Kirmeeram (కిర్మీరం) Collection 1 of Volume I — Addendum 1 — Swecchaa Kavitvamu by Prof. Madiraju Ranga Rao. Year: 1957. Language: Telugu. Canonical HTML: https://madirajurangarao.com/poetry/volume-i/addendum-1/text/kirmeeram --- కిర్మీరం (గేయాలు) మాదిరాజు రంగారావు ఆదర్శ సాహిత్యమాల హైదరాబాద్ స్వేచ్ఛా కవిత్వం కిర్మీరం ఆచార్య మాదిరాజు రంగారావు SWECCHAA KAVITHVAM KIRMEERAM Prof. Madiraju Ranga Rao © Dr. M. Santhosh Kumar Rasadhuni Sahithi Parishath, Hyderabad - 28 ప్రథమ ముద్రణ: డిసెంబరు 1957 పునర్ముద్రణ: జూన్ 2026 అనుపమ ప్రింటర్స్ శాంతినగర్, హైదరాబాద్ ఫోన్ : 040–23391364 అంకితం ‘ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు,’ మహాకవి శ్రీశ్రీ కి జ్యోతీరేఖ నాదత్రయము చిత్రశాల స్నేహ వీచి జీవ లక్షణం మెరపు రేఖలు స్వప్న కపోతము అందని సందేహం వెలుగు – చీకటి ఛాయ నిప్పుపూలు ఇచ్ఛాగీతం వ్యాఖ్యాన గీతం నాలో నేను దీప శిఖ ఘంటానాదం కీర్తిస్తంభాలు చీకటి మనుషులు భానూదయము క్రాంతి దర్శనం కిర్మీరం జ్యోతీరేఖ మధుర మధుర పీయూషావర్షిత పుష్పీకృతాత్మ వారిద గామిని కిణ కిణ పద రచనా సంచారిణి మత్కవితా నృత్యన్మందాకిని వినీల కాంతిమేఘ హృదయవీధి రివ్వున జిలుగునవ్వు పూలు రువ్వు ఈ హేరమ్మదమాలా దీపిక ఊహాలేఖా విష్కృత లాసిక హిమానీ వీచీ స్ఫీత ప్రాభా తారుణ నాకధునీ శ్రీమమ్రోడులవలెసృణీ ఫేన తరంగిణివై, తమోరాశి కాంతి పునీతము గావింపగ, గీతికాభినందనతో, అవనీ కిర్మీరం స్థలి డిగ్గు నీకై నవశరత్కాల హిమ గిరీంద్ర శిఖర రూపమెత్తిన నను వీక్షించుచు యెన్ని అబ్దములు తమోదైర్ఘ్యరేఖ లాగ సాగెను— నీలాంబుద వీణా రూపమూని శంపా రేఖా తంత్రులు మ్రాయగ కదలి వచ్చు, నీ రూపము ననుసరించు వాయూచ్ఛలత్త రంగవదూహలు కనులకు కనుపించని, జ్యోతి శ్శిఖకై తపించిపోవు, యాగి కాగ్ని పరిస్పీతారుణమా హృదయ కనక శతపత్రమువలె వికస్వర తేజోఽవధిభూత భవత్ రూప సమాహితమా నా కళాత్మ. కిర్మీరం నాదత్రయము 1 ఆరని వెలుగు దివ్వియలు వదిలే మెల మెల్లగ సాగిపోవు ధూమం లా చెక్కిన చీకటి ప్రతిమల వలె చలించని మ్రొడులవలె కూర్చున్నారేం ? ఎంత స్వర్గానందమయ మీ ప్రపంచం తత్ప్రతిబింబమెగా ఈ జీవితం ప్రతి మనిషీ కళామయ భావనతో సంతోషపు రెక్కలతో ఎగురడేం ? వికసించిన మల్లికా సుమహేలలు మొగిలు చిత్రముల పరస్పర మధురావలోకనా దృశ్యాలు చూచే తీరిక, ఓపిక నశించిందా ? వీచే గాలుల తాకిడి సహించలేరూ ? చంద్ర రేఖనో, భానుమూర్తినో ఎరుగని వెలుగు రేఖనో, నీడబొమ్మనో చూడని గగన సీమనో, భూమినో నమ్ముకోని జీవితం, వర్ణ రేఖా లుప్త చిత్రం. కిర్మీరం 2 గాజు కనులు విప్పిచూడు, నేటి వరకు, కాంతికిరణ లవ మెరుగని చీకటి గుండెలతో నఖ శిఖ పర్యంతం తెల్లని వర్ణపు టుడుపులు ధరించి — నిమ్నొన్నతాలు తెలియని చీకటిలో విద్యుద్యుగ దశలోనూ, తమ ప్రాత ఉనికి స్థిరత్వానికి ప్రాకులాడు గ్రుడ్డి వెలుగు దీప స్తంభాలు ఎప్పుడో ఆకాశాన కొంత సేపు చంద్ర బింబం కనుపిస్తే సరా? ఈ దీపస్తంభాల క్రింద వసించే స్వీయ రూప రేఖలే ఎరుగని సామాన్యుని జీవితం, వైతరణీ నదీ తీర విహార ప్రాయం కదూ ! ప్రతి వస్తువులోని అందాన్ని చూడడం ప్రతి మనిషికీ శక్యంకాదు, నిజం ! ప్రతి మనిషిని ఆనంద పరచడం ప్రతి