పనిగా

వెలుగుతూ ఇరు సంజల మెలకువతో,

రోజులు వస్తూ పోతున్నాయి అదే పనిగా

గుండెపై నునుమెత్తని అడుగులతో.

ఆ బాట పోయి పోయి మలగి తిరిగి

చివరకు కలసింది సముద్రంలో,

ఈ మనిషి నడచి నడచి అలసి సొలసి

నిదురించేదీ – దీని ఒడ్డునేగా.

ఎడారి గొంతులో నీటి చుక్క

ముత్యమై వజ్రమై మెరేస వేళ,

ప్రతిభ అను, అది అదృష్టం అను

ఆ స్థితిలో పరిసరమంతా అమూల్యమే!

ఎక్కడికక్కడే ఎదురయ్యే సరిహద్దులు

ఎన్నని స్వంతం చేసుకోగలవు బ్రతుకులో

భౌతిక మానసిక ఘర్షణ ఉన్నంత వరకు

అడుగు తీసివేస లోపలనే సరిహద్దులు !

నీడ కరగదు ఎంతటి జలధిలోనూ

నీడ తేలుతుంది వెలుగు కెరటంపై

నీడ ఒదుగుతుంది చీకటి చంకలో,

మునిగి తల ఎత్తుతుంది మనస్సులో.

ప్రకాశమాన జీవితంలో తప్పని

వస్తూ పోయే నీడల్ని గురించి

యాచిస్తూ కూర్చునే వాడికి

ఏం తెలుస్తుంది ? వస్తు స్వరూపం !

ఏవో చివుళ్ళు తప్ప ఏమీ నోచని మ్రోడును

అదృష్టం ఎక్కించిందో లేదో అందలం,

మేసరు విరగబడి ఈ మేధావులు

దేశ భవితవ్యానికి పట్టిన చెదలు !

ఇదో, శ్మశానంలో మిగిలిన కొరవి

రాలుస్తుందని బ్రతుకులో వజ్రాలు,

కదలేరు కొమ్ములు తిరిగిన ‘‘రచయితలు’’

స్వర్గ చిత్రం దిద్దుకున్న కళ్ళతో.

కడలిలోని అలలు అదే పనిగా

చెబుతూనే ఉన్నాయి యుగాలుగా

నెనరుతో విసరుతో చెప్పిందే చెప్పిందే,

పెడచెవిని పెడుతూనే ఉంది అవని.

పగలూ అవసరమే దీపం

కళ్ళతో వెతికే ముఖాలకు,

రాత్రీ అవసరం లేదు దీపం

మనస్సుతో వెదకే ముఖాలకు.

రక్తారుణ సరస్సులో ఉదయం

తల ఎత్తిన సూర్యతేజం,

ఒకరికి దేవీపదలాక్షారాగం

మరొకరి బ్రతుక్కి విప్లవ కేతనం.

ఆ పోయిన వస్తువు దొరికిందా ?

ఎవడికి? ఎక్కడ ? ఎప్పుడు? చెప్మా !

ఆ పోయిన వస్తువే దొరికితే

అసహనం, అశాంతి, ఆక్రందన దేనికి ?

క్షణాల రేఖలతో వ్యూహం పన్నేవాడే

ప్రతివాడూ ఏదో ఒక ప్రయోజనంతో,

రేఖల నీడల్లో నీడ కలుపుతూపోయే

ప్రతి మనసూ, ఒక గిజిగాని గూడు.

ఇటు నీటినీ అటు దిక్కుల్నీ చూస్తూ

సముద్రంలో నావపై ప్రయాణికుని వలె,

ఇటు లౌకికమూ అటు అలౌకికమూ

అనుభవిస్తూ పోయేను – మనస్సు.

రానీ మృత్యువు ఎదురై పైపైకి

పోనీకు నీ నుండి శాంతమైన తేజం

ఆ రవిలోని కల్యాణతమ రూపం

బింబితమై నీలో అదే నీవైపో !

n

కొలతలేని కాలం

క్షణం క్షణం.

ఒక క్షణం నుండి

మరో క్షణం దూరం.

కొలవబడదు, యాజనాల్లో.

ఈ క్షణాల్లో

అంటి ఉన్న ఘటనలు

ఒక అయస్కాంత బిందువుపై

కేంద్రీకృతమె ఉన్నవి

సూదివలె ఈ బిందువు

చెదరిన మనస్సును

కలుపుతుంది ఒకచోట.

బిందువు బిందువులో

విభక్తమైంది వృత్తరేఖ

ఈ రోజుచిత్తరువు తెరపై

పొందుతూంది సంపూర్ణ రూపం

శతశః ఖండితమై కథ

నిర్మిత మౌతూంది

ఛాయా చిత్రంగా.

