Vartamanam Screen Pai (వర్తమానం స్క్రీన్ పై) Collection 9 of Volume I — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1974–91. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/text/vartamanam-screen-pai --- బయటి నుండి అద్దాలపై ప్రసరిస్తుంది చీకటీ వెలుగు వెన్నెల పరావర్తమై చిత్ర రూపాల్లో కిర్మీరమై ఎప్పటి కపుడు నాకో వ్యక్తిత్వాన్ని ఇస్తాయి 6. వాస్తవానికి బింబం పర్వత పంక్తులూ మైదానాలూ దాటిపోతున్నాయి హయాలు నింగీ నేల కలిసిన చోటికి చేరే ఆ వేగంతో అహరహమూ ఎక్కడి కక్కడ తృప్తి పడుతూ ఎప్పటికపుడు ఆశ వహిస్తూ అహం చావని మమత పోని అలల వలె దూకేను హయాలు రోజు పోయి రోజు వచ్చే మలుపులో కాస్త విశ్రాంతి మంచులో ముక్తా హారాల్లా ఎండలో మోదుగు పూల గుత్తుల్లా అంతలో వల్గత్ తరంగాల్లా గాలి కెదురు తీర్చిన కత్తులై ఒక చోట కాక పోతే మరో చోట ఉచ్ఛావచంగా పయనిస్తున్నాయి గాలిలో విశ్వాస లతలు అల్లుతూ నేలపై డెక్కల ముద్రలతో దారిలో దాహమై ఆగే వేళ నీటిలో తన బొమ్మ చూసి మురుస్తూ జన పదాలు అరణ్యాలు కత్తిరిస్తూ దాటుతూ సీమ దాటి సీమలోకి పరుగిడుతున్నాయి గాలిలో అశ్వ సమాకృష్యమాణ రథంపై వెలిగే సూర్యుని వలె నా పయనం ఊహ నుండి ఊహలోకి ఔను ఇది స్వప్నం కాదు వాస్తవానికి బింబం నిశా పత్రికలో ముందు తోచే వెలుగు రేఖలు కార్టూన్ VI. వర్తమానం స్క్రీన్ పై (1974) ఇందులో 1. వెలుగులో ఈ నేలపై (1974) 2. మేల్కొన్న ఈ సమయం (1975) 3. శబ్దమై ప్రాణమై (1976) 4. అగ్నిమయం జీవితం (1980) 5. కాలాన్ని నిలిపి క్షణం (1979) 6. ఈ తరం స్వర చిత్రం (1986) 7. అశాంతి ఆర్కెస్ట్రా (1991) 8. వర్తమానం స్క్రీన్ పై (1991) అంకితం ప్రజాస్వామ్య సంస్కృతీ మనస్వి రచయిత మాన్యశ్రీ పి.వి. నరసింహారావు గారికి వెలుగులో ఈ నేలపై సూచిక 1. కిరణలహరి పై పుట 2. సమైక్య శిఖరమై 3. వెలుగులో లక్ష్యం 4. ప్రభా రూపం 5. వాంఛా రూపం 6. సమయ స్పందనం 7. వర్తమాన శిఖరాలు 8. సమయ దృశ్యం 9. అద్దం ముందు 10. పనిలో ఆలోచనలో 11. జ్వాలా క్షణాలు 12. నీలి పందిరి క్రింద 13. నాగరక సోపానాలపై 14. ప్రజాస్వామ్యం వైపు 15. స్మృతి భూమి 16. జన శక్తి వైపు 17. ఆదిత్య కాంతిలో 18. ధరిత్రిపై 19. మానవ చేతనతో 20. స్వేచ్ఛా చేతనతో 21. ఆత్మ బింబం 1. వెలుగులో ఈ నేలపై (1974) 1. కిరణ లహరిపై ఈ ధాత్రి చూచింది, ఎన్ని సంధ్యా ముఖాలో దేశ స్వాతంత్ర్యం ఆయువు బంగరు రేకులు తొడిగింది పద్మాతపత్రం వలెనున్న ఈ ఉదయ గగనం కింద నిలిచి త్రివర్ణ పతాకానికి మొదట వందనం చేసాక మనం ముచ్చటించు కుందాం మనలో మాటగా అన్నీ ప్రాక్ సరసి సూర్యుని వెలుగు వలె సరదా పూచిన పందిట్లో దండలు త్రెంచేయమనీ ప్రదర్శన నిలిపేయమనీ ఏవో ఏకరువు పెడితే చూస్తూ చూస్తూ ఎలా ఉండగలను ? ఇంతటి సంతోషం సంరంభంలో మనమంతా భాగస్వాములమే మబ్బుల మాటు నుండి ఊగి జారే కోష్ణ ఉదయ కిరణాలకు కరిగి మెరిసే హిమ శకలాల వలె క్షణాల కదులుతున్నాయి శిల వలె పడి ఉన్న మౌన గళం ఊద బడిన శంఖమైంది జడ హృదయం మీటిన వీణయై నాదం పొందుతూంది పగలు శబ్ద వ్యూహాల్లో తిరిగి తిరిగి అలసి సొలసి నిశ్శబ్ద శిఖరానికి రాత్రి చల్లగా చేరుకునే గాలి, విభిన్న స్థానాల నుండి వివిధ రాగ సంపుటితో స్నేహ శక్తి నింపుతూ మనోవీధి కదలుతోంది. కలవరింతలతోనో ఏమీ ఎరుగనట్లో ఏమీ పట్టనట్లో ఉన్న నిన్నటి వాతావరణం సమస్తం నేడు హత్తుకుని జాతీయ రాగం అణువణువూ స్వేచ్ఛా గంధంతో ప్రాణాసార ప్రసారానుభవాన్నిస్తోంది గంటలు మ్రోగుతున్నాయి నిదుర నుండి మేల్కోని మ్రోతలు ! ఎద ఎదలో దూర దూరం నుండి ఆశయం ప్రతిధ్వనిస్తోంది జాతిలో పరిపూర్ణత క్రమ్ముకొనీ శూన్యత పోవాలి స్ఫూర్తిలో కర్మణ్యం తరుముకొనీ నైశ్చల్యం పోవాలి ముఖ రేఖల్లో రూపొందిన స్పష్టమైనత గతితో ఈరోజు అద్దం వలె కర్తవ్యం బింబిస్తోంది టెలిగ్రాఫ్ తీగెలపై ప్రసరించే వార్తా చిత్రాల వలె ఆలోచనా తంత్రులపై అనుభవ దృశ్యాలు కదలుతున్నాయి ఇది బాష్ప జలం కార్చే సమయం కాదు ఇది ఆయుధాలు పేల్చే తరుణం కాదు ఈ రోజుకు అణువణువును తీర్థంగా మలచే శక్తి ఉంది ఈమనసుకు మట్టి మండి స్వర్గాన్ని తీర్చే శక్తి ఉంది పగలు ఎగసి క్రమ్మిన దుమ్ము పొరల్ని అణచేస్తూ రాత్రి అంతా కురిసిన మంచు తడి ఆరనే లేదు ఈ బ్రతుకెన్ని సంద్యా ముఖాలో ఇంకా చూడాలని ఉంది ! ప్రతి ఎద ఒక మృదుల సూర్య బింబ మవాలిసి ఉంది 2. సమైక్య శిఖరమై నా కాళ్ళు కదులుతున్నాయి గంగా గోదావరీ ప్రవాహం పంక్తి వలె నా చేతులు మెదలుతున్నాయి కృష్ణా బ్రహ్మపుత్ర తరంగాల వలె ఈ దేశ స్వరూపంలోని భిన్న స్వర మేళనంతో ఈ దేశ ప్రకృతిలోని వివిధ శక్తి పరంపరతో ఎదురౌతుంది తేజో రూపం స్వర్గం కన్నా గరీయం. బ్రతుకులో బీటలు వారిన నేలతో మనసులో దొరలే పిడుగులతో ఎదురుగా నినాద తరంగాలతో ఈ సమయం సమాజ వలయాలు కూలే గిరి శిఖరపుటలజడితో, దూకే ప్రవాహోద్రిక్త గతితో కదలే ప్రజా సమూహం ఇప్పుడో, చెలరేగిన బాలసముద్రం స్వాతంత్ర్య దినాన నేడు ముని వ్రేళ్ళపై నిలిచింది వినమ్రంగా రోజూ ఉదయం మౌన క్షణాలతో అవతరిస్తుంది రోజూ సాయం విషమ క్షణాలతో నిష్క్రమిస్తుంది ఈ రోజు ఉదయం పలుకుతూంది ప్రియంగా ఈ రోజు సాయం కదులుతూంది సమగతితో జడులుగా వెలుగు వెదజల్లుతూంది ఝరులుగా చైతన్యం సరిస్తూంది వివిధ భావ జనంలో స్నేహ కళ వికసిస్తూంది నిశ్శబ్ద ముఖాల నుండి జలద నాద మొలుకుతూంది బిందు కోటి సమస్తం ప్రాణిత గణ మూర్తి అవుతూంది హింసారుణ మతి లోను శాంతి పుష్ప ముదయిస్తూంది ఈర్ష్యా ద్వేషాలు క్రమ్మి మరుగు పడిన ఆత్మీయత మనోరూప యంత్రాన్ని అర్ధ మయం చేస్తూంది అనుభవ మున్నంత వరకు పరమ యధార్థమై జీవితం అలసినా శరీరాలు పద పదం పరుగులు తీస్తున్నాయి తరలీ మాటలు ఎద ఎదనూ రాగంతో కలుపుతున్నాయి అంతరాలు విభేదాలు తొలగి కవితా మయమై హృదయం స్వేచ్ఛా సంచారం పొందుతూంది, బ్రతుక్కి లక్ష్యం తలపిస్తోంది. 3. వెలుగులో లక్ష్యం దూరాన ఒడ్డగిలిన రథం కాలిబాటన బండీ రోడ్ పై కారూ ప్రక్కనే సమాయత్త యంత్రాలు జీవితాన్ని నడిపేవీ కాలాన్ని దూసేవీ దేవాలయ గోపురాలు ! గత స్మృతుల మొగలి పట్టలు కర్మాగార శిఖరాలు ! వర్తమాన ప్రగతి ముఖాలు వర్తమాన కవాటాలు తెరచి లోనికి ప్రవేశిస్తే ఏముంది ? ఇంద్రధనూ రూపం కొందరికి మృగతృష్ణా భావం కొందరికి కరుడు కట్టిన చీకటి కొందరికి శిథిల శూన్య గృహం కొందరికి ఈ బాధలూ గాధలూ ఎవరికి సమాజానికా ? వ్యక్తులకా ? వ్యక్తుల సమాహారమైన సమాజం భేదిస్తుంది అస్తిత్వంలో ఎవరి బాధ్యత వారిలో చివురిస్తేనే సమాజ సౌభాగ్యం ఫలిస్తుంది అందరికీ ఉంటుంది అకాశాన్ని అదుముకునే ఆశతో బ్రతుకులో అంచుల్ని స్పృశిస్తూ ఆనందం ప్రవహించాలనీ ప్రతి వ్యక్తీ ఉన్నమత్ జల తరంగమై తేనే దేశం సస్యశ్యామల వాచ్యం సంతోషం సరిస్తోంది నాలో పగలు మంచు సోన వలె ఆలోచన వెలుగుతూంది నాలో గగన నేత్ర కాంతి వలె త్యాగ భూమి నుండి పుట్టిన స్వాతంత్ర్య మహావృక్షం ఛాయల్లో ఎద ఎదలో సమైక్య బింబం ఈ సమయం తేజోరూపం ! లక్ష్యం ప్రజా హృదయ క్షేత్రంలో స్వర్ణ కాంతి సస్య ఫలం ! 4. ప్రభా రూపం నా మనస్సు నటత్తరంగ శ్రేణులతో తలెత్తి నిల్చిన సముద్రం నా ఊహ జనతా గాథా కల్లోలంతో శివ మెత్తిన ఉదయ గంగ నా నరాల్లో జీవశక్తులు కదలుతూన్నవి సశబ్దంగా మెలకువ తీగెల్ని మీటుతూ అంతర్నాదాన్ని పలికిస్తూ ఈ నాటి ఆతప జ్వాలలు రేపు వర్ష ధారలు తెస్తాయనే ! జలదానికి వర్షం వలె నాకు ఆనందం హృదయ సహజం నా కళ్ళ నుండి రాలే అగ్నికి గ్రీష్మం సంతప్త మవుతుంది నా కళ్ళ నుండి జారే నీటికి అవని దయార్ధ మవుతుంది ఈ జన్మభూమి పై నవనవ రూపంతో అనవరతం సాగిపోయే నేను ఏచోట నిలిస్తే అదే ! నా ప్రియ వాసం ఒకపుడో అపశకునపు పక్షి అడ్డంగా దూసుకు పోతుంది ఒకపుడో శుష్క పత్రం ఎదురుగా ఎగిరి రాలి పడుతుంది అనంత సమాజ ముంది నాలో బీజం వలె ఒదిగీ అంతమూ ఉంది నాలో ఎక్కడికక్కడ దిశల వలె నిలిచీ మునుముందు తలపుల్లో మధురంగా తోచే అనుభవమై ఆనందానికి దారి తీసే వర్తమాన విషాద మూ ఉంది నాలో తలుపులు మూసుకున్నా మిత్రమా వెలుగు వస్తుంది సందుల్లో నుండై నా మనల్ని కలవడాకి ప్రతి ఉదయం యుగ యుగాలుగా చాచిన ఆశీః ప్రసారకరాలతో నా కళా శిరస్తలోపరి ఆకాశం నిలిచి ఉంది ప్రభారూపమై నన్నందుకో జూచే కాలం నాకో బారెడు దూరంలో ఎపుడూ, కాలానికి విసుగూ విరామం లేదు నా కంతకన్నా లేదన్నట్లుంది నా రూపం కదలుతూంది మనిషిలో వెలుగు మూర్తులు వడలుతూ నే కోరను స్వప్నంలో మెరపులు ! రానీ తమస్సు గాఢ నిద్రగా ఆ పైన నా కంటికి జాగృతి ! నా ఇంటికి శాంతి ప్రభాతోరణం ! 5. వాంఛా రూపం నే కోరను వెనక్కు మరలడానికి ! నే వీడను స్వర్గంకై జీవితాన్ని నే కోరను నాకై ప్రార్థించమనీ ! నే కోరను పరదేశ వారసత్వం సింహాసన శిథిలాలకై చింతించను కిరీట శకలాలకై యోచించను నా జాతి బికారి కాదు, నా సమాజం ఎడారి కాదు, నేనో వసంతం ! వృద్దు ముఖం ముడుతల్లో భద్రమైన అనుభవాన్ని పరిశీలిస్తా యువతా జన వదనంలో పల్లవించే ఆలోచనల్ని గుర్తిస్తా ఓపిగ్గా దర్శిస్తా మానవ సంస్కృతిలో వెలిగే ఆత్మ తేజం విషమ క్షణాలు మరవాలని భగవంతుని ప్రార్ధించను అవి గాయాలై చిహ్నాలై హృదయాన్ని అలంకరించనీ అవి మరవని గుణ పాఠాలై జాతిని మెలకువలో నిల్పనీ నే కదలుతా మేఘం వలె వివేక పదం నుండి విజ్ఞాన శిఖరం దాకా సూర్యుని రూక్షే క్షణానికి దగ్ధ మయ్యే భయమూ లేక పోలేదు సూర్యుని కెదురుగా, మానవత విప్పారిన చల్లని గొడుగై జీవ కోటి కాహ్లదంగా నిల్వడం నా కెంతో గర్వం అహం నుండి ఉద్భవించే అగ్ని క్రియా రూప చిత్రం మనచుట్టూ పరిభ్రమించే ఈ చరిత్ర కీర్తి సమస్తం నే కోరను నైశ్చల్యం నే వీడను జీవిత వాస్తవం పై గమనం వద్దు వద్దు ఏకాంతం, గుహ లోకీ మాయ లోకీ పలాయనం వికసించిన ఉత్సాహ తేజం జాతి కిపుడు కావాలి వాడి రాలి నశించే ముందు, ఆశలు ఫలింప గోరీ తరం నుండి తరానికి ఫల రూపం అందిస్తూ పైన పక్షులు నింగిలో క్రింద చేపలు నీటిలో భూమి పై ప్రాణులు ఇంకెన్నో వాటిలో ! బ్రతుకుకై బాగుకై పరిక్రమించే పరిశ్రమించే మనుషులే ! మహా సంస్కృతీ పరంపరకు వారసులు ! నాకు తెలుసు మనిషిలో దేవతలూ రాక్షసులూ పక్షి పామూ జంతువూ, వివేక విలసనంతో దిశ దిశ అణు వణువూ మనిషి అధిపత్యమే! 6. సమయ స్పందనం ఉదయం సాయం సంధ్యల వలె శాంతి యుద్ధ జీవితంలో ఏదో ఒక రూపంలో ఆనందం విషాదం ఎదురయ్యేను అభాగ్య అశాంతి దారిద్య్రం ఆక్రోశం ఆవేదన తొలగించే నవ సమాజ నిర్మాణంలో మానస బిందువుతో భౌతిక రేఖనూ గగన తలం మార్మోగే గర్ణామృదంగ జలంతో జ్వాలల్ని తొలగిస్తూ ఎద ఎద తడుతూ అనురాగ స్వరంతో అమృత లిప్త స్పందిస్తాను నరాల్లో ఉత్సాహం చిందులు త్రొక్కుతూ తేలి తేలి కదిలే శరీరం ఎంతలో ఎన్ని వాద్యాలుగా మారుతుందీ సమైక్య హృదయం మనస్సులో స్వాతంత్ర్యం పరవళ్ళు తొక్కుతూ అశ్వగతి పొందుతూంది హిమ బిందువు నుండి ప్రవాహ గతితో సముద్రం వరకూ చేరే సత్యమై శివమై సుందరమై జీవిత శిఖరంపై ఒకే తేజో రూపం, దేశం అంతరంగం అడుగునున్న ఆలోచన మేల్కొంది మానవతా రాగంతో భారతాత్మ బింబంతో ఈ నేలపై పద పదంలో ఒకే సంస్కృతీ పద్మం ఈ గడ్డపై కణ కణంలో ఒకే సమైక్య వాదం హిమ స్ఫుట శుభ్రమై సాగర రసార్ధమై ఆనందాకాశమై అనుభూతి వాహినియై సామాన్యుని ఆలోచనలో జీవిత వ్యాఖ్యానమై ఈదేశం నాదేశం ఈ సమయం మహా కావ్య రూపం అంగార కణం వంటి వర్తమాన సమస్య వదిలి 7. వర్తమాన శిఖరాలు ఎలా ఊహించగలం భవిష్యత్తు స్వప్న ఖండం ? ఈత చెట్లకు మల్లె తల విరబోసుకొన్న క్షణాలు మహా వేగ ధురామతి చేతిలో కారు వలె దూసుకు పోతున్నాయి సమయ ముఖంలో గాయాలు లోతులూ నెత్తురు చారికలూ ఒకనాటి కలంకార చిహ్నాలుగా గుర్తింపుకు రావచ్చు ? ఒక క్షణం అడవిలో పైకి దూకనున్న సింహం వలె ఎదురౌతుంది ఒక క్షణం ప్రేలనున్న మెషిన్ గన్ వలె సూటిగా చూస్తుంది యజ్ఞ వేది నుండి సాగే నీల ధూమ జటాచ్చటలతో యంత్ర శిఖరం నుండి నీల ధూమ వలయ పంక్తులతో ఆకాశం నీలి ముగ్గు వేసినట్లుంది, మంచితో చెడూ తప్పదు ఇంతసేపు ప్రయాణంలో ఎక్కడ వేసినత గొంగళి అక్కడే ఉందా ? ఇంతవరకేవో ఘన కార్యాలు ఒరగ బెట్టలేదనీ కాదు తాబేళ్ళ వలె పరిశ్రమలు భుజగాల వలె ఆనకట్టలూ ఎన్నికలూ వెలుగు నీడలు క్రీడలాడే రాజకీయాలూ ఈ పురోగమనంలో అలసి సొలసి నీడ పంచన చేరుకున్న సామాన్యుల ముఖాల్లో ఆరోగ్యంగా ఆనందంగా తృప్తి రేఖ వికసించింది, సామాజికత న్యాయంతో వ్యక్తి గౌరవ శిఖరం ఎదగంది ఈ ప్రయాణానికి ప్రయోజనమేమిటి ? జీవితాన ఉత్సాహ మెక్కడిది ? 8. సమయ దృశ్యం ఉదయం రోదసి కళ్ళు చెమ్మ గిల్లినట్లు మంచు తెరలు చెట్ల తలపై పూలుగా చేతుల్లో మొగ్గలుగా మంచు బిందువులు ! దారుల్ని మూసి సందు లేకుండా ఆశల్ని నిలిపి మంచు వెండి పూతగా సూర్యునికీ ప్రపంచానికి మధ్య పిలవని పేరంటం వలె నిలిచింది ఇంకా దిక్ స్వరూపం సమగ్రంగా ఆవిష్కృతం కావలసి ఉంది ఇంకా మనిషి మనోరూపం సంపూర్ణంగా మేల్కొవలసి ఉంది ఇక్కడ నిజంగా మనుషులంతా మేల్కొనీ లేరు ఆలోచనా రంగం పై ఇంకా స్వప్న దేవతలు నర్తిస్తున్నారు ! ఎముక ముక్క నోట కరుచుకొని ఇటూ ఇటూ చూసీ చూడకుండా మంచు పొరలు చీల్చుకుంటూ పరుగిడుతోంది కుక్క అపుడే చల్లారిన శ్మశానంలో నిప్పు రవ్వల కళ్ళతో ఒక్క ఊపులో కవోష్ణ శరీరంలో ఊదిన శక్తి స్ఫులింగంతో రెక్క లొచ్చిన వెలుగుల వలె నీడల వలె పక్షులు మంచులో నుండి దారి చేసుకోనీ ఆపై కెగిరి పోయేందుకు సాహసం చేస్తున్నాయి మైదానాల్లో నుండి కాలి దారిన, సన్నని కాలవల్లో పడవల వలె మెల్లగా శ్రమ జీవులు జీవన గమ్యాలకు తరలుతున్నారు పొద్దు పొడిచీ పొడవక ముందే లేచి కిటికీ వద్ద నిలిచిన నా కంటికి కన్పించే మొదటి జీవన గతిలో ప్రయాస దృశ్యం చల్లగాలికి బరువుగా కదలే ఊపిరి తీగెలపై కాలం ఊగుతోంది ఊగే కాలానికి సనసన్నని వెలుగు కాస్త ఉత్సాహ మిస్తూంది మంచు వదలిన గాలి ఏదో రహస్యం చెప్పబోతోంది మంచు తొలగీ ముఖంపై బయట పడిన రహస్యం సమయం తిష్ఠ వేసిన పెద్ద వడ్డీ వ్యాపారి వలె ఉంది అద్దం ముందు నిల్చున్న నా ముఖంలో రీల్ వలె దృశ్యత పరంపర కదలుతూంది వేడి వేడి టీ రుచితో ఉత్సాహ లహరి అందుకుంది 9. అద్దం ముందు గంధంలోనో మంటల్లోనో ముంచెత్తే స్మృతులు నన్ను త్రిప్పి త్రిప్పి ఎక్కడో ఆనంద లహరి పైనో వేదనా కోలాహలంలోనో వదలుతాయి ఉత్సాహంతో వెలుగు తోట అయితే నిరాశలో చీకటి కోట అయితే ఎదిగే మనిషిలో అడవీ ఉంది పెరిగే అడవితో ఆటవికమూ ఉంది బయట కిటికీ చువ్వల పై నుండి ఆకులతో పూలతో లోనికి ప్రాకే తీగె వలె ఆలోచన ఓ వీడని బంధమైంది ఫ్యాక్టరీ గొట్టం నుండి ఎగసే పొగ మబ్బు వలె రోజు క్రింది నుండి పైకి మొదలౌతుంది కుంటుపడిన లిప్తలతో బద్దకంగా నడుస్తుంది వరదల్లో ప్రాణి వలె ఆచూకీ లేకుండా వెళ్ళి పోతుంది దీన్ని గురించి ఆలోచనతో సతమతమై చురుకుదనం వచ్చే లోపల కొండల మధ్య వాగువలె ఎవరి ఆర్తిలో వారు నడుస్తుంటారు మరొకరి మాట వినే తీరిక లేదు, ఎవరి స్వర ప్రపంచం వారికి ప్రియం ఒకరి ముసుగుపై మరొకరికి వల్లమాలిన ఇష్టం తమ ముసుగులోపల లేందేదో అందులో ఉందని అనుమానం చీకటి ఒక పెద్ద ముసుగు ! దిశ దిశ నుండీ పగలూ రాత్రి, దీన్ని తీయడానికో ప్రయత్నం దీన్ని వేయడానికో సంరంభం రాత్రి నల్లని బోర్డు పై తెల్లని అక్షరాల వలె వెలిగే లైట్లు బయటి ముసుగును తొలగిస్తాయి కాని లోపలి ముసుక్కి వెళ్ళలేవు ఆకలి కడుపులతో చీకట్లో దాగిపోయే ఇష్టంలేక బయటపడి కొందరు అగ్నులై నడిచేరు కొందరు రాత్రిని దహింపజూచేరు చీకటి వ్యాపారం విరివియై వెలుగు గింజ కరువవుతూంది కళ్ళలో పగలు రాత్రి ఊయల వంతెన తాళ్ళ వలె ఊగుతున్నాయి గట్టు పైన తుమ్మ చెట్టు వలె కర్షకుడూ గేటు వద్ద దీప స్తంభం వలె కార్మికుడూ 10. పనిలో ఆలోచనలో ఊపిరి సలపనంత పని ఎందరికో మతి మందగించే ఆలోచన ! సమాజంలో జీవితం గురించి నిప్పు పూలు పూచే మనస్తత్వం ! ఎక్కడి కక్కడ తలుపులు మూసుకొని కిటికీలు తెరచి మధ్య తరగతి సందేహులు ! అన్నానికి లోపం లేని వాళ్ళు యజమానీ శ్రమజీవీ ఇరువురి సంబంధం ఇంతవరకూ ధనంతో ప్రయోజనమూ, పనితో క్షుద తీరడమూ సమతా మానవతా లక్ష్యంతో శ్రమలో ఆనందం ఇంకా రావలిసి ఉంది ! ఎవరికి వారు తన్నుకు చస్తున్నారు కంచె పేరుతో నీరు పేరుతో అపాయపు గుర్తుల్ని చూచీ చూడకుండా పరుగిడుతున్నాయి వాహనాలు గమ్యం చేరే తొందరలో ఎక్కడ ఎవరు క్రాస్ చేసేదీ తెలీదు ! ప్రయాణంలో సూత్రాల్లో బిగించిన పరమార్థం పట్టుపడక దారి తప్పేరు పనిచేసే కుర్రవాని ఐదు ఒకట్ల నోట్ల పిడికిలి సడలింది ఎన్ని రోజులు శ్రమ తూగిన ఫలమో సీసాపై సీసా ఖాళీ చేసి ఆ పైన సినిమా చూడడమే మిగిలిన కర్తవ్యంగా ఉందీవారం వీధుల్లో గుంపులుగా నినాదాలతో నడచే అగ్నుల వలె యువకులు వివిధ వర్ణ సమరభావ పక్షాల రాజకీయాస్త్రాలు ఢీకొంటున్నాయి అరచే వారికీ పొడిచే వారికీ అగ్ర తాంబూలం ! వీర సన్మానం దొరకుతోంది బ్రతుకుపై రుచి చావని వృద్ధులు మరో జన్మకై వేచి ఉన్నారు దండ తెగిన ముత్యాల వలె ఎవరికి వారు దొరలి పోతున్నారు రానున్న శతాబ్దిలో సౌభాగ్యంపై ఆశతో కాలం స్వప్నంతో ఉంది ప్రస్తుతం మండే ఎడారిలో పచ్చని ఆలోచనతో బ్రతుకుతూంది ఎంత పరిచయమున్నా అపరిచితునివలె ప్రవర్తిస్తుంది కాలం పరిచయం లేకపోయినా ఆపుని లా హవణిస్తూందీ రోజు ఉదయం వదిలినట్లు వదలి తిరిగి పడే బంధనలో బాధతో జీవితంలో నిగళ ఘలం ఘలల్లో ఎక్కడో కించిత్ మెరుపు రేఖతో ప్రయాణిస్తోంది దేశం స్వేచ్ఛా యుగ ప్రజాస్వామ్య లక్ష్యంతో జీవితానికి ఆగడం లేదు ప్రయాణానికి విరామం లేదు రావాలి శ్రేయో సంస్కారంతో ప్రజాస్వామ్య మనో వికాసం సమతా మానవతా ప్రగతి భావ వర్తనతో దర్శనమై 11. జ్వాలా క్షణాలు అణచిన శక్తులెగసి విజృంభిస్తే పాతిన రూపాలు చీల్చుక పై బడితే స్వార్థం శిఖి శిఖా మస్తకంతో ఆకాశపు టెత్తు పెరుగుతూంటే అసహనం ధూమ వదనంతో దిశల్ని సంకుచితం చేస్తుంటే ఇంతవరకు చిరాకుతో సణగే శాంతి భద్రతలు నిప్పులు త్రొక్కిన అడుగుల వలె గంతులేస్తున్నాయి హక్కులకై పోరాటంలో పదవులకై నేల విడిచి సాముతో కుమ్ముతూన్న పొడుస్తూన్న నినాద శబ్ద తరంగాలు, ఆయుధాలు ! మాటల బాకులతో ఈటెలతో పోరాడుతూన్న కరపత్రాలు అహం ఎగిసేను బడబాగ్నియై, జనం తరలేను ధూమ వదనంతో రాళ్ళు సంగీతం పాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది వాలకం మ్రోళ్ళు నృత్యం చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందీ అంగణం సామాన్య జన శ్రేణులు అలల వలె బుజా లెగుర వేస్తున్నారు బుట్టల్లో ఎరలతో చేపలకై వెళ్ళే వాళ్ళు వెళ్ళుతున్నారు జేబుల్లో కత్తెర్లు సర్దుకుంటూ తారాడే వారూ ఉన్నారు చేతిలో సిరంజితో డాక్టర్ కిటికి నుండి దృశ్యంచూస్తున్నాడు పెళ్ళున విరిగిన మనస్సుతో బీటలు వారిన స్థితిలో ఈ సమయం ముఖాన కారం చల్లినట్లున్నా ఓ శాంతి రేఖ కాస్త నిలుస్తుంది నవ్వుతుంది దారికడ్డంగా తేమలో పడుకున్న కుక్కపై ఎక్కడినుండో రాయి పడింది నలుపెక్కిన సమయ ముఖంలో ఇంకా వెలుగు కళ రావలిసి ఉంది 12. నీలి పందిరి క్రింద జన సమూహ నినాదాలు ! నినాదాలు ధ్వన్యనురణన క్రీడలు మ్రోతలు అటు నుండి రాళ్ళ ప్రహారాలు ఇటు నుండి బులెట్ల విహారాలు పగిలిన లైట్లు అద్దాలు కాలిన వస్తువులూ ! ధూమ శిఖా హల్లీసకం ! ఉన్నట్లుండి ప్రేలింది రైఫిల్ ! హాహాకారం ఎగసింది ! సంక్షోభం రేగింది. ఏమీ ఎరగనట్లున్న సూర్యుని క్రింద ఆకాశం పొగలల్లుకొనీ నీలి పందిరిగా మారింది తేనే పట్టుకు సెగ తాకి చెదరిన తుమ్మెదల వలె జన సందోహం కసిగా చురుగ్గా చెంపల్ని తాకుతూ వేడి గాలులు విసురుతున్నాయి నఖ శిఖ పర్యంత ఉద్రేకం ఉవ్వెత్తుగా ఉరకలు తీస్తోంది. ప్రక్కన దారి దొరికిన ఝరుల వలె ప్రదర్శకులు పరుగులు తీస్తున్నారు చిరిగిన పొగ మంటల దుస్తులతో నిటారుగా నిలిచింది రోదసి జనగతి మందగించింది, మృత్యువు సమీపంగా కదలుతోంది కన్నుల్లో అణచుకొని వెలుగు ఎదలో దాచుకొని సహనం మండే అడవిలో ప్రాణుల వలె, భయాశ్రితులు పరుగిడుతున్నారు ! బుల్లెట్ల ధ్వని ఆగింది నిశ్శబ్దపు బాటలో బూట్ల శబ్దం హెచ్చింది గాలిలో ఆడపాదడపా ప్రతిధ్వనులతో హెచ్చరికలు తరలుతున్నాయి శ్మశానంలో సాయం సంధ్యా కీల అయిన ఈ సమయం కాలు విరిగిన వ్యక్తి వలె కదల్లేక కదులుతూంది క్షణాలు ప్రవహిస్తున్నాయి ఆగి ఆగి నిప్పులార్చుకుంటూ రగిలిన ఉద్రేకం మండి మండి సాయం వేళకు అలసి సొలసింది నినాదాలు మణిగాయి వివాదాలు సర్దుకోలేదు రాళ్ళతో టియర్ గ్యాస్ షెల్సో దూసిన బులెట్లతో దృశ్యం వికల వస్తుశకలాల్ని బింబించే శిథిలాల ఫోటో వలె ఉంది ఓడి పోతున్న నైతిక మూల్యాలతో గెల్వ జూచే హింసా సంచారంతో ఎరుపు క్రమ్మిన నలుపు రంగులో సంధ్యా మేఘం వలె ఉంది వాతావరణం పిత్రార్జితం బంగారు ప్ళరంలో వస్తే కష్టానికి నిర్వచనం తెలీదు స్వార్జితం వెండి ప్ళరంలో నిల్వడానికి కష్టానికి వాఖ్యానమవసరం కాలాన్ని ఎక్కడి కక్కడ కత్తిరించి దాటాలని ప్రతి వ్యక్తి తాపత్రయం ఎప్పటికప్పడు కత్తిరించిన ముక్కలే దారి కడ్డమవుతాయి ఇనుప గుండ్ల వలె దొరలుతూంది రోజు వెంట రోజు అడుగుపడే లోపల ఎప్పుడెవరు చితికి పోయేదీ తెలియదు మతం పేర గతం పేర భాష పేర వర్ణం పేర హక్కు పేర అశాంతి ఊపిరి తీసుకుంటూంది అలజడి అందలమెక్కుతూంది చెలరేగిన సమాజ తీరాన కాళ్ళు చాచి వరద లాపినట్లు శాంతి భద్రతల పేరున సినీ షూటింగ్ బందో బస్తులు పిట్టలు కొట్టుక బ్రతికే వాడో పెద్ద వీరు డయినట్లు చిత్రణలో బొమ్మలతో శీర్షికలతో ఉదయం పత్రిక లెదురౌతున్నాయి మంటలు నుండి ఆర్తి నుండి దేశం కోలుకునే లోపల ఇరుగు నుండి పొరుగు నుండి జ్వాలా సంచలన వార్త ! కష్టంలో హృదిలో విసరే వేడి గాలికి దుఃఖంలో చెక్కిళ్ళపై జారే కన్నీ రారి పోతూంది, ఈ జాతికిదో సహన శక్తికి సంకేతంగా చెలరేగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు దూరం నుండి గాలి అశేష వేగంతో వచ్చి చెవి ప్రక్కన హోరు పెడుతోంది సాగలేక సగంలో చతికిలబడ్డ పగటి పీడ కలలతో రోజుకో మొగంతో రోజులు వచ్చి పోతున్నాయి అనుభవం ఆలోచన పరస్పరం ఎదురై ఢీ కొని వేరై జీవితమూ సిద్ధాంతమూ చెరొక వైపు పోతున్నాయి గ్రంథాల్లోని పంక్తుల్ని అవగాహన చేసుకొనే లోపల వ్రేలి కొసల కందీ అందకుండా జీవితం పరుగెత్తుతూంది రధ గజ తురంగ కిరీటాల్లేని ప్రభువులూ ఎదురౌతారు ప్రతినిధుల సభల్లో మంత్రాలు వినిపిస్తున్నాయి చింతకాయలే రాలడం లేదు మంత్రగాడు దండం త్రిప్పుతూ లేనివి చూపించేను ఉన్నవి మరిపించేను, వ్రేళ్ళు దన్నుకున్న వేదాంతం బ్రతుకుల్ని అందంగా శూన్యంలో నిలుపుతూంది అవమానం కలచినపుడు మనిషి సూర్యుని వలె ఉదయిస్తాడు రాపిడితో నలిగినపుడు కొత్త శక్తి లావా వలె ఉద్యమిస్తుంది. కత్తిలా దిగినపుడు మాట నిప్పులా తాకినపుడు ప్రవర్తన దాసోహమనో తిరగబడో లోపలి మనిషివేటుతో పలుకుతాడు తిండికీ బట్టకూ తప్పనివై పోరాటాలు విషమిస్తే కల్లోలమై సమాజం ఎగిరిపడే అనల శకలాల వలయమే ! స్వాతంత్య్రం సమభావం అలంకార సమమై ఈ సమయం ड సామాన్యుని కే కర్తవ్యం బోధిస్తుంది ఏడ్వమనా ? ఎదిరించమనా ? ఆయుధాన్ని చేపట్టమనా ? అహింసను అవలంబించమనా ? సహనాన్ని కాపాడమనా ? శాంతిని నిలపమానా ? 