వస్తువు ప్రకృతి కతీతం. కిర్మీరం 3 ఎన్ని సూర్య బింబాలు ఆరిపోలేదు ? ఎన్ని చంద్ర బింబాలు వాడిపోలేదు ? ఎంత మంది శాంతమూర్తుల ధర్మ బోధలు జలధి ఘోషను మునుగలేదు ? దినమణి కాంతి మాసిన వేళలందు ఎన్ని దీపాలు వెలిగించుక మురియలేదు ? ఎన్ని మారులు నిశాతారుణ కాంతిఖడ్గం ప్రయోగించినా శిథిలమౌ ఈ చీకటి వటవృక్షం మాటిమాటికీ శాఖోపశాఖలుగా ప్రస్తరించి, దిగంతాల కెగసి ఎగసి, గగనంలా నిలచి పోవాలని చూస్తుందేం ? ఈ వృక్షపు నీడల ఎడారిలో నివసించే మానవ మేధాశిఖరి విజ్ఞాన రసాపగ పరుగిడుతుంటే నిస్తబ్ధత వ్యాపించిన ఆశావీధుల ఒక్కమారు చైతన్య కాంతి ఝుంఝూ సంగీత ధునీ ధ్వని వినిపిస్తుంటే, మేల్కొని మహాప్రస్థాన మూహించని కిర్మీరం చీకటి తెరలను తొలగించే కాంతి కిసలయాంగుళులతో స్వీయ నైజ రూపావిష్కరణము వాంఛించని బుద్ధిజీవి ఎవ్వడు ? భూమిని గుట్టలూ, చెట్లూ, చేమలు నదీ నదాలు, జనపదాలు ఆక్రమించగలవు ఆకాశాన్ని మబ్బులు మ్రింగివేయగలవు వాయు మండలాన్ని విమానం చుట్టిరాగలదు. రేపో లేకపోతే మాపో, చంద్ర మండలాన్ని ఆక్రమించి, సూర్య మండలానికి దారులు తీయగలం ! ఈ మహా సముద్ర గర్భంలో కవచ పరీవృత సౌధాలు నిర్మించగలం ! అడుగడుగున నిస్తబ్ధత, నిశ్శబ్దత వ్యాపించిన, మనఃప్రపంచవీధుల అనంతమైన కాలాన్ని దేశాన్ని ఆక్రమించి, మనిషికి మనిషికి మధ్య నిల్చిన, కనులకు కనుపించని చీకటి గోడలను కూలగొట్టి కాంతిగీతాలను వినిపించునదెవ్వరు ? కిర్మీరం అవునేమొ ! నిజంగానే కలడేమొ ! సృష్టిలో, ఏ చీకటి కోనలోనో ! కదలని పర్వతంలా, చీకటి సుడిలా, ఆరని వెల్గు పూల హారంలో ముడిలా. ★ ధర్మ విప్లవం జయం పొందిన ఉదయ వేళ, క్రాంతి మార్గోన్ముఖీకరణమె అభ్యుదయమను మాట కర్థము. కిర్మీరం చిత్రశాల ప్రతి మనిషి జీవితం ఒక చిత్ర కళారంగం స్వీయ దృష్టి యంత్రంలో చూడలేడు ప్రతిదృశ్యం బాల్యోదయాగమనం జరా నిశా నిష్క్రమణం చిత్ర వర్ణ ఇంద్రధను రీవితాల రెండుకొనలు కను చూపు మేర కలియు భూమి, నీలాకాశంలా, ఒకటిగ కలిసిపోవు. ఎన్నటికిని కలలోనూ ! అప్పుడపుడూ కన్నులు మోసపోవడమూ కద్దు ! ప్రతి రంగును విడివిడిగా బావుందని, వ్రేలు ఎత్తి నిర్దేశిస్తూ, అభిమానంతో అచ్చటనే, కదలక నిలచి పోవు, బాల భావుకుల సంఖ్య సగం కన్న మిన్న కిర్మీరం హస్తాలు చాచి కదలి పోవు, ఆకురాలిన జీవిత వృక్షాలు, మంచులా గడ్డ కట్టిన సరోవరాలు మనిషి జీవిత పతాక శీర్షము పైన కాలు కదిపి ఎరుగని బాల భానుని ఆధికారిక కాంతి ముద్రలు సహస్ర జ్వాలా మాలా కరాంగుళులు చాచిన గ్రీష్మంలా మండిపోవు మందార సుమ వృక్షాలు ఒక టేమిటి? అందమైన ఏ చిత్రశాల వెదకినా విలువలేని వస్తువుమాత్రం కానరాదు మన కంటికి కిర్మీరం స్నేహవీచి అంగార నిధి గ్రీష్మ దేవత రక్తానలం చిమ్మే నాల్కలు చాచే వేళ తడియారిన పుడమి గొంతుక చల్లని నీటి కోసం తపించే వేళ ఎండ మబ్బులు దగ్గర దవ్వును ఏకం చేసి మృగతృష్ణ పెంచే వేళ శిల వలె హృదయం ఘనీభవించి ప్రపంచం శ్మశానంలా మారే వేళ ఎక్కడినుండో, ఏ కోన నుండో వేలాది మైళ్ళుగా వ్యాపించిన అగాధ సముద్ర తరంగాలను కబుర్లతో మురిపిస్తూ మెల్లగాదాటి కిర్మీరం నదీ సైకతాలపైని తరంగాలను కిలా కిల నవ్వులతో ముంచేస్తూ వృక్షాలను కుశల ప్రశ్నలతో సంభావిస్తూ, గలగల ఊగిస్తూ మధ్య మధ్య ప్రేమతో సమున్నత శైల శిఖరాలను శీతల హస్తాలతో స్పృశిస్తూ — తెల్లని నల్లని జాతి జాడ్యమే యెరుగని, మతాల సూత్రాలకు కట్టువడని, ఊహ కందీ అందక రెక్క విప్పి ఎగురు ఆనందపు లేజగా వెన్నెల పులుగులా వచ్చి — పూర్ణిమా చంద్రోదయ వేళా సముల్లసిత సముద్రతరంగం లా ‘మనిషి మనిషి మనస్సు మనస్సు పరస్పర సౌహిత్య పరామర్శన శాంతికి సమర్చన’ అని గుండె విప్పి మాట్లాడ గల శిలా ప్రతిమల గుడిముందు విశ్రమించిన నా చెవిలో టీకా టిప్పణి వ్యాఖ్యానాల అవసరం ఏ మాత్రం లేకుండా ప్రతి మనిషి మనస్సునకు అవగత మయ్యే సంజ్ఞాభాషలో కిర్మీరం నిశ్శబ్దంగా రహస్యంగా ఊది మెల్లగా సన్నగా కపోలాలు తాకి మృదువుగా కరసంచాలనం చేస్తూ గంతులు వేస్తూ, ఈలలు వేస్తూ నిమిషపు కదలికలో వెళిపోయింది నిశ్శబ్దపు మెదలికలో యే కోనకో ! రహ స్థిర దేశ సమాయాత నవ శీతల మృదుల వాయు హేలా త్వరమాణ స్నేహ వీచి ! కిర్మీరం జీవ లక్షణం వేగ ఝురీ గమనము నడ్డు నీలి రంగు కొండలపై నుండి ఎగసి, పొంగి పొరలు కాంతిధార చెంగున దూకునపుడె, గంభీర ప్రశాంత ప్రకృతి రామణీయకత అంతశ్శక్తి రేఖ లొక్కమారు మేలుకున్న మనలో తదనుభూతియె పరిణత జీవిత కావ్య నిహిత సౌందర్య కళాన్విత శిల్పజ్ఞత సజీవ ప్రాణికోటి స్వభావం నిర్జీవ శిలాప్రతిమ సౌందర్యం ప్రకృతిదేవి దయా హృదయం యంత్ర శక్తుల స్పర్ధ తత్వం అడవిమనిషి జాలిగుండె లోతులు నగరవాసి మేధాశక్తి పరిసర్పణం కిర్మీరం తెల్లని పక్షులెగురు కాంతిసీమ నల్లని ధూమమెగయు యుద్ధభూమి చిత్రవర్ణ దృశ్యమాన రూపంలో కనిపించే సాంకేతిక జగత్తులో, నీరులా దయ ప్రవహించే బాట మంచులా నిర్దయ గడ్డకట్టు చోట సంస్పందమాన వీణా తంత్రిలా మ్రోగును, నదిలా కవిహృదయం సాగును కాంతి తరంగిణిలా, మబ్బులా మెత్తనైన మనసులోని భావన ప్రతి వస్తువు సౌందర్య రసస్విన్నము ప్రత్యణువు విచారణ యోగ్యము ప్రతిభావము సవిచార మనోనిష్ఠము ప్రతి మనీషి ఊహా జగత్తు భిన్నము స్వీయ దృక్పథం చెరగని సరళ రేఖ భిన్నత్వం అనిశ్చలత్వం క్షణక్షణం వినూతనత్వం రూప రేఖలు మారే గుణం భౌతిక ప్రాపంచిక లక్షణం కిర్మీరం చేతనతా లక్షణ మెరుగదు స్వర్గం యుగాలుగా బ్రతికే రంగుల చిత్రం వీచే గాలిలా, మ్రోగే నదీ తరంగంలా, దూకే జలధారా ధునిలా, మెరసే నవ విద్యుల్లేఖా పుష్పంలా హసిస్తూ నిత్యం చరించడం జీవ సృష్టి వైలక్షణ్యం. కిర్మీరం మెరపు రేఖలు జీవితం ఎగసే కాంతి విహంగం సరళ రేఖలోనే సర్వదా ప్రయాణం బహుదూరం మాత్రం వెళుతుంది గతిస్తుంది వెనక్కు తిరిగి రావడం మంటూ అసలువుండదు ఈ మధ్య చూచిన దృశ్యాలు, అనుభవాలు రసస్విన్న హృదయుల కానంద శిల్ప తీర్థాలు కిర్మీరం జ్యోతిర్మయ మేధిరుల కావ్య కర్మభూములు లౌకిక జీవులకు జీవిత వ్యాఖ్యాన సూత్ర పాఠాలు ప్రతి క్షణం, నిలకడ ఎరుగని జలధి తరంగం ప్రవాహానికి పథం వంటిది ఆగతానికి వర్తమానం కిర్మీరం స్వప్న కపోతము ఊర్జిత గగన శైల శిఖరం పై మొరసెను అరుణ కిరణ చాపమ్ములు నిరాశా నిశావృత జీవిత వ ల్మీకం నుండి బయల్వెడలి పరుగు లెత్తెను సితాసిత భుజగమ్ములు కనుపించని దిక్పర్వత సానువు పై, ఉదయించిన అరుణారుణ బింబ మండలాన క్రీడించే కాదంబినీ నికరమ్ములు మరణ మురజధ్వనితో అంతరించెను పగిలిన పుడమి గుండియ పైను లోతు నుండి పొంగులెత్తెను సద్య ఉద్గత జీవ ధారలు జీవ ధారా సిక్త జనతా హృదయ కేదారమ్ము లింకను బీడువడి పాడువడునా ? కిర్మీరం ఉషః కాంతి సదనమునకు దూరమై, దిక్కుల