Maanaveeyam (మానవీయం) Collection 10 of Volume I — Addendum 1 — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1971. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/addendum-1/text/maanaveeyam --- మానవీయం మాదిరాజు రంగారావు రసధుని ప్రచురణ స్వేచ్ఛా కవిత్వం మానవీయం ఆచార్య మాదిరాజు రంగారావు SWECCHAA KAVITHVAM MANAVEEYAM Prof. Madiraju Ranga Rao © Dr. M. Santhosh Kumar Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28 ప్రథమ ముద్రణ: జూన్, 1971 పునర్ముద్రణ: జూన్ 2026 అనుపమ ప్రింటర్స్ శాంతినగర్, హైదరాబాద్ ఫోన్ : 040–23391364 పితృదేవులు మాదిరాజు నారాయణరావు గారికి అంకితం ఈ జీవన మార్గాన గమ్యమెరిగిన ప్రయాణికుడు ఈ వివర్త జగత్తులో నీడ క్రమ్మని దీపకళిక. మానవీయం మొదటి భాగం ఉదయం ................................................ 1 ఉదయం తరువాత ......................................... 5 జీవిక మొదలు ......................................... 9 బ్రతుకు వంతెన పై నుండి ............................. 17 రెండవ భాగం అశాంతి ............................................. 30 యుగదర్శనం .......................................... 42 యుగదర్శనం II ....................................... 51 మానవీయం - మొదటి భాగం ఉదయం ఉదయ తరణి కెదురుగా నిలిచి ఉన్నాను నేను, కొండకొమ్ము మీదినుండి రసధుని పరుగిడినట్టు ఇసుక దిబ్బపై ప్రవాహం తళ తళ లాడినట్లు వెలుగుపొంగు ఎప్పుడువచ్చి జగత్తును ముంచెత్తిందో? తెలియదు. చైతన్యపు వెలుగులతో రోదసి మనోజ్ఞ రూపం దాల్చి శవాల వలెనున్న ఆశలకు ప్రాణం వచ్చి బహువర్ణ సుమ పరాగం విరజిమ్మిన రీతి మారింది గగన వలయం. అనిదంపూర్వ మహానుభూతిలో ఇంద్ర చాపంవలె పరచుకొంది మనస్సు. తెరచుకొన్న ప్రాగ్దిశా స్వర్ణకవాట కలధ్వనికి విప్పారింది మానవం మంటి నుండి మింటికి నిల్చిన సప్తవర్ణ నిశ్రేణికవలె భాసించింది జీవితం! ఉదయం వచ్చింది ఉదార చరితునివలె మానవీయం అమృతలిప్త వెలిగింది ఆత్మ ప్రకాశం వలె. దినమణి దీప కాంతితో హర్ష ధారా వీక్షణాలతో ఆకాశం భూమీ కౌగలించుకున్న క్షణం సన్నని దారంతో సాలీడు అల్లిన పటంవలె ఉంది ప్రపంచం మబ్బులో మెరపువలె ఊహ కదలిక. మనస్సులో చెలగిన పూర్వపు చీకటి స్మృతులు. మృదుల రాగ కరస్పర్శతో నిదురనుండి మేల్కొల్పి భూమికీ ఆకాశానికీ బంధం కూర్చే సూర్యుడు, పైన. ప్రత్యణువును పులకరింప జేయు వెలుగు వాకలు, గుంపులు గుంపులుగా విసరిన తెలి పూలదండలు. గగన పదం వీడి బ్రతుకలేని మబ్బులు పైన, పాదాలు పట్టుకొని వదలని క్రీనీడలు, క్రింద. మృత్యుముఖంవలె ఆవరించి రాగంతో ఆకర్షించే నీలాకాశం, చాచిన దేవతా హస్తాలవలె విచ్చిన వెలుగుల బారులు. మాదిరాజు రంగారావు నిర్మలాంతః కరణంలో ఊహల సాగుదల వలె, స్వర కల్పనలో నదించు మాధురీ ఝురి వలె కళావర్ణంతో సౌందర్యం చిమ్ము చిత్రం వలె, కదలిపోయే మోహాపాదక కాంతులు! మనస్సముద్రోర్మికలపై తూగుతూ తేలిపోయే ఆనంద దీప కళికలు. రివ్వున దూసికొనివచ్చి నడవలేని చెట్ల భుజాలపై చేయివేసి కుదుపుతూ సంతోషంతో కదలిపోవు మృదు శీతల వాయువులు. అనిర్వచనీయ స్థితిలోని దివ్యానుభూతి కదంబాలు క్షణక్షణం పొందుతూంది వర్ణ సామరస్యం చూపుమేర మీరి ఉన్న ఆకాశం. తీవ్రమైన ఆకర్షణకు లొంగి సంతోష చకితమైంది భూమి. మేల్కొనీ మేల్కొనని దశలో కలల వరుసవలె దీపించింది సృష్టి. కాంతి వర్షంలో తడిసి శరీరం స్వర్ణమయమైంది. మధునదంతో నిండి హృదయం సమార్ద్రమైంది వెలుగులు వెల్లి విరిసి ముఖం పూలబంతి ఐంది. ఆనందంతో చిందులు త్రొక్కు శిశువులవలె, ఆకాశంలో యథేచ్ఛగా విహరించు మబ్బులవలె, రసానుభూతి పరవశింప జేయు ఆలోచనలు. మానవీయం చూస్తూ చూస్తూ ఉండగనే కాల శ్మశానంలో దగ్ధమైనవి, లిప్తలు. గగన మార్గాన ప్రయాణం చేసి అలసిపోయిన సూర్యుడు పశ్చిమ దిగ్వేదికపై విశ్రమించాడో లేదో, అనంతమైన వెలుగులు సొంతమైపోయి ప్రపంచమొక పరిధిలో బంధితమైంది. కనురెప్పల అంచులపై వ్రాలింది నిదుర బరువు బరువుగా, విశ్వాంతరాళంలో ప్రణవంవలె నిశీథి చంద్రికవలె, నిదురలో స్వప్నంవలె శబ్దంలో అర్థంవలె పురుషునంటుకొని స్త్రీ. అగాధమైన మనస్సులో పొరలలో నుండి ఊహల ఔల్బల్యం అధికాధికమై, గంభీరమైన తమస్సులో పొరలలో నుండి వెలుగుల ఆగమనం అత్యంతావశ్యకమైంది. నిదుర పట్టడంతో కాటికి కాళ్ళుచాచి రెక్కలు విరిగి కుప్పగా కూలిన రాత్రి, చివరి ఊపిరి కాస్తా వదిలింది. నిదుర వదలడంతో కంటిముందు ప్రత్యక్షం మరో ఉదయం. అరె! ఎంతలో వచ్చింది ఆహ్లాదకరమైన ఉదయం మానవ లోకానికి శుభోదర్కమైన సమయం. మాదిరాజు రంగారావు సనాతన కాంతి చిమ్ము నా దృష్టిముందు స్వర్ణ వలయ సమాక్రాంత తరుణ తనుతేజశ్చక్రం! ఉదయం తరువాత తూరుపు అద్దంలో సూర్యుని ముఖం కన్పించి భయంతో నివాస స్థలాలు విడిచి, దూరాకాశ తీరాలకు చేరినవి చీకట్లు. రువ్వబడిన రాళ్ళవలె రివ్వున ఎప్పటికప్పుడు మనస్సు నాక్రమింప తిరుగు మృతభావనామూర్తులు, వెలుగులారి కొడిగట్టిన వత్తులు. చీకట్ల సమావేశంలో ఏకగ్రీవంగా ప్రకటించిన నిరసన పత్రం, తుహిన యవనికా రూపంలో ప్రత్యక్షం— చదవడానికి యత్నించే చెట్లు, చెరిపివేయ ఉత్సాహించే వెలుగులు. రవి దీపం క్రింద నీడలంటి తిరుగు రాత్రించరులు ఈ దీపపు వెలుగులు తామె వెలుగు దివౌకులు. చీకటిలా ఒకమారు మందంగా వెలుగులా ఒకమారు వేగంగా ఒకమారు కదలీ కదలని మేఘంలా కంటి చూపు నుండి జారి పోవు కాలం, మానవీయం విడిచే నిట్టూర్పులలో తూగుతూ అవ్యాహతంగా సాగిపోవు ప్రపంచం. ఆకాశం డొక్కలో పర్వతంవలె నిదురపోయే చీకటిని రూపుమాపు సూర్యచంద్రుల ప్రభా ప్రసారం, వీరి పాలనలో ఒదిగిఉంది జగత్తు. II జన్మించిన వేళనుండి ముఖంలో బింబించి ప్రతి క్షణం సమయం కోసం వేచి ఉంటుంది భవిష్యత్తు. వదలిన ఊరుపుతో పేర్కొన్న మనస్సుతో అంతమొంది వర్తమానం, అవుతుంది గతం. ఆకాశం మేల్కొన్నది. ఎటు చూచినా ప్రాణి చలనం నిదురకు జడానికీ అనుబంధం. మెలకువకు చలనానికీ స్నేహం. అందం విరిసి, గంధం చిమ్ము విచ్చిన పద్మదళ పంక్తులు ప్రాణం పల్లవించి, రాగం రవళించు వివిధ జీవిత వలయ దశలు. ఝుంకృతి తిరుగు తుమ్మెదలతో శోభారుణ పద్మంవలె, మనుషుల కదిలికతో నిండారింది ప్రపంచం. సూర్యుని ఆశీః ప్రసార కిర్మరీకృత భూమిపై ఒక వలయ మతిక్రమించి పోయే లోపల వేరొక వలయంచే పరీవృతమౌతున్నాయి పాదాలు, విడదీయరాని దుఃఖత్రయంచే ఎప్పుడో బంధింపబడింది జీవితం. మాదిరాజు రంగారావు అవిచ్ఛిన్న పరిణాహకాలం రెండు చెక్కలుగా ప్రయ్యలైన రూపాలు. ఒకదాని ముఖంచూచి వేరొకటి ప్రక్కకు తప్పుక ఒదిగిపోయే దివానిశలు. నిదుర ముంపు వెల్లి విరిసి మెలకువ కలిగే లోపల, కనులు మూసి తెరచే లోపల మాట పైకలి పచ్చేలోపల ఊహలు వాగ్రూపం పొందే లోపల ఉషస్సు తూరుపు గడపదాటి బయటి కడుగు వేస లోపల, పాదరసపు గుళికల వలె జారిపోవు లిప్తాంశలు. అడుగు వేయడంతో లిప్త గమించక ముందే ఆకర్షించు ఆశా శబలిత జీవితం అడుగు తీయడంతో