13. నాగరక సోపానాలపై అటవి కన్నా భయదమైనా మృగం కన్నా హీనమైనా మనిషి మాత్రం నాగరకతకు శిఖరం, విజయం వైపే పయనం చీకటి డ్రస్లోనో మంచు షర్్ట వేసుకోనో ఉన్న జనపదం కొరడా వలె సూర్య కిరణం చెళ్ళుమనే దాకా కదలేట్టు లేదు పిడుగుల వలె దొరలేరు ఉల్కల వలె ఎగసేరు హింసా యుధులు ! సమతకై అలజడినీ మార్పుకై హింసనూ కోరేరు విప్లవమతులు! హింసారుణ కరాళంగా వ్యవస్థను దగ్ధం చేయాలనుకోనే కోరికలు అందకుండా తెలీకుండా వెనుక నుండి నీడయై మ్రింగేయజూస్తుంది ఉండి ఉండి వినబడే అలజడికి ఆక్రందనకూ సమయం వరదలకు ఉలిక్కిపడే ఒడ్డు వలె క్షణ క్షణం కంపిస్తోంది. జ్వాలా వదన సహస్రంతో దేశ భవిష్యత్తును తీర్చాలనుకునే సోదర బృందం తపనను వీచే గాలి రికార్డు చేసి వినిపిస్తోంది చావు నుండి తప్పించుకునే యత్నంలో దానిలోనే పడుతున్నారు, పడేస్తున్నారు పీడనలో రాపిడి పొందిన మనస్సు పొందాలి బ్రతుకులో ఉదార వ్యక్తిత్వం భౌతిక శక్తితో మనస్తత్వరీతితో కదలే బ్రతుకులో అన్నీ వాస్తవాలే ! వాస్తవాలకు ప్రతినిధి మనిషి ! ఆదర్శాలకు బింబం ! ఈ సర్వంసహ పై ప్రతి మతానికీ ఉంది స్థానం చెట్టు వలె ఒకటి నీడ వలె ఒకటి కొమ్మపై గూడు వలె ఒకటి మనిషిలో ఎప్పటికపుడు సీమలు మార్చేవీ పరివర్తన పొందేవీ ప్రతి రెండు ప్రపంచాల మధ్య భేదం అనివార్యం ఈ రెండు భావాల మధ్య సహభావం అవసరం 14. ప్రజాస్వామ్యం వైపు చరిత్ర పద చిహ్నాలుగా మిగిలిన శిథిల సౌథాల్ని అంటుకొనీ అనాథలూ నిరాశ్రయులూ ఓ పంచన వాలి యున్న నీడలు ! మనస్సు తవ్వుతుంది, స్వక్షేత్రంలో పొడ సూపిన నిధికై కర్షకునిలా జీవితం పలుకుతూంది వర్తమాన తంత్రులపై వయోలా వలె పచ్చని మనస్సుతో బంగరు తలపులతో ఉన్న ఆశా వహులూ నల్లని దుఃఖంలో మంటల ఆర్తిలో ఉన్న బాధా మతులూ ధూళి కణమై లేచి చుక్కయై అలయై సాగి సముద్రమై నిలవాలనే అంతా వలయంలో బిందువులే ! అంతా బింబానికి కళలే ! సిద్ధాంతం సందర్భంతో నీతినీ నియమాన్నీ ప్రశ్నించే తరం ఏ పేరిట నిరంకుశత్వం కోరదు ఏ రూపంలో రాజరికం కోరదు ఉదార ప్రజాస్వామ్య వాదం వేగంగా అంతరాల తగ్గించే సాధనం వ్యవస్థలో మార్పుతో వ్యక్తిలో మానసిక వికాసమూ అవసరం అందరిలో ఒకే భారతాత్మ ! వికసించిన శాంతి తేజం గ్రీష్మ వర్ష శిశిరాల్లో తీవ్ర ప్రకృతి శక్తుల మధ్య నిలిచీ పెరిగి ఎదిగి బ్రతికే జీవ సంభృత మహా వృక్షం ఈ దేశం వర్గ రహిత వర్ణ రహిత బహు భాషా సంస్కార కిర్మీరం 15. స్మృతి భూమి చేయితో చేయి కలిపి ముఖంలో ముఖం నిలిపి ఎదలో ఎదతో చరిత్ర మాట్లాడుతూంది రాత్రి పగలూ గత చిత్రాల్ని బింబిస్తూ అది రాజ సౌధం ! కొండ పైనుంది, సామాన్యులకు ప్రవేశం లేదు స్మృతులతో వాయువు సన్నగా సంగీత చిత్రాలు వినిపిస్తూంది కొండ చుట్టూ రాతి కోట ! రక్షక భటులతో ఆయుధాలతో ఎన్ని కళ్ళో ఒకే వస్తువును చూస్తాయి ! ఆలోచనలెన్నో వస్తాయి ! చివు్ళత్తిన భయంతో సామాన్యులు తల వంచి నిశ్శబ్దంగా నడుస్తారు. ఎవడో ఎపుడో గానీ మొగ్గ వలె తలెత్తడానికి సాహసించడు అపుడపుడూ వెలువడే శబ్దాన్ని నిశ్శబ్దం దూరంగా తరిమేస్తుంది కోటలో ఉండేవాడు అతడు రాజు ! తలెత్తే ఒకే వ్యక్తి వీరు ప్రజలు ! కోట బయట తలవాల్చబడిన వ్యక్తులు ఇరువురి మధ్య తెంచరాని బంధం ఎప్పటిదో ఒక గాలి వంతెన ఇదీ నిన్నటి కథ ! నేటి కథ వేరు ! ప్రజాస్వామ్య గాథ ఎండలో వానలో చలిలో కాలాని కెదురొడ్డి రాతి గోడలు మాత్రం నేటికీ అవశేషాలతో ఆకర్షిస్తాయి క్షణాలు పరుగిడుతున్నాయి మార్పుతో నిలకడ లేకుండా గ్రీష్మ దాహాన్ని తీరుస్తూ వచ్చే తొలకరి అడుగు వేసింది నిశ్శబ్దాన్ని చీల్చే శబ్ద ఘోషతో తుఫాను వచ్చింది, అణగింది అంతటా కొత్తపాయలతో స్వేచ్చా జల సంచార ప్రవాహాలు ! శరత్తు వచ్చింది అభయ హస్తంతో దిక్కుల్లో కొత్త తెలివితో ఋతువు మార్పుతో కాలం కొత్త ముఖంతో అవతరిచింది చరిత్ర మలుపు తిరుగుతుంది పాత ముఖాలు కొట్టుకపోతాయి ఆకొండ చుట్టూ రంగం సిద్ధమైంది రాజ సౌధం ! ప్రజా భవనమైంది ఇది సామాన్యుని ఆశలు దశ దిశలూ ధ్వనించే నిలయమైంది ఇదో జన హితైక జంత్ర వాద్య సమ్మేళనంగానూ మారుతుంది పాలకులకూ ప్రజలకూ మధ్య ఏదో వంతెన ఎప్పటికి ఉంటుంది చేయితో చేయి కలిపి ముఖంలో ముఖం నిలిచి ఎదలో ఎదతో బంధమై నిశ్శబ్దం ఎదురుగా కోట శిథిల రూపంలో గతానికి బంధువైంది. నిశ్శబ్దం పలికేను జీవిత వాస్తవాన్ని బింబిస్తూ వర్తమానం స్క్రీన్ పై 16. జన శక్తి వైపు రాజరికం వెళ్ళిందెపుడో చీకటి గుహలోకి దాని స్థానంలో ప్రజల ప్రభుత్వం కొండపై బండలపై వ్రాసిన “ప్రజాస్వామ్యం” అక్షరాలు ఆకర్షిస్తున్నాయి అక్షరాలు వచ్చిన వాళ్ళు చదువుతున్నారు ! రానివాళ్ళు బొమ్మలు చూస్తున్నారు అలవాటు చొప్పున గుహల్లో నుండి జంతువులూ మృగాలూ బయటికి వస్తాయి అవకాశాన్ని బట్టి ఆరగిస్తాయి! కడుపులు నింపుకొని పోతాయి కొండపై ప్రభుత్వానికి వీటికీ స్నేహ బంధం ముందని వదంతి ప్రక్కన చరియల్లో మైదానాల్లో తరాల బ్రతుకు గతులతో జనం ఉన్నట్లుండి ఒకనాడు మేల్కొన్న కాల సింహం జూలు విదల్చింది ఉరుములతో ఘన మేఘంవలె జనం శక్తియై కదలింది కొండపై నుండి దిగి వచ్చి క్రింద ఇనుప చువ్వల వరండాలో ప్రభుత్వం పచార్లు చేస్తుంది మంటల కెదురుగా కదలుతుంది అద్దంలో వెలుగు చూసి మురిసి పోతుంది ఆయుధాల ధ్వనుల మధ్య శాంతి మంత్రం పఠిస్తుంది మౌన ముద్రా ముఖంతో నిశ్శబ్దం బుసలు కొట్టే ఆలోచనతో రాజనీతి తాండవంతో సమస్యకు సంకెళ్ళు వేసి నిష్క్రమిస్తుంది చల్లారిన పాలపొంగులా ఆగిన నీటి వరదల్లా అంతా యథా ప్రకారమే ఎవరైనా కోపిస్తే ఏడిస్తే పైరవీ పదవీ యోగం ఉండనే ఉంది కాకపోతే ప్రయాణంలో ఉండనే ఉన్నాయి రాజ మార్గాలు ! దొరలి పోవడానికి లోయలూ ! కొట్టుకు పోవడానికి నదులూ ఆకలితో అలమటించే జంతువులూ మృగాలూ చెప్పనవసరం లేదు శాంతికి భంగం లేకుండా తిండికి ఇబ్బంది కలగకుండా ప్రజ ! లోయల్లో మైదానాల్లో తమ జీవితం గడపడమే జనంపని ! కొండపైన జనస్వామ్య ప్రభుత్వం ! క్రింద ఉంది హక్కులున్న సమాజం శాంతి సోపానం పై ఈ శతాబ్ది ప్రయత్నిస్తోంది ప్రశ్నలకు జవాబులకై 1. ఆదిత్య కాంతిలో నేర్పిన విద్యతో సాధించిన విజ్ఞానంతో తెలివి బయట పడే లోపల రోజులు ముత్యాల వలె దొర్లిపోతాయి, కొత్త ప్రశ్నలు చేరతాయి ఎవరికో అదృష్టవంతులకు తప్ప అందరికీ ప్రశ్నలే ప్రశ్నలు ! తిండీ తిప్పలు ఉద్యోగం అవకాశం జీవితంలో బాధ్యత గురించీ ఒక్క అడుగు వేసే లోపల కాలం పది అడుగులు దాటి పోతుంది ప్రశ్నకు జవాబు వచ్చే లోపల ఆ సమస్య పాతబడి పోతుంది ఎక్కడికక్కడ నియమాల సందుల్లో నుండి అవతారాలు లేస్తాయి ఎన్నో మాటలు వింటూ రంగులు చూస్తూ సంస్కారం పెరుగుతూ బ్రతుకు రూపం మారుతుంది, మనో రహస్యం ఎక్కువవుతుంది స్వర్గం మోక్షం సంగతి అట్లా ఉంచి ఉదయించే నైతిక తేజంతో స్వేచ్ఛగా వికసించనీ వ్యక్తి రూపాన్నీ, సామాజిక శక్తినీ సమయం ఆలోచన ఒకటైసరించనీ జీవితం ఏ ప్రశ్నకూ సంపూర్ణ సమాధానం ఈ శతాబ్ది కాదు ఏ యుగమూ ఇవ్వలేదు 2. ధరిత్రిపై ప్రతిబింబంతో నిదురకూ మెలకువకూ మధ్య వంతెన వలె మనస్సు వంతెనపై పయనించే మనుషులు వాస్తవ ప్రతిబింబాలు అవసరమూ అనుభవమూ భౌతికమై మానసమై ఆర్థికమై ఎదలో స్పందనతో అంతరంగ కిరణంతో నడిచే భూమికలు స్వాతంత్ర్యం వెలుగుతో నిర్మించిన సామాజిక సోపానాలపై ఇపుడు రావలిసింది నోట్లో బాంబులతో కళ్ళలో నిప్పులతో కాదు ఊపిరిలో ఉత్సాహంతో దేహంలో వెలుగు ధారతో జడత్వం విదల్చి మనస్సుకు నవత్వం కూర్చే శక్తులతో నవసమయం మార్పు భౌతికమే కాదు మానసికమూ అవసరం భవిష్యత్తు ఏ ఒక్కరిదీ కాదు మొత్తం సమాజానిదీ 3. మానవ చేతనలో బ్రతుకులో బరువునూ ఊహలో నిశ్శబ్దాన్నీ భూమినీ ఆకాశాన్నీ గతంలో గాంభీర్యాన్నీ భవిష్యంలో విస్తృతినీ జలధినీ దిక్చక్రాన్నీ ఎత్తులో ఆశ్చర్యాన్నీ లోతుల్లో సెరాన్నీ అహంతో వినయాన్నీ వర్తమాన అస్తిత్వాన్నీ క్షణ క్షణ చలనాన్నీ దివ్య బిందువుతో కలిపే సృజన శక్తి సంకేతం, నిర్మాణ భావ చిహ్నం, ఈ మానవ చేతన శ్మశానంలో నిజంకాదు పచ్చని జీవితం, సమాధి నుండి రాదు ఛాయావృక్షం హింసతో స్వాతంత్ర్యం ఊపిరి తీసుకోదు రక్తంతో మనో భూమి మొలకెత్తదు కత్తి అవసరమే రక్షణకై మేర మీరితే ఎతెన మహాసంస్కృతి మస్తకాన్నే ఉత్తరిస్తుంది 4. స్వే్ఛ చేతనతో నిద్రించే రాత్రి తలుపులు తట్టి ఎంత గొంతు చించుకుంటేనేం ? నీవు లేవవు, తలుపు తీయవు! అందుకే తెలీదు నా రూపం తలుపులు బద్దలు కొట్టి లేపందే, నీవు లేవవనీ నాకు తెలుసు ఇదిగో ఈ స్వాతంత్ర్య మూర్తి ! చేయి పట్టుకోనిరా బయటికి కాంతి బిందు నేత్రాలతో, చీకటి హృదయంలో ఉదయంతో కదలే మన ముందు, త్యాగ కుసుమ తోరణాలు స్వాగతం చెబుతాయి మనలో వసుధైక భావం ! వసుధపై మన అపూర్వ బింబం మానవ చేతనలో స్వేచ్ఛకు సంకేతం, చరిత్రలో ప్రగతికి సోపానం 5. ఆత్మ బింబం ఎక్కడో వెతక నక్కర లేదు, ఇక్కడే ఉన్నాను అనుభవ రూపంలో నినాదం కాదు సిద్దాంతం కాదు అతీతం కాదు పురాణం కాదు అన్నిటినీ అధిగమించిన నిజం అన్నిటినీ విలీనం చేసుకున్న వాస్తవం అణువు నుండి అణువుకు క్షణం నుండి క్షణానికి అనుబంధంతో ఎడారిలో పచ్చని నిజమై బంధం నుండి స్వేచ్ఛతో ఇక్కడే ఉన్నాను తప్పని విషమ లిప్తలు ఎరువై ప్రతీ క్షణం భవిష్యత్తు బార చాచి ఊపిరి తీగెలపై కాలాన్ని సాగిస్తూ వర్తమానం ఆయువు పెంచుతూ, అహం నుండి క్రమించే ఆనందాన్ని, చీకటి నుండి వచ్చే ఉదయాన్ని ప్రపంచం మేల్కొని ఉన్న మనస్సుకు ఏ క్షణానికా క్షణం ఒక సమస్య భూమి ఆకాశంతో పాటు ఆశలూ కలలూ కామనలూ మనిషిని వీడవు ! ఇక్కడే ఉన్నాను నేను స్వర్ణ సత్యంలో వజ్ర సుందరంలా ఇక్కడే ఉన్నాను నేను బ్రతుకు నేలపై కృషి ఫలంగా మానస శిఖరం నుండి వివేక లహరి వరకు విరిసిన జన గణంతో ఎక్కడో వెతక నక్కర లేదు ఇక్కడే ఉన్నాను అంతరంగ మూర్తిని ! పలుకుతూ అందరిలో వివిధ రాగ కళనై మెదలుతూ అందరిలో ఒకే ఆత్మబింబమై జన స్వామ్య చిత్రమై వర్తమానం స్క్రీడైపైమేల్కొన్న ఈ సమయం (1975) అంకితం మహాకవి శ్రీ శ్రీ కిమేల్కొన్న ఈ సమయం సూచిక 1. వర్తమాన స్పందనం పుట 2. నిన్నను మరచి ..... 3. శూన్యాన్ని స్మరింపజేసి 4. నిశ్శబ్ద చరణాలపై 5. పొలిమేరలు అంతరాలు 6. లెక్కలేని ప్రాణం 7. వెలుగు వార్త 8. వేళకు లే ! నిద్రించకు 9. నవ్వకు విరగబడి నవ్వకు ! 10. ముఖం ఎత్తిందో లేదో 11. ఆడబడే చీకటి బంతులు 12. సూర్య బింబమై 2. మేల్కొన్న ఈ సమయం (1975) 1. వర్తమాన స్పందనం అరుణ కిరణ పంక్తి వెనుక నుండి మంటల అరపులు నడచే సూర్యుని గుండెలో ఎగసే మంటల సుడులు నడి నెత్తిన సూర్యుడు నిటారుగా మస్తిష్కంలోకి దిగేనా ? ముందుకు వెళ్ళే సూర్యుడు వెనక్కి అడుగు వేయలేడు మండి మండి సాయం సంధ్య కట్టెల వలె బూది తలపులు రాలుస్తుంది ఇపుడు రాత్రి కన్పించదు గుండెలో విప్లవంతో భ్రమించే సూర్యకణాలే తెల్లవారితే చెమ్మగిల్లిన కళ్ళతో, పాలిన ముఖాలతో సాగే జీవితాలు ఉదయ కిరణ శ్రేణుల్లో పలికే స్వాగత వచనాల్ని వినాలిసి ఉంది ! సాయం కిరణ పంక్తుల్లో ఒలికే తృప్తి రేఖల్ని చూడాలిసి ఉంది 2. నిన్నను మరచి నిన్న దూసిన బులెట్ల గాయాల పచ్చిదనం ఇంకా మాన లేదు నిన్న క్రమ్మిన ధూమ శిఖల నీలి ముద్ర లింకా వీడలేదు ప్రయాణంలో బడలిన శరీరం సత్తువ చేదుకుంటూంది హక్కులకై ఆక్రందన కల్లోల నినాదాలు పరివర్తనకై పోరాటం ! అశాంతి నాటకంలో విరామ శాంతి వలె ఈ సమయం ఎదురౌతుంది ఇపుడు పలకాలిసింది, వెనుకబడిన హిమ హృదిలో తరణి కిరణ సంగీతం నిన్నను మరచి ఏ గోతిలోనో వదిలేసి వర్తమాన ప్రగతి హృదయం ఆవిష్కృతమవుతూంది వివిధ వర్ణ మత ప్రభలతో సుందరమై భుజాలపై కాశ్మీర్ శాలువాతో మేల్కొన్న ఈ సమయం స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగులు వేస్తోంది 3. శూన్యాన్ని స్మరింప జేసే గ్రీష్మం మాట ఎత్తకముందే కళ్ళ ముందు నేల బీటలు వారుతుంది కళ్ళలో శిశిరంతో కలలో వసంతంతో, ఎడారిలో నడక సాగుతూంది గమ్మం కన్పించకముందే అడుగుల ముందు పెద్ద లోయ నిలుస్తాయి ధరలతో పాటు పైకెగరలేని సామాన్యుల చెవుల్ని స్పృశిస్తూ విషమ వార్తలు మెరుపుతో ఆశను చూపేవో పిడుగుతో దగ్ధం చేసేవో దూసుక పోతున్నాయి ఈ దేశంలో బ్రతుకు దూకడమే గాని నడవడం లేనట్లుంది గుడిలో గంటలు ఆశల్ని ప్రతిధ్వనిస్తూ భయాన్ని కరిగిస్తూ మ్రోగుతున్నాయి మబ్బుగా మారిన స్వాతంత్ర్యం విద్యుదున్మేషంతో గర్జాగళంతో పైన నిల్చింది మబ్బును గాలిమాయం చేయ జూస్తుంది మెడలో నెక్ టైని గాలి ఎత్తుక పోజూస్తూంది ఈ సమయం మాటలతో కాక మంటలతో ఆలోచన కదలుతూంది ఇదీ దేశంలో సామాన్యుని జీవితం శూన్యాన్ని స్మరింపజేసే చిత్రం ఈమబ్బు దేన్ని మెరిపిస్తుందో ? దేన్ని అర్ధం చేస్తుందో తెలీకుండా ఉంది ఇది జన హృదయంలో మునుముందు నవోదార సమాజానికి నాంది పలికేనా ? 4. నిశ్శబ్ద చరణాలపై విసరిన ఆయుధం చుట్టూ నిశ్శబ్దం శాంతి వచనాలతో తిరుగుతుంది చెవి సోకే మాట చుట్టూ నిశ్శబ్దం మౌన దీక్షతో నిలిచి ఉంటుంది మెత్తగా శరీరాన్ని తాకే గాలి అంచుల్లో నిశ్శబ్దం రహస్యం చెబుతుంది ఎన్ని ముక్కలై చెదరినా నిశ్శబ్దం అంతలో పూర్వ రూపం పొందుతుంది ఎంతటి శబ్దమైనా నిశ్శబ్దాన్ని ఎన్నటికీ పూర్తిగా అంతం చేయలేదు అలజడిలో ఆవేదనలో అశాంతిలో నిశ్శబ్దంపైకెగసి నిలుస్తుంది నిశ్శబ్ధం మేఘం వలె కదులుతుంది మెరపు వలె మాయమవుతుంది సహనంలో నిశ్శబ్దం, సరస్సులో చంద్రుని వలె బింబిస్తుంది శబ్దంలో మేల్కొన్న నిశ్శబ్దం మనో భూమికలో అర్థవంతమైన ఉదయం 5. పొలి మేరలు ! అంతరాలు! సరస్సులు ఎడారులు, మనస్సులో పొరల మధ్య ఎడారులు ! అంతరాలు ! లోలో పొరల్లో సరస్సులు ఎడారులు ! పొలిమేరలు ! విభేదాలు దప్పి కేసిన ప్రయాణికుని గొంతులోపడే తడి చార వలె నీటి జాలు ఒక చోటి నుండి మరో చోటికీ జనం గుంపులుగా కదలేరు ఎడారి బ్రతుకులో ఎక్కడెక్కడో పచ్చదనం లేకపోలేదు పొలిమేరలలో ఒక వైపు గుడిసెలు ! మరో వైపు మేడలు అంతరాల సుస్థితికై పొలిమేరల రక్షణకై సేవకులు భటశ్రేణి కండరాల నాట్యంలో అహంకృతిని అందంగా మలచుకొన్న అధికారం వెనుక ధనం బలం కుర్చీ చుట్టూ తిరిగే జీవితాలు వర్తనకూ వర్తనకూ ఆలోచనకూ ఆలోచనకూ మధ్య ఘర్షణలో ఒలికిన రక్త బిందువు చరిత్ర నుదుటపడి తిలక రేఖ అయ్యేను 6. లెక్కలేని ప్రాణం సముద్రంపై కదలే మబ్బు నీడల వలె ఎదురైన ముఖాల్ని దాటుతూ ఆపూట కేమి లేదో యోచిస్తూ ఇంట్లో అడుగు పెట్టాడు ఊగే బంతి పూల వలె ముంగిట్లో పిల్ల లెదురయినారు ఇంట్లో ఉన్న నలుగురూ రాత్రి అడవిలో ఊగే చెట్ల వలె ఉన్నారు గతం వర్తమానం అంతా కలిసి ముద్దగా ఉన్నట్లుందీ సమయం క్షణం ఆగిపోతున్నట్లుంది మనస్సు నిశ్చేష్ట స్థితి పొందుతూంది లైటు ఆరి చీకటి చూపే వెలుగు స్తంభం వలె ఉందీ వేళ వ్రేళ్ళ సందులో సిగరెట్ పొగ తరలే ప్రాణంవలె సాగుతూంది బాష్ప బిందువులో వెలుగు దుఃఖంలో ఆశను తలపిస్తోంది నెత్తురు కణంలో తేలే కిరణం జీవశక్తిని తెలుపుతోంది ఊరుపు అలపై తేలే హంస ప్రాణ శక్తిని స్ఫురిస్తోంది నిద్రలో ఏ గుడిలోనో మ్రోగే గంటలు వినిపిస్తున్నాయి మేల్కొని లేచే లోపల ఎదురుగా ప్రేలిన పిస్టల్ ధ్వని మేల్కొన్న సమయం చెదరకుండా మెల్లగా జారుతుంది కళ్ళలో సూర్యులు తిరుగుతున్నారు ధమనుల్లో అగ్నులు నర్తిస్తున్నాయి కిరణం తొలగి పోతున్నట్లుంది ప్రాణం రెక్కలు విరిగి నట్లుంది డాక్టర్ ఊడిపడ్డాడు ! ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళాడు ఎవరి పనుల్లో వారు ! ఎవరికీ తీరిక లేదు అంతా మామూలే ! ఎంత ప్రాణ భయమో అంత ఆపదకు సులభ మార్గం శరీరంలో చేతన జారే లిప్త ! సమాధికి మొదటి మెట్టు ఎంతో ఖరీదనుకున్న వస్తువు జీరో విలువకు దిగింది ? హత్యా ? ఆత్మ హననమా ? పోస్్ట మార్టమ్ రిపోర్్ట రావలిసి ఉంది కలో ? వాస్తవమో ? మనో వైజ్ఞానికుణ్ణి సంప్రదించాలిసి ఉంది ముడి వీడిన మూట నుండి జారే వస్తువు పై వ్యధతో దోసిల్లో పడిన కన్నీటిని కదిలించే ఊర్పుతో విరామం లేని రొదతో సమయం కదలి పోతూంది 7. వెలుగు వార్త గాలిలో ఎగసిన స్ఫులింగం మధ్యలోనే బూదిని కౌగిలించుకొంది బొగ్గు కణికై జారిపడిన మరణ వార్త కోపంతో కోడె త్రాచై వ్యాపించింది సాగే ముందు సమాజ ముఖంపై అతడు నిలిపిన అగ్ని ప్రశ్న అట్లాగే ఉంది సమాధానం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి కూలేముందు చరిత్ర ముఖంపై అతడు నిలిపిన బాధా సమస్య అట్లాగే ఉంది, పరిష్కారం కోసం పరిశోధన జరుగుతూంది వాహనాలు కదలిపోతున్నాయి ఆలయాలు నిశ్చలంగా ఉన్నాయి అడుగు వేయకుండా కాళ్ళను చుట్టిన ఉదయ వార్త ఎదురుగా దేహం ! సంధ్యా బింబం వలె ఎదలో ప్రతిఫలిస్తూంది ముని మాపు చెరువులో చెట్టు నీడ వలె కళ్ళ ముందుతారాడే శాంతి తన మనుగడకై అపుడపుడూ అశాంతి కోరుతుందా ? ఈ దృశ్యం చూస్తే హృదయం విలోల జలధి యౌతుంది మతిలో సమయం సాయుధ మౌతూందా ? అన్నట్లుంది ! పట్టరాని అశాంతి నృత్య మెంత సేపు జరుగుతుంది ఆగిన ఆలోచన అంతలో ప్రవాహమై పరుగిడుతోంది ప్రవాహ మెంత వేగమైందైనా పడవ నడిపే వ్యక్తిలో మనో బలం ముఖ్యం ప్రవాహ మెంత వేగమైందైనా పడవ నడిపే నైపుణి పైనే ఉంది ప్రయాణం 8. వేళకులే నిద్రించకు ఆ అర్థరాత్రి ఎవరా నిన్ను మేల్కొల్పింది ? మేమే ! సగం నిద్రలో లేచావా ? ఇప్పటి కింకా నిదురే పోలేదా ? రెండూ ఒకటే ! ఇంకా నిద్రలో తూగుతున్నట్లుందే! సరె కాని ! ఒక చెవి ఇటు పారేయ్ విను ! మేమూ తూగుతున్నట్లుంది ! గాంధీ నెహ్రూ బుద్ధుని గురించి కల లింకా నెమరేస్తూ పడుకున్నావా ? మేమూ అవే మాట్లాడేం మధ్య మధ్య నాలుక కరుచుకుంటూ ! నీకు జ్ఞాపకం లేదు ? అమ్మయ్యో! అపుడే ఎన్నేళ్లు వెలిగిపోయాయి దూలాలు పుచ్చిపోతే పోటీలు పెడుతూ, గోడలు కూలితే తెరలు కూరుస్తూ పంది కొక్కులు చేరితే బోనులు నిలుపుతూ, కలుగల్లో మట్టి కూరుస్తూ స్వాతంత్య్ర దినోత్సవానికి వెల్లవేస్తూ ఆ నివాసమే సంస్కృతి చిహ్నం మా కానందం మా కళ్ళలో పొద్దు పొడుస్తూంది మాటల్లో పొద్దు క్రుంకుతూంది చీకటికి భయం వేసి మూల మూలల్లో ముఖం దాచుకుంటూంది మళ్ళీ నిదుర పోయే లోపల చివరి మాట కాస్త విను ! వేళకులే ! సగం నిద్రలో తూగుతూ కలవరింతలూ మానేయి, ఈ రోజైనా! ఈ ఇల్లు కూలే లోపల లేస్తావు కదూ ! అపుడు నిన్ను లేపే వారుండరు ఎవరి భయంలో వారు ! ఎవరి స్వార్థంలో వారు ! ఎవరికి పట్టింది ? ఆ నిద్ర ఏదో త్వరగా కానీ! మేల్కొని మాత్రం కలలు గనకు ! నీ కలల్లో మమ్మల్ని తూగించకు నీ ఊహల్లో వేగించకు, వికసించకు! నిద్రపోయే దేశమా ! నీ నిద్రే మాకో అడ్డు తెర ! మా స్వేచ్ఛకు సావకాశం అర్థరాత్రి మేల్కొల్పింది ఎవరైతేనేం మనవాడే మానవుడే! శాంతమూర్తి! మళ్ళీ నిద్రిస్తే ఇప్పట్లో లేవవనే నమ్మకం ! అదే మాకు రక్షా కవచం ! 9. నవ్వకు విరగబడి నవ్వకు ! నవ్వకు ! పగలబడి నవ్వకు ! గుండె తూగి చేతిలో పడేను నవ్వకు ! విరగబడి నవ్వకు ! గుండె జారి నేలపై పడేను దూరం వినరి పడిన నవ్వుల్ని చుక్కలు వెతుక్కుంటాయి ఈ నవ్వులు నీ మనో భూమిక సూచికలై అదృశ్యమయ్యేను చీకటి అరచేయిలో నిరుపేదల బ్రతుకు దివ్వెలు మినుకుమంటున్నాయి చెదరిన గాజు ముక్కల్లో ఆశలు మొలకలుగా వెలుగుతున్నాయి మొక్క వోయిన పగటి ఖడ్గాన్ని గాలులు సాన పడుతున్నాయి మసక చీకటి ఇసుకలో వెలుగు జాడల్ని గుర్తించీ గుర్తించని విధంగా పెద్దలు చీకటి నీడల కన్నా ఇంటికి పోయే తొందరలో ఉన్నారు ఉన్నట్లుండి వీధి దీపాలన్నీ ఒక్కమారు మేల్కొన్నాయి మొగ్గలో రాలి పడే సామాన్యుని పగటి కలల వలె నవ్వకు పగలబడి నవ్వకు ! ఎవరిని చూచి ! నిన్ను చూచి నీవే ! నవ్వకు ! నవ్వకు విరగబడి నవ్వకు ! ఎవరిని చూచి ? మనిషిని చూచి మనిషే ! 10. ముఖ మెత్తిందో లేదో కాలం ముఖమెత్తిందో లేదో, మనస్సు చంకెక్కాలని చేతులు చాస్తుంది ఆలస్యం చేస్తే మారాం చేస్తుంది పట్టు పడుతుంది విలపిస్తుంది కాస్త చనువిస్తే కొండెక్కించమంటుంది చందమామను తెమ్మంటుంది చంద్ర బింబంతో ఆడుకోవాలనీ చుక్కల పూలు కోయాలనీ కోరుతుంది ఆకాశాన పరుగెత్తాలనీ అసంభవాన్ని సంభవం చేయాలనీ కోరుతుంది శైశవం దాటే కొద్ది బీజాలన్ని వృక్షాలై కొమ్మలు చాచి నిలుస్తాయి నడక వచ్చిందో లేదో మనస్సు అందుకోవాలన్నా అందదు కాలానికి విసుగు లేదు కాని మనస్సుకు తీరిక ఉండదు మనస్సు ఎప్పటికీ శిశువుగానే ఉండలేదు కాలం మాతృత్వం వీడదు 11. ఆడబడే చీకటి బంతులు ఆలోచన ఆగుతుంది క్షణం పెను బండ వద్ద ప్రవాహం వలె ఆలోచన క్షణంలో ఎగుస్తుంది ఆవేశంలో గాలికి అల వలె నడవనీ ఉద్రేక శిఖరాలు తిరగనీ కల్లోల వలయాలు ప్రాణ వంతమైంది బ్రతుకుతుంది శక్తియుతమైంది నిలుస్తుంది త్రుటిలో వనం దగ్ధం కాదు వ్రేటుతో పర్వతం ముక్కలు కాదు అడవులూ పర్వతాలూ ఈ ప్రయాణంలో తప్పనివీ అనుభవంలో దోషాన్ని దూరే కన్నా దండన విధించే కన్నా సరించనీ సమస్యపై ఎక్్స కిరణం చీకటి క్రమ్మిన హృదిలోకీ అగ్ని చిమ్మే మతి లోకీ పెదవులపై పిట్టల వలె ఎగిరే మాటలు, తుపాకి గుండ్ల వుతున్నాయి ఎదలో నెమళ్ళ వలె ఆడే ఊహలు నవ మారణాస్త్రా లవుతున్నాయి మండే ఎండల్లో రోడ్ ప్రక్కన నిశ్చలంగా పడి ఉన్న కుర్రవాణ్ణి ముందెట్టుకొని ఉదోషణతో తల్లి డబ్బులు పోగు చేసుకొనేను దప్పిక తీరని కళ్ళతో ఆకలి తీరని ముఖంతో కళ్ళుమూసి పడుకున్న దౌర్భాగ్యుని సమీపంలో మృత్యువు చదికిల బడి ఉంది అలంకారంతో ఒళ్ళు విరుచుకొనీ నిల్చిన మేడ ముందు అడుక్కునే విషమ సమాజంలో ! పీడితులు పరిచ్యుతులు ఆటలో చీకటి బంతులు ! 12. సూర్య బింబమై నిద్రలో చీకటి మాయమౌతుంది మెలకువతో వచ్చి వాలుతుంది పగలు మండి మసియై రాత్రి మొలకెత్తుతుంది పచ్చగా నిలుస్తుంది దిశ నుండి దిశకు కదులుతుంది ఒడ్డు నుండి ఒడ్డుకు ఈదుతుంది భయానికో ప్రయోజనానికో దీనితో నేస్తం చేసేవారూ ఉన్నారు స్వార్థానికో అలసట మరిచేందుకో దీన్ని మన్నించే వారూ ఉన్నారు ఒకపుడీ చీకటి పూలు పూస్తుంది, ప్రమిదయై వత్తికి ఉపయోగిస్తుంది దీన్ని ఎవ్వరూ అంతం చేయలేరు, దీనితో ఎప్పుడే అవసరమో తెలీదు ఏదో రూపంలో చీకటి లేకపోతే, ఇంతటి మానవ చరిత్ర ఉండేదా ? ఒకపుడు చీకటి క్రమ్మి దారితోచక ఉక్కిరి బిక్కిరై చావడమూ ఉంది ఒక్క వెలుగు పోచకై అర్రులు చాచి చీకట్లో కుమ్ముకొని చావడమూ ఉంది ఈ చీకటి ఫల రూపాన్ని ఆప్వాదించని వారెవ్వరు ? దీని రుచి లేంది ఎవరికైనా జిహ్వ తుప్పు పట్టిపోదూ! ఎగిరివచ్చి వాలే చీకటి పక్షిని మౌనంగా స్వీకరించు నొసట పూచే దీని పూలను దూసి భద్రంగా దాచుకో ! నిలువునా ఎదురైన చీకటి ఓ చిన్న దీపం వెలుగులో మాయమైనట్లున్నా ! దారి మధ్య మనస్సులో పులి వలె పీట వేసుక కూర్చుంటుంది ! ఏమైనా ఇది ఉండనే ఉంటుంది ! మనలో ! ఏదో స్థాయిలో ! ఈ సమయం మనిషి చేయగలిగిందొక్కటే ! మనస్సులో సుకుమార సూర్యబింబమై మేల్కోవడం !శబ్దమై ప్రాణమై (1976) అంకితం కీ॥ శే॥ శివలెంక శంభు ప్రసాద్ గారికి తెలుగు జాతి ఎదలో సంస్కృతీ స్పందనమై నాకు తెలీకుండా నిశ్శబ్దంగా నాలో ఉన్నావు కదలీ కదలని చంద్ర రేఖ వలె పవమాన మూర్తివై కాంతి లహరివైశబ్దమై ప్రాణమై సూచిక పుట 1. 2. 3. నాలో ధ్వనిస్తూ బిందువూ ఆకృతీ నిశ్శబ్దముఖాన 4. ప్రాణమై 5. మిగిలిన శకలాలు 6. వీచే గాలిలో 7. నిద్రించనీ తృప్తిగా 8. ఎవరి ముఖం చూచినా 9. ప్రతి దిశలోనూ 10. నేటి నిజంకానీ 11. ఈ శిలలు నిశ్శబ్ద శిఖరాలు 12. చీకటి అడుగు తీసి 13. శిశిరంలో 14. రాత్రి రైలు కదిలింది 15. కదలే శిలల్లో 16. వెలగని దీపాల్లో 17. దుగాలిసిన వెలుగు . . . . 18. పదపద పయోదమై 19. అద్దంలో 20. ఈ ముఖాల వెనుక నుండి 21. నాలుగు దిశలూ, దారులూ 22. ప్రాణియత్నం 23. ఎట్లాగో ఇంకా 24. అనుబంధం 25. జీవితమై 3. శబ్దమై ప్రాణమై 1. నాలో ధ్వనిస్తుంది నాలో ప్రపంచం శబ్దమై ధ్వనిస్తుంది, నాలో సమాజం ప్రాణమై వెలుగుతూంది నాలో దిశ దిశ తలెత్తిన ఆకాశం ఆత్మకు సంకేతమై ప్రతిఫలిస్తుంది క్రింద పరచిన ఎదతో అవని బ్రతుక్కి ప్రతిరూపమై నిలుస్తూంది ప్రాణం నుండి బీజ భూతమైన ప్రపంచం సంకల్పంతో శాఖాకీర్ణమైన జీవితం అనుభవానికి వాస్తవమైందీ ! ఆత్మకు సన్నిహితమైందీ ! 2. బిందువూ ఆకృతి రాత్రి కళ్ళలో దిగిన ఆదర్శ ప్రపంచంతో పడుకుంటాను ఉదయం కళ్ళ ముందు వాస్తవ సమాజంతో మేల్కొంటాను అటు ఆదర్శం ఇటు వాస్తవం రెండు తీరాల మధ్య వర్తమాన ప్రవాహంలో పడవ వలె నేను ప్రతి వస్తువుకూ చరిత్ర ఉంది, మనిషి చరిత్ర గతి రేఖ ఉనికిని స్థిర పరుచుకొంటూ రూపాన్ని సరిదిద్దు కొంటూ గమనాన్ని నిర్దేశించుకుంటూ సాగే సంఘర్షణ క్రియామతి మనస్సు సంస్కృతీ బిందువు, ప్రవర్తన ఆకృతికి రేఖా రూపం 3. నిశ్శబ్ద ముఖాన నిశ్శబ్ద ముఖాన పల్లవించే చైతన్యం వలె ఉదయించే సూర్యుడు నిశ్శబ్ద ముఖాన కదలే ప్మృతులు మంచు వలె రాలేను శిలపై కురిసే వాన జల్లు వలె నిశ్శబ్ద ముఖాన శబ్దం అనుక్షణం వర్ణాలు మారే ముఖంలో శబ్ద రూప చిత్రాలు ప్రతి క్షణం ఊహలు తరలే మనసులో నిశ్శబ్ద పవన గంధం ఆరిన నిప్పులో, ఆకు రాలిన మ్రోడులో ఇంకిన సరస్సులో నిశ్శబ్దం ఆకృతికై తహ తహ లాడే బిందువులో నిశ్శబ్ద జీవనం బ్రతుకులో ఆరాటపడే ప్రాణ శక్తిలో నిశ్శబ్ద రేఖా చిత్రం హృది నుండి ఎగసే అనుభవం వలె నిశ్శబ్ద ముఖాన చంద్రుడు సూర్య చంద్రులు వెలిగే ఆకాశాన నిశ్శబ్దం నుండి శబ్దం వస్తువూ స్మృతీ ప్రతిభాసించే మతిలో నిశ్శబ్దం నుండి శబ్ద ప్రపంచం దిక్కుల్లో ఉదయంవలె శరీరంలో ప్రాణ స్పందనం ఆకలి ఉసి గొల్పిన తెలివితో మనిషి యాత్ర ప్రారంభం ఆకలి తీరడంతో వెలుగులోకి సాగే పై దశ మొదలు! ఏదో పోగొట్టుకొని దారిలో వెతుక్కునే వ్యక్తి వలె రాత్రి చంద్రుడు గుంపులో ఉన్న మనిషికి ఒంటరి తన మెక్కడిది ? గుంపు తనలో ఉన్నపుడు సమాజంతో భేదం లేదు 4. ప్రాణమై మనసులో మూల నుండి మూలకు ఖేచరాలు శ్రేణులుగా ఎగిరేను మనసులో చోటు నుండి చోటుకు భూ చరాలు వరసగా కదిలేను మనసులో ఒడ్డు నుండి ఒడ్డుకు జలచరాలు మూకలుగా ఈదేను ఆకాశం భూమి సముద్రం వంటి మనస్సుతో మనిషి, మనిషి మాత్రమే కాదు 5. మిగిలిన శకలాలు చెట్లు గాలికి జల జల పూలు రాలుస్తూ త్యాగాన్ని నిర్వచిస్తాయి గాలి నిశ్శబ్ద నిశా శరీరాన్ని స్పృశిస్తూ ప్రేమను ఒలుకుతుంది మనిషి ఉంది గాలిలో కాదు అవని పై వాస్తవ తలంపై ఎండ విరిసీ మంచు రాలీ నీడ తొలగీ శిల లట్లాగే ఉన్నాయి పేదగా అంబేదగా యుగాల దుఃఖ తప్త శకలాలుగా ఉదయమైందో లేదో బ్రతుకంటే ఏమిటో దిశలే చూపిస్తాయి 6. వీచే గాలిలో గాలి వీస్తుంది, పైకి తీసుకెళ్ళే మబ్బుతో, ప్రాణం లేచి తేలినట్లుంటుంది ఒక్క ఉరుముతో అందరూ అభయనికేతనం కోరతారు ఒక సమయంలో ప్రియమైందే భయ బాధా కారణమౌతుంది ఆకర్షణతో వికర్షణతో మోదమై ఖేదమై మరో శక్తికి సంకేతమౌతుంది నాకు మొదటి నుండీ పని ఆ మబ్బుతో ఈ నీరుతో మబ్బు కన్పించే సరికి మనిషి చరిత్ర జ్ఞప్తికి వస్తుంది ఆహారం వ్యవహారం అధికారం సౌఖ్యంకై తపించే నీడలతో కాల పటంపై బింబించే వివిధ వర్ణ సమావేశ చిత్రం నా రూపం ! రొట్టె కోసం ముద్ద కోసం ఎక్కడ లేని బలంతో అంగలేస్తూ భయాన్ని చీల్చే మెరుపుతో ధైర్యం మెరసే ఆలోచనతో ఇసుకపై కాలే కాళ్ళతో ఆశతో శూన్య ముఖ వాలకంలో ధన సుఖ సంపాదనకై బంతుల వలె తరలేరు మనుషులు 7. నిద్రించనీ తృప్తిగా ఎక్కడి నుండో పక్షులు వచ్చి చెట్ల గుండెల్లో తల దాచుకుంటాయి ఇది పై కెగరడంతో బ్రతుక్కి పాఠం మొదలౌతుంది ఇవి క్రిందికి దిగడంతో విశ్రాంతికి నాంది అవుతుంది ఒక్క అంగలో గగనం బంధించాలనీ త్రుటిలో ఆకాశం మూట కట్టాలనీ మనస్సు తహ తహతో కుదుపు కుదిపి ముందుకు నెడుతుంది అక్కడి నుండి అంతా కొత్త ! అప్పటి దంతా పాత బడి పోతుంది పక్షులు వచ్చి విశ్రమించనీ, రెక్కలు విప్పి వలయాలు దాటనీ గుంపులుగా పక్షులు రానీ శాఖ పై గూడులో తృప్తిగా నిద్రించనీ జన్మతో మనిషిలో ఎదిగే చెట్టు గురించి వేరే చెప్పాలా ? 