సమా శ్రయించిన నిశా పక్షిణి ఎగిరిపోయె వాయువీధి ★ ఊహా నీహార శలాకా నిర్మితమగు నా మస్తిష్క పంజరాన, శాశ్వతముగ నిను బంధించి, ఆనందిం చే, మూర్ఖుడనని ఎందుల కీ మాద్రి సంకోచింతువు ? ఎటు చూచిన దగ్గరిగా చుట్టూ కంటికి ఎదురుగ నిలచినట్టి ఈ చీకటి లోహపు రెమ్మలగుడిలో నీ బ్రతుకు గడపగా కోరెదవా ! నీ చాచిన నిద్దుర పొలిమేరల రెక్కలతో విసరుచు, ఈ ప్రశాంత మౌనవేళ లందు, ఓ కమ్మని కథ హాయిగ వినిపించవూ ? నా స్వప్న కపోతమ ! కిర్మీరం అందని సందేహం అగ్ని వీణా తంత్రులు పలుకు మధుర స్వర మాలిక లెన్నో! హిమధామంలో దాగి వున్న అగ్ని కీలా మాల లెన్నో ! నిశా ఫాల ఫలకంపై బడి నిల్వని కాంతి కళిక లెన్నో! ఉదయ కాలనటి అడుగులంటి సాగు, చీకటి బొమ్మ లెన్నో ! చంద్రబింబం వాడిపోయి ఓ మూల ఒరిగి పోయినా చీకటి పొలిమేరలు దాటజాలని ఉషస్సంధ్యా కాంతి స్రవంతులెన్నో! అనంత కాల సికతా శ్రేణుల ఎన్ని కాంతి తరంగిణులు లింకెనో ! కిర్మీరం వెలుగు — చీకటి వెలుతురు – ఆకాశాన్ని భూమిని రోదసిని వేరు వేరు చేసి చూపుతుంది చీకటి – సర్వ జగత్తును తన రూపంలో సమైక్యం చేసివేసుకుంటుంది మనిషికి – చీకటిలో ప్రయాణించడంకన్న వెలుతురులో నిదురించడమే సుఖం మనీషికి. – చీకటిలో నిదురించడం కన్న వెలుగులో పయనించడమానందం’ కిర్మీరం వెలుగు – చీకటి ఎన్నటికీ ఏకం కాజాలని ఒకే నదికి రెండు తీరాలు ఈ రెండు తీరాలు స్వర్గ నరక లోక సంకేతాలు ఈ సంకేత పరిజ్ఞాన పరిశోధనాఫలితం గతంలోని జ్ఞానతత్వం నవయుగ విజ్ఞానరూపం. కిర్మీరం ఛాయ ఎవరొహో ! నిదురించినదిట నీలాంబుద మాలా సు స్నిగ్ధ తనూ పల్యంకిక ! ముహుర్ముహురాగత వాయు వీచీ చయ సంచాలిత పుష్పంధయ పక్షాలక ! త్యక్తాశా కాంతి చేల ! దుఃఖ ప్రావరణావృత ! సరభస గమన పవమాన విధుతమై, గగనాంస సం స్రస్తమై, పొరలాడు నవ నీరదాంశుకమ్ము వోలె భువి జారి పడినట్టి యామినీ కామినీ కర్ణమున వ్రేలాడు పూర్ణిమా చంద్ర బిం కిర్మీరం బాభరణ తాటంక ఖచిత నీలమణివలె భూదేవి పృథుల నితంబ కాంచీ దామ ధామమున అంకిత నఖాంకుర వక్ర రేఖాపంక్తి వలె తోచు ఆ పవ్వళించినదెవరు ? అరుణ మయూఖముల వాడి శార్వరీ జలద కైశిక భరము వీడి, విశీర్ణమై ఇట బడిన మానోజ్ఞ మం దార పుష్పగుచ్చము వలె ఇట నిదురించిన దెవరీ మసృణ తమాల వల్లరీ మతల్లికా సుషమాంగన ! నిస్తరంగ యామున ధుని ! సాంద్ర హిమ జల కణ వినిర్మిత ఘనా ఘన చైత్య మండప మందు మార్మ్రోగు ధ్వని తరంగములకు బెదరి, యిట బడిన దుఃఖాగ్ని సందగ్ధ మోహన మూర్తి, తారుణ్య శంపా కళా లాసికయొ ? కిర్మీరం అభ్యుదితుడు నవారుణా దిత్య మూర్తి గాత్ర పరి ష్వంగమున పరితప్తయై తనూ కాంతి వీడి — వాడి సంయన్త్రిత భుజము వీడి తోరమై, ఇటు బడిన మా నోజ్ఞ చ్ఛాయా కాంతయొ! సౌర మార్గ పరిచ్యుతయు వాయు హత జ్వాలయునై మృత్యుశయ్య పరచుక, శా శ్వతముగ సుషుప్తి మున్గిన తారాదీప శిఖా సుందరియొ ! జీవ దాన విచికీర్షా హృదయుడు, సదయుడు, ద్రుతతర గమన శీలి ! జలధర ని శ్వసిత ధూమ పరిమ్లాన దేహివై, భువి దిగజారి ప్రియు నెడబాసిన త్రపా తరళ యౌ శంపా వల్లికవా ? స్వీయ ముగ్ధ లావణ్య రూప మీ జన్మలో పొందలేవుగా ! మమతా స్విన్నమాణమౌ జ న్మసీమ దివి కేగలేవుగా ! ★ కిర్మీరం ఎవర వీవు ? రహస్తీరముల ఏకాంతముగా నృత్యమాడి మిసిమింతురాలవై, శ్రాంతి కోసరము మెయి వాల్చితివా ? కాంతి మండలపు టంచులపై దిగ జారుచు నిరాలంబయై నిరాశతో తమకము నొందుచు తనుకు చీకటి తొగ కన్నైవా ! ఏ కోరిక సుడుల ముడులు విడిపోవ, ఏకతమ తిరు గాడి, కడు డస్సి యిట బడి దుఃఖ నిమ్నగ మున్గితివి ? ఏ వృక్ష వర్షీయుని దుఃఖ సంవృత మలీమస వర్ణ జీవిత చిత్రమొకొ ? ఈ దీర్ఘ చ్ఛాయా రేఖ ! ★ ఎవరవీవు? ఏకాంతముగా కఠిన శైల పల్యంకము పై ధూళి రేణుకా రూషితవై మలిన వస్త్రమును దాలిచికొని, కిర్మీరం శీత వాత పరిపీడిత వై కృశీభవించిన; అవనీ తల పరిసర్పణ మలినీకృతమై వన్నె మాసి ఈ మన్నులోన వివర్ణమైన ప్రన్నని దేహము నల్పిష్ఠ తమ స్తరంగిణి వలె కుంచించుక ఎందుల కెవరికై ఆచరింతు వీ మౌన వ్రతమ్ము ! ఛాయా సుందరి ! దుఃఖ శలాకాగ్ర వి దారిత హృదయముతో దృజ్మనోజ్ఞ తర కాంతులు దిక్తటాంచలముల విసరుచు ఏ సాగర తీరము వెదకుచు ఏ నాక పథము నాశించుచు ఏ సుందర స్వాప్నిక సౌర పదవి కూహా సోపానాళి వినిర్మింప కాంక్షింతువు ! కిర్మీరం జఘన మండల విసర్పిత నీల వసన సంశోభిత మలినీకృత దేహాంచల విరజీకృత నీలాలక ! త్యక్తాశా కాంతిచేల ముక్తచ్ఛాయా సుందరి ! మసృణ నీల నీరద సుష మా వల్గత్కాంతి తనూ ! కిర్మీరం నిప్పుపూలు 1 గ్రీష్ముడు నడచిన అడుగుల జాడలలో, అగ్ని దేవతామూర్తి చూపులలో చిక్కిన బారులందు, సూర్యుడు తెరచిన వేయి కండ్లు ఒక్కమారు అంతటా — పూలు కణకణలాడే ఎఱ్ఱని నిప్పుపూలు 2 పూర్వం నియంతల హంతకుల నాజీల గుండెలలో, గుండెల గోరీల బండలపై విరబూచే, వెచ్చని పరిమళ నిశ్వాసం విడిచే, ధూమంతో సతతం మ్రగ్గే ఎఱ్ఱని పూలు — నిప్పుపూలు కిర్మీరం 3 తనలో చల్లదనం ఎరుగని దేహాలను దుస్తులనూ కాల్చని, విసరితే తాకి అగ్నిమయం చేసి దహించలేని, మృత్యు రేఖ; విద్యుత్తులా ప్రాకి సిరాపథాన దిమ్మెక్కించి శిలలా నిల్వజేయు సతతం తెలి వెలుగుల జడులు చిందులాడు పూలు — నిప్పుపూలు 4 ఇవో ముప్పులేని నిప్పుపూలు అంతటా దొరికే రకం కాదు మధుర మధుర గీతీ వినదిత జలధారాసిక్త స్నిగ్ధ మేఘం, మృదు సుషీమ వాస్తరంగ జలధి లాంటి కవి హృదయం — నివాసం అతడు వ్రాసే ప్రతి గీతానికి ఈ నిప్పుపూల వాసన ప్రాణాధారం అందుచేతనేమొ ! రచన సముద్రంలో మునిగే, దహ్య మాన నౌక లాగ కలిగించును మనలో ఆవేదన కిర్మీరం 5 స్వేచ్ఛా వాయు వీచి కోసం కాంతి కిరణ శకలం కోసం సతమతమౌ, పరితపించు ప్రాణికోటి గుండెలలో అజ్ఞానపు అర్ధరాత్రి నిద్రలో పన్నిన వలలో చిక్కి మేల్కొని, ఉదయవేళ ఛేదింపగ యోచించే జీవ కోటి గుండెలలో మారణాస్త్రాలకు మాడిపోని రేకులు ఎన్నటికీ రాలిపోని, వాడిపోని, కణకణలాడే ఎఱ్ఱని పూలు — నిప్పుపూలు కిర్మీరం ఇచ్ఛాగీతం నా ఫాలాకాశ వీధి మెరయు నవోదయ సంధ్యా రోచిః కళికల వీక్షించనిదే జార్తు రెవరు? తుహిన సిక్త మేఘ కాండపటము నా మనో వల్మీకం నుండి భయావహ మృత్యు భుజగి వెడలి నాట్యమాడ వినిపింతు రెవరు ? వాయు సుషిర మంజుల నిస్వానము తావుల నెత్తావుల విరజిమ్ముచు తెలి వెలుగుల రేకల కోర్కెల విహాయస కబరీ సంవాసిత ఘుసృణారుణ పారిజాతమునై హసింప నాశించిన మరుక్షణం ఎటు చూచిన వరిణాహ తమ స్తరంగిణుల కేళీ దృశ్యమె ! మేఘబృందముల నృత్యమె ! కిర్మీరం ఈ శిథిల విశ్వ దేవాలయంలో స్వీయ దేహ శిల్పము చూచి, ఎన్ని వేల శతాబ్దము లాయెను ? పునర్జీవ సృష్టి యెప్డు జరిగెను ? పరిణత సంస్కార హయములు పూర్వ వాసనామయ జీవిత రథము లాగు వేళ, నాపై విసరునదెవరా జలద శిలలు ? నామనో నికుంజ వాటిక పుల్కరించి కుసుమించెను స్వప్నాంబుద తనూ శిల్పము మ్రోగెను ఇచ్ఛాగీతము. కిర్మీరం వ్యాఖ్యాన గీతం ప్రతి దినం, ఉదయారుణ రూపంతో ప్రత్యక్షం, నిశా దీర్ఘచ్ఛాయా రాగంతో నిష్క్రమణం. ప్రతి హృదయం భవ్యాశీ ర్నాద బిందు సంభరితము మృత్యూపదేశ గీతీ రీతీ జ్యోతిః ప్రవిగాఢము. మేఘంలా మనోహరము రాగంలా అతి మధురము తరంగంలా ఉచ్ఛలితము ససంభ్రమ పతనం, జీవితం. స్వర్గం, నరకం, మతసూత్రం ఊహా జనిత మేతత్సర్వం ఊహించలేని మనిషీ ప్రతిమకూ, రూపంలో కన్న స్వాభావిక దశలో మాత్రం సామ్యము అతి ప్రగాఢం. కిర్మీరం సదూహో లేఖా విష్కారమయం ఇంద్ర ధనుర్వల్లీ వలయితం సంప్రదాయరేఖా సీమితం సుషీమ కాంతి సుషమాబింబం మనిషి జీవితాకాశ సర్వస్వం సాంఘిక పరిణాహ పరిణామం. ★ సుప్త శిశువు ముఖ బింబం గుప్త ప్రేమ ధనపేటిక వలె అనంతాబ్దాలుగా ఆకాశం నిదురిస్తూ కంటూంది కలలు, తాను కలలుగనే సంగతి సందర్భం తనకే తెలియదు తన ఆస్తిక్యమును గురించి తనకే ఎప్పుడూ సంశయం. అనంతాబ్దాలుగా నిదురవోని కీర్తి సముద్రం ఈ ప్రపంచం క్రొంగ్రొత్త తరంగ దృశ్యాలతో భిన్న భిన్న కంఠారావమ్ములతో నిరంతరం కదలి పోతుంటుంది కోలుపోని తన ఆస్తిక్యముపై ఎందులకో అంతులేని విశ్వాసం అందులకే వ్యాఖ్యానాల అవశ్యకత. కిర్మీరం నాలో నేను కంటికి కనుపించని గాలితెరలా పాటలతో కదలిపోవు సెలయేరులా చంద్రుడికి చుక్కలకు ఎంతదూరమో అంత దూరంలో నావెనకాలె నడుస్తూ నిదుర నిముషంలో, నిముషాలను ఎరుగనట్లు నిషా ఎక్కించిన వేళల గిరి శిఖరాలనంటి వాలుగా విలాసంగా మెలమెల్లగ సాగిపోవు నీలిమబ్బులా వచ్చి; గాలికి కాసారంలో చిరుతరగలు లేచి కదలినట్లు, వ్రేలి యాడు మంచుతెరలు తెగి పడినట్లు, పగలడానికి తగని ఎత్తునుండి గాజుగ్లాసు జారిపడినట్లు, కిర్మీరం నా యెదలో ఏదో సన్నని ధ్వని విని, నిదురనుండి మేల్కొనగా, పౌర్ణిమా చంద్రికా ఫాలఫలకంపై నిటారుగా నిల్చిన నీడబొమ్మలా, మెరపు తీగ మెరసి నిష్క్రమించువేళ మేఘంలా, ఎక్కడో ఎన్నడో చూచిన ఆకారం ! నా రూపానికే ప్రతిరూపం ! నా హృదయ ధ్వనికి ప్రతిధ్వని యంత్రం ! కిర్మీరం దీప శిఖ అంధీభూత రూపమున యోగ నిద్రామూర్తి లా నిల్చిన శిలామయ విశ్వ చైత్య నిలయాంగణమున ఎన్ని మారులు వెల్గించి దీప శిఖలను నిల్పితిని ! తమిస్రా చషకమ్ము నిండి పొరలెడి, జ్వలదనల మదిర పానము చేసి, అభినయించు నిశా లాసికా హస్త తలమున ఎన్ని మారులు నిల్పితిని దీప శిఖలను వెల్గించి ! కిర్మీరం నిశ్శబ్ద నిశ్వాస వల్లీ శృంఖలాబద్ధ, స్వాప్నిక ప్రకృతి దేవతా హృదయ దర్పణ నికేతనమందు ఎన్ని మారులు మలగిపోయిన దీప శిఖలను వెల్గించితిని ! నిరంతరము నిద్రోర్మికా డోలికల నూగు, జగతీ సతీ కంఠాభరణ హార మణులుగ, కమనీయ కాంతి కళికలను వెల్గించి ఎన్ని మారులు నిలిపితిని ! ఆశా శాఖీకల కులాయ ములు కట్టుక కనులుమూసి కలలో మసక వెల్గులను సం దర్శించు చీకటిగుండెపై ఎన్ని మారులు నిల్పితిని దీప శిఖలను వెల్గించి ! ఈ నాడు ప్రతి హృదిలో కాంతి వల్లిక చిగురించి కుసుమింప, ఈ నాడు సంభావనాత్మక జగతి ఆనందనృత్యము సేయ, కిర్మీరం గగనారామావరణమున లలంతికా తమస్తంత్రులకు వ్రేలాడు తారా దీపికా ముఖములు వెల తెల బోవ, భావ వీధీ చ్యుత సౌవర్ణ కల్పనా స్వర్గ సద్మమున చైతన్య భావ సంఫుల్ల జనతా మనః ప్రపంచమున అంతిమ శ్వాస విడువని తర