లిప్త గతించగనే, క్రమ్మికొను నిరాశామయ మృత్యువు. భయ శోక మోహ కోపాలకు లొంగిపోయిన అశాంతి జీవితాలు, క్రమంగా హరించే ఉదయాలు, ప్రాణికోటి కెంత ఆహ్లాద రూపాలు? శిశువువలె ప్రత్యక్షమై వృద్ధువలె నిష్క్రమించే సూర్యుడు. ప్రతి ఉదయం అవతరించు నిత్య నవ్య పురాణమూర్తి మొదలు తుది నాశన మెరుగని మహా కాంతి పుంజంనుండి మానవీయం అవతరించిన భాగం ప్రపంచం. అగ్ని శిఖలవలె సంచరించు మానవులు. ఉదయ దిశా స్వర్ణకాంతి దేహళి పై దృష్టి నిలిపి, రాగనిభృత, వర్ణ మహిత మనస్సుతో సుందర రూపంలో, శివతాతిపథంలో ఊహాశక్తిచే సృష్టింపబడిన దేవతలు. ఎన్ని ఏండ్ల గ్రహణం నుండో విడిపించి నభోమణిని, మరుద్గణంతో దుస్స్థితి పారద్రోలి సుస్థితి కల్పించు వజ్రి శతక్రతువు, శచీపతి, ఇంద్రుడు. హిరణ్య వర్ణుడు, నిత్య పవిత్రమూర్తి దేవతలకు మానవులకు దగ్గరి బంధువు ప్రతి ఉదయ మవతరించు కవిక్రతువు, అగ్నిమూర్తి. సవితృ బింబ నేత్రంలో సకల సృష్టి పర్యాలోకనచేస్తూ హస్త విధృత పాశాలతో సువర్ణ పక్షాలతో వెలుగు క్షమామూర్తి ధృతవ్రతుడు వరుణుడు. సర్గ స్థితి లయాలకు హేతువులుగా నిలచిపోయిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివులు. అహంకారం అంధకారం అశాంతి అలముకొన్న హృదయావరణంలో దివ్యానుభూతి కలిగిస్తూ కరుణతో నిలచి ఉండు జ్యోతిః ప్రతీకలు. మాదిరాజు రంగారావు జీవిక మొదలు రోజూ వస్తాడు సూర్యుడు శ్యేనం వలె గమిస్తూ కాంతి కేతన ప్రచాలనంతో, ఆశలు కళ్ళు తెరుస్తాయి. పూవు రాలుతుంది మొగ్గ పుటమరిస్తుంది ఒక దానిలో విషాదం మరో దానిలో ఆనందం. పూలతో పరిమళించే సమయం పండ్లతో పరిణామమందే కాలం, రోజులలో వికాసమందే జీవితంతో ఘటనలలో చరిత్ర పొందే జగత్తులో, ప్రయాణించేను మనిషి రాత్రీ పగలూ ఉదయ మధిరోహిస్తూ, సాయ మవరోహిస్తూ. బ్రతుకొక అగ్నిగోళమై ఎవరి దారిన వారు శాంతికై కాలు సాగు మార్గాన పయనించి, ఒంటరితనం సహించలేక జంటలుగా గుదులుగా తరలి, బహుస్థలాలలో బహువిధ జీవితాలతో హృదయం స్పందించి, బుద్ధి వికసించి ఆనందం ఇచ్చే అనుభూతితో విజ్ఞానం పైంపొందించే అనుభవంతో సంచరించేరు మానవులు. మానవీయం పరిభ్రమించి సుడిగాలివలె అతిక్రమించి అదృష్టసీమలు గుర్తించి అపాయపు గుర్తులు ఉత్తరించి అసాధ్య సముద్రాలు, సన్నివేశాన్ని బట్టి నటనవలె కాలవేగ దీప్తితో మర్మమెరుగని దిశవలెనున్న బ్రతుకులో పరివర్తనం. గాఢమైన అనుభూతుల పారంపరించే హృదయం విశాలతరమై, తీక్ష్ణమైన భావనా స్వాతంత్ర్యంచే బుద్ధినైశిత్యం పెరిగి, అధమ స్థితినుండి పరమస్థితి వరకు బహుముఖ మనఃప్రవృత్తులతో బ్రతుకు గడేప జనసందోహం. ఒకప్పుడు మృగంవలె, పక్షి వలె, మరొకప్పుడు పామువలె, పురుగువలె, పెరిగి తరిగి ఒదిగి మలగి, నశించు బహుగుణ రూపాల్లో దాగిన, మనస్సుతో, మనిషిని హతమార్చి క్రోధాగ్ని తనుపుకొని మనిషిని భక్షించి క్షుధాగ్ని చల్లార్చుకొని మనిషిని రక్షించి మానవత్వం నిలుపుకొని మనిషివి క్షమించి దైవత్వం పొందిన మానవుడు. ఒక భయధ్వని కనిశ్చయంగా ఎగిరి ఎక్కడో అవిజ్ఞేయంగా వాలిపోవు పక్షులవలె, ఎప్పుడో ఎక్కడో దూరదూరం విసరబడి కుప్పకులి చివర కసువులు కోల్పోయి చరిత్ర దృష్టిలో స్థానంలేని మానవులు, మాదిరాజు రంగారావు ఎంతమందిని చావుపాలుచేసి జయించి ఎంతవరకు విజయం సాధించిందీ ప్రధానమై ఎంతమందికి ప్రాణంపోసి రక్షించి ఏ దుస్స్థితి నుండి స్వస్థితికి తెచ్చిందీ గౌణమై. సముద్రంపై ప్రయాణం చేస నావపై గాలికి రెపరెపలాడు తెరచాపవలె జీవితంలో అలజడి కలిగించు ఆశతో, మెరుపుకత్తివంటి బుద్ధికి భాసించు. నిశాగుహా ప్రాంగణంలో మృత్యు సామీప్యంలో ధూమావృత శిఖలవలె స్వస్థితి తెలియని దుస్స్థితిలో సంచరించే మానవులు. ఈనాడు నిశ్చితంగా విజ్ఞాతంగా రేపటి అనిశ్చితరూపంలో ఆశ్చర్యంగా జరుగు ఘటనలు, వీనిలో చిక్కుకొని అసువులు కోల్పోవు త్యాగమూర్తులు బయటపడి తమ ప్రయోజకత్వం చాటుకొను స్వార్థమూర్తులు. అమాయక శైశవదశనుండి అపరిహరణీయ మృత్యుదశవరకు పొరపాటు అలవాటై, మరచిపో శక్యంగాక మానసిక బానిసత్వం, దర్పంగా భావిస్తూ చావుకైనా వెనుదీయని స్వభావంతో జీవితమొక వ్యాపార సరణి గడిపివేస సమాజం– అధికార పిపాస, కీర్తి కాంక్ష ప్రబలి అంతరింపబడిన ఒక రాజవంశ రక్తంతో మానవీయం తడిసిన వేరొక రాజవంశ మావిష్కృతమై అణగద్రొక్కబడిన ఒక జాతి మతస్థానంలో జరిగి పోయేను వేరొక జాతి మతాభ్యుత్థానం. ఆక్రమించి అవనీతలం, ఆకాశ మండలం ఆచంద్రార్కం యశోబింబాలుగా నిల్వడానికి జరుపబడు సర్వతోముఖ ప్రయత్నాలు. అపుడే ఉదితమైన విజయ కేతన ప్రచాలనం, ప్రక్కనే పతితమైన శీర్ణ కేతన పరాభవం. జీవిత విస్తృతి నెత్తిచూపు లౌకిక ప్రతారణ నీతితో చరిత్రలో నిలిచిన వెలుగుమెట్లు! అట్టడుగున పడిన చీకటిముద్దలూ! మనోఽంతరాళంలో అణగిన జంతు తత్త్వం విభిన్న రూపాలలో ప్రకటితమా స్థితిరూపం. ఇదమిత్థమని నిర్ణయింపగా వీలులేని విపరీత సృష్టిలో రాక్షస జీవితంలోనూ భయాత్మక మృత్యుసామీప్యంలో మూర్తికట్టు దేవతాభావమూ! ఇదమిత్థమని నిర్ణయింపగా ఊహ శక్తిలేని జీవితంలో మాసు లెత్తకుండా దేవతాభావం, మాదిరాజు రంగారావు విడదీయరానంతగా అల్లుకొని ఎప్పటికప్పుడు అణగద్రొక్కు రాక్షసత్వమూ, v v v మనిషికి మొట్టమొదట కావలసింది ఉనికి. కొన్ని అడుగుల మేర నేల. ఆహారం తరువాత సంపద అధికారం; వీని సంపాదనలో రక్షణకై తలలెత్తిన ఆలోచనా పరంపరలు, క్రమ పద్ధతిలో తాల్చిన ఆకారాలు ఈ కోటలు, సామ్రాజ్యాలు. దాహం క్షుధ, విషయవాంఛలతో పాటు అలౌకికానంద ప్రయోజనాల గుర్తింపూ పుణ్యపాపాలు, స్వర్గ నరకాల సృజన. ఈశ్వరుడు, ఆపై పరబ్రహ్మభావన. జీవితంలో ఆనందాన్వేషణలో సంగీతం, సాహిత్యం, శిల్పం మొదలుగా కళలు సృజించుకొని సంస్కృతీ శిఖరాల నంటుకొని అధికార మర్యాదలతో, సవ్యాజ మనస్తత్వంతో లౌకికవ్యూహాల్లో ప్రవేశింపజేసి జీవితం; అహర్నిశలూ జరిగే సంఘర్షణలో విజయానికి లేదా దానినుండి విముక్తికి సర్వశక్తి సమీకరించి సంసిద్ధమా మానవుడు. ఆచ్ఛాదన జ్ఞానం కళాన్వితమై బంధుభావం సూత్రబంధమై దేహ మేధాశక్తుల భేదం గుర్తించి ఉషస్సులో దర్శించిన స్త్రీమూర్తి అమృతకళకు ప్రతినిధియె, ఆవరించిన భయచ్ఛాయలు మానవీయం అజ్ఞాన నిలయాలుగా తోచి, ఆత్మ నిత్యత్వం భావితమైన నాటినుండ మనిషికీ ప్రపంచానికీ గల సంబంధంపై ఆకాశంనుండి జారిన బంగరు గొలుసులవలె ఎడతెగని ప్రశ్నలు; ఆలోచనా తరంగాలు. ఏదో ఒక మతనియమంలేని మానవుడు లేడు ఏదో ఒక బిందువునుండి మొదలుకాని రేఖలేదు ఒక వలయాకృతి మేరలులేని ఊహలేదు, అతడు పొందే వికాసం, పరిణతిలో వైవిధ్యం వైశిష్ట్యం ఎంతైనా ఉండవచ్చు. ఎన్ని మజిలీలు దాటినా విజ్ఞాన సంస్కార శిఖరభూములలో స్థిరపడి నిలిచిపోక చ్యుతమై పునః పునః ప్రయత్న యాతనతో ఒకవైపు పరంపరగా ఆవిర్బవిస్తూ శైశవ యౌవన జరామృత్యు దశలతో మరొక వైపు వరుసగా మట్టిలో కలిసే నిరంతర మానవ సంతతి. చిగుళ్ళు ఆకులు పూలు ఫలాల కలలు బీజంలో నిక్షిప్తమైనట్లు ఆత్మగత వాసనా మయమై సుఖదుఃఖాలతో, భోగత్యాగాలతో విస్తరించి ప్రకాశించే జీవిత గమనం. గాలి విసురులో, గ్రీష్మ తాపంలో వర్ష