ఎన్నో ఏండ్లు నెలలు రోజులు

అరగి అరగి

అస్తిత్వ హీనమై పోయాయి,

ఈ కథలో

ఎక్కడా విరామం లేదు.

భూత కాలంలో జన్మ పొంది

ఈ ఘటనలతో.

వర్తమాన క్రియలో ఉన్నవి

ఉంటూనే ఉంటవి.

హిందీ – శ్రీరామశర్మ

1969.

ఎక్కడిదీ జ్వాలా రూపం

ఎక్కడిదీ జ్వాలా రూపం

ఏ దిశనుండి నాలోకి

ఎప్పుడు దయచేసిందీ?

బింబిస్తూ తన ముఖం

ప్రతి చుక్కలో ప్రతి పూవులో

ప్రతి తరగలో ప్రతి క్షణంలో.

నిద్రలేని కళ్ళలో పూచిన

గులాబిరేకుల అంచుల

వంపుల్లో తిరుగుతూ,

కళ్ళలో ఒదిగిన

మెలకువ గట్లపై కదలుతూ

ఎక్కడిదీ జ్వాలా రూపం

ఎప్పుడు దయచేసిందీ ?

ఏ నాడులు సంస్పృశించి

సంగీతం ఒలికించాలనో ?

ఏ రూపం తగులబెట్టి

బూడిద చేయాలనో ?

దయచేసింది చెప్పా పెట్టకుండా

తిషవేసింది పిలువని అతిధియె.

నా ఇంటి వాకిట

అరుణ సుమ తోరణమైంది

నా ఊరి బయట

కింశుకసుమ వనమైంది

నిలుస్తుందా? నిలుకడగా.

ఎక్కడిదీ జ్వాలా రూపం.

ఏ తపస్సులో పుట్టింది ?

ఏ విప్లవంలో పెరిగింది?

కణకణాన్ని వెలిగించి

తేజో జగత్తును నిలుపుతుందా?

కణకణాన్ని దహించి

సూర్య గోళంగా మారుస్తుందా ?

ఎక్కడిదీ జ్వాలా రూపం ?

ఏ దిశ నుండి నాలోకి

ఇలా దయచేసింది?

ఆనాడు అరణి నుండి

ఉద్భవించిన అగ్ని

ఈ రహస్య రూపం ధరించిందా?

ఈనాడు తీగెల్లో

ప్రవహించే విద్యుత్తు

ఈ ప్రకాశ రూపం పొందిందా?

తర తరాల వలయాలు క్రమించి

వచ్చి చేరిందా ? నన్ను ఇపుడు,

తర తరాల వలయాలు గమించి

ఇలాగే పోయేనా? మునుముందు.

ఎక్కడిదీ జ్వాలా రూపం

ఎక్కడిదో కానే కాదు,

ఎంతో పరిచయమున్నట్లుంది

అంతలో క్రొత్తదనం వహిస్తుంది

గుర్తుపట్టే వీలు లేనంతగా.

రాలేదు ఏ దిశలనుండ

ఈ జ్వాలా రూపం

నా నుండి ప్రసరించింది

ప్రతి దిశలోకి.

నాలోకి ప్రసరిస్తుంది

ప్రతి దిశ నుండ

చీకటీ, వెన్నెలా వెలుగూ

ఏ విభేదమూ లేకుండా.

మనిషిలోని వాంఛా బీజం

తొడిగిన పల్లవ రాగం

మనిషిలోని అహంకార వృక్షం

వదలిన సంతాన ఫలం.

ఎక్కడికీ పోదు,

ఉంటుంది అందరిలోను,

అణీయసుల నుండి మహీయసుల వరకు

సముద్రంలో బడబాగ్నివలె గుప్తంగా

అరణిలో అనల తేజంవలె రహస్యంగా.

ఈ జ్వాలా ప్రకాశంతో

ఉదయించిన సంస్కృతి,

ఈ జ్వాలా సంచారంతో

కావచ్చు, చీకటి దిబ్బ.

ఇది ఎక్కడికీ, పోదు.

ఉంటుంది గుండె తోపులో

గంతులేస హరిణ మృగం వలె.

ఇది ఎక్కడికీ పోదు

ఉంటుంది నిద్రా వనంలో

జూలు విదల్చి నిల్చే సింహంవలె.

ఈ మనోజ్ఞ జ్వాలా రూపం

అఖిల మానవాత్మకు సంకేతం.

స్వేచ్ఛా కవిత్వం

Madiraju Ranga Rao was

Prof. Madiraju Ranga Rao,

a distinguished writer,

born on June 8, 1935, in

మొదటి సంపుటం Addendum - 1

scholar-poet and a literary

Pandithapuram village,

critic, contributed

Khammam, Telangana.

