Yugasanketam (యుగసంకేతం) Collection 8 of Volume I — Addendum 1 — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1970. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/addendum-1/text/yugasanketam --- యుగసంకేతం Donated in memory of Dr. Sripada Gopalakrishna Murthy శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారి బపూకరణ మాదిరాజు రంగారావు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయము సుల్తాన్ బజార్, హైదరాబాద్ – 1 సాహితీ బంధు బృందం హనుమకొండ, వరంగల్లు—1. స్వేచ్ఛా కవిత్వం యుగసంకేతం ఆచార్య మాదిరాజు రంగారావు SWECCHAA KAVITHVAM YUGA SANKETAM Prof. Madiraju Ranga Rao © Dr. M. Santhosh Kumar Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28 ప్రథమ ముద్రణ: జనవరి 1970 విజయ ప్రైస్, వరంగల్లు పునర్ముద్రణ: జూన్ 2026 అనుపమ ప్రింటర్స్ శాంతినగర్, హైదరాబాద్ ఫోన్ : 040–23391364 II యుగసంకేతం అంతర్నాదం ఆధునిక యుగంలో నవ కవిత్వం విస్తృత వైవిధ్యమూ పొందుతూంది. అందులో ఒక ప్రవాహం పురోగమన శీలంతో సూక్ష్మ జీవనరీతీ, అంతస్స్వ భావ స్వరూపమూ పొదిగికొని విశ్వజనీనభూమికలో సాగుతూంది. ఈనాడు ప్రతి చోటా మతాల బాహ్యాడంబరాలు, అంధ విశ్వాసాలు అంతరిస్తున్నాయి. సారభూతమైంది మానవ సంస్కృతిలో భాగంగా మిగిలేదే, రాజకీయంగా చైతన్యమూ విస్తారంగా కలుగుతూంది. శాస్త్రీయ దృక్పథమూ అలవడుతూంది. వ్యక్తిలో మేల్కొన్న స్వేచ్ఛాభావన క్రియాత్మకమౌతూంది. వీటి ప్రభావం అనివార్యం. ఈనాటి వరకు మానవునికి సంక్రమించిన సంస్కృతిలోని మేలిమి విలువలు రెక్కలు విచ్చుకోవలసి ఉంది. ఒక ప్రక్క వైజ్ఞానికంగా శిఖరాల నందుకుంటూ, మరొక ప్రక్క అనేక విధాలుగా వైక్లబ్యం, సంక్షోభం పొందిన ప్రస్తుత సమాజంలో మానసిక సమున్నతికి కావలసిన వివేకం అవసరమూ గుర్తింపుకు రావలసి ఉంది. విశ్వాంతరాళంలో గోళాలు మనకు చేరువ అవుతున్నాయి. భూమిపై మానవుడు, దుఃఖం అజ్ఞానం అసహనం దారిద్ర్యం అంతరించి, ఆనందం విజ్ఞానం శాంతి సౌభాగ్యాలకు నిలయమె నిలువవలసి ఉంది. ప్రతి ప్రగతివాదీ కోరేదే, ఆదర్శ సమాజానికి భౌతికావసరాలతో పాటు మానసికమైన ఉన్నతి. ఆత్మగతమైన సంస్కారం అవసరం. ఇవి ఈ గీతాల రూపరేఖలు. అందునా చిత్రణలో బాహ్యస్వరూపంకన్న అంతస్స్వ రూపానికి అధిక ప్రాధాన్యమీయబడింది. ఆనందించడానికి అనుభూతి శీలంతోపాటు ఆలోచనా అపేక్షిస్తాయి. కొన్ని గీతాలలోని మూల భావాన్ని స్పృశిస్తూ, కొన్ని ప్రతీకలను తెలియజేస్తూ చివర వివరణలు ఇవ్వడమైంది. అనుభూతి ప్రమాణంలో, ఆవేశపు పొంగులో మనోగతినిబట్టి శబ్దసంయోజనమూ, వాక్యరీతీ, భావ విన్యాసమూ రూపొందిన రచనలివి. ఇందులో ఏ ఛందస్సూ ఉద్దేశించ లేదు. అంతర్లయకన్నా అంతర్నాదం అనుభవానికి వచ్చే స్వేచ్ఛాకవితగా భావిస్తాను. – మాదిరాజు రంగారావు యుగసంకేతం III ముందు మాట డాక్టర్ మాదిరాజు రంగారావుగారికి ఆధునిక కవితా లోకంలో విశిష్ట స్థానమున్నది. ఆ మార్గంలో ఇదివరకే అనేక కావ్యాలు ప్రచురించి లబ్ధప్రతిష్టులైనారు. వర్తమాన మానవ జీవిత వైవిధ్యాన్ని శాస్త్రీయంగా దర్శించి, ప్రతీకాత్మకంగా కళామయంగా ప్రకటించడం వారి కవితా లక్షణం. పత్రికల్లో ప్రచురింపబడిన వారి ఖండికలన్నీ సంపుటీకరించి ప్రకటించడం అవసరంగా భావించినాము. అందుల కంగీకరించిన శ్రీ రంగారావుగారికి మా ధన్యవాదాలు. ఈ గ్రంథ ప్రచురణకోసం రు. 500/—లు విరాళంగా ఇచ్చి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారికీ, ముఖ్యంగా సహృదయులైన కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికీ మా హార్దిక కృతజ్ఞతలు. తగు సలహాలనిచ్చి సహకరించిన డాక్టర్ కోవెల సుప్రసన్నచార్యులుగారికి మా కృతజ్ఞతాభివందనాలు. అందంగా ముద్రించిన విజయ ప్రైస్ అధిపతులు శ్రీ పల్లా రామకోటార్య గారికి, దాని సిబ్బందికీ మా ధన్యవాదాలు. — డాక్టర్ పేర్వారం జగన్నాథం, హనుమకొండ ది. 16—12—1969.కార్యదర్శి. IV యుగసంకేతం అంకితం ఆప్తమిత్రులు డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్యులకు యుగసంకేతం V విషయసూచిక యుగసంకేతం – పుటరచనా కాలం యుగసంకేతం 1 1969 నేను మేల్కొని ఉంటాను 2 ‘67 హృదయంతో మాట్లాడే చెట్లు 6 ‘66 ఎవరది దూరంగా 8 ’67 అంతమవని కథ 11 ‘67 రెక్కలుదాల్చిన కొండలు 16 ‘66 ఆఖరికి దేవుడై నాసరే 19 ‘69 ఈ గీతం 20 ‘67 అంతమవని రాత్రి 25 ‘67 భగవంతుడు విడిదిచేసిన లిప్త 28 ‘66 కాలం గురించి మాట్లాడకు 30 ‘68 ఎవరిదారి వారిది 32 ‘67 అంతంకాని నాటకం 36 ‘68 ఆరని తెలివి నీటిలో మునిగాక 39 ‘68 విత్ రిగ్రెట్స్ 41 ‘68 మిగిలిన కోరిక 43 ‘68 కాలంలో కరగిపోతూ 45 ‘67 సైవెన్ స్టార్స్ 48 ‘68 అందుకే అతడు 49 ‘69 క్షమించాలి పాత్రను విస్మరించలేను 50 ‘68 వెలుగు చూపులో 54 ‘68 నేనూ నీ రూపమే 56 ‘68 నేనెరుగని ఆత్మబంధువు 58 ‘69 మనశ్చిత్రం 61 ‘69 నగరంలో ఉదయం 64 ‘66 నీవు నాలో బ్రతికి ఉన్నట్లే 68 ‘68 నిజం చెప్పు 70 ‘69 అగ్ని గానం 72 ’69 రావద్దు ఆ సమయం 75 ‘69 అమృతవర్షం 76 ‘67 మేల్కొన్న ఆకాశం – పుటరచనా కాలం కాంతి సింహం 81 1957 మూసుకున్న ఐదువ్రేళ్ళు 83 ‘60 నెక టై 86 ‘58 గాజు గది 87 ‘60 సంధి పత్రం 88 ‘57 పతాక వార్త 90 ’59 నేను 91 ‘56 గాలులు 92 ‘57 కాంతి గీతం 94 ‘58 శైశవం 96 ‘62 నిప్పు పూలు 98 ‘55 స్నేహ వీచి 99 ’55 కీర్తి స్తంభాలు 100 ‘55 లౌకిక శ్రీ 101 ‘62 ఈ మాట ఈ చేత 103 ‘61 ఎవరు మీరు 105 ‘56 ఇరవై ఒకటో శతాబ్దంలో చంద్రుడు 106 ‘58 దేవునితో టెలివిజన్ గోషి 109 ‘57 కదలండి శతఘ్నులవలె 113 ‘62 శ్వేతేతర విహంగాలు 115 ‘55 యుగసంకేతం నిరాశలో మేల్కొంటాను ఆశతో జయిస్తాను నే నీ యుగసంకేతాన్ని. పగలు చెమటలో తడిసి రాత్రి అలసట క్రమ్మిన ఈ ప్రపంచ కక్ష్య రేఖను. దీపమె వెలుగుతాను గుండెలో తోరణమె వ్రేలుతాను తలపై అణువణువున నర్తించే శక్తిని. బొగ్గును రగుల్పుతాను మట్టిలో ప్రాణం తెస్తాను నేను జీవన సంగీతాన్ని. నాకు దుఃఖం లేదు నేను పుట్టినందుకు తీరికా ఓపికా ఉంది విషాద శ్రుతి వినడానికి. నాకు తృప్తి ఉంది నేను చేస పనిలో ఆరని అగ్ని ఉంది దీపం వెలిగించడానికి. ఈ నాటి అశాంతి ఆక్రందంలో రేపటి అభ్యుదయం కోసం అగ్నియె మేల్కొంటాను వర్షమె బ్రతుకుతాను యుగసంకేతం 1 చంద్రునిపై సోదర మానవుడు ఆర్మ్ స్ట్రాంగ్ అడుగు మోపిన క్షణం గంతువేసిన యుగ ప్రభాతాన్ని ఒకే ఒక మహా హృదయమై స్పందించిన సర్వ ప్రపంచం బింబించే టి.వి. యంత్రాన్ని. నిరాశను ఎరువుచేసి విశ్వాసం పండిస్తాను. నేనీ యుగ సంగీతాన్ని. నిరాశలో మేల్కొంటాను ఆశతో జయిస్తాను నేనీ యుగ సంకేతాన్ని. నేను మేల్కొని ఉంటాను బ్రతుకులో మార్పుల ఊర్పులతో పయనిస్తూ గాలుల కదలికలో, పగలు మరపు మగతలో రాత్రి ఆరని తెలివితో ఉంటాను. నాపై పగటి ముద్రలు పూర్తిగా వదలవు, రాత్రి. నాపై రాత్రి ముద్రలు పూర్తిగా వదలవు, పగలు. అందుకే అందరిలా సూటిగా కాకపోయినా మీతో మాట్లాడగలుగుతున్నాను. 2 యుగసంకేతం గొంగళి పురుగునుండి సీతాకోకచిలుకవలె రాత్రినుండి అవతరించిన ఉదయం, బలంగా గాలితెర వేస్త ఎక్కడికక్కడ తునాతునకలై పోతుందా అన్నంత సుకుమారంగా ఉన్న ప్రపంచం, ప్రొద్దు ఎక్కినకొద్దీ వేడిమి హెచ్చినకొద్దీ ప్రశంసలు పొంది మొండిఘట మనిపించుకొంటుంది. ఉదయం కావడంతోనే అంతటా సన్నని కన్నీటి తెరవలె కన్పిస్తుంది నాకు మంచుపొర. అంతగా మండే సూర్యుని క్రింద చెమటోడ్చుతూ పరుగెత్తుతూంటే, అంతగా విసరే చలి, వానలో శరీరం ముడుచుకొని పని చేస్తూంటే ఎందరెందరో – నీవు చూస్తున్నావుగా నేనింకా నిదుర పోతూ ఉన్నాను. ఈ నిదుర మృత్యువుకన్న కొంత తేలికైంది, అంతే. ఈ ప్రపంచం మృత్యువుకన్న చాల బరువైంది ఇంతే. పగలంతా ప్రపంచం ఎందుకో సముద్రంలో పడబోతున్నట్లు ఉంటుంది. పగలంతా ప్రపంచం ఎందుకో అగ్నిలో ఆహుతి కానున్నట్లు ఉంటుంది. ప్రతిమూల ప్రతిధ్వని తప్ప ఎక్కడోకాని అసలు ధ్వని వినిపించదు. యుగసంకేతం 3 ప్రతిచోట ప్రతిరూపం తప్ప ఎక్కడోకాని అసలు రూపం కనిపించదు. కాలు పెడితే కంఠదఘ్నంగా కూరుకుపోయే ఇసుక దిబ్బలు. శూన్యంలోకి దృక్కులు ప్రసరిస్తూ కూర్చున్న పెద్ద మనుషుల లాంతరు ముఖాలు, దూర దూరంగా ఇప్పుడివి ఎవరికి కావాలి? మన భుజాల పైనుండి శవాలు నిక్కి చూస్తుంటాయి మన పాదాల వెనకాలే నీడలు నక్కి వస్తుంటాయి. పిచ్చి ఊహలకు రూపాలు చిత్రించి వట్టి మాటలకు అర్థాలు తీసి గ్రుడ్డి చూపులకు అందాలు కల్పించి చెవిటి దొప్పలకు సంగీతం సృజించి ఎంతకాలం ఇలాగా ఎక్కడినుండి ఎక్కడికి పోతున్నామా ఎందుకో ఎవరికీ తెలియదు. అవును మన గమనం నాకు తెలియకపోదు. ఊళ్ళూ, పట్టణాలూ, మైదానాలూ పొలాలు, ఎడారులు, సముద్రాలు దాటి ఇంకా గగనంలో చంద్రుని పైకి ఆపై, ఆపైన–– మన గమనానికి హద్దులు లేవు మన ప్రతిభకు పరిధులు లేనట్లే. 4 యుగసంకేతం మన ప్రవర్తనకు తీరూ తెన్నూ లేదు మన మనస్సుకు రూపం లేనట్లే. ఈ పగటి బ్రతుక్కి వేళ్ళు దన్నుకొని అలవాట్లు ఎంత లోతుగానో పాతుకపోయి ఉన్నాయి. రాత్రి అంతా ప్రపంచం శాంతిని వరించనున్నట్లు అనిపిస్తుంది. రాత్రి అంతా ఎవరో దేనికోసమా అన్వేషిస్తున్నట్లు ఉంటుంది. మానవుడు ప్రసరించవలసిందీ అతడు గమనం సాగించవలసిందీ స్థూల ప్రకృతినుండి సూక్ష్మస్వభావం వరకు వైయక్తిక వలయంనుండి విశ్వాత్మలోకి. నేను తప్పకుండా మేల్కొని ఉంటాను పగటి మగత పోయితీరుతుంది. ఈ భూమి పూలతో పండ్లతో పంటలతో కంటికి నిండుగా ఉండాలనే అందరి ఆశ. ప్రతి మనిషీ ముఖ్యంగా తనలో తాను మేల్కొనవలసిన అవసరమూ ఎంతో ఉంది. చావు నేలలో భయంవలె శత్రుముఖంలో దాపరికంవలె ఆవరించిన నిరాశ జయింపబడుతుంది, ఆశ అగ్నివలె ఉద్వేజితమై. రాత్రి వెనుక కాంతి స్వప్నంవలె మానవుని కన్నీటి తెరల వెనుక అణగిఉన్న ఊహలు, వాంఛలు, యుగసంకేతం 5 భవిష్యత్తులో మొగ్గ తొడిగి వికసించి ఫలరూపం ధరిస్తాయి. ఒక తరంపోయి మరో తరం వస్తూంది. అసహజమైన పగటి భయం పోయి మనస్సు ఆనందరూప మందుకుంటుంది. పగటికలల కవకాశమీయని నవోదయం వెల్లివిరిసిన మనోరూపులు, వసంతం చిగిర్చిన కాలసీమలు, నా ఆశారూపానికి జీవకళలు. వీరి కన్నులలో రెక్కలు విప్పి ముఖంలో పరచుకొనిఉన్న కాలం అమృతం వర్షింప జేస్తుంది. నేను తప్పకుండా మేల్కొనే ఉంటాను. హృదయంతో మాట్లాడే చెట్లు చెట్లు సందేహిస్తున్నవి మా ఇంట్లోకి రావడానికి. కిటికీ ప్రక్కగా వ్రాలి తొంగి తొంగి చూస్తున్నవి. ‘‘నేను ఒక చెట్టునైతే?’’ ‘‘చెట్టునే మనిషిగా మారేస్త?’’ అవును–చిత్రమైన ఊహ, ఒక సమయంలో సహజం. ఎంత కాలంనుండో రాళ్ళు, చెట్లు జంతుకోటితో 6 యుగసంకేతం భూమిపై ఒక భాగస్వామిగా ఆకాశం క్రింద ఒకే కుటుంబంగా పరిణామం చెందుతూన్న నేను వీటికంటే విడిగా మడి గట్టుకొని ఒంటరిగా బుద్ధి కలిగి ఉన్నందుకు నిర్మించుకొని గోడలు వరుసగా ప్రతిష్ఠించుకొని ఊహలు అందులో ఇంతవరకు ఎంతదూరం వెళ్ళాను, పరమపద సోపాన వ్యూహంలో. పైకి పైకి ఎదుగుతూ దూర దూరం విస్తరించి కొమ్మలు తమకు తెలీకుండా మన మనుగడకు గొడుగులవలె మన బ్రతుకుల కంకితమైనవి. నేను బయటికి రాగానే తలలు వంచి చేతులు చాచి ఆహ్వానిస్తూ కన్పిస్తవి ఆప్యాయంగా దేని బ్రతుకు అది బ్రతుకుతూ. మెలకువలో స్వప్నంవెంట పరుగెత్తే మనం, మన కాళ్ళు భూమిపై నడచి పోతాయి. నిదురలో మెలకువతో బ్రతికే చెట్లు, వీటి వ్రేళ్ళు భూమిలో పాతుకొని ఉన్నాయి. నేను వెళ్ళుతాను మెలకువ రహస్యం యుగసంకేతం 7 తెలుసుకునేందుకు హృదయంతో మాట్లాడే కదలలేని ఈ చెట్ల వద్దకు నేనే వెళ్ళుతాను. ఎవరది దూరంగా ఎవరది దూరంగా చెదరిన కేశరాజితో బొప్పికట్టిన ఫాలంతో విసరే వాయుఛురికలకు కందిన కపోలపాళితో దెబ్బతిన్న భుజాలపై మాయని గాయాలతో అడుగులో అడుగు వేస్తూ సాగే గ్రహణం విడువని చంద్రబింబం ఎవరది దూరంగా ఆడినమాట తప్పక మెప్పుకై అవసరమైతే సముద్రంలో దూకి చావడానికైనా వెనుదీయక వచ్చే వరదల్లో కొట్టుకొని పోవడానికీ సిద్ధంగా ఉన్న శాంత సహన భావరూపం తాకితే కాల్చని మణిదీపం ఎవరది దూరంగా. 