పాతంలో, చలికోతలో పరిక్రమించే చక్రనేమి క్రమణం. భవిష్యత్తుపై ఆలోచనతో వర్తమానంలో అనుభవంతో గజిబిజిగా క్రమ్ముకొని మేధను మాదిరాజు రంగారావు కలత పెట్టు ఊహల సాగుదలను, ఒక క్రమపద్ధతి తీర్చే విశ్వాస పరంపర కలవడింది జీవితం. వెరగొందిన మృదుభావుక మనస్సునుండి మెరపుతోడి మేఘంవలె జనించి బ్రతుకంతా అలముకొని, అందనిపూలతో ఊహసుందరమె వాసించింది స్వర్లోకం. మరపుగొన్న చపల కఠోరమతినుండి అశనిపాతవేళా స్ఫులింగ చక్రంవలె బ్రతుకంతా ఆక్రమించి, నిప్పులతో హృదయ విదారకమై దీపించింది నరకం. తనువొక వరణీయ దేవతా ప్రసాదమై దివ్వెనుండి దివ్వెవలె అవిచ్ఛిన్న ప్రజాసంతతి. దైవం పై భారంతో గడచే బ్రతుకులు. ప్రేయస్స్వ రం విని మృదురూపమూహించి దివ్యభావం హత్తుకొన్న హృదయం, కఠోర రావం విని ఘోరరూపమూహించి క్రౌర్యబుద్ధి వర్తించు మేధతో మానవుడు. తీవ్ర వేగ మృదుప్రచార దీప్తులతో ఒకజాతి, మనిషి బ్రతుకంతా నిప్పులు చెరగి మండించింది కాలం. పచ్చని పైరూ పండించింది కాలం. తల్లిపిలుపులో తండ్రి పలుకులో శిశువు నవ్వులో, ప్రియుల చెలువులో భక్తి భావనలో, శాంతహృదయంలో ప్రతిధ్వనించింది స్వాదు సంగీతం. కొండలో, ప్రవాహంలో రోదసిలో ఊరుపులో, మనస్సులో, సర్వప్రకృతి మానవీయం నిరంతరం సాగు నాదరేఖవలె ఒక్కసారి గుత్తులు గుత్తులుగా తరలి కిలకిల నవ్వులు విసరి విసరి ఒడ్డున చప్పట్లు కొట్టి తరలు. అంతరాఘూర్ణమాన జలధి తరంగాలవలె మనః కుహరంలో లయాత్మక భావనలు. ఎప్పటికప్పుడు అడ్డుగోడలతిక్రమించి ముందుకు సాగిపోవు ప్రగాఢ సాహసమతి, మానవుడు ఎప్పుడూ నిలచిపోడు ఒకేచోట. ఎంతదూరం వెళ్ళినా ఎంతకాలం గడచినా పైకి ఆ పైకి వెళ్ళాలనే మానవుని కోరిక. ఆదర్శ లోకాలతో పరిచయం అందు ఆవాసం కోసం ఆరాటం, ఆందోళన తీరని అజ్ఞాతతృష్ణ సహజం. ఎన్ని సహస్ర సమములు గతించినా మృత్యు వెరుగని ఉదయంవలె మమత చావని హృదయంతో పతనంనుండి పునరభ్యుదయంతో దివ్య దశా సంసిద్ధికై ప్రయత్నం విరమించదు మానవజాతి. దుఃఖత్రయ రేఖల సాగుదలతో మొదలై యుగాలుగా సాగు సంస్కృతికి ప్రతినిధి మానవుడు. అతని సుఖదుఃఖాత్మక జీవిత సర్వస్వం బింబీకరించుకొని వెలసిన దర్పణం, కాలం. జీవితపు మొదలు చివర బిందువులను ఈ లోకంతో కలుపు దివ్యరేఖ, ఈశ్వరుడు. ఆశ్చర్యానుభూతులనంటి వెలుగులోతులు త్రవ్వుకొని అలౌకికంగా సాగు జిజ్ఞాసా ఫలితం, వేదాంతం. మాదిరాజు రంగారావు బ్రతుకు వంతెన పై నుండి మనో నేత్రం దర్శించు ప్రపంచం ప్రతిబింబించిన కాలదర్పణం ముందు, నేను. దివా కాంతి చేలంతో నిశా నీల నిచోళనంతో చాంద్రీమృదూత్తరీయంతో ఎటు ప్రసరించినా దృష్టి నాకర్షించి, మనస్సును భ్రమింపజేస ప్రకృతి, శక్తి. క్రింద, మృత్తికామయవస్తు సమితి, దివా నిశలు చుట్టూ పరిభ్రమించే గ్రహ కుటమి — పైన. ప్రభు దయా విహీనమై వన్నె మాసిన రాత్రి, ఒక వైపు ప్రభుదయా ప్రసృతమై వన్నె కెక్కిన ఉదయం, మరోవైపు జీవితమొక చివర తెలియని చీకటి వంతెన, సంఖ్య తెలియని అనుభవాల వెలుగు మెట్లపై అడుగడుగునకు పునర్జన్మ ఎత్తినట్లు అడుగడుగులో స్వర్గశకలమందినట్లు గమనం సాగించే, చీకటి ముద్దలు కొందరు దీప శిఖలు మరికొందరు. మానవీయం వంతెనపై నడచే మనిషిని వెనుకకీడ్చు ఎవరివో యత్నాలు. సముద్రంలో నౌకవలె ముందుకు సాగిపోవగా ఊర్మికలవలె ముందు ఎవరివో హస్తవితతి. వంతెనపై నుండి క్రిందికిచూచి కళాభావన వ్యక్తపరచే సరసులు. అంధులవలె కళ్ళుమూసికొనే విభీతులు. మైమరచి ప్రాణాలర్పించే విముగ్ధులు. వంతెన కివతల మరి అవతల ఏమున్నదో ఇదమిత్థమని ఎవరికీ తెలియదు. యుగాలనుండి పరంపరగా ధురాగతి వచ్చు. ఊహా ప్రావారాలు, అనుమాన ప్రాకారాలు తప్ప. ముందుకు వేసిన అడుగు వెనుకకు తీయడ మసాధ్యం, ముందు వేయక అడుగు అక్కడే నిల్వడ మసంభవం. ఎప్పటి కపుడు భయంతో విచలితమే మనస్పు, భవిష్యత్తును గాలివలె కౌగిటబూను ప్రయత్నం. ఈ వంతెనపై అంకితమైన పాదముద్రలు, చరిత్రలో నిలచిన స్మృతులు కాలానికి ఆభరణాలు వంతెన కిరుప్రక్కల అసంఖ్యాక యశఃపతాకలు, మాదిరాజు రంగారావు జాతిమత రాజకీయ విద్యా కేంద్రాలు. నక్షత్రాలవలె అక్కడక్కడా నీతివ్రతులు, త్యాగశీలురు. ఇహపరలోక సత్ రూపులు వెలుగు దూకుడుచే మేల్కొని ఊహకు తప్ప మూర్తికట్టని రోదసి, అతీంద్రియ శక్తిచే సంచరించు జీవసమూహం కాలసూత్రానికి గ్రుచ్చిన జీవిత పుష్పాలు! v v v దూర ధరణీ కాంతారం నుండి పరుగిడి వచ్చు మహా భుజంగాలవలె నదులు. చుక్కల పూగుత్తులతో నిండిన నీలగగన మహావృక్షం. నీల వలాహక మసృణ రేఖలు ప్రతిఫలించు కన్నులతో చెలగు పయః పారావార తరంగ మధు రసాకృతులు. ముగ్ధ సరోవదనం పై నతాకాశపు వంపులు. తొలి మలి సంజలందు గాలి పలుకరింతలకు, మదిలో సుళ్ళు తిరుగు అమృతోహలతో పులకరించి తూగు పూలసవ్వడులు. హిమాంశువులు హత్తుకొని ఎదపై కాలం ఒడిలో రెక్కవిప్పిన గులాబీలు. వానిచూట్టూ కొనదేరిన కంటకాలు. మానవీయం ఆకాశంలోని నక్షత్ర హాసం శ్మశానంలోని నిప్పురవ్వవలె భాసింపజేయు రాత్రి. చీకటి కుచ్చెళ్ళలో దాగిన పృథ్వి , కొంగుచాటున కన్పించని దిగ్వలయం. జగత్తు నాక్రమింప నెంచు మానవుని ఆశా నిభృత వర్తనంవలె దిక్కుల ముఖంలో వెలుగు! ఆశాపతాక శిశువు, చెక్కిళ్ళపై ముద్దులతో కన్నీటి చారలు తుడిచివేయు మాతృమూర్తివలె, తమ్మిరేకులపై మంచుసోనలు మలుపివేయు ఉదయదేవి! గోధుమవన్నె త్రాచువలె దిక్కుల కెగబ్రాకి ప్రచండాంశు స్పారమూర్తియె అంతలో, మింటినుండి మట్టికి వ్యాపించిన గ్రీష్మం, కణ కణలాడు నిప్పుకల హసంతీ హల్లీసకం. అగ్ని శరాసారంవలె ఎడమేమాత్రమూ లేక హత్తుకొన్న సహస్ర కరోజ్జ్వల దీప్తులు. కుప్పలు కుప్పలుగా బూది చెరగిన నిప్పులు సుడులు సుడులుగా తిరుగు వడ గాడ్పులు. పెద్ద ఇసుకదిబ్బ వలె పగలు నల్లని రాజిగుట్టవలె రాత్రి! గాలిలో తేలు దూది పింజలవలె వెన్నెల దూరంనుండి ఘన కాసారం వలె ఆకాశం జలబిందువు కోసం మానవుని తహతహ ! కొడిగట్టిన దీప శిఖవలె గగనం మసిబట్టిన అద్దంవలె దిజ్ముఖం మాదిరాజు రంగారావు అంటుకొని ఆరిన బొగ్గువలె భూమి ప్రాణాధారం కోసం నడయాడు ప్రాణి. వర్తమానంపై క్రమ్ముకొని దట్టమైన అతృప్తి భవిష్యత్తుపై గూడుకట్టుకొని కోరికలు, జలదశకలం కన్పిస్తేచాలు! కళావిలసితమా ముఖ పంక్తులు. శరీర స్పృష్టిగా చెలగితే శీతలవాయు రేఖ ఒకడొకడు పొందు ఆనందం, బ్రహ్మపదవి చేరిక. అక్కడక్కడ తిరుగు బుడగలవలె మనుషులు పృథివీ దాహాగ్ని కర్పితమైన వర్షధారలు. ఎక్కడి కక్కడే దూరదూరంగా వాలిపోయి చూపుమేర మాయమా ఆకాశం. అవిరామంగా అశాంతి గీతం వినిపిస్తూ ఎప్పటికపుడు దూరదూరంగా పరుగిడు గాలులు. నిల్వడానికి సూదిమొనంత చోటు సంపాదించి ఆపైన విస్తృతికై పరితపించు బ్రతుకులవలె, ప్రతి అంగుళం అంగుళం మేర నేలను మ్రింగివేయడానికి మాటి మాటికీ విజృంభించు తరంగ వేగాకుల సముద్రం, ఉత్సాహించు తరంగ సమాలోల సరసి. ఇసుక ఎడారి నాలుక చాచి దూరంగా సరస్సువలె కన్పించే చంద్రునివైపు పరుగు తీస్తూ, ఎంతకు అందుకో జాలని భూమి. శిలామూర్తుల పాదాలముందు పూల వరుస వలె కన్నీటి చుక్కలు. పర్వత హృదయ కార్కశ్యానికి రోసి రుస రుసలాడుతూ పరుగిడుతూన్న నదులు. మానవీయం ఉన్మాద ప్రలాపాలతో తిరుగు వాయుగతికి తలలూపు వృక్షాలు, అవతరించిన అగ్ని రూపాలు. అశాంతిలో మైమరచి నగ్ననృత్యం చేయు యుద్ధమూర్తి, దాహకమతి. నీలిమబ్బులవలె గుంపులుగా ప్రబ్బికొన్న స్పర్శగుణం, చలనశక్తి లేని నీడలు, అగ్నికి భస్మమవని చీకట్లు, వెలుగు పూడ్చలేని లోయలు, మానవ ప్రగతి పథంలో ఆనతి దూరంలో ఈ వైకృత ప్రపంచ వీధులలో అశాంతి దుఃఖ నిరాసనాకాంక్షుల ‘శాంతి’ వాగమృత ధారేసచనం. II అడుగు తీస్తే నుయ్యో గొయ్యో తెలియదు. కదలితే ప్రక్కన జంతువులో మృగాలో మనుషులో, రాక్షసులో, దెయ్యాలో? సహస్ర జిహ్వలతో జ్వలదగ్నులవలె ఆలోచనలు, కర్ణవీధి కెగబ్రాకు భిన్న ధ్వనులు, వర్ణరీతులు. బాల్యం నుండి యౌవనం యౌవనం నుండి వృద్ధాప్యం ఆరోహణావరోహణల క్రమం గల క్రియా కలనా జీవులు. మౌఢ్యవిశ్వాస బలంతో దరీ వాయు ఘోషలతో వందలాది వత్సరాలుగా మాదిరాజు రంగారావు వేరొక దశయే ఎరుగని పురాణ ప్రబంధ శిలాపంక్తులు. కొండలపై మెరపు చూపులతో కన్నీరు కార్చు పయాద పంక్తులు. ఎండకు తపించి, చివరకు నీటిచుక్కైనా నిలువ ఎరుగని కొండరాళ్ళు. కనులు మూసిన తల్లి ఒడిలో చేతులు చాచి తడుముతూ, వణకుతున్న చిరు పెదవులతో వెలుగు మాసిన పసి చూపులతో ఎండిన గొంతులతో ఆక్రందించు శిశువులవలె నేలపై గాలి బరువుకు నిల్వలేక తూగు గడ్డిపోచలు. బండలపై బోదెలపై విరిసి కురిసి మృదుత్వం కోల్పోయిన వర్షబిందువులు. గాలి రొద ప్రసారం చేయు వృక్షవితతి దిగ్భిత్తికలకు వ్రేలాడు మబ్బు గబ్బిలాలు, అక్కడక్కడా సనసన్నగ నీడబొమ్మలు, సంచరించు ప్రేత భావేపత ముఖులు. తక్షణమే ఉన్మనీచరమ దశనందిన ఝుంఝా సంగీతం. వాయూచ్ఛల దుగ్రరావ భూత ప్రకృతి పటుతర భీభత్స కథారచన. తలకు మించిన వ్యూహంలో చొచ్చి అసువులు కోల్పోవు విమతులు, నదీ మహావర్తంలో చిక్కి పల్లటీల్గొను నావలు. మానవీయం నటనా చాతురీ నిగూఢ హాసం పెదవుల పొందికపై సదా ఒత్తిగిలి ఉండు దుష్టోద్యోగి మనఃప్రకృతివలె ఎప్పుడు విచ్చిపోవునో తెలిసి చావని అగ్నిపర్వతాలు. మనోఽంతర పదవి సుడులు తిరుగు ఊహల స్వేచ్ఛా సంచారం, కార్యదశకు చేరిన భయ సన్నివేశం వలె కల్లోలానిల వాతావరణం. నవ్వు తెరలు కప్పి మానసిక హత్యలు జరిపి పదునెక్కిన చేతులతో ప్రక్కన నడచే మనుషులవలె, రివ్వున దూసికొనిపోవు మెరపు బాకులు నిండి, వెలుగు జడితో చిందులుతొక్కు కారుమొగిళ్ళు. అక్కడక్కడ వేసగి నీరసించి కృశించిన మొక్కలు, దూరదూరంగా తప్పుక దాగిమలగు జీవులు. బాటసారుల కళ్ళలో దుమ్ముకొట్టి అమాయకంగా నిలచిన ఇసుక దిబ్బలు. అక్కడక్కడ గొంతులు సవరించుకొను ఈలపిట్టలు దగ్గరిదగ్గరిగా తూలి తూలి చను ప్రాణి సమూహం. గ్రీష్మమందుకుంటే చాలు తగులబడి పోవడానికి ఎండిన మ్రోడులతో ఎదురుచూస్తూన్న అరణ్యం! సుత్తెల మ్రాత ఎరుగని కొండరాళ్ళు వర్షపు చినుకులు చవిచూడని మట్టిదిబ్బలు ఋతుపరివర్తన శక్తికి తాళలేక నశించే, చిగుర్పు పెరుగుదల ఎరుగని గడ్డిపోచలు! మాదిరాజు రంగారావు అనియమిత మానవ ప్రగతి చరిత్రలో పూర్వాపరిస్థితుల మధ్య ఏర్పడిన లోయలు! కళేబరాలతో పూడ్చబడి, మారిన మట్టి దిబ్బలు, ఈ దిబ్బలపై రప్పలవలె వసించు జనం. వెనుదిరిగి చూడక ముందుకుసాగు నదీ ప్రవాహం వలె, అణగిన కోర్కెలతో ఒకచోట నిల్చిన పడియవలె, ఋతు మనోజ్ఞ వర్ణ సౌందర్యం ఎరుగని, కాలచిత్రం వలె, నదీ సమార్ద్ర కరస్పర్శ సోకని చలన రహిత శైలం వలె బహు విధ జీవిత రూపాలు ప్రకృతికి ప్రతి బింబాలు. పరిపాలింపబడి అనాదింపూర్వ స్థితిచే విసరిబడి బహుదూరం విపరీతపు గాలిచే ఊహ పరిధిలో మలచబడి విచిత్రరీతి గల్లచేపటంవలె మ్రాయు వాయు ధ్వనులవలె వాయువీధిసాగు మృదు కఠోర స్వరాలవలె చరించే మానవ రాక్షస తత్త్వానేకమతులు. వర్షధారలచే ఆర్ద్రమైన భూసారం గ్రహించి, ఉద్గమించి పుష్పఫలభారంతో వంగి, శిశిర వాయువులకు ముడుచుకొని ఆకురాలి ఎండిన లతాతరువుల వలె జీవన సంతోష రేఖలూ మృత్యు విషాదచ్ఛాయలూ బింబించిన రూపాలతో స్పందించు ప్రవర్తనలతో మానవీయం ఆయుః పరిమితి వెళ్ళబుచ్చు చైతన్యం దాగిన లౌకిక మూర్తులు, ఒక వాయు ఝుంఝు, ఒక రాక్షస కృత్యం ఒక దిశలో ఒక స్వభావంలో ఒదిగినట్లు, స్వప్న ఘటనలు, సముద్ర ఘోషలు ఒక అనువర్తనం, ఒక లయలో సాగినటు, కలతలో అలజడిలో నిదురలో చావులోనూ నియతరేఖ ననుసరించి నడుస్తుంది; అవిజ్ఞేయంగా అనిశ్చితంగా కన్పించే సంకీర్ణ మహాసృష్టి. III రెండు కనులు విప్పి ఎంత చూచినా తృప్తి చెందక నా ముఖానికెదురుగా సూర్య చంద్రులు గుర్తుగా, వంగిన ఆకాశంలేచి విశాలమై భూభాగం ఇచ్చిన అవకాశస్థలి నిశబ్దంగా, వినబడు సంగీతం వింటూ కనబడు దృశ్యం చూస్తూ, పొలాలు ఎడారులు కొండలు అరణ్యాలు నదులు జనపదాలు తిలకిస్తూ ఎంతదూరం వచ్చాను? వికసించిన పద్మంవలె నిశ్చల గగన రేఖలు హత్తుకొనేంతటి దగ్గరగా. మాదిరాజు రంగారావు నగ్నంగా వృక్షాలు నావైపే చూస్తున్నవి ప్రేమతో నదులు పరుగిడుతూన్నని. చేతులు చాచి ఎదురైనవి గాలులు. గతకాలస్మృతులవలె రాలుతుంది మంచు. ఆకాశాన కారుమొగిళ్ళ గుంపులు భూమిపై నల్లని త్రాచుపాములు. కొంత దూరంలో దూరదూరంనుండి కపాల నిర్గత వాయు స్వరాలు విని హర్షంతో ఎగిరిపోయే పిట్టలు. భయంతో ముడుచుకొనే మనుషులు. దూరం సుదూరం సాగిపోయిన నా మేధలో ఒక ప్రక్కకొరిగి తిరిగే భూగోళం, ఊహవలయం. ఊహగతంగా వేదన పెంచుకొని మానవులను చూడడానికెంతగా తపించి పోతున్నాను? అడుగడుగునా కంటి నాకర్షించేవి రంగులు వేసిన మట్టిబొమ్మలేగా? నలువైపులా పరికిస్తూ గమనం సాగిస్తూన్న నేను, నేనుగా గుర్తు పట్టడానికే ఇంత కాలం పట్టింది? ఎక్కడ ఎవరిని చూచినా వారిలో నా రూపమే. ఎక్కడ ఎవరు పలికినా అందులో నా ఊహయే. కనబడు వినబడు జగత్తును పరిపాలించే మానవ మేధ. మానవీయం కనబడని వినబడని దానికి ఆవర్జితమైపోయే హృదయం. గడచిన రోజులు వెలగుకంబాలవలె తలచిన స్మృతులు నిదురలో స్వప్నాలవలె గుంపులు గుంపులుగా ఊహలు మబ్బులవలె మనస్సు నాక్రమించి క్షణం నిలిచా. అంతలో మహాధ్వని! అంతలో నిశ్శబ్దం! నా చుట్టూ నాల్కలు తెగిన గంటలవలె గాలి పిలుపుకు పలుకలేని ఆకురాలిన చెట్లు! గాలి స్పర్శకు పులకరించలేని ఎండిన నదీనదాలు! మనస్సులో ఆవేదనా సంగీతం కనుల యెదుట మాన రోదసి! నా శిరస్సు ఆకాశం వలె అందని మేరలో నున్నది నా పాదాలు నదీ తరంగాల వలె ఒక చోట నిల్వలేకున్నవి నా మనస్సు గాలివలె వెలుగు వలె ఆడుతూంది అంతటా నా చూపు కత్తివలె పక్షివలె దిక్కులలో దూసి ఎగురుతూంది. అన్ని ఋతువులకు ఒదిగిపోతూ వాయు మూర్తులతో కలిసి ఎంత దూరమైనా సాగి వెనుకకు మరలిరా స్ఫురించదు; మాదిరాజు రంగారావు ఆకాశం గొంతులో గొంతు కలిపి వినిపించే పృథ్వీగీతం వింటూ. ఎన్ని రోజులు గడచిపోతే అన్ని రెక్కలు మొలచినట్లు నాకు. అన్ని రేకులతో వికసిస్తుంది నా జీవితకాల పద్మం! మానవీయం మానవీయం రెండవ భాగం అశాంతి వాయుసంగీత వికంపితమై సమార్ద్రమై లయించి నదించు గ్రీష్మవేళా హిమశిలంవలె, సూర్యకిరణ తీక్ష్ణతకు వాడిపోక వెన్నెలల మృదూహలకు మెత్తబడు నీలగగన వలయం వలె, తాకితే భగ్గున మండించు అంతా రూపసౌందర్యశిఖవలె, నిశ్చల