తరమ్ములకు మలగని సర్వ మానవ జాతి నూత్న చరిత దళములు విరియ, ఇరుల గుండెల దరుల నొరసి స్నిగ్ధాశా కాంతి మహా స్రోతస్విని ప్రవహింపగ, ఏకైక సాహిత్య ప్రథా దీప శిఖ వెల్గించి నే డా విష్కారము సేతము. కిర్మీరం ఘంటానాదం సిత తారా సుమమాలా లం కృత కబరీ భర నిశీథినీ దరహాసోన్మీలిత నేత్ర ప దవి అగ్ని చిత్రములు సృజించి నిద్రా భారావనమిత నిశా తరుణీమణి కాటుక కన్నుల స్వాప్నిక నీహార కాంతి సుధాధునులు నింపి శయిత జలద మోహినీ ప్ర శాంత హృదయ విపంచికా తంత్రులపై మధుస్వర వి తాన గీతము మ్రోగించి త్రుంచిన జీవిత సుమ వి దూరజ ధూళి విలిప్త శ రీరిణి ! మృత్యుసఖీ ని ర్మిత నవ్యాశాచ్ఛాయా సౌధాలను శిథిలపరచి కిర్మీరం నిదురించెడి మహా ప్రజా నీకము మేధా సౌధము గ్రమ్మిన, తమోనైల్యరాశి కరగిపోవ వెలిగించితి ! నవ్య దీప శిఖా తోరణమ్ము దివ్య దీధితీ ప్రసారణమ్ము ★ అంధకార దేవత సౌధ ప్రాంగణాన, ఉదయ కాల ఘంటిక మ్రోగించితి ‘‘గణ గణ గణ’’ మేల్కొనగా ప్రజ. కిర్మీరం కీర్తిస్తంభాలు నాటి సుజాతకుల హృదయ ద్వార కవాటాల ముందు ప్రేమామృత రసపూరిత జిహ్వలు చాచి, తారాడిన భుజంగాలు దివారాత్రులు కనుల ముందు నటియించిన పెను భూతాలు పాదమెత్తలేని నోరు కదపజాలని కాల శ్మశానంలోని కీర్తిస్తంభాలు నాడు వేదనలతో సంస్పందించగ హృదయాబ్జము; శోకంతో చిక్కని నీరై నిల్చిన వెచ్చని గుండియతో, బాధలతో కంపించిన తనూ శైలము కిర్మీరం నేడు ధాళధళ్య స్ఫటిక మయ ప్రాంశుమూర్తియై, ప్రశాంత మాన భాషతో,ప్రతి మనీషి గుండె నూపి మాట్లాడునదెవరెరుగుదురు? నేడు శీతల చందన పరిమళ సమ్మిశ్రిత వాయు పరిహాస శ్రీలతో, అపరిమాణ వాజ్రేయ శరీరంతో నిల్చిన కీర్తిస్తంభాలు కనులు తెరచి, ఊగిసలాడే తళ త్తళ రేఖా సౌందర్య గరిమ వహించలేక, పరిభ్రమించు ఉన్మాదిని, జలద విలాసిని, సుమించి గాలికి రాలిపోవు సుమ కన్యక, ప్రకాశించి కారు రాతిరి పాలిపోవు చంద్రబింబం, కడు దవ్వునుండి శైలమెత్తు ఎగసి పడి పోవు తరంగం అందమైన ప్రతి వస్తువు భౌతిక రూప మశాశ్వతమ్ము జగత్తులో శశ్వత్కాలిక వస్తువు ప్రయోజనం లౌకిక జగత్తున కర్థరహితం కిర్మీరం గగన తలంపై వెలిగే సూర్య చంద్రులు ఏ విశ్వనాథుని కీర్తిచిహ్న కేతనాలు ? నాకనుల నుండి మీ కనులదాక మింటికెగసి నిల్చిన, ‘తాజ్మహల్, అజంతా’ శిల్పకళాఖండాల్లా లక్షలాది రసరాణ్మణుల సమాకర్షించలేని; శిశువునకు పశువునకు, స్పందించే గుండె లేని తనూశిలకు కనుపించని స్వచ్చ శ్వేతవర్ణ మూర్తివంతములు కాలశ్మశానంలోని కీర్తిస్తంభాలు. కిర్మీరం చీకటి మనుషులు అస్తమించే సూర్యబింబాన్ని ఆనందం విడిచే ఆకాశాన్ని అవలోకించే సమయాలలో నా కనులలోకి తొంగిచూస్తూ మౌనంగా నీడబొమ్మల్లా వెళుతుంటారు, ఎవరు మీరు? ఉదయించే చంద్రబింబాన్ని విషాదం విడిచే ప్రవాహాన్ని అవలోకించే సమయాలలో నా కనులముందు, రెక్క విప్పిన మల్లెపూవులపై తుమ్మెదలవలె పరిభ్రమిస్తుంటారు, ఎవరు మీరు? వెలిగే తారా దీప శిఖలు నీలాకాశాన్ని విడిచిపోయేవేళ వృక్ష వర్షీయసి, పండిన ఆకుల కోర్కెలు విడుచువేళ కిర్మీరం కాలాన్ని మ్రింగిన చీకటిలా శైశిర విచార వాయువులా నెమ్మదిగా వస్తుంటారు. ఎవరు? గాలిలో ఎగిరే పావురాయిలా నా పాటలు వినిపిస్తుంటే, భూమిలో దాగి పోదాముని అనుక్షణం ఆరాటపడే, నదీ తరంగాల్లా శబ్దిస్తూ, వేగంతో అసహనంతో పరుగిడుతుంటారు ? మిమ్ములను