8 యుగసంకేతం ఆకలి దారిద్ర్యపు టెండలలో కాలుసాగని ఇసుక దిబ్బలపై గమనం సాగిస్తున్న సాహసమతి. నిన్న వేసిన తప్పటడుగు పరిణామం, ఇవాళకైనా తెలిసి రావడం లేదు. గడచిన ఏ ఒక స్థితినీ తిరిగి ఎవడూ కూర్చలేడు ఆఖరికి ఆ భగవంతుడైనా. కాలం ఎవరి చెప్పుచేతలలోనూ ఉండదు. కాలం ఎవరినీ ఎన్నడూ లక్ష్యపెట్టదు. భోజనంవేళ టేబిల్ పైనుండి క్రిందపడి ముక్కలు ముక్కలైన గాజుపాత్రపై ఆశ వదలి క్రొత్తదానికై ప్రయత్నించు. లేనిపోని మమకారం పెంచుకొని పగిలిన గాజుముక్కల నేరి కూర్చుతూ తల వాల్చి, ఆవేదన పడేకన్నా అలౌకిక మేముంది? జీవితంలో. ఇంతకు ఎవరది? జ్ఞాపకం రావడం లేదు. చితికిన సౌందర్య దీపం, తెలివివచ్చి ఊడిన స్వప్నం. గంధం ఇగిరి, వెలుగు తరిగి వర్ణం మాసిన ఊహావలయం. ఎక్కడ చూచానో పూర్వం? గుర్తుకు రావడంలేదు. ఋతువులు వచ్చి పోతూనే ఉన్నవి. దొడ్లలో, బయళ్ళలో, గడ్డిపోచలు ! యుగసంకేతం 9 అక్కడక్కడా ఉద్గమిస్తూన్నవి పూలు. తెల్లవారి పోతూన్నవి బ్రతుకులు. కాలం కదలుతూంది నదివలె. క్రమిస్తున్నవి లిప్తలు తరగలవలె, వయస్సు పైబడి వస్తూనే ఉంది. ఆయువు తరగి పోతూనే ఉంది. ఆకులపై చిగుళ్ళపై పూలపై పండ్లపై ఉదయం ముత్యాల్లా మంచునీటిబొట్లు, సూర్యుడు పైకి ఎక్కి రావడంతో అంతలో ఇగిరి పోతూన్నవి ఎక్కడివక్కడే. అక్కడికక్కడే కన్పిస్తూ ఆర్ద్రత బ్రతుకులో ఎక్కడికక్కడే మాయమౌతూంది అంతలో ఎండలో చలిలో వానలో నిశ్శబ్దంగా నిలచిన రోదసి, ఆత్మనేత్రంవలె తెరచుకొని దాగిన రహస్యానికి సాక్షిగా ఉంది. ఔజ్వల్యం సౌభాగ్యం సంస్కారం పూర్వ చరిత్రలో ఆకాశమంత ఎత్తుగా భవిష్యత్తు యోజనలో స్వప్నమంత సొగసుగా వర్తమానంలో వాస్తవంగా పీడకలగా, బరువు రెప్పలక్రింద అణగిన వెలుగులతో, వెలుగు చూపుల క్రింద దాగిన చీకట్లతో, మెడపై వ్రేలాడు ముఖాలతో మండు టెండల మనస్సులతో చీకటి క్రమ్మిన కన్నులతో మొగిలు మెరపు చూపులతో చెవులు దిబ్బళ్ళు వేయు గోడులతో 10 యుగసంకేతం స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఈ దీపమూర్తి నాశ్రయించిన ఎందరో దౌర్భాగ్య మహాభాగ్యులు. శరీరంలో జీవం ఉంది, మృత్యువూ ఉంది. మనస్సులో దైవత్వమూ, దానవత్వమూ ఉంది. మానవునిలో దానవత తలయెత్తినపుడు ఎవడికి వాడే, ఏ దేశమైతేనేం? వేరువేరు పోతలతో అజ్ఞానరూపాలు. మానవునిలో మానవత చివురెత్తినపుడు ఎవడైతేనేం? ఏ దేశమైతేనేం? అంతా ఒకే ఆకృతిలో చైతన్యశిఖలు. అంతమవని కథ భూమి తిరుగుతున్నది. భూమి పై తిరిగే మనకు దివానిశా రూపాలలో రవి చంద్రుల చలన భ్రాంతి. ప్రపంచం ఆకర్షిస్తున్నది. ప్రపంచంలో బ్రతికే మనపై త్రివర్గ రూపాలలో త్రికరణాధికార ముద్రలు. మనో నేత్రం విప్పి చూడు, ఒక్కసారి శాఖోపశాఖలుగా సంకీర్ణంగా విస్తరించిన మహావృక్షం, ఈ ప్రపంచం. యుగసంకేతం 11 పైన ఎక్కడో పాతుకపోయి అదృశ్యంగా ఉన్నవి దీని వ్రేళ్ళు క్రిందుగా ఆకర్షణీయంగా కిసలయ పత్ర పుష్ప ఫల సంతతి. మొగిళ్ళు చుక్కలు మెరపులు మరపింపజేస ప్రేయారూపాలు. ఆకుల కదలికలో సంగీతం. రంగుల కూర్పులో చిత్రకళ. అవిరళ మాధుర్య సౌందర్యంతో ఆత్మను రసపదవీనదవీయసంగా భ్రమింపజేసి, పరిభ్రమింపజేయు వివర్త కళారూపం. ప్రక్కనే ఇంకా పరిశీలింపదగినవి ముండ్లు పురుగులు త్రుట్టెలు కోకొల్లలు. ప్రాణం, మృత్యువు రెండూ వికాస వినాశ దశలలో ఒకేచోట కలసిఉన్న రూపం. ఆకాశంలోకి చొచ్చిన శిరస్సునుండి క్రిందికి జారిన చీకటి జడలు ఊగిపోవగా గాలికి దిశలలో, తరగలుదరిపడు కడలివలె నిలచిఉంది సనాతన వృక్షం. ఈ చెట్టు కొమ్మలపై ఏండ్లుగా గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నవి పక్షులు. దప్పికగొని పిడుచకట్టిన నాల్కలతో తపిస్తూ నిలచి ఉన్నవీ, చలికి ముడుచుకొన్న శరీరాలతో 12 యుగసంకేతం వణుకుతూ ఒదిగి ఉన్నవీ, వానజల్లుకు తడిసి ముద్దై వెచ్చదనంకోసం వగర్చేవీ, వసంతం వచ్చేవరకు ఆశతో బ్రతికి ఆనందించేవీ, కలలు ప్రోది చేసుకుంటూ బయళ్ళపై రోదసిలో దృష్టి బరేపవీ, బహువిధ స్థితులకు ప్రతీకలుగా. ప్రకృతిలోని అవరోధాలను నిరోధిస్తూ ఘర్షిస్తూ లంఘిస్తూ లొంగుతూ జయిస్తూ జీవనయాత్ర సాగిస్తూంది ప్రాణికోటి. అనుభూతి సమార్ద్రమై హృదయం అనుభవ పరిపక్వమె మనస్సు, అవతరించే ఉదయారుణ రూపంతో మంచు క్రమ్మిన తూరుపు దిశవలె బహుదృశ్య పరంపరలు వహించి, ఏ అనుకుల స్థితికైనా చెట్టునీడ ప్రతిఫలించిన కాసారంవలె తుఫానురాత్రి నెదుర్కొనే మహానదివలె ఎప్పుడూ సర్వసన్నద్ధమే. అడవులు పర్వతాలు నదులు ఎదురై మానవుడు వెనుకాడి నిలచి పోయాడా? యుద్ధాలు క్షామాలు దుఃఖాలు వచ్చినా అతని జీవిత పారంపరి ఆగిపోయేనా? ఈ చెట్టునీడ క్రింద బ్రతుకు తెల్లవార్చే ఓ మనిషీ, ఒక్కసారి అద్దంలో చూచుకో నీ ముఖం ! యుగసంకేతం 13 ఎన్ని మంచు పొరలు ! ఎన్నీ చీకటి తెరలు ! వాటి వెనుకనే ఎందరెందరు దేవతలు ! రాక్షసులు ! వాటి చాటునే ఎన్నెన్ని జంతువులు ! మృగాలు ! ఈ కళ్ళు చెవులు మనస్సు మొదలుగా వారి సేవకులు, వీటి అనుచరులేగా. మనస్సు నావరించిన ముసుగుతోనే మనిషి వ్యక్తిత్వ రూపం ఉంటుంది. ఎన్ని సాహసకృత్యాలు చేయించి ఎన్ని నాగరక రీతులు నిర్మించింది? ఈ ముసుగు లేకపోతే మానవు డే స్థితిలో ఉండేవాడో! శిలగానా? కలగానా? చీకటి ముద్దగానా? వెలుగు గీతగానా? నీలదుకులం కప్పుకొని వస్తుంది రాత్రి. నీలాకాశం వంగిపోయి విశాల పృథ్వీఫాలం చుంబిస్తుంది. చెట్టుక్రింద చీకటిలో కనురెప్పలు వ్రాలి మనస్సు విశ్రాంతి నభిలషిస్తుంది. అపుడు నిదుర, స్వప్నం–– కనురెప్పలు విచ్చి చెట్టుక్రింద వెలుగులో మనస్సు వ్యాపార నిమగ్నమౌతుంది. అపుడు మెలకువ, లౌకికం. బంగరు పూవుల తెల్లని పట్టుశాలువ కప్పుకొని వస్తుంది ఉషస్సు. 14 యుగసంకేతం దిక్కుల కన్నులు చెమ్మగిల్లి మధుపరాగ కింజల్కాలౌతవి చూపులు. అనంత పృథివీ హృదయం జీవకోటిని గుండెకు హత్తుకొంటుంది. అఖండ గగన హృదయం ఆనంద తరంగాలోలమె పరవశిస్తుంది. ఒక్కొక్క లిప్త ఒక్కొక్క దీపంవలె వెలిగి కాలం దీపతోరణమవుతుంది. ఒక్కొక్క లిప్త ఒక్కొక్క పుష్పంవలె వికసించి కాలం పుష్పదామమవుతుంది. ఎప్పటికపుడు క్రొత్తగా చెట్టుకొమ్మలను మేల్కొల్పుతాయి. ఎప్పటికపుడు రాలిన ఆకుల స్థానంలో క్రొత్తవి తలయెత్తి మెదలుతాయి. బయట మంచుపొర తొలగి పోతూంటే లోపల మసకతెర తరలి వస్తూనే ఉంది. రవి శుభ వీక్షణాలు ప్రసరిస్తూనే ఉన్నవి భువి స్వర్ణపథాలందరికీ లభించడం లేదు. ఊహకు చేతకు ఆశకు, ఆశయానికీ సంబంధం చేకూరీ చేకూరకా బ్రతుకు భోగభూమిగా శిల్పఖండంగా, మారడంలోనే లేదు. నిజస్వరూపావగతి, ఓ మనిషీ ! నాగరక సంపన్నంగా సాగిన ఈ వృక్షాన్ని వదలగలవా? నిదురపొరవలె ఆవరించిన ఈ నీడను మరువగలవా? యుగసంకేతం 15 సంస్కృతి, జీవన రూపానికి చిత్రకళ. పరిణామం, సృష్టి అర్థానికి వ్యాఖ్యారూపం— పగలు, రాత్రి అన్న భిన్నముఖాలు ప్రకృతి పొందే పరిణామరూపాలు. నిదుర మెలకువ అన్న స్థితులు మనస్సుపొందే పరివర్తన దశలు. దూసికొని సాగిపోయే గాలితరగలు మలపులు మలగి, తాకే వెలుగు రేఖలు. పగిలిన గాజువస్తువుల ముక్కలు. కదలే మట్టిబొమ్మల నడవడికలు. ఒక టేమిటి? ఈ ఆవరణంలో ఎన్ని ధ్వనులు ! ఎన్ని ప్రతిధ్వనులు ! ఎన్ని రూపాలు ! ఎన్ని ప్రతిరూపాలు ! ఇవి అంకితమైన బ్రతుకులో అహిపలె చుట్టలు చుట్టుకొని పరున్న అహంకారం అట్టడుగున పడిఉన్న ఆత్మ – స్వస్వరూపం ఎరుగగలదా? సంకల్ప వికల్ప శక్తిగల మనిషీ ! నిశ్చయ వివేచన జ్ఞానంగల మనిషీ! అప్పటివరకీ చెట్టునీడ తప్పదు. అప్పటివరకీ స్వప్నచిత్రం అవదు. రెక్కలు దాల్చిన కొండలు వాయువు కదలిక లేక మేఘాలెక్కడివక్కడ స్తంభించి పోతున్నాయి. 16 యుగసంకేతం ఈ ఖండం నిష్పల భూమిగా మారే ప్రమాదం ఎంతోదూరం లేనట్లుంది. అక్కడక్కడా నిలిచి ఉన్న నీరు ఇంకిపోయి ఆవిరి అయిపోగా, ఇంతకాలమూ ఉపయుక్తమౌతూ అడుగుబట్టుతూందిప్పుడు . కృత్రిమమైన రెక్కలతో అమాంతం కొండలెక్కడినుండి ఎక్కడికో ఎగిరి పోతూన్నవి. కళ్ళపై నమ్మకం చావని కొందరు కళ్ళప్పగించి తప్పుక పోచూస్తున్నారు. సంతోషంతో వాటి వెంటబడి కొందరు ఒళ్ళు మరచి అరవులతో గంతులు వేస్తున్నారు. ఆశ్చర్యంతో నిశ్చేష్టులై కోలుకొని కొందరు ఏమీ ఎరుగనట్లు మరోవైపు ముఖం పెట్టి నడుస్తున్నారు. కిచ కిచలతో రుస రుసలతో ఆగడాలకు ఆకతాయి పనులకు దిగుతున్నాయి కోతులు. వీటిని దండించడానికి భయపడుతున్నారు పాలకులు. ఇవి ఆంజనేయుని బంధువులని కాదు సుమా ! డార్విన్ సిద్ధాంతాన్ని అనుసరించి తమ పూర్వీకులేమా అనీ ఊహించవచ్చు. కాని అంతకన్నా బలమైన కారణం ఉంది. మీకు తెలేస ఉండాలి ఈపాటి కది. వీటి నివాసస్థానం ఆ కొండలే అని. తృప్తిగా తిని యథేచ్ఛగా గంతులు వేస్తాయి. అపుడపుడూ ఏదో కారణం పెట్టుకొని యుగసంకేతం 17 మీదపడి రక్కుతాయి, భయపెడతాయి, అంతే. ప్రాణాలు తీసేటంత సాహసమూ, తెలివీ లేకపోలేదు ఈ గలభాకు గాభరాపడి హడావిడిగా పరుగెత్తుకవచ్చి తమ ఉనికిని తెలియజేసే రక్షకులనుండి ఈ పని కొంత జరుగవచ్చు. మరచాను వీటికితోడు ఇంకా తోడేళ్ళూ, నక్కలూ ఎన్నో ఉన్నాయి అవి ప్రజల బ్రతుకును చీల్చి పిప్పి చేసిగాని వదలవు. వాటి ఊహను సరిగ్గా ఉపమేస్త ‘‘నల్లబజారు’’ వాటి ఎత్తులు పోకడలు చెప్పాలంటే చదరంగాలు వైకుంఠపాళీలు ఆనవు. కూర్పు విన్యాస ప్రదర్శనలలో పోటీపడుతూ కొండల మెండు రూపాల చిత్రణలతో వాతావరణం గురించి సూచనలూ వర్షాలపై వ్యాసాలు పరంపరగా వెలువడుతూన్నవి. వర్షఫలం కోసం మాటిమాటికీ బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడు, సామాన్యుడు బరువు రెప్పలెత్తి, జలమాక్తికాలు విడిచి, అడుగులు వేస్తున్నాడు లోనికి. పెద్ద పెద్ద కుటుంబాలలోని ఇంటి పెద్దలే కొడుకులపై నమ్మకం నశించి, ముందుగా ఎవరి కర్మలు వారే చేసుకుంటున్నారు. తండ్రులపై అభిమానం చచ్చిన కొడుకులు ఎవరికైనా పైంపకం పోవడానికి సిద్ధమౌతున్నారు. 18 యుగసంకేతం ఇదంతా ఎవరికి కావాలి కందకులేని దురద చేమకు పట్టినట్లు జీవంగల చెట్లకు గమనంగల నదులకు చైతన్యంగల మనసులకే నేమా? చెట్లలో పచ్చదనం మాయమౌతున్నది. నదులలో తరగలు అణగిపోతున్నవి. ప్రస్తుతం మేఘాల స్థానంలో ఎగురుతూన్నవి రెక్కలు దాల్చిన కొండలు. ఆఖరికి దేవుడైనా సరే! చినుకు పడింది సముద్రంలో దాని లోతు తెలుసుకునే కోరిక కలిగింది. జలధిలోని ఉప్పైన సహించలేకపోయింది. గాలి విసరుకు నిల్వలేనిదయింది. కోరిక గాలికి వదలి బయటికి రావాలని సతమతమె చివరకు కలిసింది సముద్రంలో. గ్రీష్మం వచ్చింది అర్చావప్నులతో జలబిందువు లావిరులైనవి. యుగసంకేతం 19 మారింది కరాళ ఋతువు వచ్చింది ప్రమీల ఋతువు. చినుకు పడింది సముద్రంలో దానిలోతు తెలుసుకునే కోరిక కలిగింది. మార్పులో నశించిన జ్ఞప్తి తిరిగి ఊర్పు తీసికొనేనా? మార్పు నాపగలిగేనా? ఆఖరికి దేవుడైనా సరే ! ఈ గీతం స్వాగతం పలికి మీకు ఈ వేదిక నలంకరించిన తరుణ మనస్కులు! ఉత్సాహకళికలు! మనో భూమికలలోని రహస్య గవేషణమతులు ! భౌతిక జగత్తులోని పరిణామ విచారణ చణులు! ఈ గీతం వినిపిస్తున్నాను. గతంలోని ఔజ్వల్యం వర్తమాన వాస్తవికత భవిష్యత్తు స్వప్నవలయం చింతనలో, అనుభూతిలో అదివసించి ఆకారం దాల్చిన 20 యుగసంకేతం కళారూపం ఈ గీతం ! నేనెందుకు వినిపిస్తున్నాను? అపశకునపుటూళలు, ఉద్రేకపుటరుపులు, గుండ్రాళ్ళ దొర్లింతలు, గులకరాళ్ళ కలవరింతలు, ముళ్ళకంపల ఈడ్పులు, నిదురలో కలవరింతలు, సుడిగుండాల తిరుగుళ్ళు, ఆవలింతలు త్రేన్పులు ఒకటేమిటి ? ఈలాంటివి శబ్దించే ముఖయంత్రాలను నియంత్రించడానికి. అవి ఇష్టంలేనివారి కొక వేదిక కల్పించి అవి నిదురలో వినేవారిని మేల్కొల్పదలచి ఈ గీతం వినిపిస్తున్నాను. చైతన్య జగత్తుకు అవరోధంగా మృత్యువు ఎప్పుడూ ఎదురై ఉంటుంది. భీజనాశనంనుండి మొక్క పుష్పపతనం నుండి ఫలరూపం తమస్సునుండి ఉష ఆగమనం, సహజం. వస్తువు ఒక రూపం పోయి, మరొక రూపం ధరిస్తూ ఉంటుంది. మార్పు నడిమి కాలమే మృత్యువు. శవాలను తగులబెట్టిన శ్మశానాలు. శవాలను పాతిపెట్టిన భూస్థలాలు భౌతిక రూపాల గొప్పమార్పుకు స్థానాలు. ఆనందానికి దుఃఖానికి ప్రతీకలైన జీవనం, మృత్యువు నిరంతర సృష్టికి ఇరుపార్శ్వాలు. ఈ పరిణామ పరంపరారూపం ఒక దశలో మృత్యువుగా ఎదురౌతూంది. యుగసంకేతం 21 ఇది మార్పు రూపాలలో ఒకటిగా ప్రచారిస్తున్నది లోకాన్ని, ఒకవిధంగా చెబితే మృత్యువు గతం యొక్క వర్తమాన రూపం. అయితే వెలుగు ఊహరాని చీకటి బొయ్యారం, కాదు గతం. రోజూ రాత్రి గర్భంలోకి నన్ను ప్రవేశింపజేయ చూస్తుంది, మృత్యువు. నేను లోనికి వెళ్లి నిదురపోయి స్వప్నచిత్రాలు తిలకించి ఉదయం మేల్కొని బయటికి వస్తాను. అప్పటివరకే తరుమబడి చీకటిలోయలో దాగి ఉంటుంది. ఇంతమాత్రానికే భయపడి, మృత్యువు పేరు విని సామాన్యులు సగం చచ్చిన బ్రతుకు గడుపుతారు. ఓ మృత్యురూపమా ? చీకటిచిమ్ము గతకాలమా! ఒక విషయం చెప్పాలి నీతో నా కాళ్ళు నేలలో పాతుకొని ఉన్నాయి. నా హృదయం భూమి గుండెకు హత్తుకొని ఉంది. ఈ భూమి ఎంతో ఆర్ద్రమైంది. ఎప్పటికైనా ఇంత స్థానమిచ్చి తనలో లీనం చేసుకొనేది, ఆకాశంపై విశ్వాసమూ లేకపోలేదు. నాకు తెలుసు బ్రతుకులో మధ్య దారిలోనే, తొండవలె వేచిఉండి గ్రసింప జూస్తున్నావని. 22 యుగసంకేతం నేను నిన్ను ఎలా తృప్తిపరచగలను? ఇది నీ దురదృష్టం కాక మరేమిటి? ప్రస్తుతం వినిపిస్తున్న దానికి అడ్డురాకుండా ఉంటే అంతే చాలు ! ప్రక్కనే చేరి రాతిబండలు దొర్లించకు. ‘‘ఇదేమంటే నా పని నేను చేసుకుంటున్నా’’ నని ఏవో కుంటి కొంటె సాకులు వినిపించకు. ఎందరినో కష్ట పెట్టడానికి వేసిన ఎత్తు కాదిది. ఎవరినో సంతోష పెట్టడానికి కనిపెట్టిన చిట్కా కాదిది. శిశిరం వస్తుంది నీ ప్రభావంతో తరువాత వచ్చేది వసంతం అని మరవకు. రాత్రి వస్తుంది, నిదుర ఆవరిస్తుంది, నిజమే. ఉదయమవుతుంది, మేల్కొనడమూ జరుగుతుంది. ఈ చక్రనేమిక్రమణ నిరంతరగతులు ఎవరి కనుకులంగా వారన్వయించుకోవచ్చు. నాకు తెలుసు మృత్యువు నా చెప్పుచేతల్లో లేదని. నాకు తెలుసు మృత్యువు శాశ్వతము, స్వతంత్రము కాదని. శాశ్వతము స్వతంత్రము అనంతము ఐన చైతన్యపుటంశనని నాకు తెలుసు. అలా విరుచుకపడుతా వెందుకు? సముద్రంపై అగ్నివర్షంవలె. అద్దాలవంటి నా కనుచూపులలో నీ రూపం ప్రతిఫలిస్తూనే ఉంది. ఆకాశంవలె విచ్చిన చెవిలో నీ గమనం శబ్దిస్తూనే ఉంది. యుగసంకేతం 23 రోదసివలె నిలచిన మనస్సులో ఊహలు గాలుల వలె అనుభవింప జేస్తూనే ఉన్నవి. ఊడలు దిగిన మర్రి చెట్టువలె ఏ మాత్రమూ కదలవేం ? కలలో జడలు రేగిన పెనుభూతంవలె అంతలో రూపుమారి పోయావేం ? ‘‘గుడ్ మార్నింగ్’’ అంటూ వచ్చి ‘‘గుడ్ బై ’’ చెప్పకుండానే వెళ్ళవచ్చు. ఒక్క గాలి తెర వేస్త గొప్పతనం తెలియవచ్చే సముద్రం, నా కంటికి చిక్కని హాస్యపు నురుగుతోనున్న మాటల తరగలతో ప్రపంచ నాటకశాలలోని గొప్ప హాస్యపాత్రవలె కన్పిస్తాడు. నీ తలపుల తలుపులు మూసి ఆటకట్టి వెళ్లిపోతూ పోతూ నాపై చేప ప్రేమ ఏముంది ? ఒక గులాభీ పుష్పం నా శిరస్సుపై ఉంచుతున్నావు. చుట్టూవున్న కంటకాలు గ్రుచ్చుకుంటా యన్న ఊహతోనేనా ? అడవిలో క్రూరకిరాతక చర్యకు బలియైన, ముగ్ధ ముగ్ధంగా కాలాన్ని కత్తిరిస్తూ ఎగిరే హరిణ శాబకం నెత్తురుతో ఈ గీతం వ్రాస్తున్నాను. 24 యుగసంకేతం వనంలో, విపరీతపు గాలిచే విశీర్ణమైన, సౌందర్య పరిమళభరితమై కాలాన్ని మరపించే పూవుల మధుపరాగ రేఖలతో ఈ గీతం చిత్రిస్తున్నాను. తల్లి కలల కానందరూపం కల్పిస్తూ బ్రతికి బట్టకట్టి కాలాన్ని జయింప నెంచే శిశువు హృదయ రూపంతో ఈ గీతం స్పందింప జేస్తున్నాను. వర్షధారలు భూమి పై విలీనమానట్లు గాలిపిల్లలు దిశల చెరగులలో దాగినట్లు వెలుగు కత్తులు రోదసి గుండెలో చొచ్చినట్లు శబ్దరేఖలు గగనవీధి పరుగు తీసినట్లు, నా మాటలు–మనస్సులో పొరలు దాటి అంతరాత్మలో అర్థవంతాలై మానవ జీవన వ్యూహంలో అమృత కాంతి వర్షంతో నవనవోన్మేష సృజనాకృతి; ఆనందం నదింపజేస అనుభవం స్పందింపజేస, సహృదయ మనఃప్రీతి పరమ నవతా గీతం ఆవిష్కరిస్తున్నాను. అంతమవని రాత్రి శవాలు లేచి తిరగడ మారంభించాయి. ఆత్మలు ముడుచుకొని పడుక్కున్నాయి. యుగసంకేతం 25 రాత్రి సాంతమవుతుందని శుభవార్త శూన్య భాండంలో మధుబిందువు పడినట్లు సముద్రంలో చూపుమేర నావ కన్పడినట్లు హఠాత్తుగా ఊడిపడింది ఆశాకిరణం. గాలికి రాలే ఆకులవలె ఊహలు సాగిపోతున్నవి. ఎవరో అమృతమూర్తికోసం నిరీక్షణ. ‘‘ఎవరు వచ్చే సమయమిది?’’ అని నిరాశ. ‘‘ఎవరో వచ్చి ఇంత ధైర్యమిస్తారని’’ తృప్తి. ఆ వచ్చేది ఎవరు? శవాల సోదరులు, నీడలు ! పగిలిన అద్దం ముక్కలవలె స్వప్నాలు చెదరి పోయాయి. ఇందులో ఏ రూపరేఖ స్పష్టంగా కన్పించడం లేదు. నిదురవేస్త హాయిగానే ఉంటుంది. ప్రపంచాన్ని మరచిపోవచ్చుగా. చావు మెలకువ రూపమైన గతానికి చాల దగ్గరి బంధువు, మరపు. ఉదయంకన్నా ముందుగా శవాలు లేచాయి. నేను నవ్వి ఊరుకునేకన్న చేసదేముంది? ఉదాసీనత నా స్వభావమన్నట్లుంది. ఓరిమి నాకు గీటురాయివలె ఉంది. కనులు మూసినా జీవి హృదయం స్పందిస్తూంటుంది. అనుభూతి విడువకుండా సరిస్తూనే ఉంటుంది. ఈ మహా జగత్తులో మానవుని రూపమెంత? అయినా అతని ఊహాధీనంలోనిదే సర్వమూ. 26 యుగసంకేతం విచ్చిన అసంఖ్యాక తారకలనుండి జారి వెలుగులు శరీరాలు తాకి ప్రవహిస్తూన్నాయి. నాటకరంగంపై యవనికవలె మృత్యువు, దీని వెనుకనే బ్రతుకుతూంది జీవితం. ఈ ప్రపంచం నాదై నాది కాదన్నట్లుంది. దీపపు వెలుగులో కొంత భాగం ఉంది. దీపపు నీడలో కొంత భాగం ఉంది. ఉన్న ఒక్క సత్యం – సూర్యుడు ఆశలలోనే పాతివేయబడి ఉన్న ఒక్క కాలం – చైతన్యం మరపులోనే బంధించబడి ఉన్న ఒక్క ఆనందం–ఉషస్సు చీకటి తెర వెనుకనే ఉంది. మానవత వధ్యశిలపై ఉన్నా మానవ హృదయంపై నమ్మకముంది. మానవ వివేకంపై ప్రత్యయముంది. అందుకే ఇంకా బ్రతికి ఉన్నాను. అంధకారంలో కన్పించనివి వెలుగులో దర్శనమిస్తాయి. క్రొత్త ఎక్కడ ఉంది? వెలుగు చూపులో తప్ప ! మానవత ఎక్కడ ఉంది ? అనుభూతి భావనలో తప్ప ! ఎవడికి వాడే మేల్కొని ఉన్నట్లు ప్రక్కవారిని ప్రబోధిస్తున్నాడు. మానవుడెప్పుడు మేల్కొనడం జరిగేను? మనస్సు ఎప్పుడు ఉషస్సు నెరుగుతుంది? యుగసంకేతం 27 ఆత్మలు ముడుచుకొని పడుక్కున్నాయి. శవాలు లేచి తిరగడ మారంభించాయి. భగవంతుడు విడిది చేసిన లిప్త ఆకాశంనుండి భూమివరకు నిశ్శబ్దం నిలచి ఉంది స్తంభంవలె. అమూల్యనిధి పోగొట్టుకొన్న ముఖంవలె ఉంది వాతావరణం. వ్రాలిన బరువు హృదయంతో తెరచిన ఆశానేత్రాలతో కాలం ఒడిలో పడుకొని మృత్యురూపం బింబిస్తోంది రాత్రి నీల సముద్ర తరంగంవలె ఎదురౌతున్నది ప్రతిక్షణం. రేకులు విచ్చనున్న పూలు మాన శిఖలవలె నున్నవి. దుఃఖం ప్రవహిస్తున్నది జీవనదివలె. సుఖం బిగిసి ఉంది మంచుగడ్డవలె. పెదవులపై కొడిగట్టినవి నవ్వు దివ్వెలు. ముఖంపై క్రమ్మికొన్నది నీడకప్పు. చేతులలో సత్తువ ఉడిగిపోతున్నది. పెదవులుదాటి శబ్దం పైకలడం లేదు. కనులలోని వెలుగు ఆరిపోతున్నది. ముక్కులోని ఆవి ఆగిపోతున్నది. 28 యుగసంకేతం సన్నని వస్త్రంవలె వ్యాపించి గాలి శరీరాన్ని కప్పుతూంది. ఊహలో తిష వేసుకొని బ్రతుకును పాలిస్తోంది రాత్రి. జీవన సముద్రంలో ప్రయాణికులకు దారి చూపుతూంది మృత్యు దీపం. కొన ఊపిరితో నున్న ఈ రోజు కనులలో ప్రాణం నిలుపుకొని ఉంది. ఈ చీకటి దారులలో ఈ విషాదచ్ఛాయలలో నలుగురితోపాటు తిరిగి తిరిగి పగిలిన గాజుబొమ్మల ముక్కలు రంగు రంగుల అందమైన రాళ్ళు ఏరుకొని ఒడి నింపుకొని, చుక్కలు విరిసిన చీకటిచెట్టుక్రింద అలసి సొలసి ఇంత సేపు విశ్రమించిన నా ఫాల నేత్ర కపోలాధరాలు వెలుగు వ్రేళ్ళు సాచి స్పృశిస్తూ పరవశింపజేస అమృతమూర్తి ! ఎవరీ మానదీపం ? రాత్రి ఎదపై జ్యోత్స్నాకృతి. మనో భూమికలో జ్యోతిర్మతి. జడ ప్రకృతి అణువణువు పులకరిస్తున్నది. చైతన్యం శివగంగవలె చెంగలిస్తున్నది. గ్రీష్మకాల మృగతృష్ణ లంతరించి వర్షచ్ఛాయ లలముకుంటున్నవి. ఉదాసీనత క్రమ్మిన సాయం సంధ్యాకాశం నుండి యుగసంకేతం 29 దిగివచ్చి నిటారుగా నా ఎదుట నిలచిన రాత్రి నిశ్శబ్దంగా కరగి పోతున్నది. ఇది కలకాదు కదా ! ఎవరి మాటో అలా ఉంచి నేనే నా రూపం గుర్తించ లేనట్లున్నది. అమృత సరస్సులవంటి ఆ కన్నులలో మరణ సూచికలవంటి నా చూపులు ప్రసరించి కలసి పోయినపుడు ప్రళయం వచ్చి పడిందనుకున్నా. కాని సుగమ సుందరంగా అవతరించింది మరో సృష్టి. ఇంతకు ఎవరీ మానదీపం ? భగవంతుడు విడిది చేసిన లిప్త ఇది. కాలం గురించి మాట్లాడకు కాలం గురించి మాట్లాడకు దానిచావు దాన్ని చావనీ. తలిస్తే చాలు తలుపులు తెరచుకొని వచ్చేస్తుంది. పిలేస్త చాలు పీట వేసికొని కూర్చుంటుంది. కాలం గురించి యాచించకు దాని దారిన దాన్ని పోనీ. 30 యుగసంకేతం కాలం మాన శంఖం దీన్ని ఊదినపుడు అవతరించిన ధ్వని ఈ మాట, ఈ పాట. మాట ఊహకు ప్రతీక పాట అనుభూతి మరీచిక. మాట ఉందే చివురాకు మాట ఉందే పదునైన కత్తి. ఇంకా ఎంతైనా చెప్పొచ్చు మాటను గురించి మాటల్లో. మాట చెప్పలేనిదాన్ని ఒక విధంగా నిశ్శబ్దం సమగ్రంగా చెబుతుంది. అయితే నిశ్శబ్దం కరువైంది. జ్ఞానానికి దూరంగా విజ్ఞానానికి దగ్గరగా, తన చుట్టూతాను తిరుగుతూన్న లౌకిక జీవిత వలయం. ప్రవర్తనలో పరిణామ రీతితో గడిపే మనిషి, ఊహలలో వివర్తవాదంతో బ్రతికే మనిషి, కాలానికంతం వూహించ లేనట్లే జీవితానికీ స్థిరరూపం కన్పించదు. అనుభవాలు కరగిపోతున్నవి అనుభూతులు వెలిగి పోతున్నవి. అర్థరహితంగా పరచుకొన్న ఆకాశంలో యుగసంకేతం 31 అర్థ సహితంగా వెలుగుతున్నాడు చంద్రుడు. కాలం గురించి మాట మరచి ఈ వేళ నిశ్శబ్దంగా, చీకటితో పోరాడే వెన్నెలగురించి ఆలోచిద్దాం. కాలం గురించి మాట్లాడకు దాని చావు దాన్ని చావనీ. ఎవరి దారి వారిది సాయంవేళ సాగించా నడక వివిధ వాహన జన సంకుల వీధులు గడచి మేడలు మిద్దెలు గుడిసైలు దాటి వూరి పొలిమేరలో నిలచి చూచా, వెనుకకు. మబ్బుక్రమ్మి మారిన నలుపు వెలుగులో ముసుగుదన్ని మత్తుగా పడుకున్నట్లుంది నా చూపుకి ఊరు. మరలి ముందుకు నడచా. నా వెంటా, చూపుమేరలోనూ ఎవరూ మచ్చుకైనా లేరు. ఎక్కడా మాటా ముచ్చటా లేదు. అయినా నాలో ఎందరో మనుషులు మసలుతున్నారు అయినా నాలో ఎందరివో మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాను 32 యుగసంకేతం అంతా బట్టబయలు, మైదానం అక్కడక్కడా కొండలు, చెట్లు, చెరువులు. ఇంతలో విరుచుక పడింది గాలి హళాహళిగా, తూగిపడింది మబ్బు పైళపైళగా, వచ్చిపడింది వాన జర జరగా, ద్యావా పృథివీ ప్రియంగా. విశ్వసౌధంలోని క్రింది అంతస్తులో అల్లరి పిల్లలు చిందులు త్రొక్కుతూ కసరి విసరి వస్తుసముదాయం నేలకు కొడుతూ, గంతులు వేస్తూ, నవ్వుతూ ప్రేలుతూన్నట్లుంది. పై అంతస్తు ఆకాశంలోని మబ్బులు తమతో రమ్మనే మెరపుసైగ కన్పిస్తూంది. అక్కడికి పోకుండా ఇక్కడే ఉండిపోయా. ఆకాశంపై నిర్లక్ష్యంతోగాక భూమితో త్రెంచరాని బంధంతో. వర్షం సన్నబడింది. అగ్గి ఆరిపోవడం అంతమై చలి ప్రాకడం మొదలైంది. అంతటా పరిణామం, మరోస్థితికి పరివర్తితమౌతూంది ప్రకృతి. ఒక్క గాలి విసరుకు చెట్ల ఆకులు డుల్లినాయి. ఒక్క మబ్బు విదల్పుకు చెట్ల కోర్కెలు చిగిర్చాయి. రాతిబొమ్మనై ఉన్నవాడిని మనిషి రూపంలోకి వచ్చి యుగసంకేతం 33 అడ్డుపడిన కొండలు నదులు దాటి మునుముందుకు సాగిపోయా. చూస్తూ చూస్తూ ఉండగనే చుట్టూ చుట్టలు చుట్టుకొని అహివలె పడిఉన్న చీకటి తోకపై లేచి నిలచింది. నా కాలినడక చప్పుడుకు నిదురపోతున్న ఊళ్ళుకనే, నడచి వస్తూన్న మేఘపంక్తుల కలలు చెదరి పోతూన్నవి. రేకులు వీడి నిలచిన పద్మకర్ణికవలె ఉంది ఆకాశం. అలలు అణగి మణగిన సముద్రంవలె ఉంది మనస్సు. ఇంతలో వెలుగులు కురుస్తూ ఉదయ మేఘం పొడసూపింది, ఆశావేదిక, రోదసీ సీమలో. కొన్ని వికసన్ముఖపద్మాలు కొన్ని విచలత్ జీవరేఖలు ప్రయాణంలో తారసిల్లాయి. ఈ ప్రదేశంనుండి మూడు నాలుగు దారులు చీలిపోతాయి. క్షమించాలి ఈ దారులన్నిటా అంతమందీ ఒకేమారు ఎలా అనించగలరు ? అందరూ ఒకేదారి ఎన్నుకోనూ లేదు. నామార్గం నాది ఎవరి మార్గం వారిది. 34 యుగసంకేతం కొంతదూరం నడిచాక కన్పించాయి పూర్వం వలెనే ఏవో గుడిసైలు, మిద్దెలు, మేడలు. మొదటనే దూరంగా కన్పించింది మబ్బు తీవెలు నింగిలోకి ప్రాకిస్తూ నిటారుగా నిలచిన ఫ్యాక్టరీ గొట్టాలు. తరువాత ఇంటిముందు పందిరిపైకి ప్రాకి మొగ్గ తొడిగి తులకరించు పూల తీగెలు. కిటికీలనుండి కన్పించినవి తిరుగుతూన్న రంగు వెలుగు బొమ్మలు. ఈ ఊరు ఎప్పుడో చూచినట్లుంది. అవును, ఈ జన్మలోనే. ఇది భూమి గుండ్రంగా ఉందని బూజువుపరచే ప్రయత్నం కాదు. అంతస్తత్వంలోని వైవిధ్యం సామరస్యం మానవ ప్రగతికి పరమం, అనుభూతి పొందే శక్తి ప్రసారం వేరు. మనస్తత్వం కలిగే రూపం, గమనం వేరు. ఈ పురిలోకి ప్రవేశించి ఇచ్చట వీచే గాలి పీల్చి ఇచ్చట దొరికే నీరు త్రావి అనుభవ వైవిధ్యంతో అనుభూతి ప్రమాణంతో బహుముఖ వ్యక్తిత్వంతో ఇచ్చట కదలే వ్యక్తిలో పరిణామం జీవసహజం. యుగసంకేతం 35 అంతంకాని నాటకం ప్రొద్దు పొడిచాకా మలపడం మరచిన వీధి దీపాలు చంద్రుని ఫోర్జరీ సంతకంలోని అక్షరాలవలె వెలుగుతూన్నవి. సౌందర్యకళాముగ్ధంగా ఆలోచనా కిర్మీర లలితంగా పొందికగా అమర్చి ఉంది గది. నింగిలో ఉదయం చుక్కలవలె ప్రక్క పై నలగి వాడిన పూలు. బైటినుండి ఒక ప్రక్క కిటికీ చువ్వలకు ప్రాకి లోనికి ఓసరిలిన పూల తీవెలు ! సగం ముడుచుకొన్న పూలు. సగం విరిసిన మొగ్గలు. గదిరూపం వాతావరణం ప్రస్తుత రంగం స్థితి ఇది. ఋతు దృశ్యాలు సంవత్సరాంకాలతో నడుస్తున్నది జీవిత నాటకం. మరోప్రక్క వికసించిన మందారం చుట్టూ తిరిగింది తుమ్మెద. రేకుల తలుపులు తెరచుకొన్నవి. తలపు రెక్కలు విప్పారినవి. తుమ్మెద ప్రవేశించింది. ఇంతలో గదిలోని వెలుగు వంపులు లేగులాభీనుండి తెలుపులోకి దిగి అంతలో బూది రంగులోకి మారాయి. 36 యుగసంకేతం ఎందుకో అతని ముఖంలో నీడ గూడు కట్టుకుంటున్నది. నగర ప్రధాన మార్గంలో జనవాహన గమనధ్వని ధారాసారంగా వర్షం ఊడిపడింది. వానపొరలు చీల్చుకుంటూ తుమ్మెద లేచింది. ఈ వర్షం దీని పాలిట శత్రువైంది. తుమ్మెద రాకడ రేకులకు విప్పు కలిగించింది. కాని దాని పోకడ వాటిని మూయలేదు. అంతలో వెలిసింది వాన. దిశాళి క్రమ్మింది ఎండ. మరో వింత ఘటన ! ఆ తుమ్మెదతోపాటు నా మనస్సు నాలుగు దిక్కులమధ్య వ్రేలాడింది. సాంధ్యవేళ ఆ గది నిప్పంటుకున్న రీతి జ్వాలామాలా ప్రచాలనంతో జూలు విదల్చి లంఘించనున్న సింహంవలె ఉంది. ఆకాశాన హరివిల్లు విరేస ఉందా? అందమైన ఇల్లు శూన్యంలో మిగిలేనా ? చుట్టూ ఎవరెవరో మూగారు జనం సందడి ఎక్కువైంది. కన్నెత్తి చూడకుండా ఎవరినీ యుగసంకేతం 37 ముందుకు నడచాడతడు, హఠాత్తుగా కంటిముందలముకొన్న మసక చీకటిపొరలు చీల్చుకుంటూ. ఎదపై వ్రాలిన ఉషస్సు, ఒరుగువలె కులిపోయి, పాదాలు పట్టుకొని వెనకాల అనుసరిస్తూంది నీడని. అపుడు తెలిసిందతనికి తాను నిలచిన నేల తిరుగుతూన్న గోళమని. సూర్యుని శవంపై నిల్చున్నట్లున్నవి కాళ్ళు. చంద్రుని రూపం అవతరించినట్లుంది మనస్సు. నక్షత్ర గోళాలు తిరుగుతున్నవి కళ్ళలో. హిమశిలవలె ఘనీభవించింది బుద్ధి. కాలం ఆగిపోయిందా? అతనికేమీ జ్ఞాపకం లేదు. ఇపుడు మాత్రం రాత్రి బోనులో ఇనుప చీకటి కమ్ములపై ఎదవాల్చి నిల్చొని ఉన్నాడు. జగచ్చక్షువు న్యాయమూర్తి ఇచ్చే తీర్పు—శిక్ష–తో ఈ నాటకం ముగుస్తుందని సామాజికుల అభిప్రాయం. కాని అతనికి స్వేచ్ఛ దొరకంది నాటకమేలా ముగుస్తుంది? 38 యుగసంకేతం అతడే స్వయంగా మృత్యువు తెరవేసి నాటకం అంతం చేయాలనుకున్నాడు. ఏమైనా గడచిన కాలం మరల చేకురేనా ? చెదరిన బ్రతుకు పూర్వరూపం దాల్చేనా ? ఆ నీడ ఉషస్సుగా మారేనా ? ఎదపై ప్రేమతో వ్రాలేనా ? ఈ నిర్బంధంతో అందుకుంది మరో రంగం. అతనికి స్వేచ్ఛ లభించేవరకు నాటకం సాగుతూన్నట్లే. గాఢమైన మనోవేదన సూక్ష్మమైన అనుభూతిలో పలికే స్వరలహరి వినలేనిది తన్మరూభవన యోగ్యత ఎక్కడిది ? ఈ సామాజికులందరూ అశ్మకుడ్య సన్నిభులే ఐతే నాటకమే ఆరంభం కాలేదు. ఆరని తెలివి నీటిలో మునిగాక నీవు ఎవరో తెలియదు నాకు ఎప్పుడూ రాత్రి ప్రొద్దుపోయే వస్తావు. అప్పటికి నేను పడుకుంటాను. నీ అడుగుల చప్పుడు వినిపిస్తుంది. యుగసంకేతం 39 విని విని ఇప్పటికెంతగా అలవాటైంది ? ఇది వినని రోజున నిదుర పట్టదు. నేను లేచీ లేవకముందే, ఉదయం నీవు వెళ్ళిపోతావు. తెరచిన కిటికీనుండి వెతికే కళ్ళకు నీ ముఖం కన్పించదు. ఏదో పని ఉన్నట్లుగా పరుగెత్తి నీకు ముందుగా నడచి మరలి నీ ముఖం చూడాలనిపిస్తుంది రోజూ. ఇంతకు కదలే ఓపికా లేదు. ఇక పరుగెత్తడం కలలోనే ! నేను లేచి ఉన్నపుడు ముఖ్యంగా పగలంతా దానిమధ్య అంతరాయం మేఘంవలె ఆవరించి, శూన్య హృదయంలో అనురాగపు మెరపులతో ఏదో అలౌకికానుభూతి అనిదంపూర్వంగా కలిగిస్తుంది. నేను పడుకోగానే దొంగా ! తెలిసినట్లు నగ్నమతివై ప్రవేశించి నేను మేల్కొనగానే, ఏమీ తెలియనట్లు గడసరి వేషంతో వెళ్ళిపోతావు. ఇప్పుడు తెలిసింది నీ ముఖం చూడనిక. అవును లీలగా గుర్తుకు వస్తున్నది, విస్మృతమె అట్టడుగున పడిఉన్నది. 40 యుగసంకేతం నీ అడుగుల చప్పుడు, దగ్గరైనకొద్దీ, రాత్రి శరీరం మొగిలు ఉడుపుల్లో మసలుతుంది. మనస్సు రెక్కలు విచ్చి ఎక్కడికో తేలిపోతుంది. నా ముఖం ! ఏమి జ్ఞాపకముంటుంది ? ఆరని తెలివి నీటిలో మునిగాక. విత్ రిగ్రెట్స్ అద్దంముందు నిల్చిన ఆమెచుట్టూ నీడలు సముద్రంలో దారి తప్పి తారాడు పడవవలె. ఆమె ఉన్నంత సేపూ దూరంగా ఉంటాయి, దృష్టిపడని స్థితిలో లేనట్లే అణగి ఉంటాయి. అద్దంలో ఆమె ముఖం చూస్తూ ఉండిపోవాలని వాటి తీరని కోరిక. కాసారంలో ప్రతిఫలించిన చంద్రబింబం ఆ ముఖం తాకజాలని మబ్బు తునకలు తొంగిచూచే నీడ గుంపులు. యుగసంకేతం 41 ఆ ముఖం ప్రతిబింబించగనే ఒకదానిపై ఒకటి చొచ్చుకొని అద్దంముందు చేరుతాయి ఏదీ ముఖం సరిగా చూచుకోదు ఆ ముఖం ప్రక్కకు త్రిప్పగనే ఏదో పోగొట్టుకున్నట్లవుతాయి. ఇంతకు ముఖం చూచుకోవడం చేతకాదంటే సరేనా ? ఇవి ఎలా చేస్తనేం గాని కోతులకు మల్లే వీటి ఆతురత కీచులాటలో అద్దం పగిలిపోతుందని నా అనవసరపు భయం. దీనితోపాటు నాలో కొంత నవ్వూ కలుగక పోలేదు. అద్దంముందు నిల్చిన ఆమె ఎవరు? తెలియదు? అంత సేపు కిటికీ ప్రక్కనున్న అతడెవరు? తెలియదు. ఆ ముఖంకన్న ఆతనికి ప్రతిబింబమే ఇష్టంలాగుంది. ఆమె ముఖం, అమ్మయ్యా ? అతనికి అగ్నిగోళం ! ప్రాణం లేచిపోదూ ? శరీరం బూడిద కాదూ ? ఆ ముఖంకన్న అందుకే అతనికి ప్రతిబింబం ఇష్టం. ఏ భయమూ లేకుండా భద్రంగా ఉండవచ్చు. 