సమరేఖాస్థితిలో నున్న మనస్సులో ఎక్కడిదీ అశాంతి. దీర్ఘ భుజగంవలె బుసకొడుతూ నటత్తరంగిణివలె చెంగలిస్తూ మలకలుగా మెలికలుగా తిరిగిపోవు మనస్సులో ఎక్కడిదీ అశాంతి! జీవితమే కళాకృతిగా మారిపోవడానికి నాంది ! వెలుగు అహంకారంతో ముసరు చీకటి గుంపులో విసరు చురుకు గాలిలో ఆకారం మలచుకొన్న అశాంతి. ఆనంద లోకాధిపతులపై రహస్య హత్యా ప్రయత్నం. సముద్రంలో ఎగిసే తరంగాలవలె మనస్సులో తీవ్రాలోచనలు. మాదిరాజు రంగారావు కాలచక్రార ఋతుపరివర్తనతో స్వభావం మారిన ప్రకృతి స్వరూపంలో రాత్రికళ్ళలో గగన మస్తిష్కంలో మనోరోదసిలో దాగిఉంది అశాంతి. రున విరచుక పడు వార్షక ఝుంఝా మూర్తివలె మనస్సులో స్త్రీ స్ఫులింగమై మేల్కొన్నపుడు అశాంతి. మానవతా కేంద్రం నుండి సాగిన ప్రగతిశీల పరిణామశక్తుల ఆక్రమణతో సమాజపు సరిహద్దులు చెరగి పోయేప్పుడు, దైనందిన జీవిత సమస్యలకు స్వస్తి చెప్పి ఎంతవరకు తీరని సందేహాలతో ఆకాశపుటవతలి లోకంపై ప్రశ్నలతో విశ్రాంతి కలవడిన గుండెలలో అశాంతి! హాహాకారహసంతులు! సంధ్యా సమస్యలే సమస్యలై చుక్కల ప్రశ్నలే ప్రశ్నలై కంటికి వెలుగుకరవై నపుడు సంప్రదాయరేఖ లధిగమించి చీకట్లను సహస్రధా చీల్చు కాంతి విప్లవం రెక్కచాచిన అశాంతి! శాంతికై అశాంతి. అశాంతిలోని వీరకృత్య చిహ్నాలు, చరిత్రలోని ప్రగతి సోపానాలు– పూర్వం వెలసిన అశాంతి స్థితులు రాజుల కీర్తి గౌరవాలకు కొలతలు. తెరలు తెరలుగా జారిన భిన్నభిన్న వర్ణాలు, పొరలు పొరలుగా ఒదిగిన సామాజిక శ్రేణులు మానవీయం మనోవ్యాపారం, క్రియాకలాపం లేనిది, నిజంగా శాంతి లేదు, మానవునికి. హృదయంలో సూక్ష్మ సూక్ష్మంగా తీవ్ర తీవ్రంగా చెలరేగిన మాయని అశాంతి చిహ్నాలు, మనోజీవి ప్రతిభా స్వరూపాలు. శాంతి! శాంతి! శాంతి! అశాంతి సమావరించని స్థలరేఖ, కాలాంశం ఉన్నదా? అనంత విశ్వంలో? రాతియుగం నుండి అణుయుగం వరకు నియంతృత్వం నుండి సామ్యభావన వరకు. సాగిన చరిత్ర పరిధులన్నీ అశాంతిలో రూపొందినవే. II ఊహల ఉన్మేషంతో రూపొందిన సృష్టి. కదలికతో గమనం, అభిరుచితో జీవితం అనుభూతితో పరమార్థం సాధించే మానవుడు. ధూళిక్రమ్మికతో రంగులుగా భాసించే వాయుగోళాలవలె పరిస్థితులు. ధ్యావాపృథివి మేల్కొన్న క్షణంనుండి ఏ ఒకరి మృత్యువుతోను అంతమొందక అవిచ్ఛిన్నంగా సాగే సంస్మృతులు, అనుభవాలు, సృష్టి క్రియాంశలు, పరివర్తన రూపాలు. మాదిరాజు రంగారావు మృత్యువు కివతలనున్న ఈ లోకంలో అడుగుతీసి వేసే లోపల నా దృష్టి పరిధి నాక్రమించి, ఒకదాని నొకటి మించిన వేగంతో కొన్ని మించని వేగంతో కదలిపోయే భిన్నభిన్న రూపాల అసంఖ్యాక ముఖాలు. ఆడబడుతున్న చదరంగాలు, వైకుంఠ పాళీలు. ప్రొద్దు పొడవగనే సంక్షుభిత విభుగ్న పరికుంచితములై వేదనా విదీర్ణ పరిపాండురములై, రాత్రి కురిసిన చీకట్లకు తడిసి చివికి కోర్కెల కుబుసం రాలిపోయి, విచ్చిపోని ప్రశ్నల సంకెలలతో కదలెడి సంకెలల గల గలలతో గుప్పిళ్ళు గుప్పిళ్ళుగా విసరిన చీకటిలో నింగి బూది కుప్పనుండి క్రిందికిరాలే తూర్పార పట్టిన నిప్పు కణాలవలె కన్పించు చూపులతో, జేవురించి మసిబట్టి పాలిన ముఖాలు. పరిభ్రమించు అశాంతి గోళాలు. ఎదురెదురుగా జంటగా మూకలో ప్రతిచోటా ఎప్పుడు చూచినా ఒంటరిగా సామాజికంగా నిన్నటి గురించి నిరాశ, నేటిగురించి అతృప్తి రేపటి గురించి అందమైన కలలబొమ్మలు. మనిషిలో మరొకరికి కన్పించక తిరుగు అసంఖ్యాక రూపాలు. ఒక నీలితెర తొలగిపోయి అవతరించు ఉదయంవలె, ఒక ఘటన ముగియగానే బహిర్గతమా నిజరూపం. మానవీయం పెదవులపై చిరునవ్వులు, ముద్దు మాటలు, ఏడుపులు, అరపులు, తిట్లు, ఆక్రోశాలు. మంచు, చలి, వేడి, ఎండ, గాలి తెరలు. తెలుపు, నలుపు, ఎరుపు, రంగు విరుపులు. ఆనందం విషాదం సంయోగం వియోగం. అవధిలేని కాలం ప్రకృతిలో పరిణామం. రాత్రి పన్నెండుగంటలు, జాతకంలో మార్పు నిన్న ఈ రోజు రేపు వెనువెంటనే ఒక స్థితి అవసానం, పునరావృత్తం. కాలు జారినపుడు గాలి నవ్విన సవ్వడి, కాలు సాగినపుడు గాలిమెచ్చిన ధ్వని. పలుచనినీడ తెరలవలె ఊహలు. వాని వెనుక రమణీయాకృతి, స్త్రీ. తిరిగి తిరిగి వచ్చిపోవు ఋతువులు మలగి మలగి సాగిపోవు బ్రతుకులు. అడవిలో పొలాలలో పల్లెలలో పట్టణాలలో చేతికందని ఎత్తులో గాలికి మ్రోగు ధ్వజస్తంభ ఘంటికలవలె మనుషులు. జన్మజన్మాల పరంపరగా వచ్చు అనాది వాసనాత్మక కల్పనలతో మలగిన వివిధాకృతులు. ప్రేక్షకుల మనోవృత్తులతో సంబంధంలేని సినిమా చిత్రాలు. అణువునుండి అజాండ పర్యంతం, అలముకొన్న అశాంతి ఆవరణంలో, కాలం చేతులుచాచి ప్రతిక్షణం రూపుమాపుతూ వచ్చినా, మాదిరాజు రంగారావు మాటిమాటికీ శాంతి రేఖలు గీచుకొని బ్రతికే ఆశాజీవులు. దేహ పోషణకై ఆరంభించి పోరాటం కూడు గుడ్డ పదవి కీర్తిలో ఎన్నటికీ తృప్తి యెరుగని శరీరులు ఆలభ్యమైన దానికోసం జీవితం పిండి, విసిగి వేసారి ఆవేదనా హృదయంతో చివరకు ఈ జీవితానంతర భావనలో పుణ్యలోకాలు సృజించుకొను లోక హితైషులు, ఆనందమూర్తులు. ఋతువు శోభ, పవమానస్పర్శ ఆశ్చర్య ఘటన, దుఃఖసమయం ఆనంద స్థితి, కళా సౌందర్యం చైతన్య ప్రకాశనం, వేదాంత భావన; సూక్ష్మ తీవ్రదశలలో జీవితంలో అనుభూతులు గుములుగా చుట్టుముట్టినా కదలని మెదలని మనోనైశిత్యం తెలియని పోతపోసిన లోహఖండాలు. ఆకలిగొన్న ఆశతో కసి బలిసిన కళ్ళతో ఆరని హసంతికవలె కణకణలాడు హృదయంతో నవోహలు మొలకెత్తని మరుభూమి మస్తిష్కంతో ఎండకెండి వానకు తడిసి చలికి బిగిసి మాటుబారిన శరీరాలతో ద్రిమ్మరుతూ, రాత్రివేళ ఏగోడ పంచనో చెట్టు క్రిందనో శారీరక కామన తీర్చుకొని బయటపడి చౌర్యం సాగించి క్రౌర్యం కనబరచి, నిశ్శబ్దం రూపుకట్టి నివ్వెరపోయిన స్థితిలో మానవీయం నీడలవలె పడి ఉండి, తృప్తిగా నిదురపోవు దిశిబొమ్మలు, వెలుగు సహించని తమామతులు. దైవబుద్ధి చేతులెత్తి శూన్యంలోకి పరుగెత్తి రాత్రితప్ప దిన మెరుగని పుట్టంధులు, ముందు వెనుక ప్రక్కల జఘన్యస్థితిలో బ్రతుకులో వెలుగుపోచ ఎరుగని భాగ్యహీనులు. ఎన్నిమారులు యుద్ధం వచ్చిపోయినా ఎంతకాలం శాంతి నెలకొనియున్నా పాలన తలక్రిందై పాలకులు మారినా మరుభూములలో చెక్కుచెదరని దిబ్బలవలె ఎక్కడబడితే అక్కడ సంస్కార హీనదశలో దాదాపంతా మగత నిదురపోయేవారే. రాజకీయ సాంఘిక మత తీవ్రశక్తుల ఆకర్షణ కోల్పోని, సంఘర్షణ వీడని విప్లవ మనస్తత్వంగల అగ్నిమూర్తులు. దివ్యదశల నూహచేయు శాంతివర్తులు. నవ్వుతూ ప్రేలుతూ కోపిస్తూ నటిస్తూ వివిధ రీతులలో రంగులలో వెలుగుతూ, మంచు మబ్బు చీకటి గాలి నిప్పు వెలుగు తెరల చాటు నుండి పరిక్రమించు ముఖ పంక్తులు. సూదుల వంటి చూపులతో క్రీపెదవి బిగబట్టి నడచు పురుషులు, ఎరుపెక్కిన చెక్కిళ్ళతో బరువు రెప్పలెత్తి చూచు స్త్రీలు. జీవితంలో సమార్ద్ర పరిష్వంగంతో అమృతం వర్షించు, నిప్పులు పండించు మాదిరాజు రంగారావు మసృణానల విసృమర శృంగార కళికలు. దేవతను రాక్షసునిలా, రాక్షసుని దేవతగా వెలుగు — చీకటిగా బ్రతుకులు తీర్చగల జీవన — మృత్యు కళా రూపులు. హృదయాకాశం నుండి కురియు ప్రేమ వర్ష బిందువులను ఎప్పటికపు డింకింపజేయు ఇసుక దిబ్బలు కొందరు. అందం