8. ఎవరి ముఖం చూచినా ఎవరి ముఖం చూచినా తమ వైపే తిరిగి ఉంటుంది ఎవరి చూపులు చూచినా తమ వైపే కదులుతూంటాయి ఎవరి అడుగులు చూచినా తమ వైపే తిరుగుతూంటాయి ఎవరి స్వరం విన్నా తన రాగమే పలకాలని ఉంటుంది ఎందరి రూపం చూచినా ఏ ఒకరి లోను పోలిక ఉండదు ఎవరి నీడ చూచినా ఒకదానిపై మరోటి పొంచి ఉంటుంది ముఖం ముడుతల్లో భద్రంగా ఎన్ని ఏండ్లు ముడుచుకున్నా మరో ఏడు ఎదురవగానే కొత్త ముఖం చూచినట్లే ఉంటుంది పగటి కలలు కంటూ తీరిగ్గా రాత్రి చుక్కలు లెక్కిడితూ ఓపిగ్గా క్షణాల నీడల నుండి వాటిని దాటే ప్రయత్నమే బ్రతుకంతా చీకట్లో భయంతో కంపించినపుడు ధైర్యంతో నిలిపిన శక్తీ మనస్సు కోపంతో చెదరినపుడు పిచ్చెత్తకుండా నిలుపుతుంది చీకటి నడక నేర్చిందో లేదో వెలుగును తరుమ జూస్తుంది వెలుగు తన శక్తిపై నిలిచిందో లేదో చీకటి దాని కాళ్ళ వద్ద జీరాడుతుంది ఎంతో యత్నంతో తొలచిన శిల్పంలో అన్నీ అమరుతాయి ఆత్మ తప్ప ఎన్ని ఉన్నా ఆత్మ లేంది జీవితాని కస్తిత్వం లేదు, పరమార్థం లేదు దిశ దిశ నుండి గాలి మనస్సును దూరం తీసుకపోతుంది ఉన్న స్వేచ్ఛతో సమయం ఉదారం కానీ, కాంతి బిందువుతో మనోజ్ఞం కానీ 9. ప్రతి దిశలోనూ నాట్యం చేసే ఆలోచనతో నాలో పరచుకొన్న సముద్రం చంద్రుడు కన్పించగానే నా విషయం పూర్తిగా మరుస్తుంది నదిలో ప్రయాణంకై ఎవరూ కాదనకుండా రావచ్చు ప్రవాహంలో కొట్టుక పోడానికి మాత్రం ఎవరూ రారు మనిషిలో ఆలోచన కత్తి అంచు అవకూడదు కాని మనిషి ఉన్న పరిసరాలూ శత్రుమయం కారాదు చేతుల్లో సత్తువ చేరగానే కాళ్ళలో బలం రాగానే ఇంట్లో పసి కూనకూ బయట పడాలనే ఆరాటం కళ్ళలో పరచుకొన్న ఆకాశం ఒక సమయం కాంతి వర్షిస్తుంది గుండెలో ఒదిగి ఉన్న అనురాగం ఒక సమయం జలద మవుతుంది మబ్బును కదల్చి జీవనం తెచ్చే గాలి, నిప్పును రగిల్చి మంటనూ రేపుతుంది బిందెడు నీరు కావాలి, కాని బావిలో బొక్కెన మునిగేట్టు లేదు నేల పొరలెన్ని ఒలిచినా నీటి చుక్క కన్పించని దశలో ప్రవాహాన్ని గుర్తించడమే కాదు దాన్ని సమీపించే భయమూ పోవాలి అదృష్టం కలిసివస్తే ఏ రత్నమో అవలీలగా దొరకొచ్చు జీవిత మున్నంత వరకూ సమస్య లెక్కడికీ ఎగిరి పోవు భూమి ఉన్నంత వరకూ సముద్ర మెన్నటికీ ఇగిరి పోదు ప్రతి ఉదయం కొత్త మనిషి నాలో అవతరించేను పలకరించేను ప్రతి రాత్రి ఆ మనిషి నా నుండి చెప్పకుండా నీడతో నిష్క్రమించేను 10. నేటి నిజం కానీ ఎదురయ్యే ఆశల్లో మబ్బులు వ్రేలాడీ క్రింద నదులు జీరాడీ చెరువుల కడుపులు నిండీ గ్రీష్మం నిన్నటి వార్త వర్షం నేటి నిజం కానీ గుండె నుండి మాట వరకు చెరువు నుండి పంట దాక ఒకే సృజన శక్తి పరంపర, మొలక నుండి ఫలం వరకు సర్వం శుషీభూతం చేసే ఋతు నిష్క్రమణంతో ఎండిన నది అయినా మండే రక్త తరంగం కారాదు మనస్సును ఆర్ద్ర చేసే ప్రతి ఋతువు కాహ్వానం ! అవని పాడనీ జల ధుని ఆడనీ గుండెలో ప్రాణ శక్తి వెలగనీ ! ఈ సమయం నిశ్శబ్దంగా పడి ఉన్నది రేపు మ్రోగే వాద్య బృంద మవుతుంది పూలతో పండ్లతో చెట్లు మనిషి హృదయ రూపాల్ని తలపిస్తాయి ఒక తరం నుండి మంచీ చెడూ గ్రహిస్తూ మరో తరం వస్తుంది ఈ చెట్లను వదిలేస్తే మనిషి కథా ప్రసక్తి లేదు ఈ మబ్బును వదిలేస్తే జీవిత గమనం లేదు వర్తమాన స్వాదు ఫలం కోరి మనిషి పెరిగేను కాలంజాడల్లో అవసరాలతో, అవి తీరే ఆలోచనతో 11. ఈ శిలలు నిశ్శబ్ద శిఖరాలు నిశ్శబ్దం తిరుగబడిందా పీడనలో అసహనం హింసతో జ్వాలా పద సంచారంతో సమయ శిఖరం బ్రద్దలైందా ? సంపాదన ఓ మూలకు రాని కార్మికుల గళం నుండి ఆర్జన ఓ కారుకు రాని కర్షకుల కంఠం నుండి వెలువడిన శబ్ద తరంగం ఏ సంగీతం వినిపిస్తుంది హెచ్చిన సంరంభంతో ప్రజ ! నినాద తరంగాలు ! నిశ్శబ్దాన్ని కవ్విస్తున్నాయి ! శబ్దాన్ని అలంకరిస్తున్నాయి ఆకలి మంటను చుట్టుకొని పడుకొన్న గుండెలో రక్త కణం మంటయై కదులుతుంది చీకటి పైకి ఉదయం రా రాదని తలుపులు వేసే రా ? తలుపులు తెరవ లేదని ఏ కిరణం ఆగదు ఎదలో కదలుతుంది అంకురమై, ఊహలో నర్తిస్తుంది ధారమై ఉదయం కదలనీ స్వేచ్చగా, వెలుగు రానీ స్వచ్ఛంగా క్షితిజం శబ్దాన్ని అనువదించనీ హృదయం ప్రాణాన్ని అనురణించనీ జనం నిండుగా కదలనీ శబ్దం కదలనీ, వెలుగుతో నాల్క పై 12. చీకటి అడుగు తీసి చీకటి అడుగు తీసి వెలుగు అడుగు వేయగానే ముంజేతిపై కపోతంతో కాలం ఎదురౌతుంది క్షితిజం వెలిగిస్తూ నీహారం కరగిస్తూ సమయం మనిషికి తన రూపాన్ని తనకే గుర్తింప జేస్తుంది ! సముద్రం వంటి సమాజంలో మహాప్రాణి వలె మనిషి ! సముద్రం నుండి బయట పడితే మిగిలేది జడం ! కాసేపు దాహాన్నీ ఆకల్నీ నిప్పు రవ్వల్లా ఆర్చుకుంటూ చిరు కోర్కెలతో పిట్టలే నీడ పంచనో చేర జూస్తాయి ! కష్టాల్ని విసరేసి, దుఃఖాల్ని విదలించీ నిరాశను తగలేసీ లోయ నుండి నేలకూ ఎడారి నుండి మైదానానికీ మనిషి తరలేదు కన్నీరెండి మండే చెక్కిళ్ళపై కదలే వ్రేళ్ళు వెచ్చని స్వరం వినిపించేను ఎండిన కట్టెకు బిగించి తీగపై మధుర స్వరం వినిపించేను శబ్దమై ప్రాణమై ఆపై సోపాన క్రమంలో జీవితమై ఆశా కవచంతో ముందుకు నడవడమే మనిషి ముందు కర్తవ్యం ! 13. శిశిరంలో శిశిరంలో చేతులెత్తి చెట్లు ఆక్రోశిస్తాయి సన్నని జ్వాలయై ఆశ నాలుక చాస్తుంది ముఖాన టవల్ కప్పుకొని ఆకాశం విలపిస్తుంది మబ్బు పొడ లేదు చివురు ముఖం లేదు చినుకు కన్పించదు బ్రతుకు గడచే కరువూ, మ్రోడూ బ్రతుకంతా పరచిన ఎడారి ! సమయాని కన్నీ సిద్దిస్తూ పోతే, జీవిత మెట్లా అవుతుంది ? రాత్రి రైలు కదిలింది స్టేషన్ వీడుతూంది 14. రాత్రి రైలు కదిలింది ప్లాట్ఫార్్మ పై లైట్ల వెలుగులో ప్రయాణికుల ముఖాలు మెరుస్తున్నాయి స్తంభాలకు వేలాడే వెలుగు బల్బుల్ని మింగేయాలనీ చీకటి వేచి ఉంది క్రింద పారే నదిలో బ్రిడ్్జ పై దీపాల ప్రతిబింబాలు కలలవలెఉన్నాయి అక్కడే చీకటి ముని వ్రేళ్ళపై నిల్చొనే ఉంది ఉన్న కాస్త సమయమూ సాగనీ గాలి బ్రిడ్జి దాటనీ అంటుంది మనస్సు పాపం అన్నా భయం లేని శాపం అన్నా విచారం లేని మొండి ఘటాల వలె ఇరు వైపులా కొండలు పెనుబండలు నిటారుగా రొమ్ములు చాచి ఉన్నాయి స్టేషన్ చేరే వరకూ చెప్పరాని తొందరలో గుండె దడ దడ లాడుతూంది ఇంజన్లో కణకణ లాడే నిప్పును జ్ఞాపకం చేస్తుంది బయటి వెళ్ళితే ఇంటికి వచ్చేదాకా భయ బంధువుతో కాలక్షేపం! సంభాషణలో కాలానికి కథ తొడుగుతూంది క్షణాలు విడిపోతూ కాలాని కాభరణాలుగా మారే తొందరలో ఉన్నాయి మతిలో అనుభవ చిత్రాలు అద్దంలో ప్రతి బింబాలవలె తోస్తున్నాయి మరో స్టేషన్ వచ్చే వరకూ వేగంలో పదిలంగా కన్పించే విరామం ఆలోచనా తరంగాలతో విశ్రాంతి ఎరగని సముద్ర తీరంవలె ఉంది 15. కదలే శిలల్లో భూమి పై బ్రతుకుకై బ్రతుకులో ప్రాణంకై మానవతా వజ్రంపై సంఘర్షణ సాగుతుంది వ్యక్తి తలం నుండి సమాజ తలంపై ఈ సమయం నిశ్శబ్దంగా నింగిలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి కాక నేలపై శిలనూ చెట్టునీ మనిషితో మనిషినీ అనుబంధం చుడుతూంది నీలి అంచు ఆకాశంలో వెలుగులతో ముఖ చిత్రం మారుతూంది పాత బడిన రాత్రి భయం ఉదయం నీడయై మొలకెత్తుతూంది భౌతికం నుండి మానసికానికి వ్యక్తి నుండి సమాజానికి అనుభవ ప్రపంచంతో ఆలోచనా కిరణంతో మనస్సు కదులుతూంది ఉబికిన కండరాలతో సాగిన ధమనులతో అరుణ వదనంతో విసరే మెరపు చూపులతో కదలే మేఘ కళతో, తోచే బ్రతుకులో రవ్వల వలెనో ఆకుల వలెనో క్షణాలు నిశ్శబ్దంగా రాలి పోయేను బరువుతో వంగి పోక, నిరాశతో కుంగిపోక, ఈ సమయం కదలనీ భయం నుండి స్వేచ్ఛలోకి, వెలుగు లోకి, ఈ సమయం కదలనీ ఊపిరి అలపై తేలే, సంస్కార కళతో, నవ సమాజ వర్తనతో తరలనీ వెలగని దీపాల్లో దాగిన కలలు నీవు చూశావా ? కదల్లేని సరస్సులో అణగిన ఉత్సాహం కన్నావా ? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కదా ? ఎంత దూర మంటూనే చదికి లబడిపోయేవా ? 16. వెలగని దీపాల్లో గ్రుడ్డిదనం చెవిటిదనం జన్మ శిల్పమయి పోయిన నాయకులకు శిలా ప్రతిమ వేయడమే మిగిలిందిక ? ఎటు నుండి ఎటు వైపుకు శాంతి పదం ప్రగతి పథం ఏది శాంతి ? ఏది కాంతి ? ఏ గుండెకు ? ఏ కళ్ళకు ? చెవిటికి వినరాదని మేఘం గర్జన మానదు గ్రుడ్డికి చూపు లేదని ఉదయం నర్తనం ఆగదు పక్షుల శబ్దాల్లో ఏ అర్థం పలికేదీ వాగుల నడకల్లో ఏ రాగం ఒలికేదీ చూడు చూడు ! ఏ చేతులు ఏ వెలుగుల నార్పేదీ పలుకు పలుకు ! ఏ ఎండలు ధారలనింకించిందీ బ్రతుకు బరువు ! ఏ మనిషిని మట్టిలో అణచిందీ భగ్న మనసు ! ఏ బ్రతుకును గాలిలో కలిపిందీ ! కొండల్ని పిండి చేస్తే మనస్సుకు మెలకువ వచ్చేనా ? అద్దాన్ని పగుల గొడితే ముఖం ముక్కలయ్యేనా ? అద్దంలో బింబించే వాలకాన్ని దాచేసే సమయం రావద్దు 17. దూకాలిసిన వెలుగు నీ స్మృతి శిఖరం పగులు వాసి ఎంత కాలమైంది ? నీ ముఖ దర్పణం ముక్కలై ఎంత కాలమైంది ? నీ ఆలోచనలో శిఖలు ఆరి ఎంత కాలమైంది ? చెప్పు ! హింస నీకు ఆయుధమై ఎంత కాలమైంది ? అశాంతికి శ్రేయో గీతం అఖండంగా పాడేవా ? పగలు నిశ్శబ్దపు లోయల్లో వసించేవా ? రాత్రి నేలపై విలయశబ్దమయ్యేనా ? బూది దిబ్బలు కెలుకుతూ నిప్పు రవ్వలు చిమ్ముతూ హసించేవా ? నటించేవా ? అవతారానికి మురుస్తూ అగ్ని పథం గుర్తుగా నెత్తురు అడుగుల ముద్రలు శ్రేయో గతికి లక్ష్యంగా క్షితిజంలో అగ్ని ప్రభలు ! రోజు పై రోజు మంచు తెరలతో తరుముకొని వస్తుంది పై నున్న ముఖ బింబాల్ని కన్పించ నీయడం లేదు వెలుక్కి అడ్డు నిల్చే మంచు పొరను చీల్చి వెలుగు దూకాలిసిఉంది ! జనతా సౌభాగ్యంగా స్వేచ్ఛగా 18. పద పద పయోదమై పద గమనంలో కొత్త లయ స్వరసరణంలో నవ రాగం ఏ దైవం కాదు నీవు ! అంత కన్న ఏ బొమ్మ కాదు బొరుసు కాదు అవును నీవు మానవుడవు ! జీవ కణం నుండి ఆత్మ వరకు వారసుడవు ఏ పాప మెరగంది భయం దేనికి ? ఏ దురాశ లేంది ఆందోళన దేనికి ? అహంకార విస్పోటంతో గడుసు దెయ్యాలు చోటు చేసుకొంటాయి లేని పోని భయ క్రీడలతో చుట్టూ నీడలు బొమ్మలుగా భ్రమింపజేస్తాయి నీలో తగిలించుకున్న రూపానికి నిప్పుపెట్టి మాపేయి నీలో వ్రేలాడే నీడల్ని మాపే రవి కాంతి సోకనీ గతం నుండి వర్తమానానికి పచార్లు చేస్తే పరిపోదు ఆలోచనా సంస్కారంలో నవ ఝరీ పరివర్తన రానీ కాలం చెల్లిన ఆకుల్ని రాలుస్తూ వేచివున్న చివుళ్ళను సుమింపజేస్తూ ముఖంలో పైరు కళతో ఊపిరిలో ప్రాణి ఆయువుతో పద పద! పయోదమై ప్రవాహాని కుత్సాహ శక్తి నిస్తూ కదలు కదలు ! మనిషీ ఎడారికి జీవన ధన మిస్తూ కాలాన్ని చీల్చే జ్ఞాపకాల కాంతితో, కాలాన్ని దూసే ఆలోచనా తరంగాలతో సమాజంలో భాగం నీవు ! నీలో ఈ సమాజంనీ అస్తిత్వానికి మూలం ! 19. అద్దంలో అద్దంలో చూస్తే ముఖంలో ఒక్కొక్క రేఖ సముద్ర తరంగంలా తీరంలో అవని అంచులతో వలె చేతి వ్రేళ్ళకు స్ఫురిస్తుంది ఒక్కొక్క రేఖలో పూలతో పండ్లతో చెట్ల వరస జ్ఞాపకం వస్తుంది ఒక్కొక్క రేఖలో పొలాల గట్లూ ఎడారి పంపులూ తలపుకు వస్తాయి పగటి చరిత్ర మరచి కూర్చున్న మనిషి నిశా ముఖంలో రేఖల సందుల్లో నుండి ఉదయ రేఖలు పొడ సూపాలి 20. ఈ ముఖాల వెనుక నుండి ఈ ముఖాల్లో కొత్త బింబాలు ఈ రేఖల్లో ఉదయ ప్రభలూ చూడాలి ఇక్కడ మంచు గుట్టల వలె గడ్డ కట్టిన కలలున్నాయి ఇవి కరగీ తొలగీ ప్రయాణానికి సుగమం కావాలి ఈ కలలు ప్రవహించాలనీ సంగీతం వినిపించాలనీ ఉంది ! మ్రోడు వారిన బ్రతుకులూ దిబ్బలేసిన ఎడారులూ లేకపోలేదు ఈ స్థితులు వెలుతురులో సౌభాగ్యం పల్లవించాలని ఉంది మ్రోడులు పచ్చని ముఖంతో దిబ్బలు జీవన ధునులతో ఈ శిలలు ! ప్రాణిత రూపాలై జీవితం పొందాలనీ ఉంది ! 21. నాలుగు దిశలూ, దారులూ ఊపిరాడని గదితో ఏంపని ? వెలుగు నిల్వని బ్రతుకుతో ఏం పని ? గదికి దిశలు నాలుగు చూపుకి ఒకటే, మనస్సుకు దిశ లనంతం నాలుగు వైపుల నుండీ ఆకర్షణలో వికర్షణలో నాలుగు దారుల మధ్య మనిషి దారి ప్రక్క కన్పించే సమాధి గురించి శ్మశానం గురించి అడక్కు సమాధిని పెల్లగిస్తే కన్పించేముంది ? అగ్ని మనస్సులో ఉందే ! శ్మశానం కెలికి చూస్తే కన్పించేదేముంది ? ఆ ఊహలో అగ్నియే ! దారులన్నీ చీలే రూపం ప్రయాణంలో మనిషికి తెలిసే జీవితం అన్నీ ఒక చోట కలిసే రూపం గమనంలో మనసుకు తెలిసిందే 22. ప్రాణి యత్నం ప్రక్కపై నుండి లేవగానే మరచింది జ్ఞాపకం వచ్చింది పిట్టలు కిచ కిచ మంటూ గూడు కోసం పుల్లలేరుకొస్తున్నాయి బ్రతుకు గూడు కోసం మనిషిలో సంస్కృతి స్ఫురించింది క్రింద జారి పడిన పుల్లల్ని పైకి చేర్చే పనిలోనూ పిట్టలు ! కాస్త అలికిడికి భయపడి బయటికి తుర్రుమంటాయి అలకిడి సర్దు కోవడంతో రివ్వున లోనికి వస్తాయి ఆవగింజంత అనుమానంతో పర్వతమంత భయం పూచిక పుల్ల కోరికతో ప్రపంచం నిండే ఆలోచన అవరోధాలు తొలగే యత్నంలో ప్రాణి జీవితం రణ సదృశం కావచ్చు ! స్వప్నం మిగలవచ్చు ! 23. ఎట్లాగో ఇంకా 'ఎట్లాగైనా బ్రతుకు' అని అనునయిస్తూ ఉదయిస్తాడు సూర్యుడు 'ఇంకా బ్రతికి ఉన్నావా' 'మంచిది' అని ఆశ్చర్యపడతాడు చంద్రుడు పౌర్ణిమ అడిగింది 'నీవు ఇక్కడే ఉన్నావా ? అనీ అమావాస్య వెతికింది " ఎక్కడున్నావు నీవు ? అనీ కాలానికి నేనేం సమాధానం చెప్పేది ? నేనే ఒక ప్రశ్నను ! పగలు బ్రతుకు బరువైతే రాత్రి నిదుర బరువులో గడుస్తుంది ఉదయం ప్రశ్నిస్తుంది "రాత్రి ఎట్లా గడిపావు ? సహనం కోల్పోలేదూ ? అని పగలూ రాత్రి తీరాల మధ్య ప్రవాహమై కదిలే నా చుట్టూ ప్రతిదీ నాపై పయనంకై అహరహం యత్నించేవే ! 24. అనుబంధం నాలోని నిరాశను విసిరేశా ఎదురుగా ఎడారియై నిలిచింది నాలోని విషా దాన్ని తరిమేశా దూరంగా లోయై నిలిచింది నాలోని ఆలోచనల్ని వదిలేశా, పైన నీలి మబ్బులై సాగాయి నాలోని ఆనందాన్ని దుమికించా, ముందు పచ్చని చెట్టె వెలసింది నాకూ ప్రకృతికి వీడని అనుబంధాన్ని చూపిస్తాయి తలపిస్తాయి అన్నీ నాకు తప్పనివై జీవితంలో అనుకోకుండా దూరదూరం పోతాయి, 25. జీవితమై ఉదయ నీహారంతో మెరిసే శరీరాలతో దారి ప్రక్కన శిలలు ! రావలిసిన మార్పుకై వేచీ ! తరాలుగా పడి ఉన్నాయి నన్ను చూచి నవ్వబోతాయిః నాతో మాట్లాడబోతాయి ! పడి ఉన్న రూపాలకు ప్రాణం పోస్తూ మాసిన ముఖాల్లో రాగం తెస్తూ దిశ దిశ సమాజంలో ! ప్రజాస్వామ్య చైతన్యం ! ఇంత కాలం నిద్రించిన శిలల్లో ఇపుడు కొంత సంగీతం వినిపిస్తూంది ఇపుడు మనస్సు పరివర్తనతో భావ తప్త సువర్ణమై వెలుగుతూంది ! దీని కెంత ఆలోచన జరిగింది ? దీని కెంత సంస్కారమవసరమైంది ? తరాల శిలల నుండి చీకటి వేరౌతూంది వెలుగు నిలిచి పోతూంది ఈ శిలల్లో నుండి గాలి శబ్దమైంది సంగీతమై ! పలికాలిసి ఉంది ఈ శిలల్లో నుండి గాలి ప్రాణమైంది జీవితమై ! కదలాలిసి ఉంది ఈ శిలల్లో నుండి వెలుగు జీవితమై సమాజమై ! చూడాలిసి ఉంది ! సమాజంలో ఉంది త్యక్తమై తిరస్కృతమై శిల వర్తమాన తలంపై మహా పరివర్తన కోరుతూ, శబ్దమై ప్రాణమై జీవితమై ఎదిగే శిల, మూలం ! ప్రతి మనిషిలో ఉంది పురా రూపమై బింబమైఅగ్నిమయం జీవితం (1980) అంకితం మహాకవి దాశరథికిఅగ్నిమయం జీవితం సూచిక 1. అగ్నిబుజాలపై పంజాబ్ 2. సూర్యునికీ చిరచిర పుట్టిస్తూ పుట 3. అగ్ని నుండి మేఘమై ..... 4. దాస్య శృంఖల మ్రోగుతూ 5. యాత్రా పథంలో 6. శ్రమ బిందువులో 7. మానవతా సందేశం 8. అగ్నిమయం ఈ సమయం 9. సమాప్తినందుకొనీ 10. ఏ బ్రతుక్కి ఆ బ్రతుకు 11. కిటికీలు మూయకండి 12. నిశ్శబ్దం ప్రేలుతూంది 13. అగ్నిమయం వాస్తవం 14. నిశ్శబ్ద గవాక్షం నుండి 15. కన్నీటి కధతో 16. ఏకాంత సమాజం .....వర్తమానం స్క్రీన్ పై - అగ్నిమయం జీవితం 4. అగ్నిమయం జీవితం 1. అగ్నిబుజాలపై పంజాబ్ దగ్గరలో ఉన్న మనిషి హృదయ స్పందన కన్నా ఆయుధ శబ్ద తరంగ మెంత దూరం నుండో వినిపిస్తూంది వీథిలో బడిలో ఇంట్లో ఆఫీస్ లో మృత్యు భయం తరుముతూంది శాంతిని గిరి శిఖరంపైకి అంతరాత్మను ఆకాశంలోకీ విసరుతూంది ఆలోచనల్ని సిద్ధంచేసి ఆయుధాలతో ఉగ్ర శిఖలు దూసుక వస్తున్నాయి అక్కడక్కడ నెత్తురు మరకలు తప్ప మరే కీర్తిజాడలూ లేవు. రక్త చిత్రం ధూళిలో కలిసిందో లేదో, అగ్ని చిత్ర మవతరిస్తూంది ప్రజల ముఖాల్లో పూలు వాడిపోయి రేకలు ముడుచుకున్నాయి ఈ సీమలో ఆధునికం ఆటవికం జీవితాన్ని చెరొక వైపు నుండి ఒకటి మార్పుకీ మరొకటి సంక్షోభానికి లాగుతున్నాయి మంచు పిడికిట్లోఉన్న ఆకాశంలో సూర్యుని ప్రభ కన్పించడం లేదు స్తంభించిన వాతావరణాన్ని చీల్చుకొని నడవాలిసి వస్తూంది శాంతి సహన జీవితం జన సమ్మతమైనా ఇక్కడ ఆశాంతీదే పైచేయి ! కల్లోలం సముద్రం వలె ఉంది. అసహనం అగ్ని వలె ఉంది. వెలుగు తన ముఖం కాస్త దాచుకుంది, కాలం స్వప్నం వలె ఎదురౌతూంతి. ఇక్కడ తమ్ములూ చెల్లెళ్ళ ఆకలితో కాదు ఆకలి తీరాక తీరికలో మెరపుల వలె ప్రశ్నించేరు ! పిడుగుల వలె నినదించేరు కత్తులు తూటాలు దూసిన దేహాలపై రాలే కన్నీటి బిందువులు మండే గాయాల మంటల్ని ఉపశమింప జేస్తున్నాయి ఈ బిందువుల్లో ఆర్తి, అగ్ని స్పర్శను తలపిస్తూంది సజీవ హత్యా కాండలో ఆదర్శం ఉన్మత్త సముద్రం వలె ఉంది ఏ మహాత్ముని నీడ కూడ సోకలేని రహస్య వ్యూహంతో ఉంది ఎద ఎదకూ మధ్య ఎడారి పరుస్తూంది ఎద ఎదలో కలహ ధ్వని సృజిస్తూంది ఇనుప కవచంతో బాష్ప నయనాలతో ఇప్పుడుందొకే ఒక అశాంతి బింబం ! హింసతో హత్యలతో విభుగ్నస్థితిలో సమాధులూ శ్మశానాలూ చేరుస్తూంది ఈ సమయం శాంతి సందేశంతో ఏ ఉదార మేఘమో కరుణిస్తే తప్ప ఇక్కడి బ్రతుకులో పచ్చదనం కన్పించేనా ? పరిమళం నిశ్వసించేనా ? ఈ చెట్టు చిగిర్చేందుకూ ఫలించేందుకూ అన్నీ సమయాని కమరేవైనా ఈ చెట్టు క్రింద మంటల సంగతి ? దీన్ని పెకలించి మరో చోట వేసేరా ? నేలపై నెత్తురు తడితో ఏదో కొత్త చెట్టును మొలకిత్తించాలనే ఆశ ! అమృత సరస్సులో అగ్ని వీచే సంచారం, జబీ హృదిలో ఆయుధ సన్నాహం అమృత సరస్సులో కదలే మానవతా మధు రుచి చూడాలిసి ఉంది జపీ హృదిలో ఎగిరే స్వర్ణ కాంతి కపోతాన్ని చూడాల్సి ఉంది. 2. సూర్యునికీ చిరచిర పుట్టిస్తూ క్షితిజంలో అంగారం చిమ్ముతూ, తీరాన అగ్ని శిఖలు దూకిస్తూ రక్తంతో పేంట్ చేసిన ముఖాలతో, నిప్పు రవ్వలు పొదిగిన నేత్రాలతో అడుగుల క్రింద మృత్యు చలనంతో, వీపు వెనుక ఆయుధ సంరంభంతో అమృత సరస్సు అశాంతి సముద్రమైంది అనల శిఖలపై నృత్యం చేస్తుంది పంజాబ్ ఇంటి నుండి వీధిలోకి అడుగులు కదిలాయో లేదో ఏ వైపు నుండి ఆయుధం దూసుక పోయేదీ తెలీదు ఇరువైపుల అగ్ని చిత్రాల ప్రదర్శనతో అమానుష విషమ చక్ర ఘట్టనతో విషాద రాగం సమాజాన్ని బంధిస్తోంది, వ్యక్తి ముఖంపై నీలి తెర జారుతూంది కర్ఫ్యూలో బొగ్గు వలె పరచుకొన్న అశాంతి క్షణాలు విసరేసిన నిప్పు రవ్వ కంటుకొని కణకణ లాడుతున్నాయి. ప్రతిరోజు జన పదంలో మొదలయ్యే ఆర్తి స్వరం శ్మశానంలోనో సమాధిలోనో అణగి పోతూంది కాళ్ళు ముడుచుకొనీ పెదువులు బిగించీ గాలికి రెపరెపలాడే పేజీలతో ఏ ఆయుధ మలంకరించేదీ తెలీని రహస్యంలో ఉన్నాయి మత గ్రంధాలు మౌఢ్య శిలపై రక్త రేఖ నిలుపుతూ, ఆటవిక రాజకీయం నెగ్గ జూస్తూంది ఇపుడు మనిషిని మనిషి వేటలో, జంతువు కన్నా మృగం కన్నా హీనం మతం ఉదార భూమికను వదలి, వెనుక నుండి గొడ్డలి వలె పని చేస్తూంది ఒక ప్రక్క ఆకలికీ అలజడికీ మరో ప్రక్క హా హా రవ హింసకూ సమాజం తెరచిన నోరు తెరచినట్లే ఉంది ! ఇపుడు నోట్లో రాలేది నిప్పు రవ్వలే !వర్తమానం స్క్రీన్ పై అగ్నిమయం జీవితం - ధూళిలో పొగలో ప్రేమ కళికనూ అనురాగ కాంతినీ వెదకుతూ ఎతెన మౌఢ్య ప్రాకారంలా ఎదిగిన చీకట్లలో చిక్కుకొనీ స్వేచ్ఛ కోసం రక్షణ కోసం ప్రజ సతమతమౌతున్నారు నీటి పాయ మిగిలిన ప్రవాహం అంచుల్లో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నారు. హృదయంలో ఉదయ పతాకను దించేసి ఎగసే మంటల కెరటాలతో పూలూ పండ్లవలె బాగ్ బాంబుల్ని దాచుకొనీ విద్రోహులు కదలుతూన్నారు విస్ఫోటంతో భయ భ్రాంతమైన మనస్సుయుద్దావని వలె ఉంది. ఉగ్రవాద క్షతమైన క్షణాలు నెత్తురు లొలుకే నీడల వలె పడి ఉన్నాయి వెనుక నుండి ధూళి లేచి వీధిలో నిప్పు రవ్వలతో క్రీడిస్తూంది ఎవరికి వారేడ్వడంతోనే సరిపోతూంది మరొకరి కోసం తీరికేది ? ఉన్మత్తుని ఆలోచన వలె రాత్రీ పగలూ వేడి గాలి వీస్తోంది పల్లెలో పట్టణంలో పొలంలో తోటలో మనిషినీ చెట్టునూ ఊపుతోంది జారిన స్వర్ణ తోరణం తగిలి నాయకుల ఫాలం బొప్పికట్టింది దివ్యత్వానికి చిహ్నమైన ఆలయం సమాజానికి విలయ బిందువు కాకూడదు జీవన సంస్కృతికి సంకేతమైన మతం, రాకెట్ దాడికి సిద్ధం కాకూడదు ఇప్పుడు నిజంగా ఏ భీ విషయం లేదు ! అంతా ఆతంక మతి గతిలోనే గుప్పిట్లో నుండి ఒక్కొక్క విషమ స్థితి కళ్ళలో ఎదపై దూకుతూంది నక్షత్రాల క్రింద పూల చెట్టు మానవత్వాన్ని జ్ఞాపకం చేస్తూన్నాయి జ్వలన్మందార గుచ్ఛం వలెనో గురిపెట్టిన గన్ పాయెంట్ వలెనో ప్రేమకు చిహ్నం గులాబి గాయానికి చిహ్నమై కీర్తి వహిస్తూంది సమయం ఆపదల ముళ్ళ నుండి ముఖమెత్తి సూర్యునికి చిరచిర పుట్టిస్తూంది 3. అగ్ని నుండి మేఘమై ఎత్తిన నల్ల రాతి పిడికిలి నుండి అగ్నులు చిమ్ముతున్నాయి స్వేచ్ఛా తేజం తీవ్రమై క్రియా శక్తికి పదును తెస్తూంది దేశ దేశ సీమలు దాటి స్వాతంత్ర్య ముఖం నినదిస్తోంది జాతి వర్ణ భేదం లేని వర్గరహిత సమ భావం నవ రాగం స్పందిస్తూ అందిస్తూ చరిత్రలో సమాజానికి కొత్త విలువ లేర్పడుతున్నాయి నిశ్శబ్ద గర్భం నుండి శబ్దం ప్రేలుతోంది నిశ్శబ్దం అంచుల్లో శబ్దం మండుతోంది బీటలు వారిన ముఖంతో లోయ లెర్పడిన శరీరంతో వెలుగు గుండెపై చీకటి సరాసరి దిగుతోంది త్యాగ పతాకతో దూకే ఒక బెంజ్మన్ మొలాయెడ్ వెనుక నుండి సామాన్యులు సాహస శక్తితో అగ్ని తోరణాలయ్యేరు అందరిదీ ఒకే లక్ష్యం ! దేశ చరిత్రలో ప్రజాస్వామ్య వాస్తవం తెలుపు లేదు నలుపు లేదు ! ఏ భేదం లేదు వెరపు లేదు వెలుగు తప్ప ! ఏ వర్ణం లేదు మానవులంతా ఒకటే ! మానవతా రాగం ఒకటే ఇది మరచిన సమయం ఒక విషాద కావ్యం 4. దాస్య శృంఖల మోగుతూ ఎదురయ్యే ఆపదకూ హింసకూ మృత్యువుకూ బెదరి భయంతో ఏ జాతీ స్వేచ్ఛను వదలుకోదు, ఏ గుండెలోనూ ఆశయం తొణకదు చరిత్రలో ప్రతి మలుపులో జాతి కొక అగ్ని పరీక్ష ! ఆలోచనతో ఆదర్శం పై అనుభవ చలనంలో చుట్టూ ఇనుప ముళ్ళ తీగెలైన నీతి నియమ పంక్తుల్ని ఛేదించే కోరికతో ! ముందు కెళ్ళే సాహస మనివార్య మవుతూంది ఆజ్ఞానారణ్యంలో గుహల్లో సామాజిక పురా రూప పంక్తులతో మనిషిలో మరో జగత్తు ఉంది ! యుగాల సాహస చరిత్రతో బంధంతో ! అడవుల్నీ సముద్రాల్నీ జన పదాల్నీ దాటి కఠిన శిలా శాసనాలు ప్రేలుస్తూ పరాధీన జన సమూహ గళం నుండి శబ్ద శక్తి, స్వేచ్ఛకు పిలుపునిస్తూంది నరాల్లో రేగే పీడిత హృదయాగ్నిని ఆకుల్లో దాచేరా ? పూవుల్లో ముడిచేరా ? దాస్య శృంఖం ముక్కలయ్యే శబ్దం, స్వేచ్ఛా పక్షి రెక్కలు దువ్వుతూంది. 5. యాత్రాపథంలో జీవన పథంలో ఇరు వైపుల నున్నవి ఆశా ముఖాలు దీపాలని తెలుసు చీకటి మంజూషికలో నున్నవి మణులో ? ఫణులో ? అస్త్రాలో తెలీదు రాత్రికి తుది ఉంది ; మనిషి మతిలో దాస్యానికి రూపం లేదు పట్ట పగలు కర్ఫ్యూలో జడ రూపం కన్నా నిశ నయ మనిపిస్తుందివర్తమానం స్క్రీన్ పై అగ్నిమయం జీవితం - దెబ్బతిన్న పగలు చీకటి గాయాలతో ఒరిగిపోతూంది వెలుగు శూన్య సదనం కావచ్చు కాని ధైర్యాన్ని కోల్పోడం లేదు ఆర్తి నిశ్శబ్దాన్ని భరిస్తుంది కాని నిష్క్రియను కోరదు ఆదర్శంలో త్యాగం కీర్తి కళలతో విశ్వరూపం పొందుతూంది జగత్తు పగలు వెలుగుతుంది మండుతుంది రాత్రికి చల్లబడుతుంది మనిషి వెలిగి మండి మండుతూ ఎపుడు చల్ల బడేదీ ఎవరికీ తెలీదు యాత్రా పధంలో చీకటిపై పోరాటం సాగుతూనే ఉంటుంది స్పందనలో ఆలోచనలో క్రియలో రవి తేజం ఆగదు. 6. శ్రమబిందువులో శ్రమ బిందువులో మౌక్తికాన్ని గుర్తిస్తూ శ్రమ సంపదతో జీవితం నిర్మిస్తూ శ్రమను ప్రేమిస్తూ జనస్వామ్య సామాజిక శక్తియై ఉద్యమిస్తూందీయుగం స్వార్ధ శ్రేణి శ్రమ శక్తిని తృష్ణ తీర్చే సాధనంగా మారుస్తుంది శ్రమపై సానుభూతి వృత్తితో బ్రతికే శ్రేణి కూడా ఉంది భృతి దొరకడమే వరమై పరిసరాలు అవసరాలు బ్రతుక్కి రూపాన్నిస్తాయి బ్రతుకు విలువ సంపదతో కొలిచే శ్రమ గౌరవాన్ని పొందుతూంది పంజరంలో ప్రాణి చలనానికి ఏ గుణం లేని స్వేచ్ఛ ఉంది అడవిలో స్వేచ్ఛకు దారి దొరకని నగరంలో ఆటంక ముంది ఊదిన కొలిమి మంటపై ఉదయ పుష్పం వలె శ్రమలో ఆనందం పొందే ఈ యుగం మనిషిలో కళ్ళ మెరపులో కన్పిస్తుంది నవ జిగీషా రూపం 7. మానవతా సందేశం గళ గళం నుండి స్వేచ్ఛ శబ్దమై ఆపై ఆయుధమై వర్తిస్తూంది ఉద్యమం వెన్నెల్ని కూడా రక్తచిత్రంతో అగ్నిమయం చేస్తూంది నిన్న వియత్నాం నేడు దక్షిణాఫికా రేపు మరో దేశం సానుభూతి ఎదకు ఒక్క కన్నీరేకాదు ! పరిష్కార స్పర్శకూడ అవసరం ధమనుల్లో స్వేచ్ఛాగ్ని నిరంకుశత్వాన్ని బూది చేస్తూంది దీన్ని చూచే మతి లేకపోయినా చూడవలసే వస్తుంది. అడుగడుగున బంధనలో ఆలోచన ఆయుధమై కదలుతుంది అదే శరీరం ! అవే గాయాలు అయినా ఊహలో లక్ష్యంతో మరో జగత్తు ఎక్కడ శిరస్సు వంగినా తమస్సు వాలినా రావలసింది కావలసింది స్వేచ్ఛా తేజమే ! ఎక్కడ మంట లెగసినా ఆర్తి మండినా రావలసింది కావలసింది మానవతా మేఘమే ! 