42 యుగసంకేతం ఈ సశేషమైన కథ చేస్త నాకనిపించింది సందేహంగా ఆమె యజమాని కావచ్చునని. ఆమె అతని చూచింది కాని అస్తిత్వం గణించినట్లే లేదు. భయం నిండిన అతని కోరికలు ఆ స్థితిలో దీపం ప్రక్కని నీడలు. తరువాత కొన్నాళ్ళకు సందేహం తీరింది. ( కథ సశేషంగానే ఉంది. ఉన్నచోటునే) చిన్నిమార్పు–ఏమంటే ‘‘ అతడు బాస్ ’’ అని – విత్ రిగ్రెట్స్. మిగిలిన కోరిక చెదరిన వెంట్రుకలు పైకి దువ్వుతూంది రాత్రి. అరచేతిలో స్వప్నం చూపిస్తున్నాడు చంద్రుడు. గాలి వినిపించే సంగీతం కాదనలేని చెట్లు తలలూపుతున్నాయి. ఔననలేని గుట్టలు నిశ్చలంగా ఉన్నాయి. యుగసంకేతం 43 ఆకురాలినట్లు గలగలా రోదసినుండి దూసికొని వస్తూన్న దేవరు? తీరని సందేహం ! చివరి ఘడియలో ప్రాణంవలె ధ్వని భయంతో గంతులేస్తున్నది పిట్టలెగిరి పోతున్నవి. గుంపులుగా కలకలమని. నీలిరంగు మైదానంలో ఒయ్యారం ఒలకబోస్తూ సిగపై మల్లెచెండుతో పరుగునవచ్చే రూపం చూచి. దూరంనుండి యువతి అనుకొని పాపం ! యువకుడొకడు అర్పించాడు హృదయం. భావగీతం పలికాడు. దగ్గరలో– రైలు అనుకొని పాపం ? తల పెట్టాడు ప్రయాణం అధివాస్తవికుడయ్యాడు. యువతి, కాదు–రైలు వెళ్ళిపోయింది. ఇతని ఉనికే గమనించకుండా. దారం తెగి చెట్టు కొమ్మకు చిక్కిన పతంగివలె కోరిక మిగిలింది. 44 యుగసంకేతం ఆకాశం మేల్కొంటున్నది. ఇంకా కళ్ళు తెరవలేదు. పాలవాడు పిలుస్తున్నాడు. లోపలినుండి తలుపు తెరచిన ధ్వని. కాలంలో కరగిపోతూ మూతవడిన కనులు విప్పి ఏదో వస్తురూపం చూడాలని ఎత్తిన బలమైన కోరికతో నడుస్తున్నా; నడుస్తున్నా – ఆకాశ మందడ మెంత విచిత్రమా ఈ కోరిక నెరవేరడమంత విశేషమా ? అవును దానికొక ఆకారం లేదు. అవును దీనికొక ప్రకారం లేదు. ఈ విశాలమైన మైదానాలు ఈ ఉన్నతమైన పర్వతాలు ఈ పరుగులెత్తే నదీ నదాలు ఈ తలలూపే లతా వృక్షాలు జనగణ సంచలనం వనమృగ సంచరణం మనస్సుకు దీపిస్తూనే ఉన్నవి. ఇంత కాలమూ చూచి చూచి విసుగెత్తి విరక్తి కలిగేనా ? యుగసంకేతం 45 మరపునబడి పోతున్నాయా ? మదిలో తలలెత్తక ఉండేనా ? కన్నులు మూసి ఉంటేనేం ? మిన్నులు పట్టని ఊహ లేదూ ? కోరిక రెక్క విప్పుతుంది వానకాలం మబ్బువలె, కోరిక చివుళ్ళు తొడుగుతుంది వసంతకాలం తీవెవలె, ప్రకృతి ప్రవర్తిస్తుంది వీచే గాలిని బట్టి అందే నీటిని బట్టి పొందే శక్తిని బట్టి. ఈ దారినుండి పోయేది పూర్వం నే చూచిన మనుషులేనా ? ఈ తెరవెనుకన ఉన్నది పూర్వం నే చూచిన పాత్రలేనా ? ఇప్పుడు కల్పన తప్ప ఏముంది? అప్పటి స్మృతి స్వప్నంవలె ఉంది. జగత్తు భ్రమాదిత స్వప్నం అని కదా వేదాంతులు కొందరు పలకడం జీవితం కాలోదితచిత్రం అని కదా కొందరు లోకశీలురు అనడం. మరి కాకపోతే ? మీరెవరో నాకు తెలియదు. ఏ జాతి మతం దేశం వారో ? ఏమి ఏమె రూపొందుతున్నది ఎన్ని విభేదవిపరిణామ కళలతో ? ఇప్పుడున్న రూపం మరో క్షణంలో ఉండదు. 46 యుగసంకేతం ఇప్పుడున్న భావనలో మరో క్షణమే మార్పు. స్ఫటికంవంటి మనస్సుపై అనుభవకాంతి ప్రసారంతో ఎన్ని వర్ణాలు మారుతున్నది జీవిత చిత్రకళారంగం. ఎన్ని రూపాలవతరించి ఎంతలో అంతరించి పోతున్నాయి. ఏదీ స్థిరంగా నిల్వలేక పోతున్నది. ఎన్ని వింతలు చూపిస్తున్నది కాలరూప ఖండం. ఒక్కటీ తృప్తినివ్వలేక పోతున్నది. గ్రుడ్డివాని కనులంతా ఏకాకృతి, చీకటి, జడరూపం. కదలే మనస్సుకు ప్రతిదీ నైక రూప పరివర్తన చైతన్యం. నాగరక భావ రూపచ్ఛాయలలో అకాలమృత్యువు ఆవరించి ఉంది. అన్న వస్త్ర పరిమితితో మొదలైన ఆశ అరచేతిలో స్వర్గం మెరపిస్తున్నది. గాలి తీవ్రతకు రేకులు రాలిన పద్మంవలె సూర్యరశ్మికి ఆవిరి అయిపోయే సముద్రంవలె ఎండకాలం దాహంతో స్రుక్కే అవనివలె ఉన్నది మానవత దైన్యంతో, ప్రమాదంలో. ఈ లోకంలో బ్రతుకుతూన్న నాకు మానవత పై విశ్వాసం సహజం. ఇక్కడ అడుగిడి పోగొట్టుకొన్న వెలుగుకై పరితాపం సహజం. యుగసంకేతం 47 గగనంలో కదలివచ్చే జలదహృదయం నీటిలో వికసించిన పద్మ వదనం అపేక్షిస్తూ నడుస్తున్నా భూమిపై, జనపదవననదీనదాలు కొండలు మైదానాలు క్రమించి ఆకాశపు వంపులు దాటి– ఇంకా నడుస్తాను సముద్రం వచ్చేదాకా ? కాలంలో కరగిపోతూ– సైవెన్ స్టార్స్ కదలిక – నీవు కదలవు కాలం ఆగదు. నీవు మెదలవు బ్రతుకు నిల్వదు. దొరకంది – దొరకిందా ? ఆయువు పట్టు. తెలిసిందా ? బ్రతుకు గుట్టు. చిత్రం — నమ్మదు నీ రూపం దింపించుకో చిత్రం నమ్ముతారు చిత్రం ! తెలివిలో భద్రం. రెండూ ఒకటే – చూపు మెరుస్తుంది మెరపులా తెలివి కురుస్తుంది వానలా. 48 యుగసంకేతం జాగ్రత్త – మలుపు తిరిగేవా మలగి పోతుంది – గాలిలో దీపం హాలులో ఉంచకు అమ్మయ్యా — నన్ను వెలిగించకు ఆరిపోతాను. నన్ను వెలిగించకు కాలిపోతాను. కర్తవ్యం — ఆగిన యుద్ధం సాగించు మరోచోట చచ్చిన శాంతిని ఊరేగించు అంతటా. అందుకే అతడు అతనికి చావు లేదని అందరికీ తెలుసు. ఎందరిలో నిజంగా ఉన్నాడన్నదే ప్రశ్న. కాలం గడుస్తూంది. బ్రతుకు గడుస్తూంది అతని నీడ అనుసరిస్తూంది. జ్ఞాపకం వస్తాడు జాతికి కష్టనష్టాల్లో, దుఃఖతాపాల్లో దేవునితో సమానమని అందుకే దూరంగా ఉంచుతాం. మనం దూరం అయ్యేకొద్దీ అతడు దగ్గరిగా వస్తాడు. యుగసంకేతం 49 హృదయం విప్పి వెలుగువలె. అందుకే అతడు మహాత్ముడు. క్షమించాలి పాత్రను విస్మరించలేను ఉదయకాంతి పరిష్వంగం కోరే హిమశిలా శ్రేణులపై, రాత్రి చరించే నేను ఎవరికోసరమా జోలపాట పాడలేను. క్షమించాలి పాత్రను విస్మరించలేను. శిరస్సు పై గొడుగువలె ఉంది ఆకాశం. కాళ్ళక్రింద శ్మశానంవలె ఉంటుంది భూమి. ముఖంపై నీడ కప్పువలె ఉంది చీకటి. కన్పించీ కన్పించకుండా ఉంది రాత్రి. పూర్వపురాత్రి స్మృతులు చిమ్మికొని వస్తూనే ఉన్నవి. తలఎత్తనున్న వెలుగు ముఖం పై చీకటి కత్తిపోటుకు వేచిఉంది. గగన దీపం పాదాలకు వేసిన నిశానిగళాలవలె బ్రతుకును కదలనీయడంలేదు. నిలువనీయడంలేదు అశాంతి. 50 యుగసంకేతం ఎడారి హృదయ భూములతో భికారి ముఖ కవళికలతో ఎవరు వీరు ? వీరిచుట్టూ తిరుగుతూన్నవి తెల్లని దుస్తులతో చుక్కలు. వేడిమి చావని యువ హృదయులూ ఏడ్వనూ చేతకాని శిశిరమూర్తులూ ముడుచుకొని పరున్న వృద్ధమతులూ వెలుగుకై వేచిఉన్న స్ఫటికశ్రీలురూ. ఉదయం వచ్చింది ఉదారచరితునివలె. వెలుగులు వేంచేస్తున్నాయి ఎడారిలో కెరటాలవలె. పిల్లల కనులలోని కలలబొమ్మలు వారి ఊహలలోని పూల సింగిణులు. చెట్లపై గుట్టలపై మైదానాలపై అంతటా విరిసిన వెలుగులు అయినా చీకటి ఉండనే ఉంది. కుండపగిలి జారిన క్షీరంవలె జగత్తుపై సోకిన వెలుగులో నీడ జాడ అంతకంటే చీకటి అంతరించి నట్లనిపిస్తుంది. చల్లనిగాలి ఎద చీల్చుకొని హఠాత్తుగా దూసికొని వచ్చే మృత్యువు అట్టహాసం ! మారణ యంత్ర ధ్వని. కూలిపోతున్న సంస్కృతీ శిఖరాలక్రింద యుగసంకేతం 51 గొంగళి పురుగువలె సగటు మానవుడు. ఉన్మత్త ఝుంఝా సంగీతంలో జ్వలదహంకారానికి ప్రతిఫలంగా, అగ్నికాపుతీయ భవనాలు శ్మశానాలుగా మారే పట్టణాలు. చిమ్మిన నెత్తురు గీతలలో క్రమ్మిన పొగల సైగలలో మానవుని వెలుగు రూపం వెదకుతూ ఇంకా నడుస్తూనే ఉన్నాను ! కనుదొప్పలలో కన్నీటిలో కాలి బూదియైన ఎదదిబ్బలపై ఉల్లోల కల్లోలంగా ప్రవహించే గాంగఝురీ చైతన్యం ఊహిస్తూ. మతాల విచ్చుకత్తుల మెరపులలో బ్రతుకును వెలిగించలేను. ఇజాల చిక్కుటుచ్చుల తలపులలో బ్రతుకును బంధించలేను. దుఃఖ వేదన నిండిన రాత్రిపై జాలి ఉంది. సుఖ సంతోషం విరిసిన ఉదయంపై కోపంలేదు. శిశిర మూర్తులను చూచి హిమవర్షం కురుస్తాను. వసంతాగమనంపై ఆశ ఎన్నటికీ చావదు. అపజయ పరంపరలో అపుడపుడూ విజయ గీతం వింటూ 52 యుగసంకేతం ఎంతదూరం వెళ్లాను ముందుకు? ఎంత కాలం సాగింది వెనుకకు ? ఉన్న చోటే ఉన్నామా ? మనం. ఉన్నచోటే ఉన్నదా ? కాలం. ఉచ్చ్వాస నిశ్వాస పరంపరలు హృదయ స్పందన గతులు. పాములు ప్రాకినట్లు గాలులు కాలం కదులుతూంది కాబోలనిపిస్తూంది. దేనికైనా తప్పదు నాశనం ఇదొక పరిణామంలోని భాగం. దేని పరిణామగతీ ఎవరికీ నిశ్చయంగా తెలిసి చావదు. మృత్యువు పై అధికారం లేదెవరికీ ఏ జ్ఞానమూ సర్వ సంపూర్ణం కాదు. ఎక్కడికక్కడే అవధిగా కన్పిస్తుంది. ఎంతకంతగనే నిండుగా వెలుగుతుంది. వెనుకనే అజ్ఞాన విహంగం చీకటి రెక్కలు విచ్చుకొనే ఉంది. భయం తుఫానువలె తరలి వస్తూంది మృత్యువు కొంత ఆలస్యంగా వచ్చేది. ఈ తుఫాను గాలులకు ఎవడికి వాడే భయపడుతున్నాడు. సముద్రం ఉప్పొంగుతుందని ఎవడికి వాడే శంకిస్తున్నాడు. అశాంతి ఎవరూ కోరరు శాంతి ఎవరికీ చిక్కదు. విషమ వాయు పరంపరతో ఉదరిపడు ఈ గోళంలో యుగసంకేతం 53 నా మనస్సు భావిస్తూంది మరో సృజన రూపం. భుగ్న భావంతో భూమిపై చేరువగా ఆశలు అవనతమై ఉన్న ఆకాశం, తిలకిస్తూ నడుస్తూన్న నేను అనుభవ పరంపరకు దూరంగా మట్టి బొమ్మలకు రంగులు దిద్ది సంతలో వ్యాపారం సాగించలేను. వర్షాజలపరిషేచనం కోరే గ్రీష్మకాలశిఖరంపై, పగలు నిలచిన నేను ఎవరికోసరమా ఈలపాట వేయలేను క్షమించాలి పాత్రను విస్మరించలేను. వెలుగు చూపులో ఎవరికి తెలుసు రేపటి ప్రయాణం సంగతి ? భవిష్యత్తు అవిదితం దాని సీమ లనంతం. అదృష్టం పై భారం వేసి అకర్మణ్యత అవలంబించకు. జరుగుతూన్న దుర్విధిపై చింతాశ్రువులు రాల్చకు. 54 యుగసంకేతం రేపులో విశ్వాసముంచు నిన్నను విస్మరించకు. గతజల సేతుబంధనలో జీవిత లిప్తలు గడపకు. ఉదాసీనత క్రమ్మి వాతావరణం కొడిగట్టిన దీపంవలె ఉంది. ఈ రాత్రి దుఃఖీతులది నిజమే రేపటి ఉదయం ఆశాజీవులదే. భగవంతుడెవడో ఎక్కడున్నాడో అక్కడే ఉండనీ నీలోని చైతన్యరేఖను గుర్తించు. నీలోని జడత్వాన్ని వదలించుకో. ప్రసరించు మనఃప్రపంచంపై దృష్టి ప్రవేశించు సుక్షేత్రాలలోనే గాక ఎడారులలోనూ, గుడారాలలోకీ, సుఖ దుఃఖ తీరాలలో అడుగిడు. అనుద్విగ్నంగా పయనించి దర్శించు అనుభవ దృశ్యాలు, అనుభూతి దశలూ. విషం నిండిన భాండంకాదు జీవితం. అమృతం నిండిన కలశమూ కాదు. పరమ యథార్థం, కేవల స్వప్నం కాదు. వాస్తవాదర్శాల సంయుతమైన రూపం. దిక్కులలో చూడనరాని వెలుగులు నీలో సాక్షాత్కరింప జేసికో. శవాలలో ప్రాణం ఏలాగా రాదు. ఉన్న ప్రాణులను శవాలు గానీయకు. క్రమ్మనీ తలపై నీల మేఘచ్ఛత్రం మండుతూంది కాలిక్రింది భూమి. యుగసంకేతం 55 అయితేనేం మార్గం కఠినం తెలిస్తే చాలు చేరాల్సిన గమ్యం. దాగనీ మనస్సులో యుగాల ఆలోచనలు అవసరమైనకొలది చాలు మాటలు. ఉన్నా నేను లౌకిక బంధంలో ఒంటరిగా నా గీతం మ్రోగుతుంది స్వేచ్ఛగా అందరిలో. అలమనీ ఉదాసీనత బ్రతుకు చిత్రంపై వెలుగు చూపు నీయకపోదు కళారూపం, జ్వలించనీ విప్లవంతో ఈ దేశం అవతరిస్తుందింతకన్న మంచిదే సత్వరం. నేనూ నీ రూపమే అంతంలేనిది కాదు రాత్రి జననం లేనిది కాదు ఉదయం. కాలగమనం అఖండమైనది. మానవ సంతతి విచ్ఛిన్నం కానిది. దుఃఖ గీతాల మడతలలో చుట్టలు చుట్టుకొని పరుండకు. వీచే గాలులవలె రేగే ఊహలు పూలు రాలుస్తాయి, నిప్పూ రగుల్పుతాయి. గతంలోని తప్పిదాలను నెమరువేస్తూ కూర్చోకు. దుఃఖీతుల కన్నులలో 56 యుగసంకేతం దాగి ఉంటుంది రాత్రి. వారి ఆశలలో పరచుక ఉంటుంది ఉదయం. ఉదయం భూమి పై మంచు నవ్వు మొలకవలె ఉంది. ఆశల ఆకులలో వెలుగురేక మొగ్గ తొడుగుతూంది. గతకాలపు భూమిపై నిల్చి వర్తమాన పవమాన పంక్తికి కదలుతూన్న చెట్ల వరుసలు స్వాగతం చెబుతూన్నవి. అగ్నికుండం వంటి బుద్ధితో వర్షరూపం వంటి మనస్సుతో విజయ గర్వం బింబించిన ముఖంతో అపజయం తొంగిచూచే కన్నులతో తల్లివలె పొదిగిఉన్న సంస్కృతితో రాముడు గాంధి, రావణుడు హిట్లరుగా క్రీస్తు బుద్ధుడు మహమ్మదు శంకరుడుగా అవతరించిన మానవుడా ! కాల రథవేగ గతి కెగసిన ధూళి క్రమ్మిన శరీరంతో ప్రయాణించే స్వేచ్ఛామతీ ! కాలమాంత్రికుని చేతినుండి తప్పించుకున్న అపాయానివి. అనంత కాలముఖంలో విభాసించే క్షణ రేఖవు. పిడికిలి విప్పి చేస్త కన్పించేదేమిటి? యుగసంకేతం 57 పిడికిలి మూసి వేస్త కన్పించని దేమిటి ? నీ అడుగు జాడలలో ఆదర్శంగా నిలచిన కాలం నీ చరిత్రలో నిర్మితమై ఇతిహాసం నీ రూపాన్ని ప్రతిబింబించే దర్పణం. ప్రతిఘటన నీ చరిత్రలో భాగమే. ప్రతి జీవితం నీ ప్రపంచ రూపమే. నీ గురించి మనో భూమికలలో పాడుతూన్న నేనూ నీ రూపమే. నేనెరుగని ఆత్మబంధువు ఒక వృద్ధుడు రోజూ వెళ్తాడు మా ఇంటి ముందుగా. నేనూ బయలుదేరా– ఒకనాడేదో పనిమీద, అతడొచ్చే సమయంలోనే. అతడు నడచి నడచి మెల్లగా ఒక పాత ఇంట్లోకి వెళ్లాడు. వీధిలో వచ్చిపోయే జనం అంత సందడిగా ఉంది. కిటికీ తలుపులు తెరచాడు దాని చువ్వలు పట్టుకొని వంగి చెంపలు వాటి ఆనించి, 58 యుగసంకేతం వీధిలోకి చూస్తూ నిల్చున్నాడు. పసివాడై పోయాడా కాసేపూ, కిటికీ తలుపులు మూసి బయటికి వచ్చాడు. ఇంటి తలుపులు మీద పడేట్టున్నాయి. మెట్లూ అంతంత మాత్రమే. లోనికి అడుగు వేయడానికే భయం వేస్తుంది నాకైతే, గతానికి దగ్గర బంధువై. వీధిలో ఒక ప్రక్కన నిల్చొని చూస్తూన్న నావద్దకు వచ్చి ‘బాబూ ! ఎవరు మీ ’ రన్నాడు. నేను నా పేరు చెప్పి వెంటనే ‘ఈ ఇల్లు మీదేనా ?’ అన్నాను. ““‘అవును’ అన్నాడు” ‘అమ్మేయక పోయారా’ అన్నాను తలూపి నవ్వి ఊరుకున్నాడు. కళ్ళలో మెరుపు మెరసింది ఆరిపోతూన్న దీపం స్ఫురించింది. కొంచెం సేపటికి చూస్తే, కళ్లు ఎర్రగా కాలి చల్లారిన ఇనుపబంతులవలె వున్నవి అంతలోనూ మంచుతెరలైనవి. ఒక క్షణం ఆగి ‘నాతో వస్తావా ?’ అన్నాడు. ‘లేదు పనిఉంది’ అన్నాను. ఎక్కడికని అడగకుండానే. ‘ఏం పనిలే ?’ అన్నాడు యుగసంకేతం 59 బహు సామాన్యంగా నా పని తెలిసిన వానికిమల్లే. నేను మాట్లాడలేదు. హఠాత్తుగా, నావైపు చూస్తూ ‘శ్మశానానికి వెళ్ళుతున్నా’ నన్నాడు. కోపం వహించి ఉన్నాడనుకుంటూ ‘అమ్మా ? భయం నాకు’ అన్నాను. నా భుజంపై చేయి వేశాడు. క్రుంగి పోతానేమా నన్నంత భయం వేసటంత బరువుగా, ఒక్క ఊపు ఊపి ‘ఏదో అన్నాను చమత్కారంగా అలా ఉలికిపడతా ఎందుకు ?’ అంటూనే గబగబా నడచాడు. అమ్మయ్య ! వదలాడురా ఇంకా నయం, తనతో పాటు శ్మశానాని కీడ్చుకొని పోలేదు ! అతని పేరు వగైరా అడగడం మరచినందు కెంతో చింతించా ఈ మారు కన్పిస్తే మరవనని సమాధాన పరచుకున్నా. ఆనాటి రాత్రి కన్పించి మళ్లీ, తనతో రమ్మన్నాడు తోడూ నీడా ఎవరూ లేరేమా ! నాకు భయంవేసి కేక వేశా. మళ్లీ, కన్పించి అదేమాట అన్నాడు. 60 యుగసంకేతం ఈసారి మర్యాదగా తల ఊపి ‘ఆలాగే తప్పకుండా’ అన్నాను. అతని ముఖం మొగ్గ తొడిగింది. ఆ ఇల్లు నాకు వ్రాసి ఇస్తానన్నాడు. ఎలా లాభించేను ? అమ్మేయాలా ? మరమ్మతు చేయించి అద్దెకివ్వాలా ? ఆలోచనలో తెల్లవారింది. లేచి కిటికీ వద్దకు వెళ్లి చువ్వలు పట్టుకొని చెంపలు వాటికి ఆనించి నిల్చున్నా బద్ధకంగా వంగి. శ్మశానంలో మండుతూన్న చితివలె ఉంది నా కంటికి ఉదయాకాశం. ‘‘అబ్బ! అప్పుడే ఎంత ఎండ ?’’ అంటూ వెనుకకు తిరిగా. ‘‘ఏడు గంటలయింది మరి ’’ అంటూ ఎదురైంది శ్రీమతి. మనశ్చిత్రం వర్షం పడుతూంది. గోటి చివర సిగరెట్ నుసి దులిపి దమ్ములాగి పొగ వదలుతూ యుగసంకేతం 61 రింగులు రింగులుగా వరండాలో నిలచిన ఆతడు కర్మ కాలినవాడు. బాల్కనీలో చల్ల గాలికి కుర్చీలో కూర్చొని వీధి దీపం వెలుగులో పరలోకపు చింతనలో కనులు సగం మూసి ఉన్న ఈతడు పెట్టి పుట్టినవాడు. ఆతని దృష్టి అమాంతం ఈతనిపై పడింది. అతడు క్రింద, ఇతడు పైన ఇద్దరిమధ్య అంతరం బహు దూరం ! దుస్సాధ్యం. మెట్లులేని మేడలోకి ప్రవేశించి ఊహతో ‘‘బాగా సంపాయించాడు అదృష్టవంతుడు’’ అని ప్రశ్నగా రూపొందాడు. వర్షం వెలిసింది. జేబులు తడుముకొని నిటారుగా నిల్చున్నాడు. సిగరెట్ దమ్ములాగి వీధిలోకి అడుగు వేసి దగ్గరలో పడుకొని ఉన్న కుక్కపై గిరాటు వేసి చీకటిలో జారిపోయాడు. కంయ్మంటూ లేచింది కుక్క, 62 యుగసంకేతం ఎంతో సేపు కాలేదు పెద్ద చప్పుడు ? ‘దొంగ దొంగ !’ అరపులు. జనం పరుగిడుతున్నారు. కుక్కలు అరుస్తున్నాయి. దారిలో వెళ్తున్న మనిషి వెంటబడి చీకట్లో, తీసుకొచ్చారు వెలుగులోకి, ‘దొంగ దొంగ !’ అని చూపారు ఎవరో ‘ప్రయాణికుడ’ న్నారు బాగ్ విప్పి ‘ఏమీ లేద’ న్నారు. పొరపాటు జరిగినందుకు పశ్చాత్తప్తులయ్యారు కొందరు ! అతడెక్కువ మాట్లాడలేదు పట్టీపట్టనివానికి మల్లే. ‘పెద్ద మనిషి’ ‘పోనీండి’ అన్నారు. అంతా ప్రజలే, ప్రజలు, అతడు వెనక్కు తిరిగాడు. ఆపైన, అదే–దూరంగా అక్కడే ఉంది కుర్చీ ఖాళిగా. అంతా వెళ్లిపోతున్నారు. దొంగల కథలు చెప్పుకుంటూ. ‘ఇంతకు దొంగ ఏమైనట్లు ?’ ఒక కౌతూహలి ప్రశ్న ‘రేపు ఉదయం పోలీసు స్టేషనుకు వెళ్లి రిపోర్టు చేస్తే సరి’ సమాధానం వచ్చింది వెంటనే. యుగసంకేతం 63 వెండితెరపై నీడబొమ్మవలె ఉందీ రాత్రి దృశ్యం. ఏదో సరిగా జ్ఞాపకానికి వచ్చీ రావడం లేదు. చెరువులో కదలే చెట్ల నీడవలె. ఇతని నెక్కడో చూచాను ! థియేటర్ లోనా ? కొంపతీసి సినిమాలోని ఒక పాత్ర కాదుగదా ? ఇక్కడెలా ఊడిపడ్డాడు చెప్మా, అయితే ట్రూకాపీ ఇటువంటివి ఒకటా రెండా ? ఎక్కడబడితే అక్కడే ! ఆకాశంలో మబ్బులవలె ఆశ్చర్య చిత్ర పరంపరలో గొలుసుకట్టు ముడివడింది అనుమానంతో మిగిలిన సమస్య. నగరంలో ఉదయం సదస్య లోక విరహితంగా ఆడబడే నాటకంవలె ఇటు అటు వెనుకాడి కొంత సేపు రాజాదరణకై తారాడే కవిరత్నంవలె అవతరించింది నగరంలో ఉదయం. 64 యుగసంకేతం రవి ప్రయాణానికి దారులు తెరచిన దివాదుహిత, యజ్ఞకేతువు, ఉషస్సు ఎవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. కళ్ళువిప్పితేగా చూచే ప్రశ్న ఉదయించేది. చీకటి ఎడారి బ్రతుక్కి ఈ వెలుగు ఒక ‘ ఒయాసిస్ ‘ అని తెలిసి వచ్చేది. ఇక్కడ గడియారమే కాలరూపం. బ్రతుకుతెరువు, భోగభావం రెండే రెండు దృష్టి రేఖలు. చుట్టూ ఎత్తైన మేడలు, చూపు కెక్కడికక్కడ అడ్డు తగిలి ఆకర్షించి బంధించి వేసవి. విశ్వపరిధులు స్పృశిస్తూ ఊహలు ఆకాశంవలె పరచుకొని మనస్సు చాపచుట్టవలె చుట్టుకొని బ్రతుకులు తమపై ఒరిగిన ప్రపంచ భారంతో క్రుంగిపోయి నడుస్తూన్న మనుషులు. ఎక్కువగా దాదాపు అంతా క్షణం తీరికలేని యంత్రాలే. గుండె డాక్టరుకు అప్పగించి బుద్ధి ఎవరికో తాకట్టు పెట్టి సరస్సులవలె లేదా పడియలవలె ఎక్కడబడితే అక్కడ ఎదురౌతారు. ఎప్పుడుబడితే అప్పుడు ఎప్పటికపుడు సమస్యా చిహ్నాలతో, పరిష్కార సాధనలతో. సూర్య చంద్రులు ఇక్కడ రిటైరైన ఉద్యోగులతో సమానం. పాపం చంద్రుడు మరీ ‘ ఔటాఫ్ డేట్ ’ మ్యూజియంలో భద్రపరచిన యుగసంకేతం 65 అమూల్య వస్తువుక్రిందే లెక్క అయినా ఏదో నెట్టుక వస్తున్నాడు పైపైని సద్యోయోగంతో. ప్రణయ దౌత్యేత్యాది గిరాకీ తగ్గినా ‘ మూన్లైట్ డిన్నర్ ’ కు అవసరమే ఐనా అంతకుమించి ఈయన కొరత తీర్చే ‘ లైట్నింగ్ ’ అవకాశమూ లేకపోలేదు. కాలాభిజ్ఞతకు హేతుమూర్తులు ప్రపంచానికి సాక్షీభూతులూ ఐన ఒకనాటి పెద్దలస్థితి ఇది. ఇక వసంతం గిసంతం మాట పూర్వ కావ్యప్రపంచంలోనే ఎక్కడా కోకిలమాటే విన్పించదు. హారన్–సైరన్–బహువిధ యాంత్రిక చలనధ్వని సమ్మేళనం తప్ప ! ఎప్పుడైనా ఒక కవి వేషధారి ఆ సరంజామా పట్టుకవేస్త మర్యాదా యవనిక చాటున, అదొక విచిత్రశ్రీయే. అధవా రాత్రి చంద్రబింబం కన్పించినా ప్రేయసీ ముఖం తలపుకు రాదెవరికీ స్పుట్నిక్ తీవ్రవేగ గమనం అస్ట్రోనాట్ ఉత్పథ విహరణం చంద్రోపరితలంపై మృదు సంచారం మానవ విజయకేతన ప్రచాలనంతో మనఃఫలకంపై నిలుస్తుంది భావరూపం. రేపు తామూ తమ బంధుమూర్తి పృథ్వీ సోదరునివద్దకు వెళ్లే 66 యుగసంకేతం సమయపుటూహలో, నిరీక్షణలో వాస్తవాని కాదర్శంగా కాలానికి లోచనంగా ఆలోలితమవుతుంది మనస్సు. కవిత్వమూ ఈనాడు వల్లమాలిన ఓపికతో చెల్లని నియమ రేఖలతో గణ యతి ప్రాసల కట్టుబాట్లలో గాక, ఉద్వేగపు కొలతలో ఆవేదన శీలంతో అనుభవ పరమార్థంగా స్వేచ్ఛాభావన పొందిక రూపం. విచ్చిన కాలలోచన దర్పణం మానవ గమన సూచీయంత్రం. వ్యక్తికి వ్యక్తికి మానసిక తత్త్వంలో వ్యత్యాసం అనుభూతిలో విభేదం ఉంటుంది తప్పదు. వ్యక్తికి వ్యక్తికి సమంగా పోలిక లేకపోయినా మానవతా సామ్యం ఏకంచేస్తుంది తప్పక. ఆ“, ఉదయంమాట మరచాను మాటల్లో తీగ కదలడంతో డొంక కదలి పోనీ ఎవరికుంది గనక తీరుబాటు మంచిది విరమిస్తా చివరి మాటలతో. వస్తురూప విన్యాసం ఎప్పుడూ ఒకలా ఉండదు. జీవితరూపం గమనం ఎప్పుడూ ఒకటిగా ఉండదు. ఆత్మ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒక్కటే. చైతన్యం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒక్కటే. ఉదాత్త సంస్కృతి జీవిత చిత్రానికి కళారూపం. యుగసంకేతం 67 ప్రపంచ పరిణామం సృష్టి మహార్థానికి వ్యాఖ్యారూపం. నీవు నాలో బ్రతికి ఉన్నట్లే నీవు దూరమవుతున్నావా ? భూతకాల స్వరూపానివి. మంచుతెర పై స్వప్నానివి. నా వెనుక నిలచిన వటవృక్షానివి. నా ముందు వెలసిన నిశ్శబ్దరేఖవు. నీవు దూరమవుతున్నావా ? నీ ప్రత్యక్షంలో నా పాత్ర మరచిపోతాను. నీ సమక్షంలో నా ఊహ నిలచిపోతుంది. నీవు దూరమవుతున్నావా ? తెలీని తనం తెలీకుండా తెలీని మలుపులలోకి తెలీనివానికి మల్లే తీసుక వెళ్ళుతావు. నీవు దూరమవుతున్నావా ? ఏదో విశ్రాంతికై కొంత సేపు నావనిలచే నివాసయోగ్యత లేని ద్వీపానివి కదూ ? ఇప్పుడు ! 68 యుగసంకేతం నీవు దూరమవుతున్నావా? నీకు పెద్దతనం వచ్చింది నాకు చిన్నతనం పోలేదు. నీవు కదలవు పర్వతంవలె నేను నిల్వలేను నదివలె. నీవు దూరమవుతున్నావా ? మనస్సులో ధర్మచింతన శిరస్సుపై ఉష్ణీషం చేతిలో కృపాణంతో కాలం ఇక కన్పించదు. నీవు దూరమవుతున్నావా ? తలుపులు తెరచే ఉన్న ఖైదులో ఉన్న నిన్ను రోజూ కలుస్తాను. సాంధ్యవేళల తప్పనిసరిగా కంటిలో గంగతప్ప ఏమీ ఎరుగవు. నీవు దూరమవుతున్నావా ? ఈ ఆవరణంలో తిరిగేప్పుడు ‘‘ జాగ్రత్త ! ఇచ్చట కుక్కలున్నాయి ’’ చేతికర్ర మరచిపోకు ! ఇప్పటి కెంతగా చూచావోలే ! నీవు దూరమవుతున్నావా ? నా ఊహలో వచ్చింది మార్పు. నా ప్రవర్తనలో వచ్చింది మార్పు. నా ఆత్మలో లేదు మార్పు క్రొత్త దుస్తులు ధరించిందంతే. నీవు దూరమవుతున్నావా ? నీవు నానుండి దూరం కావు నేను నీనుండి దూరం కాను. యుగసంకేతం 69 నేడు నీవు స్మృతిలో నిలచేవు, రేపు మేము స్మృతిలో మిగిలేము. నీవు నానుండి దూరమయ్యేవా ? ఏదీ నాముఖంలోకి చూడు. చెప్పరాని పోలిక లేదూ ! ఈ పోలికలున్నంతవరకు నీవు నాలో బ్రతికి ఉన్నట్లే ! నిజం చెప్పు ప్రపంచం మనస్సు కల్పించుకున్నదనీ జీవితం దేవుడిచ్చిన గొప్ప వరమనీ నిర్మలాకాశంలో మాలిన్యం లేదనీ వెలిగే సూర్యుని వదలి నీడ ఉండదనీ అంటావా ? చెప్పు; చెప్పు నిజం ! గుడిలో పూజారి మడిలోకన్నా కూలివాని గుండెలో ధర్మం ఉందనీ వేదికపై శాస్త్రి ప్రవచనంలో కన్నా సామాన్యుని బ్రతుకులో సత్యం ఉందనీ అంటాను, చెప్పు, నిజం చెప్పు ! కూలివాని గొడ్డుకారపుమెతుకుల్లో ఎన్ని విటమిన్లు ఎంతగా ఉన్నాయా చంకలోని శిశువుకు స్తన్యమిస్తూ అరచే బిచ్చగత్తె నడకలో శృంగారమెంతో కన్నది చెప్పు, చెప్పు నిజం ! 70 యుగసంకేతం చెప్పండి. ఈ దేశంలో సమృద్ధిగా ఉన్నది. ఎక్కడ చూచినా అసంతృప్తి, ఆందోళన విప్లవం రెక్కలు విప్పిన వాతావరణం ఎవడికి పుట్టిన బిడ్డరా–ఈ స్వాతంత్ర్యం ? పోరగాండ్లా? చావనీ దేనికీ విద్య – ఉద్యోగులా? అమ్మయ్యా ! ఇప్పటికే పడి తింటున్నారు. తెగ దండుగ్గా. కార్మికులో ? అంతా అలగా మూక కర్షకులో ? అమాయక సంతానం దేశ సౌభాగ్యానికి కావలసింది రాజకీయాధికార పదవీ వైభోగం. వీరు లేకపోతే రాజ్యాంగ రక్షకులు ఎలా నడుస్తుంది ప్రజాస్వామ్యం ? అంటావా చెప్పు ! నిజం చెప్పు ! తలలు దన్ని త్రాటి కెక్కుతూంటే కలలుగంటూ ముసుగుదన్ని పడుకునే సామాన్యునికేమి పట్టింది చెప్పు రాజకీయ సిద్ధాంతాల మెప్పు. పోరాటంనుండి పలాయనం చిత్తగించే సమస్య లంటని పరమ పవిత్రులకు మెలకువ అంటే భయం. నిదురే ఎంతో భద్రం ! ఇప్పుడు ఏమిటి మన కర్తవ్యం మనస్సు విన్నది కన్నది పలకడం, ఈ మరుభూములపై ప్రతి వ్యక్తీ ఉల్లోల తరంగమై ప్రవహించడం ! యుగసంకేతం 71 అగ్ని గానం ఇవే విద్యాలయాలు వెలుగు ఆశలు పెంచుకొన్నవి. వీరే నా సోదరులు ! రంగు వలలు క్రమ్మిన స్ఫటికాలు ఈ దశాబ్ది ప్రపంచంలో సమస్యలకు నిలువుటద్దాలు. వారే తెలీదూ ! మన పై తిరిగే గ్రహాలు ! నరాల్లో నీరుతప్ప నేత్రులేని వారు అరచేతిలో వైకుంఠం నిలిపి పిడికిలిలో కైలాసం బిగించి భవిష్యత్తు భద్రపరచు తంత్రకర్తలు ! అదిగో ! సామాన్యులు కనులలో కమలిన పూవులతో ఎదలలో దాగిన వాసనలతో సోలుతూ కదలే తీవెలు ! అయ్యా ఈ దేశం ఇప్పుడు చల్లారని శ్మశానంవలె ఉంది. దట్టంగా పొగక్రమ్మిన రాజకీయం ఎన్ని వికృత రూపాలు ధరిస్తూంది మనిషికి మానవుడు కన్పించడంలేదు. మనస్సులో మానవత ఇగిరి పోతూంది. సూర్యుడుదయించి ఎంతేసేపో అయింది చీకటి గుడారం వదలడంలేదు మంచు ముసుగు వీడడంలేదు. ఒక వేళ ఈ ఇరుకునుండి బయటపడినా పొరపాటున 72 యుగసంకేతం ఎక్కడికి వెళ్ళగలడ మనిషి ? ఉన్న కళ్ళు మూతపడినట్లై. అయినా వెళ్ళుతూనే ఉన్నారు ఒకరి నొకరు ఢకొంటూ దగ్గరి సందు గొందుల గుంతలు మూకలు మూకలుగా! ఎక్కడికి ? ఈ ఎత్తిన చేతుల పర్యవసానం ? ఈ వేసిన అడుగుల పరిసమాప్తి ? ఏముంది ఇన్నాళ్ళకి ఈ నేలపై – బురదా ! బుగ్గీ ! తరాల సంస్కృతి ఎపుడో చీలింది పాయలు పాయలుగా మారింది పడియ పడియగా నిలచింది ఎక్కడిదక్కడే. ఎన్నో యుగాలు వెలిగించిన సంస్కృతి ఇప్పుడు వెలిగిస్తూంది శ్మశానాన్ని. చస్తూంది ప్రతిక్షణం ధూమంతో బ్రతుకుతూంది అనుక్షణం ఆశతో. పరమార్థం కోల్పోయింది బ్రతుకు అంతకంటే కళలూ, నైతిక వైక్లబ్యం పొందిన అనుచిత రాగోద్రేకంతో, కత్తులు మెరసాయి కన్నులలో చీకటి వెలిగింది దిక్కులలో. అవమానం ! ఆత్మహత్య ! ఆటవికం ! అగ్నిగానం ! ఝుంఝానిలం వీచి ‘ రవీంద్ర సరోవరా ’ న కూలిపోతున్న సంస్కృతీ శిఖరంక్రింద యుగసంకేతం 73 ఎటని పరుగెత్తేరు అబలలు ! నీటిలోకా? వీటిలోకా? ఏ ఒడ్డుకి? ఇది మన ప్రజాస్వామ్యం తెలీదూ ! కాదు కాదు ! ప్రభుకాలం భారతమూ. ఎందరి తలలపైనో కాలూని చరిత్రలో సంస్కృతి గబగబా ఎన్ని పుటలో గంతులేసింది. కొండవలె ఎత్తుగా ఉన్నచోటే పడి ఉంది నిజ జీవితంలో. ఎత్తిన ముఖాలు దించేయండి. నీటిలో వెలుగు లేదు ఎత్తిన చేతులు వాల్చేయండి వీటిలో సత్తువ లేదు. భగవంతుడా ! ఎక్కడున్నావు ? ఇందుగలడందు లేడన్న సందేహం తీరేట్టుగా ఇక్కడే ! నీ ముఖం చూపించకు దోషగ్రహణం పడుతుంది. నీవు ఎదుట పడినా గుర్తించే దెవరీ సమయంలో. వెళ్ళనీ మేం పోదలచుకొన్న చోటికి. క్షమేస్త ఒక్కమాట చెప్పనా ? మానవతపై విశ్వాసంతో నా మనస్సులోని మాట మళ్ళీ తిరిగి రావచ్చు – ఆటవిక యుగంనుండి అనుభవం వెలిగించిన జ్ఞానంతో నీవున్న చోటికే 74 యుగసంకేతం భాషా సీమలూ జాతి వలయాలూ చెరగిన మనోభూమికపై అహంకారమూ అంధకారమూ తొలగిన వెలుగు దిశలో సమభావం, సుఖశాంతి అందరికీ కలిగిన నవ సమాజ నిర్మితిలో నదీ తరంగాలవలె చెంగలిస్తూ వచ్చి నిన్ను కలుసుకోవచ్చు. ప్రస్తుతానికి సెలవు అగ్నిగానం మానలేం. రావద్దు ఆ సమయం రావద్దు ఆ సమయం ఉదాసీనత ఉద్యోగం చేస ఆ సమయం రాకూడదు దీనికన్న నిద్ర మంచిది. వద్దు కదలికలేని శాంతి రానీ విషపాత్రగా క్షణం. నిరాశ నిటారుగా పెరిగిన నింగిలో తలదూర్చి మనుషులు మనసులు పీడకలలు కనే ఆ సమయం రావద్దు. రేపటి నదిఒడ్డున విశ్వాసంతో తిరిగే వ్యక్తిని వెల్లువలో ముంచే యుగసంకేతం 75 గత విషాదం జ్ఞప్తికి తెచ్చే ఆ సమయం రావద్దు. వ్యర్థంగా కనులు పరచుకొని దిక్కులుచూచే ఆ సమయం హృదయశిల పూసిన పూలతో దీర్ఘ రాత్రి హ్రస్వమా వెలుగుతో రానీ ఆ సమయం భగవంతుడా రానీ ! అమృత వర్షం సాంధ్య రోదసి క్రమ్మికొని, నవ వాస్తవిక కవితవలె మధురవర్షధారాపాతంతో ఆశామేఘం కురుస్తున్నది అమృత వర్షం ! ఎక్కడో ఆగిపోయింది ఇక్కడ తూగిపడింది. రండి ఇట్లా బయటికి గదులు వీడి, ఎదలు విప్పి. ముసలి మొగం వలె నెరియలుపడ్డ భూమి, జలబిందు పరిస్పందితమై పసిపాప నవ్వు మొగమైంది. జలధారా పరిష్వంగంతో ముగ్ధప్రియా హృదయమైంది. 