మట్టిలో ఆనంద మాకాశంలో కలిసి నిలుకడ ఎరుగనిదై మనస్సు దూదికన్న తేలికై బ్రతుకు అగ్ని రూపస్థితి కాపుతియె, గాలిలో లయించి ప్రాణచ్చట కాలగర్భంలో ఆశ్రయం పొందిన అభిమాన మూర్తులు. తమలో ఎంత లోతుగా అసురాంశు నిద్రాణమె యున్నదీ తమపట్ల ఎంత గాఢంగా భవిష్యత్తు దాసభావం వహించిందీ తెలియని అమాయక హృదయాలు తెలిసిన విజ్ఞులు, ప్రతారించు లౌకికులు. అగ్నిపర్వత శిఖరం పగిలినట్లు పట్టపగలు. ఎక్కడ చూచినా తీవ్రగమన వైఖరులు. తమపై మమకారం, లోకంపై మహాతృష్ణ. ప్రక్కవాడితో అజ్ఞానంలో పోటీ. సాయం సమయం పాములు విడిచిన పుట్టవలె మానవీయం కోర్కెలు ఫలించని ఇసుక దిబ్బవలె సంధ్యానలకీలలకు పొగబారిన ఆకాశం. జాతులు జాతులుగా మాలలు మాలలుగా ఇతస్తత ఉడ్డీన విహంగమ సమాకీర్ణమై, చివరలు నీలీకృతమైన విలోచన పథం. విశ్రాంతి కోరు యాత్రిక సమూహం. ప్రాణమున్నంత వరకు, త్రైగుణ్య విపర్యయంతో అసంపూర్తి కామనలతో రగులు మనఃశ్మశానంతో సతమతమౌ మానవుడు. అతని ఇష్టాపూర్తికి చిట్టచివరి దశ ఈశ్వరుడు ఆపైన బ్రహ్మపదవి. ఈశ్వరుని పాదాలముందవనత మస్తక సోపాన వలయం. అతని శిరః పదంమీరి బ్రహ్మ పదవి చేరగల తమలోని ఆత్మ రూపం తెలియని జీవసమూహం. రుద్రభూమిలో శివతీర్థం యుద్ధభూమిలో స్వర్లోకం మృత్యుముఖంలో పునస్సృష్టి నిద్రాలోకంలో స్వప్న ఖండం ఆశావిస్తృతిలో తృప్తి రేఖతో వెలుగు ఆనందపరీతాత్ములు. మింట గాలి కౌగిలిలో తేలి ఎప్పుడో ఎక్కడో వర్షించి భూమిని పులకరింపజేసి మాదిరాజు రంగారావు లేదా తునాతునకలై పోవు చలచ్చంచల మేఘ పంక్తులవలె స్త్రీ పురుషులు. విషాద వైరాగ్యజిజ్ఞాసతో భయ సందేహ పరిశీలనతో వేదాంతం విజ్ఞానం నూల్కొల్పి విద్య ధనం కీర్తి అధికారంతో అందం మోహం ఆనందం ముక్తితో ఆరాటం పోరాటం ఆటుపోటులతో విజృంభమాణ విస్తరణశీల అహంతో సమశక్తుల సంఘర్షణలో దుర్బలుల ఆక్రందనతో సంధ్యారుణ రక్తిమలో శాంతికోసం మానవుని తాపత్రయం. * కేవల మేధా శక్తితో ఆహార వ్యవహార సమస్యలు తీరి ఇచ్ఛామరణశక్తు లరచేత బట్టి, భూమిపై యంత్రంవలె వ్యోమంలో విమానంవలె సముద్రంలో నౌకవలె, తెలిమబ్బుకన్న తేలికైన సంకోచ వ్యాకోచ శరీరాలతో విశ్వగోళం బింబిచే మస్తిష్కాలతో ప్రేరణాత్మక సహజశక్తుల నెరుగకయే వేదనానుభూతిచ్ఛాయలైనా లేకయే సమాజావసరాలకు మించని సంఖ్యలో * A brave new world అన్న గ్రంథంలో Aldous Huxley విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన నాటి స్థితి నూహించి చిత్రించిన సమాజ స్వరూపం, ఆధారంగా మానవీయం భిన్న రీతుల్లో నిర్మితులై ప్రవర్తించు, రసాయనిక ద్రవ్య సముద్భూత భౌతికరూపులు. ఆగామి యుగంలో అవతరించనున్నవారు. చీకటిని రూపుమాపు కాంతివలె సృష్ట్యాద్యంతాలు కొలిచే చూపులతో నిశ్చితంగా తరగతులుగా విభక్తమైన సహజోన్మీలనమతిలేని వారు. అశాంతినంతరింప యత్నించు వినూతన విజ్ఞాన మహాయుగం. III సూర్యుని పాదముద్రలెంత వరకు సాగినవో అంతవరకు ఏవో ఆకృతి విశేషాలు తప్ప ఎక్కడా ఎవరి నిజస్వరూపమూ కన్పించలేదు. ప్రక్కనున్న చెట్లకు నాభాష తెలియదు వాటిలో ఒకరి భాష వేరొకరికర్థం కాదని తరువాత తెలిసింది. ప్రక్కనున్న కొండలకు నా రూపం కన్పించదు. వాటిలో ఒకరిని వేరొకరు చూడనేలేరని తరువాత తెలిసింది. వెనుక నడచే నీడలకు నా ఉనికే తెలియదు. వాటికి చెవులు నోళ్ళు కళ్ళు లేవనుకున్నా కాని జీవం కూడ లేదన్న విషయం తరువాత తెలిసింది. వెలుగు గీతదాటని చీకటి బంతులవలె ఎక్కడబడితే అక్కడ దాగిదాగి మలగు జంతువులు తప్ప నాకంటికి ఎక్కడా జ్ఞాన స్ఫూర్తి గల మానవు లగపడలేదు. మాదిరాజు రంగారావు దూరం బహుదూరం వెళ్ళిపోయిన నా పాదాలక్రింద అణగిన ధూళి రేణుపులు. బుద్ధిని వదలని తృష్ణ తీరని కామనలు కంటిముందు ఎదవిప్పి ఆహ్వానించు రోదసి. మింటినుండి మంటికి జారిన మంచు తెర చాటున ఎవరో, నే సాగినపుడు ముందుకుసాగి నే నిలచినపుడక్కడే ఆగి మనోదఘ్నంగా ఆలోచనామూర్తిలా కనుచూపు మేరలో నిలిచిపోతే నా కాలిసవ్వడి నాకే భయంగా నా ఊహ పడగ విప్పిన పాములా నగ్నంగా వాంఛాసహితంగా కన్పించి నా ఆకృతి నాకే రెండు రంగులుగా; ముఖంత్రిప్పి చూతును గదా వెనుక మలిసంజ వేళ జడలు రేగిన చీకటి. నేత్రపరిధి నావరించిన నైల్యాకృతి ఎటు చూచినా మానభావస్థితి. దగ్గర దగ్గరగా దూర దూరం నుండి గాలి నడకల పరుగుల సవ్వడి. అది నవ్వుతెర, ఏడుపు రొద ఏమైనా కావచ్చు. ఈ ఎడారి, అడవులు పొలాలు, మైదానాలు క్రమ్మిన ఆ మంచు తెర చాటునుండి కన్పించే దెవరా శాంత మూర్తి? ఒక విధంగా భగవంతుడు అవిద్యాప్రపంచంలో వెలుగు మానవీయం జ్ఞాన రూపం. అవునేమా? నా నీడ నిలుపు వెలుగు రేఖ! లౌకిక జగదనుభోగంలో ఆనందం విషాదం పేరిట రసోద్విగ్నమతికి గోచరించు అశాంతి వివర్తదృశ్యాలు. కాల పరిమితి లేకుండా అద్దంవంటి బుద్ధిలో బింబించి హృదనుభూతి కాంతిలో కన్పించు వివిధ మనో భూమికలు. యుగదర్శనం ఈ పురోగమనమెంత వరకు? దిక్కుల అంచుల వరకు. ఎంతకాలం సాగుతుంది ప్రయాణం? మరో ఉదయమయ్యే దాకా. ఎక్కడికీ సంధ్యవేళ? మరో మనోలోకానికి. ఆ శాంతిని పట్టుకోవడానికి. ఈ రూపం మారిపోవడానికి. సృష్టి రహస్యం ఇది ఇది అని ఎవరు ప్రపంచించింది నిజం? ఏదో ఎందరికో తెలిసినట్లుంటుంది. ఎవరికీ సంపూర్ణంగా తెలియదు. మాదిరాజు రంగారావు ఎన్ని యుగాలు గతించినా ఇంకా ఇక్కడే ఉన్నాం ఉన్నచోటునే, మానసిక వైక్లబ్యంతో యుద్ధభయోన్మనీ దశలో. ఎన్ని తరాలు గతించినా అక్కడే ఉన్నాం అజ్ఞాన స్థితిలో; మానసిక వ్యాపారంతో తెలివి మీరిన ముఖాలతో. ఎంత దూరం ప్రాకినా ఎంత కాలమాలోచించినా అంతరిక్షం హస్తగతమైనా గ్రహాలు స్నేహితులైనా బ్రతుకు భోగభూమి ఐనా మేరలేని వాంఛా పిపాస. ఇంకా దేనికోసమా ఆవేదన. తత్సాధనకై యత్నంలో అశాంతి. చీకటి ఓటమి నంగీకరించలేదు. ఆకాశంవలె విస్తృతమా అజ్ఞానం తుది తెలియలేదు. దివానిశలు ఋతువులు వత్సరాలు ఒకదాని వెంట వేరొకటి ఆగమనం నిష్క్రమణం పునరావృత్తం. స్వర్గం, నరకం, మతం, రాజకీయం పరాకాష్ఠ నందుకొన్న స్థితిరూపం తిరిగి మరో మరో రూపంలో ప్రత్యక్షం. ఒక ప్రాణి సన్నని చూపులో ఒదిగి ఒక జీవి బరువు నిట్టూర్పులో తూగి, సామాన్యుని కంటికొక మట్టి ముద్దవలె మానవీయం విజ్ఞానానికి పరిభ్రమించు గోళంవలె వేదాంతికి భ్రమాదిత స్వప్నంవలె, స్పష్టాస్పష్టంగా సంపూర్ణాసంపూర్ణంగా భాసించు సుఖదుఃఖాత్మక ప్రపంచం. బహు విచిత్ర మనోభావ సంకలనం. ఈ ప్రపంచ నిర్మాణ పరంపరకు మూల కారణం? నీరు ? మట్టి ? కాదు ! చైతన్యం ? అవునేమా ! ఇంకా ఇంకా ఏమైనా కావచ్చు మరో నాటికి తలయెత్తు మరో సందేహం. కొన్నాళ్ళకు పరిష్కార సూచనలు. ఎప్పటికపుడు వ్యత్యప్తమె పోవు సిద్ధాంతాలు, విలువలు. గగన పదవి కదలు మబ్బులవలె గాలి తాకిడికి వినిపించు ధ్వనులవలె అంతటా ప్రసరించి తరగని వెలుగువలె చేతికందీ అందని నీడలవలె, ఆనంద విషాద మిశ్రిత రూపాలలో ఎక్కడ మొదలై ఎక్కడ అంతమొందుతాయో తెలియని ఆలోచనలు, తదనుగుణ ప్రవర్తన గతులు. విజృంభమాణ విభిన్నశక్తుల పరస్పర ఘర్షణతో పతనమై, మరల ఉదయాన్ముఖమె వికాసించి ప్రతిష్టితమౌ సమాజ వ్యవస్థ. అనాదినుండి సృష్టి రహస్య