8. అగ్నిమయం ఈసమయం ఈ సమయం అగ్ని మయం; శిలా రూపాల్లోను అనలకణం జ్వలిస్తూంది సర్కస్ తీగెపై నడుస్తూన్నట్లు జీవిత క్షణాలు ఊగుతున్నాయి చూచే వాళ్ళకు తమాషా అయితే ఆ నడిచే మనిషో చావు బ్రతుకుల సంధ్యలో కదలే ఇనుప సంకెళ్ళ ధ్వనిలో కలిసి స్వరం బరువుగా వినిపిస్తోంది ఎవరి స్వరం వారిదే ! ఏ స్వరాన్నీ ఎవరూ ఆపలేరు అణచలేరు మార్చలేరు ! అగ్నిమయం ఈ సమయం హృదిలో రాగ మెప్పుడో ఇగిరి పోయింది కణకణంలో కోపం కసి ద్వేషం కలిసి ఒకటై పోయాయి కర్ఫ్యూలో తెరచిన ఆకలి నోట్లో రైఫిల్ గుండు ఎగసివచ్చి పడుతూంది. నాల్కపై నీటి బిందువుకు బదులు చిమ్మిన రక్తపు చుక్కలు రాలుతున్నాయి పైబూది పొర ఎగిరి పోయి మిగిలిన అనల కణ రాశి వలె ఉందీ సమయం, క్షుభితమై, స్వేచ్ఛకై తపించేను సామాజిక శక్తియై 9. సమాప్తినందుకొనీ అణువుతో అణువూ బిందువుతో బిందువూ ఊహ నందుకొని ఊహ స్వరంతో స్వరం అడుగు వెనక అడుగు ! సమాప్తినందుకొని ఆరంభం ప్రతి అంతరంగంలో సత్యం వెలిగే సూర్య బింబం వలె ఉంది బ్రతుకులో ఎగసే పొగతో ధూళితో మబ్బుతో కంటికి కన్పించదు క్షితిజ తూణీరంలో వెలుగూ చీకటి బాణాలతో నిల్చిన కాలం తలపై నుండి రాకెట్లు దూసుక పోతున్నాయి. షర్పై ఒలికిన సిరా చుక్కలతో స్కూల్ నుండి పిల్లలు వస్తున్నారు అగ్నులు నిద్రించిన హిమ కళికలు భవిష్యత్తు గగన మణులు !వర్తమానం స్క్రీన్ పై - అగ్నిమయం జీవితం ఉదయం నుండి చీకటిపడేదాక ! మట్టి పై మేడకట్టే సంరంభం రాత్రి నుండి ఉదయమయ్యే దాకా మట్టిలో మేడనుకలిపే యత్నం ఉదయమూ రాత్రీ సృజనకూ విధ్వంసనకూ చిహ్నమైతే కానీ అగ్ని కళ అవసరమే, కాని జీవితం అగ్నిమయం కారాదు 10. ఏ బ్రతుక్కి ఆబ్రతుకు ఈ లేఖ నీ చేతిలో వాలిపోయి వేళ్ళ పై హార్మనీ మెట్ల వలె కదలుతూంటే నీలో శిశిరం వికసించిన సుమ హృదయమవుతుందనీ అనుభవం హిమాలయ శిఖరాన్ని స్పృశిస్తుందనీ నాకు తెలుసు నా నుండి నీవు ఈరోజు మరో రోజు నందుకునే దూరంలో ఉన్నా ప్రక్క గదిలో నా పిలుపు కందే దూరంలో ఉన్నట్లే ఉంటుంది పెదవుల మధ్య చిరునవ్వుతో అలంకరించిన ఈ లేఖ నీ చేతిలో మడచిన మొగలి పొరవలె అందగిస్తుందనీ తెలుసు నిన్ను చుట్టిన వినీల లిప్తల్లో మృదు తేజం తెస్తుందనీ తెలుసు నిశ్శబ్ద ప్రపంచానికి శబ్ద ప్రపంచాన్నిస్తుందనీ తెలుసు శూన్య మనః క్షితజంలో జీవన దృశ్యాల్ని చూపిస్తుందనీ తెలుసు ఉన్నదానితో తృప్తిలో శూన్యత ఉన్నదే ! లేని దానితో క్షోభ చెందడం అలవాటే జగత్తు నుండి ఎదురయ్యే ప్రశ్నలకు శబ్ద రూపంలో మనస్సు ఇచ్చే అందమైన సమాధాన నిధానమే కవిత్వం. అద్దం ముందు నిల్చుంటే నా ముఖం బదులు నీ ముఖం కన్పిస్తుంది ఇక్కడి భయాల్ని రాయాలనే వాస్తవాల పొరలు విప్పి చూపాలనే ఉంది నీ గురించి ఆలోచన పరిమళమై వెలుగై అన్నిటినీ ముంచేస్తుంది ఏ రోజు కారోజు ఎంతో మిగిలే ఉంటుంది ఏ బ్రతుక్కి ఆ బ్రతుకు స్వయం సంపూర్ణం కావాలనే, ఇక్కడ వీధుల్లో చిన్నప్పటి నుంచీ చూచే బిక్షుక గణం అట్లాగే ఉంది వృత్తితో మార్పు లేదు, ప్రవృత్తి విస్తరించింది, పాత్రల వేషాలు మారాయి ద్వేషం అసహనం హింస బిగించిన వయొలా తంత్రుల వలె ఉన్నాయి కదిలిస్తే విషాద బింబ మొలికేట్లున్నాయి పలకిస్తే విలయ వీచి చిమ్మేట్లున్నాయి చెట్లపై పుష్ప ఫలాల్లో అరుణ ముఖాలు కలసిపోతున్నాయి ఇంటి వెనుక తీగెల్లో అనల కీలలు మెలగుతున్నాయి నీ పుట్టిన రోజు జ్ఞాపకం ఉంది ఆరోజు బంద్, మర్నాడు కర్ఫ్యూ రవి కిరణం సైతం నేలపై పాదం మోపడానికి భయపడుతున్న స్థితి ఇండ్ల చాటునో మనుషుల వెనకనో దాగి దాగి గాలి కదలుతూంది మనుషుల ముఖాల్లో ఎప్పటికీ అస్తమించే సూర్యుని జాడలే ! ఇక్కడ ఎవరూ ఒంటరిగా లేరు ! ఎవరి పనిలో వారున్నారు మనుషుల్ని శిల్పాలుగా చెక్కుతూనో, సర్కస్ జంతువుల్లా ఆడిస్తూనో నీడల్ని తొలగించే కాంతి హస్తాల కోసం నిరీక్షిస్తున్నారు దావాగ్ని నార్పే శాంతి మేఘం కోసం వేచి ఉన్నారు ఎంతటి కష్టాల్లోను బ్రతికేది, పగలబడి నవ్వడానికే ఆ నవ్వు గాలిలో ముక్కలై ఎగిరి నక్షత్రాలు కావచ్చు బూది లేచిన నిప్పు కణాలు కావచ్చు వేదనతో నిండిన గుండె నిద్రిస్తున్న జ్వాలా ముఖి వలె ఉంది విస్ఫోటనకూ విస్ఫోటనకూ మధ్య సమయం కన్నీటితో అలంకృతమౌతూంది బోనులో నుండి బయట పడి నిశ్శబ్దాన్ని భగ్నంచేసే మృగాలతో పరిచయంకొందరికి స్నేహంగా మారుతూంది ఎక్కడి వాళ్ళు అక్కడ నిష్క్రమించినా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఎన్ని చుక్కలతో ఎదురైనా ! పైన చంద్రుడు కన్పించినా రాత్రి రాత్రే ! దూరాన లేచే పొగ ! ఏ జలదానికీ సంకేతం కాదు దగ్గరలో వెలిగే దీపం ! ఏ ఉదయానికీ ప్రతీక కాదు దారిలో మెర్క్యురీ దీపాల వెలుగులో నడిచే నా కళ్ళను బుద్ధ మూర్తి, ఖుజరాహో, అజంతా శిల్పాల షోకేస్ ఆకర్షిస్తూంది ఈ ఆకర్షణలోనే ఈ లేఖ నిలిచి పోవడం మంచిదేమో ! 11. కిటికీలు మూయకండి కిటికీలు మూయకండి తెరచే ఉంచండి, తలుపులూ తెరవండి ఏ క్షణంలోనో మానవతా గంధంతోవర్తమానం స్క్రీన్ పై - అగ్నిమయం జీవితం ఏ మనిషో కన్పించవచ్చు లోనికి రావచ్చు ఇక్కడ అందరికీ ప్రవేశ ముంది ! హృదయ పూర్వక స్వాగతమూ ఉంది ఎవరో శూన్యాన్ని వస్తుభరితం చేస్తారనీ, దైన్యాన్నీ సంపన్మయం చేస్తారనీ ! ఆశలో కోరిక ఆరంభలోనే ఉంటుందని తెలుసు ! హేతువు మీరిన స్పందనతో స్పందన మించిన హేతువుతో సూర్యుడు వెలిగినా మనసులో కిటికీలు తలుపులూ తెరవడ మవసరం ! ఆలోచనా పథం లేంది సమాజంలేదు అనుభవ శిల్పం లేంది జీవితం లేదు కిటికీలు తెరవండి ! ఎదురుగా కణకణలాడే నిజం కన్పిస్తుంది ! స్థలానికీ కాలానికీ ఇష్టానికీ అతీతమైన స్వేచ్ఛా సౌందర్యంతో మంచు తొలగిన సూర్యుని కిరణాల్లో మానవతా మందారమూ కన్పిస్తుంది తెరవండి తలుపులు ఏ మనిషో చేతనతో ఆత్మ బింబమై రావచ్చు గగనంలో వెలిగితే సరిపోదు సమాజంలో కిరణాలు కన్పించాలి. 12. నిశ్శబ్దం ప్రేలుతూంది శిలలో నిలిచిన నిశ్శబ్దం ప్రేలుతూంది, ప్రేలుతూంది నిశ్శబ్దం జీవితాన్ని స్పృశిస్తూ వాస్తవాన్ని ధ్వనిస్తూ నిశ్శబ్దం మ్రోగుతూంది గదిలో అద్దాలు పగిలే శబ్దం ! చెట్లు కూలుతూన్న శబ్దం ! పాతాళం లోతు వలె భయం, పర్వతశిఖరం వలె ఆశ్చర్యం, చెరో వైపు శిలలో దాగిన నిశ్శబ్దం ప్రేలుతూంది; శిలల కలలు భగ్నమౌతున్నాయి మేడల్లో నిద్రించే వాళ్ళు విసుక్కుంటున్నారు ఆపద శంకిస్తున్నారు. సామాన్యులు పట్టనట్లు తమ తమ పనులు చేసుక పోతున్నారు ఒక చేత పావురాయి నెగరేస్తూనే మరోచేత బాంబును విసరేరు ఈదారినే నిరీహతో నిష్క్రియతో తూగేవారూ ఉన్నారు ప్రేలే మారణ శబ్దం గర్భంలో కూరుకపోయేవారు ఉన్నారు. నేలపై నెత్తురు చూచి గుండె చెదరి శిలలయ్యేవారూ ఉన్నారు. నిశ్శబ్దం గుండెల్లో శబ్దాన్ని మ్రోగిస్తూ శబ్దం అంచులో నిశ్శబ్దం వెదకుతూ క్షణాలు దోసిట్లో నుండి జారే పూల మొగ్గల వలె కదలి పోతాయి నిశ్శబ్దం గుండెలో సంగీతమవచ్చు; కళ్ళముందు పూలుగా రాలవచ్చు నిశ్శబ్దం గుండెలో విషాదం మ్రోగించ వచ్చు ఆ పై రాళ్ళుగాను పడవచ్చు శిలలో నిలిచిన నిశ్శబ్దం ప్రేలుతూంది ప్రశ్నల మెరపులతో సమస్య శబ్దస్తూంది పీడిత జన గాధా ధ్వనితో వాస్తవ గతి జీవన స్వరమై 13. అగ్నిమయం వాస్తవం సమాజ సంస్కృతి నుండి సామూహిక శక్తుల వర్తనతో స్థలం నుండి స్థలానికి మనిషి, వికసించే చేతనతో ప్రతీ జీవిత కథా భాగాలు సమాజ చరిత్రలో భాగాలే వెనక బడిన దృశ్యాల్ని స్మృతి కిరణం చూపిస్తుంది పెదవుల కదలికలూ నాలుక మలపులూ వేరైనా స్పందన ఒకటే అగ్నిమయం వాస్తవం నుండి అంతరంగాన్ని అందుకోవాలనే ! జ్వలించే ఆశతో దీపించే రాగంతో రగిలే వేదనతో ఈ జీవిత మొక విధంగా అగ్నిమయం వాస్తవం, హిమశిఖరంపై సూర్యునివలె అనుభవ శిఖరంపై మనిషి మనిషిలో నుండి సత్యమై సుందరమై అంతరంగ వాస్తవం 14. నిశ్శబ్ద గవాక్షం నుండి నిశ్శబ్ద గవాక్షం నుండి అనల చలన హస్తాలతో గాలి వీస్తోంది దారిన పోతూ గదిలో అద్దంలో తన వాలకం చూసుకుంటూంది తనలో తాను నవ్వుతూ నడక సవరించుకోనీ కదలుతూంది రాత్రి అంతా గది నిలువునా మౌనశిలవలె నిశ్శబ్దంగా ఉంటుంది ఉదయం కాగానే జీవన చలనంతో శబ్దమయ మవుతుంది కిటికి నుండి ఉదయం కన్నీట తడిసిన లేఖ స్ఫురిస్తుంది మంచులో జారిన కిరణాలు విషాదమద్దిన ఆలోచనలవలె ఉన్నాయి మంచు తెరకదిలింది కన్నీటి పొర తొలగినట్లుంది చేతిలో పత్రికలో అక్షరాల మెరపుల్లో వేదనా శిఖలతో పంజాబ్ శ్రీలంక లెబెనాన్ సౌత్ ఆఫికా బాధారుణ శకలాలు ! మంచుగడ్డ నుండి విస్పోటం సరోజలం నుండి మెషిన్ గన్ అట్టహాసం- వర్తమానం స్క్రీన్ పై అగ్నిమయం జీవితం యుగాలపై ఎదిగిన సంస్కృతీ శిఖరాలు కన్పించకుండా పోతున్నాయి గోడవంటి మౌఢ్యం తలపై మండే సూర్యుడు ఎంతసేపని ఉంటాడు గగనం నుండి జారే కన్నీటిని అవని ఎంతని లీనం చేసుకుంటుంది బాధతో వేదనతో అంగార వీచి సహస్ర చరణాలతో క్రమిస్తూంది నిశ్శబ్దాన్ని వెదరు వలె చీలుస్తూంది దారిలో ప్రవాహమై అన్నీ ముంచేస్తూంది ముందు జీవితం పీడన నుండి అవమానం నుండి ముక్త కావాలి దైన్యాన్ని మాయంచేసే మానవతా జలదం వెనుక నుండి రావాలి ఆటవిక యుగాన్ని అంటిపెట్టుకున్న క్రూర భీభత్స దృశాల్ని తలపిస్తూ నిశ్శబ్ద గవాక్షాలను వణకిస్తూ శబ్ద చిత్రాలు కదలుతూన్నాయి నిశ్శబ్ద గవాక్షం నుండి ఉదయం రక్త సిక్త ముఖంతో ఎదురౌతూంది ఆకాశం అనలచ్ఛాయల్ని తన బాహువుల్లోకి తీసుకుంటుంది అల్లుకున్న ధూమ శిఖల్లో చిక్కిన కాలాన్ని ఉద్దరించే చేతుల్లో అగ్ని నార్పే పరికరాలకన్నా ప్రాణంతీసే సాధనాలే ఎక్కువగా ఉన్నాయి హింసకూ అలజడికీ ఎవరూ సుముఖంకాదు ! అయినా వచ్చి పడతాయి స్తంభాల వెనక గోడలమాటున కేకలూ కాల్పులూ అనుమానం కదలుతూంది రాత్రి పూర్తిగా మేల్కొనే ఉంటుంది ! నిద్ర పోవడమెపుడో మానేసింది మండే గాయాల్ని ఉదయం మంచు పొరతో అద్దుతూంది మనిషి అందాన్ని బింబించే అద్దం పగిలింది చెదరిన అద్దం ముక్కలు కాళ్ళను నిలిపేస్తున్నాయి గవాక్షానికెదురుగా చెట్టు పై గూడు భద్రతను జ్ఞాపకం చేస్తూంది పృధ్వి నుండి గగనం దాకా మనిషి కోర్కెలు నేర్పుగా సంచరిస్తున్నాయి ఒక వైపు వీధిలో మంట బెట్టిన మానవత నిలువునా మండుతూంది దీన్ని సమీపించేందుకు ఏ జలదమూ సాహసించడం లేదు 15. కన్నీటి కథతో జలధిలో ఆయుధాల్ని ఎవరు విసరేస్తారు ? మనో గుహలోనించే ఉంటాయి అరచేయి రేఖల్లో దారితప్పిన జీవితం, నోసటి రేఖల్లో తేలుతూంది భవిష్యత్తుకై ఒక్కొక్కపుడు గతాన్ని మరిచి పోవలసి ఉంటుంది వర్తమానం పై ఆశ ప్రయాణంలో తప్పదు, భవిష్యత్తు రహస్యం తెలీదు వాస్తవ దృశ్యంలో మృత్యు రహస్యం హఠాత్తుగా ప్రేలుతూంది ఎదలో విభావరీ శిఖలతో జనగణం సంధ్యాతరంగ మౌతూంది ఇక్కడ దేవతలకేం కొదవలేదు ! మానవతా మూర్తులకు తప్ప అవతలి వ్యక్తి బుజాలపై బరువు తోసి తప్పుకునేవారే ఎక్కువ! నిశ్శబ్ద గవాక్షం నుండి చూస్తే మానవతా మందారం ధూమయితమై నఖశిఖ పర్యంతం మండే ఆలోచనా కింజల్కలతో కన్పిస్తుంది ద్వేషానల పవనంతో సమయం సంధ్యాచరణాలపై కదలుతూంది శత్రుత ఎరుగని ఆకులపై పండ్లపై మృత్యు శిఖలు విసరుతూంది ఇళ్ళముందు బారులుగా గోడలు ! ముఖాన రాతలతో శరీరాన మచ్చలతో తలుపులు కిటికీలు మూయబడి జీవితాలు సమాధుల్ని సంవదిస్తున్నాయి పట్ట పగలే వచ్చి రాత్రి ఏ ఉన్మాదచర్యకో పైబడుతూన్నట్లుంటుంది మ్లాన హృదయంతో నగరం చలన రహిత ఛాయారూపం పొందుతూంది. శాంతి వనంలో పొదచాటున మృత్యు ముఖాలతో దాగేరు నీడ వెనుక అగ్ని శిఖలతో అమాయక కవచాలతో నిలిచేరు పచ్చని ఆశలో మండే కొలిమిని సృజించే మానవతా శత్రువులు ! నాగరక జీవితంలో గీసిన అగ్గిపుల్లలు కన్నీళ్ళతో జీవితాన్ని పండించే స్థితి వచ్చి వాలింది ఎండిన ఆకులతో వాడిన పూలతో శోకశాఖలు కదలు తున్నాయి ఈ సమయం సంక్షోభ సమాజం రుద్రభావ బంధుమౌతుంది ఉదయ సూర్యుణ్ణి అపహసిస్తూ జలదాల్ని చిన్నా భిన్నం చేస్తూంది ఒకవైపు మెరపులతో మబ్బులు ! మరో వైపు పొగలతో మంటలు ! ఈ నీడల్లో మంటల్లో ముసుగులో మానవతా ముఖం కరువైపోయింది రాత్రి నుండీ మండి అణగిన జ్వాలలపై ఉదయం కన్నీరు కారుస్తోంది జ్వాలలేంది ? కన్నీరు లేంది ? కథ ఏదీ ? ఈ కథతోనే జీవితమంతా ! ద్వేషంతో ఎరుపెక్కిన చెక్కిళ్ళను మంచు గాలి జాలిగా నిమురుతూంది హింసతో పదునెక్కిన చూపుల్ని ఎగిరే పావురాళ్ళు తప్పించుక పోతున్నాయి నిశ్శబ్ద గవాక్షం నుండి సంధ్యా దృశ్యాలు ! వీధిలో సామాన్యుని జీవిత శకలాలు పైకి చూస్తూ ప్రార్థన చేసే దోసిట్లో కన్నీరేకాదు ప్రక్క నుండి రాళ్ళ పడొచ్చు నిశ్శబ్దం మండుతూంది నిశ్చలంగా ! నిశ్చలం శబ్దిస్తూంది వేదనతో చీలే పొగల సందు నుండి ఎగిరే పావురాళ్ళు ! నీలి నీలి గద్దలుగా కన్పిస్తున్నాయివర్తమానం స్క్రీన్ పై - అగ్నిమయం జీవితం 16. ఏకాంత సమాజం ఈ జ్వాలలపై ఎవరు నీళ్ళు పోస్తారు ? కొందరికి మంటలతోనే జీవితముంది ఈ అలజడి శాంతి కోసమేనని అనుకొనీ ఆనందించే వారూ ఉన్నారు దాహంతో అలమటిస్తూ సమాజం సాయం సంధ్యా సమంగా ఉంది అక్కడక్కడ వర్షా స్వరంతో కదలే మానవతా పయోదాలూ లేక పోలేదు ఎంత వెలుగు దూకినా ధూళిలో కలిసిన ముఖాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి పులివేషం వేసే వీధి వీరునివెనుక పిల్లలు ఆడుతూ పాడుతున్నారు మధ్య మధ్య తోకలాగుతూ భయ తరంగాల్ని విసురుతున్నారు బిస తిప్పి నడిపేందుకు మనస్సు యంత్రం కాదు చెరపి తిరిగి వ్రాసేందుకు సమయం పలక కాదు. పీడనలో దోపిడిలో రాపిడిలో సాగే చరిత్ర బాధలో వేదనలో నిరాశలో కదలే జీవితం ఒక దానితో మరొకటి ! వేసిన అడుగులు తిరిగి వెనక్కి జరగవు చీకటిని చెరపే చేతులే చీకటి వలనూ విసరుతాయి ఒక చేతిలో పావురంతో ముచ్చటిస్తూ మరోచేత కత్తి పదును చూచేరు ఎవరూ చదవలేని గ్రంథం సమాజం, అందరినీ ఆకర్షిస్తుంది ఇంద్ర ధనుస్సు వలెనో మృగతృష్ణ వలెనో నిశ్శబ్ద గవాక్షం నుండి కన్పించే, దృశ్యపరంపర అందరికీ ఇష్టమే సెంటర్లో వెలిగే దీప స్తంభం వస్తువును విలువలతో చూపిస్తోంది. ఎప్పటికపుడు కలిసి విడిపోయే పరిచయ రూపాలతో ప్రజాగణం! పోరాట కెరటాలతో కదలే సమాజం ! బిగించిన పిడికిట్లో భద్రమైన ఆదర్శాలతో నిలిచేను ! తెరచిన పిడికిట్లో నుండి జార్చే వాస్తవ శక్తులతో కదలేను సంవేదన సంఘర్షణ సమన్వయంతో నిరంతరం మాటలతో ఆయుధ చలనంతో ఇంచుమించు రణ సమమౌతూంది హృదిలో శాంత క్షణాలు జారే బిందువుల వలె నిశ్శబ్దంగా ఎదురౌతాయి బిందువు బిందువూ కలిసి ప్రశాంత జీవిత బింబమవుతూంది గిరి శిఖరమై ప్రవాహమై సమాజమై కదలుతూంది నాలో అపుడు మిగిలేది ! ఎక్కడికక్కడ ఏకాంత సమాజమే !కాలాన్ని నిలిపి క్షణం (1979) అంకితం ఏ రోజూ ఉభయ సంధ్యలూ ఒకటే అయిన కీ॥ శే॥ మాదిరాజు రామకిషన్ రావు పెద్ద అన్నగారికికాలాన్ని నిలిపి క్షణం 1. సూచిక ఆర్ధమై తేజమై 2. ఈ తీరం నుండి 3. 4. 5. ఈ చెట్టూ ఈ ఇల్లూ ఈ నీడన చెట్టు క్రింద ఈ దిశనుండి పుట 6. కాంతి స్పందనతో ..... 7. వర్తనలో శక్తియై 8. మానవతా రాగంతో 9. ఉదయ చేతనతో 10. ఆర్తినుండి 11. ఎవరా జీవించేది 5. కాలాన్ని నిలిపి క్షణం 1. ఆర్ద్రమై తేజమై సుదీర్ఘ నిశ్వాస పరంపరతో జలధి ఆయుః ప్రమాణాన్ని తలపిస్తోంది పవమానం పాడుతూ ఊపులో స్మృతులకు గాంధర్వ రూప మిస్తోంది రక్తంలో కణ కణంలో వసంత సూర్య బింబం వెలుగుతూంది దేహంలో అణువణువులో వన దేవతా ముఖం చిగురిస్తూంది కాల బింబం నాలో హరిణమై అంతలో సింహమై కదలుతూంది కాల ముఖం నాలో సపుష్పమై ఫలభరమై నిలుస్తూంది కిరణం అలవలె ఎదపై వాలుతూంది తొలగే ఊహ రానీకుండా శరీరంలో సన్నగా కోష్ణ స్పర్శ తెలీకుండా సరిస్తోంది తీగె వలె చేతుల్ని పైన వేసుకొనీ అధరాన్ని హాసంలో తేలుస్తూ చిలుక వలె కిరణం ముంజేయిపై నిలుస్తూంది, పూవును తలపిస్తూంది నేను జంతువున్నీ మృగానీ కాదు మానవుణ్ణి బంధువునీ జీవన గమన శక్తుల కేంద్రాన్ని కాలాని కాకృతి నిచ్చే శిల్పిని గుహా ముఖాల్లో నదీ తీరాల్లో అడవుల్లో కొండల్లో నా పాద ముద్రలు కన్పిస్తాయా ? నా కంఠ రవం వినిపిస్తుందా ? నైల్ నదీ తీరంలో రైడ్ యూప్రిటస్ అంచుల్లో ఓల్గా మేరల్లో గాంగ ధునీ సీమల్లో నేకన్న కలల్ని విన్న కథల్నీ కదల్చేనా ? రహస్యాల్ని వెలిగించేనా ? చలదరుణాధరాలు నాలోని మౌన గగనాన్ని శబ్దించేను ! జలదం మౌళిపై నిలుస్తుంది పవనం గుండెల్లో పలుకుతుంది కాలం ఆర్ధమై కదలుతుంది మనిషి తేజం కావ్యమై వెలుగుతుంది 2. ఈ తీరం నుండి నే నెవరినో చెప్పనా ? ఈ తీరాన ఆర్తిలో విలోలమై వికలమై అవని పై ఎగసిపడి కదిలే మానవ కథా తరంగ రూపాన్ని అనితర శక్తులతో కాలం బింబించే సమాజ కళాకృతిని నన్ను చూస్తూంటే సూర్యుడుదయించే గగన ఖండం స్ఫురిస్తుంది రాలే ఆకులతో, వాలే నీడలతో, కాలంతో పాటే కదలుతాను. నా చుట్టూ రాత్రులు ! సూర్యుణ్ణి అందుకోవాలని తిరుగుతాయి నా చుట్టూ నీడలు చీకట్లను దాటేయాలని కదలుతాయి నాలో వెలుగులు ! చీకట్లను అణచేసే అడుగులతో గిరులు ఆకాశం వైపు చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉన్నాయి నదులు నేలపై నిర్భయంగా అన్నీ తెలిసినట్లు పరుగిడుతాయి పక్షులు తిరిగి తిరిగి తెలిసో తెలీకో మరో ప్రపంచంలోకెగిరి పన్నిన పెద్దవల వలె నున్న విశాల నగరంపై వాలుతాయి దూరాన వెలుగులో కరుణతో కరగే తుషార పంక్తి తెర వెనుక ఆకలితో వాలిన మంటలూ దుఃఖంలో చెదరిన నిప్పు కణాలూ చీకట్లను మెత్తగా చీలుస్తూ వెలుగుల్ని ఓపిగ్గా చిత్రిస్తూ వెనుక నుండి గాలి నెట్టే కొద్దీ ముందుకు సాగే తరగలం ఎగసే అరుణ బింబం నాలో వివిధ వర్ణ రూపాలు నింపుతుంది రోజులు వాలే వెలుగు నీడలతో నాలో వర్ణ చిత్రాల్ని చూపుతాయి ఈ చెట్టు ఏనాటిదో ? చిన్ననాటి నుండీ చూచేదీ 3. ఈ చెట్టూ ఇల్లూ గ్రీష్మ విస్ఫారంలో దైన్యంతో జలద చలనంలో హర్షంతో నిలుస్తుంది ఈ ఇల్లు ఏనాటిదో ? చిన్న నాటి నుండీ చూచేదీ స్నిగ్ద సమయాలతో విషమ వేళలతో స్మృతిలో చిత్రార్పితమైందీ బ్రతుకులో కఠోర వాస్తవాలకు మనసులో అగాధ రహస్యాలకూ ఈ కొండలూ సముద్రాలూ ప్రతీకలుగా తోస్తాయి బీడువలె పరచుకొన్న బ్రతుకు ఒక్క మేఘం కరుణిస్తే చాలదు చేతిలో చాక్లెట్తో ! పిల్లడిలా సంబరపడుతుంది ! ఒక రాయి చూస్తుంది మరో రాయి వైపు ప్రపంచం తీరే తెలీనట్లు పరివర్తనలో ప్రయోజనం తెలిస్తేగా, ఉలి తాకిడిలో శిల్పం చూస్తేగా ఊహలు సాగుతాయి మెరపులతో జలాభిషేచనతో గుండెలో ఉరుములతో వరదలతో భయం పొరలూ తప్పకపోవచ్చు మబ్బూ నీరు పైరూ పంట ఇల్లు మనిషి రూపాన్ని మారుస్తాయి సమాజ జీవితంలో కొత్త సృజన లోకాన్ని చూపుతాయి ఈ మబ్బూ చెట్టూ ఇల్లూ ప్రకృతి మనోబంధాలకు భూమికలు 4. ఈ నీడన చెట్టు క్రింద ఆర్తి నుండి ఆనందాన్నీ ఊహ నుండి అనుభవాన్నీ వెలిగిస్తూ మంచు మెట్ల పై నుండి ఏ నీడ జాడ లేని హృదయంతో ఉషస్సు నాలోకి కదలుతూంది, నా రూపం మారుతూంది స్మృతి భూమి నాక్రమించి మనో వృక్షం శాఖోప శాఖలుగా ఎన్ని ప్రాణులకో ఆశ్రయమైందీ ఎన్ని కథలకో సాక్షిగా ఉంది ఆకాశం లోకి తలెత్తి గాలికి కదలే ఆకులతో చక్రూ రమ్యాకృతి ! చంద్రుడు దీనిపై నుండి విహగం వలె నిశ్శబ్దంగా ఎగురుతాడు దీన్ని చుట్టూ చీకటి గజం వలె తిరుగుతుంది వెలుగు అశ్వం వలె దూకుతుంది చుట్టూ పిల్లల గుంపు లా వెన్నెల ! కొమ్మల్లో భద్రంగా ముసలి చీకటి పైన నిప్పులు కురుస్తున్నా హృదయం హిమాభంగా ఉంటుంది గ్రీష్మంలో ఆద మరచి ప్రాణులు దీని పంచనే విశ్రమిస్తాయి కదలే పవన తరంగాల పై తేలే అనుభవ చేతనతో మనుషులు జాతి వర్ణ భేదం మరిచి మానవతా స్పృహపొందేరు తప్తమైన అవని వెనుక నుండి పచ్చని జ్ఞాపకాలు తలెత్తుతాయి చెట్టు దాపున శాంతి మండలం చేరే అనుభవం కలుగుతుంది బీటు వారిన భూతలం వర్షంతో మారి సమమైనట్లు చీలికలైన హృదయం, రాగంతో తడిసి ఒకటౌతుంది జ్వాలల వలె సాగే ఊహలు అంతలో శమిస్తాయి పూస్తాయి అలజడి పైబడి వచ్చినంత త్వరగా శాంతి అవతరించదు ఇక్కడికి రాగానే కళ్ళు నిదుర పొలిమేరలు చేరతాయి ఆగినట్లున్న కాల తలంపై ఊహ సాగుతుంది శాంత ధునియై కొమ్మకు పూచిన నక్షత్రం ఉదయం చేతిలో ఫలమై పడితే అదృష్టం కొమ్మ చాటు నుండి నక్షత్రం కాళ్ళపై బడి అంగారమైతే దురదృష్టం ఈ చెట్టు భుజాలపై బాల సూర్యుడుదయిస్తాడు మనిషి శక్తికి దీపమై దీని తలపై ఆకాశమూ చేతులపై క్షితిజమూ వ్రేళ్ళలో దిశలూ దీని పరిచయంతో హృదయం విరాట్ అనుభవం పొందుతుంది ఇక్కడ కాలం క్షణం ఆగుతుంది ఆ పై శ్రుతి సుభగంగా నదిస్తుంది వర్తమాన ధరణీ తలంపై నుండి నాలోకి నిరంతరం భవిష్యత్తులోకి ! 5. ఈ దిశ నుండి నాలో చలించే ఊహలో, నదిలో అల వలె లయ ఈ దిశ నుండి ఆ దిశకు గుండెలో జీవ స్పందనం కాల చక్ర రవళితో అనుభవ కళతో పయనం సాగుతుంది వర్తమాన తరంగాలోలమై సమాజ తీరాల్ని స్పృశిస్తుంది గగనంలో తేలి గాలిలో కలిసే మేఘం సృష్టి మొదటి రూపం దున్నిన చాళ్ళతో భూమి దీనికై మొగం వాచి వేచి ఉంటుంది దిశల కళ్ళు కాయలు కాస్తాయి ! మనిషి హృదయం పరితపిస్తుంది మబ్బులు ఏకమై ఆనంద నృత్యం చేసే లిప్తకే సమాజంలో ప్రతీక్ష ! ఊహలో అనంతమైన కాలం తెరలు తెరలుగా కదలి వస్తుంది వెలుగూ చీకటి చరిత్ర పుటలతో దశలు దశలుగా తరలుతుంది మనిషి కదిలేను ! దాహం ఆకలి తీరే గతిలో తరంగ ద్రుతితో సమాజం అణువణువున ఆర్తి హరించే మానవతా వర్షంకై నిరీక్షణం 6. కాంతి స్పందనతో కాల జలధిపై నౌక వలె వస్తూ పోయే ఈ ఉషస్సు హిరణ్మయ తేజో రూపం ! మానవ చైతన్యానికి సంకేతం ఆనందానికి లక్ష్యమైన సమాజ కళ్యాణ తేజం సువర్ణమూర్తి ఇపుడు సౌందర్యం వర్షిస్తుంది ప్రొద్దెక్కితే గాని సౌఖాగ్యం తెలీదు పవమాన పరిమళంతో సువర్ణ కాంతితో తెలీని అనుభవాన్నిచ్చేను శరీర స్పృహను దాటిన దివ్యదశను బింబించేను శూన్య జీవితంలో వెలుగు నింపే శిశువు నవ్వు వలె ఉషస్సు ప్రతికోణాన్నీ కలిపే రేఖలతో వెలుగు ముగ్గుల్ని తలిపించేను అరుణోదయం ఏ నియంత తలపై మణి కిరీటం కాదు బ్రతుకులో దాగిన రహస్యాల్నీ ఒదిగిన సముద్రాన్నీ చూపుతుంది వివిధ కాంతి మేళనంతో ఆత్మలో బింబించే ఆనంద రూపం కదలే కాలం వేసే పగలూ రాత్రీ పాద ముద్రల హ్లాద రూపం ప్రొద్దు పొడవగానే ముఖంలో ముఖం పెట్టి రహస్యం చెబుతుంది ప్రతి ఉదయం ముందు ఉషస్సు వెలుగు నిచ్చెన వలె నిలుస్తుంది ఆలోచన నుండి అనుభవానికి క్రమంచే మనస్సుకు చిహ్నం చూస్తూ చూస్తూండగానే రాగం అదృశ్యమౌతుంది, భోగం మెరుస్తుంది పక్షుల కలకలనూ ఆకుల గలగలనూ ప్రక్కకు నెట్టేసి మంచు కరగిపోతుంది అనల స్వరం వినిపిస్తుంది నేలపై వరసగా నీడలూ పైన మండే సూర్యుడూ నెత్తురోడే పిడికిలి వలె అరుణోదయం కదలుతుంది ప్రతిమల్లో గమన వైఖరి వస్తుంది తరగల్లో తురగ వల్గనం కన్పిస్తుంది సూర్య కిరణ చైతన్యం అణువణువున సంక్రమణం పొందుతుంది ఈ వేళ స్వేచ్ఛా విహంగం రెక్కలు సాచి దిక్కుల్ని కొలుస్తుంది ఇపుడు మనిషి అస్తిత్వం తనదే దేనికీ ప్రతిబింబం ప్రతి రూపం కాదు రాత్రి అయినా అర్థంలేంది కాదు ఏ సమయమూ వ్యర్థం కాదు ఉదయం మనిషికి జీవన స్పందనలో కొత్త లయతో గతినిస్తూంది 7. వర్తనలో శక్తియై జలధి తీరాన ఆర్ద్ర పవన తరంగం వలె ఈ సమయం హృదయం పలుకుతుంది సంగీత ధునీ స్వరం పగలు కదలి పోతుంది అహంకార శిఖలు వెలిగి చీకటి క్రమ్ముకొస్తుంది. చంద్రుడెంత వెలిగినా రాత్రి రాత్రే ! ఆకు రాలీ పూవు పూసీ జ్ఞాపకాల దిగంచలాల్లో కదిలే కాలం చంద్రుడు వెలిగే ఆలోచనతో చుక్కలు మెరసే ఊహతో ఎదురౌతుంది శిథిలాల్లో పగిలిన పెంకులతో ముక్కలైన బొమ్మలతో గతంలో చీకటి ఎక్కడెక్కడి కథలతోనో ఆకర్షిస్తుంది ఏకొండ వద్దో ఏకోనలోనో ఏగుహలోనో ఏనదీ తీర్థానో పగలూ రాత్రి జాడలు ప్రయాణంలో మురిపిస్తాయి ! పగలు బరువైన పని ఉందని రాత్రి రావడం మానదు అంతా నిద్రలో ఉన్నారని రాత్రి వేచి నిలిచిపోదు ! చూచే వాళ్ళు లేరని వెలుగు దిగులుతో దిశల్లో ఆగిపోదు ఎవరికీ మెలకువ రాలేదని ఉదయం నిరీక్షణలో నిలిచి పోదు పగలూ రాత్రి సుఖాల్ని దుఃఖాల్ని నింపుకొని పోయే కాలం ఉదయాని కల్లా కొత్తగా సంస్కార సుందరంగా అవతరిస్తుంది. అలలపై లేడి వలె ఎగురుతూ, తుషారాల్లో పూల వలె ఊగుతూ సముద్రంపై సమయ బింబం సహస్ర కరాలతో వస్తుంది చెట్టును చూస్తే తరాల జ్ఞాపకాలు ఇల్లును తలిస్తే అనుభూతి ష్మృతులు గిరిని చూస్తే చెదరని ధైర్యం ఝరిని చూస్తే దూకే ఉత్సాహం జల ధిని చూచినపుడు అందని లోతు గతాన్ని తలపిస్తుంది మేఘాన్ని చూచినపుడు భవిష్యత్తు ఎదురౌతున్నట్లుంటుంది అరణి వంటి బ్రతుకులో వర్తనతో సంకల్పం అగ్నియై శక్తియై, సమాజానికివస్తుంది నవం ప్రగతి రూపం 8. మానవతా రాగంతో ఎదురుగా నిల్చిన దీప శిఖ వెనుక జడ శక్తి దాగి ఉంది దూర దూరం విస్తరించిన గగనం శూన్యం ఒదిగి ఉంది ఈక్షణా లొకటొకటీ మనస్సులో వికసించి పరిమళించేను కిటికీ ప్రక్క వెలిగే పూల తీగెల్ని వెలుగు గోముగా స్పృశించేను క్షణాల యోగంతో కిరణం బ్రతుకును వెలిగిస్తుంది క్షణాల ఘర్షణలో స్ఫులింగం బ్రతుకును దహిస్తుంది ఆకుల శిరస్త్రాణాలతో గొరిల్లాల వలె చిన్న చిన్న గిరులు వెలుగు రెక్కలతో సూర్యుడు యుద్ధ విమానం వలె ఎగసి క్రింద నున్న నీడల్ని తొలగించే ప్రయత్నం చేసేను ఈ క్షణాలు మంచు పొరల్ని కరిగించే కిరణ ముఖాలు చెట్ల, భుజాలపై ఆకాశం, మనిషి మనస్సులో ఆశా రూపం ఆనంతమై ఒక దాని కన్న మరొకటి అంతమైనట్లు కన్పిస్తాయి జీవిత నౌక ప్రయాణంలో తనలో ప్రపంచంతో నిదుర నుండి లంగరెత్తితే ఆగకుండా సాగాలిసిందే సముద్ర మెంత లోతుంటేనేం పొడవైతేనేం ? ఒక్క నావ చాలు ! సూర్యుడెంత తీవ్ర మైతేనేం తలపైన ఒక్క గొడుగు చాలు ! పగలు వచ్చే ఎదురు దారినే రాత్రి వస్తుంది నిదుర తెర వెనుక నుండే కలల బొమ్మ లొస్తాయి రాత్రి సమీపిస్తూందో లేదో రవి దగ్ధమైన విషాద వార్త ఉదయం పొడసూపిందో లేదో! బ్రతికి ఉన్నాడన్న గాథ నడుం వంచి ఎత్తే సరికి రోజు సగం పైన దాటుతుంది పదం ఎత్తి వేసే సరికి నీడ సనసన్నగా దూరదూరం సాగుతుంది పయనంలో మన అడుగు జాడలే మనకు దూరమవుతాయి బిందువు బిందువును కలిపే రంగవల్లుల్లా వివిధ ఘటనలతో జీవితంలో ఉదయ రూపం! మానవతా రాగమయం అయితేనే పరిపూర్ణత ! 