76 యుగసంకేతం మసృణమై, ఆర్ద్రమై, సుగంధియె మారింది పురా భావరూపం. ఎన్నిపూలు విరబూచింది నా హృదయం అనంతకోటి నక్షత్రాలవలె, అన్నీ మాలలుకట్టి, గగన దీర్ఘ గళంలో వేయాలని ఉంది రాత్రి. అన్నీ ప్రోవుచేసి జలధిలోల వక్షంపై అమర్చాలని ఉంది రాత్రి. ఇంతలో మెరపు మెరసి, మరపు వచ్చి సుఖస్వప్నం చెడి, తెలివి వచ్చి ఆహ్వాన పత్రంవలె ఎదురైంది ఉదయ తరణి. పురాభావ నగ్నమైంది మనస్సు. ఇంకా అమృతవర్షం కురుస్తూనే ఉంది. నడవండి, ఇందులో తడిసినవారి మనస్సులు వినిర్మలంగా ప్రకాశిస్తాయి. తడవండి, ఇందులో నడచినవారి గమనం చైతన్యవంతంగా ఉంటుంది. భవిష్యత్తు స్వరూపమంతా ఆశాప్రభావంలోనే ఉంది. అదీ ఆనంద సౌందర్యమయంగా ఉండాలనుకోవడం మానవ సహజం. గతంలో నిద్రపోయే ఓ చెట్లూ ! కొండలూ ! ఇంకా నే మరచినవారూ ! యుగసంకేతం 77 అమృత వర్షంచే పునీతులు కండి. సృష్టి రహస్యానికి వ్యాఖ్యానాలవండి. వర్తమానం లేంది భవిష్యత్తు ఎక్కడిది? విచ్చిన కంటికి కన్పిస్తుంది మింటినుండి మంటికి సాగిన సూర్యకిరణ కాంతిచక్రం. మేల్కొన్న మనస్సు అనుభవిస్తుంది వర్షా మధునాద రూపంలో ఆశా మేఘం కురుస్తున్న అమృత వర్షం ! 78 యుగసంకేతం మేల్కొన్న ఆకాశం యుగసంకేతం 79 కాంతి సింహం నీలాకాశ గుహాముఖంనుండి 1 బయల్వెడలిన కాంతి సింహం నిర్మల కాసార దర్పణంలో తన ముఖం చూచుక మురుస్తూ, రోదసీ వితర్దికపై బంగారుపూలు విరబూచిన కాంతివల్లీ నికుంజంలా సంతోషంగా కూర్చుంది. రోదసీ వితర్దికపై కూర్చొని పకాలున నవ్వే కాంతి సింహం నాకెంతో చూడ ముచ్చటై సుఖసంతోష తరంగితంగా కాలం గడపాలని చేయి చాచి సైగచేసి పిలిచా. నా పై జాలి కలిగి కాబోలు 2 నా ప్రక్కనే నీరు? నిండి ఉన్న 3 గాజు గ్లాసులోకి దూకింది నీటిచుక్క తొణకలేదు. గాజుగ్లాసు పగుల లేదు. అపుడు నిదుర నిషా ఎక్కిన వేళ కాలం ఆగిపోయినట్లు గుర్తు. వ్రేలాడే మంచు తెరలు రవి కిరణాలకు తెగిపడునట్లు గాలికి కాసారంలో తరగలు లేచి పడునట్లు పగలడానికి తగిన ఎత్తునుండి గాజుగ్లాసు క్రిందపడినట్లు నా ఎదలో సన్నని ధ్వని. యుగసంకేతం 81 కనుమరుగున స్పృశించిపోయే గాలి తెరవలె కనులముందు గర్జనలతో సాగే మేఘ పటలంవలె ఆకాశానికీ చంద్రునికీ ఎంతదూరమో అంతదగ్గరగా నా వెనకాల నడచి వచ్చి ఎంత సేపటికో, అంతసేపునూ మరపించి గాలితెరల మంపులపై తుమ్మెద కాలిజాడలవలె నీటి అలల వంపులపై కదలు గాలి తరగలపలె గుండెలో పొరలనుండి ఎగిసే రాగ మాలలవలె వ్రేళ్ళకు చిక్కక కదలే పాదరసపు గుళికలవలె, నా హృదయాకాశం ఆవరించి నిలచింది కాంతి సింహం. ప్రయత్న నైష్పల్యాన్ని అంగీకరింపనీయని రూపం. అసంతుష్ట కామనాత్మక మనస్సులో అర్థ సుషుప్తిలో, జాగ్రదవస్థలోనూ అపుడపుడూ కాంతిసింహాలు ఇంకా మాట్లాడితే చీకటి దెయ్యాలూ వారివారి అభిరుచి, సంస్కార దశనుబట్టి మానవులతో స్నేహం చేయడం కద్దు. కొంత సేపలాగే ఉండి నిష్క్రమించిన నేస్తం. అనంతాకాశ వలయంలో 82 యుగసంకేతం అరుణకాంతి పతాకవలె రెక్క విప్పి నిలచింది. చీకటి గుహలో దాగి మెరపులా దూసికొని వచ్చి నిండు ప్రాణం తీస్తుందని ఎవరో చెబుతున్న మాట నిజమైనట్లు తోచదు. అయినా శాంతంగా వచ్చి కొంతసేపు కాలం గడపి హృదయాన్ని సమాకర్షించి ఊహవలయ మాక్రమించిన కాంతి సింహానికి భయపడి చీకటి గుహలో దాగిపోవడం కన్న మృత్యువు నయం ! భయపడడం అజ్ఞాన లక్షణం దాగిపోవడం తిరోగమన వర్తనం. మూసుకున్న ఐదు వ్రేళ్ళు లోకంలో తనకుగల మమతాభావం పూర్తిగా వదలజాలని వెలుగులదొర, ఆశలు గ్రీష్మంలో పలాశాలవలె ఇంకా 1 దిక్కుల చివరలు పట్టుక వ్రేలాడే సమయం. అసివాళ్ళోరూ ఎదురెదురుగా కూర్చున్నారొక రాతి పరపుపై ఐదుగురు. యుగసంకేతం 83 ఇంతవరకు సంపూర్ణంగా నెరవేరని 2 కోర్కెల ప్రకటనలతో కాలం గడపుతూ. 3 ఆకాశ మొక ఇంటికప్పు ఎప్పుడు వేశారో తెలియదు. కాని ఇప్పట్లో కూలదని వారి నమ్మకం. మానవుడు జన్మించడంతోనే లభించిన స్థిరాస్తి–దిక్కుల గుండెలలోకి చొచ్చిఉన్న భూమి. చరాస్తి–జీవితగతిని పరిపాలించే ఊహశక్తి. ఒకరిమీద వేరొకరికధికార మసలే లేదు. ఎవరికిష్టమైన పని వారు చెయ్యవచ్చు. మృత్యువు ఎక్కడో లేదు. తమ ఊహలలోనే ఉందని తెలుసు. అయినా క్రమంగా ఒకరిమీద వేరొక అధికారులై ఒకరి మృత్యువుకు మరొకరు కారణభూతులైనట్లు నడుస్తుంది ప్రపంచం. అందరికీ వెలగబెట్టాలని ఉంటుంది కాని అందరికీ తగిన అవకాశాలేవీ ? అందరూ ప్రభువులే ఐతే ! ఎలా సంభవిస్తుంది ? కాబట్టి ఘర్షణ, విభిన్న రూపాలలో సాక్షాత్కరించడం జరుగక తప్పదు. ఇంతకు చెప్పదేమంటే వీరు, అంటే ఆ ఐదుగురూ ‘ దేవుని కాలివ్రేళ్ళు ’ అని అంటారు కొందరు. 4 కాని రాక్షసుల చేతి వ్రేళ్ళు — ప్రస్తుతం. 84 యుగసంకేతం ప్రయోజనం మేర 5 రీతి క్రమం మారు మైనపు బొమ్మలు, ఇంతకు వ్యంగ్యరేఖా శరీరులు. వినిపిస్తవి అపుడపుడూ అరపులు, చప్పట్లు, ఈలలు. బహు విచిత్రధ్వని సమ్మిశ్రిత విపరీతపు టూళలూ. ఇది వారి సంగీతం, సాహిత్యం. సర్వం సన్యసించి జగన్మిథ్యా భావనతో తత్త్వ పరమార్థ శోధనచేస వేదాంతి అధికారం హస్తగతం చేసుకొని దర్పంతో లోకాన్ని శాసించాలని కోరే పెద్దమనిషి, విద్యాబుద్ధి ప్రచాలనంతో లౌకిక పదవిలో యశఃపద జీవితం గడపగోరే హితవాది పరలోకమున్నదో లేదో ఎవడికెరుక ? ప్రస్తుతం భోగవాంఛలో తృప్తిపడు మరొకడు. శ్మశాన పదవికి వెళ్ళే క్షణంవరకు ప్రాణం ధనానికి ఘనంగా లంకెవేసికొని ఉన్న శరీరి. జీవితంలో వారివారి కోర్కెల ప్రకటానంతరం ఎవరికివారు లేచి వెళ్ళాలని ఉద్యమించగనే 6 బుసకొడుతూ ప్రాకుతూ సర్వ శరీరం 7 కరవడ మారంభించినవి గాలులు, పాములవలె చాచిన ఐదు వ్రేళ్ళు క్రమంగా మూసుకపోయినవి. 8 మీద మింటికప్పు కూలి పడినట్లున్నది. అక్కడే ఉండిపోయారు వారు 9 చెల్లని రూపాయి నోట్ల వలె. యుగసంకేతం 85 నెక టై చుట్ట చుట్టుకున్న పాము పరుపుపై రాత్రి నిదుర పోయి సగం నిదుర మత్తులో ఉదయంలేచి నడవడ మారంభించిన నా వెంటబడి పరుగిడి వచ్చి మెల్లగా శరీరం ప్రాకి మెడలో మెలికలు తిరిగి చుట్టుకుంది. కనులనుండి జారిపడు నీలి నీడలు కదలకుండా కాళ్ళను పెనవైచుకున్నవి. గాలిలో రెపరెపలాడు పమిటలా గమనం సాగని స్థితిలోనున్నవి ఊహలు. కనురెప్ప వ్రాలే అవకాశం లేకుండా ఆలోచనా పరాగంతో నిండినవి నేత్ర పద్మాలు. దట్టంగా చుట్టూ మంచుపొరల క్రమ్మిక నైకభావం మరపించింది. గాలికి ఆరని, నీటికి తడవని దివ్యదీప శిఖవలె, మేల్కొని ఉండి అనాదినుండి ఆకర్షిస్తున్న స్నిగ్ధమూర్తి ! ఛాయారూపం. లోకానికానందం, దుఃఖం విధిగా కల్పిస్తూ ప్రేయా రూపంతో, ఎన్ని యుగాలు గతించినా నశించని ఏనాటికీ తరుగని ప్రభావరూపం. ఆమె లేనిది సృష్టికే స్థితిలేదు. ఆమె లేనిది సృష్టికి శోభ లేదు. జాగ్రదవస్థలో బుద్ధినాక్రమించి 86 యుగసంకేతం కంటికి కన్పించేది, ఇంతకు మెడలో వ్రేలాడే ‘‘ నెక టై. ’’ గాజు గది మనలో ప్రతివాడు తనకు తాను ఒంటరిగా ఒక గాజుగోడల గదిలో చిర నివాసం. అవతలి మనిషిని గమనించడం, పరీక్షించడం తనకు తానతి గోప్యంగా ఉన్నానని ఊహించడం. దరవాజాలు కిటికీలు లేనే లేవీ గదికి. లోపలినుండి మనిషి రా వీలులేదు బయటికి. బయటినుండి లోపలికెలా వెళ్ళగలరని ప్రశ్న ? అద్దాలు పగులగొడితే ? బయటికి రాగలడని నమ్మకం 1 సరోవరంపై నీటి పొర లొకటొకటీ ఒలిచి అందులో ఉన్న చంద్రుని పట్టుకొని ఆనందించడానికి యత్నించినట్లు. ఒక మేరలేని అవసరాల కల్పనలతో అపుడపుడూ ఒకరి గదిలో వేరొకరు చొరబడి ఏమున్నదో ఏమిలేదో ఏలాగో చూడాలని మరీ మరీ ఉబలాటంగా ఉంటుంది. ఎంతదూర మెన్ని గదులు దాటి వెళ్ళినా నాకు ఆవలి లోకానికీ మధ్య ఎప్పుడూ కనీసమొక గది నిలచి ఉంటుంది. అడుగువేసి ముందుకు సాగినపుడు ఎదురెదురుగా ఒకటొకటీ చంద్రునివలె యుగసంకేతం 87 ఎంత ప్రహ్లాదమయంగా ఉంటుంది. వేసిన అడుగు తీయడం మానినపుడు ఎక్కడిదక్కడే నిలచినట్లై సమాధివలె ఎంత భయావహంగా ఉంటుంది. సృష్టి కదలికలోనే ఉన్నది ఆనందం. ఎంత పరిణామ జీవితమైనా ఒక మానసిక వ్యాపారం. మానవుని కోర్కెల సాగుదలకు చిట్ట చివరి మెట్టు; మృత్యుపదవి, చీకటిముద్ద, జడస్థితి. అందుకే అంత భయం ! సంధి పత్రం అడుగుతీసి వేసేలోపల కాలాన్ని హత్యచేసి కాలం దాని స్థానమాక్రమించి 1 తిరిగి కాలంచే హతమౌతుంది. 2 అడుగు తీసి వేసేలోపల ఉషస్సుకు తమస్సుకుగల దూరమనల్పం. 3 వేసిన అడుగు తీసలోపల తమస్సుకు ఉషస్సుకు గల దూరం అంతే. కాలం సాగినకొద్దీ క్రమంగా చంద్రుని కిరీట మెగురగొట్టి 4 పదవీభ్రష్టుని చేస్తాడు సూర్యుడు, 88 యుగసంకేతం కాలం మారినకొద్దీ క్రమంగా చంద్రుని కిరీటం వెలసి, తిరిగి 5 పదవీ పూర్ణత్వం లభిస్తుంది. అయితే ఈ లోకంలో అడుగుతీసి వేసేలోపల కాలం, మనిషికి మనిషికి మధ్య సామీప్యం దూరదూరమై పోతే పోనీ. రాక్షసులకు రాక్షసులకు మధ్య దూరం దగ్గర దగ్గరై పోతే పోనీ. అందరికీ ఆలోచించడం చేతకాదని ఒకడే అందరి బదులూ యాచన చేసి ఒక్కడి మాట అందరికీ శిలాక్షరమయ్యే పూర్వపు నియంతల రాజ్యం మళ్ళీరానీ చెట్లు గాలికి చలించడం మాని వెంటనే గాలిలోనే కదలిపోవడ మారంభించనీ. దొంగచాటు వ్యాపారం సహజమై భయం జీవితాన్ని ఆక్రమించుకోనీ. జంతువులు, కాదు మృగాలు గెలిచి మానవులపై అధికారము సాగించనీ. మన నీడలే మన పై తిరుగబడి సహజశత్రుత్వం పెంచుకోనీ. తలలూపు చెట్లగుంపువలె జనం, మూతబడి వెలుగెరుగని కళ్ళతో శిలాస్తూపాలవలె నడుస్తూ వీధులలో అడవిలో వేణువులవలె రొదచేస్తూ చీకటి బ్రతుకుల కలవాటుపడి నిద్రలో మృత్యువుతో 6 సంధిపత్రం వ్రాసుకోనీ. యుగసంకేతం 89 ప్రాణులం అందులో మానవులం కాకపోమూ ? బ్రతికినంతకాలం జీవితమనిపించుకోదూ ? ఊపిరి ఎక్కడిదక్కడే ఆగిపోదుకదా ! 7 అడుగుతీసి వేసేలోపల కాలం ! పతాక వార్త ఉదయంనుండి సాయం సమయం వరకు మండిపోయే అగ్నిజ్వాలా తోరణాలతో నిండిపోయి, రాత్రివేళకు మసిబొగ్గై ఆరిపోయి, చల్లబడిన శ్మశానంవలె ఉన్నది, చీకటి పొరలు క్రమ్మిన నీలాకాశం. అక్కడక్కడా గాలికి చెదరిన నిప్పురవ్వలవలె చుక్కలు. పిండుకట్టిన భయంతో బిగిసి ఉన్న నిశ్శబ్ద వాతావరణం చీల్చుకొని ఒక్కమారు వెర్రికేక ! రివ్వున గాలి వేసిన ఈలలకు చివాలున చప్పట్లు చరచినవి చెట్లు. అలలులేని చీకటి నీటిలో ఒడ్డునుండి ఏదో బరువైన వస్తువు ఒరిగి పడిపోయిన చప్పుడు; అంతలో నిశ్శబ్దంలో లీనమైన స్థితి. ఝటితిస్ఫూర్తి కలిగి మేల్కొన్న మనస్సులో ఒకటి రెండు పురాస్మృతుల కదలిక. 90 యుగసంకేతం కదలిక గుర్తుపట్టి ఎవరో మెలమెల్లగా భయం భయంగా జారిపోయినట్లు గుర్తు. అలికిడి విని గుంపులు గుంపులుగా సాగి అలజడిగా ప్రతి అంగుళం మేర గాలించి చివరకు కాలిజాడలైనా తెలియని స్థితిలో విసిగి వేసారి ఉన్న గాలులు–సీత్కారాలతో అక్కడక్కడా నిదుర మత్తులో తూగుతూ సగం మేల్కొని ఉన్న చెట్లగుంపులతో గుసగుసలాడుతూన్నవి, అదే పనిగా – ఎప్పుడో ఎక్కడో భయంతో తలదాచుకొన్న చంద్రుని పాదాలు కన్పించీ కన్పించడం లేదు. మరో శవదహనానికి ఆకాశాన సత్వర సన్నాహం జరుగుతూన్న చిహ్నాలు. సృష్టి జరిగిన నాటినుండి మొదలుకొని ప్రతిరోజూ ఇలా ఎంతకాలం సాగుతుంది ? ఎవరో చిత్రవధ చేయబడినట్లు ఉదయాకాశ ముఖంపై పతాకవార్త. వెనుక ఈడ్వబడుతూ వచ్చే క్రీనీడలతో వీధిలో నడుస్తున్న నేను పునర్జన్మ ఉన్నదో లేదో తెలియదు, కాని ప్రతి ఉదయం మరోజన్మ ఎత్తినట్లుంటుంది. నేను పుంజీభూత తుహిన రేఖవలె నేను ఎప్పుడు, ఎక్కడ విశ్రమేస్త అప్పుడు, అక్కడ రాత్రి వెన్నెల. యుగసంకేతం 91 1 ప్రగాఢ నిద్రా సమాధిలో ఉన్నపుడు 2 ఎవరో రాక్షసుడు, తమోమూర్తి చల్లనిగాలి పీల్చడానికి బయటికి వస్తాడు. వాణ్ణి చూచి భయపడి లోకం విజ్ఞానేంధనాలు జ్వలింపజేసి భస్మం చేయాలని యత్నిస్తే వాడు కాష్ఠంవలె కాలి చివరకు ధూమరేఖలా ఎగసి వచ్చి మరో రూపంలో 3 కనులలోకి తొంగి చూస్తాడు. మనోజీవలక్షణాభిజ్ఞత లేని రాతియుగంనుండి మనో జీవ సంస్కార సాహిత్యం లేని ‘స్పుట్నిక్ ’ యుగం వరకు తమ నీడ చూచి తామే భయపడి తమపై తమకే నమ్మకం చచ్చి ఆ రాక్షసప్రవృత్తికి లొంగిపోయి మూర్చాసమస్థితిలో నున్నపుడు; ప్రాభాతారుణ చైతన్య రేఖవలె 4 నిదురనుండి మేల్కొని నేను ఎప్పుడు ఎంతవరకు పయనిస్తానో అప్పుడు అంతవరకు దివాభోగము. గాలులు ప్రతి క్షణం, ప్రత్యణువు శైలీరూపం దాల్చి గతంలో లీనమా జీవిత సమాధిని కదలించే గాలులు. 