రచనా కాలం 1953 - 1975

extensively to various

Madiraju Ranga Rao was a

literary genres of Telugu

student of Telugu and

literature including classical

Sanskrit literature at

literature, modern poetry,

Osmania University (O.U),

స్వేచ్ఛా

and criticism. Prof. Rao

obtained M.A. Sanskrit

established his own niche

(1960), M.A. Telugu (1962),

కవిత్వం

through his literary works in

Ph.D. Telugu (1966).

'Free Verse' (Swecchaa

Dr. Madiraju Ranga Rao was

Kavithvamu) and Literary

a member of the Editorial

Criticism. Central to Prof.

Board for the critical

Madiraju Ranga Rao's poetic

editions of Andhra

మొదటి సంపుటం

purpose were humanistic

MahaBharatham and

Addendum - 1

ideals and a democratic

Andhra MahaBhagavatham.

perspective rooted in a heart

Dr. Rao's first academic

that symbolized peace. This

రచనా కాలం

appointment in 1964 was

was the very essence of his

1953 - 1975

with the Department of

'Free Verse' poetry. Popular

Telugu, O.U, Hyderabad,

journals published his

then followed a long tenure

creative writings on a regular

at Kakatiya University,

basis. During his long and

Warangal, Telangana as

highly productive literary

Professor, Chair Board of

career, Prof. Madiraju

studies and Dean for

Ranga Rao’s creative

writings culminated in more

Faculty of Arts. Prof.

than 160 books on 'Free

Madiraju Ranga Rao was the

Verse' and over 20 books on

Founder and President of

Literary Criticism – a total

'Rasadhuni Sahithi Parishath'

of over 180 books –

literary Foundation.

published until his demise

Vol. 1

on June 21, 2025.

స్వేచ్ఛా కవిత్వం — SWECCHAA KAVITHVAMU

మొదటి సంపుటం (Volume I) · Addendum – 1

ABOUT THIS DOCUMENT / ఈ గ్రంథం గురించి

A complete, page-for-page digital edition of the printed book. Each page of this

document corresponds exactly to the same page of the printed edition (616 pages).

Title: Swecchaa Kavithvamu (స్వేచ్ఛా కవిత్వం), Volume I, Addendum – 1

Author: Prof. Madiraju Ranga Rao — ఆచార్య మాదిరాజు రంగారావు

Born: 8 June 1935, Pandithapuram village, Khammam, Telangana, India

Poet, scholar and literary critic; studied Telugu and Sanskrit literature at

Osmania University (M.A. Sanskrit).

Period of composition: 1953–1975 (రచనా కాలం)

Language: Telugu (Telugu script); front matter partly in English

Genre: Modern Telugu poetry — గేయాలు, వచన కవిత్వం, ముక్తకాలు

Edition: First Edition, 2026

ISBN: 978-93-5679-711-6

Editors: Madiraju Santhosh Kumar · Devulapally Haritha · Madiraju Charitha

Copyright: © Dr. M. Santhosh Kumar

Published by: Rasadhuni Sahithi Parishattu, Shantinagar, Hyderabad – 28

Printed at: Anupama Printers, Shantinagar, Hyderabad – 28

For copies: Dr. Madiraju Santhosh Kumar, +91 98499 79899

Digital portal: swecchaa-kavitvamu.org

Author site: madirajurangarao.com

Extent: 616 pages

CONTENTS / విషయ సూచిక (11 collections)

1. కిర్మీరం Kirmeeram (1957) · 2. మేల్కొన్న ఆకాశం Melkonna Akasam (1959)

3. మనోభూమికలు Manobhumikalu (1960) · 4. అద్దంలో నీడలు Addamlo Needalu (1960)

5. పృథ్వీగీతం Pridhvi Geetam (1961) · 6. మరో ఉదయం Maro Udayam (1962)

7. సౌందర్యశిఖ Soundarya Sikha (1963) · 8. యుగసంకేతం Yuga Sanketam (1970)

9. ముక్తకాలు – ఉష ఆగమనం Mukthakalu – Usha Agamanam (1970)

10. మానవీయం Manaveeyam (1971) · 11. ఆనందధుని Anandadhuni (1975)

KEYWORDS

Telugu poetry, Telugu literature, modern Telugu poetry, Madiraju Ranga Rao,

Swecchaa Kavithvamu, స్వేచ్ఛా కవిత్వం, మాదిరాజు రంగారావు, Yuga Sanketam,

యుగసంకేతం, Telangana literature, Osmania University, Telugu geyalu,

vachana kavithvam, 20th century Telugu verse, Hyderabad, Warangal.

DIGITAL EDITION NOTE

Text recovered from the printed edition and re-typeset in Unicode Telugu

(Noto Sans Telugu). Page geometry follows the print edition: A5, margins

0.2in top/bottom, 0.3in left/right. This page is an added metadata page and

does not appear in the printed book.