9. ఉదయ చేతనతో ఏ అణు స్పుట్నిక్ సంస్కృతీ కేతన మెగసినా ఇక్కడ అదే నాగలీ కొడవలీ బండలు తొలిచీ శిల్పాలు స్పజించీ చివరకు రాతి వలె పడి ఉన్న మనిషే అడవులు మార్చి నాగరకత నిర్మించి అడవి వలె పెరిగే మనస్సు మాత్రమే స్వేచ్ఛ దొరకని సంకెళ్ళు వీడని బ్రతుకులో వేలాడే నీడలు పయనం పెరిగిన కొద్దీ వెంట వెంట పొలిమేరలు దూరమవుతాయి పొలాల్లో గనుల్లో కర్మాగారాల్లో ఉగ్రశక్తి నర్తనతో నరాల్లో కర్షక కార్మిక జీవితాలు శిశిరంలో చిటారు కొమ్మన చుక్కలు ! అజ్ఞానం దారిద్ర్యం మౌఢ్యం గోడ లొకటొకటీ ఎత్తుగా కళ్ళు పైకెత్తితే మెరపులు పిడుగులు, కళ్ళు దించితే అంగార శిఖలు బండరాళ్ళను తొలిచి హసింప జేసిన సోక్రటిస్ వట్టి కట్టెను చెక్కి ఆకర్షింపజేసిన జీసస్ మనిషికి మనిషికి మధ్య వంతెన వేసిన బుద్దుడు ఆర్ధ హృది నుండి ఎగసిన కరుణ రస మూర్తులు ! ధమనుల్లో అనల విపంచికా రుతులు నటించినా గుండెల్లో విప్లవ దోరణీ ధునులు నదించినా చరిత్ర నుండి గుణ పాఠం ఎంత వరకు లభించింది ? ఎవరికి తోచిన అర్థం వాళ్లకు యధార్థ మనిపిస్తోంది విశ్వాసాల ఘర్షణలో సమన్వయంతో సమాజం పురోగమిస్తుంది ఉదయంలో చేతనతో ఆత్మ రూపం జీవన శిల్పాన్ని పొందుతుంది. రవి కిరణం కోసం నిరీక్షించే క్షణాల్లో నాలో కలలు హిమా కృతులు ! రాత్రి వేళ చంద్ర రేఖల్ని తలపిస్తాయి నాముందు పరచిన నిశా కార్పెట్పై నడుస్తూంటే నా అడుగు జాడలు వెలుగు ముద్రలై అలంకరిస్తాయి చుట్టూ చెట్లు కొండలూ బంధువుల వలె నిలిచి ఉన్నాయి 10. ఆర్తి నుండి ఉదయం విరిసిందో లేదో ఉత్సాహ నర్తనంతో హిమ సమూహం అవనిపై ఆర్ధ ముద్రలు వదలుతూ తరలి పోతుంది గాలులు పరుగులు తీస్తూ గిరుల వీపు తడుతూ పోతాయి చెట్ల తలల్ని నిమురుతాయి శూన్య గళాల్ని పలికిస్తాయి హిమాకృతులు కలలు మాయమై కాంతి చిత్రాలు ప్రత్యక్షమవుతాయి ఆర్తి నుండి ఆనందానికి, నడచినంత మేర ఒకే మానసిక బింబం ఆర్ద్రమైన ఆలోచనా గగనంలో ఇదో అంతరంగ ఉషోదయం ! 11. ఎవరా జీవించేది భూమి కలలు కొనైనా వాస్తవమై సమయం వెలగనీ జడ భారం వదలి మనిషి జీవితం శక్తి మయం కానీ జాతి పేర మతం పేర నిప్పు లెగసే సమాజం నవ మానవ సంస్కృతీ మనోజ్ఞం అవనీ నిన్న రేగిన అలజడి క్రమ్మి నేడు అగ్ని వర్షం కురుస్తూంది గాలి తలుపు తట్టిలేపి కొరడా వలె వీపు చరచి వెళుతూంది చెట్లు ఎక్కడికి పోతాయి ఉన్న చోటునే ఉలికి పడేను శూన్యమైన గగన కళతో భగ్న స్మృతులు నింపేను ప్రతి పూవు అనలు కణమై, ప్రతి శాఖ కొరవి దీపమై ప్రతి చెట్టు ప్రతి కొండ ధూమ గణాన్ని తలపిస్తోంది నదిలో సూర్య బింబం వలె హృదిలో చేతనతోనే సమాజం కదలుతుంది స్వప్నం నుండి వాస్తవానికి !ఈ తరం స్వర చిత్రం (1986) అంకితం పత్రికా రచనా ప్రపంచంలో సంప్రదాయ దిశనూ ఆధునిక దిశనూ కలిపే వెలుగు వంతెన కీ॥ శే॥ శివలెంక శంభు ప్రసాద్ గారికిఈ తరం స్వర చిత్రం సూచిక పుట సూచిక పుట 1. స్వేచ్ఛా సమసమాజమై 28. 2. ఎగసి పోనీ శబ్దమై 29. ఈ ఉదయం స్వర చిత్రం 388 రోజు పరుగిడుతూంది 389 3. రవం, ఆరవం 30. రోజూ అద్దంలో చూస్తాను 390 4. అరుణకిరణం గుండెలో 372 31. అశాంతి రెక్కలక్రింద 390 5. గతిలో చైతన్యం 32. బింబమై పురా బిందువై 391 6. ఈయుగంలో ప్రజాస్వామ్యం 374 33. బ్రతుకు రెక్కలపై 7. స్వేచ్ఛా స్పందనం 34. తరంతరం అన్వేషణతో 392 8. ఈ ఉదయం క్షణాలపై 35. భోపాల్ విషాదం 9. రాగంతో తేజంతో 36. చరిత్ర తేజం 10. ఆశా స్పందనం 11. ప్రశ్నాపతంగం 12. నాయాతనలో పక్షి 13. నాతో పరుగెత్తుతూంది కాలం 14. కొన్ని క్షణాలు 15. నిశ్శబ్దం శబ్దకళమై 16. అద్దంలో చూపించు నా ముఖం 381 17. చూడవచ్చు స్వేచ్ఛగా 18. స్పందనతో సృజనతో 19. ఒక్కొక్కఅడుగేస్తూ 20. సృజనలహరి 21. మనోబింబమై 22. నాకూ సూర్యునికీ మధ్య 384 23. వాస్తవంలో హద్దులు 24. రాత్రి గురించి 25. తెల్లని పొగల మధ్య 26. ఊహలో క్రియలో 27. ఈ స్వప్నం అంతమై 6. ఈ తరం స్వర చిత్రం 1. స్వే్ఛ సమ సమాజపై ఈ యుగ జన సందోహం గుండెల్లో రవి బింబం రవి బింబం ప్రతి రూపం స్వేచ్ఛా సమసమాజం ఆరనిదీ మాయనిదీ ప్రతి ఒక్కరి గాధలో బాధమయ గతిలో కణ కణలాడే క్షణాలపై కదలే ప్రజాస్వామ్య హృదయం బీద బిక్కి గుడిసె చుట్టు తిరిగి తిరిగి రవి కిరణం వాళ్ళ బ్రతుకు బండపై తిష్ఠ వేసి కూర్చుంది ఆతప పద చిహ్నాల్లో బ్రతుకుల్లో అంగారం అంగారం అంచుల్లో దాహంతో ఆకాశం ఆకాశం మండీ ఆలోచన రేగీ నేలపై జనగణం నిప్పు రగిలి మండే ఎండిన తరుశాఖలపై జీర్ణ కీర్ణ పర్ణాల్లో మరణ ధ్వని మెదలుతూంది. సంధ్యా పద చిహ్నాల్లో నిశా మనో వాటికలో అగ్నులు నీలో నాలో ఊపిరిలో తరగలుగా చూపుల్లో తీగెలుగా నీడల్లో వేదనగా ఏ మేఘం త్యాగంతో దహన శక్తి శమిస్తుంది ఎంత ధార వర్షిస్తే మనో వనం ఫలిస్తుంది పిడుగులతో మెరపులతో పెను తుపాను భీభత్సం జలార్ణవం అపని ఆర్తి సమాజ పథ గమనంలో తప్పదు నేమి క్రమణం పరివర్తన చక్రం రా రానీ ఆమేఘం మనుషుల్లో చివుళ్ళతో రస ధుని సంగీతంతో రా రానీ రవి హర్షం మానవతా కిరణంతో స్వేచ్ఛా సమ సమాజమై 2. ఎగసి పోనీ శబ్దమై శిశర చరణం ముఖంలో బూది కుప్పలు ముఖంలో ఎవరు ? వీరెవరు ? ఆశా దాహ మతితో నేలపై చేయి చాస్తే నిలుస్తూ, అడుగు వేస్తే కదలుతూ ఎవరు ? వీరెవరు ? బాధా స్ఫులింగాలను చిమ్ముతూ నిప్పు అంటిన బొగ్గులై ఎవరు వీరెవరు ? దహన మతితో దారిలో తప్త సికతా రేణుశ్రేణులు చిమ్ముతూ సాగిపోయే వేగ మూర్తులు లోహ గగనం నుండి జారే ధారాధునులు వీరెవరు ? ఇంత వరకూ నీడలై గోడ వదలని బొమ్మలై వెలుగులో నావలై అంతలో జాతి జీవన తలంపై నేడు కదలే రగ్నులై నాల్గువైపుల ఎగసి నిల్చిన కోట గోడలు కూల్చి పై కెగసి పో జూచేరు ! కోట లోపల పట్టణం బాంబు విసరిన దృశ్యమై మనిషిలో వికృత రూపం పరిచయాని కొస్తూంది శిశిర చరణం బ్రతుకులో ఆవహించిన వాలకంతో రోజు గడవడ మెలాగని దారిలో బిక్షుక గణం ! హేతు వేమిటి ? వర్గ సృజనా ? కర్మయా ? స్వార్థ వాస్త రీతులా ? అర్థమవనీ కాకపోనీ ఎగసి పోనీ వాస్తవం శబ్దమై గగనాంచలంలో సార్థమై నవ సమాజంలో 3. రవం, ఆరవం అగ్ని చరణం వేసే భగ్న హృదిలో హాహా రవం ! కోలాహలం నగ్న సత్యం పలికే స్వర్ణ తరుణం ఆహా రవం ! హాహా రవం ! సమర పవనం వీచే భీతి సమయం ! హాహా రవం ! సంధ్యా భరం ఉదయ వదనం నిలిచే రాగ హృదయం ! ఆహా పదం ! శోభార్ణవం వర్ణ కలహం చెలగే అరుణ సమయం ! హాహా రవం ! భీభత్సకం ఆర్తి హృదయం పొందే విషమ గతిలో ! ధారా రవం ! బాధా భరం 4. అరుణ కిరణం గుండెలో అరుణ కిరణం గుండెలో నిలిచి మనిషీ కదలిరా విజయ చరణం బ్రతుకులో నిలిపి మనిషి సాగిపో యుగ యుగాల శిథిలాలను పద పదాన కదిలిస్తూ తర తరాల జ్ఞాపకాలు మనస్సులో బింబిస్తూ శుష్కమైన కరాలతో ఎదురుగా తరుగణం శూన్యవలయం పాయలుగా నదీ జలం ! నిశి తారలతో తరళ గగనం పిపాసార్తయైన అవని ! కణకణంతో దాహభవం ప్రయాణార్థియైన మనిషి పద పదాన ఆటంకం పగలంతా మండిన క్షణాలు రాత్రి బూదిలో దాగుతాయి గుండె నుండి జారిన ఆశలు దారిలో ఎదురౌతాయి కళ్ళు తెరిస్తే ఉండే జీవితమే రెప్పవాలితే వేరౌతుంది సమస్తం తళతళ సంస్కృతిలో ఆలోచన ఆనందం సహనం అమేయం. కణ కణలాడే చరిత్రలో ఆరాటం ఆవేశం హింస అనంతం సమాజ సంస్కారంతో మనస్సు కాంతి ముఖం పొందుతుంది. జలధియై ఈహ నిరంతరం కదలుతుంది, జలదమై ఆశ ఎపుడో కురుస్తుంది సస్యమై బ్రతుకు ప్రతిరోజా కన్పించదు, ఆదర్శం ఎప్పటికీ అందబోయే బింబం హృదయ నభంపై వెలిగే మానవీయ సూర్యునితో ప్రజాస్వామ్య పతాకతో ఆర్థ రాగ ఉదయమై పదపదం ఒకటిగా ప్రజా గణం కదలుతూంది కాంతి బీజముఖాలతో చేతనా ప్రభవాంకురంతో చుట్టూ నవసమాజం ఇక పగటి వెలుగే కళ్ళలో ! రాత్రి చుక్కలు నిదురలో అరుణకిరణం గుండెలో 5. గతిలో చైతన్యం కదిలే జన సందోహం కండల్లో గుండెల్లో అనల సరిదుద్వేగం లయ సంభ్రమ స్పందనం ఎండల్లో నీడల్లో ఉత్తేజం ఆరాటం గిరి శిఖరం లోయల్లో ఆలోచన వాస్తసమూ మూడో కాలు సహాయం కోరే మతి పయనం విలయా వర్తంతో విషమ తలంపై క్రమణం కళ్ళలో ఆకాశం ఆకాశంలో బింబం బింబ కాంతిలో మారే చిత్ర ప్రపంచం వాస్తవ గతి రేఖలతో సామాజిక వర్తనం మానసిక ప్రసారంతో అల్లిన సంక్లిష్ట పటం ఎప్పటిదీ దైవం కల్పన ఆర్తిలో అమృత ధునియై చైతన్యం వహించిన అనుభవ కళతో ఎదలో జననం మృత్యువు మధ్య ఆగని మహానదివలె కాలం నేలకు నింగికి మధ్య చిక్కని ఉదయంవలె ఆదర్శం తీరంపై ఆశ వినా ప్రవహిస్తుంది ఝరిణి తీరంపై చూపులతో పయనిస్తుంది పడవ ఉంది సాయం సంధ్యలో భయద మృత్యువు స్వప్నం ఉంది ఉదయం సంధ్యలో రాగ జీవన తేజం రాత్రి కదలుతుంది రోజు వెంట రోజు కొత్త ఊహల శిఖలతో రాత్రి తరలుతుంది రోజు వెంట రోజు గుండెలో రవి క్రీడతో మనిషి మనిషి మధ్య కల్పిత భేదం గగనంలో లీనమై నవ సమాజ చలనంలో మానవతా దర్శనంతో కదిలే జన సముద్రం లయలో యుగ చైతన్యం నడిచే జన సందోహం ఎద ఎదలో ప్రజాసామ్యం 6. ఈ యుగంలో ప్రజాస్వామ్యం ఈ యుగంలో ప్రజాస్వామ్యం నవ్య మానవ ప్రగతి రూపం గళంతో గళం కలిపి ఎగసి వచ్చే విశ్వ హృదయం మతం మతం వెలుగు కళలై కలిసి పోయే తోరణంతో జీవ కళతో సమాజంకై కాంతి ధారా సేచనంతో శాంతితో పరివర్తనాశా సమూహాలకు విజయ వేదిక మానవతపై రక్తితో నవ శక్తి గతితో ఇక్కడుంది సమానత్వం సోదరత్వం వ్యక్తి స్వేచ్ఛా సహజ రూపం భయం నిండిన గుండె లోపల వేగ రక్త ప్రవాహ రూపం భయం వీడిన గుండె లోపల శాంత సూర్యుని కిరణ తేజం నిన్ను నీవే మంటలో కాల్చుకుని తింటావటేమిటి నిన్ననేడు రేపు రూపం సంస్కృతీ పరిణామభాగం అడుగు సాగీ, హలం కదలీ, చేయి కలిసి తిరిగి యంత్రం ఊహ విరిసీ బ్రతుకు మారీ చేరుకుందీ నేటి దశకు ఆర్తిలో నవ సమాజంకై త్యాగ ధారా సేచనంతో ప్రగతిలో పరివర్తనాశా భావ వర్తికి ఉంది విజయం మనిషి మనిషికి హృదికి హృదికి మధ్య దారుల వెలుగు నిండి వెలుగులో నవ శక్తి గతితో ఎత్తనీ సమ సమాజాకృతి అరుణ కిరణం గుండెలో నిలిచి మనిషీ కదలిరా పవన చలనం అంతటా అణువు అణువు సాగనీ విజయ చరణం బ్రతుకులో నిలిపి మనిషి సాగిపో మానవీయ సూర్యునితో ప్రజాస్వామ్య పతాకతో 7. స్వే్ఛ స్పందనం ప్రాణి కళ్ళలో మేల్కొన్న ఉదయం బ్రతుకంతా వెలుగుతుంది ఇపుడు నిజాన్ని దాచే నీడలూ లేవు, లో లోన నిదురై దువ్వే చీకటి లేదు మృదు హాసంతో వెలిగే చాంద్రీ ధునులు స్మృతుల అంచుల్లో సరిస్తాయి దిశల్ని స్నేహ కళతో నింపే వెలుగు ఏ ఆకృతిలో ఉన్నా ప్రియమే మంచులో నీరు దాగి ఉంది దీని తీరు వేరు, అందం వేరు మైత్రిలో ఆర్ధ గుణం వేరు, ప్రేమలో ప్రవాహ రూపం వేరు వ్రాలే రవి కిరణాల ముందు దీప శిఖ జాడే జ్ఞప్తికి లేదు రాగ హృదయం విప్పారి పోవలసిన దిక్కులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కళ్ళు విప్పేప్పటికి శిశువు మతికి అంతా శూన్యం గుర్తు పట్టేప్పటికి ఎదురుగా వివిధ వర్ణ ప్రపంచం పిడికిలి నుండి ఆకాశం క్రమంగా పైకి ఎగిరి పోతుంది అడుగుల క్రింద భూమి నెమ్మదిగా ఒదిగిపోతుంది కాల శకలం స్మిత సుమమై మొదలై అనుభవ సీమల్ని చుడుతూ హిమ నగమై గాంగ ధునియై ప్రాణ భరమై నిలుస్తూంది ప్రతి భావన అందాలు నింపుకొని కల్పన కాకృతినిస్తూంది ప్రతి స్పందన రాగం కూర్చుకొని ఎద అంచులు తాకుతూంది ఎదలో ధగధగలాడే తృష్ణతో మనిషి మనీషీ కదిలేను మనస్సు సంధ్యా రూపమై నిశలు పవళ్ళు దాటుతుంది ఎక్కడ చూచినా పాయలు పాయలుగా జన సమూహాలు శిఖరం నుండి తరలే ప్రవాహ దృశ్యాల్ని తలపిస్తున్నాయి దేశాల పొలి మేరలు దాటి వర్ణాల పొరమేరల్ని చీల్చుకోని వచ్చే వెలుగు గుండె కేదో తెలిసీ మానవతా భాషలో చెబుతూంది మారణాయుధం కళ్ళలో నీరు ! సోనలై సరించే క్షణం వస్తుంది బాంబు గుండెలో పచ్చని శాంతి వికసించే రోజు వస్తుంది భయం వదలి స్వేచ్ఛ స్పందిస్తూ హిమం వదలి కాంతి భాషిస్తూ నిద్రా జగం వీడి పదం కదలి మనస్సు శాంతి పథ మధిరోహించనీ 8. ఈ ఉదయం క్షణాలపై ఈ ఉదయం క్షణాలపై ప్రతి వ్యక్తి అంగలేస్తూ పోయేను ఎగసి క్రమ్మిన ధూళి దులుపుకొనే తీరిక లేదెవరికీ కఠిన శిలలు తొలిచే ఉలియై ఆలోచన కదిలేను ముందుగా క్రీనీడ అడుగులు వేస్తూంది, చేతిలో బ్యాగ్ జిపన్ను సరిచేస్తూ రోడ్ను క్రాస్ చేస్తూ మరో క్రీ నీడ చేతులు కదలిస్తూ ముందుకు వస్తూంది వారి పాద మనోజ్ఞతా గతిలోని హార్మనీ వాహనాల గమనించినట్లు లేదు బస్ రాకతో ఎగబడే జనం కోలాహలం ! అనుకోని వాన జల్లుతో ఎక్కువైంది టేబిల్పై విసరిన పేక ముక్కల్లా తీరు తీరు వాలకాలతో బస్ లో జనం లోపల ఉక్కిరి బిక్కిరి వాతావరణంతో తమకు తాము సర్దుకుంటున్నారు. పుస్తకాల బరువుతో వంగిన లేత మొగ్గలు బుజం బుజం హత్తుకొనీ నాలో దిక్కుల్నీ మబ్బుల్నీ స్పృశించే బాల్యస్మతులు చిమ్మేరు మాటలు పిలుపులు కేకలు గంటలు హారన్ శబ్ద చిత్రాలు నింపుకొని నిలకడ లేని స్థితులు సూటిగా సుళ్ళుగా గుండ్రంగా కదలిపోతున్నాయి ప్రతి గుండె ఈ రోడ్ను క్రాస్ చేసే వేళ సుడిలో చేప మోస్తరు ! వచ్చిపోయే ఎండతో నీడలో ముఖాల దోబూచు లాడుతున్నాయి వాల్ పోస్టల్ బొమ్మలతో మనోనేత్రాలు మాట్లాడుతున్నాయి కారు నిశ్శబ్దాన్ని వదలి వెళ్ళితే, లారీ నిశ్శబ్దాన్ని తరుముకొని పోతూంది టెలిగ్రాప్ తీగెలపై కూర్చున్న పక్షుల్ని ఫైర్ ఇంజన్ ధ్వని లేపేస్తూంది ఫుట్ పాత్పై పనిలో వంగిన తలల్ని గాలి పైకెత్తజేస్తూ పోతూంది గుండెలో సూర్యుని తేజంతో ధమనుల్లో ప్రవాహ నర్తనంతో కడుపులో దూరిన రోటి చాయ్ బలంతో సమయాన్ని అరగదీస్తూ అలసీ సొలసీ ఏ చెట్టు నీటనో గోడ పంచనో వ్రాలే శ్రమ జీవులు ! ఎంతో బరువు మోసి అలసి వంగిన మూపులతో క్రుంగి సడలిన సంధులతో వృద్దుల వలె పూర్వపు మేడలు ! నిన్న గాక మొన్న నిటారుగా అందంగా పైకి వచ్చి నిల్చిననీ నగరానికి నిండుదనం కొత్తదనం తెచ్చే యువ సద్మాలు ! అనుక్షణం బ్రతుకుల్ని వేగిరపెడుతూ కార్లు బస్సులూ దూసుకపోతున్నాయి అర్థరాత్రం వరకూ సద్దు మణగని శబ్దజగం సంక్షుబ్ద చిత్రం వలె ఉంది. ఇనుప చువ్వల వలె వేళకు నిల్చి వెదురు బద్దల వలె వంగుతూ లోపల మండే నిప్పుల కుంపటితో మనిషిలో మనీషినీ చూడొచ్చు ! తనపై కదలే బరువును అవని ధూళి పొరపై తేల్చేస్తూంది ప్రతీకార శిఖలు ఉదయ సాయం సంధ్యల్ని జ్ఞాపకం చేస్తున్నాయి నిశ్శబ్ద కుట్మలంపై చిరునవ్వుతో తీగె కిటికీ చువ్వల కెగబ్రాకుతోంది వీధిలో ఎగిసే ధూళికీ ధూమానికీ విషాద ప్రశ్న వలె మారుతోంది ఇక్కడెందరో తత్వాలు నినదించేరు ! లో లోపల తీరని కోర్కెలతో తపిస్తూ ఈ సమయం అనల గతిలో సంఘర్షణ వాతావరణాన్ని వణకిస్తోంది కొండ చరియ పైబడినట్లున్నా బాధా లహరి ముంచుకొచ్చినట్లున్నా వేగం హెచ్చిన జీవన గమనంలో మనుషుల ముఖాల్లో కన్పిస్తుంది ! హాయిగా పై కెగుర బోయే ఆశా విమానం ! 9. రాగంతో తేజంతో నేలపై గాలికి రాలిన ఆకు గతాన్ని జ్ఞాపకం చేస్తుంది వర్తమానం మును ముందు కొచ్చి నిల్చి అన్నింటినీ నెట్టేస్తుంది పురా శిధిలాల్లో అదృశ్యమాన తలంపై అనుబంధంతో చరిత్ర మనస్సును లాగుతుంది తెలీని చోట తెలీకుండా నిలుపుతుంది గతం ఏనాటికీ తరగని వాదం వలె వినిపిస్తుంది కొత్త జలదాన్ని సృష్టించే సముద్రం వలె కనిపిస్తుంది చండమైన గ్రీష్మ విధి నెదుర్కొనేందుకు సిద్దంగా ఉంటుంది వర్తమానం ఎదలో మేఘ సంగీతం వినిపించే నభం వలె నిలుస్తుంది జలధిలో ఎంత సుఖంగా పయనించినా అవని పైకి రావలసిందే ఏదో పోగొట్టుకుంది దొరికీ ఎద ఆనందంతో ఎగిరి గంతేస్తుంది నీటిలో గగన మణి ప్లవించే విధంగా ఆశలో శాంతి స్వప్నం ఒదిగి ఉంటుంది ఉదయం ఎన్ని మార్లు రావడం లేదు ? ఎంతమంది మనస్సు మేల్కొంటూంది మనిషిలో నిద్రా జడం లేంది ? ఇంత చీకటి చరిత్ర రూపొందేదా? ఎంతో కొంత చరిత్ర బుజాన వేసుకొనీ మనిషి దారిలో సులభంగా విడిచి, అల వలె కదలిపోయేను మానవతను తలపించే రాగంతో ప్రతి ఎదలో సంగీతం ఉంది దానవుణ్ణి తరమేసే తేజంతో ప్రతి వ్యక్తిలో వెలిగే ఆత్మ ఉంది కళ్ళు మూసి కళ్ళు తెరచి నా చుట్టూ తిరిగే నిశీథి ఉదయం నీడై వాలుతుంది మెరపు తీగె గుడిసె చెక్కిళ్ళ పై జారే కన్నీటి చార ఉదయం మంచుతో కన్పిస్తుంది సూర్యుణ్ణి మింగేసి కూర్చున్న రాత్రి విలా ఉదయం ఎగిరిపోతుంది పద పదాన చీకటి ! 10. ఆశా స్పందనం ఉదయం వెలుగుతో దూర దూరం నీడై తొలగుతుంది ఉన్నకాస్త వివేకాన్నీ మలిపి నిద్రలో ముంచేసి నిశ నిలవాలను కుంటుంది దీర్ఘ శిలా పంక్తి వలె పైన హిమ తలం వలె బిగిసిన కాలం లోపల చేపల వలె స్మృతులు కదిలేను ఎదలో చంద్రుని వలె నిశ్శబ్దం, ఝరిణి వలె శబ్దం చీకటికి భయపడే మతికి, వెన్నెల ధైర్య కళ నిస్తుంది కొండ చాటున తేజస్వి ఎంత సేపుంటాడు ? ముఖంలో ఊహలో రాగంతో బింబించేను క్షితిజ హృదయం ఉదయం స్పటికం వలె ఆకర్షిస్తుంది ఎవరు తలుస్తారీ నీడల్ని? ఆర్తిలో మనిషి తప్ప ! ఆవేదన అశాంతి నిరాశ ఒకదాని కన్న ముందొకటి వస్తుంది సహనం శాంతి తృప్తి ఒకదాని వెనుక మరొకటి ఉంటుంది పాతాళం నుండి అవనికి గగనం నుండి భూమికి అనుభవం చేరడంలో ఉంది జీవిత వాస్తవం ! సంపద సమంగా పొందడంలో ఉంది సమానత్వం 11. ప్రశ్నా పతంగం గగనాన పతంగం చూస్తూంటే పిల్లల మనస్సు ఎగసే హిమ శిఖర మవుతుంది గగనాన పతంగం ఎగురుతూంటే పిల్లల ఊహ సరించే ప్రవాహ మవుతుంది గాలి బుజాలపై తేలుతూ మేఘాల్ని చేరాలనే పతంగం మనిషి శక్తిపై యుక్తిపై ఆశతో కదలే ఒక జీవితం గాలి విసరి ఊగీ తెగి పతంగం ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుంటుంది ఏ స్తంభం తీగకో తట్టుకుంటుంది, ఆక్షణం గుండెకు చుట్టుకుంటుంది పతంగం ఒరిగి పోతూంటే లోయలోకి జారుతున్నట్లుంది పతంగం తిరుగుతూ తిరుగుతూంటే సుడిలో భ్రనిస్తున్నట్లుంటుంది ఆశా మృదు రేఖలతోతరలి తరలి మబ్బు అంచులు దువ్వుతూ దారం తెగిన పతంగం కదలి కదలి దిగిపోతూ మనః పథాన ఆడుతుంది క్షణాల వ్రేళ్ళ సందుల్లో కదులుతూ గాలి ఊహల అంచుల్లో తేలుతూ జీవన పథ గమనంలో, ఇది మనిషి ఉన్నతికీ అవనతికీ సంకేతం పైన ఎగిరేంత కాలం ప్రభయై దిగిపోయే క్షణం దీపమై ఈ పతంగం ! కాలం విసరే అందమైన ప్రశ్నకు చిహ్నం 12. నా యాతనలో పక్షి ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు చేతిలో పక్షి ఒదిగి ఉంటుంది ఇంట్లో నుండి బయటికి రాగానే కన్పించకుండా ఎగిరిపోతుంది ఇంట్లో అడుగు వేసే వేళ కెక్కడి నుండో వచ్చి వాలుతుంది పెదవులపై మాటగా గళం నుండి పొటగా ఎగసి నుదుటిపై చెక్కిళ్ళపై కళ్ళలో ఉదర్కమై బింబింస్తుంది పగలు ప్రపంచంలో చూచిన కథ మధ్య మధ్య వినిపిస్తుంది. నేను లేచే సరికి నీటుగా చేతిలో ఒదిగి ఉంటుంది. జీవితంలో నిరీక్షణకూ ప్రయత్నానికీ వెనుక నున్న అంతరంగం ఇంట్లోకి అడుగేయడంతో పక్షియై వాలుతుంది, ఆకర్షిస్తుంది ఈ పక్షికి తెలిసిన ప్రపంచం నాకు నిజంగా తెలీదు నాకు తెలిసిందల్లా ‘యేన కేనాపి ఉపాయేన' బ్రతకడ మొక్కటే ! ప్రవహించే నదితో ప్రతి రోజూ పరుగెత్తే నేను అంతరంగం మరచి బయటపోటీలో నా యాతనలోనేను ! ఇంట్లోకి రాగానే పక్షి జ్ఞాపకం వస్తుంది, నన్ను చేరుతుంది 13. నాతో పరుగెత్తుతూంది కాలం కాలం నాతో పరుగెత్తుతూంది నా కన్నా ముందు పోవాలనీ కాసేపు నిలిస్తే చాలు ! ఆదీ అనుమాన బిందువై నిలుస్తుంది నేను నడచే మార్గం చుట్టూ కొండలూ అడవీ జనపదాలూ నేను కదలే మార్గ మంతా దుమ్ము రాళ్ళు మలుపులతో విషమ తలం నా వెనుక క్షితిజం నిలువునా అవని నుండి లేచిన జనాళితో నా ముందు క్షితిజం నిటారుగా అవనిపై కదలే జనాళితో నిశ్శబ్దాన్ని తరుగుతూ వీచే గాలిలా నాలో ఆవేదన పట్టాలపై రైలు వలె ఆలోచన, నింగిలో విమానం వలె అనుభవం ప్రయాణంలో మారే దృశ్యాలు కళ్ళ ముందు కదలుతాయి ఊహలో నిలుస్తాయి శరీరంలో కోష్ణ లహరీ ప్రవాహ ముంది మనస్సులో సూర్యుని తేజముంది నాతో పరుగెత్తే కాలం దేహాన్నీ మనస్సునూ సమార్ధ కరాలతో స్పృశిస్తూంది 14. కొన్ని క్షణాలు ఎన్ని నిశలో నిద్రా సముద్రంలో పడవల వలె తేలిపోయాయి ఎన్ని పవళ్ళో సెమ్మెపై దీప శిఖల వలె వెలిగిపోయాయి ఒక్కొక్క పడవ ఒక్కొక్క యాత్రను, ఒక్కొక్క దీపం ఒక్కొక్క కథనూ చెబుతాయి హిమ శిఖరంవలె ధవళ శుభ్ర మనస్సుపై దేవతలకే నివాసం ప్రవాహం దూకుతుంది త్యాగకరంగా సమాజ కల్యాణకరంగా నరాల్లో షహనాయి స్వనిస్తుంది గుండెలో మృదంగం శబ్దిస్తుంది జీవితంలో ఏ శత్రుత్వం మెదలని తలచని కొన్ని క్షణాలుంటాయి ఆక్షణం హిమ నగం కావచ్చు స్నేహ కిరణం కావచ్చు ప్రేమ లహరి కావచ్చు 15. నిశ్శబ్దం శబ్దకళయై ఎక్కడుంది నిశ్శబ్దం ? ఆవరణమావరణం శబ్ద తరంగమయమే ఆలోచనలో నిశ్శబ్ద శిఖరాలను గాలి స్పృశిస్తూపోతుంది మనస్సును మానవ సంస్కృతీ తీరాలకు తీసుకపోతుంది గమ్యం అందుకున్న ఆనందమంతలో సశేషంగానే మిగులుతుంది ఒక పొలిమేర అంతమైత మరో పొలిమేర మొదలౌతుంది, అంతే ! పొలిమేరల్లో గుహ నుండి బయటి కొచ్చే పెద్దపులి కన్పించవచ్చు పెద్దపులి సాయం సంధ్యా దృష్టి నుండి పరుగెత్తే సారంగం కన్పించవచ్చు నిశ్శబ్ద హిమజలం ప్రవాహమై శబ్ద సౌందర్యం ఒలుకుతుంది. పెద్దపులి ఎప్పుడో కాని కన్పించదు ! ప్రయాణంలో, అరణ్యం! ఆనందాన్నిస్తుంది ఎండకు కరిగే హిమశిల వలె నిశ్శబ్దం శబ్ద కళయై ప్రవహిస్తుంది 16. అద్దంలో చూపించు నా ముఖం " అద్దంలో చూపించు ! నా ముఖం, ఎందు కిచ్చావీ చీకటి బ్రతుకు” చరణాలావృత్త మౌతున్నాయి, స్వరం శబ్ద స్ఫులింగాల్ని చిమ్ముతూంది మధ్య మధ్య కంఠం బొంగురు పోతూంది అంతలో సర్దుకుంటూంది తనలో శబ్ద శక్తిని వడబోసి పైకి పాటగా ప్రసరిస్తున్నాడతడు ఇనుపతీగె చుట్టిన చేతి వ్రేళ్ళతో చిత్ర గతుల్లో డోలక్ మ్రోగిస్తున్నాడు పాటలో ఆర్తి ప్రవహిస్తోంది కంఠ నాళాలు బిగిసాయి ముఖం ఎర్రబడింది టవల్తో మెడ పై నుండి గొంతు చుట్టూ ముఖం తుడుచుకున్నాడు ఎదురుగా ఉన్న డబ్బాలో డబ్బు వేసి జనం ఒకరొకరూ ఇక్కడికి వచ్చినపు డెరుగని బరువుతో కదలిపోతున్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, కొందరు చూచీ చూడకుండా పోతున్నారు కాస్త విరామంతో అతడు మరో ఆపర్తానికి పూనుకున్నాడు వాతావరణం విషాదం కప్పు వేసింది. మనశ్శిఖ ఆలోచనా గభీరమైంది చుట్టూ చేరిన జనం ! బుజాలపై సందు చేసుకొని అతని చూడాలనిపించింది ముందుకు నడిచా ! ఆ రెండు కళ్ళు చిన్న గుంటలు! శరీరంసన్నని తీగెలా ఉంది ముఖంపై ఒత్తుగా లోతుగా గంట్లుగా స్ఫోటకం వదలిన గుర్తులు ప్రక్కనే ఓ ఆడ మనిషి ! ఒళ్ళో చిన్న పిల్లాడు ఆడుకుంటున్నాడు రెక్కల్ని రెపరెపలాడిస్తూ ఎండ నా తలపై నిలిచింది అతడి ముఖంలో చెమట బిందువుల్లో వేడి కిరణాలు స్నానం చేస్తున్నాయి మరో ఆవర్తం మొదలు కాబోతోంది ! ఇంతలో బస్ వచ్చేసింది పిల్లల దగ్గరి నుంచీ పెద్దల దాకా ఎగబడి త్రోసుకొని ప్రవేశిస్తున్నారు బస్ కదిలింది బరువుగా ! పాట వినిపిస్తోంది ! బస్ వేగం అందుకుంది అద్దంలో చూడ లేని ముఖం వినిపించే ఆవర్తం గాలిలో తేలి ఆపై ఊహలో కదలి స్మృతిలో నిలిచింది అద్దంలో నిశ్శబ్ద కళయై “అద్దంలో చూపించు నా ముఖం ఎందు కిచ్చావీ చీకటి బ్రతుకు” అద్దంలో అతనికి చూపలేని ముఖం సమాజానికో అద్దం వంటిది 17. చూడవచ్చు స్వేచ్ఛగా ఈ చీకటి గది నుండి పచ్చని మైదానంలోకి మమ్మల్ని కదలనీండి ఏ కిరీట చ్ఛాయలో తోడు అక్కర్లేదు, ఏ శాసన ధార క్రింద నీడ అక్కర్లేదు మేం పోతే పోతాం కొండల్లోకో అడవుల్లోకో పెద్దపులి కడుపులోకో నిప్పు గాలి విసరకండి ! నీలి మబ్బు నుండైనా నాల్కపై చినుకులు రాలనీండి విషమ వ్యవస్థలో తెగని సమస్యలతో ఈ చీకటి జీవిత మక్కర్లేదు మమ్మల్ని వెన్నాడకండి మనసారా మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనీండి ! చెట్లతో మాట్లాడనీండి రాళ్ళతో పలకనీండి మనిషితో బ్రతకనీండి మా తలుపు ముందు భయంతో ముడుచుక పడుకున్న రాత్రి మా వేడి కన్నీటి బిందువులు జారిపడి మేల్కొంది, లేచి కదిలింది రాలిన ఆకుతో మృత్యువు జ్ఞాపకం వస్తుంది నిజమే వేసిన చివురుతో జీవన రహస్యమూ తెలుస్తుంది ఈ హిమ పాతం నుండి మమ్మల్ని వెచ్చని వెలుగు లోకి వెళ్ళనీండి ఊపిరి సలపనీని అవమానానికి భయానికీ హిమపాతానికి దూరంగా వెలుగు రెక్కలతో స్వేచ్ఛగా ఎగిరే హంసల్ని మా ముఖంలో చూడవచ్చు, మాదారిని మమ్మల్ని వెళ్ళనీండి ! స్వేచ్ఛగా 18. స్పందనతో సృజనతో గ్రీష్మం వస్తుంది విత్తును మట్టిలో అణచేస్తుంది వర్షం వస్తుంది. తరం నుండి తరం మొలకెత్తిస్తుంది జీర్ణపర్ణాల్ని త్రోసేస్తూ ఎండిన తీవెల్లో జీవన రుచి నింపుతూ ఎటు చూచినా ! ఆర్ద్ర వాతావరణం సృందనతో సృజన శక్తి సంకేతం గర్జాధ్వని ! మెరుపు వాన ! వరదలూ ! తుపాను ! భీభత్సం అయినా ఇష్టమే ! శివుని మూడో కన్నులో పచ్చదనం చూచే సమయం ! “ఎవరు నీవు" ? ప్రశ్నకు సమాజంలో “నేను” అనే సమాధానం మబ్బు నుండి మెరపు వలె, పిడుగు వలె, జల్లు వలె అస్తిత్వంతో మనిషి మనిషిలో విభిన్న వ్యక్తిత్వం ! తరం నుండి తరం భిన్నం స్వేచ్ఛా కిరణం ! మానవతా గంధం పచ్చని కీర్తి ఒకటే అందరిలో ఒక్కొక్క అడుగేస్తూ పోయే జీవితంలో చీకటి లో రక్షణకై చేతిలో ఆయుధం పంటలకై చేతిలో నేల దున్నే హలం ఘన గళంలో ఉంది గగనాన్ని మేల్కొల్పే శక్తి శిశు రవంలో ఉంది మనసుల్ని మేల్కొల్పే శక్తి జనమతంలో ఉంది సమాజాన్ని నడిపే శక్తి 19. ఒక్కొక్క అడుగేస్తూ శిశిరం రాకతో క్రుంగిన ప్రకృతి గుండెలో వసంతం వస్తుంది జారే కన్నీటి బిందువులో ఉదయ నృత్యం ఆశను వెలిగిస్తుంది. ప్రకృతిలో సమాజంలో మార్పు, మనిషికి నవ జీవన సంకేతం. 