92 యుగసంకేతం పొంగులుగా గుమ్ములుగా క్రమ్ముకొని 12 వచ్చిపోవు వెలుతురు చీకటిలో 34 తొలి మలి సంధ్యవేళల 5 విరిసిన మనసు మల్లెపొద పైనుండి, 6 త్రాచుపాముల పూత్కారాలతో 7 తుమ్మెద బారుల రొదలతో 8 గుప్పున కమ్మని తావులతో 9 ప్రాణ తర్పణంగా నిండుగా 10 ప్రాణ ఘాతుకంగా తీవ్రంగా కదలివచ్చు గాలులు. యంత్రంవలె వేగంగా గడిచిపోవు బ్రతుకులు విడిచే బరువు నిట్టూర్పులు, నాగలివలె మెల్లగా కదలిపోవు బ్రతుకులు వదలే ఉష్ణ నిశ్వాసాలు, మోసుక వచ్చి – సతతం 1112 సగం గాలిలో, సగం నీటిలో ఉన్న 13 నా గుండె నూపి, ఊహింప జేయు ధ్వనిగర్భిత పరిమళ సంభారవాహులు. భూమికి మేఘాగమన రహస్యం తెలియజేసి వృక్షాంగనలను కౌగిలించుకొని కబుర్లు చెప్పి హృదయంలో అగ్ని రగిల్చి, దీపాలు వెలిగించి కపాల రంధ్రాలను పూరించి సంరావం చేస్తూ అంబుధి విలోల వీచీ తంత్రీ మృదు నిస్వన రాగాలను వినిపిస్తూ, పరిణామ మేధా ప్రపంచ దిశల ఆలోచనా కిర్మీర పరాగం చిమ్మే గాలులు. బహు దూరదేశ సమాయాత వార్తావాహులు. సృష్టిని మేల్కొల్పు ఉషఃకాల సాంగీతికులు. బ్రాహ్మీముహూర్త మహిత వేళ సృష్టి రహస్యం ఊహింపజేయు గాలులు. యుగసంకేతం 93 శిలల ఒరపిడులతో కదలిపోయే సెలయేళ్ళ చిరునవ్వుల సవ్వడితో నా గొంతునుండి సాగివచ్చు పాటలకు శ్రుతులు పోసి, ఎత్తిన అలల తలలపై మెత్తని కాలూని కదలివచ్చు గాలులు. పసిపాపల పెదవులపై చిందులాడు వెలుగు నవ్వుల గలగలలవలె ఆరని ఎదమంటలతో శత్రువువలె, మనస్సును కదలించి కవ్వించు గాలులు. ఈ గాలుల నేనెలా మరవగలను ? కాంతి గీతం చీకటి గుడిపై వెలిగే తారల శిల్పసౌందర్యం విలోకించే కన్నులలో వెలుగురేఖలు తులకించేవేళ, చైతన్య స్ఫుర్జితమైనప్పుడు హృదయం, వెలుగు తలుపులు మూతబడిన చీకటి కోటగోడలు దూకివచ్చి ఎవడో సూర్యుడు చంపేస్తాడనే అజ్ఞాతభయం తొలగిన వేళ – ముడుతలు పడిన శరీరంతో నడవలేని పండు ముసలి సముద్రుని తరుణ హృదయంలో, 94 యుగసంకేతం ఊగిసలాడి మలగిపోవు కామనలకు ఉప్పైన రూపంలో ఆకృతి కలిగినపుడు – గ్రీష్మాదిత్య జ్వాలలకు తపించి వర్షాంబుద జలాధారా బంధురమై భూదేవత విడిచే సురభిళ నిశ్వాస పవన వీచికలవలె ఊహలు బుద్ధిని అల్లుకొని మనస్సులో మల్లెలు వికసించిన వేళ – వినిపిస్తుంది కాంతిగీతం. సూర్యతేజో కిరణలవమెరుగని స్థితిలో జివ్వున నేత్రునాడులు లాగు చలిగాలికి బిగిసిన మంచులా మారి, చలనశక్తి ఉడిగిన నదివలె; ముసరుకొన్న పేదరికపు దాడులకాగలేక పొంగులతో పరుగులెత్తు నేత్రు వాకలొక్కమారు ఆగిపోయి ప్రేతాకృతులవలె మారిన చీకటి మనుషుల గుండెలలో, చైతన్యపు నిప్పులు చిందుతుంది ప్రత్యణువు స్ఫులింగంగా ప్రతి మనస్సు విద్యుద్దీపంగా వెలుగు జేస కాంతి గీతం. నీలి కళ్ళు తెరచిన చీకటిగుహలో జ్యోతీరూపంలా వెలుగు శిల్ప విన్యాసంలో ఆలోచనలనంతంగా సాగే మస్తిష్కంలో సౌందర్యం సౌహిత్యం ఎరిగిన మనస్సులో ముఖ్యంగా సిలువ వేయబడిన వేళ మందారాలు పూచిన క్రీస్తు ముఖంలో విరిసిన కాంతి గీతం. యుగసంకేతం 95 అందమైన పూర్ణచంద్రుని ముఖంపై కాలం విసరిన కత్తిదెబ్బ! తీక్ష్ణమైన సూర్యుని మనస్సులో కంటికి కన్పించని గాయాలు స్వచ్ఛమైన శరదాకాశంలో కదలాడే నీలిమబ్బు తునక, జీవితంలో నెరవేరక మిగిలిపోయిన కోరిక, వీనిలో దాగిన నైల్యరేఖ. నీడలా వెన్నంటి ఉండి ప్రాణిని తనలో ఐక్యం చేసుకోజూచు మృత్యువు. బుద్ధుని ముఖంలో విరిసిన కళాచైతన్యం, తనలో లీనీకరించుకున్న కాంతిచక్రం. అతని పాదాలముందు మెట్లుమెట్లుగా మలగి అణగిపోయిన చీకటి ముద్దలు. చీకటి–సమగ్ర మాయారూపం రాక్షసుల ముఖాలపైని జీవకళ. వాళ్ళ ఊహలు చలింపజేయు శక్తి లేనిది, దేవతాత్మకమైన వెలుగు కింత ప్రశస్తి ఉండేదా ? శైశవం కాలస్థల జ్ఞానం మమకారం ఎరుగని దశ శైశవం. ఏ వికారమూ ఎరుగని సృష్టి మొదటి రూపం. 96 యుగసంకేతం హాలాహలలవ మెరుగని అమృత భావనా క్షీరధి. పితరుల ఎద కంటికి మూర్తిగొన్న సుకృత రూపం మొగిలు ఉడుపులలో పొరలి మిన్ను మన్నులో ఆడి మాసిన మేనితో తిరిగి చీకటిలో మాయమవక తిరిగే చందమామ మెలగి తీరుతాడు ఎదుట బాల్యం తలపుకు రాగానే మొదట. ఇటలేవు స్వర్గ నరక రూపాలు ఇటలేవు పుణ్య పాప భావాలు. ఏండ్లు పైబడిన కొద్దీ వికసించి బుద్ధి, ప్రకృతికి దూరంగా వికృతికి శిఖరంగా కోపతాప సంతోష హాసాలు, లౌకిక మర్యాదల మూసలో దిద్దుకుంటాయి వివిధ భూమికలు. శ్లిష్టమె క్లిష్టమై విడదీయరాని చిక్కువలె చూపుకందని ఆకాశంవలె ఎంతలో మారుతాయి బ్రతుకులు. స్వీయ బాల్య స్మృతులు మనోవిశ్రాంతికి నెలవులు. లోకంలో అలసిన మనస్సు ఇంత ఊహాస్పర్శ కోరుతుంది. మానవ జీవితంలోని శైశవం ఊహలో ఇగిరిపోని గంధం. యుగసంకేతం 97 నిప్పు పూలు అగ్ని దేవతామూర్తి చూపులలో గ్రీష్ముడు నడచిన అడుగులలో సూర్యుడు తెరచిన వేయికళ్ళలో ఒక్కమారు అంతటా – పూలు కణకణలాడే నిప్పు పూలు. పూర్వం నియంతల హంతకుల నాజీల గుండెల గోరీలపై విరబూచి వెచ్చని నిశ్వాస ధూమం విడుస్తూ సతతం మండి మండి మ్రగ్గే నిప్పు పూలు. తమలో చల్లదన మెరుగవసలు విద్యుత్తులా ప్రాకి సిరాపథాన దిమ్మెక్కించి శిలవలె నిల్వజేసి, విసరితే తాకి అగ్నివలె దుస్తులను మాత్రం కాల్చని నిప్పు పూలు. నవ్వులు చిందు అకాల మృత్యు రేఖలు. ఇవో రీతి నిప్పు పూలు అంతటా దొరికే రకంకాదు. మధుర మధుర గర్జా నినాద జలధారా స్నిగ్ధ మేఘం; మృదుసుషీమ వాస్తరంగ జలధి, కవి హృదయం, వాటికి నివాసం. అతడు వ్రాసే ప్రతి గీతానికీ ఈ నిప్పు పూలవాసన ప్రాణాధారం. స్వేచ్ఛా వాయువు, కాంతి కిరణం కోసం సతమతమౌ పరితపించు గుండెలలో, అజ్ఞానపు అర్ధరాత్రి పన్నిన వలలో చిక్కి 98 యుగసంకేతం ఉదయం మేల్కొని ఛేదింపగ యత్నించే ప్రాణికోటి గుండెలలో విరబూసి; మారణాస్త్రాలకు మాడిపోని నిప్పు పూలు. స్నేహవీచి అంగారనిధి గ్రీష్మ దేవత రక్తానలం చిమ్మే నాల్కలు చాచే వేళ తడి ఆరిన పుడమి గొంతుక చల్లని నీటికోసం తపించే వేళ ఎండలు మృగతృష్ణ పెంచేవేళ శిలవలె హృదయం ఘనీభవించి ప్రపంచం శ్మశానంవలె మారే వేళ. ఎక్కడనుండో ఏ కోననుండో వేలాది మైళ్ళు వ్యాపించిన అగాధ సముద్ర తరంగాలపై రవళిస్తూ, వాటిని కబుర్లతో మురిపిస్తూ, సై కతాలపైకి పొరలే నదీ తరంగాలను కిలకిలా నవ్వులతో ముంచేస్తూ, వృక్షాలను కుశల ప్రశ్నలతో సంభావిస్తూ గలగల ఊగిస్తూ మధ్య మధ్య ప్రేమతో సమున్నత శైల శిఖరాలను శీతల హస్తాలతో స్పృశిస్తూ, తెల్లని నల్లని జాతి జాడ్య మెరుగక మతాల సూత్రాలకు కట్టుబడక, రెక్క విప్పిన ఆనందపు లేజగా యుగసంకేతం 99 వెన్నెల పులుగువలె పూర్ణిమా చంద్రోదయ వేళ సముద్ర తరంగంవలె వచ్చి ‘‘ మనిషి మనిషి, మనస్సు మనస్సు పరస్పర సౌహిత్య పరామర్శన విశ్వశాంతికి సమర్చన ’’ అని గుండెవిప్పి మాట్లాడగల శిలా ప్రతిమల గుడిముందు విశ్రమించిన నా చెవిలో టీకాటిప్పణి వ్యాఖ్యాన ప్రమేయం లేకుండా ప్రతి మనస్సున అవగతమయ్యే భాషలో నిశ్శబ్దంగా రహస్యంగా ఊది మృదువుగా కరచాలనం చేస్తూ నిమిషపు కదలికలో వెళ్లిపోయింది నిశ్శబ్దపు కదలికలో మరో కోనకు. నవశీతల మృదుల వాయేస్నహ వీచి. కీర్తి స్తంభాలు ఒకనాడు సుజాతకుల హృదయద్వార కవాటాల ముందు ప్రేమావృత జిహ్వలు చాచి తారాడిన భుజంగాలు. శత్రుపు కనులముందు దివారాత్రం నటియించిన పెనుభూతాలు. పాదమెత్తలేని నోరు కదపజాలని కాల శ్మశానంలోని కీర్తి స్తంభాలు. 100 యుగసంకేతం నాడు, వేదనలతో కంపించిన హృదయాబ్జం బాధలతో శీర్ణమైన తనూశిలం, నేడు ధారాళ్య స్ఫటికమయ ప్రాంశుమూర్తియై నిలచి; ప్రశాంత మౌన భాషలో ప్రతి మనీషి గుండెనూపి మాట్లాడే దేవరెరుగుదురు ? నేడు, శీతల చందన పరిమళ వాయు పరిహాస శ్రీలతో అపరిమాణ వజ్ర శరీరాలతో అవిగో ! నిల్చిన కీర్తి స్తంభాలు. గగన తలంపై వెలిగే సూర్య చంద్రులు ఏ విశ్వనాథుని కీర్తి చిహ్న కేతనాలు ? నా కనులనుండి మీ కనులదాక, నిండి మంటినుండి మింటికెగసి నిలచి, తాజ్ మహల్, అజంతా రూపాలవలె ప్రత్యక్ష ప్రమాణాల కందని, స్వచ్ఛ శ్వేత నిర్మల మూర్తులు, కాల శ్మశానంలో వెలుగు కీర్తి స్తంభాలు. లౌకిక శ్రీ నీవు నా ప్రకృతికి వ్యతిరిక్తమైన రూపానివి. యుగసంకేతం 101 నీ ఉనికి నా లోకానికి ప్రతిలోకం. నాకు నీకు ఉన్న సంబంధం మింటికీ మంటికీ గల అంతరం. ఎక్కడో దూరంగా మిన్ను వున్నూ కలసినట్లు కంటికి భ్రాంతి. ఎంతదూరం వెళ్లినా అంతా శూన్యం. ఎంతో దగ్గరిగా వచ్చినట్లు ఉంటావు. అంతలో మ్రింగివేయాలన్న ఎత్తుతో. ఒకప్పు డనుకులంగా మరొకప్పు డభేదంగా ఆత్మమూర్తివలె, నాలోకి తీసుకోవా లనిపింప జేస్తావు. నీ నుండి విడిపోవాలనుకున్నంతలో. నీవు చేస గాలి రొద చచ్చినట్లు పడిఉండి అడవిలా వినమంటావు, మేమంతా అంబేదలమనుకొని. ఊహ వాచా చేస్త తెలియదు. అనుకున్నది తు.చ. చేస్త తప్పవు. నీ గాలి అక్కరలేదనడం తెలిసి కోపంతో ముఖం కందగడ్డఐ అంతలో మంచుగడ్డ ఔతుంది ! ఆ లోలోపల ఏమౌతుందో ? ఆ భగవంతునికే తెలుసు. కాని సేసమిరా వదలిపోవు పీడా విరగడౌతుందనుకుంటే. 102 యుగసంకేతం నీరులేని మబ్బు ముక్క ఒకటి చాటు చేసుకొని నవ్విపోకు. నీరు ఉన్న మబ్బుతునకలేమైనా గాలికి వదలివేయి చాలు. పిడుగులు మాత్రం మనసులోనే భద్రపరచుకోవడం మరవకు. క్షణం మెరుపులిరువురునీ ఎప్పటికైనా మాసగిస్తాయి. ఉదయం వలె ముక్కు పై ఎరుపుతో కంటిలో వెలుగుతో పోయే నా వెనుకనే, రాత్రివలె డొంక తిరుగుడు ఊహలతో అపుడపుడూ వెన్నెల ముసుగుతో వచ్చే నీవు అబ్బో ! ఎంత లౌకిక శ్రీవి ! ఈ మాట ఈ చేత ఐదు వత్తుల్లా పొడవై పొడి చేస్తాయి కలసీ, విడిగా ఐదు వత్తుల్లా నిడివై వెలుగు నిస్తాయి కలసీ, విడిగా ఆటంబాంబు విసరి జీవితం త్రుంచేవి యుగసంకేతం 103 ఆశీర్వచనం చేసి ఆయుస్సు పెంచేవి. ఇవి కలసి నిలుస్తాయి శక్తికి ప్రతీకగా నేనూ నీవూ గుర్తించేవీ నీకు నాకు తప్పనివీ. రావచ్చు ఆరోజు కత్తులు బూజు పట్టేదీ వత్తులు ఆరిపోయేదీ ఇష్టమొచ్చినట్లు చెప్పొచ్చు. దేశమంటే ఏమిటి ? ఒక చిటికెడు మట్టి మట్టిలోని పరిమళం మనకు మిగిలే సంస్కృతి. కవిత్వమంటే ఏమిటి ? ఒక విలువైన మాట. మనసుకందే అనుభవం చేయి దాటిన శక్తి రూపం. ఆకులు గాలికి మాట్లాడినట్లు హృదయం మమతా లోలమై కత్తుల మెరపులో, మెరపు వెలుగులో నడచే మనిషి గుండెలో, సూర్యుడు ప్రగతిశీలం నా వర్తనం మెలకువ నా విప్లవం ఈ చేయి శక్తికి ప్రతీక ఈ మాట నా ఎదమ్రాత. 104 యుగసంకేతం ఎవరు మీరు? అస్తమించే సూర్యబింబంతో ఆనందం విడిచే ఆకాశాన్ని, నా కళ్ళలోకి తొంగిచూస్తూ మౌనంగా నీడ బొమ్మలవలె వెళుతూంటారు ఎవరు మీరు ? ఉదయించే చంద్రబింబంతో విషాదం విడిచే ఆకాశాన్ని అవలోకించే సమయంలో నా కనులముందు తారాడుతూ దీనంగా నీలి నీడలవలె భ్రమిస్తూంటారు ఎవరు మీరు ? వెలిగే తారాదీపశిఖలు ఆకాశంలో విడిది చేసవేళ వృక్ష వర్షీయసి కోర్కెల ఆకులు విడిచే వేళ కాలాన్ని మ్రింగే చీకటివలె శైశిర విచార వాయువువలె వస్తూంటారు ఎవరు మీరు ? మిమ్ములను చూడగానే నా గుండెలో పూచిన పూలు కళ్ళనుండి జారి రాలి పోతాయి. గగనవీధి పాలవెల్లివలె మస్తిష్కంలో విరిసిన ఊహలు చలించడం మానివేస్తాయి. దైన్యభావం రూపుగొన్న మీరు దెయ్యాలా ? ఎవరు మీరు? యుగసంకేతం 105 దీపానికి నీడ ఎంతదూరమో నాకంత దగ్గరిలో వెలుగు మేడక్రింద చీకటి నిచ్చెనవలె నిల్చిన మీకు నామాట వినిపించడం లేదూ! మీరంతా చీకటి మనుషులా ? అరె ! ఎక్కడా కన్పించరేం, ఇంతలో ఏమయి పోయారు ? భానూదయ సమయం ఆసన్నమైంది. ఉదయవేళా శిల్పమైంది శరీరం. నటత్ కాంతి ధునీ ప్రావారం నా భుజాంసవీధి నలంకరించింది. ఇరవై ఒకటో శతాబ్దంలో చంద్రుడు అనాదినుండి నిన్నగాక మొన్నటివరకు నీవొక దేవతవు, అంటే చెబుతా మా మనస్సులో కలిగే ఆహ్లాదమంతా ఒకచోట గూడుకట్టిన రూపానివి. బూషులచే దర్శింపబడి దేవతల కమృతాన్నంగా, చిబుకంపై పుట్టుమచ్చ అందం మరచిన ఈ దేశపు కవులచే ఊహింపబడి ప్రేయసీ ముఖ బింబంగా, ఆకాశాన వెలిగే అమృతమూర్తి ! చీకటి సెమ్మెపైని వెలుగు వత్తి ! 106 యుగసంకేతం నీ నిదుర యొక్క ఛాయారూపం, చీకటి. నీ మెలకువ యొక్క వెలుగుచాలు, వెన్నెల. సందేహ భీజాలకు, సమస్యా వృక్షాలకు ఆకరమైన ఆకాశాన జీవితం గడుపుతూ, ప్రణయ కోవనులకు దౌత్యం కొనసాగిస్తూ ఆలాగే ఉన్నావు కళల మార్పుతో ఇంతవరకు – సరే ! ఆ సంగతి అలా ఉంచుదాం. రేపు అంటే ఇరవై ఒకటో శతాబ్దంలో — మేఘం మనస్సులో, సముద్ర గర్భంలో అరణిలో, అగ్నిని దర్శించి మానవుడు దేవతగా భావించిన నాటినుండి గోళ స్వరూపంగా నిర్ణయించిన నేటివరకు, జిజ్ఞాసా పరిశోధనల చరమదశ నీ శిరస్సుపై కాలూనడంతో సరి. హద్దుల అతిక్రమణ జరగడానికి ప్రక్కన పరాయివాడంటూ ఉంటేగా నీకు. ముఖంపై కత్తిగంట్లు పెట్టడానికి ఎవరికీ అందని ఎత్తులో ఉన్నా వింతవరకు. ఇకముందు వెలుగు కెరటంలా తేలుతూ గాలిబంతిలా ఎగిరే శరీర నిర్మితితో ప్రతి మనిషీ కాంతిగోళంగా మారి ప్రతి మస్తిష్కం టెలివిజన్ యంత్రమై, మేమంతా మీ స్థానమాక్రమించి పూర్వం నిన్ను గురించి ఈ లోకంలో వ్యాప్తమైన అభూతకల్పనలకు స్వస్తిచెప్పి సాగించి పరిశోధనలు ఆయుర్దాయం తేల్చి యుగసంకేతం 107 కొండజాతికి చెందిన వాడవనో రాతి నేలవనో నిశ్చయించి ప్రకటనలు జరుపవచ్చు. అపుడు నీ చుట్టూ రక్షణకై అమర్చబడిన యంత్రాలు. నియమింపబడిన సోల్జర్లు. పైన తిరిగే విమాన ధ్వనులు. క్రింద ప్రేలే బాంబుల ధ్వనులు. నీ జీవిత స్వరూపం మార్చడానికి అహమహమికతో పరుగిడి వచ్చే పరిశోధకులు, రాజకీయ డాక్టర్లు. తెలియని భాషలలో ఏవో ప్రసంగాలు. తమలో కలుపుకోవడానికి సాగే తంత్రాలు. హద్దులు కలిగిఉంటేనే దేశాల ఉనికి. హక్కులు కావలసివేస్తనే ఊహలో విభేదం. మనస్సులో పొరలుంటేనే ఏర్పడేవి జాతులు. సూర్యుడున్నంతవరకు నీ వెలుగు నశించదు. నిను గూర్చి పూర్వం పగటి కలలు కన్న మేము. నిన్ను రాజకీయ వేదికగా లేదా వ్యాపార సంస్థగానో మార్చవచ్చు. కాలపరిమితి దాటిపోయిన హక్కుల పత్రం చెల్లుతుందా ? కాంతి గోళంవలె వెలుగు నీకు మా అధికారంలో వ్యక్తిత్వం ఉండదూ ? చలికి బిగిసిన మంచు మనిషిలా ఒంటరిగా గగన వీధి బిక్క మొగంతో బీదతనంతో 108 యుగసంకేతం పాలిపోయి కన్పించిన చంద్రుని చూచి, ఊగిసలాడిన హృదయం సృష్టించుకున్న ఊహాత్మక చిత్రం. దేవునితో టెలివిజన్ గోషి ముఖ్యంగా ప్రతినిత్యం నేను ఆనందం విషాదం అనుభవించే ప్రపంచంతో ప్రగాఢ సంబంధం కలవాడిని బ్రహ్మైక్య భావన చేసి, మీకందకుండా ఎక్కడో దూర దూరంగా ఉండి మాట్లాడే ఇష్టంలేదు. కాబట్టి – భయంతో కూడిన గట్టి నమ్మకంతో తమ కీర్తిని కాపాడే మనుషులకోసం, బ్రతికే దేవతలు నివసించే ఆకాశంపైన, లోకాలను ఆగ్రహంతోను, అనుగ్రహంతోనూ కాంతి బాహుపంజరంలోకి తీసికొని ప్రేమించే సూర్యుడు, కామించే చంద్రుడు వెలుగు, వెలుగు లోకాలలో — ఆపైన సర్వం భస్మసాత్కృతి చేసి జ్వలించే అగ్నిలో లోకాన్ని మాయంచేసి మాట్లాడని చీకటిలో ఇంకా భూమిలో, గాలిలో నీరులో నీలో నాలో అణువులో ఒదిగి బ్రహ్మాండం విస్తరించి, పూర్వం చాలమందికి వారి వారి సంస్కార దశలనుబట్టి అనుభూతి రీతులనుబట్టి యుగసంకేతం 109 భిన్న భిన్న రూపాలలో, బహుస్వభావాలతో కన్పించి, హేతువుకతీతంగా ఉండి సిద్ధాంతాలలో ప్రమాణ సహితంగా స్థిరత్వ మేర్పరచుకొన్న దేవునితో, ఇరవయ్యో శతాబ్దంలో ఆధునిక నాగరికతలో బ్రతికే మనిషికీ టెలివిజన్ గోషి జరిగిందని చెబితే ఇందులో ఎవరూ విశేషంగా ఆశ్చర్యపోయి సశేషంగా ఊహించి అనుమానాల కేమాత్ర మవకాశమూ ఇవ్వనవసరం లేదని మనవి. ప్రపంచం విజ్ఞాన యంత్రశాలగా మారి వ్యక్తి జీవితం రాజకీయ తత్త్వంలో లీనమై సైన్సు వెలుగువలె బ్రతుకులు రక్షించేదై మతం మనిషికి చీకటి లోయలా కన్పించి జీవితానికి