గవేషణలో జీవితాల నంకితం చేసిన మాదిరాజు రంగారావు వేదనాజీవులు, మహితాత్ములచే పరంపరగా రక్షింపబడుతూ వస్తూన్న అఖండ మానవ సంస్కృతి. మతం లేదా రాజకీయపు ముసుగులో దాచబడిన మనిషి నిజరూపం. బహువర్ణ రూపాలలో ప్రకటితమా హత్యాభిముఖ రహః పూర్ణ మనోదశలు. ఈనాటి వరకు హత్యా బుద్ధిలో వేగ తీవ్రతలు సన్నగిలని మానవుడు. ఈనాటి వరకు క్షమారహిత శిక్షా నైశిత్యం మొక్కవోని నాగరికత. ఎన్ని అవతారాలెత్తి ఎన్ని మతాలు నిర్మించి ఎంతగా సాహిత్యం సృజించి ఎంతగా విజ్ఞానం ప్రపంచించి కాలానికెన్ని మారులెన్ని విధాలుగా స్వర్ణ కిరీటాలు ధరింపజేసినా అశాంతి అంధకారంతో నిండి మారని హత్యాభిముఖ చంచలమనస్థితి. అసంస్కృత దశలోని అసాధారణ దుస్థితిలో ఆయుః పరిమితి వెళ్ళబుచ్చు మానవులు. ప్రతివస్తు నిర్మితి రూపంలో సృష్టి రహస్యం శోధించి ప్రతి చిన్న కదలికలో కార్య కారణ ఊహించి, ఆకాశం పొరలొలిచి వేయు నిశిత హేతు దృష్టితో పైన ఆ పైన లోకాలు భావించి విభిన్న శక్తులను దర్శించి మానవీయం మనిషిలో పక్షిలో పాములో జంతువులో పిపీలికలో వృక్షంలో ప్రాణశక్తి గుర్తించి జనరహస్యం శోధించి, రోదసీయానంతో గ్రహతల సంచరణం సాధించి పురోగమనధ్యేయం వదలని ఆశాజీవి, మానవుడు. II నిల్చి యాచిస్తున్న పిచ్చివాని ఊహలవలె చుక్కలు. చుట్టూ తడుములాడు గ్రుడ్డివాని చేతులవలె గాలులు. ఒకరి ఊహ వేరొకరు పలుకలేని మూగజీవుల నిర్వేదం వలె, అక్కడక్కడా ఒదిగిఉన్న మసక వెలుగులు. ప్రకృతిలో మృదురూపం ధరించిన ప్రశయం వలె, మనస్సులో భయదాకృతి దాల్చిన ప్రేమ వలె, అంధకార మాక్రమించి నిల్వజూచే వెలుగువలె, బ్రతుకులు గ్రీష్మంలో ఇంకిన నదివలె సూర్యుడస్తమించిన దిశవలె చావుతప్పిన బ్రతుకుగడపు, ఈ శతాబ్దంలోని సామాన్యుడు. ఊహలో అదృశ్యమైన ఆశను మేఘంలోని మెరపు జ్ఞాపకం చేస్తున్నది. సూర్యుడు తమ ముఖాలలో ఎప్పుడు పొడిచేదీ ఎవరికి తెలియదు. మాదిరాజు రంగారావు రాత్రివేళ భయనిద్రాసమాధి వలె సంగీతం విరమించిన సముద్రంవలె ఉచ్చ్వాస నిశ్వాసాలు నిలచిన శరీరంవలె ఆగినట్లున్నది కాలం, నిశ్శబ్దంగా. అంతరిక్ష గోళాలలో ఆవాసానికి విరివిగా జరుగుతూన్న ప్రయత్న సంరంభం. భూగోళంపై ఒకమూల మానవుడు తిండికీ బట్టకు అఘోరించే అభాగ్యం. కొలిమితిత్తులవలె మండిస్తూ ఊపిరితిత్తులు, చలికి బిగిసి ఏనాడో గడ్డకట్టిన ఆలోచనలతో ఎక్కడవేస్త అక్కడే! మట్టిముద్ద స్వభావంతో కబంధుని చేతులలో కీలుబొమ్మలు. ఇంద్రియ తర్పణీయ భౌతిక సౌభాగ్యంతో గ్రహాంతర విజ్ఞానంతో, నిస్సందేహంగా పరిణతి చెందిన మానవ జీవితంలో, వ్యయమెరుగని వెలుగువలె విజ్ఞేయ ప్రపంచం. యాంత్రిక సౌభాగ్య దశలో మరచిన ఆత్మ చైతన్యం. సంఘశక్తి పీడన క్రింద అంతరించిన వైయక్తిక వికాసం. అణురజో రూపంలో రాలిపడు రూబులు డాలరు విలువలు. సైనికబల సంపదతో ఆకలి తీర్ప యత్నించెడి తెలుపులు. భూగోళం చుట్టిరాగల అణుమారణ నవాస్త్రాలు. వాని వశంలో తిరుగు యుద్ధోన్మాదుల చిత్తాలు. మానవీయం రాబోయే యుద్ధ జ్వరభయంతో వణకుతున్న వాతావరణం. మృత్యువు స్ఫురించేసరికి శాంతిపాఠం వల్లించు కంఠశోష. రాత్రి చీకటిలో తిరుగు పెద్దపులి మెరపు కళ్ళు. దగాపడి తెరపిడి పడి ఎత్తిన జాతి నిప్పుకళ్ళు. ఇసుక దిబ్బలపై ఎండుటాకులపై మొండి గోడపై పాడుగుడులపై సన్నని వర్షపు చినుకులవలె శ్మశానంలో గడ్డిపోచలవలె, చీకటి ముసురులో మిణుగురుల వలె, పేదవాని బ్రతుకులో చిరుకోర్కెలు. తలపై వెలుగు విద్యుద్దీప కిరీటంతో వీడని ప్రాణమిత్రంవలె ఇనుప స్తంభం. క్రింద కాలు విరిగిన కుర్చీవలె చీకటి. కళ్ళు తెరచి వెలుగు కలలు కనే దైన్యరూపులు. సగం చావుకు తయారై దీనంగా కూర్చుంది రాత్రి. రాకకు సిద్ధమై ఉత్సాహంతో ఎదురు చూస్తుంది ఉదయం. ఇంకా నిదురపోని నేడు కలలు కనడం మొదలు పెట్టి తలలు పోగొట్టుకొనే జనం. నిజ స్థితికి రానున్న రేపు. మాదిరాజు రంగారావు నిప్పంటుకొని మండి మండి జ్వాలలతో సముద్ర గర్భంలో మునిగిపోవు నౌకవలె మృత్యువుచే సమాకర్షింపబడి ముఖం జేవురించిన రాత్రి. సర్వదిశల నంతలోనే విప్లవాత్మకమైన మార్పులు. ఎన్ని వేల యేండ్లో అయినట్లు దట్టమైన నిదుర పొరలు క్రమ్మిన అవని మేల్కొన్నది. పద పదంలో కాంతి చిమ్ము ఉదయ నేత్ర గగన మెదురుగా. ఆగి ఆగి పరుగిడి పోయే చీకటి పిల్లల గుంపులు ప్రక్కగా. నడుస్తూన్న నా దృష్టి నుండి తప్పించుకోజాలని శిలా విగ్రహాలను స్పృశించు స్నిగ్ధ పుష్ప మధురాధరాల వలె, చీకటి కాటుక కొండపై జారిపడు సూర్యుని దృక్కులు. బహు దూరం నుండి ఒకడు దగ్గరదాకా వినవస్తున్న విభిన్న కంఠధ్వనులు. ఇంకా వదలని నిద్రలో తూగుతూ కలలు గను చీకటి మనుషులు. చుట్టూ దీపస్తంభాలవలె ఇంకా కాపలాకేస తెల్లదొరలు. ఒకటీ తిన్నగా లేని పిచ్చివాని ఊహలవలె అల్లిబిల్లిగా అల్లుకొని చీలిన చీకటి బాటలు. మానవీయం ఊహాలోకానికీ వాస్తవిక జగత్తుకు సిద్ధాంతాలకు అనుభవ స్వరూపానికీ మనిషికీ మనిషికీ వస్తువుకు వస్తువుకు మధ్య విడదీసే చీకట్లు కలిపే వెలుగులు. ఆరిన దీపాల పొగ క్రమ్మి మూత వడిన కాలం కళ్ళు ఇంకా తెరపిడి పడలేదు. కళ్ళు ఉన్నా అంధులవలె ప్రాణం ఉన్నా శవాలవలె ఉండి తీరవలసిందే ! మనిషికి మనిషి మీద కన్న జంతువు పైనే ఎక్కువ విశ్వాసం. ఆలోచనల అవధులు లేవు. ఉదయం మృత్యువు నెరగదు. ఒక యుగం గడిచిపోయి వేరొకటి వస్తున్నదెంత త్వరగా ఒక మనస్స్వ రూపం మారి వేరొకటవతరించవలె సంపూర్ణంగా. సృష్ట్యారంభం నుండి నేటి వరకు ప్రపంచంలో భౌతిక శక్తుల ఆకర్షణ సంసర్గం సంఘర్షణ ఏనాటికైనా ఒకే తీరు. గ్రహ సమూహ గమనంతో ఋతు చక్ర పరిభ్రమణం చైతన్య కళా సృష్టిపై అఖండ కాల ప్రభావం. ఒకతరం నుండి వేరొక తరానికి అందింపబడి అవిచ్ఛిన్నంగా మాదిరాజు రంగారావు మానవ సంతతి నాగరికత తీర్చిదిద్దిన ఆత్మదీప్తి. గగన కాసారంలో తలయెత్తి సహస్ర కరాలతో ఈది వస్తూన్న సూర్యుడు. ఒడ్డున మేల్కొన్న ప్రాణికోటి ఆశాపతాక ఇంకా మేల్కొనని వారి స్వప్నద్వారం. ఈ సూర్యుని వెలుగులెవరి కొరకు? మేల్కొన దలచినవారి కొరకు. నా మనశ్చక్షురుచిర కాంతి ప్రసరించినంత మేర అదే భూమి, ఆకాశం, గాలి, నీరు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, తేజస్సు. అదే మానవుడు, సంపదలు, వాంఛలు అధికారం కీర్తి లౌకిక ప్రతారణం. అవే వచ్చిపోవు దివానిశలు. అఖండ కాలచక్రనేమిక్రమణం. అంతటా అనుస్యూతంగా ప్రవహించు చైతన్యధారా విలసనం. యుగదర్శనం II పునర్జన్మ ఎత్తాలి నీవు తప్పదు సుమీ ఇక. మరో మనో లోకాన్ని కల్పించు కోవాలిప్పుడు. దుఃఖంలో మ్రగ్గిపోక కష్టంలో నిల్చిపోక పతనంతో పారిపోక మరణంతో మారిపోక మానవీయం రాతియుగం నుండి రాకెట్ యుగం వరకు ఎన్నెన్నో రూపాలలో అభ్యుదయం సాగిస్తూ పురోగమన ధ్యేయం వదలని సంస్కృతీ సంపన్నమూర్తీ! పేదవాని కోరికలో కుంచితమై ధనవంతుని ఆశలో విస్తృతమై పొలిమేరలు చెరగిన విశాల ప్రపంచం జగన్నేతల చేతులలో తిరిగే ఆటబంతి. ప్రతి యుగానికొకే ఒక మానవ ప్రతినిధి పూర్వం. ప్రతివాడొక యుగవిధాత సంపూర్ణంగా నేడు. మౌఢ్య విశ్వాస బలంతో చెలరేగిన ఒక జాతిమతాకాండ తాండవం, పరస్పర ధాటీ ఘర్షణలో మారిమారి నవీన రూపంలో ప్రకాశించిన నాగరికత. అహంకారౌద్ధత్యం, అసహనోద్రేకం రాపిళ్ళకు తాళలేక పరుగిడి, కొండల్లో దాగి చీకటి ముసుగు ధరించి రక్షోభావమూని మానవత కోల్పోయిన మానవుడు. శాంతికీ యుద్ధానికీ పురోగమన మార్గానికీ సౌఖ్యానికీ దుఃఖానికీ తిరోగమన మార్గానికీ జన్మకు మృత్యువునకు అల్పానల్పకృత్యానికీ ప్రళయం వరకుసాగు మహా పరిణామానికి కేంద్రం. మాదిరాజు రంగారావు ప్రతి మానవ మనోఽంతరాలలో వ్రేలు బంధు భావ జాతి వర్ణతోరణాలు. ఆత్మ సంస్కృతీ ప్రవాహమింక జేయు సికతా శ్రేణులవలె జీవితకాల ఖండఖండాలు. చారలు చారలుగా అట్టలు కట్టిన నెత్తుటి గీతల బొమ్మల వరుసలు; పిశాచ హృదయులు విలాసాలకై భద్ర పరచుకొను ఆట వస్తువులు. గాలికి రాలి ధూళి కలిసిపోవు ఆకులవలె ప్రాణాలను కోల్పోవు సామాన్యులు. కసి మసిగిన మృత్యుక్రీడ, రారాజులానందించే ఒకనాటి పండుగ. అవధులులేని కాలసముద్రం విడిచిన మేఘ నిశ్వాస పరంపరలు సంఘటనలు, ఏ భూమి సమార్ద్రమై, భోగమయమై ఏ ఖండ బీడువడి, దారిద్ర్యదళితమై బ్రతుకులు గడిపేదీ ఎవరికెరుక ? ఈ దిశనుండి ఆ దిశవరకు పుటాపుటిగా హఠాత్తుగా గుమ్ములుగా ముట్టడించి ఒక్కమారు ఊపివేయు ఝుంఝా పవనం వలె ఘోరాకృతి వచ్చి పడిన యుద్ధాలకు క్షామాలకు భయపడి, కష్టాల నెదుర్కొని, నష్టాలు సహించి పరుగిడి, బంధు భావ బంధాలను మానవీయం త్రెంచుకొని సంపూర్ణంగా శాశ్వతంగా ప్రేమ పూర్ణ సౌహార్దం వదలుకోని ఏ దేశం గర్భంలోనో ఏ చల్లని నీడలలోనో ఏ పచ్చని మైదానాల్లోనో ఏ ఆకలితీరే చోటునో, ఒంటరిగా గుంపులుగా తలలు దాచుకొని బ్రతుకు సాగించిన మానవజాతి సమస్తం. క్రమంగా సాగించి పోరాటం తన ఉనికికోసం అలవర్చుకుంది అధికారపుటనంత విషవలయం. ఒకనాటి అవసరం ఆనందంబట్టి అలముకొన్న అభిరుచిలో ఊహలో వేషంలో వర్ణంలో వ్రేళ్ళుదన్నుకొని మనిషిని బహిర్ముఖుని జేసి ఒక దిశ గాఢంగా ప్రసరించిన ఒక ప్రత్యేక విధా మనస్తత్వం, మార్పులు సహించక, చేర్పుకు తలవంచి ఆకాశమావరింప ఆశగల జాతీయత్వం. భిన్న భిన్న జాతులు భాషలు ఆలోచనలు భిన్న భిన్న వ్యవస్థలు ప్రవర్తనలు విశ్వాసాలు ఒకరికొకరికి పొంతనకుదరని జీవన మార్గాలు వీటినధిగమించిన మానవతా సూత్రబంధం. దారిద్ర్యం దుఃఖం క్షామం యుద్ధం పరిణామాలకు గురియె, ఎవరికివారు విడివడి నేల నాలుగు చెరగులా చెల్లాచెదరై, తమ తమ బ్రతుకులు ప్రత్యేక చరిత్రలుగా విశిష్ట సంస్కృతీ నిలయాలుగా నిర్మించుకొని జీవిత గమనం సాగించే మానవ సంతతి. మాదిరాజు రంగారావు వేల యేండ్ల నుండి ఈనాటి వరకు సాంఘిక రాజకీయ నైతిక మతవలయాల్లో మానవుని అదే మూల మనస్థితులు. రాసులు రాసులుగా రాళ్ళూ గుట్టలవలె గుంపులు గుంపులుగా చెట్లూ చేమలవలె ఎండకెండి, వానకు తడిసి చలికి బిగిసిన మట్టిదిబ్బల వలె బండలవలె మొద్దులవలె జడ భరిత స్థితీ. కశ్మల వాతావరణంలో కంకాళపు దుర్గంధంలో మానవ రూపాలలో నిలచిన బూడిదకుప్పలు కళాహీన క్షుధాకర్శిత బానిసలోకం. పురాదర్శసూత్రపు బరువుక్రింద అణగిమణిగి భ్రమ హర్మ్యపు గోడల నీడల క్రింద ఎదుగుమాని తమకు దొరికిన స్థలంతో తృప్తిపడి ఒదిగిపోయి చీకటి కలవాటుపడి, వెలుగుకు వెరగొంది. చీమలవలె దోమలవలె ప్రాణదఘ్న భయంతో పుట్టిన క్షణంనుండి చచ్చే క్షణం వరకు సంకల్ప నవోదయ మెరుగని త్రపాహీన సేవామతి సంపన్నులు. ఎక్కడ చూచినా అధిక సంఖ్యలో ‘జీరో’ విలువలు. గ్రీష్మాతప శుష్కితమై అగ్ని తేజో దగ్ధమై రథ్యావీధి నడవ నేర్చిన చెట్లవలె మానాలాపాలతో, ఉదయ రధ చక్రపు మానవీయం వెలుగుచాలు నంటి వచ్చు నీడ బొమ్మల వలె కదలిపోవు సంధ్యాజీవులు. ఆకాశచ్ఛత్రం క్రింద హద్దు మీరని ఆశలతో తమ నీడే ఒక బొంతగా చుట్టుకొన్న నగ్న జీవులు. నాలుగు చక్రాలూ విరిగిన ధర్మరథశకల పంక్తులు. నిరంతరం పీడించే చిక్కు విడని సమస్యలకు ప్రతీకలు. ఆ రోజు గడచిపోతే చాలు నిండా నూరేండ్లు నిండినంత ఎత్తైన ఊహా గగనంలో వాడిపోయి ఒరుగులవలె వ్రేలుతూ, కాలిన కట్టెలవలె నేలపై బ్రతుకు గడుపు జీవచ్చవాలు. నరనరాల తేజస్స్రవంతులు ప్రవహించి ఆకృతులు నవాగ్ని శిఖలుగా, ఉత్తుంగ తరంగనటదుద్వేగంతో పరుగులు తీయు ఉప్పెనవలె విరుచుకుపడు సమీకృత ప్రజావిక్రాంతిలో కూలిన కోటలు ఎగిరిన సింహాసనాలు హతమారిన అహంయువులు అణగారిన అగ్నిగుండాలు. దారిలో మేల్కొనవు శవాలు గతి తప్పదు చరిత్ర భ్రమణం! మాదిరాజు రంగారావు తిండికి బట్టకు స్వేచ్ఛకు కరవులేని సామ్యభావ సామాజిక వ్యవస్థలోనూ, మానవజాతి సమగ్ర వికాసం మరో మనోలోకాన్ని సృజించుకున్నపుడే. ఒక మహా పథాన వేగదీప్తి సాగు యుగరథ చక్ర విఘట్టితమె నలగికలగి గాలికెగయు ధూళికి వెరగొందక మానవతాపై విశ్వాసంతో పురోగమన శీలంతో. ఎత్తకతప్పదు నేటి మానవుడు వైజ్ఞానిక యుగ భూమికలో వైయక్తిక వికాసంతో విశ్వ సంస్కృతీ రూపం. పదపదంలో ధ్వనింపగ క్రొత్త శక్తి ఎద ఎదలో స్పందింపగ క్రొత్త సృష్టి. మానవీయం మానవీయం మానవుడు ఆదినుండి నేటి వరకు గడిపిన వివిధ జీవిత గతులూ, బహు కాల గతులూ చిత్రితమైన కావ్యం. మొదటి భాగం ఉదయం – ఉదయం చూచి మానవుడు మొదటిసారిగా పొందిన అనుభూతి స్వరూపం భావితమైంది. ఉదయం తరువాత – మానవుని నైసర్గిక తత్త్వమూ ప్రవర్తనా స్వరూపమూ పొందిన క్రమ పరిణామం కలది. బ్రతుకుపై విశ్వాసం భవిష్యత్తుపై ఆశతో, సుఖ సంతోషాలపై కాంక్ష కలిగి దేవతలను సృష్టించుకొని జీవితమొక క్రమ పద్ధతిలో వ్యూహ నిర్మాణంలో తీర్చుకొనే ప్రయత్నమూ ఊహశాలిత్వమూ స్పృశిస్తూ కొంత వర్ణన ప్రధానంగా సాగింది. జీవిక మొదలు – జీవికకై మానవుడు బయలుదేరడం అతడెదుర్కొన్న క్లిష్ట స్థితులూ, వాటి నధిగమించే తెలివి తేటలూ నాగరక దశకు చేరుకొనే సంధిలోని మనస్తత్వమూ రూపితమైంది. బ్రతుకు వంతెనపై నుండి – బ్రతుకొక వంతెనగా భావింపబడి దానిపై ప్రయాణం చేస వ్యక్తి వివిధానుభూతులు, అనుభవాలు ప్రధానంగా ప్రాపంచిక నిజస్వరూపావలోకనం కలది. మానవ స్వభావమూ ప్రవర్తన రెండూ అతని ప్రయాణ సమయంలో కన్పించే వివిధ ప్రకృతి దృశ్య స్పోరకంగా సాగింది. నేరుగా కాకుండా ప్రకృతి పరంగా సంయాజించి జీవన రీతుల్లో ప్రగతి సోపానాలు తీర్చ బడినవి. మాదిరాజు రంగారావు మానవీయం – రెండవ భాగం అశాంతి – అశాంతి స్వరూపం జీవితంపై నెరిపే ప్రభావమూ — దీని కారణంగా సమాజంలో వివిధ ప్రవర్తనల స్వరూపమూ, అశాంతిని పోగొట్టి శాంతిని స్థాపించడానికి మానవుడుచేస కృషీ, వర్ణితమైంది. యుగదర్శనం – ఈనాటి వరకు మానవుడాధ్యాత్మికంగా వైజ్ఞానికంగా సాధించిన పురోగమనం లోకహితంతోపాటు లోకాపకారంగా పరిణమించడమూ – ఇందుకతని మేధ, ప్రవర్తన పోయే పోకడలెత్తి చూపబడినాయి. యుగదర్శనం II – మానవుడు భౌతికంగానే కాక మానసికంగానూ ఆత్మ సంస్కారంతో పెరిగినపుడే జీవితంలో ఆనందమూ శాంతి పొందగలడు. ఈ ప్రయోజనం సిద్ధించడానికి జ్ఞానమూ, విజ్ఞానమూ ఈ రెండిటి సమన్వయ మవసరం. నేటి సంఘర్షణలోని క్లిష్ట స్థితుల నుండి ఆగామి యుగంలో పునర్జన్మ వలె కన్పించే మానవుని మోదార రూపం, ఉదాత్తమైన మరో మనో లోకాన్ని సృజించుకొని విశ్వ సంస్కృతీ భూమికలో అవతరిస్తుందన్న ఆశతో కావ్యం ముగిసింది.