20. సృజన లహరి వెలిగే దీప శిఖ ప్రాణి ఆయువును జ్ఞాపకం చేస్తుంది ఎగిరే పక్షి ప్రాణిలో ఆశా విస్పారాన్ని సూచిస్తుంది పూచిన పూవు వాస్తవాన్నీ రాలే ఆకు భ్రమనూ జ్ఞాపకం చేస్తాయి మనిషిలో సమాజంలో ప్రకృతిలో బింబ ప్రతి బంబాలనివార్యం సింహాసనం ముక్కలైనా కోట గోడలు కూలినా కిరీటం ఒరిగినా సవరిస్తూ నిర్మిస్తూ ఏదోరూపంలో మనిషి బలం అక్కడే తిరుగుతుంది మట్టి నుండి మొక్కతో, మట్టిపై ప్రాణితో, శిల నుండి శిల్పంతో జగతిలో మనిషిలో నిర్మాణ రూపం జరుగుతుంది, నిరంతరం. ఆటవికం నుండి నాగరికం నుండి మనిషిలో సంస్కార తేజం విషాదం నుండి వివేకం నుండి మనసులో నవ సృజన లహరి నిద్ర ఏ గుహలోకో ఎగిరి పోయింది మెలకువ కాంతి కింజల్కలతో ముంగిట నిలిచింది 21. మనో బింబమై తలుపు తెరవగానే వెలుగు కరాలు చాచి నాపై వాలింది మూసిన దిశలు తెరచుకున్నాయి రాత్రి ఓటమి పొందింది కాని మనిషి కింకా గెలుపు లభించలేదు వీధిలో కదలే మనుషులతో వికీర్ణ శబ్ద సమూహాలు అంతటా సవేగ దృశ్య పరంపర ! సరిగా చూచేందుకు సమయం లేదు మనస్సులో స్వప్న కథా శేషం అట్లాగే ఉంది ఉదయమైనా వాస్తవ మింకా వెలగాలిసి ఉంది చీకటి భయం పోలేదు గాని అణగిన క్షుధాగ్ని గీతం తిరిగి అందుకో నుంది అన్నీ యథాతథంగానే ఉన్నాయి రాత్రి తెగిన బంధాన్ని మాత్రం ఉదయం నిలుపుతూంది అందుకే మనిషి మనిషిగా కన్పించేను 22. నాకూ సూర్యునికీ మధ్య నాకూ సూర్యునికీ మధ్య వెలుగు నీడల చదరంగ ప్రపంచం పైన ఆకాశం అందని వేదాంతం వలె, క్రింద అవని తప్పని బ్రతుకువలె యుగాల వెలుగులతో పాటు తరాల చీకట్లనూ బుజాన వేసుకోని బరువు నీడలు వదలుతూ వెలుగు ఆశలు కోరుతూ సమాజం వడబోసిన సంస్కారం మనసులో ఆలోచనకు ఆకృతి నిస్తోంది మేల్కొన్న మనస్సుకు బయటి సూర్యుణ్ణి చూడాలనిపించడంలేదు వికలమైన హృదయం సుస్వరతను పొందాలిసి ఉంది రాగంతో ఆర్ద్రతతో మనిషి గమ్యం చేరాలిసి ఉంది ద్వేషంతో జ్వలించేవి నానుండి వీడి వెడలి పోతున్నాయి స్నేహంతో వెలిగేవి నాలోకి కదలి నిలిచి పోతున్నాయి రాత్రి నిదురలో ముంచేస్తుంది, ఉదయం మెలకువలో తేలుస్తుంది నాకూ సూర్యునికీ మధ్య వెలుగు వంతెన ! క్రింద జీవన ధుని ! 23. వాస్తవంలో హద్దులు శిల వద్ద నిల్చి పొదల వద్ద ఆగి ముని వ్రేళ్ళపై నిల్చి తడుముకుంటూ కదలీ తూగీ పాయలుగా పరుగెత్తే ప్రవాహ పంక్తుల వలె దేశం నుండి దేశానికి బ్రతుకు నుండి బ్రతుక్కి ఆలోచనా సమూహాలు ఒక అనుభవంతో మరొకటి మరో అనుభవంతో మరొకటి కదలి పోయేను సమాజంలో ప్రతి మనిషికీ నిహతం కాకుండా జీవించే హక్కు ఉంది బ్రతుకు బరువుకూ ఒరపిడికీ మనస్సు వికలం కావచ్చు శకలం కావచ్చు ముక్కలైన మనసు బింబానుభవం ఎన్నటికీ సంపూర్ణం కాదు మనిషి శక్తి అమేయం, మనోరూప మనంతం, దారులూ అనేకం సముద్ర మెదురైతే చేప అవుతుంది, ఆకాశం కన్పిస్తే విహంగమవుతుంది నేలపై జంతువో మృగమో కావచ్చు ! ఒకరి చేతిలో బొమ్మై ఆడొచ్చు నేల పై ఏ నిలయంలోనో వెలుగుచూడని శిల్పం అవచ్చు. నీడకై తపనతో పూవుకై ఆశతో ఫలంకై ఆర్తితో కదలే మనిషికి వాస్తవ మెదురౌతుంది, ఆటకు హద్దులు చెరగిపోతాయి ! స్వార్థంలో ఆదర్శం అదృశ్యమవుతుంది 24. రాత్రి గురించి అద్దంలో ముఖం వలె మనిషి మాటలో మనస్సు కన్పిస్తుంది ఊహలో పురా సంస్కృతీ చిహ్నం చంద్ర రేఖ వలె మెరుస్తుంది శిథిలాల తవ్వకాల్లో మొన దేరిన శిలా శకలాల్లో అన్వేషణకు సిద్ధమై మనస్సు పురా రూపాన్ని దర్శిస్తుంది అనుభవం గూడులో వివేకం పక్షి రూపం వహిస్తుంది మధ్య మధ్య నిశాంతరాలతో పగలు తరువాత పగలు మధ్య మధ్య ఎడారులతో శిఖరం తరువాత శిఖరం చరిత్రలో దిశ దిశ తిరిగి తిరిగి పక్షి కథలో పాత్ర అవుతుంది మనిషి శక్తి కాహ్వానం పలికే ఉదయం శిఖరంపై వెలుగు నిలుస్తుంది నీడలు జారిపోతాయి పక్షి గురించి ఆలోచన ఎక్కడిది ? నా వెనుక నీడలో నిర్భయంగా ఉంది ! పక్షి! 25. తెల్లని పొగలు మధ్య తెరచిన కిటికీ నుండి గాలికి నాపై రాలిన ఆకు స్మృతుల్ని కదలిస్తూంది ఈ చెట్టు ! ఎన్ని కథలకో సందర్భాలలో సాక్షీభూతంగా ఉంది గిరిజాల పెద్ద మనిషి మాజీ రంగస్థల నటుడు కిళ్ళీ నములుతూ వస్తున్నాడు డాబా గోడకు ప్రాకిన తీగె పై పైకి పోయే తాపత్రయంలో ఉంది, దైవం తమ కోర్కెల్ని విని తీర్చేందుకు భక్తులు గంటల్ని ఖంగున మ్రోగిస్తున్నారు గాజు ముక్కల్ని అమర్చిన గుడి గోడ గురించి చర్చ తాండవిస్తూంది గోడ సందులో పెరిగిన చెట్టు కొమ్మల్ని నరకాలా ? వద్దా ? అని గలాటా ! ఆగని సంఘర్షణలో పచ్చి ఆకుల వలె ప్రాణాలు రాలి పోయేను తెగని సంక్షోభంలో కాళ్ళు చేతులు కొట్టుకొనే రాజకీయ పార్టీ వలె టీపాయ్ పై వేట్ తొలగిన న్యూస్ పేపర్ గాలికి రెపరెప ఎగిరి పడుతూంది ఎండలో గొడుగుతో పెద్ద మనిషి వడిగా వంకరగా నడుస్తున్నాడు సువ్వ మొన పొడుచుకొనీ ఆ ప్రక్కన కళ్ళుపోనీ చెవిలో గుబిలి తీయనీ ఎప్పటికీ తెగని వాదనలా లారీలు బస్సులు వరసగా దూకుతున్నాయి నిన్నటి నియంత నేడు అద్దాల అల్మెరాలో కన్పించేను నిన్నటి నాయకుడు నేడు ప్రజల మధ్య ధూమ శిఖ అయ్యేను ఒకరి కొకరు సమాంతరంగా నడుస్తున్నారు ! కలిసే ప్రశ్న లేదు అంతలో కర్ఫ్యూ విధించిన నగరం భయంతో మౌన పర్వతం వలె ఉంది అడ్రసు తప్పిన ఉత్తరాల వలె ! బూట్ల చప్పుడుతో హెచ్చరికలు ! దూసుకొని పోయే జీప్ ధ్వని ! దగ్గరలో ప్రాణి నలిగిన సవ్వడి ! పట్ట పగలు చిమ్మిన మసక చీకట్లో స్థితి ఊపిరాడకుండా ఉంది సైనికులు మార్చింగ్ శబ్దానికి టెలిగ్రాప్ తీగెలపై పిట్ట లెగిరిపోతున్నాయి భూమి ఉలిక్కి పడుతూంది ! క్షితిజం సంకుచితమై కన్పిస్తూంది ఆగని చేతి గడియారంతో నెత్తురు దుస్తులతో గాయపడిన శరీరాలు పావుల కదలికలో వచ్చే చావుకలంకారాలుగా ఉన్నాయి స్మృతిలో మిగిలే ముద్రలు ! మానవ చరిత్రలో మరపురాని సందర్భాలు ఇక్కడ ప్రాణానికి విలువలేదు ! ఆకు కంటె ఈక కంటే తేలిక ! సిద్దాంతం ఏదైనా చట్టం ఎట్లా ఉన్నా మానవీయం ఓటమితో సాయం సంధ్యామయం కాకూడదు గీసిన అగ్గి పుల్ల అంటుకుంది, పెదవుల మధ్య సిగరెట్ వెలిగింది గాలికి ఊగే దారాలతో సాలీడు పటంలా సన్నగా సాగే తెల్లని పొగల మధ్య కిటికీ ప్రేమ్ జీవితం ! సందేహ సంధ్యలా బిగింపబడి ఉంది! 26. ఊహలో క్రియలో ఈ శిలామయభూమిపై ఏ పచ్చని ఊహ మొలకెత్తేను ఈ శిలా గణ తలంపై ఏ ఆర్థ కణం ప్రభవించేను గతాన్ని అరణ్యంలోనే నిద్రపోనీ! మేల్కొల్పితే మనల్ని మ్రింగేస్తుంది వర్తమానాన్ని మేల్కొనే ఉండనీ! దీన్ని నిద్ర పుచ్చడం ఎవరి తరం కాదు భవిష్యత్తును పైన గగనంలో నిల్వనీ ! ఇపుడు దీన్ని దించడం కలలో మాట సముద్రంలో పయనించే నావకు తీరం చేరడమే లక్ష్యం జల ప్రపంచం ఎంత అందమైందైనా ! భూ ప్రపంచానికి రావలసిందే ఆ వణకే చెట్ల చాటున కన్పించీ కన్పించని మనిషి హృదయ ముంది స్పందన విను మెల్లిగా ఆ బ్రతుకు భాష తెలుసుకో ఓపిగ్గా ! చెట్ల పంగల్లో నుండి జారిన త్రాచుల వలె చేతులు కన్పిస్తాయి చెట్ల ఆకుల్లో నుండి నిప్పు రవ్వల వలె కళ్ళు మెరుస్తాయి ఆ కదలని చెట్ల చాటు నుండి కదలే రహస్య జీవితాలు కన్పిస్తాయి ఆతంకమయినా విప్లవమయినా అరణ్యం ఆధారం కారాదు ప్రజలకై ప్రజల మధ్య ప్రజల ఆమోదం శ్రేయం ముఖ్యం. చీకటి ముసుగు, వెన్నెల ముసుగు, నీడ ముసుగు, నిప్పు ముసుగు, పొగ ముసుగు ఒకటేమిటి ? ముసుగు నుండి ముసుగు లోకి మారే ముఖాలు ! ఏ వ్యక్తి అయినా ? సమాజమైనా ? నిజంగా వాస్తవాన్ని భరించేనా ? చెట్ల వెనుక నున్న రూపాల్ని! అతంకమో విప్లవమో కన్పించనీయడం లేదు భయదారణ్యంలో ఆకృతులు ! సముద్రంలో జీవకోటి వలె మునుగుతూ తేలుతూ ! ఈదుతూ ! కన్పిస్తూ వసించేరు తుపాను ప్రకృతికి సృజన కళనూ ఇవ్వలేదు సౌందర్యాన్నీ ఇవ్వలేదు ప్రకృతికి ప్రతిరూపం సమాజం ఏరోజూ భీభత్స ముఖంతో కన్పించడం కుదరదు ఏ దృక్పథమైనా ఎదురైన మనిషిని ప్రేల్చేసే ఆయుధం కాకూడదు ఏ క్రియాచరణమైనా ఎదలో గంగను ఇంకించే గ్రీష్మం కాకూడదు. రాత్రి రానీ ! శ్రాంతులకు విశ్రాంతి పదం ఏ రాత్రీ విషాదం కారాదు నక్షత్రాల పద్మ వ్యూహం నుండి నేలపై వాస్తవానికి రావడం మంచిది నక్షత్రాలపై ఆశ తో ఆదర్శం, మనిషి చేతిలో ఖడ్గం కావచ్చు ! బాంబు కావచ్చు శిలా హృదిలో ఆర్ద్ర కణం కదలనీ ! శిలా మతిలో పచ్చదనం నిలవనీ ? 27. ఈ స్వప్నం అంతమై ఎటు చూచినా ప్రకృతి ! వెలుగులో తేలే భూమి ! చెట్లు! పక్షులు ! పర్వతాలు! నదులు ! సముద్రం ! జీవకోటి ! మరో వైపు మానవ సమాజం ద్వేషం కోపం తాపం ఘర్షణ యుద్ధంతో చక్ర నేమి క్రమణ జీవితం ముంగిట్లో కాంతి తోరణంతో అదృష్టం తలెత్తిం దనుకునేంతలో గడప దాటగానే స్వప్నం అంతమై ఎదురుగా కత్తి మొనతో దృశ్యం సమాజం సదా కత్తి మొన అంచునో చివరో నిలిచి ఉండలేదు కత్తికి భయపడే ప్రాణి ప్రక్కనే కత్తి చేత బూని మనిషీ సిద్ధం ! పూర్వా పర సంధ్యామతి రూపాలతో సమాజం క్రమిస్తుంది ఒక వైపు సూర్య బింబం మరోవైపు చంద్ర బింబం ఆకర్షిస్తాయి యుగాలుగా అదే మనిషి! జీవితంలో మౌలిక మనో రూపంతో స్వార్థం త్యాగం! ద్వేషం స్నేహం, రణం శాంతి ముఖాలతో మార్గాలు మారినా సాధనాలు వేరైనా సంబంధాల్లో ప్రేరణ శక్తులు ఒకటే లక్ష్యం చేరుకునే ఈహ ఒక్కటే, పయనంలో అనుభవ చలనం ఒకటే ! 28. ఈ ఉదయం స్వర చిత్రం నా వెనుక నుండి కోటి ముఖాలు హిమ నగ దర్పణంలో బింబిస్తూ దీప తోరణాలై మెరుస్తాయి కాంతి కెరటాలై కదలుతాయి కిటికీ నుండి చూస్తూ అణువణువూ సర్వం ఆత్మ రూపమైన ఉదయం గూళ్ళ నుండి ఎగిరే పక్షుల వలె మనస్సు నుండి స్మృతులతో నాలుగు వైపుల వివిధ వర్ణబింబాలు ! నా ముఖానికి ప్రతిరూపాలు ! సూర్య కిరణ ప్రతిఫలనంతో శ్రమ బిందు సౌందర్యంతో కదలే సమాజ సందోహంలో భాగమే నా ముఖంలో రంగుల అలలు ! కిటికీ నుండి కనిపిస్తుంది చిల్లి పడిన జేబు నుండి జారిన డబ్బులకోసం ఏడుస్తూ వెదికే కుర్రవాడు వెలిగి వెలిగి కను మూసిన దీప స్తంభాన్ని చేరుకున్నాడు ఎవడో చిలిపి కుంక ! విసరిన రాయికి కారు అద్దాలు పగిలిన ధ్వని ! మెడ వెనక నుండి ఎద పైకి తీసిన ఒడిలో పసి మొగ్గతో బిచ్చ కత్తె ముని వ్రేళ్ళతో నుదురు మీటుతూ పాట పలుకుతూ పోతూంది రాత్రి కనిపించని రహస్య దృశ్యాన్ని చిత్రించడానికి రాత్రి గడ్డ కట్టిన చల్లని నిశ్శబ్దాన్ని కరిగించడానికి తిరిగే ముఖాల్లో ఆర్తి శిఖలు చాలు ! ఆక్రందన వేడి చాలు ! 29. రోజు పరుగిడుతోంది రోజు కదలుతుంది, మండే అరుణ చరణాలతో ఎవరికీ తెలీని దూరం దేహంపై తీవ్ర రశ్మి మెరపులతో, నరాల్లో ప్రవహించే కోష్ణ ధునులతో చీకటి మనుషుల్నీ చెట్ల నీడల్నీ వీపుపై మోస్తూ కదలుతూంది రాలిన ఆకుల్నీ తరుముతూ, ఆకలితో మనుషుల్ని పరుగెత్తిస్తూ కళ్ళలో దూకిన మసక చీకటితో తలపై మండే సూర్యునితో ఇళ్ళ ముందు అరచే క్షుధార్తులతో రోజు మొదలౌతుంది తలపై కాంతి కిరీటంతో చేతుల్లో ఆశా పుష్పాలతో గాలి లోపలి కొస్తుంది రోజు నడుస్తుంది నిప్పులపై, స్వేచ్ఛకై ఆరాటంతో హక్కులకై నినాదాలతో సింధూర ముఖంతో బంధూక భావనలో పగటి క్షణాల కదలుతాయి తెలుపు లేదు, ఎక్కడో పచ్చదనం, ఎరుపుతో సంఘర్షణ, మెరుపులో అశాంతి ఉదయ సాయం సంధ్యలు ఆటు పోటు వలె వచ్చి పోతాయి జీవితం తీరం నుండి తీరానికి రోజూ ప్రయాణిస్తుంది జన వాహన సంకుల ధ్వని తరంగాలపై రోజు పరుగిడుతుంది దీనికి విరామం లేదు ! సమాప్తి లేదు ! శాంతి అంత కన్నా లేదు 30. రోజూ అద్దంలో చూస్తాను ఈ రూపాన్ని రోజూ వెలుగులో అద్దంలో చూస్తాను నేలపై గోడపై నీటిపైనా నాకెంతో దగ్గరగా కన్పిస్తుంది నా ఉనికితో దీనికో గుర్తింపు అవలీలగా సిద్ధిస్తుంది నా ముందు నాకన్నా ఆకర్షణతో అందంగా వచ్చి నిలుస్తుంది సన్నని అలల కదలికలో నేను మరచిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏదో కథ చెప్పడానికి సిద్ధమైన దూర బంధువు వలె ఉంటుంది నాలో ప్రతిదీ సమీక్షించే చిత్ర గుపుని వలె అవతరిస్తుంది అద్దంలో కన్పించే రూపం నాలో అంతరంగ మూర్తికి బింబం అద్దంలో కన్పించే నాలో అందమైన అహంకార శిల్పమూ ఉంది నేలపై గోడపై నీటిపై కదలీ నాలో భయాన్ని క్రీడింపజేస్తుంది గుహ నుండి బయటికి వచ్చే సింహం వలె ఆలోచన కదలుతుంది అపుడపుడూ ఎదుటి ముఖంలో పైకి తెలీకుండా ప్రతిఫలిస్తుంది మెత్తని అలల కదలికతోనేకోరిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏదో ముడి విప్పడానికి సిద్ధమైన ప్రియ మిత్రం వలె ఉంటుంది దీనికి నా మెత్తని గుండె లయతోపాటు అడుగుల సవ్వడీ బాగా తెలుసు ముఖంలో ఉషస్సు బుజాల వెనక పొంచిన తమస్సు బాగా తెలుసు బింబం ప్రతిబింబంగా అవతరిస్తుంది నీడ క్రీనీడగా కదలిపోతుంది అంతరంగం కన్నా నాలో అహంకారంలో వీటితో అస్తిత్వమున్నట్లుంది 31. ఆశాంతి రెక్కల క్రింద నిన్న ధూళిలో కలిసిన అశాంతి నేడు నిద్ర నుండి లేచింది విషాదంలో ప్లవించే ఎదను గాలి మృదువుగా నిమురుతూంది ప్రతి ముఖంలో ఆవేదనా గాధ, ప్రతి చూపులో విషమ స్థితి ! అశాంతి రెక్కల క్రింది అసహనం బ్రతికి, బట్టకడుతూంది. అద్దం వలె మెరసే ఆదర్శం పై విసరే రాళ్ళ అలజడితో కలత చెందిన సమాజంలో మానవత సుళ్ళు తిరుగుతోంది నాలుగు వైపుల ప్రశ్నా ముఖాల నుండి ఆక్రందనల్ని గుండెకు హత్తుకొని క్షితిజం మౌనంగా ఉంది చీకట్లో పొదల వలె జనపదాల్లో తీరని బాధా గ్రస్తులు విప్పారిన ఇనుప రేకుల వలె కన్పించేరు, నడిచే తీగల వలె నగరాల్లో తీరని ఆశా గ్రస్తులు లేచిన ఇనుప చువ్వల వలె వీధుల్లో కదిలేరు ఆత్మచిత్రంలో వివిధ వర్ణ రేఖలు ఒకదాని నొకటి బాధిస్తున్నాయి ఆత్మ సంగీతంలో వివిధ స్వరాలు ఒకదాని నొకటి హింసిస్తున్నాయి సమాజంలో లేచిన ఆశాంతి ఉదయమే అంగార మద్దుకుంటూంది శిల వలె బిగిసిన కాళ్ళతో ఇక్కడ గాలి కదల్లేకుండా ఉంది అగ్ని ఆలోచనలో మొలిచింది వృక్షమై ఆకాశాన్ని అంటుకో జూస్తూంది ఎగిరే హంస హింసానుభవంలో కొన ఊపిరితో రెపరెపలాడుతూంది కాలం స్మృతి చిహ్నంకై ఎదురు చూచే శిలా ఫలకం వలె ఉంది గొప్ప వారసత్వం ఉన్న మనిషి అశాంతి రెక్కల క్రింద నీడయై చరించేను 32. బింబమై పురా బిందువై నగరం నాటకం వలె ఉంది అంతలో అరణ్య మౌతుంది సమయం దర్పణం వలె ఉంది అంతలో సముద్ర మౌతుంది రాత్రి అయినా నిద్రను మ్రింగేసి మేల్కొని ఉండే పాత్ర లున్నాయి కాళ్ళ క్రింద అలలై కదలే క్షణాలు చిరు కత్తులై కదలుతాయి రాత్రి వస్తుంది, చీకట్లను కళ్ళలో గుప్పుతుంది, పోతుంది పగలు వస్తుంది, భయాన్ని గుండెలో నాటుతుంది, పోతుంది జీవికకై ఆరాటం వీధుల్లో పోరాటం పొగలతో మంటలతో అగ్నులై కాలం ఎప్పుడూ ఎవరినీ గుర్తించని తొందరలోనే ఉంటుంది ఒకపుడు కుంటిగా మరొకపుడు గుడ్డిగా మరొకపుడు చెవిటిగా ఏ మొగమోటం లేకుండా ఎదురౌతుంది తొలగిపోతుంది ఎతెన మేడ కింద నీడ వెలుగుకోసం పై పైకి చూస్తుంది చెవిలో దూరని కథల్ని గాలి ఎలాగో వినిపింప జూస్తుంది కష్టాల్నీ భయాల్నీ అరచేతిలో అదుముకొని ఇంత దూరం వచ్చిన ఈ మనిషిలో వసించే నగరంతో పాటు వదలిన అరణ్యమూ ఉంది బింబమై చెదరని పురా బిందు చిత్రమై 33. బ్రతుకు రెక్కలపై జన సంకుల నగరంలో ఘన కోలాహల ధునిలో అడుగు పెట్టిన మతిలో స్వర్గ శకలం ! ఇంద్రచాపం ! అందుకోనూ హత్తుకోనూ, పద పదం ! ఆరాటం ! ఆవేదన ! ఆవేగం ! ఆరోహణం అవరోహణం! పగలంతా తిరిగి నిరుద్యోగి ! కొమ్మలు తెగిన చెట్టు క్రింద కన్పించేను సంకీర్ణ శబ్ద ప్రపంచంపై నుండి తేలుతూ పాట వినిపిస్తోంది సముద్రంలో నావల్ని కెరటాల వలె వాహనాల్ని మనుషులు తప్పకునేరు రోడ్ మధ్య అలజడిలో నుండి ఈదే చేపల వలె కదలేరు వేగంగా బ్రతుకు నుండి బ్రతుక్కి ఒక చోటు నుండి మరో చోటుకు అన్వేషణతో మాటతో పాటతో ఆలోచనతో తరంతరం నిరంతరం ప్రయాణం రాత్రి ఎదపై వెలిగే చంద్రుని వంటి రస హృదయంతో పగలు మతిపై వెలిగే సూర్యుని వంటి తేజో మస్తిష్కంతో ఆవేదన ఆవేగంతో శబ్దం నుండి సంగీతానికి చలనం అనుభవంతో ఆలోచనతో వాస్తవం నుండి ఆదర్శానికి పయనం మనిషి చుట్టు నీడలు ! క్రీ నీడలు ! చీకటి రూపాల మధ్య అందరాని హిమ శిఖరం ! హిమ శిఖరంపై నుండి కాంతి లహరి, బిందువు నుండి వలయానికి, వలయంలో అంతర్వలయ సమూహం బ్రతుకు రెక్కలపై నగరానికి, నాటకంలో అంతర్నాటక దృశ్యం మొదలు ! 34. తరంతరం అన్వేషణతో వీథి దీపాల కళ్ళు తెరచి నగరం రాత్రి అంతా మేల్కొని ఉంటుంది జన కోలాహలంతో నగరం రాత్రి దాకా విశ్రాంతి ఎరగని సముద్రం ఆలస్యమయ్యే తొందరలో బుజాలెగరేస్తూ వాహనాలు పరుగెత్తుతాయి వీటి మధ్య బుజం మారని బ్రతుకు బరువులో కలలుగనే తీరికెక్కడిది ? దారిలో, పాతిన వెదురు గడల కిరువైపుల కట్టిన తీగెపై మెడలో తాడుకు వ్రేలాడే పాపతో తీరిగ్గా నడచే జీవితాలు అపుడపుడు శబ్దం ఎదపై సూది మొనవలె గ్రుచ్చుతుంది రాయై తగులుతుంది బాకై దిగుతుంది శిఖయై కాలుస్తుంది పయనిస్తుంది వణకే పెదవులపై మాటలు మంటలపై ఎగసే పక్షుల వలె ఉన్నాయి వీపుపై బరువు దించే లోపల మనిషి కాళ్ళ క్రింద బాంబు ప్రేలుతూంది సూర్య కిరణాల్ని అల్లుకొని అనల లతలు ఊగుతున్నాయి తరాన్ని అతిక్రమించి మరో తరం కదలుతూంది స్వేచ్ఛగా తరం తరం అన్వేషణతో కదలుతుంది వెలుగుతూంది భౌతిక శక్తుల మధ్య కన్పించే సంస్కృతి లక్ష్యంకై ఎదుగుతూంది దారిలో కాలం హరిణమై అశ్వమై యంత్రమై ఎదురౌతూంది గదులు గదులుగా నీడలు వెలుగులు సరి క్రొత్త ఆట కాహ్వానిస్తాయి రేపటి గురించి కలలు గనే అర్థరాత్రి సమయం పగటి శ్రమ మరచి అంతా నిదుర పోతున్నారు 35. భోపాల్ విషాదం విష వాయువు వాతావరణాన్ని మృత్యు వలయంగా మారుస్తోంది వెలుగేమిటి ? వెన్నె లెమిటి ? పూవు లేమిటి ? ప్రాణు లేమిటి ? హఠాత్తుగా కదలే భయం తరంగాలపై నగరం అటూ ఇటూ ఊగుతోంది ఒక్క మారు లేచి జనం, వెన్నాడే మృత్యు భయంతో పరుగెత్తేరు ఇల్లు వదలి వీధి దాటి నగరం వీడి కాలి ముని వ్రేళ్ళపై పరుగెత్తేరు అణువణువూ క్షణంలో ప్రాకే మృత్యు జాలంలో చిక్కింది ? ఒక్క మనుషు లేమిటి ? విష వాయువు కదలినంతమేర సర్వప్రాణులూ ఉక్కిరి బిక్కిరౌతున్నారు, సముద్రంలో మునిగే అనుభవంతో ప్రాణం పోసే గాలే ప్రాణం తీస్తుందీ విషమ స్థితిలో ఇంతవరకు సుగమంగా సాగిన జీవితం, అగమ్యంలోకి పరుగెత్తుతూంది స్వర్గం కూలి లోయలో పడుతూంది విషాదం శిలామయమౌతూంది మృత్యు తీరంలో మృత్యుచ్ఛాయల్లో మృత్యు భయంతో ప్రాణి కోటి కదలుతూంది, ఆశా సూత్రానికి వేలాడుతూ ఆరిపోతూన్న వెలుగుల్లో వినీల మవుతూన్న జీవిత కథతో అర్థరాత్రి మృత్యు పవనానికి సమాజం శీర్ణమై కీర్ణమై ఎగసి పోతూంది ఉదయమైంది ! అయినట్లే లేదు ! నలు వైపుల వికలస్థితి ! భీభత్సం నగరమంతా ఒకే మంచు ముసుగులో ఆర్త స్వరంతో ఊగుతోంది సగం నగర మింకా నిద్రలో ముడుచుకునే ఉంది ! లేవనే లేదు యాంత్రిక జీవనంలో వెలుక్కి బదులు చీకటి చిమ్మిన విలయ సమయం అవనిపై కదలుతూన్న మరణభయ ధూమ శిఖల సమూహం మృత్యు పాద ముద్రలతో అంకితమైన భీభత్సం మనిషిలో అలసతకూ ఆశ్రద్ధకూ వికార చిహ్నం ! స్వచ్ఛమైన గాలి కోసం భయంలేని స్థలం కోసం విషాద ముద్రతో బరువెక్కిన అడుగులతో జనం ! భయ భూతాన్ని నిలిపిన ఉదంతం ఒక పీడ కలగా మిగిలింది ఈ విషాక్త వాతావరణం నుండి అమృత స్వరం తప్పక వినిపిస్తుంది ! నీలి ముద్రల్లో మృత్యు హాసంలో నిన్న తేలిన చరిత్ర భోపాల్ విషాదం స్మృతిలో ఎప్పటికీ మిగిలే ఉంటుంది నాగరక సమాజంలో అశ్రద్దకూ అలసతకూ చిహ్నంగా 36. చరిత్ర తేజం ఆర్్చ గేట్ వద్ద రక్షక భటుడు ! వెలుగు నుండి వేరైన చీకటి పక్షి! ఆ ఉదయం క్షణాల్ని ఉన్మాదపు రెక్కల నీడతో కప్పేసింది. గేట్ దాటింది హిమ తుషార స్నిగ్ధ కిరణం జన గణ హృదిలో రెపరెపలాడే ఆశా కేతనం గుహలో లోయలో చరించే ఆటవిక మృగ రూపం మృత్యువును గుప్పించింది, ప్రధాని నేలపై కూలింది. శిఖరం నుండి మానవ సంస్కృతి పాతాళానికి జారిన సమయం శిలా మౌఢ్యం వెనుక నుండి పన్నిన బర్బర నీతికి కెమాక్్స. ఉదయ శరీరం సాయం సంధ్యా జపా సుమ గుచ్ఛమైంది చిమ్మిన రుధిర కణకణంలో త్యాగ ఫలం బింబిస్తూంది స్తంభించిన గాలి తలపై నుండి విషాద వార్త ఎగసి దూకి ప్రాకింది మనుషుల్ని దిగ్రమలోకి విసరింది అణువణువునూ అనలం స్పృశిస్తూన్నట్లుంది గుండెలు హహాకారంతో కణకణలాడాయి. హత్యా భీభత్స దృశ్యం గీసిన విషాద చిత్రం వలె ఉంది ఆమె ఇంట్లో అంతా తన వాళ్ళే! ఉండవలసిన వాళ్ళే ! మహా దేశ సముద్రంలోని శకల బిందువులే ! క్షుద్ర నీతి వ్యూహంలో పావులుగా మారారు జాతి సమున్నతికి సంకేతమైంది. హిమ సుషమా శిఖరమైంది క్షణంలో క్రిక్కిరిసిన గత స్మృతుల్లో ఒక వెలుగై మిగిలింది ప్రజల కన్నీటి అలలపై తేలుతూ శిథిల జీవిత గాధల్ని స్పృశిస్తూ శ్రమ జీవన సౌభాగ్యం ఆదర్శంతో అమరమైన భారతేందిర నవ సమాజ నిర్మాణంలో చరిత్ర సృజించిన తేజం. (1991) అంకితం సేవా చందన మతి సోదరుడు శ్రీ మాదిరాజు వెంకటేశ్వర రావుకు 1. సూచిక ఈ శతాబ్ది స్వేచ్ఛలో 2. హిమజలాల్లో అగ్నులై పుట 3. ఇక్కడికి నేను వచ్చింది 4. ఆలోల స్వరం 5. ఒంటరి రూపం 6. దారిలో అంగార కణం 7. ప్లాట్ఫార్్మ పై 8. ఆదేవునికి తెలీజేస్తూ . . . . 9. వాస్తవ చేతనతో 10. శ్రమబింబం 11. ఇంకా మిగిలే ఉంది 12. అహంక్రీడ 13. కిరణ కిరణం 14. కరుణించే ఆశతో 15. ఆర్కెస్ట్రా హృదయం 7. అశాంతి ఆర్కెస్ట్రా 1. ఈ శతాబ్ది స్వేచ్ఛలో ఈ శతాబ్ది అగ్ని పథాన్ని గమించింది, రెండు యుద్ధ శక్తుల మధ్య జ్వలించింది నియంత పాదాల ఇనుప చక్రాలపై వినీల భీ శ్రేణుల పై నడిచిందీయుగం ప్రజాస్వామ్య విజయమూ చూచింది, జనం కలల్ని యధార్థానికి చేరువ తెస్తూ లెనిన్ పిడికిలిలో శ్రామికజన కేతనమైంది ! మహాత్ముని ఎదలో శాంతి విహాయసమైంది. ఆసియా దారిద్ర్యం ఇంకా తీరనే లేదు, ఆఫికా హాహాకారం గ్రాఫ్ మారనే లేదు స్వేచ్ఛకై పోరాటం ఎంతో ఉండనే ఉంది, ఆటవిక క్రీడల సరదా ఉండనే ఉంది మనిషిపై ఆశకు అణు ఘట్టితనవ జపాన్ చిహ్నమైంది దూసికొని పోయే క్షిపణిపై నుండి ఈ శతాబ్దం పోనీ ! ఒక్క తూర్పునే కాదు మార్పు ! అన్ని దిశలా ! మార్పు రానీ అరణ్యం హరీంద్రమై మేల్కొందీ, సమాజం సముద్రమై పొంగేను జడంలో కణకణంలో చైతన్యం, ప్రతిచోట స్వేచ్ఛకై సంగ్రామం మండెలా దేశ విమోచన చరణం, ఈ శతాబ్ది స్వేచ్ఛకు మహోదయం. 2. హిమ జలాల్లో అగ్నులై అవని కార్షణ శక్తి ఉన్నట్లే మనిషిలో మనో భూమికీ ఉంది అశాంతి హింస ఎవరి కిష్టం ? అయినా బ్రతుకులో తెలిసీ తెలీకా తప్పడం లేదు దేశ రాజకీయంలో జీవన తలంపై ఉదయాస్తమయాలకు భేదం లేదు సూర్యుని మొదటి కిరణంలోనే హిమ హృదయం విషాదంతో ఎదురౌతుంది కాశ్మీర్ పంజాబ్ చండ్ర నిప్పుల కళ్ళతో హిమ జలాల్లో అగ్నులైనాయి మంచు పొగల్లో గోడ వెనక చీకటి కప్పుకొనీ అజ్ఞాత శక్తులు కదలేను ఉగ్ర వాద హింసతో అదర్శం ముక్కలైంది, ఆనందం మాయమైంది ఈ వీధి దాటితే మరో వీధి ఆ ఊరు దాటితే మరో ఊరు అక్కడా అగ్ని చక్రమే! ఎక్కడ చూచినా ఆతంక వలయాలే ! వివేకాని కందని గతిలో ప్రతి తీవ్ర మతి ఒక ఆయుధమై పని చేస్తూంది నిషేధించిన అక్షరాల్ని చదవాలనీ ఆ ముఖాలతో మాట్లాడాలనీ మానవతా స్పర్శతో సమాజం శాంతిని కోరుతూంది సుఖ నిద్రకు బదులు రాత్రి రాలే అగ్ని కణాల్ని చూడాలిసి వస్తూంది కలహాలతో కళేబరాలతో అవని రణానికీ సమాధికీ సమీపంలో ఉంది ఏ మనిషీ అగ్నుల మధ్య జ్వలిస్తూ ఎల్ల వేళల నిలవ లేడు బంధన నుండి పీడన నుండి ఘర్షణ నుండి అశాంతి నుండి చరిత్రలో నెమిబియా స్వాతంత్య్రం ! ప్రగతి దిశలో మహోదయం ఎక్కడైనా ఎప్పుడైనా జీవితంలో మానవీయం విలువ లొకటే మనస్సు సహజంగా రుద్థం కాదు ; జీవితం నగ్నం కాదు నీలాకాశం నుండి రాత్రి కొంత సేపటికైనా శశి బింబం వస్తుంది ఒక అలంక్రియ పోతే మరొకటి ! ఒక విధం బదులు మరో విధం భయంలో విషాదంలో హృదయం స్వేచ్ఛను కోల్పోతుంది తీరిక లేని పగలు బంధనలో కన్పించని స్వేచ్ఛా రూపం చేతిలో ఏ కల్తీ తుపాకీ లేకనే హృదిలో స్వేచ్ఛా శక్తితో ఒక వైపు నేపాల్ ప్రజ ! ప్రజాస్వామ్య కేతనమై నిలిచింది. ఉదయ కిరణ స్పర్శకు హిమ శిల కరిగి కదలి ప్రవహిస్తూంది, పీడనలో వేదనతో సామాజిక చేతనతో రసమయ శబ్దం నాలో ఇక్కడికి నేను వచ్చింది సమాజ తలంపై ఏ చెట్టు వలెనో నిలిచి పోయేందుకూ కాదు 3. ఇక్కడికి నేను వచ్చింది ఏ రాయి వలెనో మౌనం వహించేందుకూ కాదు పర్వతాలు నదులు దాటి ఇంత దూరం ప్రయాణించింది సంస్కృతీ శిఖరంపై నిరంకుశంగా హతమయ్యేందుకూ కాదు ప్రజాస్వామ్య సందేశంతో నాలో నీల మేఘ బృంద సంచారం దిశ దిశలో కరుణతో వర్షిస్తుంది ఎద ఎదలో సమతతో స్పందిస్తుంది ఎప్పటి కప్పుడు స్వేచ్ఛలో కొత్త క్రొత్త శక్తుల్ని సృజిస్తుంది ఒక్కొక్క బిందువుతో ఒక్కొక్క ప్రపంచాన్ని హర్షింప జేస్తుంది ఆటకై ఇంటి ముందు బొమ్మలు పరచుకొన్న చిన్ని పిల్లల్ని సన సన్నని పూల చినుకులతో అలంకరిస్తుంది పాత కలల్ని ముక్కలు చేసి కొత్తకలల్ని సృజిస్తుంది స్వేచ్ఛకై నినాదంతో నిరాశాహతుల్లో కొత్త శక్తి సమీకరిస్తుంది బయటి రూపం భౌతిక శక్తుల ఘర్షణకు హింసకు గురైనా మనిషి లోపల ! రూపం అమృత శక్తితో బయటికి వచ్చేను ! శ్రమ బిందువు రాలే సంధ్యతో యంత్ర వేగ పదగతిలో జనాలోల కోలాహల సమాజం ఆర్కెస్ట్రా వినిపిస్తుంది, ఇపుడు సోలో ప్రసక్తి లేదు. 