క్రొత్త వ్యాఖ్యానం బయలుదేరి, ఊహల స్వభావం దానితో క్రియా పర్యవసానం మారి–మానవ పరిణామ చరిత్రగతికి క్రొత్త విలువలేర్పడుతూన్న సమయం. చరిత్ర అట్టడుగున నిటారుగాదిగిన చీకటి లోయలో నీడలో కలిసిన నిన్ను పూర్తిగా మరవడానికెంతో కాలం పట్టదు. ఏ ఆకారమూ లేని నీకు రూపం కల్పించి నీ రక్షణ వ్యాజంతో జరిగిన అవమానాలు, హత్యలు, యుద్ధాలు చరిత్రలో అసంఖ్యాకాలు. నీ రూపకల్పనలు మలచడమే పరమ ప్రయోజనంగా మారి 110 యుగసంకేతం జీవిత యథార్థ్యం, సాంఘిక చైతన్యం కోల్పోయింది కళా ప్రపంచం. మాయలో మాయకతీతంగా మౌనంగా ఎవరికీ కన్పించకుండా కాలం గడిపే నీకు రానున్న శతాబ్దాలు మృత్యు మహాసోపానాలు. భూకంపం, యుద్ధం, క్షామం, నియంతృత్వం అన్నీ దురదృష్ట హేతుజనిత సంఘటనలుగా నీ దయారహిత కృత్యాలుగా చెప్పుకొని, ఇష్టంలేని బాధ్యతలనుండి తప్పుకొని బ్రతుకులు తెల్లవార్చే జనసందోహం ! నీ ఇష్టానుసారం మాపై ఇంతవరకు ప్రయోగింపబడిన భయంకరాస్త్రాలు దారిద్ర్యం, రోగం, దుఃఖం, మృత్యువు. విజయం సాధిస్తూ వీటిపై వంచిన తలయెత్తి క్రమంగా స్పుట్నిక్ దశకు చేరుకున్న మానవుడు ఇరవయ్యో శతాబ్దంలోని విజ్ఞానమూర్తి. అతని ఉన్నచోటునుండి కదలనీయకుండా అనాదినుండి పరంపరగా వస్తూన్న కర్మసిద్ధాంతం. వారసులకు సంక్రమించకుండా చేయడం ఇరవయ్యో శతాబ్దంలోని ప్రధాన ప్రయత్నం. గతానికి కొందరు చాల దగ్గరి బంధువులు. వర్తమానం, అందులో శిలానిద్ర వదలించే విప్లవం క్షమించరాని శత్రువు వారికి. జడ జగత్తుకు వారికీ అనాదినుండి మైత్రి. తోటి మానవుడే ఈ మైత్రిని భగ్నం చేయగలడు. అతనికీ కాలానికీ సముద్రమంత శత్రుత్వం. అక్కడక్కడా చీకట్లతో వెన్నెలతో నిండి లోయలతో ఎడారులతో అడవులతో, యుగసంకేతం 111 జంతు సమూహాల యథేచ్ఛావిహారంతో నిండిఉన్న ప్రపంచం, దశలుగా వ్యత్యస్తమై, సిద్ధించిన స్వాతంత్ర్యం సమభావం స్వేచ్ఛతో, కిరీటాలు అగ్నిలో మండి భస్మమై సామాన్యుని హృదయం ఉదయకాంతి చక్రమై ప్రతివదనం విప్పారిన సుమస్తబకమవడం ఇంతవరకూ సాగివచ్చిన శత్రుత్వ ఫలితం. ఒక దేశంలోని యుద్ధ జ్వర భయం విజ్ఞాన పురోగమన వేగం, ఒక జాతి సంస్కృతీ విశిష్ట లక్షణం ప్రపంచం సమంగా అనుభవించనున్న యుగం. వదలబడిన అణ్వస్త్రంవలె ఎదురులేక, మైదానంలో విసరబడిన బంతిలా సూటిగా వేగంతో పరుగిడుతూన్న కాలం. భవిష్యత్తును సూచించే జాతకచక్రం. కాలాన్ని నియమించలేడు దేవుడు. కాలానికి తల ఒగ్గక తప్పదు. ఉదయవేళ తూర్పున మంచుబొమ్మవలె పెదవి కదల్పక మౌనంగా ఉన్నా వేం ? ఇక నీతో జరేపదెలా గోషి ? నీకు నాకు ఎంతదూరమో తెలియదు. ఇక్కడే ఉన్నట్లున్నది నీవు నా ఎదకంటికి. ‘‘నేనెవరినో నాకు నీవిప్పుడు చెప్పేదాకా తెలియదు, కాని నిజం చెబుతున్నా విను. నీవూ, అంటే మానవుడూ ఒక దశలో దైవరూపమే.’’ 112 యుగసంకేతం కదలండి శతఘ్నులవలె ప్రొద్దుపోవడానికి బదులీ రోజున హఠాత్తుగా యుద్ధం వచ్చిపడింది, మన ముఖాల ముందు. యుద్ధవార్త వినిపించిందో లేదో జ్వాలలెగేస పూలనదులవలె నిప్పులు చిమ్మే గోళాలవలె చైతన్యం విరిసిన స్త్రీలు, పురుషులు. ప్రళయ సముద్ర తరంగాలవలె బుసలుకొట్టు త్రాచులవలె ఘోషలతో, ఫూత్కారాలతో నేల ఈనినట్లు ఎక్కడ చూచినా నలుమూలల వీధుల్లో, మైదానాల్లో ప్రతీకార వాంఛలు ప్రకటించే సమరభావనాయుత జనసందోహం. భరతజాతి హృదయం శాంతి కపోతీ నివాసం నివాసంపై తుపాకులు ప్రేల్చే హంతకుని మరవకండి ! మనం పీల్చేగాలి అప్పుడే బరువెక్కింది. లేవండి మహాగ్నులవలె, కదలండి శతఘ్నులవలె. మబ్బు మెరపులకు భయపడి సహజ గమన వ్యవహారం విడుస్తుందా ప్రపంచం ! మెషిన్ గన్లకు ఉలికిపడి భూభాగం గౌరవం వదలుతుందా భరత దేశం! యుగసంకేతం 113 పిడుగులు పరిహరింపజేస యంత్రశక్తి మేఘానికెంత తెలుసో? పన్నిన భూకబళన వ్యూహం సాగి చావదని శత్రువుకంతే తెలుసు ! లోహ రాక్షసుని కుతంత్ర వ్యూహం విచ్ఛిన్నంచేస దీక్షలో నిమగ్నులైన నా సోదరులారా ! స్వేచ్ఛా సమాజ బలం సర్వం మనదేశం వెనుకే ఉన్నది. మంచు కొండలలో విద్యుత్ప్రవాహంవలె మండే శక్తులతో నిలచిన సోదరులారా ! దేశ భవిష్యత్తుకై వెలుగు దివ్యజ్యోతుల్లారా ! విషవ్యూహం ఛేదించే అమృతమూర్తుల్లారా ! గుండెలో బాకు రువ్వి కీర్తి పతాక ఎగుర వేస శత్రువు వీడనిదే భూమిని జయింపనిదే వారిని సమర ప్రతిజ్ఞ వీడక సమర సన్నాహం మానక లేవండి మహాగ్నులవలె కదలండి శతఘ్నులవలె. బరువు నడకలతో, మాన ముఖాలతో ఆక్రందన స్పందించు అమాయక శీలంతో నగవు హరించిపోయిన పెదవులు బిగించి ఎక్కడో వంపులు తిరిగిన ఆకాశంలో ఆశలు భద్రపరచుకొని ప్రాణాలరచేత బట్టుకొని పిల్లలతో, పశువులతో, 114 యుగసంకేతం స్తంభించిన గాలిని కత్తులవలె చీల్చుకుంటూ తరలివచ్చే కాందిశీకులు! మానవతా సంస్కార స్పర్శలేని ఇనుప హృదయాని కెదురు నిల్చి దేశాన్ని రక్షించడానికి దేహాన్ని డాలుగా ఉపయోగిస్తూ, దేహంపైని రక్తసిక్త వ్రణాలు గులాభీ పుష్పాలుగా భావిస్తూ, ఒంటరిగా ఉన్నా తనచుట్టూ పదిమంది నిలచి ధైర్యమిస్తున్నట్లున్న మంచుకొండలలో, అగ్ని శిఖలవలె పదపదంలో ప్రళయలయ ఎదలో స్పందింపగ ఖడ్గసృష్టి, సాగే సోదర సైనిక బృందం. జాతి ప్రతిష్ఠకు ప్రతిరూపం. మూర్తీభవించిన తేజశ్శిఖరం. శ్వేతేతర విహంగాలు భవిష్యద్ రేఖాగమనం మార్చే ప్రజాహస్తాలలో చిక్కిన తమ జాతక ఫలాల కోసం ‘క్యూ’ మార్కు ముఖాలు చూచి; రాత్రివేళ భూమికంటక తిరిగే భూతాల మలిన దేహచ్ఛాయలవలె, యుగసంకేతం 115 మూకలు మూకలుగా ప్రతిచోటా విహరిస్తున్నవి శ్వేతేతర పక్షులు ! కాంతి హస్తాలక్రింద వెలుగు శాంతి హృదయ వాటికలో అంటు చీకటిచెట్లు నాటి నిప్పుపూలు పూయించాలని, నింగినిండా చీకటి నావరింపజేసి భ్రమగొల్పే తెల్లని రెక్కలు చాచి మిన్ను అన్నుబట్టి పోయేట్టు వినాదారభటీ శబ్దాలతో రేపటికి వేసే బాటలకన్నా ముందు మాపటికాడే ఆటలో రక్తి కట్టాలని అహరహం వీలైనంత శక్తి సమీకరిస్తూ, ఏకంగా ధాత్రినిండా వాలిపోయి సాంతం రాత్రిమయం చేయాలని ఉద్రేకంతో రివ్వు రివ్వున వేగంతో ఉరికి ఉరికి వస్తున్నవి పక్షులు ! పన్నిన కాంతి ఖడ్గజాలంలో అన్నీ హాయిగా విశ్రాంతి తీసికొనేనా? విహరించే శ్వేతేతర పక్షులన్నీ కన్పించే స్వేచ్ఛేతర కక్షలోవి. 116 యుగసంకేతం వివరణ ● నేను మేల్కొని ఉంటాను పగలు జీవన వృత్తి, రాత్రి విశ్రాంతి మానవ సహజం. దుర్బరమైన ప్రవృత్తులతో దుస్సహమై ప్రపంచం పగలు భయం వేసటంతగా వికృత రూపం ధరించింది. ఈ స్థితిలో మనస్సు పగలు నిదుర, రాత్రి మెలకువ వాంఛిస్తుంది. కారణం రాత్రి శాంతమైంది. దీనికి కారణమైన స్థితులలో, క్రమంగా మన స్థితులు–ఆశాజీవి పరంగా వచ్చే తరంపై విశ్వాసమూ ఇందులో చిత్రితం. ● ఎవరది దూరంగా అవివేకం, అశక్తత, అవమానం, దారిద్ర్యంతో మ్రగ్గే దేశస్థితి చిత్రితం. వ్యక్తి, దేశం, ప్రపంచం క్రమంగా ఒకదానికన్న వేరొకటి ఉన్నతంగా భావితమె చివర మానవత ఆవిష్కృతమైంది. ● అంతమవని కథ ‘ఊర్ధ్వమూలోఽహ్యవాకశాఖ ఏషోఽశ్వత్థః సనాతనః’ కఠోపనిషత్తు (తృతీయవల్లీ) ఈ ప్రపంచం సనాతన వృక్షము. దాని నీడ జీవనవృత్తిగా భావితమైంది. జీవన వృత్తిలో — మానవ యత్నం, వీడని బంధం, దాపని ప్రేమ మొదలైన ప్రేయా రూపాలు, వీటికి విరుద్ధ ఘటనలు క్రమంగా చిత్రితమైనాయి. ఈ నీడలు వీడనంత వరకు మానవుడు వెలుగులోకి రాలేడు. అప్పటి వరకు కథ అంతం కాదని — ఎప్పటికీ అంతమవని ఈ కథ సూచితం. అద్వైత భావన అంతర్వాహినిగా ఉంది. ● రెక్కలు దాల్చిన కొండలు వాయువు – కాలంయొక్క అనుకూల్యము; మేఘాలు — ప్రతిభ, సామర్థ్యము కలవారినీ, కొండలు— అసమర్థులను సూచించేవి. ● ఆఖరికి దేవుడైనా సరే సూఫీతత్త్వంలో రెండు దశలు ఫానా; బాఖా – బిందువు సముద్రంలో పడుతుంది. మొదట సముద్రాన్ని తనలో ఇముడ్చు కోవాలనుకుంటుంది. బిందువుల సమాహారమే యుగసంకేతం 117 సముద్రం, అందులో కలసి పోయింది. గ్రీష్మం రాగానే నీరు ఆవిరియై వర్షాకాలంతో తిరిగి అవతరిస్తుంది. పునరావృత్తి — ఉపనిషద్బావనతో గీతం ముగుస్తుంది. ● భగవంతుడు విడిదిచేసిన లిప్త లౌకిక సమస్యలచే సంకీర్ణమైన మనస్సు — వీటిని వదలిన లిప్త, దివ్యమైన స్థితిలో పొందిన అనుభూతి రూపకల్పన చేయబడింది. ● అంతమవని రాత్రి సంఘంలో అవినీతి, దురధికారం, విలయతాండవం చేస విషాద వాతావరణ చిత్రం, శవాలు — హృదయంలేని జడప్రకృతులను ఆత్మ— హృదయంగల చైతన్య ప్రకృతులను సూచించేవి. దీపపు వెలుగు— పగలు, దీపపు నీడ — రాత్రి; వెలుగుచూపు జ్ఞానానికి ప్రతీకలు. ● అంతంకాని నాటకం Lexican Rhetoricae లో Kennethe Burke చెప్పిన Qualitative Progression అన్న కవితా రూపాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసింది. ఇందులో ఘటనలు ప్రధానంగా గీతం ఆరంభించి చదువుతూంటే అనుకోని విధంగా మలుపులు తిరుగుతాయి. ● ఆరని తెలివి Lexican Rhetoricae లో Kennethe Burke చెప్పిన Syllogistic Progression అన్న కవితా రూపాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసింది. ఇందులో ఘటనలు పైదానికి వ్యతిరిక్తంగా, గీతం చదువుతూంటే కలిగే ఊహల కించుమించు ఒదిగిపోతూ వుంటుంది. ● అమృత వర్షం సాంధ్యరోదసి అంతశ్చైతన్య స్థితికి; సూర్యుడు జ్ఞానానికీ ప్రతీక. ● కాంతి సింహం 1. విప్లవ భావానికి ప్రతీక 2. ఊహలు 3. మనస్సు విప్లవ భావ విస్తరణం. ● మూసుకున్న ఐదు వ్రేళ్ళు సంఘంలోని ఐదు విధాలైన జీవిత రూపాలకు ప్రతీకలు, చేతికి ఐదు వేళ్ళవలె, వీరు సంఘాస్తిత్వానికి హేతువుగా భావించబడింది. 118 యుగసంకేతం 1.చివరి దశ సూచితం. సూర్యుడు వెలుగుల దొర ఐనా, అస్తమించక తప్పదు. అట్లాగే పైవారి విషయమునూ, ఆరంభంలో సాయంవర్ణన, ప్రకృత విషయాన్ని సూచించేది. 2.మరణ పర్యంతమూ ఏవో కోర్కెలు మానవులకుంటూనే ఉంటాయి. 3.వారు ఐదుగురూ ఉన్న సాంఘిక వ్యవస్థలో భద్రత్వం భావించే స్వభావం చిత్రితం. 4.రాక్షసుల పని అపకారం చేయడం – అలాగే వీరు సామాన్యులను పీడించేవారు. 5.అవకాశ వాదులు. 6.సంఘంలో వచ్చిన విప్లవాత్మక పరివర్తనం సూచితం. 7.పరిస్థితులు. 8.శాశ్వతమనుకున్న వ్యవస్థ కూలిపోవడం. 9.పూర్వపు సాంఘిక రూపంతో పాటు, ఆ ఐదుగురూ నామమాత్రంగా నిలచిన స్థితి. ● నెక్ టై స్త్రీకి ప్రతీక (ఫ్రాయిడ్). ● గాజు గది తన విషయం ఇతరులకు తెలియదు, ఇతరుల విషయం తనకు తెలుసునన్న ఊహలతో ఆవరించిన మనస్సుకు ప్రతీక. 1. సరోవరంలో నీరు ఉంటేనే చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది. గోడలుంటేనే గదికి రూపం. ఊహలతోనే మనస్సుకు స్థితి. అద్దాలు పగిలిపోతే (గోడలు లేని) గదివలె, మనస్సుకు ఊహలు లేనిది స్థితి లేదు. ● సంధి పత్రం 1. వర్తమానం భవిష్యత్తుచే అంతమొంది గతమౌతుంది. అపుడా భవిష్యత్తు వర్తమాన మవుతుంది. ఇది చక్రనేమిక్రమణంలా జరిగేది. కాలం అఖండమైంది. ఈ త్రికాలాలూ మన ప్రయోజనార్థం ఏర్పరచుకొన్నవి. 2. ఉదయ కాలం 3. సాయంకాలం 4. కృష్ణపక్షం — సూర్యకిరణ ప్రసారం జరుగకుండా చంద్రుడు ప్రకాశించలేడు. 5. శుక్లపక్షం 6. ప్రస్తుత సామాజిక పరిస్థితులు యుగసంకేతం 119 చిత్రితం. ఒక నిస్సహాయ స్థితిలో చేయగలిగిందిలేక, మనస్సులో ఆశాభావం కలిగి ఉండి, వ్యంగ్య ధోరణిలో ప్రకటించే కోపస్వభావరీతి ఇందులో కన్పిస్తుంది. 7. భవిష్యత్తుపై ఆశాభావం, వర్తమాన స్థితి నిరాసనం, కాకువు వలన స్ఫూర్తి కలుగుతూంది. ● పతాక వార్త ఉదయాలూ, రాత్రులూ వస్తూ పోతూ ఉంటాయి. ‘‘కాలాన్ని హత్యచేసి కాలం దాని స్థానమాక్రమించి తిరిగి కాలంచే హతమౌతుంది.’’(సంధి పత్రం) సాయం సంధ్య, రాత్రిచే, రాత్రి ఉదయంచే చంపబడడం ఈ చిత్రణలోని భావసూత్రం. దీనికొక ఆకృతి ఇవ్వడానికి ఉదయం వెనుక రాత్రి హంతకుని మనస్థితి, అప్పటి ప్రకృతి స్థితి ప్రయాజింపబడింది. హత్య, మృత్యువు చుట్టూ కల్పన సాగింది. ఉదయం పరమాహ్లాదకరమైంది. ఈ మహానుభూతి – మానవునికి ప్రతి ఉదయం ఒక జన్మ ఎత్తినట్లుగా ఉంటుందని చివరి పాదాల్లో వ్యక్తమయింది. ● నేను 1. అజ్ఞానం 2. దుష్ట ప్రవృత్తికి ప్రతీక 3. అజ్ఞానానికి చివరలేదని– ఈ భావ చిత్రణలో సూచితం 4. అజ్ఞాన వలయందాటిన జ్ఞాన మూర్తికి ప్రతీక. ● గాలులు గాలి ఒక మనస్థితికి ప్రతీక. 1. సుఖం 2. దుఃఖం 3. జీవితంలోని మొదటి రోజులు 4. జీవితంలోని చివరి రోజులు 5. సహజమూ, స్వచ్ఛమూ ఐన మనస్సు 6. దుష్ట ప్రవృత్తి 7. గమన లక్షణం— చలన స్వభావం 8. సౌందర్యానుభూతి కలిగించేది 9. ఆనందానుభూతి కలిగించేది 10. దుఃఖ దాయకమైంది 11. ఆధ్యాత్మిక భూమిక 12. భౌతిక భూమిక 13. అనుభూతి — తద్వివేచనా లక్షణం. ● కాంతి గీతం మంచి – చెడు, జ్ఞానం – అజ్ఞానం, వెలుగు–చీకటి ఈ పరస్పర విరుద్ధ గుణ భావరూపాలు పరమమైన చైతన్యాంశ ప్రకృతి పరంగా లోక వృత్త రీతిలో చిత్రింపబడినాయి. 120 యుగసంకేతం ● నిప్పు పూలు i. అగ్ని దేవతా..............విప్లవాత్మక భావనలకు ప్రతీక ii పూర్వం..............రాక్షస ప్రవృత్తులకు ప్రతీక iiiఇవో రీతి..............వేదనామయమైన ఊహలకు ప్రతీక iv స్వేచ్ఛా..............స్వేచ్ఛాతత్త్వానికి ప్రతీక ● కీర్తి స్తంభాలు సమాజ శ్రేయస్సుకోసం — ఒక మహాలక్ష్య సాధనలో కష్టాలు సహించి, నష్టాలు పొంది తనువులు చాలించిన వారు — కీర్తి కాయులకు ప్రతీక. ● స్నేహ వీచి విశ్వ మానవ భావనకు ప్రతీక. ప్రకృతి రూప చిత్రణలు మానవమనో అంతర వివిధ దశలు సూచించేవి. ● లౌకిక శ్రీ జీవితంలో ఏ ఒకరికీ చిక్కకుండా పబ్బం గడుపుకొనే మనస్తత్వరూపానికి ప్రతిబింబం. ● ఎవరు మీరు మానవునిలోని చెడు చీకటి, మంచి వెలుగుగా భావరూపం చిత్రితం. ● ఇరవై ఒకటో శతాబ్దిలో చంద్రుడు ఆధునిక మానవుడు వైజ్ఞానికంగా సాధించిన పురోగతి, చమత్కారంగా చంద్రునితో సంభాషణా రూపంలో కల్పితమైంది. ● దేవునితో టెలివిజన్ గోష్ఠి నేడు జీవితంలో మానవుడు కోల్పోతున్న సాంస్కృతికమైన విలువలు; ఆధునికమైన అతని మనస్తత్వమూ – స్ఫూర్తి కట్టిస్తూ దైవంతో సంభాషణ కల్పితమైంది. ● శ్వేతేతర విహంగాలు స్వేచ్ఛేతర వాదులకు ప్రతీక. యుగసంకేతం 121