చూడగనే, నాగుండెలో పూలు పూచి, కనులనుండి రాలి కొంత సేపు గాలిలో ప్రయాణించి అంతలో చీకటిలో కలిసిపోతాయి ! గగన వీధి విరిసిన పాలవెల్లిలా నా మస్తిష్కంలో, మేల్కొని వున్న ఊహలు అల్లే కలలు, చలించడం మాని, ఒక్కమారు నిదురపోతాయి. దీనతాభావం రూపుగొన్న చీకటి, అందులో సగం వెలుగు దెయ్యాలా ? లేక దేవతలా ? ఎవరుమీరు? ఇంతకూ చెప్పరేం ? కిర్మీరం భూమిమీద ఎక్కడో నివసించే నా కంటికి కన్పించే, సూర్య చంద్ర బింబాలు, చీకటిముద్దలా మబ్బుముక్కల్లా, మీకు కన్పించేనా! దీపానికి నీడ ఎంత దూరమో నాకు, అంత దగ్గరలో, వెలుగు మేడక్రింద చీకటి మబ్బుల నిచ్చెనవలె, నిల్చిన మీకు, నా మాటలు వినిపించడంలేదా ? మీరంతా చీకటి మనుషులా ? మీకన్న మంచుముద్ద నయం ! ఆ దృష్టితో నాకు కళ్ళులేవు నిజం ! కిర్మీరం భానూదయము భానూదయ వేళాసన్న మయ్యె! ఇంకా పాముల్లా నా చుట్టూ పారాడే వెన్నెల వెలుతురు నీడలు ఈ నీడలలో చీకటివృక్షంలా పెరిగి, ఇంతకాలం నిదురిస్తూ నే వున్నానని నాకే తెలియదు నే కనులు విప్పిన మరుక్షణం మంద మంద మిహికా సాహిత్య ధురా పటలము నా అక్తారుణ ముఖ మండలమును కప్పివైచె నే మేల్కొని కదలాడితినో లేదో ! ఇటు నటు పారాడే తెల్లని నల్లని మబ్బు గముల సంకెలలు బంధించెను నా పాదయుగళి కిర్మీరం రాగరహిత పరిమ్లాన పుష్పంలా మృతశరీరి పరిపాండుర ముఖంలా మసృణ చాంద్రీ వాహిని వెలవెల బోయి అంతలోన వర్ణ విహీనమయ్యెనేమి ? తలలూపుచు, చేతులెత్తి, చిత్ర గతుల నాట్యమాడు చీకటిచెట్లు సమస్తం తెరచాటున దాగిపోయె రాత్రివేళా నటి కురులనిడిన తెల్లని పూల బంతి కలలా ఎచటనో జారి పడిపోయెను. భానూదయ వేళా సన్న మయ్యె కాంతి కళా శిల్ప మూర్తి నౌదున ! నటత్ సురాపగా ప్రావారము నా భుజాంసము నలంకరించున! కిర్మీరం క్రాంతి దర్శనం కాంతి కిరణం కంటి ముందు గతులు తప్పి భ్రమించు వేళల మతి చెడి లోకం, చీకటినే గాఢంగా వాంఛిస్తున్నది ‘ఉటోపియా’ పక్షిలాగ, ఎగిరి పోవు; అందమైన తెల్లని మబ్బుల కోసమె జగమంతా తపిస్తూంది స్వాతిశయంలో తెలియక కొన్ని శతాబ్దాల క్రితం శైశవదశలోవున్న మనకు విమానాలె ! పుణ్యాత్ముల కంటికి మాత్రం కనుపించే స్వర్గపురీ పక్షులు కదూ ! కిర్మీరం ఈ చీకటి బ్రతుకు కొండలను ఊహా విద్యుల్లేఖినితో అజంతాను మరపించే నవ జీవన చిత్రాలను చిత్రించే తరుణం, బహు దూరం లేదనుకుంటా కాలచక్ర భ్రమణంలో పూర్వరంగ మంతరించె ఋతువు మారె, వీచే గాలులు దిక్కు మారె. జలధారలు హిమశైలీ రూపమెత్తి నవ్వుచుండె ఘుసృణారుణ మసృణ పద్మరాగ కాంతి ! కాంతి ! చీకటి పొరలు క్రమ్మిన మానవుని మస్తిష్కంలో వజ్రాఘాత బాధా సహిష్ణు మేఘావళి గుండెలలో మంచులా గడ్డ కట్టిన చీకటి గుండియ దారుల తరాల నుండి చీకటిలో బ్రతుకు గడపిన కన్నుల్లో కిర్మీరం తరాల తరబడి తమతమ రూపాలను మలచుకున్న చీకటి ప్రతిమల కరగించే జీవ రాగ కాంతి ! కాంతి ! బుద్ధికి అందీ అందక అప్పుడప్పుడు మెరసిపోవు ఊహా జగత్తుకు చేరువ మనో చక్షువు చూడగల సృష్టిగత చైతన్యధార నైకరూప కాంతిధార ! ★ కిర్మీరం Kirmeeram by Madiraju Ranga Rao Published by Adarsa Sahityamala, 17-5-350, outside Dabirpura N.P.62, Hyderabad - 2 ప్రకాశకులు : ఆదర్శ సాహిత్యమాల 17–5–350 డబీర్‌పుర వెలుపల, హైదరాబాద్ 2. (ఆంధ్రప్రదేశ్) ముద్రణ : సాధనా ప్రింటరీ, హైదరాబాద్.