4. ఆలోల స్వరం నలిగిన దారే అయినా అన్వేషణలో లక్ష్యంకై ఉన్న దారి చీలుతూంది కొత్త దారు లేర్పడతాయి కొత్త సమస్య లెదురౌతాయి సమయాన్ని బట్టి ఎదపై ఏ నిప్పుల కుంపటో? ఏ మబ్బుల పందిరో నిలుస్తుంది! ఏ పూల గుత్తో ఏ ముళ్ళ కిరీటమో ఎదురౌతుంది అగ్నులపై నడుస్తూ మానవ బాధ్యత వరించే జీవితం త్యాగాన్ని వరిస్తుంది ప్రేమను పంచుతుంది శిశు దశలో హిమ దర్పణమై ఆపై తెలివి మీరి రణార్ణవమై మనో ముఖాని కొకవైపు సంతోషం మరో వైపు ఆవేదన! బాధా జగత్తు నీడ నంటి ఉంటుంది! ఆనంద జగం వెలుగునంటి ఉంటుంది! నీడలో వెలుగు ముగ్గులతో! వెలుగులో నీడ ముద్రలతో ప్రతి ఒక్కరి జీవితం! 5. ఒంటరి రూపం ఒంటరిగా ఉన్నా మనో దీపం చీకట్లను చీలుస్తుంది వెలిగిస్తుంది. లోపలికి దారి చూపిస్తుంది, రహస్యాల్ని బయట పెడుతుంది రాత్రి నిదుర లోయల్లో ఉదయం మెలకువ మైదానంలోకి వచ్చే సరికే ముంది? ఆ వదలిన దృశ్యాల మౌలిక ముద్రలే ఇక్కడా! చేతి వేళ్లు తాకితే మౌనంగా రేకులు రాలే గులాబి హృదయాన్ని కదిలిస్తుంది! వేదన రగిలిస్తుంది రవి వేళ్ళు తాకితే మౌనంగా కరిగిపోయే మంచు హృదయాన్ని తేలుస్తుంది సంతోషం వెలిగిస్తుంది తల తెగి జారిన రక్తంతో తడిసిన నేలపై కూడ విత్తు చిగురిస్తుంది సృజన శక్తికి ఆగ్రహమూ అనుగ్రహమూ ఒకటే ఆకుల వలె ఆలోచనలు గలగలలాడినా పూల వలె ఆశలు తళతళలాడినా ఆగ్రహంలో దాగిన అనలం ఆయుధమయ్యేందుకు సిద్ధమవుతుంది 6. దారిలో అంగార కణం దారిలో అంగారకణం దూరం నుండి ఎర్ర గులాబి వలె ఆకర్షిస్తుంది. కాస్త దూరంలో దూసిన ఖడ్గం రక్త బిందువుతో వికర్షిస్తుంది అంగారం గాలి కెగిరి గుడిసెపై పడితే అంతా పరశురామ ప్రీతియై! క్షితిజం సాయం సంధ్యా స్థితి పొందొచ్చు, బ్రతుకు ఎడారి సమం కావచ్చు మెషిన్ గన్ హస్తమైనా కత్తి పదును అడుగలైనా ప్రభావ శక్తితో హతం! దీని ముందు అన్నీ వ్యర్థం! అంధకారంలో అంగారకణం అవసరానికి ధైర్య చిహ్నమవుతుంది వెలుగు లేని రాత్రి ఇదో చిన్నికిరణ శకలం కావచ్చు అడవి బ్రతుకులో అగ్ని నేత్రం! దీనిపై రాత్రి చీకటి తెర జారుతుంది రాత్రి కుంపటిలో అగ్ని ముఖం! దీనిపై తెర కదులుతుంది భవిష్యత్తు కుత్తేజం, ప్రస్తుతానికి ప్రేరణం, సంఘర్షణకు బీజం వ్యక్తిలో అంగారం అహంకార పుష్పం! బలమైన ఆకర్షణ నిలయం దారిలో కాచుకొని అందరికీ, తమ వైపు చూస్తున్నట్లుంటుంది. అపుడపుడూ చేతిలోకి తీసుకోవాలనిపించే, వజ్రం వలె ఉంటుంది. జీవితంలో అహంకారం దారిలో పుష్పమై వజ్రమై తోచే అంగార కణం. 7. ప్లాట్ ఫార్మపై ప్లాట్ఫార్్మ పై జనం ఓపిగ్గా కూర్చొనీ నడుస్తూ కాలం గడుపుతున్నారు ఏ భాషా ప్రాంతం వర్ణం అయినా అందరికీ సమావేశ నిలయంగా ఉంది దీప స్తంభాలు స్నేహ మూర్తుల వలె ఏ భేదం లేకుండా ఉన్నాయి ఒక్క మారు లైట్లు వెలిగి స్టేషన్ షెడ్ ఆవులించినట్లుంది ఒక ప్రక్క విరిగిన బెంచ్పై ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. ఎవడో విచ్చ గాడనుకోవచ్చు, ఎవడో త్రాగి పడుకున్నాడనుకోవచ్చు! వాలకం చూస్తే నిరాశా శకలమో! క్షామ ఖండమో! సందేహం కలుగుతుంది. మెర్క్యూరీ లైట్ల వెలుగులో సగం సగం మెరుస్తూ ఇనుప పట్టాలు సన్నని గాలికి అలలు కదలే నీటి పాయల వలె ఉన్నాయి. బయటి నుండి నినాదాలు స్టేషన్లోకి నిశితంగా దూకుతున్నాయి కంటికి కన్పించని సంకెళ్ళను గల గల ధ్వనింపజేస్తున్నాయి దరిద్రయానంలో పచ్చ లైటు మెరవచ్చు, ఎర్రజెండా ఊగొచ్చు శిలా శ్రేణిపై మేఘం కన్పించ వచ్చు, రైఫిల్ తలెత్త వచ్చు ఆకలి నుండి నీలి రాక్షసుడు రావచ్చు, విప్లవ రూపం ఎగసి పడొచ్చు అలజడి ఎక్కువైంది! ఆయుధం ప్రేలింది, ఆ పడుకున్న వ్యక్తి లేచాడు మళ్ళా నిద్ర కొరిగాడు ఆ కలకలం వచ్చే దిశ వైపు తిరిగాడు అలజడి శాంతించింది! ప్రయాణ సంరంభం తప్ప బయటి శబ్దం లేదు గుండెను గుబగుబలాడిస్తూ రైలు వచ్చే గంట గణగణ మ్రోగింది విసరిన దుప్పటిలా లేచాడతడు, కల నుండి వాస్తవానికి దిగినట్లుంది ఇంతలో రైలు వచ్చేసింది, కాలం ఆగినట్లు నటిస్తూంది బుజాన బాగ్ తో చేతిలో మడిచిన న్యూస్ పేపర్తో రైలెక్కాడు ఎదురుగా గ్రీన్పేట్! గార్్డ విజిల్ వేసి పచ్చ జెండా ఊపాడు రైలు కదిలింది. అతణ్ణి చూచే చూపులు పరుగెత్తే రైలు వెంట బడినాయి అతని మూర్తి ఆలోచనలో సందేహ రూపమైంది ఎదురుగా ప్లాట్ఫార్మ్ర్కు దూరంగా రెడ్ లైట్ వెలిగింది రైలు ఆగింది! అతడు కన్పించలేదు! చూపులు మరలాయి అతడె వరైతేనేం? బిచ్చగాడు కాదు, మత్తులోనూ లేడు బట్టలు మాసాయి, గడ్డం పెరిగింది, ముఖం అలసిపోయి ఉంది, అంతే! అనుమానం ఎక్కడికైనా లాక్కొనిపోతుంది! భయం ఏమైనా ఊహిస్తుంది! మనస్సు చేతనైందే చేస్తుంది, నిజం ఎంత లోతునైనా లెక్క చేయదు అలజడికీ అతనికీ సంబంధం ఊహలో బహు సులభం లోతు బావిలో బింబం, సూర్యుడు నిటారుగా తలపై ఉన్నపుడే కన్పిస్తుంది! 8. ఆ దేవునికి తెలిజేస్తూ అరణ్యంలో మృగాల భయానికి హరిణాలు కన్పించడం లేదు మృగరాజు జాడలేదు మనిషిలో అరణ్యం ఇప్పటిదా? ఎప్పటిదో! కర్ఫ్యూలో నగరం, పొలిమేరల్లోనే తరుమబడీ పాతేయబడీ వెలుగుల్లో నుండి ఒకటి రెండు సందుచేసుకొని నగరంలోకి ప్రవేశిస్తాయి ఇక్కడ జీవితం క్షణాలపై కొత్త రంగుల రూపాన్ని పొందుతూంది ఎవరూ గుర్తించరని ధీమా! చెట్లపై నుండి ఎండలో కోట జ్వలిస్తూ భయం గొల్పుతుంది కోట గోడకు తాకి గాలి తుది శ్వాస వలె నిలిచి పోతుంది కోట గోడ నుండి మరలి మరో శ్వాసతో కదలి పోతుంది శబ్దం ఆగిపోతుంది, ఆగిన శబ్దం వెనకనే మరో శబ్దం తరుముతుంది గుండెల్లో పొగ క్రమ్మి ముడుచుకొనీ పూలు కొమ్మ నుండి విడిపోయే భయంతో వణకుతున్నాయి శాంతికై అగ్ని మీటుతూ ఒక చోట, స్వేచ్ఛకై తుపాను రేపుతూ మరోచోట ఆయుధాల సంభాషణతో కోలాహల వాతావరణం నాటకీయ మవుతూంది ఎంతో కొంత సహాయానికి తోడూ సానుభూతి ఉండనే ఉంది. కశ్మీర్ పంజాబ్ రుమేనియా అజబెజాన్ అశ్రు నయన జన గణం జ్వాలా సమూహాల మధ్య బ్రతుకుతూ మేఘ రాగాన్ని కోరుతూంది కళ్లు తెరచి లేచి మనిషి బయటి ప్రపంచలోకి అడుగు వేసే లోపల ఆయుధం ప్రేలుతోంది! ప్రాణం ఆకు వలె రాలి పోతూంది సముద్రం అడుగు క్రింద కదలినా, అరణ్యం కాలి కింద అణగినా శిరస్సుపై ఆకాశం హాట్ విధయయినా, మానవత లేంది, శోభలేదు. జంతువు కదులుతూంటే వెనుక నుండి మృగం అడుగేస్తూ వస్తుంది పొదలోనో చెట్టుపైనో దాగిన వేటగాడు, వీటి జాడ పసిగడుతూ తిరిగేను మానుషీయంతో పరిపుష్టం అవని జీవిత మొక అస్థి పంజరం పాపంతో నిండిన మట్టి కుండను పగలగొట్టి బయట పారేసి చేతులు దులుపుకొని పోయే రోజులు పోయాయి భద్రంగా ఏ బ్యాంకులోనో దాచుకొనే కాలం ఇది అయినా ప్రౌఢ సుందరంగా నిల్చిన గుడి గోపురం ఆ దేవునికి సూటిగా సమాజౌన్నత్యాన్ని సూచిస్తూంది అంరిక్షంలో తిరిగే సెట్్ట విశ్వమానవుణ్ణి స్పందిస్తూంది పగలు వలె స్ఫుటంగానో రాత్రి వెల గుప్తంగానో 9. వాస్తవ చేతనతో సమయం సమయం నాలో కదలుతూంది సమాజం వాస్తవ చేతనతో శబ్దం మనస్సులో వెలుగునూ చీకటినీ ఆవిష్కరిస్తూంది శబ్దం అంచుల్లో ఆలోచన జీవితాన్ని మోసుకపోతూంది ఈక్షణం జీవితంలో ఉన్న వర్ణం మరో క్షణంలో ఉండదు మైదానంలో నా ప్రక్కనే మొలిచిన లేలేత మొక్క చేతి వ్రేళ్ళకు శిశు శరీరం తాకి నట్లనిపిస్తూంది చేతిలో నుండి గాలి కెగిరి వాలిన కాగితం పై అక్షరాలు గుహ బయటి కొచ్చిన పులి కళ్ళ వలె మెరుస్తాయి అంతలో అందమైన జింక వలె కాగితం నా వశమౌతుంది సముద్రంలో పడవల వలె చేతనలో స్మృతులు! దండలో పూల వలె స్వేచ్ఛా సూత్రంలో అనుభవాలు మృగ తృష్ణ ముఖాలతో ప్రక్క నుండి కదలే శ్రామికులు జీవితంలో ఒక ప్రక్కన ప్రకృతీ మరో ప్రక్క యంత్రం రెండిటినీ కలిపే ప్రవాహ తరంగ రూపం అవసరం కాలాన్ని శ్రమ సుందరంగా తీర్చే క్రియా చిహ్నం యంత్రం మనిషిలో పొందిన సంస్కృతికి ప్రతిఫలనరూపం దారిలో అర్థ నగ్న శరీరాల్ని చీకటి దాచేయ జూస్తుంది ఉదయం వస్తుంది! వాస్తవ చేతనతో అలంకరిస్తుంది కొందరికి ఉదయమెంత ఆలస్యంగా వస్తే అంత మంచిది దాహంతో నున్న ముఖాల్ని స్పృశిస్తూ మంచు తెర కదలిపోతుంది ఏ గొంతూ తడపలేదు, ఆశను పోనీదు, స్నేహస్పర్శ వీడదు ఏ కాస్త దూరంలోనో ఏ యేరో, నదో ఎదురుపడొచ్చు ఏ కాస్త దగ్గరలోనో ఏ నూయో చెరువో ఉండక పోదు! అయినా ఈ మొక్కనూ, ప్రాణినీ, మనిషినీ, మనిషిలో ఆర్తినీ తడిపే మేఘం! రావలసిందే వస్తేనే బ్రతుకు! వాస్తవ చేతనలో ఆర్కెస్ట్రా ధ్వనితోనే సమాజం ఆనందం ఈ శతాబ్ది కావ్యమై 10. శ్రమ బింబం ఈ శతాబ్ది నవ మానవ గాథమయ ప్రజాస్వామ్య హృదయాశయ పథవిలోల! మనిషి మనిషి కలిసి విశ్వ తోరణమై మనసు మనసు వెలిగి నిశా ప్రభాతమై స్వేద జలం రక్త బలం కలిసి మనిషి గంగా ఝరీ నైలు తటీ ఓల్గా హృది భయం వదలి వెనుక గతం లోయల్లో కదలుతూంది జనత! విశ్వ చరితయై హలం కలం యంత్ర శక్తి బింబితమై జీవితమై మానవీయ దర్పణమై జన జీవన భిన్న భావ కోలాహల నవ మానవ భిన్న వర్ణ రాగాంచిత! ఆకాశం అంచులు తన రెక్కలపై ఎగరేస్తూ పోయే హింసీ రూపం నాలో అవని హరిత హృదయం తన రెక్కలతో కాపాడే వినీల జలదం రూపం నాలో మానవ చరిత్ర చిహ్నం మట్టి పొరల్లో దాచే ధరణీ విశాల రూపం నాలో చుట్టూ విసరే రాళ్ళకు తగిలిన దెబ్బలు మరచే మానవతా మధు రూపం నాలో మంటలపై నడిచీ, నెత్తురు చినుకుల్లో తడిసీ ప్రాణిత శాశ్వత బీజం నాలో ఆత్మకు గుణమూ రూపం ఇచ్చే జీవన సత్యం బింబిత కవితా లోకం నాలో ఎక్కడో లేను నేను ఇక్కడే ఉన్నా హలం పదం దారి వెంట నీ ఎదుటే ఏ పొలం గట్టు పైనొ వృక్షం నీడనొ నీ గమనం దారి వెంట! నా పదచలనం వీడని పలుగూ పారా సాధన సంపదతో రాలిన స్వేద కణం త్యాగ ఫలం గాథలతో నాడూ నేడూ నీవో! జనం శక్తి చిహ్నం ఎక్కడనో లేను నేను! మానవీయ రూపం అణువణువును శ్రమ చేతనతో తీర్చే సుందర మానవ శక్తుల దారుల నే నున్నా మట్టిని చిరు పాపల నవ్వుల వలె మురిపించే నీ శ్రమ జల కీర్తికి బింబం వలె నేనున్నా 11. ఇంకా మిగిలే ఉంది వర్తమాన శబ్దం ఇరు వైపుల నిశ్శబ్దం జీవితాన నిశ్శబ్దం! గోడల సీమలతో ఎన్ని ఇళ్ళు! గోడలపై కప్పులతో నిల్చీ ఒకటొకటీ స్మృతిలో రహస్యమై గాజు బొమ్మ వలెనో మట్టి బొమ్మ వలెనో నేలపై మతి జారే వినీల సమయం ముక్కలుగా చెదరే శబ్ద భయంతో జ్ఞప్తికి వస్తుందీ గోడ! నిశ్శబ్దంగా గోడ ప్రక్క నిద్రించే మనిషిని లేపేను నిశ్శబద్ధం నుండీ శబ్దం వలె సూరీడు ఈ మెలకువ ఉంది చూడు! ఆనాటికి సరి అందుకే సమాప్తి కాదు! ఈ సూర్యుని పని సన్నని జల రాగంతో పిలుస్తోంది హృదయం ఆర్కెస్ట్రా శబ్ధంతో ధ్వనిస్తోంది నగరం గాలిలో నినాద తరంగాలు జ్వలించేను జీవన శక్తుల పోరాటంతో సమయం శిల్ప వలె మనిషీ! శిల్పంతో విపణి రుచీ ఎర్రని వెచ్చని గాలికి వశమై ఈ ఉదయం ఇంటి చుట్టు చెట్ల నుండి పూవు ఫలం రాలేను తొలగి పోయి రూపం మట్టిని కలిసేను చుక్కల వలలో చిక్కిన చంద్రుడు ఎటు పోయేను? ఎక్కడికని పోయేను? మానవ హృది గుహలోకి వ్యక్తి వెనుక నుంది సామాజిక చరిత్ర ప్రతి పదం ముద్రపై వ్యక్తిత్వం ఫోటో ఎత్తిన చేతులతో చేతులపై రవితో అలయై కదిలే పాద పంక్తి గతితో హక్కులకై పోరాడే జన గణ రూపం మార్పును కోరే నవ స్వేచ్ఛకు సంకేతం చలనంలో వేళ్లు తెగిన గతంతో గమనంలో సుళ్ళు తిరుగు బలంతో తరాల శ్రమ శక్తుల పై నిల్చిన సమయం చరిత్రలో వేల వేల పూల వికాసం బుజాన నాగలితో ముఖాన మేఘంతో కదలే మనుషుల నీడల కల్పనతో యుగాల దారిద్య్రం నిజమై కళయై, జగంలో ఎడారి ఇంక మిగిలే ఉందీ 12. అహంక్రీడ మనిషి చరణ యుగం పైకి ఎంత ఎగసినా అవని హృదయ తలంపైకి రావలసిందే ఘన వన జన పదాలతో అనుబంధంతో ఈ సర్కస్! తమాషా! ఎప్పటిదో పాతది తనువుపై గాయాల రవి శకలాలతో ఉంది దేశం శాంతి వెన్నెల కోరుతూ పట్ట పగలే రాత్రి కోరే కళ్ళతో ఉంది హృదయం రేపు పై పేరాశతో ఈ ముఖంలో ప్రళయ సమయం చిహ్నమున్నా దాగి ఎచటో గుండెపొరలో ఉంది రాగం దేవ దానవ సమర గతిలోమానవీయం శక్తి రూపం, ఉంది చిరమై శాంతి రూపం చంద్రునిలో మచ్చల వలె చరిత్రలో గాయాలు దూరమైన కొద్దీ అవి ధవళ ధవళ రూపాలు ఎడారి తళతళ మెరిసీ లోయల మాటే లేదు. ఎప్పటివో? గతం శిఖలు! స్మృతిలో మాలా రూపం ఇరు సంధ్యల మధ్య పగలుగా కదిలే జీవితాన ఇరు సంధ్యల మధ్య రాత్రిగా నిలిచే జీవితాన ఏదో ఒక వర్ణంతో నిజం ముఖం రూషితమై ఏ పగలూ ఏ రాత్రీ లేదు శూన్యాకృతి! అంతా శిలా హృదయ ముఖం అనల పత్రమై తేజం స్వేద జలంపై తేలే నావ రీతి కదిలేను ధారలుగా మండుటెండలో కదిలే మృదు దేహం వెనుక నుండి ఛిన్న భిన్న పీడిత మానవ రాగం విజయ గాథతో శయస్సుకై నెరపిన యోజనవలె ఈ సమాజ జీవితాన సంస్కృతీ ముఖ శిఖరాలు! చలనంలో జ్వలనంతో, హననంపై మననంతో జరిగే ప్రస్థానంలో అమూర్తమై ఉంది అహం. మనిషిలోని సమర శక్తి ఖననం దహనం కాదు చిరం అనల శిఖలు దూకు ఆవేశంలో పొంగీ వికార వదనంతోనో భీభత్స రవం తోనో శాంతి నీడ చేరుకొనీ సిద్ధం అవుతుంది మళ్ళీ హిమ సదృశం కన్నుల్లో బాష్ప లవం తప్పదు కాదేనాటికి బహిష్కృతం, సృష్టిని హింసను మనలో చేతనయే వహిస్తుంది నీటిని అగ్నిని మనలో ఈ హృదయం ప్లవిస్తుంది అణువణువులో నవనవమై జీవ శక్తి హర్షణం ప్రతి మనసులో తరాల ఎరుపు తెలుపు ఘర్షణం ఆత్మ శిఖర సీమలపై జన రక్త గాత్ర వాలకం మంటల కిరీట పంక్తి వెనుక నుండి ఆయుధం పీడన బల ఘర్షణ శక్తుల అనలం చలనంతో హిమ స్పర్శ కోరుతూంది మనవ హృదయం మండీ మంటల చిత్రాలు చూచి హ్లాదపడే కళ్ళ వెనక ఉంది బలం ధనం కన్న అహం క్రీడ నిశా శైలి నిప్పంటిన వనం లాగ ఉంది మనిషి హృదయం మంచు కురిసి శాంతి అలసి ఎదలో నిశ వాలీ ఉదయం విరిసిన మోదుగ సుమ వదనం కోరే ఇరాకొ కువాయటో! పెటోడాలర్ జ్వలనం 13. కిరణ కిరణం కిరణ కిరణం దివా సమయం సమర శక్తికి చరణమై జలద పటలం వెనుక నుండీ సింహ వదనం అరుణమై నేలపై నిశ్శబ్ద గుహలో నుండి ఆయుధ గర్జనం చెట్ల చాటునో! గోడ వెనుకో! మినీ విప్లవ స్థావరం హత్య జరిగిన చేతిలో శిశిర సంధ్యా వాలకం వ్యక్తి కన్నుల వెలుగులో మంచులో అమాయకం ద్వేష కోప సమాధిపై హింస మొలిచే వేళలో తర తరాలు విషాద ఫల రుచులు చూడక తప్పదు నిన్న జరిగిన హత్య మరచీ నేడు శాంతిని కోరు హృదయం ఉంది మనలో శాంతి చెక్కిన మానవీయం భావమయమై పొరలు పొరలై నిలిచి నిలిచీ హిమ సమూహం పంజరం వలె ఊపిరాడక సూర్య బింబం సతమతం అవుతుంది ఉదయం కన్నుల్లో జ్వలిత పవన ప్రతిఫలనంతో నరాల్లో ఉదయ లహరి సంచలనంతో నినాదాల ముఖాలతో ధ్వని శిఖ శిఖియై జనగణ చలనం గమనం! పరివర్తనకై స్వేద జలంలో తేలీ అనల శిఖలతో కదిలీ ధరా గగన రూపం కొలిచేనీ మనిషి చరిత్ర పుట పుటలో అక్షర శక్తులు నెత్తురులో మునిగీ బాష్ప జలాలపై తేలీ వ్యక్తిలోని శక్తికి లేదు, లేదు మరణం గ్రహణం మానవీయ రక్తికి ఏ సమాజమైన ఒకటే తరం తరం శిశువు ముఖం విభాత బింబిత రూపం దగ్గరలో! రావలసిన చరిత్ర మూర్తికి చిహ్నం పగలు సూర్య కిరాణాలకు గాయాలు జ్వలించేను రాత్రి చంద్ర కిరణాలో శాంతినీయ లేవు మనిషి మనిషి నడుమ నడుమ వీధి వీధినా ఆనల తరళ జన పటలం కదలేనీ సమయం ఎండిన కొమ్మలతో గాలికి కదలని స్థితి శబ్దంలో సహన స్థాయి ఏ గాలికో పోయేను మాటల్లో హృదయ స్పర్శ ఏ దిశనో ఆగేను 14. కరుణించే ఆశతో ద్వేషంతో కోపంతో సంక్షోభంతో వచ్చే చీకటి ఉందీ మన ఉన్మాదంలో ఎదలో వెలుగు విత్తు వృక్ష రూపమై ఎదిగి నిలిచి పోవాలని కోరిక సహజం సూర్య బింబ వదనానికి నలుపు రంగు పులిమీ దిష్టి బొమ్మ చేసేందుకు నీలి నీలి యత్నం దిశ దిశ నుండీ దూరం చాచిన చేతులతో మనిషి వెనకనే మనిషీ! కదలే నో బ్రషో జ్వాలాతతి చలనంతో దహన సమయ గమనంతో ధరిత్రిపై సృజించలేం! హరిత హృదయ ఉదయం ఎవ్వరి కోరిక పైనో రానే రాదీ ఉదయం రావలసిన వేళకే వచ్చేస్తుందా సమయం ఎవ్వరు గిట్టిస్తేనో గిట్టేది కాదు నిశ ఇష్టమున్నా లేకున్నా! వేళకు వచ్చేస్తుంది మారణాయుధం ధరించి ఎన్ని ఏండ్లు తిరిగేరు? శిశిర జ్వాల తలపిస్తూ ఎంత కాలం బ్రతికేరు? కర్ఫ్యూ నిశ్శబ్ధంతో బంధితమయ్యే రోజు సూర్యోదయ మైనట్లే లేదీ కోసే చలిలో భాను శక్తి కిరణం అనుభవ మైతే గాని విముక్తి జరిగే సూచన యే లేదు హృదయంలో ఉంది అగ్ని నిరంతర శక్తితో ఎంతటి ఘన లోహానైనా కరిగించే దీప్తితో వస్తువు లెన్నెన్నో జీవిత సంపూర్ణతకై ఒకటొకటీ సంస్కృతిలో భాగంగా నిలుస్తాయి నిప్పంటిన ఆలోచనతో పరుగెత్తే మనిషి ఈ దారిన ఆదారిన ఆయుధమై శరీరం అనల రాశి దాగిన నివురై ఉందీ సమయం శాంతి కోరే ఖడ్గం వలె ఉందీ వేళ మనస్సు అగ్ని కణం వలె మనిషీ అగ్ని సమం ఆలోచనతో జీవిత చలనంలో గమనంలో అనల మనో గతితో రాత్రి శిలా సంధుల్లో నుండి ఎగసి అగ్ని పూలు నవ్వి నవ్వి మండేనీ పవన కథల దారుల్లో భాష మధ్య మతం మధ్య అనుమానం నీడలతో మానవతా హృదయ శక్తి కురిత్రాడు బిగించేరు కర్ప్యూ మరణ భయంతో బరువెక్కిన గాలిలో కదలీ కదలని శబ్దం! ఎరుపెక్కి జ్వలిస్తూంది దుఃఖంలో వేదనలో వదనం ముడుచుకొనీ అమృత హృదయమేదో! వర్షిస్తుందని చూస్తూ రగిలి రగిలి మంటలతో కదులుతూంది ఈ క్షణం వెనుక నుండి ఏ జలదమో! కరుణించే ఆశతో 15. ఆర్కెస్ట్రా హృదయం పేరూ ఊరూ ముద్రలతో కాలం గోడల మధ్యన నిల్చిన ఓ ఖైదీ చాచిన బిక్షా పాత్ర మనస్సుతో, వాలిన ఎడారి దారి కళ్ళతో ఓ మనిషీ గమనంలో వేగం హెచ్చిన మాట నిజం, పయనంలో లక్ష్యం మరవని సమయం లయతో హృదయం స్పందన కలిగే ఉందీ, ధూళీ ధూమం నుండి విముక్తమై ఇంత వెలుగు కోసమై ఈ రాత్రి కదులుతూంది ఇన్ని నీళ్ళ కోసమై ఈ పగలు వెదకుతూంది చీకటి శబ్దం ప్రేలే వర్తమాన గతిలో మానవ హృదిలో ఉందీ! మానవతా మంత్రం పెదవులపై నుండీ ఎగసి దిశ దిశ ఎద ఎద కదిలీ శబ్ద సమూహం సాంఘిక శక్తులతో ధ్వనించేను నిగళాలను ఛేదించీ స్వేచ్ఛకు ప్రాణం పోసీ యుగాల దారులు మార్చే నిరసన ప్రతిఘటనంతో జన శక్తులు నిండిన పాత్రల మానవ గాథలు శ్రేణులు శ్రేణులుగా ఒకటొకటీ ధరిత్రి సర్వం వెనువెనుకే చీకటి వెలుగులతోజీవన వ్యూహం నిప్పుకణం! మంచు లవం! బాష్ప జలం! అంచులలో వెలిగే చేతనతో చుంబితమై దీపంతో దీపం వలె కదిలే ఆవేశంతో పొంగే ఆలోచనతో ఈ సమయం ఈ మృత్తిక పై పచ్చని వనిలో ఆశారుణ సంగీతం రానీ ప్రజాస్వామ్య నవసమాజ చలనంతో పవనంలో గతులతో, కిరణంలో రుచులతో ప్రజలో పలుకుతూంది సూర్యుని ఆర్కెస్ట్రా హృదయం.వర్తమానం స్క్రీన్ పై (1991) అంకితం జీవిత పథ సహచరి శ్రీమతి ఇందిరకువర్తమానం స్క్రీన్ పై సూచిక పుట 1. వర్తమానం అంచులపై 2. వర్తమానం వెనుక నుండి 3. స్వేచ్ఛలో హద్దులు 4. మార్చ ఆన్ 5. సమయం వస్తుంది 6. అగ్ని దీప్తి - కాంతిరక్తీ 7. ఈ రోజున ఆదారినే 8. ఈ రోజున దారి అదే 9. ముసుగై కళయై 10. ఒక మాస్్క వదలి 11. గది లోపల బయట 12. స్మృతులతో 13. అభిజ్ఞానంవలె 14. ముక్కలైన అంచులపై 15. టాన్స్పరెంట్ కర్టెక్ 16. ప్రతీక్షాముఖంతో 17. బ్రతుకుతుంది శాంతి .... 18. శ్రామికగీతం 19. నగరం దర్పణంలో 20. నిర్వచనాతీతం 21. మేఘమై జనగీతమై 22. ఉదయించే శక్తినై 8. వర్తమానం స్క్రీన్పై 1. వర్తమానం అంచులపై ముందు నభం ఇరు వైపుల అవనిపై వర్తమాన పద చలనం చేతి కందీ అందని మహదాశలో వ్యక్తి మనో వర్ణ రూపం కళ్ళలో విజయ లక్ష్యంతో గుండెలో తరుణ రాగంతో నినాదం నిరసనతో, సంఘర్షణ సమన్వయంతో సామాజిక అస్తిత్వం హిమ ముఖాలకు స్వస్తి చెబుతూ కోష్ణ పవనం కదలుతూంది అణగి మణగిన జన ప్రపంచం ముక్త కంఠం పలుకుతూంది బొగ్గులో దాగిన అగ్ని బీజం వలె వ్యక్తిలో ప్రగతి శీలం నవ సమాజం ఊహతో జనశక్తి రూపం పొందుతూంది సంఘర్షణ లేంది జీవితం లేదు సంచలనం లేంది పరివర్తన లేదు సామూహిక శక్తిలో వ్యక్తి పాత్ర ఉంది యుద్ధ నీతి రీతులతో సిద్ధమై స్క్వేర్ తరువాత స్క్వేర్ వస్తుంది సందేహ దిశల్ని చూపుతుంది వర్తమానం దారి పొడవునా భవిష్యత్తు వేచి ఉంటుంది 2. వర్తమానం వెనుక నుండి ఇండ్లపై చెట్లపై నుండి కోట కన్పిస్తుంది త్యక్తమైందీ జీర్ణమైందీ పైన సాగే రణ విమానం కోట కీర్తిని కొలుస్తూంది గతానికి రెక్కలిస్తూంది శిల వలె నిల్చిన గతం చుట్టూ పవన తరంగం వలె తిరిగే వారున్నారు నమూనా లేని సామాజిక గతిలో నలిగిపోయిన వెన్ని స్థితులో రంగ స్థలంపై నటించే పాత్రలు కొన్ని మాత్రమే అపుడపుడు ప్రేక్షకులూ పాల్గొని పాత్రలకు కొత్త మలుపు నిచ్చేరు. నిన్న ఊగే పంజరం నుండి విడుదలైన చరణ యుగం నేడు మ్రోగే శృంఖలాల్లో శబ్దిస్తూంది తెలిసిన ప్రశ్నకో తెలీని ప్రశ్నకో గురి అయి ఆందోళనతో ముఖం ధూళి గణంలో చిక్కీ హృదయం సంధ్యా సరస్సులో దూకొచ్చు యుద్ధంలోనే కాదు శాంతిలోను వివేకం అవసరం జీవితమే వివేక ప్రమేయం కోరని ఆటోమేటిక్ యంత్రం కాదు భవిష్యత్తు దిశలో పరివర్తనకై ప్రేరణతో ఘర్షణతో క్షణాలు కదలి పోతున్నాయి రంగు రంగుల బెలూన్ల వలె అందని కాంతులతో కలలు నిజాల్ని క్రమ్మేస్తున్నాయి ఈ స్వప్నం నిజమయ్యేనా ? ఈ కాంతులు మన కందేనా ? వర్తమానం చివరి బిందువునీ ముందు కాలం మొదటి బిందువునీ గమనంలో అనుభవం మనిషినీ మనిషినీ కలుపుతుంది నిరంతరం 3. స్వేచ్ఛలో హద్దులు పక్షి గగనం కొలవ జూస్తుంది మనిషి భూమినీ ఆకాశాన్నీ కొలవ జూచేను హృదిలో ఎడారి ఉంది ఒయాసిస్ ఉంది మైదాన ముంది ప్రవాహ ముంది. కళ్ళలో నక్షత్ర కాంతితో ప్రకాశించే సూర్య కిరణ ముంది సాగరం లోతు భయం లేదు పర్వతం ఎత్తు భీతిలేదు సాగర తీరాన మనిషి పద చిహ్నాల్ని నిలుపుతూ పోయేను పర్వత దేశాన మనిషి వన బీజాలు నాటుతూ పోయేను కలహ ధ్వని రాగంతో హింసన చణ చరణాలతో జన బృందం మధ్య నుండి నీడ లెగిసి కత్తులై దూసేను నేను ప్రాణినీ మనిషినీ వ్యక్తిని సమాజావసర విజయ శక్తిని అవనిపై కరుణతో కదిలే సమతా మానవతా యుగ మూర్తిని ప్రయాణంలో అలసినపుడు దారిలో నీడ నిస్తూ ఆశ మాత్రం చెట్టు వలె ఎదలో నిలిచి ఉంటుంది మేఘాల్ని మోస్తూ గాలి దిశల్ని కలిపే యత్నం చేస్తుంది చెట్లు గిరులు మేడలు తమ స్థాయిలో నిరోధిస్తూనే ఉంటాయి. మనిషిలో జైలు శిథిలం కాదు నిశ్చలంగా ఉంటుంది ఎతెన గోడల్ని తాకుతూ గాలి స్వేచ్ఛకై తారాడుతుంది శిలల కలల్ని శిల్ప కళలో మెరపిస్తూ ఒకరు జనం బాధల్ని విశ్వ హృదిలో నినదిస్తూ ఒకరు 4. మార్్చ నడిచే దిశా వీధి విప్లవం ఖడ్గమై మెరపుల్ని ప్రదర్శిస్తూంది ఈయుగం శిరస్సుపై ప్రజాస్వామ్యం వజ్రమై ఆకర్షిస్తూంది గాయపడిన క్షణాలపై జాలి చాలదు యుద్ధ విరమణ రేఖపై శాంతి చాలదు అగ్ని శిఖలపై కదలే శ్రమ జీవన వాస్తవం ఆర్తి వదలి ఈ సమయం పొందాలి జనస్వామ్యం ఇపుడు కన్పించేది రవి కాదు, జన కోపంలో అంగారం ఇపుడు విన్పించేది అగ్ని కాదు ! ప్రజల మౌనబాధా హృదయం అంగారం చైతన్యం ! నీ నుండి నాలోకి మన నుండి మనిషిలోకి మార్్చ 5. సమయం వస్తుంది నాలో అణువణువులో పృథ్వీ రూపం కణ కణంలో గాథాకాశం ఎదురుగా బహు శక్తులు ఘర్షించే సామాజిక జీవన దృశ్యం ఎవరి కోసమో ఎదురు చూచి ప్రతి రోజూ ఎద ఎడారి అవుతుంది ఇంటి ముందు వీధి దీపం సుదూర నక్షత్ర పథాన్ని చూపిస్తుంది. ఉదయం లేవగానే సూర్య బింబం సముజ్వల స్వప్న విభాతం కళ్ళలో దింపుకొనేమా ? చేతులు చాచి పొందేమా ? ఇది అందని సత్యం దీని ప్రతిఫలనం చంద్రబింబం, నా హృదయానికి ప్రతిరూపం శక్తి బిందువు వివృత రూపం బాధకూ వేదనకూ సాక్షి ఆలోచనలో హంసయై తేలుతుంది ఊగే వర్తమాన లహరి పై ఒయారంగా నడచి వస్తుంది రాత్రి జ్ఞాపకాల్ని వెలిగిస్తూ జారే కన్నీటిని తుడిచేస్తూ శశి కిరణం వరసగా ఆలోచనల్ని వెలిగిస్తూ కదలుతుంది దీప స్తంభాలకు వ్రేలాడే ముఖాలు సూర్య తేజాన్ని ప్రేమించలేవు జెండా కర్రపై వెలసిన ముఖాలు నేలకు దిగేనా ? వెలిగేనా ఒక సమయం వస్తుంది కళ్ళు మూసినట్లుతోచే చీకటితో ఒక సమయం వస్తుంది కళ్లు తెరచేట్లు చేసే కాంతితో 6. అగ్ని దీప్తీ - కాంతిరక్తీ సముద్ర మంత భయంతో నభస్సు బావురమని, గుండెలో దూకుతూంది జీవితం బింబించే నిలువెత్తు ఆదర్శం, వీధి నుండి విసరిన రాళ్ళకు ముక్కలైంది గడప దాటితే గాయా లలంకరిస్తాయి, మనిషిలో సింహమైన హింసకు ముద్రలై నిశ మనిషిలో పేరుకొని తుహిన శిల అవుతుంది, ఒక సమయం ఉషస్సు మనిషిలో కదలుతూ వెలుగు నది అవుతుంది, మరో సమయం గడ్డ కట్టిన నినాదం సరించే కిరణం రావాలి స్తంభించిన పద యుగం నడిచే తరంగం అవాలి. జ్వాలా దర్పణంలో మండే సంస్కృతీ దృశ్యాలు ఒకదాని తరువాత మరోటి పొగ జ్ఞాపకాల్ని కప్పేస్తుంది, రవ్వల మధ్య మానవతా మందారం కమలుతూంది అగ్ని శిఖలతో పాటు అమృత కళలతోనూ వర్తమానం స్క్రీన్ పై జన గణ దృశ్యం ? పొడిచే చుక్కల ప్రశ్నలతో గగనం సంధ్యా సందేహమయమైనా ఉదార హృదయంతో ఉదయం పృథ్వికి స్వాగతమిస్తుంది నాలో అణువణువు సమాజ శక్తి నికేతనం నాలో కణ కణమూ వ్యక్తి పాత్రకు సంకేతం అగ్ని దీప్తి ఎంత అవసరమో కాంతి రక్తీ అంతే అవసరం ! 7. ఈ రోజున ఆదారినే తల వంచి అమాయక నిజం వలె ఉన్న గుడిసె అగ్ని కాహుతియై స్మృతిలో మిగిలింది కళ్ళలో హిమాం దిశలతో మనుషులు కదలి పోయేరు దీన జన వినీల గాధ అంతరాత్మను పొరల్లో నుండి పైకిలేపుతూంది రాత్రి వినిపించే నక్షత్రం పాటకై ఉదయం వ్యర్థ ప్రయత్నం చేస్తూంది విసరిన రాళ్ళకో ఆయుధ చర్యకో పగిలిన టవర్ క్లాక్ పనిచేయడంలేదు ఇప్పుడు కళ్ళలో బాష్ప బిందు వెక్కడిది ? మండే ఉన్మత్త జ్వాల తప్ప ! మూటలో వస్తువు లొకటొకటీ తీసి పుట్పాత్పై అమర్చి రోజూ దీప స్తంభాని కానుకొని కన్పించే వృద్ధు ! ఈ రోజు గైర్ హాజర్. హింసతో ప్రతి హింసతో మానవ చరిత్రలో పొందిందాని కంటే సమాజంతో పాటు వ్యక్తీ కోల్పోయిందే ఎక్కువ మస్తకం నుండి పాదాల వరకూ మట్టియై సస్య గతి పొందే మనిషిలో మూర్తి లోహమయమయినా హృది శిలా సదృశం కాకూడదు ఎద కాసెట్లో రికార్్డ అయిన జీవన శాంతి సంగీతం హిమ తుషారం చిమ్మొచ్చు ! అనల సేచనం చేయొచ్చు ! గ్రీష్మ తాప దృశ్యాల్ని పొడిగిస్తూ ; జలద బృందాల్ని తొలగిస్తూ హింసానల చరణ పంక్తితో సాగే ఏ సిద్ధాంతం సహనార్హం కాదు సహనం బద్దలై ఉద్వేగ జల ధార లెటుపోతాయి ఉన్మాత్త గతిలో పొలాలపై పొర్లి జన పదాలు ముంచి భీభత్సం చేసే అశాంతి నిలయంలోకీ హృది కాసెట్లో పాత పాట మలగిపోయి కొత్త పాట వినిపిస్తోంది అనల ప్రవాహంలో ఇంకా బ్రతికి ఉన్న జనం ఆర్తిని ధ్వనిస్తూంది. రాగ లహరి నణచేస్తూ సైరన్ మ్రోత దూసుకొనీ వినిపిస్తూంది ఇపుడు కవిత్వం ఏ కోట ద్వారానికో వ్రేలాడే శిల్ప తోరణం కాదు. 8. ఈ రోజున దారి అదే ఈ రోజు అదే దారిన ! నిప్పంటిన చెట్టూ వనం మాదిరి ముఖ ముఖంలో రూపం వేరు ! క్షణక్షణంలో దృశ్యం వేరు పద పదం ధూమావృత శిఖలతో చరణాలు కదలుతున్నాయి అయితే ఇది అడవి కాదు! నగరం అడవిని తలపిస్తూంది. ఏదో ఘర్షణతో ప్రతి రోజు రక్త చిత్రాలతో నిష్క్రమిస్తూంది అశాంతిలో కన్నీళ్ళతో అగ్నులతో పగలు రాత్రిలోకి దాటుతూంది అడవైనా నగరమైనా ఎడారైనా పల్లె అయినా ఆయుధాల విషాద ధ్వని ఒకటే ! మూసిన తలుపుల్ని ముక్కలు చేసేను దాగిన బ్రతుకుల్ని బయటిక లాగేను ఎక్కడుంది ? సంపూర్ణ సత్యం ? ఎక్కడి కక్కడే ఖండ ఖండంగా కన్పిస్తుంది స్వేచ్ఛకూసమతకూ అంకితమైన నవ సమాజం మానవీయం కోరుతూంది పదం కదలి చేయి కలిసే నవ తరం పైకి గగన భయం శీర్ణ పరచే యువ గణం పైకి తుపాను వస్తుంది భీభత్సంగా, అశాంతి నురిమి పోతూంది ఇది సామాజికమే అయితె ! ఎప్పటికీ ప్రమాదమే ! తన ముఖాన్ని బింబించే అద్దాన్ని పగుల గొట్టే చేతుల్లో కన్నీరు మనస్సు లోని గుప్త రూపాన్ని జ్ఞాపకం చేస్తుంది, హఠాత్తుగా మానవతా పూర్ణమైన కంఠ ధ్వనిలో పాయలుగా విభిన్న రాగాలు ఏ వ్యక్తి సమీపానో ఏ ఊరు సీమలోనో ఏ జాతి నీడనో నిలిచి పోవు ! చీకటిలో అడుగేసీ పాతదనం కదలిపోతూంది సూర్యుని జాడలతో కొత్తదనం వచ్చేస్తూంది తన చుట్టూ మట్టితో మట్టిలోని మొక్కతో బ్రతికే వ్యక్తితో మనిషి గుండె పలుకుతూంది ధరా విశాల భావనతో మానవీయ రాగం ఎంతటి స్వర్గ ఖండం కానీ ఎంతటి స్వర్ణ లోకం కానీ మనిషి ఊహ నుండి వచ్చేదే ఏదో శ్రమ నుండి పొందేదే, ఒక ఉదయం బ్రతుకులో చేతిలో రాలిన ఫలం కావచ్చు ఒక సమయం బ్రతుకులో గుండెపై గురిపెట్టిన గన్ కావచ్చు 9. ముసుగై కళయై ఉదయం మేల్కోగానే వెలుక్కి తొలగే చీకటి అంతలో దిశ దిశ నుండి ప్రవేశిస్తుంది లోపల ముసుగై నిలుస్తుంది. చీకటి తొలగీ మంచు మెరుస్తుంది, తెరలుగా కదలుతుంది లోలో ప్రవేశిస్తుంది, లోపల పొరలుగా వ్రేలాడుతుంది. చీకటి తొలగీ ఇంటి ముందు మల్లె మందారం గులాబి పారిజాతం నాలోకి ప్రవేశిస్తాయి ; నాలో అర్ధ భావ కళలై శోభిస్తాయి శబ్దం ప్రవేశిస్తుంది నాలో తొడుగై పోతుంది. ఉన్నట్లే సంగీతమౌతుంది ఘర్షణలో ధ్వనించే ఆర్తి నా చుట్టూ తిరుగుతుంది, నినాదమౌతుంది కళ్ళు తెరచి చూచేంతసేపూ పాత్ర ఏదో నటనలోనే ఉంటుంది ఏ పొరలోనో ఏ దుస్తుల్లోనో ప్రవేశించింది ప్రవేశించి నట్లే ఉంటుంది, నాలో స్వార్థం వెలుగై సరిస్తూ అగ్నియై జ్వాలిస్తూ చీకటై వెన్నెలై బ్రతుక్కి పాత్ర రూప మిస్తుంది పొరయై తెరయై ముసుగై తొడుగై, ఏ తొడుగూ లేని ముఖం లేదు, ఏ ముసుగూలేని మనస్సు లేదు వినీలాకాశానికి ఉంది పొర; గభీర సముద్రానికీ ఉంది పొర. 10. ఒక మాస్్క వదలి మనిషి ముఖాన ముసుగువలె వెలుగు, నవ్వుల రంగులూ ఒక దిశనుండి ముఖాన ముసుగు వలె పర్వతం, ఏ మార్పులేకుండా ఉంది ఊహ కందని ధరిత్రి చరిత్రలో ఎప్పటిదో పూర్వ రూపం ధరిత్రి ముఖం పై చెట్లు పొదలూ అపుడపుడూ నీలి మేఘాల నీడలూ, శిలలూ శాసనాలతో శిల్పాలతో కోటలూ జీర్ణమైన గోడలూ అంతా అమాయక వాలకంతో మూసిన చరిత్ర గ్రంధం వలె ఉంది. ఉదయం మంచు కదలుతుంది గిరి తటాన భయాన్ని విదలిస్తూ వెలుగుతో హ్లాదమైన రూపం ! ముసుగుపై ఇదో మరో ముసుగు ఆవేశాన్ని ఆనందాన్ని హత్తుకొనీ ప్రేమను కరుణను నింపుకొనీ కష్టాలు బాధలు దాగని హృదయంతో పైనుండి జలపాతం దూకుతుంది మస్తిష్క శిఖరం నుండి పాద దేశం దాక ఆర్ధమైన అనుబంధంతో కణకణంతో స్పందనతో మానవతా సుందరమై పాయలుగా సరిస్తుంది వర్తమాన తలంపై తుషార పంక్తి విసరుతూ జలరాగం చిందుతూ ఆశాంతి హృదయంతో జలపాతం నేలపై దూకుతుంది మానవీయమై కొండతో విసిగి పోయి అపుడపుడు మనస్సు లాగుతుంది జలపాతంతో కదలే కోర్కెతో ! ఒక్క మాస్్క పోతే మరో మాస్్క 11. గది లోపల బయట మనస్సు గదిని తలపిస్తోంది, గదిలో నీడలతో శరీరాలు కదలుతున్నాయి ముఖాన రక రకాల ముసుగులతో పాత్రలు వస్తూ పోతూంటాయి గోడకు వేలాడే క్యాలెండర్లో ఈ రోజు తేదీ వెలిగే బల్బు వలె ఉంది తేదీల అంకెలు వరసగా అనుభవాన్ని నింపే చరిత్ర కాప్సెల్్స వలె ఉన్నాయి వచ్చిపోయే సంధ్యా ముఖాలతో గది భవిష్యత్తును ఆహ్వానిస్తుంది గోడపై గాంధి బుద్ధుడు చిత్రాలు దర్పణంలో ఆశా రూపాల వలె కన్పిస్తున్నాయి ఎతెన మేడలు అదృశ్యహస్తాల నీడలతో గదిని వినీల పరుస్తున్నాయి నేను పోగొట్టుకుంది మనస్సు కాదు, దాని లోతులో రహస్య గాధ మనస్సు చూపే ఆకాశం అందదు, పొందే ఆరణ్య మార్గం తెలీదు. నీతికీ నిజానికీ దూరమై మారే ముసుగులు సమాజంలో జీవిత స్వరూపానికి సరికొత్త వివరణలూ వ్యాఖ్యానాలూ వ్యక్తి రూపం గది లోపల బయటా ఒక్కొక్క విధంగా కన్పిస్తుంది గదిలో ఆకాశం దిగుతుంది ! గది బయట అరణ్యం అవతరిస్తుంది 12. స్మృతులతో కొత్తగా లేచిన సౌధాల్నీ ఎత్తుగా నిల్చిన దీపస్తంభాల్నీ దాటుతూపోయేం ఇరువురం ; నదిలో వెచ్చని అలల వలె, ఆగని పరిమళ లహరుల వలె రాత్రి వీధి అంతా నిర్జనంగా ఉంది, ఎక్కడో ఒక వాహనమో ! మనిషో ! ఈ సమయం పల్చని వెలుగుతో ముళ్ళు తీసేసిన మొగలి పట్ట వలె ఉంది దారిలో గోయి పక్క నుండి, దారి మూసిన తోటను చుట్టి దారి లేని కాంపౌండు చుట్టూ తిరిగి శిల్పం ఎరగని శిలలు పక్కగా, దీపం ఎరగని గుడిసెలు దాటి గమ్యం చేరాం అనలాన్ని ఆలోచనకు రానీకుండా గుండెను హత్తే చల్లని గాలిలో రైల్వే స్టేషన్కు వచ్చేశాం ! ఇద్దరమూ, ప్లాట్ ఫార్్మ చేరుకున్నాం మా ఇరువురి మధ్య ఏ ముసుగు లేదు ! ఈ సమయంపై రాత్రి ముసుగు స్టేషన్ పై మంచు ముసుగు ! మనుషుల ముఖాలపై వెలుగు ముసుగు ! దూరాన రెడ్ లైట్ నాలో విచ్చిన ఎర్ర గులాబిని తలపిస్తుంది ఇప్పట్లో మా రైలు వచ్చేట్టు లేని సూచన మైక్లో వినిపించింది నా కెదురుగా ఉన్న ముఖం నాలో నిశ్శబ్ద సౌందర్యాన్ని కదలిస్తూంది ఆ వెలిగే దీపాల్ని చిన్న పిల్లల్లా లెక్కపెడుతూ ఎప్పటికీ పూర్తికాని లెక్కతో నేనూ బెంచ్పై కూర్చున్నాం నాల్కపై ఐస్క్రీం చల్లదనం కన్నా చిరు వేడినే కలిగిస్తోంది మా కవసరంలేని రైలు వచ్చేసింది ! మా కవసరముంది మాత్రం ఆలస్యం ! స్నేహానికీ ప్రేమకూ వశమైన కాలం ! క్షణాలపై పరుగెత్తుతూంటుంది. ఇంతలో రెక్క వాలింది, దూరాన పచ్చలైట్ వెలిగింది రైలు రానే వచ్చింది, నేనొకణే మిగిలా ! లైలు కదిలింది ఇప్పుడు ఫ్లాట్ఫర్మపై లైట్లు కన్నీటి బిందువుల వలె ఉన్నాయి మనస్సు కాన్వాస్ పై అప్పుడే స్మృతి రేఖలు మొదలైనాయి ఆలోచనా జలపాతంతో నేనొకణ్ణి ఇంటి ముఖం పట్టాను ఇపుడు స్టేషన్కు వచ్చేప్పుడు కన్పించిన దృశ్యమేదీ కన్పించ లేదువర్తమానం స్క్రీన్ పై - వర్తమానం స్క్రీన్ పై ఈ సమయం మనోలత పూచిన స్మృతి పుష్పం వాడదు, రాలదు మా ఇష్టంలో కదలిన కాలం ఇప్పుడు తన ఇష్టంలో నిలిపేసింది ఆమె మరచిం దేమో నని నేను, నేను మరచానేమో నని ఆమె ఒకరికి తెలీకెండా మరొకరం, దూరాన్ని స్మృతులతో కొలిచేం 13. అభిజానం వలె ఆకాశం వైపు చూచే మీనార్ శిఖరం వలె ఆదర్శం బిందువూ సముద్రం వలె స్వరమూ సంగీతం వలె వ్యక్తీ వమాజం పరస్పర స్నేహంతో కలుస్తాయి, అన్యోన్యాకర్షణలో నిలుస్తాయి వాస్తవ జీవితంలో లంబరేఖల్ని ఆదర్శ బిందువు కలుపుతుంది ఇంటి వెలుపల పచ్చని చెట్టు ఉంది ; లోపల వెచ్చని జీవిత ముంది మనిషిలో పెరిగే చల్లని చెట్టు ఉంది దాని వేళ్ళలో కన్పించని అగ్ని ఉంది చెట్టును నరికే వారున్నారు ; కోష్ణ స్పృహను బుగ్గి చేసే వారూ ఉన్నారు కాలాన్ని వెంట ఈడ్చుకొనీ జీవితం ఇండ్లు దాటి మీనార్లు దాటి కదలుతూంది బిందువు బిందువు మధ్య విరుద్ధ శక్తులతో చరిత్ర నిర్మితమౌతూంది రేఖల రేఖలతో కొత్త చిత్రరూపమేర్పడుతుంది ఆలోచన ఉన్నా సంస్కారమున్నా అశాంతి ఆందోళన వచ్చే దారులు వేరు అజ్ఞానం ఎక్కువై వేళ్ళను నరకేయొచ్చు సంస్కారం లోపించి కొమ్మల్ని కొట్టేయొచ్చు, ఆనంద గాఢగానో విషాద గాథగానో మీనార్ నిలిచి పోవచ్చు ఉదయం పుష్పమై సంతోష బింబమై ముఖంపై వాలుతుంది ప్రేమతో ఎదలో కదలుతుంది సువర్ణ నాణెమై ఆపైచేతిలో కరెన్సీ రూపమై ఈ సమయం మేల్కొన్న మనస్సుకు గమ్యం చేరే శ్రేణిక వలె ఉంది కోపంతో రంజితమై హింసతో రక్తిలమై మాసికలతో పేలికలతో అనగ్న రూపాన్ని ఎవరు చూచినా చూడకపోనీ రోజు కొత్తగానే వస్తుంది ఉదయం లేవడమాలస్యమైతే తీక్ష కిరణ మెదురౌతుంది పనీ పాట్లతో భ్రాంతిలేని స్వేచ్ఛ లేని శ్రమ సమాజం కన్పిస్తుంది చీలిపోయే బాటల్లో నుండి హైవే దొరికితే అదృష్టం. దుష్యంతునికి అభిజ్ఞానం వలె ఉదయం మనోనేత్రాన్ని తెరపిస్తుంది ఇది నిరాశా ముక్త సమయం విషాదం నుండి ఆనందంలోకి తిరిగేను ప్రయాణ విపణిలో ఇది రేపటి వరకూ చెల్లే చేతిలో విలువైన కరెన్సీ 14. ముక్కలైన అంచులపై రైలు వర్తమానం అంచులపై స్టేషన్ దాటింది వేగం అందుకుంది పుట్ బోర్డపై నిల్చి వ్రేలాడే వ్యక్తి దగ్గర లగేజ్ ఏమంత ఉంటుంది ? తలుపు వద్దనే జనం ఉక్కిరి బిక్కిరౌతున్నారు స్థలమెక్కడుంది ? ఈ సమయం ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణం చేయాలిసిందే ఇష్టంతో భయంతో ప్రయాణం జలపాతాన్ని కావలించుకున్నట్లుంది దూర దూర నుండి భవిష్యత్తును తనలోకి తీసుకునే వర్తమాన క్షణాలపై రైలు పరుగెత్తుతూంది ! సడన్ బ్రేక్ పడింది, రైలు ఆగింది. పట్టాలపై చిమ్మిన రక్త చిత్రం, గుర్తించలేని భీభత్స దృశ్యం పరుగెత్తే ప్రపంచం ఆగింది ! మృత్యువు తన దారిన పోనేపోయింది కాసేపటికి సైరన్ మ్రోగింది, దిగిన జనం, ఎక్కసాగారు, టెయిన్ కదిలింది, తెరచుకొన్న అందరి ఎద తలుపులు మూసుకున్నాయి రైలు కదలే ధ్వనిలోను శిలపై అలల వలె నిశ్శబ్దం కదలుతూంది ఆక్సిడెంటో! ఆత్మ హత్యో ! సమాచార మేదైనా పర్యవసాన మొక్కటే వివరణ యేదైనా నిర్వచన మొక్కటే, నిర్ణయ మేదైనా మరణం సునిశ్చితమే ! వ్యక్తి పై మృత్యు సమయం పట్ల ఉండే జాలి జీవితం పట్ల ఉండదు. మరునాటికే ఏ గుర్తు ఉండదు ; ఒక్క మానవతా చిహ్నం తప్ప ! ఈ విషాద స్థితి, తెలీని రహస్యంగా ఉంటేనే శాంతి కవచం భద్రంగా ఉంటుంది ముక్కలన్ని పేర్చి మనిషిని చేసి పోస్్ట మార్టమ్ జరిగింది మనిషే ! ప్రాణి ! ఏమైనా సామాజిక శక్తి ఒకటి తరిగింది మనిషిలో చిట్ట చివర అల్పశక్తి ఒకటి స్కోరు చేసింది 15. టాన్స్పరెంట్ కర్టన్ తెరచిన కిటికీ దగ్గర కుర్చీలో అతడు పలకని వైయొలిన్ వలె ఉన్నాడు. ఆ వ్యక్తి రెండు కళ్ళు న్యూస్ పేపర్ అక్షరాల్లో మునిగి తేలుతున్నాయి పిల్లల బూట్ల చప్పుడు కన్న వేగంగా స్కూల్ బస్ హారన్ ధ్వని వినిపిస్తూంది బరువుకు వంగి గాలికెగసిన తీగె వలె హఠాత్తుగా తలెత్తి చూచాడు. పొడుగ్గా నిశ్శబ్ద దళం వలె నున్న హాల్లో ఆమె ఒక ప్రక్క నిలిచి హిమ కళిక వలె ఆకర్షించేను చేతిలో పేపర్ రెపరెపల మధ్య పాట వినిపిస్తోంది ? రేడియోలోనా ? గాజు గ్లాసులో కరిగే మంచు ముక్కల్లా గళం నుండి పాట జాలు వారుతూంది కూర్చిలో వైయొలిన్ మాదిరి కూర్చున్న వ్యక్తి మౌనం మంద్రంలో శబ్దించింది పాట ఆగింది ! ఆమె గదిలో నుండి కిరణం వలె హాల్ లోకి వచ్చింది అతడు తీగె తెగిన శబ్దం వలె ఏదో గొణిగాడు, ఆమె హాల్లో నుండి గదిలోకి వెళ్ళింది. ఆ పాటే తిరిగి అందుకుంది అక్కడి నుండి బిగిసిన మౌనంతో బ్రెడైఫ్ కదిలింది. చెదరిన స్వప్నం నుండి గది ఒక్క మారు మెలకువ లోకి వచ్చినట్లుంది. రాత్రి అంచుల్లో చీకటి శిలల మధ్య ప్రయాణం చేసి అలసినట్లున్న ఆమె కళ్ళలో నుండి వెలుగు సూదులుగా జారింది అంతలో గగనం వలె పరచుకొన్న ఆసమయంలో రెక్కలు విప్పి ఎగరనున్న హంసవలె హృదయం స్పందించింది ఆమె పెదవులపై స్వేచ్చా పక్షాలతో శబ్దం ఎగిసింది “నా పాట ఎట్లా ఉంది ?” “బాగా లేదూ” అంటూ ఆత్మీయ రాగం ఒలికింది. హాల్లో కిటికీ సమీపంలో సోపాలో కూర్చుంది, అదే పాట వినిసిస్తోంది. గేట్ వద్ద కుక్క అరుస్తూంది ! ఎవరో కొత్త వ్యక్తి వచ్చిన అలికిడి ! వీధిలో అదే ! వాహనాల ధ్వని ! పొగతో గుఫ్న పెటోలు వాసనతో సమయం ధూళి శాలువా కప్పుకొంది సర్వం మరపిస్తూ మెల్లగా కదలుతూంది జీవిత వాస్తవంలో ఆపాట ఆమె స్మృతిలో మొగలి రేకై నిల్చింది ఇష్టమైంది రేడియోలొ వినాలని ఉంది ! ఆ కోరిక ఎట్లా సాధ్యం ? వీధి నుండి ఇష్టం లేని శబ్దంతో వాహనాల గంధం మళ్ళీ మళ్ళీ వస్తూంది ! అతని చేతిలో న్యూస్ పేపర్ మూసి ఉంది చూపులు కిటికీ నుండి బయటికి దూకుతున్నాయి భగ్న శాంతిలోనూ ఆ పాట నందుకునే హృదయ గళంలేకపోలేదు దారిలో పిల్లల అడుగుల లయ వినిపిస్తూంది ఇంకా వినాలనిపిస్తూంది ఆదిత్య జీవితంలో మిహికానుభవం నాల్కపై ఐస్ క్రీం వలె ఉంది వ్రేలికి బాగా వదులైన ఉంగరంలా సమయం జారి పోతూంది ఆదిత్య కుర్చీలో అట్లాగే ! మ్రోగని వయొలిన్ వలె ఉన్నాడు మిహిక సోపా నుండి లేచింది పలికే తీగె వలె కదిలింది ఇరువురి మధ్య మౌనం గాలికి కదలే టాన్స్పరెంట్ కర్టెన్ వలె ఉంది కర్టెన్ పై వెలుతురు చిహ్నాలు ఎవరికి పట్టింది వయొలిన్ తెలిసిన మనిషికీ ! తీగెలు మీటే హృదయానికీ ! ఎవరిని కదిలిస్తాయి ? మధుస్పర్శ ఉన్న హృదయాన్నీ 16. ప్రతీక్షా ముఖంతో ప్యాక్టరీ గొట్టం నుండి పాయలుగా విడిపోయే ధూమ రేఖల మధ్య నుండి పక్షు లెగిరి వచ్చి చెట్లపై వాలుతున్నాయి, గూళ్ళలో చేరుతున్నాయి ఎగిరే రెక్కల్లో శక్తి పుంజుకొనీ స్వేచ్ఛా సమూహాలుగా దూసుపోతున్నాయి కళ్ళలో అరుణ బింబాలతో గుండెలో విజయ దర్శన కాంక్షతో గొంతులో నిశిత నిరసన శబ్దంతో శ్రేణులుగా పక్షు లెగిరిపోతున్నాయి వీటి కలకలంలో మంచును దూరం చేసే అగ్ని ఉంది వీటి ఉడ్డీనంలో చీకటిని చీల్చే కాంతి రేఖ ఉంది. గేటు ముందు నిల్చిన బిక్షువు రెక్కలు దాచుకొని బ్రతికేను రోడ్పై నినదించే జన పంక్తి ప్రక్కనే సాయుధ భటులు నడిచేరు. అంత ఎత్తులో ఎగిరే పక్షిని బులెట్ వచ్చి దూసింది క్రిందికి ఒరిగే రెక్కలు సంధ్యా దిశల వలె మృత్యు నృత్యం చేసాయి మాసిన వెలుగులో ఈ దారిన బీభత్స గణం ముఖాలపై రవి హృదయ రాగం ప్రతిఫలించేందుకు వెనకాడుతోంది పక్షి గొంతునుండి శబ్దం ఆగింది, రెక్కల్లో స్వేచ్ఛ పడిపోయింది నింగిలో చెట్టుపై పక్షి జనస్వేచ్ఛకు సంకేతమైనిల్చింది వెలుతురు మెట్టు మెట్టుకూ మధ్య చీకటి మృత్యు సమమౌతూంది పక్షికి మనిషికీ మధ్య స్వేచ్ఛపై అనుభవంలో అంతరం ఉన్నట్లు లేదు నిన్న కురిసిన అగ్నితో శ్మశానమైన హృదిలో ముందు శాంతి సేచన జరగాలి అపై హింసకూ ఆయుధానికీ సెలవుతో గుండెలో స్వేచ్ఛ సుమించాలి. 17. బ్రతుకుతుంది శాంతి వర్తమానం స్క్రీన్పై దృశ్య బింబాలన్నీ నీలో నాలో ఉన్నవే యువ బృందం రగిలిన అరణ్యం సెర్్చ లైట్ చూపులతో మార్్చ ఆన్ గతితో వినీలార్తి సమాజంలో సౌభాగ్యంకై భవిష్యత్తు చరిత్రకు గీసే రేఖలతో ఎదలో కోపం కసితో ప్రతి చర్యకు ఆరాటం ఆస్పాలనం చేసేను కళ్ల చివర జ్వాలా శిఖలతో పెదవులపై జ్వాలా శబ్దంతో దీర్ఘ నిద్ర నుండి నిశిదిశ నుండి అగ్ని ఖడ్గమై మెరసేరు అగ్ని సేచనతో స్వప్నించే విలయ మేఘమై కదిలేరు ఇపుడు ఓర్పు లేదని తెలుసు ! ఎవరి తీర్పుతో పని లేదని తెలుసు సమాజ శ్రేణుల్ని బద్దలు చేసే మారణ కల్పనతో అడవి నుండి జన పదాల్లోకి రహస్య ముద్రలతో నడిచేరు తప్త హృదయంతో అశ్రు నయనాలతో యుగాలుగా పన్నిన వలలో చిక్కిన అలల అడుగుల్లో అగ్నులు దాచుకొనీ విప్లవ శిఖరంపై మబ్బుల్ని ఎత్తుకొనీ మనిషికై కోరే విముక్తికై విప్లవ శక్తి కుంది ఒకటే విస్పోటనం లక్ష్యం ఏ విధి లేదు ! దైవం లేదు ! ఉందొకటే సాహసం విధ్వంసనం చీకట్లో ముడుచుకునే గుణం లేని సుడిలో తిరిగే అవసరం లేని ఒక చోటు నుండి మరో చోటికి భయం లేని కాలి బాటల్లో స్వార్థ సమాజాన్ని దగ్ధంచేసే వ్యర్థ నినాదాల్ని నగ్నం చేసే రాత్రి మరచి భీతి వదలి పట్టపగలు వీచే అనల పవన మూర్తులు స్వప్నం పిడుగై జారిపోతుంది, స్వర్గం నిప్పు కణమై రాలిపోతుంది తెల్లని పావురాళ్ళ జాడ లేదు ఎర్రని మాట తప్ప ఏదీ వినిపించదు పీడనకూ హత్యకూ మధ్య ధాత్రి కంపిస్తుంది రాత్రి చలిస్తుంది చరమ నిశ్వాసంలో ఫ్లవించే భయ సంగీతం వినిపిస్తుంది ఎవరికి రుచిస్తుంది ? ఎవరికి రక్తినిస్తుంది ? ఆన్ చేసిట్యూన్ చేసిన రేడియో వలె ఈవేళ మనస్సులో స్మృతులు ఎప్పటి కపుడు సర్్చ లైట్ దృష్టితో అప్పటి కపుడు మార్్చ ఆన్ మాటతో యువ బృందం ! మండే అరణ్యం ! అరణ్యంలో ప్రేలే ఆయుధం ! ఆశ్రువులో అగ్ని బిందువుతో ఘర్షణలో అనల చరణంతో మరో క్షణంలో నీవు లేకున్నా నేను లేకున్నా ! ఈ సమాజం బ్రతుకుతుంది శాంతికై ! 18. శ్రామిక గీతం లెండి ! లేలెండి ! ఓ క్షుధార్తి బంధితులారా లెండి ! లేలెండి ! ఓ శ్రామిక సోదరులార ! లెండి నిస్సహాయులార ! అవని పై దీనులార ! న్యాయంకై, నిరాదరణ గర్జా ధ్వని రణిస్తోంది జ కొత్త ప్రపంచం ప్రభవిస్తూంది ! మంచి సమాజం ఉదయిస్తూంది ! బంధించవు మనల్ని ఇకపై బంధించవు సంప్రదాయ శృంఖలాలు ! లేలెండి లెండి ! దీనులార ! ఏ బానిసత్వమూ మనల్ని కట్టివేయలే దికపై లెండి ! లేలెండి ! ఓ శ్రామిక సోదరులార ! (యూజినీ పాటియర్ ఫెంచి కవిత అంగ్లానువాదానికి స్వేచ్ఛానువాదం) 19. నగరం దర్పణంలో I ఈ కూజాలో నీరు పృథ్వీ తలంపై మేఘం ఎపుడో వర్షించింది ఈ కుర్చీలో మనిషి ఎపుడో జీవాగ్ని నుండి ప్రాణం స్పందించిన రూపం పురా యుగం ముద్రలతో ఈ మనస్సు అప్పటిదే! దృష్టిరేఖ ఇప్పటిది ప్రతి దశలో ప్రతి యుగ చిహ్నాలు పొందే మనో రూపం, మనిషిది. అహంకార గుహ నుండి క్షుధా పీడిత హరీంద్రం వన మంతా చరిస్తుంది స్థితి పరివర్తనతో జన జీవన సూత్రం తర తరానికి మారుతుంది ముఖంలో నీడలతో కన్నుల్లో వత్తులతో దారుల్లో పోయేరు జనంలో మనిషి ముఖం పై ధూళి మంచు అనలం ఒకదాని వెంట ఒకటి! పేజిల్లో నిద్రించే అక్షరాలు చూపులో మేల్కొంటాయి జీవిత వనంలో దారిచూపుతాయి కోలాహలం నగరం రాత్రి నిశ్శబ్ద కళ వహించిందో లేదో బాధా నది చలనం గమనం హృదయంలో వినిపిస్తుంది కోలాహల నగరం పగలు బ్రతుకు బరువు వహించిందోలేదో అనలం అలము కొన్న అరణ్యం వలె రూపం మెరుస్తుంది. పగలూ రాత్రీ మనిషి సమిధయై మండేను అగ్ని కణమై వెలిగేను ఎంత ఎదురెదురుగా ఉన్నా మనిషి వదన ముకురంలో బరువులో హరువులో జారిన తెరల్లో నిజం కన్పించదు. దారిలో గుడి మెట్ల పై బిక్షువులు దొప్పల కళ్ళలో నిప్పు రవ్వల ఊహలు వీరి గమ్యం సీమల్లేని ఆకాశం, ఆదర్శం లభ్యం కాని ఆహారావాసం ఉదీర్ణ సంస్కృతిలో సమాజ శక్తుల పాత్ర చరిత్ర నిర్మిస్తూంది కాని వెనుకనున్న జన బాధా చిత్రాల్ని విస్మరిస్తుంది. నదిలో నీరు పొంగి పొరలి ఇరు తీరాల్లో ప్రజ పోతే పోయారా ? అరచైతిలో వైకుంఠం చూపేరా అరమూత కళ్ళలో తెరదించేరా ? కదలీ కదలని పథకాలకు మహా నిద్ర వరమై వచ్చేనా ? గుడిసె ముందు పూల మొక్క! గుడిసె పైన బీర తీగె ! గుడిసెలో అనగ్నమూర్తి క్షుధ వేసిన కోపఫలం రచి ఇంకా తెలీదు II ఎదేమైతేనేం ? ఉదయం రానీ ! రాత్రి పోనీ ! తనకో బెర్్త తొరికితే చాలా ? లోకం చీకట్లో చావనీ ! కల్యాణ సూర్యుడు తన ఇంట్లో దిగితే చాలు కొందరికి రవి కిరణాలు వదలిపెట్టిన క్షణాల్ని శశి కిరణాలు అక్షరాలుగా మలుస్తాయి నగరం ఆహ్వానిస్తుంది శబ్దం నుండి అర్థవంతమైన నిశ్శబ్దంలోకి శబ్దం ఇక్కడ సక్రియకు సంకేతం ! శాఖోపశాఖలుగా పెరిగిన మహా వృక్షం టెలిగ్రాఫిక్ సంభాషణతో జనం ! తరం వెంట తరం వేగం కన్న వేగంగా! రాత్రి వెన్నెల వీధులు మాలగా వాలిన శాంతి కపోతాల వలె ఉన్నాయి అగ్గి పుల్ల గీసి అంటించే వారు లేదు ! ధూళి ధూమం చిమ్మే వీలు లేదు ఎంత త్వరగా నగరం శబ్దంలోకి ఆకర్షిస్తుందో ? అంత త్వరగా ముంచేస్తుంది విషమ జీవితంలో ఇక్కడ రాత్రికీ పగలుకూ భేదం లేని వేళ లూ ఉన్నాయి అర్ధరాత్రి నగరం వాలిన తరంగాలతో శాంత సముద్రంవలె ఉంటుంది ఉండి ఉండి రహస్యంగా నగరం ఏ కత్తి పోటుకో గురికావచ్చు అగ్ని పధంలో బాధా పుష్పమై అపుడపుడు దాహంతో నభంవైపు చూస్తుంది మంచు పథంలో బాధాగీతమై అపుడపుడు, దీప స్తంభానికి ప్రాకుతుంది తనలో అగ్ని జ్వలిస్తున్నా ఉదయం రవి ప్రపంచంపై ప్రేమను పంచేను ఏ సందు నుండైనా జారి మొగ్గలకూ ప్రాణులకూ హ్లాద స్పర్శ నిచ్చేను పచ్చని చెట్టూ జల కణమూ మన కన్నా మండే సూర్యునికే అవసరం ! ఒకరి ముఖంపై మాస్్క ను మరొకరు కాజేసి తమ కవచం మరచేరు బస్ సీటులో జారిన పర్్స వదలి త్వర త్వరగా దిగి పోయేరు మృత్యు సమయం లోను క్షణం తీరిక లేని నగరంలో సదా ఆర్కెస్ట్రా వినిపిస్తూంది ! ఏ మూల నుండో సోలో ! సూర్య కిరణం కొత్త ఆశలతో రోజు పుటపై కొత్త బొమ్మలు గీస్తుంది ఎప్పటి కపుడు చర్యకు సిద్ధంగా ఉన్న రణ విమానం వలె ఉంటుంది వెలుగు లేని బీద గుడిసెలో గాయపడిన ఉదయం కుంటుతుంది పగిలిన కూజా నుండి నీరు వలె రాత్రి నుండి ప్రభాతం వ్యాపిస్తుంది III బీచ్ నుండో పార్్క నుండో పాటలు వింటూ వచ్చే నాలో సాగే స్మృతుల్ని టాఫిక్ స్క్వేర్లో ఎదురైన ఎర్ర లైట్ నిలిపేస్తుంది. గాయాల్ని జ్ఞాపకం చేస్తుంది అంతలో వెలిగే పచ్చ లైట్ మునుముందుకు నడిపిస్తుంది అంగారం నుండి విస్ఫోటనం నుండి బయట పడే నీలో నాలో ఉంది ఒక నగరం హృదయం! అపుడపుడూ ప్రేలే ఆలోచనా గోళంతో బాల్కనీలో కుర్చీలో కూర్చున్న నా ముఖం పై స్ట్రీట్ లైట్ కళ్ళలో నీడల్ని దాచేస్తూంది ! వెలుగును చూపిస్తోంది ఇంట్లో పిల్లల సందడి ! అశాంతిలో రక్తిని నిలుపుతూంది కొత్త సింఫనీలో సంగీత ఖండం వినిపిస్తూంది సమాజంతో జీవిస్తున్న నాలో ఎప్పటి కపుడు మార్పు సహజం ఈనగరం ! స్వేచ్ఛారూపం ! ఎప్పుడు మండేది తెలీని గోళం వెలుగు ప్రశ్న చూడకుండానే కళ్ళలో సమాధానం దొరుకుతుంది బాధల్ని వహిస్తూ దరిద్రాన్ని మోస్తూ తెలివిగా వెలుగుతుంది ఇక్కడ శబ్దం కర్పూర ఖండం కాదు బాధా వీధుల్లో వెలిగే దీపం సంస్కార అంచుల్లో చక్ర ధారా ఘట్టనలో మానవీయం మెరుస్తూనే ఉంది ఎప్పటి కపుడంగారం నుండి విస్ఫోటనం నుండి బయట పడుతూ నీలో నాలో ఉందీ మానవ హృదయం జనతా శ్రమ కేతనమై, వాస్తవమై 20. నిర్వచనాతీతం శబ్దం నుండి శబ్దానికి సరిస్తూ నాలో విద్యున్నవ భావ ముంది మనిషి మనిషినీ పలకరిస్తుంది ! హృది హృదినీ వెలిస్తుంది అనాగరకం లేదు అమానుషం లేదు అయోమయ మసలే లేదు దీని వెనుక నుంది తత్త్వం ! బ్రతుకులో రమణీయ రహస్యం మాయను హిమ శిఖరంపై వదిలి ఆత్మను శక్తి ఝరిలో నిలిపి మనిషి స్వేచ్ఛకు చిహ్నమై ఈ కవితలో ఉంది సమ సమాజ వాస్తవం ! శిలలో మార్పును కోరే, ప్రగతిపై రక్తి ని పించే కళా రూపం జన స్వామ్య చరణ పథం ఈ కవిత నిర్వచనానికతీతం. 21. మేఘమై జనగీతమై స్మృతుల్ని వర్షిస్తూ జన గణంలో మేఘమై కదలి పోతున్నా దిశల చివరలో నుండి గ్రీష్మం ! నా ముఖాన్ని పరికిస్తోంది పిడికిట్లో ఆకాశంతో గుండెలో గర్జనతో నడిచే దారిలో పద పదం ధరిత్రి ఖండంపై అణువణువూ ఓ గాథతో ఆత్మీయం, దూరాన భయ సముద్ర ముంది కారుణ్యం ఒలికే అంచు కూడా ఉంది ఆకాశం అవని మధ్య ఏ రోజూ ఆర్తి నుండి జన పథాన నా గమనం నిశ్శబ్ద హిమాసారంతో ఆర్ధమై ఉదయ కిరణంతో ప్రపుల్లమై ఏ వైపు తిరిగినా ! ఎదురుగా ! మేల్కొన్న సమాజ పద్మం ఓంకారం నుండి ఝంకృతితో నాలో శబ్దం ధ్వనిస్తూంది పెదవులపై రాగంతో ముఖంలో ఉదయంతో కదలుతూంది ప్రజ 22. ఉదయించే శక్తినై అద్దం వలె శబ్దం నాలో కదలే సమాజాన్ని బింబిస్తూంది దారిలో ఎప్పటివో పగిలి చెదరిన అద్దం ముక్కలు ప్రతి అద్దం ముక్కలో జన చలనం బింబిస్తూంది పయనంలో వెలిగే దీపాలు దూర దూరమవు తున్నాయి సంఘర్షణలో మలిగే దీపాలు దగ్గర దగ్గరవు తున్నాయి భయం నుండి పుట్టిన రాత్రి చీకట్లో, కంట్లో వెలుగు చుక్కలతో కదలే వారున్నారు ; “ఎంత కాలం ? ఎంత దూరం” అంటే